Hyderabad: డీజీపీ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత.. | Bjp Protest At Dgp Office Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: డీజీపీ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత..

Feb 10 2026 12:26 PM | Updated on Feb 10 2026 4:03 PM

Bjp Protest At Dgp Office Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: డీజీపీ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడికి బీజేపీ  కార్యకర్తలు యత్నించారు. బారికేడ్లను తోసుకొని కార్యాలయం ముందుకు దూసుకువచ్చారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో.. వారి మధ్య వాగ్వాదం జరిగింది. మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై బీజేపీ నిరసనలకు దిగింది. మంత్రి శ్రీహరి వేధింపులే కారణమని బీజేపీ ఆరోపిస్తుంది.

మక్తల్‌ బీజేపీ అభ్యర్థి సూసైడ్‌ చేసుకున్నట్లు ఫిర్యాదు వచ్చిందని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. కేసు ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నామని... మహాదేవప్ప సూసైడ్‌ లెటర్‌ రాయలేదని.. విచారణ చేస్తున్నామని డీజీపీ తెలిపారు. కాగా, మక్తల్ పట్టణ కేంద్రంలో 6 వ వార్డు బీజేపీ అభ్యర్థి మృతి చెందడంతో తాత్కాలింగా ఆ వార్డు ఎన్నిక మాత్రమే రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు.

DGP ఆఫీస్ రౌండప్ 200 మందితో బీజేపీ ముట్టడి

Advertisement
 
Advertisement
Advertisement