బెంగళూరు తరహాలో సీఎం నేతృత్వంలో ?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పాలకమండలి గడువు ముగిసి..కొత్త పాలన ప్రారంభం కానున్నప్పటికీ, పరిపాలన ఎలా ఉంటుందన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అధికారులు సైతం ఏ విషయాన్నీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు కావడం ఖాయమైనప్పటికీ, హైదరాబాద్ అతిపెద్ద నగరంగా కొనసాగేందుకు మూడు కార్పొరేషన్లపైనా ఉమ్మడి పర్యవేక్షణ ఉంటుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో బెంగళూరు తరహా పాలనకు అటూఇటూగా పరిపాలన ఉండవచ్చుననే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులో గత సంవత్సరం వరకు ఐదు కార్పొరేషన్లు ఉన్నప్పటికీ, అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చారు. బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) స్థానే గ్రేటర్ బెంగళూరు అథారిటీని(జీబీఏ) ఏర్పాటు చేశారు. ఇది కూడా మున్సిపల్ కార్పొరేషన్ చేసే పనుల్ని చేస్తుంది. అన్నింటికంటే కీలకమేమిటంటే, జీబీఏకు చైర్మన్‌గా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, వైస్ చైర్మన్‌గా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉన్నారు.
ఒక చీఫ్ కమిషనర్‌తోపాటు అంశాల వారీగా ముఖ్యమైన విభాగాలకు నలుగురు ఐఏఎస్‌లు స్పెషల్ కమిషనర్లుగా ఉన్నారు. బెంగళూరులో ఐదు సిటీ (సెంట్రల్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్) కార్పొరేషన్లున్నాయి. అన్నింటికీ కలిపి ఒకే చీఫ్ కమిషనర్ ఉన్నారు. ఐదుకార్పొరేషన్లకు విడిగా ఐదుగురు కమిషనర్లున్నారు. ఇద్దరేసి అడిషనల్ కమిషనర్లు ఉన్నారు. అడిషనల్ కమిషనర్లుగా ఐఏఎస్‌లు, కేఏఎస్ (కర్ణాటక అడ్మిని్రస్టేషన్ సరీ్వస్)అధికారులు ఉన్నారు. హైదరాబాద్‌ను సైతం అలాంటి పరిపాలన ద్వారా ఒకే మహానగరంగా ఉన్నపేరు కొనసాగించనున్నారా..సీఎం రేవంత్ మదిలో ఏముందో.. ఏం కానుందో తేలాల్సి ఉంది.
జీబీఏ ఏం చేస్తోంది ?
అన్ని కార్పొరేషన్లలో పాలసీలు యూనిఫామ్‌గా అమలయ్యేలా చూస్తుంది.
పౌరులకందే సేవలి్న..ఆస్తిపన్ను, ఘనవ్యర్థాల నిర్వహణ, వార్డుస్థాయి ప్లానింగ్, తదితర అంశాలను పర్యవేక్షిస్తుంది.
సిటీ కార్పొరేషన్లు దినవారీ వ్యవహారాలు, స్థానిక పరిపాలన చేస్తాయి.
పెద్ద ప్రాజెక్టులు, క్లైమేట్ ప్రాజెక్టులు వంటివాటిని జీబీఏ మానిటర్ చేస్తుంది.
ముఖ్యమైన, సున్నితమైన అంశాలను అమలు చేసేముందు కార్పొరేషన్లు జీబీఏ అప్రూవల్ పొందుతాయి.
కార్యనిర్వాహక కమిటీగా సీఎం, డెవలప్‌మెంట్ మినిస్టర్, చీఫ్ కమిషనర్ ఉంటారు.
సంక్షిప్తంగా చెప్పాలంటే స్థానిక కార్పొరేషన్లు వార్డుస్థాయిలో ప్రజల కవసరమైన సేవలు, సదుపాయాలు కలి్పస్తాయి. భారీ ప్రాజెక్టులు, కీలక నిర్ణయాలు వంటివాటిని జీబీఏ పర్యవేక్షిస్తుంది. దాంతో పోలిస్తే హైదరాబాద్‌లో మూడు కార్పొరేషన్లు ఉంటాయి.వీటిలోనూ జోనల్ స్థాయి అధికారులు కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. పెద్ద ప్రాజెక్టుల వంటివి చేపట్టాలంటే కోట్ల నిధులవసరం. జీహెచ్‌ఎంసీ ఇప్పటికే వేలకోట్లు అప్పుచేసి పలు ప్రాజెక్టులు చేపట్టింది. నగరం మొత్తం యూనిఫామ్‌గా ఉండేందుకు, పెద్ద ప్రాజెక్టులు అమలు చేసేందుకు ప్రభుత్వం జీబీఏతరహాను ఎంచుకునే అవకాశం లేదని చెప్పలేం. అంతేకాదు..జీహెచ్‌ఎంసీ అప్పుల్ని విభజించడంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కూడా ఇది ఒక మార్గంగా ఉండే అవకాశం ఉంది.


