డిక్కీ ఓపెన్ చేయగానే బయటపడిన ట్రాఫిక్ మిస్టరీ! | Special Drive at Taj Krishna Junction Exposes Rule-Breaking Driver | Sakshi
Sakshi News home page

డిక్కీ ఓపెన్ చేయగానే బయటపడిన ట్రాఫిక్ మిస్టరీ!

Feb 10 2026 12:38 PM | Updated on Feb 10 2026 12:42 PM

Special Drive at Taj Krishna Junction Exposes Rule-Breaking Driver

హైదరాబాద్: బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు సోమవారం రోడ్డునెంబర్‌–1లోని తాజ్‌కృష్ణా చౌరస్తాలో నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌ను జూబ్లీహిల్స్‌ జోన్‌ ట్రాఫిక్‌ డీసీపీ కాజల్‌ పర్యవేక్షించారు. అదే సమయంలో నెంబర్‌ ప్లేట్‌ లేకుండా వస్తున్న వాహనదారుడిని తనిఖీ చేయగా సదరు వ్యక్తి తన నెంబర్‌ ప్లేట్‌ను డిక్కీలో దాచినట్లు గుర్తించారు. 

ఈ వాహనంపై 22 చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. రెండేళ్ల క్రితం ఈ వాహనం కొనుగోలు చేసిన వాహనదారుడు పాత యజమాని పేరుతోనే నడపిస్తున్నాడు. ఇంత వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా తిరుగుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాల్సిందిగా డీసీపీ ఆదేశించారు. ప్రీ లెఫ్ట్‌ బ్లాక్‌ చేస్తున్న వాహనదారులకు జరిమానా విధించారు. స్పెషల్‌ డ్రైవ్‌లో బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ ఎస్సైలు ప్రభాకర్‌రెడ్డి, గోవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement