ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు ధరలు పెరగడంతో పాకిస్తాన్.. డీజిల్, పెట్రోల్ ధరలను భారీగా పెంచింది. కాగా, నెల రోజుల వ్యవధిలో పాకిస్తాన్‌లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది రెండోసారి.
తాజాగా పెరిగిన ధరల ప్రకారం పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ ధర 458.40 పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. అలాగే, డీజిల్ ధర లీటరుకు 520.35 పాకిస్తానీ రూపాయలకు వెళ్లింది. ప్రస్తుతం ఉన్న ధరల విషయంలో డీజిల్‌పై 54.9%, పెట్రోల్‌పై 42.7% పెంపు విధించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ సవరించిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కాగా, ఈ ధరలు పాకిస్తాన్ చరిత్రలోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా పాకిస్తాన్ పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ స్పందిస్తూ..‘అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఈ పెంపు అనివార్యమని అన్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ ధరలు అదుపు తప్పడంతో ధరలు పెంచడం తప్పనిసరి అయ్యింది’ అని చెప్పుకొచ్చారు.
అయితే, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పెరిగిన చమురు ధరలను కారణంగా చూపుతూ గత నెలలోనే పాకిస్తాన్.. డీజిల్, పెట్రోల్ ధరలను సుమారు 20% పెంచిన సంగతి తెలిసిందే. ఈ తాజా పెంపు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచి, దేశంలోని పేద ప్రజలపై మరింత భారం మోపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్ ప్రధానంగా సౌదీ అరేబియా, యూఏఈల నుండి హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యే చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. పెరిగిన ధరల కారణంగా పెట్రోల్ బంకుల ముందు వాహనాలు బారులు తీరాయి. దీనిని సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#BREAKING : WAR CRISIS ARRIVE IN PAKISTAN:
Pakistan announces near 50% spike in fuel prices; long queues at pumps.
42.7% increase in petrol
54.9% increase in diesel
Petrol up $0.49
Diesel $0.66#IranWar #Iran #Dubai #ısrael #usa #Saudi #iraq #TelAvivBlast #middleeastunrest… pic.twitter.com/Z80zYCFSWd— The Globe & News (@TheGlobeNewt) April 2, 2026


