breaking news
Palnadu
-
విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ
నరసరావుపేట రూరల్: లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా విద్యార్థినులకు 101 సైకిళ్లను పంపిణీ చేశారు. పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో బ్యాంక్ జోనల్ హెడ్ ఎం.పిచ్చయ్య, రీజినల్ హెడ్ జీవీ రమణారావు, నరసరావుపేట శాఖ మేనేజర్ పి.వెంకట రవికుమార్‌లు అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థినులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతో సైకిళ్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. హెచ్ఎం పార్వతి, ఉపాధ్యాయులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకటరామిరెడ్డి జయంతిని పురస్కరించుకొని శనివారం వెంకటరామ్ మెమోరియల్ జీబీఆర్ హాస్పిటల్లో సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి భవనం చేసిన సేవలను కొనియాడారు. పలువురు నాయకులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: విజయవాడ కనకదుర్గ అమ్మవారికి మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం సారె సమర్పించారు. ఈ మేరకు మంగళగిరి మెయిన్ బజారులోని ఆర్యవైశ్య కల్యాణ మండపం నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం వరకు పెద్ద ఎత్తున మహిళలు తరలివెళ్లారు. తొలుత మెయిన్ బజారులోని ఆరవైశ్య కల్యాణ మండపం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు మహిళా సంఘం ప్రతినిధులు చీర, పూలు, పండ్లు, స్వీట్లతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ధ్వజ స్తంభం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య మహిళ సంఘం ప్రధాన కార్యదర్శి త్రిపురమల్లు అపర్ణ పార్వతి, కోశాధికారి వెంకట కీర్తి, కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘాల సమైఖ్య అధ్యక్షుడు సంకా బాలాజీ గుప్త హాజరయ్యారు. మంగళగిరి టౌన్: ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుద్ధ్య కార్యక్రమంలో మూడు లక్షల జనాభాకు పైబడిన పట్టణ స్థానిక సంస్థల విభాగంలో మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించింది. ఈ మేరకు గుడివాడలో జరిగిన రాష్ట్రస్థాయి వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా అవార్డును, ప్రశంసా పత్రాన్ని శనివారం అందుకున్నారు. స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో ఎంటీఎంసీ కనబర్చిన విశిష్ట పని తీరుకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు అధికారులు తెలిపారు. నగర పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాల అమలులో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధించినట్లు పేర్కొన్నారు. -
నిర్వీర్యమైన పంటల బీమా పఽథకం
సాక్షి, నరసరావుపేట: ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు నష్టం జరిగిన సమయంలో ఆసరాగా నిలవాల్సిన పంటల బీమా పథకం కూటమి ప్రభుత్వంలో నిర్వీర్యమైందని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో... అనుకోకుండా సంభవించే ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ పొందటానికి పంటల బీమా అనేది మంచి ఉపశమనం పొందే అవకాశముందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం రైతులకు ఉపయోగపడాల్సిన పంటల బీమా పథకాన్ని పూర్తిగా ఉపయోగపడకుండా చేసిందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కర్షకుల మేలుకోరే ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల పక్షాన బీమాను చెల్లించి వారిని కష్టకాలంలో ఆదుకున్నారన్నారు. అయితే ఆ పథకాన్ని రద్దు చేసి రైతులే ప్రీమియం కట్టేలా నిబంధనలు మార్చి జరిగిన నష్టానికి న్యాయమైన పరిహారం దక్కే హక్కు లేకుండా చేశారన్నారు. గత రెండేళ్లలో వరుస ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినా వారికి బీమా ధీమాను ఇవ్వలేదన్నారు. దీంతో రైతులు రైతులు బీమా కట్టడానికి ముందుకు రాలేదన్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో బీమా ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే భరించిందని గుర్తుచేశారు. -
మళ్లీ కరోనా కలవరం
ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026పల్నాడులో ముందస్తు చర్యలు శూన్యం నరసరావుపేట టౌన్: జిల్లాకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న నరసరావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి కరోనా పరిస్థితులను ఎదుర్కొనే స్థాయికి సిద్ధంగా లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. అవసరమైన అదనపు పడకలు, ఆక్సిజన్ సౌకర్యం, వెంటిలేటర్లు, అత్యవసర చికిత్సా పరికరాలు అందుబాటులో లేనట్లుగా తెలుస్తొంది. దీంతో పాటు వైద్యులు, సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలు పీపీఈ కిట్లు, మాస్క్‌లు, గ్లౌజులు సరిపడినన్ని అందుబాటులో లేవు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో అనుమానితుల కోసం ప్రత్యేక ఐసోలేషన్ వార్డు, ఆర్టీపీసీఆర్ పరీక్షల సౌకర్యం, తగినన్ని పరీక్షా కిట్లు, ఆక్సిజన్ పడకలు, అత్యవసర చికిత్స పరికరాలను ముందుగానే సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ దిశగా ఇప్పటివరకు స్పష్టమైన ఏర్పాట్లు కనిపించకపోవడం ప్రజల్లో కలవరపాటుకు గురిచేస్తుంది. ముఖ్యంగా ప్రాణవాయువు అందించి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వైద్యశాల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ నిర్వహణ లేక మూలకు చేరాయి. వాటిని వెంటనే వినియోగంలోకి తీసుకురాకుంటే అత్యవసర సమయంలో ఇబ్బందులు తప్పవు. ప్రత్యేక వార్డు సిద్ధం చేయాలి ఏరియా ఆస్పత్రిలో కరోనా అనుమానితుల కోసం ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసి, అదనపు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలి. వైద్యులు, నర్సులు, సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు, ఎన్–95 మాస్కులు, గ్లౌజులు తగినంతగా అందుబాటులో ఉండాలి. కరోనా లక్షణాలతో వచ్చే వారి నుంచి వెంటనే స్వాబ్లు సేకరించి పరీక్షలు నిర్వహించేలా వీటీఎం కిట్లు, స్వాబ్ కిట్లు, ఆర్టీపీసీఆర్ పరీక్షా సామగ్రిని అందుబాటులో ఉంచాలి. వైరస్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే వ్యాప్తిని సమర్థంగా అరికట్టే అవకాశం ఉంటుంది. జ్వరాలపై ప్రత్యేక నిఘా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న జ్వరాలపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. ప్రతిరోజు నమోదవుతున్న జ్వరాల వివరాలను సమీక్షించి, కరోనా అనుమానితులను గుర్తించాలి. వారి నమూనాలను వెంటనే పరీక్షలకు పంపించి, అవసరమైతే కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టాలి. గ్రామ, వార్డు స్థాయిలో ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. తొలి కేసు గుర్తొస్తోంది... కరోనా తొలి దశలో పల్నాడు జిల్లాలో నమోదైన మొదటి కేసు నరసరావుపేటలోనే వెలుగు చూసింది. వరవకట్ట ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి భారీ స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టారు. ఆ తర్వాత జిల్లాలో వైరస్ వేగంగా వ్యాపించి అనేక కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా ప్రజల మదిలో చెరిగిపోలేదు. నరసరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాల జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యుల సలహా తీసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో మాస్కు ధరించడం, చేతుల పరిశుభ్రత పాటించడం, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా మళ్లీ వ్యాప్తి చెందే అవకాశాల నేపథ్యంలో కేసులు వచ్చిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే సిద్ధమైతేనే ప్రజల ఆరోగ్యాన్ని సమర్థంగా కాపాడగలమని నిపుణులు సూచిస్తున్నారు. -
ఎరువు... బరువు!
సత్తెనపల్లి: ఎరువులు కావాలంటే రైతులు ముందుగా ఏపీ ఏఐఎంఎస్ యాప్‌లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే రైతులకు ఇబ్బందికరంగా తయారైంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ అన్నదాతల అవస్థలు వర్ణనాతీతంగానే ఉన్నాయి. దీనికి తోడు ఇక మీదట సాగు చేసే పంటలను ముందస్తుగా రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేయించాలని, తర్వాతే ఎంత మేర ఎరువులు ఇవ్వాలో నిర్ణయిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పైగా భూములు వెబ్‌ల్యాండ్‌లో ఉంటేనే ఎరువులు ఇస్తామని లేకుంటే ఇవ్వమని తెగేసి చెబుతున్నారు. నమోదైన మేరకే... గత ఏడాదిలో ఏ పంట సాగు చేశారు .. ప్రస్తుతం ఏ పంటను సాగు చేయనున్నారు.. పంట మార్పిడి చేస్తారా.. లేక అదే సాగు చేస్తారా .. అనే వివరాలను రైతు సేవా కేంద్రంలో నమోదు చేయించిన తర్వాతే రైతు పేరు, ఆధార్, భూమి రికార్డులను ఏపీ ఏఐఎంఎస్ యాప్‌లో సిబ్బంది పొందుపరుస్తారు. అనంతరం వివరాలు తీసుకొని ఏ ఎరువుల దుకాణం వద్దకు వెళ్లినా యాప్ లో నమోదైన మేరకు ఎరువులు ఇస్తారు. అదీ నమోదు చేసిన ఎరువులను ఒక్కసారిగా ఇవ్వరు. మూడు విడతలుగా అందజేస్తారు. ఒక్కో విడతకు 20 రోజుల నుంచి 30 రోజుల వ్యవధి ఉంటుంది. అధికంగా కావాలంటే ఎరువుల దుకాణంలో ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుందని రైతులు వాపోతున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయలేకే ప్రభుత్వం ఇప్పుడు యాప్ ఎత్తుగడ వేసిందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఉద్యాన పంటలు సాగు చేసేవారితో పాటు ఏడాది పాటు మూడు పంటలు సాగు చేసే రైతుల కు ఈ ఎరువులు ఏ మూలకు సరిపోవు. ఖరీఫ్ సాగు లక్ష్యం : 1,60,138 హెక్టార్లు ఖరీఫ్‌కు అవసరమైన ఎరువులు : 1,08,636 మెట్రిక్ టన్నులు అందుబటులో ఉన్న ఎరువులు : 73,359 మెట్రిక్ టన్నులు -
మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీ విద్యార్థుల ప్రతిభ
యడ్లపాడు: మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో రెండురోజుల వైజ్ఞానిక ప్రదర్శన శనివారం ముగిసింది. జేఎన్ఎస్ హైదరాబాద్ రీజియన్ పరిధిలోని 9 జవహర్ నవోదయ విద్యాలయాలకు చెందిన విద్యార్థులు 60 రకాల ప్రాజెక్టులతో హాజరై ప్రదర్శనలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో విద్యాలయ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో బాల శాస్త్రవేత్తలు రూపొందించిన అంశాలు అందర్నీ ఆకట్టుకుని ఆలోచింపజేశాయి. ముఖ్య అతిథులు చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తీవ్ర పోటీ నడుమ సాగిన ఈ ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యాలయాల వివరాలు ఇలా ఉన్నాయి. -
అర్హత ఉంటే అప్పు
సాక్షి, నరసరావుపేట: ప్రజలు బ్యాంకులకు వెళ్లి అప్పులు తెచ్చుకునే రోజుల నుంచి బ్యాంకులే ప్రజల వద్దకు వచ్చి రుణాలు ఇచ్చే మార్పు వచ్చిందని, దీనికి కారణం ప్రధాని నరేంద్రమోదీ అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో శుక్రవారం క్రెడిట్ ఔట్ రీచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి జిల్లాలో 1,03,246 మంది లబ్దిదారులకు రూ.3,216 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తాను ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి బ్యాంకులు ఎన్పీఏల సమస్యలతో ఇబ్బందుల్లో ఉండేవని, చిన్న వ్యాపారులు అప్పులు దొరక్క నష్టపోయేవారని చెప్పారు. నేడు బ్యాంకులు స్వయంగా వ్యాపారుల చెంతకే వచ్చి రుణాలు ఇస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సిఫార్సులతో బ్యాంకుల్లో అప్పులు దొరికేవని, ప్రస్తుతం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రుణాలు లభిస్తున్నాయని చెప్పారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రసంగం చివర్లో భారత్‌మాతాకి జై అని గట్టిగా అరవాలని.. పల్నాడు బలం ఢిల్లీకి వినిపించాలని ఆమె సభికుల్లో ఉత్సాహం నింపారు. బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక మార్పులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక మార్పులొచ్చాయని చెప్పారు. రైతు భవిష్యత్తు మార్చడానికి, యువత కలలు నెరవేర్చడానికి, పారిశ్రామికవేత్తల లక్ష్యం నెరవేరడానికి రుణాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. క్రెడిట్ అవుట్ రీచ్‌ను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా మారాలని సూచించారు. కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు ఆకాంక్షలు నెరవేరుతున్నాయని చెప్పారు. వచ్చే మార్చిలోపు పోలవరం మొదటిదశ పూర్తిచేసి తీరతామన్నారు. రాయలసీమను హార్టీ కల్చర్ హబ్‌గా మారుస్తామన్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు ఇప్పటివరకు నిండలేదని, నిండే ఛాయలు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పలువురు ఎమ్మెల్యేలు, బ్యాంక్ ఉన్నతాధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు. -
సభకు బస్సులు.. ప్రజలకు కష్టాలు
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శుక్రవారం నిర్వహించిన రుణమేళా సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు రావడంతో బస్సు ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. సీఎంతోపాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. చంద్రబాబు సభకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేయడానికి ఆర్టీసీ బస్సులను కేటాయించారు. నరసరావుపేటలోని సభకు మొత్తం 600 బస్సులు కేటాయించడంతో ప్రయాణికులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడికక్కడ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు ఆర్టీసీ బస్సులను కేటాయించి వాటిలో డ్వాక్రా మహిళలతోపాటు జనాన్ని సమీకరించారు. సీఎం చంద్రబాబు సభ పుణ్యమా అని ప్రయాణికులు, విద్యార్థులకు రోడ్లపై గంటల తరబడి పడిగాపులు తప్పలేదు. దీనికితోడు ఆషాఢ మాసంలోని శుక్రవారం కావడంతో మహిళలు పెద్ద ఎత్తున అమ్మవార్ల దేవాలయాలకు బయలుదేరారు. ఈ క్రమంలో జిల్లాలోని ఏ డిపోలో కూడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో వారు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వైద్యశాలలకు వెళ్లే రోగులు నానా అవస్ధలు పడ్డారు. ముఖ్యమంత్రి సభ సంగతి దేవుడెరుగు తమకు ఈ ఇబ్బందులు ఏమిటంటూ ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జిల్లా సమస్యలపై ప్రస్తావన శూన్యం
నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2200, గరిష్ట ధర రూ.4000, మోడల్ ధర రూ.3200 వరకు పలికింది. నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా స్థానిక కోడెల శివప్రసాదరావు క్రీడల స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన రుణ వితరణ సభలో జిల్లాలో నెలకొన్న సమస్యలకు స్థానం దక్కలేదు. సభలో మాట్లాడే అవకాశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు దక్కినా ఎక్కడా సమస్యలు ప్రస్తావించలేదు. పరిష్కరించమని అడగలేదు. అలాగే సభ ఒక గంట ఆలస్యంగా ప్రారంభమైంది. షెడ్యూలు ప్రకారం 11.25కు సీఎం నారా చంద్రబాబునాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభా ప్రాంగణానికి రావాలి. కానీ వారు 12.30కు వచ్చారు. సభా ప్రాంగణం 11గంటల సమయంలో కేవలం ముప్పావు వంతే జనాభాతో నిండింది. ఒకవైపు వరుస కుర్చీలు అన్నీ ఖాళీగానే ఉన్నాయి. జనాభా రాలేదనే కారణంతోనో ఏమోగాని శ్రీ చైతన్య కళాళాల నుంచి విద్యార్థులను రప్పించారు. వారందరూ కళాశాల బస్సులు దిగి లైనులో చేరుకున్నారు. 2003 డీఎస్సీ ప్రదాత సీఎంకు ధన్యవాదాలు అంటూ గట్టిగా ఒక 20 మంది వ్యక్తులు బ్యానర్, సీఎం ఫొటోలు పట్టుకొని సీఎం ప్రవేశించేందుకు నిర్దేశించిన మెయిన్‌గేటు వద్ద నిల్చున్నారు. వాహనంలో వచ్చిన సీఎం వారివైపు కూడకుండానే వెళ్లిపోయారు. అలాగే ఫ్రీ బస్సు సీ్త్ర శక్తి పథకానికి ఉపయోగించే పల్లెవెలుగు బస్సులనే జనాభా తీసుకొచ్చేందుకు ఉపయోగించారు. పట్టణంలో సభ జరుగుతుండగా, పలు వార్డుల నుంచి డ్వాక్రా మహిళలు, టీడీపీ కార్యకర్తలను అక్కడకు తీసుకొచ్చేందుకు బస్సులను ఉపయోగించారు. కిలో మీటరు, లేదా కిలోమీటరున్నర దూరంలో ఉన్న సభా ప్రాంగణానికి కూడా బస్సులు ఉపయోగించటం గమనార్హం. దీంతో గురువారం సాయంత్రం నుంచే ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే కూటమిలో భాగస్వామ్యమైన జనసేన సారథి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటో ఎక్కడా సభాప్రాంగణంపై కన్పించలేదు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములమైన తమ విషయంలో ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించలేదని జనసేన అభిమానులు విమర్శిస్తున్నారు. -
పాలకుల దాష్టీకం
తాడికొండ: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులు, తల్లిదండ్రులపై చంద్రబాబు ప్రభుత్వం దాష్టీకానికి దిగింది. పోలీసులను ఉసిగొల్పి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులను బెంబేలెత్తించింది. తమకు చదువు కావాలని బతిమాలుతూ ‘అయ్యా మా పిల్లలను రోడ్డున పడేయకండి.. చదువుకుంటారు. పాఠశాల ఉంచండి..’ అని అడిగినందుకు దళిత తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు చితకబాదారు. అనంతరం అరెస్టు చేసి స్టేషన్లో బంధించారు. ఇప్పటికే ఈ విషయంపై మూడు సార్లు రోడ్డెక్కి నిరసనలు తెలియజేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఇక కన్నీరే మిగిలింది. పేద విద్యార్థులకు అన్యాయం ఐఐటీ– జేఈఈ, నీట్ ఎక్స్‌లెన్స్ సెంటర్ల ఏర్పాటు పేరుతో ఇటీవల ప్రభుత్వం మంత్రివర్గ తీర్మానం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న మూడు గురుకుల పాఠశాలలను ఖాళీ చేయించి వాటిలో ఎక్స్‌లెన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసింది. వీటిని ప్రభుత్వమే నిర్వహిస్తుందా.. అంటే అదీ కాదు. పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. అనుకున్నదే తడవుగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు తాడికొండతోపాటు తిరుపతి జిల్లా కోట, విశాఖ జిల్లా మేఘాద్రి గడ్డలోని గురుకుల పాఠశాలలకు చెందిన 1,500 మంది విద్యార్థులను బలవంతంగా బయటకు పంపేందుకు రంగం సిద్ధం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశం ఏర్పాటు చేసి పేరుకు కూడా తెలియజేయలేదు. ఫోన్లు మాత్రమే చేసి ఇక్కడ గురుకుల పాఠశాల సెంటర్‌ను తీసివేస్తున్నారని, ఐఐటీ సెంటర్ వస్తున్నందున పిల్లలను తీసుకెళ్లాలని హుకుం జారీ చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద విద్యార్థులు విషయం ఏమిటా అని సోమవారం పాఠశాలకు చేరుకొన్నారు. విషయం తెలిసిన తర్వాత ఆవేదనతో నిరసన వ్యక్తం చేశారు. దీంతోపాటు ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తర్వాత విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసి సమాచారం తెలియజేయాలని చెప్పినా నిబంధనలు ఉల్లంఘించి పిల్లలను తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక రోడ్డెక్కారు. అండగా నిలిచిన వైఎస్సార్సీపీ బాధితులకు వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు అండగా నిలిచారు. గురువారం బాధితులతో కలసి పాఠశాలకు చేరుకొని పాఠశాలను తరలిస్తే సహించేది లేదని, ఐదు ఎకరాల విలువైన స్థలం ఉందని గుర్తుచేశారు. కావాలంటే భవనాలు నిర్మించుకోవాలని, కానీ పేదల ఉసురుపోసుకుంటే ఒప్పుకోబోమని హెచ్చరించారు. గురుకులాలను పూర్తిగా తొలగించి విద్యార్థులను రోడ్డుపాలు చేయడం తగదని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తల్లిదండ్రులను అమానుషంగా కొట్టి బెదిరించారన్నారు. విద్యార్థులను బయటకు పంపించేశారన్నారు. -
నీట్ ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం
గుంటూరు ఎడ్యుకేషన్: నీట్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని సంస్థ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. శుక్రవారం గుంటూరు లక్ష్మీపురంలోని సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గుంటూరు జోన్ నుంచి అఖిల భారతస్థాయిలో అన్ని కేటగిరీల వారీగా తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు కై వసం చేసుకున్నట్లు తెలిపారు. సీహెచ్ మోహన నాగశ్రీ సాయి అఖిల్ 115వ ర్యాంకు, కె.సిద్ధార్థ 164వ ర్యాంకు, షేక్ నిహాల్ పర్వేజ్ 935వ ర్యాంకు, ఏ. నికేత్ రామ్ చౌదరి 1514వ ర్యాంకు, బి. శశిధర్ 1620వ ర్యాంకుతో పాటు ఐదువేల లోపు 46 మంది, 10వేల లోపు 89 ర్యాంకులతో పాటు 179 మంది విద్యార్థినీ, విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించనున్నారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సంస్థ అకడమిక్ డైరెక్టర్ బొప్పన సుష్మ, ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్, ఏజీఎం ఎల్టీసీ శ్రీనివాస్, ఆయా క్యాంపస్‌ల ప్రిన్సిపాల్స్ అభినందనలు తెలియజేశారు. -
యాప్‌ను సద్వినియోగం చేసుకోండి
మాచర్ల: రాష్ట్రంలో అధికార పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అందర్నీ అణగదొక్కుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నందున ప్రతి కార్యకర్తతో పార్టీ నాయకత్వం అనుసంధానం అయ్యేలా జగన్ 2.0 యాప్‌ను మాజీ సీఎం జగన్ ప్రవేశపెట్టారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు. శుక్రవారం మాచర్లలోని క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలసి ఆయన యాప్ పోస్టర్ ఆవిష్కరించారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ నాయకులు అత్యంత దారుణంగా రాజకీయాలు చేస్తూ తమ పార్టీ వారిపై కుట్రలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ కంటెంట్‌ను డిలీట్ చేసి కుట్రలు పన్నుతున్న నేపథ్యంలోనే జగన్ 2.0 యాప్‌ను ఆవిష్కరించారన్నారు. అందర్నీ చైతన్యపరచి ఈ యాప్‌లో భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు తాడి వెంకటేశ్వరరెడ్డి, యరబోతుల శ్రీనివాసరావు, పల్లపాటి గురుబ్రహ్మం, బోయ రఘురామిరెడ్డి, అబ్దుల్ జలీల్, బూడిద శ్రీను, పోతురెడ్డి కోటిరెడ్డి, నల్ల వెంకటరెడ్డి, మందా సంతోష్, మాచర్ల సుందరరావు, షేక్ మస్తాన్, పిల్లి కొండలు, బూదాల మరియమ్మ, అల్లి జీవన్, మైనార్టీ నాయకులు అబ్దుల్ సత్తార్, చికెన్ బాజి, నాయకులు మోరా రామకృష్ణారెడ్డి, కొంగర సుబ్రహ్మణ్యం, కొండా శివలింగరాజు, ఇంద్ర గౌడ్, బాలమ్మ, అనంతరావమ్మ, కారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, చిన్న బద్రు, దుర్గ, డేగ శివ, వేల్పుల గురవయ్య, కొమ్ము వెంకటేశ్వర్లు (బొంగురు), పులిమెల మాణిక్యం, సభావత్ రవినాయక్, సుబ్రహ్మణ్యం నాయక్, వై. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానం ఇదీ.. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘జగన్ 2.0 సూపర్ యాప్’ అని టైపు చేయగానే వైఎస్ జగన్ చిత్రంతో కూడిన యాప్ కనిపిస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. అనంతరం సెల్ నంబరు, ఓటీపీ నమోదు చేయాలి. యాప్ వినియోగించే వారి పేరు నమోదు చేసుకుని, ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. తద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకోవచ్చు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి -
కనీ్నటి కస్తల
అచ్చంపేట: కస్తల రీచ్‌లోని ఇసుక అంటే ఓ బ్రాండ్. పెద్ద కట్టడాలు, వంతెనలు, అపార్టుమెంట్లు నిర్మించడానికి ఇక్కడి నుంచే ఇసుక తరలించేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిననాటి నుంచి గత రెండేళ్లుగా ఈ రీచ్ మూతపడింది. దీనినే నమ్ముకున్న కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారు. రూ.లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన పడవలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ పాడవుతున్నాయి. ఈ రీచ్ నుంచి హైదరాబాద్, చైన్నె వంటి మహా నగరాలకు ఇసుకను పెద్ద వాహనాల్లో తరలించేవారు. నది లోతుల్లో నుంచి ఇసుకను తోడుకుని వచ్చేందుకు గ్రామస్తులు ఒక్కో పడవను సుమారు రూ.10 లక్షల వ్యయంతో ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. ఒక్కో పడవలో లారీకి సరిపడా ఇసుకను అంటే 25 నుంచి 30 టన్నుల వరకు నింపవచ్చు. ఇలా తీసుకొచ్చి లారీలకు నింపేవారు. ఈ రీచ్ కేవలం కూలీలలతో మాత్రమే నడిచేది. నిబంధనలకు పాతర ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక రీచ్‌లలో యంత్రాలను ఉపయోగించకూడదు. కేవలం కూలీలతోనే ఇసుకను లోడ్ చేయాల్సి ఉంది. అందుకు కస్తల రీచ్‌లో వేల మంది కార్మికులు అడ్డుపడతారు కాబట్టి ఆ రీచ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా అనధికార క్వారీలకు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాది కోనూరు, అంబడిపూడి రీచ్‌లలో భారీ యంత్రాలు, గ్రిడ్జిస్ వినియోగించవచ్చన్న కారణంగా ఆ రీచ్‌లకు మాత్రమే బహిరంగవేలం నిర్వహించారు. అక్కడ అక్రమార్కుల ఆగడాలు ఎక్కువ కావడం, టీడీపీలోనే రెండు గ్రూపులు ఏర్పడి పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇప్పుడవీ మూతపడ్డాయి. చింతపల్లి రీచ్ నుంచి ఇసుక అక్రమ తరలింపు జరుగుతోంది. బడా రాజకీయ నాయకుల అండదండలతో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. అధికారులు నామమాత్రపు దాడులకే పరిమితం అవుతున్నారు. ఇసుక రీచ్‌ను నమ్ముకుని కస్తల గ్రామంలో 200కుపైగా పడవలను గ్రామస్తులు కొనుగోలు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంలోకి రీచ్ పూర్తిగా మూతపడిపోవడంతో పడవలన్నీ ఒడ్డుకే పరిమితమయ్యాయి. రెండేళ్లుగా వీటిని వియోగించకపోవడంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, వరదలు వచ్చినప్పుడు మునిగిపోతూ, చెదలు పట్టి దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. వెయ్యి మందికిపైగా పనిచేసే కార్మికులు ఉపాధి లేక వీధులపాలయ్యారు. రీచ్ వెలవెల ఒకప్పుడు వేల మంది ఇసుక కార్మికులతో, నిత్యం వచ్చిపోయే లారీలు, ట్రాక్టర్లుతో కళకళలాడే కస్తల రీచ్ ఇప్పుడు వెలవెలబోతోంది. కస్తల గ్రామానికి చెందినవారే కాకుండా కోనూరు, రుద్రవరం, ఓర్వకల్లు, చిగురుపాడు, కోగంటివారిపలెం, కొండూరు, నిండుజర్ల, ఊటుకూరు తదితర గ్రామాలకు చెందిన వారు ఇక్కడ పనిచేశారు. వారంతా ఉపాధి లేక, ఏం చేయాలో తెలియక, కుటుంబ పోషణ కష్టమై కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయాన్ని అనేకసార్లు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా మొర ఆలకించడంలేదని కార్మికులు వాపోతున్నారు. కస్తల రీచ్‌లో నిరుపయోగంగా పడవలు కస్తల రీచ్‌ని పునరుద్ధరించకపోవడంతో దీనిపైనే ఆధారపడిన వేల మంది కార్మికులకు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. రూ.లక్షల వ్యయంతో పడవలను కొనుగోలు చేసిన యజమానులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇకనైనా రీచ్ పునరుద్ధరించాలి. – షేక్ మహబూబ్ సుభాని, మాజీ సర్పంచ్, కస్తలకూటమి ప్రభుత్వం పుణ్యమా అని కస్తల ఇసుక రీచ్ మూతపడటంతో దీనిని నమ్ముకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వేల మంది కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారు. పక్క గ్రామాల నుంచి కూడా కార్మికులు వచ్చి ఈ రీచ్‌లో పనిచేసేవారు. వీరంతా కష్టాల పాలయ్యారు. – గుడేటి సలోమాన్, ఇసుక కార్మికుడు, కస్తల -
అత్తింటికి కన్నం వేసిన అల్లుడు అరెస్ట్
తెనాలి రూరల్: భార్య పుట్టింటికి వెళ్లి రాకపోతుండడంతో అత్తపై కోపం పెంచుకుని అత్తింటికి కన్నం వేసిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాయబ్‌రసూల్ వివరాలు వెల్లడించారు. మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన సుద్దపల్లి సుజాత మనవరాలు మంగళగిరి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోంది. మనవరాలి వద్దకు కుటుంబమంతా ఈ నెల 8వ తేదీన వెళ్లి, మరుసటి రోజు తిరిగి వచ్చారు. ఇంటికి వేసి ఉన్న తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెల్లి చూడగా ఇంట్లో ఉంచిన రూ. 10 వేల నగదు, సుమారు 70 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. పోలీసులను ఆశ్రయించగా రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చోరీకి పాల్పడింది సుజాత అల్లుడే అని నిర్ధారణకు వచ్చారు. సుజాత కుమార్తె శిరీష తన భర్త, బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడికి చెందిన అయ్యంకి పసితో కుటుంబ కలహాల నేపథ్యంలో కొలకలూరులోని పుట్టింటికి వచ్చింది. ఎన్నిసార్లు అడిగినా భార్య కాపురానికి రావడానికి నిరాకరిస్తోంది. ఇందుకు అత్త సుజాత కారణమని అల్లుడు కక్ష పెంచుకున్నాడు. 8వ తేదీన ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని చోరీకి పాల్పడ్డాడని సీఐ తెలిపారు. నిందితుని నుంచి చోరీ సొత్తు స్వాధీనపర్చుకున్నట్టు వివరించారు. సమావేశంలో ఎస్ఐ ఆనంద్, సిబ్బంది ఉన్నారు. -
సర్ లక్ష్యం ముస్లిం, క్రైస్తవ, దళితుల ఓట్లు తొలగింపే
నరసరావుపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరుతో ముస్లిం, క్రైస్తవ, దళిత, ఆదివాసీ, మహిళల ఓట్లు తొలగించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని మేలుకో ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ రమేష్ పట్నాయక్ ఆరోపించారు. కుల నిర్మూలనా పోరాట సమితి(కేఎన్పీఎస్) గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో కారంచేడు దళిత మృత వీరుల సంస్మరణ సభ శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విభాగమైన భారత ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థగా మారి అనేక రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించిందని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం రాక పూర్వం కేవలం ధనికులకు మాత్రమే ఓటు హక్కు ఉండేదని చెప్పారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతనే ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ వచ్చిందన్నారు. ప్రజలు నూటికి నూరు శాతం ఓట్లు వేసే పరిస్థితిని తొలగించి కొద్ది మంది ధనికులకు మాత్రమే ఓటు ఉండే విధంగా ఎన్నికల కమిషన్ పడరాని పాట్లు పడుతుందని దుయ్యబట్టారు. ఓటరు సవరణకు బదులుగా ఓట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేసిందని విమర్శించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోకపోతే ఓట్లు కోల్పోయిన వారి పౌరసత్వం కూడా రద్దయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓటు రద్దయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావన్నారు. హక్కులు కోల్పోయిన ప్రజలు జీవించడం కష్టతరమైన పని కనుక ప్రజల ఓట్లు తొలగించేందుకు సిద్ధమైన ఎన్నికల కమిషన్ కుట్రలను అడ్డుకుందామని పిలుపునిచ్చారు. కేఎన్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ మాట్లాడుతూ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను బలోపేతం చేస్తున్న పాలకులు పీడిత కులాల ప్రజలపై నిరంతరం దాడులు, దౌర్జన్యాలకు పాల్పడే అగ్రకుల హంతకమూకలకు అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. హిందూ రాష్ట్ర స్థాపనే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చి దాని స్థానంలో ఆధునిక మనుస్మృతిని రాజ్యాంగంగా అమలు చేయాలని ఉవ్విళ్లూరుతుందన్నారు. కేఎన్పీఎస్ జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి బి.కొండారెడ్డి, కేఎన్పీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఓర్సు శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు గొల్లపూడి చిన్నప్రసాద్, సహాయ కార్యదర్శి జక్కా బ్రహ్మయ్య పాల్గొన్నారు. కారంచేడు దళిత మృతవీరుల సంస్మరణ సభలో రమేష్ పట్నాయక్ -
రెడ్‌బుక్ రాజ్యాంగంతో ప్రాణాలు తీస్తారా
● ఇదేనా ప్రజాస్వామ్యం.. ఎన్నాళ్లీ దుర్మార్గం ● దరియా హుస్సేన్ ఆత్మహత్య చేసుకునేలా పోలీసుల వేధింపులు ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకష్ణారెడ్డి మాచర్ల: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని మైనార్టీ నేతలతో కలసి విలేకరులతో మాట్లాడారు. పిన్నెల్లి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు పెట్టి పోలీసులతో వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తూ పరోక్ష హత్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే పిడుగురాళ్ల పట్టణానికి చెందిన షేక్ దరియాహుస్సేన్ ఆత్మహత్యకు పాల్పడేటట్లు పోలీసులు చర్యలు ఉన్నాయని చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటూ దరియా మరణ వాంగ్మూలంలో పిడుగురాళ్ల సీఐ ఆత్మహత్యకు కారణమని చెప్పినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. టీడీపీ వారు దందాలు చేస్తూ వాటిని తప్పించుకునేందుకు నిత్యం ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను అత్యంత దారుణంగా వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు. సివిల్ కేసు కోర్టు పరిధిలో ఉండగా దరియా హుస్సేన్‌ను ప్రతి రోజూ పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావు పోలీసు స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారన్నారు. ఈ విధంగా గురజాల నియోజక వర్గంలో దారుణంగా అక్రమ కేసులు పెట్టి పలు గ్రామాల్లో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులను తరిమికొట్టేలా పోలీసు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా పోలీసు అధికారులు పట్టించుకోకపోవటం దారుణమన్నారు. ఇప్పటికై నా ఈ విషయమై పూర్తి స్థాయిలో విచారణ జరిపి మైనార్టీ ఉద్యోగి దరియా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకొని అధికార పార్టీ అరాచకాలుపై దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. దరియా కుటుంబానికి న్యాయం చేసే వరకు వైఎస్సార్ సీపీ మద్దతిస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో షేక్ అబ్దుల్ జలీల్, మస్తాన్‌వలి, ముస్తాఫా, బాజీ, అబ్దుల్ సత్తార్, చిన్నబద్రు, ట్రాక్టర్ కరిముల్లా, నాగూర్‌వలితో పాటు పలువురు నాయకులున్నారు. -
మూలాంకురేశ్వరికి విశేష పూజలు
ఫిరంగిపురం: మండలంలోని అమీనాబాద్ గ్రామంలోని మూలాంకురేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాస శుక్రవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు అయ్యన్నశాస్త్రి, కార్తీక్శాస్త్రిలు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం విశేషంగా అలంకరించారు. పసుపు, కుంకుమలతో లలిత అష్టోత్తర, సహస్రనామ అర్చనలు చేశారు. ముఖమండపంలో ఉన్న శ్రీచక్రానికి ఖడ్గమాల స్త్రోత్రంతో కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన బగళాముఖి అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం మూడవ రోజున అమ్మవారు శాఖాంబరి వారాహిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శాఖాంబరి దేవి అలంకరణ కోసం సుమారు 800 కిలోల పలు రకాల కూరగాయలు, పండ్లు వినియోగించారు. మూడవ రోజున రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రదక్షిణలు చేశారు. నవరాత్ర మహోత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు వారాహి హోమం విశేష పూజలు నిర్వహించారు. చందోలు గ్రామానికి చెందిన సుమారు 60 మంది ఆర్యవైశ్య మహిళలు సాంప్రదాయ బద్ధంగా సారెలు, పూజా ద్రవ్యాలు శిరస్సున ధరించి మంగళ వాయిద్యాలతో శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని విశేష పూజల అనంతరం అమ్మవారికి సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఒంగోలుకు చెందిన తెల్లపాటి శ్రీనివాసరావు, కనకదుర్గ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 20న జగన్నాథ రథయాత్ర తెనాలి టౌన్: ఇస్కాన్ టెంపుల్ తెనాలి ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన పట్టణంలో శ్రీశ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. స్థానిక నాజరుపేటలోని టెంపుల్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ ఇన్చార్జి సింహ గౌరదాస్ వివరాలను తెలిపారు. 20వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు పట్టణ శివాజీచౌక్‌లో ఇందుకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 2 గంటల నుండి శ్రీశ్రీ జగన్నాథ రఽథయాత్ర మహోత్సవం ప్రారంభమవుతుందని వెల్లడించారు. శివాజీచౌక్, గాంధీచౌక్, నెహ్రూ రోడ్డు, లక్ష్మీ డీలక్స్ రోడ్డు, మెయిన్ రోడ్డు మీదుగా బోసురోడ్డులోని శ్రీకన్యకాపరమేశ్వరి దేవస్థానం వరకు రథయాత్ర జరుగుతుందని చెప్పారు. దేవాలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనం, 108 పదార్థాలతో భోగ నివేదన, మహా హారతి ఉంటాయని తెలిపారు. అన్నప్రసాద వితరణ ఉంటుందని వివరించారు. ఆలయ కమిటీ సభ్యులు అప్పారావు, శ్రీనివాసరెడ్డి, ప్రసాద్, గోపాలకృష్ణ, కార్తీక్ తదితరులున్నారు. దుర్గమ్మకు ఆషాఢ సారె మంగళగిరి టౌన్: పట్టణంలోని బైపాస్‌రోడ్‌లో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలోని శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆంజనేయ కాలనీ భక్తబృందం శుక్రవారం సారె సమర్పించింది. కాలనీలోని ప్రధాన సెంటర్ నుంచి మహిళలు సారెతో ఊరేగింపుగా వచ్చారు. మేళతాళాలు, కనక తప్పెట్ల మధ్య ఊరేగింపు భక్తి శ్రద్ధలతో సాగింది. ఆయా వీధుల్లోని వారు సారెకు భక్తి శ్రద్ధలతో నీరు వారబోశారు. అనంతరం ఊరేగింపు ఆలయం వరకు చేరుకుంది. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో భక్తబృందం ప్రతినిధులు మల్లేశ్వరి, అంజలి, సత్యవతి, లేఖ, సుజాత, వాణి పాల్గొన్నారు. -
తెనాలి పోలీసులపై క్రమ శిక్షణ చర్యలు
● ఇద్దరు కానిస్టేబుళ్ల బదిలీ, డీఎస్పీ సహా అధికారులకు మెమోలు ● ‘సాక్షి’ కథనానికి స్పందన తెనాలిరూరల్:తెనాలి పోలీసు లపై అక్రమ వసూళ్లు, అవినీతి దందాల ఆరోపణలు హెచ్చుమీరుతున్న నేపథ్యంలో పోలీ సు ఉన్నతాధికారులు చర్యల కు శ్రీకారం చుట్టారు. ‘పేరుకే పోలీసు.. చట్టం అంటే అలుసు’ పేరిట ఈ నెల 10వ తేదీన తెనాలిలో పోలీసుల వ్యవహారాన్ని కళ్లకుకట్టినట్టు చెబుతూ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. పేకాట దందాలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న అరోపణలతో వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ ఎం. రమేష్‌ను కాకుమాను స్టేషన్‌కు, తెనాలి రూరల్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ డి.రవిని ఫిరంగిపురం బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ శుక్ర వారం ఉత్తర్వులు జారీ చేశారు. తెనాలి డీఎస్పీ బి.జనార్ధనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్.సాంబశివరావు, వన్ టౌన్ సీఐ సీహెచ్.రాంబాబు, రూరల్ ఎస్ఐ కె.ఆనంద్‌లకు చార్జ్ మెమోలు జారీ చేసిన ట్టు తెలిసింది. వేరే మహిళతో సహజీవనం చేస్తూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇల్లు మార్చిన సీఐ ప్రస్తుతం ఎక్కడ అద్దెకు తీసుకున్నారన్న అంశాన్ని విచారిస్తున్నట్టు తెలిసింది. -
రాజధాని రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యం
గుంటూరు వెస్ట్: రాజధాని ప్రాంత రైతుల ప్రయోజనాలను కాపాడుతూ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల సహకారంతో పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ లేదా ల్యాండ్ పూలింగ్ విధానంపై రైతులతో మంత్రి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ , జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, సీ ఆర్ డీఏఎ అడిషనల్ కమిషనర్లు భార్గవ్ తేజ, కార్తీక్, సంబంధిత శాఖల అధికారులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైల్వే శాఖ ప్రారంభంలో మార్కెట్ ధర ప్రకారం భూసేకరణ చేపట్టాలని నిర్ణయించిందన్నారు. అయితే భూసేకరణ వల్ల తాము నష్టపోతామని, దానికి బదులుగా ల్యాండ్ పూలింగ్ విధానంలోనే భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్థానిక రైతులు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. రైతుల విజ్ఞప్తిని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, రైతులతో నేరుగా చర్చించి వారి అభిప్రాయం మేరకే ముందుకు సాగాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి వెల్లడించారు. ఆ మేరకు రైతులతో ఉమ్మడి సమావేశం నిర్వహించి, భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ విధానాలపై ఉన్న సందేహాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సమగ్రంగా నివృత్తి చేశారని చెప్పారు. రైతులందరికీ పూర్తి అవగాహన కల్పించి, వారి అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు త్వరలోనే గ్రామ సభ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డిఓ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాలి జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి.నారాయణ -
కోవిడ్ కేసులపై భయపడాల్సిన పనిలేదు
మంగళగిరి రూరల్: మంగళగిరిలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్ )లో కోవిడ్ కేసు నమోదయిందంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అయిన విషయంపై ఎయిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ రాకేష్ గురువారం స్పందించారు. కోవిడ్ కేసులపై ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ఎయిమ్స్‌లో ఎవరూ కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా ఔట్ పేషెంట్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఇద్దరు డాక్టర్లను ప్రత్యేకంగా నియమించామన్నారు. కోవిడ్ రోగుల కోసం ముందస్తు జాగ్రత్త చర్యగా 10 బెడ్లతో సపరేటు వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. గుంటూరు మెడికల్: విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు గుంటూరు వైద్య కళాశాల మెన్స్ హాస్టల్లో టేబుల్ టెన్నిస్ కోర్టును ప్రారంభిస్తున్నట్లు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి చెప్పారు. గురువారం అమరావతి రోడ్డులోని మెన్స్ మెడికల్ హాస్టల్లో రూ. 2.50 లక్షలతో ఏర్పాటు చేసిన టేబుల్ టెన్నిస్ పరికరాలను ఆయన ప్రారంభించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శివగోపాల్, ఫిజికల్ డైరెక్టర్ అజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. రెంటచింతల: పూర్వీకులు నిర్మించిన ఆలయాలు మన చరిత్రకు సజీవ సాక్ష్యాలని పల్నాడు జిల్లా దేవదాయ శాఖ అధికారి జీఏవీ శ్రీనివాసు అన్నారు. గురువారం తుమృకోట గ్రామంలోని పాత శివాలయం పునర్నిర్మాణానికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మంజూరైన రూ. 15 లక్షల చెక్కును ఆయన ఆలయ కమిటీ వారికి అందజేసి మాట్లాడారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలించిన తుమృకోట గ్రామంలో సుమారు 400 సంవత్సరాల చరిత్ర కిందట నిర్మించిన పాత శివాలయం శిథిలమైనట్లు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యుల కృషి మేరకు రూ. 15 లక్షల నిధులను టీటీడీ శ్రీ వాణి ట్రస్ట్ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. మండల దేవదాయ శాఖ అధికారి గాదె రామిరెడ్డి, ఆలయ అధ్యక్షుడు జంగాల వెంకటే శ్వర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: టెట్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఇన్ సర్వీసు ఉపాధ్యాయుల ప్రయోజనార్ధం ఈనెల 19న గుంటూరులోని ఏసీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి తెలుగు సబ్జెక్టుపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్ తెలిపారు. గురువారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో అవగాహన తరగతుల పోస్టర్ విడుదల చేశారు. నెల్లూరుకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు ఆర్.వెంకట్రావు తరగతులు బోధిస్తారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పాల్గొని జిల్లాల విభజనపై తాజా సమాచారాన్ని తెలియజేస్తారని పేర్కొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, బి.ప్రసాద్, కె.రంగారావు, కె.కేదార్నాథ్, శ్రీధర్ పాల్గొన్నారు. -
హామీలు మరచినారా?
ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్యల స్వాగతం శుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026సాక్షి, నరసరావుపేట: హామీలివ్వడం వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ఓటర్లను మభ్యపెట్టడం ఆయన నైజం. మెగా రుణమేళా పేరిట నరసరావుపేట కోడెల శివప్రసాద్‌రావు స్టేడియంలో నేడు నిర్వహించనున్న కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్న నేపథ్యంలో ఎన్నికల ముందు బాబు ఇచ్చిన హామీలను ఈ ప్రాంత ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. వరికపూడిశెలకు తట్టెడు మట్టీ ఎత్తలేదు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా హామీలను అమలుచేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు ప్రజల చిరకాల కోరికై న వరికపూడిశెల ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. ఇలాంటి ప్రాజెక్టు చంద్రబాబుకు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొస్తుంది. అధికారంలోకి వస్తే వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మిస్తామంటారు...వచ్చిన తర్వాత ఆ మాటే మర్చిపోతారు. చంద్రబాబు నాయుడు అయితే పల్నాడు వాసుల ఓట్లకోసం వరికపూడిశెలకు ఏకంగా రెండుసార్లు శంకుస్థాపన చేసి ఈ ప్రాంతప్రజలను మభ్యపెట్టేశారు. యువగళం పేరిట పాదయాత్ర చేసిన నారాలోకేష్ వినుకొండ నియోజకవర్గం కొండ్రముట్ల వద్ద వరికపూడిశెల ప్రాజెక్టు హామీనిస్తూ శిలాఫలకాన్ని సైతం ఆవిష్కరించడం గమనార్హం. 2024 ఎన్నికల్లో గెలిస్తే ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని రెండేళ్లు అవుతున్నా కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదంటూ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. సుమారు 1.25 లక్షల ఎకరాలకు సాగు, లక్షమందికి తాగునీరు అందించే విధంగా డీపీఆర్‌ను రూపొందించి అవసరమైన కేంద్ర అనుమతులను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. 2023 నవంబర్‌లో ఈప్రాజెక్టు పనులను సైతం ప్రారంభించారు. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ ప్రాజెక్టు పనులను పక్కన పెట్టారంటూ వైఎస్సార్ సీపీ, కమ్యూనిస్ట్ నేతలు ఆరోపిస్తున్నారు. కౌలు రైతులకు మొండిచెయ్యి మరోవైపు జిల్లాలో నేడు పంపిణీ చేయనున్న రుణాల్లో కౌలు రైతులకు న్యాయం జరగడం లేదు. జిల్లా వ్యాప్తంగా 70 వేల మంది కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు పంపిణీ చేయాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 8,057 మందికి మాత్రమే కార్డుల పంపిణీ జరిగింది. దీంతో అర్హులైన కౌలు రైతులు కార్డులు అందక పెట్టుబడి రుణాలు, బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వివిధ రాయితీలను కోల్పోతున్నారు. అభివృద్ధి జాడేలేని నరసరావుపేట నరసరావుపేట రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రంలో కీలకంగా ఉన్నామని చెప్పుకునే టీడీపీ పార్లమెంటరీ నేత లావు కృష్ణదేవరాయలు ఎంపీగా ఉన్న నరసరావుపేటలో రైల్వే స్టేషన్ పనులను రైల్వే శాఖపై ఒత్తిడి తెచ్చి పూర్తి చేయించడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా రెండో ఫ్లాట్ ఫామ్‌లో రైలు ఎక్కడ ఆగుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా రెండో ఫ్లాట్ ఫామ్‌లో డిజిటల్ బోర్డులు సైతం ఏర్పాటు చేయలేకపోతున్నారు. ● ఆటోనగర్ ఏర్పాటు సమస్య పట్టణంలో దీర్ఘకాలంగా ఉంది. గత ప్రభుత్వం కేసానుపల్లి సమీపంలోని ప్రభుత్వ భూములను ఏపీఐఐసీకి అప్పగించి ఆటోనగన్ర్ శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దీని ఊసే ఎత్తడం లేదు. ● శ్రీకృష్ణ చిత్రాలయ థియేటర్ వద్ద ఆర్యూబీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. దీనివల్ల పట్టణంలోని ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ● మరోవైపు జిల్లా కేంద్రంలో ముఖ్యమైన రహదార్లను విస్తరించకపోవడంతో నిత్యం ప్రజలు తీవ్ర ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఏళ్లుగా భూ హక్కుల కోసం పోరాడుతున్న లింగంగుంట్ల ప్రజల సమస్యను మఠం, కోర్టులతో సంప్రదించి పరిష్కరించాల్సి ఉంది. అయితే ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేదు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలసి నేడు నరసరావుపేటలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తుచేసుకుంటున్న పేట ప్రజలు ఆటోనగర్ ఏర్పాటు హామీపై దృష్టి పెట్టని బాబు సర్కార్ తీవ్ర ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు రోడ్ల విస్తరణ, ఆర్యూబీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ కోటప్పకొండ రోప్వేకు 2016లో శంకుస్థాపన నేటికీ అందుబాటులోకి రాని వైనం కోటప్పకొండ గిరిప్రదక్షిణ రోడ్డు మంజూరు చేసినట్టు ప్రకటించి మరచిన కూటమి ప్రభుత్వం -
రోప్‌వేపై హోప్స్ ఏవీ?
కోటప్పకొండను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఇందులో భాగంగా రోప్‌వేను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు 2016లో ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించారు. కోటప్పకొండ దిగువున నల్లచెరువు నుంచి కొండ పైకి యాత్రికులు చేరుకునే విధంగా రోప్‌వేను నిర్మించే పనులకు 2016లో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పీపీపీ పద్ధతిలో పలు సంస్థలు రోప్‌వే ఏర్పాటుకు ముందుకు వచ్చినా టీడీపీ నాయకుల కమీషన్లకు భయపడి ప్రారంభించిన పనులు మధ్యలోనే నిలిపి వెళ్లిపోయారు. ఇప్పుడు మరోసారి సీఎం హోదాలో నరసరావుపేటలో చంద్రబాబు పర్యటించనున్నారు. రోప్‌వే నిర్మాణంపై చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఏడాది జనవరి 22 పర్యటిస్తూ కోటప్పకొండ గిరిప్రదక్షిణ రోడ్డు మంజూరు చేసినట్టు ప్రకటించారు. ఆరు నెలలు గడిచినా ఇప్పటివరకు ఆ పనులు పట్టాలెక్కలేదు. -
దరియాహుస్సేన్ ఆత్మహత్య బాధాకరం
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణానికి చెందిన షేక్ దరియా హుస్సేన్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ జానీ అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయం లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఆత్మహత్యకు సీఐ శ్రీరామ్ వెంకట్రావు కారణమంటూ దరియా హుస్సేన్ మరణ వాంగ్మూల లేఖలో పేర్కొన్నారని, దరియా హుస్సేన్ ఆత్మహత్యకు కారకుడైన సీఐ శ్రీరామ్ వెంకట్రావు పై వెంటనే శాఖా పరమైన చర్యలు తీసుకోవాల న్నారు. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి మాట్లాడుతూ దరియా హుస్సేన్ ఆత్మహత్య చేసుకోవడానికి సీఐ శ్రీరామ్ వెంకటరావు కారణమని, సివిల్ కేసు కోర్టులో ఉండగా దరియా హుస్సేన్‌ను రోజు పోలీస్‌స్టేషన్‌కు పిలిచి చిత్రహింస లకు గురి చేశారన్నారు. చిత్రహింసలు తట్టుకోలేకనే దరియా హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. సీఐ శ్రీరామ్ వెంకట్రావు పై శాఖాపరమైన చర్యలు తీసుకొని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ మాబూ హుస్సేన్, దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గోర, మైనార్టీ సెల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ ఖాసిం, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు షేక్ ముక్త్యార్, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ బాషా, నాయకులు షేక్ మహిబ్, అలీ ఆజాం, తదితరులు ఉన్నారు. దరియా హుస్సేన్ కుటుంబానికి పరామర్శ పిడుగురాళ్ల: పోలీసుల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న దరియా హుస్సేన్ కుటుంబాన్ని గురువారం ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్, మైనార్టీ హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ మహ్మద్ ఫార్కూ షుబ్లీ పరామర్శించారు. దరియా హుస్సేన్ భార్య అమిరుషా బేగం, కుమారులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకుంటామని, అండగా ఉంటామని ఆయన చెప్పారు. ఆయన వెంట ముస్లిం పెద్దలు పలువురు పాల్గొన్నారు. దరియా హుస్సేన్ ఆత్మహత్యపై కేసు పిడుగురాళ్ల: పిడుగురాళ్ల పట్టణంలో షేక్ దరియా హుస్సేన్ పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. అయితే ఈ కేసులో దరియా వలి భార్య అమిరునిషాబేగం ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అమిరునిషా బేగంకు ఇల్లు అమ్మిన పులుకూరి లక్ష్మీ, ప్రశాంత్‌ల వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదు చేయటంతో దాచేపల్లి సీఐ ఖాజావలి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ ఎం. మోహన్తెలిపారు. -
వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర కార్యదర్శిగా మణిబాబు
నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సత్తెనపల్లికి చెందిన చిన్నం మణిబాబును లీగల్‌సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాచర్లకు చెందిన మేరాజ్యోత్ హనుమానాయక్‌ను పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి మాచర్ల: పట్టణంలోని గుర్తు తెలియని వ్యక్తి గురువారం తెల్లవారు జామున బస్టాండ్ ఎదురు వెంగమాంబ కాంప్లెక్స్ వద్ద మృతి చెందాడు. సుమారు 42 సంవత్సరాలు కలిగిన వ్యక్తి అపస్మారక స్థితిలో మృతిచెందినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని పట్టణ పోలీసులు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్టు వారికి తెలుపగా పోలీసుల సహకారంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎవరైనా స్నేహితులు, బంధువులు సంబంధిత వ్యక్తిని గుర్తుపడితే మాచర్ల పట్టణ పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలన్నారు. స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రి మార్చురికి చేర్చారు. ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్టు నూజండ్ల: ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇరువురు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు ఐనవోలు ఎస్సై బి.వి.కృష్ణారావు గురువారం తెలిపారు. పల్నాడు జిల్లా పరిధిలో ఇటీవల ద్విచక్రాల చోరీ అధికమవుతున్నట్లు పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడమైందని అన్నారు. సీఐ బి.బ్రహ్మయ్య ఆదేశాలతో సిబ్బందితో కలిసి ముప్పరాజువారిపాలెం గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న ఇరువురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారించటం జరిగిందన్నారు. గ్రామానికి చెందిన దుర్గంపూడి సుబ్బారావు, నందిగం వెంకటశివయ్యలుగా గుర్తించామన్నారు. వివిధ సంఘటనల్లో ఆరు ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు వారు అంగీకరించటంతో కేసు నమోదు చేసిన ట్లు తెలిపారు. కారెంపూడిలో ఐపీ దాఖలు చేసిన వ్యాపారి కారెంపూడి: ఒక వ్యాపారి రూ. కోటిన్నరకు పైగా ఇన్సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) దాఖలు చేశారని సమాచారం గురువారం రాత్రి సంచలనం రేపింది. సదరు వ్యాపారి 22 మంది వద్ద మొత్తం రూ. 1,52,50,000లు అప్పుగా తీసుకుని వారందరికి ప్రాంసరీ నోట్లు రాసిచ్చారు. వారందరికి కూడా ఐపీ నోటీసులు సిద్ధం చేసినట్లు సమాచారం. అప్పు చెల్లించాలని అడుగుతున్నవారికి అప్పు చెల్లిస్తానని చెబుతూ వచ్చి తీరా ఐపీ దాఖలు చేయడంతో అప్పులిచ్చినవారంతా ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి, పొదుపు పథకాలు నడుపుతున్నాడనే నమ్మకంతో వ్యాపారులు అతనికి కూడా లక్షల్లో అప్పులిచ్చారని తెలుస్తోంది. సినీ రచయిత కోన వెంకట్‌కు మాతృ వియోగం బాపట్ల: సినీ రచయిత నిర్మాత కోన వెంకట్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కోన ధర్మావతి (82 )బుధవారం రాత్రి వైజాగ్‌లో కన్నుమూశారు. ఆమె మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి వదిన. ధర్మావతి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
అమ్మోనియా భద్రతపై అవగాహన
కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు, ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఫ్యాక్టరీల శాఖ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు జీటీ రోడ్‌లోని టుబాకో అసోసియేషన్ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు 81 ఫ్యాక్టరీల యాజమాన్యాలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్‌లలో వినియోగించే అమ్మోనియా గ్యాస్ అత్యంత ప్రమాదకరమైనదని, అందువల్ల భద్రతా ప్రమాణాలను ఏ మాత్రం విస్మరించరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా కంప్రెసర్ గదుల్లో ఉన్న అమ్మోనియా నిల్వ ట్యాంకులను బయట ఏర్పాటు చేయడం ద్వారా భారీ ప్రమాదాలను సమర్థంగా నివారించవచ్చని తెలిపారు. గ్యాస్ లీకేజీలు, పేలుళ్లు వంటి ప్రమాదాలు సంభవించకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జీరో ప్రమాద మరణాలే లక్ష్యం.. కోల్డ్ స్టోరేజ్‌ల అసోసియేషన్ అధ్యక్షుడు సురేంద్రబాబు మాట్లాడుతూ శివకుమార్ రెడ్డి చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, శిక్షణల వల్లే పరిశ్రమల యాజమాన్యాల్లో భద్రతపై స్పష్టమైన అవగాహన ఏర్పడిందని చెప్పారు. ఈ చైతన్యమే అమ్మోనియా ట్యాంకుల స్థాన మార్పుతో పాటు భద్రతా ప్రమాణాల అమలుకు దోహదపడిందన్నారు. సదస్సులో కోల్డ్ స్టోరేజ్ అసోసియేషన్ కార్యదర్శి రాఘవయ్య, అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి, వివిధ సంస్థల సేఫ్టీ అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలు, భద్రతా ప్రతినిధులు పాల్గొన్నారు. -
డీఎస్ఏ స్టేడియంలో వి‘ధ్వంస’రచన
● ఒక్కరోజు సీఎం, కేంద్ర మంత్రి పర్యటన కోసం పలు క్రీడా కోర్టులు కూల్చివేత ● ఆరుచోట్ల స్టేడియం ప్రహరీకి తూట్లు ● డ్రైనేజీ కనిపించకుండా రూ.లక్షల వ్యయంతో పరదాలు ● మళ్లీ స్టేడియంలో సౌకర్యాల కల్పనకు రూ.లక్షల్లో బిల్లులు నరసరావుపేట: క్రీడాకారులు, క్రీడా ప్రేమికులు ఎంతో అనుబంధం పెంచుకున్న జిల్లా స్పోర్ట్స్ అకాడమీ క్రీడల (కోడెల) స్టేడియం.. సీఎం చంద్రబాబు రాకతో ధ్వంసం అవుతోంది. అరకొర సౌకర్యాలున్నా.. నెట్టుకొస్తున్న ఈ స్టేడియానికి చిక్కులు వచ్చి పడుతున్నాయి. శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన కోసం ధ్వంసం చేసి మరీ ఏర్పాట్లు చేశారు. స్టేడియానికి ఎదురుగా ఉన్న ప్రహరీని ఆరుచోట్ల పగలగొట్టి వీఐపీ, పబ్లిక్ అంటూ రాకపోకలకు మార్గాలు ఏర్పాటు చేశారు. స్టేడియం లోపల ఉన్న క్రికెట్ ఆడే పిచ్‌లు, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్‌ల కోర్టులను ధ్వంసం చేస్తూ ముఖ్య అతిథులు, కార్యక్రమం కోసం వచ్చే వారు కూర్చునేందుకు పెద్ద జర్మన్ గుడారాలను నిర్మించారు. అలాగే స్టేడియానికి ఎదురుగా రోడ్డు మార్జిన్లో చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్న స్టాళ్లను తొలగించి వారి జీవనోపాధిని దెబ్బగొట్టారు. ఆ మార్గంలో పలు షాపుల ముందు నిర్మించుకున్న మెట్లు, ఇతర కట్టడాలను తొలగించారు. అలాగే స్టేడియానికి పట్టణంవైపున రాకపోకలు చేసే ముఖ్య అతిథులు, ప్రజలకు కత్తవ డ్రైనేజ్ కన్పించకుండా సుమారు రూ.లక్ష వ్యయంతో తెరలు ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి సత్తెనపల్లి రోడ్డు నుంచి స్విమ్మింగ్‌పూల్ వైపున ప్రవేశించే మార్గంలో ఉన్న పెద్దగేటును పెకిలించి స్టేడియం ఆవరణలో పడేశారు. స్టేడియం ఏర్పాటై సుమారు 24ఏళ్లు గడుస్తోంది. ఈ కాలంలో స్టేడియం ఆవరణలో గతంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. వాటికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు, ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యం లాంటి వీవీఐపీలు ఎందరో పాల్గొన్నారు.. అయితే స్టేడియంలో సౌకర్యాలను మాత్రం ధ్వంసం చేస్తూ ఏర్పాట్లు చేయటం ఇదే తొలిసారని అధికారులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ధ్వంసమైన సౌకర్యాలు మళ్లీ పునరుద్ధరించాలంటే లక్షల ప్రజాధనం ఖర్చు చేయాల్సిందే. ముఖ్యమంత్రి పాల్గొనే ప్రతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 నుంచి రూ. 6 కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. -
వినుకొండలో పట్టపగలే చోరీలు
ఒకే రోజు నాలుగు ఇళ్లలో..వినుకొండ: వినుకొండ పట్టణంలో గురువారం ఒకే రోజు నాలుగు ఇళ్లలో వరుస దొంగతనాలు జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దొంగలు పట్టపగలే తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బీరువాలు పగలగొట్టి, భారీగా నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. స్థానిక కొత్తపేట ఐదో లైను, ట్రాన్‌న్స్‌ఫార్మర్ బజారుతో పాటు, కాలువ కట్టపై ఉన్న రెడ్డి నగర్ సమీపంలోని మూడు ఇళ్లలో ఈ చోరీలు జరిగాయి. కొత్తపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆవుల సుబ్బారెడ్డి ఇంట్లోకి చొరబడిన దొంగలు, బీరువా తాళాలు పగలగొట్టి సుమారు పది తులాల బంగారం, లక్ష రూపాయల నగదును అపహరించుకుపోయారు.మరో మూడు ఇళ్లలోనూ దొంగలు అదే పద్ధతిలో తాళాలు, బీరువాలు పగలగొట్టి విలువైన వస్తువుల కోసం వెతికారు. ఇళ్లలోని సామాన్లను, బట్టలను గదుల నిండా చెల్లాచెదురుగా పడేశారు. ఆ ఇళ్లలో జరిగిన నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే రోజు, అది కూడా పట్టపగలే నాలుగు ఇళ్లలో దొంగతనాలు జరగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే వినుకొండ పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకున్నారు. దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించి, వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దించి దర్యాప్తును ముమ్మరం చేశారు. -
గుంటూరు వైద్యురాలి ఘనవిజయం
గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన సీనియర్ న్యూరాలజిస్ట్, లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పమిడిముక్కల విజయ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 18 మంది వైద్యులను మాత్రమే ఎంపిక చేసే వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్‌కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఎంపికై రికార్డు సృష్టించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్‌కు ఎంపికై న మొట్టమొదటి వ్యక్తిగా డాక్టర్ విజయ రికార్డు సృష్టించారు. బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు అందిస్తున్న చికిత్సలకు, పక్షవాత బారిన పడకుండా ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలకు, బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సల్లో వైద్యులు, సిబ్బందికి లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన అంకినీడు స్ట్రోక్ సెంటర్ ద్వారా అందిస్తున్న అత్యుతన్నత వైద్య ప్రమాణాలకు అంతర్జాతీయ గౌరవం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలిగా ఆమె పనిచేసి రికార్డు సృష్టించారు. 1996 నుంచి సేవలు ఉమ్మడి ఏపీలోనే మొట్టమొదటిగా, దేశంలో రెండవదిగా 1996లో గుంటూరులో అంకినీడు స్ట్రోక్ సెంటర్‌ను డాక్టర్ విజయ ఏర్పాటు చేశారు. పక్షవాత ( బ్రెయిన్ స్ట్రోక్) చికిత్సలో అత్యున్నత ప్రమాణాలు, నాణ్యమైన వైద్యసేవలు అందించటంలో అంకినీడు స్ట్రోక్ సెంటర్ చూపుతున్న నిరంతర కృషికి గాను ఇటీవల జాతీయ అవార్డు లభించింది. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఏజెంల్స్ ఇనిస్టిట్యూట్ డైమండ్ స్టేటస్ అంతర్జాతీయ అవార్డు స్ట్రోక్ సెంటర్‌కు, డాక్టర్ విజయకు 2020 నుంచి 2025 వరకు వరుసగా ఐదుసార్లు లభించింది. తాత మరణం కలచివేసింది.. ఈ సందర్భంగా డాక్టర్ పి.విజయ ‘సాక్షి’తో మాట్లాడుతూ నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో తాత అంకినీడుకు పక్షవాతం వచ్చి సకాలంలో చికిత్స ఎక్కడా లభించక చనిపోయారని, కళ్లెదుటే ఆయన మరణం చూసి తట్టుకోలేక బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు నివారించాలని మనస్సులో గట్టిగా నిర్ణయించుకున్నానని తెలిపారు. తదనుగుణంగా న్యూరాలజిస్ట్‌గా సేవలు ప్రారంభించానని తెలిపారు. ఉమ్మడి ఏపీలోనే మొట్టమొదటిగా, దేశంలో రెండవదిగా మా తాత అంకినీడు పేరు మీదుగా 1996లో గుంటూరులో పక్షవాత మరణాలు నివారణే లక్ష్యంగా స్ట్రోక్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. అంకినీడు స్ట్రోక్ సెంటర్ డైరక్టర్‌గా ఉన్న తాను ప్రతినెలా 100 నుంచి 125 మంది స్ట్రోక్ బాధితులకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వరల్డ్ స్ట్రోక్ అసోసియేషన్‌కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఎంపికవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి స్ట్రోక్ మరణాలు తగ్గింపే లక్ష్యంగా చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ఇచ్చిన పదవికి దేశానికి గుర్తింపు వచ్చేలా పనిచేస్తానని తెలిపారు. కుటుంబమంతా వైద్యులే.. డాక్టర్ విజయ భర్త పి. వి.రాఘవశర్మ సీనియర్ కార్డియాలజిస్టుగా, కార్డియాలజీ వైద్యుల సంఘం రాష్ట్ర నాయకుడిగా సేవలందిస్తున్నారు. పెద్దకుమారుడు డాక్టర్ అనురాగ్ కార్డియాజిస్ట్గా, పెద్ద కోడలు డాక్టర్ స్రవంతి క్యాన్సర్ వైద్య నిపుణులుగా చిన్న కుమారుడు డాక్టర్ నరేన్ న్యూరాలజిస్ట్‌గా, చిన్న కోడలు డాక్టర్ సిరి చందన నెఫ్రాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. సీనియర్ న్యూరాలజిస్టుగా, స్ట్రోక్ స్పెషలిస్టుగా 35 సంవత్సరాలుగా డాక్టర్ విజయ సేవలందిస్తూ ఎన్నో అవార్డులు, సన్మానాలు పొందారు. నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ (యూఎస్ఏ), వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎస్ఓ), అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ (ఏఏఎన్), యూరోపియన్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ (ఈఎస్ఓ), ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ (ఏపీఎన్‌ఎస్‌ఏ), న్యూరలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. -
పల్నాడు అడ్డా.. జోరుగా పేకాట
● టీడీపీ నాయకుల అండదండలతో యథేచ్ఛగా పేకాట ● ఐదు జిల్లాల నుంచి వస్తున్న పేకాటరాయుళ్లు ● చిలకలూరిపేట, సత్తెనపల్లిలో పేకాట క్లబ్‌లు ● నోట్ల కట్టలతో పోలీసుల కళ్లు మూయించినట్లు ఆరోపణలు ● నీకింత .. నాకింత అంటూ అధికార పార్టీ నేతల వాటాల పంపకాలు ● రెండు నియోజకవర్గాల్లో మండిపడుతున్న మహిళలు రూ. లక్షల్లో నిర్వహణ... కాయిన్లతోనే ‘లెక్క’ ! -
రాగి తీగల దొంగలు అరెస్ట్
● 16 ట్రాన్స్ఫార్మర్లలో రూ. 1.5 లక్షల విలువైన 105 కిలోల వైరు చోరీ ● పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు నరసరావుపేట టౌన్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులోని రాగి తీగలను అపహరిస్తున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు పల్నాడు జిల్లా అడ్మిన్ ఎస్పీ జె.వి.సంతోష్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నకరికల్లు మండలం కండ్లగుంట, నరసింగపాడు గ్రామాల పరిధిలో ఇటీవల వరుసగా ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులో విలువైన రాగితీగలను చోరీలకు పాల్పడుతున్న కేసులను డీఎస్పీ ఎం. హనుమంతరావు ఆధ్వర్యంలో నకరికల్లు పోలీసులు ఛేదించారన్నారు. కండ్లగుంట గ్రామానికి చెందిన చండ్రా వెంకటేశ్వర్లు తన పొలంలోని ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి రాగి వైర్లను దొంగలించినట్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు. బుధవారం చేజర్ల గ్రామ సమీపంలో ఎన్ఎస్పీ కుడి కాల్వ దగ్గర నకరికల్లు మండలం చేజర్ల గ్రామానికి చెందిన తడపాల సాయిబాబు, ఉరాలశెట్టి మల్లయ్య, చలంచర్ల హనుమంతరావులు అనుమానస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని, విచారించగా.. రాగివైర్లు దొంగతనానికి పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారన్నారు. నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో 16 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులో విలువైన కాపర్ వైర్లను అపహరించినట్లు తేలిందన్నారు. కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మాచర్ల టౌన్‌కు చెందిన రాజు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.1.5 లక్షల విలువైన 105 కేజీల రాగి వైరును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ హనుమంతరావు, సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్, నకరికల్లు ఎస్ఐ సతీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులపై కేసులేవి?
మైనార్టీ ఉద్యోగి మరణానికి కారణమైన పిడుగురాళ్ల: సీఐ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన మైనార్టీ వర్గానికి చెందిన ఉద్యోగి షేక్ దరియా హుస్సేన్ కేసును నీరుగార్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారని పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ఆత్మహత్య చేసుకున్న దరియా హుస్సేన్ రాసిన సూసైడ్ లేఖ, మరణవాంగ్మూలం వీడియో ఉన్నాయి. ఇవి ఉంటే నేరుగా కేసు కట్టాలని న్యాయవ్యవస్థే చెబుతోంది. కానీ పిడుగురాళ్ల పోలీసులు ఇద్దరు వ్యక్తులపై కేసుకట్టి చేతులు దులుపుకోవటం దుర్మార్గం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి ఆత్మహత్యతో పోలీసులకు సంబంధం లేదని మీడియాకు చెప్పాలని, ఇదే విషయమై సంతకాలు పెట్టాలని పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి బెదిరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఉన్నతాధికారులు తమను పంపించారని భయపెడుతున్నారని చెప్పారు. చెప్పినట్టు వినకపోతే మీ బిడ్డలపై కేసులు నమోదు చేస్తామని తీవ్రమైన బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. ఎమ్మెల్యే యరపతినేని చెబితేనే తాను చేస్తున్నానని, తనపై కేసులు పెడితే ఎవరు ఎవరు ఉన్నారో చెబుతానని సీఐ వెంకట్రావు బహిరంగంగా చెబుతున్నారని ఆరోపించారు. దరియా హుస్సేన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, అతడి ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై కేసులు కట్టే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. ప్రభుత్వం హుస్సేన్ కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం, ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. -
విజ్ఞాన్‌కు జాతీయ స్థాయిలో స్వయం ఎన్పీటీఈఎల్ ‘ఏఏ’ గ్రేడ్
చేబ్రోలు: మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి భారతీయ సాంకేతిక విద్యా రంగంలో ప్రతిష్టాత్మక గుర్తింపుగా నిలిచే ఐఐటీ మద్రాస్ స్వయం– ఎన్పీటీఈఎల్ విడుదల చేసిన జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో ‘ఏఏ’ గ్రేడ్ లభించిందని వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిషోర్ గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా స్వయం–ఎన్పీటీఈఎల్ లోకల్ చాప్టర్ల పనితీరు ఆధారంగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో విజ్ఞాన్ యూనివర్సిటీ 22వ జాతీయ ర్యాంక్‌ను సాధించి ‘ఏఏ’ గ్రేడ్‌ను కైవసం చేసుకుందని తెలిపారు. ఎన్పీటీఈఎల్ నిర్వహించిన వివిధ ఆన్లైన్ కోర్సుల్లో విజ్ఞాన్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొత్తం 5,851 కోర్సు సర్టిఫికెట్లను సాధించారని చెప్పారు. 2026 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎన్పీటీఈఎల్ విద్యార్థులు ప్రదర్శించిన విశిష్ట ప్రతిభ, కోర్సులలో నమోదు, ఉత్తీర్ణత శాతం, టాపర్ విజయాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ‘ఏఏ’ గ్రేడ్ ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు. గ్రేడ్ సాధించేందుకు కృషి చేసిన ఎన్పీటీఈఎల్ లోకల్ చాప్టర్ కోఆర్డినేటర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, విభాగాధిపతులను చైర్మన్ లావు రత్తయ్య అభినందించారు. -
భక్తిశ్రద్ధలతో కార్మెల్‌మాత ఉత్సవాలు
ఫిరంగిపురం: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కార్మెల్‌మాత ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. కొండపై పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ విశ్వాసులు భక్తిశ్రద్ధలతో కార్మెల్‌మాతను దర్శించుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా బాల ఏసుదేవాలయంలో విచారణ గురువులు ఫాతిమామర్రెడ్డి ప్రధాన యాజకులుగా ఉండి దివ్యపూజా నిర్వహించారు. భక్తులకు దేవుని సందేశం వినిపించారు. కొండపై 9గంటలకు ఏర్పాటు చేసిన దివ్యపూజాబలి కార్యక్రమంలో విజయవాడ పీఠాధిపతి టి.రాజారావు పాల్గొని వాక్యోపదేశం చేశారు. కోరిన వరాల నిచ్చే మాతగా కార్మెల్ మాతను భక్తులు విశ్వసిస్తారన్నారు. మాతపై విశ్వాసంతో ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ప్రశాంతత, అమ్మ అనుగ్రహం లభిస్తాయని చెప్పారు. అనంతరం 10.30 గంటలకు కార్మెల్‌మాత సమిష్టి దివ్యపూజా బలి కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన యాజకులుగా గుంటూరు మేత్రాసన నూతన అభిషిక్త గురువులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు తాగునీరు, అన్నదానం, వైద్యసదుపాయాలు కల్పించారు. పోలీసు సిబ్బంది, వలంటీర్లు భక్తులకు రద్దీలేకుండా చేస్తూ వారిరాకపోకలు పర్యవేక్షించారు. ఉత్సవాలు ప్రశాత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. -
సీఐ వేధింపులతోనే చచ్చిపోతున్నా..
సాక్షి, నరసరావుపేట, పిడుగురాళ్ల: పోలీసుల వేధింపులు తాళలేక మైనార్టీ వర్గానికి చెందిన ఓ ఉద్యోగి పుట్టినరోజు నాడే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం ఉదయం పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. సివిల్ పంచాయితీలో తలదూర్చడమే కాకుండా తాను చెప్పినట్లు వినకుంటే గంజాయి కేసు నమోదు చేస్తానని పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావు బెదిరించడంతో చనిపోతున్నానని, తన చావుకి పోలీసులే కారణమని సూసైడ్ లెటర్లో షేక్ దరియా హుస్సేన్ (49) పేర్కొన్నాడు. పట్టణంలోని బిలాల్ మసీద్ సమీపంలో దరియాహుస్సేన్ తన ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుడి భార్య షేక్ అమిరున్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... » సత్తెనపల్లిలోని ఉర్దూ అకాడమీలో లైబ్రేరియన్‌గా ఉద్యోగం చేస్తున్న దరియా హుస్సేన్ 2016లో తన భార్య షేక్ అమీరున్ పేరిట రెండు రేకుల ఇళ్లను కొనుగోలు చేశాడు. పులికూరి ప్రశాంత్ పేరిట ఉన్న ఆ ఇళ్లను అతడి తల్లి లక్ష్మి విక్రయించారు. అయితే ఆ ఇళ్లు 22 ఏ జాబితాలో ఉన్నందున రిజి్రస్టేషన్ కాలేదు. దీంతో స్వా«దీన అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఏడాది తర్వాత మరికొంత నగదు చెల్లించాలంటూ లక్ష్మి ఒత్తిడి చేసింది. దీంతో దరియా హుస్సేన్ 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ప్రస్తుతం తుది తీర్పు దశలో ఉంది. ఈ క్రమంలో పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు ఈ నెల 14వ తేదీన ఇళ్లు ఖాళీ చేయాలంటూ దరియా హుస్సేన్‌ను తీవ్ర స్థాయిలో బెదిరించారు. లేదంటే గంజాయి కేసు నమోదు చేసి కుటుంబం మొత్తాన్ని ఇబ్బందులకు గురి చేస్తామని హెచ్చరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దరియా హుస్సేన్ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని మృతి చెందాడు. ఎస్పీకి పీజీఆర్ఎస్లో అర్జీలు పెట్టుకున్నా సీఐ వేధింపులు ఆగలేదని మృతుడి కుటుంబీకులు వాపోయారు. మైనార్టీ ఉద్యోగి మరణానికి కారణమైన సీఐ వెంకట్రావుపై కేసు నమోదు చేయాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. రానున్న జగనన్న ప్రభుత్వంలో సీఐ వెంకట్రావు తప్పులన్నింటికి చట్ట ప్రకారం శిక్షలు పడతాయని హెచ్చరించారు. బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. » మృతుడు తన సూసైడ్ నోట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్లను ప్రస్తావించాడు. పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు, పోలీసు సిబ్బంది తనను ఇబ్బంది పెట్టారని వెల్లడించాడు. సీఐ ఎస్.వెంకట్రావు తమ ఇంటికి తాళాలు వేయించినట్లు తెలిపాడు. రాజీకి టీడీపీ నేతల యత్నం.. తన మరణానికి పోలీసులే కారణమని మృతుడు దరియా హుస్సేన్ సూసైడ్ లేఖలో పేర్కొనడంతో రంగంలోకి దిగిన టీడీపీ నేతలు రాజీ యత్నాలు ప్రారంభించారు. సామాన్యులు కావటంతో సామదాన భేదదండోపాయాలను ప్రయోగించి కేసును పక్కతోవ పట్టించే కుట్రలకు తెర తీశారు. పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు సివిల్ పంచాయితీలలో తలదూర్చడంతో ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్యా యత్నాలకు ఒడిగట్టడం గమనార్హం.ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళతోపాటు ఓ దళిత యువకుడు వీరిలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు ఉన్నతాధికారులు సీఐ వెంకట్రావును వెనుకేసుకొస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. పోలీసుల వేధింపులతో మరణించిన షేర్ దరియా హుస్సేన్ కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేయాలని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా డిమాండ్ చేశారు. -
టీటీడీకి రూ.30 లక్షల విరాళం
గుంటూరు మెడికల్: టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు నగరానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్, బ్రిందా న్యూరో సెంటర్ అధినేత డాక్టర్ హనుమ శ్రీనివాసరెడ్డి రూ.10,00,116, శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116, బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించింది. శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు బ్రింద హాస్పటల్ అధినేతలు డాక్టర్ భవన హనుమ శ్రీనివాసరెడ్డి, వసంత సిద్ధార్ధలు ఈ విరాళం డీడీలను అందజేశారు. కార్యక్రమంలో టీటీడీపాలక మండలి సభ్యులు, నాట్కో ట్రస్టు ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో వారాహి నవరాత్రులు ప్రారంభం సత్తెనపల్లి: పట్టణంలోని శ్రీ త్రిశక్తి దుర్గాపీఠంలో వారాహి నవరాత్రులు బుధవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా అమ్మవారికి నవరాత్రులు భక్తిశ్రద్ధలతో చేస్తే శత్రు బాధలు, ఇతర సమస్యలు తొలగిపోతాయని, సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. బుధవారం శ్రీ త్రిశక్తి దుర్గా పీఠంలో దుర్గామాతను వారాహిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శతనామాలతో అర్చనలు, గాయత్రి మూలమంత్రంతో సామూహిక కుంకుమ పూజలు, గాజులతో పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ పీఠాధిపతి వెలిదండ్ల హనుమత్ స్వామి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పొంగలి షెడ్డు నిర్మాణానికి విరాళం తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని 17వ వార్డులో ఉన్న శ్రీ గంగానమ్మ ఆలయంలో పొంగలి షెడ్డు నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ తన సొంత నిధుల నుంచి రూ. 1.50 లక్షల విరాళం అందజేశారు. ఆయన తరఫున బుధవారం టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు ఈ మొత్తాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాడిబోయిన భాస్కర్, గుద్దంటి నాగేశ్వరరావు, ఇట్టా భాస్కర్, నిర్మల, రాంబాబు, గోపి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కారెంపూడిలో ఈఎఫ్‌ల చోరీ కారెంపూడి: పల్నాడు జిల్లా కారెంపూడి–2 గ్రామ సచివాలయంలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. ప్రధాన ద్వారం తాఽళం, తర్వాత లోపల బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న ఎస్ఐఆర్కు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు ఎత్తుకెళ్లారని తెలుస్తోంది. దాదాపు 50 ఫారాలు దొంగిలించారని ఎంపీడీఓ జి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. అవన్నీ ఆధార్ లింకు కానివని, చిరునామా మార్పు కోసం పెట్టినవిగా పేర్కొన్నారు. సర్ ప్రక్రియ గడువు పొడిగించిన నేపథ్యంలో డేటా రికవరీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేవలం ఈ ఫారాల కోసమే కార్యాలయం మొత్తం దుండగులు వెతికినట్లుగా ఉందన్నారు. మిగతా వారి ఫారాలన్నీ బీఎల్ఓల వద్ద సురక్షితంగా ఉన్నాయని ఎంపీడీఓ తెలిపారు. ఆయనతోపాటు తహసీల్దార్ ఆర్. వెంకటేశ్వర్లునాయక్ ఆదేశాల మేరకు సచివాలయం–2 కార్యదర్శి కె. కోటేశ్వరరావు నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యథేచ్ఛగా పేకాట, గంజాయి రవాణా
సత్తెనపల్లి: బహిరంగంగా పేకాట క్లబ్‌లు నడుస్తున్నా, గంజాయి విచ్చలవిడిగా అక్రమ రవాణా జరుగుతున్నా పోలీసులకు కనిపించడం లేదా అని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజక వర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాలో పట్టుబడిన 200 కేజీల గంజాయి అక్రమ రవాణా కేసులో సత్తెనపల్లికి చెందిన ఇరువురు పట్టుబడ్డారన్నారు. గంజాయి ప్రస్తుతం విచ్చలవిడిగా లభిస్తున్నందున ఆ మత్తులో యువత ఘర్షణలకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా గత ప్రభుత్వంపై అనేక విమర్శలు చేసినా... అధికారంలోకి వస్తే వంద రోజుల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేస్తామని కూటమి నేతలు ఊదరగొట్టారన్నారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా పట్టించు కోవడం లేదని చెప్పారు. విద్యార్థులు జీవితాలను గంజాయి మత్తులో నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఇటీవల గంజాయి మత్తులో ఓ దుకాణదారుడిపై గొడవకు దిగిన వీడియో వైరల్‌గా మారినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. డీజేలు, వైఎస్సార్ సీపీ చేపట్టే ర్యాలీలకు ఆంక్షలు విధించడం మిగతా విషయాల్లో పోలీసులు సాధించింది శూన్యమన్నారు. సామాన్యులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ప్రతాపం చూపుతున్నారని మండిపడ్డారు. అనకాపల్లి కేసులోని ఇరువురు అధికార కూటమికి సంబంధించి ఆర్మీ గ్రూపుగా ఏర్పడిన వారిలోని బాధ్యులన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జునయాదవ్‌పై అక్రమకేసు పెట్టి అరెస్టు చేశారన్నారు. కక్ష సాధించడానికి ఎప్పుడో మాట్లాడిన మాటలను వక్రీకరించి అడ్డగోలుగా కేసులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. -
ఖరీఫ్‌కు ఎల్‌నినో గండం
ఎల్‌నినో ప్రభావంతో సాగు భూములన్నీ బీడు భూములుగా మారుతున్నాయని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎల్‌నినోతో వానలు కురవని పరిస్థితి నెలకొన్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయం చూపడం లేదు. కనీసం ఏ పంటలు వేయాలో కూడా అవగాహన కల్పించడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శావల్యాపురం: గత ఏడాది ఇదే సీజన్లో వర్షాలు సకాలంలో కురవడంతో జలాశయాలన్నీ నిండుకుండలను తలపించాయి. పంట కాల్వల్లో నిండుగా నీరు రావడంతో రైతులు ఆనందంగా పంటలు సాగు చేశారు. ఈ ఏడాది మాత్రం అందుకు విరుద్ధంగా వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకోవడం, కర్ణాటక ఎగువ జలాశయాల నుంచి వరద నీటి ఉధృతి లేకపోవడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని కాల్వలన్నీ ఒట్టిపోయి ఉన్నాయి. వర్షాలు లేకపోవడంతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రాకపోవడం కూడా రైతులకు శాపంగా మారింది. దానికి తోడు నిత్యం అధిక ఉష్ణోగ్రతల తీవ్రతతో భూమిలో తేమ కోల్పోయి పంట భూములన్నీ బీటలువారుతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులు కూలీ పనులకు వెళ్లలేక, మరోవైపు వర్షాలు లేక సాగు చేయలేక అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. నిదర్శనం ఇదిగో... వినుకొండ నియోజకవర్గంలో 23,337 హెక్టార్ల సాగు భూములు ఉండగా, ఇప్పటి వరకు కేవలం బోరు బావుల ఆధారంగా 1,143 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేశారు. ప్రస్తుతం బోరు బావుల్లో ఉన్న నీరు కూడా వేడి గాలులకు ఎండిపోవడంతో ఉన్న కాస్త పంట కూడా దక్కదని రైతులు వాపోతున్నారు. శావల్యాపురం మండలంలో వ్యవసాయ అధికారుల లెక్కల మేరకు ఎకరం కూడా సాగు కాలేదు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పాడి పరిశ్రమ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం గేదెలకు గ్రాసం కొరత ఏర్పడింది. శావల్యాపురం 3,164 00 ఈపూరు 5,478 78 నూజెండ్ల 5,744 80 బొల్లాపల్లి 4,794 790 వినుకొండ రూరల్ 4,157 195 -
ప్రాణాలే బలి.. ఈ ఖాకీని ఏమనాలి?
సాక్షి, నరసరావుపేట: అధికార మదానికి ప్రభుత్వ, పోలీసు పెద్దల సహకారం తోడైతే ఎంతటి అరాచకాలకు పాల్పడతారనే దానికి నిదర్శనం పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావు వ్యవహరిస్తున్న తీరు. ఇప్పటికే పదుల సంఖ్య వైఎస్సార్సీపీ సానుభూతిపరులను అక్రమ కేసులతో వేధించడం, అక్రమ వసూళ్లకు పాల్పడటం అలవాటుగా మారింది. అధికార పార్టీ నేతలు చెప్పిందే చట్టంగా విధులు నిర్వహిస్తూ తీవ్ర వివాదస్పదంగా వ్యవహరిస్తున్నా పోలీసు బాసులు మాత్రం పట్టనట్టు ఉంటూ పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిత్యం పోలీసుస్టేషన్లో సివిల్ పంచాయితీలు చేస్తూ అక్రమార్జనలో కొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. సీఐ వేధింపులు తాళలేక ఓ ఆర్యవైశ్య మహిళ స్టేషన్లోనే కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. సరిగ్గా నెల క్రితం దళిత యువకుడు సురేంద్ర నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నం చేసి చావుబతుకుల్లోంచి బయటపడ్డారు. అది మరువక ముందే సీఐ సివిల్ పంచాయితీల దాహానికి ఓ మైనారిటీ ఉద్యోగి ఏకంగా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇంత జరుగుతున్నా జిల్లా పోలీసులు మాత్రం అతను చనిపోవడానికి కారణాలు తెలియాల్సి ఉందంటున్నారు. అతడే సూసైడ్ నోట్ రాశాడని గ్యారెంటీ ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పిడుగురాళ్ల సీఐ వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నాడు. పిడుగురాళ్ల పరిధిలోని ఓ గ్రామంలో రాజకీయ నాయకుడి విగ్రహం చేయి విరిగింది. దాంతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్సీపీ కార్యకర్తను స్టేషన్‌కు తీసుకువచ్చి భారీ మొత్తంలో డబ్బులు ఇస్తేనే ఆ కేసులో ఇరికించనని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. గాలికి అధికారపార్టీ ఫ్లెక్సీ చిరిగినా దానికి కారణం మీరేనంటూ వైఎస్సార్సీపీ నేతలను వేధించి తీవ్రంగా హింసించడంతోపాటు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. వైఎస్సార్సీపీ సోషల్‌మీడియా యాక్టివిస్టులే లక్ష్యంగా రౌడీషీట్లు, పీడీ యాక్టులు తెరిచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సివిల్ పంచాయితీలో తలదూర్చి సీఐ వేధించి నా భర్త మరణానికి కారణమయ్యారు. ప్రతి రోజు స్టేషన్‌కు పిలిపించి తిట్టడం, మహిళా పోలీసులతో కొట్టిస్తానని భయపెట్టాడు. డబ్బులు కట్టకపోతే గంజాయి కేసు పెడతానని బెదిరించారు. ఎస్పీ ఆఫీస్‌లో గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. నా భర్త సూసైడ్ నోట్లో వివరాలు రాసి చనిపోయారు. నా కుటుంబానికి న్యాయం చేయాలి. – షేక్ అమిరున్, దరియా హుస్సేన్ భార్య పిడుగురాళ్ల పోలీసుస్టేషన్ సివిల్ పంచాయితీలకు అడ్డాగా సీఐ మార్చాడు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో ద్వితీయ శ్రేణి నాయకులు నిత్యం ఆర్థిక వ్యవహారాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, వైఎస్సార్సీపీ నేతలపై వేధింపులు వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఆర్యవైశ్య వ్యాపారులను అనేక మందిని బలవంతంగా స్టేషన్లో ఉంచి వారితో ఆస్తులను రాయించుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల కంట పడకుండా వెనుక ఉన్న క్వార్టర్ట్స్‌లో ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నారని సమాచారం. గత ఏడాది డిసెంబర్లో ఓ ఆర్యవైశ్య మహిళ పోలీసుల వేధింపులు తాళలేక కత్తితో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంత జరిగినా సీఐపై చర్యలు తీసుకోకపోవడంతో ఆర్యవైశ్యులు చంద్రబాబు ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులపై తీవ్రంగా మండిపడుతున్నారు. అక్రమ వసూళ్లతో విసిగిన దళిత యువకుడు సురేంద్ర గత నెల 15వ తేదీన ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇప్పుడేమో మైనార్టీ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సీఐపై చర్యలు తీసుకోకపోతే ఇంకెందరి ప్రాణాలు, ఆస్తులు పోతాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే మన రాష్ట్రంలో ప్రాణాలు తీస్తున్నారు, ఆత్మహత్యలకు ఉసిగొలుపుతున్నారు. దీనికి ఉదాహరణ పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు తీరు. దరియాహుస్సేన్ను స్టేషన్‌కు తీసుకువెళ్లి రూ.30 లక్షలు కట్టాలని డిమాండ్ చేసి అక్రమకేసులు బనాయిస్తానని బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టినరోజునే చనిపోయే దుస్థితి తెచ్చారంటే ఎంతటి ఘోరమో ఆలోచించాలి. అన్ని పార్టీలలోని మైనారిటీలు ఆలోచించండి. సీఐపై వెంటనే కేసు నమోదు చేసి, ఆ స్టేషన్ విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. సూసైడ్ నోట్ ఉన్నా కేసు పెట్టకుండా బేరసారాలు చేస్తున్నారు. ఆ కుటుంబానికి కనీసం రూ.కోటి ఇచ్చి ఆదుకోవాలి. జగనన్న ప్రభుత్వం రాగానే ఆర్యవైశ్యులు, దళితులు, మైనార్టీలకు అన్యాయం చేసిన పిడుగురాళ్ల స్టేషన్లోనే కేసు నమోదు చేసి బాధ్యులైన పోలీసులను చట్టప్రకారం అరెస్ట్ చేయిస్తాం. – కాసు మహేష్‌రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే -
యువతకు ఓటు నమోదు అవకాశం
సత్తెనపల్లి: ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 17 ఏళ్లు నిండిన యువత ముందస్తుగానే ఓటర్ జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. వారికి 18 ఏళ్లు నిండిన తర్వాతే తుది ఓటరు జాబితాలో పేరు నమోదు అవుతుంది. మారిన నిబంధనలు... గతంలో ఉన్న నిబంధనల ప్రకారం .. కేవలం జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉండేది. జనవరి 2న 18 ఏళ్ల నిండినా.. ఓటరుగా నమోదు కావడానికి మరో ఏడాది పాటు వేచి చూడాల్సి వచ్చేది. యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రాతినిధ్య చట్టంలో కీలక సవరణలు తీసుకొచ్చింది. దీని ప్రకారం భారత ఎన్నికల సంఘం సంవత్సరానికి నాలుగు అర్హత తేదీలను అందు బాటులోకి తెచ్చింది. జనవరి , ఏప్రిల్ , జూలై , అక్టోబర్ ఒకటో తేదీల్లో పదిహేడేళ్లు నిండి ఉంటే సంబంధిత యువత ఫారం–6 ద్వారా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవచ్చు. యువతా మేలుకో.. భారత ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లాలో సుమారు 29వేల మందికి పైగా యువతకు సరికొత్తగా ఓటరుగా మారే అవకాశం లభించనుంది. జిల్లాలోని విద్యా సంస్థల గణాంకాలను పరిశీలిస్తే 2023–24 పదో తరగతి విద్యార్థులు 29,423 మంది. 2023–24 విద్యాసంస్థల్లో పరీక్షలు రాసే సమయానికి 15 ఏళ్లు నిండిన విద్యార్థుల వయసు 2026 నాటికి 17 ఏళ్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు 17 నుండి 18 ఏళ్ల వయసు గ్రూపులోకి వస్తున్నారు. వీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సి ఉంది. 17 ఏళ్లు నిండిన తర్వాత ఓటరుగా నమోదు చేసుకోవడానికి వయసు, నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు పరిశీలిస్తారు. వారు ధ్రువపత్రాలను ఆన్లైన్, వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాత, అర్హులకు ఓటు హక్కు ఇవ్వాలా? లేదా? అనేది నిర్ణయిస్తారు. దరఖాస్తు ప్రక్రియ 17 ఏళ్లకే ప్రారంభమైనప్పటికీ, సదరు యువతకు 18 ఏళ్లు పూర్తిగా నిండిన తర్వాతే వారి పేర్లు తుది ఓటరు జాబితాలో ప్రచురితమవుతాయి. ఈ సరికొత్త విధానంపై అవగాహన పెంచడానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోనే ప్రత్యేక నమోదు శిబిరాలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
హక్కులు, చట్టాలపై అవగాహన అవసరం
సత్తెనపల్లి: ప్రతి పౌరుడు వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ అన్నారు. సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి సచివాలయంలో కూలీలకు బుధవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కూలీలు తమ హక్కులు, చట్టపరమైన రక్షణలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనుకోని ప్రమాదాలు, ఇతర న్యాయ పరమైన సమస్యలు ఎదురైనప్పుడు పారాలీగల్ వలంటీర్లను సంప్రదించాలన్నారు. ప్రతి కుటుంబం జనన, వివాహ తదితర కీలక ధ్రువపత్రాలను తప్పనిసరిగా పొందాలని సూచించారు. ముందుగా పట్టణంలోని సబ్‌జైల్‌ను ఆయన సందర్శించారు. రాజీ మార్గమే రాజ మార్గమని, లోక్ అదాలత్ తీర్పు అంతిమం అన్నారు. ఈ సందర్భంగా పలు చట్టాల గురించి వివరించారు. ఆయా కార్యక్రమాలలో ప్యానల్ న్యాయవాది బీఎల్ కోటేశ్వరరావు (సత్తెనపల్లి), కాళిదాసు (గుంటూరు), పారాలీగల్ వలంటీర్లు షేక్ సుభాని, వెంకటేశ్వర రావు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో ఏపీ యువతి మృతి
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి మృతి చెందింది. మృతురాలిని పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్నగా గుర్తించారు. ఆమె ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా వెళ్లారు. ఇటీవలే చదువు పూర్తి చేసిన ప్రసన్న ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు.న్యూజెర్సీలో ప్రసన్న తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె స్నేహితులకు గాయాలు కాగా, ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెద్ద కుమార్తె మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రసన్న భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని.. సాయం అందించాలని కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల దరఖాస్తు గడువు పెంపు
డీఈఓ రామారావు నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం– 2026 దరఖాస్తు గడువును ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు మంగళవారం తెలిపారు. అర్హులైన వారిని డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గుర్తించి వారు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించి సంబంధిత అధికారికి దరఖాస్తులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు, అన్ఎయిడెడ్ పాఠశాలలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే పాఠశాలల్లో కనీసం 10 సంవత్సరాల క్రమబద్ధమైన సేవను పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని స్పష్టం చేశారు. అర్హత గల ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఈనెల 20వ తేదీ లోగా సంబంధిత డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. పిడుగురాళ్ల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్వై వార్షిక 2026లో జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్(జేడీఎన్) రాష్ట్ర చైర్మన్ 2026–28 పదవికి పిడుగురాళ్ల పట్టణానికి చెందిన డాక్టర్ దూళ్లిపాళ్ల భరత్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆయన మంగళవారం తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలను ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ డాక్టర్ జీఎస్ మూర్తి అధికారికంగా ప్రకటించినట్లు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ దూళ్లిపాళ్ల భరత్‌కుమార్ పిడుగురాళ్ల ఐఎంఏ శాఖ అధ్యక్షులుగా, ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా భరత్‌కుమార్‌ను పలువురు వైద్యులు అభినందించారు. దాచేపల్లి: గూడ్స్ రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం రాత్రి రాత్రి 8:30 గంటల సమయంలో పొందుగల–నడికుడి రైల్వేస్టేషన్ల మధ్య ఓ మహిళ నడుచుకుంటూ వెళుతోంది. గమనించిన గూడ్స్‌రైలు లోకో పైలట్ పలు మార్లు గట్టిగా హారన్ మోగించినప్పటికి సదరు మహిళ పట్టాలపై నుంచి పక్కకు తప్పుకోలేదు. దీంతో గూడ్స్‌రైలు కిందపడి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి శరీరంపై పింక్ కలర్ పూల డిజైన్చీర, నలుపు రంగు జాకెట్ ఉన్నది. నడికుడి రైల్వే పోలీస్‌లు మృతదేహాన్ని పరిశీలన చేసి కేసు నమోదు చేసి పోస్ట్‌మార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు నడికుడి రైల్వే పోలీసుల సెల్ నెంబర్ 92475 85720, 94403 73372 సంప్రదించాలని కోరారు. -
జిల్లాలో 89.19 శాతం ఈఎఫ్‌ల డిజిటలైజేషన్
నరసరావుపేట: జిల్లాలో సమగ్ర ఓటరు రివిజన్ (సర్) ప్రక్రియ మంగళవారం సాయంత్రం నాటికి 89.19 శాతం పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 17,41,798మంది ఉండగా 1932మంది బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు ఓటర్లకు వందశాతం అందజేశారన్నారు. వీరిలో తమకు పూర్తిచేసి అందజేసిన ఫారాలలో 15,53,455మందివి డిజిటలైజేషన్ చేయటం జరిగిందన్నారు. సెక్యూరిటీ అలారం మోగడంతో పరారీ మంగళగిరి టౌన్: మెడికల్ షాపులో చోరీకి వచ్చి అలారమ్ మోగడంతో వారు పరారీ అయిన ఘటన మంగళవారం తెల్లవారుజామున మంగళగిరి పట్టణంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి పట్టణ పరిధిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ సమీపంలో గౌతమబుద్ధ రోడ్డు వెంబడి శ్రీ ధాత్రి సాయి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్‌ను పట్టణానికి చెందిన ఫణీంద్ర అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున తన ఫోన్లో అలారం మోగడంతో వెంటనే షాపు సీసీ కెమెరాలను తన ఫోన్లో చూశాడు. అదే సమయంలో అలారం ఏర్పాటు చేసిన ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీ వారు కూడా ఫణీంద్రకు ఫోన్లో సమాచారం అందించారు. అయితే సీసీ కెమెరాల్లో ఏమీ కనబడకపోవడంతో నిద్రపోయాడు. వెంటనే మరుక్షణంలోనే అలారం మోగడంతో తన ఫోన్లో సీసీ కెమెరా ఓపెన్ చేయగా షట్టర్ పగలకొట్టి లోపలకు ఓ వ్యక్తి ప్రవేశించడం గమనించాడు. వెంటనే తన ఫోన్లో అలారం బటన్ నొక్కి తన షాపులో మోగే విధంగా ఏర్పాటు చేశాడు. దీంతో దుండగుడు వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. ఇంటి వద్ద నుంచి షాపు వద్దకు వచ్చి చూడగా షట్టర్ తాళాలు పగలకొట్టి, పైన ఉన్న సీసీ కెమెరా పక్కకు వంచి ఉండడం, సైరన్ బాక్స్ పగలకొట్టి ఉండడం గమనించాడు. వెంటనే పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాడు. అయితే పోలీసులు సరిగా స్పందించలేదని బాధితుడు తెలిపాడు. షాపులో ఎటువంటి నష్టం వాటిల్లకపోవడంతో ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడు. గతంలో ఇదే తరహాలో.... మూడేళ్ల క్రితం 2023 జూలై నెలలో ఇదే తరహాలో షాపు పైభాగంలో రంద్రం చేసి దుండగుడు లోపలకు ప్రవేశించాడని, షాపులో వున్న అధిక మొత్తంలో నగదును, హార్డ్‌డిస్క్ అపహరించుకుపోయినట్లు బాధితుడు ఫణీంద్ర తెలిపాడు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీస్ అధికారులు, క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించి విచారించారని, కానీ నేటికీ ఆ కేసుపై ఎటువంటి పురోగతి లేదని, అందువల్లే ఇప్పుడు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయడానికి నిరాకరించినట్లు పేర్కొన్నాడు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఎగువ సన్నిధి కొండపై వున్న గండాలయ స్వామిని దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. కొండపైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్లో ద్విచక్రవాహనాల ద్వారా భక్తులు ప్రయాణాలు చేస్తారు. అమావాస్య కావడంలో భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి కొండపైకి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఘాట్రోడ్లో వస్తుండగా రెండు ద్విచక్రవాహనాలు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయాయి. వాటిపై ఉన్న ఇద్దరు యువకులు లోయలోకి జారుకున్నారు. గమనించిన పలువురు భక్తులు వారిని పైకి తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద భరితంగా ఉన్న ఘాట్రోడ్లో ప్రమాదాలు జరగకుండా ఆలయ అధికారులు, సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్సకోసం స్థానిక దేవస్థానం సిబ్బందిని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. కార్మికుడి కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో దొండపాడు వద్ద పనిచేస్తూ మట్టి గడ్డలు పడి ప్రమాదంలో ఒడిశాకు చెందిన వలస కార్మికుడు 21 సంవత్సరాల గుడు సాహూ మృతి చెందడం బాధాకరం అని సీఐటీయూ నాయకులు అన్నారు. ఆ కుటుంబానికి తను పనిచేస్తున్న ఎన్సీసీ కంపెనీ యాజమాన్యం రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని రాజధాని డివిజన్ సీఐటీయూ అధ్యక్ష ,కార్యదర్శులు ఎం.రవి, బి.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. తుళ్లూరు పీహెచ్సీలో ఉన్న గుడ్డు సాహు మృతదేహాన్ని సీఐటీయూ బృందం పరిశీలించి, వారి బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని నిర్మాణ పనులు చేపడుతున్న కార్మికులు, వలస కార్మికులకు రక్షణ కల్పించాల్సిన పూర్తి బాధ్యత సీఆర్డీయేకు, ఏడీసీలకు ఉందన్నారు. రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడేందుకు సీఐటీయూ బృందం ప్రయత్నించినా దాటవేసే ప్రయత్నం చేశారని, ఎక్స్‌గ్రేషియా ఇవ్వకుండా మభ్యపెట్టాలని చూస్తే భవిష్యత్తలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కార్మికుడు గుడ్డు సాహు మృతదేహాన్ని సీఐటీయూ రాజధాని డివిజన్ కార్యదర్శి బి.లక్ష్మణరావు, నాయకులు జె.నవీన్ ప్రకాష్, పి.బాబురావులు పరిశీలించి, మృతుని బంధువులను పరామర్శించారు. -
ముద్రగడ మృతి తీరని లోటు
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాఽభం మృతికి పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మంచితనానికి, నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం ముద్రగడ అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసి ఆదర్శమైన మంత్రిగా మెలిగారన్నారు. ఇటువంటి నిజాయతీ గల వ్యక్తిని కోల్పోవటం దురదృష్టకరం అన్నారు. ఆయన మృతి రాష్ట్ర భవిష్యత్‌కు, కాపు ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బాపట్ల: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతికి మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సంతాపం తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముద్రగడ మృతి తీరని లోటని కోన అభిప్రాయపడ్డారు. ఉద్యమ నాయకుడిగా ఆయన చూపిన ధైర్యం, నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పొన్నూరు: ప్రముఖ కాపు నేత, రాజకీయ నాయకుడు, సామాజిక ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం మృతికి వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేపల్లె: కాపు ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి కాపు జాతికే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ తీరని లోటని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్‌కృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన ముద్రగడ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. కాపు సమాజానికి న్యాయం జరగాలనే లక్ష్యంతో ముద్రగడ జీవితాంతం పోరాడారని పేర్కొన్నారు. -
సమ్మె నోటీసు అందజేసిన ఆశా వర్కర్లు
నరసరావుపేట రూరల్: ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 31వ తేదీన సమ్మెతో పాటు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు డి.శివకుమారి తెలిపారు. ఈ మేరకు గురువారం కోటప్పకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా శివకుమారి మాట్లాడుతూ ఆశ వర్కర్ల వేతనాలు పెంచి ఏడు సంవత్సరాలు గడిచిపోయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతనాలను సవరించి అమలు చేయాల్సి ఉన్నప్పటికి, ఆ బాధ్యత నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమయిందని తెలిపారు. ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని, ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ సెలవు దినాలను వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాల సాధన, ఉద్యోగ భద్రత కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈనెల 31 తేదీన ఉదయం 10 గంటలకు నరసరావుపేటలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలో పెద్ద ఎత్తున ఆశ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు గోవిందమ్మ, సుగుణమ్మ, సీఐటీయూ మండల కన్వీనర్ షేక్ సిలార్, రాజ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా గుంటూరు ఎడ్యుకేషన్: కాలానుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతిక విద్యాబోధన నైపుణ్యాలు అలవర్చుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా అన్నారు. గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు మంగళవారం డివిజన్ స్థాయిలో వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమంతో పాటు డీఆర్పీలకు జిల్లాస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని పట్టాభిపురం, వేణుగోపాల్‌నగర్‌లోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల్లో ప్రారంభించారు. ఈసందర్భంగా డీఈఓ సలీమ్ బాషా మాట్లాడుతూ మారిన సిలబస్, లీప్ యాప్, తదితర అంశాలపై శిక్షణలో నేర్చుకున్న అంశాలను డివిజన్ స్థాయిలో శిక్షణ కల్పించాలని సూచించారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో తరగతి గదిలో విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యే విధంగా బోధించి, పాఠశాలలను అభివృద్ధి బాట పట్టించాలన్నారు. కోర్సు కో–ఆర్డినేటర్ కె.విజయభాస్కర్ మాట్లాడుతూ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ రెండు రోజులపాటు జరిగే శిక్షణా కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో స్టేట్ రీసోర్స్ పర్సన్, డైట్ అధ్యా పకులు, డీఆర్పీలు పాల్గొన్నారు. తాడేపల్లిరూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని గురుకుల రాష్ట్ర కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘం నేతలు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకపక్కన రోడ్డుపై కూర్చొని ఉపాధ్యాయులు నిరసన చేస్తుంటే మరోపక్క విధులు నిర్వహించడానికి వచ్చిన అదనపు పోలీస్ సిబ్బంది ఇదేమీ పట్టనట్లు కార్యాలయం కింద పార్కింగ్ ప్లేస్‌లో క్యారమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారు. ధర్నా జరుగుతున్నంత సేపు ఆడుకుంటూ ఉన్నారు. ధర్నా జరుగుతున్నా అటువైపు చూడకుండా ఆటలో నిమగ్నమవ్వడంతో అక్కడి అధికారులు నివ్వెరపోయారు. ధర్నా జరిగే సమయంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే పరిస్థితి ఏంటంటూ అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. అక్కడున్న విలేకరులు ఫొటోలు తీయడానికి ప్రయత్నించినా వారితో వ్యంగ్యంగా మాట్లాడి క్యారమ్స్ ఆడడం మాత్రం ఆపలేదు. -
వృద్ధులే లక్ష్యంగా దోపిడీలు
తెనాలిరూరల్: వృద్ధులే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల నకిలీ పోలీసులను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి.జనార్ధనరావు వివరాలను వెల్లడించారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన కావటి కిరణ్‌కుమార్, సదుపాటి మురళి స్నేహితులు. కిరణ్‌కుమార్ గతంలోనే నకిలీ పోలీస్ అవతారమెత్తి, పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. గుంటూరు, చీరాల, ఇంకొల్లు, వేటపాలెం, ఒంగోలు, నందిగామల్లో నేరాలకు పాల్పడ్డాడు. ఇతనిపై 12 కేసులు ఉన్నాయి. మురళి 12 ఏళ్లు బీఎస్ఎఫ్లో పనిచేసి 2012లో ఉద్యోగం వదిలి వచ్చేశాడు. మద్యం, ఇతర వ్యసనాలకు బానిసైన మురళి కిరణ్‌కుమార్‌తో కలిసి ఇటీవలి కాలంలో నేరాలకు పాల్పడుతున్నాడు. ఈనెల 7వ తేదీన కొల్లిపర చెందిన మల్లికార్జున రెడ్డి నందివెలుగు నుంచి స్కూటీపై తెనాలి వస్తుండగా ఆటోనగర్ వద్ద అతడిని ఇద్దరు నిందితులు అడ్డగించి పోలీసుల పేరుతో బెదిరించారు. స్కూటీని చెక్ చేయాలంటూ భయపెట్టి డిక్కీలో ఉన్న రూ. 1.60 లక్షల నగదులో రూ.50,000 లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. అదే రోజు దుగ్గిరాల సమీపంలోని కొత్త పెట్రోల్ బంకు వద్ద మోపెడ్‌పై వెళుతున్న వృద్ధుడు మహమ్మద్ ఫరూక్‌ను కూడా బెదిరించి అతని వద్ద ఉన్న రూ 7వేలు తీసుకొని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు నిందితులను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 57 వేల నగదు, పల్సర్ బైక్ స్వాధీనపర్చుకున్నారు. నిందితులను తక్కువ సమయంలోనే గుర్తించి అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులను డీఎస్పీ అభినందించారు. సయావేశంలో రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె.ఆనంద్, సిబ్బంది ఉన్నారు. -
పోరాట ఫలితమే మెడికల్ కళాశాల
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి గురజాల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన సెల్ఫీల పోరాట ఫలితమే ఈ మెడికల్ కళాశాల అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. నగర పంచాయతీ పరిధిలోని జంగమహేశ్వరపురంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైనవె వైద్య దేవాలయానికి శంకుస్థాపన చేశామని దానికి రూ. 215 కోట్లతో భూములు సేకరించడంతో పాటు వైద్య కళాశాల, వైద్యశాలకు ఒక రూపు తీసుకురావడం జరిగిందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో 90 శాతం భవనాలు పూర్తయినా టీడీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడిచినా ప్రారంభించలేకపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు అవగాహన లేమి వల్ల ఆలస్యం అయిందని లేకపోతే 2024లోనే ప్రారంభించే అవకాశం ఉండేదన్నారు. కూటమి హయాంలో వైద్య కళాశాలను అమ్మకానికి పెట్టిందని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సెల్ఫీల ద్వారా అన్ని మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో పాటు ప్రవాస భారతీయులు సైతం భాగస్వాములు కావడంతో వైద్యకళాశాల మనకు దక్కిందన్నారు. దీనికి తోడు కేంద్రం కూడా ఆసక్తి చూపకపోవడంతో టీడీపీ ప్రభుత్వం మెడికల్ కళాశాలల గురించి వెనకడుగు వేసిందన్నారు. మెడికల్ కళాశాలలో 100 సీట్లు కేటాయిస్తూ చెప్పడంతో కేంద్రంకు కాసు మహేష్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకుడు యెనుముల మురళీధర్‌రెడ్డి, మాచర్ల నియోజకవర్గ పరిశీలకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ కొమ్మినేని బుజ్జి, వేముల చలమయ్య, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సిద్దాడపు గాంధీ, పట్టణ కన్వీనర్ కె. అన్నారావు, కె. చిన కోటేశ్వరరావు, తదితరులున్నారు. -
అధికారం మాదే.. పెత్తనమూ మాదే!
చీరాల టౌన్: అధికారం చేతిలో ఉంది.. అధికారులు మా కిందే ఉన్నారు... మా మాటకు అడ్డు లేదంటూ టీడీపీ గ్రామ, మండల స్థాయి నాయకులు సచివాలయంలో తిష్ట వేసి చక్రం తిప్పుతున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమంలో ఏకంగా అధికారి కుర్చీలోనే టీడీపీ నేతలు కూర్చొని సర్ డిజిటలైజేషన్ చేయిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వ అధికారికి కేటాయించిన కుర్చీలో కూర్చొని వారి అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారు. ఈ సంఘటన మంగళవారం చీరాల మండలంలోని తోటవారిపాలెం గ్రామ సచివాలయంలో చోటు చేసుకుంది. సర్ కార్యక్రమంలో బీఎల్వోలకు అనుసంధాన పార్టీ తరఫున ఏర్పాటు చేసి బీఎల్ఏలు, టీడీపీ నాయకులు బీఎల్ఓలతో కలిసి గ్రామ సచివాలయంలో ఓట్ల చేర్పు, తొలగింపు ప్రక్రియ చేస్తున్నట్లు సమాచారం. సర్ ప్రక్రియలో అనుకూలమైన ఓట్లు ఉంచుతున్నారు. ఇతర పార్టీల ఓట్లు తొలగిస్తున్నారని సమాచారం. -
యువతిని బలిగొన్న క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం
సత్తెనపల్లి: జాతీయ రహదారి విస్తరణ పనుల్లో డ్రైవర్ నిర్లక్ష్యం ఓ యువతి నిండు ప్రాణాన్ని బలిగొంది. రోడ్డుపై వెళుతున్న ఇంజినీరింగ్ విద్యార్థినికి క్రేన్ బలంగా తగలటంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందింది. పొన్నూరు సమీపంలోని మామిళ్లపల్లి గ్రామానికి చెందిన లలితశ్రీ (21) నలంద కళాశాలలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. రోడ్డుపై వెళుతుండగా రహదారి విస్తరణ పనులు నిమిత్తం వచ్చిన క్రేన్ డ్రైవర్ అజాగ్రత్త వలన ఆమెకు క్రేన్ తగిలి కింద పడిపోయింది. స్థానికులు గమనించి, డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసే సమయానికి పరిస్థితి విషమించి మృతి చెందింది. రహదారి పనుల వద్ద కనీస భద్రత ప్రమాణాలు పాటించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గంజాయి కేసులో ‘తమ్ముళ్లు’
సత్తెనపల్లి: అనకాపల్లి జిల్లాలో వెలుగు చూసిన కేసులో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అనకాపల్లి జిల్లాలో వాహనాల తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా వెళుతున్న కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా అందులో ఉన్న వ్యక్తులు వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. కారును పోలీసులు తనిఖీ చేయగా అందులో 200 కిలోల గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. స్వాదీనం చేసుకున్నారు. అనంతరం చేపట్టిన దర్యాప్తులో సత్తెనపల్లి పట్టణంలోని సంగం బజార్‌కు చెందిన ఎస్కే ఫయాజ్, 27వ వార్డుకు చెందిన ఎస్కే రఫీలు నిందితులుగా ఉన్నట్లుగా గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొంతమంది పాత్రపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. పట్టణానికి చెందిన పది మందికిపైగా ఈ దందాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ ముఖ్యనేత అండదండలతోనే ఈ గంజాయి అక్రమ రవాణాకు తెరతీశారనే విమర్శలు పట్టణంలో వినిపిస్తున్నాయి. మిగిలిన వారి కదలికలపైనా పోలీసులు నిఘా పెట్టారు. అయితే వీరంతా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతకు కీలక అనుచరులుగా ఉండటం గమనార్హం. -
తప్పుల తడకగా కొచ్చర్ల భూ రీసర్వే
ఈపూరు: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొచ్చర్లలో జరిగిన భూ రీసర్వే తప్పుల తడకగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ మంగళవారం రాత్రి వినుకొండ–కారంపూడి రహదారిపై రైతులు భారీ సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా భూ సర్వే పూర్తి చేశారని ధర్నాలో రైతులు మండిపడుతున్నారు. ఏకపక్షంగా రీసర్వే... సర్వే సమయంలో ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా సర్వేలు కానిచ్చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. రికార్డుల్లోనూ తీవ్రమైన పొరపాట్లు చేశారని, ఒకరి భూమిని మరొకరి పేరుతో ఆన్లైన్లో నమోదు చేశారని రైతులు వాపోతున్నారు. వాస్తవంగా ఉన్న భూమి కంటే తక్కువ విస్తీర్ణం ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చూపించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెబ్‌ల్యాండ్–2లో బయటపడ్డ తప్పిదాలు.. ఇటీవల కాలంలో రెవెన్యూ అధికారులు వెబ్‌ల్యాండ్–2 డేటా విడుదల చేయడంతో రీసర్వే తప్పిదాలు బయటపడ్డాయి. ఆన్లైన్ ద్వారా తమ భూముల అడంగల్, వన్ బీ పత్రాలను తీసుకున్న రైతులు ఒక్కసారిగా కంగుతిన్నారు. తప్పులు సరిదిద్దుకోవడానికి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు వాపోయారు. సర్వే ప్రభావం వల్ల వ్యవసాయ రుణాలు రెన్యూవల్ చేసుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోందని అంటున్నారు. అధికారుల తప్పిదం వల్ల కొచ్చర్ల గ్రామంలోనే 820 మంది రైతులు అన్నదాత సుఖీభవ లబ్ధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులే రీసర్వే తప్పులు సరిదిద్ది న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ గంటలకు పైగా జరిగిన ధర్నా కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వినుకొండ రూరల్ సీఐ బొప్పన బ్రహ్మయ్య, ఎస్ఐ కె. వేణుగోపాల్ ధర్నా ప్రాంతానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. స్థానిక తహసీల్దార్ వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు తహసీల్దార్ నళిని సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, భూసమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన ముగించారు. -
కార్మెల్‌మాత ఉత్సవాలు ప్రారంభం
ఫిరంగిపురం: మండల కేంద్రంలోని కార్మెల్ కొండపైనున్న కార్మెల్ మాత ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. బాల ఏసు దేవాలయంలో విచారణ గురువు ఫాతిమా మర్రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను ప్రారంభించారు. కొండపై దివ్యపూజాబలి నిర్వహించారు. కొండవీడు విచారణ గురువు సీహెచ్ అలెక్స్ వాక్యోపదేశం చేశారు. దివ్యపూజాబలి కార్యక్రమంలో మొదటిరోజు సెయింట్ ఆన్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మఠకన్యలు పాల్గొన్నారు. అనంతరం మరియమాతను ప్రత్యేకంగా అలంకరించారు. తేరులో ఉంచి ఆలయ ప్రదక్షిణ చేయించారు. గుంటూరు మెడికల్: పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 7 నుండి 13వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. పట్టణ ఆరోగ్యకేంద్రాలలో 20 ఫార్మసిస్ట్, ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో 20 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేశామన్నారు. ఎంపికై న వారికి మంగళవారం నియామకపు ఉత్తర్వులు గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో డాక్టర్ విజయలక్ష్మి అందజేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని ఆమె సూచించారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని పానకాల లక్ష్మీనరసింహ స్వామి కొండపై ఉన్న గండాలయ స్వామికి మంగళవారం భక్తులు విశేష పూజలు నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు కొండపైకి చేరుకున్నారు. గండాలయ స్వామివారిని దర్శించుకున్నారు. తమ గండాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ పూజలు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ నిర్వాహకులు, ఎండోమెంట్ అధికారులు తగిన సౌకర్యాలు కల్పించారు. పెదకాకాని: శివాలయంలో అమావాస్య మంగళవారాన్ని పురస్కరించుకుని రాహుకేతు పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో తెల్లవారు జాము నుంచే భక్తుల సందడి నెలకొంది. మధ్యాహ్నం రాహుకాలం 3 గంటల వరకు భక్తులు పాలుపంచుకున్నట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావులు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పూజా టికెట్ల విక్రయం ద్వారా స్వామి వారికి రు. 5.30 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. దుర్గమ్మకు బంగారు హారం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గుంటూరుకు చెందిన భక్తుడు మంగళవారం రూ. 3 లక్షల విలువైన బంగారుహారాన్ని సమర్పించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిచంద్రపురానికి చెందిన సీహెచ్ వంశీకృష్ణ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి సుమారు 20 గ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. -
● ప్చ్.. ఏం బ్యాగో లేదు..!
చిరిగిన బ్యాగులు.. ప్లాస్టిక్ కవర్లు, విద్యామిత్ర కవర్లలో పుస్తకాలు, స్వీటు బ్యాగు సంచుల్లో పలకలు, జూటు బ్యాగుల్లో నోట్‌బుక్స్.. ఇలా కనిపిస్తున్న ఈ చిత్రాలు చంద్రబాబు సర్కారు తీరును వెక్కిరిస్తున్నాయి. విద్యార్థులు పుస్తకాలు ఇలా బడికి వెళ్తుండటం విద్యాశాఖ నిర్వాకాన్ని ఎండగడుతోంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేస్తామంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం,... బడులు తెరిచి నెల అవుతున్నా నేటికీ స్కూల్ బ్యాగ్‌లు ఇవ్వలేదు. విద్యార్థులు ఇలా చిరిగిన బ్యాగులు, కవర్లలో పుస్తకాలను తీసుకుని బడి నుంచి ఇంటికి వెళుతుండటం మంగళవారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులో ‘సాక్షి’ కెమెరాకు కనిపించింది. ప్రత్తిపాడు మండలంలో 2,517 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు ఈ ఏడాది నూతన బ్యాగులు ఇవ్వలేదని మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు. – ప్రత్తిపాడు -
ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ముఖ్యం
నరసరావుపేట: జిల్లాలో జూలై మాసంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైతే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఈ ఏడాది ఖరీఫ్ సాగు పరిస్థితులు, వర్షపాతం, పంటల సాగు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతు సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయ శాఖ చేపడుతున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ– పంట నమోదు, సీసీఆర్సీ కార్డుల జారీ, కౌలు రైతులకు రుణాల మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు జిల్లాలోని వ్యవసాయ పరిస్థితులపై సమగ్ర వివరాలు తెలియచేశారు జూన్ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనప్పటికీ జూలై నెలలో ఇప్పటివరకు వర్షపాతం గణనీయంగా తగ్గిందన్నారు. జూన్ ఒకటి నుంచి జూలై 13 వరకు జిల్లాలో 110.1 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని చెప్పారు. ఇది సాధారణంతో పోలిస్తే 18.40 శాతం తక్కువ అన్నారు. జూలై 13వ తేదీ నాటికి జిల్లాలో 23,721 హెక్టార్లలో ఖరీఫ్ పంటల సాగు పూర్తయిందని తెలిపారు. ఇది సాధారణ సాగులో 14.81శాతం అన్నారు. గతేడాదితో పోల్చితే సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. ప్రస్తుత సాగులో పత్తి పంట ప్రధానంగా ఉందన్నారు. ఇప్పటివరకు 8060మంది రైతులకు 1,311 మెట్రిక్ టన్నుల యూరియా, 465 మెట్రిక్ టన్నుల డీఏపీ పంపిణీ చేశామన్నారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు తగిన సలహాలు ఇస్తూ పంటల బీమా పథకం ఆవశ్యకతను వివరించాలన్నారు. సీసీఆర్సీ కార్డుల ద్వారా కౌలు రైతులకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియను రైతు సేవ కేంద్రాల సిబ్బంది ద్వారా తెలియచేసి ఖరీఫ్ సాగు విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయ అధికారి కమలకుమారి, ఉద్యాన పంటల అధికారి వెంకటరావు పాల్గొన్నారు. కలెక్టర్‌కు అధికారులు జ్ఞాపిక అందజేశారు. జిల్లాలో జాడలేని వాన జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఏ మండలంలోనూ వర్షపాతం నమోదు కాలేదని అధికారులు మంగళవారం వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 1655.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కేవలం 170.8 మి.మీ. మాత్రమే కురిసింది. ఎల్‌నినో ప్రభావంతో ఎండలు అధికంగా కాస్తున్నాయి. -
పల్నాడులో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామానికి చెందిన భారతి అనే మహిళ తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఘటనాస్థలిలో పోలీసులు ఓ సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందులో ‘నా చావుకు ఎవరూ కారణం కాదు‘ అని భారతి రాసినట్లు తెలుస్తోంది. భారతి ఈ ఘోర నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులను పోలీసులు విచారిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సూసైడ్ లెటర్ పరిశీలన అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
టీడీపీ కనుసన్నల్లోనే ‘సర్’
పిడుగురాళ్ల/నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ‘సర్’ కార్యక్రమం అపహాస్యం పాలవుతోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో ఈ తంతు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను నమోదుచేసేందుకు బీఎల్ఓలు సైతం ముందుకురాకపోవడంతో స్థానిక ఓటర్లు ఆందోళన వ్యక్తంచేశారు. సర్ ప్రక్రియకు ఇక సోమవారం ఒక్కరోజే గడువు మిగిలి ఉండడంతో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను నమోదుచేసేందుకు బీఎల్ఓలు నానుస్తున్నారు. దీంతో కరాలపాడు ఓటర్లు, బీఎల్ఏలు అందరు కలిసి పిడుగురాళ్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు. గ్రామ ఇన్చార్జి ఆర్ఐ శ్రీనిబాబు, ఐదుగురు బీఎల్ఓలు గ్రామానికి వచ్చి విధులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అధికారులు మా గ్రామానికి వస్తేనే ఇక్కడ నుంచి కదులుతామని తేల్చిచెప్పడంతో గత్యంతరంలేక ఆర్ఐ శ్రీనిబాబుతోపాటు బీఎల్ఓలు కరాలపాడు గ్రామానికి స్థానికుల వెంట వెళ్లారు. అయినప్పటికీ టీడీపీ సానుభూతిపరులవి మాత్రమే నమోదుచేస్తుండడంతో అధికారులపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కలెక్టర్‌కు కాసు మహేష్ రెడ్డి ఫిర్యాదు.. ఈ నేపథ్యంలో.. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాకు ఫిర్యాదు చేశారు. దీంతో కోనంకి, కరాలపాడు గ్రామంలో పూర్తిస్థాయిలో సర్ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, తహసీల్దార్ మధుబాబులను ఆదేశించారు. ఈలోగా పోలీసులు కరాలపాడు సచివాలయం వద్దకు చేరుకుని టీడీపీ సానుభూతిపరులవి మాత్రమే బీఎల్ఓ ద్వారా దగ్గరుండి ఆన్లైన్ చేయిస్తున్నారు. తమను సచివాలయంలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని వైఎస్సార్సీపీ బీఎల్ఏలు ఆరోపించారు. అలాగే, కోనంకి గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓటర్లను ఆన్లైన్ చెయ్యొద్దని తహసీల్దార్ బీఎల్ఓలకు ఆన్లైన్ లాగిన్ ఇవ్వలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు నమోదుచేయాలన్న లక్ష్యంతో సర్ ప్రక్రియ నిర్వహిస్తుంటే వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓటర్లను ఆన్లైన్లో నమోదుచేయకుండా ఉన్నతాధికారులే అడ్డుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ మధుబాబును వివరణ కొరేందుకు ప్రయతి్నంచినా ఆయన అందుబాటులోకి రాలేదు. మూడ్రోజుల ముందే ఆపేశారు: కాసు మరోవైపు.. నరసరావుపేటలో కలెక్టర్‌ను కలిసిన అనంతరం కాసు మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం ఈనెల 14 సాయంత్రం వరకు ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుని డిజిటలైజ్ చేయాల్సి ఉన్నా మూడ్రోజుల ముందే కరాలపాడు, కోనంకి గ్రామాల్లోని బీఎల్ఓలు, ఎన్నికల అధికారులు ఓటర్ల దగ్గర నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోవడం నిలిపివేశారని చెప్పారు. దీన్ని తాము ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. -
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
ప్రయాణికులు సురక్షితం రేపల్లె: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని పెనుమూడి వద్ద సోమవారం ఆర్టీసీ బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. రేపల్లె డిపో నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారం ప్రకారం.. పెనుమూడి సమీపంలోని పంట కాలువ పక్కన బస్సును డ్రైవర్ నిలిపి తాగునీటి కోసం దిగాడు. ఈ సమయంలో ఒక్కసారిగా బస్సు ముందుకు కదిలి పంట పొలంలోని కాలువలోకి దూసుకెళ్లింది. బస్సులో సుమారు 10 మంది ప్రయాణికులు ఉండగా, ఎవరికీ గాయాలు కాలేదు. స్థానికులు స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మంగళవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2026
పిడుగురాళ్ల ప్రభుత్వ కళాశాల, వైద్యశాల ముఖ ద్వారం నెరవేరిన జగనన్న సంకల్పం పిడుగురాళ్ల: పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించాలన్న సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను నిర్మించడానికి గతంలో శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే పిడుగురాళ్ల కళాశాల నిర్మాణం పల్నాడు జిల్లాకే మణిహారంగా మారింది. బడుగు, బలహీన వర్గాలు, పేదలకు వైద్యంతోపాటు పేద విద్యార్థులకు వైద్యవిద్య అందించేందుకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దీనిని నిర్మించారు. ఈ ప్రాంతం ప్రజల కల వైఎస్ జగన్ సహకారంతో సాకారం అయిందని జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి వంద ఎంబీబీఎస్ సీట్లు 2026–27 విద్యా సంవత్సరానికి కేటాయిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా బోధనాసుపత్రి, తరగతి గదులు, ప్రయోగశాలలు, హాస్టళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు సిద్ధమైనట్లు వైద్య బృందం తెలిపింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ... పల్నాడు జిల్లాతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేందుకు ఈ వైద్య కళాశాల ఎంతో ఉపయోగపడనుంది. వైద్యులు, బోధన సిబ్బంది, ఇతర ఉద్యోగాల కల్పనకు అవకాశం దక్కింది. పరోక్షంగా ఎంతో మంది స్థానికులు ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ సీట్ల సంఖ్య పెరగటంతోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి రావటం మాజీ ముఖ్యమంత్రి జగన్ చలవేనని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ముందుచూపు ఫలితమే నేడు పిడుగురాళ్ల వైద్యశాల, వైద్య కళాశాల రూపకల్పనకు కారణమైంది. గతంలోనే 90 శాతం పూర్తి జిల్లా ప్రజలకు ఆరోగ్య భద్రత కోసం చేపట్టిన కళాశాల నిర్మాణం 90 శాతం ఆయన హయాంలోనే పూర్తి చేశారు. ఈ ఏడాది నుంచి మెడికల్ కళాశాల కూడా ప్రారంభం కానుండటంతో వంద సీట్లు కేటాయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదలు పెట్టమని ఎన్ఎంసీ ఆదేశాలు ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైద్య కళాశాల, వైద్యశాల నిర్మాణం శరవేగంగా చేసేందుకు అప్పటి గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి చూపిన చొరవను ప్రజలు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. గురజాల నియోజకవర్గ ప్రజల కోసం పనిచేసే నాయకుడిగా మాజీ ఎమ్మెల్యే కాసు ప్రత్యేక ముద్ర వేశారు. మెడికల్ కాలేజీ, వైద్యశాల పరిసరాలు వ్యాపారపరంగా అభివృద్ధి చెందడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను నిలదీస్తున్న భక్తులు పేద, మధ్యతరగతి వారికి ఉచిత వైద్యం, విద్య అందించాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. దానికి అనుగుణంగా వైద్య కళాశాలల నిర్మాణానికి నడుం బిగించారు. అందులో భాగంగా పిడుగురాళ్లలో వైద్య కళాశాల పనులు చేపట్టి దాదాపు 90 శాతం పూర్తి చేయించారు. నేడు ఆ కళాశాల ప్రారంభమవడమే కాకుండా తాజాగా ఎంబీబీఎస్ సీట్లు కూడా పొందింది. పేదలకు మెరుగైన వైద్యం అందించేలా వైద్యశాల కూడా అందుబాటులోకి రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రజలు కోరిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలి
– ఆర్టీఐ కమిషనర్ శ్రీనివాసరావు అచ్చంపేట: ప్రజలు కోరిన సమాచారం అందుబాటులో ఉంటే వెంటనే ఇవ్వాలని ఆర్టీఐ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. అచ్చంపేట తహసీల్దారు, ఎంపీడీవో కార్యాలయాలను సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. సహ చట్టం రికార్డులు పరిశీలించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్నింటికి సమాచారం అందించారనే విషయాలను పరిశీలించారు. అధికారులు జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. ప్రతి సమాచారం పబ్లిక్కు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డులు ఉంచి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ఆయన వెంట సత్తెనపల్లి ఆర్డీవో గోపాలకృష్ణ, తహసీల్దారు సరోజ, డిప్యూటీ తహసీల్దారు జానీబాషా, ఎంపీడీవో శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బగళాముఖి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని వారాహి నవరాత్రి మహోత్సవాలు బుధవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కె.చక్రధరరెడ్డి తెలిపారు. సోమవారం 90వ అమావాస్య దివ్యహోమం సందర్భంగా అమ్మవారికి అష్టాదశ శక్తి పీఠాలలో దేవతారూపం లేకుండా కేవలం చక్ర రూపంలో గయా క్షేత్రంలో మాత్రమే దర్శనమిచ్చే శ్రీమాధవేశ్వరి మహామాత అలంకరణలో పూజలు చేశారు. అమావాస్య సందర్భంగా ఆలయంలో జరిగిన హోమం, విశేష పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్నంబజారు: ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్‌లో సోమవారం నెల్లూరు జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (ఈడీ) జి.నాగేంద్రప్రసాద్ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) డి.సాంబ్రాజ్యంతో క లసి డిపో–1 గ్యారేజీని పరిశీలించారు. బస్సుల మరమ్మతుల పనులను పరిశీలించారు. గుంటూరు డిపో–2లో జరుగుతున్న ఎలక్ట్రికల్ బస్సుల గ్యారేజీ పనుల గురించి ఆరా తీశారు. ఈడీ మాట్లాడుతూ ఆర్టీసీలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు వచ్చినట్లు వెల్లడించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణం, పరిసర ప్రాంతాల్లోని శివాలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం, సోమవారం ఒకే రోజు రావడంతో పట్టణంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానానికి ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, బిల్వ దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. రద్దీ కారణంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ అర్చకులు మాట్లాడుతూ మహా శైవాక్షయోగం రోజున శివునికి భక్తి శ్రద్ధలతో పూజలు, అభిషేకాలు చేయడం వలన వంద మహాశివరాత్రులు ఆచరించిన పుణ్యఫలం లభిస్తుందని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆలయ నిర్వాహకులు, అర్చకులు అందించారు. -
ఆటో నడుపుతుండగా గుండెపోటు
ఈపూరు: ఆటో నడుపుతుండగా మార్గమధ్యలో గుండెపోటు వచ్చినప్పటికీ సమయస్ఫూర్తితో ఐదుగురు ప్రయాణికులను ప్రమాదం నుంచి తప్పించి ఓ ఆటో డ్రైవర్ మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. మండలంలోని ఊడిజర్ల గ్రామానికి చెందిన కాండ్రకొండ మధుకిరణ్ (42) ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తుంటాడు. ఎప్పటిలాగే ఈపూరు నుంచి వినుకొండకు ప్రయాణికులతో బయలుదేరాడు. కొచ్చర్ల గ్రామ సమీపంలోని చెరువు వద్ద రాగానే మధుకిరణ్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆటోను రోడ్డు పక్కన నిలిపివేసి, అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు 108 కి సమాచారం ఇవ్వడంతో వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎస్ఐ వేణుగోపాల్ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రయాణికులను కాపాడి డ్రైవర్ మృతి -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సత్తెనపల్లి: వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సత్తెనపల్లిలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని 21వ వార్డుకు చెందిన ఆలేటి జయబాబు పురుగు మంది తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు హుటాహుటిన పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. కాగా, పట్టణ సీఐ వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావును వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. బైక్ ఢీకొని వృద్ధురాలు మృతి చిలకలూరిపేటటౌన్: మండలలలోని జాతీయ రహదారి–16పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బొప్పూడి గ్రామానికి చెందిన కోడూరు వెంకటరమణమ్మ (65) దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బొప్పూడి గ్రామానికి చెందిన వెంకటరమణమ్మ రోజూ మాదిరిగానే సోమవారం ఉదయం 8 గంటలకు పొగాకు కంపెనీకి కూలీ పని నిమిత్తం బయలుదేరింది. చిన్న పసుమర్రు గ్రామం సమీపంలోని చీరాల ఓడరేవుకు వెళ్లే హైవే వంతెన కింద రహదారిని దాటుతుండగా, ఒంగోలు వైపు వెళ్ను ద్విచక్ర వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణమ్మతో పాటు, బైక్ నడుపుతున్న వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిలకలూరిపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరమణమ్మ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. నాదెండ్ల మండలం గణపవరంకు చెందిన మృతురాలి కుమార్తె బత్తినేని శేషమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ జి.అనిల్‌కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ‘సర్’ గడువును పొడిగించాలి పీజీఆర్ఎస్లో కలెక్టర్‌ను కోరిన సీపీఐ నాయకులు నరసరావుపేట: జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అనేక లోపాలు చోటుచేసుకుంటున్నాయని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని సీపీఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును మరో మూడు నెలలపాటు పొడిగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం జరుగుతున్న సర్‌లో అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగిపోతున్నాయనే ఫిర్యాదులు రాష్ట్రవ్యాప్తంగా వస్తున్నాయని తెలిపారు. మరణించినవారి పేర్లు, నకిలీ ఓటర్లను తొలగించడం అవసరమే అయినప్పటికీ, ఆ పేరుతో నిజమైన ఓటర్ల హక్కులు దెబ్బతినకూడదన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉలవలపూడి రాము మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన వారికి కూడా సరైన సమాచారం అందడం లేదని, సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తుల స్థితి తెలియని పరిస్థితి నెలకొన్నదన్నారు. చాలా చోట్ల బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఫారాలు అందించకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రమేయానికి ఆస్కారం లేకుండా ప్రతి అర్హుడి పేరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ సుభాని, సీహెచ్.సత్యనారాయణరాజు, మహంకాళి సుబ్బారావు, ఉప్పలపాటి రంగయ్య, వైదన వెంకట్ పాల్గొన్నారు. ఏఎన్‌యూ ఎమ్మెస్సీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ ఎమ్మెస్సీ నాలుగో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వెల్లడించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఎ.వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 ఏప్రిల్‌లో నిర్వహించిన ఎమ్మెస్సీ ఆక్వాకల్చర్ పరీక్షలకు 41 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 40 మంది ఉత్తీర్ణులయ్యారు. అలానే ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ పరీక్షలకు 22 మందికిగానూ 20 మంది, ఎంఎస్సీ బోటరీ పరీక్షలకు 66 మందికి 38 మంది, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ పరీక్షకు 37 మంది 31 మంది ,ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ 26 మందికి 26 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎమ్మెస్సీ ఎన్విరాల్మెంట్ సైన్స్ పరీక్షకు 16 మందికి 16 మంది, ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్, నూట్రీషన్ 70 మందికి గాను 70 మంది, ఎమ్మెస్సీ జియాలజీ పరీక్షలకు ఐదుగురు, ఎమ్మెస్సీ సైకాలజీ పరీక్షకు 23 మంది హాజరు కాగా 23 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. -
కొనసాగే హక్కు లేదు
టీడీపీ ప్రభుత్వానికి నరసరావుపేట: రాష్ట్రంలో రూ. వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో పెట్టి విద్యార్థులకు దిక్కుతోచని స్థితి కల్పించిన టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బందారపు యశ్వంత్ రఘువీర్ పిలుపు ఇచ్చారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద వందల మంది విద్యార్థులతో కలసి మహాధర్నా నిర్వహించారు. అనంతరం పీజీఆర్ఎస్లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యశ్వంత్ రఘువీర్ మీడియాతో మాట్లాడుతూ పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీల వరకు అనేక సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయని అన్నారు. సంక్షేమ వసతి గృహాలకు నిధులు కేటాయించక దశాబ్దగా ఖాళీగా ఉన్న కుక్, కమాటి, వార్డెన్ పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో డ్రాప్ అవుట్స్ పెరిగిపోతున్నాయని తెలిపారు. డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తిచేసిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో సర్టిఫికెట్ చేతికి రాక కళాశాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నికల్, ఐటీఐ కళాశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్య అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. వర్సిటీలలో గాడి తప్పిన పాలన విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని గొప్పగా చెబుతూ యూనివర్సిటీలను గాలికి వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. నిధులు కేటాయించకుండా విద్యార్థులు తక్కువ ఉన్నారని నెపంతో చాలా వరకు విభాగాలను మూసివేస్తున్నారని అన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు మూడు వేలకు పైగా ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పోస్టులు భర్తీ చేయకపోవడం వలన యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారన్నారు. జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పీజీ చదువుకోవాలనే కలలు కొంటున్న విద్యార్థులకు సర్కారు వైఖరి ఆటంకంగా మారిందన్నారు. పీజీ కళాశాలలు మూతపడటంతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అధికారంలోనికి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని చెప్పి ఇంతవరకు దాని ఊసే పట్టకపోవడం విద్యార్థులను మోసం చేయటమేనని మండిపడ్డారు. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గురజాల నియోజకవర్గ కార్యదర్శి దుర్గా ప్రసాద్, నాయకులు జగదీశ్, శ్రీనివాస్, మధు, సామ్యూల్ పాల్గొన్నారు. -
రెడ్‌బుక్ రాజ్యాంగం మేరకే అక్రమ అరెస్టు
నరసరావుపేట: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం మేరకే తెలంగాణ పోలీసులు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను అక్రమంగా, అన్యాయంగా అరెస్టు చేశారని పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్ తెలిపారు. సోమవారం గుంటూరురోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని రెండేళ్లక్రితం టీవీ చర్చలో భాగంగా విమర్శిస్తే ఇప్పుడు అరెస్టు చేయడం విడ్డూరమన్నారు. అక్కడి ప్రతిపక్ష నాయకులను రోజుకు ఒకసారి చులకనగా మాట్లాడే రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులను ఏం చేయాలని ప్రశ్నించారు. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వంగా వ్యవహరిస్తుందనే దానికి నిదర్శనం వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, నాగార్జున యాదవ్‌ల అక్రమ అరెస్టులేనన్నారు. వైఎస్సార్సీపీ గొంతుకలా నాగార్జునా యాదవ్ వ్యవహరిస్తున్నాడనే కారణంతోనే అతడిని అక్రమ అరెస్టు చేశారన్నారు. ఇటువంటి కేసులకు పార్టీ యువత భయపడపదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. నాగార్జున యాదవ్‌పై నమోదు చేసిన అక్రమ కేసులపై వైఎస్సార్ సీపీ యువత, విద్యార్థి విభాగం పోరాడుతుందన్నారు. విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఉప్పుతాళ్ల వేణుమాధవ్, జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శులు షోయబ్ అక్తర్, జానీబాష, మండల అధ్యక్షుడు శాంతకుమార్, నియోజకవర్గ సోషల్‌మీడియా కన్వీనర్ బూదాల కల్యాణ్, నాయకులు పాల్గొన్నారు. -
హోంగార్డు కుటుంబానికి చెక్కు అందజేత
నరసరావుపేట రూరల్: ప్రజా రక్షణ కోసం నిరంతరం పాటుపడుతున్న పోలీసు సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని జిల్లా అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి తెలిపారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన హోంగార్డు కుటుంబానికి ఇన్స్యూరెన్స్ చెక్‌ను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అందజేశారు. హోంగార్డుగా పనిచేస్తున్న గౌరి ప్రభాకరరావు డిప్యూటేషన్ మీద గుంటూరు ఆర్టీఓ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది పాము కాటుతో ప్రభాకరరావు మృతిచెందాడు. మృతుని భార్య జ్యోతికి యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ.34లక్షల చెక్‌ను అందించారు. కార్యక్రమంలో హోంగార్డు ఆర్ఐ ఎస్.కృష్ణ, యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ కె.అంకారావు, క్లస్టర్ శాలరీ మేనేజర్ తిరుమల కుమార్ పాల్గొన్నారు. కారును ఢీకొన్న లారీ.. దంపతులకు గాయాలు నాదెండ్ల: జాతీయ రహదారి నూతన బైపాస్‌పై ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొన్న ఘటనలో కారు వెనుకభాగం నుజ్జునుజ్జుకాగా, కారులో ప్రయాణిస్తున్న దంపతులకు గాయాలైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి నరసరావుపేట వెళ్తున్న కారులో దంపతులు ప్రయాణిస్తున్నారు. నూతన బైపాస్‌పై గణపవరం వద్దకు రాగానే విజయవాడ నుంచి చైన్నె వెళ్తున్న లోడు లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో కారు వెనుకభాగం నుజ్జునుజ్జుకాగా, దంపతులకు స్వల్పగాయాలయ్యాయి. మెడికల్ కాలేజీకి సీట్లు కేటాయించడం హర్షణీయం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కోటా సాయికుమార్ పిడుగురాళ్ల: పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి ఎంబీబీఎస్ సీట్లు కేటాయించటం ఎంతో హర్షణీయమని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కోటా సాయికుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ...పల్నాడు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశాలు ప్రారంభం కావడం జిల్లాలోని విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ, పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమన్నారు. వైద్య విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ఇది కీలక ముందడుగని పేర్కొన్నారు. అయితే కేవలం సీట్ల కేటాయింపుతోనే పరిమితం కాకుండా కళాశాలలో అవసరమైన అధ్యాపకులు, వైద్యసిబ్బంది, ప్రయోగశాలలు, గ్రంథాలయం, విద్యార్థులకు వసతి గృహాలు, తాగునీరు, రవాణా తదితర అన్ని మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి నాణ్యమైన వైద్య విద్య అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తూ భవిష్యత్తులో పీజీ కోర్సులు, సూపర్ స్పెషాలిటీ విభాగాలను కూడా ఈ కళాశాలలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దళిత ఉద్యమనేత కోటి జేమ్స్ కన్నుమూత చీరాల రూరల్: దళిత ఉద్యమనేత, చీరాల జాన్‌పేటకు చెందిన కోటి జేమ్స్ అనారోగ్యంతో సోమవారం తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు దళిత, ప్రజా సంఘాల నాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోటి జేమ్స్ మరణం దళిత ఉద్యమానికి తీరని లోటని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎల్టీడీ కార్మికుడిగా జీవితం ప్రారంభించిన ఆయన.. కార్మిక నాయకుడిగా హక్కుల సాధన కోసం విశేష కృషి చేశారు. కారంచేడు మారణకాండ బాధితులకు బాసటగా నిలిచి, వారికి న్యాయం జరిగే వరకు ఆర్థికంగా, నైతికంగా అండగా ఉంటూ ఎన్నో పోరాటాలు సాగించారని నాయకులు గుర్తుచేసుకున్నారు. దళిత ఉద్యమ శిఖరం డాక్టర్ కత్తి పద్మారావుకు ప్రధాన అనుచరుడిగా ఉంటూ.. దళిత మహాసభ ఉపాధ్యక్షుడిగా ఆయన విశేష సేవలు అందించారని కొనియాడారు. అత్యంత సాధారణ జీవితం గడిపిన జేమ్స్.. చివరి దశలో క్రీస్తు పరిచర్యలో గడిపారని వివరించారు. జేమ్స్ భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మూరి కనకారావు, జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ల వాసు, దళిత, ప్రజా సంఘాల నాయకులు నీలం నాగేంద్రరావు, మాచవరపు జూలియన్, కొరివి వినయకుమార్, దారా అంజయ్య, పులిపాటి బాబురావు, గోసాల ఆశీర్వాదం, దుడ్డు భాస్కరరావు, భగత్‌సింగ్, తేళ్ల వెంకటస్వామి, బి.లక్ష్మీనరసయ్య, గొర్రెపాటి రవికుమార్ తదితరులు ఉన్నారు. -
సర్కారు వారి కుట్టు కథ
సత్తెనపల్లి: మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు కుట్టు శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్లు ఇస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటం చేసింది. ఆ మాటలు నమ్మి వేలాది మంది మహిళలు ఎంతో ఆశతో శిక్షణ పొందారు. తీరా చూస్తే ప్రభుత్వం శిక్షణతో సరిపెట్టేసి కుట్టుమిషన్లు ఇవ్వకుండా చేతులు దులిపేసుకుంది. ఇదంతా చంద్రబాబు మార్కు కట్టు కథలా ఉందంటూ ప్రభుత్వ తీరుపై మహిళలు మండిపడుతున్నారు. రెండు విడతలుగా... బీసీ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ శాఖల ఆధ్వర్యాన బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ), కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, కాపు సామాజిక వర్గాల్లో అర్హులైన మహిళలకు 2024–25 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గత ఏడాది ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చారు. దీనికోసం సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (సీయూఆర్డీ), సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ (ఎస్ఏపీఈ) ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి కేంద్రంలో ఒక ట్రైనర్, ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించారు. శిక్షణ కేంద్రం అద్దె, కుట్టుమిషన్, ఇతర పరికరాల కోసం ఒక్కో మహిళకు సుమారు రూ. 22 వేలు చొప్పున కేటాయించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ మొదటి విడతగా 7,345 మంది మహిళలు తమ వివరాలు నమోదు చేసుకున్నారు. వీరిలో 30 శాతం మంది శిక్షణ పొందారు. నాలుగు నెలలకు తగ్గకుండా శిక్షణ పొందితేనే కుట్టు మిషీన్ ఇస్తామని ప్రకటించారు. మిషన్లు ఇవ్వకుండా కాలయాపన... నాలుగు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే 75 శాతం హాజరు నమోదైన మహిళలకు సర్టిఫికెట్తో పాటు ఉచితంగా కుట్టుమిషన్లు అందిస్తామని అప్పట్లో ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ అలా జరగలేదు. పైగా 75 శా తం హాజరున్న మొదటి బ్యాచ్ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తామని చెప్పుకొచ్చారు. శిక్షణ పొందితే మిషన్లు ఇస్తారని ఆశతో ఎదురు చూస్తుంటే కాలయాపన చేస్తున్నారని మహిళలు మండిపడుతున్నారు. కేవలం మిష న్లు ఇవ్వకుండా కాలయాపన చేయడానికి ఇలా సాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. శిక్షణ పూర్తయి ఏడాది గడుస్తున్నా కుట్టు మిషన్లు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని, కనీసం ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వాలని నిలదీస్తున్నారు. దీంతో రెండో విడత శిక్షణ కూడా ఇవ్వలేదు. అలాగే శిక్షణ ఇచ్చిన 32మంది సిబ్బందికి సైతం ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడం గమనార్హం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషీన్లు అందజేయడంతో పాటు శిక్షణ ఇచ్చిన సిబ్బందికి వేతనాలు విడుదల చేయా లని మహిళలు కోరుతున్నారు. -
కళారంగ సేవకుడు ‘మల్నేని’ కన్నుమూత
నివాళులర్పించిన సినీ, నాటక రంగ ప్రముఖులు యడ్లపాడు: కొండవీటి కళా పరిషత్ ఆర్గనైజింగ్ కార్యదర్శి మల్నేని సీతారామాంజనేయులు(58) అనారోగ్యంతో మృతి చెందారు. లింగారావుపాలెం గ్రామంలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కొండవీటి నాటక కళాపరిషత్ జాతీయస్థాయి నాటికల పోటీలను నిర్వహణను ఆయన చురుగ్గా పర్యవేక్షించేవారు. రెండున్నర దశాబ్దాలుగా కొండవీడు కళాపరిషత్ ప్రతినిధిగా ఉంటూ కళామతల్లికి తనవంతుగా సేవలు అందించారు. హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన యడ్లపాడు మండలం లింగారావుపాలేనికి తరలించగా, నాటక, సినీ రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అశ్రునయనాల మధ్య నివాళు లర్పించారు. ఎఫ్బీసీ డైరెక్టర్ డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, అనంతవరం ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు గుదె పాండురంగారావు, వరగాని కళా పరిషత్ అధ్యక్షుడు పోపూరి నాగేశ్వరరావు, మన సంతానం సీరియల్ డైరెక్టర్ మల్నేని రాధాకృష్ణ, ఆలోకం పెద్దబ్బయ్య, సినీ దర్శకుడు జరుగుల పద్మారావు, రామారావు, జరుగుల శంకర్రావుతో పాటు కొండవీటి కళా పరిషత్ అధ్యక్షుడు కట్టా శ్రీహరి, కార్యదర్శి మండెపూడి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు తోకల సాంబశివరావు, కట్టా రామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, ముత్తవరపు రామారావు తదితరులు సీతారామంజనేయులు భౌతికదేహాన్ని సందర్శించి సంతాపం ప్రకటించగా, అనంతరం గ్రామంలోనే అంత్యక్రియలు అధికారికంగా ముగిశాయి. ఆయనకు భార్య సుభాషిణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించండి
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అందిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి అర్జీని నిబంధనల ప్రకారం నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించి బాధితులకు తగిన న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 153 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ క్లినిక్ ద్వారా మూడు డివిజన్లకు చెందిన ఆర్డీఓలు 35 అర్జీలు స్వీకరించారు. వచ్చిన వాటిలో అధికంగా సర్వేలో తమ భూముల విస్తీర్ణం తగ్గిందని, నూతన పింఛన్లు, ఇళ్ల పట్టాలు అందజేయాలని, ఇప్పటికే ఇస్తున్న పింఛన్‌ను పెంచి ఇవ్వాలంటూ కొందరు దివ్వాంగులు స్వయంగా కలిసి అర్జీ అందజేశారు. అలాగే డ్వాక్రా సొమ్ము చెల్లించట్లేదని, కన్న పిల్లలు ఆస్తులు రాసిన తర్వాత తమను పట్టించుకోవట్లేదంటూ పలువురు వృద్దులు కలెక్టరేట్‌కు వచ్చారు. కొన్ని సమస్యలు వారి మాటల్లోనే... మా గ్రామంలో అనాదిగా 63 కుటుంబాలకు చెందిన ఏడెకరాల పొలాన్ని రామిశెట్టి సైదారావు కబ్జా చేసి తన కుటుంబ సభ్యుల పేర్లతో రాయించుకొని స్వాధీనం చేసుకున్నాడు. అతనికి గ్రామ వీఆర్ఓ, సర్వేయరు, ఆర్ఐలు సహకరించారు. తహసీల్దార్ కూడా మా గోడు పట్టించుకోవట్లేదు. దయచేసి ఆ కబ్డాదారుడు, అతనికి సహకరించిన అధికారులపై విచారణ జరిపి మాకు న్యాయం చేయండి. –బట్టు సత్యనారాయణ, కోటయ్య, ఈశ్వరయ్య, కటకం శ్రీనివాసాచారి, తాళ్లపల్లి, మాచర్ల మండలం నా కుమార్తె మున్సిపాల్టీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తూ భర్త చేతిలో హత్యకు గురైంది. ఆమెకు మూడేళ్లు, ఒక సంవత్సరం వయస్సుగల ఇద్దరు పిల్లలు ఉన్నారు. వయస్సు పైబడిన వారి తాత, అమ్మమ్మలు ఆ పిల్లల బాగోగులు చూసుకోలేక పోతున్నారు. అక్క కుమారుడు ఆ బాధ్యతలు స్వీకరించాడు. అందువలన అతనికి ఉద్యోగం ఇప్పించి న్యాయం చేయండి. –తొరటి కోటేశ్వరమ్మ, ప్రకాష్‌నగర్, నరసరావుపేట నా భార్య ప్రసవించిన నాలుగు రోజులకే అనారోగ్యంతో నరసరావుపేట నుంచి గుంటూరుకు తరలిస్తుండగా చనిపోయింది. డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని గుంటూరు జీజీహెచ్‌ను కోరితే తాము కాదు ఇచ్చేది మీ ప్రాంతంలోనే తీసుకోవాలని చెప్పారు. దాని కోసం మా ఊరు చీమలమర్రి పంచాయతీ, నరసరావుపేట లింగంగుంట్ల పంచాయతీ, మున్సిపల్ అధికారులను కలిసినా మేము కాదంటే మేము కాదని సర్టిఫికెట్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు. –టి.వెంకటేశ్వర్లు, చీమలమర్రి, నకరికల్లు మండలం మేము మూడేళ్ల కిందట అబ్దుల్ బాషా డ్వాక్రా గ్రూపుపై పదిమందిని కలిసి రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాం. మాలో మున్నీసా అనే మహిళ తన వంతు రూ.లక్ష తీసుకొని తిరిగి బ్యాంకుకు చెల్లించకుండా వెళ్లిపోయింది. బ్యాంకు వారు ఆ డబ్బును కూడా మమ్మల్ని కట్టమంటున్నారు. –షేక్ నూర్జహాన్, కరిమున్నీసా, ఇస్లాంపేట, నరసరావుపేట మా గ్రామంలోని సాయిబాబా గుడి పక్కగా బ్రిడ్జికి సమీపంలో ప్రయాణికుల కోసం బస్‌షెల్టర్ నిర్మిద్దామని ఆర్అండ్బీ అధికారులను కలిస్తే అంగీకారం తెలుపలేదు. ఇప్పటికే అనధికారికంగా పట్టలతో ఏర్పాటుచేస్తే ప్రయాణికులు ఎండవేడికి ఉపయోగించుకుంటున్నారు. అధికారికంగా ఉత్తర్వులు ఇస్తే నా సొంత ఖర్చులతో నిర్మించి ఇస్తాను. –మద్దూరి రామకోటిరెడ్డి, సొలస, యడ్లపాడు మండలం -
పోలీసు పీజీఆర్ఎస్లో 88 ఫిర్యాదులు
స్వీకరించిన అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి నరసరావుపేట రూరల్: పీజీఆర్ఎస్ ఫిర్యాదులను సత్వరం పరిష్కరించి ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యమని జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్ధిక, కుటుంబ సమస్యలుతో పాటు మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి పలు అంశాలకు సంబంధించిన 88 ఫిర్యాదులు అందాయి. పీజీఆర్ఎస్లో మహిళలు, వృద్ధుల ఫిర్యాదుల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో విచారణ వేగవంతంగా పూర్తిచేసి చట్ట ప్రకారం న్యాయం చేయాలని సూచించారు. ఆస్తి కోసం కుమారుడు వేధిస్తున్నాడు జీవన భృతిగా ఉన్న పొలాన్ని ఇవ్వమని పెద్ద కుమారుడు వేధిస్తున్నాడని మాచర్ల మండలం రాయవరం గ్రామానికి చెందిన వృద్దుడు ఫిర్యాదు చేసాడు. తనకు ఇరువురు సంతానం కాగా వీరికి వివాహం చేసి ఆస్తిని పంచి ఇచ్చినట్టు తెలిపాడు. నాలుగు సంవత్సరాల క్రితం భార్య చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తున్నానని వివరించాడు. జీవనభృతిగా ఉంచుకున్న నాలుగు ఎకరాలను తనకు ఇవ్వమని పెద్ద కుమారుడు మద్యం సేవించి వచ్చి ఇబ్బంది పెడుతున్నట్టు ఫిర్యాదులో తెలిపాడు. కుమారుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు. పెళ్లి చేసుకుని ఎన్ఆర్ఐ మోసం ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన అల్లుడు గత కొంతకాలంగా కుమార్తెతో మాట్లాడటం లేదని, దీనిపై వారి కుటుంబసభ్యులను ప్రశ్నిస్తే విడాకులు ఇవ్వమని అంటున్నారని శావల్యాపురం మండలం కొత్తలూరు గ్రామానికి చెందిన వ్యక్తి ఫిర్యా దు చేసాడు. 8 సంవత్సరాల క్రితం గురజాలలో నివసం ఉంటున్న యువకుడితో కుమార్తెకు వివా హం చేసినట్టు తెలిపాడు. వీరికి కుమార్తె ఉన్నారని పేర్కొన్నాడు. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన అల్లుడు కొంత కాలం కుమార్తెతో ఫోన్లో మాట్లాడినట్టు వివరించాడు. తరువాత ఫోన్లో అందుబాటులో లేకుండా కుమార్తెను మానసికంగా హింసిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.రైతులకు మిర్చి వ్యాపారి టోకరా మిర్చిని కొనుగోలు చేసిన వ్యాపారి డబ్బులు చెల్లించకుండా వేదిస్తున్నాడని కారంపూడి మండలానికి చెందిన రైతులు ఫిర్యాదు చేసారు. మండలంలోని బట్టువారి పల్లె, పెద్ద కొదమ గుండ్ల, కాచవరం గ్రామాలకు చెందిన 70 మంది రైతుల వద్ద నుంచి గాదెవారిపాలెం చెందిన వ్యాపారి ఎండుమిర్చి కొనుగోలు చేసాడు. ఇందులో రైతులకు కొంత మేరకే నగదు చెల్లించాడు. రైతులకు రూ.1.50కోట్లు చెల్లించాల్సి ఉండగా రైతులు నిలదీయడంతో నా వద్ద డబ్బులు లేవని సమాధానమిస్తున్నాడు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. -
అక్రమంగా చెరువు మట్టి తరలింపు
అడ్డుకుని నిలదీసిన గ్రామస్తులు బొల్లాపల్లి: రాత్రిళ్లు అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్న ఘటన బొల్లాపల్లి మండలం మూగ చింతలపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. మండలంలోని మూగచింతల పాలెం గ్రామ సమీపంలో చెరువు మట్టిని రాత్రిళ్లు అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకొని గ్రామస్తులు నిలదీశారు. చెరువు మట్టిని 10 నుంచి 12 టిప్పర్లలో అక్రమంగా తరలించేందుకు సిద్ధమైన విషయం తెలుసుకున్న గ్రామస్తులు మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. అక్రమ మట్టిని తరలింపునకు పాల్పడిన వారిని నిలదీశారు. మట్టి తరలింపునకు అనుమతి ఉందని డ్రైవర్లు చెప్పినా.. అధికారుల అనుమతి ఉంటే రాత్రిళ్లు తరలించాల్సిన అవసరం ఏముందని నిలదీయడంతో మట్టిని నింపుకొన్న టిప్పర్లు అక్కడ నుంచి తరలి వెళ్లగా.. మట్టిని నింపని టిప్పర్లు ఖాళీగా వెళ్లాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో గత రెండేళ్ల నుంచి చెరువులు, బంజర భూముల్లో మట్టిని అక్రమంగా తరలించి రూ.లక్షలు అర్జించారన్నారు. అక్రమ మట్టి తరలింపు పై సంబంధిత శాఖల అధికారులకు సమాచారం ఇచ్చామని, అధికారులనుంచి స్పందనలేదని గ్రామస్తులు చెబున్నారు. చెరువుల మట్టిని గ్రామస్తుల అవసరార్థం మాత్రమే ఉపయోగించుకోవాలని గతంలో పెద్దల సమక్షంలో తీర్మానం చేసుకున్నామని, అయితే గ్రామానికి చెందిన టీడీపీ నేత అక్రమంగా మట్టి తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నాగార్జున యాదవ్ అరెస్టు
దుర్మార్గపు పాలనకు పరాకాష్ఠ .. నరసరావుపేట: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జునయాదవ్ అరెస్టు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గపు పాలనలో భాగంగానే జరిగిందని పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నాగార్జునయాదవ్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు, లోకేష్‌లు అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం మేరకే తెలంగాణలోని తెలుగు–కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. రెండేళ్ల క్రితం సాక్షి టీవీలో కేఎ్స్ఆర్ లెవ్షోలో పాల్గొన్న యాదవ్ మాట్లాడిన సందర్భంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని స్విగ్గీ డెలివరీ బాయ్ అని కామెంట్ చేసిన వీడియోను ఈ నెల 10వ తేదీన తెలంగాణకు చెందిన వ్యక్తి ఫేస్ బుక్‌లో చూసి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయటం కుట్రలో భాగమే అన్నారు. ఆ రాష్ట్ర పోలీసులు మన రాష్ట్రంలోని పోలీసుశాఖకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న యాదవ్‌ను బలవంతంగా తీసుకెళ్లారన్నారు. అడ్డువచ్చిన ఆయన భార్యను కూడా జీపులో ఎక్కించుకొని కొంతదూరం వెళ్లగానే రోడ్డుపై విడిచిపెట్టి వెళ్లిపోవటం దారుణమని అన్నారు. వాస్తవానికి ఇటువంటి కేసుల్లో 41ఏ నోటీసులు ఇవ్వాలని కోర్టులు అనేకమార్లు చెప్పినా ఆంధ్ర, తెలంగాణ పాలకులు అమలు చేయట్లేదన్నారు. యాదవ్‌ను తీసుకెళ్లిన వెంటనే గుంటూరు ఎస్పీని వైఎస్సార్సీపీ నాయకులు కలువగా తనకు కూడా ఆ విషయం తెలియదని వ్యాఖ్యానించి. ఆ తర్వాత ఆయన వివరాలు తెలుసుకోవడం ఆధారంగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. రెండేళ్ల క్రితం జరిగిన సంఘటనపై వైఎస్సార్సీపీ నాయకులను ఇప్పుడు అరెస్టుచేసిన పోలీసులు.. వైఎస్ జగన్ సతీమణి ఫొటోలను ఐటీడీపీ వ్యక్తులు మార్ఫింగ్ చేసి పెట్టిన తప్పుడు పోస్టులపై మాత్రం స్పందించట్లేదన్నారు. రేవంత్‌రెడ్డి రోజూ అక్కడి ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడే మాటలు ఆయన నైజాన్ని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా ఏమాత్రం మాట్లాడని నాగార్జున యాదవ్‌పై ఇప్పటికే రాష్ట్రంలో 12 అక్రమ కేసులు పెడితే కోర్టు నుంచి యాంటిస్పేటరీ బెయిల్ తీసుకొని ఉన్నారన్నారు. పోలీసులు హెబియస్ కార్పస్ పిటిషన్లపై కూడా స్పందించలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఇటువంటి దౌర్జన్యాలు, అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నాయకులు భయపడబోరని, నాగార్జున యాదవ్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను మేధావులు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు. ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, యువజన విభాగ జిల్లా ఉపాధ్యక్షుడు నాలి వెంకటరావుయాదవ్ మాట్లాడుతూ నాగార్జున యాదవ్ అరెస్టు అప్రజాస్వామికమన్నారు. బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోగుల మనోహర యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం నాయీ, పట్టణ అధ్యక్షుడు మర్రిపూడి రాంబాబు, జిల్లా వాలంటరీ విభాగ జిల్లా కార్యదర్శి నక్క వెంకటకోటేశ్వరరావు పాల్గొన్నారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
కుళ్లిన స్థితిలో క్వారీ గుంతలో మృతదేహంగుంటూరు రూరల్: కుళ్లిన స్థితిలో క్వారీ గుంతలో వ్యక్తి మృతదేహం ఆదివారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం... పొత్తూరు గ్రామ రెవెన్యూ పరిధిలో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం క్వారీ గుంతలో ఛిద్రమైన స్థితిలో ఉందని స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహంపై వస్త్రాలు లేవని పోలీసులు గుర్తించారు. కాళ్లను తాళ్లతో కట్టారని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రుద్ర ట్రస్ట్ సహకారంతో జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎక్కడైనా చంపి ఇక్కడకు తెచ్చి పడేశారా? ఇక్కడే హత్య చేశారా? అనే కోణాలలో దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో మృతుడు తాడికొండ మండలం ఫణిదరం గ్రామానికి చెందిన మాడుగుల శంకరరావు (52)గా గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడని తేలింది. ఈ నెల 7వ తేదీన చిలకలూరిపేటలో పని ఉందని ఇంటి నుంచి బయటకు వచ్చాడని, తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీస్ స్టేషన్లో ఈ నెల 8వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశారని తెలిసింది. కుటుంబసభ్యులకు నల్లపాడు పోలీసులు సమాచారం అందించారు. వ్యాపార లావాదేవీల వల్ల హత్య చేశారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణాలలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
స్టీరింగ్ విరిగి వాహనం బోల్తా
కొల్లూరు: అరటి గెలలు లోడుతో ప్రయాణిస్తున్న వాహనం స్టీరింగ్ విరిగిపోవడంతో పంట పొలాలలోకి దూసుకువెళ్లి పల్టీ కొట్టిన సంఘటన కొల్లూరు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. లంక గ్రామాల నుంచి అరటి గెలల లోడుతో వాహనం మిర్యాలగూడ బయలుదేరింది. కూలీలను వారి గ్రామంలో దింపేందుకు మండలంలోని కోటిపల్లి వెళుతుండగా కొల్లూరు సమీపంలోని మలుపు దాటిన అనంతరం అకస్మాత్తుగా స్టీరింగ్ విరిగిపోవడంతో అదుపు కోల్పోయి పంట పొలాల వైపు దూసుకుపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన కూలీలు పంట పొలాల్లోకి దూకివేయడంతో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. పల్టీ కొట్టిన వాహనంలో నుంచి డ్రైవర్ సైతం క్షేమంగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
డేంజర్... డెంగీ!
డెంగీ! వర్షాకాలం మొదలై నెల రోజులు కూడా కాకముందే పల్నాడు జిల్లాలో సీజనల్ వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రతి ఇంట్లో కనీసం ఒకరు జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులతో బాధపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రోగుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వం ప్రతి ఏడాది జూలై నెలను యాంటీ డెంగీ మాసంగా ప్రకటించి ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో మాత్రం వాటి ప్రభావం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నరసరావుపేట టౌన్: పట్టణాలు, గ్రామాల్లో అపరిశుభ్ర వాతావరణం, నిల్వ నీరు, దోమల బెడద కారణంగా డెంగీతోపాటు వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట ఏరియా వైద్యశాలకు గతంలో రోజుకు సుమారు 600 మంది వరకు ఓపీకి వస్తుండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 750 దాటింది. ఉదయం నుంచే ఓపీ కౌంటర్లు, వైద్యుల గదుల వద్ద రోగులు బారులు తీరుతున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు అధికంగా జ్వరాలతో ఆస్పత్రులకు వస్తుండటంతో వైద్యసిబ్బందిపై పనిభారం పెరిగింది. ప్రైవేటు ఆస్పత్రులు కూడా జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. దోమల కేంద్రాలుగా కాలనీలు నరసరావుపేట పట్టణంతోపాటు జిల్లాలోని అనేక గ్రామాల్లో డ్రెయినేజీలు నెలల తరబడి శుభ్రం చేయకపోవడం, చెత్త పేరుకుపోవడం, వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు విపరీతంగా పెరిగాయి. రంగు మారిన మురుగు నీరు కాలువల్లో నిల్వ ఉండటం, ఖాళీ స్థలాల్లో చెత్త, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ పాత్రల్లో నీరు నిల్వ ఉండటం దోమలకు అనుకూల వాతావరణంగా మారింది. ఫలితంగా డెంగీ వ్యాప్తి పెరిగింది. నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదమే మరోవైపు డెంగీ సాధారణ జ్వరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతులు, శరీరంపై ఎర్రటి మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్లేట్లెట్స్ తగ్గి రక్తస్రావం వంటి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్లేట్లెట్స్ పేరుతో దోపిడీ డెంగీ పేరు వినగానే ప్రజలు భయపడుతున్న పరిస్థితిని కొందరు ప్రైవేటు ఆస్పత్రులు అవకాశంగా మార్చుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్లేట్లెట్స్ తగ్గాయని చెబుతూ అవసరం లేని రక్తపరీక్షలు, స్కానింగ్‌లు, ఖరీదైన చికిత్సలు సూచించి రూ.వేల నుంచి రూ.లక్షల వరకు బిల్లులు వేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. వైద్య నిపుణుల ప్రకారం ప్రతి డెంగీ రోగికి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉండదు. రోగి పరిస్థితిని బట్టి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. ప్రజలు వదంతులను నమ్మకుండా ప్రభుత్వ వైద్యుల సలహాలు పాటించాలని సూచిస్తున్నారు. కాగితాలకే పరిమితం ప్రతి ఏడాది జూలైలో డెంగీ నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు, ఇంటింటా తనిఖీలు, యాంటీ లార్వా స్ప్రేయింగ్, ఫాగింగ్ వంటి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని ప్రజలు అంటున్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డెంగీకి కారణమయ్యే దోమ పగటి వేళల్లో కుడుతుంది. నీటి డ్రమ్‌లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, కూలర్లు, ఫ్రిజ్ ట్రేలు, పూల కుండీలు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, ప్లాస్టిక్ కప్పులు వంటి చోట్ల నిల్వ ఉండే స్వచ్ఛమైన నీటిలోనే ఈ దోమలు ఎక్కువగా పెరుగుతాయి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండనివ్వకూడదు. వారానికి ఒకసారి నీటి నిల్వ పాత్రలను పూర్తిగా శుభ్రం చేయాలి. పూర్తిగా చేతులను కప్పేలాదుస్తులు ధరించాలి. దోమతెరలు, దోమల నివారణ పరికరాలు వినియోగించాలి. జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సూచన లేకుండా ప్లేట్లెట్స్ ఎక్కించుకోవద్దు. అధికారుల అప్రమత్తతే రక్షణ డెంగీని అరికట్టాలంటే యాంటీ డెంగీ మాసం పేరుతో ప్రచారం చేయడం మాత్రమే సరిపోదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాలనీల్లో నిల్వ నీటిని తొలగించడం, డ్రెయినేజీలను శుభ్రం చేయడం, ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్‌ను విస్తృతంగా నిర్వహించడం అవసరమని పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో పల్నాడు జిల్లాలో డెంగీతో పాటు ఇతర సీజనల్ వ్యాధులు మరింత విజృంభించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
రాజకీయ కుట్రలో భాగంగానే నాగార్జున యాదవ్ అరెస్టు
వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ గుంటూరు మెడికల్: ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ(ఐఏపీ) ఏపీ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల వైద్య విభాగాధిపతి డాక్టర్ నీలి ఉమాజ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం విశాఖపట్నంలో మానసికవ్యాధి వైద్య నిపుణుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ ఉమాజ్యోతిని మానసిక వైద్య నిపుణుల సంఘం రాష్ట్ర శాఖకు ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఈమె రాష్ట్ర శాఖలో వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. డాక్టర్ ఉమాజ్యోతి 1999 నుంచి సంఘంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లా అధ్యక్షురాలిగా, రాష్ట్ర సంఘంలో పలు హోదాల్లో సేవలందించారు. ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై న డాక్టర్ ఉమాజ్యోతికి మానసికవ్యాధి వైద్య నిపుణుల సంఘం గుంటూరు ప్రెసిడెంట్ డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, సెక్రటరీ డాక్టర్ పసుపుల సాయి కిరణ్, ఇతర సంఘ నేతలు, గుంటూరు జీజీహెచ్ మానసికవ్యాధుల వైద్య విభాగానికి చెందిన వైద్యులు, జీజీహెచ్, గంటూరు వైద్య కళాశాల అధికారులు, వైద్యులు అభినందనలు తెలిపారు. గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన ప్రముఖ మధుమేహవైద్యనిపుణులు, ఎస్వీఆర్ షుగర్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ వీవీ రామకుమార్ ఆదివారం జాతీయస్థాయి అవార్డు అందుకున్నారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో జ్యోతి దేవ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఫోరం– 2026 సంవత్సరానికి ‘పేషెంట్ ఎంపవర్మెంట్ డిజిటల్ ఎంగేజ్మెంట్ అండ్ పేషెంట్ ఎడ్యుకేషన్ ఇన్షియేటివ్స్‘ విభాగంలో ప్రముఖ మధుమేహ నిపుణులు పద్మశ్రీ డాక్టర్ శశాంక్ జోషి, త్రివేండ్రం గోకులం హాస్పిటల్ చైర్మన్ మనోజ్ చేతుల మీదుగా డాక్టర్ రామ్‌కుమార్ జాతీయస్థాయి పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ కుమార్ మాట్లాడుతూ మూడు దశాబ్దాలకు పైగా షుగర్ వ్యాధిపై వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. జాతీయ పురస్కారాన్ని అందుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. తన ఆత్మీయ పేషెంట్లకు, సహచర వైద్య బృందానికి, విద్య నేర్పిన గురువులకు, కుటుంబ సభ్యులకు డాక్టర్ రామ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. -
తల్లిదండ్రుల విశ్వాసమే భాష్యం విజయానికి పునాది
రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ గుంటూరు ఎడ్యుకేషన్: తల్లిదండ్రులు తమపై ఉంచిన విశ్వాసమే భాష్యం విజయానికి పునాది అని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్‌ను అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు, భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ అన్నారు. ఆదివారం గోరంట్లలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని భాష్యం విద్యాసంస్థలకు చెందిన సెంట్రల్ అడ్మిన్ టీం, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో భాష్యం రామకృష్ణకు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ 1993లో 183 మంది విద్యార్థులతో మొదలైన భాష్యం విద్యాసంస్థలు విజయ ప్రస్థానంలో ప్రతి ఒక్కరి కృషి, సహకారం దాగి ఉన్నాయని, తద్వారా భాష్యం తన స్థానాన్ని పదిలపరచుకుందని పేర్కొన్నారు. భాష్యంలో పనిచేస్తున్న సిబ్బందికి ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు మాట్లాడుతూ భాష్యం స్థాపించిన నాటి నుంచి తమతో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. తొలుత భాష్యం మెయిన్ క్యాంపస్ నుంచి గోరంట్ల వరకు భాష్యం రామకృష్ణ, వారి కుటుంబ సభ్యులను భాష్యం కార్యనిర్వాహక సిబ్బంది ర్యాలీగా తీసుకెళ్లి వేదమంత్రోచ్ఛరణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. సభకు భాష్యం ఐఐటీ అకాడమీ ప్రోగ్రామర్ ఆనంద్ కుమార్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనంతో భాష్యం రామకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కార్యనిర్వాక సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. -
జిల్లా ఎస్పీని కలిసిన అమరావతి ఎల్‌అండ్‌ఓ ఓఎస్డీ
నగరంపాలెం: గుంటూరు నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను ఆదివారం అమరావతి లా అండ్ ఆర్డర్ (ఎల్/ఓ) నూతన ఓఎస్డీ మనోజ్ రామనాథ్‌హెగ్డే మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మనోజ్ రామనాథ్‌హెగ్డే రాజంపేట నుంచి బదిలీపై అమరావతి ఎల్ అండ్ ఓకు బదిలీయ్యారు. అమరావతి రాజధాని ఏరియాకు ప్రాధాన్యత ఉందని జిల్లా ఎస్పీ అన్నారు. సున్నితమైన ప్రాంతంలో విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. తుళ్లూరు, సీఆర్డీఏ లో లా అండ్ ఆర్డర్ నిర్వహణలో ఇంటెలిజెనన్స్, ఎస్బీ సమాచారంతో ఉండాలని, ప్రజా భద్రతకై విధులు చేపట్టాలని సూచించారు. -
ఉపాధ్యాయ పని సర్దుబాటు కౌన్సెలింగ్
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయిలో ఉపాధ్యాయ పని సర్దుబాటు కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో నిర్వహించారు. గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా అధ్యక్షతన నిర్వహించిన ఈ ప్రక్రియలో ఎస్జీటీలుగా పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్ అర్హతలు ఉన్న వారిని వివిధ ఉన్నత పాఠశాలలకు కేటాయించారు. పలువురు ఎస్జీటీలు గుంటూరు జిల్లా నుంచి పల్నాడు జిల్లాకు వెళ్లారు. కౌన్సెలింగ్‌కు హాజరైన 147 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల్లో తెలుగు మీడియం విభాగం నుంచి హైస్కూల్‌కు అర్హతలు గల ముగ్గురు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కోరుకోగా, మరో 10 మంది ఎస్జీటీలు వేర్వేరు పాఠశాలలను కోరుకున్నారు. ఉర్దూ మీడియంలో హాజరైన తొమ్మిది మంది ఉపాధ్యాయుల్లో ఇద్దరు వేర్వేరు పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. మొత్తం 147 మంది ఉపాధ్యాయుల్లో 15 మంది పాఠశాలలను ఎంపిక చేసుకోగా, మిగిలిన వారు సుముఖత చూపలేదు. కౌన్సెలింగ్ ప్రక్రియలో గుంటూరు డీవైఈవో జి.ఏసురత్నం, ఎంఈవోలు కె.విజయభాస్కర్, ఎండీ ఖాసిం, జిల్లా విద్యాశాఖ ఐటీ సెల్ సిబ్బంది నాగమల్లేశ్వరరావు, శివ నాగేశ్వరరావు, నరేష్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెనాలి రూరల్: పోలీసులమని చెప్పి దోపిడీలకు పాల్పడుతున్న వారిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన 73 ఏళ్ల మల్లికార్జునరెడ్డి ఈ నెల 7వ తేదీన తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులో రూ.1.60 లక్షలు విత్‌డ్రా చేశారు. నగదును స్కూటీ డిక్కీలో పెట్టుకుని తెనాలి వస్తుండగా ఆటోనగర్ వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. పోలీసులమని, తనిఖీ చేయాలంటూ వాహన పత్రాలను అడిగారు. అదే సమయంలో డిక్కీలో ఉన్న నగదులో నుంచి రూ.50 వేలు తీసుకుని పరారయ్యారు. ఈ కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిందితుల్లో ఒకరు చీరాలకు చెందిన వ్యక్తి కాగా, మరో వ్యక్తి బాపట్లకు చెందిన మాజీ సైనికుడని విశ్వసనీయ సమాచారం.నగరంపాలెం: జిల్లా వ్యాప్తంగా లాడ్జీలు, హోటళ్లలో ఆదివారం సాయంత్రం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఆయా సబ్ డివిజన్లలోని డీఎస్పీల పర్యవేక్షణలో సీఐలు, ఎస్ఐలు, ప్రత్యేక బృందాలుగా ఈ తనిఖీలు కొనసాగించారు. తొలుత రిజిస్టర్ పుస్తకాలను పరిశీలించారు. రోజుకి ఎంత మంది వస్తున్నారు, ఏయే పనులపై వస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటున్నారనే విషయాలపై నిర్వాహకుల నుంచి ఆరా తీశారు. అనంతరం గదుల్లో బస చేసిన వ్యక్తుల ఆధార్ కార్డులు, ఇతరత్రా గుర్తింపు కార్డులను పరిశీలించారు. జిల్లాలో, ముఖ్యంగా గుంటూరు నగరంలో వారు ఎందుకు వచ్చారనేది అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా వస్తే ఒరిజినల్ ఆధార్, ప్రభుత్వ గుర్తింపు కార్డులను పరిశీలించాక వాటి జిరాక్స్ కాపీలను తీసుకోవాలని నిర్వాహకులకు పోలీస్ అధికారులు సూచించారు. విధిగా రిజిస్టర్లల్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు 24 గంటలు వాడుకంలో ఉండాలని, కనీసం నెల రోజుల రికార్డింగ్ బ్యాకప్ ఉండాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. దుర్గమ్మకు విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. తిరుపతి జిల్లా పనగలూరుకు చెందిన జి. సుబ్రహ్మణ్యంరెడ్డి కుటుంబం అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ. 1,00,116 విరాళాన్ని ఆలయ అధికా రులకు అందజేశారు. మచిలీపట్నం నరసింహనగర్‌కు చెందిన సీహెచ్ శ్రీలలిత కుటుంబం అమ్మవారి అన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ డీఈవో కిషోర్‌బాబు, అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను దాతలకు అందజేశారు. -
ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్టు
పట్నంబజారు: ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాలు.. ఏప్రిల్ నెల 4వ తేదీన చౌత్రా డౌన్ గంజిబజార్లోని కోట్ల అంకమ్మ తల్లి దేవస్థానంలో గుడి పూజారిని మాయ చేసి అమ్మవారి మెడలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు ఒక వ్యక్తి దోచుకుని పోయాడు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడుని గుర్తించారు. కృష్ణాజిల్లా విజయవాడ మాచవరానికి చెందిన ఏమని రాంబాబు ప్రస్తుతం హైదరాబాదులోని నేతాజీ నగర్లో నివాసం ఉంటున్నారు. ఏప్రిల్ నాలుగో తేదీన విజయవాడ నుంచి స్కూటీపై గుంటూరుకు వచ్చి గంజి బజార్‌లోని కోట్ల అంకమ్మ తల్లి దేవస్థానంలో పూజారి గుడి శుభ్రం చేస్తుండగా అమ్మవారికి దండం పెట్టుకున్నట్లు నటించి ఆయనకు రూ.500 నోటు ఇచ్చి 100 రూపాయలు దక్షిణ తీసుకుని మిగతావి తిరిగి ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో ఆలయ అర్చకుడు బయటకు వెళ్లిన సమయంలో అమ్మవారి బంగారు మంగళ సూత్రాలు, బొట్టు మొదలగు వెండి వస్తువులను అపహరించుకుపోయాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 70కి పైగా ఆలయాల్లో చోరీకి చేసినట్లు గుర్తించిన పోలీసులు నిందితుడిని సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నుంచి అమ్మవారి ఆలయంలో చోరీకి పాల్పడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. -
నేషనల్ హైవేపై రెయిలింగ్ రాడ్లు చోరీ
నాదెండ్ల: జాతీయ రహదారి నూతన బైపాస్ రోడ్డుకు ఇరువైపులా రెయిలింగ్ బిగించిన ఇనుప రాడ్లను దొంగిలిస్తున్న వ్యక్తిని హైవే పెట్రోలింగ్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ ఆర్.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన తాళ్లూరి జక్రయ్య దివ్యాంగుడు. ఒక కాలు లేకపోవటంతో మూడు చక్రాల బండిపై తిరుగుతుంటాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో జక్రయ్య నూతన బైపాస్ రోడ్డుపై గణపవరం వద్ద రోడ్డు వెంబడి రెయిలింగ్‌కు బిగించిన ఇనుప రాడ్లు దొంగిలించి పాత ఇనుప దుకాణంలో విక్రయిస్తున్నాడు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు గత పదిరోజులుగా సీసీ కెమేరాల ఫుటేజీ గమనించి సుమారు రూ.60 వేలు విలువైన ఇనుప రాడ్లు దొంగిలించి, విక్రయించినట్లు నేషనల్ హైవే పోలీసులు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగిలించిన వస్తువులను ఎక్కడెక్కడ విక్రయించాడో ఆరా తీస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు -
వైఎస్సార్ సీపీ ఓటర్లే టార్గెట్ !
పిడుగురాళ్ల: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)– 2026 కార్యక్రమాన్ని ప్రారంభించి, కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమం ఈ నెల 14తో ముగియనుంది. అయితే కొందరు అధికారుల తీరుతో కార్యక్రమం తీరుతెన్నులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన గ్రామం. ఈ గ్రామంలో 213, 214, 215, 216, 217 నంబర్ల పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ నెల 11వ తేదీవరకు సర్ పక్రియ, డిజిటలైజేషన్ సజావుగా సాగింది. అయితే ఈనెల 11వ తేదీన గురజాల ఆర్డీఓ మురళి, పిడుగురాళ్ల తహసీల్దార్ మధులు కరాలపాడు గ్రామంలోని సచివాలయంలో బీఎల్ఓలతో సర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఇక్కడి బీఎల్ఓల పనితీరు మారిందని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియలో కీలకమైన ఆదివారం రోజున డిజిటలైజేషన్ ప్రక్రియలో ఇక్కడి ఐదుగురు బీఎల్ఓలు హాజరై వేగవంతంగా ఆన్లైన్ చేయాల్సి ఉండగా కేవలం ఒక బీఎల్ఓ మాత్రమే హాజరై అది కూడా మధ్యాహ్నం తర్వాత వచ్చి ఆన్లైన్ కార్యక్రమం నామమాత్రంగా నిర్వహించారు. దీంతో వైఎస్సార్ సీపీ సానుభూతి పరులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీలకు అతీతంగా చేయాల్సిన కార్యక్రమంలో అధికారుల ఒత్తిళ్లతోనే బీఎల్ఓలు విధులకు దూరంగా ఉంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఏ ప్రభుత్వ కార్యక్రమైన ఉన్నతాధికారులు వచ్చివెళ్లిన తర్వాత కింది స్థాయి సిబ్బంది వేగవంతంగా విధులు నిర్వహించి పనులు ముగిస్తారని, కానీ కరాలపాడులో మాత్రం ఉన్నతాధికారులు వచ్చినప్పటి నుంచి ప్రక్రియ నత్తనడకన సాగుతుందని ఆరోపిస్తున్నారు. ● ఈ విషయమై తహసీల్దార్ మధుబాబును ‘సాక్షి’ వివరణ కోరగా.. కరాలపాడులో బీఎల్ఓలు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారని, మరింత సమాచారం కావాలంటే ఆ గ్రామానికి మండల ఆర్ఐ శ్రీనుబాబు ఇన్ఛార్జిగా ఉన్నాడని మాట దాటవేశారు. దీంతో ఆర్ఐ శ్రీనుబాబును వివరణ కోరగా కరాలపాడులోని ఐదు ఎన్నికల బూత్‌లలో ఇప్పటి వరకు 84 శాతం ఆన్లైన్ పక్రియ చేయటం జరిగిందని, కొన్ని ఎన్యూమరేషన్ ఫారాలు ఓటర్ల వద్ద నుంచి సేకరించాల్సి ఉందని, అవి కూడా ఈ రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో సేకరించి ఆన్లైన్ చేస్తామని తెలిపారు. -
రేపు ఫ్యాప్టో ధర్నాను జయప్రదం చేయండి
ఫ్యాప్టో జిల్లా చైర్మన్ రామిరెడ్డి పిలుపునరసరావుపేట ఈస్ట్: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ ఫ్యాప్టో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ నెల 14వ తేదీన తలపెట్టిన జిల్లాస్థాయి ర్యాలీ, ధర్నా కార్యక్రమాలలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఎల్.వి. రామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నిరసనకు పోలీస్‌శాఖ అనుమతి తీసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం 9 గంటలకు స్టేషన్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకొని ధర్నా చేపట్టనున్నట్టు వివరించారు. ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి చైర్మన్ నియామకం, డీఏ ప్రకటన, ఐఆర్ విడుదల, బకాయిల చెల్లింపులు, కారుణ్య నియామకాలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ తదితర డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఆందోళనలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని గళం వినిపించాలని కోరారు. ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం.మోహనరావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల ఒత్తిడి తగ్గించాలన్నారు. వారిని బోధనకు పరిమితం చేయాలన్నారు. మున్సిపల్, గురుకుల, ఇతర ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఫ్యాప్టో నాయకులు బి.సంపత్‌బాబు, బి.శ్రీనివాసరావు, ఆర్.గోవిందరాజులు, పమ్మి వెంకటరెడ్డి, ఎ.ఏమండీ, పి.వి.భీష్మారావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగార్జున యాదవ్‌ని ఇంటి నుండి తీసుకెళ్లిన పోలీసులు.. తెలంగాణ పోలీసులమంటూ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నాగార్జున యాదవ్‌ని పోలీసులు తీసుకెళ్లారు. నల్లపాడు పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపారు.నాగార్జున యాదవ్ అరెస్ట్‌పై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ రఘురాం, నాగార్జున యాదవ్ భార్య.. ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. -
దేశం నేత భూ కబ్జా
పల్నాడుతాళ్లపల్లిలో ఏడు ఎకరాలకు పైగానే పొలం ఆక్రమణ ● సమాధుల భూముల్లోనూ పాగా ● రిజిస్ట్రేషన్ భూములనూ వదలని టీడీపీ నేత రామిశెట్టి సైదారావు ● మామూళ్లతో అధికారులతో దోస్తీ ● ఆ టీడీపీ నేతపై సొంత పార్టీలోనే ఆగ్రహావేశాలు ● న్యాయం చేయకుంటే కలెక్టర్‌ను కలిసేందుకు సిద్ధమంటున్న గ్రామస్తులు 7మాచర్ల రూరల్: అధికారమే అండగా అధికార పార్టీ నాయకుల అక్రమాలు, ఆక్రమణలు, దందాలు రోజు రోజుకి అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి. ప్రభుత్వ రెవెన్యూ భూములను ఆక్రమించుకోవటమే కాకుండా చివరికి గ్రామ ప్రజల చొప్ప దొడ్డి, పశువుల పాకలకు ఉపయోగించుకునే భూములనే కాకుండా తమ పూర్వీకుల సమాధులు నిర్మించుకున్న భూములను సైతం ఆక్రమించుకొని రూ.కోటికి పైగా విలువైన భూములను ఆన్లైన్లో నమోదు చేసుకుని, విక్రయాలు జరుపుతున్న టీడీపీ మండల నాయకుడి వైనం వెలుగులోకి వచ్చింది. మాచర్ల మండలంలోని తాళ్ళపల్లి గ్రామంలోని 351, 352 సర్వే నెంబర్లో గల ఏడు ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్ భూములను అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రామిశెట్టి సైదారావు 4.40 ఎకరాలు తన అత్త మన్నెంకుంట శ్రీదేవి పేరుపై, 2.50 ఎకరాలు, మిగిలిన భూమిని ఇతరులపై దర్జాగా ఆన్లైన్లో ఎక్కించుకొని రిజిస్ట్రేషన్ సైతం చేయించుకుని మార్కెట్లో విక్రయించుకునేందుకు సిద్ధమయ్యాడు. తాళ్ళపల్లి గ్రామం ఏర్పడిననాటి నుంచి వందేళ్లకు పైగా ఏడు ఎకరాల భూమిని గ్రామస్తులు తమ పశువుల కొట్టాలకు, గడ్డివాములు ఏర్పాటు చేసుకునేందుకు అదే గ్రామానికి చెందిన రైతు నుంచి కటకం శ్రీనివాసరావు 6సెంట్లు, పేర్ల అంకయ్య 9 సెంట్లు, పీరసాల అంజయ్య, కొండా చౌడయ్య, కటకం లక్ష్మినారాయణ, యడవల్లి కొండయ్య, సంపత్తి సైదారావు, పొర్లు అశోక్, కడియం రమేష్, కొండా మల్లయ్య, చింతా నాగేశ్వరరావు, కటకం శ్రీనివాసరావు, తదితర రైతులు తలా పది సెంట్లు చొప్పున కొనుగోలు చేసి తాత ముత్తాల నుంచి కొట్టాలకు, పశువుల పాకలకు ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా కటకం శ్రీనివాసరావు, కటకం లక్ష్మీనారాయణలు ఈ స్థలంలో తమ తల్లిదండ్రుల సమాధులను ఏర్పాటు చేసుకొని ప్రతి ఏటా పూజలు నిర్వహించుకుంటున్నారు. ఇలాంటి రిజిస్ట్రేషన్ కలిగిన స్థలాన్ని సైతం సదరు టీడీపీ నాయకుడు రామిశెట్టి సైదారావు దర్జాగా ఆన్లైన్లో నమోదు చేసుకొని విక్రయాలు జరపటం పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారముందని అధికారులను మభ్యపెట్టి గ్రామ రైతుల భూములను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తుంటుంటే గ్రామ వీఆర్ఓ, సర్వేయర్లు మామూళ్ల మత్తులో రిజిస్ట్రేషన్ భూములు సైతం సైదారావు కుటుంబ సభ్యుల పేర్లతో నమోదు చేయటంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ నడిబొడ్డున ఉన్న రిజిస్ట్రేషన్ భూములకే రక్షణ లేకపోతే ఇక గ్రామ శివారులోని సాగు భూముల పరిస్ధితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. గ్రామ రెవెన్యూ రికార్డులను నిత్యం పరిశీలించి గ్రామంలో సంచరించే వీఆర్ఓ, సర్వేయర్లకు ఆక్రమిత భూములు రిజిస్ట్రేషన్ భూములని తెలియదా? తెలిసి కూడా అక్రమంగా ఆన్లైన్లో ఎక్కించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోరంటూ ప్రశ్నిస్తున్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నీటి నిల్వ 31.1220 టీఎంసీలు. ప్రాజెక్టుకు 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 3000 క్యూసెక్కులు వదులుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 513.70 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. -
ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి బాధ్యతల స్వీకారం
నరసరావుపేట రూరల్: జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్)గా రోహిత్‌కుమార్ చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. 2022 బ్యాచ్‌కు చెందిన రోహిత్‌కుమార్ చౌదరి గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. తాడిపత్రిలో ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై జిల్లాకు వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన జేవీ సంతోష్‌కు ఎస్పీగా ఉద్యోగోన్నతి లభించింది. ఇదిలా ఉండగా డిప్యూటేషన్‌పై సీబీఐకు వెళ్తున్న జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు శనివారం రిలీవ్ అయ్యారు. జేవీ సంతోష్‌కు ఇన్చార్జ్ ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. -
రైతులపై ప్రభుత్వ దౌర్జన్యాలు ఆపాలి
ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్ లక్ష్మీపురం: రైతుల ఆమోదంతో దేవతల రాజధాని నిర్మిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు దీనికి భిన్నంగా రైతుల పచ్చని పంట పొలాలను ఒక్కసారిగా ధ్వంసం చేయటమే కాకుండా అడ్డు వచ్చిన రైతులను కూడా విచక్షణారహితంగా ఈడ్చివేయడం అన్యాయమని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ పేర్కొన్నారు. గుంటూరు కార్యాలయంలో శనివారం మాట్లాడారు. చూస్తుంటే ప్రశాంతమైన రాజధాని నిర్మాణం జరిగేటట్టు కనబడట్లేదని అభిప్రాయపడ్డారు. రాజధాని పరిధిలోనే ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో భూములు తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదనలును రైతుల ఆమోదించి మార్కెట్ విలువ ప్రకారం చెల్లించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 9వ తేదీ ఉండవల్లిలో సీఆర్డిఏ అధికారులు గ్రామ సభ జరిపి రైతుల ప్రమేయం లేకుండా, చర్చించకుండా ఎటువంటి నిర్ణయం చేయబోమని చెప్పిన రెండు రోజులు గడవక ముందే పోలీసులను రంగంలో దింపి పచ్చని పంట పొలాలును పొక్లెయిన్లతో ధ్వంసం చేయటం దుర్మార్గమైన, సహించరాని చర్య అన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని చెప్పిన రైతుల పైన ఈ విధంగా వ్వహరించటం అంటే భవిష్యత్‌లో దీని తగిన మూల్యం చెల్లించక తప్పదు అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఈ దుందుడుకు చర్యలను ఉపసంహరించుకొని రైతు పక్షపాతిగా వారు కోరిన మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించి న్యాయం చేయాలని అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. తెనాలిరూరల్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన విజయవాడ– చైన్నె రైలు మార్గంలోని చుండూరు– మోదుకూరు స్టేషన్ల మధ్య శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని జీఆర్పీ పోలీసులు శనివారం పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఎల్.సరస్వతి తెలిపారు. -
కనికరించని మేఘం
● కరి మబ్బులు ఉన్నా.. వాన జాడ లేదన్నా ● జిల్లాలో జూలై 11న 1.2 మి.మీ. వర్షం రొంపిచర్ల: జిల్లాలో వర్షాలు దాదాపు ముఖం చాటేశాయి. రోజంతా ఆకాశం మేఘావృతమవటమే తప్పా ఆకాశం నుంచి చినుకు రాలదు. అయితే శనివారం జిల్లాలో వర్షపాత గణాంకాల ప్రకారం బొల్లాపల్లి మండలంలో మాత్రమే 1.2 మిల్లీమీటర్ల స్వల్ప వర్షపాతం నమోదైంది. మిగతా అన్ని మండలాల్లో వర్షపు జాడలేదు. ఈ నెల ప్రారంభంలో అక్కడక్కడ కురిసిన వర్షాలతో రైతులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, గత కొన్ని రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో వరి, పత్తి, మిర్చి, కందులు తదితర ఖరీఫ్ పంటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా విత్తనాలు వేసిన పొలాల్లో తేమ నిల్వ ఉండేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు అవసరమని రైతులు చెబుతున్నారు. గణాంకాల ప్రకారం జూలై నెలకు సాధారణంగా ఈ నాటికి 46.47 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు నమోదైన వర్షపాతం అంతంత మాత్రమే. జూలై 3న జిల్లాలో అత్యధికంగా 92.6 మి.మీ., 6న 45.4 మి.మీ., 9న 15.2 మి.మీ. 10న 5.4 మి.మీ., జూలై 11న కేవలం 1.2 మి.మీ. మాత్రమే వర్షపాతం నమోదైంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు సాగు పనులు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో విసృతంగా వర్షాలు కురిస్తే తప్ప ఖరీఫ్ సాగుకు అనుకూలించే పరిస్థితులు లేవని రైతులు చెబుతున్నారు. -
వినూత్న ప్రయోగం ‘గ్రహాంతర ప్రేమికుడు’
తెనాలి: మానవాళితో గ్రహాంతరవాసుల సహజీవనం కథాంశంతో మా–ఏపీ నుంచి నూతన దర్శకుడు స్టైల్ రవి రూపొందిస్తున్న ’గ్రహాంతర ప్రేమికుడు’ ఓటీటీ చిత్రం ఒక వినూత్న ప్రయోగమని మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్‌రాజా చెప్పారు. తెనాలిలోని సంస్థ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గ్రహాంతర వాసులు... ఏలియన్స్ ఉనికిని నేచర్ అస్ట్రానమి జర్నల్ సైంటిస్టులు ధ్రువీకరించారని దిలీప్‌రాజా చెప్పారు. దర్శకుడు స్టైల్ రవి మాట్లాడుతూ శాస్త్రవేత్తలు వెల్లడించిన పరిశోధనల నుంచి స్ఫూర్తి పొందామని చెప్పారు. ఈ చిత్రంలో భవానీ కపూర్, రమ్య రాథోడ్, సముద్రాల శ్రీధర్ శర్మ, యశ్వంత్ చంద్ర, బెల్లంకొండ వెంకట్, తుమ్మా పాపారావు, మల్లెపాడు రమేష్, సైదులు నటిస్తున్నారని తెలిపారు. -
జాతీయ లోక్ అదాలత్‌లో 2476 కేసులు పరిష్కారం
నరసరావుపేట టౌన్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం న్యాయస్థాన భవనాల ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్, 13వ అదనపు జిల్లా సెషనన్స్ న్యాయాధికారి ఎస్.రమేష్ నేతృత్వంలో న్యాయాధికారులు మూడు బెంచ్ లుగా ఏర్పడి 2476 కేసులను పరిష్కరించారు. సివిల్, క్రిమినల్ కేసులతోపాటు ముందస్తు వ్యాజ్యాలు తదితర అన్ని రకాల వ్యాజ్యాలు కలిపి 2476 కేసులు పరిష్కారమయ్యాయి. పరిష్కారమైన కేసుల్లో కక్షిదారులకు రూ. 5,88,78,243 మేరకు లబ్ధి చేకూరింది. తొలుత న్యాయస్థాన ఆవరణలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో న్యాయాధికారులు లోక్ అదాలత్ ప్రాధాన్యతను, విశిష్టతను, ఉపయోగాలను వివరించారు. న్యాయధికారులు కిరణ్ కుమార్, ఎ.సలోమి, న్యాయవాద సంఘ సభ్యులు, ప్యానల్ న్యాయవాదులు, కక్షిదారులు, పోలీసులు పాల్గొన్నారు. తెనాలి: కొల్లిపర మండల గ్రామం కుంచవరంలోని శ్రీవారాహి దేవాలయంలో ఈనెల 15 నుంచి 24వ తేదీవరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు, దీక్షాధారణ ఉత్సవాలు జరగనున్నాయి. ఈమేరకు ఉత్సవాల ఆహ్వానపత్రికను శనివారం స్థానిక మారీసుపేటలోని పోస్టల్ సహకార సొసైటీ భవనంలో శ్రీకాకతీయ కో–ఆపరేటివ్ సొసైటీ గౌరవ చైర్మన్ డీఎల్ కాంతారావు ఆవిష్కరించారు. ఆలయ ధర్మకర్త, ‘పోస్ట్’ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ తన్నీరు శ్రీనివాసబాబు మాట్లాడుతూ పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి చేతుల మీదుగా ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకారాలు, హోమాలు, కుంకుమ పూజలు ఉంటాయని తెలిపారు. యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య, కల్యాణం శ్రీనివాసరావు, పీఎస్సార్ బ్రహ్మాచార్యులు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: న్యాయవాదులుగా రాణించాలంటే భాషా నైపుణ్యాలు పెంపొందించుకోవడం కీలకమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ చీమలపాటి రవి అన్నారు. శనివారం జేకేసీ కళాశాల రోడ్డులోని జాగర్లమూడి చంద్రమౌళి (జేసీ) న్యాయ కళాశాల గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఇరువురు న్యాయమూర్తులు న్యాయ విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల పాలకమండలి అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కార్యదర్శి కుప్పుస్వామి, ఉపాధ్యక్షుడు డాక్టర్ కొండబోలు కృష్ణ ప్రసాద్, కోశాధికారి వెంకట కోటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరుకు చెందిన భక్తులు శనివారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. గుంటూరు వికాస్‌నగర్‌కు చెందిన రాయపాటి కోటి సుధాకర్ (సుబ్బారావు) ఆలయ అధికారులను కలిసి అన్నదానానికి రూ. 1,08,616 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయ డీఈఓ కిశోర్‌కుమార్, అర్చకుడు రంగావఝుల శ్రీనివాసశాస్త్రి దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
పెదకాకానిలో భారీ చోరీ
పెదకాకాని: పెదకాకానిలో తాళాలు వేసి ఇళ్లే టార్గెట్‌గా దుండగులు చోరీలకు తెగబడుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పెదకాకాని గ్రామానికి చెందిన రాధారపు నాగేశ్వరరావు ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 7వ తేదీన ఫిరంగిపురం మండలం వేములూరుపాడులో పెద్ద కుమార్తె బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకలకు నాగేశ్వరావు భార్య, చిన్న కుమార్తె వెళ్లారు. అదే రోజు డ్యూటీ ముగించుకుని ఇంటికి రాకుండానే బస్టాండ్ నుంచి నాగేశ్వరరావు కూడా బంధువుల వివాహానికి వెళ్లాడు. వివాహ కార్యక్రమం ముగించుకొని శనివారం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండటం, బీరువా పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు భావించి, పెదకాకాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి పోలీసులు క్లూస్‌టీంతో చేరుకున్నారు. దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 15 సవర్లు బంగారం, 40 తులాల వెండి, రూ.50 వేలు నగదు దోచుకెళ్లినట్లు బాధితులు తెలియజేశారు. బాధితుడు నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దకాకాని సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు. 15 సవర్లు బంగారం అపహరణ -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
నాదెండ్ల: ద్విచక్ర వాహనం అదుపు తప్పిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ ఆర్. వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు... నుదురుపాడు గ్రామానికి చెందిన పారెళ్ళ అనిల్‌కుమార్ (27) కేరళలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో తమ బంధువు మృతి చెందటంతో ద్విచక్రవాహనంపై వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో నాదెండ్ల–అప్పాపురం డొంక రోడ్డులో ద్విచక్రవాహనం అదుపుతప్పి గోతిలో పడింది. స్థానికులు గమనించి 108కు సమాచారమిచ్చారు. అనిల్‌కుమార్‌ను చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని శనివారం పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించటంతో స్వగ్రామమైన నుదురుపాడుకు తరలించారు. నకరికల్లు: మండలంలోని చల్లగుండ్ల గ్రామంలో వరిగడ్డి వామి దగ్ధమైంది. ఈ సంఘటన గ్రామంలోని ఎస్సీ కాలనీలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన డి.పెదలాజర్ నాలుగెకరాల వరిగడ్డిని సుమారు రూ.50 వేలతో కొనుగోలు చేసి నిల్వ చేశాడు. శనివారం ఉదయం సమయంలో వరిగడ్డికి నిప్పంటుకుంది. చుట్టుపక్కల వారు గమనించే సరికి మంటలు చెలరేగాయి. నీళ్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పిడుగురాళ్ల ఫైరింజన్ యంత్రాంగం గ్రామానికి చేరుకొని మంటలను అదుపు చేసింది. అప్పటికే వరిగడ్డి మొత్తం అగ్నికి ఆహుతైంది. అసలే మేత దొరకని గడ్డుకాలం వస్తున్న తరుణంలో తమకు భారీ నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరువెస్ట్(క్రీడలు): గుంటూరులోని రాప్ స్నూకర్స్ గేమ్ జోన్ ఆధ్వర్యంలో 10 రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్ర స్థాయి బిలియర్ట్స్ చాంపియన్న్ షిప్ పోటీల విజేతగా కాకినాడకు చెందిన శివశర్మ నిలిచాడు. ద్వితీయ స్థానంలో గుంటూరుకు చెందిన బద్రు జుబేర్ నిలిచాడు. శనివారం జరిగిన విజేతల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాదాల వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధినేతలు అమర ఆదినారాయణ, అమర అజయ్ మాట్లాడుతూ గత పది రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 200 మందికి పైగా క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించి పోటీలను విజయవంతం చేయడం అభినందనీయమని క్రీడాకారులు ప్రశంసిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు సుమారు రూ.1.50 లక్షలు నగదు రూపంలో అందజేశామని చెప్పారు. భవిష్యత్‌లో రాప్ స్నూకర్స్ గేమ్ జోన్ ఆధ్వర్యంలో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి బిలియర్డ్స్ పోటీలను నిర్వహించడంతో పాటు గుంటూరును ఈ క్రీడకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. తెనాలిరూరల్: రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలి రైల్వే స్టేషన్ ఐదో నంబరు ప్లాట్‌ఫాంపై శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి ఐదో నంబరు ప్లాట్‌ఫాం పట్టాలపై ఆత్మహత్యాయత్నం చేశాడు. కాళ్లు తెగిపోయి తీవ్ర రక్తస్రావమవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని తెనాలి వైద్యశాల మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లి రూరల్: ఇద్దరు బాలికల అదృశ్యంపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఖాజావలి తెలిపిన వివరాలు.. మంగళగిరి– తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేట, అంబేడ్కర్ కాలనీలో బాలికలు వారి తల్లిదండ్రుల కలసి నివాసం ఉంటున్నారు. మొహరం కుమార్తె ఇస్రా, అస్మతున్నిసా కుమార్తె నూర్జహాన్ కనిపించకుండా పోయారంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఉదయం తాడేపల్లి ప్రెస్ క్లబ్ వద్ద మంగళగిరి వెళ్లే ఆటోలో వెళ్లినట్లు సీసీ ఫుటేజీల్లో గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రార్థనలు ఆలకించే కార్మెల్ మాత
14 నుంచి కార్మెల్ మాత మహోత్సవాలు ఫిరంగిపురం: మండలకేంద్రం కార్మెల్ కొండపై ఉన్న కార్మెల్‌మాత ఉత్సవాలు ఈనెల 14,15,16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే దివ్యపూజాబలి కార్యక్రమంలో గుంటూరు మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య పాల్గొంటారని ఆలయ వర్గాలు శనివారం తెలిపాయి. 14 మంగళవారం సాయంత్రం కార్మెల్ మాత కొండవద్ద దివ్యపూజాబలి కార్యక్రమం విచారణ గురువు పి.అంతోని రాజు నిర్వహించనున్నారు. 15 బుధవారం ఉదయం కథెడ్రల్ దేవాలయంలో విచారణ గురువు ఫాతిమా మర్రెడ్డి, కొండపై 8గంటలకు విచారణ గురువు కె.సాగర్లు దివ్యపూజాబలి పూజలు నిర్వహిస్తారు. రాత్రి పదినుంచి ఉదయం 4 వరకు అఖండ జపమాల నిర్వహించనున్నారు. 16న ఉదయం బాల ఏసుదేవాలయంలో, 9గంటలకు కార్మెల్ కొండపైన దివ్యపూజాబలి నిర్వహిస్తారు. కార్యక్రమానికి విజయవాడ పీఠాధిపతి తెలగతోటి రాజారావు ప్రధాన యాజకులుగా వ్యవహరిస్తారు. తరువాత కార్మెల్ మాత మహోత్సవ సమిష్టి దివ్యపూజాబలి కార్యక్రమానికి గుంటూరు మేత్రాసన నూతన అభిషిక్త గురువులు పాల్గొంటారు. అనంతరం కార్మెల్‌మాత తేరు ప్రదక్షిణ నిర్వహించనున్నారు. -
తుమృకోటలో ఎగసిపడిన జనకెరటం
తుమృకోట(రెంటచింతల): మండలంలోని తుమృకోట గ్రామంలో శుక్రవారం రాత్రి జన కెరటం ఎగసిపడింది. గ్రామంలో ఎనిమిది రోజులుగా జరుగుతున్న ఇంద్రపల్లి ముత్యాలమ్మ జాతర మహోత్సవాల్లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు జై జగన్..జేజే పీఆర్కే అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ... నీరాజనం పలికారు. గ్రామ దేవతగా పూజలందుకుంటున్న ఇంద్రపల్లి అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే పీఆర్కే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమృకోట గ్రామ ప్రజల ఇలవేల్పు అయిన ఇంద్రపల్లి ముత్యాలమ్మ తల్లి తుమృకోట గ్రామాన్ని, గ్రామ ప్రజలను కంటికి రెప్పలా కాపాడాలని, రైతన్నల ఇంట పాడి పంటలు సమృద్ధిగా పండి సిరులు కురవాలని ఆక్షాంక్షించారు. గ్రామస్తులందరిపై గ్రామ దేవత శక్తిస్వరూపిని ఇంద్రపల్లి ముత్యాలమ్మ అమ్మవారి చల్లని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న భక్తులు, మహిళలు, చిన్నలు పెద్దలు అనే తారతమ్యం లేకుండా అందరూ పీఆర్కేతో కరచాలనం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ తోరణాలతో అందంగా ముస్తాబు చేసి అలంకరించారు. ఆలయ చైర్మన్ పోట్ల వెంకటేశ్వర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్ఐ సీహెచ్ నాగార్జున తన సిబ్బందితో భారీ బందో బస్తును ఏర్పాటు చేశారు. ఇంద్రపల్లి ముత్యాలమ్మకు పీఆర్కే ప్రత్యేక పూజలు -
సైదారావు పై చర్యలు తీసుకోవాలి
మా తాతముత్తాల నుంచి పశువుల కోసం ఉపయోగించుకుంటున్న భూమిని ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న సైదారావు పై, అలాగే సహకరించిన రెవెన్యూ ఉద్యోగుల పై చర్యలు తీసుకోవాలి. లేకుంటే రైతులందరితో కలిసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. – పేర్ల అంకయ్య, స్థానికుడు తాళ్ళపల్లి గ్రామంలో రిజిస్ట్రేషన్ భూమిని రామిశెట్టి సైదారావు, మన్నెంకుంట శ్రీదేవిల పేర్లతో ఆన్లైన్లో నమోదైన విషయం నా దృష్టికి వచ్చింది. రీ సర్వేలో జరిగిన పొరపాటు.. లేకుంటే ఇతర కారణాలపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. – బి.కిరణ్ కుమార్, తహసీల్దార్ -
బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభం
గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలను రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ ప్రారంభించారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పోటీలకు హాజరైన క్రీడాకారులను రామకృష్ణ పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ పోటీలు రెండు రోజుల పాటు నిర్విరామంగా కొనసాగుతాయన్నారు. ముఖ్యంగా అండర్ 11, 13, 15 విభాగాలలో క్రీడాకారులకు అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారు. నలుమూలల నుంచి 400 మంది క్రీడాకారులు పోటీలకు హాజరవడం విశేషమని తెలిపారు. అనంతరం చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి వజ్జా రామకృష్ణ, అసోసియేషన్ అధ్యక్షులు రంగబాబు, జిల్లా కమిటీ సభ్యులు మొకమటం వెంకట్, సతీష్ చంద్ర, బండారు రాము, బొచ్చు రమేష్, హరి పాల్గొన్నారు. -
యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
వినుకొండ: నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. మట్టిని సరిహద్దులు దాటిస్తూ రూ. కోట్లలో సంపాదిస్తున్నారు. వినుకొండ రూరల్ మండలం దొండపాడు గ్రామంలోని చెరువును ఆనుకుని ఉన్న మునిస్వామి కొండను పొక్లెయిన్లతో అక్రమంగా తవ్వి, వేలాది ట్రక్కులతో మట్టి తరలిస్తున్నారు. దీని వల్ల కొండపై ఉన్న చారిత్రక శివాలయం కనుమరుగయ్యే దశకు చేరుకుంది. రాత్రింబవళ్లు తేడా లేకుండా తవ్వి తరలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ప్రైవేటు వారికి అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో అధికం వినుకొండ రూరల్ మండలంలోని నీలగంగవరం, వెంకుపాలెం, అలాగే బొల్లాపల్లి మండలంలోని పేరుపాడు, వెల్లటూరు, నూజెండ్ల మండలంలోని పలు గ్రామాల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వెంకుపాలెం జాలపాలెం గ్రామ పరిధిలోని ఎర్ర కొండ వద్ద భారీ యంత్రాలతో మట్టిని తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి ధరను నిర్ణయిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ బొల్లాపల్లి, వినుకొండ రెవెన్యూ అధికారులు పరస్పరం సాకులు చెబుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు ఇప్పటికై నా స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కన్నెత్తి కూడా చూడని అధికారులు -
జిల్లాలో 81.89 శాతం ఈఎఫ్‌ల డిజిటలైజేషన్
నరసరావుపేట: జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ ముగింపునకు మరో మూడురోజులు మిగిలి ఉండగా శనివారం నాటికి ఓటరు ఎన్యూమరేషన్ఫారాల డిజిటలైజేషన్ 81.89 శాతం పూర్తి చేశారు. మొత్తం ఓటర్లు 17,41,798 మంది ఉండగా.. వందశాతం మందికి ఫారాలు పంపిణీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్లా పేర్కొన్నారు. వీరిలో 14,26,416 మంది ఫారాలు డిజిటలైజేషన్ చేశామన్నారు. సర్ ప్రక్రియ పరిశీలన రొంపిచర్ల: మండలంలోని అన్నవరం, రొంపిచర్ల గ్రామాల్లో ఆర్డీఓ కె. బాలకృష్ణ శనివారం పర్యటించారు. సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. రొంపిచర్లలోని 33, 34, 35, 36, 37, 38 పోలింగ్ బూత్‌ల పరిధిలో ప్రక్రియ తీరును తెలుసుకున్నారు. బీఎల్ఓలతో మాట్లాడి, పలు సూచనలు ఇచ్చారు. అన్నవరం గ్రామంలోని 63, 64 పోలింగ్ బూత్‌ల పరిధిలో కూడా పరిశీలించారు. పారదర్శకంగా మ్యాపింగ్ చేయాలని బీఎల్ఓలను ఆదేశించారు. తహసీల్దార్ బండి నిర్మల తదితరులు వెంట ఉన్నారు. -
విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి
విజయపురిసౌత్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో విద్యనభ్యసించి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సొసైటీ(ఏపీఆర్ఈఐఎస్) కార్యదర్శి కృష్ణమోహన్ అన్నారు. శనివారం స్థానిక ఏపీఆర్ జూనియర్ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్‌డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కళాశాల 1976–78 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు 25 మంది హాజరవ్వటం ఎంతో సంతోషకరమన్నారు. పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అనంతరం ప్రిన్సిపాల్ ఎం హేమాంబర్‌రెడ్డి మాట్లాడుతూ కళాశాల ప్రగతి, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల విజయాలను వివరించారు. తొలుత పూర్వ విద్యార్థులు అలుమ్ని సభ్యులు విద్యార్థి జీవితంలోని మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ విద్యార్థులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు జీవిత విలువలపై పలు సూచనలు చేశారు. కళాశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పూర్వ విద్యార్థులను ఏపీఆర్ఈఐఎస్ కార్యదర్శి కృష్ణమోహన్, సంయుక్త కార్యదర్శి ఉబేదుల్లా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఈ– ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానంపై అపోహలు వద్దు
తెనాలిటౌన్: మార్కెటింగ్‌శాఖ జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానంపై అపోహలు అవసరం లేదని మార్కెటింగ్ శాఖ విజయవాడ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఎం.దివాకర్ తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శనివారం ది డాల్‌మిల్స్, పల్సెస్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ– ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానంపై వ్యాపారులు లేవనెత్తిన సందేహాలకు సమాధానం ఇచ్చారు. నగదు రహిత లావాదేవీల కోసం ప్రభుత్వం రూపొందించిన ఈ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చెక్‌పోస్ట్‌ల వద్ద నగదు రశీదులు రాసి ఇవ్వడం పూర్తిగా రద్దు చేయబడిందని వెల్లడించారు. లైసెన్స్ కలిగిన వ్యాపారస్తుడు స్వతహాగా ఆన్లైన్ ఈ–పర్మిట్ తీసి సరుకు ఎగుమతి చేస్తున్న వాహన డ్రైవర్‌కు ఇచ్చి పంపాలని స్పష్టం చేశారు. వాహన డ్రైవర్ ఆన్లైన్ ఈ–పర్మిట్ ప్రింట్‌ను తన మొబైల్‌కు వచ్చిన నంబర్‌ను చెక్ పోస్టు వద్ద చూపించి స్కానింగ్ చేయించుకుని వెళ్లాలని సూచించారు. ముందస్తు ఆన్లైన్ ఈ–పర్మిట్ లేకుండా సరుకు ఎగుమతి చేస్తున్న వాహన డ్రైవర్ల నుంచి చెక్ పోస్టు వద్ద కేవలం ఫోన్‌పే, జీపే, పేటీఎం ఇతర డిజిటల్ పద్ధతిలోనే మార్కెట్ ఫీజు వసూలు చేసి పర్మిట్ జారీ చేయబడుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో నగదు అంగీకరించబడదని వెల్లడించారు. పర్మిట్ తీసుకున్న పది రోజుల వరకు గడువు ఇవ్వాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరగా ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. వ్యాపారులందరూ సహకరించాలని కోరారు. -
ఉపాధ్యాయులకు టెట్ సైకాలజీపై శిక్షణ
గుంటూరు ఎడ్యుకేషన్: ఎస్టీయూ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలో భాగంగా సైకాలజీ తరగతులు నిర్వహించారు. ప్రముఖ సైకాలజీ నిపుణుడు టి.సుగంధరావు సైకాలజీ తరగతులను బోధించారు. కార్యక్రమానికి ఎస్టీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సిహెచ్.జోసెఫ్ సుధీర్ బాబు మాట్లాడుతూ టెట్ ఉత్తీర్ణతపై ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు పొందటానికి ఎస్టీయూ అన్ని రకాలుగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డి.పెదబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పార్లమెంటులో చట్టం చేయించి 2011 ముందు ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరిన వారికి టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు లభించేలా చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకుమాను జోజప్ప, రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీధర్, మాజీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎస్.రామచంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్యామ్ బాబు, జిల్లా ఆర్థిక కార్యదర్శి హనుమంత ప్రసాద్, జిల్లా గౌరవాధ్యక్షులు ఏవీ ప్రసాద్ బాబు, నాయకులు వీరాంజనేయులు, మహి, శంకర్, ఏ వీరయ్య, భానుమూర్తి, ఏడుకొండలు, వెంకయ్య, గురుబ్రహ్మం, దేవరాజ్ పి.రవికుమార్, బి.మరియదాసు, జగన్, పి.సురేష్ పాల్గొన్నారు. -
టీడీపీ నేత కార్యాలయంలో హత్యాయత్నం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): టీడీపీ నేత ముజీబ్ కార్యాలయంలో జరిగిన కుటుంబ పంచాయి తీ నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బావ తమ్ముడిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం జరిగింది. పాతగుంటూరు సుద్దపల్లి డొంకకు చెందిన షేక్ షాజిదబేగంను నాలుగేళ్ల కిందట కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామానికి చెందిన షేక్ రఫీకి ఇచ్చి వివాహం జరిపారు. రెండున్నరేళ్ల కిందట భార్యా భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో దిశ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయ గా, అప్పటి పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పి కాపురానికి పంపించారు. మళ్లీ ఏడాది క్రితం ఇరువురి మధ్య వివాదం జరగడంతో మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేయగా, కేసు నమో దై ప్రస్తుతం కోర్టులో ఉంది. షేక్ రఫీ బంధువు బాజి ముజీబ్‌ను సంప్రదించి తమ సమస్యను పరిష్కరించాలని కోరడంతో షాజిద కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆయన కా ర్యాలయంలో పంచాయితీ జరిగింది. షాజిదా తమ్ముడు షౌకత్ అలి అతనితోపాటు మరో ఇద్దరు కలిసి రఫీ తమ్ము డు ఇమ్రాన్‌పై కత్తితో దాడిచేశారు. -
కిట్.. ఇస్తే ఒట్టు
సత్తెనపల్లి: వాస్తవానికి గతంలో స్కూళ్లు తెరిచిన రోజే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేసి వారి ముఖంలో చిరునవ్వును నింపేవారు. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు వారాలు గడుస్తున్నా వీటిని ఇవ్వలేదు. పర్యవసానంగా పిల్లలను బడిలో చేర్పించేందుకు అప్పుల కోసం పేరెంట్స్ తిప్పలు పడుతున్నారు. కార్పొరేట్ విద్యావ్యవస్థపై ఉన్న ఆసక్తిని ప్రభుత్వ స్కూళ్ల పై టీడీపీ ప్రభుత్వం చూపడం లేదు. పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలు చదువుతున్న సర్కారీ బడులపై అంతులేని నిర్లక్ష్యం చూపుతోంది. జగనన్న విద్యా కానుక పేరిట కిట్లను అందజేసే పథకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లుగా నామకరణం చేసేందుకే సర్కార్ పరిమితమైందనే విమర్శలున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమై నాలుగు వారాలు అవుతున్నా, నేటికీ వీటిని పూర్తిస్థాయిలో అందించకపోవడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. బ్యాగులు, బూట్లు, సాక్స్‌లు, బెల్టులు ఇప్పటికీ పాఠశాలలకు చేరలేదు. యూనిఫామ్ అరకొరగా పంపిణీ చేసినప్పటికీ కుట్టుకూలీ ప్రభుత్వం విడుదల చేయలేదు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను మాత్రమే పంపిణీ చేసి మమ అనిపించింది. నమ్మించి వంచన తల్లికి వందనం పథకం కింద సాయం ఈ నెలలో అందజేస్తామంటూ సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. ఇందులో ఎన్ని కోతలు పెడతారోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ దీన్ని వర్తింపజేస్తామంటూ గత ఎన్నికలకు ముందు ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. నిజమని భావించి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించారు. తన మార్కు రాజకీయాలను ఆయన అమలు చేయడంతో ఫీజుల కోసం పేరెంట్స్ అప్పులు చేశారు. సర్కారు బడుల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం బ్యాగులు, బూట్లు, బెల్టుల కోసం ఖర్చు పెట్టకతప్పని పరిస్థితి నెలకొంది. అసలే ఖర్చులు పెరిగిన ఈ కాలంలో సర్కారు నిర్వాకంతో మరింత భారం పెరిగింది. నిజానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో అంతా సాఫీగా జరిగేది. పాఠశాలలు పునఃప్రారంభం రోజునే అమ్మఒడితో పాటు జగనన్న విద్యా కానుక కిట్లను పూర్తిస్థాయిలో అందజేసేవారు. దీంతో తమ అభీష్టం మేరకు ఏ పాఠశాలలోనైనా తమ పిల్లలను చేర్పించే అవకాశం తల్లిదండ్రులకు ఉండేది. అయితే టీడీపీ ప్రభుత్వంలో ఈ పరిస్థితులు మచ్చుకై నా కానరావడం లేదు. జిల్లాలో 1,213 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, 54 మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, 297 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు వెరసి 1,564 బడులు ఉన్నాయి. వీటిలో 1,40,172 మంది విద్యార్థులు చదువుతున్నారు. సర్కారీ బడుల విద్యార్థులకు యూనిఫామ్, బ్యాగులు, సాక్స్, బూట్లు, బెల్టులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, ఆక్ఫర్డ్ డిక్షనరీలు, పిక్టోరియల్ డిక్షనరీలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. సగం మందికిపైగా విద్యార్థులకు ఇవి నేటికీ అందలేదు. యూనిఫామ్ 1.13 లక్షల మందికి పంపిణీ జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కుట్టుకూలీ నగదు రాలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ పాఠశాలల్లో అమలు చేసిన సంస్కరణలకు ప్రస్తుత టీడీపీ సర్కార్ తూట్లు పొడుస్తోంది. నాడు–నేడు, అమ్మఒడి, విద్యార్థులకు కిట్ల పంపిణీ నాడు సాగగా... ఇప్పుడు పేర్లు మార్చి ఆయా పథకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపుతోంది. -
ఆస్పత్రి నిధులకే ‘టెండర్’
గుంటూరు మెడికల్ : పేద రోగులకు ఉపయోగపడేలా ప్రభుత్వ బడ్జెట్‌ను వినియోగించాల్సిన గుంటూరు జీజీహెచ్ అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తిపడి నిబంధనలు పక్కన పెట్టారు. వైద్య పరికరాలు, సర్జికల్ వస్తువులను టెండర్ల ద్వారా కాకుండా కొటేషన్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. పలు కంపెనీల ప్రతినిధులకు తెలిసేలా వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం వలన పోటీ పెరిగి వస్తువులు తక్కువ ధరకే వస్తాయి. కానీ సింగిల్ కొటేషన్ ద్వారా తమకు నచ్చిన కాంట్రాక్టర్ నుంచి కొనుగోలు చేసి సొంత లాభం చూసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాటాలు పంచుకుంటూ పేద రోగుల బడ్జెట్‌ను పంచేసుకుంటున్నారు. ఏడాదికి రూ. 4 కోట్లకుపైగానే... గుంటూరు జీజీహెచ్‌లో సర్జికల్ బడ్జెట్ వినియోగంలో అధికారులు నిబంధనలకు నీళ్లొదిలారు. ప్రభుత్వం జీజీహెచ్‌కు ఏపీ ఎంఎస్ ఐడీసీ సంస్థ ద్వారా 80 శాతం సర్జికల్ వస్తువులు సరఫరా చేస్తుంది. సదరు సంస్థ ఏమైనా పంపిణీ చేయని పక్షంలోఆపరేషన్లకు వినియోగించే వైద్య పరికరాలు, ఇతర సామగ్రి కొనుగోలు కోసం 20 శాతం బడ్జెట్‌ను జీజీహెచ్‌కు కేటాయిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి సుమారు రూ.కోటి చొప్పున ఏడాదికి నాలుగు కోట్లకుపైగా ప్రభుత్వం ఇస్తుంది. ఆస్పత్రి అధికారులు ఈ నిధులతో టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. ఇలా చేస్తే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పాల్గొని తక్కువ మొత్తానికే సామగ్రి సరఫరా చేసే వీలుంటుంది. రెగ్యులర్‌గా వైద్య పరికరాలు కొనుగోలు చేస్తుండటం వలన కాంట్రాక్టర్లు కూడా సాధ్యమైనంత తక్కువ ధరకే సరఫరా చేస్తుంటారు. వచ్చే లాభాల్లో కొంత తగ్గించుకుని మరీ జీజీహెచ్‌లో టెండర్లు దక్కించుకుంటారు. ఇలాంటి కాంట్రాక్టర్లు తక్కువ కమీషన్లు ఇస్తున్నారని ఆస్పత్రి అధికారులు రూటు మార్చారు. కేవలం కొటేషన్లు... అది కూడా ఒకరు లేదా ఇద్దరు తెలిసిన కాంట్రాక్టర్లు, తమకు ఎక్కువ మొత్తంలో కమీషన్లు ఇచ్చే వారికే సరఫరా బాధ్యత అప్పగించారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్ చెల్లింపుల్లోనూ పక్షపాతమే..... ఇటీవల ఆస్పత్రిలో సర్జికల్, మెడికల్ బడ్జెట్లను ప్రభుత్వం విడుదల చేసింది. సుమారు రూ.మూడు కోట్ల వరకు విడుదల కాగా... ఎక్కువ కమీషను ఇచ్చేవారికే బిల్లులు చెల్లించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది కాంట్రాక్టర్లకే ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తే ఇతరులు టెండర్ల ద్వారా సరఫరా చేసే వాటిని నిలిపివేసే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించేలా, బిల్లులు చెల్లించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ఓటరు హెల్ప్ డెస్క్‌లు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లతోపాటు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలోనూ ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఈ డెస్క్‌ల వద్ద ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను నేరుగా స్వీకరించి, తదుపరి ప్రక్రియ కోసం సంబంధిత సూపర్వైజర్లకు అందజేస్తారని వివరించారు. నగర ప్రజలతోపాటు ప్రయాణికులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. తమ వార్డు కౌంటర్లను, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ హెల్ప్ డెస్క్‌లను సంప్రదించి సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేచవరంలో ఘనంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం నకరికల్లు: మండలంలోని దేచవరం గ్రామంలోని శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 4వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని అర్చకులు పరుచూరి గిరీష్ మణిపవన్ ఆధ్వర్యంలో హోమాలు జరిపించారు. 108 కలశాలతో విశేష అభిషేకాలు చేశారు. స్వామి వారిని విశేషంగా అలంకరించారు. సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. రాత్రికి కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి కుటుంబ సమేతంగా వేడుకలలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్నారు. మునగోడులో కార్డన్ సెర్చ్ అమరావతి: మండల పరిధిలోని మునగోడు గ్రామంలో శుక్రవారం వేకువజామున పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు ఆధ్వర్యంలో సుమారు వంద మందికిపైగా పోలీసులు ఈ కార్డన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. రెండు ఎస్సీ కాలనీలతోపాటు గ్రామంలోని ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తనిఖీలలో 34 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో సీజ్ చేసి అమరావతి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే గంజాయి నిర్మూలన, హెల్మెట్ ధారణ, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ తనిఖీలలో సీఐ వై.అచ్చయ్య, ఎస్ఐలు జె.శ్రీనివాసరావు, కె.రాజశేఖర్‌లతోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు రేపల్లె: నాణ్యమైన ఎరువులనే రైతులకు అందించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అద్దేపల్లి లక్ష్మి అన్నారు. పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలలో శుక్రవారం అధికారులతో కలసి ఆమె ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్, ఐఎఫ్ఎంఎస్ ద్వారా జరుగుతున్న ఎరువుల విక్రయాలు, రైతుల వివరాల నమోదు విధానం, బయోమెట్రిక్, ఓటీపీ ఆధారంగా ఎరువుల పంపిణీ ప్రక్రియ తదితరాలను పరిశీలించారు. నాణ్యత లోపించిన ఎరువులు, పురుగు మందుల విక్రయిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలలో సహాయ వ్యవసాయ సంచాలకుడు వి.రమేష్ బాబు, మండల వ్యవసాయాధికారి ఎ.మహేష్‌బాబు పాల్గొన్నారు. -
చిన్నారిపై వీధికుక్కల దాడి
అమరావతి: మండల కేంద్రమైన అమరావతి బండలచేను కాలనీలో చిన్నారిపై వీధికుక్కలు దాడి చేయటంతో బాలిక తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బండచేను కాలనీలో నివాసం ఉంటున్న షేక్ నజీర్‌బాబు కుమార్తె నాలుగు సంవత్సరాల వయస్సు గల చాందినీబేగం శుక్రవారం సాయంత్రం ఆడుకోవటానికి వీధిలో రాగానే ఒక్కసారిగా వీధికుక్కలు దాడి చేశాయి. బాలిక ముఖంపైన, కంటి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించగా, చికిత్స అందిస్తున్నారు. బాలిక చాందినీబేగం తండ్రి నజీర్‌బాబు మాట్లాడుతూ కొంతకాలంగా బండచేను కాలనీలో వీధికుక్కల బెడద అధికంగా ఉందన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు రావటానికి భయపడుతున్నారని తెలిపారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యాలయంలో, మండల పరిషత్ కార్యాలయంలో కాలనీవాసులు అనేకమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
అంగన్వాడీల పోరుబాట
నరసరావుపేట: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు నెలకు రూ.26 వేల కనీస వేతనంతోపాటు పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలను తక్షణమే అమలు చేయాలని సీఐటీయూ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు జై.కృష్ణకిరణ్ జిల్లాలో పర్యటిస్తూ ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేయడం తగదని అన్నారు. అఖిల భారత కోర్కెల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు ఎ.లక్ష్మీప్రసన్న, జిల్లా కార్యదర్శి శాంతమణి ఆధ్వర్యంలో వందల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు కలెక్టరేట్‌ను ముట్టడించారు. పట్టణంలోని ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద జరిగిన బహిరంగ సభలో పలువురు నాయకులు ప్రసంగించారు. అంగన్వాడీ ఉద్యోగులకు తగిన వేతనాలు, భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ, పల్నాడు విజ్ఞాన కేంద్రం కార్యదర్శి అనుముల లక్ష్మీశ్వరరెడ్డి తదితరులు ప్రసగించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. నాయకులు డి.శివకుమారి, షేక్ సిలార్ మసూద్, హనుమంతరెడ్డి, పేరుబోయిన వెంకటేశ్వర్లు, జయలక్ష్మి, కవిత, శివపార్వతి, సావిత్రి, నిర్మల, సాయి, మాధవి పాల్గొన్నారు. -
టీడీపీ కార్యాలయంలో ఈఎఫ్లపై కలెక్టర్ ఆరా
దాచేపల్లి : దాచేపల్లి టీడీపీ కార్యాలయంలో ఎన్యూమరేషన్ ఫారాలు (ఈఎఫ్‌లు) ఉండటంపై జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా శుక్రవారం ఆరా తీశారు. ఫారాలలోని వివరాలను టీడీపీ నాయకులు అప్లోడ్ చేస్తున్నట్లుగా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ అంశంపై వైఎస్సార్సీపీ నాయకులు దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్ జి. వెంకటేశ్వర్లును కలసి వినతిపత్రం అందజేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆరా తీసి, విచారణ చేయాలని నగర పంచాయతీ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. నగర పంచాయతీ అధికారులు, సూపర్వైజర్లు బీఎల్ఓలతో మాట్లాడి ఎవరి వద్ద ఎన్ని ఫారాలు ఉన్నాయి.. ఎన్ని అప్లోడ్ చేశారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ బీఎల్ఓ నుంచి ఫారాలు టీడీపీ నాయకుల వద్దకు వెళ్లాయో తెలుసుకున్నారు. టీడీపీ నాయకులకు ఫారాలు ఇచ్చిన బీఎల్వోలపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలిసింది. ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎవరిపైకి వచ్చి ఎంతమందిపై వేటు పడుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
పారదర్శకంగా సర్ నిర్వహణ
వివిధ పార్టీల ప్రజాప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ నరసరావుపేట: జిల్లాలో సర్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్లా తెలిపారు. ఇప్పటివరకు 31,501 మంది అన్కలెక్టబుల్గా గుర్తించబడ్డారని చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో సర్‌పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 17,41,798 మంది ఓటర్లకుగాను ఇప్పటివరకు 13,19,818 ఫారాలు డిజిటలైజ్ చేశామన్నారు. 21,073 మంది మరణించిన ఓటర్లు, 4,430 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, 5,409 మంది ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటరుగా నమోదు చేసుకున్న వారు, 556 మంది గైర్హాజరు, 33 ఇతర కేసులు గుర్తించారని తెలిపారు. మొత్తం జిల్లాలో మొత్తం 1,932 మంది బీఎల్ఓలు పనిచేస్తున్నట్లు చెప్పారు. గత 24 గంటల్లో 15,709 ఫారాలు డిజిటలైజ్ చేసినట్లు వెల్లడించారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. డీఆర్ఓ అద్దెయ్య పాల్గొన్నారు. ఓటర్లు ఈసీఐనెట్ మొబైల్ యాప్‌లోని బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ ఆప్షన్ ద్వారా లేదా ఓటర్స్.ఈసీఐ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఈ సేవను ఉపయోగించుకోవచ్చని సూచించారు. కాల్‌బుక్ చేసిన 48 గంటలలోపు సంబంధిత బీఎల్ఓ స్వయంగా ఓటరును సంప్రదించి, కావాల్సిన సమాచారాన్ని అందిస్తారని వివరించారు. -
ప్రకృతి వ్యవసాయ విధానం మేలు
నార్నెపాడు(ముప్పాళ్ల): ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా సాగు మేలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ కే.అమలకుమారి పేర్కొన్నారు. మండలంలోని నార్నెపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసిన పంటలను జర్మనీకి చెందిన రీనట్–పిక్ ప్రాజెక్ట్ ప్రతినిధి టీమ్హెక్మన్తో కలిసి శుక్రవారం పరిశీలించారు. పీఎమ్డీఎస్–సీసీఈ విధానంలో సాగును పరిశీలించి, 5/5 మీటర్ల ప్లాట్‌లో నమోదైన 28 కిలోల బయోమాస్తోపాటు పరిశోధన డేటా సేకరణ, నమోదు విధానాన్ని జర్మనీ ప్రతినిధికి వివరించారు. విత్తన గుళికలు, విత్తన బంతుల తయారీ విధానం, వాటి ప్రయోజనాలను వివరించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు ప్రకృతి వ్యవసాయంలో విత్తన గుళికల ప్రాధాన్యతను వివరించారు. బీజామృతం తయారీ విధానాన్ని రైతు శాస్త్రవేత్త ఉమామహేశ్వరి వివరించారు. ఇన్ఫ్రారెడ్, ధర్మామీటర్, 3ఇన్1 మీటర్ ద్వారా నేల ఉష్ణోగ్రత, తేమ, పీహెచ్ విలువను ప్రదర్శించి, ప్రకృతి వ్యవసాయం–సాంప్రదాయ వ్యవసాయం మధ్య ఉన్న తేడాలను వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ రవిబాబు, ఏఓ శ్రీధర్‌రెడ్డి, వీఏఏలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతు శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. -
ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ
మంగళగిరి టౌన్: ఇంట్లో లేని సమయంలో తాళాలు పగలగొట్టి దుండగులు బంగారు ఆభరణాలు, నగదు, వెండి వస్తువులను చోరీ చేసిన ఘటన గురువారం రాత్రి మంగళగిరి పట్టణంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి పట్టణం కొప్పురావు కాలనీ 9వ లైన్లో గోలి నాగరత్నం నివాసముంటోంది. ఇద్దరు కుమార్తెలకు వివాహం కావడంతో ఇంట్లో ఒంటరిగా జీవిస్తోంది. పెద్ద కుమార్తె తమ ఇంటి సమీపంలోనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగోలేని కారణంగా గత నాలుగు రోజుల నుంచి రాత్రి సమయంలో పెద్దకుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి ఉదయం తన ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో 9వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి తన పెద్దకుమార్తె ఇంటికి వెళ్లింది. 10వ తేదీ ఉదయం 6 గంటలకు ఇంటికి రాగా ఇంటి తాళం పగలగొట్టి, తలుపులు తీసి ఉండడం గమనించింది. లోపలకు వెళ్లి చూడగా బీరువా లాకర్లో బంగారు హారం, బంగారు నక్లెస్, చెవిపోగులు, నాలుగు ఉంగరాలతో పాటు వెండి ఆభరణాలు, కొంత నగదు చోరీకి గురైనట్లు గుర్తించింది. మొత్తం 9 సవరల బంగారు వస్తువులు, 500 గ్రాముల వెండి వస్తువులతో పాటు కొంత నగదు దొంగిలించుకు పోయారని నాగరత్నం తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
పల్నాడు
శుక్రవారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 31.4607 టీఎంసీలు. ఎగువ నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 3 వేల క్యూసెక్కులు వదలుతున్నారు.జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ట్రాఫిక్ సిగ్నళ్లు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ప్రజాప్రతినిధులుగానీ, అటు సంబంధిత ఉన్నతాధికారులుగానీ కన్నెత్తి చూసిన పాపానపోవడంలేదు. ముఖ్యంగా మల్లమ్మ సెంటర్లో నిత్యం వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సిగ్నళ్లు వెలగక ఎప్పుడు ఎవరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయోనని వాహన చోదకులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది.నరసరావుపేట టౌన్: ప్రమాదాలను నివారించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు వినియోగించే సిగ్నళ్లు నెలల తరబడి పనిచేయడం లేదు. రూ.లక్షల ప్రజాధనంతో ఏర్పాటు చేసిన వాటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని అత్యంత రద్దీ కూడలి మల్లమ్మ సెంటర్. ఇక్కడ నిత్యం ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోంది. నాలుగు వైపుల నుంచి ఒకేసారి వాహనాలు దూసుకొస్తుండటంతో వాహనదారులు, పాదచారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రమాదాల ముప్పు రోజురోజుకూ పెరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 40 వేలకుపైగా వాహనాలు... నరసరావుపేటలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార కేంద్రాలు అధికంగా ఉండటంతో రోజూ వేలాది మంది వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. గుంటూరు, చిలకలూరిపేట, వినుకొండ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ ప్రధానంగా మల్లమ్మ సెంటర్ మీదుగానే ప్రయాణిస్తాయి. ట్రాఫిక్ పోలీసుల అంచనా ప్రకారం రోజుకు 40 వేలకుపైగా వాహనాలు ఈ కూడలి మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇంతటి రద్దీ ఉన్న ప్రాంతంలో సిగ్నళ్లు పనిచేయకపోవడంతో మొత్తం అస్తవ్యస్తంగా మారుతోంది. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే పరిస్థితి నెలకొంది. మరమ్మతులు చేసినా... గతంలో సిగ్నళ్లు మొరాయిస్తే మరమ్మతులు చేశారు. కొద్దిరోజులు మాత్రమే పనిచేశాయి. అనంతరం అవి నిలిచిపోయాయి. అప్పటి నుంచి శాశ్వతంగా బాగు చేసే ఆలోచనే అధికారులకు లేకుండా పోయింది. పల్నాడు బస్టాండ్, గడియార స్తంభం సెంటర్, హార్డ్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నళ్లు కూడా నెలలుగా పనిచేయక నిరుపయోగంగా మారాయి. రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వ్యవస్థలు ఇలా నిర్లక్ష్యానికి గురికావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు కూడా తమ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇకనైనా స్పందించాలని కోరారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు సిబ్బంది కొరత కూడా ప్రధాన కారణంగా మారింది. లక్షన్నర జనాభా ఉన్న నరసరావుపేటకు ట్రాఫిక్ సీఐ, ఇద్దరు ఎస్ఐలు, కేవలం 15 మంది సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం విద్యాసంస్థల సమయాల్లో మల్లమ్మ సెంటర్లో వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఒకేసారి కూడలిలోకి రావడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభిస్తోంది. అత్యవసర సేవల కోసం వెళ్తున్న అంబులెన్సులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. సిగ్నళ్లను వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. పేటలోని రద్దీ కూడళ్లలో అదనపు ట్రాఫిక్ సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
కొనసాగుతున్న ముత్యాలమ్మ జాతర
తుమృకోట(రెంటచింతల): మండలంలోని తుమృకోట గ్రామంలో ఇంద్రపల్లి ముత్యాలమ్మ జాతర మహోత్సవ వేడుకలలో భాగంగా 7 వ రోజు గురువారం కుంకుమ బళ్లతో గ్రామ పురవీధులలో ఎంతో ఉత్సాహం...ఉల్లాసంగా గ్రామోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించారు. గ్రామ దేవతగా పూజలందుకుంటున్న ఇంద్రపల్లి అమ్మవారికి పూర్వకాలం నుంచి రెండు సంవత్సరాలకు ఒకసారి ముత్యాలమ్మ జాతర వేడుకలను కులమతాలకు అతీతంగా గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు జరుపుకొని, మొక్కులు చెల్లించుకుంటారు. రూ.లక్షల వ్యయంతో 27 కుంకుమ బండ్లు కట్టి వాటిని అందంగా అలంకరించారు. ఆచారంలో భాగంగా ముందు పెద్దకాపు, కరణం, పెద్దశెట్టి కుంకుమబళ్లు, తరువాత వివిధ సామాజిక వర్గాలకు చెందిన మరో 22 బళ్లు గ్రామోత్సవంలో పాల్గొన్నాయి. పోతురాజు, మాతంగి కుంకుమబళ్లకు ముందుండి దేవుని బజార్లలో తిరిగి అనంతరం ముత్యాలమ్మ ఆలయం వద్దకు బళ్లతో సహా చేరుకున్నారు. ఉదయం 10 గం. నుంచి కుంకుమబళ్లతో గ్రామోత్సవం ప్రారంభించి రాత్రి 9 గం. వరకు జాతర చేస్తూ ఆలయం వద్ద వరకు ఊరేంగింపు కొనసాగించారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ తోరనాలతో అందంగా ముస్తాబు చేసి అలంకరించారు. జాతర ప్రశాంతంగా నిర్వహించడానికి ఎస్ఐ సీహెచ్ నాగార్జున తన సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఏడు రోజులుగా గ్రామంలో నిర్వహిస్తున్న ఇంద్రపల్లి ముత్యాలమ్మ జాతర వేడుకలలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గురువారం పాల్గొనగా ఆలయ చైర్మన్ పోట్ల వెంకటేశ్వర్లు, నాయకులు, గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య వేడుక అయిన కుంకుమబళ్లను ఆయన ప్రారంభించారు. కుంకుమ బళ్లుతో భక్తిశ్రద్ధలతో గ్రామోత్సవం -
అనుమానం పెనుభూతమై.. భార్యను హత్య చేసిన భర్త
వేటపాలెం: భార్య మెడకు వైర్ బిగించి ఽభర్త హత్య చేశాడు. ఈ ఘటన దేశాయిపేట పంచాయతీ రైల్వే ట్రాక్ అవతల కప్పలదిబ్బ కాలనీలో గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఎస్సై జనార్దన్ తెలిపిన వివరాల మేరకు.. కాలనీలో అన్నపురెడ్డి వీరమ్మ అలియాస్ షేక్ ఆశా భర్త షేక్ రఫీ నివాసం ఉంటున్నారు. వీరమ్మకు గతంలో వివాహం అయి ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తెకు వివాహం అయింది. వీరమ్మ భర్త గతంలోనే చనిపోయాడు. రామానగర్కి చెందిన షేక్ రఫీని రెండో పెళ్లి చేసుకుంది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. షేక్ రఫీ ఆటో నడుపుతూ తరచూ మద్యం తాగొచ్చి భార్యపై అనుమానపడేవాడు. ఆమోతోపాటు కుమార్తె ఉమా వెంకటలక్ష్మి, కుమారుడు షేక్ షారూఖ్‌ను కూడా హింసించేవాడు. కుమార్తెను కూలీ పనులకు వెళ్లమని వేధిస్తుండటంతో భార్య అడ్డుకుంది. బుధవారం మధ్యాహ్నం తాగొచ్చి గొడవ పెట్టుకొన్నాడు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున గొడవ పడ్డాడు. చార్జింగ్ వైరును భార్య గొంతుకు చుట్టి హత్య చేశాడు. పిల్లలు కేకలు వేయగా చుట్టుపక్కల వారు రాగానే రఫీ పారిపోయాడు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని చీరాల రూరల్ సీఐ సుధాకర్ యాదవ్, క్లూస్ టీం పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. -
కాపు హాస్టల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
పొన్నూరు: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి గుంటూరులోని కాపు హాస్టల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించినట్లు హాస్టల్ కార్యదర్శి బాలిశెట్టి విజయ్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చి ఇంటర్మీడియెట్, డిగ్రీ, బీటెక్., పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డి, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ;సీపీటీ. తదితర విద్యా కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులు కాపు హాస్టల్లో దరఖాస్తుకు అర్హులని అన్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ తదితర పోటీ, ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కూడా హాస్టల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు, మునూరు కాపు సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. హాస్టల్లో భోజన సౌకర్యం, 24 గంటల గ్రంథాలయ సౌకర్యం, స్టడీ అవర్స్, జిమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 86865 55999 నెంబరుకు సంప్రదించాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రవేశాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో ఆకుల రామ్మోహన్రావు, దేగల వెంకటేశ్వరరావు, అమిరినేని సాంబశివరావు పాల్గొన్నారు. -
కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు
సత్తెనపల్లి: త్రుటిలో పెను ప్రమాదం తప్పిన ఘటన సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలోని నలందా ఇంజినీరింగ్ కళాశాల వద్ద గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారు ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇరువురికి గాయాలయ్యాయి. కంకణాలపల్లి అజయ్ అనే వ్యక్తికి గాయాలు కావడంతో సత్తెనపల్లి ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరో వ్యక్తిని పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దాడి ఘటనపై కేసు నమోదు యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో కల్వర్టు నిర్మాణానికి సంబంధించి తలెత్తిన వివాదంలో పలువురు వ్యక్తులు దాడిచేసినట్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సొలస గ్రామానికి చెందిన గువ్వల శ్రీనివాసరావు తన వ్యవసాయ భూమికి వెళ్లేందుకు వీలుగా పాత డ్రైనేజీ కాలువపై జూన్ నెల 27వ తేదీన ఉదయం సిమెంట్ కల్వర్టు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాడు. అదే గ్రామానికి చెందిన గువ్వల భూలక్ష్మి, గువ్వల గోపిలు అక్కడికి చేరుకుని, పనులను అడ్డుకోవడమే కాకుండా వారిపై దుర్భాషలాడారు. తిరిగి అదే రోజు రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో గువ్వల గోపి మరో ఎనిమిది మంది తన ఇంట్లో దౌర్జన్యంగా ప్రవేశించి దాడి చేసినట్లు బాధితుడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ టి.శివరామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఒక్క మండలంలోనే వర్షం నరసరావుపేట: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పూర్తిగా మందగించాయి. గడిచిన 24గంటల్లో కేవలం అచ్చంపేట మండలంలో మాత్రమే 5.4మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మిగతా 27మండలాల్లో ఎక్కడా వర్షం నమోదు కాలేదు. వాతావరణం వేడిగా ఉండటంతో గృహాల్లో ఏసీల వినియోగం తగ్గలేదు. దీంతో విద్యుత్ శాఖపై వినియోగ భారం పెరిగింది. 30, 31న కలెక్టరేట్ వద్ద ధర్నా నరసరావుపేట: ప్రైవేట్ రంగ కార్మికులకు ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాలను తక్షణమే సవరించి కర్ణాటక రాష్ట్రంతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 30న జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాకు కార్మిక లోకం పెద్దఎత్తున తరలిరావాలని సీఐటీయూ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ పిలుపునిచ్చారు. గురువారం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు బండ్ల మహేష్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. వేతనాల సవరణ జరగకపోవడంతో యాజమాన్యాలకు రూ.వేల కోట్ల లాభాలు చేకూరాయని, కార్మికులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నాయకులు డి.శివకుమారి, పి.వెంకటేశ్వర్లు, జి.మల్లీశ్వరి, బి.సూరిబాబు, కె.హనుమంత రెడ్డి, టి.శ్రీనివాసరావు, వేముల వెంకట్రావు, ఎం.రత్నకుమారి, షేక్ సిలార్ మసూద్, కోశాధికారి ఎం.హరిపోతు రాజు పాల్గొన్నారు. -
ఎదురెదురుగా రెండు లారీలు ఢీ ఒకరికి గాయాలు
ఈపూరు: దున్నపోతును తప్పించబోయి ఎదురెదురుగా రెండు లారీలు ఢీ కొన్న సంఘటన మండల పరిధిలోని బోడెశంభునిపాలెం సమీపంలో గురువారం రాత్రి జరిగింది. ఘటనలో దున్నపోతు చనిపోగా, వ్యక్తికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. వినుకొండ నుంచి గుంటూరుకు వెళ్తున్న లారీ రోడ్డుపై వెళ్తున్న దున్నపోతును తగిలి, అదే వేగంలో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీ కొంది. ప్రమాదంలో దున్నపోతు చనిపోగా లారీ డ్రైవర్ తిరుమలశెట్టి నరేంద్రకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 ద్వారా వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఈపూరు పోలీసులు పరిశీలించారు. -
టీడీపీ నేతలపై చర్యలకు డిమాండ్
దాచేపల్లి: సర్ ప్రక్రియలో టీడీపీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. దాచేపల్లి టీడీపీ కార్యాలయంలో ఎన్యూమరేషన్ ఫారాలు పరిశీలిస్తున్న టీడీపీ నేతల ఫొటోలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వైఎస్సార్సీపీ నేతలు అప్రమత్తమై నగర పంచాయతీ కమిషనర్ జి. వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. టీడీపీ నేతల వద్ద ఈఎఫ్లున్న ఫొటోలను సైతం కమిషనర్‌కి అందించారు. విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. బీఎల్ఓల వద్ద ఉండాల్సిన ఫారాలు సంబంధం లేని టీడీపీ నాయకుల వద్దకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీకి చెందిన వారి ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వినతిపత్రం అందించిన వారిలో పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోట కృష్ణ, షేక్ సుభాని, నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, ఎంపీపీ కందుల జాను, మాజీ సర్పంచ్ మందపాటి రమేష్‌రెడ్డి, మున్సిపల్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కొప్పుల రవికుమార్, అధికార ప్రతినిధి షేక్ జాకీర్‌హుస్సేన్, పట్టణ ఉపాధ్యక్షుడు కొలా జంపాలరెడ్డి, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు షేక్ సైదా, క్రిస్టియన్ మైనార్టీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పరిమి బాబు, యుజవన విభాగం అధ్యక్షుడు జక్కా ఆశోక్, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి గరికపాటి సైదారావు, నాయకులు బొమ్మిరెడ్డి నరసింహారావు, కోలా నరసింహారెడ్డి, షేక్ డాడీ, నట్టు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. -
వైఎస్సార్ జయంతి వేడుకలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
మాచర్ల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాలను పల్నాడు జిల్లాలో విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం కృతజ్ఞతలు తెలిపారు. నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని డూ నియోజక వర్గాలలో ప్రజలు ఎక్కడికక్కడ బారులు తీరి సేవా కార్యక్రమాలతో పాటు పండుగ వాతావరణాన్ని సృష్టించి వైఎస్సార్‌కు నివాళులర్పించటం హర్షణీయమన్నారు. ప్రజల కోసం మహానేత చేసిన కృషితో పాటు, ఆయన చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో నాటుకుపోయాయన్నారు. ఆయనను గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరూ జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించటం జరిగిందన్నారు. అన్నీ ప్రాంతాలలో వైఎస్సార్ జయంతిని విజయవంతం చేసిన అన్నివర్గాల ప్రజలకు పీఆర్కే అభినందనలు తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి -
● 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు ● వివరాలు వెల్లడించిన వెస్ట్ ఇన్చార్జి డీఎస్పీ శ్రీనివాసరావు
గంజాయి విక్రేతలు అరెస్టు లక్ష్మీపురం: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద గల 1.5 కిలోల గంజాయిని నగరంపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు, నగరంపాలెం సీఐ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. వీఐపీ రోడ్డు, కృష్ణబాబు కాలనీ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి లాలుపురం వెళ్లే డొంక రోడ్డులో గల శ్రీవల్లి దేశసేన సమేత సుబ్రహ్మణేశ్వరస్వామి దేవస్థానం సమీపంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు పఠాన్ నాగూర్ వలి, అలియాస్ గుండు, బత్తుల దుర్గారావు, బోడా నరేష్‌లు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంబడించి వారిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యవర్తుల సమక్షంలో విచారించారు. వారు తమ వద్ద గంజాయి ఉన్నట్లు అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో విచారించగా ప్రధాన నిందితుడు పఠాన్ నాగూర్ వలి తన తల్లి నాగూర్ బితో కలిసి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి చిన్నచిన్న పొట్లాలుగా తయారు చేసి యువకులు, ఇతరులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. గతంలో అతనిపై నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో హత్యాయత్నం కేసు ఎన్డీపీఎస్ చట్టం కింద మరొక కేసు నమోదైనట్లు కూడా విచారణలో వెల్లడైందని తెలిపారు. దీంతో ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో షేక్ నాగూర్ బి అనే మహిళను అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. 12న టెట్ ఆంగ్లంపై అవగాహన తరగతులు గుంటూరు ఎడ్యుకేషన్: సాంబశివపేటలోని ఏసీ కళాశాలలో ఈనెల 12న ఉదయం 9 గంటలకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 1ఏ, 2ఏలోని ఆంగ్ల భాషా సబ్జెక్టుపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్ తెలిపారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం అవగాహన తరగతుల పోస్టర్లు విడుదల చేశారు. రాష్ట్రంలో ఆంగ్ల భాషా సబ్జెక్టు బోధనలో పేరుగాంచిన ఒంగోలుకు చెందిన అధ్యాపకుడు బి.ప్రసాద్ బోధిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ 1ఏ, 2ఏ పరీక్ష రాయనున్న ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
జిల్లాలో 74 శాతం డిజిటలైజేషన్
నరసరావుపేట: జిల్లాలో సర్ ప్రక్రియలో 74 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్లా గురువారం పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 17,41,798 మంది ఓటర్లు ఉండగా.. 99.99 మందికి ఈఎఫ్‌లు పంపిణీ చేశామన్నారు. 12,88,984 మంది ఫారాలు డిజిటలైజేషన్ చేశామన్నారు. కాగా, ఢిల్లీ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులు నిర్వహించిన వీడియా కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హాజరయ్యారు. ఎన్నికల నియమావళి మార్గదర్శకాల మేరకు సర్ ప్రక్రియను పారదర్శకంగా, సమయపాలనతో పూర్తి చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనర్హుల పేర్ల తొలగింపు, వివరాల సేకరణ, చిరునామా మార్పు అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. -
గుమ్మడి శతజయంతి ఉత్సవాలు ప్రారంభం
తెనాలి: ప్రముఖ సినీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాల ప్రారంభం సంరంభం స్వస్థలమైన తెనాలిలో గురువారం అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో సాయంత్రం కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ఉత్సవాలు జరిగాయి. తొలుత గుమ్మడి చిత్రపటానికి అతిథులు పుష్పాంజలి ఘటించారు. సభకు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. గుమ్మడి బాల్యం నుంచి అయిదారు దశాబ్దాల ఆయన సినీప్రస్థానంలో మైలురాళ్లను, నటనలో ఆయన పరిపూర్ణతను, క్యారెక్టర్ పాత్రకు హద్దులు నిర్ణయించిన గుమ్మడి ప్రతిభను వక్తలు స్మరించుకున్నారు. -
రైల్వే వంతెన నిర్మాణంపై నిరసన
సత్తెనపల్లి: యూ ఆకారపు రైల్వే వంతెన వద్దంటూ సత్తెనపల్లి మండలం వెన్నాదేవి వద్ద జాతీయ రహదారిపై కంకణాలపల్లి గ్రామస్తులు గురువారం నిరసన తెలిపారు. వెన్నాదేవి గ్రామం, వావిలాలనగర్ (కాందీశీకులు) నుంచి కంకణాలపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో రైల్వే గేటు వద్ద కొంతకాలం క్రితం అధికారులు అండర్‌పాస్ నిర్మాణానికి ప్రయత్నించారు. తమ ఇళ్లు కోల్పోతామని, అండర్‌పాస్ వద్దని జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు కాందీశీకులు విన్నవించారు. రైల్వే గేటు నుంచి వంద మీటర్ల దూరంలో క్రేన్ తీసుకొచ్చి అండర్ పాస్ నిర్మాణ పనుల ప్రాంరంభానికి గురువారం అధికారులు ప్రయత్నించారు. కంకణాలపల్లి గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. వ్యవసాయ సీజన్లో యూ టర్న్ తీసుకుని వాహనాలు రావడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెన్నాదేవి గ్రామంలోని సచివాలయం వద్దకు చేరుకుని కొండమోడు, పేరేచర్ల జాతీయ రహదారిపై వారు బైటాయించారు. గ్రామాన్ని కాపాడాలని, యూ ఆకారపు అండర్ పాస్ వద్దంటూ నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులకు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వెన్నాదేవి, కంకణాపల్లి పరిసరాల్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. -
నత్త నడకన ‘సర్’
సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడింది. రాష్ట్రంలోనే అట్టడుగున ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఎక్కువ మంది రెండు, మూడు చోట్ల ఓట్లు కలిగి ఉండటం కూడా గమనార్హం. విదేశాల్లో ఉండేవారు, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో చదువులు, ఉద్యోగాల నిమిత్తం వెళ్లిన వారు, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఓటు ఉండి, ఇక్కడ నివాసం ఉండేవారు చాలా ఎక్కువగా ఉన్నారు. వీరిలో ఎవరు తమ ఓటును ఎక్కడ ఉంచుకోవాలనేది తేల్చుకోలేకపోవడంతో ఈ నియోజకవర్గంలో డిజిటైజేషన్ నత్తనడకన నడుస్తోంది. సర్ కారణంగా ఇక్కడ సుమారు 25 వేలకుపైగా ఓట్లు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 291 పోలింగ్ కేంద్రాలలో 2,78,555 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,77,003 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. ఇంకా 1,552 ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో కేవలం 1,60,009 మంది ఫారాలను డిజిటైజ్ చేశారు. 290 ఫారాలను ఇంకా బీఎల్ఓలు తనిఖీ చేయాల్సి ఉంది. దాదాపు 22 వేల మందికి పైగా రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సమారు మూడు వేల మందికి మూడు చోట్ల ఓట్లు ఉన్నట్లుగా తేలింది. గుంటూరు పశ్చిమతోపాటు తాడికొండ, ప్రత్తిపాడు, వినుకొండ, సత్తెనపల్లి వంటి ప్రాంతాలు, తెలంగాణలో కూడా వీరికి ఓట్లు ఉన్నాయి. వారు ఎక్కడ ఓటు ఉంచుకోవాలనే దానిపై సందిగ్ధంగా ఉన్నారు. అందుకే ఇప్పటి వరకూ ఎన్యూమరేషన్ ఫారాలను వెనక్కి ఇవ్వలేదని సమాచారం. ప్రత్యేక బృందాలు ఏర్పాటు గుంటూరు మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించి డిజిటలైజ్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. లక్ష్మీపురం, శ్యామలానగర్, పట్టాభిపురం, బృందావన్ గార్డెన్స్, విద్యానగర్, ఎస్వీఎన్ కాలనీలలో ఇళ్లు అక్కడక్కడ ఉండటం, అడ్రస్ ట్రేస్ కాకపోవడం వంటి ఇబ్బందులతో ఎన్యూమరేషన్ ఫారాలను వెనక్కి తీసుకునే ప్రక్రియ కూడా ముందుకు సాగడం లేదు. ఒక్కో స్పెషల్ ఆఫీసర్ పరిధిలో రోజుకు ఎనిమిది వందల ఫారాలను వెనక్కి తీసుకురావాలని, ప్రతి బీఎల్ఓ వందకు తగ్గకుండా డిజిటలైజ్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. మూడు వందల ఫారాలు కూడా వెనక్కి రావడం లేదు. దీనిపై గురువారం జరిగిన టెలీ కాన్ఫరెన్స్‌లో కూడా మున్సిపల్ కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా గడువు ఐదు రోజులే ఉన్నా 1.17 లక్షలకుపైగా ఎన్యూమరేషన్ ఫారాలు వెనక్కి రావాల్సి ఉంది. వచ్చిన వాటిలో కూడా మరణించిన ఓటర్లు 5,646 మంది ఉండగా.. 1,766 మంది వరకూ శాశ్వతంగా ఇక్కడి నుంచి చిరునామా మార్చుకున్న వారే. ఇప్పటికే వేరేచోట ఎన్రోల్ అయినవారు 2,482 మంది ఉన్నారు. 9,882 ఎన్యూమరేష్ ఫారాలు అందుబాటులో లేవని అధికారులు చెబుతున్నారు. వీరందరికి ఓటు హక్కు పోయినట్లే. పశ్చిమ నియోజకవర్గంలో డిజిటైజేషన్ కేవలం 57 శాతం మాత్రమే పూర్తి అయ్యింది. జిల్లాలో తాడికొండ 85.24 శాతంతో అగ్రభాగాన ఉంది. తర్వాత స్థానాల్లో 79.99 శాతంతో పొన్నూరు, 78.36 శాతంతో తెనాలి, 76.10 శాతంతో మంగళగిరి, 74.12 శాతంతో ప్రత్తిపాడు, 62.16 శాతంతో గుంటూరు తూర్పు, చిట్టచివరన 57.93 శాతంతో గుంటూరు పశ్చిమ నియోజక వర్గాలు నిలిచాయి. -
ఎమ్మార్పీ కంటే అధికంగా అమ్మితే చర్యలు
మాచర్ల: మాచర్ల పట్టణం, వెల్దుర్తి మండలాల్లోని పలు ప్రాంతాలలోని ఎరువుల షాపులలో సరఫరా విధానం పై జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు, మాచర్ల వ్యవసాయ సహాయ సంచాలకులు వి.జగదీశ్వర రెడ్డిలు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని మార్క్‌ఫెడ్ ఆగ్రో సర్వీస్ సెంటర్, బాలాజీ ఫర్టిలైజర్‌ను, వెల్దుర్తి మండలంలోని శిరిగిరిపాడులో అజయ్ ట్రేడర్స్‌లో సంయుక్తంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు మాట్లాడుతూ మాచర్ల మండలంలో రోజుకి సుమారుగా 12,000 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యూరియా అవసరం ఉన్న రైతులు 2 లేదా 3 రోజులు ముందే అవసరాన్ని బట్టి ఏపీఏఎంఐఎస్ యాప్ ద్వారా కొనుగోలు చెయ్యవచ్చన్నారు. డీలర్లు ఎంఆర్పి కన్నా ఎక్కువ కు అమ్మితే మండల వ్యవసాయ అధికారి, సహాయ వ్యవసాయ సంచాలకులు లేదా తన దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎరువులు డీలర్లు నిబంధనలకు లోబడి ఎరువుల వ్యాపారం చెయ్యాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని, షాపులైసెన్స్లు రద్దు చేస్తామన్నారు. ఈ తనిఖీల్లో మాచర్ల, వెల్దుర్తి మండలాల వ్యవసాయ అధికారులు డి. పాప కుమారి, టి.బాలాజీ గంగాధర్, వ్యవసాయ విస్తరణ అధికారి ఎం.మార్కండేయులు పాల్గొన్నారు. -
తెలుగులో న్యాయమూర్తి తీర్పులు
తెనాలి రూరల్: తెనాలి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఏకా పవన్‌కుమార్ గురువారం తెలుగులో తీర్పులు చెప్పారు. రేపల్లె న్యాయస్థానంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన రెండు న్యాయస్థానాల్లో తీర్పులను తెలుగులో వెలువరించారు. రేపల్లె న్యాయస్థానంలో ఒక ముస్లిం మహిళ విడాకుల వ్యాజ్యంతో పాటు, తెనాలి న్యాయస్థానంలో రెండు ప్రామిసరీ నోటు దావాలలో కూడా తెలుగులో తీర్పులు ఇచ్చారు. కక్షిదారులకు తమ వ్యాజ్యాలు ఎందుకు గెలిచామో, ఎందుకు ఓడామో తెలుసుకోవడానికి తరచుగా తెలుగులో తీర్పులు చెబుతున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.నిజాంపట్నం (రేపల్లె): మండలంలోని గోకర్ణమఠం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ్ఠ మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఉదయం నుంచే శాస్త్రోక్తంగా వేద పండితుల ఆధ్వర్యంలో మహోత్సవాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం కూడా వైభవంగా జరిగింది. మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్, మాజీ ఎంపీపీ మోపిదేవి హరనాథబాబులు పూజా కార్యక్రమాలలో పాలొన్నారు. ఆలయ అభివృద్ధికి మోపిదేవి వెంకట రమణారావు సోదరులు రూ.3 లక్షలు విరాళమిచ్చారు. అమరావతి: మండల పరిధిలోని లేమల్లె ప్రసన్నాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. త్రయాహ్నిక దీక్షతో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో గురువారం ఉదయం 9 గంటలకు స్వామివారి విగ్రహన్ని గర్తంలో ప్రవేశపెట్టారు. భక్త జనుల నామస్మరణల మధ్య ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని గర్భాలయంలో ప్రత్యేక వేదికపై ప్రతిిష్ఠించారు. అనంతరం స్వామి వారి విగ్రహానికి కళాన్యాసం, ప్రాణప్రతిష్ఠ చేసి దిష్టికుంభంతో వేదపండితులు దిష్టి తీశారు. తరువాత ఋత్విక్కులు సుగంధద్రవ్యాలతో హోమాన్ని నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి పూర్తి చేశారు. అన్నసంతర్పణ నిర్వహించారు. ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యుడు కృష్ణకిరణ్ నాదెండ్ల: మండలంలోని చిరుమామిళ్ల, నాదెండ్ల గ్రామాల్లో గురువారం ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యుడు కృష్ణకిరణ్ జిల్లా అధికారులతో కలసి పర్యటించారు. నాదెండ్లలోని రెండు రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. 11వ నంబర్ షాపులో అదనంగా పది క్వింటాళ్లు బియ్యం ఉన్నట్లు గుర్తించారు. చిరుమామిళ్ల ఏపీ మోడల్ పాఠశాలను సందర్శించారు. వంట గదిలోని కూరగాయలు, నిత్యవసర సరుకుల నాణ్యతపై ఆరా తీశారు. కూరగాయల్లో కొన్ని పాడై దుర్వాసన రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు అనారోగ్యం పాలైతే బాధ్యత ఎవరిదంటూ ప్రిన్సిపల్ పద్మజను ప్రశ్నించారు. వసతి గృహంలోని విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను విద్యార్థులు లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కోరారు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని వారు ఆయన తెలిపారు. బోరు నీరే దిక్కు అని, సమస్య పరిష్కరించాలన్నారు. -
బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు?
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం స్థాయీ సంఘాలు భేటీ అయ్యాయి. సెప్టెంబర్‌లో జెడ్పీ పాలకవర్గ పదవీ కాలం ముగియనుండటంతో గురువారం జరిగిన సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొత్తం ఏడు స్థాయీ సంఘాలకుగానూ 1,7వ సంఘాలు మినహా మిగిలిన కోరం లేకపోవడంతో వాయిదా పడ్డాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జెడ్పీలో అభివృద్ధి పనులు నిలిచిపోవడంతోపాటు చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. మరో రెండు నెలల్లో పాలకవర్గ పదవీ కాలం పూర్తి కానుండటంతో గ్రామాల్లో పనులు చేయించిన జెడ్పీటీసీలు బిల్లులు చెల్లించాల్సిందిగా అధికారులను నిలదీస్తున్నారు. గురువారం జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరిగిన 1వ, 7వ స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీటీసీలు ఇదే అంశాలపై చైర్‌పర్సన్‌తోపాటు సీఈవో వి.జ్యోతిబసు ఎదుట ప్రస్తావించారు. పూర్తి చేసిన పనులను బిల్లుల చెల్లింపు, ముందస్తు అనుమతుల పేరుతో జెడ్పీ బడ్జెట్‌కు మించి చేసిన కేటాయింపులకు నిధుల కొరత వంటి అంశాలపై సభ్యులు నిలదీశారు. ప్రభుత్వం చెల్లిస్తేనే... స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి స్టాంప్ డ్యూటీ సర్‌చార్జ్ రూపంలో ప్రభుత్వం రూ.69 కోట్లు జెడ్పీకి జమ చేయాల్సి ఉంది. కానీ ఇవ్వకపోవడంతో జెడ్పీకి శాపంగా మారింది. అభివృద్ధి పనులకు నిధులు వెతుక్కోవాల్సి రావడంతో పాటు దాదాపు రూ.30 కోట్లకు పైబగా పూర్తి చేసిన పనులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జెడ్పీకి వివిధ రూపాల్లో రావాల్సిన నిధుల్లో పైసా విడుదల చేయకపోవడంతో గుంటూరు జెడ్పీ లోటు బడ్జెట్లోకి వెళ్లిపోయింది. జెడ్పీ నిధులతో చేపట్టిన పనులతో పాటు వివిధ గ్రాంట్ల రూపంలో వచ్చే నిధులను దృష్టిలో ఉంచుకుని చేసిన పనులకు సీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లింపులు జరపాల్సి ఉంది. దీంతో సంబంధిత బిల్లులను సీఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ చేస్తున్నా, లోటు బడ్జెట్ కారణంగా అవి తీసుకోవడం లేదు. ఫలితంగా పూర్తయిన పనులకు బిల్లులు చెల్లింపుకు నోచుకోవడం లేదు. మూడు జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు అమానుషం
నరసరావుపేట: మహిళలు, బాలికలపై రోజురోజుకూ పెరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచార ఘటనలను అరికట్టాలని ఐద్వా రాష్ట్ర మాజీ కమిటీ సభ్యురాలు గద్దె ఉమాశ్రీ డిమాండ్ చేశారు. లైంగిక దాడులు ఆపాలని కోరుతూ మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో బుధవారం కోటప్పకొండరోడ్డులోని విజ్ఞాన కేంద్రం వద్ద మహిళలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి గుంటుపల్లి రజని అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఉమాశ్రీ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమెను నిర్బంధించి మత్తు పదార్థాలు ఇచ్చి పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడిన ఘటన అత్యంత అమానుషమన్నారు. అనంతరం నేర ఆనవాళ్లు లేకుండా ఉండేందుకు బాధితురాలిపై తీవ్ర హింసకు పాల్పడటం సమాజాన్ని కలిచివేసే విషయమన్నారు. రాష్ట్రాల్లో గంజాయి, మత్తు పదార్థాల మాఫియా విస్తరిస్తుందని, చాక్లెట్లు, సిగరెట్ల రూపంలో పిల్లలకు మత్తు పదార్థాలు అందుబాటులోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటికి బానిసలవుతున్న యువత విచక్షణ కోల్పోయి చిన్నారులనే లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. మహిళలు, బాలికల భద్రతపై ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకుని వేగవంతంగా శిక్షలు అమలు చేయాల్సి ఉండగా వారికి రాజకీయ పరిరక్షణ లభించడం దురదృష్టకరమని విమర్శించారు. సెల్ఫోన్లలో అశ్లీల వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని బెదిరిస్తూ మహిళలపై లైంగిక దాడులు ఎక్కువయ్యాయన్నారు. మహిళలు, బాలికల రక్షణకు కఠిన చట్టాల అమలుతో పాటు నిందితులకు తక్షణమే శిక్షలు పడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు వి.రాణిమాధవి, సీఐటీయూ నాయకురాలు డి.శివకుమారి, ఐద్వా నాయకురాళ్లు జె.అనూష, ఎస్.దుర్గాబాయి, సుజాత, పార్వతి పాల్గొన్నారు. దాడులు నియంత్రించాలంటూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు నిరసన -
ఎస్ఐఆర్ వెరిఫికేషన్ కచ్చితత్వంతో నిర్వహించాలి
జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికా శుక్లా పిడుగురాళ్ల: ఎస్ఐఆర్ వెరిఫికేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో కచ్చితత్వంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికా శుక్లా అన్నారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో జరుగుతున్న సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(ఎస్ఐఆర్) పక్రియను జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి చేపడుతున్న వెరిఫికేషన్, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, ఓటర్ల వివరాల నిర్ధారణ, డిజిటలైజేషన్ పురోగతిని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రతి అర్హులైన ఓటరును తప్పనిసరిగా సంప్రదించి, వివరాలను నిబంధనల ప్రకారం ధ్రువీకరించాలని బీఎల్వోలకు సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ ఈనెల 14 వరకు కొనసాగుతుందని, ప్రతి బూత్ లెవల్ అధికారి, తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి గణన ఫారం ఓటర్లకు అందజేశారన్నారు. ప్రజలు ఫారం పూర్తి చేసి బీఎల్వోలకు అందజేయాలని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా, పారదర్శకంగా నిష్పక్షికంగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లు తావులేకుండా ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంచి పనితీరు కనబరుస్తున్న బీఎల్వోల మాదిరిగా బాధ్యతాయుతంగా పని చేసి కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో మురళీకృష్ణ, కమిషనర్ ఐ శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జైలాబ్దిన్, బీఎల్వోలు, బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయలు
రెంటచింతల: రెంటచింతలలోని రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి గాయాలయ్యాయి. రెంటాల గ్రామా నికి చెందిన సిద్దవటం కృష్ణారెడ్డి ఆటోలో రెంటచింతల వస్తూ రైల్వేస్టేషన్ సమీపంలోని మొదటి మూల మలుపు వద్ద ఆదుపు తప్పి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన కృష్ణారెడ్డిని వెంటనే 108 వాహనంలో గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కృష్ణారెడ్డిని నర్సరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాచర్ల మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ డి. శేషిరెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద ఘటన వివరాలను తెలుసుకున్నారు. రెంటచింతల –రెంటాల గ్రామాల మధ్య రహదారిలో ను న్న మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రెకర్లు ఏర్పా టు చేయడం వలన ప్రమాదాలను నివారించవచ్చన్నారు. మూలమలుపుల వద్ద అతివేగంగా నడపడం మంచిదికాదన్నారు. -
బీసీ మహాధర్నాను జయప్రదం చేయండి
నరసరావుపేట: బీసీ వర్గీయుల డిమాండ్ల సాదన కోసం ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 10న విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహించే బీసీల మహా ధర్నా కార్యక్రమానికి బీసీలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ హాజరై జయప్రదం చేయాలని రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను కోరారు. బుధవారం సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు జనాభా దామాషా మేరకు కల్పించాలని, సుప్రీంకోర్టు 50శాతం సీలింగ్ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రద్దు చేయించాలని, రాజ్యాంగ సవరణ ద్వారా పెంచిన బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని షెడ్యూల్ లైన్లో చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పించాలని, బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఏబీసీడీలుగా వర్గీకరించాలని, చట్టసభల మహిళ రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని, బీసీ రిజర్వేషన్లు ఖరారు తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని బీసీ కులాల వారు, ప్రజాస్వామికవాదులు, మహిళలు, ప్రజలందరూ మహాధర్నాలో పాల్గొన్న జయప్రదం చేయాలని కోరారు. పల్నాడు జిల్లా అధ్యక్షులు బిళ్ళకంటి శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు నాగారపు గురు ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు కొల్లిపర బాలాజీ, మండల ఉపాధ్యక్షులు వి.శ్రీరాములు, యువజన నాయకులు దమ్మాటి మల్లిఖార్జున పాల్గొన్నారు. కోరిన బీసీ సంక్షేమసంఘ నాయకులు -
కుల వివక్ష లేని సమాజ నిర్మాణమే లక్ష్యం
నరసరావుపేట: కుల వివక్ష లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా అన్ని ప్రజా సంఘాలు ఏకమై ‘సామాజిక శంఖారావం‘ పూరించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బుధవారం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ‘కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం‘ పేరుతో జిల్లా స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన వర్క్‌షాప్ లో కృష్ణయ్య మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్–14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులని, ఆర్టికల్–15 కుల వివక్షను నిషేధిస్తుందని, ఆర్టికల్–17 అంటరానితనాన్ని పూర్తిగా రద్దుచేస్తుందని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రవిబాబు మాట్లాడుతూ కుల వివక్ష నిర్మూలనే లక్ష్యంగా ఈ నెల 16 నుంచి వచ్చే నెల 23 వరకు జిల్లావ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసనలు, అవగాహన కార్యక్రమాలు, అధికారులకు వినతిపత్రాల అందజేత 24న కలెక్టరేట్ ముట్టడికి పిలుపు ఇచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వంకాయలపాటి శివ నాగరాణి, జిల్లా అధ్యక్షురాలు మాధవి, సీఐటీయు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్, ప్రజా సంఘాల నాయకులు ఏ.లక్ష్మీశ్వరరెడ్డి, నాగమల్లేశ్వరరావు, పెద్దిరాజు, నాగేశ్వరరావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య -
దూరవిద్య డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం ఆధ్వర్యంలో గత నెలలో నిర్వహించిన బిఏ, బీబీఏ, బీకాం ఆరో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు దూరవిద్య కేంద్రం సంచాలకులు వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఫలితాలను బుధవారం వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు చేతుల మీదుగా విడుదల చేశారు. మొత్తం 9,202 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 9,024 మంది ఉత్తీర్ణులై 98 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయ దూరవిద్యా కేంద్రం వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ (డీసీ)గా జనమంచిలి ఏకాంబరం బాధ్యతలు స్వీకరించారు. నాజ్ సెంటర్లోని ఆ శాఖ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు ఆయన చిత్తూరులోని పోలమాంబ తల్లి, శ్రీకాళహస్తి ఆలయం డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. గతంలో డీసీగా పనిచేసిన కేబీ శ్రీనివాస్ పదవి విరమణ చేసిన నేపథ్యంలో ఏకాంబరం గుంటూరు డీసీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల పరిరక్షణకు బాధ్యతగా పనిచేస్తానని తెలిపారు. ఏకాంబరంను అసిస్టెంట్ కమిషనర్ జి.మాధవి, శాఖ అధికారులు, పలువురు ఈవోలు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తుమృకోట (రెంటచింతల): తుమృకోట గ్రామంలో ఆరు రోజులుగా నిర్వహిస్తున్న ఇంద్రపల్లి ముత్యాలమ్మ జాతరలో భాగంగా బుధవారం ఇంద్రపల్లి ముత్యాలమ్మకు భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఆలయ అర్చకులు నేతృత్వంలో గ్రామ దేవతైన ఇంద్రపల్లి ముత్యాలమ్మకు వేకువజాము నుంచే పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపించారు. అన్ని వర్గాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సందర్శించుకుని మొక్కులు చెల్లించి బోనాలు సమర్పించారు. ఆలయ చైర్మన్ పోట్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఎస్ఐ సీహెచ్ నాగార్జున నేతృత్వంలో పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. నరసరావుపేట: ఈ నెల 11, 12 తేదీలలో విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సాహిత్య సమ్మేళనాన్ని పల్నాడు జిల్లాకు చెందిన కవులు, రచయితలు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పల్నాడు బాలోత్సవం కమిటీ ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో సాహిత్య సమ్మేళనం పోస్టర్ విజ్ఞాన కేంద్రం బాధ్యులతో కలిసి ఆవిష్కరించారు. సమ్మేళనం రెండు రోజుల పాటు మొత్తం 6 సెషన్లలో నిర్వహిస్తారన్నారు. మొదటిరోజు తెలకపల్లి రవి పాల్గొని ప్రసంగిస్తారని, ముగింపు సభలో కుమారస్వామి అధ్యక్షతన గంటేడు గౌరునాయుడు, ఎంవీఎస్ శర్మ, పిన్నమనేని మురళీకృష్ణ, కె.సత్యరంజన్ మాట్లాడతారని అన్నారు. ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగాలు, చర్చలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, షేక్ మస్తాన్‌వలి పాల్గొన్నారు. -
అప్పుల బాధతో హోటల్ కార్మికుడు ఆత్మహత్య
చిలకలూరిపేటటౌన్: భార్య అనారోగ్యం, కొడుకు చదువు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురై ఓ హోటల్ కార్మికుడు ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన చిలకలూరిపేట పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..చిలకలూరిపేట పట్టణంలోని రెడ్ల బజార్‌కు చెందిన షేక్ దరియా(51) స్థానిక కిచిడి హోటల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య ఆషాబేగం గత కొంతకాలంగా పక్షవాతం వ్యాధితో బాధపడుతోంది. భార్య వైద్య ఖర్చులకు, అలాగే కొడుకు మహబూబ్ సుభాని చదువు నిమిత్తం దరియా పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. నిరుపేద కుటుంబం కావడంతో ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక, కుటుంబ భారం ఎక్కువై గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర మనస్తాపంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెంది, గత నెల 29న ఇంట్లో ఎలుకల నివారణ పేస్ట్ తిన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. భార్య ఆషాబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫ్లెక్సీ వివాదం తాడేపల్లి రూరల్ : తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉండవల్లి దళితవాడలో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుని ఒకరిపై మరొకరు దాడిచేసుకునే వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న తాడేపల్లి పోలీసులు బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అక్కడకు చేరుకుని గుంపులుగా ఉన్న రెండు వర్గాల వారిని చెదరగొట్టారు. అనంతరం ఫ్లెక్సీ వివాదం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరింది. మందకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా ఉండవల్లి వాటర్ ట్యాంక్ వద్ద ఉండవల్లి దళితవాడకు చెందిన ఓ యువకుడు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దానిని ఏర్పాటు చేయడానికి వీలులేదంటూ రెండవ వర్గం వ్యతిరేకించింది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఎవరైనా వివాదాలకు, గొడవలను ప్రోత్సహిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినా కేసులు నమోదు చేస్తామని సీఐ వీరేంద్రబాబు హెచ్చరించి పంపించివేశారు. గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా ముఖ్య కూడళ్లలో ఫిల్టింగ్ ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం 7 గంటల వరకు ఫిల్టింగ్ కొనసాగుతూనే ఉంది. శతాధిక వృద్ధుడు ఆగమ పండితులు దీవి వీరరాఘవాచార్యులు మృతి తెనాలి: ప్రముఖ వైఖానస ఆగమ పండితులు రూరల్ మండల గ్రామం కొలకలూరులో వేంచేసి ఉన్న శ్రీరాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి వారి ఆలయ వంశపారంపర్య అర్చకులు పండిత దీవి వీరరాఘవాచార్యులు (106) మంగళవారం రాత్రి మృతి చెందారు. వృద్ధాప్యంతో ఉన్నప్పటికీ చివరి దశ వరకు ఆరోగ్యంగా ఉంటూ సునాయాస మరణాన్ని పొందారు. వైఖానస ఆగమ శాస్త్రంలో పాండిత్యాన్ని సముపార్జించి ఎందరో శిష్యులకు ఆగమ శాస్త్ర బోధన చేశారు. శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు రచించారు. భగవద్గీతలో పూర్తి సారాంశాన్ని 18 శ్లోకాలతో అందించి గీతా సారంగా హిందూ సమాజంలో విస్తృత ప్రచారం చేశారు. ఆధ్యాత్మికపరమైన కృషితో పాటు ఎందరో పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థల ద్వారా సన్మానాలు పొంది తనకు అబ్బిన విద్యను పదిమందికి పంచిపెట్టారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి సీతారామాచార్యులు ఆగమ శాస్త్రంలో పేరు ప్రఖ్యాతలు గడించారు. తల్లి చినరంగమ్మ కూడా 104 సంవత్సరాల వయసులో మృతి చెందారు. వీరరాఘవాచార్యులు మృతి పట్ల వైఖానస ఆగమ సంఘాలు, అర్చక సంఘాలు పలు ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు సంతాపం వ్యక్తంచేస్తూ, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. యువతికి సైగలు చేశాడంటూ కొట్లాట నకరికల్లు: ఫంక్షన్లో ఉన్న యువతికి ఓ వ్యక్తి అసభ్యకరంగా సైగలు చేశాడన్న విషయమై జరిగిన ఘర్షణతో అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.సతీష్ బుధవారం తెలిపారు. సంఘటనకు సంబంధించి ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. నకరికల్లులో మంగళవారం జరిగిన ఒక ఫంక్షన్లో మహమ్మద్ అనే వ్యక్తి ఓ యువతికి అసభ్యకరంగా సైగలు చేశాడన్న విషయమై సైగలు చేసిన వ్యక్తి స్నేహితుడు బాజీకి యువతి తండ్రికి గొడవ జరిగి కొట్టుకోగా ఇరువురికి గాయాలయ్యాయి. బాలిక అదృశ్యంపై కేసు ముప్పాళ్ళ: మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.అనిల్‌కుమార్ బుధవారం తెలిపారు. గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఇంటి నుంచి కాలేజీ కి వెళ్లి రాకపోవటంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మోటార్ సైకిళ్ల చోరీ కేసులో నిందితుడు అరెస్టు
