డాక్టర్ మేరీ గ్లౌరీ సేవలు మరువలేనివి
గుంటూరు మేత్రాసనం పీఠాధిపతి చిన్నబత్తిని భాగ్యయ్య
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): సేవకు ప్రతిరూపంగా నిలిచే గుంటూరు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్‌లో 36 ఏళ్లు సుదీర్ఘంగా వేలాది మంది రోగులకు చికిత్సలు చేసి, తన చేతి స్పర్శతో వారిని ఆరోగ్యవంతులుగా చేసిన దివంగత డాక్టర్ మేరీ గ్లౌరీకి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ఆమెను సెయింట్‌గా గుర్తించే క్రమంలో రెండవ దశ అయిన పూజ్యనీయ (వెనరబుల్‌గా) స్థానాన్ని పొందడం గుంటూరుకే గర్వకారణమని గుంటూరు మేత్రాసనం పీఠాధిపతి చిన్నబత్తిని భాగ్యయ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక సెయింట్ జోసెఫ్స్ పాఠశాల ఆవరణలో డాక్టర్ మేరీ గ్లౌరీకి దక్కిన గౌరవ పురస్కారం సందర్భంగా జె.యం.జె. సభ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవం నిర్వహించారు.
17, 22 తేదీల్లో శాప్ లీగ్స్ క్రీడా పోటీలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): శాప్ ఆదేశాల మేరకు 31 క్రీడాంశాల్లో శాప్ లీగ్స్ పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా 17వ తేదీ ఉదయం 9 గంటలకు స్థానిక బీఆర్ స్టేడియంలో అండర్–13, 15, 17, 19 బాల బాలికలు, యువతీ యువకుల చెస్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ప్రతిభ కనబరచిన వారిని ఎంపిక చేసి ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పంపిస్తామన్నారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 9 గంటలకు స్థానిక బీఆర్ స్టేడియంలో అండర్–18 యువతీ యువకుల జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు జరుగుతాయన్నారు. ఎంపికై న వారిని ఈ నెల 28 నుంచి మార్చి 1 వరకు విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు పంపిస్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు శాప్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. వివరాలకు స్కేటింగ్ కోచ్ షేక్ అబ్దుల్ సలామ్ 94934 47566, సైక్లింగ్ కోచ్ కనకరావు సెల్ నెంబర్ 63011 77119ను సంప్రదించాలని కోరారు.
డాక్టర్ మేరీ గ్లౌరీ సేవలు మరువలేనివి


