అందరు చేసే వంటకమే కానీ దాన్ని సర్వ్ చేసే విధానం లేదా వండే విధానంలో ప్రత్యేకత ఉంటేనే కథ ఏ ఫుడ్ స్టాల్ అయినా క్లిక్ అయ్యేది. ప్రజాదరణ పెరిగేది. బహుశా దాన్నే క్యాచ్ చేశాడు ఈ టీనేజ్ యువకుడు. అలా ఇలా ఆలోచించలేదు ఈ యువకుడు. వంట చేసే విధానంలో సరికొత్తగా ఫ్యాషన్ జోడించడంతో అతడ ఫుడ్ స్టాల్ మూడు పువ్వులు ఆరు కాయల్లా దినదినాభివృద్ధితో దూసుకుపోతోంది. ఇంతకీ స్టైలిష్‌గా వంట చేయడం ఎలాగంటే..
చైనాకు చెందిన ఒక యువకుడు ఒక సాధారణ ఫ్రైడ్ రైస్ దుకాణాన్ని తన క్రియేటివిటీతో కొత్త లుక్‌ని అందించడమే కాదు లాభాల బాట పట్టేలా చేశాడు. అందరిలా వండటం కంటే.. ప్రత్యేకంగా విభిన్నంగా వంట చేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా అతడి వద్దకు వచ్చేవాళ్లు తినడాని కంటే..అతడు చేసే విధానం అతడి ఆహార్యం చూసి నివ్వెరపోతూ ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తిగా వస్తూ..ఇక అక్కడే తింటుండటం విశేషం.
19 ఏళ్ల లూ షాన్‌డాంగ్ ఈనే యువకుడు కుటుంబ దుకాణాన్ని చాలా విభన్నంగా నడిపిస్తున్నాడు. ఎవరైన వంట చేయాడానికి వచ్చే వాళ్లు కుక్ డ్రెస్ లాంటది వేసుకుంటారు. కానీ ఇక్కడ లూ ఫ్యాషన్‌గా ఉంటాడు. ఆయన ఆఫీస్‌కి వెళ్లే వ్యక్తిలా సూటు బూటు వేసుకుని కనిపించడం విశేషం. చైనాలోని ఓ సాదారణ ఫ్రైడ్ రైస్ స్టాల్ రెస్టారెంట్‌కు మించి క్రేజ్ సంపాదించుకుంది. అందుకు ప్రధాన కారణం అతడు వండే విధానమే. లీ చాలా స్టైలిష్‌గా వండుతున్న విధానం అందర్నీ ఆకర్షించి ఆ స్టాల్‌కి జనాలు క్యూకట్టేలా ప్రజాదరణ పొందింది.
అంతేకాదండోయ్ ఎంతో రుచిగా క్షణాల్లో వేడివేడిగా వడ్డిస్తాడు. అతడు ఎంత బిజీలో అయినా ఫ్రైడ్ రైస్‌ని జస్ట్ మూడు నిమిషాల్లో తయారు చేస్తాడు. ఇక ఫైడ్‌రైస్ ఒక ప్లేటు రూ. 1401లు అట. అతడి ఖర్చులు పోగా నెలకు సుమారుగా రూ. 7లక్షలుపైనే ఆర్జిస్తున్నట్లు తెలిపాడు. క్రియేటివిటీకి నైపుణ్యం తోడైతే అద్భుతాలు జరగుతాయి అంటే ఇదేగదా..!.
లూ నవ్వు మామలు గ్రేట్ కాదు..సూపరో సూపర్..!. కాగా, ఈ స్టాల్ ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈమేరకు లూ మాట్లాడుతూ..ఏదో సరదాగా కస్టమర్ల ముఖంలో నువ్వులు విరబూయించేందుకు ఇలా సూటు వేసుకుని వంట చేశాను. కానీ వాళ్ల నుంచి ఈ స్ధాయిలో స్పందన వస్తుందని అస్సలు ఊహించలేదని సంతోషంగా చెబుతున్నాడు లూ.
(చదవండి: కోడిగుడ్డంత పుచ్చకాయలు)


