బీజేపీని ఓడించే కుట్ర
సుభాష్‌నగర్: నిజామాబాద్‌లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి కుట్ర ప న్నుతున్నాయని, ప్రజలు కళ్లు తెరిచి బీజేపీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. నగరంలోని పూసలగల్లి టీ కార్నర్ వద్ద బీజేపీ అభ్యర్థులు బంటు ప్రీతి ప్రవీణ్, గిరిబాబు, బట్టు రాఘవేంద్ర, శీల శ్రీనివాస్, చింతకాయల రాజేందర్, వినోద్, సత్య పాల్ తరఫున సోమవారం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం నుంచి 100 మంది ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాంచందర్‌రావు మాట్లాడారు. ఎంఐఎం గత పదేళ్లు బీఆర్‌ఎస్‌తో కాపురం చేయగా, ప్రస్తుతం కాంగ్రెస్‌తో చేస్తుందన్నారు. ఎంఐఎంకు బీజేపీ అంటే భయం పట్టుకుందని ఆరోపించారు. నిజామాబాద్‌లో మళ్లీ నిజాం పాలన తీసుకొచ్చే ప్ర యత్నం చేస్తున్నారని విమర్శించారు. మతం పేరు తో రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. బీజేపీ ఏనాడూ మతం ఆధారంగా రాజకీయం చే యలేదని, వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కలాంను రాష్ట్రపతిని చేశామని గుర్తుచేశారు. ఈ నెల13 తర్వాత నిజామాబాద్ పేరు ఇందూరుగా మారుతుందన్న విశ్వాసం ఉందని తెలిపారు. ఎన్నికలకు ముందు అబద్ధాలు ప్రచారం చేయడం కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటైందని రాంచందర్‌రావు విమర్శించారు. బీజేపీ, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలను బదనాం చేస్తున్నారని దుయ్య బట్టారు. సమావేశంలో ఎంపీ అర్వింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, జాతీ య పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్, కాంతారావు, నాయకులు పాల్గొన్నారు.
నిజామాబాద్‌లో మళ్లీ నిజాం పాలన తీసుకొచ్చే ప్రయత్నం
ఈ నెల 13 తర్వాత ఇందూరుగా
మార్పు తథ్యం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు


