ఇంతవరకు చాలామంది భారత్ ఉండటం ఇష్టపడటాన్ని చూశాం. ఇక్కడ భోజనానికి, జీవనశైలికి అలవాటు పడితే ఒక మహిళ ఏకంగా అచ్చం భారతీయ మహిళలా రష్యన్ మహిళ తనను తాను మార్చుకుంది. కేవలం కట్టు బొట్టు మాత్రమే కాదు..మన భారత నారి ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా కుటుంబంతో మసులుకుంటుందో అలా మొత్తం జీవనశైలినే మార్చుకుందామె. పైగా ఆ జీవనవిధానం తన వ్యక్తిత్వాన్ని చాలా గొప్పగా మార్చాయంటూ తన అనుభవాన్ని వివరిస్తూ వీడియో షేర్ చేసుకుంది.
ముంబైలోని మొహాలీలో నివశిస్తున్న రష్యన్ మహిళ ఒక భారతీయ మహిళ నుంచి ఆ ఐదు అలవాట్లను నేర్చుకున్నా అంటూ వాటి గురించి వీడియోలో వివరించింది. ఉదయాన్నే త్వరగా లేవడం నుంచి ప్రతి నిర్ణయం తీసుకునే ముందుకు భర్తను సంప్రదించడం వరకు ప్రతి అలవాటు తన వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మార్చాయని పేర్కొంది. భారతీయ మహిళల నుంచి అలవర్చుకున్న అలవాట్లు అంటూ క్యాప్షన్ జోడించి మరి వీడియోని పోస్ట్ చేసింది.
నేర్చుకున్న ఐదు అలవాట్లు..
1. తాను రష్యాలో ఉంటే ఉదయం 10 అయితే గానీ లేచేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకున్నా. ఉదయం 5 నుంచి 7 లోపు మేల్కొంటానని చెప్పింది. భారత్‌లో రోజు చాలా త్వరగా ప్రారంభమవుతుంది. ఉదయాన్నే చెత్త సేకరించడం, తాజా కూరగాయలు, పాలు తెచ్చుకోవడం, దుకాణాలు తెరుచుకోవడం వంటివన్నీ చాఆ తొందరగా జరిగిపోతాయి అని పోస్ట్‌లో రాసింది.
2. భర్త లేచేసరికే వంట చేయడం తనకు ఇష్టమని, అందుకే ఉదయాన్నే లేస్తానని చెప్పింది. కాచిన పాలను తాగడం అనేది తాను తప్పించుకోలేని రోజువారి ఉదయపు అలవాటుగా పేర్కొంది.
3. అలాగే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు భర్తను సంప్రదించడం వంటివి కూడా చేస్తానని అంది. నిజానికి ఇది రష్యాలో అతి పెద్ద ప్రమాదకరమైన సమస్య, ముఖ్యంగా స్వేచ్ఛను హరించేదిగా తీవ్రంగా పరిగణిస్తారని, కానీ భారత్ ప్రకారం కుటుంబ ఐక్యతకు సంబంధించిందని అంటుంది. అంతేగాదు దాన్ని సింపుల్‌గా జట్టు కృష్టిగా అభివర్ణించిందామె.
4. ఇప్పుడు తన దగ్గర చీరలు, సూట్లు ఉన్నాయని, ప్రతి కార్యక్రమం "ప్రత్యేకంగా" అనిపిస్తుందని చెబుతోంది. ఎలాగైన భారతీయ వేషధారణ కాస్త ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపించినా..నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుందని చెబుతోంది.
5. అతిథులు రాగానే భారతీయ మహిళల్లా నీళ్లు, టీ లేదా కాఫీ సర్వ్ చేయడం నేర్చుకున్నానని అంటోంది. ఒక భారతీయ మహిళ వడ్డించినట్టుగా భోజనం కూడా సర్వ్ చేస్తానని చెబుతోంది.
నెటిజన్లంతా ఆమెతో ఏకభవిస్తూ..మాకు అత్యంత సర్వసాధారణం, జీవితంలో భాగమైన మా అలవాట్ల గొప్పతనాన్ని అద్భుతంగా వివరించడమే గాక, అనుసరించడం అభినందనీయం. ధన్యవాదాలు అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: కేన్సర్‌పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్‌పాండే హెల్త్ టిప్స్)