8 మోటార్ సైకిళ్లు స్వాధీనం నరసరావుపేట టౌన్: వివిధ ప్రాంతాలలో ఎనిమిది మోటార్ సైకిళ్లను చోరీ చేసిన కేసులో నిందితుడైన ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వల్లాపల్లి గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్‌ను పట్టణంలోని డీమార్ట్ వద్ద మంగళవారం అరెస్టు చేసినట్లు నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు బుధవారం తెలిపారు. మొదటి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. నిందితుడు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో 8 మోటార్ సైకిళ్లను చోరీ చేసినట్లు నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. వాటి విలువ సుమారు ఆరు లక్షల రూపాయలు ఉంటుందన్నారు. నిందితుడు బైక్ మెకానిక్‌గా పని చేస్తూ సులభంగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో మోటార్ సైకిళ్లను చోరీ చేసినట్లు తెలిపారు. సమావేశంలో మొదటి పట్టణ సీఐ షేక్ ఫిరోజ్, ఎస్ఐ వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి
చిలకలూరిపేట: ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను వెంటనే కల్పించాలని ఎస్టీయూ రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె . కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎస్టీయూ పట్టణశాఖ సమావేశం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉపాఽఽధ్యాయులకు సంబందించి ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎంఈవో, హైస్కూల్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులు వెంటనే పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు లేక తీవ్రంగా నష్టపోతున్నారని, అదే సమయంలో విద్యార్థులకు సంబంధిత సబ్జెక్టు టీచర్లు లేకపోవడం వల్ల విద్యలో నాణ్యత కొరవడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు బొంతా రవి, ఎం.శారదా, విజయకుమార్, షేక్ జమీర్, మేకల కోటేశ్వరరావు, వి.జయప్రకాశ్, షేక్ మక్బూల్‌బాష తదితరులు పాల్గొన్నారు. ఎస్టీయూ నాయకుల డిమాండ్ -
నీరాజనం
సంక్షేమ రేడుకు వైఎస్సార్ .. ఆ పేరే ఒక ప్రభంజనం ఎవరూ చెరపలేని, మరువలేని, మరపురాని సజీవ సంక్షేమ సంతకం.. పేదింటి గుండె కోవెలలో నేటికీ ఆయన సజీవం.. అన్నదాతల చిక్కటి చిరునవ్వుల్లో ఆయన చిరునామా శాశ్వతం.. వైద్యులుగా, ఇంజినీర్లుగా మారిన పేదింటి బిడ్డల హృదయాల్లో ఆయన స్థానం చిరస్మరణీయం.. ఆయనంటే నమ్మకం.. ఆయన వెంటే జనసందోహం. ఉమ్మడి జిల్లాపై మహానేత మమకారం అనిర్వచనీయం.. జిల్లా అభివృద్ధిపై ఆయన ముద్ర అపురూపం. దివంగత మహానేత వైఎస్సార్ జయంతిని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం పెద్దఎత్తున నిర్వహించారు. పెదకూరపాడులో వైఎస్సార్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు -
పల్నాడు
గురువారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 20267అచ్చంపేట : పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 31.8797 టీఎంసీలు. ఎగువ నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు అంతే నీటిని వదలుతున్నారు. తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1500, గరిష్ట ధర రూ.2500, మోడల్ ధర రూ.1800 వరకు పలికింది. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 513.80 అడుగులకు చేరింది. సాగర్ నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. -
కూలుతున్న ఇళ్లు.. ఎండుతున్న పంటలు
సాక్ష, టాస్క్‌ఫోర్స్: దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామ సమీపంలో శ్రీ సిమెంట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ విస్తరణ, సున్నపురాయి గని విస్తరణ కోసం భారత ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సభను బుధవారం నిర్వహించారు. ఈ సభలో జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా, గురజాల, మాచర్ల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ నజీనా బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో దాచేపల్లి మండలం పెదగార్లపాడు, కారంపూడి మండలం కాచవరం, ఇనుపరాజుపల్లి, గాదెవారిపల్లె గ్రామాల ప్రజలు పాల్గొని తమ సమస్యలపై ఏకరువు పెట్టారు. గతంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో పై గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చేంత వరకు ఎటువంటి అనుమతులు ఇవ్వొద్దని ప్రజలు జిల్లా కలెక్టర్‌ని కోరారు. కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ..కాచవరం గ్రామంలో ఇళ్లను అనుకుని జరుగుతున్న మైనింగ్‌ని తక్షణమే నిలిపివేయాలని, ఇళ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా మైనింగ్ చేయాలని యజమాన్య ప్రతినిధులకు సూచించారు. కలుషిత నీరు, దుమ్ముతో రోగాల బారిన పడుతున్నాం ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వాల్సిందే శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ సభలో గ్రామస్తుల ఆందోళన శ్రీ సిమెంట్స్ యజమాన్యం కాచవరం గ్రామానికి 100 నుంచి 150 మీటర్ల దూరంలో భారీ బ్లాస్టింగ్స్ చేస్తున్నారు. భారీ బ్లాస్టింగ్ ధాటికి ఇళ్ల గోడలు నెర్రెలు కొట్టి కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. బ్లాస్టింగ్ చేయటం కోసం నల్లమందు ఉపయోగించటం వలన తాగేనీరు కలుషితం అవుతున్నాయి. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాల్లో అర్హతని బట్టి ఉద్యోగాలు ఇవ్వమంటే ఇవ్వటంలేదు. – కిష్టాపాటి రవీందర్‌రెడ్డి, కాచవరం శ్రీ సిమెంట్స్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులను భిక్షగాళ్లగా చూస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ముధూళితో పంటలు పాడైపోతున్నాయి. సాగునీటి కాలువలను అక్రమంగా పూడ్చి వేస్తున్నారు. ఫ్యాక్టరీ వల్ల జరుగుతున్న నష్టాలకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మా సమస్యలు పరిష్కరించకపోతే ఢిల్లీ దాకా వెళ్లి పోరాటం చేస్తాం. – కొరకూటి ఆంజనేయులు, ఇనుపరాజుపల్లి -
రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు సత్తెనపల్లి వాసులు ఎంపిక
సత్తెనపల్లి: రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు సత్తెనపల్లి వాసులు ఎంపికయ్యారు. యోగ అసోసియేషన్ నేతృత్వంలో పల్నాడు జిల్లా నేషనల్ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేట శ్రీసరస్వతి శిశు మందిర్‌లో నిర్వహించిన యోగా పోటీల్లో సత్తెనపల్లి యోగా సాధకులు ప్రతిభ కనబర్చి వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. సత్తెనపల్లికి చెందిన యోగా గురువు మారుతి రమేష్, లక్ష్మయ్య, వెంకటేశ్వరరావులు విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. విజేతలుగా 10–14 సంవత్సరాల విభాగంలో ఆర్యన్, ఆర్టిస్టిక్ సోలో ఈవెంట్ ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం, ట్రెడిషనల్ ఈవెంట్లో తృతీయ స్థానం సాధించి కాంస్య పతకం కై వసం చేసుకున్నారు. 14–18 సంవత్సరాల విభాగంలో కె.చాతుర్య ట్రెడిషనల్ ఈవెంట్లో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం, ఆర్టిస్టిక్ సోలో ఈవెంట్లో ద్వితీయ స్థానం సాధించి వెండి పతకం కై వసం చేసుకున్నాడు. 35–45 సంవత్సరాల విభాగం మహిళల్లో జె.వసుంధర ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం, కె.రమాదేవి ద్వితీయ స్థానం సాధించి వెండి పతకం కై వసం చేసుకుంది. 35–45 సంవత్సరాల పురుషుల విభాగంలో ఎం.సునిల్‌కుమార్ ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం, టి ఆంజనేయులు ద్వితీయ స్థానం సాధించి వెండి పతకం కై వసం చేసుకున్నారు. 45–55 సంవత్సరాల విభాగంలో డి.సాంబశివరావు ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం, పులి ద్వితీయ స్థానం సాధించి వెండి పతకం, పులహరి బానోజి తృతీయ స్థానం సాధించి కాంస్య పతకం కై వసం చేసుకున్నారు. -
రైతు పొలమే ప్రయోగశాల
● శాసీ్త్రయ సాగుకు ‘పొలం బడి’ వేదిక ● ఐదు జిల్లాల వ్యవసాయ అధికారులకు ఓరియంటేషన్ శిక్షణలో జేడీఏ పద్మావతి కొరిటెపాడు(గుంటూరు): రైతులకు శాసీ్త్రయ సాగు విధానాలను క్షేత్రస్థాయిలో చేరవేసి, ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపడుతున్న ‘పొలం బడి’ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఐదు జిల్లాలకు చెందిన వ్యవసాయ అధికారులకు గుంటూరులోని కృషి భవన్లో బుధవారం ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో గుంటూ రు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన మండల వ్యవసాయ అధికారులు, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. రైతులకు పొలం బడుల ద్వారా శాసీ్త్రయ సాగు పద్ధతులను ప్రత్యక్షంగా ఎలా బోధించాలనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. గుంటూరు జిల్లా వ్యవసాయ జేడీ ఎం.పద్మావతి మాట్లాడుతూ నిర్ధేశించిన విధి విధానాలను తప్పనిసరిగా పాటించడం ద్వారా రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు లభించి అధిక లాభం పొందడంతో పాటు సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతుందని తెలిపారు. ప్రతి జిల్లాలో ఖరీఫ్‌లో ఒక ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ (మేలైన యాజమాన్య పద్ధతులపై) పొలంబడి కార్యక్రమం, రబీలో ఒకటి లక్ష్యంగా చేయాలని సూచించారు. ఎస్‌ఓపీసీఏ అధికారిణి డాక్టర్ సారిక మాట్లాడుతూ ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ విధానంలో రైతులను, ఎఫ్‌పీఓకి అనుసంధానం చేసి వారు పండించిన పంట ఉత్పత్తుల నాణ్యతను ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ల్యాబ్‌ల ద్వారా పరీక్షించి స్కోప్ సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతోందన్నారు. దీనిద్వారా ఆన్లైన్ డిజిటల్ మార్కెట్ ప్లాట్ ఫామ్‌లలో వారి ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముకునే అవకాశం లభిస్తోందని వివరించారు. డీడీఏలు సునీత, పీవీ హేమలత, ఏడీఏ ఎం.వెంకటేశ్వర్లు, ఐదు జిల్లాల ఏఓలు, ఏడీఏలు పాల్గొన్నారు. -
14న కలెక్టరేట్ ముట్టడి
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి ఫ్యాప్టో పిలుపు నరసరావుపేట ఈస్ట్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఫ్యాప్టో రాష్ట్ర వ్యాపిత పిలుపులో భాగంగా ఈనెల 14వ తేదీ మంగళవారం పల్నాడు జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేపడుతున్నట్టు ఫ్యాప్టో పల్నాడు జిల్లా చైర్మన్ ఎల్.వి.రామిరెడ్డి బుధవారం తెలిపారు. అరండల్‌పేటలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, పీఆర్సీ కమిటీ కమిషనర్ నియామకం, ఐఆర్ ప్రకటన, పెండింగ్ డీఏల విడుదల వంటి డిమాండ్లతో చేపడుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్యాప్టో సెక్రటరీ జనరల్ బి.సంపత్‌బాబు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం.మోహనరావు, డి.శ్రీనివాసరావు, ఆర్థిక కార్యదర్శి ఆర్.గోవిందరాజులు, పమ్మి వెంకటరెడ్డి, ఏ.ఏమండీ, భీష్మారావు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టరేట్ ముట్టడి పోస్టర్‌ను విడుదల చేశారు. చోరీలకు పాల్పడిన నలుగురు అరెస్ట్ నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : ఇంట్లో బంగారం, మొబైల్ దుకాణంలో దొంగతనాలకు పాల్పడిన నలుగుర్ని తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి, 229.5 గ్రాముల బంగారం, రూ.2 లక్షలు, ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలు వెల్లడించారు. తెనాలి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కఠెవరం గ్రామంలో జరిగిన ఓ ఇంటి దొంగతనం, తెనాలి పట్టణంలోని ఒక మొబైల్ దుకాణంలో మొబైల్ఫోన్లు అపహరించడంపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు సీఐ ఎస్కె.నయాబ్‌రసూల్, ఎస్ఐ కె.ఆనంద్ పోలీస్ బృందంతో దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ పుటేజీ, సాంకేతిక ఆధారాలతో అంగలకుదురు– యడ్లపల్లి రహదారిపై తనిఖీలు నిర్వహించగా, నలుగుర్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన కారు డ్రైవర్ 23 ఏళ్ల వేజెండ్ల జోసెఫ్ అతనికి సహకరించిన గొడవర్రు గ్రామానికి చెందిన బేతపూడి సురేష్, ప్రస్తుతం అంగలకుదురు గ్రామంలో ఉంటున్న రికవరీ ఏజెంట్ చావలి పవన్‌తేజ, చావలి వంశీ అలియాస్ నానిలను అరెస్ట్ చేశారని అన్నారు. వారి నుంచి 229.5 గ్రాముల బంగారం, రూ.2 లక్షలు, ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జోసెఫ్ కార్ డ్రైవర్‌గా చేస్తూ చెడు వ్యసనాలకు అలవాటయ్యాడు. సలభంగా డబ్బు సంపాదించాలని వరుస చోరీలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. మొబైల్ దుకాణంలో, ఓ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుమారు రూ.2 లక్షలు, భారీగా బంగారు సొత్తు అపహరించాడని అన్నారు. దొంగిలించిన బంగారాన్ని స్నేహితుడైన బేతపూడి సురేష్‌కు అప్పగించగా, అతను చావలి పవన్‌తేజ, చావలి వంశీల సహకారంతో పొన్నూరులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో విడతల వారీగా సుమారు 50 గ్రాములు తనఖా పెట్టారని తేలిందన్నారు. తద్వారా వచ్చిన నగదు పరస్పరం పంచుకుని వ్యక్తిగత అవసరాలు, విలాసాలకు వినియోగించారని విచారణలో వెల్లడైందన్నారు. మిగతా బంగారం, నగదుతో గోవా వెళ్లేందుకు పథకం వేశారని అన్నారు. కేసును ఛేదించిన తెనాలి డీఎస్పీ జనార్థనరావు, రూరల్ పీఎస్ సీఐ ఎస్.కె.నయాబ్‌రసూల్, ఎస్ఐ కె.ఆనంద్, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గరుడబిల్లి–గొట్లాం, దొంకినవలస–కోమటిపల్లి మధ్య నేటి నుంచి జరుగుతున్న సమగ్ర ఆర్వీఎన్ఎల్ పనుల కోసం ట్రాఫిక్–కమ్–పవర్ బ్లాక్ (రైళ్ల రాకపోకలు, విద్యుత్ సరఫరా నిలిపివేత) కారణంగా, రాయగడ–విజయనగరం మధ్య నడిచే రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు గుంటూరు రైల్వే డివిజన్ డీసీఎం వినయ్‌కాంత్ బుధవారం తెలిపారు. గుంటూరు–రాయగడ(17243) ఎక్స్‌ప్రెస్ ఈనెల 8 న బయలుదేరే ఈ రైలు రాయగడ వరకు కాకుండా, విజయనగరం వరకే నడుస్తుందని తెలిపా రు. రాయగడ–గుంటూరు(17244) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 9న ఈ రైలు రాయగడకు బదులుగా విజయనగరం నుంచే ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని తెలిపారు. -
భారీ బ్లాస్టింగ్‌తో నష్టపోతున్నాం
సాక్షి, టాస్క్ ఫోర్స్ : ‘సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రెండు పంటలు పండే సారవంతమైన 600 ఎకరాల భూములు ఇస్తే పట్టుమని పది ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మేము నివసించే ఇళ్లను ఆనుకుని భారీ బ్లాస్టింగ్లు చేస్తే ఇళ్లు బీటలు వారుతున్నాయి. గుండెలు ఝల్లుమంటున్నాయి. ఊరు వదిలిపెట్టి వెళ్లే దుస్థితి దాపురించింది. నల్లమందుతో బ్లాస్టింగ్ చేయటం వలన రోగాల బారిన పడుతున్నాం.. మా జీవితాలతో చెలగాటం ఆడుకోవద్దు’ అంటూ పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు పరిసర గ్రామాల ప్రజలు’ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ, సున్నపురాయి గని విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ సభను బుధవారం నిర్వహించారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ నజీనా బేగం అధ్యక్షతన జరిగిన ఈ సభలో కలెక్టర్ కృతికాశుక్లా, ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మనందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో దాచేపల్లి మండలం పెదగార్లపాడు, కారంపూడి మండలం కాచవరం, ఇనుపరాజుపల్లి, గాదెవారిపల్లె గ్రామాల ప్రజలు పాల్గొని తమ సమస్యలు ఏకరువు పెట్టారు. గతంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో పై గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు విస్తరణకు ఎటువంటి అనుమతులూ ఇవ్వొద్దని కలెక్టర్‌ని కోరారు. కొద్దిసేపు సభ వద్ద కాచవరం గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ..కాచవరం గ్రామంలో ఇళ్లని ఆనుకుని జరుగుతున్న మైనింగ్‌ని తక్షణమే నిలిపివేయాలని, ఇళ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా మైనింగ్ చేయాలని యాజమాన్య ప్రతినిధులకు సూచించారు. ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మనందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టర్ బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. -
రోగుల భద్రతకు భరోసా కరువు
ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రే ఇప్పుడు రోగుల్లో భయాన్ని నింపుతోంది. అనారోగ్యంతో ఆస్పత్రికి చేరిన వారు వ్యాధి నుంచి కోలుకునేలోపే సెల్ఫోన్లు, వాహనం పోతుందేమోనన్న ఆందోళనతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పల్నాడు జిల్లాకు ప్రధాన వైద్యసేవల కేంద్రంగా ఉన్న నరసరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నరసరావుపేట టౌన్: ఇటీవల కేసానుపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తపై గ్రామ టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. క్షతగాత్రులు ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న సమయంలో ఆస్పత్రిలోకి చొరబడిన టీడీపీ మూకలు... మరోమారు వారిపై దాడికి దిగారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలోనే ఇలాంటి దారుణం జరగడం భద్రతా వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో వెల్లడిస్తోంది. ఆస్పత్రిలో ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? అనే పర్యవేక్షణ కూడా సమర్థంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సెల్ఫోన్ల చోరీలు... పురుషులు, మహిళా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల సెల్ఫోన్లు తరచూ మాయం అవుతున్నాయి. ముఖ్యంగా రాత్రివేళ చార్జింగ్ పెట్టిన ఫోన్లు ఉదయం కనిపించకపోవడం లేదని బాధితులు చెబుతున్నారు. పేదలకు సెల్ఫోన్లు ఎంతో కీలకం. ఓటీపీలకు కూడా అవే అవసరం. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి లేక చాలామంది నష్టాన్ని మౌనంగా భరిస్తున్నారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో దొంగలను గుర్తించడం కూడా కష్టమవుతోంది. వాహనాలకూ రక్షణ శూన్యం... రోజూ వందల మంది రోగులు, వారి బంధువులు ద్విచక్ర వాహనాలతో ఆస్పత్రికి వస్తుంటారు. చికిత్స ముగించుకుని బయటకు వచ్చేసరికి వాహనాలు కనిపించకపోవడం లేదా విడిభాగాలు చోరీకి గురవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పార్కింగ్ స్థలం ఆక్రమణకు గురవడంతో ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపాల్సి వస్తోంది. దీనిని అవకాశంగా తీసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. డాక్టర్లు, సిబ్బందికి కూడా ప్రత్యేక పార్కింగ్ సదుపాయం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చీకటి పడితే చాలు.. రాత్రి కాగానే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. రోగుల సహాయకుల పేరుతో ఆస్పత్రిలోకి ప్రవేశిస్తున్న కొందరు మద్యం తాగి వార్డుల వద్ద సంచరిస్తూ సిబ్బందితో, రోగుల బంధువులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులతో వచ్చిన కుటుంబాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. అత్యవసర చికిత్స కోసం వచ్చిన వారు కూడా భద్రతపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలో ప్రైవేటు భద్రతా సిబ్బందిని నియమించినప్పటికీ వారి విధులు నామమాత్రంగా నిర్వర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, చోరీలు జరిగినా సమయానికి స్పందించడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. కొందరు సెక్యూరిటీ సిబ్బంది మెడికల్ సర్టిఫికెట్ల కోసం వచ్చే వారి నుంచి డబ్బులు తీసుకుని డాక్టర్ల వద్ద పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. భద్రత కంటే ఇతర వ్యవహారాలపైనే ఆసక్తి చూపుతున్నారని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని వైద్యశాల వర్గాలు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వైద్యాధికారులు పలుమార్లు పోలీస్ శాఖకు ప్రతిపాదనలు పంపినా స్పందన రాలేదని తెలుస్తోంది. ఆస్పత్రిలో పోలీస్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటే నేరాలకు అడ్డుకట్ట పడటమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది. ఒక్కోసమయంలో రెండు వర్గాలు ఒకేసారి వైద్యశాలకు వచ్చినప్పడు ఘర్షణ వాతావరణం ఏర్పడి పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. పోలీసు ఔట్‌పోస్టు ఏర్పాటైతే ఈ సమస్య కూడా తీరుతుంది. -
ప్రకృతి వ్యవసాయానికి కెన్యా బృందం ఫిదా
కొల్లిపర(తెనాలి): ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్(ఏపీసీఎన్ఎఫ్) ద్వారా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ నమూనాలను అధ్యయనం చేసేందుకు కెన్యాకు చెందిన ప్రతినిధుల బృందం మంగళవారం కొల్లిపర మండలం బొమ్మువానిపాలెంలో పర్యటించారు. అత్తోటలోని భూమి భారతి దేశ విత్తన సంరక్షణ కేంద్రం ‘భూమిభారతి’ని సందర్శించింది. సీడ్ సేవర్ నెట్వర్క్, కెన్యా కో–ఆర్డినేటర్ వంజుమా న్జోరోగే డేనియల్, జిప్పోరా న్యాంబురా కురియా, స్లో ఫుడ్–కెన్యా హెడ్ జాన్ కరియుకి మ్వాంగి, గ్లోబల్ ఫీల్డ్ నెట్వర్క్, కెన్యా ప్రతినిధి ఒడ్డా ఫ్రైడే ఒచోమా, న్యూయార్క్ యూనివర్శిటీ–అబుదాబికి చెందిన ఇంటర్న్ ప్రసిద్ధ సప్కోటా ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి, కొల్లిపర మండల ప్రత్యేక అధికారి, కెన్యా ప్రతినిధుల బృందానికి జిల్లాలో జరుగుతున్న పంటల నమూనాలను వివరించారు. తొలుత రైతు డి.భీమరాజుకు చెందిన ఏటీఎం(ఎనీ టైమ్ మనీ) మోడల్ పంటపొలాన్ని పరిశీలించారు. వంకాయ, మిరప, గోంగూర, టమాటా, కాకర, పొట్లకాయ, బీరకాయ, చిక్కుడు, కరివేపాకు, మామిడి తదితర 20 పైగా పంటలతో ఏర్పాటు చేసిన అక్కడి జీవ వైవిధ్య వ్యవస్థను పరిశీలించారు. క్షేత్రంలో సహజంగా అభివృద్ధి చెందిన ప్రయోజనకర కీటకాలు, సూక్ష్మజీవుల చురుకై న కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించిన ప్రతినిధులు ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అభినందించారు. తర్వాత ఏ–గ్రేడ్ అరటి మోడల్ క్షేత్రాన్ని సందర్శించారు. రసాయన పురుగుమందులు లేకుండా ఏపుగా పెరిగిన అరటి తోటనూ పరిశీలించారు. అరటితో పాటు సాగు చేసిన బంతి, ఆముదం వంటి ట్రాప్ క్రాప్స్తో సహజ కీటక నియంత్రణపై కెన్యా ప్రతినిధులకు వివరించారు. ప్రకృతి వ్యవసాయం నేల ఆరోగ్యంపై చూపుతున్న సానుకూల ప్రభావాన్ని గుర్తించారు. తదుపరి హెప్సి స్వయం సహాయక సంఘం సభ్యులతో నిర్వహించిన పరస్పర సమావేశంలో, మహిళలు ప్రకృతి వ్యవసాయాన్ని ఎలా అమలు చేస్తున్నారో, గ్రామస్థాయిలో ఏఏల పాత్ర, ప్రభుత్వ రుణాలు, రుణాలు, కుటుంబ పోషణ, రైతుల జీవనోపాధిలోమార్పులను తెలుసుకున్నారు. జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ నమూనాలు, జీవ వైవిధ్య ఆధారిత సాగు, సహజ కీటక నియంత్రణ పద్ధతులు, నేల ఆరోగ్య పరిరక్షణ, మహిళల భాగస్వామ్యాన్ని కెన్యా ప్రతినిధులు ప్రశంసించారు. ఈ నమూనాలు వాతావరణ మార్పులను ఎదుర్కొనే సుస్థిర వ్యవసాయానికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
చందోలు(కర్లపాలెం): చందోలు జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని కారు ఢీకొనటంతో ఆ వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతిచెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. చందోలు ఏఎస్ఐ రామయ్య తెలిపిన వివరాల మేరకు... చందోలు ఎస్టీ కాలనీకి చెందిన నంబూరు నాంచారయ్య(35) చందోలు ఐస్ ఫ్యాక్టరీ సమీపంలోని 216 జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళుతుండగా చెరుకుపల్లి వైపు నుంచి చీరాల వైపు వస్తున్న కారు ఢీ కొనటంతో నాంచారయ్య తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. నాంచారయ్యకు భార్య ఉంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎఎస్ఐ తెలిపారు. -
ఆకట్టుకున్న నాటిక ప్రదర్శనలు
తెనాలి: రోటరీ కళాపరిషత్, ఈదర రామారావు ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాపరిషత్‌లో రాష్ట్రస్థాయి తృతీయ ఆహ్వాన నాటికలు మూడో రోజైన మంగళవారం కొనసాగాయి. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి జ్యోతి ప్రజ్వలన చేశారు. రాత్రి ఏడు గంటలకు ఏర్పాటైన ప్రత్యేక సభకు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. రోటరీ వ్యవస్థాపకుడు పాల్ హారిస్ పురస్కారాన్ని ప్రముఖ రొటేరియన్ డీకే ఆనంద్ దంపతులకు రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నే రత్నప్రభాకర్ చేతులమీదుగా ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, నాటక పరిశోధకుడు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు మాట్లాడుతూ, బ్రిటిష్ హయాంలోనే డీకే ఆనంద్ తండ్రి రంగస్థలంపై నటించారని, కళాకారుడి కుటుంబానికి చెందిన రొటేరియన్ ఆనంద్‌కు పాల్హారిస్ పురస్కారం ఇవ్వటం సముచితమని చెప్పారు. ప్రముఖ సినీమాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, రోటరీ డిస్ట్రిక్ట్–3150 అధ్యక్షుడు సోమవరపు రాంప్రసాద్, ఎఫర్ట్ ఆర్గనైజేషన్, మార్టూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జేవీ మోహనరావు, రోటరీ క్లబ్, తెనాలి అధ్యక్షుడు గుమ్మడి సరోజ్బాబు, ఈదర శ్రీనివాసరావు పాల్గొన్నారు. నిర్వాహక సంస్థల అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ పర్యవేక్షించారు. తొలుత తెలుగు కళాసమితి, విశాఖపట్నం వారి ‘చిటికెన వేలు’ నాటికను ప్రదర్శించారు. అట్టాడ అప్పలనాయుడు రచనకు చలసాని కృష్ణప్రసాద్ దర్శకత్వం వహించారు. చివరగా చైతన్య కళాస్రవంతి, ఉక్కునగరం, విశాఖ వారి ‘అగ్నిసాక్షి’ నాటికను ప్రదర్శించారు. మాడభూషి దివాకర్‌బాబు రచనకు పి.బాలాజీనాయక్ దర్శకత్వం వహించారు. రెండు నాటికలూ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా సాగాయి. ప్రముఖ రొటేరియన్ డీకే ఆనంద్ దంపతులకు రోటరీ వ్యవస్థాపకుడు పాల్ హారిస్ పురస్కారం ప్రదానం -
12న సత్రశాల దేవస్థానంలో రుద్రాభిషేకాలు
రెంటచింతల: ప్రముఖ శైవ క్షేత్రమైన సత్రశాల గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీ నుంచి గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి సేవాట్రస్టు ఆధ్వర్యంలో సామూహికంగా మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ గుండా వెంకట శివయ్య, సేవాట్రస్టు అధ్యక్షుడు పోలిశెట్టి పిచ్చయ్య మంగళవారం తెలిపారు. ఉదయం 9.35 గంటల నుంచి నిర్వహించే ఈ వేడుకలలో భక్తులు పాల్గొని మల్లన్న స్వామివారి అనుగ్రహం పొందాలన్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు. ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి మంగళవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విజయవాడ భవానీపురానికి చెందిన పి.రవిచంద్ర కుటుంబం అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేసింది. గుంటూరు జిల్లాకు చెందిన సానా శ్రీనివాసరావు అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ.లక్ష విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. ఫిరంగిపురం: మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయ 9వ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు నగరేశ్వర స్వామికి, వాసవి మాతకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. విశేష అర్చనలు, అష్టోత్తర, సహస్రనామ పూజలు చేశారు. అనంతరం లక్ష్మి, గణపతి హోమం, గణపతి పూజ, అంకురార్పణ, మండపారాధన, విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ దాచేపల్లి, నరేంద్రకుమార్, గుగ్గిళం మధుసూధన్, కె.వెంకటేశ్వర్లు, కె.శేషులు తదితరులు పూజాది కార్యక్రమాలను పర్యవేక్షించారు. అమరావతి: మండల పరిధిలోని లేమల్లె ప్రసన్నాంజనేయస్వామి నూతన ఆలయ, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల 9వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ముందుగా జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. తొలుత బాలాలయంలో ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శంకరరావును ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. స్వామి వారి శేష వస్త్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి నిరంతర కృషి చేసిన బందం రావూరి శ్రీనివాసరావుతోపాటు ఆలయ కమిటీ సభ్యులను శంకరరావు అభినందించారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు భవిరిశెట్టి హనుమంతరావు, నేతలు కూరపాటి వాసు, నాగుల్మీరావలి, కోపూరి సుధాకర్ , మేకల లక్ష్మణ్, రహయాన్, రాజు, యడ్లపల్లి నేతాజీ, డాక్టర్స్ సెల్ షరీఫ్‌లతో పాటు ఆళ్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
కుమార్తె ప్రేమ వివాహం.. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య
నాదెండ్ల: కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయిందన్న మనస్తాపంతో తండ్రి ఎలుకల పేస్ట్ తిని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన గణపవరం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గణపవరం గ్రామానికి చెందిన అచ్చి కాళహస్తి (46) చికెన్షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కాళహస్తికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత నెల 26న కుమార్తె పార్వతి ఇంటి నుంచి వెళ్ళి ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన కాళహస్తి ప్రతిరోజూ మదనపడేవాడు. గత నెల 30న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల పేస్ట్ తిన్నాడు. కుటుంబ సభ్యులు గుర్తించి చిలకలూరిపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. కుమారుడు రాధాకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
జిల్లాలో 65.11 శాతం ఈఎఫ్‌ల డిజిటలైజేషన్
నరసరావుపేట: జిల్లాలో మంగళవారం నాటికి 65.11శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మొత్తం 17,41,798మంది ఓటర్లు ఉండగా 17,41,401మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామన్నారు. వారిలో 11,34,118మంది ఫారాలు డిజిటలైజేషన్ చేయటం జరిగిందన్నారు. నరసరావుపేట పట్టణంలోని షాలెంనగర్లో గల 11,12,13 వార్డుల్లోని 153, 154, 163 పోలింగ్ బూత్‌లలో జరుగుతున్న సర్ ప్రక్రియను నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఆర్డీఓ కె.బాలకృష్ణ, అసిస్టెంట్ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ బి.రమ్యకీర్తన మంగళవారం పరిశీలించారు. త్వరగా ఫారాలు సేకరించి డిజిటల్ చేయాలని బీఎల్ఓలకు సూచించారు. -
ఆర్టీసీ ఉద్యోగుల నిరసన
మాచర్ల: ఆర్టీసీ ప్రైవేటీకరణను నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన చేశారు. ఆర్టీసీలో విద్యుత్ బస్సులను సంస్థే చేపట్టాలని, ప్రైవేటీకరణ చేయకూడదని, సీ్త్ర శక్తి జీరో టికెట్ ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలని, 4వేల డిజిల్ బస్సులను కొనాలని, 15వేల ఖాళీలను పూర్తిచేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. నాయకులు సోమయ్య, నరహరి, ఎంవీకే చారి, నీలంరాజు, సురేష్, మురహరి, మల్లారెడ్డి, శివయ్య ఆధ్వర్యంలో మహిళా కండక్టర్లు, డ్రైవర్లు, ఉద్యోగులు, నిరసనలో పాల్గొన్నారు. మాచర్ల: పల్నాడు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2025–26 విద్యా సంవత్సరానికి చేరేందుకు ఆసక్తి కలిగి దరఖాస్తు చేసుకొన్నవారందరూ ఈ నెల 13న జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని జిల్లా కన్వినర్ పి.పవన్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాచర్ల ప్రభుత్వ ఐటీఐలో జరిగే సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే కౌన్సెలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులను సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, అధికారులను ఆదేశించారు. ప్రాధాన్య రంగాల అధికారులతో స్థానిక కలెక్టరేట్లో మంగళవారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువులు అధిక మోతాదులో వినియోగించకుండా అవగాహన కల్పించాలని కోరారు. యూరియా, డీఏపీ ఎరువులను ఏపీ–ఎయిమ్స్ యాప్ ద్వారా పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. పంట వేసే రైతుకు మాత్రమే ఎరువులు అందాలని, బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయించడం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు ఎరువులు కొనుగోలు నిమిత్తం పంట భూమి వివరాలు, సాగు చేసే పంటల వివరాలు ఆయా రైతు సేవా కేంద్రాలలో సర్వే నంబరు, ఖాతా నంబరు, విస్తీర్ణం, పంట సరిగా ఉన్నట్లు రైతు సేవ కేంద్రం సహాయకుల ద్వారా సరిచూసుకోవాలని సూచించారు. ఎక్కడైనా విత్తనాలు అవసరం ఉంటే వెంటనే పంపిణీ చేసే విధంగా సిద్ధంగా ఉండాలని కోరారు. -
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
మాచర్ల: మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలోని పరిష్కరించదగ్గ, రాజీపడదగ్గ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఈ నెల 11న శనివారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తులు శ్రీనివాస్ కళ్యాణ్, పి.ప్రశాంత్‌లు పేర్కొన్నారు. మంగళవారం కోర్టు ప్రాంగణంలోని వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండల లీగల్ సెల్ ఆధ్వర్యంలో సివిల్, క్రిమినల్, కుటుంబ వివాదాలు, బ్యాంకు కేసులు, వరకట్న వేధింపులు వంటివి రాజీ చేసుకునే అవకాశముందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రజా కోర్టులో రాజీ పడదగ్గ కేసులు పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. న్యాయవాదులు రామా నాయక్, శ్రీనివాసరెడ్డి పలువురు న్యాయవాదులున్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు మేడికొండూరు: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన మండల పరిధిలోని పేరేచర్లలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ మధుసూదన్ రావు తెలిపిన వివరాలు.. యూనివర్సల్ కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న భవాని శంకర్(20) తన బావమరిది నాగంజితో పేరేచర్లలోని ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటూ కాలేజీకి వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో డోకిపర్రు గ్రామానికి చెందిన వినయ్ అదే కళాశాలలో చదువుతున్నాడు. ముగ్గురు కలసి పేరేచర్ల సమీపాన ఉన్న కై లాసగిరి క్షేత్రానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి భవాని శంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భవాని శంకర్ ఘటన స్థలంలోని మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నాగంజి, వినయ్‌ని మేడికొండూరు పోలీసులు చికిత్స నిమిత్తం 108లో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెనాలిరూరల్: పోలీసుల పేరిట స్కూటీపై వస్తున్న వృద్ధుడిని అడ్డగించి అతని బండిలో ఉన్న రూ.50 వేలు దోచుకున్న ఘటన తెనాలి– విజయవాడ రహదారిలో ఆటోనగర్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన 73 ఏళ్ల మల్లికార్జునరెడ్డి తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులో రూ.1.60 లక్షలు విత్‌డ్రా చేశారు. నగదును స్కూటీ డిక్కీలో పెట్టుకుని తెనాలి వస్తుండగా ఆటోనగర్ వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. పోలీసులం, తనిఖీ చేయాలంటూ వాహన పత్రాలను అడిగారు. అదే సమయంలో డిక్కీలో ఉన్న నగదులో నుంచి రూ. 50 వేలు తీసుకుని పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ కె.ఆనంద్ తెలిపారు. తెనాలిరూరల్: గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలి మండలం జగ్గడిగుంటపాలెంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కె.ఆనంద్ అందించిన వివరాలు.. గ్రామ పరిధిలోని పొలంలో సుమారు 55 ఉండి 60 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిస్తే 9440796219, 9440796170 నంబర్లలో సంప్రదించాలని రూరల్ ఎస్ఐ మంగళవారం కోరారు.


