వ్యభిచారం కేసులో చంద్రకళకు 10సంవత్సరాల జైలు | Three Women Sentenced to 10 Years in Jail in Prostitution Case | Sakshi
Sakshi News home page

వ్యభిచారం కేసులో చంద్రకళకు 10సంవత్సరాల జైలు

Feb 10 2026 2:00 PM | Updated on Feb 10 2026 3:16 PM

Three Women Sentenced to 10 Years in Jail in Prostitution Case

శివమొగ్గ( కర్ణాటక): వ్యభిచారం కేసులో ముగ్గురు మహిళలకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.1.61 లక్షల జరిమానా విధిస్తూ భద్రావతి 4వ అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఇందిరా మైలస్వామి చెట్టియార్‌ తీర్పు వెలువరించారు. వివరాలు.. 2021, డిసెంబర్‌ 24వ తేదీన భద్రావతిలోని ఉజ్జయిన్‌పూర్‌లోని మరియమ్మ ఆలయం వెనుక ఉన్న 3వ క్రాస్‌లోని ఒక ఇంట్లో వ్యభిచారం జరుగుతుందనే ఫిర్యాదుపై ఐపీఎస్‌ అధికారి జితేంద్ర కుమార్‌ దయామా నేతృత్వంలోని పోలీసు బృందం దాడి చేసింది. 

భద్రావతిలోని హోసూరులోని జెడికట్టే నివాసి చంద్రకళ అలియాస్‌ శ్వేత, ఉజ్జయినిపూర్‌ నివాసి శిల్ప, హోసా సిద్ధాపూర్‌ నివాసి కవితను అరెస్ట్‌ చేశారు. ఈ విషయమై పేపర్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ సమయంలో ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న మంజునాథ్‌ ఈఓ కేసును దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషిట్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున పి.రత్నమ్మ వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో నిందితులకు జైలు శిక్షతో పాటు రూ.1.61 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఇందిరా మైలస్వామి చెట్టియార్‌ తీర్పు ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement