ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం

Apr 3 2026 7:44 AM | Updated on Apr 3 2026 7:44 AM

ప్రణాళికల రూపకల్పన, సమస్యల

పరిష్కారం కోసమే వార్డు సభల నిర్వహణ

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

బోధన్‌టౌన్‌(బోధన్‌): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతు న్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే విజయవంతం అవుతాయని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగం గా గురువారం పట్టణంలోని 26, 35వ వార్డుల్లో వార్డు సభ లు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మునుముందు అమలు చేయనున్న కొత్త పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రగతి, సంక్షేమంలో ప్రజలను భా గ స్వామ్యం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. పట్టణ అభివృద్ధి కోసం అందరి అభిప్రాయా లను క్రోఢీకరించి సమగ్ర ప్రణాళిక రూపొందించడాని కి, సమస్యల పరిష్కారానికి ఈ వార్డు సభలు దోహదపడుతాయన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకా లు చేరేలా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని సూచించారు. పట్టణ పరిసర ప్రాంతాల శుభత్రకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్లాస్టిక్‌ వినియోగాన్ని విడనాడాలని సూచించారు. పట్టణంలోని 26వ వార్డులో ఇటీవల రేఖమ్మ అనే వివాహితకు భర్త మృతి చెందాడని అమెకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరుకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని అధికారులను అదేశించా రు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తూము పద్మాశరత్‌ రెడ్డి, వార్డు కౌ న్సిలర్‌ దాము, కమిషనర్‌ జాదవ్‌ కృష్ణ, ఏసీపీ శ్రీనివాస్‌, ట్రా న్స్‌కో డీఈ ముక్తార్‌ తదితరులు పాల్గొన్నారు.

మోస్రా మండల కేంద్రంలో..

వర్ని: మోస్రా మండల కేంద్రంలో జరిగిన గ్రామసభలో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల్లో ఎక్కడైనా అక్రమాలు జరిగితే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పథకాల ఎంపికలో ఇంకా అర్హులైన వారు మిగిలి ఉంటే విచారణ జరిపి లబ్ధి చేకూర్చుతామని భరోసా కల్పించారు. మోస్రా మండల ప్రత్యేక అధికారి రతన్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీ ఓ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ భూపాల్‌ రెడ్డి, కార్యదర్శి శ్రావణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement