breaking news
National
-
‘నా వ్యాఖ్యల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పను’
సాక్షి,ఢిల్లీ: లోక్‌సభలో తనకు మాట్లాడే అవకాశం లేదని తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని, క్షమాపణలు చెప్పబోమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యనించారు. బుధవారం రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘విద్యార్థులపై పోలీసుల దుశ్చర్యకు కేంద్రహోంమంత్రి అమిత్ షానే బాధ్యత వహించాలి. పోలీసులు మేకులున్న లాఠీలతో విద్యార్థులను చావబాదారు. పెల్లెట్ గన్ తగిలి ఓ యువకుడు కన్ను పోవాల్సిన పరిస్థితి వచ్చింది.మహిళలు, మైనర్లపై కూడా దాడులు చేశారు. పోలీసులకు అమిత్‌షా ఆదేశాలైనా ఇచ్చి ఉండాలి.. ఆయనకు తెలియకుండా జరిగుండాలి’అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జరిగిన పేపర్ లీకేజీల నిరసనల సందర్భంలో, విద్యార్థి నిరసనకారులపై పోలీసుల కాల్పులు, లాఠీఛార్జీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఆదేశాలు ఇచ్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అమిత్ షా ఆదేశాలు ఇచ్చారనడానికి రాహుల్ గాంధీ దగ్గర ఏవైనా రాతపూర్వక ఆధారాలు ఉంటే సభ ముందు ఉంచాలని, లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు సభకు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని, అలాంటప్పుడు ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. -
సరికొత్త రికార్డుపై కన్నేసిన విజయ్ సర్కార్!
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మిల్లో భాగంగా విద్యార్థులకు వారానికి ఓకసారి చికెన్ బిర్యానీ పెట్టేందుకు దాదాపు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఒక వేళ ఈ పథకం అమలైతే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చికెన్ బిర్యాణీ పెట్టిన రాష్ట్రంగా తమిళనాడు రికార్డు సృష్టించనుంది.మధ్యాహ్న భోజన పథకంలో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీని చేర్చాలనే ప్రతిపాదన వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల్లో హాజరు శాతం పెంచడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్లను తగ్గించడం తదితర కారణాలున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు, విద్యార్థులకు మరింత పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు పాఠశాలలపై ఆసక్తిని పెంచేందుకు సీఎం విజయ్ ఈ అంశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందుతోంది. 11, 12వ తరగతులు (ఇంటర్మీడియట్) చదివే విద్యార్థులకు కూడా పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఒకవేళ అది అమలైతే అప్పుడు విద్యార్థుల సంఖ్య దాదాపు 48 లక్షలకు చేరుతుంది.కాగా ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో వారానికి ఒకసారి కేవలం వెజిటబుల్ బిర్యానీ లేదా పులావ్ మాత్రమే మెనూలో భాగంగా ఇస్తున్నారు. దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు కేవలం గుడ్లు, అరటిపండ్లు లేదా పాలు మాత్రమే అదనపు పోషకాహారంగా అందిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలు గతంలో చికెన్ కర్రీ ఇస్తామని ప్రకటించినప్పటికీ, అది కొన్ని నెలల ప్రత్యేక ప్యాకేజీగా మాత్రమే ఉంది తప్ప నిరంతరంగా వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ ఇచ్చేలా ఏ రాష్ట్రం కూడా శాశ్వత ప్రతిపాదనలు సిద్ధం చేయలేదు.తొలిసారిగా మిడ్డే మీల్ భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం తమిళనాడే. బ్రిటీష్ కాలంలో (1920లలో) మద్రాస్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని పాఠశాలల్లో దీన్ని చిన్నస్థాయిలో ప్రారంభించగా, ఆ తర్వాత ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కె. కామరాజ్ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల కోసం ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగావిస్తరింపజేశారు.ఇప్పుడు విద్యార్థుకు చికెన్ బిర్యాణీ పెడితే మరోసారి తమిళనాడు రికార్డు సృష్టించనుంది. -
‘‘అందుకే రాహుల్ గాంధీ ప్రధాని నివాసం వద్దకు వెళ్లారు’’
న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్షాల ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. ఆందోళనల మధ్యే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. విపక్షాలపై జితేంద్ర సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై అమిత్ షా కాల్పులకు ఆర్డర్స్ ఇచ్చారంటూ రాహుల్ గాంధీ అనడం సరికాదని చెప్పారు."జూలై 21న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బహుశా ఏదో ప్రత్యేక ఆలోచనతో వెళ్లి ప్రధానమంత్రి నివాసం బయట బైఠాయించారు. దేశం తనను ఎన్నుకుని 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో కూర్చోబెట్టాలనే బలమైన కోరిక ఆయనకు ఉన్నట్టు కనిపించింది. ఆ ఆకాంక్ష నెరవేరకపోవడంతో ఆయన నిరాశకు, అసహనానికి గురై 7 లోక్ కల్యాణ్ మార్గ్ గేట్ల వద్ద కూర్చున్నారు. అలా చేయడం ఆయన స్థాయికి తగదని ఎంతో మర్యాదగా వివరించే ప్రయత్నం చేసినప్పుడు, తనను తీసుకెళ్లిపోవచ్చని ఆయన స్పందించారుకాల్పులు జరగలేదని పదేపదే స్పష్టం చేశారు. టియర్ గ్యాస్ వాడారు. కాల్పులు జరగలేదు కాబట్టి ఆదేశాలు జారీ చేసే ప్రశ్నే తలెత్తదు. అలాంటి ఆదేశాలు జారీ చేసే అధికారం మంత్రికి కాదు, మేజిస్ట్రేట్‌కు ఉంటుంది.ఇంత ముఖ్యమైన బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సూచనలు ఇవ్వకుండా దానిపై రాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత వాడిన అసభ్య పార్లమెంటరీ భాష దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆయనకు కనీస పార్లమెంటరీ నిబంధనలపై అవగాహన ఉన్నదా అన్న సందేహం కలుగుతోంది. ఈ దేశ భవిష్యత్తైన యువతను 'ఇడియట్స్' అని పిలవడం కన్నా దురదృష్టకరమైన విషయం ఇంకేముంటుంది?" అని అన్నారు. -
యాంటీ పేపర్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
సాక్షి,ఢిల్లీ: యాంటీ పేపర్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓట్లతో యాంటీ పేపర్ లీక్ బిల్లు పాసమైంది. పరీక్షల నిర్వహణ, పలు సంస్కరణలు చేపడుతూ బిల్లు రూపకల్పన జరిగింది. బిల్లు ఆమోదం తర్వాత రేపటికి లోక్‌సభ వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ బిల్లు, 2026 (యాంటీ పేపర్ లీక్ బిల్లు) పోటీ పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యంత కఠినమైన నిబంధనలను ప్రతిపాదిస్తోంది. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వివాదాలు, దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో ఈ సవరణ బిల్లును కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కూడా పాసయ్యింది. పేపర్ లీకేజీలు, కాపీయింగ్, ఇతర అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు కనీసం 5 ఏళ్ల నుండి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే గరిష్ట జరిమానాను రూ.10 లక్షల నుండి రూ.50 లక్షల వరకు పెంచారు.పేపర్ లీక్ చేసే వారికి కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష,రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధిస్తారు. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే సదరు నిందితులు లేదా సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ఈ బిల్లు కల్పిస్తుంది.పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు తప్పు చేస్తే రూ.5 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు, ఆయా సంస్థలను 8 ఏళ్ల పాటు బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు.పేపర్ లీక్ కేసులను వేగంగా తేల్చడానికి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. కేసు దర్యాప్తును 2 నెలల్లోగా (60 రోజులు) పూర్తి చేయాలి. చార్జ్‌షీట్ దాఖలు చేసిన 3 నెలల లోపే కోర్టులు తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా జరిగే ఇటువంటి పరీక్షల మోసాలను విచారించడానికి కేంద్రం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దించుతుంది. ఈ చట్టం దేశంలోని అన్ని ప్రధాన కేంద్ర నియామక, ప్రవేశ పరీక్షలకు వర్తిస్తుంది. ఈ కొత్త బిల్లులో దాదాపు 15 రకాల చట్టవిరుద్ధమైన చర్యలను నేరాలుగా గుర్తించారు.క్వశ్చన్ పేపర్లు లేదా ఆన్సర్ కీ లీక్ చేయడం.ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేయడం.నకిలీ అడ్మిట్ కార్డులు సృష్టించడం లేదా ఫేక్ వెబ్సైట్లు నడపడం.ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయడం కంప్యూటర్ నెట్‌వర్క్‌లను హ్యాక్ చేయడం వంటి అంశాలునన్నాయి. -
భారత పౌరసత్వంపై కోల్‌కతా హైకోర్టు స్పష్టత
ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, పాన్ కార్డ్, బ్యాంకు ఖాతా పుస్తకం వంటి పత్రాలు కేవలం వ్యక్తిగత గుర్తింపునకు లేదా ప్రభుత్వ సేవలు పొందడానికే పరిమితమని, అవి భారత పౌరసత్వానికి నిర్దిష్ట నిరూపణలు (కన్‌క్లూజివ్ ప్రూఫ్) కావని కోల్‌కతా హైకోర్టు తీర్పు వెలువరించింది. బంగ్లాదేశ్ పౌరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ డిటెన్షన్ సెంటర్లో ఉన్న ఓ వ్యక్తి పౌరసత్వ వివాదానికి సంబంధించిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ దేబాంగ్షు బసాక్, జస్టిస్ మహమ్మద్ షబ్బర్ రషీదీలతో కూడిన ధర్మాసనం ఈ స్పష్టత ఇచ్చింది.కేసు నేపథ్యం.. విచారణ ముఖ్యాంశాలుముర్షిదాబాద్ ప్రాంతానికి చెందినవాడిగా భావిస్తున్న నాసిర్ అనే వ్యక్తి విదేశీయుడనే అనుమానంతో లాల్గోలా డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు. తాను భారతీయ పౌరుడినేనని నిరూపించుకోవడానికి ఆయన తరఫున ఓటరు ఐడీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్‌బుక్‌లను కోర్టుకు సమర్పించారు. అయితే, విచారణలో ఆయన వెల్లడించిన వివరాల్లో వ్యత్యాసాలు, అస్పష్టత ఉన్నట్లు ధర్మాసనం గుర్తించింది. విదేశీయుల చట్టం (ఫారెనర్స్ యాక్ట్, 1946) సెక్షన్ 9 ప్రకారం.. ఒక వ్యక్తి తాను విదేశీయుడు కాదని నిరూపించుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత ఆ వ్యక్తిపైనే ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.‘ఓటరు గుర్తింపు కార్డు అనేది ఓటర్ల జాబితాలో సదరు వ్యక్తి పేరు నమోదుకు సాక్ష్యమే తప్ప పౌరసత్వాన్ని ధ్రువీకరించదు. ఆధార్, పాన్ కార్డ్ ప్రభుత్వ సేవలు పొందడానికి, పన్ను సంబంధిత గుర్తింపునకు ఉద్దేశించిన సాధనాలు మాత్రమే. వీటి ఆధారంగా పౌరసత్వాన్ని పొందలేరు. పౌరసత్వ చట్టం 1955 ప్రకారం భారతదేశంలో పౌరసత్వ నిర్ణయాలకు సిటిజన్‌షిప్ యాక్ట్, 1955 ప్రధాన ప్రాతిపదిక. అందులోని చట్టబద్ధ నిబంధనలను సాధారణ సేవా గుర్తింపు కార్డులు అధిగమించలేవు’ అని కోర్టు వ్యాఖ్యానించింది.కస్టడీలో ఉన్నప్పుడు సమర్పించిన పత్రాలు, ఇచ్చిన వాంగ్మూలాల్లో పొంతన లేకపోవడంతో పిటిషనర్ కోరికను నిరాకరిస్తూ హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. అక్రమ చొరబాట్లు, గుర్తింపు పత్రాల దుర్వినియోగం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో పౌరసత్వ చట్ట నిబంధనలకు, సాధారణ గుర్తింపు కార్డులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చట్టపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటే..భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటే కేవలం సాధారణ గుర్తింపు కార్డులు సరిపోవని ‘పౌరసత్వ చట్టం, 1955’ ప్రకారం నిర్దిష్టమైన, చట్టబద్ధమైన ధ్రువపత్రాలు అవసరమవుతాయని న్యాయస్థానాలు, హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేశాయి.పాస్‌పోర్ట్: భారత ప్రభుత్వం జారీ చేసే విదేశీ ప్రయాణ పాస్‌పోర్ట్ అనేది విదేశాల్లో, దేశంలో పౌరసత్వానికి అత్యంత బలమైన ప్రాథమిక ఆధారం.పౌరసత్వ గుర్తింపు పత్రం: విదేశాల నుంచి వచ్చి భారత పౌరసత్వం పొందిన వారికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక పౌరసత్వ పత్రం.బర్త్ సర్టిఫికేట్: మున్సిపాలిటీ, పంచాయతీ లేదా ప్రభుత్వ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి పొందిన అధికారిక జనన ధ్రువీకరణ పత్రం.తల్లిదండ్రుల పౌరసత్వ ఆధారాలు: 1987 జులై 1కి ముందు భారతదేశంలో జన్మించిన వారికి తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రం సరిపోతుంది. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబరు 3 మధ్య జన్మిస్తే అభ్యర్థి జనన ధ్రువీకరణ పత్రంతో పాటు తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకరు ఆ సమయానికి భారతీయ పౌరుడని నిరూపించే పత్రాలు ఉండాలి. 2004 డిసెంబరు 3 తర్వాత జన్మిస్తే తల్లిదండ్రులిద్దరూ భారతీయ పౌరులై ఉండాలి.ఇతర పత్రాలుజనన ఆధారాలు స్పష్టంగా లేనప్పుడు కొన్ని ప్రభుత్వ పత్రాలు పౌరసత్వ విచారణల్లో సహాయపడతాయి. తరాల నుంచి భారతదేశంలో నివసిస్తున్నట్లు చూపే పాత ఆస్తి లేదా రెవెన్యూ రికార్డులు. పుట్టిన తేదీ, ప్రదేశం నమోదై ఉన్న పాత విద్యా అర్హత పత్రాలు. పూర్వీకులు భారతదేశంలో నివసించారని నిరూపించే ప్రభుత్వ గుర్తింపు పొందిన రికార్డులు ఉండాలి.ఇదీ చదవండి: వసివాడిన పసిడి మెరుపులు -
జ్యోతి కుటుంబానికి ఆర్థిక సాయం.. సోదరుడికి ఉద్యోగం
యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు భావిస్తున్న పీహెచ్డీ స్కాలర్ జ్యోతి కుటుంబానికి అధికారులు అండగా నిలిచారు. విద్యార్థుల ఆందోళనలతో దిగి వచ్చి ఆమె కుటుంబానికి రూ.16 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు పంజాబ్ యూనివర్సిటీ ప్రకటించింది. అంతేకాకుండా.. ఆమె కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు సోదరుడికి యూనివర్సిటీలోనే ఉద్యోగం కల్పించనున్నట్లు వెల్లడించింది.హరియాణాలోని రేవారీకి చెందిన 28 ఏళ్ల జ్యోతి.. పంజాబ్ యూనివర్సిటీలోని మైక్రోబయాలజీ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నారు. మంగళవారం క్యాంపస్‌లోని హాస్టల్ నుంచి తన విభాగానికి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.వర్షాల కారణంగా క్యాంపస్‌లోని కొన్ని ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో జ్యోతి ప్రధాన మార్గానికి బదులుగా నీరు నిలిచిన ప్రాంతం పక్కనున్న దారిలో వెళ్లింది. ఆ సమయంలో.. సమీపంలోని విద్యుత్ జంక్షన్ బాక్స్ కరెంట్ వైర్ తెగిపడింది. విద్యుత్ షాక్‌తో కుప్పకూలిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.విద్యార్థుల నిరసనలుజ్యోతి మృతిపై పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపస్‌లో విద్యుత్ భద్రతా లోపాలపై ప్రశ్నిస్తూ వందలాది మంది విద్యార్థులు వీసీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. క్యాంపస్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జ్యోతి కుటుంబానికి తగిన పరిహారం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.కుటుంబ సభ్యులతో చర్చల తర్వాత నిర్ణయంవిద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు జ్యోతి కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం రూ.16 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే జ్యోతి సోదరుడికి యూనివర్సిటీలో ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. జ్యోతి సోదరుడు 10+2తో పాటు ఐటీఐ (ఎలక్ట్రికల్) విద్యార్హత కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు. పంజాబ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అతడిని యూనివర్సిటీలో ఎలక్ట్రీషియన్‌గా నియమించనున్నట్లు వెల్లడించారు.A research scholar lost her life in Panjab University on 28 July 2026, suspected electrocution. Students staged protest in the campus against official's negligence on the matter. PU has agreed to pay Rs 16 lakh compensation to family and a job of electrician to her brother. pic.twitter.com/qUnMKVFHrj— Patrkaar Priyanka (@Patrkarpriyanka) July 28, 2026బాధ్యులపై దర్యాప్తుఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్యాంపస్‌లో విద్యుత్ నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా? ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటి? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. చండీగఢ్ ఎంపీ మనీష్ తివారీ కూడా జ్యోతి మృతిపై స్పందించారు. ఈ ఘటన హృదయ విదారకమని పేర్కొంటూ.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. -
‘దమ్ముంటే ఒంటరిగా రా’.. కంగనాపై రాఖీ తిరుగుబాటు
జంతర్‌మంతర్ వద్ద జరిగిన జెన్ జెడ్ విద్యార్థుల నిరసనలపై ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నటి రాఖీ సావంత్ తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులకు, దేశ యువతకు మద్దతుగా నిలిచిన ఆమె, కంగనా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల కంగనా రనౌత్ జెన్ జెడ్ వారిని ‘జనరేషన్ గట్టర్’ అని అభివర్ణించడంతో పాటు, నిరసనల్లో పాల్గొన్న యువతులపై వివాదాస్పద కామెంట్లు చేశారు.దీనిపై రాఖీ సావంత్ తీవ్రంగా స్పందిస్తూ, దేశంలోని యువతులు, విద్యార్థినుల గురించి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసిన రాఖీ సావంత్, కంగనా రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంపీగా ఎలా ఎదిగారని ప్రశ్నించారు. ‘మీకు ధైర్యం ఉంటే సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా బయటకు తిరగండి. అప్పుడే దేశంలోని యువత శక్తి ఏంటో మీకు తెలుస్తుంది’ అని సవాలు విసిరారు.పార్లమెంట్లో కూర్చుని ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. బాలీవుడ్లో కంగనా గత వివాదాలను గుర్తుచేస్తూ, ఆమె భాషపై తీవ్ర ఆక్షేపణ తెలిపారు. మరోవైపు, కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో జెన్ జెడ్ నిరసనల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిరసనల్లోని రీల్స్ చూసి తాను దిగ్భ్రాంతి చెందానని, కొద్దిరోజులు డిజిటల్ డిటాక్స్లోకి వెళ్తున్నట్లు వెల్లడించారు. సాంప్రదాయ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కొందరిపై ఆమె మండిపడ్డారు. ఈ పరిణామాలు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
అడవుల్లో చివరి వేట.. గణపతి ఎక్కడ?
అడవుల్లో తుపాకుల శబ్దం తగ్గుతోంది... కానీ ఒక ప్రశ్న మాత్రం ఇంకా మారుమోగుతోంది. ఒకప్పుడు దేశాన్ని వణికించిన మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన అగ్రనేతలు ఇప్పుడు ఎక్కడ?, ఆపరేషన్ ‘కగార్’ దెబ్బకు ఒక్కొక్కరుగా కీలక నేతలు మరణించగా, మరికొందరు లొంగిపోయారు. ఒకప్పుడు అజేయంగా భావించిన మావోయిస్టు కేంద్ర కమిటీ ఇప్పుడు దాదాపు చెల్లాచెదురైంది. మరి ఒకప్పుడు ఉద్యమానికి ముఖచిత్రంగా నిలిచిన గణపతి ఇంకా జీవించి ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? సంస్థను ఇంకా నడిపిస్తున్నారా? లేక మావోయిస్టు ఉద్యమం నిజంగానే చివరి అధ్యాయానికి చేరుకుందా? ఇప్పుడు భద్రతా వర్గాల్లో ఇదే ప్రధాన చర్చ.ఒకప్పుడు దేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద సవాల్‌గా నిలిచిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు ఉనికిని కాపాడుకునే పోరాటంలో పడింది. నాలుగు దశాబ్దాలుగా మధ్య భారత అటవీ ప్రాంతాలను తమకు అడ్డాగా మార్చుకున్న మావోయిస్టు సంస్థపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ నిర్ణయాత్మక దశకు చేరుకుంది. వరుస ఎన్కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్లు, అగ్ర నాయకుల మరణాలతో ఒకప్పుడు దేశాన్ని వణికించిన సీపీఐ (మావోయిస్టు) సంస్థ ఇప్పుడు తీవ్రమైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి.కగార్ అంటే?‘కగార్’ అంటే హిందీలో అంచు, చివరి దశ అనే అర్థం. మావోయిస్టులను వారి చివరి స్థావరాల వరకూ వెంబడించి, ఆయుధ సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడం, నాయకత్వాన్ని బలహీనపరచడం, అడవుల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని విస్తరించడమే ఈ ఆపరేషన్ లక్ష్యం. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, అబుజ్మాద్, బీజాపూర్, దంతేవాడ, సుక్మా, నారాయణ్‌పూర్, కాంకేర్ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్, తెలంగాణ-ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు అడవుల్లో కేంద్ర బలగాలు, కోబ్రా కమాండోలు, రాష్ట్ర పోలీసు ప్రత్యేక దళాలు సంయుక్తంగా భారీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.ఒకప్పుడు 200కు పైగా జిల్లాలు.. 2000 దశకంలో మావోయిస్టుల ప్రభావం 200కు పైగా జిల్లాల వరకు విస్తరించిందని అంచనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వరకు ‘రెడ్ కారిడార్’ పేరుతో విస్తరించిన ఈ ఉద్యమం ప్రస్తుతం ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతానికే పరిమితమైందని భద్రతా సంస్థలు చెబుతున్నాయి.కీలక నేతలంతా మృతి.. మావోయిస్టు ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న పలువురు అగ్రనేతలు గత కొన్నేళ్లలో భద్రతా బలగాల ఆపరేషన్లలో మరణించారు. మరికొందరు సంస్థ నుంచి వైదొలగి పోలీసులకు లొంగిపోయారు.చెరుకూరి రాజ్‌కుమార్ (ఆజాద్)సీపీఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధి, కేంద్ర కమిటీ సభ్యుడు. 2010లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. సంస్థకు రాజకీయ, సిద్ధాంతపరమైన ముఖచిత్రంగా గుర్తింపు పొందాడు.కోటేశ్వరరావు (కిషన్‌జీ)పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు ప్రధాన వ్యూహకర్త. 2011లో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఆపరేషన్‌లో మరణించాడు.నంబాల కేశవరావు (బసవరాజు)ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి) తర్వాత సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజు, 2025లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ భద్రతా ఆపరేషన్‌లో మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిని మావోయిస్టు ఉద్యమానికి అతిపెద్ద దెబ్బగా అధికారులు పేర్కొన్నారు.హిడ్మా..మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వీ హిడ్మా.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా మృతి చెందాడు. హిడ్మా మరణం మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.గణపతి ఎక్కడ?ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమానికి ప్రధాన సిద్ధాంతకర్తగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత నాయకత్వ బాధ్యతలను బసవరాజుకు అప్పగించారు. ప్రస్తుతం గణపతి సంస్థలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారన్న విషయంపై అధికారిక సమాచారం లేదు. గణపతి మాత్రమే మిగిలిన అగ్రనాయకుడు అనే వాదన ప్రచారంలో ఉంది.చివరి అధ్యాయమా?భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మావోయిస్టు ఉద్యమం గతంతో పోలిస్తే గణనీయంగా బలహీనపడింది. అయినప్పటికీ, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని అటవీ ప్రాంతాల్లో ఇంకా చిన్న చిన్న దళాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అందుకే ఆపరేషన్ కగార్‌ను కేంద్రం ఇంకా కొనసాగిస్తోంది. ఇక, ఒకప్పుడు వేలాది మంది సాయుధ కేడర్, బలమైన కేంద్ర కమిటీ, విస్తృత 'రెడ్ కారిడార్'తో దేశ భద్రతకు సవాల్ విసిరిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు అస్తిత్వ పోరాటం చేస్తోందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆపరేషన్ కగార్ దెబ్బకు నాయకత్వం చెల్లాచెదురవడం, అడవుల్లో భద్రతా బలగాల ఆధిపత్యం పెరగడం, కొత్తగా కేడర్ నియామకాలు తగ్గిపోవడం వంటి పరిణామాలు సంస్థ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మావోయిస్టు ఉద్యమం నిజంగానే చివరి అధ్యాయానికి చేరుకుందా? లేక మళ్లీ పునర్వ్యవస్థీకరణకు ప్రయత్నిస్తుందా? అనే ప్రశ్నలకు రానున్న రోజుల్లో జరిగే పరిణామాలే సమాధానం చెప్పనున్నాయి. -
పేపర్ లీక్ తర్వాత పెట్రోల్ పోరు..కేజ్రీవాల్ సన్నాహాలు
న్యూఢిల్లీ: పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం (E20)పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ సమన్వయకన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ ఆందోళనలకు మద్దతు తెలిపిన ఆయన, తాజాగా ఈ20 విధానానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2023కి ముందు తయారైన వాహనాల్లో ఈ20 వాడకం సురక్షితమేనా అని తాను 29 ఆటోమొబైల్ కంపెనీలను ప్రశ్నించినట్లు తెలిపారు. అయితే మోదీ ప్రభుత్వంపై భయంతో ఏ కంపెనీ కూడా లిఖితపూర్వకంగా స్పందించలేదని అన్నారు.సాంకేతికంగా ఈ విధానం వల్ల వాహనాలు దెబ్బతింటాయని, మైలేజ్ తగ్గుతుందని కంపెనీల అధికారులు అనధికారికంగా అంగీకరించినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ప్లాంట్లు మూసివేయిస్తామని, ఈడీ దాడులు చేయిస్తామని కేంద్రం నుంచి బెదిరింపులు వస్తున్నందునే వారు బయటకు చెప్పలేకపోతున్నారని విమర్శించారు. దేశంలో 2023కి ముందు కొనుగోలు చేసిన దాదాపు 30 కోట్ల వాహనాలను మోదీ ప్రభుత్వం పనికిరాకుండా చేస్తోందని ఆరోపించారు. ఇథనాల్ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, పైగా నీటి వనరులు కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు.శనివారం తలపెట్టిన టౌన్‌హాల్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అనుమతుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. పోలీసులు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం ఈ20 విధానాన్ని శాంతియుతంగా వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రజలే తరగబడతారని ఆయన హెచ్చరించారు. -
రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు
రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద రోజూ కనిపించే తోపులాటలు, దళారుల ఆధిపత్యానికి తెరదించేందుకు భారతీయ రైల్వే రంగం సిద్ధం చేసింది. ఆగస్టు 1, 2026 నుంచి తత్కాల్ టికెట్ల జారీ విధానంలో విప్లవాత్మకమైన ‘టోకెన్ వ్యవస్థ’ను ప్రవేశపెడుతున్నారు. ప్రాథమికంగా వెస్ట్ సెంట్రల్ రైల్వే (కోటా డివిజన్) పరిధిలోని రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ఈ నూతన నిబంధనలను అమలు చేయనున్నారు. టికెట్ బుకింగ్ సమయాల్లో ఎటువంటి మార్పు లేకపోయినప్పటికీ క్యూలైన్లలో నిలబడే పద్ధతి పూర్తిగా మారనుంది.టోకెన్ల కేటాయింపు వేళలు ఇవే..కొత్త నిబంధనల ప్రకారం కౌంటర్ వద్ద నేరుగా గుమిగూడేందుకు అనుమతించరు. ముందుగా టోకెన్లు పొందిన వారికే ప్రాధాన్యత ఇస్తారు. ఏసీ తరగతుల వారికి ఉదయం 8:30-9:00 గంటల మధ్య టోకెన్లు పంపిణీ చేస్తారు. ప్రతి కౌంటర్‌కు గరిష్ఠంగా 10 టోకెన్లు మాత్రమే ఇస్తారు. (బుకింగ్ సమయం: ఉదయం 10:00 గంటలు). నాన్-ఏసీ తరగతులకు ఉదయం 9:30-10:00 గంటల వరకు టోకెన్లు జారీ చేస్తారు. ప్రతి కౌంటర్‌కు 15 టోకెన్లు కేటాయిస్తారు. (బుకింగ్ సమయం: ఉదయం 11:00 గంటలు)కేటగిరీ ఏ, బీ ప్రాధాన్యతలుదళారీ వ్యవస్థను అరికట్టేందుకు ప్రయాణికులను రెండు వర్గాలుగా విభజించారు. కేటగిరీ ఏ..(తొలి ప్రాధాన్యం) తమ కోసం లేదా తమ కుటుంబ సభ్యుల కోసం టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులు ఈ వర్గంలోకి వస్తారు. వీరు తమ అసలు గుర్తింపు కార్డుతో పాటు కుటుంబ సంబంధాన్ని రుజువు చేసే ఐడీ పత్రాన్ని తప్పనిసరిగా చూపించాలి. కేటగిరీ ‘బీ’ కింద ఇతర ప్రయాణికులకు ఇస్తారు. ‘ఏ’ కేటగిరీ ప్రయాణికుల బుకింగ్ పూర్తయిన తర్వాతే వీరికి అవకాశం కల్పిస్తారు. వీరు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా అధికారిక గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.పారదర్శకత, భద్రతకే ప్రాధాన్యంజారీ చేసిన టోకెన్లపై ప్రయాణికుడి పేరు, వివరాలు స్పష్టంగా ముద్రిస్తారు. ఇవి ఇతరులకు బదిలీ చేయడానికి వీల్లేదు. టోకెన్ ఉన్న వ్యక్తికి మాత్రమే టికెట్ జారీ చేస్తారు. దీనివల్ల ప్రయాణికులు కౌంటర్ల వద్ద నిరంతరం క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా హాల్లో వేచి ఉండవచ్చు. అటు ఆన్లైన్ ద్వారా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్‌లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వినియోగదారులకు ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి. సాధారణ ప్రయాణికులకు తత్కాల్ రిజర్వేషన్ సులభతరం చేయడం, కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడమే లక్ష్యంగా రైల్వే శాఖ ఈ కీలక మార్పులు చేపట్టింది.ఇదీ చదవండి: వసివాడిన పసిడి మెరుపులు -
విద్యార్థుల్లో హెచ్ఐవీ కలకలం.. ఇక కాలేజీల్లో ప్రత్యేక క్యాంపులు
కర్ణాటకలో హెచ్ఐవీ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యువతలో వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కాలేజీల్లో హెచ్ఐవీ అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ శిబిరాలు నిర్వహించాలని ఆదేశించింది. అవసరమైన వారు స్వచ్ఛందంగా హెచ్ఐవీ పరీక్షలు చేయించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించింది.రాష్ట్ర ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ (KSAPS) ప్రత్యేక ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే వ్యక్తుల అనుమతి లేకుండా ఎలాంటి పరీక్షలు లేదా స్క్రీనింగ్ నిర్వహించబోమని అధికారులు స్పష్టం చేశారు. గోప్యతకు ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని తెలిపారు.యువతలో పెరుగుతున్న కేసులుజాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) గణాంకాల ప్రకారం.. హెచ్ఐవీ బాధితుల సంఖ్యలో కర్ణాటక దేశంలో మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 2.60 లక్షల మంది హెచ్ఐవీతో జీవిస్తున్నట్లు అంచనా. వీరిలో దాదాపు 2.05 లక్షల మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. మరో 54 వేల మందికి తమ హెచ్ఐవీ స్థితి గురించి తెలియకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.ముఖ్యంగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారిలో కేసులు వేగంగా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023–24లో ఈ వయసు వర్గంలో హెచ్ఐవీ కేసులు 44,500గా ఉండగా.. 2025–26 నాటికి ఈ సంఖ్య 66,600కు పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక 18 నుంచి 25 ఏళ్ల మధ్య .. అదీ విద్యార్థుల్లోనే 7,000 మందికి పైగా హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలడం మరింత ఆందోళన కలిగిస్తోంది.కాలేజీల్లో అవగాహన శిబిరాలుఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉన్నత విద్యాసంస్థల్లో హెచ్ఐవీపై అవగాహన పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు వైరస్ వ్యాప్తి, నివారణ మార్గాలు, చికిత్స అవకాశాలపై సమాచారం అందించనున్నారు. విద్యార్థులు తమ ఆరోగ్య పరిస్థితిపై అవగాహన పెంచుకునేందుకు ప్రత్యేకంగా QR కోడ్ ఆధారిత సమాచార వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా సమీప కేంద్రాల వివరాలు, కౌన్సెలింగ్ సేవలు పొందే అవకాశం కల్పించనున్నారు.లక్ష్యం.. భయాన్ని కాదు, అవగాహనను పెంచడంహెచ్ఐవీపై ఉన్న అపోహలు, వివక్షను తగ్గించడంతో పాటు.. బాధితులు సకాలంలో చికిత్స పొందేలా చూడడమే ఈ కార్యక్రమాల ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. హెచ్ఐవీని ముందుగానే గుర్తిస్తే మెరుగైన జీవనం కొనసాగించే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు యువతలో ఆరోగ్య అవగాహన పెంచేందుకు కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే పరీక్షలు నిర్వహించే సమయంలో విద్యార్థుల గోప్యత, సమ్మతిని కచ్చితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
బోరున వర్షం.. వీఐపీనే గొప్ప!
జోరున వర్షం.. బస్ షెల్టర్‌లో నిల్చున్న ప్రజలు.. ఇంతలో వీఐపీ కాన్వాయ్ వస్తుందనే సమాచారం. అక్కడ ఉండకూడదంటూ ప్రజల్ని పోలీసులు పక్కకు తరిమేసిన దృశ్యాలు. దీనికి సంబంధించిన 23 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వర్షం కురుస్తున్న సమయంలో బస్ షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్న ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులను పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుతూ బయటకు పంపించారు. కొందరిని నెట్టివేస్తున్నట్లు వీడియోలో కనిపించడం వివాదానికి కారణమైంది. రాజస్థాన్ జైపూర్‌లోని జేఎల్ఎన్ మార్గ్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.వీఐపీ ప్రోటోకాల్.. ప్రజల హక్కుల కంటే పెద్దదా?ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన బస్ షెల్టర్‌లోనే ప్రజలకు చోటు లేకుండా చేయడం ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వీఐపీ భద్రత పేరుతో సామాన్యుల ఇబ్బందులను పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.Indian policemen are removing people from under the shed because some lowlife VIP is about to pass by. Feudalism is not a system. It is about the DNA. People don't rebel and vote for psychopaths. Policemen from the lower caste implement what they claimed to have suffered.…— Jayant Bhandari (@JayantBhandari5) July 29, 2026సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ స్పందిస్తూ..“ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన బస్ స్టాప్‌లో కూడా ప్రజలు నిలబడలేని పరిస్థితి వచ్చింది. కారణం.. వీఐపీ ప్రోటోకాల్” అంటూ విమర్శించింది. “భారీ వర్షంలో తలదాచుకునేందుకు బస్ షెల్టర్‌లో ఉన్న పాదచారులు, బైక్ రైడర్లను ప్రజల రక్షకులుగా ఉండాల్సిన పోలీసులే బయటకు పంపించడం సిగ్గుచేటు. వీఐపీ ప్రోటోకాల్ మానవత్వం కంటే గొప్పదా? లేక సామాన్యుడికి ఆశ్రయం పొందే హక్కు లేదా?” అంటూ ప్రశ్నించింది.సోషల్ మీడియాలో దుమారంఈ ఘటనపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను వీఐపీ రాకపోకల కోసం అడ్డుకోవడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీఐపీ భద్రత అవసరమే అయినప్పటికీ.. సాధారణ ప్రజల పట్ల కనీస మానవత్వం, గౌరవం పాటించాల్సిందేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ ఘటనపై రాజస్థాన్ పోలీసుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. అలాగే ఆ కాన్వాయ్ ఎవరిదన్న వివరాలు కూడా ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. -
అమిత్‌షా ఆదేశాల ప్రకారమే దాడులు.. రాహుల్
సాక్షి, ఢిల్లీ: పేపర్ లీక్‌పై ఏం జరిగిందో ప్రభుత్వానికి తెలియాలంటే బీజేపీ ఎంపీలు వారి పిల్లలను అడగాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీక్‌పై విద్యార్థులు శాంతియుత నిరసన చేపట్టారని అన్ని పార్టీలు విద్యార్థులు ఆందోళనను గౌరవించాలన్నారు. ఢిల్లీ వీధుల్లో జరిగింది నిరసన కాదని అది భావప్రకటన స్వేచ్ఛని రాహుల్ గాంధీ కేంద్రాన్ని దుయ్యబట్టారు.విద్యావ్యవస్థ క్రూరంగా మారిపోయింది. విద్యను ప్రైవేటీకరించారు. విద్యను ఆరెస్సెస్మయం చేశారు. ఇది యూపీఏ పాలన.. మా మంత్రి రాజీనామా చేయరని మరో మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ధర్మేంద్ర ప్రదాన్‌ను విద్యాశాఖ మంత్రి అని మేం అనుకోలేదు. దేశంలో విద్యాశాఖను ఆరెస్సెస్నడిపిస్తోంది. దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఆరెస్సెస్ మనుషులే వీసీలుగా ఉన్నారు ఉన్నారు.భయాన్ని దాటుకుని విద్యార్థులు పోరాటం చేశారు. విద్యార్థులపై దాడికి హోం మంత్రే ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులపై పెల్లెట్స్ దాడికి హోం మంత్రే కారణం. నీట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో హోం మంత్రి ఇప్పుడు ఇక్కడ ఎందుకు లేరు?. ఆయనకి ఇక్కడ కూర్చునే ధైర్యం లేదు. ఆయన భయంతో వణికిపోతున్నారు. పోలీసుల చర్యపై విద్యార్థులకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలి అని రాహుల్ డిమాండ్ చేశారు.రిజిజు అభ్యంతరంకాగా రాహుల్ ప్రసంగంపై దుమారం చెలరేగింది. ఆయన చేసిన ‘ఇడియట్స్’ వ్యాఖ్యలతో ఎన్డీయే ఎంపీలు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలపై అని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు అభ్యంతరం వ్యక్యం చేశారు. అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఆ సమయంలో స్పీకర్ ‘హుందాగా వ్యవహరించాలి’ అని సభ్యులను ఉద్దేశించి సూచించారు. రాహుల్‌వి తప్పుడు ఆరోపణలన్న కిరెన్ రిజిజు.. ఆధారాల్లేకుండా ఆయన ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ‘‘విద్యార్థుల పేరుతో అనుచిత వ్యాఖ్యలు సరికాదు. హోం మంత్రే ఆదేశాలు ఇచ్చారని ఎలా అంటారు. రాహుల్ క్షమాపణలు చెప్పాలి’’ మంత్రి డిమాండ్ చేశారు. -
జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి,ఢిల్లీ: జమిలి ఎన్నికల బిల్లుకు సంబంధించిన అంశంలో పార్లమెంటు కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లులను పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) కాలపరిమితిని పొడిగిస్తూ ఆమోదం తెలిపింది. వచ్చే శీతాకాల సమావేశాల చివరి వారం వరకు జెపీసీ గడువును పొడగించింది.జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల కోసం డిసెంబర్ 23, 2024 బీజేపీ సీనియర్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి పి.పి. చౌదరి నేతృత్వంలో అనురాగ్ ఠాకూర్ , ప్రియాంకా గాంధీ , ధర్మేంద్ర యాదవ్ , మనీష్ తివారీ , సుప్రియా సూలే వంటి ప్రముఖ రాజకీయ నేతలు సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానాన్ని చట్టబద్ధంగా ఎలా అమలు చేయాలో క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.కమిటీ విధులుకేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను కమిటీ లైన్-బై-లైన్ పరిశీలిస్తుంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితిని మార్చడానికి రాజ్యాంగంలోని 5 కీలక అధికరణలను (Articles 83, 85, 172, 174, 356) మార్చాల్సి ఉంటుంది. దీనివల్ల సమాఖ్య వ్యవస్థకు ఏవైనా ఇబ్బందులు వస్తాయా అని కమిటీ చర్చిస్తుంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, ఎన్నికల సంఘం అధికారులు, ఆర్థికవేత్తల నుంచి సాక్ష్యాలు, సలహాలను సేకరిస్తుంది.ప్రధానితో పాటు ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం ఐదేళ్ల కంటే ముందే పడిపోతే, మళ్లీ జమిలి ఎన్నికల చక్రంలోకి ఆ రాష్ట్రాన్ని ఎలా తీసుకురావాలనే దానిపై అంతర్జాతీయ నమూనాలను పరిశీలిస్తోంది.అయితే కమిటీ తన రిపోర్టును 2026 వర్షాకాల సమావేశాలలోనే పార్లమెంటుకు సమర్పించాల్సి ఉంది. అయితే జమిలి ఎన్నికల బిల్లులపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో జరుపుతున్న సంప్రదింపులు ఇంకా పూర్తి కాలేదు. కమిటీ ఇప్పటికే 10 కి పైగా రాష్ట్రాల్లో పర్యటించినప్పటికీ, నివేదికను సంపూర్ణంగా సిద్ధం చేయడానికి మరికొంత సమయం అవసరమని భావించింది. దీంతో మరికొంత గడువు కావాలని పార్లమెంటును అభ్యర్థించింది. దీంతో కొత్త గడువు ప్రకారం ఈ నివేదికను 2026 శీతాకాల సమావేశాల చివరి వారపు మొదటి రోజు నాటికి సమర్పించాల్సి ఉంటుంది. -
దిగ్గజ నటి రేఖ సినిమాకు మరో అరుదైన గౌరవం
బాలీవుడ్ దిగ్గజ నటి రేఖ నటించిన అద్భుత చలనచిత్రం ‘ఉమ్రావ్ జాన్’. 1981లో విడుదలైన ఈ చిత్రం నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలను కైవసం చేసుకుంది. ఇందులో అద్భుత అభినయం ప్రదర్శించిన రేఖ 'ఉత్తమ నటి'గా జాతీయ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రేఖ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘ఉమ్రావ్ జాన్’ చిత్రం త్వరలో మరో అరుదైన గౌరవాన్ని అందుకోనుంది.వచ్చే నెలలో జరుగనున్న ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ (ఐఎఫ్ఎఫ్ఎం) వేదికపై ఈ క్లాసిక్ మూవీ ప్రదర్శితం కానుంది. ఈ నేపథ్యంలో ఉమ్రావ్ జాన్ పాత్ర దశాబ్దాలుగా తనతోపాటే సజీవంగా ఉందంటూ రేఖ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా రేఖ మాట్లాడుతూ.. ‘ఉమ్రావ్ జాన్ నా జ్ఞాపకాల్లో, నా నిశ్శబ్దంలో, దశాబ్దాలుగా ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగా ఉంది. ప్రపంచ వేదికపై ఈ చిత్రానికి దక్కుతున్న గౌరవం చూసి నా మనస్సు ఆనందంతో నిండిపోతోంది’ అని పేర్కొన్నారు.ఆగస్టు 13 నుండి 23 వరకు జరుగనున్న ఈ చలనచిత్రోత్సవంలో రేఖ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. భారతీయ సినిమాకు ఆమె అందించిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ వేదికపై ప్రతిష్టాత్మక ‘ఎక్స్‌లెన్స్ ఇన్ సినిమా అవార్డు’తో ఆమెను సత్కరించనున్నారు. ఈ పురస్కారాన్ని కృతజ్ఞతా భావంతో స్వీకరించనున్నట్లు రేఖ తెలిపారు. ఇది కేవలం తన నటనకు దక్కిన గుర్తింపు మాత్రమే కాదని, తన జీవితాన్ని, నటనను తీర్చిదిద్దిన చిత్రనిర్మాతలు, రచయితలు, సంగీత దర్శకులు, కళాకారులందరికీ అంకితమని ఆమె పేర్కొన్నారు. -
ప్రకాష్ రాజ్‌ను చేపలకు ఆహారంగా వేస్తా: బీజేపీ ఎమ్మెల్యే
ఉడుపి: ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్‌కు కర్ణాటకలోని ఉడుపికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్పాల్ సువర్ణ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. కళాకారుల మదిలో విషబీజాలు నాటడం మానుకోవాలని, లేనిపక్షంలో అరేబియా సముద్రంలో చేపలకు ఆహారంగా మారుస్తామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఇటీవల 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి నిరసనలో ప్రకాశ్ రాజ్ పాల్గొని, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో యశ్పాల్ సువర్ణ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన నీట్ నిరసనలో పాల్గొన్నవారు అసలైన విద్యార్థులు కారనీ, వారి నేపథ్యాన్ని పరిశీలిస్తే నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు.ఇలాంటి రాజకీయాలు కొనసాగితే బీజేపీ కార్యకర్తలు తగిన రీతిలో స్పందిస్తారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ జిల్లాకు చెందిన వీ. సునీల్ కుమార్‌తో సహా పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు 'ఇండియా' కూటమి నేతలైన రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ తదితరుల ముఖాలతో ఉన్న బొద్దింకల ప్లకార్డులపై క్రిమిసంహారక మందు పిచికారీ చేయడం గమనార్హం.ఇది కూడా చదవండి: కంగనాకు గట్టిగా ఇచ్చిపడేసిన ప్రముఖ సింగర్! -
“అరెస్టుల్లో తప్పేముంది?”.. విద్యార్థి నిరసనలపై నడ్డా కౌంటర్
నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, రాజ్యసభ సభా నాయకుడు జేపీ నడ్డా ప్రభుత్వ చర్యలను సమర్థించారు. నిరసనలు చేపట్టినప్పుడు చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.బుధవారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థి నిరసనలపై పోలీసులు బలప్రయోగం చేశారని, ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. నిరసనకారులపై చర్యలు తీసుకున్న వారిపై ఎందుకు చర్యలు లేవని.. వాళ్లు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.దీనిపై స్పందించిన నడ్డా.. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అవసరమైన చర్యలు తీసుకోవడం వారి బాధ్యత అని అన్నారు. ఆందోళనలు, ఉద్యమాల్లో పాల్గొనే వారు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.Union Minister JP Nadda on Wednesday defended the Delhi Police action at the CPI(M) headquarters, calling it a "normal law and order situation" and accusing the Opposition of politicising the incident. Responding in the Rajya Sabha after CPI(M) MP John Brittas raised the issue,… pic.twitter.com/i2yzjYApeE— The Siasat Daily (@TheSiasatDaily) July 29, 2026నిరసనలు చేస్తే చర్యలు సహజమేవిద్యార్థి ఉద్యమాలపై మాట్లాడిన నడ్డా.. యాక్టివిజంలో పాల్గొనేవారు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. నిరసన హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ.. చట్ట పరిమితులను దాటితే చర్యలు తప్పవని పేర్కొన్నారు. తన విద్యార్థి దశను గుర్తు చేసుకున్న నడ్డా.. ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా విద్యార్థి కార్యకర్తగా ఉన్నానని చెప్పారు. ఆ సమయంలో తరగతి గది నుంచి రెండుసార్లు పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.‘నేనూ అరెస్టయ్యా..’‘‘నేను కూడా విద్యార్థి ఉద్యమంలో ఉన్నాను. ఎమర్జెన్సీ సమయంలో క్లాస్రూమ్ నుంచి రెండుసార్లు నన్ను పోలీసులు తీసుకెళ్లారు’’ అని నడ్డా పేర్కొన్నారు. అయితే అప్పటి పరిస్థితులను ప్రస్తావిస్తూ.. ఉద్యమాల్లో పాల్గొంటే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.ఇటీవల విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తోంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడం సరికాదని ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని డిమాండ్ చేశారు. అయితే నడ్డా మాత్రం పోలీసుల చర్యలను సమర్థించారు. చట్టాన్ని అమలు చేయడం ప్రభుత్వ, పోలీసు వ్యవస్థల బాధ్యత అని అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగే పరిస్థితుల్లో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. -
బస్సు ప్రయాణికులకు బిగ్ అలర్ట్..!
సాక్షి, తమిళనాడు: ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే వారు సెల్ఫోన్లలో పెద్ద శబ్దంతో పాటలు వినడం, వీడియోలు చూడడంపై నిషేధం విధించారు. అంతేకాకుండా ప్రయాణికులు బ్లూటూత్, ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్లను ఉపయోగించాలని సూచించారు. తమిళనాడు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు తోటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా, సురక్షితంగా ప్రయాణించేలా తమిళనాడు రవాణా శాఖ కొత్త నిబంధనలను, ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ విషయమై రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి నిర్మల్‌రాజ్, చైన్నె మహానగర రవాణా సంస్థ, ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ, అన్ని రీజినల్ ప్రభుత్వ రవాణా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. -
రైతు సంఘాలతో సీజేపీ దోస్తీ.. సర్వత్రా ఉత్కంఠ
న్యూఢిల్లీ: రైతు సంఘాలు- కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సంయుక్తంగా ఉద్యమించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనల తర్వాత, సీజేపీ ఇప్పుడు మరింత విస్తృత కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ నేతలు ప్రముఖ రైతు నాయకుడు రాకేశ్ టికైత్‌ను కలిసి ఏకతాటిపై నిలిచే విషయమై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు ప్రాధాన్యంత సంతరించుకున్నాయి.‘ఇండియా టుడే’ నివేదిక ప్రకారం, ఈ భేటీలో సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా సహా పలువురు నేతలు, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికైత్ పాల్గొన్నారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సీజేపీ వెల్లడించింది. దీని ద్వారా రైతులు, విద్యార్థులు, యువతను ఒకే వేదికపైకి తీసుకురావాలని యోచిస్తున్నారు. దేశంలోని రైతులు, యువత, విద్యార్థులు అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి నిలదీయాలని రాంకా పేర్కొన్నట్లు ఆ నివేదిక పేర్కొంది.మరోవైపు, రాజస్థాన్‌లోని అల్వార్ పరిసర ప్రాంతాల్లో జూలై 30న భారీ మహాపంచాయత్ నిర్వహించనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించింది. ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఢిల్లీకి తరలివస్తున్న రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో, భవిష్యత్ కార్యాచరణపై రైతులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని, గతంలో జరిగిన చర్చల సమయంలో ఇచ్చిన హామీలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఒప్పందాలను గౌరవించకపోతే, అన్ని ఎఫ్ఐఆర్లను బేషరతుగా రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో మరోసారి ఉద్ధృతమైన ఆందోళనలు చేపడతామని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. -
కంగనాకు గట్టిగా ఇచ్చిపడేసిన ప్రముఖ సింగర్!
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలపై, నేటి యువతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జెన్ జీ వర్గం అనుచిత భాషను వాడిందని, వారి ప్రవర్తన బాగోలేదని ఆమె ఆరోపించారు. కాగా కంగనా వ్యాఖ్యలపై ప్రముఖ మ్యూజిక్ కంపోజర్, సింగర్ విశాల్ దద్లానీ తీవ్ర స్థాయిలో స్పందించారు.ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన ఒక పోస్ట్ షేర్ చేస్తూ.. ఆందోళనకారులపై జరిగిన లాఠీచార్జీలు, హింసాత్మక ఘటనలను ఆయన గుర్తు చేశారు. ‘చెడు భాష గురించా? మీరు రోడ్లపై పిల్లలను కొట్టారు, వారిపై రాళ్లు రువ్వారు, పైగా వారినే నిందిస్తున్నారు! వారిపై కాల్పులు జరుపుతున్నారు, బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. వారి ముఖాలపై పెల్లెట్ గన్లు వాడుతున్నారు. మీ పెయిడ్ గూండాలు ఇప్పటికీ తిరుగుతూ, వారిని బెదిరిస్తున్నారు, కొడుతున్నారు! ఈ తిట్లను మీరే స్వయంగా సంపాదించుకున్నారు.. మై ఫ్రెండ్’ అంటూ విశాల్ దద్లానీ మండిపడ్డారు.ఈ పోస్ట్ క్యాప్షన్‌లో.. ‘పెయిడ్ స్టోరీలు, ఇన్ఫ్లూయెన్సర్ క్యాంపెయిన్లు నిర్వహించడం వల్ల మీ దిగజారుడుతనం మరింత స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, విశాల్ దద్లానీ చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. మరోవైపు, కంగనా రనౌత్ తన సోషల్ మీడియా ఖాతాలో నిరసనలకు సంబంధించిన ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ తీవ్ర పదజాలం వాడారు. ‘నా జీవితంలో ఇంతటి అసహ్యకరమైన దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. జెన్ జీ నిరసనల రీల్స్ చూస్తే వాంతి వస్తోంది. వారు మాట్లాడే తీరు, వాడే భాష అత్యంత హేయంగా ఉన్నాయి’ అని ఆమె పేర్కొన్నారు. ఈ నిరసనకారులను ‘జనరేషన్ గటర్’ అంటూ కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చదువుసంధ్యలు లేని వీరు వ్యవస్థకు ఏమాత్రం ఉపయోగపడరని, కనీసం ఇంటిని కూడా చక్కదిద్దలేరని ఆమె విమర్శించారు. కాగా, ఈ వివాదం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
క్యాబ్ కోసం వేచి చూస్తుంటే.. మీ రేటు ఎంత..?
బెంగళూరు: మహిళను అసభ్యకరంగా మాట్లాడిన బైకిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నగరం కృష్ణరాజపురం పరిధిలోని రామమూర్తి నగర్లో ఒక మహిళ క్యాబ్ కోసం ఎదురుచూస్తుండగా బైక్‌పై వచ్చిన ఒక వ్యక్తి ‘మీ రేటు ఎంత’ అని అడిగాడు. ఆ మహిళ ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ‘నేను క్యాబ్ కోసం ఎదురుచూస్తుండగా, స్కూటీపై ఉన్న ఒక వ్యక్తి నా రేటు ఎంత అని అడిగాడు. నా భద్రత కోసం నేను వీడియో తీస్తున్నాను. అది గమనించిన ఆ వ్యక్తి నన్ను తిట్టి పారిపోయాడు’ అని పేర్కొంది. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని 42 ఏళ్ల విజయ్ రాఘవ్‌గా గుర్తించారు. అతను పండ్ల వ్యాపారి, హోరమావు నివాసి. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, స్కూటర్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు రామమూర్తి నగర్ పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో అతను వేరొకరి స్కూటర్‌ను ఉపయోగిస్తున్నాడని తెలిపారు. A woman was waiting by the roadside for a cab in Bengaluru when a man on a scooty approached her.MAN: I’ll give you ₹10,000. Come with me to a hotel room.WOMAN: What? Why the f*uck are you asking me? I’ll file a police complaint.MAN: Why would you file a police complaint?… pic.twitter.com/bz26WFsDV4— Lakshay Mehta (@lakshaymehta08) July 28, 2026 -
రాజ్యసభలో మాటల మంటలు.. నడ్డా, ఖర్గే మధ్య వాగ్వాదం
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో నేతల మాటల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీజేపీ ఎంపీ జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దేశంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, రాజకీయ ప్రత్యర్థులపై చర్యలు వంటి అంశాలపై ఇరువురు నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఎమర్జెన్సీ కాలం నాటి అరెస్టులను ప్రస్తావిస్తూ జేపీ నడ్డా కాంగ్రెస్‌పై విమర్శలు చేయగా, ప్రస్తుతం బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య హక్కులు క్షీణిస్తున్నాయని ఖర్గే ఆరోపించారు.ప్రజలకు స్వేచ్ఛ లేదు: ఖర్గేపార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం ఉదయం సభలో మల్లికార్జున ఖర్గే.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి రక్షణ లేదని ఆరోపించారు. దేశంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థులపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు.దీనికి ప్రతిస్పందించిన జేపీ నడ్డా.. కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను నడ్డా రాజ్యసభలో ప్రస్తావించారు. అప్పట్లో తాను విద్యార్థిగా ఉన్న సమయంలో క్లాస్ జరుగుతుండగానే అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల స్వేచ్ఛ, హక్కులు అణచి వేయబడ్డాయని పేర్కొంటూ, కాంగ్రెస్ చరిత్రను ఆయన విమర్శించారు. Ruckus in Rajya Sabha over police action on protesters: "Those who hit students are roaming free," Congress chief Mallikarjun Kharge slams Centre, JP Nadda hits back, says "police acted to maintain law & order" pic.twitter.com/EZ3u8jj7fu— NDTV (@ndtv) July 29, 2026ఇదే సమయంలో తమ పార్టీ కార్యాలయానికి ఢిల్లీ పోలీసులు రావడంపై సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద పోలీసుల జోక్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆందోళనకర సంకేతమని పేర్కొంది. అయితే, పార్టీ కార్యాలయాలకు పోలీసులు వెళ్లడం సాధారణ ప్రక్రియేనని జేపీ నడ్డా స్పందించారు. చట్టపరమైన అంశాల్లో పోలీసులు తమ విధులు నిర్వహిస్తారని తెలిపారు.దీంతో, ఎమర్జెన్సీ నాటి పరిణామాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజాస్వామ్య హక్కులపై జరిగిన చర్చతో రాజ్యసభలో వాతావరణం వేడెక్కింది. గత ప్రభుత్వాల విధానాలు, ప్రస్తుత పాలనపై అధికార–విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి. -
ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 2026లో భాగంగా బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే తీవ్ర గందరగోళం నెలకొంది. పేపర్ లీకేజీ నిరోధక సవరణ బిల్లుపై చర్చకు ముందు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు హాజరుకావాలని డిమాండ్ చేస్తూ విపక్ష ‘ఇండియా' కూటమి ఎంపీలు నినాదాలు చేయడంతో లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఎంపీల నిరసనల మధ్య సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. కాగా లోక్‌సభలో మంగళవారం అర్ధరాత్రి వరకు పేపర్ లీకేజీ నిరోధక బిల్లుపై తీవ్ర వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ బిల్లుపై మాట్లాడే అవకాశం ఉండటంతో అందరి దృష్టి ఆయన ప్రసంగంపైనే నిలిచింది. మరోవైపు, ఈ కీలక బిల్లుపై రాహుల్ గాంధీ కనీసం ఐదు నిమిషాల పాటు మాట్లాడాలని, అటువంటి ముఖ్యమైన అంశంపై మాట్లాడకుండా తప్పించుకోవడం సరికాదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు.సభ ప్రారంభానికి ముందే ఉభయ సభల విపక్ష సభ్యులు ఎన్నికల సంస్కరణల నుంచి అంతరాష్ట్ర జల వివాదాల వరకు పలు అంశాలపై చర్చించేందుకు వాయిదా తీర్మానాలు సమర్పించారు. లోక్‌సభ జాబితా ప్రకారం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. జనన, మరణాల రిజిస్ట్రేషన్ (సవరణ) బిల్లు, 2026ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమగ్ర చర్చ కోరుతూ వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు.ఇక రాజ్యసభలో జాతీయ గౌరవ అవమానాల నిరోధక (సవరణ) బిల్లు, 2026 ఆమోదం కోసం రానుంది. అలాగే కావేరి జల వివాదంపై జలశక్తి మంత్రిత్వ శాఖ తప్పుదారి పట్టించే సమాధానం ఇచ్చిందంటూ ఎంపీ ప్రవీణ్ చక్రవర్తి రూ. 267 కింద సభ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరుతూ మోషన్ వేశారు. కాంగ్రెస్ విప్ నాసిర్ హుస్సేన్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖాతాలపై స్వతంత్ర ఆడిట్ కోరుతూ వాయిదా నోటీసు అందజేశారు. ఉభయ సభల్లోని ఈ పరిణామాలపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
విజయ్ సర్కార్ ఆంక్షలు.. ఏపీ సహా మూడు రాష్ట్రాలకు సరఫరా బంద్!
