టీవీకే విజయం : డిజిటల్‌ సునామీపై స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు | MK Stalin Takes Dig At CM Vijay, Says Instagram Influence Helped TVK Win Tamil Nadu, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

టీవీకే విజయం : డిజిటల్‌ సునామీపై స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు

May 19 2026 11:20 AM | Updated on May 19 2026 1:25 PM

Stalin says Vijay became CM by influencing children on Instagram

ఇన్‌స్టాగ్రామ్‌  ప్రభావాన్ని అంచనా వేయలేకపోయాం!

చెన్నై: తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ చేతిలో ఓటమి పాలైన కొన్ని రోజుల తర్వాత, డీఎంకే (DMK) అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్.. బూత్ ఏజెంట్లను కూడా సరిగ్గా నియమించుకోకుండా, కేవలం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పిల్లలను ప్రభావితం చేసి ముఖ్యమంత్రి అయ్యారని స్టాలిన్ విమర్శించారు.

'డిజిటల్ సునామీ'
తమిళనాడులోని తంజావూరులో జరిగిన ఒక సభలో స్టాలిన్ మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లల ద్వారా పెద్దలను ప్రభావితం చేసిన టీవీకే విజయం సాధించిందన్నారు. ఇన్‌స్టా ఆధారిత ప్రచారం, పిల్లలు టీవీకేకు అనుకూలంగా ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తాయో అంచనా వేయడంలో డీఎంకే విఫలమైందన్నారు. తంజావూరులో ఒక వివాహవేడుకకు హాజరైన ఆయన మాట్లాడారు. ‘సోషల్‌ మీడియా, ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించడం, వారి తల్లులు, తాతలు, పెద్దలను ప్రభావితం చేయడానికి పిల్లలతో ప్రచారం చేయించడం వంటివి ఉద్దేశపూర్వకంగానే చేశారు. దాన్ని మేం గ్రహించలేకపోయాం. ఇకపై ఇలాంటి చర్యలను ఓడించడానికి పార్టీ వ్యూహాలను రూపొందిస్తుంది’అని చెప్పారు. 

ఇదీ చదవండి: 120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశ

అధికారం కోల్పోయినప్పటికీ డీఎంకే రాజకీయంగా ప్రాసంగికంగానే ఉందన్నారు. డీఎంకే పాలనలో ప్రారంభించిన సంక్షేమ పథకాలను కొత్త ప్రభుత్వం కొనసాగించడాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో పరిపాలనను ఇప్పటికీ తమ పార్టీ విధానాలే ప్రభావితం చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఎన్నికల ఓటమి తర్వాత తాను కుంగిపోలేదని, ఓటమి తరువాత సమయంలో డీఎంకే ఫీనిక్స్‌ పక్షిలా పుంజుకుంటుందని అన్నారు. 

 ఇదీ చదవండి: ట్రంప్‌, నెతన్యాహులను హతమారిస్తే రూ. 480 కోట్లు : ఇరాన్‌

అధికార కూటమి వ్యాపింపజేస్తున్న తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవాలని పార్టీ కార్యకర్తలను కోరారు. పాలనకు డీఎంకే ఆటంకం కలిగించదని హామీ ఇస్తూ ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను కూడా పంచుకున్నారు. ‘కొత్త ప్రభుత్వం ఏర్పడింది. వారు పరిపాలిస్తున్నంత కాలం ఇబ్బంది పెట్టం. కానీ వారి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మాపై నిందారోపణలు చేస్తే, వివరణలు ఇస్తాం. సోషల్‌ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తే, నిజాన్ని బయటపెడతాం’అని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రతిరోజూ హత్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దోషులను గుర్తించి, వారిపై తగిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడి, శాంతిభద్రతలను పరిరక్షించడం పరిపాలనలో ప్రాథమిక కర్తవ్యం. ఈ వాస్తవాన్ని టీవీకే ప్రభుత్వం, దాని ముఖ్యమంత్రి గ్రహించి, ఆ మేరకు చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు.    

ఇదీ చదవండి: వింటేజ్ లుక్‌ : ఇషా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్‌

కాగా ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 234 స్థానాలకు గాను 104 స్థానాలను గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేయగా, డీఎంకే 59 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైంది.

ఇదీ చదవండి: వివాదంలో యాసిడ్‌ దాడి బాధితురాలు : అసలు ఏమైంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement