వివాదంలో యాసిడ్‌ దాడి బాధితురాలు : అసలు ఏమైంది? | backlash acid attack survivor Laxmi Agarwals viral government office photo | Sakshi
Sakshi News home page

వివాదంలో యాసిడ్‌ దాడి బాధితురాలు : అసలు ఏమైంది?

May 18 2026 3:28 PM | Updated on May 18 2026 4:57 PM

backlash acid attack survivor Laxmi Agarwals viral government office photo

ప్రముఖ యాసిడ్ దాడి బాధితురాలు, సామాజిక కార్యకర్త లక్ష్మీ అగర్వాల్ మళ్లీ వార్తల్లోనిలిచారు.  సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ ఫోటో నిజమైనది కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫోటో అని నెటిజన్లు భావిస్తుండటంతో సోషల్ మీడియాలో చర్చకు కేంద్రబిందువుగా నిలిచారు.

లక్ష్మీ అగర్వాల్   షేర్‌ చేసిన ఫోటోలో ఆమె  ఒక ప్రభుత్వ కార్యాలయంలో కూర్చుని, ఏదో ఒక అధికారిక పత్రంపై సంతకం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటో బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘ఢిల్లీ సర్కార్’ (Delhi Sarkar) బోర్డు, భారత జాతీయ చిహ్నం, రెండు జాతీయ జెండాలు ఉన్నాయి. అంతేకాదు ఆమె  ముందున్న  టేబుల్‌పై "లక్ష్మీ అగర్వాల్" అని రాసి ఉన్న నేమ్‌ప్లేట్ ఉంది. ఈ ఫోటోకు హిందీలో ఒక ఎమోషనల్ క్యాప్షన్ కూడా జోడించారు: "ఒకప్పుడు ఏ గొంతునైతే నొక్కేయాలని చూశారో.. ఇప్పుడు అదే గొంతు మార్పును లిఖిస్తుంది. నన్ను బలహీనురాలిగా భావించిన వారు ఇకపై నా పేరు గుర్తుపెట్టుకోవాలి- లక్ష్మీ అగర్వాల్."   ఈ పోటోతోపాటు,  ఆ క్యాప్షన్‌  నెటిజన్లలో గందరగోళం నెలకొంది.

ఇదీ చదవండి: విజయ్‌ సర్కార్‌ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్‌ నేత జోస్యం


ఈ ఫోటో చూసి చాలా మంది లక్ష్మీ అగర్వాల్‌కు ఏదో ప్రభుత్వ పదవి లేదా అధికారిక నియామకం లభించిందని భావించి పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. మరికొందరు ఆమె ప్రయాణాన్ని ప్రశంసిస్తూ, ఆ క్షణం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మరి కొందరు నెటిజన్లు ఇది పూర్తిగా AI ఫోటోని గుర్తించారు.  దీనికి భిన్నంగా కొందరు లక్ష్మికి మద్దతుగా నిలిచారు. ఆమె ఆ పోస్ట్‌లో తనకు ఫలానా ప్రభుత్వ పదవి వచ్చిందని ఎక్కడా క్లెయిమ్ చేయలేదని, కేవలం ఒక ప్రతీకాత్మకమైన (Symbolic) సృజనాత్మకత కోసం మాత్రమే ఆ ఫోటోను వాడారని, నేమ్‌ప్లేట్‌పై కూడా ఎలాంటి హోదా రాయలేదని వారు వాదించారు. 

ఇదీ చదవండి: నలుగుర్ని కనండి : డా.శివరంజని తీవ్ర ఆందోళన వీడియో వైరల్‌

ఒక సెలబ్రిటీ అయి ఉండి, ఇలాంటి నకిలీ ఫోటోలను వాస్తవం లాగా ఎందుకు షేర్ చేస్తున్నారని, కనీసం ఇది AI ఫోటో అని డిస్క్లైమర్ (Disclamer) ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇది  చట్టపరమైన వివాదం, ప్రభుత్వ చిహ్నాల దుర్వినియోగం అనే వ్యాఖ్యలు కూడా  కనిపించాయి.  భారతదేశ జాతీయ చిహ్నం, జాతీయ జెండాలు, మరియు ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయం లాంటి సెటప్‌ను AI ద్వారా సృష్టించి చూపించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని కొందరు వాదించారు. ఇది 'ది స్టేట్ ఎంబెల్మ్ ఆఫ్ ఇండియా (ప్రొహిబిషన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్) యాక్ట్, 2005' కింద చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చని  పలువురు న్యాయవాదులతో సహా పలువురు వినియోగదారులు హెచ్చరించారు.

లక్ష్మీ అగర్వాల్‌కు ప్రభుత్వ పదవి వచ్చినట్టుగా లాంటి అధికారిక ప్రకటన కూడా లేదు. విమర్శలు ఎన్ని వస్తున్నప్పటికీ, లక్ష్మికి అభిమానుల నుండి మద్దతు మాత్రం లభిస్తూనే  ఉండటం గమనార్హం.

ఎవరీ లక్ష్మీ అగర్వాల్
ఈమె  భారతీయ యాసిడ్ దాడి బాధితురాలు, మహిళా హక్కుల కార్యకర్త , టీవీ హోస్ట్. యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం మరియు చట్టపరమైన సంస్కరణలు భారతదేశంలో ఆమెకు ఎంతో గుర్తింపునిచ్చాయి.  2005లో, ఆమెకు 15 ఏళ్ల వయసులో, పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన ఒక వ్యక్తి ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. కోలుకున్నతరువాత బాధితుల కోసం ఒక ప్రముఖ గళంగా మారి, 'స్టాప్ యాసిడ్ ఎటాక్స్' ప్రచారంలో చేరారు. సుప్రీంకోర్టులో ఆమె వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం, భారతదేశంలో యాసిడ్ అమ్మకాలపై కఠినమైన నిబంధనలు రావడానికి దారితీసింది.  యాసిడ్ దాడుల బాధితులకు పునరావాసం, మద్దతు అందించే ఛన్వ్ ఫౌండేషన్ (Chhanv Foundation) కు ఆమె డైరెక్టర్‌గా ఉన్నారు.ఆమె చేసిన సామాజిక సేవలకు గాను 2014లో అమెరికా ప్రభుత్వ ‘ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్’ అవార్డును అందుకున్నారు. ఆమె జీవిత  కథ ఆధారంగా  బాలీవుడ్‌లో దీపికా పదుకొణె ప్రధాన పాత్రలో ‘ఛపాక్’ (Chhapaak) అనే చిత్రం కూడా రూపొందింది.
 

ఇదీ చదవండి: మాజీ మిస్ పూణే అనుమానాస్పద మృతి : దిగ్భ్రాంతి పర్చే లాస్ట్‌ మెసేజెస్‌


 

Advertisement
 
Advertisement
Advertisement