తమిళనాడులో టీవీకే విజయ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగానికి కీలకమైన రఫ్ స్టోన్, ఎం-శాండ్, మెటల్ జెల్లీ వంటి నిర్మాణ సామగ్రిని పొరుగు రాష్ట్రాలకు తరలించడంపై తమిళనాడు ప్రభుత్వం మూడు నెలలు తాత్కాలిక నిషేధం విధించింది. రాష్ట్రంలో పెరుగుతున్న నిర్మాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, తమిళనాడు నిర్ణయం దక్షిణ రాష్ట్రాల మధ్య మౌలిక వసతుల అభివృద్ధి, వనరుల వినియోగం, ప్రాంతీయ ఆర్థిక సమతుల్యతపై ప్రభావం చూపే నిర్ణయంగా మారింది.అయితే, ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, రహదారులు, గృహ నిర్మాణాలు, పారిశ్రామిక ప్రాజెక్టుల కారణంగా తమిళనాడులో నిర్మాణ సామగ్రికి డిమాండ్ భారీగా పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పనిచేస్తున్న క్వారీల నుంచి లభిస్తున్న రాళ్లు, నిర్మాణ అగ్రిగేట్లు స్థానిక అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్నాయని పేర్కొంది. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి తరలిపోవడం వల్ల రాష్ట్రంలో సరఫరా తగ్గి, ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వం అభిప్రాయపడింది.ఈ నిషేధం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వెళ్లే నిర్మాణ సామగ్రిపై వర్తించనుంది. అయితే.. పుదుచ్చేరి, కారైకాల్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. నిషేధాన్ని అమలు చేసేందుకు సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు కఠిన పర్యవేక్షణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే అక్రమ మైనింగ్, ఖనిజ రవాణా చట్టాల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ముఖ్యంగా కేరళలో నాణ్యమైన రాయి అగ్రిగేట్‌ల లభ్యత పరిమితంగా ఉండటంతో తమిళనాడులోని తిరునెల్వేలి, తెంకాసి, కన్యాకుమారి ప్రాంతాల నుంచి వచ్చే నిర్మాణ సామగ్రిపై అనేక ప్రాజెక్టులు ఆధారపడుతున్నాయి. జాతీయ రహదారులు, విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం వంటి కీలక ప్రాజెక్టుల పనులకు సరఫరా అంతరాయం కలగవచ్చని కేరళ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని కోరింది.ఎందుకు ఈ నిర్ణయం?కాగా, తమిళనాడులో ప్రస్తుతం భారీ స్థాయిలో నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కొత్త రహదారులు, పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలు, గృహ నిర్మాణాల కోసం రాళ్లు, ఇసుక, ఇతర అగ్రిగేట్‌ల అవసరం పెరిగింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న నిర్మాణ సామగ్రిలో కొంత భాగం పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంతో స్థానిక మార్కెట్లో సరఫరా తగ్గుతోందని ప్రభుత్వం చెబుతోంది. దీని వల్ల ధరలు పెరిగి నిర్మాణ వ్యయాలు పెరుగుతున్నాయని వాదిస్తోంది.తమిళనాడు నిర్ణయం సహజ వనరుల నిర్వహణ, రాష్ట్ర అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను ముందుకు తెస్తోంది. ఒక రాష్ట్రంలోని ఖనిజ వనరులు మరో రాష్ట్రంలోని అభివృద్ధి పనులకు ఉపయోగపడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలు-ప్రాంతీయ అభివృద్ధి అవసరాల మధ్య సమతుల్యతపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ అంశం కేవలం నిర్మాణ సామగ్రి రవాణా సమస్యగానే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల మధ్య వనరుల వినియోగం, మౌలిక వసతుల అభివృద్ధి సమన్వయానికి సంబంధించిన అంశంగా మారింది. మూడు నెలల నిషేధ కాలంలో నిర్మాణ సామగ్రి ధరలు, సరఫరా పరిస్థితులు, ప్రాజెక్టులపై ప్రభావాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. ఆ తర్వాత నిషేధాన్ని కొనసాగించాలా, సడలింపులు ఇవ్వాలా అన్నదానిపై నిర్ణయం తీసుకోవచ్చు. -
ప్రియుని కోసం కన్నకొడుకు గొంతు కోసి..
మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఓ కన్నతల్లి తన మూడేళ్ల పసికందును అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియుడితో మాట్లాడుతుండగా ఏడుస్తున్నాడనే కారణంతో ఆమె ఈ దారుణానికి పాల్పడింది. బల్దేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛౌలీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఛౌలీ గ్రామానికి చెందిన కృష్ణ మురారి గుప్తా భార్య రుచి జిందల్ (32) వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. జూన్ 28న భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతోంది. ఆ సమయంలో మూడేళ్ల కుమారుడు మాధవ్ పదే పదే ఏడుస్తూ ఆమెకు అడ్డుగా మారాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ తల్లి, బిడ్డ గొంతు నులిమి హత్య చేసింది.ఈ దారుణం తర్వాత ఆమె ఏమీ ఎరుగనట్లు నాటకం మాడింది. బిడ్డకు అకస్మాత్తుగా అనారోగ్యం చేసిందంటూ భర్తకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు బాలుడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. పోలియో చుక్కల వికటించడం వల్లే మృతి చెంది ఉండవచ్చని భావించి, బాలుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.అయితే, సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే జూలై 27న భర్త కృష్ణ మురారి తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమె ఫోన్ కాల్స్ పరిశీలించారు. ఆ సమయంలో ఆమె తన ప్రియుడితో మాట్లాడుతున్న సంభాషణను ఆయన విన్నారు. నిలదీయడంతో రుచి జిందల్ తన తప్పును అంగీకరించింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బల్దేవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నామని, కోర్టు ఆదేశాల మేరకు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు మహావన్ సీఓ సంజీవ్ కుమార్ రాయ్ తెలిపారు. -
కోడింగ్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలు వృథా.. టెకీ ఆవేదన!
బెంగళూరు: అమెరికాలో ఉద్యోగ వేట విఫలమై, నెలల తరబడి ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కక బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన మోహిత్ ఆర్. గౌడ అనే యువకుడు తన అనుభవాలను లింక్డ్ఇన్ వేదికగా పంచుకున్నారు. కష్టపడి చదివి, ఎన్నో త్యాగాలు చేస్తే భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన తనకు, అక్కడి వాస్తవ పరిస్థితులు తీవ్ర నిరాశను మిగిల్చాయని ఆయన పేర్కొన్నారు.వందలాది ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తూ, కోడింగ్ పరీక్షలు, ఇంటర్వ్యూల కోసం రాత్రింబవళ్లు శ్రమించినా, చివరికి నిరాశే ఎదురైందని మోహిత్ తెలిపారు. స్వదేశానికి తిరిగి రావడం తన ప్రణాళికలో లేదని, ఈ నిర్ణయం ఎంతో వేదనను, అనిశ్చితిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ వేటలో ఉన్న సమయంలో పొదుపు చేసుకున్న సొమ్మంతా క్రమంగా కగిపోవడం ఆర్థికంగా ఎంతో కుంగదీసిందని వాపోయారు. అయినప్పటికీ నిరాశను పక్కనపెట్టి, కృత్రిమ మేధస్సు , జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాల కోసం అన్వేషిస్తున్నట్లు ఆయన తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, తగిన అవకాశాలు ఉన్నవారు రిఫరల్స్ ద్వారా సహకరించాలని కోరారు.ఇది కూడా చదవండి: మోనాలీసాను బలవంతంగా తరలించొద్దు: హైకోర్టు -
మావోయిస్టులకు బిగ్ షాక్.. కీలక నేత బేస్రా అరెస్ట్
రాంచీ: జార్ఖండ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన కోబ్రా 209వ బెటాలియన్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మావోయిస్టు అగ్రనేత మిసిర్ బేస్రాను అరెస్ట్ చేసినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. మిసిర్ బేస్రా నక్సల్స్ సంస్థలో కీలక స్థాయిలో ఉన్న నేతగా, సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జార్ఖండ్‌లో మావోయిస్టు కార్యకలాపాల నిర్వహణ, వ్యూహాల రూపకల్పనలో అతడికి ముఖ్యమైన పాత్ర ఉందని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.బేస్రాతో పాటు మరో ఇద్దరు అరెస్ట్ఈ ఆపరేషన్‌లో మిసిర్ బేస్రాతో పాటు మరో ఇద్దరు నక్సల్స్ నేతలు మోచూ, గౌరవ్ హాన్స్దాలను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరి అరెస్టుతో రాష్ట్రంలోని నక్సల్ నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బ తగిలిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, మిసిర్ బేస్రా కోసం భద్రతా బలగాలు చాలా కాలంగా ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాయి. అతడి కోసం జార్ఖండ్‌లోని అడవి ప్రాంతాలు, నక్సల్ ప్రభావిత జిల్లాల్లో గతంలో పలు భారీ ఆపరేషన్లు నిర్వహించారు.కాగా, అడవుల్లో మావోయిస్టుల కదలికలు, ఆయుధ సరఫరా మార్గాలు, కీలక సమావేశాలపై నిఘా పెట్టి భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసినట్లు తెలుస్తోంది. భద్రతా వర్గాల ప్రకారం.. మిసిర్ బేస్రా అరెస్ట్ మావోయిస్టు సంస్థకు వ్యూహాత్మకంగా పెద్ద నష్టంగా భావిస్తున్నారు. సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉన్న నేత అరెస్ట్ కావడంతో సంస్థ నిర్ణయాలు, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో జార్ఖండ్‌లో నక్సల్ ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు సంయుక్తంగా పలు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిసిర్ బేస్రా అరెస్ట్‌ను నక్సల్ వ్యతిరేక పోరులో ఒక కీలక విజయంగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. బేస్రాపై పోలీసుల రివార్డులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. -
మోనాలీసాను బలవంతంగా తరలించొద్దు: హైకోర్టు
కొచ్చి: 'కుంభమేళా వైరల్ గర్ల్'గా గుర్తింపు పొందిన మోనాలీసా భోస్లే భద్రతపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమెను కొచ్చి నగరం నుంచి బలవంతంగా లేదా హైకోర్టు అనుమతి లేకుండా బయటకు తరలించరాదని స్పష్టం చేసింది. జస్టిస్ బేచు కురియన్ థామస్ ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎన్సీఎస్టీ) ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో నిబంధనల ప్రకారం మధ్యప్రదేశ్ పోలీసులకు ఆమెను అప్పగించాలన్న ప్రతిపాదనను కోర్టు ఈ సందర్భంగా పరిశీలించింది. అయితే ఆమె మతాంతర వివాహం కారణంగా ప్రాణాపాయం ఉందని, మధ్యప్రదేశ్‌కు వెళ్తే తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని మోనాలీసా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.మోనాలిసా భద్రతను దృష్టిలో ఉంచుకుని, తదుపరి విచారణ జరిగే వరకు ఆమెను కొచ్చి సరిహద్దులు దాటించవద్దని కేరళ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అలాగే, ఆమెకు తగిన పోలీసు రక్షణను కొనసాగించాలని స్పష్టం చేసింది. వివాహం జరిగే సమయానికి ఆమెకు 18 ఏళ్ల మూడు నెలల వయసు ఉందని, ఆమె ఒరిజినల్ సర్టిఫికెట్‌ను నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారని, దీనిపై ఇప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టులో సవాల్ దాఖలు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.ఇది కూడా చదవండి: జైలు నుంచి వస్తూనే తమ్ముడి దగ్గరికి తేజ్! -
కాక్రోచ్ నిరసనల ఎఫెక్ట్.. ఢిల్లీ వీధుల్లో టెన్షన్!
నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు ముగిసిన తర్వాత ఢిల్లీలో కొత్త వివాదం మొదలైంది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, కార్యకర్తలపై దాడులు జరిగాయంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు నిరసనల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం, భద్రతా సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరికొన్ని వీడియోలు చర్చకు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు నీట్ పేపర్ లీక్, పరీక్షా వ్యవస్థలో లోపాలపై ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలు తీవ్రతరం కావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అనంతరం నిరసనలపై భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో నిరసనల్లో పాల్గొన్న వారిపై దాడులు జరిగినట్టు తాజాగా వీడియోలు బయటకు వస్తున్నాయి. పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.As Soon as Dharmendra Pradhan’s Resignation is Confirmed……• Sonam Wangchuk has left.• Abhijeet Deepke and Saurabh Das are celebrating.Meanwhile, in Delhi, the Sangh Parivar has put their most Notorious and Riotous Group, the Bajrang Dal, out on the Streets.They are… pic.twitter.com/yLa72eEdBA— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) July 28, 2026ఇటీవల సత్యం పండిట్ అనే వ్యక్తి ఇద్దరు నిరసనకారులపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన వీడియో చర్చకు వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు చూపించే మరికొన్ని వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో చిత్రీకరించినట్లు చెబుతున్న ఓ వీడియోలో, మైక్ పట్టుకున్న ఓ వ్యక్తి కొందరు నిరసనకారులను ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నిస్తూ నిలదీసినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ సమయంలో అతడి మెడపై చేయి వేసి మాట్లాడుతున్నట్లు, క్షమాపణ చెప్పాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆ వ్యక్తి క్షమాపణ చెప్పినట్లు వీడియోలో కనిపిస్తుంది.जो काॅकरोच जंतर-मंतर पर सनातन धर्म और मोदी जी को गाली दे रहे थे उनकी दिल्ली मेट्रो में जमकर धुलाई हो रही है...🤣😏 pic.twitter.com/XHtgERs9Hx— राजपूत सवित सिंह (@Savit12) July 29, 2026 మరో వీడియోలో ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు వెంబడించి కొట్టినట్లు, తన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంకొక వీడియోలో ఓ మహిళను పలువురు వ్యక్తులు చుట్టుముట్టి ప్రశ్నిస్తూ, ఆమెను మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనలపై నిరసనలకు మద్దతు ఇస్తున్న వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని లేదా విధానాలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో భాగమని, నిరసనకారులను బెదిరించడం, దాడి చేయడం సరైన విధానం కాదని వారు పేర్కొంటున్నారు.బీజేపీ అనుకూల వర్గాల వాదనమరోవైపు, బీజేపీకి మద్దతు ఇస్తున్న వర్గాలు నిరసనల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, పోలీసులపై అనుచిత నినాదాలు చేసినట్లు చూపించే కొన్ని వీడియోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నిరసనల పేరుతో చట్టపరమైన, సామాజిక పరిమితులు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు నిరసనల్లో పాల్గొన్న వ్యక్తుల ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ పోలీసులను ట్యాగ్ చేశాయి. అయితే, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకోవాల్సింది చట్టపరమైన వ్యవస్థ మాత్రమేనని, వ్యక్తులు లేదా ప్రైవేట్ గుంపులు స్వయంగా చర్యలకు దిగడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.THIS IS SHAMEFUL !!!If this is what young Indians have to face simply for supporting a protest then what kind of democracy are we becoming?This video appears to show Satyam Pandit confronting and slapping two youths on their way to the Jantar Mantar protest has sparked… pic.twitter.com/8zDPBMb1at— Ravi Prakash Official (@raviprakash_rtv) July 26, 2026ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం పౌరుల హక్కు. అదే సమయంలో నిరసనల సమయంలో హింస, బెదిరింపులు, దాడులు లేదా చట్ట ఉల్లంఘనలు జరిగితే వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు, న్యాయ వ్యవస్థలపై ఉంటుంది. కాగా, నీట్ నిరసనలు ముగిసినా, వాటి చుట్టూ రాజకీయ వాదోపవాదాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఒకవైపు నిరసనకారులపై దాడుల ఆరోపణలు, మరోవైపు నిరసనల్లో జరిగిన అనుచిత వ్యాఖ్యలపై విమర్శలు కొనసాగుతున్నాయి. The police have started their job. The Students movement is over. Now who will come forward to help these students?Unity of students is required. #cjpprotesters #india #arrested #students #police pic.twitter.com/6o7LxWowhb— भारतीय (@ramanswall) July 27, 2026 -
ఈ జెన్‌జీ భాష కనిపెట్టింది ఎవరో తెలుసా?
నిన్నటి వరకు సోషల్ మీడియా మీమ్స్, చాటింగ్‌ల్లో మాత్రమే కనిపించిన జెన్ జీ భాష.. ఇప్పుడు దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలోనూ వినిపించింది. రాజకీయ విమర్శలకు యువత వాడే స్లాంగ్ పదాలను ఎంపీలు ఉపయోగించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సాధారణంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్, ఆన్లైన్ సంభాషణల్లో కనిపించే పదాలు.. తాజాగా లోక్‌సభ చర్చలోనూ చోటు దక్కించుకున్నాయి.నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన చర్చలో శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే తొలుత Gen Z పదజాలాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్షాల నిరసనలను విమర్శిస్తూ.. ‘MIA’ (Missing In Action), ‘FOMO’ (Fear Of Missing Out), ‘Delulu’ (Delusional) వంటి పదాలను ఉపయోగించారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ కూడా ‘Clock it’ అనే పదాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. తేజస్వి సూర్య సైతం ‘Delulu’, ‘source code’ వంటి పదాలను ఉపయోగిస్తూ తన వాదనను వినిపించారు.It's raining Gen Z lingo in Loksabha.BJP MP Bansuri Swaraj said that PM Modi clocked by bringing a bill against the Paper leak. https://t.co/ovC4uz8QKs pic.twitter.com/o2cNJtUT4k— Political Kida (@PoliticalKida) July 28, 2026 "Congress was having FOMO and staying in DELULU".Dr. Shrikant Shinde of Shivsena just bodied Congress in Loksabha in GenZ style! 😂 pic.twitter.com/LMN5IRUQmt— Political Kida (@PoliticalKida) July 28, 2026 అయితే ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాత్రం ఈ కొత్త భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది విద్యా వ్యవస్థలోని సమస్యలపై అని.. కేవలం కొత్త పదాల ప్రదర్శన కోసం కాదని సూచించారు. అయితే ఆ తర్వాత ఆమె కూడా ‘Delulu’ పదాన్ని ఉపయోగిస్తూ.. యువత మొత్తం తమవైపే ఉందని భావించొద్దని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.'Delulu' takes over #LokSabha: #TejasviSurya, #SupriyaSule clash over who has Gen Z's support🌍 Catch the day's latest news here ➠ https://t.co/40gdOz6FIS 🗞️ pic.twitter.com/B9cr59wJTm— Economic Times (@EconomicTimes) July 28, 2026అసలు ఈ Gen Z భాష పుట్టింది ఎక్కడ?Gen Z స్లాంగ్ అనేది ఏ ఒక్క వ్యక్తి కనిపెట్టిన భాష కాదు. ఇది ఇంటర్నెట్, సోషల్ మీడియా, మీమ్ సంస్కృతి, డిజిటల్ జీవనశైలి కలిసి సృష్టించిన కొత్త భాషా రూపం. సాధారణంగా 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని Gen Zగా పిలుస్తారు. ఈ తరం చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియాతో పెరిగింది. అందుకే వీరి సంభాషణల్లో వేగం, సంక్షిప్తతకు ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది.ఎక్కువ భావాన్ని తక్కువ పదాల్లో చెప్పడం, సరదాగా స్పందించడం, ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడం కోసం కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. మొదట చిన్న ఆన్లైన్ గ్రూపులు, గేమింగ్ కమ్యూనిటీలు, సోషల్ మీడియా చర్చల్లో మొదలైన ఈ పదాలు.. TikTok, Instagram, YouTube వంటి వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి.మీమ్స్‌తో మొదలై..జెన్‌జీ భాష వ్యాప్తిలో మీమ్ కల్చర్ కీలక పాత్ర పోషించింది. ఒక సంఘటనను లేదంటే ఒక భావాన్ని సీరియస్‌గా కాకుండా సరదాగా చెప్పేందుకు యువత కొత్త పదాలను ఉపయోగించడం మొదలుపెట్టింది. ఒకప్పుడు కొత్త పదాలు సినిమాలు, టెలివిజన్, సంగీతం ద్వారా ప్రజల్లోకి వెళ్లేవి. ఇప్పుడు సోషల్ మీడియా ఆ స్థానాన్ని తీసుకుంది. ఒక వైరల్ వీడియో, ఒక మీమ్ లేదంటే ఒక ట్రెండ్ ద్వారా పుట్టిన పదం కొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇలా డిజిటల్ ప్రపంచంలో పుట్టిన పదజాలం ఇప్పుడు రాజకీయాలు, వ్యాపారం, ప్రకటనలు వంటి రంగాల్లోకి కూడా ప్రవేశించింది.యువత ఎందుకు ఇష్టపడుతోంది?ఈ భాషలో కొన్ని పదాలకు ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. ‘Delulu’ అంటే వాస్తవానికి దూరమైన ఊహల్లో ఉండటం, ‘FOMO’ అంటే ఏదైనా అవకాశం కోల్పోతామేమో అన్న భయం, ‘MIA’ అంటే కనిపించకుండా పోవడం, ‘Clock it’ అంటే ఒక విషయాన్ని గుర్తించడం లేదా నిజాన్ని బయటపెట్టడం. ‘Rizz’ అంటే ఆకర్షించే వ్యక్తిత్వం, ‘Slay’ అంటే అద్భుతంగా చేయడం, ‘No cap’ అంటే నిజం చెబుతున్నాను అనే అర్థం. సోషల్ మీడియా, మీమ్ కల్చర్ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ పదాలు ఇప్పుడు యువత సంభాషణల్లో భాగమయ్యాయి.జెన్‌జీ భాషకు ప్రధాన ఆకర్షణ దాని సరళత, వేగం. సుదీర్ఘమైన భావాలను ఒకే పదంతో వ్యక్తం చేసే అవకాశం ఈ స్లాంగ్ ఇస్తోంది. అంతేకాదు.. ఒకే తరానికి చెందిన వారు ఒకే రకమైన పదాలను ఉపయోగించడం ద్వారా తమ మధ్య ప్రత్యేకమైన అనుబంధాన్ని కూడా ఏర్పరుచుకుంటున్నారు. ఇది కేవలం మాట్లాడే విధానంలో మార్పు కాదు.. డిజిటల్ యుగంలో ఒక తరం తన గుర్తింపును వ్యక్తం చేసుకునే మార్గంగా మారింది.వ్యాపారాలకు కూడా ఉపయోగమే..ఇప్పుడు కేవలం యువత సంభాషణలకే ఈ భాష పరిమితం కాలేదు. యువ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకునే కంపెనీలు, బ్రాండ్లు కూడా ఈ పదజాలాన్ని గమనిస్తున్నాయి. ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారాల్లో యువతకు దగ్గరగా ఉండే భాషను ఉపయోగించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఒక తరం ఎలా ఆలోచిస్తోంది, ఎలా స్పందిస్తోంది అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ స్లాంగ్ ఒక సాధనంగా మారింది.విమర్శలు కూడా..అయితే Gen Z భాషపై విమర్శలు కూడా ఉన్నాయి. అధికారిక వేదికల్లో ఇలాంటి స్లాంగ్ పదాలను ఉపయోగించడం సరైనదేనా అనే ప్రశ్నలు కొందరు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా విద్య, విధానాలు వంటి తీవ్రమైన అంశాలపై చర్చ జరిగే సమయంలో భాష మరింత గంభీరంగా ఉండాలని కొందరి అభిప్రాయం.భాష ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఒకప్పుడు కొత్తగా అనిపించిన ఎన్నో పదాలు ఇప్పుడు సాధారణ వాడుకలోకి వచ్చాయి. టెక్నాలజీ, సినిమాలు, వీధి సంస్కృతి నుంచి గతంలో పదాలు వచ్చినట్లే.. ఇప్పుడు సోషల్ మీడియా కొత్త పదాలకు వేదికగా మారింది. Gen Z భాష వెనుక అసలు కథ కొన్ని విచిత్రమైన పదాల కథ కాదు. ఇంటర్నెట్ యుగంలో పెరిగిన ఒక తరం తన భావాలను, ఆలోచనలను, గుర్తింపును వ్యక్తం చేసుకునేందుకు సృష్టించుకున్న కొత్త శైలి. అందుకే మీమ్స్, చాటింగ్‌ల నుంచి మొదలైన ఈ భాష.. ఇప్పుడు పార్లమెంట్ చర్చల వరకూ చేరింది.:::వెబ్ ప్రత్యేకం -
జైలు నుంచి వస్తూనే తమ్ముడి దగ్గరికి తేజ్!
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బెవూర్ జైలు నుంచి విడుదలైన వెంటనే తన తమ్ముడు తేజస్వి యాదవ్‌ను కలుసుకున్నారు. పట్నాలోని కౌటిల్య నగర్‌లోని రబ్రీ దేవి నివాసంలో వీరి భేటీ జరిగింది. విద్యార్థి నిరసనలకు సంబంధించిన కేసులో జూలై 25న పోలీసులు తేజ్ ప్రతాప్‌ను అరెస్టు చేయగా, దీనిపై తేజస్వి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా సుమారు రెండు నెలల తర్వాత ఇద్దరు సోదరులు ముఖాముఖి కలుసుకున్నారు.గతంలో సోషల్ మీడియా పోస్టుల వివాదం కారణంగా లాలూ ప్రసాద్ యాదవ్ తేజ్ ప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన 'జనశక్తి జనతాదళ్' (జేజేడీ)అనే కొత్త పార్టీని స్థాపించి, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలోకి దించారు. ఆ సమయంలో తేజస్వి సలహాదారులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే జైలు నుంచి రాగానే తేజ్ ప్రతాప్ నేరుగా కుటుంబ సభ్యులను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామంతో అన్నదమ్ముల మధ్య ఉన్న రాజకీయ దూరం తగ్గుముఖం పడుతుందనే సంకేతాలను ఇస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: ప్రొఫెసర్ కామకోటి ఎవరు?.. ప్రియాంక ఎందుకు ఎద్దేవా చేశారు? -
ప్రొఫెసర్ కామకోటి ఎవరు?.. ప్రియాంక ఎందుకు ఎద్దేవా చేశారు?
న్యూఢిల్లీ: లోక్‌సభలో విద్యా సంస్కరణల బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రక్షాళన కోసం ఏర్పాటు చేసిన నిపుణుల ప్యానెల్ సభ్యుడైన ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటిని ఆమె ‘గోమూత్ర నిపుణుడు’ అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కంప్యూటర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వి కామకోటి, ఐఐటి మద్రాస్ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేసి 2001లో అదే సంస్థలో అధ్యాపకునిగా చేరారు. జనవరి 2022లో ఐఐటి మద్రాస్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, వీఎల్ఎస్ఐ డిజైన్లలో విశేష అనుభవం ఉన్న ఆయన, జాతీయ భద్రతా సలహా మండలి సభ్యునిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఏఐ టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడిగా సేవలందించారు.ఈ వివాదానికి మూలం 2025 జనవరిలో చెన్నైలోని ఒక గోశాలలో జరిగిన ‘మాటు పొంగల్’ వేడుకలు. ఆ కార్యక్రమంలో దేశీయ గోజాతులు, సేంద్రియ వ్యవసాయం, గోమూత్రంలోని ఔషధ గుణాల గురించి ప్రొఫెసర్ కామకోటి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రియాంక గాంధీ ఆయనను విమర్శించారు. కేవలం ఒక అంశాన్ని ఆధారంగా చేసుకుని, దశాబ్దాలుగా విద్యా, సాంకేతిక రంగాలకు ఆయన అందించిన విశేష సేవలను విస్మరించడం సమంజసం కాదని నిపుణులు, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన కామకోటి, డీఆర్డీఓ అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డుతో పాటు అనేక జాతీయ పురస్కారాలను అందుకున్నారు.ఇది కూడా చదవండి: షిర్డీలో వైభవంగా గురుపూర్ణిమ వేడుకలు -
షిర్డీలో వైభవంగా గురుపూర్ణిమ వేడుకలు
షిర్డీ: నేడు(బుధవారం) గురుపూర్ణిమ మహోత్సవాన్ని పురస్కరించుకుని మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా సమాధి మందిరం, ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడుతోంది. లక్షలాది మంది సాయి భక్తుల సమక్షంలో మూడు రోజుల పాటు వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అద్భుతమైన పూల అలంకరణలు, ఆకర్షణీయమైన విద్యుత్ కాంతుల అలంకరణ చేపట్టడంతో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఆలయంలో బాబాకు పూజలు, హారతి కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.ఈ ఏడాది కర్ణాటకకు చెందిన సాయిభక్తుడు ఎస్. ప్రకాష్ అందించిన విరాళంతో సాయిబాబా సమాధి మందిరంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల దేశీయ, విదేశీ రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించారు. గులాబీలు, బంతిపూలు, ఆర్కిడ్స్, రజనీగంధ అలాగే ఇతర రకాల పుష్పాలను ఉపయోగించి ఆలయానికి ఆకర్షణీయమైన రూపురేఖలు తీసుకొచ్చారు. సమాధి మందిరం సుందరమైన పూలతో అలంకృతమై భక్తుల ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. గర్భగుడితో పాటు గురుస్థాన్, ద్వారకామాయి, చావడి తదితర ప్రాంతాలలో రంగురంగుల దేశీయ, విదేశీ పూల తోరణాలు ఏర్పాటు చేశారు. ఆలయ మూడవ గేటు వెలుపల వివిధ పుష్పాలతో సాయిబాబా వారి భవ్యమైన ప్రతిమను తీర్చిదిద్దారు. ఈ అద్భుతమైన పుష్ప కళాఖండం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.ముంబైకి చెందిన సాయిరాజ్ డెకరేటర్స్ ఆధ్వర్యంలో సమాధి మందిరంతో పాటు ఆలయ ప్రాంగణంలో ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణ చేశారు. ఆలయ ప్రవేశ ద్వారాలు, గురుస్థాన్, ద్వారకామాయి, చావడి, సంస్థాన్ పరిపాలనా భవనం, ప్రసాదాలయం మరియు ప్రధాన వీధులు రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రకాశిస్తున్నాయి. సాయంత్రం కాగానే ఈ విద్యుత్ కాంతుల వెలుగులో ఆలయ ప్రాంగణం దీప్తివంతంగా మారుతూ, భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతోంది. -
అస్సాం వరదల వెనుక భయంకర నిజాలు
అస్సాం మరోసారి జల విలయాన్ని చవిచూస్తోంది. సాధారణంగా ప్రతి ఏడాది వరదలను ఎదుర్కొనే ఈశాన్య రాష్ట్రం.. ఈసారి మాత్రం ఇటీవలి కాలంలోనే అత్యంత తీవ్ర వరద పరిస్థితుల్లో ఒకదాన్ని ఎదుర్కొంది. గ్రామాలకు గ్రామాలు నీట మునగడం, వేలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడం, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడం.. అస్సాం వరదల భీకర రూపాన్ని చూపిస్తున్నాయి.ఈసారి వరదల బారిన పడి ఇప్పటివరకు 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరు లక్షల మందికిపైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వందలాది గ్రామాలు నీట మునగగా.. వేలాది కుటుంబాలు సహాయక శిబిరాలకు తరలిపోయాయి. 37 వేల హెక్టార్లకుపైగా వ్యవసాయ భూమి నీట మునిగింది. పశుసంపద, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు గంటల తరబడి వరద నీటిలో చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే అస్సాం వరదలు కేవలం భారీ వర్షాల ఫలితమేనా? లేదంటే దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు కూడా ఈ విపత్తు తీవ్రతను పెంచుతున్నాయా?.. బ్రహ్మపుత్ర ఉగ్రరూపం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టినా వరదలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నాయి?.. Amid Assam's devastating floods, a father was seen swimming through floodwaters while carrying his children in a large tub to safety. The viral visuals have become a powerful symbol of a parent's courage, sacrifice, and unconditional love.#AssamFloods #FloodRescue #Father pic.twitter.com/uz5ZousOSM— Apka Aashish (@ApkaAashish) July 28, 2026అస్సాం భౌగోళిక పరిస్థితులే ఆ రాష్ట్రాన్ని వరదలకు అత్యంత సున్నితంగా మార్చాయి. టిబెట్ నుంచి భారత్‌లోకి ప్రవేశించే బ్రహ్మపుత్ర.. అరుణాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాల నుంచి భారీగా నీటిని తీసుకొస్తుంది. దీనికి అస్సాంలో 50కిపైగా ఉప నదులు కలుస్తాయి. వర్షాకాలంలో ఈ నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోతుంది.బ్రహ్మపుత్ర నది మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది భారీగా ఇసుక, మట్టిని (సిల్ట్) మోసుకొస్తుంది. దీంతో నది లోతు తగ్గి.. తక్కువ నీటిని మాత్రమే మోయగల పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా భారీ వర్షాలు కురిసినప్పుడు నది తన గట్లను దాటి ప్రవహిస్తుంది.40 శాతానికి పైగా భూభాగం..అస్సాంలో వరద సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఒక గణాంకం చాలు. రాష్ట్ర మొత్తం భూభాగంలో దాదాపు 39.58 శాతం ప్రాంతం వరద ముప్పు ప్రాంతంగా గుర్తించారు. ఇది దేశ సగటు వరద ముప్పు ప్రాంతంతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. ప్రతి ఏడాది సగటున లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి వరదల ప్రభావానికి గురవుతోంది. అంటే అస్సాంలో వరదలు కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు.. అక్కడి భౌగోళిక వాస్తవం కూడా.ఈసారి ఎందుకు ఇంత భయంకరంగా?ఈ ఏడాది అస్సాం, పొరుగు నాగాలాండ్ ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైంది. తక్కువ సమయంలో భారీగా వర్షం కురవడంతో కొండ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వరద నీరు మైదాన ప్రాంతాలకు చేరింది. దీనికి తోడు వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతం తీరు మారుతోంది. గతంలో కొన్ని రోజుల్లో కురిసే వర్షం ఇప్పుడు కొద్ది గంటల్లోనే భారీగా పడుతోంది. ఇలాంటి ఆకస్మిక వర్షాలు నదులపై ఒత్తిడిని పెంచుతున్నాయి.ప్రభుత్వం వల్ల కావట్లేదా?వరదలను పూర్తిగా ఆపడం అస్సాం లాంటి ప్రాంతంలో దాదాపు అసాధ్యం. కానీ నష్టాన్ని తగ్గించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇక్కడే ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్నాయి.👉పాతబడుతున్న కట్టలువరదలను నియంత్రించేందుకు అస్సాంలో వేల కిలోమీటర్ల మేర కట్టలు (ఎంబాంక్మెంట్లు) నిర్మించారు. రాష్ట్రంలో దాదాపు 4,473 కిలోమీటర్ల మేర కట్టలు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రతి ఏడాది భారీ ప్రవాహాలతో కొన్ని చోట్ల ఇవి బలహీనపడుతున్నాయి. కట్టలు తెగిపోవడమో, బలహీన ప్రాంతాల్లో నీరు చొచ్చుకురావడం వల్లనో ఒక్కసారిగా గ్రామాలు మునిగిపోతున్నాయి.👉తాత్కాలిక చర్యలకే పరిమితంఅస్సాం వరద నిర్వహణలో ఎక్కువగా సహాయక చర్యలు, కట్టల మరమ్మతులు, తాత్కాలిక రక్షణ పనులపైనే దృష్టి ఉందనే విమర్శలు ఉన్నాయి. దీర్ఘకాలిక పరిష్కారాలైన నది నిర్వహణ, సహజ నీటి ప్రవాహ మార్గాల పరిరక్షణ, వరద ప్రాంతాల ప్రణాళిక వంటి అంశాలు ఇంకా సవాలుగానే ఉన్నాయి.👉నదీ కోత మరో పెద్ద సమస్యఅస్సాంలో వరదలతో పాటు నదీ కోత కూడా పెద్ద ప్రమాదమే. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ఏటా భూమిని కోతకు గురిచేస్తాయి. దీంతో ప్రజలు ఇళ్లు, వ్యవసాయ భూములను కోల్పోతున్నారు.ఆ మార్పులు పెంచుతున్న ముప్పుప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా తీవ్ర వర్షాలు, ఆకస్మిక వరదలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అస్సాం వంటి నది పరివాహక ప్రాంతాల్లో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. అంటే భవిష్యత్తులో సమస్య కేవలం “వరద వస్తుందా?” అన్నది కాదు.. “ఎంత తీవ్రంగా వస్తుంది?” అన్నదే కీలక ప్రశ్నగా మారుతోంది.కావాల్సింది కొత్త విధానంఅస్సాం వరద సమస్యకు కేవలం మరిన్ని కట్టలు నిర్మించడం ఒక్కటే పరిష్కారం కాదని నిపుణులు భావిస్తున్నారు. నదుల సహజ ప్రవాహాన్ని అర్థం చేసుకుని ప్రణాళికలు రూపొందించడం, ప్రమాద ప్రాంతాల్లో నిర్మాణాలను నియంత్రించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం అవసరం. ప్రస్తుతం సహాయక చర్యలతో ప్రాణాలను కాపాడటం ముఖ్యం. కానీ ప్రతి ఏడాది ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే.. వరదలను ఎదుర్కొనే విధానంలో మూలమైన మార్పులు అవసరం.అస్సాం వరదలు మరోసారి చెప్పే నిజం ఒక్కటే.. ప్రకృతిని పూర్తిగా నియంత్రించలేం.. కానీ నష్టాన్ని తగ్గించే సిద్ధతను మాత్రం పెంచుకోవచ్చు. -
గుండు కొట్టించుకుంటే 15 వేలు..!
తమిళనాడు: సేలం జిల్లాలోని ఆత్తూరు సమీపంలో ఉన్న పుదుకోతమ్మడి గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళకు ఆదివారం రాత్రి సుమారు 8 గంటలకు ఆమె సెల్ ఫోన్‌కు ఒక కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ఆత్తూరు తాలూకా కార్యాలయం నుండి తహసీల్దార్ అని చెప్పుకుంటూ, ఆ మహిళ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు కూడా అడిగారు. కరోనా వంటి కొత్త వ్యాధులు నిరంతరం వ్యాపిస్తున్నాయి. ఈ వ్యాధి జుట్టు ద్వారా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో విదేశాలలో ప్రజలు గుండు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధి బారి నుండి తప్పించుకుంటున్నారు. ఈ విధంగా గుండు చేయించుకుంటే, వారికి ఈ వ్యాధి సోకదు. ప్రభుత్వం కూడా రూ. 15 వేల వరకు ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పాడు. దీనిని నమ్మి 20 మంది గుండు కొట్టించుకునేందుకు సిద్ధమయ్యారు. ముగ్గురు మహిళలు గుండు చేయించుకున్న తర్వాత.. అజ్ఞాత వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసమని గ్రహించి మిగిలిన వారు గుండు చేయించుకోకుండా జాగ్రత్తపడ్డారు. కాగా కొత్త పద్ధతిలో మహిళలను మోసం చేస్తున్న ముఠాను గుర్తించి, చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు పోలీసులను కోరారు. తమిళనాడులో విక్రమార్కుడు గుండు సీన్ రిపీట్గుండు చేయించుకుంటే రూ.15 వేలు ఇస్తామని ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి, నమ్మి గుండు చేయించుకున్న మహిళలుఆకతాయిల పని అని తెలిసి వాపోయిన బాధితులుతమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ… pic.twitter.com/zcggDhinxs— Telugu Scribe (@TeluguScribe) July 29, 2026 -
అధికారులకు షాక్.. కేంద్రం కొత్త రూల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ వాహనాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఒక అధికారి.. ఒక అధికారిక కారు’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ నిబంధనలను వెల్లడించింది. దీనిపై కేంద్ర వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇకపై అదనపు బాధ్యతల పేరుతో సీనియర్ అధికారులకు మరో ప్రభుత్వ వాహనం కేటాయించకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే అధికారిక కారుకు అర్హత ఉన్న ఓ అధికారి.. మరో మంత్రిత్వ శాఖ, విభాగం, ప్రభుత్వ రంగ సంస్థ (PSU) లేదంటే స్వయం ప్రతిపత్తి సంస్థకు అదనపు బాధ్యతలు నిర్వహించినా.. ప్రత్యేకంగా మరో వాహనం ఇవ్వకూడదని పేర్కొంది. అలాంటి అధికారులు తమకు ఇప్పటికే కేటాయించిన అధికారిక వాహనాన్నే అన్ని విధుల కోసం ఉపయోగించుకోవాలని ఆదేశించింది. అధికారిక కార్ల దుర్వినియోగాన్ని అరికట్టడం, అనవసర ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా ఈ రూల్ తెచ్చినట్లు చెబుతోంది.కఠిన ఆంక్షలు ఇలా.. కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు లేదంటే ఇతర అర్ధ ప్రభుత్వ సంస్థలకు చెందిన వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంపై కూడా ఆంక్షలు విధించింది. కేవలం అధికారిక విధులు, అనుమతించిన పర్యటనల సమయంలో మాత్రమే వాటిని ఉపయోగించాలని స్పష్టం చేసింది. వినియోగంలో లేని లేదా అదనపు వాహనాలను సురక్షితంగా భద్రపరచాలని అన్ని శాఖలకు సూచించింది.ప్రజాధనం ఆదా చేయడమే లక్ష్యంప్రభుత్వ వాహనాల నిర్వహణలో పారదర్శకత పెంచడం, అనవసర వ్యయాలను నియంత్రించడం, ప్రజాధనాన్ని సమర్థంగా వినియోగించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని కేంద్రం తెలిపింది. ఒకే అధికారి వద్ద పలు వాహనాలు ఉండటం వల్ల జరిగే దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడంతో పాటు.. ప్రభుత్వ వనరుల వినియోగాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొంది.2022 మార్గదర్శకాలకు కొనసాగింపుప్రభుత్వ వాహనాల వినియోగంపై కేంద్రం 2022 సెప్టెంబర్‌లో సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. వివిధ శాఖల్లో అమల్లో ఉన్న నిబంధనలను ఒకే విధానంలోకి తీసుకొచ్చింది. తాజా ఉత్తర్వులతో ఆ మార్గదర్శకాలను మరోసారి పునరుద్ఘాటించిన కేంద్రం.. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.వాహనాల నిర్వహణలో మారనున్న విధానంఇక ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే.. ఈ నిబంధన వారికి నేరుగా వర్తించదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు వాహన సదుపాయాలు వారి హోదా, సంబంధిత నిబంధనల ప్రకారం కొనసాగుతాయి. తాజా ఉత్తర్వులు మాత్రం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ అధికారుల వాహన వినియోగానికే వర్తిస్తాయి. కొత్త నిబంధనలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక వాహనాల కేటాయింపు, వినియోగ విధానం మరింత కట్టుదిట్టం కానుంది. -
నీట్ పేపర్ లీక్ కేసు: 13 మందిపై నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చార్జ్‌షీట్‌లో ఉన్న నిందితుల్లో ముగ్గురు ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) సబ్జెక్ట్ నిపుణులు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో యశ్ యాదవ్, మంగీలాల్ బివాల్, దినేశ్, వికాస్, శుభమ్, ధనుంజయ్, ప్రహ్లాద్ సహా మొత్తం 13 మంది పేర్లు ఉన్నాయి. ప్రశ్నపత్రం లీక్‌కు సంబంధించిన కుట్ర, ప్రశ్నపత్రాల అక్రమ సేకరణ, పంపిణీ తదితర అంశాలపై సీబీఐ విస్తృతంగా దర్యాప్తు జరిపి ఈ చార్జ్‌షీట్‌ను సమర్పించింది. ఈ కేసును నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణకు తీసుకోనుంది. చార్జ్‌షీట్‌పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో కేసులో మరికొంతమందిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. -
2029 నాటికి ‘జెన్ జీ’ ఓటే శాసనం!
2029 నాటికి భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేందుకు ఒక సరికొత్త యువశక్తి సిద్ధమవుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకున్న ‘జెన్ జెడ్’ లేదా ‘జెన్ జీ’ అని పిలిచే ప్రస్తుత యువతరం దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఓటర్ల సమూహంగా అవతరించనున్నదని తాజా నిరుద్యోగ, విద్యాపరమైన నిరసనలు స్పష్టం చేస్తున్నాయి.రాజకీయాల్లో ఆధిపత్యంభారతదేశ రాజకీయ భవిష్యత్తును మలుపు తిప్పే శక్తిగా ‘జెన్ జెడ్’ ఎదుగుతోంది. నీట్ వంటి కీలకమైన పరీక్షల పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు, ప్రభుత్వాలు ఇకపై యువత గొంతును విస్మరించలేవనే కఠిన సత్యాన్ని నిరూపించాయి. పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఈ తరం నిలబడుతున్న తీరు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల్లో వణుకు పుట్టిస్తోంది.38 కోట్ల మందితో భారీ ఓటర్ల బలగంవచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి, 18 నుండి 32 సంవత్సరాల వయస్సు గల జెన్ జెడ్ జనాభా దాదాపు 38 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇందులో దాదాపు 19 కోట్ల మంది పురుషులు, 18 కోట్ల మంది మహిళలు ఉంటారు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న ఈ తరం, మిలీనియల్స్ తరాన్ని వెనక్కి నెట్టి దేశంలోనే అతిపెద్ద వయోజన ఓటర్ల సమూహంగా రికార్డు సృష్టించనుంది.డిజిటల్ కనెక్టివిటీతో పెరిగిన శక్తికేవలం జనాభా సంఖ్య మాత్రమే కాకుండా ఈ తరానికి ఉన్న డిజిటల్ కనెక్టివిటీనే వారి ప్రధాన బలం. సోషల్ మీడియా వేదికగా కేవలం క్షణాల వ్యవధిలో వేలాది మందిని ఏకం చేయగల సామర్థ్యం ‘జెన్ జెడ్’ సొంతం. ఏ చిన్న సమస్య ఎదురైనా దానిపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేయడంలో, ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడంలో ఈ యువత ముందుంటోంది.మారుతున్న జనాభా లెక్కలు మరోవైపు భారతదేశ జనాభా క్రమంగా వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తోంది. దేశంలో చిన్నారుల శాతం తగ్గుతుండగా, వృద్ధులు, మధ్య వయస్కుల జనాభా క్రమంగా పెరుగుతోంది. 1988లో ఓటర్లలో 18-29 ఏళ్ల వయసువారు 38.3 శాతంగా ఉండగా, 2024 నాటికి అది 30.1 శాతానికి పడిపోయింది. 2029 నాటికి ఇది మరింత తగ్గి 27.8 శాతానికి చేరనుందని అంచనా.రాజకీయ పార్టీలకు సవాల్ఓటర్ల మొత్తం సంఖ్యలో యువత శాతం స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ, వారి ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రాబోయే కాలంలో ఉపాధి, నాణ్యమైన విద్య, జీవన ప్రమాణాలు, గృహ నిర్మాణం, వాతావరణ మార్పులు, సుపరిపాలన వంటి అంశాలే ఎన్నికల ఫలితాలను శాసించనున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఈ యువ ఓటర్ల మద్దతు తప్పనిసరి కానుంది.నిరసనల రూపంలో ప్రజాస్వామ్యంగతంలో ఎన్నడూ లేనివిధంగా యువత తమ నిరసనలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా, డిజిటల్, ప్రత్యక్ష ఆందోళనల ద్వారా ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కి తీసుకునేలా చేయగలుగుతున్నారు. ఢిల్లీ వేదికగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు కేవలం ఒక విద్యా విభాగానికి సంబంధించినవి కావు, ఇవి రాబోయే రాజకీయ మార్పులకు బలమైన పునాదులు.దేశ భవిష్యత్తును నిర్దేశించనున్న ‘జెన్ జెడ్’ఒకవైపు జనాభా కూర్పు మారుతున్నప్పటికీ, జెన్ జెడ్ తరం అత్యంత చైతన్యవంతంగా ఉంటూ, దేశ రాజకీయ దిశను నిర్దేశిస్తోంది. 2029 ఎన్నికల నాటికి ఈ యువశక్తి దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే కాలంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఈ యువత ఆకాంక్షలకు తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.ఇది కూడా చదవండి: వీడని బిగ్ మిస్టరీ: 23 ఏళ్లుగా ప్రముఖ నటుడు అదృశ్యం! -
‘గూగుల్‌లో వెతికా.. ఎంత పనికిమాలినోడివో!’
జెన్-జీ నిరసనలపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో ఉన్న బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్.. తాజాగా సీజీపీ (Cockroach Janata Party) ప్రతినిధి సౌరవ్ దాస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలను విమర్శించిన సౌరవ్ దాస్‌కు కౌంటర్‌గా.. అతడిని ‘‘పనికిమాలినోడు, ఉద్యోగం లేనివాడు’’ అంటూ మండిపడ్డారు. తన కెరీర్ విజయాలను ప్రస్తావిస్తూ విమర్శలకు బదులిచ్చారు.సౌరవ్ దాస్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన కంగనా.. ‘‘గూగుల్‌లో ఈ వ్యక్తి గురించి వెతికాను. అతడి వయసు 28 ఏళ్లు. అతనో పనికిమాలినోడు అని అర్థమైంది. అలాంటి వ్యక్తి తనను తాను విద్యార్థి అని ఎలా చెప్పుకుంటున్నాడో అర్థం కావడం లేదు’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను రాజకీయాల్లోకి వచ్చి రెండేళ్లే కావచ్చు. కానీ ప్రజా జీవితంలోకి వచ్చి 20 ఏళ్లు అవుతోంది. అతడి వయసులోనే నేను రెండు జాతీయ అవార్డులు సాధించాను’’ అని పేర్కొన్నారు.నటిగా, ఎంపీగా నా ప్రయాణం వేరుతాను కేవలం రాజకీయ నాయకురాలిని మాత్రమే కాదని కంగనా అన్నారు. నటిగా, చిత్ర నిర్మాతగా, స్క్రీన్‌రైటర్‌గా, వ్యాపారవేత్తగా కూడా తన ప్రయాణం కొనసాగిందని తెలిపారు. ‘‘కొత్త ఎంపీగా బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో ఒత్తిడి ఎదురైంది. ఎందుకంటే నేను ఫిల్మ్‌మేకర్, పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్, నిర్మాత, రచయిత్రి, వ్యాపారవేత్తగా కూడా ఉన్నాను’’ అని పేర్కొన్నారు. ఎప్పుడూ డిమాండ్‌లో ఉండటం అంటే ఏమిటో సౌరవ్ దాస్ లాంటి వారు అర్థం చేసుకోలేరంటూ విమర్శించారు.‘ముందు నైపుణ్యం నేర్చుకో’సౌరవ్ దాస్‌ను ఉద్దేశించి కంగనా మరింత ఘాటుగా స్పందించారు. ‘‘నీ సమస్యలు వ్యక్తిగతమైనవి. నువ్వు విద్యార్థివి కాదు. నువ్వు కేవలం పనికిమాలిన వ్యక్తివి. ముందు ఏదైనా నైపుణ్యం నేర్చుకోవడం ప్రారంభించు’’ అంటూ తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.జెన్-జీ నిరసనలపై కంగనా వ్యాఖ్యలునీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణలపై జరిగిన విద్యార్థుల నిరసనలకు సంబంధించిన కొన్ని వీడియోలపై కంగనా గతంలో తీవ్రంగా స్పందించారు. ‘‘నా జీవితంలో ఒకే దగ్గర ఇంత కంపును ఎప్పుడూ చూడలేదు. జెన్-జీ నిరసనకారుల రీల్స్ వాంతులు తెప్పించేలా ఉన్నాయి. వారు మాట్లాడే విధానం, ఉపయోగించే భాష నేనెప్పుడూ చూడలేదు’’ అంటూ విమర్శించారు. ‘‘ఇలాంటి వారిని ఎవరు కంటున్నారు? ఎవరు పెంచుతున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.విపక్షాల నుంచి తీవ్ర విమర్శలుకంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఎంఐఎం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ స్పందిస్తూ.. జెన్-జీ యువత నుంచి కంగనాకు త్వరలోనే సమాధానం వస్తుందని అన్నారు. యువతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు. కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కూడా కంగన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందేందుకు ఒక మహిళా ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.సౌరవ్ దాస్ కౌంటర్కంగనా వ్యాఖ్యలకు ముందు సౌరవ్ దాస్ కూడా ఆమెపై విమర్శలు చేశారు. ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘కంగనాను ఆమె సొంత పార్టీ నేతలే పెద్దగా పట్టించుకోరు. ఆమెను సీరియస్‌గా తీసుకోనప్పుడు మేమెందుకు తీసుకోవాలి?’’ అని అన్నారు. జెన్-జీ, జెన్ ఆల్ఫా తరాలు కంగనా వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ‘‘జెన్-జీ ఈ దేశానికి మీకంటే ఎక్కువ చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ప్రజాస్వామ్యంపై మళ్లీ నమ్మకం కలిగించే పని యువత చేస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.నీట్ నిరసనలతో మొదలైన వివాదంనీట్-యూజీ పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో సీజీపీ కీలక పాత్ర పోషించింది. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఆందోళనల తర్వాత కేంద్రం కొన్ని డిమాండ్లను అంగీకరించింది. బాధిత కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ పరిణామాల తర్వాత అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కూడా చర్చనీయాంశమైంది.కొనసాగుతున్న మాటల యుద్ధంనిరసనలు ముగిసినా.. కంగనా, సీజీపీ నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతోంది. ఒకవైపు కంగనా నిరసనకారుల తీరును ప్రశ్నిస్తుండగా.. మరోవైపు సీజీపీ నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. తాజాగా సౌరవ్ దాస్‌పై కంగనా చేసిన ఘాటు వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. -
బ్లాక్‌సీలో చిక్కుకున్న భారతీయ నావికులు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి భారతీయ నావికుల భద్రతపై ఆందోళన పెంచుతోంది. ఉక్రెయిన్‌లోని చోర్నోమోర్స్క్ పోర్టులో ఓ కార్గో నౌకలో 13 మంది భారతీయ నావికులు చిక్కుకుపోయారు. బ్లాక్‌సీ ప్రాంతంలో కొనసాగుతున్న డ్రోన్, క్షిపణి దాడుల మధ్య వారు ప్రాణభయంతో ఉన్నట్లు ఫార్వర్డ్ సీమన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) తెలిపింది.‘ఎంవీ అమీర్1’ అనే కార్గో నౌకలో మొత్తం 15 మంది సిబ్బంది ఉండగా.. అందులో 13 మంది భారతీయులేనని యూనియన్ వెల్లడించింది. నౌక చాలా రోజులుగా పోర్టులో నిలిచిపోయిందని, చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుసగా డ్రోన్, మిసైల్ దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల నడుమ.. నౌకలోని సిబ్బంది నిరంతరం భయంతో జీవిస్తున్నారని FSUI తెలిపింది. ఎప్పుడైనా నౌకపై నేరుగా దాడి జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే భారత ప్రభుత్వం, నౌక యజమానులు, సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని వారిని సురక్షితంగా తరలించాలని కోరింది.వరుస దాడులతో బ్లాక్‌సీ ప్రమాదకరంఇటీవల ఉక్రెయిన్ తీర ప్రాంతాల్లో వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఓడెసా సమీపంలో ‘ఎంవీ ఓమోర్ఫీ’ నౌకపై జరిగిన దాడిలో ఓ భారతీయ నావికుడు మృతి చెందాడు. మరో ఘటనలో ‘ఎంవీ ఏజీఎన్ రాగ్నర్’ నౌకపై దాడి జరగగా.. కొందరు సిబ్బంది గల్లంతయ్యారు.భారతీయ నావికుల భద్రతపై ఆందోళనబ్లాక్సీ ప్రాంతం ప్రస్తుతం వాణిజ్య నౌకలకు అత్యంత ప్రమాదకరంగా మారింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు ఈ ప్రాంతాల్లో పనిచేసే ముందు భద్రతను అంచనా వేసుకోవాలని విదేశాంగ శాఖ ఇప్పటికే సూచనలు జారీ చేసింది. -
ఉత్తరాదిని వణికిస్తున్నవానలు
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. హిమాలయ ప్రాంత రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకోగా, దేశ రాజధాని ఢిల్లీలో జన జీవనం స్తంభించింది. వచ్చే నాలుగైదు రోజుల్లోనూ ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో భారీ వర్షాలు నమోదయ్యాయి. హిమాచల్‌లోని చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో వాహనాలు, నివాసాలు మట్టి, బురద, రాళ్లకింద కూరుకుపోయాయి.అయితే, ప్రాణనష్టం సంభవించలేదు. ఉత్తరాఖండ్‌లో విడవకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఛార్‌ధామ్ యాత్రను రెండు రోజులపాటు నిలిపివేశారు. యాత్ర మార్గంలో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వరద నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఈ సీజన్లో అత్యధికంగా మంగళవారం వర్షం నమోదైందని, మూడేళ్లలోనే జూలైలో 29 డిగ్రీల సెల్సియస్‌తో అతి చల్లని రోజుగా మంగళవారం ఉందని ఐఎండీ తెలిపింది. -
కోర్టు గేట్లకు ఏముండాలో మేం చూసుకుంటాం!
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు భవనం ప్రధాన గుమ్మటం, గేటు, అధికార పత్రాలపై జాతీయ చిహ్ననికి బదులుగా న్యాయస్థానం తన సొంత చిహ్నాన్ని వినియోగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోర్టు గేట్లపై ఏముండాలో నిర్ణయించే విషయాన్ని తమకు వదిలేయాలని, ఇతర సామాజిక సమస్యలపై దృష్టి పెట్టాలని పిటిషనర్‌కు హితవు పలికింది. ఈ అంశంపై బదరవాడ వేణుగోపాల్ అలియాస్ బాబా ఖతర్నాక్ అనే వ్యక్తి స్వయంగా పిటిషన్ వేశారు. కేంద్ర హోంశాఖ–2007 నిబంధనల ప్రకారం రాజ్యాంగ సంస్థలు జాతీయ చిహ్నాన్ని మాత్రమే ప్రదర్శించాలని, కానీ 1958లో ప్రారంభమైన సుప్రీంకోర్టు భవనంపై జాతీయ చిహ్నం ఇప్పటి వరకు లేదని ఆయన పేర్కొన్నారు.రిజిస్ట్రీ సైతం కోర్టు సొంత చిహ్నన్నే వాడుతోందని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది. ‘సుప్రీంకోర్టు గేట్లు, తలుపులపై ఏముండాలనే విషయాన్ని మాకే వదిలేయండి. మీ ఆహార్యం చూస్తుంటే సన్యాసిలా ఉన్నారు, ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. వాటిపై దృష్టిపెట్టి సమాజ సేవ చేసుకోండి. కోర్టు గేట్ల విషయం మేం చూసుకుంటాం‘అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్ర హోంశాఖ నిబంధనలను పిటిషనర్ ప్రస్తావించినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. పిటిషన్లో విచారణార్హమైన అంశాలు లేవంటూ కొట్టివేసింది.గతంలో వేసిన పిటిషన్‌కు కొనసాగింపుకోర్టులకు రాజ్యాంగపరమైన గుర్తింపు వంటి అశోక చిహ్నం సుప్రీంకోర్టుకు ఏర్పాటు చేసేందుకు తగు ఆదేశాలు జారీ చేయాలంటూ వేణుగోపాల్ రాజ్యాంగంలోని ఆర్టీకల్ 32 ప్రకారం గతంలో ఒక రిట్ వేశారు. మార్చి 23న సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ అంశం పరిపాలనాపరమైనదని పేర్కొంటూ దీనిపై తగిన నోట్‌ను సంబంధిత అధికారికి పంపించాలని సెక్రటరీ జనరల్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాల పురోగతిని తెలపాలంటూ వేణుగోపాల్ జూలై 3న రిజిస్ట్రార్ ద్వారా మరో పిటిషన్ వేశారు. ఆ తర్వాత, రిజిస్ట్రార్ ఉత్తర్వును సవాల్ చేస్తూ చేసిన అప్పీలును మంగళవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏం ప్రదర్శించాలనేది తమ సొంత విషయమంటూ అప్పీల్‌ను కొట్టివేసింది. -
అది ఉత్తుత్తి పెళ్లి...
అమ్రోహా: ఒకే వ్యక్తిని ముగ్గురు పెళ్లాడిన వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, దీనిపై ఆన్లైన్లో పెద్ద దుమారమే చెలరేగింది. స్పందించిన యూపీ మహిళా సంక్షేమ కమిటీ(సీడబ్ల్యూసీ) అధికారులు ఆ ముగ్గురినీ సోమవారం పిలిపించారు. విచారణలో వారు చెప్పిన విషయాలను విని అధికారులు నోరెళ్లబెట్టారు. అదంతా వైరలయ్యేందుకు తీసుకున్న వీడియో మాత్రమేనని వారు అసలు విషయం వెల్లడించారు. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు తీసిన ప్రాంక్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. అయితే, తమపై ఆన్లైన్ ట్రోలింగ్ ఘోరంగా ఉందని వాపోయారు. అది నిజంగా పెళ్లేనంటూ అబద్ధం చెప్పినందుకు పశ్చాత్తాప పడుతున్నారు. ఇకనైనా వేధింపులను ఆపాలని వారు వేడుకున్నారు.ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు వీడియోలో కనిపించిన ముగ్గురిలో ఒకరు మైనర్ అంటూ తమకు మూడు రోజుల క్రితం అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు సీడబ్ల్యూసీ చైర్మన్ అతులేశ్ కుమార్ భరద్వాజ్ వివరించారు. ముగ్గురి నుంచి వాంగ్మూలాలను సేకరించామని, వీరిలో ఒకరు మైనర్ అని రూఢీ అయ్యిందని చెప్పారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామన్నారు. యూపీలోని అమ్రోహా జిల్లా ధోరియా గ్రామానికి చెందిన దేవిక, ఛావి అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు, వారి బంధువు మెహర్పూర్కు చెందిన ఆల్కా కలిసి శ్యాంపురి గ్రామానికి చెందిన వికాస్ అలియాస్ విక్కును హసన్‌పూర్‌లోని చాముండ ఆలయంలో వివాహమాడినట్లు ఆన్లైన్లో వీడియో ప్రత్యక్షమైంది.వీరు నలుగురూ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు, ఆన్లైన్లో బాగా ఫాలోయింగ్ ఉన్న వాళ్లు. ఆరు నెలలుగా వికాస్ ముగ్గురికీ భర్తగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నాడు. అయితే, ముగ్గురు యువతులు ఒక్కరినే వివాహమాడటం సనాతన ధర్మానికి విరుద్ధమంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, తాము మైనర్లమనీ, ఇష్టం వచ్చిన వారిని పెళ్లాడే హక్కు తమకుందని, పురాణాల్లోనూ ఇలాంటి ఉదాహరణలున్నాయంటూ వారు మొదట్లో కొట్టిపారేశారు.అదేవిధంగా, ముగ్గురు యువతులు, ఒక యువకుడి పెళ్లి తాను జరిపించలేదని చాముండ ఆలయ పూజారి స్పష్టం చేస్తున్నారు. వివాదాస్పద వీడియోలో ఉన్న ఆ నలుగురినీ ఈ నెల 23వ తేదీన పిలిపించి, వారి వయస్సును నిర్ధారించే పత్రాలను సమరి్పంచాలని, లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని కోరామని హసన్పూర్ సీనియర్ ఎస్సై అమిత్ కుమార్ తెలిపారు. అయితే, వారింకా వాటిని ఇవ్వలేదన్నారు. -
నీచమైన వ్యక్తి ప్రల్హాద్ జోషీ
న్యూఢిల్లీ: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రల్హాద్ జోషీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. అత్యాచారానికి పాల్పడిన వారికి అండగా నిలిచే వ్యక్తి, నీచమైన వ్యక్తి అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తిని విద్యా శాఖ మంత్రిగా నియమించడం ఏమిటని ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ ధ్వజమెత్తారు. మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి తన మంత్రివర్గంలోని ఎవరినైనా విద్యాశాఖ మంత్రిగా ఎంపిక చేసుకుని ఉండొచ్చు కానీ ‘అత్యాచారానికి పాల్పడిన వారిని రక్షించే’ వ్యక్తిని ఎంపిక చేసుకోవడం విచిత్రంగా ఉందని చెప్పారు. ‘‘ప్రల్హాద్ జోషీ అత్యంత నీచమైన వ్యక్తి. అత్యాచారానికి పాల్పడేవారికి రక్షణ అవసరమని చెప్పే వ్యక్తి కంటే నీచమైనవాడు మరొకరు ఉండరు. ఆయనే నేడు విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు. ప్రధానమంత్రి తీరు సరైంది కాదు. మంత్రివర్గంలో చాలామంది ఉండగా, వారిని కాదని ప్రల్హాద్ జోషీని ఎంచుకోవడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది’’ అని రాహుల్ పేర్కొన్నారు. బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన వారితో ప్రల్హాద్ జోషీ కలిసి ఉన్న పాత వీడియోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. -
‘దిల్ కా యాంగిల్’ మార్చుకోండి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెన్ జెడ్ తరాన్ని, వారి మనసులను గెలుచుకోవాలనుకుంటే కెమెరా యాంగిల్స్ కాకుండా ‘దిల్ కా యాంగిల్’మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా సూచించారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీ విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థుల వీపులపై పడే ప్రతి లాఠీ దెబ్బ వారి కంటే ఎక్కువగా ప్రభుత్వ ప్రతిష్టకే హాని కలిగిస్తుందని తేల్చి చెప్పారు. మంగళవారం లోక్‌సభలో పేపర్ లీక్ వ్యతిరేక బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగించి, లాఠీలతో విరుచుకుపడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.యువతుల దుస్తులు చింపేసి అవమానించడం, కనికరం లేకుండా కొట్టించడం ఏమిటని మండిపడ్డారు. దేశ యువతపై పెల్లెట్ గన్లు, ఏకే–47లతో కాల్పులు జరపడం రాక్షసత్వం కాదా? అని నిలదీశారు. ప్రభుత్వం దృష్టిలో విద్యార్థులు ఉగ్రవాదులా? అని ధ్వజమెత్తారు. ఈ రోజు ఈ ప్రశ్నలను కాంగ్రెస్ మాత్రమే కాదు, దేశం మొత్తం అడుగుతోందని అన్నారు. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.దేశంలోని యువతను ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని అడిగారు. వారి గొంతుకలను అణచివేసే హక్కు ఎవరు ఇచ్చారు? అంటూ దుయ్యబట్టారు. విద్యార్థులపై పెల్లెట్ గన్లతో దాడి చేయాలని ఎవరు ఆదేశాలు ఇచ్చారో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దేశమంతా ఇదే ప్రశ్న అడుగుతోందని వెల్లడించారు. మోదీ సత్య మార్గంలో నడవాలి పేపర్ లీకేజీలను అరికట్టడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనను ప్రియాంకా గాంధీ తోసిపుచ్చారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల పనితీరు ఇప్పటికే చాలా పేలవంగా ఉందని గుర్తుచేశారు. పార్లమెంట్లో ప్రతిపక్షాన్ని నిందించడం, డొల్ల రాజకీయ క్రీడలు ఆడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. నేటి కొత్త తరం ఎంతో అవగాహన కలిగి ఉందని, అబద్ధాలను గుర్తించగల అపారమైన సామర్థ్యాన్ని వారికి ఉందని వెల్లడించారు. యువత హృదయాలను గెలుచుకోవాలంటే ప్రధాని మోదీ సత్య మార్గంలో నడవాలని ప్రియాంకా గాంధీ సూచించారు. మోదీ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.‘‘నిజాన్ని అంగీకరించండి, బాధ్యత తీసుకోండి, పటిష్టమైన చర్యలు చేపట్టింది. నిపుణులను సంప్రదించండి. లోపాలకు తావులేని నూతన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయండి. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కలి్పంచేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలి. దేశంలో విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను విస్తరించాలి. అప్పుడే పిల్లలు ఉజ్వల భవిష్యత్తును కలలు కనగలరు’’అని స్పష్టంచేశారు. విద్యార్థులను బలవంతంగా వీధుల నుంచి తొలగించవచ్చేమో గానీ వారి ప్రశ్నలను మాత్రం తొలగించలేమని ప్రియాంకా గాంధీ తేల్చి చెప్పారు. -
పేపర్ లీక్ బిల్లు చరిత్రాత్మకం
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’చరిత్రాత్మకమని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు చట్టాన్ని తీసుకురావాలన్న అసంపూర్ణ కార్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024లో పూర్తి చేసిందని తెలిపారు. 2024 నాటి చట్టాన్ని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ బిల్లు విద్యార్థులు, యువత ప్రయోజనాలు కాపాడాలన్న ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా, మంగళవారం చర్చ ప్రారంభమైంది. మంత్రి జితేంద్ర సింగ్ చర్చకు శ్రీకారం చుట్టారు.ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల భారీ జరిమానా వంటి కఠినమైన శిక్షలు విధించేలా ‘పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’ను రూపొందించిన సంగతి తెలిసిందే. బిల్లుపై వివిధ పార్టీల సభ్యులు మాట్లాడారు. మంగళవారం అర్ధరాత్రి వరకు చర్చ కొనసాగింది. నిరసన వ్యక్తంచేసిన విద్యార్థులపై లాఠీచార్జీ చేయడాన్ని విపక్ష సభ్యులు తప్పుపట్టారు.ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అధికార పక్ష సభ్యులు బిల్లును సమరి్థంచారు. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. పేపర్ లీకేజీలను అరికట్టడానికి పటిష్టమైన చట్టం తీసుకొస్తుండడం కీలక పరిణామం అని వెల్లడించారు. అనంతరం చర్చ బుధవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యులది రాజకీయ ప్రసంగం: రిజిజు ప్రతిపక్షాలు పేపర్ లీక్ నిరోధక బిల్లు గురించి కాకుండా ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. మొత్తం చర్చ బిల్లు యోగ్యతపై కేంద్రీకృతమై ఉండాల్సిందని అన్నారు. ఆయన పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. విపక్ష సభ్యులు బిల్లు గురించి మాట్లాడలేదని, కేవలం రాజకీయాలు చేశారని అన్నారు. అందరూ రాజకీయ ప్రసంగాలు చేశారని ఆక్షేపించారు. సభలో ఇలా చేయడం సరైంది కాదన్నారు. -
ఇలాగైతే త్వరలోనే భారీ నిరసనతో స్పందిస్తాం: అభిజీత్ దీప్కే
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన భారీ నిరసన తర్వాత ప్రభుత్వం విద్యార్థులపై తీసుకుంటున్న చర్యలు, జరుగుతున్న పరిణామాలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. ‘‘విద్యార్థులను పోలీసులు వేధించడం కొనసాగితే, కాక్రోచ్ జనతా పార్టీ త్వరలో భారీ శాంతియుత నిరసనతో స్పందిస్తుంది. ప్రభుత్వం విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడం, వేధింపుల వేట కొనసాగించడాన్ని వెంటనే ఆపాలి’’ అంటూ ట్వీట్ చేశారు.మరోవైపు, తమ పోరాటం ఇంకా పూర్తికాలేదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు స్పష్టం చేశారు. ఆందోళన విరమించడం అంటే ఉద్యమం ముగిసినట్టుకాదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఇంతకుముందే తెలిపారు.సీజేపీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని, ఈ నిరసన ముగింపు "కేవలం ఆరంభం మాత్రమే" అని పేర్కొన్నారు.కేసులను వెనక్కి తీసుకోవాల్సిందే.. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధి సౌరవ్ దాస్ మంగళవారం సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలను విమర్శించారు. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల దర్యాప్తు కొనసాగించవచ్చని, అయితే ప్రస్తుతం ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.ఎక్స్‌లో చేసిన పోస్టులో సౌరవ్ దాస్ స్పందిస్తూ... ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్ఐఆర్లు ఉపసంహరించకుండా ఉండేందుకు సాకుగా ఉపయోగించే అవకాశం ఉందని అన్నారు. నిరసనకారులపై నమోదైన కేసులను వెనక్కి తీసుకోవడం సీజేపీ ప్రధాన డిమాండ్లలో ఒకటని గుర్తుచేశారు.అస్సాం, బిహార్ వంటి ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కేంద్రం సీజేపీకి ఇచ్చిన హామీని గౌరవిస్తూ ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. కోర్టు పోలీసు చర్యలు కొనసాగించాలని ఎక్కడా ఆదేశించలేదని చెప్పారు. మంగళవారాన్నే ఎఫ్ఐఆర్ల ఉపసంహరణకు గడువుగా పేర్కొంటూ, డిమాండ్ నెరవేరకపోతే సీజేపీ మళ్లీ ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.జూలై 25న కేంద్ర ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీ ప్రకారం ఎఫ్ఐఆర్లు ఉపసంహరించుకోవాలని, శాంతియుత ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ లక్ష్యంగా చేసుకోబోమని చెప్పిందని సౌరవ్ దాస్ తెలిపారు. అయితే సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు ఆ హామీకి విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.కేంద్రం తరఫున వాదించిన న్యాయవాదులు కూడా ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ హామీ ఆధారంగానే సీజేపీ దేశవ్యాప్త నిరసనను విరమించుకుందని చెప్పారు. -
జంతర్ మంతర్ నుంచి నేరుగా పెళ్లి మండపానికి దీప్కే?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (30)కి వరుసగా పెళ్లి సంబంధాలు వస్తున్నాయని ఆయన తల్లిదండ్రులు తెలిపారు. అభిజీత్ దిప్కే తల్లి అనితా దీప్కే మీడియాతో మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై సీజేపీ ఆందోళన ప్రారంభం కాకముందు కూడా పెళ్లి సంబంధాలు కొన్ని వచ్చాయని, జంతర్ మంతర్ వద్ద ఆందోళన తర్వాత వాటి సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు. అభిజీత్ బోస్టన్‌లో ఉన్న సమయంలో అతడి గురించి పెళ్లి విషయం గురించి కుటుంబ సభ్యులు మాట్లాడారని, కానీ తన ప్లాన్స్ గురించి ఆయన పెద్దగా చెప్పలేదని ఆమె తెలిపారు. "దాని గురించి ఆయన ఎక్కువగా మాట్లాడలేదు. చిరునవ్వు మాత్రమే నవ్వాడు. తల్లిదండ్రులుగా పెళ్లి చేసుకోవాలని మేము ఒత్తిడి చేస్తున్నాం. ఇంకొన్ని రోజుల్లో ఆయన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మళ్లీ ప్రస్తావించి, తుది నిర్ణయం ఆయనకే వదిలేస్తాం" అని ఆమె తెలిపారు. ఇప్పుడు దీప్కే అంటే చాలా మంది అమ్మాయిలు పడిచస్తుండడంతో ఆయన జంతర్ మంతర్ నుంచి నేరుగా పెళ్లి మండపానికే వెళ్తాడేమోనని నెటినన్లు అంటున్నారు.ఉద్యమం కొనసాగుతుంది..సీజేపీ ఉద్యమం కొనసాగుతుందని ఆ సంస్థ నేతలు అంటున్నారు. ఆందోళన విరమించడం ఉద్యమానికి ముగింపు కాదని దీప్కే తెలిపారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో, సీజేపీ "ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది" అని పేర్కొంటూ, నిరసన ముగింపు "కేవలం ఆరంభం మాత్రమే" అని చెప్పారు.పరీక్షల వివాదం సమయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే బాధిత కుటుంబాలకు సాధ్యమైనంత గరిష్ఠ పరిహారం అందిస్తామని కేంద్రం తెలిపింది.విద్యా సంస్కరణల కోసం సీజేపీ ప్రచారం కొనసాగిస్తుందని, ఉద్యమాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్తామని కూడా సీజేపీ నాయకులు సూచించారు. సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థ, పాలనలో సంస్కరణల కోసం ప్రయత్నిస్తూనే యువతను ప్రభావితం చేసే అంశాలను సంస్థ ప్రస్తావిస్తుందని చెప్పారు.ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించడం ప్రస్తుతం తమ ప్రాధాన్యం కాదని, యువత సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించేలా చూడటంపైనే దృష్టి ఉందని కూడా దాస్ తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాన్ని సీజేపీ నాయకుడు రాంకా పూర్తిగా తోసిపుచ్చనప్పటికీ, దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఒత్తిడి కొనసాగించడమే తక్షణ లక్ష్యమని చెప్పారు. -
డీఎస్సీ పేపర్ లీకేజీపై సీబీఐ దర్యాప్తు జరగాలి: ఎంపీ గురుమూర్తి
సాక్షి,ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన డీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'పై జరిగిన చర్చలో ఆయన వైఎస్సార్సీపీ తరఫున పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, దీనివల్ల ఎంతోమంది అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలకు ఆస్కారం ఉన్నప్పటికీ, ఈ మెగా రిక్రూట్మెంట్పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేయడం లేదని మండిపడ్డారు. విద్యాశాఖలో టీచర్ పోస్టులను అడ్డగోలుగా అమ్ముకున్నారని, దీనికి సంబంధించిన ఆడియో సంభాషణలు కూడా బయటపడ్డాయని సభ దృష్టికి తెచ్చారు.ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.డీఎస్సీ లీకేజ్ కేసులో ముందుకు వెళ్లొద్దని పోలీసులపై ఒత్తిడి తెచ్చారని, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయని గురుమూర్తి ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా కూడా ఉన్నతాధికారుల లేదా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిన అత్యంత దారుణమైన పరిస్థితి నెలకొందని విమర్శించారు. కాబట్టి, కేంద్రం తీసుకొస్తున్న ఈ యాంటీ పేపర్ లీక్ చట్టం కిందికి అన్ని రాష్ట్రాలను, అన్ని రకాల పరీక్షలను తీసుకురావాలని ఆయన కోరారు.గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడా అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా, కేవలం మెరిట్ ప్రాతిపదికన లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేశామని గురుమూర్తి గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతి రిక్రూట్‌మెంట్‌లోనూ అక్రమాలు జరుగుతున్నాయని, చివరకు స్పోర్ట్స్ కోటా నియామకాల్లో సైతం భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటాకు నిర్వహించాల్సిన అర్హత పరీక్షలను రద్దు చేసి, కనీసం పరీక్ష పాస్ కాని 384 మందికి అక్రమ మార్గంలో ఉద్యోగాలు ఇచ్చారని ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై కేంద్రం తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని కోరారు. -
రాత్రంతా ప్రియురాలి మృతదేహంతోనే ప్రయాణం.. ఏకంగా 350 కి.మీ
ముంబై: ప్రియురాలికి మరొక వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉందని అనుమానించి, ఆమెను గొంతు నులిమి చంపేశాడు 40 ఏళ్ల ఓ వ్యక్తి. అనంతరం ఆమె మృతదేహాన్ని కారులో పెట్టుకుని కొల్హాపూర్ నుంచి థానే వరకు 350 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు.నిందితుడి పేరు ప్రకాశ్ ఆనంద పాటిల్ (40). ఇతడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా షిర్గావ్ గ్రామానికి చెందినవాడు. బాధితురాలు సురేఖ శివాజినే ఆరే (40). ఆమె అదే గ్రామానికి చెందిన వితంతువు. ఆమెతో పాటిల్ రిలేషన్షిప్లో ఉన్నాడు.పోలీసుల సమాచారం ప్రకారం.. సురేఖకు మరొక వ్యక్తితో సంబంధం ఉందని పాటిల్ అనుమానించాడు. ఆదివారం ఉదయం షిర్గావ్లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆమెను గొంతు నులిమి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్య తర్వాత నిందితుడు మృతదేహాన్ని చుట్టి కారులో ఉంచి, నేరం జరిగిన ప్రాంతం నుంచి 350 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న థానే జిల్లా భివాండిలోని కసేలీ వైపు రాత్రంతా కారు నడిపాడు.సోమవారం ఉదయం భివాండిలో ఓ స్థానికుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. వాహనాన్ని గుర్తించి పాటిల్‌ను అదుపులోకి తీసుకుని, కారులో ఉన్న మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 103(1) కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కోసం నేరం జరిగిన ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. థానే చేరుకున్న తర్వాత మృతదేహంతో నిందితుడు ఏం చేయాలనుకున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. -
కంగనా రనౌత్‌లా మారిన సాయోని ఘోష్ : ఏకిపారేస్తున్న నెటిజన్లు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా, మమతకు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన టీఎంసీ ఎంపీ, నటి సాయోని ఘోష్ (Saayoni Ghosh), రెబల్ వర్గంలోకి చేరిన తరువాత మరింతగా వార్తల్లో నిలుస్తున్నారు. బీజేపీపై తీవ్ర విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే సాయోని ఘోష్ తాజాగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సీజేపీ ఆందోళన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్రప్రభుత్వానికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన "పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026" (పేపర్ లీకేజీల నిరోధక బిల్లు)కి మద్దతుగా కేంద్రానికి మద్దతుగా గళమెత్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చకు కేంద్ర ప్రభుత్వం ఆమెను ప్రతిపాదన వక్తగా ఎంపిక చేసింది.ఈ సందర్బంగా లోక్‌సభలో విపక్షాల ఆందోళనల మధ్య బిల్లుపై చర్చ ఆగిపోవడంపై సాయోని ఘోష్ మండిపడ్డారు. మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కూడా విపక్షాలు చర్చ నుంచి పారిపోతున్నారంటూ విమర్శించారు. సభలో ప్రతి నిమిషం చాలా విలువైంది. దేశంలోని లక్షలాది మంది విద్యార్థులకు ఈ కొత్త బిల్లులోని సంస్కరణల గురించి తెలిసే హక్కు ఉందన్నారు. పార్లమెంట్ అనేది రాజకీయ ఘర్షణలకు వేదిక కాకూడదని, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో సమిష్టి చర్చలు జరగాలని ఆమె పిలుపునిచ్చారు. విపక్షాలు కేవలం రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.She was an intellectual, gave brilliant speeches when she was in TMCAs soon as she flipped and became “ Chaddi” , she started sounding like Kangana Ranaut.Aak Thoo @sayani06 , ashamed to have ever praised you. pic.twitter.com/QuINjM4UPR— Roshan Rai (@RoshanKrRaii) July 27, 2026 2024 లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్ నుంచి గెలిచిన సాయోని, పార్లమెంట్లో కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడేవారు. తాము రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని పోరాడతాం.. చేతుల్లో కత్తులు పట్టుకుని కాదంటూ చేసిన వ్యాఖ్యలు గతంలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఎన్డీఏ మద్దతు దారుగా ఇప్పుడు అదే సాయోని ఘోష్, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను గట్టిగా సమర్థిస్తూ ప్రతిపక్షాలపై విరుచుకుపడటం గమనార్హం.నెటిజన్లు స్పందనఆమె తాజా కామెంట్లపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె ప్రవర్తన బీజేపీ గురించేకాదు ఆమె వ్యక్తిత్వాన్ని చెప్పకనే చెబుతోందని , అసలు నైతిక విలువలే లేవని మండిపడ్డారు. ఇలాంటి నీచమైన వారిని మమతా బెనర్జీ పెంచి పోషించారని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: చెఫ్ అవుదామనుకుని స్టార్ హీరో : కళ్లు చెదిరే కార్లు, ఆస్తులుఆమె ఎప్పుడూ అలాగే ఉంటుంది! తన పార్టీకి సంబంధించి తనకు ఉన్న ప్రస్తుత అవగాహన సరైనదని ఆమె నిజంగా నమ్మితే, ఆమె ఆలోచన సరైనదే కావచ్చు. కానీ అందుకు ఆమెకు అత్యున్నత స్థాయి నిజాయితీ, చిత్తశుద్ధి అవసరమన్నారు మరొకరు. టీఎంసీ ఎంపీగా గెలిచి, ఇపుడు వ్యతిరేకంగా మారడం మీనియోజకవర్గ ప్రజలు పన్ను చెల్లింపుదారులకు , ఓటర్లకు చేసిన ద్రోహం అని ఒకరు కామెంట్ చేశారు. అంతేకాదు ఆమె 12వ తరగతి అతి కష్టమ్మీద పాస్ అయ్యింది, ఆమె మాటల్లో దూకుడు ఉండేది కానీ, ఆమె మేధావి కాదు అని మరొకరు మండిపడ్డారు. ఇదీ చదవండి: షాకింగ్ : భార్యకు ఉరేసి, అత్తామామలకు వీడియో కాల్!ఆమెకు, ఆమె లాంటి వారికి ఎలాంటి చిత్తశుద్ధి గానీ, వ్యక్తిత్వం గానీ లేవు. సిగ్గులేని అవకాశవాదులు. పార్టీ మారిన వెంటనే ఆమె భావజాలం, సూత్రాలు అన్నీ మారిపోయాయా? బహుశా ఆమెకు మొదట్నుంచే ఎలాంటి బలమైన నమ్మకాలు లేవేమో. లేకపోతే అంత తీవ్రంగా తన ఆత్మను ఎలా అమ్ముకోగలరు? మీలాంటి భజనపరులను 'ద్రోహులు' (ధోకేబాజ్) అంటారు.చాలా మంది అవకాశవాదులు మమత పని అయిపోయిందని భావిస్తున్నారు. ఆమె విధానాలు లేదా కొన్ని వర్గాల పట్ల ఆమె అనుసరించే ధోరణితో విభేదాలు ఉండవచ్చు, కానీ బెంగాల్ కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్నప్పుడే మమత తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అలాగే, ఆమె సొంత పార్టీవారే ఆమెకు ఎలా ద్రోహం చేశారో ప్రజలు గుర్తుంచు కుంటారన్నారు మరొకరు.అంత గొప్పవారైతే, రాజీనామా చేసి బీజేపీ టికెట్‌పై మళ్లీ ఎన్నికై ఉండాల్సింది అని ఒకరంటే, నిజానికి ఆమె ఒక పరిణతి చెందిన నటి. అప్పుడు నటించింది, ఇప్పుడు కూడా నటిస్తోంది. ఆమెకు కేవలం సరదాగా గడపాలని మాత్రమే ఉందనంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.కాగా ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో TMC ఘోర పరాజయం పాలైన తర్వాత, మమతా బెనర్జీపై తిరుగు బాటు చేసి ఆమె పార్టీని వీడారు. ఆ తర్వాత ఆమె కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP/NCPI)లో చేరి, ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏకి మద్దతుదారుగా మారారు. -
కంగనా రనౌత్ వ్యాఖ్యలకు కాక్రోచ్ జనతా పార్టీ కౌంటర్
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాఖ్యలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చింది. కంగనా వ్యాఖ్యలను ఆమె పార్టీ కూడా సీరియస్‌గా తీసుకోదని సౌరవ్ దాస్ అన్నారు. నేతలు ఉపయోగించే భాష గౌరవప్రదంగా ఉండాలని కోరారు. దేశ ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచేలా జెన్‌జీ చేసింది.అంతకుముందు సీజేపీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిరసన వీడియోలు వాంతి వచ్చేలా ఉన్నాయని సోషల్ మీడియా పోస్టులో అన్నారు. కాక్రోచెస్ మాట్లాడే విధానం,వాడుతున్న భాష అసభ్యంగా ఉన్నాయి. 75ఏళ్ల ప్రధాని, ఆయన తల్లిపైనా నోరుపారేసుకున్నారు. అలా మాట్లాడే వారిని ఏ కోణంలో విద్యార్థులుగా చూడాలి’అని పోస్టులో పేర్కొంది. కంగనా చేసిన వ్యాఖ్యలపై సీజేపీ పైవిధంగా స్పందించింది. -
జులైలో వర్షాలు ఊరటనిచ్చినా.. ఏం జరిగిందో తెలుసా?
భారత్‌లో జులై నెల దాదాపు సాధారణ వర్షపాతంతో ముగిసే అవకాశం ఉన్నప్పటికీ, నైరుతి రుతుపవనాల సీజన్ మొత్తం మీద వర్షపాత లోటు 15 శాతం వద్దే కొనసాగనుంది. జులైలో వర్షపాతం తీవ్ర హెచ్చుతగ్గులు చూసింది. తొలి వారం అత్యధిక వర్షాలు, రెండో వారం పొడి వాతావరణం, జూలై 21 నుంచి 24 మధ్య మరోసారి భారీ వర్షాలు కురవడంతో నెలవారీ వర్షపాత లోటు తొలగిపోయింది."జులైలో ఇప్పటివరకు వర్షపాతం స్వల్పంగా సాధారణ స్థాయిలోనే ఉంది. నెల ముగిసే నాటికి దాదాపు సాధారణ వర్షపాతంతో ముగిసే అవకాశం ఉంది. నెలాఖరు వరకు రోజుకు 9-9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది" అని స్కైమెట్ వాతావరణ సంస్థ తెలిపింది.జూలై తొలి వారంలో భారీ వర్షాలతో మాన్సూన్ బలంగా ప్రారంభమైంది. దీంతో సీజనల్ వర్షపాత లోటు 40 శాతం నుంచి 14 శాతానికి తగ్గింది. అయితే రెండో వారంలో దీర్ఘకాలం పొడి వాతావరణం కొనసాగడంతో సీజనల్ లోటు మళ్లీ 24శాతానికి పెరిగింది.జులై 21 నుంచి 24 మధ్య దేశవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురవడంతో పరిస్థితి మళ్లీ మెరుగుపడింది. జూలై నెల వర్షపాత లోటు పూర్తిగా తొలగిపోయి, సీజనల్ లోటు 15 శాతానికి తగ్గింది. నెలాఖరుకు కూడా ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది.బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, రాజస్థాన్‌పై ఉన్న చక్రవాత ప్రసరణ ప్రభావంతో నెల చివరి రోజుల్లో పెద్ద స్థాయిలో వర్షపాత లోటు ఏర్పడే అవకాశం లేదని సంస్థ తెలిపింది. జులైలో వర్షపాతం మెరుగుపడినప్పటికీ, వర్షాకాలం మొత్తం మీద ఉన్న 15 శాతం లోటు సీజన్ రెండో భాగంలో భర్తీ అవుతుందనే స్పష్టమైన సంకేతాలు కనిపించడం లేదని స్కైమెట్ పేర్కొంది.భవిష్యత్ వర్షపాత పరిస్థితి ప్రధానంగా బలపడుతున్న ఎల్‌నినో, ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఓడీ) పరిణామాలపై ఆధారపడి ఉంటుందని సంస్థ తెలిపింది. ఇవి భారత వర్షాకాలంపై భారీగా ప్రభావం చూపే రెండు ప్రధాన వాతావరణ కారకాలు. "సీజనల్ వర్షపాత పరిస్థితిపై మరింత స్పష్టత ఆగస్టు తొలి వారంలో వచ్చే అవకాశం ఉంది" అని స్కైమెట్ తెలిపింది.రానున్న 10 రోజుల్లో తూర్పు, ఈశాన్య, వాయవ్య భారత ప్రాంతాల్లో విస్తృతంగా, సమయానుకూలంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు మధ్య భారత ప్రాంతాల్లో మాన్సూన్ బలహీన దశ కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో, ముఖ్యంగా అంతర్గత ప్రాంతాలు, ఆగ్నేయ ప్రాంతాల్లో వర్షాల కొరత కొనసాగనుంది. ఈ కాలంలో గణనీయమైన వర్షాలు కురిసే సూచనలు కనిపించడం లేదు. -
ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన ఈ లేఖలో కోరారు. కావేరీ నదిపై కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు మురుగునీటి నిల్వ/డ్యామ్ ప్రాజెక్టుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆ సమాధానం ఇచ్చారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి మాట్లాడుతూ, కావేరీ నదిపై ఏదైనా నిర్మాణాన్ని చేపట్టే ముందు కర్ణాటక రాష్ట్రం ఇతర దిగువ రాష్ట్రాల (తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి) అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సుప్రీంకోర్టు 2018 నాటి తీర్పులో స్పష్టంగా ఎక్కడా పేర్కొనలేదని సమాధానమిచ్చారు.అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ సమాధానం తీవ్ర నిరాశకు గురిచేసిందని సీఎం విజయ్ పేర్కొన్నారు. అంతరాష్ట్ర నీటి వివాదాలలో ఇప్పటికే స్థిరపడిన చట్టాలు మరియు చట్టపరమైన సూత్రాలను పరిశీలించకుండానే కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారని విజయ్ విమర్శించారు. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరిగిన ఆలమట్టి డ్యామ్ వివాదంలో, దిగువన ఉండే రాష్ట్రం యొక్క అనుమతి ఖచ్చితంగా అవసరమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.కావేరీ నీటి వివాదాల ట్రిబ్యునల్ అవార్డు, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఉంటే తప్ప, మేకేదాటు డ్యామ్ ప్రాజెక్టుకు ఎటువంటి పరిపాలనాపరమైన లేదా చట్టపరమైన అనుమతులు మంజూరు చేయకుండా చూడాలని సీఎం విజయ్ ప్రధానమంత్రిని కోరారు. అలాగే, 2018లో సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ తీర్పును సమర్థించినప్పుడు, రాష్ట్రాలు తమ పరిధిలోని నీటిని ట్రిబ్యునల్ ఆదేశాలకు లోబడి మాత్రమే నియంత్రించుకోవచ్చని స్పష్టం చేసిందని పేర్కొన్నారు.గతంలో కేరళకు చెందిన పాంబార్ హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విషయంలో కూడా దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉమ్మడి ఒప్పందాలు అవసరమని ట్రిబ్యునల్ పేర్కొన్న విషయాన్ని విజయ్ గుర్తు చేశారు. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యసభలో ఇచ్చిన సమాధానాన్ని ఉపసంహరించుకోవాలని, దిగువ రాష్ట్రాల హక్కులను రక్షించాలని ఈ ప్రాజెక్టుపై సమగ్ర చట్టపరమైన, సాంకేతిక పరిశీలన జరపాలని డిమాండ్ చేశారు. -
జంతర్ మంతర్ వద్ద జులై 31న మరో నిరసన
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీ సమయంలో పోలీసులపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీ మాజీ పోలీసు అధికారులు జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగనున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో సంఘ వ్యతిరేక శక్తులు చొరబడి పోలీసు సిబ్బందిపై దాడి చేశాయని, ఆ ఘటనలో 100 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. భద్రతా సిబ్బంది హద్దులు దాటారని నిరసనకారులు ఆరోపిస్తుండగా, సంఘ వ్యతిరేక శక్తులు తమపై దాడి చేశాయని పోలీసులు చెబుతున్నారు.ఇప్పుడు.. పదవీ విరమణ చేసిన అధికారుల సంఘం ఢిల్లీ పోలీసు ఫెడరేషన్ జులై 31న జంతర్ మంతర్ వద్ద ఒక రోజు నిరసన చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ అనురాగ్ కుమార్‌కు లేఖ రాసింది. తమ దరఖాస్తులో ఫెడరేషన్ ఇలా పేర్కొంది.. ‘‘జూలై 20న జంతర్ మంతర్ పరిసరాల్లో చట్టబద్ధ విధులు నిర్వహిస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో పోలీసు, పారామిలిటరీ దళాల అధికారులు, సిబ్బంది గాయపడ్డారు. పోలీసు దళానికి సంఘీభావం తెలియజేసేందుకు జులై 31న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా చేపట్టేందుకు అనుమతి ఇవ్వండి’’ అని కోరింది. శాంతి భద్రతలు కాపాడే సమయంలో భద్రతా సిబ్బంది చేసిన త్యాగాలను ప్రస్తావించేందుకు ఈ ధర్నాకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ ధర్నాను పదవీ విరమణ చేసిన ఢిల్లీ పోలీసు సిబ్బంది అంతా కలిసి చట్టాన్ని గౌరవించే పౌరుల తరఫున నిర్వహిస్తున్నామని, ఇది పూర్తిగా శాంతియుతంగా, అహింసాత్మకంగా సాగుతుందని ఫెడరేషన్ తెలిపింది.మరోవైపు, జులై 20న జరిగిన పోలీసు చర్యపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. "నిరసనల సమయంలో పోలీసులకు కొత్త ప్రోటోకాల్ అవసరం" అని సుప్రీంకోర్టు పేర్కొంది. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలోని విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసులు గతంలో నిర్దేశించిన నిబంధనలు పాటించలేదని కోర్టు సూచించింది. -
ఏసీ రైలు బోగీలో దీప ధూపాలతో పూజ : నెటిజన్లు ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ : రైలు ప్రయాణంలో జరిగిన ఒక వింతలు, విడ్డూరలాలతో ప్రమాదకరమైన వీడియోలు ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిపోయాయి. కదులుతున్న రైలు ఏసీ బోగీలో ఒక ప్రయాణీకుడు నూనె ప్రమిదలో దీపారాధన, ధూపంతో పూజలు చేసిన వింత సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోప్రకారం బనియన్, ధోతీ ధరించిన వ్యక్తి రైలు ఏసీ కంపార్ట్మెంట్లోని అప్పర్ బెర్త్‌పై మత కార్యక్రమాలు నిర్వహించాడు. ఏకంగా ధూపదీప నైవేద్యాలతో చేతులు జోడించి పూజ చేసిన వైనం తోటి ప్రయాణీకుల్లో అలజడి రేపింది. ఇది ప్రయాణికుల భద్రతకు తీవ్ర ముప్పు అని, మంటలు లేదా పొగ కారణంగా ఫైర్ అలారం మోగే ప్రమాదం ఉందని తోటి ప్రయాణికులు వారించారు.వీడియో తీస్తున్న ప్రయాణికుడు ఆ వ్యక్తిని "పండిత్ జీ" అని వరుసగా పిలుస్తూ ప్రశ్నించి నప్పటికీ, ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా పూజలోనే మునిగిపోయాడు. ఆయన తమతో వచ్చిన పండితుడు కాదని మిగిలిన ప్యాసింజెర్స్ కూడా చెప్పారు. అనంతరంధూపం నుంచి వచ్చే పొగ వల్ల ఏసీ బోగీలోని 'ఫైర్ అలారమ్' మోగే అవకాశం ఉందనీ, పైగా వెలుగుతున్న ప్రమిద వల్ల రైలులో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకునే ప్రమాదం ఉందని గట్టిగా హెచ్చరించాడు.ఇదీ చదవండి: రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!🚆A video circulating on social media shows a passenger performing prayers on the upper berth of an AC train coach while lighting incense sticks and an oil lamp.A fellow passenger reportedly intervened, explaining that such acts can be dangerous. Smoke may trigger the train's… pic.twitter.com/79SrmBnAdW— Jharkhand Rail Users (@JharkhandRail) July 26, 2026నెటిజన్ల ఆగ్రహంఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రైల్వే భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు: మత స్వేచ్ఛ వేరు, భద్రత వేరు, ఎవరి నమ్మకాలు, ఆచారాలు వారికి ఉన్నప్పటికీ, వందలమంది ప్రయాణించే ప్రజా రవాణా వ్యవస్థల్లో ఇలాంటి నిప్పుతో కూడిన పూజలు చేయడం అత్యంత ప్రమాదకరమని నెటిజన్లు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఏడేళ్లు భర్త వేళ్లు కొరుకుతూ...చివరకు ‘ఐ లవ్యూ’ చెప్పాడు!రైల్వే మంత్రిత్వ శాఖ (@RailMinIndia) వెంటనే ఈ విషయంపై దృష్టి సారించి, ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీని వలన ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఇతనిపై భారీగా జరిమానాతోపాటు, రైలు ప్రయాణాలు చేయకుండా నిషేధించి జైలుకు పంపాలని పలువురు కామెంట్ చేశారు.ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.ఇదీ చదవండి: గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్‌కు హ్యాట్సాఫ్ -
ధర్మేంద్రను తొలగించి ప్రధానికి కాపాడారు.. అఖిలేష్
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూఎన్నో ఎంట్రన్స్ పేపర్లు, ఉద్యోగ పరీక్షల పేపర్లు లీకయ్యాయిపేపర్ లీకేజ్‌కు పాల్పడిన ముఠా రూ. 10 కోట్లు చెల్లించాలిలీకేజ్కు పాల్పడిన నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్షపేపర్ లీకేజ్‌ల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయబోతున్నాంఈ బిల్లు ద్వారా బాధితులకు సత్వరం న్యాయం జరుగుతుంది. అఖిలేష్ యాదవ్ కామెంట్స్ యువత కేంద్రం మెడలు వంచింది.గతంలో రైతులు కూడా ఈ విధంగానే చేశారుధర్మేంద్రను తొలగించి ప్రధానిని కాపాడారుఎన్డీఏ హయాంలో అనేకసార్లు పేపర్లీకేజ్లు ఎన్డీఏ హయాంలోనే రామ్‌మందిర్‌లో చోరీ జరిగింది -
షాకింగ్ : భార్యకు ఉరేసి, అత్తామామలకు వీడియో కాల్!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో దిగ్భాంతి రేపే అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో 23 ఏళ్ల భార్యను భార్యను ఉరివేసి హత్య చేశాడు. అతి దారుణంగా హత్య చేయడమే కాకుండా, ఆమె ప్రాణాలు విడుస్తున్న దృశ్యాలను రికార్డు చేసి, ఆ వీడియోను బంధువులకు, స్నేహితులకు పంపిన ఘోరాన్ని అత్తమామలకు వీడియో కాల్ చేసి చూపించిన కిరాకత ఘటన కలకలం రేపింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మృతురాలిని భాగ్యశ్రీ జిగళూర్ (23)గా, నిందితుడైన ఆమె భర్తను ప్రవీణ్ జిగళూర్ (28)గా పోలీసులు గుర్తించారు. ఇంట్లో గొడవ జరిగిన సమయంలో ప్రవీణ్ ముందుగా భాగ్యశ్రీపై దుంగతో దాడి చేశాడు. ఆ తర్వాత ఆమెను ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేశాడు. భాగ్యశ్రీ ఉరితాడుకు వేలాడుతూ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలో, ప్రవీణ్ ఆ ఘోరాన్ని వీడియో రికార్డు చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి, కూతురు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటాన్ని వారికి చూపించాడు. అంతేకాదు ఆ వీడియోను పలువురికి షేర్ కూడా చేశాడు.ఈ ఘటన బాగల్కోట్ జిల్లా గలగలి గ్రామంలోని వారి నివాసంలో చోటుచేసుకుంది.ఇదీ చదవండి: గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్‌కు హ్యాట్సాఫ్గత కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో భాగ్యశ్రీ రెండు నెలల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది. ఇకపై ఎలాంటి గొడవలు లేకుండా కలిసి ఉందామని, గొడవలు పడనని నమ్మబలికి ప్రవీణ్ ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. అయితే, ఇంటికి తిరిగి వచ్చిన ఆ రోజే ఆమెను ఈ రకంగా దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న బిళగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇదీ చదవండి: ఏడేళ్లు భర్త వేళ్లు కొరుకుతూ...చివరకు ‘ఐ లవ్యూ’ చెప్పాడు!ఇదీ చదవండి: రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ! -
NEET నిరసన కేసుల్లో సుప్రీం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: నీట్ నిరసనల కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జంతర్ మంతర్‌తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనల్లో అరెస్టైన, అదుపులోకి తీసుకున్న మైనర్లను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. 18 ఏళ్లలోపు వాళ్లతో పాటు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేని వారిని తక్షణమే విడుదల చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ల విషయంలో తదుపరి బలవంతపు చర్యలు (coercive action) తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.వాళ్లకు వర్తించదుప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే క్రిమినల్ నేపథ్యం ఉన్నవారికి ఈ రక్షణ వర్తించదని స్పష్టం చేసింది. నిరసనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఒకే విధంగా చూడలేమని, మైనర్లు, గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని విద్యార్థుల విషయంలో ప్రత్యేకంగా పరిశీలన అవసరమని కోర్టు అభిప్రాయపడింది.FIRలపై తాత్కాలిక రక్షణజంతర్ మంతర్‌లో CJP నేతృత్వంలో జరిగిన నిరసనలు, ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసులపై కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇప్పటికే అరెస్టులు, నిర్బంధాలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఈ ఆదేశాలు తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించనున్నాయి.పోలీసుల చర్యలపై విచారణకు సంకేతాలువిద్యార్థులపై పోలీసులు అతిగా బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీతో దర్యాప్తు జరిపించే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ విచారణలో పోలీసులపై వచ్చిన ఆరోపణలతో పాటు.. నిరసనకారుల నుంచి పోలీసులపై జరిగిన దాడుల ఆరోపణలను కూడా పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.కేంద్రం, ఏడు రాష్ట్రాలకు నోటీసులుఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర, బిహార్, అసోం, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల నిరసనల సమయంలో నమోదైన కేసులు, పోలీసు చర్యలు, అరెస్టులపై ఆయా ప్రభుత్వాల నుంచి వివరణ కోరింది.విద్యార్థి ఉద్యమానికి కీలక మలుపునీట్ పేపర్ లీక్ ఆరోపణలపై ప్రారంభమైన ఉద్యమంలో పలువురు విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. అరెస్టులు, పోలీసు చర్యలపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు విద్యార్థులకు కొంత ఊరటనిచ్చాయి. అయితే క్రిమినల్ నేపథ్యం ఉన్నవారిపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేయడంతో.. ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. -
ప్రధానికి మాజీ ఐఏఎస్ వింత విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ప్రభుత్వ సేవలో తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచలేకపోతున్నానంటూ ఏడేళ్ల క్రితం రాజీనామా సమర్పించిన మాజీ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపినాథన్ దానిని వెంటనే ఆమోదించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మరోసారి కోరారు. ‘ఎక్స్’ వేదికగా ప్రధానిని ట్యాగ్ చేస్తూ ఆయన ఈ అభ్యర్థన చేశారు. ‘ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీ గారూ.. మీరు ఇప్పుడు రాజీనామాలు ఆమోదించడం ప్రారంభించారు కాబట్టి, దయచేసి నా రాజీనామాను కూడా ఆమోదించండి. దీనికి ఇప్పటికే ఏడేళ్లు పూర్తయ్యాయి’ అని ఆయన పేర్కొన్నారు.జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన ఆర్టికల్ 370 పరిణామాల నేపథ్యంలో, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ 2012 బ్యాచ్‌కు చెందిన ఏజీఎండీయూటీ కేడర్ ఐఏఎస్ అధికారి గోపినాథన్ 2019లో తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ఇన్నేళ్లు గడిచినా కేంద్ర ప్రభుత్వం ఆయన రాజీనామాను ఇప్పటివరకు ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో ఆయన.. తనకు గత ఏడేళ్లుగా ఎలాంటి జీతం అందలేదని, సస్పెన్షన్‌కు గురికాలేదని, కేవలం తన ఫైల్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తొక్కిపెట్టిందని విమర్శించారు.గతంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తనకు నోటీసులు జారీ చేస్తూ.. సర్వీస్‌లో ఉండగానే ప్రభుత్వాన్ని విమర్శించినందున మీ పే-స్కేల్ తగ్గిస్తామని తెలిపిందని, కానీ తనకు ఎటువంటి జీతం అందనప్పుడు పే-స్కేల్ కోత ఎలా వర్తిస్తుందని ఆయన గతంలో ప్రశ్నించారు. ఇదే సమయంలో రాజీనామా చేసిన పలువురు అధికారుల రాజీనామాలు ఇప్పటికే ఆమోదం పొందగా, తన ఫైల్ మాత్రం హోంశాఖ వద్దే పెండింగ్‌లో ఉండటం గమనార్హంమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది. -
నిర్మాణాత్మక రాజకీయాలు కావాలి!
ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే రాజకీయాలు పక్షపాతాన్ని అధిగమించాలి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు జవాబు దారీగా ఉండటం, పారదర్శకంగా పని చేయడం, ప్రజల ప్రయోజనాలను అన్నింటికంటే ముందు ఉంచడం కూడా అంతే ముఖ్యమైన అంశాలు. ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం అత్యంత విలువైన సంపద. ఒకసారి ఆ విశ్వాసం దెబ్బతింటే దానిని తిరిగి సంపాదించడం చాలా కష్టం.దేశంలో ఏదైనా పెద్ద ప్రజా వివాదం, అవినీతి ఆరోపణ లేదా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సంఘటన వెలుగులోకి వచ్చిన ప్రతిసారి దాదాపు ఒకే పరిస్థితి కనిపిస్తున్నది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయి. పార్లమెంట్, శాసనసభల సమావేశాలు వాగ్వాదాలతో స్తంభిస్తాయి. టెలివిజన్ చర్చలు రోజంతా వేడెక్కుతాయి. సోషల్ మీడియాలో కూడా తీవ్ర వాదోపవాదాలు సాగుతాయి. ప్రజల్లో కొంతకాలం ఆగ్రహం వ్యక్తమవుతుంది. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ చర్చలు తగ్గిపోతాయి. వార్తల్లో కొత్త అంశాలు వస్తాయి. చివరకు అసలు సమస్య మాత్రం అలాగే మిగిలిపోతుంది. ఈ పరిస్థితి ప్రజల్లో వ్యవస్థపై నమ్మకాన్ని క్రమంగా తగ్గిస్తుంది.సమాజంలో ఉన్న విద్యావంతులు, నిజాయితీ గల వ్యక్తులు, నిష్పక్షపాతులు, సమర్థులు రాజకీయాలకు దూరంగా ఉండటాన్ని ఎంచుకున్నారు. ఇది సరికాదు. ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో విజయవంతం కావాలంటే ప్రజాసేవ పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తులు ప్రజా జీవితంలోకి రావాలి.పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు మన దేశంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారాయి. ఇవి యువతలో ప్రతిభపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. ప్రభుత్వ నియామక వ్యవస్థల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తాయి. దేశ భవిష్యత్తుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే ఈ సమస్యను రాజకీయ కోణంలో మాత్రమే చూడటం సరైంది కాదు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే 2004–2014 మధ్య కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్ర సంస్థల్లో కూడా ప్రశ్నపత్రాల లీకేజీ సంఘటనలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2, అరుణాచల్ ప్రదేశ్‌లో 1, అస్సాంలో 6, బిహార్‌లో 5, ఢిల్లీ, కేంద్ర సంస్థల్లో 27, గుజరాత్లో 8, హరియాణాలో 5, హిమాచల్ ప్రదేశ్‌లో 4, జమ్మూ కశ్మీర్లో 5, జార్ఖండ్‌లో 2, కర్ణాటకలో 6, కేరళలో 2, మహారాష్ట్రలో 9, మణిపూర్‌లో 1, మధ్యప్రదేశ్‌లో 7, ఒడిశాలో 3, పంజాబ్‌లో 2, రాజస్థాన్ లో 10, తమిళనాడులో 2, తెలంగాణలో 3, త్రిపురలో 1, ఉత్తరాఖండ్‌లో 3, పశ్చిమ బెంగాల్లో 10, ఉత్తరప్రదేశ్‌లో 9 సంఘటనలు నమోదైనట్లు సమాచారం. ఈ వివరాలు చూస్తే ప్రశ్నపత్రాల లీకేజీ సమస్య ఏ ఒక్క రాష్ట్రానికి, ఏ ఒక్క ప్రభుత్వానికి లేదా ఏ ఒక్క రాజకీయ పార్టీకి మాత్రమే పరిమితం కాదని అర్థమవుతుంది.అందువల్ల ఈ అంశంపై రాజకీయ విమర్శలు చేయడం కంటే శాశ్వత పరిష్కారాలపై దృష్టి పెట్టడం అవసరం. ప్రతి ప్రభుత్వం నేరస్థులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆధునిక సాంకేతిక భద్రతా వ్యవస్థలు, డిజిటల్ రక్షణ, స్వతంత్ర పర్యవేక్షణ, కఠిన చట్టాలు, పారదర్శక నియామక విధానాలు అమలు చేయాలి. పరీక్షల నిర్వహణలో ప్రతి దశను అత్యంత భద్రతతో నిర్వహించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలి.దేశ నిర్మాణంలో ప్రభుత్వాల పాత్ర ఎంత ముఖ్యమో, బాధ్యత గల పౌరుల పాత్ర కూడా అంతే ముఖ్యమైనది. ఉపాధ్యాయులు, మాజీ న్యాయమూర్తులు, పదవీ విరమణ పొందిన అధికారులు, పాత్రికేయులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక సంస్థలు తమ అనుభవాన్ని దేశ ప్రయోజనాల కోసం వినియోగించాలి. సమస్యలను మాత్రమే చూపించడం కాకుండా వాటికి ఆచరణాత్మక పరిష్కారాలను కూడా సూచించాలి. సమాజం మొత్తం కలిసి పని చేసినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.- పి. వేణుగోపాల్ రెడ్డి, వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ -
జంతర్ మంతర్ లాఠీఛార్జిపై సీజేఐ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆందోళనకారులపై లాఠీచార్జ్, పెల్లెట్ గన్స్ వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తిన అత్యున్నత న్యాయస్థానం.. ఇలాంటి ఘటనల్లో బాధ్యతను నిర్ధారించడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది.“ఎవరు అతిగా బలప్రయోగం చేశారో తేల్చాలి. తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేస్తుంది. బాధ్యతను నిర్ణయించకుండా చేసే దర్యాప్తునకు అర్థం లేదు” అని మంగళవారం ఈ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.నిరసన హక్కు ప్రతి ఒక్కరికీ ఉందిప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కు అని సుప్రీంకోర్టు సీజేపీ ధర్మాసనం గుర్తు చేసింది. ఆందోళనలను ఎదుర్కొనే సమయంలో పోలీసులు పాటించాల్సిన విధానాల్లో మార్పులు అవసరమని పేర్కొంది. పోలీసులు గతంలో కోర్టులు సూచించిన మార్గదర్శకాలను పాటించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. నిరసనల సమయంలో పోలీసుల వ్యవహారశైలికి సంబంధించి కొత్త ప్రొటోకాల్ అవసరమని సూచించింది. 2018లో ఇచ్చిన మార్గదర్శకాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి. టియర్ గ్యాస్, లాఠీచార్జి, నియంత్ర పద్ధతులపై సమగ్ర విధానం రూపొందించాలి అని పేర్కొంది. జులై 20న ఉద్రిక్తతలుజులై 20న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీగా(చలో సంసద్) వెళ్లేందుకు CJP నేతృత్వంలో నిరసనకారులు ప్రయత్నించిన సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వారిని అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీలు ఉపయోగించారు. ఈ క్రమంలో ఘర్షణలు చోటుచేసుకుని పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పెల్లెట్ గన్స్ వాడకంపై ఆగ్రహంపోలీసుల దాడిలో ఓ యువకుడు కంటి చూపు కోల్పోయిన ఘటనను పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మహిళలు, చిన్నారులపై కూడా లాఠీచార్జి జరిగిందని.. యూనిఫాంలో లేకుండా సివిల్ డ్రెసులో ఉన్నవాళ్లూ దాడులు చేశారని.. ఎలక్ట్రిక బ్యాటన్లు, ఎలక్ట్రిక్ షీల్డ్‌లు వాడారని తెలిపారు. ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడంపై సీజేఐ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. పోలీసుల చర్యల్లో అతిగా బలప్రయోగం జరిగిందా? అనే అంశంపై పూర్తి స్థాయి విచారణ అవసరమని తెలిపారు. మాజీ న్యాయమూర్తితో సిట్ ఏర్పాటు?ఈ ఘటనపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరం అని సుప్రీంకోర్టు పేర్కొంది. మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించింది. జంతర్ మంతర్ ఘటనలో ఎవరి తప్పు ఎంత ఉందో బయటకు రావాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పోలీసులకు కీలక సందేశంనిరసనలు, ఆందోళనలు ప్రజాస్వామ్యంలో భాగమని గుర్తు చేసిన సుప్రీంకోర్టు.. వాటిని నియంత్రించే క్రమంలో పోలీసులు చట్టపరమైన పరిమితులు దాటకూడదని సూచించింది. జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం వ్యాఖ్యలు.. నిరసనల నిర్వహణ, పోలీసుల వ్యవహారశైలిపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీశాయి. -
CJP సంబరాలపై వాంగ్‌చుక్ రియాక్షన్ ఇదే..
నీట్ ఉద్యమం నేపథ్యంలో తెరపైకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుల సంబరాల వీడియోలపై ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ స్పందించారు. సీజేపీ నిరసనలకు మద్దతుగా ఆయన 26 రోజులపాటు దీక్ష కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాక CJP సభ్యులు పార్టీ చేసుకున్న వీడియోలు వైరల్‌గా మారిన వేళ.. వాంగ్‌చుక్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.సీజేపీ పార్టీ సంబురాలపై వాంగ్‌చుక్ స్పందించారు. విజయాన్ని సాధించడం ఎంత ముఖ్యమో.. దాన్ని గౌరవం, నియంత్రణ, బాధ్యతతో స్వీకరించడం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. “విజయానికి వినయం తోడవ్వాలి” (Victory must be accompanied by humility) అని సోనమ్ వాంగ్‌చుక్ పేర్కొన్నారు. CJP నిర్వహించిన నెల రోజులకుపైగా సాగిన నీట్ నిరసనల అనంతరం ఈ సంబరాలు జరగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఈ వేడుకలపై విమర్శలు చేయగా.. మరికొందరు ఇది యువత నిరసన వ్యక్తీకరణలో భాగమని సమర్థించారు.సోనమ్ వాంగ్‌చుక్ పాత్రఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఉద్యమానికి సోనమ్ వాంగ్‌చుక్ మద్దతుగా నిలిచారు. నిరాహార దీక్ష చేపట్టిన ఆయన.. పోలీసులు ఆసుపత్రికి తరలించే వరకు నిరసనకారులతోనే ఉన్నారు. అనంతరం ప్రభుత్వం నుంచి హామీలు రావడంతో 26 రోజుల దీక్షను విరమించారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థులపై నమోదైన కేసులు, బాధిత కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై జరిగిన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన దీక్ష విరమణను స్వాగతిస్తూనే.. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దీక్షతో తమకు సంబంధం లేదని.. తమ డిమాండ్లు నెరవేరే దాకా ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు. అదే సమయంలో.. Resignation की ख़ुशी 🥹 pic.twitter.com/QT4Y5j4cy6— Cockroach Janta Party (@CJP_for_India) July 26, 2026CJP సంబరాలపై విమర్శలుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన తర్వాతి దీప్కే ప్రసంగంలో సోనమ్ వాంగ్‌చుక్ పేరు ప్రస్తావనకు రాకపోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అంతేకాదు.. ఎక్స్ ఖాతా నుంచి సోనమ్ వాంగ్‌చుక్ సపోర్ట్‌గా వేసిన డీపీని దీప్కే తొలగించగా.. అధికార ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాలు అలాగే కొనసాగించడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆపై ఢిల్లీలోని అభిజిత్ దీప్కే నివాసానికి సమీపంలోని ఓ హోటల్లో CJP సభ్యులు డ్యాన్స్‌లు చేస్తూ సంబరాలు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉద్యమం వెనుక విద్యార్థుల ఆందోళనలు, ఆత్మహత్యల విషాదం ఉన్న నేపథ్యంలో ఇలాంటి వేడుకలు సరైన సందేశం ఇవ్వవని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం కొత్త తరం పోరాట విధానంలో ఉత్సాహం, సృజనాత్మకత కూడా భాగమేనని పేర్కొన్నారు.“ఇదే జెన్ జీ స్టైల్”.. విమర్శలపై CJP ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందిస్తూ.. తమ వేడుకలు యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. అంతేకాదు పోరాటంలో పాల్గొన్న ఎవరీని తాము విస్మరించలేదని.. వలంటీర్ల గౌరవార్థమే ఈ పార్టీ ఇచ్చామని చెప్పారు. “ఎంతకాలమైనా రోడ్డుపై కూర్చొని పోరాడగలం.. అదే సమయంలో పాటలు పాడుతూ నిరసన చేయగలం. కాఫీ తాగుతూ ఉద్యమాన్ని నిర్వహించగలం. ఇదే కొత్త తరం శైలి” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాజకీయ విమర్శకులను అంకుల్స్, ఆంటీస్ అంటూ ఎద్దేవా చేశారు. ఫైవ్ స్టార్ హోటల్ ఆరోపణలుసంబరాల వీడియోలపై సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ స్పందిస్తూ.. CJP నాయకత్వం ఫైవ్ స్టార్ హోటల్లో విజయోత్సవం చేసుకుందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఖర్చులు ఎవరు భరించారంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ ఆరోపణలను సౌరవ్ దాస్ ఖండించారు. అది ఖరీదైన వేడుక కాదని, సాధారణ హాల్లో జరిగిన కార్యక్రమమని తెలిపారు. వాంగ్‌చుక్ వ్యాఖ్యలతో కొత్త చర్చCJP సంబరాలపై కొనసాగుతున్న వివాదం మధ్య సోనమ్ వాంగ్‌చుక్ చేసిన “విజయానికి వినయం తోడవ్వాలి” అనే వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. ఇది విమర్శలా? లేదంటే ఉద్యమానికి ఇచ్చిన సూచనా? అనే అంశంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
జంతర్ మంతర్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్ : ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు మితిమీరిన బలప్రయోగానికి దిగారనే ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. లాఠీ చార్జి ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించి కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సి కీలక వ్యాఖ్యలు చేసింది. జూలై 25న జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ఎన్హెచ్ఆర్సి ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు పంపుతూ, దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ప్రజా నిరసనల సమయంలో ప్రాథమిక హక్కుల పరిరక్షణపై ఈ ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని కమిషన్ అభిప్రాయపడింది. దీని తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, కమిషన్ సుమోటోగా స్వీకరిస్తోందని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది.శాంతియుత నిరసన ప్రాథమిక హక్కు, శాంతిభద్రతల దృష్ట్యా కొన్ని సహేతుక పరిమితులు మాత్రమే విధించాలి కానీ, నిరసనకారులపై మితిమీరిన బలప్రయోగం కూడదని కమిషన్ వ్యాఖ్యానించింది. లాఠీచార్జి అనంతరం వారికి అందించిన వైద్య సహాయం తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని కోరింది. ఈఘటనపై సీసీటీవీ ఫుటేజ్ రికార్డు అందజేయాలని కూడా ఆదేశించింది. అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాల ప్రకారం భారత్ పాటించాల్సిన బాధ్యతలకు విరుద్ధం" అని ఆర్డర్లో పేర్కొంది. జులై 20వ తేదీన జరిగిన ఘటనపై రెండు వారాల్లో సవివర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులకు ఎన్ హెచ్ ఆర్ సి నోటీసులిచ్చింది.ఇదీ చదవండి: గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్‌కు హ్యాట్సాఫ్నిరసనకారులకు అయిన గాయాల వివరాలతోపాటు, గాయపడిన విద్యార్థులకు వైద్య సహాయం అందిందో లేదో తెలిపే సమాచారం. నిరసన సమయంలో గుంపును అదుపు చేయడానికి అనుసరించిన ప్రామాణిక కార్యాచరణ విధానాలు, ఇంకా ఉపయోగించిన బలప్రయోగం సమర్థనీయమైనదా మరియు పరిమితులకు లోబడి ఉందా అనినిర్ధారించడానికి ఏమైనా విచారణ ప్రారంభించారా అనే వివరాలు కూడా సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.కాగా నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలపై అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీఇచ్చిన పిలుపుతో జూన్ నెలలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో జూలై 20న పార్లమెంట్‌కు "సంసద్ చలో" పిలుపు తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీనికి ఎలాంటి అనుమతి లేదంటూ ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ , ఇతర బలప్రయోగ చర్యలకు దిగారని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గామారడంతో కమిషన్ స్పందించింది. ఇదీ చదవండి: రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ! -
మోదీ సెల్ఫీ వీడియో తొలగింపుపై మెటా వివరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో ఎంత ప్రభంజనం సృష్టించాయో తెలిసిందే. రికార్డు స్థాయి వ్యూస్, లైక్స్, కామెంట్లు వచ్చాయి వాటికి. అయితే ఫేస్బుక్ నుంచి ఆ వీడియోలు కాసేపు కనిపించకుండా పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకు తొలగించారంటూ ఫేస్‌బుక్‌పై నెటిజన్లు మండిపడ్డారు. అయితే ఈ ‘తాత్కాలిక’ వ్యవహారంపై మెటా వివరణ ఇచ్చింది. ఆ వీడియోను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెబుతూ.. దాన్ని పునరుద్ధరించామని కూడా వెల్లడించింది.నీట్ వివాదంపై కొనసాగిన విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో ప్రధాని మోదీ జులై 23న ఫేస్బుక్లో ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. జెన్ జీ విద్యార్థులతో మోదీ చేసిన తొలి ప్రత్యక్ష సంభాషణగా ఈ వీడియోకు భారీ స్పందన వచ్చింది.అయితే జులై 28 తెల్లవారుజామున కొంతసేపు ఈ వీడియో భారతీయ వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయింది. వీడియో స్థానంలో ‘‘చట్టపరమైన అభ్యర్థన కారణంగా మీ ప్రాంతంలో ఈ మీడియా అందుబాటులో లేదు’’ అనే సందేశం కనిపించింది. దీంతో రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.మెటా ఏమంది?వీడియో తొలగింపుపై వివరణ ఇచ్చిన మెటా.. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని స్పష్టం చేసింది. పొరపాటున వీడియోను పరిమితం చేశామని, గుర్తించిన వెంటనే దాన్ని పునరుద్ధరించామని తెలిపింది. వీడియోను తొలగించడానికి కారణమైన ప్రక్రియలో తప్పిదం జరిగిందని, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని మెటా పేర్కొంది.భగ్గుమన్న బీజేపీ, అభిమానులుప్రధాని మోదీ అధికారిక ఖాతాలో ఉన్న వీడియోను ఫేస్బుక్ పరిమితం చేయడంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కోట్లాది మంది భారతీయులకు చేరాల్సిన ప్రధానమంత్రి సందేశాన్ని ఒక సోషల్ మీడియా సంస్థ ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. బీజేపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన నేతలు మెటాను ట్యాగ్ చేస్తూ పారదర్శకత, జవాబుదారీతనంపై ప్రశ్నలు లేవనెత్తారు. కంటెంట్ నియంత్రణ పేరుతో రాజకీయ పక్షపాతం చూపుతున్నారా? అనే చర్చకు ఈ ఘటన కారణమైంది.జెన్ జీ ఉద్యమం సమయంలో వీడియోనీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై దేశవ్యాప్తంగా సాగిన విద్యార్థుల నిరసనల సమయంలో ప్రధాని మోదీ ఈ వీడియో విడుదల చేశారు. పేపర్ లీక్‌లను అరికట్టేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ వీడియోకు భారీగా వ్యూస్ రావడంతో పాటు యువతలో చర్చకు దారితీసింది. ఇలాంటి సమయంలో వీడియో తాత్కాలికంగా కనిపించకుండా పోవడం మరింత ఆసక్తిని రేపింది.వివాదం టు వివరణ వరకుసోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ.. ఇన్నేళ్లలో పోస్ట్ చేసిన తొలి సెల్ఫీ వీడియో ఇదే కావడం గమనార్హం. అదీ నీట్ నిరసనలతో జెన్ జీ చేసిన ఆందోళనలపై కావడంతో ప్రపంచవ్యాప్తంగా దానిని కోట్ల మంది వీక్షించారు. అయితే ఉన్నట్లుండి ఆ వీడియో ఎందుకు తొలగించబడిందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. చట్టపరమైన అభ్యర్థన కారణమా? అనే ప్రశ్నా తలెత్తింది. అయితే మెటా తాజాగా ఇచ్చిన వివరణతో ఇది సాంకేతిక పొరపాటేనని తేలింది. ప్రస్తుతం ప్రధాని మోదీ వీడియో మళ్లీ ఫేస్బుక్లో అందుబాటులోకి వచ్చింది.మెటాకు కేంద్రం నోటీసులుమెటా క్షమాపణలు చెప్పినప్పటికీ.. కేంద్రం మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్బుక్ వీడియో తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) స్పందించింది. ఈ అంశంపై వివరణ కోరుతూ మెటా గ్లోబల్ హెడ్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. -
ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నేడు (మంగళవారం) ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళనల మధ్య మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చకు సహకరించాలని లోక్‌సభ స్పీకర్ కోరగా, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌పై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. ఇదే పరిస్థితి రాజ్యసభలోనూ తలెత్తడంతో ఉభయ సభలు వాయిదా పడ్దాయి. కాగా పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు ఉద్దేశించిన ‘పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026’ను లోక్‌సభలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చర్చించి ఆమోదించనున్నారు. మరోవైపు రాజ్యసభలో ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు, 2026’ను ప్రవేశపెట్టనుండగా, ‘జాతీయ గౌరవానికి భంగం వాటిల్లకుండా నిరోధించే (సవరణ) బిల్లు, 2026’ను ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు.లోక్‌సభ జాబితా ప్రకారం.. దేశవ్యాప్తంగా కలకలం రేపిన పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలను కఠినంగా శిక్షించేందుకు 2024 చట్టాన్ని మరింత బలోపేతం చేసే ఈ సవరణ బిల్లును సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సభలో ప్రవేశపెట్టి ఆమోదం కోరనున్నారు. ఈ దిగువ సభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత, కేంద్ర మంత్రులు పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ స్టాండింగ్ కమిటీ నివేదికల సమర్పణ, పార్లమెంటరీ కమిటీ సిఫారసుల అమలుపై ప్రకటనలు ఉంటాయి. గౌహతి ఎయిమ్స్ పాలకమండలికి లోక్‌సభ సభ్యుడి ఎన్నిక కోసం తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు.మరోవైపు రాజ్యసభలో.. 2006 నాటి ఎంఎస్ఎంఈ అభివృద్ధి చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన ‘ఎంఎస్ఎంఈ అభివృద్ధి (సవరణ) బిల్లు, 2026’ను కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ప్రవేశపెట్టనున్నారు. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘జాతీయ గౌరవానికి భంగం వాటిల్లకుండా నిరోధించే (సవరణ) బిల్లు, 2026’ను పరిశీలన, ఆమోదం కోసం సభ ముందుకు తీసుకురానున్నారు. -
చివరి నిమిషంలో కేంద్రం ప్లాన్ బెడిసి కొట్టిందా?
నీట్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారం.. మరో ఆసక్తికర మలుపు తిరిగింది. రాజీనామా కంటే ముందే కేంద్రం మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తప్పించకుండా.. ఆయన శాఖను మార్చే ప్రతిపాదనను కేంద్రం చేసిందట. ఇదే విషయాన్ని ఆ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా ద్వారా ప్రకటించగా.. అది వాస్తవమేనన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా సాగిన విద్యార్థుల ఉద్యమంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రం, సీజేపీ మధ్య జరిగిన చర్చల్లో కీలక ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లు సమావేశమైన సమయంలో.. ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించినట్లు సమాచారం. మిగతా రెండు డిమాండ్లను ఎలాంటి షరతుల్లేకుండా అంగీకరిస్తూ.. ఈ ఒక్క డిమాండ్ విషయంలోనే పంతం వీడాలని కోరినట్లు సమాచారం. అయితే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులు దాన్ని తిరస్కరించినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ సమాచారం వెలుగులోకి వచ్చింది.ఒక మంత్రిని కొనసాగించాలా? లేదంటే శాఖ మార్చాలా? అన్నది ప్రధానమంత్రి పరిధిలోని నిర్ణయమని కేంద్ర ప్రతినిధులు వివరించినట్లు తెలుస్తోంది. అయితే సీజేపీ మాత్రం ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదని సమాచారం. కేవలం శాఖ మారిస్తే సరిపోదని.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే తమ డిమాండ్ అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.రాజీనామా తప్ప మరో మార్గం లేదన్న సీజేపీనీట్ వ్యవహారంలో విద్యార్థుల ఆందోళనలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తప్పుకోవాలని సీజేపీ మొదటి నుంచీ డిమాండ్ చేసింది. విద్యార్థుల్లో నమ్మకం పునరుద్ధరించాలంటే నాయకత్వ మార్పు అవసరమని వాదించింది. ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను అంగీకరించలేదని తెలుస్తోంది. ఇటు రాహుల్ కూడా.. ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి ప్రతీక. ఆయన రాజీనామా చేయాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. అలాంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగడం అనైతికం. ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఆయన శాఖను మార్చాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు మాకు సమాచారం ఉంది. కానీ, ఆయన్ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల్సిందే. లేకుంటే ఆందోళనలను విరమించం అని రాహుల్ గాంధీ ఆ సమయంలో మీడియా ద్వారా వెల్లడించారు. అటు నిరసనకారులు.. ఇలా విపక్షాలు . రాజీనామాపైనే పట్టుబట్టడంతో చివరకు ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్న చర్చ జరుగుతోంది.రాజీనామా తర్వాత రాజకీయ వేడిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం పార్లమెంట్‌లోనూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్డీయే నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. పార్లమెంట్‌కు వచ్చిన మాజీ మంత్రికి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అదే సమయంలో ప్రతిపక్షాలు.. ఆయన రాకపై నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో తన చర్యను సమర్థించుకుంటూ ధర్మేంద్ర ప్రధాన్ విపక్షాలకు కౌంటర్ ఇచ్చేలా ప్రసంగం ఇచ్చారు. ఉద్యమం తర్వాత కొత్త దశధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ ప్రధాన డిమాండ్లలో ఒకటి నెరవేరినప్పటికీ.. నిరసనకారులపై నమోదైన కేసులు, అరెస్టుల అంశం మరో వివాదంగా మారింది. దీనిపై కేంద్రంతో చర్చలు జరిపిన సీజేపీ.. కేసుల ఉపసంహరణ, విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరుతోంది. మొత్తంగా నీట్ వివాదం కేవలం పరీక్షల నిర్వహణ అంశానికే పరిమితం కాకుండా.. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాల వరకు ప్రభావం చూపింది. -
ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో కీలక అంశాలపై చర్చ
న్యూఢిల్లీ: పార్లమెంట్లో మంగళవారం ఉదయం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రసంగించారు. భారత్ ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) విజయం, వ్యూహాత్మక ప్రభావం గురించి పీయూష్ గోయల్ వివరించగా.. మత్స్య రంగ వృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణను మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ భేటీకి, తొలిసారిగా కొత్తగా ఏర్పడిన ‘నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (ఎన్సీపీఐ)కు కూడా ఆహ్వానం లభించింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను వీడి ఎన్సీపీఐలో చేరిన సుదీప్ బందోపాధ్యాయ, కాకోలి ఘోష్, శతాబ్ది రాయ్ తదితర ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. Delhi: NDA Parliamentary Party's 'Mangal Milan' meeting begins at the Parliament. Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh, and other leaders attend the meeting.(ANI photos by Rahul Singh) pic.twitter.com/ckHDAIG7vJ— ANI (@ANI) July 28, 2026ప్రస్తుత వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎన్డీఏ ‘మంగళ్ మిలన్’ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. పరీక్షల సంస్కరణలు, విద్యార్థులపై పోలీసుల చర్యలంటూ విపక్షాలు చేస్తున్న ఆందోళనలు ఈ సమావేశంలో ప్రధాన చర్చాంశాలుగా మారాయి. లోక్‌సభలో విపక్షాల నినాదాల మధ్య పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నిరోధక) సవరణ బిల్లు-2026 ప్రవేశపెట్టిన తరుణంలో ఈ సమావేశం ప్రాముఖ్యత సంతరించుకుంది. పేపర్ లీక్‌లు, పరీక్షల అవకతవకలను కఠినంగా అణచివేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై చర్చించేందుకు ఎన్డీఏ పలువురు యువ ఎంపీలను రంగంలోకి దించింది. జులై 20 నాటి ‘సంసద్ చలో’ నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్లో ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. దీనికితోడు కొత్త చట్టం ప్రభావంపై కూడా విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గత సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల వెంటే ఉంటుందని, పేపర్ లీక్‌లు జాతీయ ఆందోళనకర అంశమని, దీనిపై రాజకీయాలు చేయకూడదని స్పష్టం చేశారు. పరీక్షల అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన పునరుద్ఘాటించారు.తొలగిన ప్రతిష్టంభన..పబ్లిక్ పరీక్షల బిల్లుపై చర్చపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కొనసాగుతున్న ప్రతిష్టంభన తొలగింది. మంగళవారం లోక్‌సభలో పబ్లిక్ పరీక్షల (అక్రమాల నివారణ) సవరణ బిల్లు, 2026పై చర్చ జరగనుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలతో జరిపిన సంప్రదింపులు ఫలించడంతో సభ సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది. నీట్ పేపర్ లీక్ ఉదంతం నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవస్థీకృత పరీక్షల మోసాలను అణచివేయడానికి కేంద్రం ఉద్దేశించిన నూతన బిల్లును ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. -
అమర్నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు!
గందర్బాల్: జమ్ముకశ్మీర్‌లోని గందర్బాల్ జిల్లాలో అమర్నాథ్ యాత్ర నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 39 మంది గాయపడ్డారు. కంగన్ ప్రాంతంలోని హరిగన్వాన్ వద్ద మలుపు తిరుగుతుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న ఒక ఇంటిపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఇల్లు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, బస్సు సింధు నదిలోకి పడిపోకుండా ఆ ఇల్లు అడ్డుకుంది.అమర్నాథ్ పవిత్ర గుహను దర్శించుకుని తిరిగి వస్తున్న యాత్రికులు ఈ ప్రమాదానికి గురయ్యారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే జమ్ముకశ్మీర్ పోలీసులు, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్, భారత సైన్యం సిబ్బందితో పాటు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తక్షణమే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారందరి పరిస్థితి నిలకడగా ఉందని, ఎక్కువ మందికి స్వల్ప గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు.ఈ ప్రమాదంపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గందర్బాల్ డిప్యూటీ కమిషనర్, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జూలై 2న ప్రారంభమైన అమర్నాథ్ యాత్రలో ఇప్పటివరకు 4.15 లక్షలకు పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆగస్టు 28తో ఈ వార్షిక యాత్ర ముగియనుంది.ఇది కూడా చదవండి: కోర్టులో సాక్ష్యానికి ఏఐ సాయం .. చివరికి ఏమైందంటే? -
నీట్ ఉద్యమంలో మిడ్నైట్ ట్విస్ట్!
న్యూఢిల్లీ: నీట్ వివాదంపై సాగిన విద్యార్థుల ఉద్యమం మరో కీలక మలుపు తిరిగింది. నిరసనకారులపై నమోదైన కేసులు, అరెస్టుల అంశంపై కేంద్రంతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో.. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులతో ప్రభుత్వం అర్ధరాత్రి కీలక చర్చలు జరిపింది. ఈ సమావేశం అనంతరం నిరసనకారులకు రక్షణ కల్పించేలా మరిన్ని రాష్ట్రాల నుంచి అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని సీజేపీ వెల్లడించింది.“ఏ ఒక్క నిరసనకారుడిని ఒంటరిగా వదిలిపెట్టం. అందరం కలిసి ఉన్నాం” అని సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై తమకు ఉన్న అనుమానాలను చర్చల్లో ప్రస్తావించామని, వాటిపై స్పష్టమైన హామీలు లభించాయని పేర్కొన్నారు.#Important: 1 AM update.Hours after our press conference, Government’s representatives met us. The meeting lasted for 2-3 hours. They shared copies of the Bihar and Assam notifications guaranteeing FIR withdrawals, no action in future, and release of all detainees and… pic.twitter.com/G7WcHHcfAs— Saurav Das (@SauravDassss) July 27, 2026 2–3 గంటల పాటు సాగిన అర్ధరాత్రి భేటీసోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సౌరవ్ దాస్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. తమ ప్రెస్‌మీట్ తర్వాత ప్రభుత్వ ప్రతినిధులు తమను కలిశారని, దాదాపు 2–3 గంటల పాటు చర్చలు సాగాయని తెలిపారు. బిహార్, అస్సాం ప్రభుత్వాలు నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఉండవన్న హామీలకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతులను ప్రభుత్వం తమకు అందించిందని చెప్పారు. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం, ఇతర బీజేపీ–ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి కూడా ప్రకటనలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.“హామీలు అమలవుతాయా?”చర్చల అనంతరం విడుదల చేసిన వీడియో సందేశంలో సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ హామీల అమలుపై తమకు ఆందోళన ఉందని స్పష్టం చేశారు. “చర్చల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోతాయేమోనన్న భయాన్ని ప్రభుత్వ ప్రతినిధుల ముందు పెట్టాం. అందుకు ప్రతిగా బిహార్ హోం శాఖ జారీ చేసిన ప్రకటనను వారు చూపించారు. అందులో నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లు ఉపసంహరిస్తామని, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఉండవని పేర్కొన్నారు” అని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా రక్షణ కల్పించేలా నోటిఫికేషన్లు జారీ చేయడంపై చర్చ జరిగినట్లు వెల్లడించారు.మళ్లీ ఉద్యమం హెచ్చరికతో కదిలిన ప్రభుత్వంకేంద్రంతో చర్చలకు ముందు సీజేపీ మరోసారి ఆందోళన బాట పట్టే హెచ్చరికలు చేసింది. ఒప్పందం ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు కొనసాగుతున్నాయని పేర్కొంది. బిహార్, బెంగాల్లో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారని, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో వాలంటీర్లను వేధిస్తున్నారని సీజేపీ ఆరోపించింది. వెంటనే కేసులు ఉపసంహరించుకోవాలని, అరెస్టైన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే తిరిగి జంతర్ మంతర్ వేదికగా ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించింది.బిహార్, అస్సాం తర్వాత రాజస్థాన్ హామీఇప్పటికే బిహార్, అస్సాం ప్రభుత్వాలు నీట్ నిరసనలకు సంబంధించి నమోదైన కేసులపై ఉపశమనం కల్పించే నిర్ణయాలు ప్రకటించాయి. అరెస్టైన వారిని విడుదల చేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల చర్యలు ఉండవని హామీ ఇచ్చాయి. తాజాగా రాజస్థాన్‌లోనూ నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ లభించిందని సీజేపీ తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదని, ఇకపై కూడా నమోదు చేయబోమని అధికారులు స్పష్టం చేసినట్లు పేర్కొంది.నీట్ పోరాటం ముగిసినట్లే!నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై జూన్ 20న ప్రారంభమైన సీజేపీ ఉద్యమం.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తాత్కాలికంగా ముగిసింది. అయితే నిరసనకారులపై కేసులు, అరెస్టుల అంశం కొత్త వివాదానికి దారితీసింది. తాజా చర్చలతో తాత్కాలికంగా ఆందోళన సద్దుమణిగినప్పటికీ.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేసుల ఉపసంహరణ, విద్యార్థుల రక్షణపై అధికారిక ప్రకటనలు రావడమే కీలకంగా మారింది. -
ఈపీఎఫ్ఓ అప్డేట్.. డబ్బు ఆటో రీఫండ్
ఉపాధి, కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) దశాబ్దాలుగా క్లెయిమ్ కాకుండా పడివున్న చందాదారుల డబ్బును నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఏళ్ల తరబడి నిద్రాణంగా (ఇన్ఆపరేటివ్) ఉండి రూ.1,000 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న 7.11 లక్షల ఖాతాలలో ఇప్పటికే 1.18 లక్షల ఖాతాదారుల బ్యాంకు వివరాలను ఆధార్ డేటాతో అనుసంధానించి ధ్రువీకరించినట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.ఈపీఎఫ్ఓ 2.0 సంస్కరణల్లో భాగంగా ప్రారంభించిన ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా చందాదారులు ఎలాంటి దరఖాస్తులు లేదా క్లెయిమ్ ఫారాలు సమర్పించాల్సిన అవసరం లేకుండానే వడ్డీతో సహా వారి సొమ్ము బ్యాంకు ఖాతాల్లోకి ఆటో-క్రెడిట్ కానుంది.సీ-డాక్ సాఫ్ట్వేర్రూ.1,000 కంటే తక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్న 7.11 లక్షల ఖాతాల్లో మొత్తం రూ.30.52 కోట్ల సొమ్ము ఆమోదం లేకుండా పడి ఉంది. ఈ భారీ ప్రక్రియ కోసం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ‘సీ-డాక్’ సంస్థ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. సాధారణంగా ఈపీఎఫ్ఓ వ్యవస్థ సభ్యులు క్లెయిమ్ చేస్తేనే స్పందిస్తుంది. కానీ ఈ విధానంలో సభ్యుల ప్రమేయం లేకుండానే సిస్టమ్ జనరేటెడ్ క్లెయిమ్ సదుపాయాన్ని సీ-డాక్ అభివృద్ధి చేస్తోంది.బ్యాంక్ ఖాతాల ధ్రువీకరణలో భాగంగా ‘పెన్నీ డ్రాప్’ విధానాన్ని అమలు చేయగా మరణించిన ఖాతాదారుల వివరాలు కూడా గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రారంభమైన ఈ పైలట్ ప్రాజెక్ట్, ఆగస్టు నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.భవిష్యత్తు ప్రణాళికలు.. మానవ ప్రమేయానికి స్వస్తిఈ మొదటి విడత పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాత రూ.1,000 కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న మిగిలిన 24.76 లక్షల మంది చందాదారులకు కూడా ఇదే రీతిలో ఆటో రిఫండ్ ప్రక్రియను వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం గత రెండు దశాబ్దాలుగా దాదాపు 31.86 లక్షల క్లెయిమ్ కాని ఖాతాల్లో రూ.10,903 కోట్ల నిధులు నిరుపయోగంగా పడి ఉన్నాయి. 2014లో యూనివర్సల్ అకౌంట్ నంబర్ కేటాయింపుతో ప్రారంభమైన ఈ డిజిటల్ ప్రక్షాళన, కార్మికులు తమ సొంత డబ్బు కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సులభతరమైన సేవలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఇదీ చదవండి: చిన్న రవాణాదారుల మనుగడ ప్రశ్నార్థకం -
ఢిల్లీ నిరసనలపై ఫేస్ స్కాన్ ఆపరేషన్
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జూలై 20న నిర్వహించిన పార్లమెంట్ ‘చలో సంసద్ ర్యాలీ’లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. జంతర్ మంతర్ దగ్గర గత వారం జరిగిన ఉద్రిక్త ఆందోళనలకు సంబంధించిన వందలాది గిగాబైట్ల సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. పరీక్ష పేపర్ లీకేజీల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ.. సీజేపీ నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలో పోలీసులకు, సీజేపీ మద్దతుదారులకు మధ్య ఘర్షణ చెలరేగిన సంగతి తెలిసిందే.సుమారుగా 100 సీసీటీవీ వీడియో క్లిప్‌లలో నిరసనకారులు.. భద్రతా వలయాలను ఛేదించడం, పోలీసు సిబ్బందిపై దాడి, రాళ్లు రువ్వి ఆస్తులను ధ్వంసం చేయడం రికార్డయింది. ఇప్పటివరకు ముఖ గుర్తింపు వ్యవస్థ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్) ద్వారా 2,873 మంది నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించారు. వీరిలో 989 మందిపై హత్య, అత్యాచారం, కిడ్నాప్, దోపిడీ, పోక్సో చట్టం కింద నమోదైన కేసులతో సహా పలు తీవ్రమైన నేర చరిత్ర ఉన్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇందులో 101 మంది హత్య కేసుల్లో, 284 మంది దొంగతనం కేసుల్లో.. మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్న 92 మంది పాల్గొన్నారని పోలీసులు వెల్లడించారు.పోలీసులు, భద్రతా సిబ్బందిపై దాడులు చేయడం, బారికేడ్లను బద్దలు కొట్టడం, రాళ్లు రువ్వడం, పెప్పర్ స్ప్రే ఉపయోగించడం, వాహనాలను ధ్వంసం చేయడం, వాహనాల లోపల ఉన్న పోలీసులపై దాడి చేయడం, నిరసన మార్గంలో ఉన్న ప్రజా ఆస్తులను, దుకాణాలను ధ్వంస చేయడం వంటి ఘటనలు పలు ప్రదేశాల్లో సీసీటీవీలలో రికార్డయ్యాయి. కొన్ని ఫుటేజీలలో గుంపుగా బారికేడ్లను బద్దలు కొట్టి ముందుకు సాగడం, జూలై 20న సంసద్ మార్గ్ వద్ద పలు చోట్ల రాళ్లు రువ్విన దృశ్యాలు ఉన్నాయి.అదే రోజు.. జంతర్ మంతర్ సమీపంలో పోలీసులు లోపల కూర్చున్నప్పటికీ, గుంపు పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేసి, ఒక పోలీసు వాహనాన్ని బోల్తా కొట్టించడానికి ప్రయత్నించింది. టాల్‌స్టాయ్ మార్గ్ వద్ద ఒక వాహనానికి నిప్పు పెట్టడం, బస్సు టైర్లను పంక్చర్ చేయడం సీసీటీవీలో రికార్డయ్యింది. పోలీసు సిబ్బందిపై ప్రత్యక్ష దాడులు జరిగినట్లు పలు వీడియోలు స్పష్టంగా చూపుతున్నాయని వర్గాలు తెలిపాయి. గాయపడిన ఒక మహిళా పోలీసు అధికారిని ఆమె సహచరులు సురక్షిత ప్రాంతానికి తరలించడం కనిపించింది.సంసద్ మార్గ్ వద్ద గుంపు ఒక పోలీసును చుట్టుముట్టి దాడి చేసింది. గాయపడిన పోలీసు సిబ్బంది యూనిఫామ్లపై రక్తం కారుతున్న అనేక క్లిప్‌లు ఉన్నాయి. ఢిల్లీ పోలీసుల ప్రకారం సుమారు 200 మంది పోలీసులు గాయపడ్డారు. జూలై 22న రికార్డయిన సీసీటీవీ ఫుటేజ్‌లో పోలీసు అధికారులు నంద్కిషోర్, వివేక్ భగత్‌లపై జరిగిన దాడులు నమోదయ్యాయి. కొంతమంది నిరసనకారులు కెమెరా ముందు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను సేకరించి తదుపరి చర్యల నిమిత్తం విశ్లేషిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. వీటిలో కన్నాట్ ప్లేస్‌లో ఓ మహిళ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, సంసద్ మార్గ్ వద్ద ఓ వ్యక్తి పార్లమెంటు గురించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోలీసులపై ఒక మహిళ బూతులు తిట్టిన దృశ్యాలు ఉన్నాయి. -
చిన్న రవాణాదారుల మనుగడ ప్రశ్నార్థకం
దేశీయ సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న చిన్న మోటారు రవాణాదారులు (స్మాల్ ట్రక్కర్స్) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. నిరంతరం పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, స్థిరంగా పడిపోతున్న ఫ్రైట్ ధరల మధ్య ఈ రంగాన్ని నమ్ముకున్న వేలాది మంది కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.అఖిల భారత మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) తెలిపిన వివరాల ప్రకారం, దేశీయ సరుకు రవాణాలో 70 శాతం చిన్న ఆపరేటర్లే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఒక లారీ నిర్వహణ వ్యయంలో కేవలం డీజిల్ ఖర్చులే 55-60 శాతానికి చేరాయి. దీనికితోడు టోల్ ఛార్జీలు, ఇన్సూరెన్స్, అడ్ బ్లూ (వాహనాల నుంచి వెలువడే ప్రమాదకరమైన పొగను తగ్గించడానికి ఉపయోగించే ఒక రసాయన ద్రవం), టైర్లు, వాహన ఈఎంఐలు, నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగాయి. మరోవైపు, ఏజెంట్లు (బ్రోకర్లు), డిజిటల్ ఫ్రైట్ ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడటం వల్ల తక్కువ ధరలకే సరుకును రవాణా చేయాల్సి వస్తోంది.పరిశ్రమను వేధిస్తున్న మరో ప్రధాన సమస్య డ్రైవర్ల కొరత. ప్రస్తుతం దేశంలో దాదాపు 22 లక్షల మంది కమర్షియల్ డ్రైవర్ల కొరత ఉంది. సుదీర్ఘ ప్రయాణాలు, రహదారులపై సరైన వసతులు లేకపోవడం, తక్కువ ఆదాయం కారణంగా యువత ఈ వైపు రావడం లేదు. ఏఐఎంటీసీ మాజీ అధ్యక్షుడు బాల్ మల్కిత్ సింగ్ ఈ పరిస్థితిపై మాట్లాడుతూ.. ‘సరుకు రవాణా రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే వేలాది మంది చిన్న ఆపరేటర్లు వ్యాపారాలు మూసివేసే ప్రమాదం ఉంది. ఇది దేశ సరఫరా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది’ అని పేర్కొన్నారు.ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టోల్ రుసుములను హేతుబద్ధీకరించాలని, సరుకు రవాణా ధరలను నిర్వహణ ఖర్చులతో అనుసంధానించాలని, వాహన్ (Vahan) పోర్టల్‌లోని లోపాలను సరిచేసి వెహికల్ ట్రాకింగ్ డివైజ్ నిబంధనలను పునపరిశీలించాలని రవాణా సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. -
Gen Z ఎఫెక్ట్.. బీజేపీకి కంచుకోటలో టెన్షన్!
అది బీజేపీకి బలమైన కంచుకోట.. వరుస విజయాలతో పార్టీకి అండగా నిలిచిన నియోజకవర్గం. కానీ ఇప్పుడు అదే స్థానంలో ఫలితం ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అందుకే బంకీపూర్‌లో పార్టీ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. సాధారణంగా గెలుపు ఖాయంగా భావించే ఈ సీటులో ఈసారి మాత్రం బీజేపీ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కారణం.. ఒకవైపు జన సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం.. మరోవైపు జెన్ జీ (Gen Z) విద్యార్థుల ఉద్యమం రాజకీయ చర్చకు కేంద్రంగా మారడం.బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఈసారి సాధారణ పోరుగా కాకుండా.. బీజేపీ ఆధిపత్యానికి పరీక్షగా మారింది. జులై 30న పోలింగ్ జరగనుండగా.. ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున నీరజ్ కుమార్ సిన్హా పోటీ చేస్తుండగా.. జన సూరాజ్ పార్టీ నుంచి ప్రశాంత్ కిశోర్ బరిలో ఉన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఉన్నప్పటికీ.. ప్రధాన పోరు బీజేపీ, జన సూరాజ్ మధ్యే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీజేపీ కంచుకోటలో కొత్త సవాల్బంకీపూర్ నియోజకవర్గం చాలాకాలంగా బీజేపీకి అనుకూలంగా ఉంది. గత నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే నితిన్ నబీన్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ స్థానం ఖాళీ అయింది. బీజేపీ తన సంప్రదాయ బలాన్ని నిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా తరఫున ప్రచారం చేస్తున్న నితిన్ నబీన్.. ప్రజల్లో పార్టీపై విశ్వాసం కొనసాగుతోందని చెబుతున్నారు. “యువత ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం సామ్రాట్ చౌధరీ, ఎన్డీయేకు మద్దతుగా ఉంది. ప్రజల ఆశీర్వాదం బీజేపీకి కొనసాగుతుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.పీకే ఎంట్రీతో ఆసక్తికర పోరురాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్.. జన సూరాజ్ పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన సూరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. బంకీపూర్ ఉప ఎన్నిక ఆయనకు కీలక పరీక్షగా మారింది. ఈ ఎన్నిక ద్వారా బిహార్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో జన సూరాజ్ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా యువ ఓటర్లు, పట్టణ ప్రాంత ప్రజలు, సంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయం కోరుకునే వర్గాలపై ప్రశాంత్ కిశోర్ దృష్టి పెట్టారు.యువ ఓటర్లే నిర్ణాయక శక్తిబంకీపూర్ ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర కీలకంగా మారనుంది. నీట్ వివాదంపై ఢిల్లీలో జరిగిన జెన్ జీ ఉద్యమం, ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అటు బిహార్‌లోనూ నీట్ నిరసనల సందర్భంగా కేసులు, అరెస్టుల వ్యవహారం వివాదాస్పదమైంది. దీంతో యువతలో ఈ అంశాలపై ఉన్న అభిప్రాయం ఎన్నికలపై ప్రభావం చూపుతుందా? అన్న చర్చ మొదలైంది. పరీక్షల పారదర్శకత, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల సమస్యలు యువ ఓటర్ల నిర్ణయంలో కీలక అంశాలుగా మారే అవకాశం ఉంది.జెన్ జీ ఉద్యమ ప్రభావం ఉంటుందా?జెన్ జీ ఉద్యమ ప్రభావం బంకీపూర్ ఎన్నికలపై ఉండదని బీజేపీ నేతలు చెబుతున్నారు. యువత తమకు మద్దతుగానే ఉందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమకు బలమని పేర్కొంటున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం విద్యార్థుల ఆందోళనలను ప్రస్తావిస్తూ యువతలో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జెన్ జీ ఉద్యమం కేవలం నిరసనగానే మిగిలిపోతుందా? లేక ఓటు రూపంలో ప్రభావం చూపుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.బంకీపూర్ ఫలితం ఎందుకు కీలకం?బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితం ఒక సీటు గెలుపోటములకే పరిమితం కాదు. బీజేపీ తన కంచుకోటను నిలబెట్టుకుంటుందా? లేక ప్రశాంత్ కిశోర్ జన సూరాజ్ ప్రభావాన్ని చాటుతుందా? అన్నది బిహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫలితం బీజేపీ బలాన్ని మాత్రమే కాకుండా.. యువ ఓటర్ల మూడ్, ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఉన్న అవకాశాలను కూడా సూచించే అవకాశం ఉంది. అందుకే బంకీపూర్ బైపోల్ ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. -
అస్సాం: నీటిలో 631 గ్రామాలు.. 4.45 లక్షల మంది విలవిల
డిస్పూర్: అస్సాంలో భీకర వరదలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో వరద తీవ్రత కారణంగా సుమారు 4.45 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీఆర్ఐఎంఎస్) నివేదిక ప్రకారం శివసాగర్, గోలాఘాట్, చరైదేవ్, జొర్హాట్, నాగావ్, కామరూప్ (మెట్రోపాలిటన్) జిల్లాల్లో వరద పరిస్థితి అత్యంత భీకరంగా ఉంది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఏఎస్డీఎంఏ) వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి నాటికి 21 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 631 గ్రామాలు నీటమునిగాయి.వరద ప్రభావిత ప్రాంతాల్లో చరైదేవ్ జిల్లా అత్యధికంగా నష్టపోయింది. ఇక్కడ 1.88 లక్షల మంది ప్రభావితం కాగా, శివసాగర్ జిల్లాలో 1.44 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. నుమాలిగఢ్ వద్ద ధాన్సిరి నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 37,139 హెక్టార్లలో పంట పొలాలు నీటమునిగాయి. అలాగే 2.56 లక్షలకు పైగా మూగజీవాలు వరద బారిన పడగా, సుమారు 26 వేలకు పైగా పశువులు కొట్టుకుపోయాయి.ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా 184 పునరావాస శిబిరాలు, సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో 28,695 మంది ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో 97 మంది గర్భిణులు, బాలింతలు, 42 మంది దివ్యాంగులు ఉన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు స్థానిక యంత్రాంత్రంతో కలిసి 67 పడవలను వినియోగించి, సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. వరద నీటి కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురికాగా, 171 ఇళ్లు పూర్తిగా, 4,667 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. శివసాగర్, జొర్హాట్ జిల్లాల్లో కొన్ని ప్రాథమిక పాఠశాలలు నీటమునిగాయి. బాధితులకు బియ్యం, కందిపప్పు, ఉప్పు వంటి నిత్యావసర సరుకులను ప్రభుత్వం అందజేస్తోంది. ప్రధాన మంత్రి మోదీ, ముఖ్యమంత్రి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: భర్తను ఎదిరించి మరీ రాజకీయాల్లోకి.. -
ఇవాళే డెడ్‌లైన్! కేంద్రానికి సీజేపీ మరో వార్నింగ్
నీట్ వివాదంపై సాగిన విద్యార్థుల ఉద్యమం మరోసారి ఉత్కంఠకు దారితీస్తోంది. కేంద్రంతో చర్చల అనంతరం ఆందోళనను విరమించిన కాక్రోచ్ జనతా పార్టీ.. ఇప్పుడు ఆ హామీలు అమలు కావడం లేదని ఆరోపణలకు దిగింది. ఈ క్రమంలో కేంద్రానికి మరోసారి అల్టిమేటం జారీ చేసింది. తమ డిమాండ్లను నెరవేరుస్తూ ఇవాళ గనుక రాతపూర్వక హామీ ఇవ్వకుంటే.. మళ్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించింది. నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా జూన్ 20న ప్రారంభమైన సీజేపీ ఉద్యమం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం జులై 25న తాత్కాలికంగా ముగిసింది. అదే సమయంలో ఈ నిరసనలకు మద్దతుగా పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఉద్యమించారు. అయితే వాళ్లపైనా ఆయా చోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా నీట్ నిరసనలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని సీజేపీ సోమవారం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో మళ్లీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేసింది.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో జరిగిన చర్చల్లో.. నిరసనకారులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని హామీ ఇచ్చారని సీజేపీ పేర్కొంది. ఆ తర్వాత కూడా బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం.. మరికొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల అరెస్టులు కొనసాగుతున్నాయని, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో వాలంటీర్లను వేధిస్తున్నారంటూ ఆరోపించింది.‘‘హామీ ఉల్లంఘిస్తే నమ్మకద్రోహమే’’సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లు కేంద్రానికి డిమాండ్లు పెట్టారు. నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను వెంటనే రద్దు చేయాలని, అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని కోరారు. కేంద్రం ఇచ్చిన హామీలపై లిఖితపూర్వక స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు కాకపోతే తిరిగి జంతర్ మంతర్ వేదికగా ఆందోళన ప్రారంభిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు చర్చలను నమ్మి ఉద్యమాన్ని విరమించారని.. ఇప్పుడు మాట తప్పడం లక్షలాది మంది యువత నమ్మకాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.వార్నింగ్ ఎఫెక్ట్.. బిహార్ ప్రభుత్వ హామీసీజేపీ హెచ్చరికల తర్వాత బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 26 సాయంత్రం 6 గంటల వరకు నిరసనలకు సంబంధించి నమోదైన కేసులను ఉపసంహరించుకునే ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించింది. అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేస్తామని, భవిష్యత్తులోనూ వారిపై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేసింది.బిహార్‌లో నిరసనల సందర్భంగా పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి. మొత్తం 335 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఆందోళనల సమయంలో హింస, ఆస్తుల నష్టం, పోలీసులపై దాడుల ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి.ఏకే-47 ఘటనపై దుమారంబిహార్లోని సివాన్‌లో నిరసనల సందర్భంగా ఓ కానిస్టేబుల్ ఏకే-47తో గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. జేపీ చౌక్ వద్ద భారీగా చేరుకున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ అభిషేక్ కుమార్‌ను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఆందోళనల్లో మొత్తం 694 మందిని అదుపులోకి తీసుకోగా, వారిలో 339 మందిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. నిరసనల్లో పోలీసు అధికారులు సహా 91 మంది గాయపడ్డారని, 14 ప్రభుత్వ వాహనాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు.బెంగాల్లోనూ కేసులు.. 16 మంది అరెస్టుఇటు పశ్చిమ బెంగాల్లో నిరసనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కోల్‌కతాలోని డొరినా క్రాసింగ్ వద్ద అనుమతి లేకుండా గుమిగూడి, పోలీసులపై రాళ్లు, చెప్పులు, కర్రలు విసిరారని పోలీసులు ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 16 మందిని అరెస్టు చేశారు. అయితే ఈ కేసుల ఉపసంహరణపై బెంగాల్ ప్రభుత్వం న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం. వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా నమోదైన కొన్ని కేసుల విషయంలో నేరుగా ఉపసంహరణ సాధ్యం కాకపోవచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.అసోంలోనూ అరెస్టులు.. కేసుల ఉపసంహరణకు నిర్ణయంఅసోంలోనూ నిరసనలకు సంబంధించి చర్యలు తీసుకున్నారు. ప్రజా శాంతికి భంగం కలిగించారన్న ఆరోపణలతో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. లఖింపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ ద్వారా నిరసనకు మద్దతుగా ప్రజలను సమీకరించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. అయితే.. సీజేపీ హెచ్చరికల నేపథ్యంలో అసోం ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ నిరసనలకు సంబంధించి నమోదైన ఐదు కేసులను ఉపసంహరించేందుకు చర్యలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అరెస్టైన 13 మందిని విడుదల చేసే ప్రక్రియను మొదలు పెట్టామని తెలిపింది. నిరసనల్లో పాల్గొన్న వారిపై భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల చట్టపరమైన చర్యలు ఉండవని స్పష్టం చేసింది.ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో సోషల్ మీడియాపై నిఘాఇదిలా ఉండగా.. నిరసనల సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని పోస్టులపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపినట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌లోని నివారీ జిల్లాలో ఓ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌పై మాజీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ, ఢిల్లీ పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కేసు నమోదైంది.ముంబైలో కొనసాగుతున్న పోలీసుల నోటీసులుసీజేపీ ప్రకటన తర్వాత కూడా.. ముంబైలో కొంతమంది నిరసనకారులకు పోలీసుల నోటీసులు కొనసాగుతున్నాయి. కేసుల దర్యాప్తు ప్రక్రియలో భాగంగానే నోటీసులు ఇస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అధికారికంగా కేసుల ఉపసంహరణ ఉత్తర్వులు వచ్చే వరకు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.విద్యార్థుల న్యాయ పోరాటానికి సిబల్ చేయూతనీట్ నిరసనల్లో కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయ సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ముందుకొచ్చారు. సీజేపీ ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ ఫండ్‌కు రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయవాదులు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.పైన పేర్కొన్న రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కేరళ సహా పలు ప్రాంతాల్లో నీట్ నిరసనలకు సంబంధించి కేసులు, అరెస్టుల ప్రక్రియ కొనసాగింది. అయితే కేవలం ప్రకటనలతోనే ఈ వివాదం ముగిసిపోతుందా? కేసుల ఉపసంహరణ, అరెస్టయిన విద్యార్థుల విడుదల అంత సులువైన ప్రక్రియేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యాయపరమైన చిక్కులు, దర్యాప్తు దశలో ఉన్న కేసులు, రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు కీలకంగా మారాయి.తమ డిమాండ్లు నెరవేరకపోతే మళ్లీ జంతర్ మంతర్ వేదికగా ఆందోళనకు దిగుతామని సీజేపీ స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతాయి? విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? లేక ఈ వ్యవహారం మరోసారి దేశవ్యాప్త ఉద్యమానికి దారితీస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కేంద్రం తదుపరి చర్యలపైనే నీట్ ఉద్యమం భవిష్యత్ ఆధారపడి ఉంది. -
కెనడాలో రూ.930 కోట్ల డ్రగ్స్ సీజ్
ఒంటారియో: కెనడాలోని ఒంటారియోలో రికార్డు స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. అధికారులు రూ.930 కోట్ల విలువైన 1.7 టన్నుల డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి 19 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో అత్యధికులు భారతసంతతి వారే కావడం గమనార్హం. కెనడాలోకి డ్రగ్స్‌ను తరలించే అతిపెద్ద అంతర్జాతీయ రాకెట్‌ను తాము భగ్నం చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. అమెరికా–కెనడా సరిహద్దుల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించిన వారిలో ఎక్కువ మంది ట్రక్కు డ్రైవర్లేనని వివరించారు. ప్రాజెక్టు బే పేరుతో 2025 జనవరి నుంచి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన డ్రగ్స్‌లో 973 కిలోల కొకైన్, 660 కిలోల మెథాంఫెటమైన్, 49 కిలోల నల్లమందు, 230 కిలోల ఆక్సీకొడోన్ టాబ్లెట్లు ఉన్నాయి. ఇంకా 17 తుపాకులు, 80 వేల కెనడా డాలర్లు, 10 వేల అమెరికా డాలర్లు, ఖరీదైన నగలు, 43 సెల్ఫోన్లు, ఆరు ల్యాప్‌టాప్‌లు, ఒక వాహనాన్ని కూడా స్వా«దీనం చేసుకున్నారు. -
శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు
సాక్షి, న్యూఢిల్లీ: శాంతియుతంగా, చట్టబద్ధంగా నిరసన తెలపడం దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఆందోళన జరుగుతోందనే ఒకే కారణంతో పోలీసులు, ఇతర భద్రతాధికారులు లాఠీచార్జ్‌కు పాల్పడటం సరికాదని సీజేఐతోపాటు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్లతో జంతర్‌మంతర్‌లో జరిగిన ఆందోళనలపై పోలీసులు లాఠీఛార్జ్ తదితర బల ప్రయోగానికి పాల్పడటంపై దాఖలైన వేర్వేరు పిటిషన్లు అన్నింటినీ కలిపి మంగళవారం విచారించనున్నట్లు ధర్మాసనం తెలిపింది.అది రాజ్యాంగ హక్కువిచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ ‘‘జంతర్ మంతర్ ఆందోళనల్లో పోలీసులు అతిగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉంటే వాటిపై స్వతంత్ర విచారణ జరగాలి. ఇది కేవలం ఢిల్లీకి పరిమితమైన సమస్య కాదు. నిరసనలను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో దేశవ్యాప్తంగా ఒకే రకమైన పోలీసు ప్రోటోకాల్ అవసరం. ప్రజాస్వామ్యంలో క్రమశిక్షణ అంతర్భాగం’ అని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తి ప్రాణం చాలా విలువైందని స్పష్టం చేశారు. జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ మాట్లాడుతూ ‘‘పోలీసులు, విద్యార్థుల్లో ఎవరు గాయపడ్డా సమానంగానే చూడాలి. నిరసన ప్రదర్శనలను సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసులకు తగిన రక్షణ ఏర్పాట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి రావచ్చు’’ అని అన్నారు. నిరసనల సందర్భంగా గాయపడ్డ పోలీసు సిబ్బంది కుటుంబాలు తమ వాదన కూడా వినిపించేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కేంద్రం తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ న్యాయస్థానానికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. -
కేసుల రద్దుపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారంలోగా ఆమేరకు హామీ లభించకుంటే మళ్లీ ఆందోళన బాట పడతామని హెచ్చరించింది. సీజేపీ జాతీయ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌తో కలిసి సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ఆందోళనకారులు, నిర్వాహకులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఉప సంహరించుకుంటామని, కొత్తగా ఎవ్వరిపైనా కేసులు పెట్టబోమని మూడో విడత చర్చల సమయంలో కేంద్రం మాకు హామీ ఇచ్చింది. ఆ తర్వాతే 36 రోజులపాటు జంతర్‌మంతర్‌లో కొనసాగించిన నిరసనలను ఉపసంహరించుకున్నాం’అని సీజేపీ ప్రతినిధులు వివరించారు. ‘ముసాయిదా ఒప్పందాన్ని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు అందజేయగా వారు ఆమోదం తెలిపారు. న్యాయనిపుణులతో చర్చలు జరిపాక మంగళవారం కల్లా ప్రభుత్వం లిఖిత పూర్వక ఒప్పందాన్ని అందజేస్తుందని మాకు హామీ ఇచ్చారు’అని వివరించారు. ‘ప్రభుత్వం నుంచి అందాల్సిన లిఖిత పూర్వక ఒప్పందం కోసం మేం ఎదురు చూస్తున్నాం. కేబినెట్ సీనియర్ మంత్రులు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నాం. నిరసనకారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వేధించరాదు. భవిష్యత్తులో వారిపై ఎటువంటి కేసులు పెట్టరాదు’అని రాంకా, దాస్ స్పష్టం చేశారు. లేనిపక్షంలో తాము మరోసారి నిరసనలకు దిగక తప్పదని స్పష్టం చేశారు. -
ఏపీ డీఎస్సీపై కేంద్రం స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలో ప్రశ్నాపత్ర భద్రత, నియామక విధానం, క్రీడాకోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఉపాధ్యాయుల నియామకాలు, వారి సేవా నిబంధనలు, నియామక ప్రక్రియ పూర్తిగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన పరిధిలోనే ఉంటాయని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి జయంత్ చౌదరి తెలిపారు. లోక్‌సభలో సోమవారం వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత, ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి, పార్టీ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి ప్రశ్నలకు మంత్రి జవాబిస్తూ.. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ దేశంలోని ఎక్కువ పాఠశాలలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన నియంత్రణలో ఉంటాయని తెలిపారు. అందువల్ల ఉపాధ్యాయుల నియామకాలు, సేవా నిబంధనలు, పోస్టింగ్‌లకు సంబంధించిన అంశాలు వాటి పరిధిలోనే ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలను పారదర్శకంగా, పటిష్టంగా, సాధ్యమైనంతవరకు పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీచేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో పారదర్శకత, విశ్వసనీయత పెంపొందించడంతో పాటు అక్రమాలను అరికట్టేందుకు పార్లమెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం–2024ను తీసుకొచ్చిందని తెలిపారు. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా అనుసరించేందుకు ఇది ఒక నమూనా చట్టంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. మెగా డీఎస్సీకి సంబంధించి రాష్ట్రంలో జరిగిన అవినీతి, అన్యాయాలపై ఎంపీలు అడిగిన ప్రశ్నకు మాత్రం కేంద్రమంత్రి జవాబివ్వలేదు. -
లోక్‌సభలో పేపర్‌లీకేజీల బిల్లు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నీట్ వంటి కీలక పోటీపరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలతో ఉద్యమించిన విద్యార్థిలోకాన్ని శాంతింపజేసేందుకు, లీకేజీ నేరగాళ్ల వెన్నులో వణుకుపుట్టేలా అత్యంత కఠిన శిక్షలు, అత్యధిక జరిమానాలతో నూతన చట్టానికి తుదిరూపునిచ్చి సంబంధిత బిల్లును మోదీ సర్కార్ సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పరీక్షలు(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు,2026ను ప్రధానికార్యాలయానికి సహాయ మంత్రి అయిన జితేంద్ర సింగ్ సోమవారం లోక్‌సభలో విపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టారు. బిల్లు ప్రతిపాదించేముందు నిబంధనల ప్రకారం సీనియర్ విపక్ష సభ్యులైన సౌగతా రాయ్(టీఎంసీ), మనీశ్ తివారీ(కాంగ్రెస్), ఎన్కే ప్రేమచంద్రన్(ఆర్ఎస్పీ)లను బిల్లుపై మాట్లాడాల్సిందిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. దానికి వాళ్లు ముందుకురాకపోవడంతో ఇక బిల్లును ప్రవేశపెట్టాలని సహాయమంత్రి జితేంద్రను స్పీకర్ కోరడంతో ఆయన బిల్లును సభముందుకు తెచ్చారు. వెంటనే స్పీకర్ మాట్లాడారు. ‘‘ప్రభుత్వ పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు తెస్తున్న బిల్లు ఇది. మీరు నినాదాలు ఆపేసి బిల్లుపై చర్చలో పాల్గొంటే బాగుంటుంది. చర్చ వేళ మీరు ఇచ్చే సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది’’ అని స్పీకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, దాని ఏజెన్సీలు నిర్వహించే పబ్లిక్ ఎగ్జామ్‌లో అవకతవకలకు పాల్పడే వాళ్లను ప్రత్యేక చట్టాల కింద శిక్షించేందుకు మోదీ సర్కార్ 2024లో పబ్లిక్ ఎగ్జామ్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం తెచ్చింది. యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేస్, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇతర ప్రభుత్వ సంస్థలు చేపట్టే పరీక్షల పేపర్లను లీక్‌చేసే వాళ్లను, ముఠాలను ఈ చట్టనిబంధనల కింద శిక్షిస్తున్నారు. తాజాగా నీట్ లీకేజీ ఉదంతం, విద్యామంత్రిగా ధర్మేంద్ర రాజీనామా డిమాండ్లు, విద్యార్థి నిరసనోద్యమంలో మోదీ సర్కార్ చట్టసవరణ చేస్తూ కొత్త బిల్లును తేవడం తెల్సిందే.బిల్లులో ఏముంది? → అక్రమ పద్దతులను అనుసరిస్తూ పోటీపరీక్షల ప్రశ్నపత్రాలను వ్యక్తిగతంగా లీక్‌చేసిన నేరగాళ్లకు కనిష్టంగా ఐదేళ్లు, గరిష్టగా పదేళ్ల శిక్ష పడేలా బిల్లులో ప్రతిపాదనలు పొందుపరిచారు. ఈ నేరగాళ్లకు రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. → వ్యక్తిగతంగా కాకుండా ముఠాగా ఏర్పడి వ్యవస్థీకృత నేరం చేసిన వాళ్లకు గరిష్టంగా ఏడేళ్ల జైలుశిక్ష విధించేలా బిల్లులో ప్రతిపాదనలు చేర్చారు. వీళ్లకు గరిష్టంగా రూ.10 కోట్ల జరిమానా విధిస్తారు. → 2024లో అమల్లోకి వచ్చిన పాత చట్టం ప్రకారం పేపర్ లీకేజీ వ్యక్తిగతం నేరగాళ్లకు మూడు నుంచి ఐదేళ్ల జైలుశిక్ష విధించేవారు. వ్యవస్థీకృత నేరగాళ్లకు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.1 కోటి జరిమానా విధిస్తారు. వీటిని పెంచుతూ సవరణ బిల్లును తెచ్చారు.→ లీకేజీ సంబంధిత కేసుల సత్వర విచారణ కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏదైనా సెషన్స్ కోర్టును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా ఏర్పాటుచేయాలని కొత్త బిల్లులో ప్రతిపాదించారు.→ కేసును రోజువారీగా కోర్టులో విచారిస్తూ, ఆ కేసులో నేరాభియోగం(చార్జ్‌షీట్) దాఖలైన మూడు నెలల్లోపు కేసు విచారణ ముగించాలని బిల్లులో ప్రతిపాదించారు. కేసు తీవ్రత దృష్టా అవసరమైతే ప్రత్యేక టాస్క్ఫోర్స్నుఏర్పాటుచేయొచ్చు.→ పరీక్షల నిర్వహణ కోసం అవసరమైతే ఇతర విభాగాల సాయం తీసుకోవచ్చు.→ పరీక్ష కేంద్రాలు, పరీక్షార్థుల తనిఖీ, బయోమెట్రిక్ నమోదు, భద్రతా ప్రమాణాలు, సీట్ల కేటాయింపు, ప్రశ్నపత్రాల కూర్పు, పేపర్ల లోడింగ్, ఇని్వజిలేషన్లకు సంబంధించి కొత్త నిబంధనలు,ప్రమాణాల రూపకల్పనకు సంబంధించి బిల్లులో ప్రతిపాదనలుచేశారు→ పేపర్ లీక్ చేయడం, ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్, నకిలీ వెబ్సైట్ల రూపకల్పన, నకిలీ ఐడీ కార్డులను జారీచేయడం ఇలా 15 అనైతిక చర్యలను నేరాలుగా పేర్కొన్నారు. నేడు చర్చ! వరసబెట్టి వాయిదాలపర్వంతో ముగుస్తున్న లోక్‌సభ సెషన్లో తొలిసారిగా మంగళవారం సుదీర్ఘ చర్చ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్ట సవరణ బిల్లు–2026 ను మంగళవారం లోక్‌సభో చర్చించనున్నారు. చర్చ కోసం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను స్పీకర్ బిర్లా ఒప్పించడంతో చర్చ సాధ్యంకానుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సభలో బిల్లుపై ఏడు గంటలపాటు చర్చించే వీలుంది. -
వైఎస్ జగన్ హయాంలోనే అత్యధిక ఇళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)–అర్బన్, పీఎంఏవై–అర్బన్ 2.0 పథకాల కింద ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు మొత్తం 19,67,971 ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ సహాయమంత్రి తోఖన్ సాహు తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీనేత, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. దేశవ్యాప్తంగా 2015 జూన్ 25 నుంచి అమలవుతున్న పీఎంఏవై–అర్బన్ పథకాన్ని 2024 సెపె్టంబర్ 1 నుంచి పీఎంఏవై–అర్బన్ 2.0గా విస్తరించినట్లు చెప్పారు. ఈ పథకాల కింద ఏపీకి మంజూరైన 19.68 లక్షల ఇళ్లల్లో ఇప్పటివరకు 11.38 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, వీటిలో 10.75 లక్షల ఇళ్లల్లో లబ్ధిదారులు నివాసం ఉంటున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా విడుదలలో జాప్యం, మౌలిక వసతుల కల్పన ఆలస్యం, లబ్దిదారులు తమ వాటా నిధులు సమకూర్చుకోవడంలో ఎదురైన ఇబ్బందుల కారణంగా అమలు వేగం తగ్గిందని చెప్పారు. పీఎంఏవై–అర్బన్ 2.0 కింద 61,084 ఇళ్లు 2024 సెప్టెంబర్ 1 నుంచి పీఎంఏవై–అర్బన్ 2.0గా విస్తరించిన ఈ పథకం కింద ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు 61,084 ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు. అమరావతి భూసమీకరణ రైతులను పీఎంఏవై–అర్బన్ 2.0 లబ్ధిదారులుగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలోనే అత్యధిక ఇళ్ల మంజూరు, నిర్మాణం వైఎస్సార్సీపీ హయాంలోనే అత్యధికంగా ఇళ్లు మంజూరై, నిర్మాణం జరిగినట్లు కేంద్ర గణాంకాల ద్వారా వెల్లడైంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ పాలన కాలంలో మొత్తం 14,15,800 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఈ పథకాల కింద చంద్రబాబు పాలనలో 2015–19 మధ్య 4,91,087 లక్షల ఇళ్లు, 2024–27 (ప్రస్తుత సంవత్సరం) 61,578 మంజూరయ్యాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వాల హయాంలో మొత్తం 5,52,171 లక్షల ఇళ్లకు ఆమోదం లభించినట్లు కేంద్ర నివేదికలు చెబుతున్నాయి. -
విద్యార్థులపైకి ఏకే–47
పట్నా: కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో పార్లమెంట్ దిశగా ‘చలో సంసద్ ర్యాలీ’కి పిలుపునివ్వగా ఆ ర్యాలీకి మద్దతుగా శనివారం బిహార్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో వందలాది మంది ఉద్యమకారుల పైకి పోలీసులు ఏకంగా ఏకే–47 మారణాయుధాన్ని ప్రయోగించిన వార్త ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజికవేత్తలను లాఠీచార్జ్‌తో రెచ్చగొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి చివరకు ఏకే–47 గన్ను పోలీసులు వినియోగించారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగింది? పట్నా, సరణ్ జిల్లాలోని ఛాప్రా, సివాన్, ఔరంగాబాద్, భాగల్పూర్, సమస్తీపూర్, నవాడా, పూరి్ణయా, నలందా, బోజ్పూర్, మధుబని, షేక్పురాల్లో జూలై 25న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థి ర్యాలీలు జరిగాయి. అయితే సివాన్ పట్టణంలో జరిగిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇక్కడ జేపీ చౌక్ ప్రాంతంలో జాతీయరహదారి గుండా రాకపోకలను నిలిపేశారు. దుకాణాలను మూసేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ర్యాలీగా వెళ్తున్న తమను అడ్డుకున్న పోలీసులపైకి ఉద్యమకారులు రాళ్లతో దాడిచేశారు. ట్రాఫిక్ పోలీస్బూత్లను ధ్వంసంచేశారు. విద్యార్థుల రాళ్ల దాడిలో సివాన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పురన్ కుమార్ ఝా గాయపడ్డారు. దీంతో బాష్పవాయుగోళాలు ప్రయోగించాలని ఆయన ఆదేశించారు. అయితే ఉద్యమకారులు రాళ్ల వర్షం కురిపించడంతో వారిని నిలువరించేందుకు జిల్లా నిఘా విభాగానికి చెందిన అభిషేక్ పటేల్ అనే కానిస్టేబుల్ తన వద్ద ఉన్న ఏకే–47ను విద్యార్థుల పైకి ఎక్కుపెట్టారు. నాలుగు రౌండ్లు కాలుస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో తాజాగా ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ఝా ప్రకటించారు. నాలుగు రౌండ్ల కాల్పుల్లో అటుగా వెళ్తున్న కుమార్ గోండ్ ఒక వ్యక్తి కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అయితే ఉద్యమకారులు నాటుబాంబులు విసిరేయడంతోనే ఈ కాల్పుల ఘటన జరిగిఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. వాళ్లేమైనా ఉగ్రవాదులా?న్యూఢిల్లీ: బిహార్‌లో నీట్ లీకేజీ నిరసనోద్యమంలో విద్యార్థులపైకి పోలీసులు ఏకే–47 గన్ను ఎక్కుపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మోదీ సర్కార్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిలదీశారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’లో రాహుల్ ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘మోదీ ప్రభుత్వసారథ్యంలో యావత్ పోలీస్‌వ్యవస్థ విద్యార్థులను హతమార్చే స్థాయికి దిగజారింది. బిహార్‌లో ఏకే–47 గన్ను విద్యార్థులపైకి గురిపెట్టారు. వందలాది మందిని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌చేశారు. మోదీజీ.. విద్యార్థులపై ఒక్క ఎఫ్ఐఆర్ నమోదుకాబోదన్న మీ వాగ్దానం ఏమైంది? ఢిల్లీలో పెల్లెట్ గన్స్ వాడితే బిహార్‌లో ఏకంగా ఏకే–47ను వాడా రు’’అని అన్నారు. ఏకే–47 గురిపెట్టిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా మాట్లాడారు. ‘‘మీ అమ్మాయిలను నిరసనలకు ఎందుకు పంపించారు? అని తల్లిదండ్రులను కొందరు నేతలు మందలిస్తున్నారు. అమ్మాయిలు ఉద్యమంలో పాల్గొనకూడదా? ఏకే47, పెల్లెట్ గన్స్ వాడొచ్చా? విద్యార్థులేమైనా ఉగ్రవాదులా? ’’అని ప్రియాంక నిలదీశారు. కాల్పుల ఘటనపై సుప్రీంలో పిల్ సాక్షి, న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై జూలై 20 నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో పోలీసులు అతిగా బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై రాజ్యస భ సభ్యుడు, ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా బిహార్‌లో జరిగిన పోలీసుల కాల్పుల ఘటనతో పాటు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసనకారులపై జరిగిన లాఠీచార్జి తదితర ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. -
కాళేశ్వరంపై ఉద్దేశపూర్వక రాజకీయాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రస్తుతం కన్నెపల్లి వద్ద తగిన నీటి మట్టం ఉన్నందున పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతులకు నీరు అందించడం లేదన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో గ్రౌటింగ్ పూర్తయిన తర్వాత పరిమిత స్థాయిలో నీటిని నిల్వ ఉంచి మూడు పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని రిటైర్డ్ ఇంజినీర్లు సూచించారని తెలిపారు.సోమవారం కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే 48 గంటల్లో నివేదిక ఇచ్చారని, అందుకే దానిని బీఆర్ఎస్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదుం ఎన్డీఏ రిపోర్ట్ అని ఎద్దేవా చేశారు. రూ.8.5 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మిస్తే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని ప్రభుత్వ ఇంజినీర్లు నివేదిక ఇచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తుమ్మిడిహెట్టి సాధ్యం కాకపోవడంతోనే నిపుణుల సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేశామని చెప్పారు. ఐటీ ఉద్యోగాలు తగ్గాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం ఐటీ టవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగించుకోవడంలో విఫలమైందన్నారు. ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వకపోవడంతో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని విమర్శించారు. టీ–ఫైబర్ ప్రాజెక్టును పూర్తి చేస్తే ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ ఉద్యోగాలు పెరుగుతాయని తెలిపారు. కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు రెండున్నరేళ్లుగా నిలిచిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్–కరీంనగర్ రైల్వే మార్గం విద్యుద్దీకరణతోపాటు మిడ్ మానేరు వద్ద రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ సాధించిన విజయం తెలంగాణ యువత ప్రతిభను ప్రపంచానికి చాటిందని కేటీఆర్ అన్నారు. అర్ధరాత్రి బీజేపీతో కాంగ్రెస్ దోస్తీ: ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ మధ్య అంతర్గత అవగాహన ఉందని, అర్ధరాత్రి వేళల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకులతో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదా లు జరిగినా వివరాలు బయటకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అక్కడ దొరికిన నగదును లెక్కించడానికి మిషన్లు కూడా సరిపోవట్లేదంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. -
‘‘ఆందోళనకు దిగిన విద్యార్థులను కాల్చిపడేయాలని ఆదేశించేవాడిని’’
తిరువనంతపురం: నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనను తాను నియంత్రించే బాధ్యతలో ఉండి ఉంటే విద్యార్థి ఆందోళనకారులపై కాల్పులు జరపాలని భద్రతా బలగాలకు ఆదేశించేవాడినని ఓ ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యాత చెప్పడంతో కేరళలో తీవ్ర వివాదం చెలరేగింది.పత్రిక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలో టీజీ మోహన్‌దాస్ మాట్లాడుతూ.. ముందుగా జంతర్ మంతర్ చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో కర్ఫ్యూ విధించేవాడినని చెప్పారు. ఆ తర్వాత ఆందోళనకారులను 3 సార్లు వెళ్లిపోవాలని హెచ్చరించేవాడినని, అయినా వినకపోతే వారిపై కాల్పులు జరపాలని ఆదేశించేవాడినని అన్నారు."ప్రజలు చెదిరిపోయి పరుగులు తీస్తారు. కొందరు చనిపోతారు. కొందరు చనిపోరు. ఇంకొందరికి తీవ్రగాయాలు అవుతాయి. 4 గంటల్లో పరిస్థితి ప్రశాంతంగా మారుతుంది. మృతదేహాలను తీసుకుని ఆసుపత్రికి తరలిస్తాం" అని మోహన్‌దాస్ అన్నారు.మహిళా ఆందోళనకారులపై కూడా ఆయన అవమానకర వ్యాఖ్యలు చేశారు. వారిని "అత్యాచారాలను ఇష్టపడే మహిళలు" అంటూ వ్యాఖ్యానించారు. "సామూహిక అత్యాచారాలు జరుగుతాయి. దేవుడి దయతో ఎలాంటి ఫిర్యాదులు రావు. ఎందుకంటే అత్యాచారాలను ఇష్టపడే వారు ఉన్నారు. ముఖ్యంగా వామపక్షాలు, లౌకికవాదులు, ప్రజాస్వామ్యాన్ని నమ్మేవారు" అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా మహిళా ఆందోళనకారులపై హింసను ప్రోత్సహిస్తున్నారని పలువురు మోహన్‌దాస్‌పై నెటిజన్లు ఆరోపణలు చేశారు.టీజీ మోహన్‌దాస్ ఎవరు?టీజీ మోహన్‌దాస్ కేరళకు చెందిన రచయిత, కాలమిస్ట్, రాజకీయ వ్యాఖ్యాత. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), భారతీయ జనతా పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తి. ఇంజనీర్, న్యాయవాదిగా శిక్షణ పొందిన ఆయన పాత్రికేయుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, సామాజిక విమర్శకుడిగానూ పని చేశారు.గతంలో బీజేపీ మేధావుల విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా పని చేశారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ విచార కేంద్రంలో కూడా నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. 2012లో ఆర్ఎస్ఎస్ అనుబంధ వారపత్రిక కేసరిలో బీజేపీ, సీపీఐ(ఎం) మధ్య రాజకీయ సహకారం సాధ్యాసాధ్యాలపై వ్యాసం రాశారు. ఆ వ్యాసం రెండు వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.పోలీసులకు ఏఐఎస్ఎఫ్ ఫిర్యాదుసీపీఐ అనుబంధ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) సోమవారం కేరళ రాష్ట్ర పోలీసు చీఫ్‌కు ఫిర్యాదు చేసింది. మోహన్‌దాస్ వ్యాఖ్యలు హింసను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది.శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై కాల్పులు జరపాలని బహిరంగంగా చెప్పడం రాజకీయ అభిప్రాయ వ్యక్తీకరణ కాదని, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసే హక్కుపై నేరుగా దాడి చేసినట్టేనని విద్యార్థి సంఘం ఆరోపించింది.డిజిటల్ వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వ్యాఖ్యలు అడ్డుకోకపోతే హింసను రెచ్చగొట్టే అవకాశం ఉందని, ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేయవచ్చని, చట్టవ్యతిరేక పరిస్థితులకు దారితీయవచ్చని కూడా పేర్కొంది. విద్యార్థి ఆందోళనకారులను "కాల్చి చంపాలని" మోహన్‌దాస్ పిలుపునిచ్చారని ఏఐఎస్ఎఫ్ ఆరోపించింది. ఆయనపై తగిన చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని పోలీసులను కోరింది. -
ప్రపంచ వ్యాప్తంగా వైరలైన ఈ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు..
ముంబై: ఇటీవల జరిగిన జెన్-జీ ప్రొటెస్ట్‌లో ముంబైలో ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని నిరసనకు ప్రతీకగా నిలిచిన మోడల్ రియా అహిర్ ఇప్పుడు తనపై ఆన్లైన్ వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. తాను పోలీసు వ్యాన్‌ను అడ్డుకున్న ఘటన తర్వాతి నుంచి బెదిరింపులు, ట్రోలింగ్ ఎదుర్కొంటున్నానంటూ ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎంఐడీసీ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో.. సామాజిక మాధ్యమాల్లో నిరంతరం బెదిరింపులు వస్తున్నాయని, తన పోస్టులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై విద్వేష ప్రచారం సాగుతోందని, ఇందులో పరువునష్టం, బెదిరింపులు, మహిళలపై ద్వేషపూరిత దూషణలు, డీప్‌ఫేక్ వీడియోలు ఉన్నాయని కూడా ఆరోపించారు.వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. పరువునష్టం కలిగించే పోస్టుల స్క్రీన్షాట్లు, యూఆర్ఎల్లు, ఇతర ఆధారాలను కూడా సమర్పించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.జూలై 22న ముంబైలోని దాదర్ శివాజీ పార్క్ సమీపంలో రియా అహిర్ పోలీసు వ్యాన్‌ను అడ్డుకున్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులను ఆ వ్యాన్‌లో తీసుకెళ్తున్నారు.బూడిద రంగు హూడీ ధరించి, పోలీసు వ్యాన్ బానెట్‌పై చేయి ఉంచి ధైర్యంగా నిలబడ్డ ఆమె దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో తాను సహజసిద్ధంగా స్పందించానని రియా అహిర్ చెప్పారు."పోలీసులు తప్పు చేస్తున్నారని నాకు తెలుసు కాబట్టే నేను అలా చేయగలిగాను. మీ హక్కుల గురించి మీకు తెలుసుండాలి" అని తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తనది సహజ స్పందన మాత్రమేనని, కానీ ప్రజలు దాన్ని అసాధారణ ఘటనగా చూడటం ఇప్పటికీ తనకు ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. -
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మిల్మా పాలకమండలి రద్దు
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిల్మా తిరువనంతపురం ప్రాంతీయ యూనియన్ పాలకమండలిని రద్దు చేసింది.శబరిమల ఆలయానికి సరఫరా చేసిన మిల్మా నెయ్యిని దారి మళ్లించి, తిరిగి విక్రయించడం, మహారాష్ట్ర నుంచి పాలు రవాణా చేసేందుకు టెండర్లుఆహ్వానించకుండానే అధిక ధరకు మిల్క్ ట్యాంకర్ కాంట్రాక్టును కేటాయించడం వంటి తీవ్రమైన ఆర్థిక అవకతవకలు బయటపడటంతో పాలక మండలిని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చైర్ పర్సన్ మణి విశ్వనాథన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) మద్దతుగల పాలకమండలిపై పాడి అభివృద్ధి శాఖ డైరెక్టర్ శాలిని గోపినాథ్ ఈ చర్య తీసుకున్నారు. బోర్డు రద్దు అనంతరం, పాడి అభివృద్ధి శాఖ జాయింట్ డైరెక్టర్ (ప్రణాళిక) సినీ ఉన్నికృష్ణన్ను నిర్వాహకురాలిగా నియమించారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, చట్టం ప్రకారం ఆరు నెలల్లోగా తిరిగి ఎన్నికలు నిర్వహించాలి, ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన పాలకవర్గం బాధ్యతలు స్వీకరిస్తుంది.శబరిమల నెయ్యి స్కామ్ట్రావెన్ కోర్ దేవస్థానం, మిల్మా మధ్య కుదిరిన అధికారిక ఒప్పందం ప్రకారం, శబరిమల మరియు పంపాలకు 1.7 లక్షల లీటర్ల నెయ్యిని సరఫరా చేయాల్సి ఉంది. బహిరంగ మార్కెట్లో మిల్మా నెయ్యి లీటరుకు రూ.720 లకు అమ్ముడవుతుండగా , దానిని దేవస్థానం బోర్డు అంగీకరించిన ధర లీటరుకు రూ.540 కే సరఫరా చేశారు. కాగా విచారణలో డెయిరీ నుండి పంపిన అత్యుత్తమ నాణ్యత గల మిల్మా నెయ్యిని శబరిమలకు చేరకముందే దారి మళ్లించి, ప్రైవేట్ ఏజెన్సీలకు మరియు బహిరంగ మార్కెట్లో విక్రయించినట్లు విచారణలో తేలింది.దానికి బదులుగా , తమిళనాడు నుండి తెప్పించిన నాసిరకం నెయ్యిని శబరిమలకు సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. లీటరుకు కేవలం ₹350 విలువ కలిగిన సుమారు 70,000 లీటర్ల ఈ నాసిరకం నెయ్యిని ఆలయానికి సరఫరా చేసి, భక్తులను మోసం చేసినట్లు పాడి అభివృద్ధి శాఖ కనుగొంది.టెండర్ లేకుండానే పాల ట్యాంకర్ కాంట్రాక్టును కేటాయించారు.మిల్మాలో పాల కొరతను తీర్చడానికి మహారాష్ట్ర నుంచి కేరళకు పాలు రవాణా చేసే కాంట్రాక్టుల కేటాయింపులో కూడా అవకతవకలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది.ప్రభుత్వ టెండర్లను ఆహ్వానించకుండా నిర్దేశిత టెండర్ ప్రక్రియను పాటించకుండా , అధిక ధరలకు ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్లకు కాంట్రాక్టును అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సహకార ఆడిట్లో , ఈ ఒక్క అవకతవక వల్లే మిల్మా తిరువనంతపురం ప్రాంతీయ యూనియన్‌కు రూ. 93.40 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లిందని తేలింది.కందల సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు, మిల్మా తిరువనంతపురం ప్రాంతీయ యూనియన్ మాజీ ఛైర్మన్ అయిన ఎన్. భాసురంగన్ ఏర్పాటు చేసిన పరిపాలనా కమిటీ హయాంలో వివాదాస్పద ట్యాంకర్ కాంట్రాక్టును కేటాయించారు. కందల సహకార బ్యాంకు ఆర్థిక మోసం కేసులో భాసురంగన్ను ఆ తర్వాత ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఆ సమయంలో కేఆర్ మోహనన్ పిళ్లై, విఎస్ పద్మకుమార్ ఆ కమిటీలోని ఇతర సభ్యులుగా ఉన్నారు. -
పెరిగిన ఎయిడ్స్ మరణాలు
ముంబై: ప్రాణాంతక హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధిని నిర్ములించేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వ్యాధి పీడితులు, మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆరోగ్యశాఖను ఆందోళనకు గురిచేస్తోంది. గడచిన నాలుగేళ్లలో ఎయిడ్స్‌తో మృతిచెందినవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గత రెండేళ్లలో వేయికిపైగా రోగులు మృతిచెందినట్లు ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది.ఆ నివేదిక ప్రకారం కేవలం ముంబైలోనే 2022–23లో 958 మంది మృతి చెందగా, 2023–24లో 986 మంది, 2024–25లో 1,148 మంది, 2025–26లో 1,068 మంది మరణించారు. 2022–23తో పోలిస్తే 2025–26లో ఎయిడ్స్‌తో మృతి చెందిన రోగుల శాతం 19.83గా నమోదైంది. హెచ్ఐవీ, ఎయిడ్స్ మృతుల సంఖ్యను నియంత్రించేందుకు ఆరోగ్య శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అవగాహనా, ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేసింది. అయినా రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (న్యాకో) వెల్లడించింది.అందరి సహకారంతోనే నియంత్రణ సాధ్యం: డా. విజయ్ కరంజ్కర్ఒకప్పుడు హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధి సోకిందంటే రోగులు ప్రాణాల మీద ఆశ వదులుకునే వారు. ఇక తాము కొద్ది రోజులు మాత్రమే జీవిస్తామనే ధోరణితో బతుకీడుస్తుండేవారు. కానీ ఇప్పుడు అనేక కొత్త కొత్త మందులు మార్కెట్లోకి వచ్చాయి. జీవితాంతం మందులు వాడితే ప్రాణాలు నిలబడతాయి. ఇలాంటి రోగుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు అనేక సేవా, స్వయం సేవా సంస్ధలు కృషిచేస్తున్నాయి. ఏఆర్టీ కేంద్రం అందులో ఒకటి. ఈ కేంద్రం ఎయిడ్స్ రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తుంటుంది. కానీ అనేక నెలలుగా రోగులు పరీక్షలు చేయించుకునేందుకుగాని, మందులు తీసుకునేందుకుగాని ఈ కేంద్రానికి రాలేదు. దీంతో వీరంతా ఎక్కడున్నారు..? ఏమయ్యారు.ఫాలో అప్‌కు ఎందుకు రావడం లేదన్న సందేహంతో గత రెండేళ్లుగా అంటే 2024, 2025 నుంచి ముంబై ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ఆధ్వర్యంలో ‘లాస్ట్ టూ ఫాలో అప్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈమేరకు ఫోన్ ద్వారా రోగులు లేదా వారి బంధువులతో సంప్రదించడం, స్వయంగా ఇళ్లకు వెళ్లి వారినుంచి వివరాలను సేకరించడంతో రోగుల్లో అనేకమంది మరణించారని, వీరి వివరాలు ఏఆర్టీ కేంద్రంలో నమోదు కాలేదని తెలిసింది.చదవండి: ఉత్కంఠ రేపుతున్న కార్పొరేషన్ల ఎన్నికలు ఇలా రెండేళ్లలో మృతిచెందిన వారిగురించి తెలిసిందని ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ప్రాజెక్టు సంచాలకుడు డా.విజయ్ కరంజ్కర్ తెలిపారు. ఉచితంగా పరీక్షలు, మందులు పంపిణీ చేసినప్పటికీ హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులు కేంద్రానికి రాకపోవడం ఆందోళన కలిగిస్తోందని కరంజ్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందరి సహకారం ఉంటేనే ఎయిడ్స్ నియంత్రణలోకి వస్తుందని అన్నారు. -
బాలుడి ప్రైవేట్ పార్ట్స్‌పై కాల్చి వాతలు, స్కూల్ టీచర్ ఘాతుకం..!
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. నర్సరీ చదువుతున్న ఐదేళ్ల చిన్నారి పట్ల ఉపాధ్యాయురాలు అత్యంత దారుణంగా ప్రవర్తించిన ఘటన దిగ్భ్రాంతి రేపింది. వాష్‌రూమ్‌కు వెళ్లనివ్వకపోవడంతో, ఆ బాలుడు యూరిన్ పాస్ చేశాడు. దీంతో బాలుడి ప్రైవేట్ భాగాలపై చాకు కాల్చివాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన తీవ్ర విమర్శలకు తావిచ్చింది.బాలుడు తండ్రి కేసరి కుమార్ తన కుమారుడికి జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం వారణాసిలోని పాండేపూర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. నర్సరీ చదువుతున్నబాధిత బాలుడు టాయిలెట్‌కి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ఉపాధ్యాయురాలు ప్రీతి కుష్వాహాను కోరాడు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. దీంతో బాలుడు ప్యాంట్‌లోనే మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీచర్, చిన్నారిని వేరే గదిలోకి తీసుకెళ్లి, చాకును వేడి చేసి ప్రైవేట్ భాగాలపై కాల్చి వాతలు పెట్టింది. అంతేకాకుండా బాలుడిని తీవ్రంగా కొట్టి, మళ్లీ ఈ తప్పు చేయవద్దని బెదిరించింది.ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసిందిబాధతో ఇంటికి తిరిగొచ్చిన బాలుడు జరిగిన ఉదంతాన్ని తల్లిదండ్రులకు వివరించడంతో వారు షాకయ్యారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు. టీచర్ దుర్మార్గాన్ని ప్రశ్నించిన తమపై స్కూల్ యాజమాన్యం బెదిరిస్తోందని కుటుంబ సభ్యులు మీడియా ముందు వాపోయారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు టీచర్, ప్రిన్సిపాల్, పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపు తున్నారు.ఇదీ చదవండి: ఇండిగో విమానంలో పొగలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ Deeply shocked by the horrifying incident in Varanasi, where a 5-year-old was brutally tortured by a teacher. Cruelty against children is unacceptable. I demand swift & strict legal action against the teacher & school admin. Zero tolerance for abuse! #Varanasi pic.twitter.com/mnOd0UOk3S— Rais Shaikh (@rais_shk) July 27, 2026అఖిలేష్ యాదవ్ స్పందనఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఇది అత్యంత తీవ్రమైన దారుణమైన ఘటన అన్నారు. దీనివల్ల ఆ చిన్నారిపై జీవితాంతం కోలుకోలేని మానసిక ప్రశాంతత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలతో సానుభూతి, మానవత్వంతో ఎలా ప్రవర్తించాలో ఉపాధ్యాయులకు కనీస అవగాహన ఉండాలి. ఈ ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మరో సంచలనం.. సీజేపీ కీలక నిర్ణయాలు.. మళ్లీ ఆందోళనలు?
న్యూఢిల్లీ: విద్యార్థులపై దాడులు చేసిన పోలీసులపై కేసులు పెడతామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తెలిపింది. న్యూఢిల్లీలో ఆ పార్టీ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆందోళన సమయంలో విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చర్చల సమయంలోనూ కేసులు ఎత్తేస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తమకు తెలిపారని చెప్పారు.ఒప్పందం అమలు చేయకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామని కేంద్రానికి సీజేపీ వార్నింగ్ ఇచ్చింది. ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌కు ఉద్దేశించి ఎక్స్‌లో కూడా సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా ఓ పోస్ట్ చేశారు. బిహార్, పశ్చిమ బెంగాల్లో విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు దాడులు చేయడాన్ని ప్రస్తావించారు."జేపీ నడ్డా, జితేంద్ర సింగ్.. ఆందోళనకారులపై పోలీసు చర్యలు ఉండవని జరిగిన ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని మేము గమనిస్తున్నాం. బిహార్, బెంగాల్లో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో వందలాది మందిపై నిఘా పెట్టి వేధిస్తున్నారు. ఆందోళనకారులకు లాజిస్టిక్స్ సాయం అందిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలను ఢిల్లీలో అదుపులోకి తీసుకుంటున్నట్టు ఎన్నో నివేదికలు వస్తున్నాయి. ఆందోళనకారులపై నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లను వెంటనే ఉపసంహరించాలి. విద్యార్థులను విడుదల చేయాలి. ఇకపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, భాజపా మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదు. మా ఒప్పందానికి అనుగుణంగా ఇదంతా అమలు కావాలి. లేదంటే మేము మళ్లీ ఆందోళనలో కూర్చోవాల్సి వస్తుంది. చట్టపరమైన కేసులపై రాతపూర్వక ఒప్పందాన్ని భారత ప్రభుత్వంతో నిర్ణయించిన గడువులతో పాటు రేపటిలోగా మాకు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం" అని రాంకా తెలిపారు.జూలై 25న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఈ ఆందోళన విరమించారు. ఆ సమయంలో సీజేపీ, ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్‌తో జరిగిన ఒప్పందంలో కేసులు ఎత్తివేయడం, పోలీసుల వేధింపులు అడ్డుకోవడం, ప్రశ్నపత్రాల లీక్‌లను అరికట్టే చట్టం తీసుకురావడం వంటి అంశాలకు ప్రభుత్వం అంగీకరించింది.అంతకుముందు రోజే సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్.. అసోం, పశ్చిమ బెంగాల్, బిహార్‌లో విద్యార్థులు, ఇతర ఆందోళనకారులను అరెస్టు చేస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. వారిని వెంటనే విడుదల చేసి, ఎఫ్ఐఆర్లను ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరారు."అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్‌లో విద్యార్థులు, ఇతర ఆందోళనకారులను లక్ష్యంగా చేసుకుని అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం జరుగుతోందని మాకు ఎన్నో నివేదికలు వస్తున్నాయి. ఇది మాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది" అని దాస్ తెలిపారు. -
ఇండిగో విమానంలో పొగలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్
దుబాయ్ నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ఇండిగో (IndiGo) విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఉన్నట్టుండి విమానంలోని కార్గో ఏరియా నుంచి పొగలు రావడంతో, సోమవారం రోజున గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.మొత్తం 194 మంది సిబ్బందితో దుబాయ్ నుండి ముంబైకి బయలుదేరిన IGO 1452 విమానంలో మధ్యాహ్నం2:45 గంటలకు ఎయిర్‌లైన్ సిబ్బంది పొగను గుర్తించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించగా, రాజ్‌కోట్ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి (Emergency) ప్రకటించారు. మధ్యాహ్నం 3:27 గంటలకు విమానం రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. లోపల ఉన్న 194 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పాల్చుకున్నారు.రాజ్‌కోట్ విమానాశ్రయ డైరెక్టర్ దిగంత బోరా, ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.పి. తరేతియా ఈ ఘటనపై స్పందిస్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదనీ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని వెల్లడించారు.ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసిందిప్రమాదం ఏమీ లేదుముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పైలట్ అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారని అధికారులు తెలిపారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ టెక్నికల్ టీమ్ వెంటనే విమానాశ్రయానికి చేరుకుని విమానాన్ని తనిఖీ చేసింది. తనిఖీల అనంతరం విమానంలో ఎలాంటి మంటలు (Fire) చెలరేగలేదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి : రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ,1.69 లక్షల కంపెనీ!ఇదీ చదవండి: వీకెండ్ క్లాస్‌లో ఐఐఎం ప్రొఫెసర్ సర్ప్రైజ్, నెటిజన్లు ఫిదా -
‘ఆ ప్రభుత్వ ఉద్యోగాలు చెల్లవు’.. సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ
సాక్షి,చెన్నై: మద్రాస్ హైకోర్టులో సీఎం విజయ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాట కుటుంబాలకు సీఎం విజయ్ అందించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను రద్దు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో టీవీకే నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తొక్కిసలాట జరిగి 41మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు నేతృత్వంలో తమిళనాడు రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం, సీబీఐ దర్యాప్తును కొనసాగిస్తున్నాయి.ఈ క్రమంలో గత నెలలో సీఎం విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలలోని 32 మందికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందించారు. ఆ నియామకాలపై దాఖలైన పిటిషన్లపై సోమవారం మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో కరూర్ బాధిత కుటుంబాలకు సీఎం విజయ్ అందించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు చెల్లవని స్పష్టం చేసింది. రాజ్యాంగ పరిమితులకు లోబడే వ్యవహరించాలని ఆదేశించింది. బాధితులకు ఆర్ధిక సాయం అందించవచ్చు. కానీ ఉద్యోగం ఇవ్వడం సమంజసం కాదని తెలిపింది. ప్రభుత్వ బస్సుల్లో మరణించినవారికి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది అర్హత, నిర్దేశిత నియామక ప్రక్రియ (TNPSC వంటి పరీక్షలు) ద్వారా రావాలే తప్ప, ఇలా ఉచితంగా పంచేది కాదని స్పష్టం చేసింది.ఇది సాధారణ అభ్యర్థుల సమానత్వ హక్కును దెబ్బతీస్తుందని పేర్కొంది. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ఎంతైనా ఆర్థిక సాయం అందించుకోవచ్చని, కానీ రాజ్యాంగ నిబంధనలు, పరిమితులను దాటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. అర్హత ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పెట్టేది కాదని వ్యాఖ్యానిస్తూ కరూర్ బాధితులకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని తీర్పు ఇచ్చింది. దీంతో సీఎంగా విజయ్‌కు తొలిసారి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సీఎం విజయ్ తీసుకున్న ఈ ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. -
జంతర్‌మంతర్ .. ఢిల్లీలో మునిగితే ముస్సోరిలో తేలాడు
సాక్షి, ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నిరసనకారులకు ఆహరం పంపిణీ చేసిన వ్యక్తిని పోలీసులు విచారించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జునైద్ అనే వ్యక్తి అక్కడి నిరసన కారులకు ఆహరం సరఫరా చేశారు. దీనిని గమనించిన పోలీసులు అతనిని భిన్న విధాలుగా ప్రశ్నించి చివరికి కళ్లకు గంతలు కట్టి ముస్సోరిలో వదిలేశారు. ఈ వివరాలను ఆ బాధితుడు సోషల్ మీడియావేదికగా పంచుకున్నారు.వివరాల్లోకి వెళితే గత శుక్రవారం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న నిరసనకారులకు జునైద్ ఆహరం సరఫరా చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో ఢిల్లీ పోలీసులు అతని వద్దకు వచ్చి ప్రశ్నించడం మెుదలు పెట్టారు. నువ్వు ఈ ఆహరం ఎందుకు పంపిణీ చేస్తున్నావు. దీనికోసం నీకు ఎవరు సహాయం చేస్తున్నారు. రాత్రంతా పోలీసుల అదుపులో ఉంచుకొని ఆ బాధితుడు కళ్లకు గంతలు కట్టి క్యాబ్‌లో తీసుకెళ్లి ముస్సోరిలో వదిలివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఈ వివరాలు తెలుసుకున్న విద్యార్థుల న్యాయ సహాయ బృందం తనను సంప్రదించిందన జునైద్ తెలిపారు. కాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ధర్నా చేయగా ఎట్టకేలకు మంత్రి రాజీనామా చేశారు. దీంతో సీజేపీ నిరసన ముగిసింది.Mohammad Junaid Used and Thrown by CJP Founders!!Mohammad Junaid who played the biggest part in CJP Protest by supplying Non Stop Bread Pakodas, Samosas, Biryani and various other dishes for 40 days is now feeling cheated by CJP Founders!!During an Interview the reporter… pic.twitter.com/L9j8qiwyaa— Rohit (@Iam_Rohit_G) July 26, 2026 -
రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!
Satyanarayan Nuwal Success Story అత్యంత తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి, విజయం సాధించి బిలియనీర్‌గా అవతరించిన వ్యాపారవేత్తల విజయగాథల గురించి చాలానే విన్నాం. అయితే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా, ఎన్న సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ఏకంగా రూ.72000 కోట్ల ఆస్తికి యజమాని అయిన సక్సెస్ స్టోరీ విన్నారా? చేతిలో చిల్లి గవ్వ లేని స్థితి నుండి.. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పడుకునే స్థాయి నుండి మొదలై.. పట్టుదలతో దేశంలోనే అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో ఒకరిగా నిలిచిన సత్యనారాయణ్ నువాల్ జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం. పదండి ఈ వివరాలేంటో తెలుసుకుందాం.రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన అతని పేరే 72 ఏళ్ల సత్యనారాయణ్ నువాల్ (Satyanarayan Nuwal). సుమారు రూ. 45,650 కోట్ల నికర ఆస్తితో నాగ్‌పూర్‌లోని అత్యంత ధనవంతుడు. సత్యనారాయణ్ నువాల్ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల 10వ తరగతితోనే చదువు ఆపేసాడు. 18-19 ఏళ్లకే వివాహం, బాధ్యతలు నెత్తినపడ్డాయి. రాజస్థాన్‌లోని భిల్వారాలో పట్వారీగా పనిచేసిన అతని తండ్రి 1971లోనే రిటైర్ అయ్యారు. తాతగారు ఒక చిన్న కిరాణా కొట్టు నడిపేవారు, సపోర్ట్ చేయడానికి ఎలాంటి కుటుంబ వ్యాపారం లేదు. 18 ఏళ్ల వయసులో సిరా (Ink) తయారీ యూనిట్‌ను ప్రారంభించినా అది విఫలమైంది. దాంతో బతుకుదెరువు కోసం కొత్త ప్రాంతానికి వచ్చాడు.చేతిలో పైసా లేకుండా, ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో చేరుకున్నాడు. 1977లో, మహారాష్ట్రలోని బల్హార్షా రైల్వే స్టేషన్‌కు చేరాడు. ఆ రాత్రి అతనికి ఆశ్రయం ఆ రైల్వే ప్లాట్‌ఫారమే అయింది. ఆ రాత్రి ప్లాట్‌ఫారమ్‌పై పడుకున్నప్పుడు, భవిష్యత్తులో తన జీవితం ఎలా మారబోతోందో అతనికి కనీసం ఊహ కూడా లేదు.ఇల్లు అద్దెకు తీసుకోవడానికి కూడా ఆయన దగ్గర తగినంత డబ్బు ఉండేది కాదు. దీంతో ఆయన చాలా రాత్రులు రైల్వే స్టేషన్లోనే గడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం ఆయన ఫౌంటెన్ పెన్నులు కూడా అమ్మేవారు.చిన్న అడుగుతో మొదలైన వ్యాపారంబల్హార్షాలో నువాల్‌కు అబ్దుల్ సత్తార్ అల్లాభాయ్ పరిచయమయ్యారు. ఆయన బావులు తవ్వడానికి, రోడ్లు వేయడానికి, బొగ్గు గనులకు ఉపయోగించే పేలుడు పదార్థాల (Explosives) వ్యాపారి. నువాల్ దీనిని ఒక అవకాశంగా మలుచుకున్నాడు. నెలకు వెయ్యి రూపాయల అద్దె చెల్లించి అబ్దుల్ సత్తార్ లైసెన్స్‌ను ఉపయోగించుకుని వ్యాపారం ప్రారంభించాడు. 25 కేజీల పేలుడు పదార్థాలను రూ. 250కి కొని, రూ.800కి అమ్మేవాడు. లాభాలు తక్కువే అయినా, అది నిజాయితీతో కూడిన శ్రమ.#WATCH | Solar Group Chairman Satyanarayan Nuwal receives Padma Shri award from President Droupadi Murmu for his contribution to India's defence manufacturing ecosystem pic.twitter.com/xEuTePY74k— ANI (@ANI) May 25, 2026త్వరలోనే ఆయన కష్టపడే తత్వాన్ని, నిజాయితీని బ్రిటిష్ కంపెనీ 'ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్' అధికారులు గుర్తించారు. ఇది ఆయనకు వ్యాపారంలో సరికొత్త తలుపులు తెరిచింది. ఒక చిన్న వ్యాపారిగా ఉన్న నువాల్, ఎక్స్‌ప్లోజివ్స్ బిజినెస్లోని మెళకువలను లోతుగా నేర్చుకున్నాడు.'సోలార్ ఇండస్ట్రీస్' అద్భుత ప్రగతి1995లో, తన 37వ ఏట నువాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ.60 లక్షల రుణం తీసుకుని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా (Solar Industries India) పేరుతో ఒక చిన్న తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. చాలామంది ఇది పెద్ద రిస్క్ అనుకున్నారు, కానీ నువాల్ తనపై నమ్మకంతో ముందడుగు వేశారు.2006 IPOఐపీఓ (IPO)కి వెళ్లే సమయానికి రూ.78 కోట్ల టర్నోవర్, రూ.11 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఈ నిధులతో దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సోలార్ ఇండస్ట్రీస్ భారతదేశంలోని 9 రాష్ట్రాల్లో, 29 నగరాల్లో తయారీ కేంద్రాలను కలిగి ఉంది. వీటితో పాటు జాంబియా, ఘనా, నైజీరియా, టర్కీ, టాంజానియా మరియు సౌత్ ఆఫ్రికాలలో 6 విదేశీ యూనిట్లను నడుపుతోంది.రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర2010లో భారతదేశ రక్షణ దళాలకు (Defence Forces) వార్హెడ్ల కోసం పేలుడు పదార్థాలను తయారు చేసే లైసెన్స్‌ను భారత ప్రభుత్వం నుండి పొందిన మొదటి ప్రైవేట్ కంపెనీగా సోలార్ ఇండస్ట్రీస్ రికార్డు సృష్టించింది.'మేక్ ఇన్ ఇండియా' మిషన్‌లో భాగంగా కంపెనీ ఎక్స్‌ప్లోజివ్స్, ప్రొపెల్లెంట్స్, గ్రెనేడ్లు, డ్రోన్లు మరియు వార్హెడ్ల తయారీని ప్రారంభించింది. పినాకా (Pinaka) రాకెట్లు: ఈ రాకెట్ల కమర్షియల్ ప్రొడక్షన్ కంపెనీకి ఒక మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం రక్షణ రంగం నుంచి అంతర్జాతీయ ఆర్డర్లు భారీగా పెరుగుతున్నాయి. కంపెనీ రాబడిలో మెజారిటీ భాగం ఎగుమతుల (Exports) ద్వారానే వస్తోంది.2026 జులై నాటికి సోలార్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ,1.69 లక్షల కోట్లకు చేరుకుంది. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం పొందిన నువాల్ ఆస్తి విలువ సుమారు రూ.7.5 బిలియన్ డాలర్లు (రూ.72,000 కోట్లకు పైగా).ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసిందిపద్మశ్రీ పురస్కారం2026, మే 25న రాష్ట్రపతి భవన్లో జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో దేశ రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను పెంపొందించినందుకు గాను సత్యనారాయణ్ నువాల్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'పద్మశ్రీ' అవార్డును ప్రదానం చేశారు. ఇంతఎత్తుకు ఎదిగినా ఆయన తన మూలాలను మరచిపోలేదు. నాగ్‌పూర్ పరిసర ప్రాంతాలలో విద్య, సమాజ అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు విస్తృతంగా విరాళాలు అందిస్తూ గొప్ప దాతగా పేరు గాంచారు.ఇదీ చదవండి: వీకెండ్ క్లాస్‌లో ఐఐఎం ప్రొఫెసర్ సర్ప్రైజ్, నెటిజన్లు ఫిదా -
విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేయాలి.. ఇన్ని రాష్ట్రాల్లో నిరసనలు
కేంద్ర విద్యామంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు విద్యార్థి సంఘాలు పంజాబ్, ఝార్ఖండ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల విద్యామంత్రులు రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్రశ్నపత్రం లీక్ అంశం ఒక్క పరీక్షకే లేదా ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నో పరీక్షలతో ఈ విషయం ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రం లీక్ అంశంపై నిరసనలు కొనసాగుతున్నాయి.లక్నోలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులు భారీ నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రశ్నపత్రం లీక్ ఘటనల్లో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేశారని, ఇలాంటి ఆరోపణలు వచ్చిన రాష్ట్రాల్లో కూడా విద్యాశాఖ మంత్రులు అదే విధంగా బాధ్యత వహించి, వారు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని నిరసనకారులు అంటున్నారు.పంజాబ్‌లో రెండుసార్లు నిర్వహించిన ప్రభుత్వ నియామకాల అంశంపై కూడా రాజకీయ వేడి పెరిగింది. పంజాబ్‌లో కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలి దళ్ పార్టీలు భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నాపత్రం లీక్ అంశంపై నిలదీస్తున్నాయి.పంజాబ్‌లో వరుసగా పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయని, హైటెక్ పద్ధతిలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. రాష్ట్రంలో ఎలాంటి ప్రశ్నపత్రం లీక్ జరగలేదని, సమయానికి నకలు మాఫియాను బయటపెట్టామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఫార్మసీ విభాగం, వ్యవసాయ శాఖకు చెందిన రెండు కేసుల చుట్టూనే ఈ వివాదం కొనసాగుతోంది. ఈ కేసుల వల్ల పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి.ఫార్మసీ ఆఫీసర్ పరీక్ష: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 454 ఫార్మసీ ఆఫీసర్ల నియామకానికి ఇటీవల బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహించిన పరీక్షలో సుమారు 7,000 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే స్పెషల్ కౌంటర్ ఇంటెలిజెన్స్, పోలీసుల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఫరీద్కోట్, ఫిరోజ్‌పూర్, కోట్ కపూరా పరీక్ష కేంద్రాలపై దాడులు చేశాయి.ఈ ఘటనలో 28 మంది అభ్యర్థులతో పాటు మొత్తం 35 మందిని అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థులు తలపాగా, సాక్స్, లోదుస్తుల్లో చిన్న బటన్లు, వైర్లెస్ బ్లూటూత్ పరికరాలు దాచుకుని వచ్చారు. ఫిరోజ్‌పూర్‌లోని ఒక పరీక్ష కేంద్రం నుంచి పెన్ కెమెరాతో ప్రశ్నపత్రాన్ని స్కాన్ చేసి వాట్సాప్ ద్వారా బయటకు పంపారు. అక్కడ హరియాణా, రాజస్థాన్ నుంచి నిర్వహిస్తున్న కంట్రోల్ రూమ్ ద్వారా అభ్యర్థులకు సమాధానాలు చెబుతున్నారు.ఈ ముఠా ఒక్కో అభ్యర్థి నుంచి 3.5 లక్షల నుంచి 13 లక్షల రూపాయలు వసూలు చేస్తోందని సమాచారం. దీన్ని నేరుగా ప్రశ్నపత్రం లీక్, వ్యవస్థ వైఫల్యంగా పేర్కొంటూ రాష్ట్ర ఆరోగ్యమంత్రి, విద్యామంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. ఇది పరీక్షకు ముందు జరిగిన ప్రశ్నపత్రం లీక్ కాదని, పరీక్ష ప్రారంభమైన తర్వాత రియల్ టైమ్‌లో జరిగిన హైటెక్ లీక్ అని, దాన్ని సమయానికి గుర్తించి అడ్డుకున్నామని పంజాబ్ పోలీసులు, అధికారులు చెబుతున్నారు.వ్యవసాయ అభివృద్ధి అధికారి నియామక పరీక్షలో వివాదంవ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో వ్యవసాయ అభివృద్ధి అధికారి నియామక పరీక్షపై చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ పరీక్ష ప్రశ్నపత్రం ముందుగానే లీక్ అయిందని ప్రతిపక్షం, ముఖ్యంగా శిరోమణి అకాలి దళ్, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఈ పరీక్షలో ప్రశ్నపత్రం సెట్లు లీక్ అయ్యాయని, తర్వాత విషయాన్ని దాచిపెట్టేందుకు అసాధారణంగా గ్రేస్ మార్కులు ఇచ్చారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరీక్షపై పారదర్శక విచారణ జరిపి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ పట్టభద్రులు, యువ అభ్యర్థులు నిరసనలు చేపట్టారు. ఇవేగాక, పలు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగాయి. ఆయా రాష్ట్రాల్లోనూ విద్యా శాఖ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. -
కామన్వెల్త్ హీరోకు సీఎం విజయ్ భారీ నజరానా
స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన తమిళనాడు వెయిట్‌లిఫ్టర్ రాజా ముత్తుపాండికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ భారీ నజరానా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.30 లక్షల నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ ముత్తుపాండిని అభినందించారు. ఆయన సాధించిన విజయం తమిళనాడుకు గర్వకారణమని అన్నారు. ముత్తుపాండి విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి రాష్ట్రం, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముత్తుపాండి తమిళనాడులోని కోవిల్పట్టికి చెందినవారు.కాగా, ముత్తుపాండి కామన్వెల్త్ క్రీడల పురుషుల 65 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించాడు.స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలో 126 కిలోలు ఎత్తడంలో విఫలమైన ముత్తుపాండి, రెండో ప్రయత్నంలో అదే బరువును విజయవంతంగా ఎత్తాడు. అనంతరం 129 కిలోల ప్రయత్నం విఫలమైనప్పటికీ, 126 కిలోలతో ఆ విభాగాన్ని ముగించాడు.క్లీన్ అండ్ జర్క్‌లో కూడా తొలి ప్రయత్నంలో 158 కిలోలు ఎత్తలేకపోయిన ముత్తుపాండి, రెండో ప్రయత్నంలో 160 కిలోలు విజయవంతంగా ఎత్తి మొత్తం 286 కిలోల లిఫ్ట్‌తో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. -
శబరిమల భక్తులకు గుడ్‌న్యూస్.. రైల్వేలైన్ పనులు ప్రారంభం
తిరువనంతపురం: సంవత్సరాల తరబడి నెలకొన్న అనిశ్చితి, జాప్యం తర్వాత, కేరళ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించడంతో అంగమాలి - శబరి రైల్వే ప్రాజెక్టుకు పెద్ద ఊపు వచ్చింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టు కోసం భారతీయ రైల్వే ₹505 కోట్లు కేటాయించింది.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు కేరళ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించిందని, శబరి రైల్వే లైన్ నిర్మాణానికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని మంత్రి తెలిపారు. జూలై 22న లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ ప్రకటన చేశారు. భూసేకరణ ప్రక్రియకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ఆయన పేర్కొన్నారు.అంగమాలి-శబరి రైల్వే ప్రాజెక్ట్ మరియు ఆలస్యానికి గల కారణాలు1997-98లో ఎరుమేలి మీదుగా వెళ్లే 111 కిలోమీటర్ల అంగమాలి-శబరి రైల్వే లైన్‌ను మంజూరు చేశారు. 7 కిలోమీటర్ల అంగమాలి-కాలడి సెక్షన్ నిర్మాణం , 10 కిలోమీటర్ల కాలడి-పెరుంబవూర్ సెక్షన్‌పై ప్రాథమిక పనులు ప్రారంభమయ్యాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుండి తగినంత మద్దతు లేకపోవడం, భూసేకరణ మరియు రైల్వే అలైన్‌మెంట్‌కు సంబంధించిన నిరసనలు , న్యాయపరమైన వివాదాల కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది.సవరించిన ప్రాజెక్టు వ్యయం ₹3,801 కోట్లకు పెరిగిందని, ఈ సవరించిన అంచనా ఆమోదం , ప్రాజెక్టు వ్యయ పంపిణీ కోసం కేరళ ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించినట్లు మంత్రి తెలిపారు.2024 ఆగస్టులో , కేరళ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు షరతులతో కూడిన ఆమోదం ఇచ్చింది. అయితే, ప్రాజెక్టు వ్యయంలో 50% భరించడానికి రాష్ట్రం బేషరతుగా అంగీకరించాలని రైల్వే మంత్రిత్వ శాఖ కోరింది. ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రానికి ఉన్న 50% వాటాను ఉపయోగించి అవసరమైన భూమిని సేకరించాలని రైల్వే మంత్రి ముఖ్యమంత్రిని కూడా అభ్యర్థించారు.ప్రాజెక్టుకు అవసరమైన 302 హెక్టార్ల భూమిలో , ఇప్పటివరకు కేవలం 25 హెక్టార్లను మాత్రమే సేకరించారు. మిగిలిన 279 హెక్టార్లను ఇంకా సేకరించాల్సి ఉంది.అంగమలీ-శబరి రైల్వే ప్రాజెక్ట్ 14 ప్రతిపాదిత స్టేషన్లు అంగమలీ, కాలడి, పెరుంబవూరు, ఊడక్కలి, కొత్తమంగళం, మువాట్టుపుజా, వజకులం, తొడుపుజా, కరీంకున్నం, రామాపురం, భరణంగానం, చెమ్మలమట్టం, కంజిరపల్లి , ఎరుమేలి. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత శబరిమల యాత్రికులకు ఎంతో ప్రయోజనం చేకూర్చడంతో పాటు, మధ్య కేరళ వ్యాప్తంగా అనుసంధానాన్ని, అభివృద్ధిని గణనీయంగా మెరుగుపరుస్తుందని అంతా భావిస్తున్నారు. -
ఆసుపత్రి నుంచి సోనమ్ వాంగ్‌చుక్ డిశ్చార్జ్.. నేరుగా అక్కడకు..
గురుగ్రామ్: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ సోమవారం గురుగ్రామ్‌లోని మెదాంతా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన 6 రోజుల పాటు అక్కడ చికిత్స పొందారు. మెదాంతా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే సోనమ్ వాంగ్‌చుక్ తన భార్య గీతాంజలి ఆంగ్మోతో కలిసి రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీకి కృతజ్ఞత చెప్పేందుకే వచ్చానని వాంగ్‌చుక్ అన్నారు. అహింసాయుత ఉద్యమం గాంధీ చూపిన మార్గమని చెప్పారు. ఇంతకు ముందు వాంగ్‌చుక్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వీడియో విడుదల చేస్తూ.. "ఈ రోజు నన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. నా శరీరం నెమ్మదిగా బలాన్ని తిరిగి పొందుతోంది" అని చెప్పారు. లద్ధాక్‌కు తిరిగి వెళ్లే ముందు మహాత్మా గాంధీకి నివాళి అర్పించేందుకు రాజ్‌ఘాట్‌కు వెళ్తానని చెప్పారు. జంతర్ మంతర్ వద్ద జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ప్రశ్నపత్రం లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో సాగిన విద్యార్థుల ఆందోళనకు పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.మెదాంతా ఆస్పత్రి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది. "డిశ్చార్జ్ చేసే సమయానికి ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. ఆయన పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ఔట్ పేషెంగ్లా వచ్చి క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయాలని సూచించాం" అని మెదాంతా ది మెడిసిటీ వైద్య సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ దురాణి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.వాంగ్‌చుక్ జూలై 21న ఢిల్లీలో జరిగిన 'సంసద్ చలో' ర్యాలీ తర్వాత ప్రైవేట్ ఆసుత్రిలో చేరారు. జూలై 18న జంతర్ మంతర్ నుంచి ఆయనను తీసుకెళ్లి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ 3 రోజుల పాటు చికిత్స పొందారు. నీట్ ప్రశ్నపత్రం లీక్‌కు వ్యతిరేకంగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో విస్తృత సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వాంగ్‌చుక్ జంతర్ మంతర్ వద్ద 26 రోజుల నిరాహార దీక్షకు నాయకత్వం వహించారు. ప్రధాన్ రాజీనామాకు ఒక రోజు ముందు, జూలై 24న ఆయన నిరాహార దీక్షను ముగించారు. -
వీకెండ్ క్లాస్‌లో ఐఐఎం ప్రొఫెసర్ సర్ప్రైజ్, నెటిజన్లు ఫిదా
సండే క్లాస్‌లో స్టూడెంట్స్ అందరూ బిజీగా ఉన్నారు. లంచ్ బ్రేక్ అవుతున్నా కూడా అందరూ క్లాస్‌లో మునిగి పోయారు. ఇది చూసిన ఒక ప్రొఫెసర్‌కి ఒక ఆలోచన తట్టింది. ఆ విద్యార్థుల కోసం ఏకంగా డామినోస్ (Domino’s) పిజాలను ఆర్డర్ చేశారు. ఈ స్వీట్ జెస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.IIM షిల్లాంగ్ విద్యార్థి రోహన్ సాహా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సాధారణంగా ఐఐఎమ్‌లలో వీకెండ్స్‌లో కూడా క్లాసులు జరగడం సహజమే, కానీ ఈ సమయంలో కొందరు ప్రొఫెసర్లు ఆ కష్టాన్ని అర్థం చేసుకుంటారు అని రోహన్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Rohan Saha (@rohan_ntshh) వీకెండ్ క్లాసులను కొందరు ప్రొఫెసర్లు ఆ తరగతులను ఎంతో ఆహ్లాదకరంగా మారుస్తారు! అలా ప్రొఫెసర్ అరుణి సర్ ఎంతో దయాహృదయుడు. షెడ్యూల్ వల్ల మేం లంచ్ మిస్ అవుతున్నామని తెలుసుకుని, మా అందరి కోసం పిజాలు ఆర్డర్ చేశారు. థాంక్యూ సర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. వీడియోలో క్లాస్‌రూమ్‌లో డామినోస్ పిజా బాక్సుల వరస కనిపిస్తుంది. విద్యార్థులందరూ ఎంతో సంతోషంగా వచ్చి తమ పిజా స్లైసులను ఆరగించారు. నెటిజన్ల కామెంట్స్ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు ప్రొఫెసర్ అరుణిపై ప్రశంసల వర్షం కురిపించారు. తమ పాత కాలేజ్ రోజులను గుర్తుచేసుకుంటూ రకరకాల కామెంట్లు చేశారు. చాలా అక్కీ స్టూడెండ్స్. నిజంగా ఆ ప్రొఫెసర్ చాలా గ్రేట్ అంటూ కొందరు ఆయన్ని పొగిడేశారు. "ఈ ప్రొఫెసర్ పూకీ (Pookie) లాంటివారు" అని మరొకరు కామెంట్ చేశారు.ఒకవేళ మీరు ఆ రోజే డైటింగ్ చేస్తుంటే పరిస్థితి ఏంటి?" అని ఒకరు జోక్ చేయగా, "నేను తప్పుడు సబ్జెక్టులను ఎంచుకున్నాను అని మరొకరు ఫన్నీగా స్పందించారు. మరికొందరు తమ ప్రొఫెసర్లతో పోల్చు కున్నారు. అదే మా ప్రొఫెసర్ అయితేనా మళ్లీ వచ్చే ఆదివారం కలుద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయేవారు అని ఒకరంటే, మనకెందుకు దొరకరు భయ్యా ఇలాంటి ప్రొఫెసర్లు దొరకరు మరికొందరు సరదాగా జెలస్ ఫీలవ్వడం విశేషం. ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసింది -
పరిష్కారమా... కొత్త సవాలా?
2026 ‘నీట్’ ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆందో ళనకు దారితీశాయి. ఫలితంగా పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి నీట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ప్రశ్నాపత్రాన్ని కాగితం నుంచి కంప్యూ టర్కు మార్చడమే సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని గుర్తించాలి. అసలు సమస్య పరీక్షా విధానంలో కాదు, ప్రశ్నపత్రాల గోప్యత, భద్రత, జవాబుదారీతనం వంటి వ్యవస్థాగత లోపాల్లో ఉంది. అంతర్జాతీయ అనుభ వాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షలలో ఒకటైన చైనా గావ్కావ్, దక్షిణ కొరియా సీఎస్ఏటీ ఇప్పటికీ పేపర్–పెన్సిల్ విధానంలోనే అత్యంత కట్టు దిట్టమైన భద్రతతో విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. దీనివల్ల పరీక్షా విధానం కంటే పటిష్టమైన భద్రతా వ్యవస్థ, పారదర్శకత, క్రమశిక్షణే విశ్వస నీయ పరీక్షలకు పునాది అని స్పష్టమవుతోంది. నీట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తే, కోట్లాది మంది విద్యార్థులను ఒకే సమయంలో పరీక్షించడం సాధ్యం కాదు. అందువల్ల బహుళ షిఫ్టులు తప్పనిసరి అవుతాయి. జేఈఈ మెయిన్‌లో కనిపించినట్లుగా వివిధ షిఫ్టుల్లో ప్రశ్న పత్రాల క్లిష్టతలో తేడాలు రావడం, నార్మలైజేష¯Œ పై వివాదాలు తలెత్తడం వల్ల సమాన ప్రతిభ కలిగిన విద్యార్థులకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల శాట్, జీఆర్ఈ వంటి పరీక్షల్లో ఉపయోగించే ఐటమ్ రెస్పాన్స్ థియరీ వంటి శాస్త్రీయ మనో కొలమాన పద్ధతులను అధ్యయనం చేసి అమలు చేయడం మరింత సముచితం.కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో మరో ప్రధాన సవాలు డిజిటల్ అంతరం. పట్టణ విద్యార్థులతో పోలిస్తే గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు కంప్యూటర్ వినియోగం, ఆన్లైన్ పరీక్షల అనుభవం తక్కువగా ఉండే అవకాశం ఉంది. వైద్య విద్య వంటి అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షలో సాంకేతిక పరిజ్ఞాన పరిచయం విద్యార్థి ప్రతిభను ప్రభావితం చేయకూడదు. కాబట్టి ఆన్లైన్ విధానాన్ని అమలు చేయాలంటే ముందుగా దేశవ్యాప్తంగా సమాన డిజిటల్ మౌలిక సదుపాయాలు, శిక్షణ, మాక్ పరీక్షలు అందుబాటు లోకి తీసుకురావడం అత్యవసరం. పరీక్షపై నమ్మకాన్ని పునరుద్ధరించడం. ప్రశ్నాపత్రాల భద్రతను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లడం, లీకేజీలకు పాల్పడిన వారిపై వేగంగా కఠిన చర్యలు తీసుకోవడం, అత్యవసరం. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల్లో సంస్కరణలు హడా వుడిగా కాకుండా సమగ్ర ప్రణాళికతో చేపట్టాల్సిన అవసరం ఉంది.– ఏటూరి శేఖర్ శర్మ, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి -
గడ్కరీ కీలక నిర్ణయం.. టెన్షన్ మొదలైందా?
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ గురించి గత కొన్నాళ్లుగా నడుస్తున్న రచ్చ(చర్చ) సంగతి తెలిసిందే. అయితే నీట్ వ్యవహారంతో ఇన్నాళ్లు ఈ అంశం కాస్త పక్కకు జరిగిపోయింది. అయితే.. ఇప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చుట్టూ కొత్త వివాదం మొదలైంది. ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్(E20) విధానంతో గడ్కరీ కుటుంబం లాభపడుతోందని.. ఆయన కూడా రాజీనామా చేయాల్సిందేనంటూ డిమాండ్ ఒకటి తెర మీదకు వచ్చింది. ఈ తరుణంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. E20 పెట్రోల్ విధానం కేవలం స్వార్థపూరితంగా ఆయన తెచ్చారని.. దాని వల్ల ఆయనకు, తన కుటుంబానికి లాభాలు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఆయన న్యాయపోరాటానికి దిగారు. తప్పుడు పోస్టులు, డీప్‌ఫేక్ కంటెంట్‌పై బాంబే హైకోర్టును ఆశ్రయించారు.వీటిని పరువు నష్టం కలిగించే ప్రచారంగా పేర్కొన్న గడ్కరీ.. సంబంధిత సోషల్ మీడియా సంస్థలు, గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్ కేసు దాఖలు చేసేందుకు కోర్టు అనుమతి కోరారు. ఈ విధానం వల్ల తనకు పైసా లాభం లేదని.. తమ కుటుంబం నిర్వహిస్తున్న చెరకు వ్యాపారంతో లాభాలు కూడా పెద్దగా రావని అందులో వివరించారు.సమగ్ర కథనం: ఇథనాల్ అంశం.. నా వాటా ఎంతంటే..: గడ్కరీబాంబే హైకోర్టును ఆశ్రయించిన గడ్కరీగడ్కరీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన బాంబే హైకోర్టు.. కేసు దాఖలుకు అనుమతి ఇచ్చింది. తనపై ప్రచారం జరుగుతున్న కంటెంట్ ముంబైలోనూ అందుబాటులో ఉందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే అంశంపై నాగ్‌పూర్‌లో ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ20 ఇథనాల్ విధానానికి సంబంధించి తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు.ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత.. గడ్కరీనే టార్గెట్?ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో.. సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. తదుపరి టార్గెట్ నితిన్ గడ్కరీనే అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ20 ఇంధనంపై గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం, వాహనదారుల నుంచి వస్తున్న అభ్యంతరాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్చ మరింత వేడెక్కింది. అయితే గడ్కరీపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఇటు కేంద్రం కూడా ఇథనాల్ పెట్రోల్ విషయంలో ఎలాంటి పొరపాట్లు లేవని అంటోంది కూడా.అసలు ఈ20పై వివాదం ఏంటి?కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ20 ఇంధనం అంటే.. 80 శాతం పెట్రోల్‌కు 20 శాతం ఇథనాల్‌ను కలిపిన మిశ్రమం. ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, రైతులకు ప్రయోజనం కల్పించడం, కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే కొందరు వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు మాత్రం పాత వాహనాలపై ఈ20 ప్రభావం, మైలేజీ తగ్గుదల వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.కోర్టు బాట పట్టిన గడ్కరీతనపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు గడ్కరీ తీసుకున్న న్యాయపరమైన చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ20పై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న వేళ.. తప్పుడు ప్రచారాలపై చట్టపరంగా ఎదుర్కొంటాననే సంకేతాన్ని ఆయన ఇచ్చినట్లు కనిపిస్తోంది. -
ఆగని ‘నీట్’ బలవన్మరణాలు.. జాబితాలో..
న్యూఢిల్లీ: ‘నీట్ యూజీ’పేపర్ లీక్, పరీక్షా విధానంలోని లోపాల కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా చేయగా, సమస్యల పరిశీలన కోసం ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే, పరీక్షా వివాదాలు, మానసిక ఒత్తిడి కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న విషాదకర ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని అహిల్యానగర్‌కు చెందిన అంకితా సాంగ్లే అనే విద్యార్థిని రీ ఎగ్జామ్‌లో తక్కువ మార్కులు రావడంతో, మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఇదే రకమైన మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న పలువురు విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి.ప్రదీప్ మేఘవాల్ (రాజస్థాన్): జుంఝును జిల్లాకు చెందిన 22 ఏళ్ల ఈ యువకుడు, మే 2026లో నీట్ యూజీ పరీక్ష రద్దు కావడంతో సీకర్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.ఋతిక్ మిశ్రా (ఉత్తర ప్రదేశ్): లఖింపూర్ ఖేరీకి చెందిన 21 ఏళ్ల ఈ విద్యార్థి, పరీక్షలో గందరగోళం, మానసిక ఒత్తిడి కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.సిద్దార్థ్ హెగ్డే (గోవా): 17 ఏళ్ల ఈ విద్యార్థి మే 2026లో నీట్ పరీక్ష రద్దయిన తర్వాత తీవ్ర మనోవేదనతో ప్రాణాలు తీసుకున్నారు.భాగ్యశ్రీ (కర్ణాటక): కలబుర్గికి చెందిన 18 ఏళ్ల ఈ విద్యార్థిని పీయూసీ బోర్డు పరీక్షలో 92 శాతం మార్కులు సాధించినప్పటికీ, నీట్ ఆందోళనలతో మే 2026లో బలవన్మహత్వానికి పాల్పడ్డారు.అంశిక పాండే (ఢిల్లీ): ఆదర్శ్ నగర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల ఈ పరీక్షార్థిని మానసిక ఒత్తిడి కారణంగా ప్రాణాలు విడిచిపెట్టారు.ఉమేష్ మాలీ(రాజస్థాన్): సీకర్‌లో నీట్ ప్రిపరేషన్ చేస్తున్న ఈ 22 ఏళ్ల యువకుడు జూన్ 15న ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారు.రేణు మీణా (రాజస్థాన్): అన్వర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఈ ప్రతిభావంతురాలైన విద్యార్థిని జూన్ 2026లో నీట్ వివాదాల కారణంగా ప్రాణాలు తీసుకున్నారు.రియా కుమారి థాపా (ఉత్తరాఖండ్): డెహ్రాడూన్‌కు చెందిన 23 ఏళ్ల ఈ అభ్యర్థి జూన్ 2026లో పేపర్ లీక్ ఆందోళనలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.శివానీ యాదవ్ (ఉత్తర ప్రదేశ్): లక్నోకు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని పరీక్ష రద్దు, వివాదాలతో ఆత్మహత్య చేసుకున్నారు.కహాన్ పటేల్ (గుజరాత్): అహ్మదాబాద్‌కు చెందిన 17 ఏళ్ల ఈ విద్యార్థి జూన్ 18, 2026న అపార్ట్మెంట్ పైనుంచి దూకి ప్రాణాలు వదిలారు.ఆకాంక్ష చతుర్వేది (మధ్య ప్రదేశ్): మౌగంజ్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఈ విద్యార్థిని నాగ్‌పూర్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.రీమా బేగం (అస్సామ్): 21 ఏళ్ల ఈ నీట్ అభ్యర్థి జూన్ 2026లో మానసిక ఒత్తిడితో ప్రాణాలు విడిచారు.అవంతిక మౌర్య (మధ్య ప్రదేశ్): ఇండోర్‌కు చెందిన 21 ఏళ్ల ఈ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో భవనంపై నుంచి పడి మృతి చెందారు.జతిన్ కుమార్ (ఉత్తర ప్రదేశ్): ఘజియాబాద్‌కు చెందిన 22 ఏళ్ల ఈ విద్యార్థి జూన్ 2026లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఎస్. గోపిక (తమిళనాడు): సేలం జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 19, 2026న రీ-టెస్ట్ ఒత్తిడితో ప్రాణాలు విడిచారు.షేక్ సనా (తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 21, 2026న జరగాల్సిన రీ-నీట్ పరీక్షకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఆత్మహత్య చేసుకున్నారు.వెత్రియానందం (తమిళనాడు): హోసూర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల విద్యార్థి జూన్ 2026లో పరీక్షా వివాదాల కారణంగా ప్రాణాలు తీసుకున్నారు.సిమ్రన్ (హర్యానా): హిసార్‌కు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 21, 2026న పునఃపరీక్షకు ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.రోషిణి (తమిళనాడు): ధర్మపురి జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 2026లో పరీక్షా ఒత్తిడి కారణంగా బలవన్మహత్వానికి పాల్పడ్డారు.అంకితా సాంగ్లే (మహారాష్ట్ర): అహిల్యానగర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని నీట్ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన కారణంగా ప్రాణాలు కోల్పోయారు.ఇది కూడా చదవండి: ‘జంతర్ మంతర్’ లవ్ స్టోరీ.. తలకు గాయంతో వివాహం! -
లాఠీచార్జ్ ఎలా చేస్తారు?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపుతూ పోలీసులు మితిమీరిన బలప్రయోగాన్ని సమర్థించలేరని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.కాగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ నిరసనల సందర్భంగా వారిపై పోలీసుల చర్యల విషయమై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సోమవారం విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కేవలం నిరసన జరుగుతోందనే కారణంతోనే లాఠీచార్జ్ చేయలేరు. ఎక్కడైనా పోలీసులు మితిమీరిన బలప్రయోగానికి పాల్పడితే దానిని అరికట్టాల్సిందే. ప్రతి పౌరుడి హక్కులను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్రానిదే.ఈ విచారణలో జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి మాట్లాడుతూ..‘విద్యార్థుల భద్రత ఎంత ముఖ్యమో, పోలీసుల భద్రత కూడా అంతే ముఖ్యం. నిరసనకారులు పోలీసులపై కూడా దాడులకు పాల్పడకూడదు. పోలీసుల చర్యలకు సంబంధించి తగిన ఎస్ఓపీలు ఎందుకు లేవో రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరవచ్చు" అని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో నిరసనల్లోకి ఆకతాయిలు, సామాజిక విద్రోహ శక్తులు చొరబడి పోలీసులపై దాడులకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని కోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని స్పష్టం చేసింది. శాంతియుత నిరసనలు, పోలీసుల చర్యల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన మార్గదర్శకాలు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిరసనకారులు కూడా హింసకు తావులేకుండా ఆత్మనియంత్రణ, క్రమశిక్షణ పాటించడం అత్యంత కీలకమని పేర్కొంది. విద్యార్థుల నిరసనలు, పోలీసుల వ్యవహార శైలిపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. -
ఎల్ నినో ఎఫెక్ట్: భూమికి పొంచి ఉన్న మరో ముప్పు?!
ప్రపంచం ఇప్పటికే వాతావరణ మార్పుల సెగను ఎదుర్కొంటోంది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వేడిగాలులు, కరవు పరిస్థితులు.. మరోవైపు ఊహించని స్థాయిలో విరుచుకుపడుతున్న తుపాన్లు, వరదలు అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న ఓ పరిణామం ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. సూపర్ ఎల్‌నినో.. గాడ్జిల్లా ఎల్‌నినో అంటూ చర్చకు వచ్చిన ఈ వాతావరణ ప్రభావం 2026పైనే అందరి దృష్టిని మళ్లించింది. అయితే శాస్త్రవేత్తల తాజా అంచనాలు మాత్రం అసలు ప్రభావం మరింత ఆలస్యంగా కనిపించే అవకాశాన్ని సూచిస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే.. 2026 ప్రపంచంలో రెండో అత్యంత వేడిగల సంవత్సరంగా నిలిచే అవకాశం ఉందని అంటోంది. మరి మొదటి ఏడాది?. దానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని అంటున్నారు. 2027 మాత్రం గత శతాబ్దానికి పైగా ఉన్న ఉష్ణోగ్రత రికార్డులను సవాలు చేసే స్థాయికి చేరవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్ నినో పరిస్థితులను పేర్కొంటున్నారు.సముద్రంలో దాగిన వేడి.. భూమిపై ప్రభావంఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో సహజంగా సంభవించే వాతావరణ మార్పు. సాధారణ పరిస్థితుల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు.. ఆ వేడి ప్రపంచవ్యాప్తంగా గాలుల కదలికలు, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో భారీ స్థాయిలో వేడి నిల్వ ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. సముద్రం లోపల పేరుకుపోయిన ఈ వేడి క్రమంగా పైకి వచ్చి వాతావరణ వ్యవస్థలోకి చేరినప్పుడు.. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.ప్రస్తుత ఎల్ నినోను 1997-98లో నమోదైన అత్యంత బలమైన ఎల్ నినోతో శాస్త్రవేత్తలు పోలుస్తున్నారు. అప్పట్లో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు, వరదలు, కరువులు సంభవించాయి. అయితే ఈసారి పరిస్థితులు మరింత భిన్నంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు భూమి ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో మరింత వేడెక్కిపోయింది.2026లో మొదలై.. 2027లో తీవ్ర ప్రభావం?ఎల్ నినో ప్రభావం ఏర్పడిన వెంటనే బయటపడదు. సముద్రంలో మార్పులు చోటుచేసుకున్న తర్వాత వాటి ప్రభావం వాతావరణ వ్యవస్థపై పడేందుకు కొంత సమయం పడుతుంది. అందుకే సాధారణంగా ఎల్ నినో ఏర్పడిన ఏడాది కంటే.. తర్వాతి ఏడాదిలో దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే కారణంగా 2026లో బలపడుతున్న ఎల్ నినో ప్రభావం 2027లో గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే వాతావరణంలో పెరిగిన గ్రీన్హౌస్ వాయువులు వేడిని బంధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎల్ నినో ప్రభావం కలవడంతో ఉష్ణోగ్రతలు గత అంచనాలను మించి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మారనున్న ప్రపంచ వాతావరణ ముఖచిత్రం!బలమైన ఎల్ నినో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను ప్రభావితం చేయగలదు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర పొడి పరిస్థితులు ఏర్పడవచ్చు. దక్షిణ అమెరికా, తూర్పు ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండగా.. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో ఎండలు, కరవు పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత మరింత పెరగవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తుఫాన్ల తీవ్రత, వాటి ప్రయాణ మార్గాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.భారత్‌పై ఎలాంటి ప్రభావం?ఎల్ నినో ప్రభావం భారత వాతావరణంపై కూడా పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం కనిపించే సందర్భాలు గతంలో ఉన్నాయి. కొన్ని బలమైన ఎల్ నినో పరిస్థితుల సమయంలో వర్షపాతం తగ్గిన ఉదాహరణలు నమోదయ్యాయి. అయితే భారత రుతుపవనాలను ఎల్ నినో ఒక్కటే నిర్ణయించదు. హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలు, గాలుల మార్పులు, స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ ఎల్ నినో బలపడితే వ్యవసాయం, నీటి వనరులు, వేసవి ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.సహజ మార్పా? మానవ తప్పిదాల ప్రభావమా?ఎల్ నినో అనేది సహజంగా జరిగే ప్రక్రియే అయినప్పటికీ.. ప్రస్తుతం దాని ప్రభావం తీవ్రంగా కనిపించడానికి గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక ముఖ్య కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బొగ్గు, చమురు, సహజ వాయువుల వినియోగం వల్ల పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలు భూమి ఉష్ణోగ్రతలను నిరంతరం పెంచుతున్నాయి. దీంతో సహజ వాతావరణ మార్పులు వచ్చిన ప్రతిసారి వాటి ప్రభావం గతంతో పోలిస్తే మరింత తీవ్రంగా కనిపించే పరిస్థితి ఏర్పడుతోంది.మరో వేడి రికార్డుకు రంగం సిద్ధమా?ప్రస్తుత అంచనాలు నిజమైతే.. 2027 భూమి చరిత్రలోనే అత్యంత వేడిగల సంవత్సరంగా నిలిచే అవకాశం ఉంది. ఇది కేవలం ఉష్ణోగ్రతల రికార్డు మాత్రమే కాదు.. మారుతున్న వాతావరణ పరిస్థితులు భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లకు ఒక ముందస్తు హెచ్చరికగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో పేరుకుపోతున్న వేడి రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. భూమి వేడెక్కే వేగం ఇంకా తగ్గడం లేదు. కొత్త ఉష్ణోగ్రత రికార్డులకు వాతావరణం మరోసారి వేదికగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
రథయాత్రలో కాజాలకు గిరాకీ..రూ.100 కోట్లు దాటిన వ్యాపారం!
పూరీ: జగన్నాథ రథయాత్ర సందర్భంగా ‘పూరీ కాజా' విక్రయాలలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. పది రోజుల ఉత్సవాల్లో దాదాపు రూ.100 కోట్ల విలువైన కాజా అమ్ముడైనట్లు వర్తకులు చెబుతున్నారు. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో ఈ తియ్యని పదార్థానికి గిరాకీ అనూహ్యంగా పెరిగింది. ఈ ఏడాది రథయాత్రకు ముప్పై లక్షలకు పైగా భక్తులు పూరీకి తరలివచ్చారు. దీంతో శ్రీమందిర్ ఆనంద్ బజార్, అడపా మండప్ ఆనంద్ బజార్‌తో పాటు గ్రాండ్ రోడ్, నగర వీధులు, పూరీ-భువనేశ్వర్ హైవే వెంట వెలిసిన వందలాది దుకాణాల్లో కాజా విక్రయాలు జోరుగా సాగాయి.గత సంవత్సరాలతో పోలిస్తే విక్రయ కేంద్రాల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. భక్తులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఒక్కొక్కరు 2 నుంచి 5 కిలోల వరకు కాజాను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన ప్రీమియం రకం కిలో సుమారు రూ.400 పలుకగా, సాధారణ రోడ్డు పక్కన విక్రయించే రకాలు రూ.200 నుంచి రూ.300 వరకు అమ్ముడయ్యాయి.పండుగ రద్దీని ఆసరా చేసుకుని కొన్ని చోట్ల సాధారణ కాజాను కూడా ‘కాళీయ భోగం’ అంటూ కొందరు విక్రేతలు అమాయక భక్తులను మోసగించారనే ఆరోపణలు వినిపిస్తునాయి. జగన్నాథ సంప్రదాయాల పవిత్రతను దెబ్బతీసే ఈ చర్యలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం శ్రీమందిర్ ఆనంద్ బజార్లోనే రూ.40 కోట్ల విలువైన మహాప్రసాదం అమ్ముడైనట్లు అంచనా. మరోవైపు పూరీ కాజాకు అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నప్పటికీ, దీనికి ఇప్పటివరకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించలేదు. దీని ప్రత్యేకతను కాపాడేందుకు, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించడానికి జీఐ ట్యాగ్ ఇవ్వాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. -
విద్యార్థులపైకి తూటాలా.. మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: రాహుల్
ఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కార్ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్, బీహార్‌లో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఏకే-47 తూటాలు ప్రయోగించారని రాహుల్ మండిపడ్డారు. విద్యార్థుల పట్ల మొత్తం వ్యవస్థ అత్యంత కఠినంగా, అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్రంపై నిప్పులు చెరిగారు.విద్యార్థులపై పోలీసుల చర్యలను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రాహుల్.. ‘బీహార్‌లో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఏకే-47 తూటాలు ప్రయోగించారనే వార్తలు వస్తున్నాయి. వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేసి వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని, వారిని విడుదల చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులపై దాడులు, కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.छात्रों के ख़िलाफ़ पूरा का पूरा सिस्टम ही जानलेवा है।खबर आ रही है कि बिहार में प्रदर्शन कर रहे छात्रों पर AK-47 से गोलियाँ चलाई गई हैं और सैकड़ों छात्रों को गिरफ़्तार करके उनपर FIR की जा रही है।मोदी जी, कहाँ गया आपका वादा कि छात्रों पर कोई FIR नहीं की जाएगी और उन्हें रिहा कर… https://t.co/c7zdyyeLA0— Rahul Gandhi (@RahulGandhi) July 27, 2026ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారని, బీహార్‌లో ఏకే-47లు ప్రయోగించారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ.. ఎక్కడ చూసినా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించడం లేదని, సంస్కరణలు చేపట్టే సామర్థ్యం లేదని ఆయన విమర్శించారు. విద్యార్థుల గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. దేశంలోని విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి కానీ విద్యార్థులపైన కాదు అని డిమాండ్ చేశారు.అయితే, పోలీసుల చర్యలు చట్టపరమైన పరిస్థితుల నేపథ్యంలోనే జరిగాయని, శాంతిభద్రతలను కాపాడేందుకు అధికారులు తమ విధులు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. బీహార్‌లో విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ పోలీసులు అధికారి ఏకే-47 పట్టుకుని నిరసనకారులపైకి ఎక్కుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేసింది. -
‘కాక్రోచ్’ ఉద్యమం కుదిపేసిన రాజకీయాలు.. అమరావతి వరకు సెగ!
రాజకీయాలలో ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదన్నది ఒక అభిప్రాయం. అన్నిసార్లు కాకపోయినా, కొన్నిసార్లు బొద్దింకలు కూడా తిరగబడతాయన్న సత్యాన్ని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పక్షాన యువత రుజువు చేసింది. ఎంత బలాఢ్యుడైనా ఆ తిరుగుబాటుకు తలొగ్గక తప్పదని రుజువైంది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్‌కు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ పర్వం దేశానికే ఒక స్పూర్తిదాయక ఘట్టంగా నిలిచింది. ఇలాంటి లీక్‌లు జరిగినా, లేదా స్కామ్‌ల ఆరోపణలు ఆధారాలతో సహా బయటపడినా సంబందిత బాధ్యులు పదవి నుంచి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ యువత ఆందోళన తేల్చి చెప్పింది.కేంద్రంలోనేనా ఇలా రాజీనామాలు జరగవలసింది? మరి రాష్ట్రాలలో జరిగే లీక్‌లు, ఇతర కుంభకోణాల పరిస్థితి ఏమిటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదవి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ గట్టిగా తెరపైకి వచ్చింది. డీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ ఆరోపణ, టీచర్ల ఎంపికలో అవకతవకలు, స్పోర్ట్ కోటా టీచర్ల ఎంపికలో అక్రమాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధారసహింతంగా ఆరోపణలు చేసినా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. బహుశా ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం గురించి స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. కాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఉద్యమం చేస్తున్న యువతపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శకు గురయ్యారు.కాక్రోచ్ ఉద్యమానికి కాంగ్రెస్ తదితర విపక్షాలు రంగంలోకి దిగడంతో తీవ్రరూపం దాల్చింది. ఒకరకంగా రాజకీయ రంగు పులుముకున్నప్పటికీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేలు ప్రధాని ఇంటిముందు ధర్నాకు దిగడంతో బీజేపీ కంగుతిన్నట్లనిపించింది. సీజేపీతో చర్చలకు సిద్దమని బీజేపీ కూడా చెప్పవలసి వచ్చింది. రాహుల్ గాంధీపై విమర్శలు చేసినా, బీజేపీ కొంత డిఫెన్స్‌లో పడినట్లయింది. కాక్రోచ్ ఉద్యమంతో పాటు, కాంగ్రెస్ ధర్నా ప్రభావం వివిధ రాష్ట్రాలలో కూడా పడింది. కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ యాక్టివ్ అయ్యాయి. వారికి పోటీగా బీజేపీ కూడా ఎదురుదాడి చేయడానికి యత్నించింది.ఏపీ, తెలంగాణలలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇదో గొడవగా మారింది. తెలంగాణలో రెండు పార్టీలు కర్రలతో ఘర్షణకు దిగాయి. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. విజయవాడలో కాంగ్రెస్ ఆఫీస్‌పై బీజేపీ దాడికి యత్నించడం ఆశ్చర్యంగానే ఉంది. ఏపీలో ఈ రెండు పార్టీలకు పెద్దగా బలం లేకపోయినా, ఈ అవకాశం ద్వారా తమ ఉనికి కోసం ప్రయత్నించినట్లు అనిపిస్తుంది.23 లక్షల మంది విద్యార్ధులు మెడికల్ కాలేజీలలో సీట్ల నిమిత్తం రాసిన నీట్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన వైనం, ఆ తర్వాత ఆ విషయాలు బయటకు వచ్చి దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ చేసిన ఒక అనవసర వ్యాఖ్యతో దేశంలో కొత్తగా పుట్టుకువచ్చిన క్రాకోచ్ జనతాపార్టీ యువతను ఆకర్షించింది. నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌కు సంబంధించి కొందరిని ప్రభుత్వం అరెస్టు చేసింది. కాని తొలి నీట్ పరీక్ష రద్దు కావడంతో సుమారు ఇరవైమంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆవేదనకు గురి చేసింది. మళ్లీ నీట్ పరీక్షను నిర్వహించినప్పటికీ, నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌కు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను కాక్రోచ్ జనతా పార్టీ చేసింది. అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని వీరు కోరారు.ఇలా వివిధ డిమాండ్లతో సాగుతున్న వీరి ఉద్యమం ఒక దశలో ముగిసిపోయిందని అనుకున్నారు. కాని వాంగ్ చుక్ అనే ఉద్యమకారుడు నిరాహారదీక్షకు దిగడంతో తిరిగి ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. వేలాదిగా తరలివచ్చిన యువత పార్లమెంటు ముట్టడికి వెళ్లడం, ఆ క్రమంలో పోలీసులు లాఠీచార్జీ చేయడం వంటివి పరిస్థితిని ఉద్రిక్తం చేశాయి. పోలీసులు విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు పలువురిని లాఠీలతో కొట్టారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది సంబంధం లేని పిల్లలను కూడా పోలీసులు కొట్టిన తీరు విమర్శలకు గురి అయింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.ప్రధాని మోదీ తొలిసారిగా నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌పై స్పందించి అది మహాపాపమని అభివర్ణించారు. ఈ వ్యవహారంలో గట్టిగా స్పందిస్తున్నామన్న సంకేతం ఇవ్వడానికి యత్నించారు. బీజేపీ, జనసేన వంటి పార్టీలు ఈ ఉద్యమంలో దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, ఇతరత్రా ఆరోపణలు చేసినా, ప్రధాని ఆ యువతను స్నేహితులు అని అడ్రస్ చేయడం విశేషం. ఈ కేసులో నిందితులకు సత్వరమే శిక్ష పడడానికి వీలుగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. వాంగ్ చుక్ దీక్ష విరమించినా, ఉద్యమం కొనసాగడం, దేశం అంతటా దీని ప్రభావం పడుతుండడం గమనించి మోదీ స్పందించారు. వెంటనే డామేజ్ కంట్రోల్‌కు చర్యలు చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ఉద్యమకారుల డిమాండ్లను అంగీకరించినట్లు కేంద్ర మంత్రులు ప్రకటించారు. దాంతో కాక్రోచ్ సంబరాలు అంబరాన్ని అంటాయి.నిజానికి కాక్రోచ్ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం మొదట తేలికగా తీసుకున్నట్లుగా ఉంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కొన్ని వందలమంది దేశ యువతకు ప్రతినిధులుగా కేంద్రం ఆలోచించలేకపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల ఇంటర్నెట్ బంద్ చేశారంటే, 18 మెట్రో రైల్వేస్టేషన్లను బంద్ చేశారంటేనే ఈ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. ఇదంతా యువత స్వచ్చందంగా చేసిందే.కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో రైతుల ఆందోళన కుదిపేసింది. వారు కోరినట్లు కొన్ని చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంది. అయినా ఆనాడు సమర్థంగా హాండిల్ చేశామన్న భావన కేంద్ర పెద్దలకు ఉండి ఉండవచ్చు. ఆ పరిస్థితి వేరు. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితి వేరు. ఒక్కసారి యువతలో గూడుకట్టిన అసంతృప్తి ఎగసిపడితే, అది దేశ వ్యాప్తంగా పాకితే ఎంత ప్రమాదమో బీజేపీ పెద్దలకు తెలియనిది కాదు. అందులోనూ పలు ఇతర దేశాలలో యువత ఈ మధ్యకాలంలో ఎంతటి క్రియాశీలకపాత్ర పోషించి ప్రభుత్వాలే మారిపోయేలా చేసిందో ఇటీవలి చరిత్రే.ఈ క్రమంలో పార్లమెంటు సమావేశాలలో సహజంగానే విపక్షం దీనిని ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. మంత్రి ప్రధాన్ రాజీనామాకు విపక్షం కూడా పట్టుబట్టింది. ఎప్పుడో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం సంచలనం అయింది. తర్వాతకాలంలో కొందరు కేంద్ర మంత్రులు వివిధ కారణాలతో రాజీనామాలు చేయకపోలేదు. రైల్వే ప్రమాదాల కారణంగానే నితీష్ కుమార్, మమత బెనర్జీ వంటివారు రాజీనామా చేశారు. విమాన ప్రమాదం జరిగినప్పుడు మాధవరావు సింధియా రాజీనామా చేశారు. ఉగ్రదాడికి బాధ్యత వహిస్తూ శివరాజ్ పాటిల్ పదవి నుంచి తప్పుకున్నారు.అలాగే, ఆయా స్కామ్‌ల ఆరోపణలపై దయానిది మారన్, ఎ.రాజా తదితరులు రాజీనామా చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీక్‌కు బాధ్యత వహిస్తూ అప్పటి విద్యా మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రాజీనామా చేశారు. క్యాబినెట్ ఎజెండాను లీక్ చేశారన్న కారణంగా 31 మంది మంత్రుల నుంచి ఎన్టీరామారావు రాజీనామాలు తీసుకున్నారు. చంద్రబాబు టైమ్‌లో వివిధ ఆరోపణలు వచ్చినా ఆయన నైతిక బాధ్యత వహించడానికి సిద్దపడలేదు. గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట కారణంగా 29 మంది మరణిస్తే, చంద్రబాబు ఎదురు బుకాయించారు తప్ప బాధ్యత తీసుకోలేదు. పూరి జగన్నాథ రథయాత్రలో జరగలేదా? కుంభమేళాలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో మరణించడం లేదా అంటూ డబాయించారు. ఆ ఘటనలో ఒక్క కానిస్టేబుల్‌పై కూడ కేసు రాకపోవడం చిత్రంగానే అనిపిస్తుంది.తిరుమలలో 20 మంది తమిళ కూలీలు ఎన్ కౌంటర్‌కు గురి కావడం వివాదాస్పదం అయినా, అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పడలేదు. అవన్ని ఎందుకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయినా, ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసే లేకుండా చేసుకోగలిగారు. ఒకప్పుడు చెన్నారెడ్డి ప్రభుత్వంలో హౌసింగ్ స్కామ్ జరిగితే అప్పటి మంత్రి కోనేరు రంగారావుతో రాజీనామా చేయించారు. తదుపరి ఆ ఆరోపణలు రుజువు కాలేదని తిరిగి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు డీఎస్సీ అక్రమాలకు వైఎస్సార్సీపీ ఎన్నో ఆధారాలు చూపి సీబీఐ విచారణ కోరుతోంది. వాటికి చంద్రబాబు లేదా లోకేష్ ఎక్కడా నేరుగా జవాబు ఇవ్వలేదు. టీడీపీ ఇతర నేతలతో ఎదురుదాడి చేయించారు.ఈ నేపథ్యంలో డీఎస్సీ అక్రమాలపై ఉద్యమించాలని వైఎస్సార్సీపీ తలపెట్టింది. దీనికి యువత కూడా తోడైతే అది సీరియస్‌గా మారవచ్చు. అయితే వారిని అణచివేయడానికి చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇది ఏ రూపు దాల్చుతుందో అప్పుడే చెప్పలేం. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లోకేష్‌పై ఒత్తిడి పెంచుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యమం చేసిన కాక్రోచ్ యువతపై కక్ష కట్టకుండా ఉండాలని ఆశిద్దాం. ఏది ఏమైనా కాక్రోచ్‌లే కదా అని తేలికగా చూడరాదన్న విషయం అర్థం అవుతోంది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పార్లమెంట్‌కు ధర్మేంద్ర ప్రధాన్.. కారు దిగగానే!
సాక్షి, న్యూఢిల్లీ: యువత నిరసలతో దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు కదా. ఇవాళ ఎంపీ హోదాలో ఆయన పార్లమెంట్ సమావేశాలకు కోసం వచ్చారు. అయితే ఆయన రాక సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో నినాదాల పోరు కనిపించింది.సోమవారం ఉదయం పార్లమెంట్‌కు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ కారు దిగి దిగగానే ఎన్డీయే ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు మద్దతుగా “ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. ఆయనను హీరోలా స్వాగతిస్తూ.. నెత్తిన టోపీ పెట్టి ఎన్డీయే ఎంపీలు సంఘీభావం ప్రకటించారు. ఫొటోలు కూడా దిగారు. అదే సమయంలో.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసిన ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం కొద్దిసేపు హోరెత్తింది. అయితే ఎన్డీయే ఎంపీలు అవేం పట్టనట్లు తమ పని తాము చేసుకుంటూ పోయారు. అలా.. ఒకేసారి డబుల్ వెల్కమ్ దక్కింది ఆయనకు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో నీట్ వ్యవహారంపై కేంద్రంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 36 రోజుల తర్వాత నిరసనలు ఉధృతమైన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను నైతిక బాధ్యత తీసుకున్న నిర్ణయంగా ఎన్డీయే నేతలు అభివర్ణిస్తున్నారు. అటు ప్రతిపక్షాలు మాత్రం నీట్ అవకతవకలకు ఆయన రాజీనామా చేయడం సరైందేనని అంటున్నాయి. #WATCH | Delhi: Former Union Education Minister and BJP MP Dharmendra Pradhan arrives at the Parliament. BJP-NDA MPs sloganeer "Dharmendra Pradhan zindabad" as they receive him here. pic.twitter.com/7DHXIzMkvI— ANI (@ANI) July 27, 2026 -
మరో ‘నీట్’ విద్యార్థిని బలవన్మరణం
అహిల్యానగర్: మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లా కర్జాత్ తాలూకా జలాల్పూర్ గ్రామానికి చెందిన 19 సంవత్సరాల ‘నీట్’ అభ్యర్థి అంకిత సంగాలే ఆత్మహత్య చేసుకున్నారు. ‘నీట్ రీ టెస్ట్’లో తక్కువ మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికిలోనై, ఆమె తన స్టడీ రూమ్‌లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.ఈ పరీక్షలో అంకిత 166 మార్కులు సాధించారు. ఆశించిన మార్కులు రాకపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పేపర్ లీక్ వివాదం కారణంగా రీ టెస్ట్ నిర్వహించడానికి ముందు జరిగిన పరీక్షలో ఆమె మెరుగైన మార్కులు సాధించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలంలో నీట్ స్కోర్ గురించిన ప్రస్తావన ఉన్న సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కర్జాత్ పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఎన్సీపీ (ఎస్పీ) నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ‘నీట్’ కారణంగా ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్దారు.ఇది కూడా చదవండి: ‘జంతర్ మంతర్’ లవ్ స్టోరీ.. తలకు గాయంతో వివాహం! -
పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం.. రేపటికి వాయిదా
పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు వచ్చింది. విపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టింది కేంద్రం. లోక్‌సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పరీక్షల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిబంధనలు తీసుకొస్తున్నామని కేంద్రం చెబుతుండగా.. నిరసనల సమయంలో జరిగిన పరిణామాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి.పార్లమెంట్ సమావేశాలు.. 6వ రోజు అప్డేట్స్రాజ్యసభ రేపటికి వాయిదారాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభంసభలో మళ్లీ గంగదగోళంరేపటికి వాయిదా వేసిన డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్లోక్సభ రేపటికి వాయిదాలోక్సభ సమావేశాలు తిరిగి ప్రారంభంసభలో గందరగోళం.. రేపటికి వాయిదాకాంగ్రెస్ సహా విపక్షాల ఆందోళనలతో ముందుకు సాగని సభా కార్యక్రమాలుయాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరగని చర్చవాయిదాల పర్వంలోక్సభ సాయంత్రం 5 గంటల వరకు వాయిదా3 గంటల వరకు వాయిదా పడి మళ్లీ ప్రారంభమైన రాజ్యసభఆ తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళనరాజ్యసభ మళ్లీ సాయంత్రం 5.15 గంటల వరకు వాయిదాఓం బిర్లా కీలక ప్రకటనలోక్సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లువిపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టిన కేంద్రంచర్చ ముందుకు సాగకపోవడంతో వాయిదామధ్యాహ్నం 2గం. తిరిగి ప్రారంభం కానున్న లోక్సభలోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక ప్రకటనబిల్లుపై ఎంపీల సూచనలు కోరిన స్పీకర్.మధ్యాహ్నం 1 గంట వరకు సవరణలకు అవకాశం.చర్చకు తగిన సమయం ఇస్తామని హామీ.పేపర్ లీక్‌కు భారీ శిక్షలుయాంటీ పేపర్ లీక్ బిల్లులో కీలక ప్రతిపాదనలుపేపర్ లీక్‌లో వ్యక్తులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ప్రతిపాదన.జరిమానా రూ.50 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు ఉండే అవకాశం.విద్యార్థుల లాఠీఛార్జిపై రగడపోలీసుల చర్యలపై హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని పవన్ ఖేరా డిమాండ్.నిరసనలను అణచివేయడం సరికాదని వ్యాఖ్య.సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన కాంగ్రెస్.సమగ్ర కథనం: లాఠీచార్జ్ ఎలా చేస్తారు?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుపేపర్ లీక్ బిల్లుకు కేంద్రం ప్రాధాన్యంలోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుస్పందించిన పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజుబిల్లు ఆమోదమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటనవిద్యార్థుల భవిష్యత్ రక్షణే ప్రధాన ఉద్దేశమని వెల్లడి.పేపర్ లీక్‌లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం.విపక్షాలు ఇతర అంశాలతో దృష్టి మళ్లించొద్దని సూచన.పరీక్షల వ్యవస్థపై నమ్మకం పెంచడమే లక్ష్యమని వ్యాఖ్య.లోక్‌సభ సైతం వాయిదామధ్యాహ్నానికి లోక్‌సభ వాయిదావిపక్షాల నిరసనల నడుమే.. యాంటీ పేపర్ లీక్ బిల్లు పెట్టిన కేంద్రంవిపక్షాల ఆందోళనలతో ముందుకు సాగని చర్చలోక్‌సభ మధ్యాహ్నం 2గం. కు వాయిదారాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదావాయిదా తర్వాత కూడా మారని సీన్పెద్దల సభలో విపక్షాల నిరసన గళంప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాల డిమాండ్మధ్యాహ్నం 2గం. దాకా సభ వాయిదా వేసిన చైర్మన్వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఉభయ సభలులోక్సభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళనవిపక్షాల నిరసనల నడుమే లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర జింగ్నీట్ నిరసనలు.. కేంద్రంపై పప్పు యాదవ్ ఫైర్ నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన.. ప్రభుత్వ చర్యలు తీవ్రంగా తప్పుబట్టిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ఉన్న విద్యార్థులను నేరస్తుల్లా చూస్తున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.“మన పిల్లలు ఉగ్రవాదులా? మన కూతురు నేరస్తురాలా? హక్కుల కోసం గొంతెత్తడం తప్పా?” అని పప్పు యాదవ్ వ్యాఖ్యానించారు.బిహార్‌లో దాదాపు 800 మంది విద్యార్థులను జైలుకు పంపించారని ఆరోపించారు.విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరితో దేశంలో భయానక వాతావరణం నెలకొన్నదని ఆయన విమర్శించారు.ఖర్గే తీవ్ర వ్యాఖ్యలునీట్ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అత్యంత అరుదైన ఘటన (rarest of rare) గా అభివర్ణించారు.ఈ అంశంపై రాజ్యసభలో తక్షణ చర్చకు అనుమతించాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌ను ఖర్గే కోరారు.రూల్ 267 కింద చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధన ప్రకారం ఆ రోజు జాబితాలో ఉన్న ఇతర కార్యక్రమాలను నిలిపివేసి ప్రత్యేక అంశంపై చర్చ చేపట్టవచ్చు.భారత చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఖర్గే పేర్కొంటూ.. ఈ అంశంపై వెంటనే చర్చ అవసరమని అన్నారు.ఖర్గే డిమాండ్‌పై స్పందించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్.. రూల్ 267 అమలుకు ఆ అంశం నిజంగా “rarest of rare” స్థాయిలో ఉండాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.నీట్ నిరసనల అంశం మాన్సూన్ సమావేశాల్లో రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.మోదీ సర్కార్‌పై రాహుల్ గాంధీ ఫైర్పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాపార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసనప్రధాని మోదీపై లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్విద్యార్థుల్ని అణచివేయడంలో మోదీ ప్రభుత్వ తీరు ఎక్కడైనా ఒక్కటేఢిల్లీలో పెల్లెట్లు.. పట్నాలో ఏకే 47 ప్రయోగించారుప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే स्टूडेंट्स पर लाठीचार्ज और पैलेट गन के इस्तेमाल के विरोध में विपक्ष संसद परिसर में विरोध प्रदर्शन कर रहा है#Parliament pic.twitter.com/ihXExAzby2— Poonam Pandey (@pandeypoonam20) July 27, 2026 बिहार के सीवान में छात्र प्रदर्शन के दौरान AK-47 से फायरिंग करने वाले SIT जवान अभिषेक पटेल को सस्पेंड कर दिया गया है!सिवान में छात्र आंदोलन के दौरान पुलिस अधिकारी अभिषेक पटेल ने छात्रों की दिशा में AK-47 असॉल्ट राइफल से फायरिंग की थी! pic.twitter.com/ZjyQa8fGOK— Sadaf Afreen صدف (@s_afreen7) July 27, 2026జంతర్ మంతర్‌లో లాఠీఛార్జిపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలుఛలో సంసద్ ర్యాలీ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుశాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు: సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ ధర్మాసనం.విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపి పోలీసుల మితిమీరిన బలప్రయోగాన్ని సమర్థించుకోలేం ఆందోళనల్లో ఆకతాయిలు ప్రవేశించి పోలీసులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళనకరంశాంతియుత నిరసనలు, పోలీసు చర్యల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఏకరూప మార్గదర్శకాలు అవసరం.నిరసనల్లో చొరబడే సామాజిక విద్రోహ శక్తులపై చర్యలకు అధికారులకు పూర్తి అధికారాలు ఉండాలినిరసనల్లో హింసకు తావులేకుండా నిరసనకారులు 'ఆత్మశిక్షణ' పాటించడం అత్యంత కీలకమన్న సుప్రీంకోర్టు.విద్యార్థుల నిరసనలు, పోలీసుల దాష్టీకంపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా.ఉభయ సభలు వాయిదా!ఆరో రోజు అదే తీరునీట్పై చర్చకు పట్టుబట్టిన విపక్షాలుప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ఉభయ సభలు మధ్యాహ్నం 12గం. దాకా వాయిదాప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలులోక్సభలో విపక్ష ఎంపీల ఆందోళనపబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026 నేడే ప్రవేశపెట్టాలని కేంద్రం యోచనలాఠీ ఛార్జిపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు పార్లమెంట్‌కు ధర్మేంద్ర ప్రధాన్.. పోటాపోటీ నినాదాలుపార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీలు పోటాపోటీ నినాదాలుపార్లమెంట్కు వచ్చిన మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ధర్మేంద్ర ప్రధాన్‌కు హీరో వెల్ కమ్ చెప్పిన ఎన్డీయే ఎంపీలుకేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఇండియా కూటమి ఎంపీలునీట్ లీకేజీ వ్యవహారంలో.. యువత నిరసనతో రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ఊహించినట్లే.. కాంగ్రెస్ వాయిదా తీర్మానంపార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానంవిద్యార్థులపై లాఠీఛార్జి, పెల్లెట్ గన్స్‌తో దాడిపై చర్చకు నోటీసుజంతర్ మంతర్ ధర్నా సమయంలో విద్యార్థులపై భద్రతా బలగాల బలప్రయోగంచలో సంసద్‌ను అడ్డకునే కమ్రంలో జులై 20న చోటు చేసుకున్న పరిణామాలుతీవ్రంగా ఖండించిన కాంగ్రెస్అమిత్ షాకు లేఖ రాసిన రాహుల్ గాంధీవిద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలంటున్న విపక్ష నేతపరీక్షా బిల్లు.. చర్చలో పాల్గొనేది వీళ్లే!నేడు లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026పై చర్చబిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్బిల్లుపై 8–12 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగే అవకాశంబీజేపీ తరఫున బన్సూరి స్వరాజ్ చర్చ ప్రారంభంబీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రసంగంటీడీపీ తరఫున లావు శ్రీకృష్ణ దేవరాయలుజేడీయూ నుంచి లల్లన్ సింగ్ సభలో మాట్లాడనున్నారుశివసేన తరఫున డా. శ్రీకాంత్ షిండే ప్రసంగంఅప్నా దల్ (ఎస్) నుంచి అనుప్రియా పటేల్ చర్చలో పాల్గొననున్నారుఎల్జేపీ (రామ్ విలాస్) నుంచి అరుణ్ భారతికి అవకాశంఎన్సీపీ తరఫున సునీల్ తట్కరేతృణమూల్ కాంగ్రెస్ నుంచి సయోని ఘోష్ లేదా మితాలి బాగ్ పాల్గొనే అవకాశంపరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు బిల్లు ప్రధాన లక్ష్యంబిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించే అవకాశంపై ఆసక్తిసభ.. సజావుగా సాగేనా?సీజేపీ ఆందోళన విరమణతో పార్లమెంట్ సమావేశాలపై అందరి దృష్టిగతవారమంతా విపక్షాల నిరసనలతోనే గడిచిన పార్లమెంట్కేంద్ర మంత్రి రాజీనామా కోరుతూ సభను అడ్డుకున్న విపక్షాలునీట్ లీకేజీపై చర్చ.. ప్రత్యేక చట్టంకు సిద్ధమని ప్రకటించిన కేంద్రంఅయినా వెనక్కి తగ్గని విపక్షాలు, చివరకు..ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో శాంతించిన యువతఆందోళన విరమించిన కాక్రోచ్ జనతా పార్టీనేడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుకాసేపట్లో ఖర్గే కార్యాలయంలో విపక్షాల సమావేశంయువతపై జరిగిన దాడుల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న విపక్షాలుదాడికి బాధ్యత వహించాలని ఇప్పటికే అమిత్ షాకు లేఖ రాసిన రాహుల్ గాంధీ బిల్లులో కీలక ప్రతిపాదనలుపేపర్ లీక్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు విధించేలా నిబంధనలు.లీకేజీలకు పాల్పడిన వ్యక్తులకు గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష.నిందితులపై రూ.50 లక్షల వరకు జరిమానా.వ్యవస్థీకృతంగా పేపర్ లీక్‌లకు పాల్పడే ముఠాలకు రూ.10 కోట్ల వరకు జరిమానా.ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు.కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసేలా నిబంధనలు.ఎన్డీయే వ్యూహం ఏంటి?పేపర్ లీక్‌లను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చాటే ప్రయత్నం.యువ ఎంపీలను రంగంలోకి దించి బిల్లుపై బలమైన వాదనలు వినిపించాలనే వ్యూహం.బీజేపీ నుంచి బన్సూరీ స్వరాజ్, తేజస్వీ సూర్య చర్చకు నాయకత్వం వహించే అవకాశం.టీడీపీ, జేడీయూ, శివసేన, ఎన్సీపీ, ఇతర మిత్రపక్షాల ఎంపీలు కూడా చర్చలో పాల్గొననున్నారు.విపక్షాల వ్యూహం ఏమిటి?బిల్లుకు వ్యతిరేకంగా కాకుండా.. నీట్ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించాలని భావిస్తున్నాయి.పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావాన్ని లేవనెత్తే అవకాశం.జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ మార్చ్ సమయంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నారు.ఘటనలపై ప్రధాని క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే అవకాశం.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తొలి పార్లమెంట్ సమరంనీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు.కొత్త మంత్రి తొలిసారి విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కోనున్నారు.నీట్ వివాదంపై ప్రభుత్వ వైఖరి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.10 గంటల పాటు చర్చబిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చకు అవకాశం.దాదాపు 8 నుంచి 10 గంటల పాటు చర్చ జరగనున్నట్లు సమాచారం.అధికార, విపక్ష సభ్యులు తమ వాదనలు వినిపించనున్నారు.36 రోజుల ఉద్యమం తర్వాత..నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు జరిగాయి.విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.పార్లమెంట్ మార్చ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఉద్యమం ముగిసింది. -
‘జంతర్ మంతర్’ లవ్ స్టోరీ.. తలకు గాయంతో వివాహం!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరిగిన ‘నీట్’ పేపర్ లీక్ నిరసన ప్రదర్శన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫలితంగా కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నిరసనలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి యువత తరలివచ్చింది. ఈ క్రమంలోనే బీహార్‌కు చెందిన మోహన్ శ్రీవాస్తవ్, ఢిల్లీకి చెందిన ఓ యువతి మధ్య చిగురించిన ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. This could be a prank from Bihar. But it ends so authentically with a question, that is so steeped in reality. pic.twitter.com/t1EBCziYhy— Smita Prakash (@smitaprakash) July 26, 2026నీట్ పేపర్ లీక్ నిరసనల్లో పాల్గొనేందుకు మోహన్ బీహార్ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఆందోళన ప్రాంతంలో భోజన వసతి లేకపోవడంతో ఒ యువతి అతనికి ఆహారం అందించింది. తర్వాతి రోజు తాగునీరు కూడా తెచ్చి ఇచ్చింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య మంచి స్నేహానికి దారితీసింది. ఆ యువతి కూడా ‘నీట్’ పరీక్ష రాసి, పేపర్ లీక్ బాధితురాలే కావడంతో ఆందోళనలో పాలుపంచుకుంది.ఈ క్రమంలో పోలీసులు జరిపిన లాఠీచార్జిలో మోహన్ తలకు తీవ్ర గాయమై అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్పందించిన ఆ యువతి అతనిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడింది. మోహన్ కోలుకున్నాక ఆమె తన ప్రేమను వ్యక్తం చేసింది. మోహన్ కూడా తన మనసులోని భావాన్ని బయటపెట్టాడు. గాయాలతో బాధపడుతూనే మోహన్ ఆ యువతిని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఒంటరిగా ఢిల్లీకి వెళ్లిన మోహన్, ఆందోళన ముగిశాక నూతన వధువుతో కలిసి బీహార్‌కు తిరుగుముఖం పట్టాడు.ఇది కూడా చదవండి: ఇక గడ్కరీకి ‘బొద్దింకల’ బెడద? -
రూ.50,000 కోట్ల టార్గెట్ ఫిక్స్.. డిఫెన్స్ ఎగుమతుల్లో దూకుడు!
భారత రక్షణ ఉత్పత్తి రంగం అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేస్తోంది. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.50,000 కోట్ల రక్షణ ఎగుమతుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా చేరుకుంటుందని కేంద్ర రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. గత దశాబ్దంలో ఆత్మనిర్భర్ భారత్ పిలుపుతో విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకున్న భారత్ నేడు గ్లోబల్ సౌత్ దేశాలకు నమ్మకమైన భద్రతా భాగస్వామిగా రూపాంతరం చెందుతోందని చెప్పారు.విశ్వవ్యాప్తంగా పెరిగిన డిమాండ్గత ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.38,000 కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది ఏకంగా 61 శాతం వృద్ధి కావడం గమనార్హం. 2014 ప్రాంతంలో కేవలం రూ.600 కోట్లకు పరిమితమైన ఎగుమతులు నేడు ఈ స్థాయికి చేరడం భారత రక్షణ పారిశ్రామిక వ్యవస్థ సామర్థ్యానికి అద్దం పడుతోందని రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సంప్రదాయ యుద్ధ సామగ్రి, ఆర్టిలరీ షెల్స్, క్షిపణులు, డ్రోన్ సాంకేతికతలకు భారీ డిమాండ్ ఏర్పడింది. భారత ఆయుధ వ్యవస్థలు క్షేత్రస్థాయిలో నాణ్యతను నిరూపించుకోవడంతో అనేక దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని చెప్పారు.లైన్ ఆఫ్ క్రెడిట్ రూపంలో ప్రోత్సాహంఆసియా, ఆఫ్రికా దేశాల్లోని కొనుగోలుదారులను మరింత ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఆర్థిక పరిమితులు ఉన్న వర్ధమాన దేశాలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించేందుకు (లైన్ ఆఫ్ క్రెడిట్) ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ కేబినెట్ నోట్ సిద్ధం చేసింది. ఇది అమల్లోకి వస్తే భారతీయ ఆయుధాల విక్రయాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.ప్రభుత్వ రంగం, యూరప్ భాగస్వామ్యాలుగతంలో ప్రైవేట్ కంపెనీలకే పరిమితమైన ఎగుమతుల వృద్ధిలో ప్రస్తుతం హిందూస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరోవైపు, యూరప్ దేశాల్లో శ్రామిక శక్తి కొరత, వయోవృద్ధుల జనాభా పెరుగుతుండటంతో తక్కువ వ్యయంతో నాణ్యమైన తయారీ సామర్థ్యం ఉన్న భారత స్థానిక పరిశ్రమలతో భాగస్వామ్యానికి పాశ్చాత్య దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.ఇదీ చదవండి: ఒక రివార్డ్ పాయింట్.. రూ.1 అనుకుంటున్నారా? -
ఇక గడ్కరీకి ‘బొద్దింకల’ బెడద?
న్యూఢిల్లీ: దేశ రాజధాని రాజకీయాల్లో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ‘బొద్దింకల’ హడావుడి మరింత పెరిగింది! పరీక్షల రచ్చతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించిన ‘సీజేపీ’ బాటలోనే తాజాగా మరో వింత సంఘం తెరపైకి వచ్చింది. అదే ‘ఈ20 జనతా పార్టీ’ (ఈజేపీ). ఇప్పుడు ఈ కొత్త ఆన్లైన్ వేదిక కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని చుట్టుముట్టేందుకు పావులు కదుపుతోంది. ప్రభుత్వ ఇథనాల్ విధానాన్ని ఎండగడుతూ, కేంద్ర మంత్రిని టార్గెట్ చేస్తూ ఈ వర్గం సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న రచ్చ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారుతోంది.ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా వాహనదారుల్లో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండగా, దీన్ని ఆసరాగా చేసుకుని ‘ఈ20 జనతా పార్టీ’ తెరపైకి వచ్చింది. ఇథనాల్ బ్లెండింగ్‌కు తాము వ్యతిరేకం కాదంటూనే, మరోవైపు నితిన్ గడ్కరీ అనుసరిస్తున్న ఇథనాల్ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అసలు సిసలైన 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్‌ను అదనపు ఆప్షన్‌గా ఇవ్వాల్సిందేనంటూ గడ్కరీని ఇరుకున పెట్టేందుకు ఈ ‘బొద్దింకల’ స్ఫూర్తితో పుట్టుకొచ్చిన కొత్త బృందం సిద్ధమవుతోంది.‘మా డిమాండ్ ఒక్కటే.. స్వచ్ఛమైన పెట్రోల్ మా హక్కు’ అంటూ ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ వేదికగా వీరు చేస్తున్న ప్రచారం ఇప్పుడు యువతను, వాహనదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కీలకమైన ఇంధన విధానాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. ఒకవైపు ఎనర్జీ సెక్యూరిటీ అంటున్న ప్రభుత్వానికి, మరోవైపు వాహనాల మైలేజ్ పడిపోతోందని ఆవేదన చెందుతున్న వినియోగదారులకు మధ్య ఈ వివాదం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చుతోంది. మొత్తానికి, 'కాక్రోచ్ జనతా పార్టీ' బాటలోనే దూసుకొస్తున్న ఈ 'ఈ20 జనతా పార్టీ' ఉద్యమం.. రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది!ఇది కూడా చదవండి: డిశ్చార్జ్ తర్వాత వాంగ్‌చుక్ ప్రణాళిక ఇదే.. -
డిశ్చార్జ్ తర్వాత వాంగ్‌చుక్ ప్రణాళిక ఇదే..
న్యూఢిల్లీ: నిరాహార దీక్ష విరమించిన ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ సోమవారం గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. అనంతరం ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పిస్తారని, ఆ తర్వాత లడఖ్‌కు పయనమవుతారని ఆయన బృందం వెల్లడించింది.గత శుక్రవారం అర్ధరాత్రి తన 26 రోజుల నిరాహార దీక్షను ముగించిన వాంగ్‌చుక్, ఆస్పత్రిలో కోలుకున్న తర్వాత సోమవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. నీట్ పరీక్షలో అవకతవకలను నిరసిస్తూ, నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించడానికి ముందు, జూన్ 28న కూడా ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.జూన్ 28న విద్యార్థుల నేతృత్వంలోని ఆందోళనలో చేరిన వాంగ్‌చుక్ 26 రోజుల పాటు నిరవధిక దీక్ష కొనసాగించారు. జూలై 18న ఆయనను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ తనను ఖైదీలా నిర్బంధించారని ఆయన ఆరోపించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స కోసం ఆయనను మేదాంత ఆస్పత్రికి తరలించారు. నీట్-యూజీ పేపర్ లీక్, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై బాధ్యుల నుంచి జవాబుదారీతనం కోరుతూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో జూన్ 20న ప్రారంభమైన ఈ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో శనివారం ముగిసింది.ఇది కూడా చదవండి: భారత విద్యార్థులకు థన్‌బర్గ్ ఎందుకు మద్దతు పలికారు? -
నన్ను అడగొద్దు.. డిలీట్ చేయను: బీజేపీ ఎంపీ కూతురి సంచలన పోస్ట్
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆయన స్వంత రాష్ట్రం ఒడిశాకే చెందిన ఓ బీజేపీ ఎంపీ కూతురు సంచలన పోస్ట్‌తో రాజకీయ దుమారం రేపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సంబురంగా ఆమె ఓ పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఆ పోస్ట్ తొలగించాలంటూ తనపై ఒత్తిడి వస్తోందంటూ ఆమె అందులో పేర్కొనడం ఈ చర్చకు దారి తీసింది. భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత సారంగి చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఓ వార్తా హెడ్డింగ్ స్క్రీన్‌షాట్‌ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన అర్చిత.. ఆ తర్వాత మరో పోస్ట్ పెట్టారు. “డీపీ (ధర్మేంద్ర ప్రధాన్‌ను ఉద్దేశించి..) పీఏ నా తల్లికి మెసేజ్ చేసి ఈ స్టోరీని డిలీట్ చేయమని అడుగుతారని తెలుసు.. కానీ నేను డిలీట్ చేయను. ఇలాంటి విషయం ఇంతకుముందు కూడా జరిగింది’’ అంటూ పోస్ట్ చేశారు. కాబట్టి అడగాల్సిన అవసరం లేదు.. నేను డిలీట్ చేయను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. అయితే కొంత సమయం తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్ అయినట్లు సమాచారం.ఎవరీ తల్లీకూతుళ్లు?అర్చిత సారంగి తల్లి అపరాజిత సారంగి ఒడిశాకు చెందిన బీజేపీ నాయకురాలు. 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణిగా పనిచేసిన ఆమె.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో భువనేశ్వర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి విజయం సాధించారు. పరిపాలనా రంగంలో అనుభవం ఉన్న అపరాజిత సారంగి.. బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇక అర్చిత ఎంబీఏ పూర్తి చేసుకుంది. అంతకు మించి ఆమె గురించి వివరాలేవీ నెట్టింట సమాచారం. అయితే తన కుమార్తె చేసిన పోస్ట్ విషయంలో ఆమె మాత్రం ధర్మేంద్ర ప్రధాన్‌కు మద్దతుగా స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమె సమర్థిస్తూ.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత తీసుకోవడం నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు.Our daughter, Archita, has been selected for the MBA course at UNIVERSITY OF OXFORD. We convey our deep sense of gratitude to all our friends and well wishers.Jai Jagannath ! 🙏 pic.twitter.com/sNejUZYf6s— Aparajita Sarangi, MP,( Lok Sabha) Bhubaneswar (@AprajitaSarangi) March 9, 2024ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు?ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ అవకతవకలపై విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో నెల రోజులకు పైగా ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా సందర్భంగా ఆయన.. విద్యార్థుల ఆకాంక్షలు, భవిష్యత్తు తనకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. దేశ ఐక్యతకు భంగం కలగకుండా, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.కొత్త చర్చకు కారణంమంత్రికి మద్దతుగా ఆమె తల్లి నిలబడగా.. అదే సమయంలో కుమార్తె మాత్రం రాజీనామా వార్తను షేర్ చేయడం, దాన్ని తొలగించనని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అటు అస్సాంలోనూ ఎన్డీయే కూటమి మంత్రి కేశబ్ మహంతా(అస్సాం గణ పరిషత్ పార్టీ) కూతురు దిసాబా కూడా ఇలాగే నీట్ నిరసనల్లో ధర్మేంద్ర రాజీనామా కోరుతూ నినాదాలు చేశారు. ఇలా కుటుంబంలోనే.. అదీ అధికార పార్టీలకు చెందిన వాటిలో భిన్న స్వరాలు వినిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. -
నందన్ నీలేకని ఎవరు?..‘పరీక్షల భద్రత’కు ఎందుకు ఎంపిక చేశారు?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షా విధానంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీక్ ఉదంతాలు, అక్రమాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యూఐడీఏఐ (ఆధార్) వ్యవస్థాపక ఛైర్మన్ నందన్ నీలేకని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా వివరాలను వెల్లడించారు. HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5— Narendra Modi (@narendramodi) July 26, 2026పోటీ పరీక్షలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు ఈ కమిటీ పలు సిఫార్సులు చేయనుంది. ప్రశ్నాపత్రాల భద్రతను పటిష్టం చేయడం, అభ్యర్థుల ధృవీకరణ, మూల్యాంకన విధానాలు, పరీక్షల నిర్వహణలో సాంకేతికతను ఏ విధంగా అమలు చేయాలనే అంశాలపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది. మాజీ ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వీ కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కల్వాల్ తదితరులు ఈ టాస్క్ ఫోర్స్‌లో సభ్యులుగా ఉన్నారు.నందన్ నీలేకని ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, టెక్నాలజీ నిపుణుడు. ప్రభుత్వ విధాన నిపుణుడు. 1981లో ఎన్ఆర్ నారాయణ మూర్తితో కలిసి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2002 నుండి 2007 వరకు ఆ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈఓ) సేవలు అందించారు. ఆ తర్వాత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచపు అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు ప్రాజెక్ట్ అయిన ‘ఆధార్’ (యూఐడీఏఐ) వ్యవస్థాపక ఛైర్మన్‌గా విశేష సేవలందించి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి విశేష కృషి చేశారు.ఇది కూడా చదవండి: ‘నన్ను అరెస్ట్ చేస్తారా?’.. మమ్దానీపై విరుచుకుపడ్డ నెతన్యాహు -
మహిళతో అసభ్య ప్రవర్తన.. బస్సులోనే దాడి
బనశంకరి: బెంగళూరు బీఎంటీసీ బస్సుల్లో గొడవలు కొత్త కాదు. ఇప్పుడో రగడ వైరల్ అయ్యింది. ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని యువతితో పాటు బస్సు డ్రైవరు అతన్ని చితకబాదారు. సంపిగేహళ్లి పోలీసులు సుమోటోగా కేసు నమోదుచేశారు. వివరాలు.. ఈ నెల 24వ తేదీ మద్యాహ్నం 12:42 సమయంలో బీఎంటీసీ బస్సు మాన్యతా టెక్‌పార్కు వైపు వెళ్తోంది. ఓ యువతిని నిందితుడు కావాలనే తాకాడని ఆమె కోపంతో అతన్ని కేకలు వేసింది. తరువాత డ్రైవరుకు చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి అతన్ని బస్సులో మూలకు తోసి బట్టలు విప్పి చితకబాదారు. డ్రైవరు కాలితో ఎడాపెడా కొట్టాడు. చివరకు అతడు బస్సులో నుంచి దిగి పారిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సదరు వ్యక్తిని మతిస్థిమితం లేనివానిగా భావిస్తున్నారు. తరచూ సిటీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఆకతాయిగా ప్రవర్తిస్తుంటాడని సమాచారం. యువతి ధైర్యంగా అతనికి గుణపాఠం చెప్పిందని కొందరు నెటిజన్లు అన్నారు. మరికొందరు అతన్ని అంత ఘోరంగా కొట్టడం సరికాదని పేర్కొన్నారు. ఆ వ్యక్తిని పట్టుకుని విచారించడానికి పోలీసులు గాలింపు చేపట్టారు.A woman faced sexual harassment by a copassenger on a #BMTC bus near Manyata Tech Park in #Bengaluru.After she confronted the accused, the BMTC driver locked the bus doors to stop him from fleeing and assaulted him. A video of the incident has gone viral. #Karnataka pic.twitter.com/MhXMNMZs4e— Imran Khan (@KeypadGuerilla) July 25, 2026 -
పాపం ధనుష్.. ఆ మాటలకే ఇన్ని తిట్లా?
సినీ పరిశ్రమకు, రాజకీయాలకు మధ్య అనుబంధం తమిళనాట కొత్తేమీ కాదు. తెరపై భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న పలువురు నటులు.. ఆ తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వేదికగా మార్చుకుని.. ఆ తర్వాత రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్ ప్రయాణం ఇప్పుడు మరికొందరు సినీ ప్రముఖుల భవిష్యత్తుపైనా ఆసక్తి పెంచింది.ఈ క్రమంలోనే మరో స్టార్ హీరో ధనుష్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. అభిమానుల్లో, నెటిజన్లలో కొత్త చర్చకు కారణమయ్యాయి. అయితే ధనుష్ అసలు రాజకీయాల గురించి ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఆయన మాటలను కొందరు పొలిటికల్ యాంగిల్లో విశ్లేషిస్తున్నారు. తన అభిమానులను ఉద్దేశించి ధనుష్ మాట్లాడుతూ.. కేవలం సినిమా వేడుకలు, అభిమానుల సమావేశాలకే పరిమితం కాకుండా.. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.“ఒకచోట ఇంతమంది కలవడం వెనుక ఎంతో శక్తి ఉంది. ఆ శక్తికి ఒక లక్ష్యం ఉండాలి. ఆడియో లాంచ్‌లు, మీటింగ్స్‌కే పరిమితం కాకుండా.. మీ చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేయండి. మీ ప్రాంతంలోని కుటుంబాలకు అండగా నిలవండి. మీపై నేను మరింత గర్వపడేలా చేయండి” అంటూ ధనుష్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.ఇక్కడి నుంచే అసలు చర్చ మొదలైంది. “ఇది కేవలం అభిమానులకు ఇచ్చిన సామాజిక సందేశమా? లేదంటే భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి సంకేతమా?” అని చర్చ మొదలుపెట్టారు. అయితే ఈ చర్చకు మరో కారణం విజయ్ రాజకీయ ప్రయాణమే. విజయ్ కూడా గతంలో తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో ధనుష్ కూడా అదే దారిలో వెళ్తున్నారా? అంటూ కొందరు పోల్చడం మొదలుపెట్టారు.ఇటు విజయ్ అభిమానులు మాత్రం ఈ ప్రచారాన్ని తప్పుబడుతున్నారు. “విజయ్ బాటను కాపీ చేస్తున్నారా?” అంటూ కొందరు సోషల్ మీడియాలో ధనుష్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో ధనుష్‌ను ఆయన మాజీ మామ, సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో పోలుస్తూ కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఏళ్ల తరబడి ఊహాగానాలు వచ్చినప్పటికీ.. చివరకు ఆయన వెనక్కి వెళ్లిపోయారు. విజయ్ గెలుపు సమయంలోనూ అభినందించకుండా ‘అసూయ’ను ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో “రజినీకాంత్ వల్లే కాలేదు.. ఇంక ధనుష్ ఏం చేస్తారు?” అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.అయితే ధనుష్ అభిమానులు మాత్రం సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం మాత్రమే రాజకీయ ఎంట్రీకి సంకేతం కాదని, ప్రతి హీరో వ్యాఖ్యలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదంటున్నారు. రాజకీయ ప్రవేశంపై ధనుష్ ఇప్పటిదాకా ఎలాంటి సంకేతం ఇవ్వలేదు. ఆయన వ్యాఖ్యలు అభిమానులను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరిన సందేశంగానే కనిపిస్తున్నాయి. కానీ తమిళనాడులో సినీ హీరోలకు ఉన్న ప్రజాదరణ, అభిమాన సంఘాల ప్రభావం కారణంగా ఇలాంటి చిన్న వ్యాఖ్యలు కూడా పెద్ద రాజకీయ చర్చలకు దారి తీస్తున్నాయి. -
విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం.. కేంద్రానికి మరో పరీక్ష!
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానుండగా, విద్యార్థి నిరసనలు, పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టే పరిస్థితిలో లేదు.జూలై 20న జరిగిన సీజేపీ చలో సంసద్ నిరసన సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు దాడులు చేశారన్న ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా లేవనెత్తుతోంది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారన్న ఆరోపణలపై అమిత్ షాకు లేఖ రాశారు. 19 ఏళ్ల విద్యార్థి సహిల్ లోచాబ్ ఒక కంటిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని పేర్కొంటూ, ఇలాంటి బలప్రయోగానికి అనుమతి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సాధారణ దుస్తుల్లో కనిపించిన వ్యక్తులు విద్యార్థులను లాఠీలతో కొట్టిన ఘటనపై కూడా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.Another disturbing video from the CJP "Sansad Chalo" protest is circulating online.Protesters allege that, after lathi charges and tear gas, pellet guns were also used during the crackdown.#संसद_मार्च#cjp_पार्टी pic.twitter.com/6IrdPuAQss— Zo World (@ZoWorldd1) July 22, 2026మరోవైపు, రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఉపనేత సాగరికా ఘోష్ రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు. విద్యార్థులపై జరిగిన దాడులపై సభలో తక్షణమే చర్చ జరపాలని ఆమె కోరారు. అయితే, నిరసనల సందర్భంగా పెల్లెట్ గన్స్ ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)పై వచ్చిన ఆరోపణల విషయంలో మాత్రం సీఆర్పీఎఫ్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026ను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి నేరాలకు మరింత కఠిన శిక్షలు విధించేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. సవరణ బిల్లు ప్రకారం, వ్యక్తులకు కనిష్ఠ జైలు శిక్షను మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు, గరిష్ఠ శిక్షను పది సంవత్సరాలకు పెంచనున్నారు. గరిష్ఠ జరిమానాను రూ.50 లక్షలకు పెంచడంతో పాటు, సేవలందించే సంస్థలకు రూ.5 కోట్ల వరకు జరిమానా, నిర్వాహకులకు కఠిన శిక్షలు, వ్యవస్థీకృత ప్రశ్నాపత్రాల లీకేజీ నేరాలకు మరింత కఠిన చర్యలు తీసుకునే నిబంధనలు చేర్చారు. అలాగే కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు.ఇక కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీపై కూడా విమర్శలు పెరుగుతున్నాయి. ఇథనాల్ మిశ్రమ ఇంధనం (E20) కారణంగా వాహనాలకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ ఈ నెల 31న ఢిల్లీలో మరో నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. -
రాజీనామా ఖుషీ.. హుషారుగా స్టెప్పులేసిన సీజేపీ లీడర్స్
నీట్ పేపర్ లీకేజీ.. విద్యార్థుల ఆత్మహత్యలు.. మంత్రి రాజీనామా అంశంతో ఆందోళనలు చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ తమ డిమాండ్లు నెరవేరడంతో రిలాక్స్ అయ్యింది. గత రాత్రి ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఆ పార్టీ నేతలు, పలువురు స్టూడెంట్స్ గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. రకరకాల వంటకాలతో.. డీజే పాటలతో హుషారెత్తించే స్టెప్పులేశారు. అయితే.. ఖుషీగా వాళ్లు చేసిన ఆ పార్టీపై ఇప్పుడు దుమారం రేగుతోంది.కొందరు అమ్మాయిలు(సీజేపీ ప్రతినిధులు/నీట్ అభ్యర్థులు?!) జోష్‌గా డ్యాన్సులు చేయగా.. అటు చర్చల్లో పాల్గొన్న అశుతోష్ రాంకా, సౌరబ్ దాస్ ఇద్దరూ కూడా హుషారుగా వాళ్లతో కలిసి స్టెప్పులు కలిపారు. అందరూ కలిసి హోటల్లో సంబురాల్లో మునిగిపోయారు. మరోవైపు.. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఓ మూలన కూర్చుని పార్టీ చూస్తున్నట్లు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. రాజీనామా సందర్భంగా ఖుషీ అంటూ ఆ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచే ఈ వీడియో(Resignation की ख़ुशी) పోస్ట్ కావడం గమనార్హం.Resignation की ख़ुशी 🥹 pic.twitter.com/QT4Y5j4cy6— Cockroach Janta Party (@CJP_for_India) July 26, 2026అయితే ఈ వీడియోపై పలువురు అభ్యంతరాలు.. ఇంకొందరు తిట్టిపోస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్న కొందరు విద్యార్థులకు పార్లమెంట్ మార్చ్ సందర్భంగా గాయాలైన సంగతి తెలిసిందే. వాళ్లు కోలుకోకముందే కాక్రోచ్ నాయకత్వంలో ఉన్నవాళ్లు ఇలా పార్టీ చేసుకోవడానికి కొందరు తీవ్రంగా తప్పు బడుతున్నారు. నీట్ కారణంగా దేశవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అసలు ఉద్యమం ఉద్దేశాన్ని నీరుగార్చేలా వీళ్ల తీరు ఉందంటూ మండిపడుతున్నారు.అదే సమయంలో యాంటీ నెటిజన్లు మాత్రం.. ఇది కాక్రోచ్ల నిజ స్వరూపం అంటూ మండిపడుతున్నారు. నిరసనల్లో ఆందోళనకారులకు అరటిపండ్లు, బ్రెడ్ పకోడీలు పంచుతూ గుర్తింపు పొందిన జునైద్ అనే యువకుడి గురించి కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘అభిజీత్ దీప్కే నా కాల్స్‌కు స్పందించడం లేదు’.. అంటూ అతను కంటతడి పెట్టిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. షాదాబ్ సైఫీ సైతం ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ జోష్ పార్టీలో కనిపించకపోవడంతో.. ఇలాంటి కొందరిని కేవలం తమ అవసరాలే దీప్కే వాడుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వాంగ్‌చుక్ ప్రస్తావన లేకుండానే.. గత రెండ్రోజులుగా సీజేపీ వ్యవహరిస్తుండడమూ విమర్శలకు తావిస్తోంది. మరోవైపు.. అభిజీత్ దీప్కే తనకు టైఫాయిడ్ సోకిందని ట్రీట్మెంట్ ఫొటోలను వైరల్ చేశాడని.. కానీ సాయంత్రానికే ఇంటికి దగ్గర్లో ఉన్న హోటల్లో పన్నీర్ టిక్కా తింటూ ఎంజాయి చేస్తున్నాంటూ ఇంకొందరు మండిపడుతున్నారు. అయితే ఇటు ఈ యువతకు మద్దతుగా పోస్టులు చేసేవాళ్లు కొందరు కనిపిస్తున్నారు. -
ఎన్డీఏ పాలనలో విద్యాశాఖ వివాదాలు
భారతదేశ విద్యా వ్యవస్థను అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లాల్సిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర వివాదాలు, కుదుపులకు లోనైంది. ఎన్డీఏ ప్రభుత్వ పన్నెండేళ్ల పాలనా కాలంలో నలుగురు వేర్వేరు మంత్రులు ఈ కీలక బాధ్యతలను నిర్వర్తించినప్పటికీ, వారిలో ముగ్గురు కనీసం మూడేళ్లు కూడా పదవిలో కొనసాగలేకపోయారు. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే ఐదేళ్ల పూర్తి కాలం పని చేసినప్పటికీ, చివరికి ‘నీట్’ పరీక్షల లీకేజీలు, చెలరేగిన దేశవ్యాప్త నిరసనల సెగతో ఆయన కూడా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2014 నుంచి ఇప్పటివరకు విద్యాశాఖను చుట్టుముట్టిన సంచలన వివాదాలివే..మారిన పేర్లు.. రద్దయిన ఎఫ్‌వైయూపీ2014 మే 26 నుంచి 2016 జూలై 5 వరకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఇప్పుడు విద్యా మంత్రిత్వ శాఖ) బాధ్యతలు చేపట్టిన స్మృతి ఇరానీ హయాంలో పలు సంచలన నిర్ణయాలు వెలువడ్డాయి. ఆమె పదవీకాలంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అమలవుతున్న నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఎఫ్‌వైయూపీ) రద్దు చేయడం ఒకటి. దీనివల్ల విద్యార్థి, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయితే ఇదే సమయంలో జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ముసాయిదా రూపకల్పనకు శ్రీకారం చుట్టడంతో పాటు, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ రేంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)ను ఆమె ప్రారంభించారు.జేఎన్‌యూ వివాదాలు, రోహిత్ వేముల ఆత్మహత్యస్మృతి ఇరానీ పదవీకాలం అనేక రాజకీయ తుఫాన్లకు కేంద్రబిందువుగా మారింది. జేఎన్‌యూలో చెలరేగిన భారీ నిరసనలు, నాటి విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అరెస్టు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అలాగే 2016 జనవరిలో చోటుచేసుకున్న రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం ప్రభుత్వంపై తీవ్ర నైతిక ఒత్తిడి తెచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2016 జూలైలో ఆమెను విద్యాశాఖ నుంచి తప్పించి జౌళి శాఖకు బదిలీ చేశారు.ఐఐఎంలకు స్వయంప్రతిపత్తి.. ఎన్టీఏ ఏర్పాటుస్మృతి ఇరానీ తర్వాత విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన ప్రకాశ్ జవదేకర్ 2016 జూలై 5 నుంచి 2019 మే 30 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన హయాంలో ప్రవేశపెట్టిన ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)యాక్ట్-2017’ ద్వారా ఐఐఎం సంస్థలకు మరింత స్వయంప్రతిపత్తి లభించింది. అలాగే దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల నిర్వహణను ఒకే గొడుగు కిందకు తెచ్చే ఉద్దేశంతో ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (ఎన్టీఏ)ను ఆయన ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాతి కాలంలో నీట్ పేపర్ లీక్ అంశంలో ఇదే ఎన్టీఏ తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.నో డిటెన్షన్ పాలసీ రద్దు.. సీబీఎస్ఈ పేపర్ లీక్జవదేకర్ హయాంలో విద్యా హక్కు చట్టానికి సవరణ చేసి, ఐదు, ఎనిమిది తరగతుల్లో పిల్లలను ఫెయిల్ చేయకుండా పై తరగతులకు పంపే ‘నో డిటెన్షన్ పాలసీ’ని రద్దు చేశారు. అయితే 2018లో సీబీఎస్ఈ బోర్డు పరీక్షల పేపర్ లీక్ కావడంతో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తీవ్ర విమర్శలపాలైంది. అంతేకాకుండా, జియో ఇన్స్టిట్యూట్కు ‘ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్’ హోదా కట్టబెట్టడం కూడా పెద్ద వివాదానికి దారితీసింది.నిశాంక్ హయాంలో జాప్యమైన కీలక నియామకాలు2019లో ప్రకాష్ జవదేకర్ స్థానంలో డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ విద్యామంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలో 2020 జూలైలో నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ఆమోదం పొందడం ఒక మైలురాయిగా నిలిచినా, దాని రూపకల్పనలో సింహభాగం అంతకుముందే పూర్తయింది. అయితే ఆయన కాలంలో జెఎన్యూ, బీహెచ్‌యూ, ఢిల్లీ వర్సిటీ వంటి ప్రముఖ కేంద్ర విశ్వవిద్యాలయాలకు నెలల తరబడి వైస్‌చాన్సలర్ల నియామకాలు జరగలేదు. అలాగే ఐదు ఐఐటీ సంస్థలకు పూర్తిస్థాయి డైరెక్టర్లను నియమించడంలో తీవ్ర జాప్యం జరిగింది. అనారోగ్య కారణాలరీత్యా ఆయన 2021 జూలైలో పదవికి రాజీనామా చేశారు.ధర్మేంద్ర ప్రధాన్ రాక.. జాతీయ స్థాయిలో సంక్షోభాలురమేష్ పోఖ్రియాల్ నిష్క్రమణ తర్వాత విద్యాశాఖ పగ్గాలు చేపట్టిన ధర్మేంద్ర ప్రధాన్ సుదీర్ఘకాలం పదవిలో కొనసాగినప్పటికీ, ఆయన కూడా వివాదాల నుంచి తప్పించుకోలేకపోయారు. ఎన్సీఈఆర్టీ సిలబస్ మార్పులు, పాఠ్యాంశాల తొలగింపు వంటి అంశాలపై మేధావులు, విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయంటూ బీజేపీ పాలనలో లేని రాష్ట్రాల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.‘నీట్’ తుఫాన్.. పదవిని కోల్పోయిన మంత్రిధర్మేంద్ర ప్రధాన్ హయాంలో ‘నీట్-యూజీ’ ప్రవేశ పరీక్షలో తలెత్తిన పేపర్ లీక్ కుంభకోణం, గ్రేస్ మార్కుల వివాదం దేశవ్యాప్తంగా విద్యార్థులను రోడ్డెక్కేలా చేశాయి. సుప్రీంకోర్టు జోక్యం, సీబీఐ దర్యాప్తు వరకు వెళ్లిన ఈ వ్యవహారం ఎన్టీఏ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసింది. పరీక్షల మాఫియా అంతుచూస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, దేశవ్యాప్తంగా చెలరేగిన తీవ్ర నిరసనలు, ఆందోళనల కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ చివరకు తన విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.ఇది కూడా చదవండి: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా.. ఎక్కడంటే.. -
అసోం వరదలు.. 68కి చేరిన మరణాలు
గువాహటి: అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ప్రస్తుతం చరైదియో, గోలాఘాట్, జోర్హాట్, నగావ్, శివసాగర్ జిల్లాల్లో 5.24 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. వరదల కారణంగా ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 68కు చేరింది.గత 24 గంటల్లో చరైదియో జిల్లాలో ఇద్దరు వరద నీటిలో మునిగి మృతి చెందారు. వరద ప్రభావిత జిల్లాల్లో చరైదియో అత్యంత తీవ్రంగా దెబ్బతింది. అక్కడ సుమారు 1.9 లక్షల మంది వరదల బారిన పడగా, శివసాగర్‌లో 1.5 లక్షల మందికి పైగా, జోర్హాట్లో సుమారు 1.4 లక్షల మంది ప్రభావితులయ్యారు.🚨BREAKING : Assam floods worsen as relentless rain & upstream cloudbursts hit multiple districts. 47 dead after 6 deaths in last 24 hrs (ASDMA). 7.21 lakh+ people affected, with Sivasagar among the worst hit. IAF, NDRF, SDRF continue rescue & relief pic.twitter.com/vmWziRi5Yf— The Lie Lamaa 🏹 (@TweetsOfLamaa) July 26, 2026బాధితుల సహాయార్థం ప్రభుత్వం నాలుగు జిల్లాల్లో 354 సహాయ శిబిరాలు, సహాయ పంపిణీ కేంద్రాలు నిర్వహిస్తోంది. వీటిలో 37,724 మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందిస్తోంది. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ, పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టి పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 763 గ్రామాలు నీటమునిగాయి. ఇదిలా ఉండగా, నుమాలిగఢ్ వద్ద ధనసిరి నది ఇంకా ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నట్లు ఏఎస్డీఎంఏ వెల్లడించింది. వరదల ప్రభావంతో రాష్ట్రంలో 88,240 పశువులు, పౌల్ట్రీ పక్షులు కూడా నష్టపోయినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. -
బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు
సాక్షి,చెన్నై: తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని సెంగమలపట్టిలో ఆదివారం ఉదయం అనుమతి లేకుండా ఒక వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా నడుపుతున్న బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పరిశ్రమ యజమానిసహా ముగ్గురు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు దాటికి మృతుల శరీరావయవాలు 50 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడటంతో మృతులను గుర్తించడం కష్టంగా మారింది. రేకుల షెడ్డు పక్కనే నిలిపి ఉంచిన ఒక కారు, బైక్ ధ్వంసమయ్యాయి. అలాగే సమీపంలోని మూడు ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. సమాచారం అందుకున్న శివకాశి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ధ్వంసమైన బాణసంచా పరిశ్రమ -
చైనాలో తుపాను బీభత్సం
బీజింగ్: నౌల్ తుపాను చైనాలో బీభత్సం సృష్టిస్తోంది. వాయవ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు 10 మంది మృతి చెందారు. 32 మంది గాయపడ్డారు. పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయారు. జాతీయ సమగ్ర అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ హుయిజౌ నగర సమీపంలో ఆదివారం తెల్లవారుజామున తుపాను తీరం దాటింది. దీంతో గంటకు 162 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. తుపాను తీవ్రతను ఊహించిన హోం శాఖ 28 తాత్కాలిక శిబిరాలు ఏర్పాటుచేసింది. ప్రభావిత ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రవాణా వ్యవస్థ దెబ్బతిని వందలాది విమానాలు, హైస్పీడ్ రైలు సరీ్వసులు రద్దయ్యాయి. గ్వాంగ్జౌ, షెన్‌జెన్‌లలో 700కు పైగా విమానాలను నిలిపేశారు. -
ఉక్రెయిన్‌లో నౌకపై దాడి
లండన్/న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని ఒడెసా నౌకాశ్రయంలో ఉన్న ఓ వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు భారతీయులు గల్లంతయ్యారు. ‘ఎంవీ ఏజీఎన్ రగ్నార్’ నౌకలో ఉన్న మరో ఇద్దరు భారతీయ నావికులు మాత్రం దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారని కీవ్ నగరంలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. శనివారం జరిగిన ఈ ఘటనలో గల్లంతైన భారతీయుల ఆచూకీ కనుగొనేందుకు ఉక్రెయిన్ అధికారులతో సంప్రతింపులు జరుపుతున్నామని ఎంబసీ వివరించింది. రష్యా– ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో తరచూ రష్యా నల్ల సముద్ర తీరంలోని ఒడెసా పోర్టుపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడుతోంది. అయితే, తాజా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ఈ ప్రాంతంలో ఏప్రిల్ నుంచి వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల్లో ఇప్పటి వరకు కనీసం ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అప్రమత్తంగా ఉండండి: విదేశాంగ శాఖ నల్ల సముద్ర ప్రాంతం వంటి సంక్షోభాలు కొనసాగుతున్న చోట్ల విధులు నిర్వహించాల్సిన పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం భారతీయ నావికులు, సిబ్బందిని కోరింది. ఈ మేరకు ఆదివారం ఒక అడ్వైజరీ జారీ చేసింది. అటువంటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని, భద్రతా పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేసుకోవాలని సూచించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా నల్ల సముద్రం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని హెచ్చరించింది. -
రక్షణ రంగంలో ఉన్నత శిఖరాలకు భారత్
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ రంగ ఉత్పత్తులు, ఎగుమతులు, మిత్రదేశాలతో రాజకీయ సహకారం వంటి రంగాల్లో భారత్ నిరంతరం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో మనదేశం స్వయం సమృద్ధి సాధిస్తోందని, స్వదేశీ పరిజ్ఞానంతో నూతన రికార్డులు సృష్టిస్తోందని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఆదివారం 136వ ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశ రక్షణ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, యువత సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. ఆయన ఏం చెప్పారంటే.. ‘ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్–1’జూలై 18న శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడం చరిత్రాత్మక ఘట్టం. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుండడం సంతోషంగా ఉంది. ‘క్యాచ్ ది రెయిన్’, ‘ఏక్ పేడ్ మా కే నామ్ పే’ కార్యక్రమాలు ఉద్యమంలా కొనసాగుతున్నాయి’’ అని అన్నారు. క్రీడలు, విద్యలో సత్తా చాటుతున్న యువత ‘‘అంతర్జాతీయ క్రీడల్లో మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ షట్లర్‌గా పీవీ సింధు చరిత్ర సష్టించింది. లండన్‌లోని చారిత్రక లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు తొలి టెస్ట్ మ్యాచ్‌లో 270 పరుగుల తేడాతో అపూర్వ విజయం సాధించడం మనందరికీ గర్వకారణం. 1983లో పురుషుల జట్టు ఇక్కడే తొలి ప్రపంచకప్ సాధించగా, ఇప్పుడు మన నారీశక్తి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచి్చపెట్టింది’’ అని అన్నారు. చేనేత కళాకారులను గౌరవించాలి‘‘అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్స్‌లో సత్తా చాటిన భారత విద్యార్థులను నా అభినందలు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లాలోని సౌత్ చిట్టూర్కు చెందిన ఉపాధ్యాయుడు అభిలాష్ ఫుట్‌బాల్ పదాలతో సంస్కృతం నేర్పిస్తున్న ‘అక్షర కందుక్’ ప్రాజెక్టు ప్రయోగం ప్రశంసనీయం. జూలై 27న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్థంతి జరుగనుంది. గురు పూరి్ణమ నిర్వహించుకోబోతున్నాం. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలంతా ‘హర్ ఘర్ తిరంగా’కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలి. ఆగస్ట్ 7న ‘నేషనల్ హ్యాండ్లూమ్ డే’జరుగనుంది. చేనేత వ్రస్తాలను ప్రోత్సహించడం ద్వారా చేనేత కళాకారులను గౌరవించాలని ప్రజలను కోరుతున్నా’’ అని అన్నారు. -
ఎల్జీబీటీ కమ్యూనిటిపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎల్జీబీటీక్యూపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎల్జీబీటీక్యూ వ్యక్తులు ఎప్పుడూ భారతీయ సమాజంలో అంతర్భాగంగానే ఉన్నారని, వారిని బహిష్కరించడం కాకుండా గౌరవం, ఆమోదం తెలపాలని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ ఈ విధంగా మాట్లాడారు. భారతీయ సంప్రదాయాలు చాలాకాలం క్రితమే వీరిని గుర్తించాయని సమాజంలో వాటికి తగిన స్థానం కల్పించాయని ఆయన పేర్కొన్నారు.మోహన్ భగవత్ మాట్లాడుతూ.."ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలన్నీ సమాజంలో ఉన్నాయి. ఇటువంటి స్వభావాలు సమాజంలో సహజంగానే కనిపిస్తాయి. కొన్ని పుట్టుకతోనే ప్రకృతిసిద్ధంగా వస్తే, మరికొన్ని మనుషుల ఆలోచనా విధానం లేదా శారీరక ధోరణుల కారణంగా ఏర్పడతాయి.కమ్యూనిటీ సభ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ వెలివేయకూడదని ఆయన స్పష్టం చేశారు. మన సంప్రదాయం వారి ఉనికిని అంగీకరిస్తుంది. వారు కూడా మనుషులే, వారికి జీవించే హక్కు ఉంది. వారిని సమాజం నుంచి బహిష్కరించలేదు; విశాలమైన మన సామాజిక జీవన విధానంలో వారికి కూడా ఒక స్థానం ఉంది" అని తెలిపారు.భారతీయ సమాజం అటువంటి వర్గాల పట్ల పక్షపాతంతో వ్యవహరించకుండా చారిత్రాత్మకంగా మానవతా దృక్పథాన్నే అనుసరించిందని ఆయన తెలిపారు. నేటికీ వారికి స్వంత దేవతలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయని కుంభమేళాలో పాల్గొనే మహామండలేశ్వరులు కూడా వీరున్నారని ఆయన గుర్తుచేశారు. భారతీయ సమాజం సాంప్రదాయబద్ధంగా ఈ అంశాన్ని ఎప్పుడూ నిశ్శబ్దంగా, అత్యంత సానుకూల దృక్పథంతో అర్థం చేసుకుంటూ వారిని సమాజంలో అంతర్భాగంగానే చూసిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు.గతంలోనూ ఇలా సమలింగ సంపర్కం, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ గురించి మోహన్ భగవత్ బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. 2023 జనవరిలో ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎల్జీబీటీక్యూ వ్యక్తులు ఇతరులలాగే జీవించే హక్కు ఉన్న మనుషులు కాబట్టి, వారికి సొంత వ్యక్తిగత, సామాజిక స్థలం ఉండాలి" అని పేర్కొన్నారు. హిందూ గ్రంథాలు, పురాణాలను ఉదాహరణగా చూపుతూ, భారతీయ నాగరికత వారిని సామాజికంగా వెలివేయకుండా చారిత్రాత్మకంగా ఆమోదించిందని ఆయన వాదించారు.పెద్దల అంగీకారంతో కూడిన స్వలింగ సంబంధాలను 2018లో భారత సుప్రీంకోర్టు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 377ను కొట్టివేసి నేరరహితం చేసింది. అయితే, స్వలింగ వివాహాలు, ఎల్జీబీటీక్యూ+ వర్గాలు కోరుతున్న అనేక ఇతర హక్కులు ఇప్పటికీ చట్టపరమైన గుర్తింపు పొందలేదు. స్వలింగ సంపర్కాన్ని సంచలనాత్మకంగా మార్చకూడదని, అది సమాజంలో ఒక సహజ వాస్తవమని భగవత్ గతంలో కూడా చెప్పారు. 2019 అక్టోషన్లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మహాభారతంలోని శిఖండి వంటి పాత్రలను ఉదాహరణగా చూపుతూ, భారతీయ సమాజంలో లైంగిక వైవిధ్యం చాలా కాలంగా ఉందని ఆయన వాదించారు. "దీనిపై అనవసరమైన రాద్ధాంతం చేయడం సహాయపడదు" అని, కాలంతో పాటు సమాజం కూడా పరిణామం చెందాలని ఆయన అన్నారు. -
సభలో రగడ ఆగేనా?
సాక్షి, న్యూఢిల్లీ: సీజేపీ ఉద్యమంతో మోదీ సర్కార్‌పై పెరిగిన ఒత్తిడిని పార్లమెంట్‌లోనూ కొనసాగించాలని విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు నిర్ణయించాయి. చలో సంసద్ ర్యాలీలో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదిన, పెల్లెట్ గన్స్ ఉపయోగిస్తూ కొనసాగిన పోలీస్ చర్యకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంట్లో విపక్ష పార్టీలు డిమాండ్ చేయనున్నాయి. పార్లమెంట్ ఉభయసభలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్షాలు కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. పోటీపరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీల నివారణకు ఉద్దేశించి కొత్త ముసాయిదా బిల్లును ప్రభుత్వం తీసుకొస్తున్న నేపథ్యంలో దానికి మద్దతు ఇవ్వాలా వద్దా అనే దానిపై సోమవారం పార్లమెంట్లో ఖర్గే చాంబర్లో సమావేశమై ‘ఇండియా’ కూటమి నేతలు తుది నిర్ణయం తీసుకోనున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులపై దాడికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఉభయసభల్లో మరోమారు వాగ్వాదాల వేడి రాజుకోనుందని స్పష్టమవుతోంది. మరోవైపు నీట్ అంశంపై ఆందోళనలు సాగిస్తున్న విద్యార్థుల పట్ల భద్రతా బలగాలు అతిగా వ్యవహరించాయని, దీనిపై రాజ్యసభలో చర్చ చేపట్టాలని కోరుతూ టీఎంసీ రాజ్యసభ ఉప నేత సాగరికా ఘోష్ ఆదివారం నోటీసు ఇచ్చారు. 267వ నిబంధన ప్రకారం సభలో ఆరోజు జరగాల్సిన కార్యక్రమాలను రద్దు చేసి, ఈ అంశంపై చర్చను చేపట్టాలని రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు పంపిన నోటీస్‌లో సాగరిక పేర్కొన్నారు.నేటి నుంచి సభలో బిల్లులు → పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలను అరికట్టడమే లక్ష్యంగా రూపొందించిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్(అన్యాయమైన మార్గాల నిరోధక) సవరణ బిల్లు–2026’ను లోక్‌సభ ముందుకు తీసుకురానున్నారు. → ఇదివరకే రాజ్యసభలో ప్రవేశపెట్టిన ‘వందేమాతరం’బిల్లుపై చర్చ జరుగనుంది. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా సమాధానం ఇవ్వనున్నారు. వందేమాతరం గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉండటంతో చర్చ ఆసక్తికరంగా మారనుంది. → సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య(సవరణ) బిల్లు–2026 కూడా పార్లమెంట్ ముందుకు రానుంది. సుప్రీంకోర్టులో న్యాయ మూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన ఈ సవరణ బిల్లు చర్చల జాబితాలో ఉంది. -
పంజాబ్ పరీక్షలో అక్రమాలపై సీజేపీ పోరాటం
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ఆందోళన విజయవంతం కావడంతో ఆ పార్టీ తదుపరి కార్యాచరణపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పంజాబ్‌లో జరిగిన పరీక్షలో అక్రమాలపై పోరాటం చేపట్టాలని చాలామంది ఆ పార్టీని కోరుతున్నారు. దీనిపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తాజాగా స్పందించారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. జంతర్‌మంతర్ వద్ద పోరాటం నిన్ననే ముగిసింది కాబట్టి తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. తదుపరి పోరాటం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఢిల్లీలో విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఏ ఒక్క విద్యార్థిపైనా కేసులు నమోదు చేయకూడదని తేల్చిచెప్పారు. పంజాబ్‌లో 454 మంది ఫార్మసీ అధికారుల నియామకం కోసం బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ జూలై 19న నిర్వహించిన పరీక్షలో వ్యవస్థీకృత పద్ధతిలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం భగవంత్ మాన్ సమాధానం చెప్పాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
మోదీపై అభ్యంతకర పోస్టర్.. నటిపై ఫిర్యాదులు
కోల్‌కతా:ప్రధాని నరేంద్ర మోదీపై 'అసభ్యకరమైన' పోస్టర్‌ను ప్రదర్శించారనే ఆరోపణలతో ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రపై ఫిర్యాదు నమోదైంది. కోల్‌కతాలో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసనలో మోదీ చిత్రపటాన్ని అసభ్యకరరీతిలో ప్రదర్శించారని నటి శ్రీలేఖపై పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.నిన్న (ఆదివారం) ఆనంద్‌పూర్ పోలీసు స్టేషన్లో బీజేపీ నాయకురాలు కేయా ఘోష్, నటి శ్రీలేఖ మిత్రపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. కేవలం ఒకే చోట కాకుండా బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌తో సహా పలు జిల్లాల్లోని వివిధ పోలీసు స్టేషన్లలో ఆమెపై ఫిర్యాదులు దాఖలైనట్లు నివేదికలు వెల్లడించాయి.ఈ అంశమై బీజేపీ నేత మాట్లాడుతూ.. "దేశ ప్రధానిని అవమానించేలా ఒక అసభ్యకరమైన పోస్టర్‌ను ప్రదర్శించినందుకు నటి శ్రీలేఖ మిత్రపై ఫిర్యాదు దాఖలైంది, ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. శ్రీలేఖ మిత్రను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలి" అని పేర్కొన్నారు.నిరసన ప్రదర్శన నేపథ్యంNEET ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కోల్‌కతా రోడ్లపై భారీ నిరసన ప్రదర్శన జరిగింది.ఈ నిరసనలో శ్రీలేఖ మిత్ర కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీకి సంబంధించిన అభ్యంతరకరమైన/అసభ్యకరమైన చిత్రంతో ఉన్న పోస్టర్‌ను పట్టుకున్నట్లు ఫోటోలు వెలువడ్డాయి.అయితే దీనిపై శ్రీలేఖ మిత్ర తన సోషల్ మీడియా పేజీలో ఒక వీడియో స్టేషను విడుదల చేస్తూ ఘాటుగా స్పందించారు."నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయండి; నన్ను ఉరిశిక్షకు పంపాలనుకుంటే ఉరిశిక్షకు పంపండి. దీనికి వ్యతిరేకంగా కూడా కచ్చితంగా ఒక ఉద్యమం వస్తుందని నేను నమ్ముతున్నాను" అని ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. -
పాశవిక దాడికి బాధ్యులెవరు?
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి బాష్పవాయుగోళాలు ప్రయోగించి, పెల్లెట్ గన్స్ వినియోగించాలంటూ అనుమతిచ్చింది మీరేనా? అని హోం మంత్రి అమిత్ షాను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీనికి జవాబు చెప్పాలని దేశ ప్రజల నుంచి డిమాండ్లు ఎక్కువయ్యాయని రాహుల్ చెప్పారు. విద్యార్థులపై పాశవికంగా జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శనివారం అమిత్ షాకు రాహుల్ ఒక లేఖ రాశారు. ‘‘జంతర్‌మంతర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. విద్యార్థులు న్యాయమైన, పారదర్శకమైన విద్యా వ్యవస్థను కోరుతూ ఆందోళన నిర్వహించారు. వారి డిమాండ్లను వినాల్సిన ప్రభుత్వం, పోలీసులతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ వినియోగం వంటి తీవ్ర బలప్రయోగానికి పాల్పడింది. విద్యార్థినులతో కొందరు పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పోలీసుల దమనకాండలో వందలాది మంది విద్యార్థులు గాయపడ్డారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. పెల్లెట్స్ తగిలి గాయపడిన, ఒక కంట్లో చూపును కోల్పోయే ప్రమాదంలో పడిన టీనేజీ విద్యార్థి సాహిల్ లోచబ్‌ను కలిశా. ఒక జర్నలిస్టు సహా పలువురు తీవ్రంగా గాయపడినట్లు మీడియాలో కథనాలొచ్చాయి. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడాలని మీరే అనుమతి ఇచ్చారా? ఇవ్వకపోతే ఎవరు ఆదేశించారు? సాధారణ దుస్తుల్లో లాఠీలతో విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తులు పోలీసులా లేదా వలంటీర్లా? వారికి అక్కడ విధులను అప్పగించింది ఎవరు?’’ అని అమిత్‌షాను రాహుల్ నిలదీశారు. ‘‘విద్యార్థులపై జరిగిన హింస ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసింది. దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. యువత దేశ భవిష్యత్తు. వారు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే’’ అని రాహుల్ ఆ లేఖ ద్వారా డిమాండ్‌చేశారు. -
ఎడమ కాలుకి కణితి.. కుడి కాలుకి ఆపరేషన్
గురుగ్రామ్: ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది’ అని సామెత. హరియాణాలో ఈ వైద్యులకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ ఆ డాక్టర్లు ఏం చేశారంటే.. బాలునికి ఓ కాలుకు సమస్య ఉందని వెళ్తే మరో కాలుకి శస్త్ర చికిత్స చేశారు. నూహ్ జిల్లాలోని నల్హార్లో షహీద్ హసన్ ఖాన్ మేవాతి ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ఈ ఘటన వైద్యుల నిర్లక్ష్యాన్ని మరోసారి వెలుగులోకి తెచి్చంది. ఆరిఫ్ తన నాలుగేళ్ల బాలుడి ఎడమ కాలులో కణితి చికిత్స కోసం జూలై 20న వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. చూసిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. అలాగే, బాలుడి కాలికి శస్త్రచికిత్స చేశారు. చికిత్స అనంతరం బయటికి తీసుకురాగానే కుడి కాలికి శస్త్రచికిత్స జరిగిందని ఆరిఫ్ గుర్తించాడు. ఎడమకాలికి చేయాల్సి ఉండగా కుడి కాలుకు చికిత్స చేశారని డాక్టర్ల నిర్లక్ష్యాన్ని తెలియ జేశాడు. అల్ట్రాసౌండ్ రిపోర్ట్‌ను చూసిన ఆర్థోపెడిక్ సర్జన్ తన పొరపాటును అంగీకరించి, ఆ తర్వాత మరో కాలికి సైతం శస్త్రచికిత్స చేశాడు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు వైద్య కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపేందుకు వైద్య కళాశాల డైరెక్టర్ నలుగురు వైద్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
జై జవాన్.. జై కిసాన్.. జై 'యువ'
సాక్షి, హైదరాబాద్: వికసిత్ భారత్ 2047, సబ్కా సాథ్ సబ్కా వికాస్ వంటి నినాదాలతో మాత్రమే మార్పు రాదని, యువశక్తిని సరైన దిశలో నడిపించి దేశ భవిష్యత్తుతో వారిని అనుసంధానం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే ఒకప్పుడు ‘జై జవాన్, జై కిసాన్‘ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ‘జై జవాన్, జై కిసాన్, జై యువ‘ అనే నినాదంతో ముందుకెళుతుందని చెప్పారు. యువశక్తి ఇక రోడ్లపై పోరాడటమే కాదు, పార్లమెంట్‌లోకి రావడానికీ సిద్ధంగా ఉందని, చట్టాలను కేవలం పాటించడానికే కాదు, రూపొందించడానికీ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ స్థానాల పెంపు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లతో పాటు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే వయసును తగ్గించే అంశంపై కూడా చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నాలుగు అంశాలపై ఒకేసారి చర్చ జరగాలని, ప్రజాస్వామ్యంపై కేంద్ర ప్రభుత్వానికి నమ్మకం ఉంటే ఈ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీలు, భాగస్వామ్య వర్గాల అభిప్రాయాలు తీసుకుని దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి చట్టాన్ని రూపొందించాలని కోరారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం జాతీయ మీడియాతో మాట్లాడారు. విని, ఆలోచించి, చట్టం చేయాలి ‘ప్రదానమంత్రికి తెలంగాణ ప్రభుత్వం తరఫున నా డిమాండ్ ఒక్కటే. సీట్ల పెంపు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌తో పాటు ఎన్నికల వయసు తగ్గింపు అంశాన్ని కూడా చర్చించండి. దేశంలో లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ.. ఇలా ఎక్కడ ఎన్నికల వ్యవస్థ ఉన్నా అక్కడ చర్చ జరగాలి. ప్రజల స్వరమే దీనిపై తుది నిర్ణయానికి ఆధారం కావాలి. ప్రధాని మోదీ ఎప్పుడూ మాట్లాడడమే కాదు వినడమూ అలవర్చుకోవాలి. మీ పార్టీ, మీ వ్యవస్థలో మీరు చెప్పేది అందరూ వింటారు. ఎందుకంటే మీరు ఎప్పుడూ ‘మన్ కీ బాత్‘ పేరుతో ఆకాశవాణిలో మాట్లాడుతూనే ఉంటారు. మీకు మాట్లాడడం మాత్రమే అలవాటు. వినే అలవాటు లేదు. కానీ ఇప్పుడు వినడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే దేశం మారుతోంది. దేశ ప్రజలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడడం ప్రారంభించారు. మీరు కొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. విని, ఆలోచించి, చట్టం చేయాలి. యువశక్తిని రాజకీయ వ్యవస్థలోకి తీసుకొస్తే దేశ భవిష్యత్తు మారిపోతుంది. 21, 25 సంవత్సరాలకు తగ్గించాలి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ ఎదుగుతుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు ఇంకా 25 సంవత్సరాలుగానే ఎందుకు ఉండాలి? అందుకే ఆగస్టు నెలను చరిత్రాత్మక నెలగా మార్చాలని నిర్ణయించాం. తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని నిర్వహించి, ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకుని, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 సంవత్సరాలకు, రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసే వయస్సును 25 సంవత్సరాలకు తగ్గించాలని తీర్మానం చేసి ఆమోదించాలని నిర్ణయించాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. మోదీకి ఇది రెండో పరాజయం ‘దేశంలోనే అత్యంత శక్తివంతుడు తానేనని భావించే మోదీకి ఇది రెండో పరాజయం. రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలు తెచ్చినప్పుడే రాహుల్‌గాంధీ హెచ్చరించారు. ఈ చట్టాలను దేశ ప్రజలు అంగీకరించరని, విరమించుకోవాలని సూచించారు. కానీ మోదీ తనను ఏమీ చేయలేరని భావించారు. రైతులకు క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని నాడు రాహుల్‌గాంధీ చెప్పినా వినలేదు. చివరకు దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమబాట పట్టారు. ప్రాణాలు పోయినా వెనక్కు తగ్గకుండా ఉద్యమించి మోదీని వెనక్కు తగ్గించారు. ఆ మూడు నల్లచట్టాలను విరమించుకునేలా చేసి రైతులకు క్షమాపణలు చెప్పించారు. దాన్ని ఒక పాఠంగా తీసుకుని మోదీ మారతారని, ప్రతిపక్షానికి గౌరవం ఇస్తారని భావించాం. కానీ మారలేదు. పాత ధోరణినే కొనసాగించారు. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి విద్యా రంగంలోనూ అదే పరిస్థితి కనిపించింది. యూజీసీ–నెట్ సహా అనేక పోటీ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. పరీక్షలు రాసిన విద్యార్థులు విఫలం కాలేదు.. పరీక్షలను సక్రమంగా నిర్వహించాల్సిన కేంద్ర ప్రభుత్వమే విఫలమైంది. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ, నార్కోటిక్స్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి బెదిరించి విద్యార్థులను, వారి పక్షాన మాట్లాడిన వారిని నియంత్రించాలని ప్రయత్నించారు. దేశమంతా వీధుల నుంచి పార్లమెంట్ వరకు తమ శక్తిని యువత చాటింది. 56 అంగుళాల ఛాతీ అంటూ గొప్పలు చెప్పుకున్న అహంకారాన్ని ఓడించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే కాదు.. నీట్ ఘటనల్లో తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు కేంద్రం ఆర్థికసాయం అందించాలి. విద్యార్థులపై పెట్టిన అన్ని క్రిమినల్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి. రాహుల్‌గాంధీ కోరినట్టు అది జరగకపోతే యువశక్తి మరో ఉద్యమం చేపడుతుంది..’ అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ విజయం ముమ్మాటికీ విద్యార్థులదే.. ‘మొదట దేశం, తర్వాత ప్రజలు, చివరగా పార్టీ. దేశ ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు కాంగ్రెస్ ముందు నిలబడుతుంది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది, నిజాం పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసింది, స్వతంత్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు యువత చేసిన ఉద్యమాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావించడం లేదు. ఈ విజయం ముమ్మాటికీ విద్యార్థులు, యువతదే. వారికి అండగా నిలబడడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తీసుకుంది. పేదలను మరింత పేదలుగా మార్చడం బీజేపీకి ఎప్పుడూ అలవాటు. అందుకే చిన్న రాష్ట్రాలన్నింటికీ నష్టం జరిగేలా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడుతోంది. దీనికి శాస్త్రీయ పరిష్కారాన్ని కనుగొనాలి..’ అని సీఎం అన్నారు. -
హైపవర్డ్ యాక్షన్
దేశంలో తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో పలు పరిణామాల అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా.. ఆ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. ఆదివారం కూడా ఇదే అంశం చుట్టూ దేశ రాజకీయాలు పరిభ్రమించాయి. ఢిల్లీలో 37 రోజులపాటు చేసిన యువత ఆందోళనలు ఆగిపోయినప్పటికీ.. పరీక్షల్లో లీకేజీలు, అక్రమాల విషయంలో వారిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తిని కేంద్రం గుర్తించింది. ఈ అంశంపై ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, లీకేజీలకు పాల్పడితే పదేళ్ల జైలుశిక్ష వంటి చర్యలు తీసుకునే దిశగా సాగుతున్న ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో సంస్కరణల కోసం హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఈ టాస్క్ ఫోర్స్‌ను నియమించినట్లు చెప్పారు. పటిష్ట, పారదర్శక పరీక్ష విధానాన్ని ఏర్పాటు చేసేందుకు సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడంపై ఆ టాస్క్‌ఫోర్స్ సూచనలు ఇస్తుందన్నారు. మరోవైపు పేపర్ లీకేజీలపై ఉక్కుపాదం మోపడానికి, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత పెంచడానికి ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’ను కేంద్రం సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో తాము మరింత విజృంభించాలని విపక్షాలు కూడా భావిస్తున్నాయి. విద్యార్థులపై పాశవికంగా దాడికి దిగడం, వారిపై కేసులు నమోదు చేయడంపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీయడానికి సన్నద్ధమవుతున్నాయి. విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి బాష్పవాయుగోళాలు ప్రయోగించి, పెల్లెట్ గన్స్ వినియోగించాలంటూ అనుమతిచి్చంది మీరేనా? అంటూ హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖాస్త్రం సంధించారు. మరోవైపు నీట్ ఆందోళనలను పతాకస్థాయికి తీసుకెళ్లి ధర్మేంద్ర ప్రదాన్ చేత రాజీనామా చేయించడంతో విజయం సాధించిన కాక్రోచ్ జనతా పార్టీ కూడా తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టంచేసింది. పంజాబ్‌లో ఫార్మసీ రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై త్వరలో ఉద్యమించబోతున్నట్లు ఆ పార్టీ అధినేత అభిజిత్ దీప్కే సంకేతాలిచ్చారు. ఇలా ఎవరికి వారు తమ హైపవర్డ్ కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరీక్షల్లో సంస్కరణలకు టాస్క్‌ఫోర్స్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థలో సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. పరీక్షల వ్యవస్థలను ఎలా మెరుగుపరచాలన్న అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ఒక వీడియోను ‘ఎక్స్’లో పోస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో పరీక్షల విశ్వసనీయతను మరింత పెంచేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పటిష్టమైన, పారదర్శకమైన పరీక్షా విధానాన్ని ఏర్పాటు చేసేందుకు సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడంపై ఆ టాస్క్ ఫోర్స్ సూచనలు ఇస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారు జైళ్లలో మగ్గుతున్నారని చెప్పారు. పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలను అరికట్టడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు ఉద్ఘాటించారు. కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త చట్టాన్ని రూపొందించే దిశగా ముందుకు సాగుతున్నామని స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు. విశ్వసనీయంగా, పారదర్శకంగా... నీట్ పేపర్ లీకేజీ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన మరుసటి రోజే హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుపై ప్రధాని స్వయంగా ప్రకటన చేయడం గమనార్హం. మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు. మన పరీక్షా విధానం విశ్వసనీయంగా, పారదర్శకంగా ఉండాలన్నారు. అలాగే, అందులో సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పరీక్షల సంస్కరణలపై దృష్టి సారించేందుకు ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు నీలేకని నేతృత్వంలో ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ సభ్యులు నీలేకని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌లో మొత్తం ఆరుగురు సభ్యులను నియమించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పరీక్షా విధానాన్ని, ముఖ్యంగా సాంకేతిక కోణంలో వ్యవస్థాగత సంస్కరణల పరంగా పునరుద్ధరించడంలో సహాయపడేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులకు ఇందులో స్థానం కల్పించింది. → టెక్నాలజీ నిపుణుడు నందన్ నీలేకని → ఇస్రో మాజీ చైర్మన్ ఎస్.సోమనాథ్ → ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా → ఐఐటీ–చెన్నై డైరెక్టర్ వి.కామకోటి → విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కార్వాల్ → లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనాటెక్నాలజీ దిగ్గజం నీలేకని నందన్ నీలేకని భారతీయులకు సుపరిచితులే. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు ఆయన సహ వ్యవస్థాపకుడు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) వ్యవస్థాపక చైర్మన్‌గా సేవలందించారు. ‘ఆధార్’ ప్రాజెక్టు విజయవంతం కావడం వెనుక ఆయనదే కీలకపాత్ర. 2023 జనవరిలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఏర్పాటు చేసిన జీ20 టాస్క్ ఫోర్స్ సహ–అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బెంగళూరులో జన్మించిన నందన్ నీలేకని ఐఐటీ–బాంబే నుండి బ్యాచిలర్ డిగ్రీని పొందారు. పద్మభూషణ్ సహా ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు.ఫోర్బ్స్ ఆసియా బిజినెస్‌మేన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, బిజినెస్ స్టాండర్డ్ లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్ అవార్డు ఆయనను వరించాయి. ఏక్‌స్టెప్ ఫౌండేషన్‌ను నిలేకని స్థాపించారు. ‘టైమ్స్’ పత్రిక విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో(2006, 2009), ఏఐ రంగంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల(2024) జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. వ్యాపారం, ఆవిష్కరణలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల రంగాల్లో అందించిన సేవలకు గాను నీలేకని అనేక అవార్డులను పొందారు.టాస్క్ ఫోర్స్ బాధ్యతలు → నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన పరీక్షల వ్యవస్థను పునర్వ్యస్థీకరించడం→ పరీక్షల నిర్వహణలో నిర్మాణాత్మక సంస్కరణలను సిఫార్సు చేయడం→ పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ వంటి అనైతిక పద్ధతులను అరికట్టడానికి నూతన వ్యవస్థను రూపొందించడం → జాతీయ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం. -
టైగర్ రిజర్వులో తీవ్రగాయాలతో పులి మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్ ,షాజహాన్‌పూర్ జిల్లాలపిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో తీవ్రంగా గాయపడిన ఐదేళ్ల పులి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ వివరాలని టైగర్ రిజర్వ్‌లోని అటవీ శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.పీటీఆర్ డిప్యూటీ డైరెక్టర్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) మనీష్ సింగ్ మాట్లాడుతూ.. శనివారం రాత్రి పులి మృతి చెందిందని తెలిసింది. దానిని పోస్ట్ మార్టం నివేదిక కోసం మృతదేహాన్ని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపాం. మరణానికి గల అసలు కారణం పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాతే నిర్ధారించబడుతుంది" అని అన్నారు.ప్రాథమికంగా తెలిసిన సమాచారం ప్రకారం మరో పులితో జరిగిన భూభాగ వివాదం బెబ్బులి గాయపడి ఉండవచ్చని తెలిపారు. గత శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అటవీశాఖ అధికారులు రొటీన్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ పులి గాయపడినట్లు గుర్తించారు. ఈ జంతువుకు చికిత్స చేయడానికి దక్ష గంగ్వార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన పశువైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే వైద్యులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ పులిప్రాణాలు దక్కలేదని తెలిపారు. -
మా నెక్ట్స్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాం: అభిజీత్ దీప్కే
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తదుపరి కార్యాచరణ ఏంటి? భారతీయుల్లో ఉన్న ప్రశ్న ఇది. దీంతో దీనిపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన సమాధానం చెబుతూ.. "మా తదుపరి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాం. ఉద్యమం నిన్ననే ముగిసింది. మాకు కొంత సమయం ఇవ్వండి" అని అన్నారు.పంజాబ్‌లో ప్రశ్నపత్రాల లీకేజీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై కూడా అభిజీత్ దీప్కే స్పందించారు. "ఆ అంశాన్ని కూడా ప్రస్తావిస్తాం. ప్రస్తుతం దానికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం" అని చెప్పారు.ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల గురించి దీప్కే మాట్లాడుతూ... "విద్యార్థులపై నమోదైన కేసుల అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఏ విద్యార్థిపైనా కేసులు నమోదు చేయకూడదు" అని స్పష్టం చేశారు.పంజాబ్ మంత్రిపై ఒత్తిడికేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ కూడా రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వచ్చాయి. అయితే ఆ డిమాండ్లను బైన్స్ తాజాగా తిరస్కరించారు. ఫార్మసీ నియామక పరీక్ష వివాదంపై స్పందిస్తూ విమర్శకులపై ఆయన మండిపడ్డారు.బైన్స్ మీడియాతో మాట్లాడుతూ.. "ఇది ప్రశ్నపత్రాల లీకేజీ కేసు కాదు. భారీ స్థాయిలో కాపీయింగ్ జరిగిన ఘటన. కాపీయింగ్‌ను పరీక్షా కేంద్రంలోనే గుర్తించి, అందుకు పాల్పడిన విద్యార్థులను అక్కడికక్కడే పట్టుకున్నాం" అని చెప్పారు.తన రాజీనామా కోరుతున్న వారిపై స్పందిస్తూ, ప్రతిపక్ష నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. "నేను మొదటి నుంచి విద్యార్థులకే అండగా నిలిచాను. నా రాజీనామా వల్ల ఉద్యమానికి ఉపయోగం ఉంటే పదవి వదులుకోవడానికి కూడా సిద్ధమేనని విద్యార్థులకు చెప్పాను" అని బైన్స్ వెల్లడించారు."ఆ కాపీయింగ్ కేసు నా శాఖ పరిధిలోనిది కూడా కాదు. అది నా సహచర మంత్రి బాధ్యత. అయినప్పటికీ బాధ్యత నుంచి నేను తప్పించుకోవడం లేదు" అని హర్జోత్ సింగ్ బైన్స్ స్పష్టం చేశారు. -
భారత జెన్-జీకి పాక్, శ్రీలంక, నేపాల్ సెల్యూట్.. రియాక్షన్లు ఇవే..
భారత జెన్-జీని తరచూ మొబైల్లో ఎక్కువ సమయం గడిపే తరం, ప్రతి విషయాన్నీ మీమ్స్‌గా మార్చే తరం, తీవ్రమైన అంశాలపై ఎక్కువసేపు దృష్టి పెట్టని తరంగా భావించేవారు. కానీ గత నెల రోజులుగా అదే బలహీనతలు వారి అతిపెద్ద బలంగా మారాయి. వరుసగా సాగిన విద్యార్థి ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేశాయి. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఉద్యమంలో సంప్రదాయ రాజకీయ ప్రకటనల స్థానంలో మీమ్స్ వచ్చాయి. ఇన్‌స్టా రీల్స్ ప్రజలను సమీకరించే సాధనంగా మారాయి.ఈ ఉద్యమం ఇప్పుడు భారత్‌కే పరిమితం కాలేదు. పొరుగు దేశాల్లో కూడా దీని గురించి చర్చ సాగుతోంది. జెన్-జీ దృష్టి త్వరగా మళ్లిపోతుందని సాధారణంగా చెబుతుంటారు. కానీ భారత్‌లో జరిగిన ఈ ఉద్యమం శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్ యువత దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ దేశాల్లో గతంలో కూడా యువజన ఉద్యమాలు జరిగాయి. అందువల్ల భారత్‌లోని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమంపై అక్కడ ప్రత్యేక ఆసక్తి కనిపించింది.దీనిపై పాకిస్థాన్ యువతి ఒకరు మాట్లాడుతూ.. "ఇలా చేస్తుంటే ప్రేమలో పడిపోతానేమో... మీరు ఇంత బాగా చేస్తుంటే నేను మిమ్మల్ని ఎలా ద్వేషిస్తాను?" అని అన్నారు. భారత జెన్-జీ చూపించిన ధైర్యం, ఐక్యత ఎవరినైనా ఆకట్టుకుంటాయి. సరిహద్దులు వేరు కావచ్చు. కానీ ఈ తరం ఆలోచనలు, ఉత్సాహం ఒక్కటేనని చెప్పారు. పాకిస్థాన్‌కు చెందిన పలువురు యువకులు అవకాశం వస్తే తామూ భారత విద్యార్థుల్లాగే వీధుల్లోకి వచ్చేవాళ్లమని అన్నారు. ఓ యువకుడు మాట్లాడుతూ.. "కాక్రోచ్ జనతా పార్టీ చాలా కూల్‌గా ఉంది. వారు అవసరానికి మించి సీరియస్‌గా ఉండరు. అదే నాకు నచ్చింది. జెన్-జీకి సాటి ఎవరూ లేరు" అని చెప్పాడు.ఒక ప్లేట్ బిర్యానీకే అమ్ముడుపోయేవాళ్లం ముంబైలో వైరల్ అయిన ఓ వీడియోను కూడా అతను ప్రస్తావించాడు. అందులో పోలీసులు విద్యార్థులను వాహనంలో తీసుకెళ్తుండగా, వెనుక నుంచి ఎవరో నిశ్శబ్దంగా తాళం తీసేయడంతో విద్యార్థులు బయటకు వచ్చి పరుగులు తీశారు. మరో పాకిస్థాన్ యువకుడు మాట్లాడుతూ.. భారత విద్యార్థులు మతం, కులానికి అతీతంగా ఐక్యంగా నిలిచారని, కానీ పాకిస్థాన్‌లో ప్రజలు పంజాబీ-పష్తూన్, సున్నీ-షియా వంటి విభజనల్లో ఉన్నారని అన్నాడు."అదే భారత్ జెన్-జెడ్ అతిపెద్ద బలం. పాకిస్థాన్ జెన్-జీ అంత సులభంగా ఒక్కటవుతుందని నాకు అనిపించడం లేదు." భారత్ ఉద్యమానికి పాకిస్థాన్ నుంచి నిధులు వస్తున్నాయన్న ఆరోపణలపై పాకిస్థాన్ కంటెంట్ క్రియేటర్ బిలాల్ హసన్ వ్యంగ్యంగా మాట్లాడుతూ.. "మా దేశాన్ని నడపడానికే మా దేశం వద్ద డబ్బు లేదు. భారత ఉద్యమానికి ఎలా నిధులు ఇస్తాం?" అని అన్నాడు.బిలాల్ హసన్ అనే యువకుడు మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్ జరగొచ్చు. కానీ పాకిస్థాన్‌లో చాలా సందర్భాల్లో ప్రజలను నేరుగా తీసుకెళ్లి అదృశ్యం చేస్తారు’’ అని చెప్పారు. పాకిస్థాన్‌లో చాలామందిని "ఒక ప్లేట్ బిర్యానీ"కే కొనుగోలు చేయవచ్చని వ్యాఖ్యానించారు.శ్రీలంక యువతపై ప్రభావంభారత విద్యార్థి ఉద్యమం శ్రీలంక యువతపై కూడా ప్రభావం చూపింది. 2022లో శ్రీలంక యువత ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత రాజపక్స ప్రభుత్వం అధికారాన్ని వీడింది. ఇప్పుడు శ్రీలంకలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపై కార్టూన్లు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు కూడా వచ్చాయి. ప్రముఖ కార్టూనిస్ట్ అవంతా ఆర్టిగాలా పంచుకున్న వ్యంగ్య చిత్రంలో ప్రభుత్వం "బొద్దింకలను" అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, భారత్ ఇళ్లలో వాడే "లక్ష్మణ రేఖ" కూడా వాటిని ఆపలేకపోయినట్టు చూపించారు.భారత్ ఉద్యమంలో ఎక్కువగా చర్చకు వచ్చిన చిత్రం ముంబైకి చెందిన రియా అహీర్ పోలీసు వాహనం ముందు చేతులు చాపి నిలిచిన ఫొటో. చాలామంది దీన్ని 1989 తియానన్మెన్ స్క్వేర్‌లోని ప్రసిద్ధ "ట్యాంక్ మ్యాన్" చిత్రంతో పోల్చారు. శ్రీలంక లా కాలేజీ విద్యార్థిని స్వస్థిక అరులింగం ఫేస్బుక్లో ఈ చిత్రాన్ని పంచుకుంటూ "వైబింగ్ ఎట్ అనదర్ లెవల్" అని రాశారు. 2022 శ్రీలంక ఉద్యమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త బువాంకా పెరేరా ఇన్‌స్టాగ్రామ్‌లో భారత యువతకు సందేశం పంపారు."శ్రీలంక నుంచి ప్రారంభమై ఆసియా అంతటా వ్యాపించిన యువజన ఉద్యమాల జ్వాల భారత్‌ను చాలాకాలం తాకలేదనిపించింది. కానీ ఇప్పుడు రాజ్యాంగం, దేశ వ్యవస్థాపకులు కలలు కన్న భారత్ కోసం భారత యువత పోరాడుతుండటం చూసి ఆనందంతో కళ్లలో నీళ్లు వస్తున్నాయి" అని ఆయన అన్నారు. నేపాల్ యువత మద్దతునేపాల్లో కూడా భారత్ జెన్-జీ ఉద్యమంపై సానుకూల స్పందనలు వచ్చాయి. కాఠ్మాండూ కంటెంట్ క్రియేటర్ అవినాశ్ మిశ్రా మాట్లాడుతూ.. భారత విద్యార్థుల ఆగ్రహం పూర్తిగా సమంజసమని, దాన్ని అతిగా స్పందించారని చెప్పలేమన్నారు. "వీధుల్లో విద్యార్థులను చూసినప్పుడు నా మనసు అప్పుడూ బాధపడింది. ఇప్పుడూ బాధపడుతోంది" అని చెప్పారు. 2025లో నేపాల్ జెన్-జీ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, అది కూడా యువత శక్తికి ఉదాహరణగా నిలిచి చివరకు కేపీ ఓలీ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేసిందని అన్నారు.జెన్-జీ నుంచి ప్రపంచం నేర్చుకుంటోంది..ఢిల్లీ జంతర్ మంతర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచం తొలిసారి భారత్ జెన్-జీ మీమ్స్, నినాదాలు, వైరల్ వీడియోలను చూసి నవ్వడమే కాదు, వాటి నుంచి నేర్చుకోవడం కూడా ప్రారంభించింది. పొరుగు దేశాల నుంచి వచ్చిన స్పందనలు చూస్తే, భారత్ విద్యార్థి ఉద్యమం సరిహద్దులు దాటి యువతకు స్ఫూర్తిగా మారిందని తెలుస్తోంది. శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్‌కు చెందిన పలువురు యువకులు భారత విద్యార్థుల ఐక్యత, ధైర్యం, సృజనాత్మక నిరసనను ప్రజాస్వామ్య ఉద్యమానికి కొత్త ఆదర్శంగా అభివర్ణించారు. -
పరీక్షల సంస్కరణలపై కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: పరీక్షల సంస్కరణలపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమాల నివారణే లక్ష్యంగా పలు సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం సన్నద్ధమైంది. పరీక్షల సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు నరేంద్ర మోదీ. ‘ పరీక్షల సంస్కరణలపై ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. సాంకేతిక నిపుణుడు నందన్ నీలేఖని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం, పరీక్షల విశ్వసనీయతపై ఇచ్చే ఈ నివేదికను అమలు చేస్తాం. లీక్‌లకు పాల్పడిన వారిని జైల్లో పెట్టాం. రేపు పార్లమెంట్లో కఠిన చట్టాలను తీసుకొస్తాం. పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతతో పాటు అక్రమాల నివారణే లక్ష్యం సంస్కరణలు తీసుకురాబోతున్నాం. విద్యార్థుల భవిష్యత్ కోసం నిరంతరం చర్యలు తీసుకుంటున్నాం. కఠిన నియమాలతో కొత్త చట్టం తీసుకొస్తున్నాం. వీలైనంత ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగిస్తాం’ అని తెలిపారు.HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5— Narendra Modi (@narendramodi) July 26, 2026 -
కోట్లాది రూపాయల ఆస్తి ఒక్క వేలిముద్రతో దేవుడి పేరిట..
జైపూర్: దేవాలయాల్లో భక్తులు ఏమేమి సమర్పిస్తారు? కొందరు కొబ్బరికాయ, కొందరు మిఠాయిలు, ఇంకొందరు బంగారం, వెండి సమర్పిస్తారు. కానీ రాజస్థాన్‌లోని చిత్తోడ్గఢ్లో మాత్రం ఓ భక్తుడు ఆస్తిని సమర్పించాడు. ‘‘శ్రీ సావలియా సేఠ్’’ దేవుడి పేరిట 10.25 బీఘాల వ్యవసాయ భూమితో పాటు తన రెండంతస్తుల ఇంటిని కూడా విరాళంగా ఇచ్చాడు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆస్తిని ఆలయం పేరిట అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించాడు.ఈ ఘటన డూంగర్పూర్ జిల్లా ఆస్పూర్ తహసీల్దార్ పరిధిలోని ఖేడా సామోర్ గ్రామంలో జరిగింది. అక్కడ నివసించే అమర్జీ అనే వృద్ధుడు.. గౌతమ్ పటేల్ కుమారుడు. అమర్జీ గోభక్తుడు. కుటుంబంలో ఆయన ఒక్కరే ఉన్నారు. నివసించడానికి ఆయనకు మరో ఇల్లు ఉంది. అందువల్ల తన రెండో ఆస్తిని భగవంతుడు సావలియా సేఠ్ పాదాల వద్ద సమర్పించాలని నిర్ణయించారు.అమర్జీ స్వయంగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి 10.25 బీఘాల వ్యవసాయ భూమితో పాటు రెండంతస్తుల ఇంటిని శ్రీ సావలియాజీ ఆలయ మండలి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ పూర్తికాగానే ఆ ఆస్తి అధికారికంగా ఆలయానికి చెందింది.రిజిస్ట్రేషన్ సమయంలో ఆలయ మండలి పరిపాలనాధికారి రాజేంద్ర సింగ్, ఆస్తుల ఇన్చార్జ్ భేరుగిరి హాజరయ్యారు. అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తైన తర్వాత ఆలయ మండలి అమర్జీని సత్కరించి కృతజ్ఞతలు తెలిపింది.సావలియా సేఠ్ ఆలయ ప్రత్యేకత ఏంటి?రాజస్థాన్‌లోని శ్రీ సావలియాజీ ధామ్ దేశంలోని అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతి నెల హుండీలు తెరిచినప్పుడు కోట్ల రూపాయల నగదుతో పాటు బంగారం, వెండి, ఇతర విలువైన కానుకలు బయటపడుతుంటాయి. అయితే అమర్జీ సమర్పించిన విరాళం ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆయన నగదు లేదా నగలు కాదు, తన స్థిరాస్తినే భగవంతుడి పేరిట రాసిచ్చాడు.ఇటీవల మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా సోన్కచ్ నుంచి వచ్చిన ఓ కుటుంబం 11 కిలోల 400 గ్రాముల వెండి కడ్డీలను సమర్పించింది. వాటి విలువ రూ.26 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. అంతకుముందు మరో భక్తుడు సుమారు 137 గ్రాముల బంగారు వేణువును సమర్పించాడు. దాని అంచనా విలువ సుమారు రూ.20 లక్షలు.ఆలయ కమిటీ అధ్యక్షుడు హజారిదాస్ వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘‘సావలియా సేఠ్‌పై భక్తుల విశ్వాసం నిరంతరం పెరుగుతోందని చెప్పారు. దేశం నలుమూలల నుంచి భక్తులు తమ భక్తికి అనుగుణంగా కానుకలు తీసుకొస్తున్నారని తెలిపారు. అయితే ఒక భక్తుడు తన భూమి, ఇంటిని భగవంతుడి పేరిట రాసివ్వడం అరుదైన ఘటన అని అన్నారు. కొందరికి ఇది విరాళం కావచ్చు. మరికొందరికి ఇది భక్తి కావచ్చు. ఇంకొందరికి ఇది వ్యక్తిగత నిర్ణయం కావచ్చు. కానీ ప్రతి కోణం వెనుక ఒక ప్రశ్న మాత్రం ఉంది. నిజంగా మనిషి ఏదైనా వస్తువుకు యజమానినా? లేక కొంతకాలం పాటు దానికి కాపలాదారుడా?’’ అని వ్యాఖ్యానించాడు. -
మిల్మా తిరువనంతపురం యూనియన్ రద్దు
తిరువనంతపురం: శబరిమల ఆలయానికి సరఫరా చేసిన మిల్మా నెయ్యిని దారి మళ్లించి, తిరిగి విక్రయించడం, మహారాష్ట్ర నుంచి పాలు రవాణా చేసేందుకు టెండర్లు ఆహ్వానించకుండానే అధిక ధరకు మిల్క్ ట్యాంకర్ కాంట్రాక్టును కేటాయించడం వంటి తీవ్రమైన ఆర్థిక అవకతవకలు బయటపడటంతో , మిల్మా తిరువనంతపురం ప్రాంతీయ యూనియన్ పాలకమండలిని రద్దు చేశారు.చైర్ పర్సన్ మణి విశ్వనాథ్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) మద్దతుగల పాలకమండలిపై పాడి అభివృద్ధి శాఖ డైరెక్టర్ శాలిని గోపినాథ్ ఈ చర్య తీసుకున్నారు. బోర్డు రద్దు అనంతరం, పాడి అభివృద్ధి శాఖ జాయింట్ డైరెక్టర్ (ప్రణాళిక) సినీ ఉన్నికృష్ణన్ను నిర్వాహకురాలిగా నియమించారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, చట్టం ప్రకారం ఆరు నెలల్లోగా తిరిగి ఎన్నికలు నిర్వహించాలి, ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన పాలకవర్గం బాధ్యతలు స్వీకరిస్తుంది.పాడి అభివృద్ధి శాఖ సంయుక్త సంచాలకులు సమర్పించిన విచారణ నివేదిక ప్రకారం, గత నాలుగేళ్లుగా ప్రాంతీయ యూనియన్ పాలకవర్గం పాల్పడిన అవినీతి, ఆర్థిక అవకతవకల స్థాయి చాలా విస్తృతమైనదిగా గుర్తించారు. పాలకవర్గంలోని కొందరు సభ్యులు అక్రమ ప్రయోజనాలు పొందేందుకు అధికారులను ప్రభావితం చేశారని దర్యాప్తులో తేలింది. నిర్ణయాలను తారుమారు చేయడాన్ని లేదా కీలకమైన సాక్ష్యాలను నాశనం చేయడాన్ని నివారించడానికి, బోర్డును తక్షణమే రద్దు చేసి పరిపాలనా నియంత్రణలోకి తీసుకున్నారు.ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) -మిల్మా మధ్య కుదిరిన అధికారిక ఒప్పందం ప్రకారం, శబరిమల మరియు పంపాలకు 1.7 లక్షల లీటర్ల నెయ్యిని సరఫరా చేయాల్సి ఉంది. బహిరంగ మార్కెట్లో మిల్మా నెయ్యి లీటరుకు రూ. 720 చొప్పున అమ్ముడవుతుండగా , దానిని దేవస్వం బోర్డుకు అంగీకరించిన ధర అయిన లీటరుకు ₹540 కే సరఫరా చేశారు.డెయిరీ నుండి పంపిన అత్యుత్తమ నాణ్యత గల మిల్మా నెయ్యిని శబరిమలకు చేరకముందే దారి మళ్లించి, ప్రైవేట్ ఏజెన్సీలకు మరియు బహిరంగ మార్కెట్లో విక్రయించినట్లు విచారణలో తేలింది.దానికి బదులుగా , తమిళనాడు నుండి తెప్పించిన నాసిరకం నెయ్యిని శబరిమలకు సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. లీటరుకు కేవలం ₹350 విలువ కలిగిన సుమారు 70,000 లీటర్ల ఈ నాసిరకం నెయ్యిని ఆలయానికి సరఫరా చేసి, భక్తులను మోసం చేసినట్లు పాడి అభివృద్ధి శాఖ కనుగొంది.టెండర్ లేకుండానే పాల ట్యాంకర్ కాంట్రాక్టును కేటాయించారు. మిల్మాలో పాల కొరతను తీర్చడానికి మహారాష్ట్ర నుంచి కేరళకు పాలు రవాణా చేసే కాంట్రాక్టుల కేటాయింపులో కూడా అవకతవకలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది.ప్రభుత్వ టెండర్లను ఆహ్వానించకుండా , నిర్దేశిత టెండర్ ప్రక్రియను పాటించకుండా , అధిక ధరలకు ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్లకు కాంట్రాక్టును అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సహకార ఆడిట్లో , ఈ ఒక్క అవకతవక వల్లే మిల్మా తిరువనంతపురం ప్రాంతీయ యూనియన్‌కు రూ. 93.40 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లిందని తేలింది.కందల సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు, మిల్మా తిరువనంతపురం ప్రాంతీయ యూనియన్ మాజీ ఛైర్మన్ అయిన ఎన్. భాసురంగన్ ఏర్పాటు చేసిన పరిపాలనా కమిటీ హయాంలో వివాదాస్పద ట్యాంకర్ కాంట్రాక్టును కేటాయించారు. కందల సహకార బ్యాంకు ఆర్థిక మోసం కేసులో భాసురంగన్ను ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఆ సమయంలో కేఆర్ మోహనన్ పిళ్లై, విఎస్ పద్మకుమార్ ఆ కమిటీలోని ఇతర సభ్యులుగా ఉన్నారు. -
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (79) సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఆదివారం ప్రకటించారు. వయసు పెరగడం, ఆరోగ్యం బలహీనపడటం, రాజకీయాల్లో అవినీతి పెరగడమే ఇందుకు కారణమని చెప్పారు.ఎక్స్‌లో చేసిన పోస్టులో సిద్ధరామయ్య, ప్రజా జీవితంలో చురుగ్గా కొనసాగుతానని, కానీ ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. "రాజకీయ రంగం అవినీతిమయంగా మారిపోయింది. అందుకే నేను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. అయితే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ప్రజల కష్టసుఖాలకు గొంతుకగా నిలుస్తాను" అని పేర్కొన్నారు.తన వరుణ నియోజకవర్గ ప్రజలు మరోసారి పోటీ చేయాలని కోరుతున్నారని, కానీ ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. తన నిర్ణయానికి కారణం వివరిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ముగిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయానికి తన వయసు 81 లేదా 82 ఏళ్లు ఉంటుందని సిద్ధరామయ్య తెలిపారు."ఇప్పుడు నా వయసు 79 ఏళ్లు. మా ప్రభుత్వ పదవీకాలం ముగియడానికి ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అప్పటికి నాకు 81-82 ఏళ్లు వస్తాయి. నా ఆరోగ్యం గతంలో ఉన్నంత బలంగా లేదు. ఇంతకుముందులా అదే ఉత్సాహంతో పని చేయడం ఇక సాధ్యం కాదు" అని అన్నారు.సిద్ధరామయ్య తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గురించి కూడా ప్రస్తావించారు. 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా ప్రజా జీవితంలో అడుగుపెట్టానని, 2028తో ఆ ప్రయాణానికి 50 ఏళ్లు పూర్తవుతాయని చెప్పారు."ఓటములు, విజయాలు రెండూ చూశాను. కానీ నేను నమ్మిన సిద్ధాంతాలకు విరుద్ధంగా ఎప్పుడూ వ్యవహరించలేదు. నా మనస్సాక్షిని ఎప్పుడూ మోసం చేయలేదు అన్న సంతృప్తి నాకు ఉంది" అని చెప్పారు. ఎన్నికల రాజకీయాల తీరు మారిపోయిందని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు."ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజలకు డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు రాజకీయాలు పూర్తిగా అవినీతిమయంగా మారిపోయాయి. నిజాయితీ రాజకీయాలకు నిలదొక్కుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను" అని పేర్కొన్నారు. ఎన్నికల రాజకీయాలకు వీడ్కోలు ప్రకటించినా, ప్రజల కోసమే పని చేస్తానని సిద్ధరామయ్య చెప్పారు. "50 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు నన్ను తమలో ఒకడిగా భావించి ప్రేమతో నడిపించారు. ఆ రుణం నా మీద ఉంది. అందుకే నా మిగిలిన జీవితం కూడా ప్రజాసేవకే అంకితం" అని పోస్టులో పేర్కొన్నారు. -
ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థి తల్లి భావోద్వేగభరిత కామెంట్స్
నాగ్‌పూర్: నీట్ పేపర్ లీక్‌లపై దేశవ్యాప్తంగా భారీ నిరసనలు చెలరేగిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం (జులై 25న) రాజీనామా చేశారు. అయితే, దాంతో ఏమి సాధిస్తారని నీలమ్ చతుర్వేది అనే మహిళ ప్రశ్నించారు. ఆమె కూతురి పేరు ఆకాంక్ష చతుర్వేది. ఆమె 18 ఏళ్ల నీట్ అభ్యర్థి. ఈ ఏడాది నీట్ పరీక్ష రద్దు అయిన తర్వాత తీవ్ర మనోవేదనకు గురై, మే 20న నాగ్‌పూర్‌లో ఆత్మహత్య చేసుకుంది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో నీలమ్ చతుర్వేది మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకునే ఏ చర్యా తన కూతురిని తిరిగి తీసుకురాలేదని, అయినా ఆమెకు న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నానని చెప్పారు. పేపర్ లీక్ నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఉద్యమానికి తాము మద్దతు ఇస్తున్నామని, కానీ రాజీనామాతో బాధ్యత ముగిసిపోదని అన్నారు."ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మేము సంతృప్తి చెందలేదు. విద్యార్థుల నిరసనకు మా మద్దతు కొనసాగుతుంది. పేపర్ లీక్‌కు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించాలి" అని ఆమె డిమాండ్ చేశారు.తండ్రికి రెండు సార్లు గుండెపోటు మధ్యప్రదేశ్‌కు చెందిన ఆకాంక్ష.. నీట్ పరీక్షకు ప్రిపరేషన్ కోసం కుటుంబంతో కలిసి నాగ్‌పూర్‌కు వెళ్లింది. పరీక్ష సన్నద్ధత కోసం ఓ కోచింగ్ సంస్థలో చేరింది. మే 3న నీట్ పరీక్ష రాసిన ఆకాంక్ష, పరీక్ష బాగా జరిగిందని చెప్పిందని ఆమె తల్లి గుర్తుచేశారు. అయితే పరీక్ష రద్దు అయిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు."ఆకాంక్ష తండ్రికి ఇప్పటికే రెండు సార్లు గుండెపోటు వచ్చింది. ఆయనకు పక్షవాతం కూడా వచ్చింది. ఇప్పుడు మా బాధ్యత ఎవరు తీసుకుంటారు? నా కుమార్తె బతికి ఉంటే అన్నీ చూసుకునేది" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాంక్ష తన చేతిరాతతో రాసిన ఆత్మహత్య లేఖలో తాను ఎదుర్కొన్న తీవ్ర మానసిక భారాన్ని వివరించింది."అమ్మా, నాన్నా... మీ కుమార్తె బాగా చదివి డాక్టర్ అవుతుందని మీరు నమ్మారు. కానీ మరోసారి నీట్ పరీక్ష రాసే ధైర్యం నాకు లేదు. మొదటి ప్రయత్నంలో మంచి మార్కులు వస్తాయని నమ్మకం ఉండేది. ఇప్పుడు మళ్లీ అంతే బాగా రాస్తాననే నమ్మకం లేదు. అమ్మా, నాన్నా... నన్ను క్షమించండి. నేను అన్నీ నాశనం చేశాను" అని ఆమె లేఖలో రాసింది.కుటుంబ సభ్యుల మాటల్లో, కుమార్తె చదువు కోసం ఆమె తండ్రి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొద్ది భూమిలో వ్యవసాయం చేస్తూనే, నాగ్‌పూర్‌లో వంటమనిషిగా పని చేసి కుటుంబ ఖర్చులు, కోచింగ్ ఫీజులు భరించారు.ఆకాంక్ష మామ జగదీశ్ ప్రసాద్ చతుర్వేది మాట్లాడుతూ.. పరీక్ష రాసి ఇంటికి వచ్చినప్పుడు ఆమె చాలా సంతోషంగా కనిపించిందన్నారు. మొదట 650కు పైగా మార్కులు వస్తాయని ధైర్యంగా చెప్పిన ఆమె, పేపర్ లీక్ విషయం తెలిసిన తర్వాత తీవ్ర మనోవేదనకు గురై, తినడం తగ్గించి, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం మానేసిందని తెలిపారు. "ఇలా జరుగుతుందని మేమెప్పుడూ ఊహించలేదు" అని ఆయన అన్నారు. -
రూ. 10 బిస్కెట్ ప్యాకెట్లో తేడా.. రూ. 50 వేల జరిమానా!
కన్నూరు: కేరళలోని కన్నూరు జిల్లాలో వినియోగదారుల హక్కులకు సంబంధించిన ఒక కీలక తీర్పు వెలువడింది. 150 గ్రాములు ఉండాల్సిన పార్లే బిస్కెట్ ప్యాకెట్లో కేవలం 125 గ్రాములు మాత్రమే ఉండటంతో, వినియోగదారుడికి అనుకూలంగా కన్నూరు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సంచలన తీర్పునిచ్చింది. పార్లే బిస్కెట్స్ కంపెనీ, విక్రయించిన రిటైలర్ సంయుక్తంగా బాధితుడికి రూ. 50,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.కన్నూరు జిల్లా అంజరకండికి చెందిన టీపీ ఆశిక్ అనే వ్యక్తి 2024 జూలై 26న చక్కరక్కల్ లోని మెట్రో హైపర్ మార్కెట్లో 150 గ్రాములుగా ముద్రించిన పార్లే 20-20 బిస్కెట్ ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు. అయితే ఆ ప్యాకెట్‌పై సందేహం వచ్చి సమీపంలోని దుకాణంలో తూకం వేయగా కేవలం 125 గ్రాములు మాత్రమే ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సమయంలో, తమ ఉత్పత్తులు పూర్తిగా ఆటోమేటెడ్ ప్రక్రియ ద్వారా తయారవుతాయని, కమిషన్ ముందుంచిన ప్యాకెట్ తమ కంపెనీకి చెందింది కాకపోవచ్చని పార్లే వాదించింది. మరోవైపు, బిస్కెట్లను పార్లే సంస్థే తయారు చేసిందని, బరువులో తేడా ఉంటే అది తయారీదారులదే బాధ్యతని మెట్రో హైపర్ మార్కెట్ స్పష్టం చేసింది.లీగల్ మెట్రోలాజికల్ విభాగం అందించిన నివేదికతో పాటు సాక్ష్యాధారాలను పరిశీలించిన కమిషన్ అధ్యక్షులు రవి సుష, సభ్యులు మొల్లీకుట్టి మాథ్యూ, కేపీ సజీశ్లతో కూడిన బెంచ్ ఈ తీర్పు వెలువరించింది. తక్కువ బరువుతో కూడిన ఉత్పత్తులను విక్రయించడం సేవలలో లోపమని, దీని నుంచి రిటైలర్ బాధ్యతను విస్మరించలేరని కమిషన్ స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రకారం పార్లే కంపెనీ రూ. 25,000 నష్టపరిహారం, రూ. 10,000 కోర్టు ఖర్చులు చెల్లించాలి. అలాగే మెట్రో హైపర్ మార్కెట్ రూ. 10,000 నష్టపరిహారం, రూ. 5,000 కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించారు. ఈ మొత్తాన్ని తీర్పు వెలువడిన నెల రోజుల్లోపు చెల్లించాలని, లేని పక్షంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
ఎమర్జెన్సీ అంటే ఇదేనేమో.. బైక్‌తోనే వార్డులోకి ఎంట్రీ!
కర్ణాటక: తాగిన మత్తులో ఉన్న మందుబాబులు బైక్‌ను నేరుగా ఆస్పత్రిలోకి తీసుకువచ్చిన సంఘటన బీదర్‌లోని బ్రిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అనారోగ్యంగా ఉన్న స్నేహితుడిని బైక్‌పై ఎక్కించుకున్న మందుబాబు వాహనాన్ని వేగంగా నడుపుతూ ఆస్పత్రి ఆవరణలోకి దూసుకొచ్చి అదే వేగంతో రోగుల వార్డులోకి దూకించాడు. ఈ హఠాత్ పరిణామంతో సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారికి తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. #Karnataka #Breaking Youth Ride Motorcycle into Bidar Hospital Emergency Ward, Detained by Police#Bidar: Two allegedly intoxicated youths created panic at the Bidar Institute of Medical Sciences (BRIMS) District Hospital by riding a motorcycle into the Emergency Ward late on… pic.twitter.com/7xHLkqe7Ze— Mahesh M Goudar (@IamMGoudar) July 25, 2026 -
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల భారీ నిరసనలు, జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన మరుసటి రోజే, ఆదివారం నాడు ప్రహ్లాద్ జోషి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తాను ప్రధాని నరేంద్ర మోదీకి రాజీనామా లేఖను సమర్పించినట్లు ప్రధాన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.జంతర్‌మంతర్ వద్ద నిరసనలు తెలుపుతున్న విద్యార్థి సంఘం (సీజేపీ) ప్రతినిధి బృందం, కేంద్ర మంత్రులు జగత్ ప్రకాష్ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నిరసనకారుల ప్రధాన డిమాండ్లపై ఇరువర్గాల మధ్య సానుకూల అంగీకారం కుదరడంతో ఈ ఆందోళనను విరమించినట్లు ప్రకటించారు. ప్రధాన్ రాజీనామా అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో, ఈ బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. కర్ణాటకలోని బీజాపూర్‌లో 1962 నవంబర్ 27న జన్మించిన ప్రహ్లాద్ జోషి, హుబ్బళ్ళిలో తన విద్యాభ్యాసం పూర్తి చేశారు.రాజకీయాల్లోకి రాకముందు వ్యాపార రంగంలో అనుభవం గడించిన ఆయన, కర్ణాటకలో కీలక బీజేపీ నేతగా ఎదిగారు. 2004 నుంచి ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రితో పాటు, 2024 ఎన్నికల తర్వాత వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన వంటి కీలక పథకాల అమలులో ఆయన కీలక పాత్ర పోషించారు.ఇది కూడా చదవండి: పోలీసుల అణచివేతపై హోంమంత్రికి రాహుల్ లేఖ -
పోలీసుల అణచివేతపై హోంమంత్రికి రాహుల్ లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసన ప్రదర్శనపై పోలీసులు జరిపిన హింసాత్మక చర్యలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన ఒక లేఖ రాశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, కిరాతక దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జూలై 20న ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు విచక్షణా రహితంగా లాఠీఛార్జ్, వాటర్ క్యానన్లుతో పాటు పెల్లెట్ గన్లను ఉపయోగించారని లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనల్లో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని, ముఖ్యంగా 19 ఏళ్ల సాహిల్ లోచబ్ అనే విద్యార్థి పెల్లెట్ గాయాల కారణంగా తన కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా విద్యార్థులపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు.ఈ లేఖలో రాహుల్ హోంమంత్రి అమిత్ షాకు ప్రధానంగా రెండు ప్రశ్నలు సంధించారు. విద్యార్థులపై పెల్లెట్ గన్ల వంటి ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించడానికి అనుమతిచ్చింది ఎవరు? పోలీసులతో కలిసి సాధారణ దుస్తుల్లో వచ్చి విద్యార్థులను కొట్టిన వ్యక్తులు పోలీసులా లేదా వాలంటీర్లా? వారిని ఎవరి ఆదేశాల మేరకు రంగంలోకి దించారు? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: భారత్ ఇప్పుడు తిరుగులేని శక్తి: ప్రధాని మోదీ -
భారత్ ఇప్పుడు తిరుగులేని శక్తి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కార్గిల్ విజయ్ దివస్ ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశ సైనికుల అసాధారణ ధైర్యసాహసాలు, త్యాగాలను కొనియాడారు. జూలై 14న ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుండి ప్రారంభమైన ‘శౌర్య విజయ్ యాత్ర’ ద్రాస్ లోని కార్గిల్ వార్ మెమోరియల్ వరకు సాగుతుందని తెలిపారు.భారత రక్షణ రంగ తయారీ సామర్థ్యాలకు ప్రతీకగా ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకను ఇటీవల నావికాదళంలో చేర్చినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ ఆధునిక యుద్ధ నౌక పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారని, ఇందులో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలనే వినియోగించినట్లు చెప్పారు. అలాగే లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్, కుషా క్షిపణి పరీక్షలు విజయవంతం కావడంపై డీఆర్డీఓను ప్రశంసించారు. ఇండోనేషియాతో బ్రహ్మోస్, అస్త్రా క్షిపణుల ఒప్పందం కుదిరిందని, రక్షణ రంగంలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని పేర్కొన్నారు.అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రతిభ కనబరుస్తున్న భారతీయ అథ్లెట్లను ప్రధాని అభినందించారు. జపాన్ ఓపెన్ బాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన పీవీ సింధును, లండన్ లోని లార్డ్స్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రశంసించారు. కేరళలోని ఎర్నాకులం విద్యార్థుల సంస్కృత క్లబ్, ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన దేశపు తొలి రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతమైన ప్రయోగాన్ని కొనియాడారు. సైన్స్ ఒలింపియాడ్లలో విద్యార్థులు సాధించిన పతకాల గురించి ప్రస్తావించారు. కాశ్మీరీ సాంప్రదాయ చాపల తయారీ కళ ‘వాగు’ పునరుద్ధరణకు గులాబ్ హుస్సేన్, తన్జిలా చేస్తున్న కృషితో పాటు ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లా మహిళలు తయారు చేస్తున్న ‘విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ’ విశేషాలను ప్రధాని వివరించారు. -
ప్రధాన్ రాజీనామాపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు!
అహిల్యానగర్: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్పందించారు. హింస ద్వారా ఎటువంటి సమస్యలూ పరిష్కారం కావని, చర్చలు, శాంతియుత నిరసనలే సరైన మార్గమని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని అహిల్యానగర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ప్రభుత్వాల ప్రాధాన్యత కావాలని, సమస్యలను హింస ద్వారా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.ప్రజలు తమ డిమాండ్లను కోరే హక్కు కలిగి ఉన్నప్పటికీ, హింస ఏ పరిస్థితుల్లోనూ సరైనది కాదని అన్నా హజారే పేర్కొన్నారు. తాము కూడా గతంలో రాజీనామాలను డిమాండ్ చేశామని, అయితే ఆ సమస్యలను ఎప్పుడూ హింస ద్వారా పరిష్కరించుకోలేదని గుర్తుచేశారు. తన జీవితంలో తాను 22 సార్లు నిరాహార దీక్షలు చేశానని, ఎక్కడా హింసకు తావు ఇవ్వలేదని, అందుకే పది చట్టాలను తీసుకురాగలిగామని ఆయన తెలిపారు. శాంతియుత మార్గాలు, చర్చల ద్వారానే వ్యవస్థలో నిజమైన మార్పు సాధ్యపడుతుందని ఆయన ఉద్ఘాటించారు.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల నేపథ్యంలో, విద్యా రంగంలో చోటుచేసుకున్న పరిణామాల కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం, నిరసనకారుల మధ్య జరిగిన చర్చల అనంతరం కేంద్రం వారి డిమాండ్లను అంగీకరించడంతో ఈ ఆందోళన విరమించారు. ఏ పరిస్థితుల్లోనూ హింసను ప్రోత్సహించకూడదని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా శాంతియుత పద్ధతులను అనుసరించాలని అన్నా హజారే పునరుద్ఘాటించారు. -
పాక్‌తో చర్చలు కేవలం పీఓకేపైనే..
ద్రాస్: ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ తమ రాజ్య విధానంలో ఒక భాగంగా మార్చేసుకుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగమైన పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంపై తప్ప ఆ దేశంతో ఇతర అంశాలపై చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. ఆయన ఆదివారం లద్దాఖ్‌లోని ద్రాస్‌లో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లను నివాళులర్పించారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో మన సైనికులు ఎన్నో త్యాగాలు చేశారని, శత్రుదేశాన్ని చిత్తుచిత్తుగా ఓడించారని చెప్పారు. నాటి యుద్ధంలో భారత్ సాధించిన విజయాన్ని భరతమాత కిరీటంలో పొదిగిన వజ్రంగా రాజ్‌నాథ్ సింగ్ అభివరి్ణంచారు. ఉగ్రవాద భూతంతో భారత్‌ను బెదిరించడానికి ప్రయత్నించే వారి గతి ఏమవుతుందో ఆపరేషన్ సిందూర్ స్పష్టంగా చాటిచెప్పిందని పేర్కొన్నారు. జాతికి గర్వకారణం: ప్రధాని మోదీ కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ప్రధాని మోదీ మన వీర జవాన్ల సేవలను స్మరించుకున్నారు. ‘అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వారు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ఎప్పటికీ మన జాతికి గర్వకారణంగా నిలిచిపోతాయి. వారి అచంచలమైన దేశభక్తి, విధి నిర్వహణలో అంకితభావం భావి తరాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తాయి’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. మాతృభూమి రక్షణ కోసం వీరోచితంగా పోరాడి అసువులు బాసిన కార్గిల్ వీరులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. -
10 గంటల్లో 12 కోట్ల వ్యూస్.. సోషల్ మీడియాలో సీజేపీ సెన్సేషన్!
న్యూఢిల్లీ: నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టి కేంద్ర ప్రభుత్వాన్ని స్పందించేలా చేసిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోషల్ మీడియాలోనూ భారీ ఆదరణ పొందుతోంది. సీజేపీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ వీడియో కేవలం 10 గంటల్లోనే 12 కోట్ల (120 మిలియన్) వ్యూస్‌ను సాధించి రికార్డు సృష్టించింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నారనే సమాచారం సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేకు ఫోన్లో అందిన క్షణాలను వీడియోగా చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అది కాస్తా వైరలైంది. ఈ వీడియోకు వచ్చిన స్పందనతో సోషల్ మీడియాలో సీజేపీ ప్రభావం ఎంతగా పెరిగిందో స్పష్టమవుతోంది.నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ప్రారంభమైన ఉద్యమం తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో యువతను ఆకర్షించింది. రాయిటర్స్ కథనం ప్రకారం, సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఇప్పటికే 2.2 కోట్ల మంది ఫాలోవర్లు చేరడం విశేషం. ముఖ్యంగా యువతతో అనుసంధానం కావడానికి ఇన్స్టాగ్రామ్ ఈ ఉద్యమానికి ప్రధాన వేదికగా మారింది.అయితే సోషల్ మీడియాలో వచ్చే వ్యూస్, లైక్‌లు ఉద్యమానికి ఉన్న రాజకీయ మద్దతును పూర్తిగా ప్రతిబింబించవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, భారత రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందనడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఇదిలా ఉండగా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్నకు సీజేపీ నాయకులు ఆసక్తికరంగా స్పందించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ భారత్‌లో దేనికీ 'నో' చెప్పకూడదు. ప్రస్తుతం మాత్రం మా దృష్టి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంపైనే ఉంది అని అన్నారు. DEMOCRACY WINS! 🇮🇳Education minister Dharmendra Pradhan has resigned. pic.twitter.com/DsB6hCHUzP— Cockroach Janta Party (@CJP_for_India) July 25, 2026


