అస్సాంలో మోదీ.. రోడ్డుపైనే ల్యాండయిన విమానం | Prime Minister Modi arrives in Assam | Sakshi
Sakshi News home page

అస్సాంలో మోదీ.. రోడ్డుపైనే ల్యాండయిన విమానం

Feb 14 2026 11:14 AM | Updated on Feb 14 2026 1:39 PM

Prime Minister Modi arrives in Assam

దిస్పూర్: ప్రధాని మోదీ అస్సాం చేరుకున్నారు. దిబ్రూగఢ్-మోరాన్ జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ లాండింగ్ ఫెసిలిటీ రోడ్డుపై.. మోదీ ప్రయాణించిన ప్రత్యేక విమానం ల్యాండయ్యింది. అనంతరం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రధాని తిలకించారు. ఇటీవల నిర్మించిన 4.2 కిలోమీటర్ల ఈ రహదారిపై రఫెల్, సుఖోయ్ వంటి యుద్ధ విమానాల ల్యాండింగ్ ప్రదర్శన చేయవచ్చు.

దానితో పాటు, అత్యవసర పరిస్థితుల్లో సైనిక, పౌర విమానాల ల్యాండింగ్‌కు ఇది ఉపయోగపడుతుంది.  ఈశాన్య భారతంలో ఎమర్జెన్సీ లాండింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈశాన్య ప్రాంతాలలో ఉండే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అత్యవసర సమయాల్లో ఉపయోగించడానికి వీలుగా దీనిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

అనంతరం బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన భాస్కర వర్మ సేతు ప్రాజెక్టును మోదీ ప్రారంభించనున్నారు.  దాని తర్వాత దాదాపు రూ. 5,450 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీకి హిమంత బిశ్వశర్మతో పాటు ఇతర నాయకులు  స్వాగతం పలికారు. 

Advertisement
 
Advertisement
Advertisement