టెన్త్‌ విద్యార్థినికి తాళి కట్టిన ఉపాధ్యాయుడు | Shocking Incident, Private School Teacher Arrested For Marrying 10th Class Student In Nizamabad | Sakshi
Sakshi News home page

టెన్త్‌ విద్యార్థినికి తాళి కట్టిన ఉపాధ్యాయుడు

Feb 10 2026 8:04 AM | Updated on Feb 10 2026 8:50 AM

School teacher Marriage with tenth grade student

నిజామాబాద్ జిల్లా: అన్నోజిగూడలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదివే టెన్త్‌ క్లాస్‌ విద్యార్థిని మెడలో అదే స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు తాళి కట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నోజిగూడలోని ఓ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి అదే స్కూల్‌లో ఫిజిక్స్‌ టీచర్‌గా పనిచేస్తున్న పర్రే మైటీస్‌ మాయమాటలు చెప్పి రహస్యంగా పెళ్లి చేసు కున్నాడు. విద్యార్థిని మెడలో పసుపు తాడు చూసిన తల్లి ప్రశ్నించగా..తమ ఉపాధ్యా యుడు మైటీస్‌ తనను పెళ్లి చేసుకున్నట్లు కూతురు చెప్పింది. 

ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిని పిలిపించి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పోలీసు­లకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమ­య్యారు. విషయం బయటకు వస్తే స్కూలు పరువు పోతుందని భావించిన యాజమాన్యం ఉపా­ధ్యాయుడిని ఉద్యోగం నుంచి తొలగించి, పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. మై నర్‌ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్ప డిన ఉపాధ్యాయుడితో పాటు స్కూల్‌ యాజ మాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement