పుదీనాలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని డ్యామేజ్ కాకుండా రక్షించడమే కాకుండా, హైడ్రేట్ చేసి తాజాగా ఉండేలా చేస్తాయి. పుదీనాలోని విటమిన్ ‘ఏ’ చర్మంలోని జిడ్డును తగ్గించి, చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. పుదీనా ఆకుల పేస్ట్, గుడ్డు తెల్లసొన మిశ్రమంతో మాస్క్ వేసుకుంటే చర్మం నిగారిస్తుంది. పుదీనాలోని శాలిసిలిక్ యాసిడ్ మొటిమలను తగ్గిస్తుంది. పుదీనా రసం, పచ్చి బొప్పాయి రసాన్ని కలిపి మచ్చలు, కీటకాలు కుట్టిన చోట లేదా చర్మ ఇన్‌ఫెక్షన్లపై రాస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది.
వేసవిలో చన్నీటిలో పుదీనా ఆకులను వేసి ముఖం కడుక్కోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో పుదీనా ఆకులు లేదా పుదీనా నూనె వేసుకుంటే అలసట తగ్గి, అధిక చెమట సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖంపై మొటిమల వల్ల ఏర్పడే మచ్చల నివారణకు కూడా పుదీనా తోడ్పడుతుంది. సమాన పరిమాణంలో ఎండిన తులసి, వేప, పుదీనా ఆకులను పొడి చేసి పెట్టుకోవాలి. ఒక చెంచా ఈ పొడికి కొంచెం పసుపు, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసి మచ్చలపై రాస్తే అవి క్రమంగా తగ్గుతాయి.
చర్మ సంరక్షణ కోసం కానోపి
ఎంత ఖరీదైన ఫేస్ వాష్‌లు వాడినా, ముఖం కడుక్కోవడానికి ఉపయోగించే నీరు బాగుండకపోతే ఆ ప్రయత్నాలన్నీ వృథానే. కొళాయి నీటిలో ఉండే క్లోరిన్, ఇతర మలినాలు, హార్డ్ వాటర్ చర్మాన్ని పొడిగా మార్చడమే కాకుండా, మొటిమలు, అలర్జీలకు దారితీస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ వెల్‌నెస్ బ్రాండ్ కానోపీ తన సరికొత్త ఫాసెట్ ఫిల్టర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ ఫిల్టర్ సాధారణ వాటర్ ఫిల్టర్ల లాగా కాకుండా, ప్రత్యేకంగా చర్మ సంరక్షణ కోసం రూపొందించినది. ఇది నీటిలోని క్లోరిన్, ఇతర మలినాలను తొలగించి, నీటిని సున్నితంగా మారుస్తుంది. దీనివల్ల చర్మంపై కలిగే మంట, అలర్జీలు తగ్గుతాయి. మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది. చర్మం సహజసిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది.
ఈ ఫిల్టర్ కేవలం పనితీరులోనే కాకుండా, చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బాత్రూమ్ ఇంటీరియర్‌కు తగినట్లుగా ఇది లావెండర్, ఇత్తడి, మ్యాట్ బ్లాక్, బ్రష్డ్ నికెల్ వంటి అద్భుతమైన రంగులలో లభిస్తుంది. కానోపీ సంస్థ కేవలం ఫిల్టర్లకే పరిమితం కాకుండా, షవర్ హెడ్‌లు హ్యూమిడిఫైయర్‌లను కూడా సరికొత్త రీతిలో డిజైన్ చేస్తోంది. గృహోపకరణాలను బ్యూటీ టూల్స్‌గా మార్చడం ద్వారా మన ఇంట్లోనే చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.


