వడదెబ్బకు పారాసెటమాల్‌ ఉపయోగిస్తున్నారా? | Heat Stroke: Doctor Explains Why Paracetamol Doesn't Work | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు పారాసెటమాల్‌ ఉపయోగిస్తున్నారా? వైద్యులు ఏమంటున్నారంటే..

May 17 2026 11:48 AM | Updated on May 17 2026 12:05 PM

Heat Stroke: Doctor Explains Why Paracetamol Doesn't Work

గత కొన్ని రోజులుగా భారత్‌లో ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయో తెలిసిందే. ఎండలు భగభగలాడిస్తున్నాయి. ఉదయం పది దాటితేనే సూర్ర్యు సుర్రు మంటున్నాడు. కనీసం బయటకు వెళ్లాలంటేనే వణుకుపుట్టుకొస్తుంది. అంతలా ఎండలు గజగజలాడిస్తున్నాయి. ప్రతి చోట నలభై డిగ్రీలు దాటేస్తున్నాయి. మెట్రో ప్రాంతాల్లో ఇక ఆ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అంతేగాదు ఎండల ధాటికి వడదెబ్బల బారినపడుతున్న వారు ఎక్కువే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు కొందరు వడదెబ్బ బారిన పడగానే..పారాసెటమాల్‌ వేసుకుంటుంటారు. ఇలా అస్సలు చేయకూడదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వడదెబ్బ రెండు విధాలుగా ఉంటుందని, అందుకోసం ఎలాంటి ఆరోగ్య సంరక్షక చర్యలు తీసుకోవాలో సవివరంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. మరి అవేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా!.

దేశంలోని అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45°C దాటుతుండగా, తీర ప్రాంతాలు తీవ్రమైన తేమ, భరించలేని వేడితో సతమతమవుతున్నాయి. పైగా ఆస్పత్రులలో వడదెబ్బ, వడతాపం కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తే..క్షణాల్లో ప్రాణాంతకంగా మారుతుందని అంటున్నారు డాక్టర్‌ విశాల్‌. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియోలో వడదెబ్బకు, వడఘాతానికి మధ్య ఉన్న తేడాను కూడా వివరించారు. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో పారాసెటమాల్‌ వేసుకోవడం ఎంత ప్రమాదకరం, ఎలాంటి అత్యవసర చర్యలు తీసుకుంటే మంచిది, వంటి వాటి గురించి సవివరంగా వెల్లడించారు.  

ప్రస్తుతం భారతదేశంలో ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీలకు దగ్గరగా ఉందని, తీరప్రాంతలైతే అంతకమించి ఉంటున్నాయి. సాధరణంగా వడదెబ్బ తగిలినప్పుడు..రోగి అలసిపోయినట్లు కనిపిస్తాడు, కానీ అతనికి చెమట పడుతూనే ఉంటుంది. ఈ సందర్భంలో, చాలా సమయం ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది అని డాక్టర్ విశాల్‌ చెబుతున్నారు. అదే వడఘాతం అనేది ప్రాణాంతకమైన వైద్య పరిస్థితి అని పేర్కొన్నారు. 

శరీరం అంతర్గత ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ పూర్తిగా విఫలమైనప్పుడు ఇది సంభవిస్తుందట. రోగి పూర్తిగా స్పృహ కోల్పోతాడు, ఆ వ్యక్తి శీతలీకరణ వ్యవస్థ పనిచేయడం ఆగిపోతుంది. పైగా చెమట కూడ పట్టదు కాబట్టి చర్మం పొడిగా, వేడిగా ఉంటుందట. దానివల్ల, మెదడు అక్షరాలా మైక్రోవేవ్‌లో పెట్టినట్లుగా ఉడికిపోతుంది. దాని కారణంగా, రోగి స్పృహ కోల్పోవచ్చు, అతనికి మూర్ఛలు రావచ్చు, కోమాలోకి వెళ్ళవచ్చు, లేదా చనిపోవచ్చు కూడా అని అన్నారు.

పారాసెటమాల్‌ వేసుకోవచ్చా..
వడదెబ్బలో పారాసెటమాల్ పనిచేయదని అంటున్నారు వైద్యులు. అనారోగ్యం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, పారాసెటమాల్ మెదడు థర్మోస్టాట్‌ను రీసెట్ చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కానీ వడదెబ్బ తగిలినప్పుడు, బయటి నుండి వచ్చే అధిక వేడి శరీర వ్యవస్థను అధిగమించినప్పుడు, శరీరాన్ని చల్లబరిచే యంత్రాంగం విఫలమవుతుంది. 

పైగా రోగిని చల్లటి నీటితో చల్లబర్చాలి, చంకల ప్రాంతంలో చల్లటి నీటినిపోయాలి. దాంతో వారిలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే రోగికి తగినంత నీఉ, ఓఆర్‌ఎస్‌ ఇవ్వడం వంటివి చేయాలి. ఇలాంటి వాళ్లు సాధ్యమైనంతవరకు చల్లటి నీటిని తాగుతూ..ఇంటిలోనే ఉండటం మంచిదని సూచిస్తున్నారు డాక్టర్‌ విశాల్‌.

గమనిక: ఇది కేవలం అవగాహాన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వైద్యులు లేదా నిపుణులకు సంప్రదించడం ఉత్తమం. 

 

(చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?)

 

Advertisement
 
Advertisement
Advertisement