రామ్‌ చరణ్‌కు మరో ఆపరేషన్‌.. ? | Ram Charan Will Undergo A Wrist Surgery, Peddi Producer Says | Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌ మణికట్టుకు గాయం.. ఎల్లుండి ఆపరేషన్‌!

May 17 2026 3:07 PM | Updated on May 17 2026 3:23 PM

Ram Charan Will Undergo A Wrist Surgery, Peddi Producer Says

రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన తాజా పాన్‌ ఇండియా చిత్రం ‘పెద్ది’ మరికొద్ది రోజుల్లో(జూన్‌ 4) ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రెండేళ్లుగా ఈ చిత్రం కోసం రామ్‌ చరణ్‌ కష్టపడ్డాడు. దర్శకుడు బుచ్చిబాబు రాసుకున్న ‘పెద్ది’ పాత్ర కోసం చరణ్‌ పడిన కష్టం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌, యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌తో పాటు నిర్మాత కూడా చరణ్‌ పడిన కష్టం గురించే చెబుతున్నారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కించే క్రమంలో చాలా సార్లు ప్రమాదానికి గురయ్యారట. దాదాపు మూడు పెద్ద గాయాలు అయ్యాయట. కానీ బయటకు మాత్రం కంటికి గాయం అయిందన్న విషయమే తెలిసిందే. 

ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ తెరకెక్కిస్తున్నప్పుడు చరణ్‌ మణికట్టుకు కూడా తీవ్రంగా గాయం అయిందట. అయినా కూడా షూటింగ్‌కి బ్రేక్‌ ఇవ్వలేదట. ఇప్పుడా నొప్పి కాస్త ఎక్కువైపోవడంతో వైద్యులను సంప్రదిస్తే.. సర్జరీ చేయాలని చెప్పారట. రెండు రోజుల్లో చరణ్‌ మణికట్టు దగ్గర చిన్న సర్జరీ చేయించుకోబుతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత వెంకట సతీష్‌ వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. చరణ్‌కు తగిలిన గాయాల గురించి వివరించాడు.

‘పెద్ది’ సినిమా కోసం రామ్‌ చరణ్‌ చాలా కష్టపడ్డాడు. షూటింగ్‌ సమయంలో ఆయనకు మూడు గాయాలు అయ్యాయి. అయినా కూడా విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొన్నాడు. కంటికి మాత్రమే కాదు మణికట్టు దగ్గర కూడా గాయం అయింది. ఇప్పుడా నొప్పితో బాధపడుతున్నాడు. ఎల్లుండి(మంగళవారం) ఆపరేషన్‌ ఉంది. షూటింగ్‌ సమయంలో కండరాలు పట్టేసేవి. షూటింగ్‌ గ్యాప్‌లో జిమ్‌ చేసి వచ్చేవాడు. 

కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్‌లో ఆయన కండరాలు పట్టేశాయి. కాలు కూడా బెణికింది. ఆయన కోసం ప్రత్యేకంగా  ఫిజియో థెరపిస్ట్ పెట్టాల్సివచ్చింది.  ఈ సినిమా కోసం ఆయన  ప్రాణం పెట్టి నటించాడు. సినిమా చూస్తే అందరికి ఆ విషయం అర్థవవుతుంది. సినిమా ప్రారంభం నుంచే పెద్ది ప్రపంచంలోకి వెళ్తారు’ అని సతీష్‌ చెప్పుకొచ్చాడు.   కాగా, ఇటీవల చరణ్‌ కంటికి చిన్న సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మణికట్టుకు కూడా మరో సర్జరీ అని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement