కన్నడ ముద్దుగుమ్మ, హీరోయిన్ శ్రీలీల గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఈ ఏడాది పరాశక్తి చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ కన్నడభామ ప్రస్తుతం ధనుష్‌కు జంటగా కనిపించనున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. ఈ ముద్దుగుమ్మపై గతంలో రూమర్స్ వినిపించాయి. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్‌లో ఉందంటూ వార్తలొచ్చాయి. వినాయక చవితి వేడుకల కోసం ఆమె తన తల్లితో కలిసి ముంబయిలోని కార్తీక్ ఇంటికి వెళ్లడంతో పుకార్లు వైరలయ్యాయి. అదే సమయంలో తనకు డాక్టర్ కోడలు కావాలని కార్తీక్ ఆర్యన్ తల్లి చెప్పడంతో మరింత ఆజ్యం పోసింది. కానీ వీటిపై ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు.
(చదవండి: రామ్ చరణ్ మణికట్టుకు గాయం.. ఎల్లుండి ఆపరేషన్!)
తాజాగా శ్రీలీలపై మరోసారి డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ సారి ఏకంగా టీమిండియా క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్‌లో ఉందంటూ కథనాలొస్తున్నాయి. మన తెలుగువాడు, యంగ్ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తోందని కథనాలు మొదలయ్యాయి.
ఏడాదిగా రూమర్స్..
శ్రీలీల, తిలక్ వర్మ ప్రేమలో ఉన్నారని గతేడాది నుంచి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి కనిపించారని వార్తలు రావడంతో రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. దాదాపు ఆరు నెలల క్రితమే శ్రీలీల తన తల్లితో కలిసి తిరుమలను సందర్శించింది. అదే సమయంలో తిలక్ వర్మ కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం.
ఆ తర్వాత ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా శ్రీలీల, ఆమె తల్లితో పాటు ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లతో కలిసి కనిపించడంతో రూమర్స్ మరింత బలపడుతున్నాయి. అయితే తమపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించలేదు.


