ఐదో ప్రపంచకప్‌ ఆడనున్న మోడ్రిచ్‌ | Luka Modric set for 5th World Cup as part of Croatia squad | Sakshi
Sakshi News home page

ఐదో ప్రపంచకప్‌ ఆడనున్న మోడ్రిచ్‌

May 19 2026 6:29 AM | Updated on May 19 2026 6:29 AM

Luka Modric set for 5th World Cup as part of Croatia squad

మెగా టోర్నీకి క్రొయేషియా ఫుట్‌బాల్‌ జట్టు ప్రకటన 
 

జాగ్రెబ్‌: ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే క్రొయేషియా జట్టును ప్రకటించారు. 40 ఏళ్ల లుకా మోడ్రిచ్‌ ఐదోసారి ప్రపంచకప్‌లో ఆడనున్నాడు. 2006లో అరంగేట్రం చేసిన మోడ్రిచ్‌ ఆ తర్వాత 2014, 2018, 2022 ప్రపంచకప్‌ టోర్నిల్లో క్రొయేషియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలను వెనక్కి నెట్టి ప్రతిష్టాత్మక ‘బాలన్‌ డోర్‌’ అవార్డు అందుకున్న మోడ్రిచ్‌ 196 మ్యాచ్‌ల్లో క్రొయేషియా తరఫున ఆడాడు.

 వచ్చే నెలలో అమెరికా, మెక్సికో, కెనడా ఆతిథ్యమివ్వనున్న ప్రపంచకప్‌లో మిడ్‌ఫీల్డర్‌ మోడ్రిచ్‌ 200 మైలురాయిని దాటే అవకాశముంది. అంటోనియో కర్బాజాల్‌ (మెక్సికో), ఆండ్రెస్‌ గార్డాడో (మెక్సికో), లోథర్‌ మథియాస్‌ (జర్మనీ), రాఫెల్‌ మార్కెజ్‌ (మెక్సికో), గియాన్లుగి బఫన్‌ (ఇటలీ), యుటో నాగటోమో (జపాన్‌), గిలెర్మో ఒచావా (మెక్సికో), మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్‌) ఇప్పటికే ఐదు ప్రపంచకప్‌ టోర్నీలు ఆడారు. మెస్సీ, రొనాల్డో తాజాగా ఆరోసారి ప్రపంచకప్‌లో పోటీపడనున్నారు. 2018 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా, 2022 ప్రపంచకప్‌లో మూడో స్థానాన్ని సంపాదించింది.  

క్రొయేషియా ఫుట్‌బాల్‌ జట్టు: లివాకోవిచ్, కొటార్‌స్కీ, ఇవోర్‌ పాండుర్‌ (గోల్‌కీపర్లు), గ్వార్‌డియోల్, కాలెటకార్, సుటాలో, స్టానిసిక్, పొన్‌గ్రాసిక్, ఎర్‌లిక్, వుస్కోవిచ్‌ (డిఫెండర్లు), లుకా మోడ్రిచ్, కొవాసిచ్, పాసాలిచ్, వ్లాసిక్, లుకా సుసిక్, బటురినా, జాకిక్, పీటర్‌ సుసిక్, నికోలా మోరో, టోనీ ఫ్రుక్‌ (మిడ్‌ఫీల్డర్లు), పెరిసిచ్, క్రామారిచ్, బుడిమిర్, పాసాలిచ్, పీటర్‌ మూసా, మటానోవిచ్‌ (ఫార్వర్డ్స్‌).    

Advertisement
 
Advertisement
Advertisement