సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే విమర్శలు | Criticism of the Maithili Thakur government | Sakshi
Sakshi News home page

సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే విమర్శలు

Feb 10 2026 1:08 PM | Updated on Feb 10 2026 1:18 PM

Criticism of the Maithili Thakur government

బిహార్ అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా అధికార పార్టీ చేసిన పనిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమర్థిస్తుంటారు. అయితే అక్కడ అసెంబ్లీలో ఇందుకు వ్యతిరేకంగా జరిగింది. ఇటీవల బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్ అక్కడి ఆసుపత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎ‍న్నికల్లో  అక్కడి ఆలీనగర్ నియోజకవర్గం నుంచి మైథిలీ ఠాకూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ప్రస్తుతం అక్కడున్న ఎమ్మెల్యేలలో ఆమె అతి పిన్న వయస్కురాలు. అయితే ప్రస్తుతం బిహార్‌లో అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడి వైద్యశాఖ మంత్రి మంగళ్ పాండేని మైథిలీఠాకూర్ ఆసుపత్రుల పనితీరుపై ప్రశ్న అడిగింది. దీనికి ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే దీనిపట్ల మైథిలీ ఠాకూర్ తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేసింది.

మైథిలీ మాట్లాడుతూ "వైద్యశాఖ మంత్రి ఆసుపత్రుల భవనాలకు చిన్న మరమ్మత్తులు చేస్తే సరిపోతుందన్నారు. అయితే నేను వాటిని స్వయంగా చూశాను. అవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. అక్కడి ఆసుపత్రులన్ని ఒక చిన్న గదిలో కొనసాగుతున్నాయి. మంత్రి సమాధానంపై నాకు సంతృప్తి కలగలేదు". అని మైథిలీ ఠాకూర్ అన్నారు.

వైద్యశాఖ మంత్రి అంతా బాగుందన్నారు. అయితే పరిస్థితులు మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి అని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా ఇంతకు ముందు ఆసుపత్రులలో ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండేవారని ఇప్పుడు మాత్రం ఆయుష్ ప్రాక్టీషినియర్లతోటే ఆసుపత్రులు నడుస్తున్నాయని తెలిపారు.ప్రస్తుతం జనాభా 40 నుంచి 50 వేలున్న ప్రాంతంలో ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్‌ ఫోక్‌ సింగర్‌. అయితే బిహార్‌లో ఇటీవలే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. బీజేపీ, ఆర్జేడీలతో పాటు ఇతర మిత్రపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో  స్వంత ప్రభుత్వంపైనే విమర్శలు చేయడంతో ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో మైథిలీ వ్యాఖ్యలు హాట్‌ టాఫిక్‌గా మారాయి.

Advertisement
 
Advertisement
Advertisement