మహిళల ఖాతాల్లోకి రూ.5వేలు | CM MK Stalin Credits 5thousand To Bank Accounts Of 1.31 Crore Women | Sakshi
Sakshi News home page

మహిళల ఖాతాల్లోకి రూ.5వేలు

Feb 14 2026 11:07 AM | Updated on Feb 14 2026 11:13 AM

 CM MK Stalin Credits 5thousand To Bank Accounts Of 1.31 Crore Women

ఎన్నికల వేల మహిళలను ఆకట్టుకున్న  డీఎంకే ప్రభుత్వం 

తమిళనాడు: డీఎంకే ప్రభుత్వం మహిళల ఖాతాల్లోకి రూ.5వేలు వేయడంతో మహిళలు రెట్టింపు ఉత్సాహం  చెందారు. ఎన్నికల వేల డీఎంకే వ్యూహానికి సానుకూల స్పందనతో ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి.   రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మరికొద్ది రోజుల్లో మోగనున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్‌  మహిళలను ఆకర్షించే విధంగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు మూడు నెలలకు రూ.3వేలు, మే నెల వేసవి ఎండలకు అదనంగా రూ.2వేలతో కలిపి రూ.5లచొప్పున మహిళ హక్కు పథకం కింద 1.31 కోట్ల మంది మహిళల ఖాతాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకే నగదు జమ చేశారు. 

మహిళల చేతికి డబ్బులు అందాలని శుక్రవారం ఉదయం 7 గంటలకల్లా అందరి ఖాతాల్లో డబ్బులు జమ చేశామని సీఎం స్టాలిన్‌ తెలిపారు. దీంతో మహిళలు నగదు విత్‌డ్రా కోసం బ్యాంకుల వద్దకు పోటెత్తారు. తిరుత్తణిలోని మపోసీ ప్రదాన రోడ్డు మార్గంలోని ఇండియన్‌ బ్యాంకు, ఎస్‌బీఐ బ్యాంకుల వద్ద క్యూకట్టారు. రెండు గంటల పాటు బ్యాంకు వద్ద వేచివుండి  బ్యాంకు ఏజెంట్లు,  సరీ్వసు  కేంద్రాల్లో డబ్బులు విత్‌డ్రా చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement