breaking news
Palnadu District News
-
వచ్చేది జగనే.. ఇచ్చేదీ జగనే!
నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం సాక్షి, నరసరావుపేట: వైఎస్ జగన్మోహన్ రెడ్డి... అంటేనే అభివృద్ధి, సంక్షేమాలకు మారుపేరుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తన ఐదేళ్ల పరిపాలనతో చరిత్రలో మరే ముఖ్యమంత్రి చేయలేని పనులు చేసి ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం పొందారు. కులమత, వర్గ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించిన ప్రజాపాలన ఆయనకే ప్రత్యేకమైంది. పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతో కీలకమైన ప్రభుత్వ విద్య, వైద్య రంగాలలో సంస్కరణలు చేపట్టి మెరుగైన సేవలు అందుబాటులోకి తెచ్చారు. రైతు పక్షపాతిగా విత్తనాలు మొదలు పండిన పంట అమ్ముకునే వరకు ప్రతి దశలో వారికి చేదోడుగా నిలిచారు. లాభాల సాగుకు సాయం చేశారు. గ్రామాలలో సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్‌లు, ప్రభుత్వ బడుల అభివృద్ధి, రైతులకు గోదాములు వంటి పనులతో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. కరోనా వంటి విపత్తులో సైతం ప్రజలకు భరోసానిచ్చారు. మహిళలు స్వయంశక్తితో నిలబడేలా చేయూత ఇచ్చారు. ఐదేళ్లలో లెక్క లేనన్ని మంచి పనులు చేసి వందేళ్లు గుర్తుంచుకునేలా పాలించారు. నేడు ఆయన జన్మదినం కావడంతో జిల్లా ప్రజలు పొందిన లబ్ధిని గుర్తు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా పుట్టిన రోజు వేడుకలు చేయడానికి వాడవాడలా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడానికి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సిద్ధమయ్యారు. వైద్య విప్లవం... విద్య, వైద్యానికి పెద్దపీట వేసిన వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా పిడుగురాళ్ల కామేపల్లి శివారులో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో రూ. 550 కోట్ల వ్యయంతో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారు. దీని ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్యతోపాటు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నరసరావుపేటలో 200 పడకల ప్రభుత్వ జిల్లా వైద్యశాల గత ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగి పేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందాయి. ఆయన కృషిని నేటికీ గుర్తు ఉంచుకున్నారు. -
ప్రాణాలు నిలబెట్టిన నాటి ముఖ్యమంత్రి భరోసా
యడ్లపాడు: ఒక నిరుపేద యువకుడికి అమ్మ త్యాగం.. వైఎస్ జగన్ సాయం ప్రాణం పోశాయి. పల్నాడు జిల్లా యడ్లపాడు దిగువ ఎస్సీ కాలనీకి చెందిన కారుచోల ఏసుపాదం, రాణి దంపతులకు ఇద్దరు కుమారులు. 15 ఏళ్ల క్రితమే ఏసుపాదం మరణించారు. కుటుంబ భారం రాణిపై పడింది. కూలి పనులు చేస్తూ బిడ్డలను సాకుతోంది. తల్లి కష్టాన్ని చూడలేక శ్రీనివాస్ ఇంటర్‌తోనే చదువు ఆపేసి, గ్లాస్ వర్కింగ్ పనులకు వెళ్లాడు. కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో సాధారణ జ్వరంతో అనారోగ్యం మొదలైంది. పరీక్షల సమయంలో శ్రీనివాస్ కిడ్నీ దెబ్బతిన్నట్లు వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. స్పందించిన వైఎస్ జగన్ ఆపరేషన్ కోసం రూ. 7 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఉన్న 30 సెంట్ల పొలాన్ని అమ్ముకున్నారు. అయినా డబ్బులు సరిపోక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ విషయం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఆయన వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 5 లక్షలు మంజూరు చేశారు. తల్లి తన కిడ్నీని కొడుకుకు దానం చేయగా, ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ఆపరేషన్ తర్వాత వారు బరువైన పనులు చేసే పరిస్థితి లేకపోవడంతో శ్రీనివాస్‌కు ఎడ్లపాడు గ్రామ పంచాయతీలో శానిటరీ సూపర్వైజర్గా, తల్లి రాణిని క్లాప్మిత్రగా నియమించి ఉపాధి కల్పించారు. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదుకోకపోతే తమ బిడ్డ ప్రాణాలు దక్కేవి కావని, పొలం అమ్మినా ఆపరేషన్ ఖర్చులకు డబ్బుల్లేక అల్లాడిపోయామని రాణి గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరయ్యారు. జగనన్న చొరవతో తన కొడుకు కళ్ల ముందు ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పారు. తమ కుటుంబాన్ని జగన్ దేవుడిలా ఆదుకున్నారని తెలిపారు. -
మారిన ఊరు రూపురేఖలు
సత్తెనపల్లి: ‘‘ఇదిగో ఈ ఊరి నడిబొడ్డున అరుగు మీద కూర్చుని గ్రామాన్ని చూస్తుంటే జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. నాది పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామం. నా పేరు కళ్లం తిరుపతి రెడ్డి. 82 ఏళ్లు దాటాయి. భార్య మంగమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పిల్లల పెళ్లిళ్లు అయిపోయాయి. ముని మనవళ్లు కూడా వచ్చారు. అప్పట్లో ఎట్టా ఉండేది ఊరు?.. ఇప్పుడు ఎట్టా మారిందో! చదువులకు వెళ్లాలంటే 10 కిలో మీటర్లు నడిచేవారు. బురదలో భుజాన బ్యాగులు తగింలిచుకుని కాళ్లు ఈడుస్తూ సత్తెనపల్లి పోయేవారు. ఊళ్లో ఎవరికై నా రోగం వస్తే గుండెలు కొట్టుకునేవి. ఎడ్లబండి కట్టుకుని సత్తెనపల్లికి పరుగు పెట్టేవాళ్లం. మట్టిని నమ్ముకున్నోళ్లం. వ్యవసాయం తప్ప వేరే పని తెలియదు. నీళ్ల కోసం ఆశగా ఆకాశం వంక చూసి.. నాలుగు చినుకులు రాలితే దండం పెట్టుకునేవాళ్లం. ఒక్కసారిగా పనులు వైఎస్ జగన్ పాలనలో ఊళ్లో పరిస్థితులే మారిపోయాయి. నడిబొడ్డుకే అన్ని వచ్చి చేరాయి. మా మనవళ్లు, మనవరాళ్లు బ్యాగులు భుజాన తగిలించుకుని, బూట్లు వేసుకుని ఊరిలోనే బడికి వెళుతుంటే ఎంతో సంబరంగా ఉంది. ఎప్పుడు అవసరం వచ్చినా చిటికెలో విలేజ్ క్లినిక్ (ఆరోగ్య కేంద్రానికి) వెళుతున్నాం. పెద్ద డాక్టర్లను కూడా పల్లెటూళ్లకు తీసుకొచ్చారు. అంతకంటే ఏం కావాలి మాకు. వైఎస్ జగన్ పుణ్యమాని ఏ పని కావాలన్నా మండల కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. గ్రామంలోనే సచివాలయ భవనం నిర్మించారు. పంటలకు సరిపడా నీళ్లు వస్తున్నాయి. కాలువలను నిండుతున్నాయి. అన్నదాతలను నెత్తిన పెట్టుకున్నారు జగన్. విత్తు నుంచి పండించిన పంట ఉత్పత్తులను మద్దతు ధరకు అమ్ముకునే వరకు ఊళ్లోకే రైతు భరోసా కేంద్రం తీసుకొచ్చారు. వ్యవసాయాన్ని నిలబెట్టారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టారు. ఒక్క మా ఊరిలోనే రూ. 13 కోట్లకుపైగా అభివృద్ధి పనులు చేయించారు. దీంతో పల్లె కాస్త పట్టణంలా మారిపోయింది. అందుకే వైఎస్ జగన్ పది కాలాలపాటు బంగారంలా ఉండాలని జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నా.’’ -
ప్రాధాన్యతా క్రమంలో అర్జీల పరిష్కారం
సీఆర్డీయే కమిషనర్ కె కన్నబాబు తాడికొండ: అర్జీలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు, అడిషనల్ కమిషనర్ ఎ.భార్గవతేజ్లు అర్జీదారులకు హామీ ఇచ్చారు. రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో శనివారం ‘గ్రీవెన్స్ డే‘ నిర్వహించారు. అర్జీలను కమిషనర్ కె కన్నబాబు, అడిషనల్ కమిషనర్ ఏ భార్గవతేజ్లు స్వీకరించారు. గ్రామకంఠాలు, ఎల్పీఎస్ లే అవుట్లు, రిటర్నబుల్ ప్లాట్ల రీ అలాట్మెంట్ తదితర సమస్యలపై పలువురు అర్జీలు అందజేశారు. అర్జీదారులు తెలియజేసిన పలు ఫిర్యాదులకు అధికారులు అక్కడికక్కడే పరిష్కారం చూపగా మిగిలినవి కూడా సత్వరమే పరిష్కరించాలని, అలసత్వం వద్దని కమిషనర్ అధికారులకు సూచించారు. ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాయపూడిలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో జరిగే గ్రీవెనన్స్ డేను రైతులు వినియోగించాలన్నారు. -
పల్నాడు
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఆ చిరునవ్వే.. ప్రజలకు కొండంత అండ.. ఆ అభివాదమే.. జనం గుండెకు భరోసా.. ఆ సంకల్పమే.. ప్రజా సంక్షేమ ఎజెండా.. ఆ ధైర్యమే.. ప్రజా శ్రేయస్సుకు రక్ష ఆ దూరదృష్టే.. రాష్ట్ర ప్రగతికి దిక్సూచి ఆ సంతకమే.. నిరుపేదలకు వెలుగు రేఖ ఆ ఓదార్పే.. అలసిన బతుకులకు ఆశాదీపం ఆ మోమే.. ఆపన్నుల ఎనలేని ధైర్యం ఆ రూపమే.. జనహృదయ ఆనంద తరంగం ఆ అపురూపమే... వైఎస్ జగన్ ! జగనన్న చేసిన మేలుతో ఇంటింటా కృతజ్ఞత ఆయన జన్మదిన వేళ.. శుభాకాంక్షల హేల!! -
ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే బిల్లును వెనక్కి తీసుకోవాలి
తాడేపల్లి రూరల్: గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు డిమాండ్ చేశారు. తాడేపల్లి రూరల్ పరిధిలోని చిర్రావూరులో ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును వ్యతిరేకిస్తూ రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు బిల్లుల ప్రతులను శనివారం దహనం చేశారు. హరిబాబు మాట్లాడుతూ 2025లో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి వామపక్ష పార్టీలు మద్దతునిచ్చి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించే విధంగా ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదల కడుపుకొట్టే విధంగా ఉపాధి హామీ పథకం నిధులను పక్కదారి పట్టించడమేకాకుండా, బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి పూర్తిస్ధాయిలో నిధులు కేటాయించకుండా గ్రామీణ పేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకరరావు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు జి.అప్పలస్వామి, రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, బొప్పన గోపాలరావు, కౌలు రైతు సంఘం నాయకులు పల్లపాటి సుబ్బారావు, అడప సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఉండవల్లిలో... ఎంటీఎంసీ పరిధిలోని ఉండవల్లి సుందరయ్య చౌక్ వద్ద మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం పేరును మార్పు చేయవద్దని నిరసన వ్యక్తం చేసి, జీవో కాపీలను దహనం చేశారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు ఈశ్వర్‌రెడ్డి, వీరాస్వామి, కోటేశ్వరరావు, గాంధీ, రామారావు, వెంకటేశ్వరరావు, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, సారధి తదితరులు పాల్గొన్నారు. -
నేడు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు
సత్తెనపల్లి: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఐదేళ్ల లోపు వయసు ఉన్న చిన్నారులు 1,89,746 మంది ఉన్నారు. చుక్కల మందు వేయడానికి 1,151 బూత్‌లను ఏర్పాటు చేశారు. 26 ట్రాన్సిట్ పాయింట్లు, 87 మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో చోట నలుగురు సిబ్బంది ఉంటారు. పారా మెడికిల్ సిబ్బందితో పాటు అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో 100 శాతం మంది చిన్నారులకు చుక్కల మందు వేస్తారు. జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, వివిధ శాఖల సమన్వయంతో మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పోలియో బూత్‌ల ద్వారా చుక్కల మందు వేసిన సిబ్బంది ఆ బిడ్డల చేతి గోరుపై సిరా గుర్తు పెడతారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే మంగళ, బుధవారాల్లో ఇంటింటికి అవగాహన ర్యాలీ నరసరావుపేట: ఐదేళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించే పల్స్‌పోలియో సందర్భంగా శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి నిర్వహించిన పల్స్‌పోలియో అవగాహనా ర్యాలీకి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ రాంబాబు, డీఎల్‌టీఓ డాక్టర్ మాధవీలత, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఎఫ్డీపీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ డి.హనుమకుమార్, డీఎంఓ డాక్టర్ షేక్ నజీర్, డీపీఓ ఉన్నూరు బాష, ఎస్ఓ నీలకంఠేశ్వరరావు పాల్గొన్నారు. తిరుగుతూ చుక్కల మందు వేస్తారు. పరిసరాల పరిశుభ్రత అందరి నైతిక బాధ్యత జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: స్వచ్ఛత ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. శనివారం నరసరావుపేటలోని గాంధీపార్కు వద్ద స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రీసైక్లింగ్ విధానంలో తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి నెల మూడవ శనివారం ఒక ముఖ్యమైన అంశంతో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. తొలుత మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీపార్కు వరకు ఉద్యోగులు, మహిళలు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు, డీఇ రఫీక్, టౌన్‌ప్లానింగ్ అధికారి కె.సాంబయ్య, రెవెన్యూ ఆఫీసర్ శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు కోటయ్య, రమాదేవి పాల్గొన్నారు. కలెక్టరేట్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నరసరావుపేట: స్థానిక కలెక్టరేట్లోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో శనివారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్పర్సన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. సీనియర్ పాస్టర్లు క్రీస్తు సందేశం వినిపించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్రీస్తు అవలంబించిన జాలి, దయ, కరుణ, క్షమ అందరికీ అనుసరణీయమన్నారు. క్రైస్తవులకు కళ్యాణమండపం, వేడుకలకు స్థలం కేటాయింపుపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. భిన్న మతాలు, కులాలు ఉన్న దేశంలో సర్వమత సామరస్యం అవసరమన్నారు. -
బండరాళ్లు మోపి వ్యక్తి హత్య
తాడేపల్లి రూరల్: బండరాళ్లు మోపి వ్యక్తిని హత్య చేసిన ఘటన శనివారం తాడేపల్లిలో ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంజిరెడ్డి కాలనీ, కొలనుకొండ గ్రామాలను కలిపే రహదారిలో పంట పొలాల మధ్యలో మృతదేహం ఉన్నట్లు ఓ రైతు గుర్తించి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. చనిపోయిన వ్యక్తి ఆటోడ్రైవర్ ఇళ్లచెరువు వెంకట్(30)గా గుర్తించారు. వెంకట్ బ్రహ్మానందపురంలో నివాసముంటున్నాడని, అంజిరెడ్డి కాలనీలో రెండో భార్య ఉంటోందని స్థానికుల ద్వారా గుర్తించారు. అంజిరెడ్డి కాలనీకి సమీపంలో ఈ హత్య జరగడంతో అక్కడే నివసిస్తున్న వెంకట్ రెండవ భార్య శిరీషకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లి మృతిచెందిన వ్యక్తి వెంకట్ అని పోలీసులకు తెలిపింది. ఆమె మొదటి భార్య సాయిదుర్గకు సమాచారం ఇచ్చింది. మొదటి భార్య ఘటనా స్థలానికి తన ఇద్దరు ఆడపిల్లలతో కలసి వచ్చి భర్త మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. ఘటనా స్థలానికి గుంటూరు నుంచి వచ్చిన వెంకట్ తండ్రి వెంకటేశ్వర్లు తమ కొడుకుని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి, తలపై రాయిమోపి చంపినట్లు ఫిర్యాదు చేశాడు. వెంకట్ రెండవ భార్య విషయంలో మొదటి భార్య వెంకట్‌తో గొడవ పడింది. అనంతరం ఆమె దగ్గరకు వెళ్లనని వెంకట్ చెప్పినట్లు తెలియవచ్చింది. రెండవ భార్య శిరీష నా భర్తను అంజిరెడ్డి కాలనీకి చెందిన వారే పాత కక్షలు మనసులో పెట్టుకుని హత్యచేశారని, గతంలో నా భర్తను, నన్ను చంపడానికి ప్రయత్నించిన ఆ ముగ్గురే ఈ దారుణానికిఒడిగట్టారని, వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించాలని ఆమె డిమాండ్ చేసింది. ఇదే క్రమంలో మొదటి భార్య సాయిదుర్గ, రెండవ భార్యగా చెప్పుకుంటున్న శిరీషనే ఈ హత్య చేయించిందని ఆరోపిస్తోంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.... వెంకట్ తండ్రి దగ్గర ఫిర్యాదు అందుకున్న తాడేపల్లి సీఐ వీరేంద్ర విచారణ చేపట్టారు. పోలీసులు ఇప్పటికే నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. గురువారం రాత్రి వెంకట్ రెండవ భార్య దగ్గర నుండి మొదటి భార్య దగ్గరకు వెళుతుండగా మార్గం మధ్యలో నడిరోడ్డుపై పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కొంతమంది యువకులతో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ నేపథ్యంలో వెంకట్‌ను హత్యచేసినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసుల అదుపులో ఉన్నవారిలో ఇద్దరు వెంకట్‌ను హత్యచేయగా మరో ఇద్దరు అడ్డుకున్నట్లు తెలియవచ్చింది. హత్య జరిగిన సమయంలో ఆ బర్త్‌డే పార్టీలో మొత్తం ఏడుగురు ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
తాడిపత్రి జ్ఞానమ్మ సేవలు ఎనలేనివి
కార్డినల్ పూల అంథోని(అగ్రపీఠాధిపతి, హైదరాబాద్) జ్ఞానమ్మ మ్యూజియం ప్రారంభం ఫిరంగిపురం: దైవ సేవకురాలు తాడిపత్రి జ్ఞానమ్మ బాలికలకు చేసిన సేవలు ఎనలేనివని కార్డినల్ పూల అంథోని(అగ్రపీఠాధిపతి, హైదరాబాద్) అన్నారు. ఫిరంగిపురంలోని బాల ఏసు దేవాలయ ప్రాంగణంలో సెయింట్ ఆన్స్ సంస్థ స్థాపకురాలు తాడిపత్రి జ్ఞానమ్మ 150వ వర్థంతి వేడుకలు శనివారం నిర్వహించారు. ఆమె జీవిత చరిత్రను తెలిపేలా ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని కార్డినల్ పూల అంథోని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గుంటూరు మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య మాట్లాడుతూ దైవంపై విశ్వాసంతో జ్ఞానమ్మ జీవించారని చెప్పారు. అదేవిశ్వాసంతో బాలికలకు సేవ చేయాలనే తలంపుతో సేవా సంస్థను స్థాపించి సేవలు అందించారన్నారు. సెయింట్ ఆన్స్ సంస్థల మదర్ జనరల్ పైరెడ్డి అంతోనమ్మ మాట్లాడుతూ ఏ లక్ష్యాలతో తాడిపత్రి జ్ఞానమ్మ సంస్థను స్థాపించారో అదే లక్ష్యాలతో సంస్థను ముందుకు నడిపిస్తామన్నారు. పలుప్రాంతాల నుంచి వచ్చిన మేత్రానులు, మేత్రాసన గురువులు, గురువుల ఆధ్వర్యంలో దివ్యపూజాబలి నిర్వహించారు. జూబిలి స్మారక గ్రంథాన్ని ఆవిష్కరించారు. పలు సాంస్క్రతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. జ్ఞానమ్మ డాక్యుమెంటరీ ప్రదర్శించారు. కార్యక్రమంలో సంస్థకు చెందిన పలు ప్రాంతాల నుంచి వచ్చిన మఠకన్యా సీ్త్రలు, పూర్వవిద్యార్థులు, కథోళిక క్రైస్తవులు పాల్గొన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న యువ–2025 శనివారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందని, రానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించే శక్తి దేశ యువతదే అని అన్నారు. స్వామి వివేకానంద ఆశయాలతో యువతకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందకు స్ఫూర్తిదాయక కార్యక్రమాలు అవసరమని స్పష్టం చేశారు. రాజధానిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరుగనుందరి వివరించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అనంతరం ప్రతిభ కనబర్చిన యువతకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. -
బీచ్ వాలీబాల్ పోటీల విజేత పశ్చిమ గోదావరి జట్టు
బాపట్ల: బాపట్ల మండలం సూర్యలంకలో జరిగిన రాష్ట్రస్థాయి 69వ ఎస్జీఎఫ్ అండర్–17 బీచ్ వాలీబాల్ పోటీల్లో బాలుర విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా జట్టు మొదటిస్థానంలో నిలిచింది. శుక్ర, శనివారాలలో జరిగిన పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జట్లు పాల్గొన్నాయి. పోటీల్లో మొదటి స్థానంలో పశ్చిమగోదావరి, ద్వితీయ స్థానంలో కృష్ణా, తృతీయస్థానంలో విజయనగరం, నాలుగో స్థానంలో నెల్లూరు జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో మొదటి స్థానం కడప, రెండో స్థానం తూర్పుగోదావరి, తృతీయ గుంటూరు, నాలుగో స్థానం విజయనగరం, అండర్ 14 బాలుర విభాగంలో మొదటి స్థానంలో విజయనగరం, రెండో స్థానంలో చిత్తూరు, మూడో స్థానంలో కర్నూల్, నాలుగు శ్రీకాకుళం, బాలికల విభాగం అండర్–14లో మొదటి స్థానంలో గుంటూరు, రెండో స్థానంలో తూర్పుగోదావరి, మూడో స్థానంలో శ్రీకాకుళం, నాలుగో స్థానంలో కడప, అండర్–19 విభాగం బాలురలో మొదటి స్థానంలో నెల్లూరు, రెండో స్థానంలో పశ్చిమగోదావరి, మూడో విభాగం విజయనగరం, నాలుగో స్థానంలో కృష్ణా, 19 బాలికల విభాగంలో మొదటి స్థానంలో కృష్ణా, రెండో స్థానంలో కడప, మూడో స్థానంలో చిత్తూరు, నాలుగోస్థానంలో కర్నూల్ విద్యార్థులు నిలిచారు. పోటీల విజేతలను జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయురాలు యు.వి.సుధారాణి, గుంటూరు జిల్లా స్కూలుగేమ్స్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, స్టేట్ అడ్జ్వజర్లు రజనినాయక్, శిరీష, పీడీలు పాల్గొన్నారు. -
వైఎస్ కుటుంబం చలవతోనే వైద్య విద్య
నా పేరు షేక్ ఖాదర్ అఫ్రిది. మాది పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం చినతురకపాలెం గ్రామం. తండ్రి షేక్ సుభాని రోజు వారి కూలీగా పనిచేస్తారు. అమ్మ హుస్సేన్‌బీ గృహిణి. సోదరికి వివాహమైంది. చిన్నతనం నుంచి కష్టాల్లో పెరిగిన నేను ఉన్నత చదువులతో తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కలలు కన్నా. ఆ కలలు నిజం కావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఎంతో తోడ్పడింది. నీట్లో 4,700 ర్యాంక్ సాధించిన నాకు ముస్లింలకు వైఎస్ఆర్ తీసుకువచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ వలనే శ్రీకాకుళం రిమ్స్‌లో 2019లో కన్వీనర్ కోటాలో మెడికల్ సీటు లభించింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు, హాస్టల్ ఖర్చులకు కూడా పెట్టుకోలేని పరిస్థితి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కాగా అమలు చేసిన ఫీజు రీయంబర్స్మెంట్ ఎంతో ఉపయోగపడింది. ప్రతి ఏడాది కళాశాల ఫీజు, హాస్టల్ ఫీజులను ప్రభుత్వమే చెల్లించింది. సంవత్సరానికి రూ.45 వేల వరకు ప్రభుత్వం అందజేసింది. వైద్య విద్య చదివేందుకు తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడలేదు. ప్రస్తుతం రిమ్స్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నా. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎంబీబీఎస్ పూర్తవుతుంది. ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడంలో వైఎస్ కుటుంబ సహకారం మరువలేనిది. నాలాంటి ఎంతో మంది నిరుపేదలకు డాక్టర్ కలను సాకారం చేసిన వైఎస్ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు ఆయన వందేళ్లు చల్లగా బతకాలి. – షేక్ ఖాదర్ అఫ్రిది, చినతురకపాలెం గ్రామం, నరసరావుపేట మండలం -
క్రమశిక్షణకు ప్రతీక క్రీడలు
భాష్యం స్పోర్ట్స్ మీట్లో వక్తలు గుంటూరు ఎడ్యుకేషన్: క్రీడలు కేవలం పతకాలు, ట్రోఫీల కోసం మాత్రమే కాదని, అవి విద్యార్థుల్లో క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే తత్వం, ఓర్పు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని గుంటూరు జిల్లా అగ్నిమాపక విపత్తు స్పందన అగ్నిమాపకశాఖాధికారి ఎం.శ్రీనివాసరెడ్డి అన్నారు. వికాస్‌నగర్‌లోని వికాస్ గ్రౌండ్లో భాష్యం ఒలంపస్ పేరుతో నిర్వహిస్తున్న జోనల్‌స్థాయి వార్షిక స్పోర్ట్స్ మీట్ శనివారం రెండు రోజు కొనసాగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో క్రీడలు నేర్పిస్తాయన్నారు. గెలుపోటములు సహజమని, పాల్గొనడమే ముఖ్యమన్నారు. ప్రతి ప్రయత్నం మిమ్మల్ని ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతుందన్నారు. మరో అతిథి డాక్టర్ లావణ్య మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో తరగతి గదులు మేధస్సును పెంచితే, ఆట స్థలాలు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భాష్యం సాంబశివపేట, ఆర్టీసీ కాలనీ, ఎస్వీఎన్ కాలనీ, పట్టాభిపురం, నగరాలు క్యాంపస్‌లకు చెందిన ప్రైమరీ విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్ఈవోలు శివ, స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉత్కంఠభరితంగా ఖోఖో పోటీలు
జె.పంగులూరు: స్థానిక మాంగుట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల క్రీడా ప్రాగణంలో, ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు జరుగుతున్నాయి. శనివారం మెదటి పూల్‌లో బాలురకు 12, బాలికలకు 12 మ్యాచ్ జరిగాయి. మొత్తం 48 టీంలు పాల్గొన్నాయి. బాలుర టీంలో క్వార్టర్ ఫైనల్‌కు ప్రకాశం, కర్నూలు, గుంటూరు, విశాఖ, విజయనగరం, చిత్తూరు, ఈస్టు గోదావరి, కృష్ణ జిల్లా జట్లు చేరాయి. బాలికల విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు అనంతపురం, విజయనగరం, కర్నూలు, చిత్తురు, ప్రకాశం, తూర్పు గోదావరి, విశాఖ, శ్రీకాకుళం జట్లు చేరాయి. చివరి రోజు ఆదివారం క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యచ్‌లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఫైనాన్స్ ఎగ్గొట్టి.. నెంబర్లు మార్చి
నరసరావుపేట టౌన్: కారుపై తీసుకున్న ఫైనాన్స్‌ను ఎగ్గొట్టేందుకు నెంబర్ మార్చి తిరుగుతున్నట్టు చోళమండల్ ఫైనాన్స్ కంపెనీ ఏరియా మేనేజర్ భరత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. తమ సంస్థ నుంచి మూడు కార్లకు రుణం పొందిన ముగ్గురు వ్యక్తులు వాయిదాలు సక్రమంగా చెల్లించడం లేదు. వాహనాలకు నకిలీ నెంబర్లు అంటించి తిరుగుతున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి కారు రుణం తీసుకున్న వారితో పాటు ప్రస్తుతం కార్లను తిప్పుతున్న మరో ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని భరత్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఆరుగురుపై కేసు నమోదు చేసి మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. రూరల్ స్టేషన్‌కు చేరిన కార్ల పంచాయితీ... చిలకలూరిపేట హైవే ప్రమాదంలో ఐదుగురు విద్యార్థుల మృతి కేసులో ప్రధాన నిందితుడు ఏఎస్ఐ కుమారుడు వెంకట్‌నాయుడు వినియోగించిన నకిలీ నెంబర్ కారు వ్యవహారంతో నకిలీ కార్ల గుట్టు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. నకరికల్లుకు చెందిన అంజి, భానులు తనకు కారు విక్రయించారని చెప్పడంతో వారిద్దర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో వీళ్లు ఇద్దరు విక్రయించిన సుమారు 23 కార్లను స్వాధీనం చేసుకొని రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం కార్లను వినియోగిస్తున్న యజమానుల దగ్గర ఉన్న పత్రాలు, కారు బాడీపై చాయిస్ నెంబర్లను పరిశీలించారు. అవి నకిలీవా కాదా అన్నది నిగ్గుతేల్చమని రవాణాశాఖ అధికారులను కోరారు. వీటిని పరిశీలించిన అధికారులు మూడు కార్లకు నకిలీ నెంబర్లు అంటించి వినియోగిస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. అనుమానాలకు తావిస్తున్న అధికారుల తీరు.. అధికారపార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కాన్వాయ్‌లో నకిలీ కార్ల గ్యాంగ్ అందజేసిన ఓ కారు తిరుగుతున్నట్టు విచారణలో తేలింది. దీంతో పాటు పలువురు పోలీసు అధికారులు వీరి వద్ద నుంచి కార్లు కొనుగోలు చేసినట్టు నిందితుల నుంచి తెలుసుకున్నారు. అయితే ఆ కార్లను వదలిపెట్టి మిగిలిన కార్లను మాత్రమే విచారణకు స్టేషన్‌కు తీసుకురావడం పలు ఆరోపణలకు తావిస్తోంది. ఇప్పటికే నకిలీ కార్ల వ్యవహారంలో ఎస్ఐ, ఏఎస్ఐ సస్పెండ్ కాగా, మరో నలుగురు సిబ్బందిని బదిలీ చేసిన విషయం తెలిసిందే. కారు కొనుగోలు చేసిన పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది. -
పరిహారం .. పరిహాసం
సత్తెనపల్లి: రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు వారిని ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మోంథా తుఫాన్‌తో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని ప్రకటించి నేటికీ పరిహారం అందజేయక పోవడం పై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాయం అందజేస్తే కనీసం రబీ సాగు ఖర్చులకు దోహదపడతాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. – గత రెండు నెలల క్రితం మోంథా తుఫాన్ దాటికి జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1730.25 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు సర్వే చేసి అధికారులు లెక్కలు కట్టారు. అప్పట్లో 33 శాతం కన్నా ఎక్కువగా పంట నష్టం జరిగితే పరిహారం అందజేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేసి పంటల నష్టాన్ని గుర్తించారు. రైతు కంట కన్నీరు... ప్రభుత్వం నుంచి స్పందన కరువు... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తానన్న రూ. 20 వేల సాయాన్ని తొలి ఏడాది ఇవ్వలేదు. రెండో ఏడాది కూడా కౌలు రైతులకు అందజేయలేదు. అర్హులైన కొంత మంది రైతులకు ఇంతవరకు ఖాతా లకు నగదు జమకాలేదు. ఎందుకు అన్నదాత సుఖీభవ పథకం ఖాతాకు జమ కాలేదని స్టేటస్ అడిగితే చెప్పేవారే కరువ య్యారని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఖరీఫ్ సాగు సమయంలో సరిపడా యూరియా సరఫరా చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. చంద్రబాబు సర్కారు వచ్చాక నష్టం తప్ప మేలు జరగలేదనే విమర్శలు రైతుల నుంచి వస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మోంథా తుఫాన్‌తో నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం అందజేయాలని రైతుల కోరుతున్నారు. జిల్లాలో మోంథా తుఫాన్ నష్టం(హెక్లార్లలో) పంట విస్తీర్ణం పత్తి 1,564.80 వరి 114.75 మొక్కజొన్న 28.99 కంది 05.42 మినుము 16.29 మొత్తం 1,730.25 -
పృథ్వీరాజ్ పునరాగమనం
తెనాలి: ఐపీఎల్లో అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుతమైన వికెట్‌తో సంచలనం సృష్టించిన తెలుగు యువ క్రికెటర్ యర్రా పృథ్వీరాజ్ గాయాలతో రెండు సీజన్ల విరామం తర్వాత పునరాగమనం చేశాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన సత్తాను చాటిన ఈ ఎడంచేతి ఫాస్ట్ బౌలర్‌ను తాజా ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్ రూ.30 లక్షలకు దక్కించుకుంది. ఐపీఎల్ నుంచి టీమిండియాకు ఆడాలన్న కలను ఈసారి నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఈ యువతేజం వివరాల్లోకి వెళితే...పృథ్వీరాజ్ జన్మస్థలం తెనాలి సమీపంలోని దుగ్గిరాల. తల్లి జంపాల కృష్ణకుమారి విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్‌లో జూనియర్ అకౌంట్స్ అధికారిగా రిటైరయ్యారు. తండ్రి యర్రా శ్రీనివాసరావు సివిల్ ఇంజినీరు, ప్రభుత్వ కాంట్రాక్టరు. తల్లి ఉద్యోగరీత్యా విశాఖలో పెరిగిన పృథ్వీరాజ్ ప్రస్తుతం అక్కడే ఇంజినీరింగ్ చేశాడు. 2011 నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి జట్టుకు వివిధ విభాగాల్లో ఆడుతూ వచ్చాడు. తండ్రికి కజిన్ అయిన ఆంధ్రా యూనివర్సిటీ హెచ్ఓడీ, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ ఎన్.విజయమోహన్ తొలి గురువు. క్రికెట్లో ఓనమాలు నేర్పారాయన. ఇప్పటికీ పృథ్వీరాజ్ శిక్షణను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. తండ్రి వారసత్వంగా క్రికెట్‌పై ఆసక్తి... పృథ్వీరాజ్‌కు ఆట వారసత్వం అనుకోవచ్చు. తాత ప్రసాదరావు పహిల్వాన్. తండ్రి యర్రా శ్రీనివాసరావు స్వస్థలం చీరాల. బాపట్లలో ఇంజినీరింగ్ కాలేజీలో చదివేటపుడు క్రీడల్లో యాక్టివ్‌గా ఉన్నారు. రెండేళ్లు కాలేజీ చాంపియన్. 1985లో గుంటూరు జిల్లా అండర్–19 క్రికెట్ జట్టులో ఆడారు. 1986లో జావలిన్ త్రోలో బంగారు పతకం సాధించారు. ఈ నేపథ్యమే పృథ్వీరాజ్‌కు క్రికెట్‌పై ఆసక్తిని కలిగించింది. విజయమోహన్ వ్యక్తిగత శిక్షణలో సాధన ఆరంభించి, విజయశిఖరాలను అధిరోహిస్తూ వచ్చాడు. 2011 నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు అండర్–14 నుంచి వివిధ వయసు విభాగాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్కూల్స్ జాతీయ పోటీలకు ఆడిన జట్టుకు కెప్టెన్‌గా చేశాడు. 19 ఏళ్లకే దేశవాళీ క్రికెట్లోకి... 2017 అక్టోబరులో 19 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీకి ఎంపికై న పృథ్వీరాజ్ రెండు మ్యాచ్‌ల్లో పన్నెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. 2018 జులైలో బీసీసీఐ ఆధ్వర్యంలో జాతీయ క్రికెట్ అకాడమీ నిర్వహించే ఇండియన్ స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్ క్యాంప్‌కు ఇండియా నుంచి ఏడుగురిని ఎంపిక చేయగా, అందులో పృథ్వీరాజ్‌కు అవకాశం దక్కింది. అక్కడ శిక్షణ అనంతరం ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోపీలో ఇండియా రెడ్ టీమ్‌కు ఆడాడు. 2018 అక్టోబరులో బీసీసీఐ విజయ్ హజారే ట్రోఫీకి నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు ఆడి, హైదరాబాద్‌పై రెండు వికెట్లు తీశాడు. 2019లో వన్డేలోనే ప్రొఫెసర్ ధియోధర్ ట్రోఫీకి ఆడారు. అదే ఏడాది డిసెంబరులో రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడి తొమ్మిది వికెట్లు తీశాడు. వార్నర్ వికెట్‌తో సంచలనం అక్కడ్నుంచి పృథ్వీరాజ్ పయనం ప్రతిష్టాకరమైన ఐపీఎల్‌కు చేరింది. వేలంలో కేకేఆర్ యాజమాన్యం కొనుగోలు చేసినప్పటికీ తుది 11 మంది జట్టులో స్థానం కల్పించలేదు. హైదరాబాద్‌తో మ్యాచ్‌తోనే జట్టులో బెర్త్ దక్కింది. అందులో మొదటి, మూడో ఓవర్లో పృథ్వీరాజ్ బౌలింగ్‌లో రెండు క్యాచ్‌లను జారవిడిచారు. అయినప్పటికీ మెయిడెన్ వికెట్‌గా వార్నర్‌ను బౌల్డ్ చేయడంతో వార్తల్లోకెక్కాడు, అంతకుముందు ఫిబ్రవరి 28న మూలపాడులో జరిగిన బీసీసీఐ సయ్యద్ ముస్తాఫ్‌ఆలీ టీ20 టోర్నమెంటులో జార్ఖండ్‌పై నాలుగు ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు నెట్ బౌలర్‌గా పృథ్వీరాజ్, కోల్‌కతా నుంచి ఆకాశ్‌దీప్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. తర్వాత ఆకాశ్‌దీప్ ఇండియా జట్టుకు అన్ని ఫార్మట్లలోనూ ఆడారు. సెలక్షన్స్ టైములో గాయాల కారణంగా అవకాశం కోల్పోయాడు. రంజీ ట్రోఫీల్లో సత్తా మళ్లీ గత రెండు సీజన్లలోనూ దేశవాళీ క్రికెట్లో రెడ్ బాల్, వైట్ బాల్లోనూ సత్తా చాటుతున్నాడు. 2023లో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో మధ్యప్రదేశ్‌పై రెండు ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నా, ఆంధ్ర జట్టు ఓటమి చెందింది. గతేడాది విజయ్ హజారే ట్రోఫీలో మూడు మ్యాచ్‌లు ఆడి ఏడు వికెట్లు తీశాడు. రెండు రంజీ ట్రోఫీల్లో పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు పృథ్వీరాజ్. 2025–26 సీజన్ తొలి దశ రంజీట్రోఫీలో మూడు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీశాడు. సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ టీ20లో ఆంధ్ర జట్టు తరఫున ఆడిన తొమ్మిది మ్యాచ్‌లో ఏడు పరుగుల సగటుతో 12 వికెట్లు తీయటం మరో ప్రత్యేకత. -
నెరవేరిన సొంతింటి కల
అద్దె ఇంట్లో ఉంటున్నామనేగానీ ఎప్పుడూ ఏదో వెలితి. పిల్లల కోసమైనా సొంత గూడు ఏర్పాటు చేసుకోలేకపోయామనే బాధ వెంటాడుతూ ఉండేది. కాయకష్టం చేసిన డబ్బులు ఇంటి అద్దెకు, కుటుంబ పోషణకు, పిల్లల చదువులకే సరిపోయేవి కాదు. సొంతింటి ఆలోచన వస్తే దుఃఖం పొంగుకొచ్చేది. ఆ సమయంలో దేవుడిలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మా మొర ఆలకించారు. మా ఇంటికే వలంటీరును పంపించి సెంటున్నరకు నా పేరుతో పట్టా కాగితమిచ్చారు. పట్టా అందుకున్నాక ఆ ఆనందానికి అవధుల్లేవు. ఇల్లు కట్టేందుకు కూడా రూ.1.50 లక్షలు ఇచ్చి, 50 సిమెంట్ బస్తాలు, నాలుగు ట్రాక్టర్ల ఇసుక, ఇనుము పంపించారు. భర్త కృష్ణారెడ్డి, పిల్లలు లహరి, లాస్య ఇంటిల్లిపాదీ కష్టం చేసుకున్నాం. ఇటుక ఇటుక పేరుస్తుంటే.. గుండెల్లో పొంగిన ఆనందం అంతా ఇంతా కాదు. మా చేతి డబ్బులు రూ.60 వేలు ఖర్చు చేశాం. ఇప్పుడు సొంతింట్లో దర్జాగా బతుకుతున్నాం. ఆ కల నెరవేర్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక ఽజన్మదిన శుభాకాంక్షలు. – గాయం సుధారాణి, కొమెరపూడి గ్రామం, సత్తెనపల్లి మండలం -
పాలిటెక్నిక్ క్రీడల్లో ఓవరాల్ చాంపియన్‌షిప్ కై వసం
గుంటూరుఎడ్యుకేషన్: గుజ్జనగుండ్ల లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన 28వ ప్రాంతీయస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా రెండు రోజులపాటు నిర్వహించిన క్రీడలు, ఆటల పోటీల్లో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ ఓవరాల్ చాంపియన్‌షిప్ కై వసం చేసుకుంది. కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జాస్తి ఉషారాణి, అధ్యాపకులు కలసి విద్యార్థినులను అభినందించారు. -
ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
తాడికొండ: రాయపూడిలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో శనివారం అధికారులు, సిబ్బంది ఆనందోత్సాహాల మధ్య సెమీక్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ్, ఆఫీస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు, సీఆర్డీయే పీజీఎంసీ పలు విభాగాల ముఖ్య అధికారులు పాల్గొనగా కార్యక్రమంలో భాగంగా క్రిస్మస్ కరోల్స్, కేక్ కటింగ్, క్రిస్మస్ పాటల ఆలాపన నిర్వహించారు. అనంతరం క్రిస్మస్ వేడుకలలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాలకు సంబంధించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈగల్ టీమ్ చీఫ్ రవికృష్ణ మంగళగిరిటౌన్: విద్యార్ధులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తూ ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ అన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో ఉన్న నిర్మల హైస్కూల్ (సీబీఎస్ఈ)లో శనివారం స్పోర్ట్స్–ఓ–మేనియా క్రీడోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రవికృష్ణ మాట్లాడుతూ క్రీడలు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న పిల్లలందరిలో మంచి ప్రతిభ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తోందని స్పష్టం చేశారు. విద్యార్థి దశలో తప్పుదారి పట్టకుండా ఎప్పటికప్పుడు పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు. అనంతరం చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలు క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం మత్తుపదార్థాల నిర్మూలనపై పోస్టర్లను ఆవిష్కరించారు. స్కూల్ యాజమాన్యం ఆకె రవికృష్ణను సత్కరించి మెమోంటో అందజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి డిప్యూటీ డీఈఓ శాంతకుమారి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవినాయుడు, పాఠశాల యాజమాన్యం రెవ.సిస్టర్ డాక్టర్ షోవ్రిలు, మేరి ఫ్రాన్సిస్, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెనాలిఅర్బన్: తెనాలి రెవెన్యూ డివిజన్‌ను స్క్రబ్ టైపస్ వ్యాధి వణికిస్తుంది. ప్రతి రోజు తెనాలి జిల్లా వైద్యశాలకు ఐదు నుంచి 10 మందికి అనుమానితులు వచ్చి చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 26 మంది చికిత్స పొందారు. శనివారం నూతనంగా ఐదుగురుకి నిర్ధారణ అయినట్లు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం 10 మంది జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ, అన్నదానం, గోసంరక్షణకు భక్తులు విరివిగా విరాళాలు అందించారు. విజయవాడ మధురానగర్‌కు చెందిన డి.శ్రీనివాస ప్రసాద్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి ఉచిత ప్రసాద వితరణకు రూ.లక్ష విరాళంగా అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు బుల్లబ్బాయ్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. అన్నదానానికి రూ.లక్ష విరాళం అమ్మవారి అన్నప్రసాద వితరణకు చైన్నెకు చెందిన ఎం.బాబ్జి రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారికి అందజేశారు. విజయవాడ ఇస్లాంపేటకు చెందిన కె.వి.మోహనరావు దంపతులు దుర్గమ్మ గోసంరక్షణ పథకానికి రూ.1,00,005 విరాళాన్ని ఆలయ అధికారికి అందజేశారు. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించి, వేద ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. -
దేవుడిలా ప్రాణం పోసిన వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సమాజంలో వైద్యులను దేవుడితో సమానంగా ప్రజలు చూస్తారు. అలాంటి వైద్యుడికి ప్రాణాపాయ స్థితి ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రాణాలు కాపాడారు. దీనిపై గుంటూరు జీజీహెచ్ రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బొమ్మినేని భాగ్యలక్ష్మి మాట్లాడుతూ... ‘‘కరోనా రోజుల్లో నా భర్త నర్తు భాస్కరరావు అప్పటి ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్. నేను గుంటూరు జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్నాను. కరోనా బాధితులకు చికిత్స అందిస్తూ 2021 ఏప్రిల్‌లో కరోనా బారిన పడ్డాం. కొద్దిరోజుల్లోనే కోలుకున్నా. నా భర్త ఆరోగ్యం క్షీణించింది. ఎంతోమంది మా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని మానవత్వంతో సహాయం చేశారు. విజయవాడ ప్రైవేటు ఆసుపత్రిలో కొద్దిరోజులు చికిత్స చేయించినా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాం. కష్టాలు పడుతూనే వైద్యం అందించాం. ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయని, మారిస్తేగానీ బతకరని తెలియడంతో చైన్నె తీసుకువెళ్లాలంటే ఎయిర్ లిఫ్టింగ్‌కే రూ. 26 లక్షలు అవుతాయని చెప్పారు. దీంతో హైదరాబాద్ కిమ్స్‌కు తీసుకువెళ్లాం. అక్కడ ఎక్మో దొరకడం ఆలస్యం కావడంతో ఆయన పరిస్థితి క్షీణించింది. బ్రెయిన్‌డెడ్ అని నిర్ధారించి ఇంటికి తీసుకెళ్లమన్నారు. వైద్యురాలిగా బతికించుకునేందుకు ఒక అవకాశం ఇవ్వాలని బతిమాలడంతో మరిన్ని పరీక్షలు చేసి మెదడు పని చేస్తుందని గుర్తించారు. హైదరాబాద్ వైద్యులు చికిత్స ప్రారంభించారు. 40 రోజులు ఎక్మో పెట్టి ప్రాణాలు కాపాడేందుకు శ్రమించారు. జూన్ 4న ఆసుపత్రిలో చేరాం. జూలై 14న ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేశారు. ఊపిరితిత్తులు డోనర్ దొరకడానికి జాప్యం జరగడంతో 40 రోజులు ఎదురుచూశాం. ఆపరేషన్ సుమారు పది గంటలకు పైగా పట్టింది. మొత్తం ఖర్చు రూ. 1.17 కోట్లు అయింది. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వమే మంజూరు చేసింది. వంద రోజులకుపైగా బెడ్‌పైనే ఆపరేషన్ అనంతరం వంద రోజులకుపైగా బెడ్‌పై ఉంచారు. నరాలు చచ్చుపడిపోయి చిన్నపిల్లాడిలా మారిపోయారు. ప్రతి పని నేర్పించాను. ఊపిరితిత్తులు నూతనంగా అమర్చడంతో ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుకుంటున్నాం. ఆయన ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాలలో డాక్టర్ భాస్కరరావు, నేను క్లాస్మేట్స్. 2001లో ఎంబీబీఎస్ అభ్యసించాం. ఆర్థికంగా చాలా చిన్న కుటుంబం. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం పెట్టుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లో కూడా ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి మార్చడానికి గ్రీన్ చానల్ ఏర్పాటు చేయించారు. జగన్మోహన్రెడ్డి చేసిన సాయం మాకు ఊపిరిగా మారింది. ’’ -
గుంటూరు జిల్లా పసుపు రైతులకు దక్కిన భరోసా
తెనాలి: భారతీయులు శుభప్రదంగా భావించే పసుపు పంట సాగుచేసే రైతులకు ఏటా కష్టాల కడగండ్లు ఎదురయ్యేవి. ఆటుపోట్ల మధ్య సంప్రదాయంగా పసుపు సాగుచేసే రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భరోసా దక్కింది. మార్కెట్ ధర పతనమైనపుడు మద్దతు ధరకు కొనుగోలు చేయటమే కాదు, ఉచిత బీమాతో అధికవర్షాలతో దెబ్బతిన్న పంటకు భారీ పరిహారం అందించారు నాటి సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి. తీవ్ర నిరాశలో ఉన్న రైతులకు.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పసుపు పంటను 13 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగుచేస్తుంటారు. ఏటా 35 వేల టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఎకరాకు కనీసం రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు. పంట చేతికొచ్చేసరికి మార్కెట్ మాయాజాలం నిరాశపరుస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న పసుపు పంటకు నష్టపరిహారం సంగతి దేవుడెరుగు! అన్నట్టుగా ఉండేది. ఇలాంటి నేపథ్యంలో జిల్లాలో 2021–22 ఖరీఫ్ సీజనులో సాగుచేసిన పసుపు పైరు అధికవర్షాలు, వరదలకు దెబ్బతింది. ఎప్పటిలాగే పరిహారం రాదనుకుని తీవ్ర నిరాశలో ఉండిపోయారు. ఆ సమయంలో జిల్లాలోని దాదాపు 9వేల మంది పసుపు రైతులకు నాటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బీమా పరిహారం అందించింది. ఎకరాకు రూ.52,800 చొప్పున, లంక గ్రామాల్లో రూ.75 వేల వరకు అందటంతో రైతులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. రెండుమూడేళ్లకోసారి ప్రకృతి విపత్తులకు పసుపు దెబ్బతినటం సాధారణమే అయినా, బీమా పరిహారం అందటం అదే తొలిసారి. అదికూడా ఎకరాకు భారీ మొత్తం రావటంతో రైతుల ఆనందం అంతా ఇంతా కాదు. పసుపు విస్తీర్ణం ఎక్కువంగా ఉండే కొల్లిపర మండల రైతులకు దాదాపు రూ.10 కోట్ల వరకు బీమా డబ్బులు అందాయి. అంతేకాదు...మార్కెట్ ధరల మాంద్యం ఫలితంగా రైతుల దగ్గరే నిల్వ ఉండిపోయిన పసుపు పంటను క్వింటాలుకు రూ.6,850 చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయటం మరో విశేషం! అప్పట్లో క్వింటాలు ధర రూ.5 వేలకు పతనమైంది. ఇంతగా తమను ఆదుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి రైతులు ధన్యవాదాలు చెబుతున్నారు. -
రెండు గ్రామాలను దత్తత తీసుకున్న యూనియన్ బ్యాంక్
నరసరావుపేట రూరల్: యూనియన్ బ్యాంక్ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ తిలక్ తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నరసరావుపేట రీజియన్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పాలపాడు, దొండపాడు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో బ్యాంక్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించారు. బ్యాంక్ మేనేజర్ తిలక్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై పథకాలను బ్యాంక్ ద్వారా అందిస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో పాటు బ్యాంక్ రుణాలు అందజేస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శివరాజ్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. -
44వ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం
క్రీడా జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించిన శాప్ చైర్మన్ రవినాయుడు జె.పంగులూరు: చక్కగా చదువుకుంటూ, ఆడుకుంటూ తద్వారా మంచి భవిష్యత్తు సాధించాలని ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపాపరు. స్థానిక జూనియర్ కళాశాలలో శుక్రవారం 44వ బాలబాలికల (18 సంవత్సరాలలోపు) ఖోఖో పోటీలు ప్రారంభం అయ్యాయి. కార్యక్రమానికి ముందుగా క్రీడాకారులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా పతకాలను ఆవిష్కరించారు. ప్రాంగణంలో క్రీడాకారులు మార్చి ఫాస్టు నిర్వహించారు. అంతర్జాతీయ క్రీడాకారులు క్రీడా జ్యోతిని శాప్ చైర్మన్ రవినాయుడుకి అందించగా ఆయన వెలిగించారు. అనంతరం మాట్లాడుతూ పంగులూరులో ఖోఖో నిర్వహణ చూస్తుంటే ఆనందంగా ఉందంటూ నిర్వాహకులను అభినందిచారు. మొట్ట మొదటిసారిగా ఖోఖో మెడల్ సాధించిన క్రీడాకారులకు డీఎస్సీలో నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. క్రీడాకారులకు ప్రభుత్వం ఎప్పుడు ప్రోత్సాహం అందిస్తుందన్నారు. అనంతరం రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బాచిన చెంచుగరటయ్య మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా గ్రామస్తులు క్రీడను ఆదరిస్తున్నారని తెలిపారు. మొట్టమొదటి సారిగా రెండు సార్లు జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలకు బంగారంతో చేసి బంగారు మెడల్ అందిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో కేకేఐఎఫ్ సెక్రటరీ సీతారామిడ్డి, డీఎస్డీఓ శ్రీనివాసరావు, రాజరాజేశ్వరి, ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె. హనుమంతురావు, రఘుబాబు, గ్రామస్తులు రావూరి రమేష్, వీరనారాయణ, రామారావు, రాయిని వెంకటసుబ్బారావు, కర్రి సుబ్బారావు పాల్గొన్నారు. -
● విద్యార్థుల్లేక మూత‘బడి’ంది..!
విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాల మూతబడింది. మండల కేంద్రం పెదనందిపాడులోని ఉర్దూ పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. తాత్కాలికంగా విద్యాశాఖ అధికారులు బడిని మూసేశారు. ఒక్క టీచర్‌నూ మండల విద్యాశాఖ అధికారులు వేరే పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపారు. పిల్లలను చేర్పించడంపై దృష్టి సారించకపోవడంతో ఈ దుస్థితి పట్టిందని స్థానికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొంటున్నారు. – ప్రత్తిపాడు -
రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు పేర్కొన్నారు. అమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ‘ఆదర్శ్ 2025 – స్పోర్ట్స్ ఫర్ హార్మనీ‘ పేరుతో రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రవినాయుడు జాతీయ, క్రీడోత్సవ పతాకాలు ఆవిష్కరించిన అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి పావురాలను ఎగురవేశారు. రవినాయుడు మాట్లాడుతూ చదువు ఒక్కటే లక్ష్యంగా ఉన్న ప్రస్తుత టెక్నాలజీ యుగంలో క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి 15 క్రీడా అంశాలపై స్పోర్ట్స్‌మీట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా క్రీడల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న కళాశాలగా హిందూ కళాశాల పేరు పొందిందని తెలిపారు. కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న క్రీడోత్సవాలకు 25 కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ పీఎం ప్రసాద్ , జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.అఫ్రోజ్ ఖాన్, ఏపీ శాప్ సభ్యుడు ఎస్.సంతోష్ కుమార్, కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు ఎస్వీఎస్ సోమయాజి, ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్ వజ్రాల నర్సిరెడ్డి, కొల్లా సుస్మితా చౌదరి, ఫిజికల్ డైరెక్టర్ కోసూరి రవి తదితరులు పాల్గొన్నారు -
ఆస్ట్రేలియా వెళ్తాడనుకుంటే..కానరాని లోకాలకెళ్లాడు!
నాదెండ్ల: విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు పూర్తి చేసి కుటుంబానికి అండగా నిలుస్తాడనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. ఫిరంగిపురం మండలం మేరిగపూడి గ్రామానికి చెందిన పాకనాటి శ్రీసత్యసాయి మణికంఠారెడ్డి (21) బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసాకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసేందుకు బుల్లెట్ బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురై మృత్యువాత పడిన సంఘటన నాదెండ్ల గ్రామ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై ఆర్.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు మేరిగపూడి గ్రామానికి చెందిన పాకనాటి యలమందారెడ్డి, విజయలక్ష్మి దంపతులు వ్యవసాయ పనులు చేసుకుని జీవిస్తుంటారు. వీరికి ఇరువురు కుమారులు. పెద్దకుమారుడు మణికంఠారెడ్డి బీటెక్ పూర్తి చేశాడు. రెండో కుమారుడు మనోహర్‌రెడ్డి గ్రామంలోనే తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మణికంఠారెడ్డి ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం మేరిగపూడి నుంచి చిలకలూరిపేటకు బుల్లెట్ వాహనంపై బయలుదేరాడు. నాదెండ్ల –తిమ్మాపురం మార్గంమధ్యలో ఉబ్బలవాగు సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కంకర లోడు ట్రాక్టర్ ఢీకొంది. దీంతో మణికంఠారెడ్డి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెద్ద కుమారుడు మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లారు. తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిడ్డ మరణంతో మేరిగపూడిలో ఘొల్లుమన్న తల్లిదండ్రులు వీసా ప్రక్రియ కోసం వెడుతూ బీటెక్ విద్యార్థి దుర్మరణం -
ఔషధ నియంత్రణ పాటించని ఆర్ఎంపీకి శిక్ష
పిడుగురాళ్ల: ఔషధ చట్టాన్ని ఉల్లంఘించిన ఆర్ఎంపీకి పిడుగురాళ్ల జూనియర్ సివిల్ కోర్డు జడ్జి ప్రవల్లిక గురువారం శిక్ష విధించినట్లు పిడుగురాళ్ల డ్రగ్ ఇన్స్పెక్టర్ పి.మంగమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన కొర్రపోలు పెదవెంకయ్య గతంలో విధులు నిర్వర్తిస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏఎన్ క్రాంతికుమార్ దాడులు నిర్వహించిన సమయంలో ఈ పెద వెంకయ్య ఆర్ఎంపీగా విధులు నిర్వహిస్తూ డ్రగ్ నిషేధ చట్టాన్ని ఉల్లంఘించి అతని వద్ద మందులు ఉంచటంతోపాటు ఆపరేషన్లు కూడా నిర్వహించాడని అప్పటి డ్రగ్ ఇన్స్పెక్టర్ కేసు ఫైల్ చేశారు. ఆ కేసు పిడుగురాళ్ల కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.విజయ్‌కుమార్ వాదోపవాదల అనంతరం పెద వెంకయ్య కుటుంబీకులు విజ్ఞప్తి మేరకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల అపరాధ రుసుం న్యాయమూర్తి టి.ప్రవల్లిక విధించారు. ఈ రెండీటిల్లో ఏదైనా ఒకటి ఉల్లంఘించినా అదనంగా ఒక నెల జైలు శిక్ష, మరో రూ.20 వేలు జరిమానా చెల్లించాల్సి వస్తుందని న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు ప్రస్తుత పిడుగురాళ్ల సెక్టార్ ఇన్స్పెక్టర్ పి.మంగమ్మ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి జె.పంగులూరు: మోటార్ సైకిల్‌పై వేగంగా వస్తూ ట్రాక్టర్ ట్రక్కు వెనుక భాగాన్ని ఢీ కొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సమీపంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రేణింగవరం ఎస్సై వినోద్‌బాబు తెలిపిన వివరాలు...చందలూరు గ్రామానికి చెందిన పెంట్యాల సుధాకర్ (55) అద్దంకి నుంచి స్వగ్రామం చందలూరు తన మోటార్ సైకిల్‌పై వస్తున్నాడు. చందలూరు సమీపంలోకి వచ్చే సరికి మలుపు తిరిగే సమయంలో ఎదురుగా ట్రాక్టర్ ట్రక్కును గమనించక ఢీ కొట్టాడు. అతని తలకు బలమైన గాయం కావడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన సుధాకర్‌కు భార్య అనంతలక్ష్మి, కుమారులు విష్ణు, చరణ్ ఉన్నారు. బీసీ విభాగం జిల్లా కమిటీ నియామకం బాపట్ల: జిల్లా వైఎస్సార్ సీపీ బీసీ విభాగం కమిటీని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఉపాధ్యక్షులుగా ఎం.వెంకట్రావు(వేమూరు),మన్నెం రాజశేఖర్(అద్దంకి), జనరల్ సెక్రటరీలుగా యద్దనపూడి హరిప్రసాద్ (పర్చూరు),పేరాల సురేష్(బాపట్ల),కె.శ్రీనివాసరావు(రేపల్లె),ఓ. వీరయ్య(అద్దంకి),పి.వెంకట దుర్గా కిరణ్(వేమూరు),సెక్రటరీలుగా జి.సుధాకర్(చీరాల), షేక్ కరిముల్లా(అద్దంకి), వెలనాటి వెంకట్రావు(పర్చూరు), ఆరేపల్లి శివయ్య(బాపట్ల), మరకా సురేష్(రేపల్లె),ఎం.నాగేశ్వరరావు(వేమూరు), బి.సురేష్(చీరాల)లను నియమించారు. వీరితోపాటు పలువురిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. వ్యాసరచనలో కొప్పరపాడు విద్యార్థిని ప్రతిభ బల్లికురవ: బాపట్ల జిల్లా స్థాయిలో జరిగిన వ్యాసరచన పోటీల్లో కొప్పరపాడు ఉన్నత పాఠశాల విద్యార్థిని ప్రథమస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్ఎం పి. శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. డిజిటల్ న్యాయవ్యవస్థ ద్వారా సమర్థవంతమైన, వేగవంతమైన పరిష్కారం అనే అంశంపై తెలుగు మీడియం విభాగంలో పి. లక్ష్మీ అమూల్య ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుని రూ. 5 వేల పారితోషిక అవార్డు పొందినట్లు చెప్పారు. మంగళవారం విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు బాపట్ల జిల్లా తరఫున పాల్గొననున్నట్లు హెచ్ఎం వివరించారు. ఎంపీడీవో కుసుమకుమారి ఎంఈఓలు కె. శ్రీనివాసరావు, కె.రమేష్‌బాబు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. కేంద్రం చేతిలో ఉపాధి చట్టం నిర్వీర్యం తెల్ల గాంధీ విగ్రహం వద్ద నిరసన చీరాల: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్ట స్ఫూర్తిని దెబ్బతీస్తూ.. పేరు మార్పు చేయడం అంటే.. ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయడమేనని సీపీఎం చీరాల ప్రాంతీయ కమిటీ కార్యదర్శి ఎన్.బాబూరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పేరు మార్పును వ్యతిరేకిస్తూ సీపీఎం చీరాల ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కొట్లబజారులోని తెల్లగాంధీ బొమ్మ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధిని హక్కుగా కల్పించే ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఉపాధిని హక్కుగా కాకుండా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పథకంగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు. సీపీఎం కమిటీ సభ్యులు ఎం.వసంతరావు, ప్రసాద్, జి.ఇమ్మాన్యుల్, పి.శ్రీనివాసరావు, డి.మోషే, యు.సాంబయ్య, గోపి, రాంబాబు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. బంగారు ఆభరణాలు చోరీ చీరాల: ఇంటికి వేసిన తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను దుండగులు చోరీ చేశారు. ఈ సంఘటన శుక్రవారం కేపాల్ కాలనీలో చోటుచేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుట్టా ఫణిరాజ అనే మహిళ చీరాల మండలం కేపాల్ కాలనీలో నివాసముంటోంది. ఆమె భర్త రాజస్థాన్‌లో సీఆర్పీఎఫ్లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు సమీపంలోని ఆమె హాస్పిటల్‌కు వెళ్లింది. తిరిగి మధ్యాహ్నం 12గంటలకు ఇంటికి వచ్చేసరికి ఇంటికి వేసిన తాళాలు పగులగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని రూ.2.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆమె చీరాల ఒన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మహిళా ఎస్సై రాజ్యలక్ష్మి తెలిపారు. -
గడియారం క్లూతో హత్య కేసును ఛేదించిన పోలీసులు
యడ్లపాడు: అది జూన్ 25వ తేదీ.. యడ్లపాడు హైవే పక్కన కాలువలో పూర్తిగా దగ్ధమైన యువకుడి మృతదేహం. ఎలాంటి ఆనవాళ్లు లేవు, ఆధారాలు అంతకంటే లేవు. ముఖం కూడా గుర్తు పట్టలేనంతగా పెట్రోల్ పోసి తగులబెట్టారు. నిందితులు తాము చేసిన నేరానికి ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకదని భావించారు. ఇది పోలీసులకు సవాల్‌గా మారింది. నేరం చేసే సమయంలో ఎంత తెలివిగా వ్యవహరించినా ఎక్కడో ఓ చోట లభించే చిన్న క్లూతో ఇట్టే దొరికిపోతారు. అలాంటి ఘటనే ఇది. ఘటనా స్థలంలో మిగిలిన ఒక చిన్న ’క్యాషియో వాచ్ ప్లేట్’. అదే పోలీసుల పాలిట బ్రహ్మాస్త్రమైంది. ముగ్గురు కిరాతకులను జైలు ఊచల వెనక్కి పంపడమే కాకుండా, పోలీసులకు ప్రతిష్టాత్మక అవార్డును తెచ్చిపెట్టింది. ఏమిటీ కథ? గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తాడిబోయిన గోపి(32) వెబ్ సిరీస్‌ల నిర్మాణంలో బిజీగా ఉండేవారు. ఈ క్రమంలో పరిచమైన గుంటూరుకు చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తితో మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే కిరాతక పథకం పన్నిన ఇమ్రాన్ తన అనుచరులు షేక్ రియాజ్, ఖాజామొహిద్దీన్లతో కలిసి ఈ ఏడాది జూన్ 24న గోపిని ఇమ్రాన్ అద్దె ఇంటికి పిలిపించి రాడ్‌తో తలపై కొట్టి, ఆపై తాడుతో ఊరివేసి హత్య చేశారు. గోపీకారు డిక్కీలోనే మృతదేహాన్ని పెట్టి యడ్లపాడుకు తరలించారు. 16వ హైవే సర్వీస్ మార్గంలోని డ్రైనేజ్‌లో 25న పట్టపగలే తగులబెట్టి పరారయ్యారు. డీజీపీ ప్రశంసలు–అవార్డుల పంట.. పోలీసుల ఈ అసాధారణ ప్రతిభను గుర్తించిన రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా శుక్రవారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ (ఏబీసీడీ) అందజేశారు. పల్నాడు ఎస్పీ కృష్ణారావుతోపాటు అద్భుతమైన నైపుణ్యం కనబరిచిన డీఎస్పీ హనుమంతరావు, సీఐ సుబ్బానాయుడు, ఎస్సై శివరామకృష్ణ, ఏఎస్ఐలు సుబ్బారావు, రోశిబాబు, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్, కానిస్టేబుల్ ఇర్మియా, హోంగార్డులు మధు, సాంబశివరావులను డీజీపీ ప్రశంసించారు. క్లూస్ టీం సీడీఆర్ వింగ్ సమన్వయం ఈ విజయంలో కీలకమైందని కొనియాడారు. ముగ్గురు నిందితులకు జైలు పోలీసులకు ఏబీసీడీ అవార్డు, ప్రశంస డీజీపీ చేతుల మీదుగా అందుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు, దర్యాప్తు బృందం ఆ సమయంలో అటుగా వస్తున్న పోలీసులు మంటల్ని గమనించి ఆర్పేసినా అప్పటికే దేహం పూర్తిగా కాలిపోయింది. క్రైమ్ నం:68/2025 మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు మొదట అంతా శూన్యం అనిపించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జల్లెడ పట్టినా మృతుడెవరో తెలియలేదు. ఏ స్టేషన్లో అదృశ్యమైనట్టు ఫిర్యాదు లేదు. కానీ చిలకలూరిపేట రూరల్ సీఐ బి సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్సై టి శివరామకృష్ణ జిల్లా ఎస్పీ ఆదేశాలతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. సంఘటనా స్థలంలో లభించిన కాలిపోయిన కాసియో వాచ్ అడుగు భాగంలోని ప్లేట్‌పై ఉన్న నంబర్ ఆధారంగా మృతుడు గోపి అని గుర్తించారు. సెప్టెంబర్ 23 నాటికి ఈ కేసులో నిందితులందరినీ అరెస్ట్ చేసి పోలీసు శాఖ సత్తా చాటారు. -
మెప్మాలో రూ.20 కోట్ల కుంభకోణం
● డీఆర్ఓకు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ● ఎమ్మెల్యే అరవింద్ బాబు, వాసిరెడ్డి రవి కనుసన్నల్లోనే కుంభకోణం ● సమగ్ర దర్యాప్తు జరిపించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో నరసరావుపేటలో ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, మెప్మా అధికారుల ప్రోద్బలంతో దాదాపు 140 ఫేక్ డ్వాక్రా గ్రూపులు సృష్టించి సుమారు రూ.20 కోట్ల మేర భారీ కుంభకోణం చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్లో డీఆర్ఓ ఏకా మురళిని కలిసి వివరాలు అందజేశారు. అనంతరం డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం నరసరావుపేట పురపాలక సంఘంలోని మెప్మా విభాగానికి వచ్చిన డ్వాక్రా సిటీ మెషిన్ మేనేజర్ (సీఎంఎం) దీప గతంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నల్లపాడులో పనిచేస్తూ భారీ కుంభకోణానికి పాల్పడడంతో సస్పెడ్ చేశారని తెలిపారు. ఆమైపె ఎఫ్ఐఆర్ నమోదైందని, ఈ కేసుపై గుంటూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో వాయిదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇంత ఖ్యాతి గల ఈమెను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, మున్సిపాల్టీ వ్యవహారాలు చూసే టీడీపీ నాయకుడు వాసిరెడ్డి రవిలు కలిసి నరసరావుపేట తీసుకువచ్చారని తెలిపారు. డ్వాక్రా సిటీ మెషిన్ మేనేజర్ (సీఎంఎం) దీప, డ్వాక్రా గ్రూపుల సీసీ ప్రణతి ఇరువురు కలిసి టీడీపీ నాయకుల ప్రమేయంతో డ్వాక్రా గ్రూపు లీడర్లు, ఆర్పీలతో కుమ్మకై ్క సుమారు 140 ఫేక్ డ్వాక్రా గ్రూపులు తయారుచేశారన్నారు. ఈ ఫేక్ గ్రూపులకు బ్యాంకుల వద్ద నుంచి ఒక్కొక్క గ్రూప్‌కు రూ.15 నుంచి రూ.20 లక్షల రుణాలు ఇప్పించారన్నారు. ఇందుకు సంబంధించి ఒక్కొక్క డ్వాక్రా గ్రూపు వద్ద నుంచి రూ.5 లక్షలు వసూలు చేసి అందులో 50 శాతం ఎమ్మెల్యేకి అందజేశారని విమర్శించారు. మిగతా 50 శాతం అందరూ పంచుకున్నారని చెప్పారు. నవంబర్ 20న కలెక్టర్‌కు ఒక డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారం చేసుకుని ప్రాథమికంగా విచారణ చేయటంతో ఈ స్కాం బయటపడిందని తెలిపారు. కుంభకోణం వివరాలు కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్ ముఖ్యమంత్రికి తెలియజేయగా ఆయన కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించిన విషయాన్ని గుర్తుచేశారు. అన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి డబ్బు ఎవరెవరికి, ఎంతెంత చేరిందనే దానికి సంబంధించి ఆడియోలు, వీడియోలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. వీటన్నిటిని అతి త్వరలో కలెక్టర్‌కి అందజేస్తామన్నారు. కలెక్టర్ ఈ కుంభకోణంపై పూర్తి విచారణచేసి పాత్రధారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో ప్రమేయం ఉన్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గంటెనపాటి గాబ్రియేలు, పాలపర్తి వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా, వర్కింగ్ అధ్యక్షులు అచ్చిశివకోటి, బీసీసెల్ పట్టణ అధ్యక్షులు మర్రిపూడి రాంబాబు పాల్గొన్నారు. -
పట్టణాన్ని గ్రామం చేయడమేమిటి?
అభిప్రాయ సేకరణ రసాభాస పిడుగురాళ్ల: పట్టణాన్ని గ్రామం చేయడమేమిటని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పల్లెటూరు గ్రామం కావాలి, గ్రామం పట్టణం కావాలని, పట్టణం నగరం కావాలని అకాక్షిస్తుంటాం, దానికి అనుగుణంగా రాజకీయ నాయకులు పనిచేస్తారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లి గురజాల, దాచేపల్లిలకు పట్టణ హోదా కల్పించామని తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఇళ్ల పట్టాలు కేటాయించామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇళ్లు నిర్మించుకునేందుకు సుమారు రూ.2 నుంచి రూ.2.50 లక్షలు కేటాయించామన్నారు. మాచర్ల, గురజాల, దాచేపల్లి పట్టణాలకు కలుపుతూ సుమారు రూ.400 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేశామన్నారు. అమృత్ పథకం కింద శుద్ధి చేసిన తాగునీటిని ప్రతి ఇంటికి అందించాలని గురజాల పట్టణానికి సుమారు రూ.17 కోట్లు, దాచేపల్లి పట్టణానికి సుమారు రూ.25 కోట్లు మంజూరు చేశామన్నారు. గురజాలలో పనులు ప్రారంభించామని, కానీ ఒకటిన్నర సంవత్సరం నుంచి పనులను పట్టించుకున్న నాథుడు లేడన్నారు. అవగాహన, తేలివి లేని నాయకులు మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే ఏవిధంగా ఉంటుందో ఈ రోజు చూస్తున్నామన్నారు. జంగమహేశ్వరపురాన్ని మరలా గ్రామం చేస్తారంటా, అది ఏమైనా గొప్ప అని ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి గ్రామం చేస్తే ఇంటి పన్నులు తగ్గుతాయని చెబుతున్నారన్నారు. ఇంటి పన్ను తగ్గించటం కోసం పట్టణాన్ని గ్రామం చేయనక్కరలేదన్నారు. ఇంటి పన్ను ఇంత ఉంది ఇంత తగ్గిస్తున్నామని జీవో తీసుకొని వస్తే సరిపోతుంది కదా అని అన్నారు. గురజాల మున్సిపాలిటీ గెలవలేమని, జంగమహేశ్వరపురాన్ని తీసేస్తున్నారన్నారు. ఇంటి పన్ను కట్టలేకపోతే ఐదేళ్లు, పదేళ్లు మినహాయింపు ఇవ్వవొచ్చుకదా అని కాసు పేర్కొన్నారు. పట్టణాన్ని గ్రామం చేస్తామంటున్నారు, దీనిని వైఎస్సార్ సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జంగమహేశ్వరపురం, గురజాలలో ఇంటి పన్ను తగ్గించటం కానీ, ఉపాధి హామీ పథకం కొనసాగించండి, మున్సిపాలిటిని గ్రామం చేయటం అంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సభ మధ్యలో వెళ్లిపోయిన అధికారులు -
సౌర శక్తి వియోగిద్దాం..విద్యుత్ పొదుపు చేద్దాం
మాచర్ల: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు పలు మండలాలలో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పల్నాడు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) డాక్టర్ విజయ్‌కుమార్ చెప్పారు. మాచర్ల రీజియన్ పరిధిలోని ఏఈలు, ఏఓలు, ఉద్యోగులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఈ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొదుపునకు సంబంధించి పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగా సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సబ్సిడీ ఇవ్వటం, కనెక్షన్ పొందినప్పటికీ ఎటువంటి బిల్లులు లేకుండా చేయటం జరుగుతుందన్నారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని విద్యుత్‌ను పొదుపు చేయాలని అన్నారు. ఈ పథకం ద్వారా విద్యుత్ వినియోగదారులు పలు ప్రయోజనాలు పొందవచ్చునన్నారు. పట్టణంలోని రూ.4.5 కోట్లతో ఈ నెల 24న ప్రజా ప్రతినిధులచే టిడ్కో వద్ద నూతనంగా నిర్మించే సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. వినియోగదారులంతా వెంటనే బకాయిలు చెల్లించి విద్యుత్ సంస్థకు సహకరించి మెరుగైన విద్యుత్ పొందాలన్నారు. కార్యక్రమంలో డివిజినల్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ఎన్ సింగయ్య, పల్నాడు జిల్లా సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ బి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. అనంతరం విద్యుత్ శాఖాధికారులతో వివిధ సమస్యలపై చర్చించారు. విద్యుత్ శాఖ ఎస్ఈ డాక్టర్ పి విజయ్‌కుమార్ -
నారసింహ మహాదేవిగా బగళాముఖి అమ్మవారు
చందోలు(కర్లపాలెం): మార్గశిర అమావాస్య శుక్రవారం బాపట్ల జిల్లా చందోలులోని బగళాముఖి అమ్మవారు శ్రీ నారసింహ మహాదేవిగా పూజలందుకున్నారు. అమావాస్య సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈవో నరసింహమూర్తి ఆధ్వర్యంలో వేద పండితులు శాంతి హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి బగళాముఖి అమ్మవారికి పూజలు చేశారు. గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారు లాంఫాంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం బిల్డింగ్ ఆన్ ఏఐ యూనివర్సిటీ–ఏఐ ఫర్ అగ్రికల్చర్ అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. యూఎస్ఏలోని ఫ్లోరిడా గ్లోబల్ ఫుడ్ స్టెంప్స్ ఇనిస్టిట్యూట్ యూనివర్సిటీ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కాకాని గోపాల్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఫ్లోరిడా, భారతదేశం వాతావరణ పరిస్థితులు ఒకే విధంగా ఉండటం వల్ల కృత్రిమ మేధస్సుపై చేసిన పరిశోధనలు ఆంధ్రప్రదేశ్‌లో పరిశీలించి ఆచరణలో పెట్టవచ్చన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్ల్లోరిడా సూపర్ కంప్యూటర్ కలిగి ఉండటం వల్ల కృత్రిమ మేధస్సుపై ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందన్నారు. కృత్రిమ మేధస్సు ద్వారా పంటల్లో కలుపు మొక్కలను, పురుగులను గుర్తించి వాటిపైన మాత్రమే రసాయనాలు పిచికారి చేసే పరిజ్ఞానం అక్కడ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లాంఫాం రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ, ఇంజినీరింగ్ టెక్నాలజీ డాక్టర్ ఎ.మణి, పీజీ స్టడీస్ డీన్ డాక్టర్ ఏవీ రమణ, కంట్రోలర్ డాక్టర్ ప్రసాద్, కమ్యూనిటీ సైన్స్ డీన్ డాక్టర్ పి.సాంబశివరావు, ఎస్టేట్ ఆఫీసర్ పి. రవి, లైబ్రేరియన్ డాక్టర్ జి.కరుణ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యాన పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఉద్యాన పంటలపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రైతు సేవ కేంద్రాల వారీగా రబీ 2025, ఖరీఫ్ 2026, రబీ 2026 సీజన్లకు సంబంధించిన పంట ప్రణాళికలను సిద్ధం చేసే విధానాలపై చర్చించారు. స్థూల విలువ జోడింపునకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఉద్యాన శాఖ అదనపు డైరెక్టర్ ఎం. వెంకటేశ్వరరావు, ఉద్యానశాఖ ఏడీలు హరి నాథరెడ్డి, ఎం.అశోక్‌కుమార్ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
నరసరావుపేట టౌన్: ద్విచక్ర వాహనాలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఎనిమిది వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ సీహెచ్ ప్రభాకర్ తెలిపారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. పట్టణ శివారు గుంటూరు రోడ్డు స్వర్గపురి సమీపంలో తనిఖీలు చేస్తుండగా గుంటూరు రామిరెడ్డినగర్‌కు చెందిన షేక్ ఇస్మాయిల్ పోలీసులను చూసి ద్విచక్రవాహనంపై పారిపోయేందుకు ప్రయత్నించాడు. అనుమానంతో అతన్ని వెంబడించి పట్టుకొని విచారించారు. విచారణలో వివిధ ప్రాంతాల్లో నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు నేరాన్ని అంగీకరించాడన్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో చోరీకి గురైన ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాహనాలను యజమానులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ తెలిపారు. ఎనిమిది వాహనాలు స్వాధీనం -
నిర్లక్ష్య పాలనలో విద్యార్థులపై కక్ష
● ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు ఏటా ఉచిత మెటీరియల్ ● ఈ ఏడాది ప్రశ్నార్థకంగా పంపిణీ ● గత వైఎస్సార్ సీపీ పాలనలో నిరాటంకంగా అందజేత ● ఉమ్మడి గుంటూరు జిల్లాలో 35 వేల మంది విద్యార్థులు ● ‘అల్పాహారం’ కూడా లేక అవస్థలుగత ప్రభుత్వంలో నిరాటంకంగా.. అర్ధాకలితో హాజరవుతున్న విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి సిద్ధమవుతున్న విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏకధాటిగా నిర్వహిస్తున్న రెగ్యులర్, అదనపు తరగతులకు వారు హాజరవుతున్నారు. మధ్యాహ్న భోజనంతోనే సరిపెట్టుకుంటున్నారు. సాయంత్రం అదనపు తరగతులు ముగిసే వరకు ఖాళీ కడుపులతో నెట్టుకువస్తున్నారు. పట్టణ, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలకు దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి ఉదయం 7 గంటలకే ఇళ్ల నుంచి బయల్దేరి వస్తున్నారు. నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంతో ఎస్సీఈఆర్టీ ద్వారా నూరు రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన ప్రభుత్వం పాఠశాలల్లో అదనపు తరగతులను నిర్బంధంగా అమలు చేస్తోంది. వారి ఆకలిని మాత్రం మరిచిపోయింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 186 ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, సోషల్, బీసీ వెల్ఫేర్ పాఠశాలల నుంచి పరీక్షలకు సన్నద్ధమవుతున్న 10,384 మంది విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. గతేడాది కూడా జిల్లా పరిషత్ ద్వారా నెల రోజులు మాత్రమే అమలు చేశారు. విద్యార్థికి రూ.10 చొప్పునే కేటాయించారు. ఈ సారి కనీసం ఎటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధం కాలేదు. మరోవైపు అధికారుల హెచ్చరికలు, ఆకస్మిక తనిఖీలతో ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారు. చంద్రబాబు పాలనలో పదో తరగతి విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ఉత్తీర్ణత శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు... బాలలకు ఆ మేరకు వసతులు కల్పించడంలో చేతులెత్తేసింది. కనీసం ప్రణాళిక కూడా లేకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తూ విద్యార్థులను అర్ధాకలితో అలమటింపజేస్తోంది. స్టడీ మెటీరియల్ ఇవ్వడానికి కూడా చేతులు రావడం లేదు. అదనపు తరగతులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు బడిలోనే ఉంటున్న విద్యార్థులకు అల్పాహారం పెట్టడానికీ చంద్రబాబు సర్కారుకు మనసు కూడా రావడం లేదు. -
సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ జట్టుకు చీరాల క్రీడాకారుడు
చీరాల రూరల్: ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో నిర్వహించే సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ జట్టుకు చీరాల క్రీడాకారుడు కంచర్ల సుభాష్ ఎంపికయ్యాడు. చీరాల జయంతి పేటకు చెందిన కంచర్ల సుభాష్ చిన్నతనం నుంచి చదువుతో పాటు ఫుట్‌బాల్ క్రీడలో రాణిస్తున్నాడు. ప్రస్తుతం సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. చిన్నతనం నుంచే అతడు ఫుట్‌బాల్‌లో ఆరంగేట్రం చేశాడు. ఐఎల్టీకి కంపెనీకి చెందిన క్రీడామైదానం తన ఇంటికి దగ్గరగా ఉండడంతో నిత్యం సీనియర్ క్రీడాకారులతో కలిసి ఉదయం, సాయంత్రం వేళల్లో సాధన చేసేవాడు. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది జూలైలో నిర్వహించిన సీనియర్ మెన్ ఫుట్‌బాల్ జిల్లాస్థాయి సెలక్షన్స్‌లో అత్యధిక ప్రతిభ కనబరచి జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. ● ఆగస్టులో నిర్వహించిన సీనియర్ మెన్ జోనల్ మీట్లో బాపట్ల జిల్లా ఫుట్‌బాల్ జట్టులో పాల్గొని జట్టును విజేతగా నిలిపాడు. ● విశాఖపట్టణంలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ మెన్ మీట్లో పాల్గొని తన అత్యుత్తమ ప్రదర్శనతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తన అత్యుత్తమ ప్రతిభభతో సుభాష్ సెలక్టర్లను ఆకర్షించాడు. దీంతో సెలక్టర్లు జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సంతోష్ ట్రోఫీ జట్టుకు సుభాష్‌ను ఎంపిక చేశారు. ● బాపట్ల జిల్లా నుంచి సంతోష్ ట్రోఫికి ఎంపికై న సుభాష్‌ను జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసిమళ్ల విజయకుమార్, సమ్మర్ ఫుట్‌బాల్ క్యాంపు ఇన్చార్జ్ బొనిగల ప్రేమయ్య, జోనల్ కోఆర్డినేటర్ ఎన్. దేవదాసు, కోచ్ ప్రసన్న, ఎన్. నరేష్, సీనియర్ క్రీడాకారులతో పాటు కుటుంబ సభ్యులు సుభాష్‌ను అభినందించారు. మున్ముందు భారత జట్టులో చోటుసంపాదించి దేశం తరఫున ఆడాలని వారు ఆకాంక్షించారు. ఎంపికపై అభినందించిన ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు -
మహిళ శరీరంలో బ్లేడ్...
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం నరసరావుపేట పాత ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మహిళ శరీరంలో బ్లేడు పెట్టి కుట్లు వేసిన దారుణమైన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నరసరావుపేట బాలయ్యనగర్‌కు చెందిన టి రమాదేవి గత నెల 26వ తేదీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వైద్యశాలలో చేరింది. ఆపరేషన్ చేసిన వైద్యులు ఆమె శరీరంలో బ్లేడ్‌ను వదిలేసి కుట్లు వేశారు. వైద్యుల నిర్లక్ష్యానికి ఈ సంఘటన పరాకాష్టగా మారింది. శస్త్రచికిత్స గదిలో మౌలిక జాగ్రత్తలు తీసుకోకుటే రోగుల ప్రాణాలకు గ్యారెంటీ ఏంటన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందించి ఉచితంగా సర్జరీ చేసి బ్లేడ్‌ను తొలగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ వైద్యుడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. -
నల్లబర్లీ సాగు చేస్తే కఠిన చర్యలు
ప్రత్తిపాడు: నల్లబర్లీ సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి అన్నారు. ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంలో గురువారం ఆమె పర్యటించి రైతులతో మాట్లాడారు. నల్లబర్లీ పొగాకు సాగును ప్రభుత్వం నిషేధించిందని, సాగు చేయవద్దని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం జీవో నంబర్ 740 జారీ చేసిందని, అతిక్రమించి సాగు చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. టాస్క్‌ఫోర్స్ టీంలు, ఆర్ఎస్కే సిబ్బంది నల్లబర్లీ సాగు చేయవద్దంటూ అవగాహన కల్పిస్తున్నా, కొందరు రైతులు వినడం లేదన్నారు. అందుకే గ్రామాల్లో పర్యటించి సేకరించిన వివరాలను జిల్లా టాస్క్‌ఫోర్స్ టీంకు పంపి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆమె వెంట మార్క్‌ఫెడ్ మేనేజర్ నరసింహారెడ్డి, గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్.మోహన్‌రావు, తహసీల్దార్ ఉన్నారు. మాచర్ల: మాచర్ల బస్టాండ్ ప్రాంతంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం అర్చకులు అడిగొప్పల చెన్నకేశవాచార్యుల ఆధ్వర్యంలో పంచామృతాలతో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వందలాది మంది మహిళలు పూజలో పాల్గొన్నారు. పాత మాచర్లలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు కొండవీటి రాఘవాచార్యులు, అధ్యక్షులు భవనాశి వెంకటేశ్వర్లు, పట్టణంలోని ప్రధాన వీధిలోని కోదండ రామాలయంలో అర్చకులు కొండవీటి వేణుగోపాలాచార్యులు, అధ్యక్షులు బచ్చు రామారావులు ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. అమృతలూరు(భట్టిప్రోలు):గోవాడలోని గంగాపార్వతి సమేత బాలకోటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం కోటి కుంకుమార్చన, సామూహిక లలితా పారాయణ మహోత్సవం జరుగుతుందని ఎస్ఎస్ఎఫ్ బాపట్ల దేవాలయ ప్రముఖ్ పొన్నపల్లి సత్యనారాయణ తెలిపారు. దేవస్థాన కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల శ్రీనివాసవర్మ, చైర్మన్ పావులూరి రమేష్ ఆధ్వర్యంలో జరుగుతుందని పేర్కొన్నారు. ప్రధాన అర్చకులు, ఎక్స్అఫిషియో సభ్యులు స్వర్ణ వెంకట శ్రీనివాసశర్మ, ఉపముఖ్య అర్చకులు చావలి శ్రీధరశర్మ, ఆధ్యాత్మికవేత్త పావులూరి వరలక్ష్మి పాల్గొంటారని తెలిపారు. అన్నదానం కూడా చేస్తున్నట్టు వివరించారు. తాడికొండ: మోతడక చలపతి ఫార్మసీ కళాశాలలో ఈనెల 21వ తేదీన రాష్ట్ర ఓపెన్ చెస్ టోర్నమెంట్–2025 నిర్వహిస్తున్నట్లు చలపతి విద్యా సంస్థల చైర్మన్ వైవీ ఆంజనేయులు గురువారం తెలిపారు. ఆనంద్ ఈ చెస్ వింగ్స్, ఏపీసీఏ విభాగం, గుంటూరు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అన్ని కళాశాలల నుంచి ఏ వయసు వారైనా పాల్గొనవచ్చన్నారు. ఎంట్రీ ఫీజు రూ.500 అని తెలిపారు. విజేతలకు నగదు బహుమతిగా రూ.50 వేలు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఆసక్తి కలిగిన వారు మోతడక చలపతి ఫార్మసీ కళాశాలలో సంప్రదించాలని సూచించారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు, భోజన వసతి ఉంటుందన్నారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ నల్లాని వెంకట రామారావు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. -
అసలే చలికాలం..చన్నీటితో స్నానం.. ప్రబలుతున్న దగ్గు, జలుబు, జ్వరం..వసతి గృహాల వైపు కన్నెత్తి చూడని వైద్య ఆరోగ్యశాఖ బృందం..అయినా పట్టించుకోని అధికార గణం..సాకు చూపి సాగనంపుతున్న వసతి గృహ యంత్రాంగం .. తప్పని పరిస్థితిల్లో తల్లిదండ్రులు తమ బిడ్డలను ఇళ్లకు తీసు
సత్తెనపల్లి: జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రభుత్వ ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో సమస్యలు తిష్టవేశాయి. విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు గజగజ వణికే చలి.. మరోవైపు దోమల విలయతాండంతో జ్వరాల బారిన పడుతున్నారు. వేడి నీటి సౌకర్యం ఊసే లేకపోవడంతోపాటు విద్యార్థులకు వైద్యసేవలు అరకొరగా అందుతున్నాయి. వ్యక్తిగత, ఆరోగ్య సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన జిల్లా వైద్యశాఖ అంటీముట్టనట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్య సేవలు అందించకుండా హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించి చేతులు దులుపుకుంటోంది. ప్రతి హాస్టల్లో సుమారు 25 శాతం మందికి పైగా వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. వైద్య శిబిరాల ఊసేది? ప్రభుత్వ వసతి గృహాల్లో నిరుపేద, మధ్యతరగతికి చెందిన విద్యార్థులు అధిక శాతం విద్యనభ్యసిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా తరచూ విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రధానంగా జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, చర్మ వ్యాధులు, దురదలు, తామర, వాతులు, విరేచనాలు తదితర వ్యాధులు విద్యార్థులను పట్టిపీడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను క్రమం తప్పకుండా పరీక్షించి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది వసతి గృహాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందించాల్సి ఉంది. ప్రతి రోజూ సంబంధిత వైద్య సిబ్బంది వసతి గృహాలను సందర్శించడంతో పాటు స్థానిక వైద్యాధికారి వారానికి ఒకసారైనా పర్యవేక్షించాల్సి ఉంది. విధిగా ప్రతి 15 రోజులకు ఒకసారి వైద్య శిబిరాలు నిర్వహించాలి. ఇలాంటి పరిస్థితి జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. పాఠాలు నేర్వని సంక్షేమ శాఖ సంక్షేమ వసతి గ్రహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రధానంగా భవనాలకు సరైన కిటికీలు, తలుపులు లేకపోవడం, దోమల నుంచి రక్షణకు మెష్‌లు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు. గతంలో సత్తెనపల్లిలోని ఒక కళాశాల వసతి గృహంలో భోజనం బాగా లేకపోవడంతో విద్యార్థినిలు ఔషధాలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ సంక్షేమ శాఖ యంత్రాంగం పాఠాలు నేర్వలేదు. వసతిగృహల్లో సమస్యల పరిష్కారం, వైద్య శిబిరాలు, తగిన మందులు, మాత్రలు అందుబాటులో ఉంచడం లేదు. పర్యవేక్షణ అంతంతమాత్రంగా ఉంది. జలుబు, జ్వరం, మాత్రలు తప్ప ఎటువంటి మందులు వసతి గృహాల్లో లేవు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు బారిన పడిన విద్యార్థులకు బయటి నుంచి మందులు తెచ్చుకోమని ఉచిత సలహా ఇస్తున్నారు. మెడికల్ కిట్ల ప్రస్తావనే లేదు. విద్యార్థులు ఏ చిన్న జబ్బు చేసినా తల్లిదండ్రులపై ఆధార పడాల్సిన దుస్థితి ప్రతి హాస్టల్లో కనిపిస్తోంది. ఇప్పటికై నా పాలకులు, జిల్లా అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో వసతి గృహలు సందర్శించి విద్యార్ధుల ఇబ్బందులు పరిష్కరించడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలో వసతి గృహాలు, విద్యార్థుల వివరాలు ఇలా... వసతి గృహం సంఖ్య విద్యార్థులు బీసీ ప్రీ మెట్రిక్ 20 2,200 బీసీ పోస్ట్ మెట్రిక్ 14 1,400 ఎస్సీ ప్రీ మెట్రిక్ 18 1,800 ఎస్సీ పోస్ట్ మెట్రిక్ 11 1,100 ఎస్టీ ప్రీ మెట్రిక్ 06 600 ఎస్టీ పోస్ట్ మెట్రిక్ 03 300 -
మహిమాన్వితం.. బాల ఏసు ఆలయం
ఫిరంగిపురం: బాల ఏసుకు జన్మనిచ్చిన మరియ మాత తన పుత్రుడిపై చూపే ప్రేమను గుర్తుకు తెచ్చే మహిమాన్విత పుణ్యక్షేత్రం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని బాలఏసు దేవాలయం. ఎత్తయిన గోపురంతో ఎలాంటి ఆధారం లేకుండా లండన్ మిల్హిల్కు చెందిన విచారణ గురువు ఫాదర్ డిక్మన్ ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు. అందుకే రాష్ట్రంలోనే ఎత్తయిన బాల ఏసు కథెడ్రల్ ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నిర్వహించే క్రిస్మస్ ఉత్సవాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో పలు ప్రాంతాల నుంచి మత గురువులు వచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాలుపంచుకుంటారు. ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి క్రిస్మస్ సందర్భంగా ఈనెల 23, 24, 25 తేదీల్లో క్రీస్తు జయంతి మహోత్సవాలు నిర్వహించనున్న ట్లు విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి తెలిపారు. ఈ ఆలయానికి విచారణ గురువులుగా వచ్చిన అనేక మంది ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. విద్య, వైద్య, సామాజిక రంగాల్లో గ్రామాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులలో భాగంగా వ్యాకుల మాత విగ్రహం, బెల్ టవర్, పునీత గురువుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆలయం లోపల క్రీస్తు జన్మ వృత్తాంతం తెలిపేలా పశువుల పాకను ఏర్పాటు చేశారు. ఆలయ చరిత్ర ఇదీ... 18 శతాబ్దంలో కథోళిక సంఘం ఫిరంగిపురంలో ఏర్పాటు చేశారు. కొండమెట్లకు వెళ్లే దారిలో చిన్న ఆలయం ఉండేది. దానికి విచారణ గురువులుగా లండన్ మిల్హిల్కు చెందిన థియోడర్ డిక్మన్ వచ్చారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని చూసి ఆయన బాధపడ్డారు. 1888లో ఆలయ పునర్నిర్మాణానికి తన సొంత నిధులను వెచ్చించి శంకుస్థాపన చేశారు. 1891 నాటికి అద్భుతంగా బాల ఏసు దేవాలయం నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఆలయం పూర్తిగా ఫ్రెంచి నిర్మాణ శైలిలో ఉండటం విశేషం. ఆలయం పైభాగంలో ఉన్న డోమ్‌కు ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా దీనిని నిర్మించారు. పండుగకు సర్వం సిద్ధం క్రిస్మ్స్ సందర్భంగా 15వ తేదీ నుంచే ఆలయంలో నవ దిన ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. 23న సహాయ విచారణ గురువు కె.సాగర్ దివ్యపూజాబలి నిర్వహించనున్నారు. 24న బాల ఏసు దేవాలయ విచారణ గురువు ఫాతిమా మర్రెడ్డి దివ్యపూజాబలి నిర్వహిస్తారు. రాత్రి 11 గంటలకు క్రీస్తు జయంతి మహోత్సవాలు, దివ్యపూజాబలి ఉంటాయి. గుంటూరు మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య పాల్గొంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై దివ్యపూజాబలి నిర్వహిస్తారు. 25న విచారణ క్రైస్తవుల ఆత్మ శరీర మేలు కోసం దివ్యపూజాబలి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాన యాజకులుగా ఫాతిమా మర్రెడ్డి, టి.కమలేష్‌లు వ్యవహరిస్తారు. రాత్రి బాల ఏసు కథెడ్రల్ దేవాలయ రథోత్సవం (తేరు ప్రదక్షిణ) నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమాలలో మఠకన్యలు, గుడి పెద్దలు, సోడాలిటీ సభ్యులు, మరియ దళ సభ్యులు, కథోళిక సంఘ సభ్యులు కీలక భూమిక పోషిస్తారని చెప్పారు. -
ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం
పురిటి నొప్పుల బాధను పంటి బిగువున భరించింది ఆ ఇల్లాలు...పండంటి బిడ్డకు జన్మనిచ్చింది..బిడ్డను మురిసిపోవాలని కలలుగన్న మాతృమూర్తి.. ఆ బిడ్డ కళ్లు తెరవముందే కన్నుమూసింది. రక్తహీనత ఉన్నా గర్భిణికి పురుడుపోసిన వైద్యుల నిర్లక్ష్యం ఆమె ప్రాణాలను బలిగొంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం ఖరీదు కావడంతో పేదలు ప్రభుత్వ ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సర్కారు దావఖానా అంటేనే భయపడుతున్నారు. నరసరావుపేట టౌన్: ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్యసేవలు అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రంటే పేదలకు ప్రాణాలు నిలిపే కేంద్రాలన్నది ఒకప్పటి మాటైతే..ప్రస్తుతం పల్నాడు జిల్లాలో వరుసగా జరుగుతున్న నిర్లక్ష్యపు వైద్యంతో ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. వైద్య సేవల కోసం వెళ్లాలంటే ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. కార్పొరేట్ వైద్యశాలలకు వెళ్లి వేలకు వేలు చెల్లించలేని పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ప్రభుత్వ వైద్యశాలనే ఆశ్రయిస్తుంటారు. అక్కడ ఉచిత వైద్యంతోపాటు మెరుగైన సేవలు అందుతాయన్న నమ్మకం గత ప్రభుత్వంలో ఉండేది. కూటమి ప్రభుత్వంలో నిర్లక్ష్యపు వైద్యం కారణంగా పేదల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. వైద్య రంగంపై ప్రభుత్వం చూపుతున్న సవతి తల్లి ప్రేమతో సరిపడా సిబ్బంది, మౌళిక వసుతులు లేకపోవడానికి తోడు కొంతమంది వైద్యుల నిర్లక్ష్యం రోగుల పాలిట శాపంగా మారుతోంది. బాలింత మరణం పల్నాడు ప్రాంతానికే పెద్దాసుపత్రిగా పేరొందిన ఏరియా వైద్యశాలలో బాలింత మృతి చెందడం దిగ్భాంతికి గురిచేసింది. రెంటచింతల మండలం పాల్వాయి గేటుకి చెందిన సాగరమ్మ పురిటి నొప్పులతో బాధపడుతూ రెండు రోజుల కిందట పల్నాడు రోడ్డులోని పాత ప్రభుత్వ వైద్యశాలలో చేరింది. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి తగిన పరీక్షలు, ముందస్తు వైద్య జాగ్రత్తలు తీసుకోకుండా శస్త్ర చికిత్స చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చిన అనంతరం తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమించి బాలింత ప్రాణాలు కొల్పోయింది. ఈ సంఘటన ప్రభుత్వ వైద్య వ్యవస్థలో లోపాన్ని ఎత్తిచూపుతోంది. మాతాశిశు మరణాలు అరికట్టామని గొప్పగా చెప్పుకొనే ప్రభుత్వం నరసరావుపేటలో బాలింత మరణం వాస్తవికతను తెలియజేస్తోంది. సంతకం పెడితేనే వైద్యం.. గర్భిణులు కాన్పు చేయాలంటే తల్లీబిడ్డకు ఏదైనా జరిగితే వైద్యులకు సంబంధంలేదని ముందుగా కుటుంబ సభ్యులు రాసి సంతకం పెడితేనే వైద్యం చేస్తానన్న సంఘటన సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో చోటుచేసుకుంది. తాను చెప్పినట్టు రాసి సంతకం పెట్టకుంటే వైద్యం చేయనని ఖారాఖండిగా చెప్పింది. దీంతో సంతకం పెట్టి వైద్యసేవలు పొందాల్సిన దుస్థితి నెలకొంది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ వైద్యరాలిపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేసి చేతులుదులుపుకున్నారు. సత్వర వైద్యం అందని ద్రాక్ష జిల్లాలోని కొన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో సత్వర వైద్యం అందని ద్రాక్షగా మారింది. చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల పీహెచ్‌సీకి ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తనిఖీకి వెళ్లారు. ఆ సమయంలో పీహెచ్‌సీకి తాళం వేసి ఉండటం చూసి అవాక్కయ్యారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్యెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయగా ఆ సమయంలో విధుల్లో ఉండాల్సిన వైద్యులు కనిపించలేదు. ఆరా తీయగా ప్రతి రోజూ ఇదే తంతు అని తెలుసుకొని వైద్యులపై చర్యలకు ఆదేశించారు. ఈ రెండు సంఘటనలు వైద్యసేవల్లో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. -
జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం
పర్చూరు(చినగంజాం): మండలంలోని ఉప్పుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కందుల నిషి జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం సాధించింది. జాతీయ వినియోగదారుల దినోత్సవ సందర్భంగా గురువారం బాపట్ల జిల్లా స్థాయిలో ‘డిజిటల్ న్యాయవ్యవస్థ ద్వారా సమర్థవంతమైన వేగవంతమైన పరిష్కారం’ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో కందుల నిషి సత్తా చాటినట్లు జిల్లా సైన్సు అధికారి సాధిక్ ప్రకటించారు. ఈ నెల 23న విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో పాల్గొనున్నట్లు తెలిపారు. విజేతగా నిలిచిన నిషిని పాఠశాల హెచ్ఎం వసుంధరాదేవి, పర్చూరు మండల విద్యాశాఖాధికారులు శివ కోటేశ్వరరావు, ఎం. వెంకటరామయ్య, స్థానిక హోమియో వైద్యులు చంద్రశేఖర్, ఉపాధ్యా యులు రామకోటిరెడ్డి, వెంకటస్వామి, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ అభినందించారు. దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్షల విరమణ ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా రూ.4.49 కోట్ల ఆదాయం సమకూరింది. గురువారం జరిగిన కానుకల లెక్కింపులో రూ.3,21,22,542 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రి పై మహా మండపం ఆరో అంతస్తులో కానుకల లెక్కింపు జరిగింది. బుధవారం జరిగిన కానుకల లెక్కింపులో రూ.1,27,90,645 కోట్ల ఆదాయం వచ్చిన సంగతి విదితమే. రెండు రోజుల్లో రూ.4,49,13,187 నగదు, 218 గ్రా ముల బంగారం, 17.324 కిలోల వెండి సమకూరింది. 190 యూఎస్ఏ డాలర్లు, 25 కెనడా డాలర్లు, 15 యూఏఈ దిర్హమ్స్, 23 మలేరియా రింగట్స్, 101ఖత్తర్ రియాన్స్, 100.5 ఓమన్ బైంసాలు లభించాయి. కానుక ల లెక్కింపును ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించగా, దేవస్థాన, సేవా సిబ్బంది పాల్గొన్నారు. మచిలీపట్నం–ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రత్యేక రైలు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు మచిలీపట్నం– ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రత్యేక వన్ వే రైలు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఒక ప్రకటలో తెలిపారు. ఈనెల 22న సాయంత్రం 4.20 గంటలకు మచిలీ పట్నంలో బయలుదేరి, 24వ తేదీ తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రయాగ్‌రాజ్ చేరుతుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, ఖమ్మం, వరంగల్లు, పెద్దపల్లి, మాచర్ల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, బినా, వీరంగన లక్ష్మీభాయ్ జంక్షన్, ఒరై, గోవింద్‌పురి స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. విజయవాడ–కాచిగూడ ప్రత్యేక రైలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ – కాచిగూడ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు నుస్రత్ మండ్రుప్కర్ తెలిపారు. ఈ నెల 20న రాత్రి 9.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు గుంటూరు, సత్తెనపల్లి మీదగా ప్రయాణిస్తుంది. -
అయ్యప్ప నామస్మరణతో పులకిస్తున్న గ్రామాలు
రెంటచింతల: దేశంలోని పట్టణ ప్రాంతాలతోపాటు పల్లెలు ప్రతి ఏటా నవంబర్ 15 నుంచి జనవరి 20 వరకు హరహర పుత్రుడు అయ్యప్పనామస్మరణతో పులకించిపోతుంటాయి. కోట్లాది మంది భక్తులు కఠినమైన 41 రోజులపాటు అయ్యప్పస్వామి మాలలు ధరించి వారి వారి ప్రాంతాలలో పడిపూజ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. పడిపూజలో అయ్యప్ప స్వామి వారికి 21 రకాల అభిషేకాలతోపాటు వివిధ రకాల పూజా కార్యక్రమాలు చేపడతారు. సాక్షాత్తూ జ్యోతిస్వరూపుడు అయప్పస్వామి మహిషి అనే రాక్షసిని సంహారించి శబరిమలైలో వెలిశాడని పురాణం ద్వారా తెలుస్తుంది. ధర్మశాస్త్ర మణికంఠుడిగా పేరు పొందిన అయప్పస్వామి కేరళ రాష్ట్రంలోని శబరిమలై హిందువులకు ఓ ప్రధాన పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతుంది. దేశ నలుమూలల నుంచి 41 రోజుల పాటు నియమాలను పాఠించి ప్రతి ఏటా సుమారు 5 కోట్ల మంది భక్తులు అయప్ప సన్నిధికి చేరుకుని దర్శించుకుంటారు. కార్తికమాసం, సంక్రాంతి సమయలలో అత్యధిక సంఖ్యలో మాల ధారులు శబరిమలై వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. దక్షిణభారతదేశంలోని ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో అధికంగా అయప్పమాలధారణ స్వీకరిస్తారు. ఆంధ్ర శబరిమలైగా పేరుపొందిన ద్వారపూడి శంఖవరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని శబరిమలై వలే నిర్మించడం విశేషం. ఇరుముడి ప్రత్యేకత రెండు అరలున్న మూట ఇరుముడి. నేతితో నింపిన కొబ్బరి కాయ, రెండు కొబ్బరికాయలు, వక్కలు, తమలపాకులు, నాణాలు, పసుపు, గంధం పొడి, విభూది, పన్నీరు, బియ్యం, అటుకులు, మరమరాలు, బెల్లం, అరటిపండ్లు, కలకండ, అగరువత్తులు, కర్పూరం, మిరియాలు(వావర్ దర్గాకోసం), తేనే, ఎండు ద్రాక్ష, తువ్వాలు వంటి వస్తువులను ప్రతి అయప్ప మాలధారుడు ఖచ్చితంగా ఇరుముడిగా కట్టుకుంటారు. ఈ వస్తువులను ఇరుముడిగా కట్టుకునే ఉత్సవాన్ని పల్లికెట్టు అంటారు. శబరిమల కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వతశ్రేణుల ప్రాంతంలో సముద్ర మట్టానికి సుమారు 3 వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు 18 కొండల మధ్య వెలసిఉంది. ప్రతి ఏటా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 26 వరకు ఆలయ తలుపులు తెరచి ఉంచుతారు. 27,28,29, మూడు రోజులు ఆలయ తలుపులు మూసి తిరిగి డిసెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు మాలధారులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు తెరచి ఉంచుతారు. శబరిమలకు మార్గం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నేరుగా రోడ్డు మార్గం ఉంది. ఏ ప్రాంతం నుంచి వచ్చిన పంబ దగ్గర నుంచి ప్రతి భక్తుడు ఇరుముడితో స్వామివారి దర్శనానికి దట్టమైన అడవుల మధ్య సుమారు 7 కి. మీ కాలినడకన వెళ్లాలి. దీనికి మరో మార్గం వండిపెరియార్ నుంచి పులిమేడు కొండ మీదుగా 17 కి. మీటర్లు నడచి వెళ్లాలి. ఈ మార్గంలో పులులు, అడవి జంతువులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. దీంతో ఈ మార్గం నుంచి తక్కువ మంది భక్తులు స్వామిదర్శనానికి వెళ్తారు. -
ఒకరి పరిస్థితి విషమం
సంతమాగులూరు(అద్దంకి): కారు బైకు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. అందులో ఒకరి పిరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన కర్నూలు–గుంటూరు రహదారిలోని కామేపల్లి వద్ద గురువారం రాత్రి జరిగింది. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన రామకృష్ణ, దావీదులు బైకుపై మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పుట్టావారిపాలెం(అడ్డరోడ్డు)కు వచ్చారు. సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడే ఉండి పనులు ముగించుకుని తిరిగి బైకుపై స్వగ్రామానికి పయనం అయ్యారు. ఈ క్రమంలో వారి బైకు, కారు కామేపల్లి సమీపంలో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరకి తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది వాహనంలో క్షతగాత్రులను నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై పట్టాభిరామయ్య అక్కడకు చేరుకుని సంఘటన వివరాలు తెలుసుకుని దర్యాప్తు చేస్నున్నారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. పాతగుంటూరు పోలీసుస్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, పాతగుంటూరు పోలీసుస్టేషన్ ఎస్‌హెచ్‌వో వెంకటప్రసాద్ వివరాలను మీడియాకు వెల్లడించారు. హౌసింగ్‌బోర్డు కాలనీ ఆదర్శనగర్‌కు చెందిన దొంత ప్రవీణ్‌కుమార్ అనే యువకుడు గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. తన చెడు వ్యసనాల కోసం గోవా, విశాఖపట్నం నుంచి గంజాయి తెచ్చి గుంటూరులో విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో అతని వద్ద నుంచి 1100 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవటంలో ప్రతిభ కనబరిచిన పాతగుంటూరు పోలీసుస్టేషన్ ఎస్ఐ రెహమాన్, సిబ్బంది మోహన్, నూరూద్దీన్, రామారావులను జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ అభినందించినట్లు తెలిపారు. విద్యాహక్కు చట్టంలో సవరణ తీసుకురావాలి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా విద్యాహక్కు చట్టంలో సవరణ తీసుకురావాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని, ఇతర సమస్యలను తక్షణం పరిష్కరిచాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో గురువారం ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడారు. -
గాంధేయ వాది ఆళ్ల సుబ్బారెడ్డి మృతి
నివాళులర్పించిన పలువురు ప్రముఖులునరసరావుపేట: గాంధేయ హేతువాది, సాంఘిక ఉద్యమాల నేత, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు ఆళ్ల సుబ్బారెడ్డి (96) బుధవారం హైదరాబాదులో మృతిచెందారు. గురువారం నరసరావుపేటలో కుటుంబ సభ్యులు ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలోని పలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసి, నరసరావుపేట కేంద్రంగా గాంధీ స్మారక సమితి, అశ్లీలత ప్రతిఘటన వేదిక, మద్య వ్యతిరేక పోరాట సమితి, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ, లోక్‌సత్తా పార్టీ జన విజ్ఞాన వేదికలలో చురుకై న నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. పలువురు పట్టణ ప్రముఖులు, బంధుమిత్రులు సుబ్బారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. మాకినేని హరిబాబు, ఈదర గోపీచంద్, సర్వేశ్వరరావు, ఈవూరి వెంకటరెడ్డి, బీఆర్ సుబ్బారావు, జెవీవీ నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రకృతి జీవన విధానం, పట్టణ పారిశుద్ధ్యంతో సహా పలు ఆదర్శాలను అమలు పరచిన సుబ్బారెడ్డి అందరికీ ఆదర్శప్రాయులని, చిరస్మరణీయులని కొనియాడారు. సుబ్బారెడ్డి పెద్ద కుమారుడు రవీంద్రారెడ్డి తెనాలిలో విశ్రాంత అధ్యాపకులుగా, చిన్న కుమారుడు కరుణాకర్ గృహ నిర్మాణం రంగంలోను, కుమార్తె సుమతి, అల్లుడు రమేష్‌రెడ్డి విశ్రాంత డీఎస్పీగా హైదరాబాదులో ఉన్నారు. -
వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్‌పై టీడీపీ కార్యకర్త దాడి
పిడుగురాళ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ షేక్ సుభానిపై టీడీపీ కార్యకర్త కరాలపాడు ముజావర్ రహీం మద్యం సీసాతో దాడి చేసిన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని లెనీన్నగర్లో గురువారం రాత్రి జరిగింది. బాధితుడు సుభాని తెలిపిన వివరాలు.. 32వ వార్డులోని 294 బూత్ వైఎస్సార్ సీపీ కన్వీనర్‌గా షేక్ సుభాని పనిచేస్తున్నారు. ఆయన లెనిన్‌నగర్‌లోని తన ఇంటి సమీపంలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. అప్పటికే మద్యం తాగిన కరాలపాడు ముజావర్ రహీం సుభాని వద్దకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఏం చేస్తారు రా.. మీరేమీ చేయలేరూరా... మా టీడీపీకి అధికారం ఉంది మేము ఏమైనా చేస్తాం అంటూ విరుచుకుపడ్డాడు. రహీం మద్యం తాగి ఉన్నావ్ ఇంటికి వెళ్లు రేపు మాట్లాడుకుందామని సుభానీ చెప్పడంతో నువ్వు ఏందిరా నాకు చెప్పేది అంటూ నా ఇష్టం మీ వైఎస్సార్ సీపీ వాళ్లు ఏమీ చేయలేరంటూ నోటికి వచ్చినట్లు అసభ్యకరంగా మాట్లాడడంతోపాటు అతను దగ్గర ఉన్న మద్యం ఖాళీ సీసా పగలగొట్టి సుభానీపై దాడి చేశాడు. సుభాని వెంటనే చెయ్యి అడ్డు పెట్టాడు. అతని చేతికి తీవ్ర గాయమైంది. ఎడమ చెంపకు గాయమైంది. స్థానికులు కరాలపాడు ముజావర్ రహీంను పట్టుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సుభానీ వెళ్లాడు. రక్తస్రావం అవుతుండడంతో పోలీసులు వెంటనే గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమని సూచించగా గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతున్నానని తెలిపారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను రద్దు చేయాలి
పిడుగురాళ్ల రూరల్/ పిడుగురాళ్ల: డబుల్ ఇంజన్ సర్కార్ ప్రైవేట్ వ్యక్తులకు మాత్రమేనని, పేదవాడి కడుపు కొట్టి ప్రైవేటు వ్యక్తుల కడుపు నింపటం సరైన పద్ధతి కాదంటూ సీపీఐ, విద్యా సంఘాల నాయకులు గళమెత్తారు. పల్నాడు జిల్లా కామేపల్లి గ్రామంలోని మెడికల్ కాలేజీని ఏఐఎస్ఎఫ్, సీపీఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గురువారం సందర్శించారు. డౌన్ డౌన్ చంద్రబాబు ప్రభుత్వం, పీపీపీ విధానంమాకొద్దు... అంటూ నినాదాలతో మెడికల్ కాలేజీ ప్రాంగణం హోరెత్తించారు. అనంతరం ర్యాలీగా మెడికల్ కాలేజకి వెళ్లి భవనాలను సందర్శించారు. తొలుత మెడికల్ కాలేజీని సందర్శించేందుకు సీపీఐ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు అద్దంకి నార్కెట్‌పల్లి హైవే వద్దకు చేరుకొని మెడికల్ కాలేజీలోకి వెళ్లేందుకు చూస్తుండగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కాలేజీని సందర్శించేందుకు ఎలాంటి అనుమతి లేదని ర్యాలీని అడ్డుకున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటం వల్ల పిల్లలు, భవిష్యత్ పోతుందని, అడ్డుకోవటం సరైనది కాదని, చంద్రబాబు ప్రభుత్వం కోసం పోలీసులు పని చేస్తున్నారని చెప్పటంతో నాయకులకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. అనంతరంమెడికల్ కాలేజీని సీపీఐ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు సందర్శించారు. మెడికల్ కాలేజీని వెంటనే ప్రభుత్వమే పూర్తి చేస్తే వెనుక బడిన పల్నాడు ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, వెంటనే దీనిని పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి బందె నాసర్జి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతి వరప్రసాద్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు షేక్ హుస్సేన్, కాసా రాంబాబు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం.సుబ్బారావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సర్వయ్య, గురజాల నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి, సీపీఐ సెక్రటరీ అక్కినపల్లి బాలయ్య, గోదా శ్రీను, బాబురావు, విద్యార్థి సంఘాల నాయకులు చక్రవర్తి, శ్రీరాం, బుర్రి కృష్ణారెడ్డి, సత్యనారాయణ, ఏఎస్ఎఫ్ఐ నాయకులు మధు, నాగేంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందె నాసర్‌జీ మాట్లాడుతూ చంద్రబాబు కథలు నమ్మేందుకు పేద ప్రజలు సిద్ధంగా లేరన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సీపీఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ మాట్లాడుతూ పేదవాడికి వైద్య విద్య, వైద్యం అందేలా చూడాలని కోరారు. పల్నాడు ప్రాంతానికి మెడికల్ కాలేజీ మణిహారం లాంటిదన్నారు. -
ముగిసిన ‘అన్వేషణ్ – 2025’
తాడికొండ: భారత విశ్వవిద్యాలయాల సంఘం (ఏఐయూ) నిర్వహించిన విద్యార్థుల పరిశోధన – ఆవిష్కరణ పోటీ (సౌత్ జోన్) అన్వేషణ్–2025, గురువారం వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయంలో విజయవంతంగా ముగిసింది. 17,18 తేదీలలో నిర్వహించిన ఈ కార్యక్రమం భారతదేశంలోనే అతిపెద్ద పరిశోధన మరియు ఆవిష్కరణ పోటీగా కళాశాల యాజమాన్యం తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహంతెం శాంతా సింగ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత నేతృత్వంలోని పరిశోధనలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. గౌరవ అతిథి జీనియస్ ఫిల్టర్స్ అండ్ సిస్టమ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పంచుమర్తి లక్ష్మీ భీమేష్ మాట్లాడుతూ విద్యార్థులు తమ పరిశోధనా కార్యకలాపాలను వాస్తవ ప్రపంచ పారిశ్రామిక సామాజిక సవాళ్లతో అనుసంధానించాలన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్ర పాణి ప్రత్యేక అతిథిగా హాజరై పాల్గొన్న వారితో పాటు అవార్డు గ్రహీతలను అభినందించారు. అత్యుత్తమ విద్యార్థి పరిశోధన ప్రాజెక్టులను పోస్టర్ ప్రజెంటేషన్ పోడియం ప్రజెంటేషన్ రెండింటి నుంచి ఎంపిక చేశారు. ప్రతి ట్రాక్ నుంచి మొదటి, రెండవ మరియు మూడవ స్థానాల్లో నిలిచిన విజేతలను సత్కరించారు. వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.అరుల్మోళి వర్మన్, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి హాజరయ్యారు. -
పథకాల అమలులో పల్నాడు జిల్లా ఫస్ట్
నరసరావుపేట: జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర అనుబంధ పథకాల అమలులో పల్నాడు జిల్లా రాష్ట్రంలో నెంబర్ వన్‌గా నిల్చింది. 47 పథకాల అమలుకు సంబంధించి 91శాతం నిధులు ఖర్చు చేసి, 26 జిల్లాల్లో పల్నాడు జిల్లా మేటిగా నిల్చింది. జిల్లాలో మొత్తం రూ.167కోట్లకు గాను రూ.151కోట్లు లబ్ధిదారులకు నేరుగా చెల్లించడం లేదా వెచ్చించారు. 90శాతంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, 89శాతంతో నంద్యాల జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. -
డీఎస్ నకార సేవలు చిరస్మరణీయం
ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మంగళగిరి టౌన్: విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేసిన డీఎస్ నకార సేవలు చిరస్మరణీయమని ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని పెన్షనర్స్ హోమ్‌లో జాతీయ పెన్షనర్ల దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్ పితామహులు డీఎస్ నకార విగ్రహాన్ని ఆవిష్కరించారు. అసోసియేషన్ సభ్యులు నకార విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం ప్రభుత్వానికి సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడంతో డీఎస్ నకార తన కర్తవ్యంగా న్యాయస్థానానికి వెళ్లారని గుర్తుచేశారు. దీంతో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చారిత్రాత్మక తీర్పు వెలువరించారని.. ఆనాటి నుంచి పెన్షనర్ దినోత్సవాన్ని జరుపుకొంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటగా మంగళగిరిలో నకార విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం పలువురు సీనియర్ పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాసు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిచ్చయ్య, కృష్ణయ్య, మంగళగిరి శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపిరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌కు నిహాల్ ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: మణిపూర్‌లో జనవరి 4వ తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌నకు శ్రీచైతన్య జూనియర్ కళాశాల సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థి దానియేలు నిహాల్ ఎంపికై నట్లు విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. బుధవారం లక్ష్మీపురంలోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడారంగంలో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పెదకాకాని మండలం వెనిగండ్ల జెడ్పీ హైస్కూల్లో జరిగిన అండర్–19 రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించిన తమ విద్యార్థి దానియేలు నిహాల్ జాతీయస్థాయికి అర్హత సాధించాడని తెలిపారు. ఈసందర్భంగా నిహాల్‌ను అభినందించారు. కార్యక్రమంలో మహతి క్యాంపస్ ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ ఆందోళన
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గురువారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద, రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నామని సీపీఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు తెలిపారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసినప్పుడే పాలన విజయవంతమవుతుందని, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సహాయం వంటి ‘సూపర్ సిక్స్‘ హామీలను పక్కన పెట్టి ‘సూపర్ సక్సెస్’ అని చెప్పుకోవడం ఆత్మ సంతృప్తికి తగదని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నెలకు రూ. మూడు వేలు ఉపాధి భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం, ఆ హామీ అమలులో ఎందుకు వెనుకంజ వేస్తోందో సమాధానం చెప్పాలని నిలదీశారు. అనంతరం జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగరకార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు పాల్గొన్నారు. నేడు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, మెడికల్ కళాశాలల వద్ద ధర్నాలు సీపీఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు -
ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత మృతి
నరసరావుపేట టౌన్: ఏరియా వైద్యశాలలో బాలింత మృతికి వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు బుధవారం ఏరియా వైద్యశాల ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలు.. రెంటచింతల మండలం పాల్వాయి గేటుకు చెందిన సాగరమ్మ(21) గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతూ కాన్పు కోసం మంగళవారం ఏరియా వైద్యశాలలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు బుధవారం శస్త్ర చికిత్స చేశారు. మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఆమె మరణించింది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు పెద్ద సంఖ్యలో ఏరియా వైద్యశాల వద్దకు చేరుకున్నారు. రక్తం తక్కువ ఉన్న పేషెంటుకు ఆపరేషన్ ఎలా చేశారంటూ వైద్యురాలు, సిబ్బందిని నిలదీసి గొడవకు దిగారు. ఓ సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సర్దిచెప్పారు. వైద్యురాలి నిర్లక్ష్యంతోనే అంటూ బంధువుల ఆందోళన -
కొనసాగిన ఐటీహెచ్పీబీఏబీ గ్లోబల్ కాన్ఫరెన్స్
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాం గ్రామంలోని చలపతి ఫార్మశీ కళాశాలలో జరుగుతున్న గ్లోబల్స్ కాన్ఫరెన్స్ రెండవ రోజు బుధవారం కొనసాగింది. రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా అవార్డు ఉపన్యాసాలు, పరిశోధనలపై సదస్సు నిర్వహించారు. ఇంటిగ్రేటింగ్ టెక్నాలజీ విత్ హెల్త్‌కేర్ ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్, బయోమెడికల్ సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ (ఐటీహెచ్బీఏబీ–2025) గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో జపాన్ దేశానికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు ప్రొఫెసర్ మసాకో కినోషితా న్యూరాలజీ రంగంలో విశేషమైన పరిశోధనా, వైద్య అనుభవాన్ని వివరించారు. ఫార్మసీ రంగంలో జీవితకాల సేవలకు ప్రొఫెసర్ జి.నరహరిశాస్త్రికి, బయోటెక్నాలజీ రంగంలో జీవితకాల కృషికి డాక్టర్ శ్రీనివాసులుకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. పరిశ్రమలలో బయోటెక్నాలజీ అభివృద్ధికి కృషిచేసిన డాక్టర్ కె.సురేష్‌బాబుకు టాలెంటెడ్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజిస్ట్ అవార్డు అందించారు. ఏబీఏపీ సీనియర్ సైంటిస్ట్ అవార్డులు డాక్టర్ బిపిన్నాయర్, డాక్టర్ వెంకటదాసు వీరంకి, డాక్టర్ లతారంగన్లకు అందించి సత్కరించారు. యువ పరిశోధకుల ప్రతిభను గుర్తిస్తూ ఏబీఏపీ టాలెంటెడ్ ఇన్నోవేటివ్ సైంటిస్ట్ అవార్డులు డాక్టర్ శ్రీకాంత్గడాడ్, డాక్టర్ బృందా గన్నేరు, డాక్టర్ శ్రీనివాస్ పెంట్యాలాలకు అవార్డులు అందజేశారు. నానో సైన్స్, టెక్నాలజీ రంగంలో ఉన్నత పరిశోధనలకు డాక్టర్ శ్రీనివాసరెడ్డి బోనం, ఏబీఏపీ గోల్డ్ మెడల్‌ను, పరిశ్రమలలో వినూత్న ఆవిష్కరణలకు డాక్టర్ జి.వివేకానందన్కు ఏబీఏపీ ఇండస్ట్రీ ఇన్నోవేటివ్ అవార్డు ప్రదానం చేశారు. మొత్తం 161 ఒరల్ ప్రెజెంటేషన్లు 104 పోస్టర్ ప్రెజెంటేషన్లు జరిగాయి. చలపతి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ రామారావు నాదెండ్ల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డి నళినిదేవిలు రచించిన ఎమ్సీక్యూస్ ఇన్ పార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అనే పుస్తకాన్ని జపాన్‌కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు ప్రొఫెసర్ మసాకో కినోషితా ఆవిష్కరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, అధికారులు ఇతర దేశాలకు చెందిన ప్రొఫెసర్లు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
యువత చేతిలోనే దేశ భవిత
ఎస్పీ బి.కృష్ణారావునరసరావుపేట ఈస్ట్: యువత చేతిలోనే దేశ భవిత ఉందని, నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం విద్యార్థుల నుంచే రావాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఆడిటోరియంలో బుధవారం జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్, మహిళలపై దాడులు, డ్రగ్స్ సమస్యలపై విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూమాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఇందులో విద్యార్థి లోకం కీలకపాత్ర పోషించాలని తెలిపారు. విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలపై అప్రమత్తంగా ఉంటూ వాటి సమాచారాన్ని పోలీసులకు అందివ్వాలని ఆయన కోరారు. యువత తేలికగా మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కావడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. వ్యసనాలకు అలవాటు పడి, మానసిక నియంత్రణ కోల్పొయి నేరాలకు పాల్పడుతూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్ సమూలంగా నిర్మూలించేందుకు నడుం బిగించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 370 ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామని, విద్యార్థి లోకం అప్రమత్తంగా ఉంటూ డ్రగ్స్ వినియోగదారులు, అమ్మకందారుల సమాచారాన్ని పోలీసులకు, 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని కోరారు. బాలికలు, మహిళల భద్రతకు శక్తి యాప్ ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. మైనర్లు మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారని, వారికి వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు తెలిపారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. డీఎస్పీ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ కుటుంబ పెద్ద, తండ్రికి హెల్మెట్‌ను కానుకగా ఇవ్వాలని సూచించారు. కేవలం నిర్లక్ష్యం, అశ్రద్ధతోనే హెల్మెట్లు ధరించటం లేదని తెలిపారు. బాలికలు ప్రేమ పేరుతో ఆకర్షణకు లోనై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటరమణ, సీఐలు షేక్ ఫిరోజ్, ప్రభాకర్, ఎం.వి.సుబ్బారావు, ట్రాఫిక్ సీఐ లోకనాథం, కళాశాల కార్యదర్శి నాగసరపు సుబ్బరాయగుప్త, ప్రిన్సిపాల్ ఎం.ఎస్.సుధీర్, వైస్ ప్రిన్సిపాల్ పి.శ్రీనివాససాయి, ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ బి.ఎస్.ఆర్.కె. రాజు పాల్గొన్నారు. -
కల్లగా మారిన సొంతింటి కల
దాచేపల్లి : పేదల ఇళ్లపై కూటమి సర్కార్ పగబట్టటంతో జగనన్న కాలనీలు నేడు కళాహీనంగా దర్శనమిస్తున్నాయి. సొంతింటి కలకు పేదలు నోచుకోవడం లేదు. జగనన్న కాలనీల ద్వారా కొత్త ఊర్లు రూపాంతరం చెందేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషి చేస్తే..నేడు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. కళకళలాడిన కాలనీలు దాచేపల్లి జగనన్న కాలనీలో మొదటి దశలో 1020 మంది పేదలకు స్థలాలు కేటాయించి ఇళ్లు మంజూరు చేశారు. వీటిల్లో 728 మంది ఇళ్లు నిర్మించుకుని అందులో నివాసం ఉంటున్నారు. రెండవ దశలో 1,870 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. సాధారణ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇళ్లు మంజూరు కాలేదు. గోగులపాడు రోడ్డులో 450 మందికి, దుర్గా పబ్లిక్ స్కూలు వెనుక 129 మంది, ఇరికేపల్లిలో 129 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. వీరు కూడా ఇళ్లు కట్టుకుని వాటిల్లో నివాసం ఉంటున్నారు. కాలనీల్లో వసతుల కల్పన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల్లో తాగునీరు. కరెంట్, రోడ్ల వసతి కల్పించేందుకు నాటి ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి తీవ్రంగా కృషి చేసి, మౌళిక వసతులు కల్పించారు. ఎక్కువ కుటుంబాలు జగనన్న కాలనీల్లో నివాసం ఉండటంతో అవి గ్రామాలుగా రూపాంతరం చెందాయి. వెలవెలబోతున్న కాలనీలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్నన కాలనీలు వెలవెలబోతున్నాయి. కొత్తగా ఇళ్లు మంజూరు చేయకపోవడంతో పట్టాలు తీసుకున్న పేదలు ఆశతో ఎదురు చూస్తున్నారు. దాచేపల్లి జగనన్న కాలనీలో 1,840 మందికి పట్టాలను ఇస్తే, ఇప్పటి వరకు స్థలాలను కూటమి ప్రభుత్వం చూపించలేదు. తాగునీరు, రోడ్లు, కరెంట్ సమస్యలు ఉండటంతో ఇల్లు మంజూరు చేసిన కట్టే పరిస్థితిలో లబ్ధిదారులు లేరు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఆరు జగనన్న కాలనీలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. అక్కడ ఉండలేక మళ్లీ దాచేపల్లికి వచ్చి అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటూ అవస్థలు పడుతున్నారు. జగనన్న కాలనీల్లో కనీస మౌలిక వసతులు కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అన్ని వసతులు కల్పించటంతో నిరుపేదలు ఇళ్లు నిర్మించుకుని అందులో నివాసం ఉన్నారు. జగనన్న కాలనీలపై కూటమి ప్రభుత్వానికి వివక్ష తగదు. కాలనీల్లో అన్ని వసతులు కల్పించాలి. –షేక్ డాడీ, దాచేపల్లి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటిౖకైనా స్పందించి పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు చూపించి ఇళ్లు మంజూరు చేయాలి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదలకు పట్టాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేయడం వల్ల అత్యధికంగా నిర్మాణాలు జరిగాయి. పేదల సొంతింటి కలను చంద్రబాబు ప్రభుత్వం సాకారం చేయాలి. –షేక్ ఖాదర్ బాషా, వైస్ చైర్మన్, దాచేపల్లి -
తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దేశంంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులోని ఓ హోటల్లో బుధవారం వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జొన్న శివశంకరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టుకునేందుకు రైతులను సంఘటిత పరచాలని ఆ దిశగా ఉద్యమాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గుంటూరులో వచ్చే ఏడాది జనవరి 29, 30, 31, ఫిబ్రవరి ఒకటో తేదీన జరగనున్న అఖిలభారత కిసాన్ సమితి జాతీయ సమావేశాల్లో ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఙరైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం రైతుల చేతుల్లో నుంచి కార్పొరేట్ శక్తుల్లో చేతుల్లోకి వెళ్తుందన్నారు. ఙమాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం వల్ల స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ వాటా తగ్గిపోయిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ రంగంలో ఒక్క పంటకీ గిట్టుబాటు ధరలు లేవన్నారు. గుంటూరులో జరిగే ఏఐకేఎస్ జాతీయ సమావేశాలకు రైతు సంఘం నాయకులు అశోక్ దావాలే, హనన్ మొల్ల విజూ కృష్ణ హాజరు కానున్నట్లు తెలిపారు. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ టి.రత్నారావు, కిసాన్ ఫౌండేషన్ అధ్యక్షుడు బండ్ల సూరయ్య చౌదరి, లాం ఫారం మాజీ అసోసియేట్ డైరెక్టర్ ఆర్.అంకయ్య, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు కళ్ళం రాజశేఖర్ రెడ్డి, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ మూర్తి వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం జాతీయ సమావేశాలకు సంబంధించిన ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య -
21,22 తేదీల్లో వివా వీవీఐటీయూ 2కే25–26
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో డిసెంబర్ 21, 22 తేదీల్లో జాతీయస్థాయి యువజనోత్సవం వివా వీవీ 2కే25–26 నిర్వహించనున్నట్లు వీవీఐటీ విశ్వవిద్యాలయం ప్రో–చాన్స్‌లర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న అపరిమిత సామర్థ్యాలు, అంతర్గతశక్తిని గ్రహించాలని తెలియపరిచే విధంగా యువర్ పొటెన్షియల్ ఈజ్ ఎండ్ లెస్ ద మ్యాజిక్ ఈజ్ ఇన్ యు అనే నినాదంతో యానిమి ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ చైనా నేపథ్యంలో ఈ యువజనోత్సవాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ (శాక్) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకత, నైపుణ్యం, కళాత్మకతను వెలికితీసే విధంగా సాంకేతిక, క్రీడా, సాంస్కృతిక విభాగాలలో 93 అంశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ యువజనోత్సవానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను బుధవారం విద్యార్థులతో కలసి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రో–చాన్స్‌లర్ వాసిరెడ్డి మహదేవ్, రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి విడుదల చేశారు. శాక్ విద్యార్థి తనువుద్ధి నవ్య మాట్లాడుతూ, వీవీఐటీ నిర్వహించే యువజనోత్సవం వివా వీవీఐటీయూ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. యువజనోత్సవంలో పాల్గొనే విద్యార్థులు వివావీవీఐటీ.కామ్ వెబ్సైట్ నందు వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అకడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ సి.ఉదయ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. -
చలపతి ఫార్మసీలో ఏబీఏపీ 19వ వార్షిక మహాసభ
గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారులోని లాం నందున్న చలపతి ఫార్మసీ కళాశాలలో అసోసియేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఫార్మసీ (ఏబీఏపీ) సహకారంతో నిర్వహిస్తున్న ఏబీఏపీ 19వ వార్షిక మహాసభ అంతర్జాతీయ సదస్సు (గ్లోబల్ కాన్ఫరెన్స్) మంగళవారం ప్రారంభమైంది. స్థిరమైన అభివృద్ధి కోసం హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ బయో మెడికల్ సైన్సెస్‌తో సాంకేతికత సమన్వయం అనే ప్రధాన అంశంతో మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ శాస్త్రవేత్తలు, అకడమిషీయన్లు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే అరుదైన అవకాశాన్ని కల్పించిందని ఆయన తెలిపారు. కార్యక్రమానికి చలపతి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వైవి ఆంజనేయులు, సెక్రటరీ వై. సుజిత్కుమార్లు అధ్యక్షత వహించారు. ఏబీఏపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ కె.ఆర్.ఎస్.సాంబశివరావు కార్యక్రమంలో కీలకపాత్ర పోషించారు. ● ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి మాట్లాడుతూ ఉన్నతవిద్య, పరిశోధన నాణ్యత, పరిశ్రమ అకాడమీ అనుసంధానం వంటి అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ● ఏఎన్‌యూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.గంగాధరరావు మాట్లాడుతూ గ్లోబల్ స్థాయిలో జరుగుతున్న పరిశోధనాధోరణులు, వైద్య శాస్త్రాల్లో సాంకేతికతపై విలువైన అవగాహన కల్పించారు. ● యూనివర్సిటీ ఆఫ్ అలబామా, ట్రాన్స్లేషనల్ సైన్స్ మెడిసిన్ విభాగం డాక్టర్ ఎం.ఎన్.వి.రవికుమార్ మాట్లాడుతూ ప్రయోగశాల స్థాయి పరిశోధనలు, వైద్య ఆవిష్కరణలుగా సమాజానికి ఉపయోగపడే విధానాన్ని వివరించారు. ● ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డాక్టర్ నేసె శ్రీనివాసులు వ్యవసాయ పరిశోధనల్లో బయోటెక్నాలజీ పాత్ర, ఆహార భద్రత, సమగ్ర అభివృద్ధి అంశాలపై వివరించారు. ● హైదరాబాద్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ జి. నరహరిశాస్త్రి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర శాఖల పరిశోధనలు ఇన్నోవేషన్‌పై సమాచారాన్ని అందించారు. ● అలబామా స్టేట్ యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయాలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్ మనోజ్ కె. మిశ్రా బయోమెడికల్ సైన్సెస్, గ్లోబల్ రీసెర్చ్ సహకారం యువ పరిశోధకులకు ఉన్న అవకాశాలను వివరించారు. కార్యక్రమంలో దేశంలోని సుమారు 12 రాష్ట్రాలకు చెందిన 50కి పైగా ప్రముఖ విద్యాసంస్థల నుంచి 1250 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ప్రారంభమైన గ్లోబల్ కాన్ఫరెన్స్ -
‘80’ ల్లోనూ పతకాల పంట
తెనాలిటౌన్: రూరల్ మండలం కఠెవరం గ్రామానికి చెందిన ఆళ్ళ వీరారెడ్డి, సోమిశెట్టి బుల్లయ్య 80 సంవత్సరాల వయస్సులోనూ అథ్లెటిక్స్‌లో పాల్గొని మెడల్స్ సాధిస్తున్నారు. బాపట్లలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో 7వ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో జావెలెన్ త్రో, లాంగ్ జంప్, త్రో బాల్ పోటీలు 80 సంవత్సరాలు దాటిన వారికి నిర్వహించారు. కఠెవరం గ్రామానికి చెందిన ఆళ్ళ వీరారెడ్డి, సోమిశెట్టి బుల్లయ్య పాల్గొన్నారు. ● బుల్లయ్య జావెలెన్ త్రో, త్రోబాల్, లాంగ్ జంప్‌లో ప్రథమ బహుమతి సాధించగా, ఆళ్ళ వీరారెడ్డి షార్ట్‌ఫుట్‌లో ప్రథమ బహుమతి సాధించినట్లు చెప్పారు. ● చిన్ననాటి నుంచి క్రీడల్లో ఈ ఇరువురు ఉత్సాహంగా పాల్గొంటారని గ్రామస్తులు వివరించారు. ఈ సందర్భంగా ఇరువురుని సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో లక్కరాజు శ్రీనివాసరావు, లక్కరాజు ఉమాకాంత్, కొల్లి ఉమాశంకర్‌రెడ్డి, పుట్టా రవికిషోర్, లక్కరాజు హరి, ఎం.నరేంద్ర, ఎస్.కోటేశ్వరరావు, తదితరులు ఉన్నారు. -
ధాన్యం కొనుగోడు
నిబంధనల పేరుతో సక్రమంగా కొనని సర్కార్ సత్తెనపల్లి: జిల్లాలో 1,32,725 ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు జరిగింది. ఇప్పటికే 80 శాతం కోతలు పూర్తయ్యాయి. ఇంకా కోతలు జరగాల్సిన పంట మరో 20 శాతం ఉంటుందన్నది అంచనా. ఖరీఫ్‌లో మొత్తం 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నది అధికారులు అంచనా. ఇందులో 40 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 1100 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. మిగిలిన 29,900 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే ప్రభుత్వ కొనుగోలు లక్ష్యం పూర్తవుతుంది. తేమ శాతం రైతన్నలకు శాపం... చంద్రబాబు ప్రభుత్వం తేమశాతం అమల్లో కఠిన నిబంధనలు విధించడం రైతుల పాలిట శాపం గానూ,దళారుల పాలిట వరలా మారింది. చేతికి అంది వచ్చిన ఖరీఫ్ పంట నోటికి అందుతుందనుకున్న ఆశలపై అధిక వర్షాలు, మోంథా తుఫాన్ నీళ్లు జల్లాయి. ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి తేమ, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసి కష్టాల్లో ఉన్న తమను ఆదుకుంటుందని అన్నదాతలు భావించారు. అయితే తేమ శాతం పేరుతో ప్రభుత్వం వారి ఆశలను అడియాసలు చేసింది. కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడం, వాతావరణం భయపెడుతుండడంతో గత్యంతరం లేక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని వారు చెప్పిన తక్కువ రేటుకే అమ్ముకుంటున్నారు. ఈ విధంగా దళారులు లక్ష మెట్రిక్ టన్నుల పైనే ధాన్యం కొనుగోలు చేసినట్లు అంచనా. ఇది ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని రైతులు అంటున్నారు. అసలే ఆశాజనకంగా లేని దిగుబడులతో రైతులు ఎకరాకు 25 బస్తాలు వస్తున్నాయి. దళారులు రూ.1,300లకు కొనుగోలు చేస్తున్నారు. 25 బస్తాలు విక్రయిస్తే రూ. 32,500 వస్తోంది. ఎకరాకు పెట్టుబడి రూ.49,800 అవుతోంది. ఈ లెక్కన ఒక్క ఎకరం వరి సాగుకు రూ.17,300 రైతు నష్టపోతున్నాడు. అదే కౌలు రైతు అయితే మరో రూ. 10 వేలు అదనంగా నష్ట పోతున్నాడు. జిల్లా వ్యాప్తంగా వరి సాగు చేసిన 1,32,725 ఎకరాలకు రైతులకు రూ. 22.96 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. నేను ఎకరం సొంత పొలం, మూడు ఎకరాలు కౌలు సాగు చేస్తున్నా. ఎకరానికి 25 బస్తాలు చొప్పున 100 బస్తాలు దిగుబడులు వస్తే .. ఎకరానికి రూ.20 వేలు నష్టం వచ్చింది. నాలుగు ఎకరాల పైన రూ.80 వేలు నష్టపోయాను. ఎకరానికి 35 బస్తాలు దిగుబడి వస్తుందని ఆశిస్తే మోంథా తుఫాన్ వల్ల దిగుబడి పూర్తిగా తగ్గింది. ఈ ఏడాది నష్టం తప్ప లాభాలు ఆశించే పరిస్థితి కనిపించడం లేదు. – రాచమంటి నాగ బ్రహ్మయ్య, రైతు, మాదల -
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
తెనాలి రూరల్: ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్‌పై వెళుతున్న ఇరువురు వ్యక్తులు గాయపడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం తెనాలి నుంచి నందివెలుగు మీదుగా ఆర్టీసీ బస్సు గుంటూరు వెళుతుండగా కాజీపేట ఏ–వన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఓ సైకిల్, బైక్ ఢీకొని దానిపై ప్రయాణిస్తున్న వారు రోడ్డుపై పడ్డారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ రోడ్డుపై పడిన వారిని తప్పించబోయి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టాడు. బైక్ పై ప్రయాణిస్తున్న కొలకలూరు బాపయ్యపేటకు చెందిన పురంశెట్టి రామకృష్ణ, నీలి శ్రీనివాసరావు గాయపడ్డారు. ఇరువురిని స్థానికులు తెనాలి వైద్యశాలకు తరలించారు. రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా వైద్యశాలలో నాలుగు స్క్రబ్ టైఫస్ అనుమానిత కేసులు తెనాలి అర్బన్: జిల్లాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తెనాలి జిల్లా వైద్యశాలలో ఇప్పటికే 10 మంది చికిత్స పొందారు.మరి కొందరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పొన్నూరుకు చెందిన ఓ వ్యక్తి పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు పంపినట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం మరో నలుగురు స్క్రబ్ టైఫస్ లక్షణాలతో చేరినట్లు చెప్పారు. వీరికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశామని, బుధవారం రిపోర్టులు వచ్చే అవకాశం ఉందన్నారు. బాలుడు బలవన్మరణం మార్టూరు: ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మార్టూరులో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. స్థానిక విద్యానగర్ కాలనీకి చెందిన దేసు ప్రసన్నకుమార్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు భద్రి ( 14) సంతానం. భద్రి స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. క్లాసులో మెరిట్ స్టూడెంట్‌గా ఉండే భద్రి.. ఇటీవల తన అమ్మమ్మ మృతి చెందినప్పటి నుంచి మానసికంగా బాధపడుతూ స్కూల్‌కు సరిగా వెళ్లడం లేదు. ఈ క్రమంలో ఉదయం 7:30 గంటల సమయంలో భద్రి తన తాతయ్యకు టీ పెట్టి ఇచ్చి.. ఇంట్లోకి వెళ్లి తిరిగి బయటికి రాలేదు. మనుమడు ఎంతకూ బయటకు రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా.. సీలింగ్ ఫ్యాన్‌కు తల్లి చీరతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. కేకలు వేస్తూ స్థానికులను అప్రమత్తం చేయగా వారు కింద దించి స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఎప్పుడూ చదువులో ముందుందే భద్రి అకాల మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. మనస్తాపంతో లారీ డ్రైవర్..బల్లికురవ: మనస్తాపంతో ఓ లారీ డ్రైవర్ మద్యంలో గడ్డి నివారణకు వాడే పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 65 గంటలపాటు మృత్యువుతో పోరాడి మంగళవారం ఉదయం చనిపోయాడు. అందిన సమాచారం ప్రకారం మండలంలోని వైదన గ్రామానికి చెందిన శాయిని వేణుగోపాల్ (52) లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఈయనకు భార్య రామాంజమ్మ ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. ఎస్సై వై. నాగరాజు కేసు నమోదుతో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
విజయకీలాద్రిపై ధనుర్మాస వేడుకలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ధనుర్మాస వేడుకలను మంగళవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనాలతో ధనుర్మాస వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం ఉదయం గోదా అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన, మంగళాశాసనం నిర్వహించారు. అనంతరం 1వ పాశుర విన్నపం, తీర్థ ప్రసాద వితరణ జరిగాయి. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదా అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ సాక్షి భావనారాయణ స్వామి ఆలయంలో... పొన్నూరు: పట్టణంలోని స్వయంభూ శ్రీ సాక్షి భావనారాయణస్వామి, కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దేవాలయం అర్చకులు గోవర్ధనం రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగ్నిక స్వామి వేదాంతం అనంత శ్రీనివాస భట్టాచార్యులు, తిరుప్పావై ప్రవచకులు తిరువాయిపాటి గోవర్ధనాచార్యులు పాల్గొన్నారు. భక్తులు గోదాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. వాజ్‌పేయి విగ్రహానికి రూ.8 లక్షలు విరాళం గుంటూరుమెడికల్: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్‌బిహారీ వాజ్‌పేయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి గుంటూరులో సోమ వారం శంకుస్థాపన జరిగింది. గుంటూరు లక్ష్మీపురం నాలుగు రోడ్ల కూడలిలో విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఈ విగ్రహ ప్రతిష్టకు గుంటూరుకు చెందిన పారిశ్రామికవేత్త మాదల రత్నగిరిబాబు రూ.8 లక్షలు విగ్రహ నిర్మాణ కమిటీకి మంగళవారం అందజేశారు. వైభవంగా స్వామి వారి ఆరాధన మహోత్సవం నగరంపాలెం(గుంటూరువెస్ట్):గుంటూరులోని శ్రీకంచి కామకోటి పీఠ శ్రీమారుతీ దేవాలయ ప్రాంగణంలో శ్రీకంచి కామ కోటి పీఠం 68వ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి 32వ ఆరాధన మహోత్సవాన్ని మంగళవారం అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్ పర్యవేక్షించారు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి విశేష పూజలు తెనాలి: నాజరుపేటలోని శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీ పీఠపాలిత శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేష కార్యక్రమాలు జరిపారు. స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష అలంకరణ చేశారు. భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. అప్పికట్ల వెంకటేశ్వరరావు సిద్ధాంతి ప్రవచనం చెప్పారు. 30న ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5.45 గంటలకు ఉత్తర ద్వారా దర్శనం నిర్వహిస్తారు. -
ఉపాధ్యాయులకు ఐడీఈ బూట్ క్యాంప్
ప్రత్తిపాడు: పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఐడీఈ బూట్ క్యాంప్ తమ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు కిట్స్ కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు తెలిపారు. వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ), కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో కిట్స్ కళాశాలలో పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఈ నెల 17, 18, 19 తేదీల్లో ఇన్నోవేషన్, డిజైన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ (ఐడీఈ) బూట్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏఐసీటీఈ, ఎంవోఈ ఇన్నోవేషన్ సెల్, ఎస్సీఈఆర్టీ, స్కూల్ ఇన్నోవేషన్ కౌన్సిల్, వాధ్వానీ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జరిగే ఈ క్యాంప్‌కు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి సంబంధిత స్కూల్స్ ఉపాధ్యాయులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయుల్లో ఇన్నోవేషన్, డిజైన్ థింకింగ్ వ్యాపారోన్ముఖ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ క్యాంప్ చేపడుతుందని వివరించారు. బూట్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆర్జేడీ వి.లింగేశ్వర రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు నిపుణులైన రిసోర్స్ పర్సన్లతో లెక్చర్లు, వర్క్ షాపులు, హ్యాండ్స్–ఆన్ సెషన్లు నిర్వహించబడతాయని తెలిపారు. కళాశాల సెక్రటరీ కోయి శేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను మరింత మెరుగు పరిచేందుకు బూట్ క్యాంప్ దోహదపడుతుందన్నారు. సమావేశంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె. హరిబాబు, ప్రిన్సిపల్ డాక్టర్ పి.బాబు, బూట్ క్యాంప్ ఇన్చార్జి ఎస్పీవోసీ డాక్టర్ అరుణ పాల్గొన్నారు. కిట్స్ కళాశాల చైర్మన్ కోయి సుబ్బారావు -
ఏపీఐఐసీ భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు
రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారుల పరిశీలన యడ్లపాడు: మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ భూముల్లో ఇష్టానుసారంగా తవ్వకాలు చేస్తున్నారు. విలువైన ఎర్ర మట్టిని సుదూర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో మండలంలోని బోయపాలెం పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) భూముల్లో అధికార పార్టీకి చెందిన కొందరు యథేచ్ఛగా కొద్ది రోజుల నుంచి అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. ఇదే విషయం ఏపీఐఐసీ ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో మంగళవారం ఏపీఐఐసీ, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు ఆకస్మికంగా బోయపాలెం పరిధిలోని ఏపీఐఐసీ భూముల్ని పరిశీలించారు. తవ్వకాలు చేసిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తవ్వకాలకు ఎవరు పాల్పడుతున్నది ఆరా తీశారు. బోయపాలెం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రాత్రివేళల్లో, సెలవు దినాలను అదునుగా తీసుకుని మట్టి తవ్వకాలు సాగిస్తూ ట్రాక్టర్ల ద్వారా తరలించిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ కార్యకలాపాలపై పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఏపీఐఐసీకి చెందిన భూముల్లో తవ్వకాలు జరుగుతున్నాయని అందిన సమాచారం మేరకు అధికారులు క్షేత్రస్థాయికి చేరుకుని తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. -
ఇంటర్ పరీక్షల మార్పులకు సన్నద్ధం కావాలి
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో తీసుకువస్తున్న మార్పులకు అనుగుణంగా సన్నద్ధం కావాలని ఇంటర్మీడియెట్ బోర్డు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సైమన్ విక్టర్ తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో భాగంగా ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై మంగళవారం శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఆడిటోరియంలో పల్నాడుజిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, పరీక్ష నిర్వహణ అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సైమన్ విక్టర్ మాట్లాడుతూ, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు పాత విధానాన్నే అమలు చేస్తుండగా, ప్రథమ సంవత్సరం పరీక్షల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రథమ సంవత్సరం సిలబస్‌లో భారీ మార్పులు జరిగాయనీ, అందుకు అనుగుణంగా పరీక్షా విధానంలోనూ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. ఈసందర్భంగా ప్రశ్నల సరళి, మార్కుల కేటాయింపు, అన్సర్ బుక్లెట్ తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బోటనీ, జువాలజీ పేపర్లు వేర్వేరుగా ఉంటాయని తెలిపారు. వీటి ప్రశ్నాపత్రం 43, 42 మార్కులకు కేటాయించగా ద్వితీయ సంవత్సరంలో 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయని, రెండు సంవత్సరాలకు కలిపి 200 మార్కులకు పరీక్ష ఉంటుందని వివరించారు. మార్పులను గుర్తించి అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. మార్పులను విద్యార్థులకు వివరించి వారిని సన్నద్ధం చేయాలని తెలిపారు. పరీక్షల స్పెషల్ ఆఫీసర్ వి.వి.సుబ్బారావు, రమేష్, ఆర్జేడి జె.పద్మా, జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు టి.ప్రభాకర్, కె.వేణు, ఎస్ఎస్ అండ్ ఎన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాససాయి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణాధికారి సైమన్ విక్టర్ జూనియర్ ఇంటర్ పరీక్ష మార్పులపై అవగాహన సమావేశం -
13వ అదనపు జిల్లా కోర్టు ఏపీపీగా జీవీఎస్ ప్రసాద్
నరసరావుపేట టౌన్: 13వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఏపీపీగా పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది జీవీఎస్ ప్రసాద్‌ను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. నరసరావుపేటకు చెందిన ప్రసాద్ 1993–96 సంవత్సరంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రం అభ్యసించారు. 1997లో న్యాయవాదిగా నమోదై సీనియర్ న్యాయవాది సీహెచ్ఎల్ కాంతారావు వద్ద కొంతకాలం జూనియర్‌గా పనిచేశారు. జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. అరవిందబాబుకు షాక్.. అదనపు జిల్లా కోర్టు ఏపీపీగా పట్టణానికి చెందిన ఓ న్యాయవాదిని నియమించాలని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పట్టుబట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు సదరు న్యాయవాదిని వెంటబెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబును పలుమార్లు కలిశారు. సిఫారసు లేఖను సైతం అందజేశారు. బహిరంగ విలేకరుల సమావేశంలో కూడా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. అయితే అనూహ్యంగా ప్రభుత్వం జనసేనకు చెందిన ప్రసాద్‌ను ఏపీపీగా నియమించటం ఎమ్మెల్యే వర్గాన్ని షాక్ గురిచేసింది. -
21న సెంట్రల్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం
కొరిటెపాడు(గుంటూరు వెస్ట్): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఈ నెల 21వ తేదీన జరుపుకుంటోందని ఆ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాకేష్ రంజన్ తెలిపారు. అందులో భాగంగా మంగళవారం ‘భూమిని రక్షించండి.. ఆరోగ్యంగా ఉండండి’ అంటూ వాకథాన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ రంజన్ మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115వ వ్యవస్థాపక దినోత్సవానికి దారితీసే కార్యకలాపాలలో భాగంగా, కడప ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఆరోగ్యంగా ఉండండి, ఫిట్‌గా ఉండండి‘ అనే థీమ్‌తో ఫిట్నెస్ అవగాహన వాకథాన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. శారీరక ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి కడప ప్రాంతీయ కార్యాలయం, నగరపాలెం ప్రాంతంలో ఒక వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ అధిపతి ఇ. వెంకటేశ్వరరావు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగిందని ఆయన వివరించారు. -
అవసాన దశలో అష్టకష్టాలు
సత్తెనపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెన్షనర్లకు ఒక్క ఆర్థిక ప్రయోజనం కూడా చేకూరలేదు. నెల నెలా పెన్షన్ ఇస్తున్నాం కదా .. మిగిలిన ప్రయోజనాలు ఇవ్వడం ఎందుకు అనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డీఏలు పెండింగ్‌లో ఉండిపోయాయి. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) చెల్లింపులు లేవు. ఎర్న్లీవ్ల పేమెంట్లు పెండింగ్‌లో ఉండి పోయాయి. డీఎన్ఎస్ రిలీఫ్ కూడా పెండింగ్ లోనే ఉంది. కమిషన్ ఏర్పాటు చేసి .. సిఫార్సుల అమలు మరిచి.. 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షనర్ల కోసం పే–రివిజన్ కమిషన్ ఏర్పాటు చేశారు. మార్కెట్ ధరలను అధ్యయనం చేసి విశ్రాంత ఉద్యోగ సంఘాల నేతలతో సుదీర్ఘంగా చర్చించిన అప్పటి కమిషన్ సిఫార్సులను చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు. అదే సిఫార్సులను ఆ తరువాత అధికారం లోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసి తన ఉదారతను చాటుకున్నారు. తాజాగా పే–రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ఆ దిశగా ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. మెడికల్ రియింబర్స్‌మెంట్‌కు కూడా పెన్షనర్లు నోచుకోవడం లేదు. పెన్షనర్లు మరణిస్తే మట్టి ఖర్చులకు 24 గంటల్లో ట్రెజరీ అధికారులు రూ. 20 వేలు చెల్లించేవారు. మట్టి ఖర్చులకు ఇచ్చే ఆర్థిక సాయానికి కూడా నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. నేడు జాతీయ పెన్షనర్ల దినోత్సవం... ఏటా డిసెంబర్ 17న జాతీయ పెన్షనర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్‌తోనే సరిపెడుతున్న ప్రభుత్వం ఎర్న్ లీవ్‌ల పేమెంట్ కోసం పండుటాకుల ఎదురు చూపులు జీపీఎఫ్ ఇస్తే ఒట్టు ..మట్టి ఖర్చులకూ దిక్కులేదు మెడికల్ రీయింబర్స్మెంట్ ఊసే లేదు జిల్లాలో 10 వేల మంది విశ్రాంత ఉద్యోగులు నేడు జాతీయ పెన్షనర్ల దినోత్సవం పెన్షనర్లకు పెన్షన్ మినహా ఇతరత్రా ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదు. ముఖ్యంగా పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం పెంచాలి. ఐదేళ్లకోసారి పెన్షనర్ల కోసం పే–రివిజన్ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎర్న్లీవ్లకు పేమెంట్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, డీఏలు వెంటనే చెల్లించాలి. నాలుగు డీఏలకుగాను ఒక్క డీఏ చెల్లించారు. జనవరికి మరో డీఏ కలవనుంది. జిల్లా వ్యాప్తంగా 10 వేల మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. – చొప్పర చిన్న ఆదెయ్య, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, పల్నాడు -
మాతృ వందనం నమోదుకు కష్టాలు
సత్తెనపల్లి: జిల్లాలో ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై)అమల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సర్వర్‌తోపాటు సెల్ఫోన్లలో సాంకేతిక కారణాలతో గర్భిణులు, నవజాతి శిశువుల వివరాల నమోదు అరకొరగానే సాగుతోంది. నేటి వర కు 3,634మంది లబ్ధిదారులను మాత్రమే నమోదు చేశారు. ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో అంగన్వాడీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. మొదటి కాన్పుకు రూ. 5 వేలు... ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన మహిళలు గర్భం దాల్చిన సమయంలో, జన్మనిచ్చిన తరువాత పోషకాహారం, మందుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. మొదటి కాన్పు అయితే వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 5 వేలు జమ చేస్తారు. అందులో భాగంగానే గర్భిణిగా నమోదు చేసుకున్న సమయంలో రూ. 1,000, బిడ్డ జన్మించినప్పుడు రూ. 2 వేలు, బిడ్డకు టీకాలు వేయించటం పూర్తయిన సమయంలో మరో రూ. 2 వేలు అందిస్తారు. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే మరో రూ. 6 వేలు జమ చేస్తారు. అరకొరగానే నమోదు... ఈ పథకం అమలు కోసం ఐసీడీఎస్ ప్రాజెక్టులోని కొందరు సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. వారు మరికొందరు అంగన్వాడీ కార్యకర్తలకు కొంత మేర కు తర్ఫీదు ఇచ్చారు. వారి ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు చెందిన కార్యకర్తలు తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ల్లో యాప్‌లు వేసుకొని ఈ పథకం కింద లబ్ధిదారుల వివరాలను నమోదు చేసేందుకు ప్రయ త్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్ఫోన్లతో పాటు తమ వద్ద ఉన్న సెల్ఫోన్ల ద్వారా వివరాలను నమోదు కోసం ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదు. సర్వర్ తోపాటు సెల్ఫోన్లలో సాంకేతిక కారణాలు, దీనికి తోడు బ్యాంకుల్లో ఎర్రర్ సమస్యలు, ఆధార్, ఫోన్ నెంబర్ బ్యాంక్ ఖాతాలకు లింక్ కాకపోవడం వంటి కారణాలతో అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో గర్భిణులు మాతృ వందనం పథకం కింద అందే ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. -
పగలు రెక్కీ.. రాత్రిళ్లు చోరీ
నరసరావుపేట టౌన్: పగలు దుప్పట్లు విక్రయిస్తూ రెక్కీ నిర్వహించి తాళ్లాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు నరసరావుపేట ఇన్చార్జి డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన బైరా సుజాత గృహంలో దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి గృహంలోని 21 సెవర్ల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, వాచీలు, రూ.లక్ష నగదును ఈ ఏడాది నవంబర్ 28న దోచుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి చిలకలూరిపేట పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారన్నారు. ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా గుర్రాలచావిడి, పాత బాలాజీ సినిమా హాల్ దగ్గర సోమవారం సంచరిస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో పైనేరాన్ని వారే చేసినట్లుగా అంగీకరించారన్నారు. నిందితులు నూర్ హసన్, నొసద్, మిన్నా యామిన్, అబ్దుల్ గప్పార్, సాహుల్ జబ్బార్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 1,25,800 విలువైన చోరీ సొత్తును, దొంగతనానికి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన అనంతరం మిగిలిన సొత్తు రికవరీ కోసం పోలీస్ కస్టడీ కోరతామన్నారు. ఈ దొంగల ముఠాపై హర్యానా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, బీహార్, ఒడిశాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలో కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో ముఖ్యపాత్ర వహించిన చిలకలూరిపేట అర్బన్ సీఐ పి.రమేష్ , ఎస్ఐ హజరత్తయ్య, సిబ్బంది వై.శ్రీనివాస్, ఎస్.వణుకుమార్, వి.హరీష్, కె. శ్రీరాములు, వి.నారాయణరావు, జి.జాన్‌బాబు, కె.శివకృష్ణ, షేక్ జాన్‌బాషా సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
పీఎఫ్ రుణాలపై ఆడిట్ అభ్యంతరాలు తొలగించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: అత్యవసర ఖర్చుల కోసం ఉపాధ్యాయులు దాఖలు చేస్తున్న పీఎఫ్ రుణాల దరఖాస్తులను అసంబద్ధమైన ఆడిట్ అభ్యంతరాలతో తిరస్కరించడం మానుకోవాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.బసవ లింగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఆడిట్ అధికారి బి.మధురిమను గుంటూరులోని ఆడిట్ కార్యాలయంలో కలిసిన ఏపీటీఎఫ్ బృందం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తెచ్చారు. – బసవ లింగరావు మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ పాఠశాలల్లో వివిధ కేడర్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల అవసరాలకు ఉపయోగపడతాయని నెల నెలా పీఎఫ్‌లో దాచుకున్న సొమ్ము అనారోగ్య పరిస్థితుల్లో వైద్య చికిత్సల కోసం దాఖలు చేసుకున్న రుణ దరఖాస్తుల్లో రూ.ఐదు లక్షలు దాటితే అసిస్టెంట్ సివిల్ సర్జన్, మెడికల్ సర్టిఫికెట్ తేవాలని లేదంటే పీఎఫ్ దరఖాస్తును తిరస్కరిస్తున్నారని అన్నారు. ● పీఎఫ్ రుణాల మంజూరులో అర్థం లేని నిబంధనలు విధించడం తగదని, లేని నిబంధనలు చూపి దరఖాస్తులను ఏ విధంగా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. ఆడిట్ కార్యాలయం నుంచి లేవనెత్తుతున్న అభ్యంతరాలు పూర్తిగా విరుద్ధమన్నారు. ● ఎన్జీవోలకు వర్తించే నిబంధనలను ఉపాధ్యాయులకు అన్వయించడం సహేతుకం కాదని, కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏ మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి అయినా సర్టిఫికెట్ సమర్పిస్తే సరిపోతుందన్నారు. ● పీఎఫ్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక ఆందోళనలో ఉపాధ్యాయులు ఉన్న పరిస్థితుల్లో జెడ్పీ పీఎఫ్ విభాగం, జిల్లా ఆడిట్ కార్యాలయం ఒకరిపై ఒకరు చెప్పుకుని రుణ దరఖాస్తులను కొర్రీలు వేస్తూ, కాలయాపనతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ● ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ పీఎఫ్ రుణాలపై జెడ్పీ కార్యాలయ సిబ్బంది వ్యవహరిస్తున్న అసంబద్ధ విధానాలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ● రుణానికి దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులతో పాటు, ఉద్యోగ విరమణ అనంతర తుది చెల్లింపులకు ఉపాధ్యాయులకు ఫోన్ చేసి వ్యక్తిగతంగా కలవాలని చెబుతున్నారని, ఈ విధంగా ప్రవర్తించడ సరికాదన్నారు. ● జిల్లా ఆడిట్ అధికారి బి.మధురిమ స్పందిస్తూ ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆడిట్ అధికారిని కలసిన వారిలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి.నాగశివన్నారాయణ, జి.దాస్, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ యూ.వందనం, జిల్లా కౌన్సిలర్లు సయ్యద్ జహంగీర్, కృష్ణారావు, గురుమూర్తి, అప్పారావు, తదితరులు ఉన్నారు. ఏపీటీఎఫ్ డిమాండ్ -
నిర్ణీత సమయంలో ఫిర్యాదులు పరిష్కరించాలి
నరసరావుపేట రూరల్: నిర్ణీత సమయంలో ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ, పలు మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి పలు అంశాలకు సంబంధించిన 101 ఫిర్యాదులు అందాయి. పీజీఆర్ఎస్లో మహిళలు, వృద్ధులు ఇచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టితో వేగంగా విచారణ జరిపి చట్టప్రకారం న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. -
పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక
–నివాళులర్పించిన కలెక్టర్ నరసరావుపేట: తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ కృతికా శుక్లా కొనియాడారు. సోమవారం పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా పాల్గొన్నారు. దరఖాస్తులు పరిశీలించిన కలెక్టర్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో భాగంగా జిల్లాలో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కోసం ఇప్పటివరకు అందిన దరఖాస్తులను సోమవారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా డీపీఆర్ ప్రీలిమీనరీ వెరిఫికేషన్ నిర్వహించారు. జిల్లా రవాణా అధికారి సంజీవరావు, ఆర్డీఓ కె.మధులత పాల్గొన్నారు. లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారానికి జాతీయ స్థాయి పెన్షనర్ అదాలత్ ఉపయోగపడుతుందని డీఆర్ఎం సుథేష్ణసేన్ పేర్కొన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో జాతీయస్థాయిపెన్షన్ అదాలత్ కార్యాక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. పెన్షన్ అదాలత్‌ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో గుంటూరు డివిజన్ ముందుండి పనిచేస్తూ వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అనంతరం అదాలత్‌లో 19 ఫిర్యాదులు నమోదు కాగా, సంబంధిత విభాగాల అధికారుల సమన్వయంతో 10 ఫిర్యాదులు వేదిక వద్దనే పరిష్కరించారు. మిగిలిన వాటిని తక్షణమే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను డీఆర్ఎం ఆదేశించా రు. ఏడీఆర్ఎం, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్, సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ రెండవ సెమిస్టర్, ఆరవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్టు సోమవారం సీఈ ఆలపాటి శివప్రసాద్ వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన ఎల్ఎల్బీ రెండవ సెమిస్టర్, ఆరవ సెమిస్టర్ రెగ్యులర్‌కు 1044 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 755 మంది ఉత్తీర్ణులయ్యారు. అలానే ఎల్ఎల్బీ రెండవ సెమిస్టర్ రెగ్యులర్‌కు 550 మంది హాజరు కాగా వారిలో 479 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 27 లోగా పీజీ కో–ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కు రూ. 2070 చొప్పున చెల్లించాలన్నారు. పర్సనల్ వెరిఫికేషన్ జిరాక్స్ ఆన్సర్ బుక్లెట్ ఫీజు రూ. 2190 చెల్లించాలని తెలియజేశారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణం నాంచారమ్మ ప్రాంగణంలో ఉన్న శ్రీ భద్రావతి సమేత భావనా ఋషి స్వామివార్ల దేవాలయంలో సోమవారం పల్నాడు జిల్లా రెంటచింతల మండలం సత్రశాల శ్రీ భక్తమార్కండేయ పద్మశాలీ అన్నదాన సేవా సంఘం కమిటీ ముద్రించిన 2026 క్యాలెండర్‌ను అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పండుగ వేళల్లో ధార్మిక సత్రాల ద్వారా భక్తులకు సేవలు చేసే భాగ్యం రావడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో అన్నదాన సేవా సంఘం గౌరవ అధ్యక్షులు చిన్నవీరయ్య, మాజీ కౌన్సిలర్ బట్టు సదానంద శాస్త్రి, సత్రం అధ్యక్షులు వెంకట కోటయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటీకరణ దుర్మార్గం
ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో మెరిట్ విద్యార్థులకు ఫ్రీ సీట్లు వస్తాయి. పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేందుకు వీలు ఉంటుంది. ప్రైవేటు కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా రూ.20 లక్షలు, డొనేషన్ రూ.50 లక్షలు ఉంటుంది. ప్రభుత్వ పరంగా హాస్పిటళ్లు నిర్వహిస్తే పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం లభిస్తుంది. ప్రైవేటు హాస్పిటళ్లు అయితే పేదలపై విపరీతమైన భారం ఉంటుంది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వమే కళాశాలలను నిర్వహించాలి. –డాక్టర్ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షులు, వైఎస్సార్ సీపీ డాక్టర్ల విభాగం -
సాగర్‌లో ఆక్టోపస్ మాక్ డ్రిల్
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో సోమవారం ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఇటీవల కాలంలో దేశంలోని ప్రముఖ ప్రదేశాలలో ఉగ్రవాద మూకల కదలికల దృష్ట్యా ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా ఆక్టోపస్ దళాల డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సాగర్‌లోని ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పరిసర ప్రాంతాలు, పవర్ హౌస్ లోపలి భాగంలో ఉగ్రవాదులు చొరబడితే అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏవిధంగా స్పందించాలి, ఆక్టోపస్ బలగాలకు సమాచారం అందిన వెంటనే బలగాలు ఏవిధంగా ఎదుర్కోవాలి, ఎటువంటి ప్రత్యేక కోడ్లతో ఆపరేషన్ నిర్వహించాలనే అనే విషయంలో సంఘటన జరుగుతున్నట్లుగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ విధంగానే నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ పరిసర ప్రాంతాలలో ఉగ్రవాదుల సంచారం, ఉగ్రవాదులు డ్యామ్‌పైకి ప్రవేశించే సందర్భాలలో, సాగర్ డ్యాం పరిధిలోని సున్నితమైన విభాగాలలో ఉగ్రదాడిని ఎదుర్కొనే సంఘటనలను ఆక్టోపస్ దళాలు డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులను ఎదుర్కొనే సందర్భంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్సులు, మంటలు చెలరేగితే ఆపటానికి అగ్నిమాపక వాహనాలు నిజంగానే ఉగ్రవాదులను ఆక్టోపస్ దళాలు ఎదుర్కొంటున్నట్టుగా వ్యవహరించారు. మాక్ డ్రిల్ లో ఎస్పీఎఫ్ ఉన్నత అధికారులు, తెలంగాణ పోలీస్ అధికారులు, సీఆర్పీఎఫ్ దళాలు, ఎస్పీఎఫ్ దళాలు పాల్గొన్నాయి. -
వైఎస్సార్ సీపీ వర్గీయులపై టీడీపీ నాయకుల దాడి
మంచికల్లు(రెంటచింతల): మంచికల్లు గ్రామంలో సోమవారం సాయంత్రం వైఎస్సార్ సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పొలం వెళ్లి ఇంటికి వస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు పొట్లపాటి శ్రీనివాసరెడ్డితోపాటు తన ఇంటి ముందున్న వెన్నా శ్రీనివాసరెడ్డిని ఆయన తమ్ముడు కొడుకు వెంకటరెడ్డిపై టీడీపీకి చెందిన వారు ఒక్కసారిగా కర్రలతో దాడిచేశారు. దాడిలో వెంకటరెడ్డి రెండు చేతులకు తీవ్రగాయాలు కాగా వెంటనే నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పొట్లపాటి శ్రీనివాసరెడ్డికి, వెన్నా శ్రీనివాసరెడ్డిలకు స్పల్ప గాయాలయ్యాయి. ఘర్షణ జరిగిన విషయం తెలుకున్న వెన్నా శ్రీకాంత్‌రెడ్డి భార్య ఇప్పుడు గొడవలు ఎందుకు పడుతున్నారని వీధిలో అన్నందుకు కొందరు టీడీపీ వారు ఆమె ఇంటిపైకి వెళ్లి ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం గ్రామంలోని వైఎస్సార్ సీపీకి చెందిన సుమారు 35 కుటుంబాలు గ్రామం విడిచి వివిధ ప్రాంతాలలో తల దాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురజాల డీఎస్సీ జగదీష్ ఆదేశాల మేరకు ఎస్ఐ సీహెచ్ నాగార్జున ఈ నెల 11వ తేదీన వైఎస్సార్ సీపీకి చెందిన 27 మందిని తహసీల్దార్ మేరి కనకం ఎదుట బైండోవర్ చేసి గ్రామంలో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండాలని గ్రామంలోకి వెళ్లమని చెప్పడంతో వారు గ్రామంలోకి వచ్చారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనడానికి పోలీసులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ముహూర్తాలకు తాత్కాలిక శుభం కార్డు!
ఖాళీగా కల్యాణ మండపాలు వెలవెలబోతున్న వ్యాపారాలు ఉపాధి నిల్ 52 రోజులపాటు శుభ ముహూర్తాలు లేవు వ్యాపారాలు వెలవెల పురోహితులకు తగ్గిన ఆదాయం కళాకారులకు, కూలీలకు ఉపాధి కరువు ప్రస్తుతం 52 రోజులపాటు ఎటువంటి శుభ ముహూర్తాలు లేక పోవడంతో కల్యాణ మండపా లు వెలవెలబోతున్నాయి. వివాహాలతోపాటు గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, నిశ్చితార్థాలు, అన్నప్రాసన, ఉపనయనం వంటి శుభకార్యాలకు శుభముహూర్తాలు లేక అనేక మంది కళాకారులు, కార్మికులు, కూలీలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు.– పరాశరం రామకృష్ణమాచార్యులు, పురోహితుడు, అమరావతి – తోట ఆనంద్‌కుమార్, డెకరేషన్, టెంట్‌హౌస్ వ్యాపారి, అమరావతి -
ఆర్బీఎస్కె కార్యక్రమం త్వరితగతిన పూర్తిచేయాలి
పల్నాడు జిల్లా రాష్ట్రీయ బాలస్వాస్య అధికారి రాజేశ్వరి నకరికల్లు: విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నందున ఆర్బీఎస్కె కార్యక్రమం త్వరితగతిన పూర్తిచేయాలని పల్నాడు జిల్లా రాష్ట్రీయ బాలస్వాస్య అధికారి రాజేశ్వరి ఆదేశించారు. మండలంలోని కుంకలగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం తనిఖీలు చేపట్టారు. రికార్డులు పరిశీలించారు. ఆర్బీఎస్కె పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, ఎన్‌సిడిసిడి కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. ఎన్‌సిడిసిడి సర్వే పురోగతిలేని సామాజిక ఆరోగ్య అధికారులకు స్వయంగా ఫోన్‌చేసి కారణాలు అడిగి తెలుసుకొని సర్వే వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ 4డిలను జిల్లా డీఐఈసీ సెంటర్‌కు సిఫార్సు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.పూజాశ్రీ, ఆరోగ్య విస్తరణాధికారి కె.వెంకటేశ్వర్లు, ఆరోగ్య పర్యవేక్షకుడు షేక్.కరిముల్లా, స్టాఫ్ నర్స్ హసీనాబేగం, ఫార్మాసిస్ట్ కల్పన, సిబ్బంది పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక
నరసరావుపేటలో నిర్వహించిన ర్యాలీకి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి స్వచ్ఛందంగా వేలాది మంది తరలివచ్చారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య. మెడికల్ కళాశాలలను ప్రైవేటు వారికి అప్పగించి సిబ్బంది జీతా లు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు, తన మనషుల జేబులు నింపుకునే కార్యక్రమంలో భాగంగానే ప్రైవేటీకరణ విధానానికి తెరదీశారు. మెడికల్ కళాశాల ల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. రానున్నరోజుల్లో ప్రభుత్వానికి బుద్ధిచెబుతారు. –డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త. -
పల్నాడు
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1200, గరిష్ట ధర రూ.1800, మోడల్ ధర రూ.1500 వరకు పలికింది. 9విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 572.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 50,710 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి విడుదల నిలిచింది. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 42.0293 టీఎంసీలు. -
ప్రత్యేక దృష్టితో అర్జీలు పరిష్కరించండి
నరసరావుపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారు ఇచ్చిన అర్జీలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా అధికారులతో కలిసి 112 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఆయా శాఖల పరిధిలో పీజీఆర్ఎస్ గ్రీవెనన్స్‌పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తిచేయాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొంతమంది దివ్వాంగులు తమకు పింఛన్‌ను పెంపుదల, తదితర సమస్యలతో వచ్చిన వారి వద్దకు స్వయంగా వచ్చి అర్జీలు స్వీకరించారు. అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దుచేయండి సర్వే నంబరు 818లో 6.5 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు రాళ్ల గుట్ట భూమి ఉండగా 1921 నుంచి 2019 వరకు 58 మందికి అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. ఆ రిజిస్ట్రేషన్లు రద్దుచేసి అంతకు ముందు ఆ భూమిని ఎవరికై తే కేటాయించారో వారి హక్కుదారులకు అందజేయాలి. –దుగ్గి రాంబాబు, కొత్త గణేశునిపాడు, మాచవరం మండలం పొలం ఆక్రమించి చేపల చెరువు చేశారు నాకు 2.46 ఎకరాల డీకే పట్టా భూమి ఉంది. 2019లో ఏ.వెంకటరెడ్డి నా పొలాన్ని ఆక్రమించి దొంగ సర్వే నెంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. చేపల చెరువు చేస్తున్నాడు. అదేమని ప్రశ్నించిన నా భర్త, కుమారుడిపై తప్పుడు కేసులు పెట్టి పోలీసుస్టేషన్ చుట్టూ తిప్పాడు. ఆ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దుచేసి నా పొలం నాకు ఇప్పించండి. –అంబటి సుధాకర్నగర్, నూజెండ్ల మండలం -
రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
సత్తెనపల్లి: పౌర హక్కుల సంఘం రాష్ట్ర 20వ మహాసభలను జయప్రదం చేయాలని పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. సత్తెనపల్లిలోని బస్టాండ్ సెంటర్లో పౌర హక్కుల సంఘం రాష్ట్ర 20వ మహసభల కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ ఐదు దశాబ్దాలుగా పౌర హక్కుల సంఘం పీడిత ప్రజల హక్కుల కోసం ఉద్యమించే క్రమంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొటుందన్నారు. సంఘం సీనియర్ నాయకులను రాజ్య హింసలో కోల్పోయి కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం సందర్భంలో నేడు పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ 20వ రాష్ట్ర మహాసభలను 2026వ సంవత్సరం జనవరి 10, 11 తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తున్నామన్నారు. పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు వి.ప్రభాకర్, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి శిఖినం చిన్న, పౌరహక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి వినుకొండ పేరయ్య మాట్లాడారు. పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు -
ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిల్లో జిల్లాకు స్థానం
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర నూతన కార్యవర్గంలో పల్నాడు జిల్లాకు సముచిత స్థానం లభించినట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏ.ఏమండి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించిన 79వ ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారన్నారు. రాష్ట్ర కౌన్సిల్లో పల్నాడు జిల్లా నుంచి రాష్ట్ర కార్యదర్శిగా సీహెచ్.అనిల్‌కుమార్, ఉపాధ్యక్షులుగా యూ.చంద్రజిత్‌యాదవ్, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యునిగా షేక్ కరిముల్లా, అసోసియేట్ అధ్యక్షునిగా జె.గంగాధరబాబు, ఆర్థిక కార్యదర్శిగా కె.కోటేశ్వరరావులను ఎన్నుకున్నారని వివరించారు. పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం ఇస్తూ పాల్గొన్న ఎస్టీయూ ప్రతినిధులకు పల్నాడు జిల్లా శాఖ కృతజ్ఞతలు తెలిపింది. కౌన్సిల్ సమావేశానికి జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులతోపాటు ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్.జోసఫ్ సుధీర్‌బాబు, జిల్లా ఆర్థిక కార్యదర్శి షేక్ మహబూబ్ సుభాని, గౌరవాధ్యక్షుడు కె.ఏసయ్య తదితరులు పాల్గొన్నారని తెలిపారు. -
నిరసన గళం
పల్నాడు నుంచి కోటి సంతకాల ప్రతులు తాడేపల్లి తరలింపు ● జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన జిల్లా నేతలు ● పార్టీ జిల్లా కార్యాలయం నుంచి నరసరావుపేట శివారు వరకు భారీ ర్యాలీ ● పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ● మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు ● చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తప్పుపట్టిన నేతలు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా 4 లక్షల 37వేల సంతకాలు సేకరించి తాడేపల్లి రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తున్నాం. రాజకీయాలకతీతంగా టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్త లు కోటి సంతకాల ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది ఓటర్లు ఉంటే కోటి మంది మెడికల్ కళాశాలలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలుచేయడం విశేషం. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కూటమి పాలనలో దోపిడీ తప్ప అభివృద్ధి లేదు. కోటి సంతకాల సేకరణ సూపర్ హిట్...కూటమి ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్. –డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే సాక్షి, నరసరావుపేట/నరసరావుపేటరూరల్: ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 4.37 లక్షల సంతకాలు సేకరించారు. ఆ పత్రాలను జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి సోమవారం తరలించారు. జిల్లా నేతలు జెండా ఊపి సంతకాల పత్రాలు ఉన్న వాహనాన్ని ప్రారంభించారు. లింగంగుంట్లలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి నరసరావుపేట శివారులోని ఎస్ఆర్కేటీ జంక్షన్ వరకు కార్లు, బైక్‌ల ర్యాలీ సాగింది. లింగంగుంట్ల ప్రభుత్వ ఆసుపత్రి, పాత పోస్టాఫీస్, పల్నాడు చెక్‌పోస్ట్, పల్నాడు బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా ర్యాలీగా సాగింది. నేతలు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, మాట్లాడారు. అనంతరం మల్లమ్మ సెంటర్, చిలకలూరిపేట ప్లైఓవర్ మీదుగా ఎస్ఆర్కేటీ జంక్షన్లో బత్తిన గార్డెన్స్ వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో ముఖ్యంగా యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడదల రజిని, కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, గజ్జెల సుధీర్ భార్గవ్‌రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు పూనూరు గౌతమ్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు ఎనుమల మురళీధర్‌రెడ్డి, పడాల శివారెడ్డి, గుత్తికొండ అంజిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జునయాదవ్, సీనియర్ నాయకులు కేవీ, చిట్టా విజయభాస్కర్‌రెడ్డి, రోళ్ల మాధవి, పీఎస్ ఖాన్, గంటెనపాటి గాబ్రియేలు, కె.బ్రహ్మారెడ్డి, పాలపర్తి వెంకటేశ్వరరావు, పడాల చక్రారెడ్డి, కొమ్ము చంద్రశేఖర్, డాక్టర్ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కందుల శ్రీకాంత్, గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్, మనీంద్రరెడ్డి, అన్నెం పున్నారెడ్డి, అన్నా మోహన్, హెల్డా ప్లారెన్స్, బొగ్గరం మూర్తి, రమావత్ జాన్పాల్నాయక్, బి.శ్రీలక్ష్మి, పొన్నపాటి విజయకష్ణారెడ్డి పాల్గొన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగనన్న ఇచ్చిన కోటి సంతకాల సేకరణ పిలుపులో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థులు రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే. మెడికల్ సీట్లు లభించటమే కష్టతరంగా మారుతుంది. –కొమ్ము చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం మెడికల్ కళాశాలల వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు చాలా బాధాకరం. ప్రజల నిర్ణయాన్ని గౌరవించైనా ముఖ్యమంత్రి చంద్రబాబు పీపీపీ విధానాన్ని ఉపసంహరిస్తే బాగుంటుంది. ఇక్కడ మెడికల్ సీట్లు లభించక ఇతర రాష్ట్రాలు, దేశాలకు విద్యార్థులు తరలి వెళుతున్నారు. అదే 17 మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వస్తే సీట్లు సులభంగా లభించటంతోపాటు పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. –ఏరువ కోటిరెడ్డి, విద్యావేత్త, నరసరావుపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై జిల్లా ప్రజలు నిరసన గళం వినిపించారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు కోటి సంతకాల సేకరణ జిల్లా వ్యాప్తంగా ఉవ్వెత్తున సాగింది. విద్యావంతులు, వ్యాపారు లు, యువకులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రభుత్వం తీరును నిరసిస్తూ సంతకాలు చేశారు. సంతకాల ప్రతులను తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయానికి తరలింపు సందర్భంగా సోమవారం నరసరావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ చేసిన నినాదాలతో పట్టణ వీధులన్నీ మారుమ్రోగాయి. పేదలకు వైద్యం, విద్య అందించాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు తీసుకువచ్చారు. ఆయా కళాశాలలను చంద్రబాబు తన శిష్యులకు అమ్ముకుని పేదల నుంచి లక్షలు వసూలు చేసేందుకు కుట్ర చేస్తున్నాడు. ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఎంత? పోతే ఎంత? మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడు నెలల నుంచి ప్రజాఉద్యమం చేపట్టాం. నిరంకుశ పాలన కొనసాగిస్తున్న చంద్రబాబు దిగివచ్చి ప్రైవేటీకరణను అపాలి. లంచాలు తీసుకుని మెడికల్ కళాశాలలను అమ్ముకున్నా రెండున్నర సంవత్సరాల్లో జగనన్న మరలా అధికారంలోకి వచ్చి ప్రభుత్వ పరం చేస్తాడు. –కాసు మహేష్‌రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే -
రైల్వే వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో డివిజన్‌కు రజత పతకం
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈనెల 3వ తేదీ నుంచి 6 వరకు నిర్వహించిన ఆల్ ఇండియా రైల్వే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్లో గుంటూరు రైల్వే డివిజన్లో కమర్షియల్ క్లర్క్ కమ్ టిక్కెట్ క్లర్క్ ఎ.శివరామకృష్ణ యాదవ్ రజత పతకం దక్కించుకోవడం అభినందనీయం అని డివిజన్ డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో వెండి పతకం దక్కించుకున్న శివరామకృష్ణ యాదవ్‌ను సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ తూర్పు కోస్ట్ రైల్వే, విశాఖపట్నంలో చాంపియన్‌షిప్ నిర్వహించడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేలకు చెందిన వెయిట్ లిఫ్టర్లు ఈ పోటీల్లో పాల్గొనగా 88 కిలలో విభాగంలో గుంటూరు డివిజన్‌కు చెందిన ఉద్యోగి శివరామకృష్ణ యాదవ్ వెండి పతకం కై వసం చేసుకోవడం అభినందనీయమన్నారు. డివిజన్ ఉద్యోగులు క్రీడల్లో చురుగ్గా పాల్గొని, డివిజన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావాల్సిందిగా కోరారు. -
బియ్యం లారీ బోల్తా
రెంటచింతల: మండలంలోని పాలువాయి జంక్షన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నుంచి బెంగుళూరుకు 600 బస్తాల లోడుతో వెళ్తున్న లారీకి ఎదురుగా వాహనం రావడంతో డ్రైవర్ పఠాన్ దస్తగిరి సడన్‌గా బ్రేక్ వేయడం వలన లారీ బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ దస్తగిరికి గాయాలు కాగా వెంటనే 108 అంబులెన్స్‌లో మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెనాలిఅర్బన్: దళితుడుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ఉన్నం ధర్మారావు డిమాండ్ చేశారు. చుండూరు మండలం వలివేరు దళితవాడకు చెందిన పందిపాటి రెడ్డియ్యపై దాడికి నిరసనగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఆదివారం ఎమ్మార్పీఎస్ నాయకులు కొద్దిసేపు ఆందోళన చేశారు. ముందుగా బాధితుడిని పరామర్శించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు వేమూరు(చుండూరు): వలివేరు గ్రామానికి చెందిన అప్పిరెడ్డి, సందీప్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం ఆనందరావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం చుండూరు మండలంలోని వలివేరు గ్రామానికి చెందిన పందిపాటి రెడ్డియ్య ట్రాక్టర్ ట్రక్కు వెనుక భాగం అప్పిరెడ్డి ఇంటి ప్రహారీకి తగిలింది. ఇద్దరు మధ్య వివాదం చోటుచేసుకుంది. అప్పిరెడ్డి, కుమారుడు సందీప్ కోపంతో పందిపాటి రెడ్డియ్యపై శుక్రవారం దాడి చేశాడు. బాధితుడు తెనాలి ప్రభుత్వం వైద్య శాలల్లో చికిత్స పొందుతున్నాడు. శనివారం ఆసుపత్రి అవుట్ పోలీసులు కేసు చుండూరు పోలీసు స్టేషన్‌కు పంపించడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు లక్ష్మీపురం(గుంటూరు పశ్చిమ): సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు కేటాయించినట్లు డివిజన్ పీఆర్ఓ వినయ్‌కాంత్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికారాబాద్ – కాకినాడ టౌన్ (07264), సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07261), సికింద్రాబాద్ – నరసాపూర్ (07239) రైళ్లు జనవరి 9వ తేదీన, వికారాబాద్ – నరసాపూర్ (07211) జనవరి 10న, సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07280), సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07261), వికారాబాద్ – నరసాపూర్ (07249) రైళ్లు జనవరి 11న, వికారాబాద్ – నరసాపూర్ (07211), వికారాబాద్–నరసాపూర్(07253) జనవరి 12 వ తేదీన, సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07261) జనవరి 13న కేటాయించినట్లు తెలిపారు. కాకినాడ టౌన్ – వికారాబాద్( 07263) జనవరి 8న, నరసాపూర్–వికారాబాద్ (07250) జనవరి 9న, కాకినాడ టౌన్ –సికింద్రాబాద్ (07279), కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07262), నరసాపూర్ – వికారాబాద్ (07248) రైలు జనవరి 10న, నరసాపూర్ – వికారాబాద్ (07250) జనవరి 11న, కాకినాడ టౌన్ –వికారాబాద్(07262), నరసాపూర్–వికారాబాద్ (07248) జనవరి 12న, నరసాపూర్–వికారాబాద్ (07257), కాకినాడ టౌన్–వికారాబాద్ (07241) రైలు జనవరి 17న, నరసాపూర్–వికారాబాద్ (07259) రైలు జనవరి 18న, కాకినాడ టౌన్–వికారాబాద్ (07285) రైలు జనవరి 19న గుంటూరు డివిజన్ మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు నగరంపాలెం: జిల్లాలో ఈవ్‌టీజింగ్‌పై 332 మందికి అవగాహన కల్పించినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రహదారులపై అనవసరంగా సంచరిస్తున్న కొందరి ఆకతాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు. ఈవ్‌టీజింగ్‌ను సహించేదిలేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. జిల్లాలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, వ్యాపార కూడళ్లు, రద్దీ ప్రదేశాల్లో ప్రత్యేక గస్తీ, ఆకస్మిక తనిఖీలు చేపట్టారని అన్నారు. -
పిన్నెల్లి సోదరుల అరెస్టుపై నిరసన
కూకట్పల్లి: మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కుట్రపూరిత కేసులు పెడుతున్నారని కేపీహెచ్‌బీ టెంపుల్ బస్‌స్టాప్‌లో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆదివారం నిరసన వ్యక్తం చేశాయి. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులపై కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని, పిన్నెల్లి సోదరులపై పెట్టిన అక్రమ కేసులను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్ల కార్డులతో నల్ల కండువాలు వేసుకుని కేపీహెచ్‌బీ బస్‌స్టాప్ సెంటర్లో బైఠాయించారు. కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి, శ్యామల, వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి మల్లు సురేంద్రరెడ్డి, స్పోక్స్ పర్సన్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొని కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద 18 నెలల కాలంలో 16 అక్రమ కేసులు పెట్టారని, నాలుగుసార్లు వరుసగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కావాలని అక్రమంగా కేసులు పెట్టడం సిగ్గు చేటన్నారు. టీడీపీకి చెందిన రెండు వర్గాల వాళ్లు పాత గొడవల నేపథ్యంలో చంపుకుంటే దాన్ని స్వయానా జిల్లా ఎస్పీ మీడియా ముఖంగా చెప్పినా కూడా ఆ కేసుని కూడా పిన్నెల్లిపై మోపి జైలుకి పంపడం చూస్తుంటే ఒక చెడు సంప్రదాయం అనే విత్తుని నాటారని దానికి ముగింపు ఎలా ఉంటుందో రానున్న రోజుల్లో వైఎస్సార్ సీపీ చూపిస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు వుయ్ స్టాండ్ విత్ పిన్నెల్లి బ్రదర్స్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో శివారెడ్డి, మధుసూదనరెడ్డి, కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో సోమవారం నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయండి. పార్టీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల పత్రాలను లింగంగుంట్లలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి నేడు తరలించనున్నాం. ఉదయం 10 గంటలకు నాయకులు, కార్యకర్తలు, అన్ని విభాగాల అధ్యక్షులు, పార్టీ అభిమానులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు జిల్లా కార్యాలయానికి చేరుకొని, అక్కడి నుంచి నిర్వహించే ర్యాలీలో భారీగా పాల్గొని విజయవంతం చేయండి. చంద్రబాబు సర్కారు తీరుపై వ్యతిరేకత చాటాలి. – డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. దీన్ని కొనసాగించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేసి పేదలకు, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వ వైద్యం, వైద్య విద్యను దూరం చేస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ పేద, మధ్య తరగతి కుటుంబాలకు మంచి జరగాలనే ఉద్దేశంతో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం తుది దశకు చేరింది. ఇప్పటికే జిల్లా కేంద్రానికి నియోజకవర్గాల నుంచి సంతకాల పత్రాలు తరలించాం. నేడు జరగబోయే ర్యాలీ ద్వారా కేంద్ర కార్యాలయానికి పత్రాలు చేరనున్నాయి. జయపద్రం చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు ప్రజాసంఘాలు, సామాజిక వేత్తలను కోరుతున్నాం. – విడదల రజిని, మాజీ మంత్రి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేక ఉద్యమంలో భాగంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల పత్రాలను నేడు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద, బడుగు బలహీన వర్గాల కోసం 17 వైద్య కళాశాలలను తీసుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఆ కళాశాలల ప్రైవేటీకరణకు ప్రయత్నించడం దారుణం. నేటి భారీ ర్యాలీని విజయవంతం చేయాలని గురజాల నియోజకవర్గంతోపాటు జిల్లా వైఎస్సార్సీపీ కుటుంబానికి ఆహ్వానిస్తున్నా. ప్రజాఉద్యమాన్ని చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోలేదు. – కాసు మహేష్‌రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే -
ప్రజా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేద్దాం
చిలకలూరిపేట: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలని మాజీ మంత్రి విడదల రజిని పిలుపు నిచ్చారు. పట్టణంలోని ఎన్ఆర్టీ రోడ్డులో ఉన్న తన నివాసంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం నిర్వహించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల ఉద్యమం చేపట్టిన విషయం విదితమేనన్నారు. ఇప్పటికే చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో సేకరించిన 63,511 సంతకాల ప్రతులను జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు పంపడం జరిగిందన్నారు. అలా పంపిన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రతులను సోమవారం నరసరావుపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం జరుగుతుందన్నారు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యంతో పాటు వారి పిల్లలకు వైద్య విద్యను అందించేందుకు జగనన్న ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్య ప్రతి ఒక్కరిదిగా భావించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతనిధులు భారీగా తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టణ, చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాల అధ్యక్షులు షేక్ దరియావలి, దేవినేని శంకరరావు, వడ్డేపల్లి నరసింహరావు, మంగు ఏడుకొండలు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, నాయకులు కొప్పురావూరి పటేల్, రాచమంటి చింతారావు, అప్పాపురం షేక్ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ మాజీ మంత్రి విడదల రజిని -
ప్రైవేటుపరంపై నిరసన గళం
పేదల జీవితాలను నాశనం చేసేలా చంద్రబాబు సర్కారు చేస్తున్న కుట్రలపై ప్రజా ‘సంతకమే’ సమర శంఖం మోగించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఉన్న వ్యతిరేకత ప్రజాగళమై గర్జించింది. పేదల సొమ్మును పెత్తందారుల చేతిలో పెట్టనున్న చంద్రబాబు ప్రభుత్వంపై పోరుకు నాంది పలికింది. వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అన్ని వర్గాల నుంచి లభించిన అనూహ్య మద్దతుతో కార్యక్రమం విజయవంతమైంది. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాల పత్రాలను భారీ ర్యాలీల నడుమ తరలించనున్నారు. సాక్షి, నరసరావుపేట : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైద్య కళాశాలను పీపీపీ పేరుతో ప్రైవేట్‌పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం తుది దశకు చేరింది. ఇప్పటికే జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో సేకరించిన కోటి సంతకాల పత్రాలను జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయానికి తరలించారు. నేడు ఆ పత్రాలను భారీ ర్యాలీగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నేతలు, కార్యకర్తలు, ప్రజలు హాజరుకానున్నారు. దీన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ సమన్వయకర్తలు పిలుపునిచ్చారు. అనూహ్య మద్దతు జిల్లాలోని వినుకొండ, మాచర్ల, గురజాల, చిలకలూరిపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలలో ఇప్పటికే 4.30 లక్షలకుపైగా సంతకాలు పూర్తి అయ్యాయి. ఆయా నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో నేడు నరసరావుపేటలో జరిగే ర్యాలీకు హాజరుకానున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు వైద్యవిద్య కలను నిజం చేయాలన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నడూ లేనివిధంగా 17 మెడికల్ కళాశాలను ప్రవేశపెట్టారు. ఇవి ప్రారంభిస్తే అక్కడి వైద్యశాలల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందుబాటులోకి వచ్చేది. అయితే వారి పేద, మధ్య తరగతి ప్రజల ఆశలను చంద్రబాబు ప్రభుత్వం సమాధి చేస్తోంది. తక్కువ ఖర్చుతోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డాక్టర్ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. నియోజకవర్గం సంతకాల సంఖ్య మాచర్ల 72,452 గురజాల 51,326 సత్తెనపల్లి 66,507 పెదకూరపాడు 50,500 నరసరావుపేట 62,500 చిలకలూరిపేట 63,511 వినుకొండ 63,500 మొత్తం 4,30,296 -
పిన్నెల్లి సోదరులపై కక్ష సాధింపు చర్యలు
యడ్లపాడు: గుండ్లపాడు జంట హత్యల కేసులో టీడీపీలోని గ్రూపు తగాదాలే కారణమని అప్పటి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గతంలో ప్రకటించినప్పటికీ, ఈ కేసులో సంబంధం లేని పిన్నెల్లి సోదరులు రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిలపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమని వైఎస్సార్సీపీ రాష్ట్రరైతు కార్యదర్శి మద్దూరి విజయబాల చంద్రారెడ్డి, పార్టీ ఉమ్మడి గుంటూరు–కృష్ణా జిల్లాల ఐటీ విభాగం రీజినల్ కో–ఆర్డినేటర్ పాలూరి అంజిరెడ్డిలు పేర్కొన్నారు. యడ్లపాడు మండలం సొలస గ్రామంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. బాధితులు ఒక వివాహం నుంచి తిరిగి వస్తున్నప్పుడు, నిందితులు స్కార్పియో కారులో వచ్చి వారి బైక్‌ను ఢీకొట్టి, రాళ్లతో కొట్టి చంపారని, ఈ హత్యలకు సంబంధం లేని పిన్నెల్లి సోదరులపై చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపులకు దిగుతోందని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పటివరకు 16 తప్పుడు కేసులు పెట్టినట్లు తెలిపారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న రామకృష్ణారెడ్డి బెయిల్ రద్దు కారణంగా కేవలం 21 రోజుల్లోనే మాల విరమించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. వారివెంట గుండ్లకుంట కోటిరెడ్డి, మద్దూరి సంజీవరెడ్డి, గండు వెంకటప్పయ్య, సుంకిరెడ్డి పుల్లారెడ్డి, గొట్టం హన్మంతు, పెరవలి శివకోటి, బొజ్జా శివకోటి, వెలుతుర్ల రోసిరెడ్డి, మంచా నవీన్, కారుచోల రామూర్తి, జిటిక నాని, విప్పర్ల దాసు, చలమచెర్ల వెంకట సుబ్బారావు, గొట్టం శంకర్ తదితరులు ఉన్నారు.వైఎస్సార్ సీపీ నేతలు మద్దూరి విజయబాల చంద్రారెడ్డి, పాలూరి అంజిరెడ్డి -
ఆడియాలజిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ శిరీష
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెతాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా గుంటూరుకు చెందిన డాక్టర్ ఆర్.శిరీషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గుంటూరు కొత్తపేటలోని సంఘ కార్యాలయంలో కార్యవర్గ ఎన్నిక జరిగింది. సంఘ రాష్ట్ర సెక్రటరీగా డాక్టర్ బి.ప్రకాశం, ట్రెజరర్‌గా డాక్టర్ సిహెచ్.సుజిత ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఏపీలోని పలు ప్రాంతాల్లో అనధికారికంగా స్పీచ్ థెరిఫీ సెంటర్లు నడుపుతున్నారని చెప్పారు. మాట, ప్రవర్తన లోపాలు ఉన్న పిల్లల తల్లిదండ్రుల నుంచి అనాధికార స్పీచ్ సెంటర్ల నిర్వాహకులు నెలకు రూ. 25 నుంచి రూ.30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లలకు సరైన పద్ధతుల్లో స్పీచ్ థెరఫీ అందిచలేకపోతున్నారని, వేలల్లో ఫీజులు దండుకుంటున్నారని వాపోయారు. ప్రభుత్వం అనధికార ఫీజు సెంటర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినికిడి లోపం ఉన్న వారి పిల్లల తల్లిదండ్రులు నిపుణులైన ఆడియాలజిస్ట్లను సంప్రదించి వారి పర్యవేక్షణలోనే వినికిడి యంత్రాలు వినియోగించాలని సూచించారు. సమావేశంలో సంఘ సభ్యులు మోహన్‌కుమార్, లావణ్య, క్రిష్టాఫర్, శ్రీను నాయక్, తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ కేసులో పురోగతి పట్నంబజారు: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మైనర్ బాలిక డ్రగ్స్ సేవించిన కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. తెలిసిన సమాచారం వరకు... గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్లోని లాలాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోనీ చిన్న బజార్లో నివాసం ఉండే.. ఇంటర్మీడియెట్ అభ్యసిస్తున్న ఒక మైనర్ బాలికను ఇతర యువకులు ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పరిచయమై డ్రగ్స్‌కు బానిసగా మార్చినట్లు, ఈ విషయమై తల్లి వంగల స్వప్న ప్రియ ఆత్మహత్యాయత్నానికి పాల్ప డిన విషయం విధితమే. ఈ ఘటనలో కొంతమంది యువకులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసు అధికారులు యువకులను గుర్తించినట్లు తెలుస్తోంది. సాంకేతిక నిపుణుల ద్వారా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో బాలికకు పరిచయమైన యువకులు అంశాలను పరిశీలిస్తున్నారు. బాలిక చెప్పిన వాస్తవాల ఆధారంగా డ్రగ్స్ ఎక్కడి నుంచి వారికి అందుతున్నాయి... ఈ విద్యార్థిని కాకుండా మరెవరికై నా డ్రగ్స్ అందజేస్తున్నారా... రక్షణలో చేస్తున్న యువకులకు ఎక్కడినుంచి వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో కొంతమంది యువకులను విచారించే నేపథ్యంలో అసలు నిందితుల కోసం వెతుకులాడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులను సమాచారం అడగ్గా.. దర్యాప్తులో ఉందని చెబుతున్నారు. యువకులను రిమాండ్ కూడా తరలించారనే వాదనలు వినవస్తున్నాయి. అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక రేపు చినగంజాం: ఉమ్మడి ప్రకాశం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16వ తేదీ మంగళవారం ఖేలో ఇండియా అస్మిత జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామంలో నిర్వహించనున్నారు. ఈమేరకు ప్రెసిడెంట్ పి.రామచంద్రరావు, సెక్రటరీ ఎం. వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం కడవకుదురు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అండర్ 14,16 బాలికలకు ఎంపికలు ఉంటాయన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌కి ఎంపిక చేస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో విజయం సాధించిన మొదటి మూడు స్థానాల వారికి మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అథ్లెట్స్ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు తీసుకొని 16వ తేదీ ఉదయం 8 గంటల లోపు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 9885788827, 7675026220 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కోచ్ రాజు నాయక్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి అత్యుత్తమ మార్గం సాహిత్యం
నగరంపాలెం: సమస్యల పరిష్కారానికి అత్యుత్తమ మార్గం సాహిత్యమేనని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డీ.విల్సన్ అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ధార్మిక ప్రాంగణంలో ఆదివారం 16వ సోమేపల్లి సాహితీ పురస్కారాల సభ నిర్వహించారు. రమ్య భారతి సాహిత్య పత్రిక నుంచి చలపాక ప్రకాష్, శ్రీ వసిష్ట సోమేపల్లి నిర్వహణలో జరగ్గా, అతిథులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. రమ్య భారతి గౌరవ సలహాదారులు వేముల హాజరత్తయ్య గుప్తా అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి, అకాడమీ చైర్మన్ ఆర్డీ.విల్సన్ మాట్లాడుతూ సాహిత్యంలో మానవతా విలువలు ఉన్నప్పుడు రాణిస్తుందని పేర్కొన్నారు. ఏపీ రచయితల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ సి.భవానిదేవి, ప్రముఖ కథకులు శ్రీ కంఠస్ఫూర్తి మాట్లాడుతూ మనిషిలో అంతర్లీనంగా ఉన్న సాహిత్యాన్ని వెలికితీసేందుకు వేదికను నెలకొల్పిన మహా వ్యక్తి సోమేపల్లి అని కొనియాడారు. అదే బాటలో ఆయన కుమారుడు శ్రీ వశిష్ట సోమే పల్లి పయనిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం కథల పోటీల్లో ప్రథమ విజేత సింగరాజు శ్రీనివాసరావు (గెలుపు), ద్వితీయ విజేత జి.రంగబాబు (ఇకనైనా మారండి ), తృతీయ విజేత బీఎస్కే.కరీముల్లా (బేరం), ప్రోత్సాహక ఉత్తమ పుర స్కారాలను సింహప్రసాద్, ఎం.వెంకటేశ్వరరావు (హైదరాబాద్), ఇంద్రగంటి నరసింహమూర్తి (కాకినాడ) కు అందించి, సత్కరించారు. సభలో సాహితీవేత్త లు కేంద్ర సాహిత్య అవార్డుగ్రహీతలు పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, రావెల సాంబశివరావు, సీహెచ్.సుశీలమ్మ, శివప్రసాద్, తోట కూర వెంకటనారాయణ, సుభాని పాల్గొన్నారు. -
చదువులమ్మ చెట్టు నీడలో..!
చిలకలూరిపేట: ఏరా శ్రీను.. ఎలా ఉన్నావు... పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ క్షేమమా అంటూ కాంతారావు పలకరింపు. బాగానే ఉన్నాను.. మీ పిల్లలు అంతా సెటిల్ అయ్యారా అంటూ శ్రీనివాసరావు ప్రతి పలకరింపు. 50 ఏళ్ల తర్వాత కలసిన మిత్రుల మధ్య భావోద్వేగ సన్నివేశమిది. చిలకలూరిపేట ఆర్వీఎస్ సీవీఎస్ హైస్కూల్లో 1974– 75 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం పాఠశాల ప్రాంగణంలో జరిగింది. 50 ఏళ్ల కిందట ఇక్కడ చదువుకుని.. వివిధ ప్రాంతాలలో స్థిర పడిన పూర్వ విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. స్కూల్ ప్రాంగణంలో తిరుగుతూ నాడు తాము చేసిన అల్లరి తలుచుకుంటూ, తరగతి గదులను పరిశీలించి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్న పిల్లల తరహా సందడి చేశారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటూ తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను తలుచుకున్నారు. నాడు పాఠాలు బోధించిన గురువులు ప్రతాప వెంకట సుబ్రమణ్యశాస్త్రి, చిట్టిపోతు పట్టాభిరామారావు, ఎన్ వెంకట సుబ్బారావులను ఘనంగా సన్మానించారు. ఒకరికొకరు కొసరికొసరి వడ్డించుకుంటూ భోజనాలు చేశారు. సాయంత్రం బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు చెప్పుకున్నారు. 1975లో స్కూల్ ఎస్పీఎల్గా వ్యవహరించిన డీఎల్ కాంతారావు, పూర్వ విద్యార్థులు కందిమళ్ల రాంబాబు, కృష్ణమూర్తి, నాగరాజు, చంద్రశేఖరరావు, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట ఆర్వీఎస్ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు -
కుటుంబ కలహాలతో వివాహిత హత్య
రొంపిచర్ల/అద్దంకి రూరల్: కుటుంబ కలహాలతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన అల్లరి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్‌కు మండలంలో మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మి(24) తో తొమ్మిది సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటేష్ బేకరీ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాఫీగా సాగుతున్న వారి సంసారంలో మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మహాలక్ష్మి కొంత కాలంగా తన భర్త, పిల్లలను వదిలి మాచవరం గ్రామంలో తన పుట్టింటి దగ్గర ఉంటోంది. నెలలు గడుస్తున్నా భార్య తిరిగి కాపురానికి రాకపోవడంతో వెంకటేష్ మాచవరం గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. తన భర్త వద్దకు వెళ్లేందుకు భార్య నిరాకరించింది. దీంతో వెంకటేష్ తన సోదరి సాయంతో ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటూ పనికి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మాచవరానికి వచ్చిన వెంకటేష్ తన భార్యకు వద్దకు వెళ్లాడు. పాపకు బంగారం తెచ్చాను, మన ఇంటికి వెళ్దామని చెప్పి నమ్మించి బండిపై తీసుకెళ్లాడు. ఊరి వెలుపలకు వెళ్లిన తర్వాత భార్యతో మాటా మాటా పెరిగి గొడవ పడ్డారు. ఆమె ధరించిన చలికోటు నుంచి లేస్ తీసి మెడకు వేసి బిగించి లాగి దాడికి పాల్పడ్డాడు. అనంతరం మోటారు బైక్‌పై ఆమెను తీసుకొని బాపట్ల జిల్లా సంతమాగులూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. జరిగిన విషయం పోలీసులకు తెలియజేయగా ప్రాణం ఉందేమోనని భావించి ఆమెను సంతమాగులూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ మహిళ చనిపోయినట్లుగా వైద్యులు నిర్థారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. నరసరావుపేట రూరల్ సీఐ ఎం.వి.సుబ్బారావు మాచవరంలోని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. చిన్న పిల్లలు అనాథలయ్యారు. ఈ విషయం మండలంలో చర్చనీయాంశంగా మారింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేష్‌ను రొంపిచర్ల పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని బైక్‌పై పెట్టుకుని స్టేషన్‌కు చేరుకున్న నిందితుడు కుటుంబ కలహాల నేపథ్యంలో పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరం గ్రామంలో భార్యను చంపిన నిందితుడు ఆదివారం సంతమాగులూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మహాలక్ష్మి మృతదేహం -
ఖోఖో బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక
నకరికల్లు: ఉమ్మడి గుంటూరు జిల్లా ఖోఖో అసోసియేషన్ పల్నాడు జిల్లా ఖోఖో జట్టు సెలక్షన్స్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. ఉత్కంఠభరితంగా సాగిన సెలక్షన్స్‌ను గుంటూరు జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు వీరభధ్రారెడ్డి, కార్యదర్శి చింతా పుల్లయ్య, ట్రెజరర్ జి.ఝాన్సీరాణిలు పర్యవేక్షించారు. సుమారు 200 మందికి పైగా బాలబాలికలు సెలక్షన్స్‌కు హాజరు కాగా బాలబాలికల్లో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో సెలక్షన్స్ నిర్వహించారు. ఒక్కో జట్టుకు 19 మంది చొప్పున క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి చింతా పుల్లయ్య మాట్లాడుతూ పల్నాడు జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 19వతేదీ నుంచి 21వరకు జె.పంగులూరులోను, 24వ తేదీ నుంచి 26 వరకు గుడివాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని అన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులకు పలువురు అభినందనలు తెలిపారు. -
షటిల్ డబుల్స్ టోర్నమెంట్ విజేత విజయవాడ జట్టు
నాదెండ్ల: క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతోపాటు యువత మధ్య స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయని సీఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చుండి రంగనాయకులు అన్నారు. గణపవరం సీఆర్ కళాశాల ఇండోర్ స్టేడియంలో నియోజకవర్గ స్థాయి, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల స్థాయి షటిల్ డబుల్స్ టోర్నమెంట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. సీఆర్ కళాశాల షటిల్ ప్లేయర్స్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్లో నియోజకవర్గ స్థాయిలో 30 జట్లు, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల స్థాయిలో 40 జట్లు పాల్గొన్నాయి. మూడు జిల్లాల స్థాయి విజేతలు.. మూడు జిల్లాల స్థాయిలో విజయవాడకు చెందిన ధనుష్, చంద్రగోపీ మొదటి బహుమతి కై వసం చేసుకున్నారు. రెండో బహుమతి విజయవాడకు చెందిన విజయ్‌సాయిరెడ్డి, పోతురాజు దక్కించుకున్నారు. మూడో బహుమతి గణపవరం గ్రామానికి చెందిన జాక్సన్, పృధ్వీ, నాలుగోబహుమతి కోండ్రుపాడు, గణపవరానికి చెందిన ఆదినారాయణ, సుబ్రహ్మణ్యం దక్కించుకున్నారు. నియోజకవర్గ స్థాయి విజేతలు.. నియోజకవర్గ స్థాయిలో మొదటి బహుమతి చిలకలూరిపేటకు చెందిన ఖాదర్, నవీన్ గెలుపొందారు. రెండో బహుమతి గణపవరానికి చెందిన జాక్సన్, పృధ్వీ, మూడో బహుమతి చిలకలూరిపేటకు చెందిన శ్రీనివాసరావు, శేషిరెడ్డి, నాలుగో బహుమతి కోండ్రుపాడు, యడ్లపాడుకు చెందిన ఆదినారాయణ, ప్రసాద్‌లు దక్కించుకున్నారు. విజేతలకు కమిటీ సభ్యులు నగదు బహుమతి, షీల్డ్ అందించారు. న్యాయనిర్ణేతలుగా కొండెపాటి నాగయ్య, రమేష్, నరేంద్ర, గేరా యాకోబు వ్యవహరించారు. కమిటీ సభ్యులు యశ్వంత్‌చౌదరి, సాయిచౌదరి, పట్నంశెట్టి మణికంఠ, నాని, బాష, ఆదినారాయణ పర్యవేక్షించారు. ముగిసిన షటిల్ డబుల్స్ టోర్నమెంట్ -
వైభవం.. ఏపీఆర్‌జే కళాశాల స్వర్ణోత్సవం
విజయపురిసౌత్: వారంతా 50 ఏళ్ల క్రితం ఏపీఆర్ జూనియర్ కళాశాలలో చదువుకున్నారు. ఆతరువాత విడిపోయారు. సుధీర్ఘ జీవన ప్రయాణంలో విభిన్నదారుల్లో సాగి వివిధ వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణించారు. జీవితం యాంత్రికమైపోయింది. ఒక్కసారి చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. సాగర్ పరివార్ ఆధ్వర్యంలో దేశ, విదేశాలలో ఉన్నత స్థానాలలో, వివిధ ఉద్యోగాలు చేస్తున్న సుమారు 5వేల మంది చిరునామాలు సేకరించారు. 1975 నుంచి 2025 వరకు ఏపీఆర్ జూనియర్ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం మరోసారి అదే కళాశాలలో స్వర్ణోత్సవాల్లో తిరిగి కలుసుకుని ఒకే వేదిక పై చేరుకున్నారు. ఒక్కసారిగా అందరిలో ఉద్వేగం...అపురూపమైన ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పరస్పర పలకరింపులు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఫోన్ నంబర్లు, చిరునామాలు సేరించుకున్నారు. తమ ఉన్నతికి దోహదపడిన ఆనాటి గురువులను గుర్తు చేసుకున్నారు. అపురూపమైన జ్ఞాపకాలను తమ స్నేహబంధానికి గుర్తుగా గ్రూఫ్ ఫొటోలు దిగారు. అనంతరం గురువులను శాలువాలు, పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు, పూర్వ విద్యార్ధులకు కొమ్ముకోయ నృత్యంతో కళాశాలలో ఘన స్వాగతం పలికారు. అనంతరం సభలో స్వర్ణోత్సవ సావనీర్ ఆవిష్కరణ జరిపారు. వీపీసౌత్ ఏపీఆర్జేసీలో 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు -
ఫ్లై ఓవర్ భద్రతకు ముప్పు
నరసరావుపేట టౌన్: ఓవర్ బ్రిడ్జి భద్రతకు ముప్పు ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల ఇష్టారాజ్యం అందుకు కారణం. ఓవర్ బ్రిడ్జి కింద భాగంలో మిఠాయి దుకాణ నిర్వాహకుడు పిల్లర్‌కు ఆనుకొని కార్ఖానా ఏర్పాటు చేయటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజూ అక్కడ పొయ్యి వెలిగించి ఆ మంటతో వంటకాలు చేస్తున్నారు. నిరంతరం వెలుగుతున్న వేడి ధాటికి పిల్లర్ ఉపరితల భాగం దెబ్బతినటంతోపాటు పై శ్లాబ్ పెచ్చులూడిపోవటం భయాందోళన కలిగిస్తోంది. చిత్రాలయ టాకీస్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి క్రింది భాగంలో కొన్నేళ్లుగా ఈ తంతు జరుగుతోంది. కళ్ల్లెదుట బ్రిడ్జి రోజురోజుకు దెబ్బతింటున్నా అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇలానే కొనసాగితే భవిషత్తులో ఓవర్ బ్రిడ్జికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద ప్రమాదానికి సంకేతం ఇలానే కొనసాగితే పిల్లర్లు బలహీనపడి భవిష్యత్తులో పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఇంజినీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిడ్జి కింద మంటలు, వేడి వంటకాల వల్ల కాంక్రీట్ నిర్మాణాలు బలహీన పడి వంతెన మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పారు. బ్రిడ్జ్జి కింద ఏర్పాటు చేసిన అనధికార ఖార్ఖానాను తొలగించి శాశ్వత పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కొరవడిన సమన్వయం రోడ్డు భవనాల శాఖ, పురపాలక శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఓవర్ బ్రిడ్జి కింద భాగంలో వదిలిపెట్టిన కానాలు ఆక్రమించారు. అక్కడ శాశ్వత దుకాణాలు ఏర్పాటు చేసి కొందరు వ్యాపారాలు నిర్వహిస్తుండగా, మరి కొందరు రోజు వారి అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్ సెంటర్లో ఓవర్ బ్రిడ్జి కానాల ఆక్రమణల వల్ల నిత్యం అక్కడ ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవుతోంది. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినా అధికారులు ఓవర్ బ్రిడ్జి పర్యవేక్షణ తమ పరిధి కాదంటూ ఒకరిపై ఒకరు చెప్పుకొంటూ దాటవేస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పెద ముప్పు వాటిల్లక ముందే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
జాతీయ లోక్ అదాలత్‌లో 1,590 కేసుల పరిష్కారం
నరసరావుపేట టౌన్: జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 1,590 కేసులు పరిష్కారం అయ్యాయి. కక్షిదారులకు రూ.4.84 కోట్లు పరిహారం కింద లభించింది. మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. న్యాయమూర్తులు నాలుగు బెంచ్‌లుగా లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులతోపాటు సివిల్, చెల్లని చెక్కు, మనోవర్తి, గృహహింస, వాహన ప్రమాదాలు, ముందస్తు వ్యాజ్యపు కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి శరత్ బాబు, న్యాయ అధికారులు ఎన్.లావణ్య, ఆర్.ఆశీర్వాదంపాల్, ఎ.సలోమి, ఎం.గాయత్రి, న్యాయవాద సంఘ అధ్యక్షుడు ఎం.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజి నుంచి పశ్చిమ డెల్టాకు 2,212 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. బ్యాంక్ కెనాల్‌కు 150, తూర్పు కాలువకు 70, పశ్చిమ కాలువకు 45, నిజాంపట్నం కాలువకు 50, కొమ్మూరు కాలువకు 1,666 క్యూసెక్కులు విడుదల చేశారు. 2 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 36వ విజయవాడ పుస్తక మహోత్సవం నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు టి.మనోహర్‌నాయుడు, కె.లక్ష్మయ్య తెలిపారు. సొసైటీ కార్యాలయంలో శనివారం పుస్తక మహోత్సవం పోస్టర్లను ఆవిష్కరించాక మీడియాతో మాట్లాడారు. ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ప్రాంగణంలో జరిగే ఈ వేడుక ప్రాంగణానికి వడ్లమూడి విమలాదేవి, ప్రధాన వేదికకు ప్రముఖ రచయిత డాక్టర్ బి.వి.పట్టాభిరామ్, విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించే ప్రతిభ వేదికకు జయంత్ నార్లేకర్ పేర్లు పెడుతున్నట్లు వెల్లడించారు. రెండో తేదీ సాయంత్రం ఆరు గంటలకు పుస్తక మహోత్సవం ప్రారంభమవుతుందని, ముఖ్యమంత్రిని లేదా ఉపముఖ్యమంత్రి తదితర ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జనవరి ఐదో తేదీ సాయంత్రం పుస్తక ప్రియుల పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు జె.ప్రసాద్, సహాయ కార్యదర్శి ఎ.బి.ఎన్.సాయిరామ్, కోశాధికారి కె.రవి, కార్యవర్గ సభ్యులు జి. లక్ష్మి, నాగిరెడ్డి, శ్రీనివాస్, ఎ.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 574.10 అడుగులకు చేరింది. ఇది మొత్తం 266.8601 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు వెయ్యి, ఎడమ కాలువకు 8,541, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 29,354, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 49,995 క్యూసెక్కులు వదులుతున్నారు.. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 49,995 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. -
పీఏసీఎస్ ఉద్యోగుల ఆందోళన బాట
సత్తెనపల్లి: చంద్రబాబు సర్కార్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తోంది. వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చక పోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు ఈనెల 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. జిల్లాలో ఉన్న 62 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో (పీఏసీఎస్) పని చేస్తున్న 200 మంది ఉద్యోగులు యూనియన్ పిలుపుమేరకు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపడుతున్నారు. అన్ని పీఏసీఎస్‌లకు వచ్చి పోయే రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో పీఏసీఎస్‌ల ద్వారా ప్రతి రోజూ సుమారు రూ.20 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. నిరసనల కారణంగా ఆయా లావాదేవీలు నిలిచిపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో 62 పీఏసీఎస్‌ల పరిధిలో సుమారు 1.20 లక్షల మంది రైతులు పీఏసీఎస్‌ల సేవలు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ ముగియడంతో పలువురు రైతులు పండించిన పంట ఉత్పత్తులు విక్రయించి డబ్బు చేతికి రావడంతో వాటిని చెల్లించేందుకు పీఏసీఎస్‌లకు వస్తున్నారు. ఈ క్రమంలో పీఏసీఎస్ ఉద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాల్లో ఉండటంతో ఊసురుమంటూ వెనుతిరిగి వెళ్లాల్సి వస్తోంది. ప్రతి పీఏసీఎస్‌కు ప్రతి రోజూ సుమారు 15 నుంచి 20 మందికి పైగా రైతులు వచ్చి లావాదేవీలు జరుపుతుంటారు. ప్రతి పీఏసీఎస్‌లో నిత్యం రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. డిమాండ్లు ఇవే... జిల్లాలో పీఏసీఎస్ ఉద్యోగులు హామీలు నెరవేరక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర యూనియన్ పిలుపుమేరకు ఈనెల 6 నుంచి వివిధ రూపాల్లో శాంతియుత నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాం. జనవరి 5న విజయవాడ ధర్నా చౌక్ వద్ద రాష్ట్రస్థాయిలో మహాధర్నా జరగనుంది. ప్రభుత్వం పీఏసీఎస్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు, ఉద్యోగుల వేదనను గుర్తించి డిమాండ్లను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలి. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన తప్పదు. – ఆరాధ్యుల శ్రీనివాసరావు, పీఏసీఎస్ ఈయూ అధ్యక్షుడు, పల్నాడు జిల్లా -
ఉపాధ్యాయ క్రీడా పోటీలు ప్రారంభం
నరసరావుపేట: ఉపాధ్యాయుల డివిజన్ స్థాయి క్రీడా పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో 2025–26 విద్యా ఏడాదికి ఆదివారం వరకు కొనసాగనున్నాయి. పోటీలలో పురుషుల ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు లూథరన్ హైస్కూల్ మైదానంలో నిర్వహించగా, మ హిళా ఉపాధ్యాయులకు త్రో బాల్ పోటీలు శంకరభారతీపురం జెడ్పీ హైస్కూలులో నిర్వహించారు. టీడీపీ నాయకుడు డాక్టర్ రాంప్రసాద్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఉపాధ్యాయుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెనాలి: విజయవాడలోని టీటీడీ కల్యాణ మండపంలో రోడ్డులో ఆదివారం జరగనున్న తెలుగు వరల్డ్ ఆర్టిస్ట్స్ ఆర్ట్ సొసైటీ 4వ చిత్రకళా సంతలో తెనాలి శిల్పకళా ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. సొసైటీ కోరికపై తెనాలిలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు ఇందుకు సన్నాహాల్లో ఉన్నారు. ఈ ప్రదర్శనలో భారతరత్న అటల్ బిహారి వాజపేయి, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా విగ్రహాలతోపాటు స్టైలిష్ స్టిల్‌తో తయారుచేసిన సింహం, పులి, జామెంట్రిక్ షేప్‌తో రూపొందించిన జింక, త్రీడీ టెక్నాలజీతో చేసిన ఎలిఫెంట్ ఫైట్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, సెల్ఫ్ మేడ్ పర్సన్ విగ్రహాలను ప్రదర్శిస్తున్నట్టు ‘కళారత్న’ కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష శనివారం స్థానిక విలేకరులకు తెలియజేశారు. చేబ్రోలు: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గుంటూరు జిల్లా మహాసభలు ఆదివారం ఉదయం చేబ్రోలులోని ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వరరావు తెలిపారు. మహాసభల ఏర్పాట్లను శనివారం యూటీఎఫ్ నాయకులు పర్యవేక్షించారు. జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారన్నారు. ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరణతో మహా సభలు ప్రారంభం కానున్నాయని, చేబ్రోలు ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా మహాసభలలో జిల్లా నలుమూలల నుంచి ఉపాధ్యాయులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చేబ్రోలు మండల కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ఖాదర్ బాషా, పి పార్థసారథి కోరారు. బాపట్లటౌన్: హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ వినియోగంపై శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహన చోదకులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ హెల్మెట్ బరువు కాదు, అది మీ ప్రాణానికి రక్షణ కవచంలాంటిదన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ ధారణతోపాటు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. -
ఘనంగా ముగిసిన విజ్ఞాన్ బాలోత్సవ్
●జోనల్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ● హజరైన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ నరసరావుపేట రూరల్: విద్యార్థులు బాల్యం నుంచే విభిన్నంగా ఆలోచించే దృక్పధాన్ని అలవరచుకోవాలని ఎంపీ, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని డీఎస్ఏ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన విజ్ఞాన్ బాల మహోత్సవ్ జోనల్ ఆటల పోటీలు శనివారం ముగిశాయి. ఎంపీ లావు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు క్రియేటివిటి, ఇన్నోవేషన్, విభిన్న ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఇండోర్ గేమ్, అవుట్ డోర్ గేమ్, వ్యక్తిగత హాబీ వంటి మూడు వ్యాపకాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. మూడు వ్యాపకాలను పాటిస్తే విద్యార్థులు కోరుకున్న లక్ష్యాలను సులభంగా సాధించగలుగుతారని వివరించారు. జీవితంలో ఎప్పుడూ సెల్ప్ రెస్పెక్ట్, ఇంటిగ్రిటి విషయంలో రాజీపడకూడదని, తల్లిదండ్రులు గర్వపడేలా మన పనులు ఉండాలని హితవు పలికారు. దేశం మీలాంటి యువతపై ఆశలు పెట్టుకుందని, మీ జీవిత కథలో మీరే హీరోలుగా మారాలన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా సమాజంలో ఎలా మెలగాలి, ఎలా పనిచేయాలో తెలుస్తుందన్నారు. బాల మహోత్సవ్‌లో భాగంగా బాల, బాలికలకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, చెస్, 100 మీట్లు, 800 మీటర్లు, రిలే, లాంగ్‌జంప్, షాట్‌పుట్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. -
మహిళల్లో మౌనం బలహీనత కాకూడదు
●కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ●తుళ్లూరులో ఘనంగా నయీ చేతన 4.0 కార్యక్రమం ●పాల్గొన్న రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ తాడికొండ: మహిళల్లో మౌనం బలహీనత కాకూడదని కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. లింగ సమానత్వ జాతీయ ప్రచార కార్యక్రమం నయీ చేతన 4.0 కార్యక్రమం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డీఆర్డీఏ సౌజన్యంతో తుళ్లూరు మేరీమాత హైస్కూల్లో శనివారం నిర్వహించారు. నయీ చేతన 4.0 కార్యక్రమంలో భాగంగా సీఆర్డీఏ స్కిల్ హబ్ భవనంలో జెండర్ రిసోర్స్ సెంటర్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌లతో కలిసి ప్రారంభించారు. ప్రదర్శన శాలలను మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మంత్రి డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ వివక్ష తగ్గించడమే నయీ చేతన 4.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. సమాజంలో బాల్య వివాహాలు, గృహ హింస, లింగ వివక్ష వంటి రుగ్మతలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో 4.50 లక్షల గృహ హింస కేసులు నమోదు అయ్యాయని గణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు. ప్రతి ముగ్గురిలో ఒక మహిళ వివక్షకు గురౌతున్నట్లు అంచనా ఉన్నప్పటికీ అన్ని కేసులు నమోదు కావడం లేదని, ఇందుకు పరువు ప్రతిష్ట కోసం ఆలోచించడం కారణమన్నారు. అందుకే నయీ చేతన కార్యక్రమాన్ని 2021 సంవత్సరంలో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం అన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారన్నారు. లింగ సమానత్వం వంట గది నుండి ప్రారంభం కావాలని, అప్పుడే మహిళలు శారీరకంగా, మానసికంగా ధైర్యంగా, స్థైర్యంగా ఉండగలరన్నారు. రాష్ట్ర ఎంఎస్ఎంఇ, సెర్ప్, ఎన్.ఆర్.ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి మాట్లాడారు. జెండర్ చాంపియన్లు చలివెంద్రి సుగంధి, తురకా శ్యామల మాట్లాడారు. జెండర్ చాంపియన్లను మంత్రులు సత్కరించారు. అనంతరం లింగ సమానత్వం కోసం అవగాహన కల్పిస్తూ లఘు నాటికను ప్రదర్శించారు. లింగ సమానత్వంపై అవగాహన కరదీపికను విడుదల చేసి సెల్ఫీ తీసుకున్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కోసం వైద్య ఆరోగ్యశాఖ ఉచిత వైద్య శిబిరం, మిషన్ శక్తి కార్యక్రమాలపై ఐసీడీఎస్, శక్తి టీంపై జిల్లా పోలీస్ శాఖ, మహిళా కార్మికులు పని ప్రదేశాల్లో సౌకర్యాలపై జిల్లా కార్మిక శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్, గ్రామీణ యువతకు డిడియు జీకేవై 2.0 ద్వారా శిక్షణ కార్యక్రమాలపై సీడాప్–డిఆర్డిఏ, స్వయం సహాయక సంఘాల వ్యాపార ఉత్పత్తులతో విక్రయాలు, ప్రదర్శన శాలలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వాకాటి కరుణ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సెర్ప్ సంచాలకులు శివ శంకర్ ప్రసాద్, డీఆర్డీఏ ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయలక్ష్మి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతిబసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగసాయి కుమార్, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
మానవుల రక్షణార్థం క్రీస్తు సిలువపై మరణం
గుంటూరు రూరల్: ఏసుక్రీస్తు ఈ భువిలో 2025 సంవత్సరాల క్రితం జన్మించి మానవుల రక్షణార్థమై సిలువపై మరణించెనని గుంటూరు రోమన్ క్యాథలిక్ మేత్రాసన పీఠాధిపతులు డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య తెలిపారు. ఏసుక్రీస్తు మార్గము అనుసరణీయమని పేర్కొన్నారు. గుంటూరు మేత్రాసన పరిధిలో ఏసు క్రీస్తు జయంతి 2025 జూబ్లీ వేడుకలు శనివారం నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. జగద్గురువులు, కీర్తిశేషులు ఫ్రాన్సిస్ పోపు ద్వారా రూపుదిద్దుకుని, ప్రస్తుత రోమన్ క్యాథలిక్ విశ్వ పీఠాధిపతులు లియో పోపు నేతృత్వంలో జూబ్లీ వేడుకలు విశ్వవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ప్రత్యేక జూబిలీ ప్రార్థన ద్వారా జ్యోతి ప్రజ్వలన చేసి, గుంటూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య వేడుకలను ప్రారంభించారు. అనంతరం జూబ్లీ విశిష్టతను గురించి గురు డాక్టర్ చాట్ల మరియదాసు, క్రీస్తు రాకడ కోసం నిరీక్షణ, ఆశయాలు, లక్ష్యాలు అనే అంశంపై గురు పెంటారెడ్డి రాజారెడ్డి, దేవుని వాక్కు శ్రీసభ జీవన విధానం అనే అంశంపై గురు పూదోట స్టౌటన్ తోమాసు వివరించారు. విశ్వాస సంఘాల నిర్మాణం, గురువులు, మఠవాసులు, గృహస్థ క్రైస్తవుల పాత్ర అనే అంశంపై గురు డాక్టర్ గోవిందు రాయన్న భక్తులకు వాక్యోపదేశం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న క్రీస్తు భక్తులందరికీ భోజన సదుపాయం కల్పించారు. మధ్యాహ్నం ఏసు సభ గురు విద్యార్థులు నిర్వహించిన సంస్కరణ రథసారథి జగద్గురులు ఫ్రాన్సిస్ పోపు జీవిత సందేశ నృత్య, నాటక కళా ప్రదర్శన భక్తులను అలరించింది. వైభవంగా దివ్య బలిపూజ స్వస్థత ప్రార్ధనల అనంతరం గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు, గుంటూరు మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు మోస్ట్ రెవరెడ్డి డాక్టర్ గాలిబాలిలు ప్రధాన యాజకులుగా, గుంటూరు మేత్రాసనంలోని గురువులందరితో కలిసి జూబ్లీ మహోత్సవ దివ్యబలి పూజను నిర్వహించారు. గురువులు, మఠకన్యలు, విశ్వాసులు 7000 మందికిపైగా పాల్గొన్న కార్యక్రమంలో పీఠాధిపతులు తమ వాక్యోపదేశాన్ని కొనసాగించారు. క్రీస్తు రాక కోసం అనేకమంది నిరీక్షించారన్నారు. ఆయన మనుషావతారంలో ఈ భువిలో జన్మించారన్నారు. గొల్లలు, దేవదూతలు, ముగ్గురు జ్ఞానులు ఆ దివ్య బాల ఏసుని కనుగొని ఆరాధించి, స్తుతించి కానుకలు సమర్పించారని వివరించారు. మనమందరం దివ్య ఏసు రెండో రాక కోసం నిరీక్షించి, క్రీస్తు ప్రభువు చూపించిన మార్గంలో నడిచి, పాప క్షమాపణ పొందాలని తెలిపారు. నూతన జీవితం ద్వారా ఆ దేవదేవుని కృపావరాలకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. జూ బ్లీ వేడుకలకు గురు డాక్టర్ గోవిందు రాయన్న, గురు పెంటారెడ్డి రాజారెడ్డి కోర్ కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వహించారు. మహోత్సవానికి సహకరించిన లయోలా పబ్లిక్ స్కూల్ యాజమాన్యాని కి, అధ్యాపకులకు, అధ్యాపకేతర బృందానికి, గురువులకు, సిస్టర్స్‌కు, సకల విశ్వాసులకు గురు డాక్టర్ గోవిందు రాయన్న అభినందనలు తెలిపారు. రోమన్ క్యాథలిక్ మేత్రాసన పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగ్యయ్య -
పల్నాడు
ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025నగరంపాలెం: గుంటూరు ఆర్.అగ్రహారంలోని శ్రీరామనామక్షేత్ర ఆవరణలో శ్రీరామకోటి మహోత్సవాల్లో శనివారం అద్దాల మందిరంలో సీతారాముల పవళింపు సేవ నిర్వహించారు.నాదెండ్ల/యడ్లపాడు: ఐదుగురు యువకులను డిసెంబరు 4న రోడ్డు ప్రమాదం బలితీసుకున్న ఘటన బాధిత కుటుంబాలకు తీరని శోకం మిగి ల్చింది. అల్లారు ముద్దుగా పెంచిన వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల గుండెలు తల్లిడిల్లుతూనే ఉన్నాయి. ఐదు కుటుంబాల పాలిట తీరని శోకాన్ని మిగిల్చిన చీకటి రోజు అది. ప్రమాదానికి కారకులపై తగిన చర్యలు మాత్రం తీసుకోలేదు. బాధితులకు భరోసా కల్పించలేదు. ప్రకాశం జిల్లా విఠలాపురం గ్రామం మేడిగం రామిరెడ్డి, పల్నాడు జిల్లా శివాపురం, ములకలూరు, పిడుగురాళ్ల ప్రాంతాలకు చెందిన మేరుగ వెంకట నాగశ్రీకాంత్రెడ్డి, గోడవర్తి యశ్వంత్‌సాయి, వంగవోలు వాసు, శివరాత్రి మహేష్‌బాబులు విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాలకు అండగా నిలబడాల్సిన వారు మృత్యువాత పడ్డారు. విద్యకోసం అప్పులు, ఎన్నో త్యాగాలు చేసిన వారి ఆశయ సౌధం ఒక్కరాత్రిలోనే కుప్పకూలింది. సీసీ కెమెరాల లేకుంటే... ఈ ప్రమాదానికి విద్యార్థుల నిర్లక్ష్యం ఎంతమాత్రం కారణం కాదు. తమ వసూళ్ల దందా కోసం, అధికారుల అవతారమెత్తిన అక్రమార్యుల పాపమే కారణం. వారు వెంబడించి ఓవర్టేక్ చేసి ట్రాక్టర్ల ట్రాలర్‌ను కనుసైగతో పక్కకు మళ్లించినందు వల్లే ఈ ఘోరం జరిగిందన్నది వాస్తవం. హైవే బైపాస్‌పై సీసీ కెమెరా లేకుంటే... విద్యార్థుల ప్రాణాలతో పాటు నిజం సమాధి అయ్యేది. అక్రమ వసూళ్లకు పాల్పడే ముఠా ఈ ప్రమాదానికి కారణం. ఇందులో ఏఎస్ఐ కుమారుడు మదమంచి అనుజ్ఞనాయుడు కీలకం కాగా, అతనితోపాటు పుల్లంశెట్టి మహేష్, బెల్లంకొండ గోపి, షేక్ నబిబాష, నాలి వెంకట్రావులను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ప్రధాన నిందితుడికి నేర చరిత ఉన్నట్లు గుర్తించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. తమ బిడ్డల మృతికి కారకులను శిక్షించాలని కన్నవారు కోరుతున్నారు. -
ఆన్లైన్లో పరిచయం.. రూ. 18 లక్షలకు టోకరా
లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు సత్తెనపల్లి: ఫేస్బుక్లో పరిచయమైన యువతి మాటలు నమ్మి ఓ యువకుడు రూ.18 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వెలుగు చూసింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి 20వ వార్డుకు చెందిన తుమ్మల వెంకటేష్‌బాబు సెల్‌ఫోన్‌కు సంబంధించిన విడిభాగాలు విక్రయిస్తుంటారు. వెంకటేష్‌బాబుకు సెప్టెంబర్ నెలలో ఢిల్లీకి చెందిన సీహెచ్ రుచి అనే యువతి ఫేస్బుక్లో పరిచయమైంది. ఇరువురు వాట్సాప్ ద్వారా చాటింగ్, మాట్లాడుకోవటం చేశారు. ఆమె తెలుగులో మాట్లాడటంతో నమ్మాడు. ఢిల్లీలోని వసంత విహార్ ఏరియాలో నివసిస్తున్నానని, ఎలైట్ మాల్ స్టోర్ అండ్ ఈ కామర్స్ ఆన్లైన్ వ్యాపారానికి మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు ఆమె చెప్పింది. ఆన్లైన్లో బంగారం, వెండి, తదితర విలువైన వస్తువులు తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించి లాభాలు గడించవచ్చని నమ్మించింది. ఆమె రిఫరల్ ఐడీ లింకు ద్వారా లాగిన్ అయి మొదట ప్రవేశ రుసుము కింద రూ. 40 వేలు కట్టాడు. వివిధ వస్తువుల కొనుగోలు నిమిత్తం నగదు చెల్లించాడు. కొద్ది రోజులకే ధర పెరిగి లాభాటు వచ్చినట్టు చూపారు. గోల్డ్ రింగులు, చైన్లు, బ్రాస్లెట్స్ వంటివి తక్కువ ధరకు ఉన్నట్లు రుచి చెప్పింది. అత్యాశకు పోయిన వెంకటేష్ బాబు మరికొంత డబ్బును యూపీఐ, బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించి వస్తువులు కొనుగోలు చేశారు. ఆ నగదు వచ్చేలోపు మరో వస్తువు తక్కువ ధరకు చూపిస్తుండడంతో మొత్తం రూ.18 లక్షలు పెట్టి సామగ్రి కొన్నారు. లాభాలు అధికంగా వచ్చాయని నగదు విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. మోసపోయినట్లు తెలుసుకుని శుక్రవారం రాత్రి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డు తొలగింపునకే హత్యలు
నరసరావుపేట రూరల్: వివాహేతర సంబంధం నేపథ్యంలోనే భార్య, ఏడు నెలల బాలుడిని ఎన్ఎస్పీ కాలువలోకి నెట్టి భర్త హత్య చేసాడని డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలను శనివారం నరసరావుపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మీడియా సమావేశంలో వివరించారు. రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన కందారపు శ్రీకాంత్‌కు నాదెండ్ల మండల కేంద్రానికి చెందిన త్రివేణి(25)కి రెండు సంవత్సరాల వివాహమయింది. వీరికి ఏడు నెలల వయసున్న శరత్ ఉన్నాడు. శ్రీకాంత్ నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషీయన్ పనిచేస్తున్నాడు. రెండు, మూడు రోజులకు ఒకసారి ఇంటికి వస్తుండటంతో భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 5వ తేదీ రాత్రి 11గంటల సమయంలో రావిపాడు సమీపంలోని చిలకలూరిపేట మేజర్ కాలువలోకి త్రివేణిని, శరత్‌ను నెట్టి హత్య చేశాడు. త్రివేణి మృతదేహం అదే రోజు రాత్రి గుర్తించగా, శరత్ మృతదేహం ఇప్పటి వరకు లభించలేదు. అడ్డుగా ఉన్నారనే.. శ్రీకాంత్‌కు మరో మహిళతో తన వివాహానికి ముందునుంచే సంబంధం ఉందని డీఎస్పీ తెలిపారు. ఈ విషయం త్రివేణికి తెలిసి నిలదీయడంతో పలు మార్లు ఆమైపె దాడి చేశాడు. భార్య, కుమారుడిని అడ్డు తొలగించుకుని ఆ మహిళను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 5వ తేదీ రాత్రి నరసరావుపేట నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో రావిపాడు సమీపంలోని కెనాల్ వద్ద త్రివేణితో గొడవపడ్డాడు. అటువైపుగా వచ్చిన వాహనదారులు దీనిని గమనించి ప్రశ్నించడంతో దంపతుల మధ్య గొడవ అని శ్రీకాంత్ తెలిపాడు. అనంతరం భార్యను, కుమారుడిని కాలువలోకి నెట్టి హత్య చేశాడు. రోడ్డు ప్రమాదంలో వారు కాలువలో పడినట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అనుమానంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. మహిళ పాత్రపై దర్యాప్తు ఈ హత్యల వెనుక శ్రీకాంత్‌తో వివాహేతర సంబంధం ఉన్న మహిళ పాత్రపై విచారణ చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ విషయాలపై శ్రీకాంత్‌ను కస్టడీకి తీసుకుని విచారణ జరపాల్సి ఉందని పేర్కొన్నారు. నిందితుడు శనివారం ఉదయం కొత్తపల్లి వీఆర్ఓ తలారి కిరణ్‌బాబు వద్ద నేరాన్ని అంగీకరించాడని, వీఆర్ఓ నిందితుడి వద్ద స్టేట్మెంట్ తీసుకుని పోలీసులకు అప్పగించినట్టు వివరించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన నరసరావుపేట రూరల్ సీఐ ఎంవీ సుబ్బారావు, ఎస్ఐలు సీహెచ్ కిషోర్, ఎస్కే ఫాతిమాలను ఆయన అభినందించారు. మీడియా సమావేశంలో సీఐ సుబ్బారావు, ఎస్ఐ కిషోర్‌లు పాల్గొన్నారు. -
రూ.12 వేల కోట్ల విద్యుత్ భారం మోపేందుకు యత్నాలు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడం లేదంటూనే సర్దుబాటు చార్జీల పేరుతో నెలనెలా వసూలు చేస్తూనే తాజాగా రూ.12,617 కోట్ల భారాన్ని వేసేందుకు రంగం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు చెప్పారు. ఈ ప్రతిపాదన తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ 18 నెలల పాలనలో 2019–20, 2023–24 ఏడాదికి సంబంధించి సర్దుబాటు చార్జీల కింద ప్రజలపై భారాలు వేయడం తగదన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు నియంత్రణ మండలికి పంపిన ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చార్జీల పెంపుదల వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాలన్నారు. గత ప్రభుత్వ పాలనలో రూ.32 వేల కోట్ల భారాలు వేశారని, కూటమి అధికారంలోకి వస్తే ఎటువంటి భారాలు వేయబోమని హామీ ఇచ్చి ఉమ్మడి బాదుడు మొదలు పెట్టారన్నారు. తాజాగా 2026–27 ఆర్థిక ఏడాదికి విద్యుత్ చార్జీల నియంత్రణ మండలి నోటిఫికేషన్ జారీ చేసిందని, దీని ప్రకారం 2026–27ఏడాదికి సంబంధించి రూ.15,651 కోట్ల భారం ప్రజలపై పడనుందన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలతోపాటు తేమ సాకుతో పంటను మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. ధాన్యం బస్తాకు రూ.500, క్వింటా పత్తి రూ.3వేలు నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి తేమ శాతం నిబంధనలు సడలించి కొనుగోలు చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.ఆంజనేయులున ాయక్, వై.రాధాకృష్ణ, ఏపూరి గోపాలరావు, జి.రవిబాబు, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
యర్రబాలెంలో స్పటిక రాళ్లు చోరీ
●బీభత్సం సృష్టించిన గుర్తు తెలియని వ్యక్తులు ●వాచ్‌మేన్‌ను బంధించి రూ. 5 లక్షల విలువైన రాళ్లు అపహరణ మంగళగిరి టౌన్: మంగళగిరి నగర పరిధిలోని యర్రబాలెంలో క్రిస్టల్స్ (స్పటిక రాళ్లు) చోరీకి గురైన ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. యర్రబాలెం – పెనుమాక రహదారిలో కొన్నేళ్లుగా పలువురు భాగస్వామ్యంతో క్రిస్టల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు బీభ త్సం సృష్టించారు. నెంబరు ప్లేట్లు లేని మూడు కా ర్లలో వచ్చి వాచ్‌మేన్ కుటుంబాన్ని బెదిరించి, తాళ్ల తో బంధించారు. కేకలు వేయకుండా నోటిపై ప్లాస్టి క్ స్టిక్కర్లు అతికించారు. అనంతరం గోడౌన్ షట్టర్ తాళాన్ని కటింగ్ మిషన్‌తో కట్ చేసి, సీసీ కెమెరాల కనెక్షన్‌ను సైతం తొలగించారు. గోడౌన్‌లోకి ప్రవేశించి కొన్ని క్రిస్టల్స్‌ను గోతాల్లో నింపుకుని, వారు వచ్చిన కారుల్లో వేసుకుని పరారయ్యారు. అపహరణకు గురైన క్రిస్టల్స్ విలువ 5 లక్షల రూపాయలు విలువ చేస్తుందని సమాచారం. ముందుగానే చోరీకి వ్యూహం దుండగులు పక్కా వ్యూహంతోనే చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. రెండు నెలల కిందట ఇదే విధంగా గుర్తు తెలియని వ్యక్తులు క్రిస్టల్స్ చోరీకి యత్నించారు. గోడౌన్ బయట వున్న కెమెరాల కనెక్షన్‌ను కూడా కత్తిరించారు. గమనించిన వాచ్‌మేన్ కుటుంబీకులు పెద్దగా కేకలు వేయడంతో పారిపోయే క్రమంలో వాకీటాకీని జారవిడుచుకున్నారు. అప్పట్లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసి, దుండగులు వదిలి వెళ్లిన వాకీటాకీని సైతం పోలీసులకు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. విభేదాలే కారణమా? నలుగురు భాగస్వాములు ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారి మధ్య విభేదాల కారణంగానే ఈ చోరీ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురిలో ఒక భాగస్వామి వేరే ప్రాంతంలో క్రిస్టల్స్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఆయనే ఈ ముఠాను పంపి భీభత్సం సృష్టించడంతో పాటు దొంగిలించుకుపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చోరీకి జరిగిన తీరులో కొంత భాగం కెమెరాల్లో నమోదైంది. గోడౌన్ లోపలికి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించిన ప్రవేశించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. వారిలో ఒక వ్యక్తి గతంలో ఇదే గోడౌన్‌కు వచ్చాడని, వాచ్‌మేన్ కుటుంబ సభ్యులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రూరల్ పోలీసులు ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం రావడంతో శనివారం ఉదయం గోడౌన్‌ను సీఐ ఎ.వి. బ్రహ్మం, ఎస్ఐ వెంకట్ సిబ్బందితో పరిశీలించారు. లోపల, బయట పరిశీలించి కొన్ని ఆధారాలు సేకరించి, దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. -
ఏపీఆర్జేసీలో ఘనంగా స్వర్ణోత్సవాలు
విజయపురిసౌత్: స్థానిక ఏపీఆర్ జూనియర్ కళాశాల నాగార్జునసాగర్ పరివార్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైమ్యాట్ డైరెక్టర్, ఏపీఆర్ఈఐ కార్యదర్శి వి.ఎన్.మస్తానయ్య ముఖ్యఅతిథిగా విచ్చేశారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గురు సత్కారం జరిగింది. 1975వ సంవత్సరం నుంచి ప్రస్తుతం అధ్యాపకులుగా ఉన్న వారివరకు 118మంది అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎన్.సరోజిని మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్, ఆర్ఎస్ఐ, ఎఫ్ఎస్ వంటి ఉన్నత ఉద్యోగులుగా.. వివిధ రంగాలలో ఉన్నతులుగా చేసిన కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పని చేయడం గర్వకారణమన్నారు. గురువుల గౌరవం మసకబారుతున్న నేటి దినాల్లో తమ గురువుల పట్ల గౌరవాన్ని సజీవంగా ఉంచి, గురుభక్తిని చాటుకుని కళాశాల పూర్వ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఏపీఆర్జేసీ పూర్వవిద్యార్థులు ఎ.సైదారెడ్డి, ఎస్.నాగచారి, డా. కె.వీరనంది, డా.చక్రపాణి, జి.గోపాలరావులు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్రాంత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఐజీ రమేష్‌రెడ్డి, ఐఏఎస్ అధికారి డా.కె.వెంకటేశం, ఐఎఫ్ఎస్ అంబాసిడర్ సీహెచ్ రాజశేఖర్, పూర్వ విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్, కలైపట్టు పోటీలు ప్రారంభం
పెదకాకాని: విద్యార్థులంతా క్రీడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యాయా మోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చుక్కా కొండయ్య తెలిపారు. రాష్ట్రస్థాయి కలైపట్టు, ఫెన్సింగ్ పోటీలు గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని వెనిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆధునిక నర్సింగ్ హోం డాక్టర్ వీర్నల ప్రత్యూష్ మాట్లాడుతూ క్రీడల ద్వారా దేహదారుఢ్యం, స్నేహ సంబంధాలు పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని చెప్పారు. కలైపట్టు అండర్– 17 బాలబాలికల విభాగాల్లో 60 మంది పాల్గొన్నారన్నారు. పెన్సింగ్ అండర్– 17, అండర్– 19 బాలబాలికల విభాగాల్లో పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. 360 మంది క్రీడాకారులు హాజరు పోటీలకు రాష్ట్రస్థాయిలో 13 జిల్లాల నుంచి సుమారు 360 మంది క్రీడాకారులు హాజరయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా సెక్రటరీలు ఎం. గోపి, కె. నాగశిరీష ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో డాక్టర్ శిల్ప సిందూర, పర్యవేక్షకులు మోహనలక్ష్మి, వ్యాయామోపాధ్యాయుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి. లక్ష్మీపతి, పలువురు పీఈటీలు పాల్గొన్నారు. -
కబడ్డీ ఓవరాల్ చాంపియన్ పల్నాడు జిల్లా
పెదకూరపాడు: గ్రామీణ స్థాయి నుంచి కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ పని చేస్తుందని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ యలమంచిలి శ్రీకాంత్ అన్నారు. మూడు రోజులుగా పెదకూరపాడులోని జీఆర్‌సీఆర్‌కే శ్రీ చైతన్య పాఠశాలలో రాష్ట్రస్థాయి కబడ్డీ బాలురు, బాలికల పోటీలు, రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు, రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రాష్ట్రస్థాయి కబడ్డీ బాలురు విభాగంలో పల్నాడు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. పార్వతీపురం మన్యం జిల్లా ద్వితీయ స్థానంలో, మూడో స్థానంలో కాకినాడ, శ్రీకాకుళం జిల్లాలు జాయింట్ విన్నర్లుగా నిలిచాయి. బాలురు విభాగంలో పార్వతీపురం మన్యం జిల్లా క్రీడాకారుడు మణికంఠ బెస్ట్ రైడర్ అవార్డు పొందారు. బెస్ట్ ఆల్ రౌండర్‌గా పల్నాడు జిల్లాకు చెందిన జి హరీష్ నిలిచారు. కబడ్డీ బాలికల విభాగంలో విశాఖపట్నం జిల్లా జట్టు ప్రథమ స్థానంలో, శ్రీకాకుళం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. జాయింట్ విన్నర్‌గా కృష్ణాజిల్లా, కర్నూలు జిల్లాలు నిలిచాయి. బాలిక విభాగంలో బెస్ట్ రైడర్‌గా విశాఖకు చెందిన కుమారి, బెస్ట్ ఆల్ రౌండర్‌గా హరీష్ నిలిచారు. షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో గుంటూరుకు చెందిన విజయ్, గోపి ప్రథమ స్థానంలో, గుంటూరుకు చెందిన జితేంద్ర, నవీన్‌ల జోడి ద్వితీయ స్థానంలో నిలిచారు. విజయవాడ వీఆర్ సిద్ధార్థ ఇంజినీర్ కళాశాలకు చెందిన ప్రవీణ్, కృష్ణల జోడి తృతీయ స్థానంలో నిలిచింది. వాలీబాల్ విభాగంలో పల్నాడు జిల్లాకు చెందిన జీఆర్‌సీఆర్‌కే పాఠశాల, గుంటూరు జిల్లాకు చెందిన మేడికొండూరు జట్లు ప్రథమ ద్వితీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు నగదు బహుమతితోపాటు షీల్డ్ అందించారు. జీఆర్‌సీఆర్‌కే శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్లు గుత్తా రాము, కవిత పాల్గొన్నారు. -
బాలల బ్యాగు పట్టని బాబు!
శనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పుస్తకాలు పెట్టుకునేందుకు విద్యార్థులకు తప్పని తీవ్ర కష్టాలు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో కిట్లు పంపిణీ నాసిరకం కావడంతో నెల రోజులకే చీకు పట్టి చినిగిపోయిన బ్యాగులు జిల్లాలో పంపిణీ చేసిన కిట్లలో 85 శాతానికిపైగా చినిగిపోయినవే పుస్తకాలు పెట్టుకునేందుకు నిత్యం ఇబ్బందులు తప్పని విద్యార్థులు తల్లిదండ్రులపై భారం పడుతున్నా విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం జిల్లాకు 1,40,297 కిట్లు సరఫరా కొత్తవి పంపిణీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ -
జిల్లాలో గ్యాస్ డెలివరీ పారదర్శకంగా ఉండాలి
ఎల్పీజీ, ఎఫ్పీ డీలర్లతో పౌరసరఫరాల అధికారి కీలక సమావేశాలు నరసరావుపేట: జిల్లాలో గ్యాస్ డెలివరీ పారదర్శకంగా ఉండాలని పల్నాడు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎంవీ ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐవీఆర్ఎస్ కాల్ సర్వే ద్వారా పౌరుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్యాస్ డెలివరీ వ్యవస్థ, డెలివరీ బాయ్స్ ప్రవర్తన, దీపం–2 అమలుపై వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సానుకూల అభిప్రాయాలను డీలర్లకు వివరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సానుకూల దృక్పథం కోసం డెలివరీ బాయ్స్‌కు కఠిన ఆదేశాలు జారీ చేయాలని డిస్ట్రిబ్యూటర్లను ఆదేశించారు. వినియోగదారులకు సకాలంలో గ్యాస్ అందించడం, మర్యాదపూర్వకంగా ప్రవర్తించటం, రసీదు కంటే అధికంగా డబ్బులు వసూలు చేయకుండా ఉండటం, బుకింగ్ నుంచి డెలివరీ వరకు పారదర్శకత పాటించడం తప్పనిసరిగా నిర్వహించాలి స్పష్టం చేశారు. జిల్లాలోని దాచేపల్లి, రొంపిచర్ల రేషన్‌షాపు డీలర్లతో సమావేశాలు నిర్వహించి సానుకూల దృక్పథం లేని డీలర్లను గుర్తించి, వారి పని తీరును తక్షణం సరిదిద్దుకోవాలని హెచ్చరించారు. ప్రతినెలా నాణ్యమైన రేషన్ సరుకులు విధిగా ఇవ్వాలని, లేనిపక్షంలో తగు చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
పీఆర్కే తిరిగి వస్తాడు.. ప్రజల మనిషిగానే ఉంటాడు
మాచర్ల : రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో బ్లడ్ బుక్‌ను నడుపుతున్నారని, చట్టాన్ని చుట్టం చేసుకొని అత్యంత దారుణంగా వైఎస్సార్సీపీ నేతలను అణచివేయడమే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తుందని, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు సంఘీభావంగా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, సత్తెనపల్లి సమన్వయకర్త సజ్జల సుదీర్ భార్గవ్‌రెడ్డి, పొన్నూరు నియోజక వర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, గురజాల వర్గ నాయకులు కేవీలు మాట్లాడారు. -
వైఎస్సార్ సీపీ నుంచి ఏరువ వెంకటేశ్వరరెడ్డి సస్పెన్షన్
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన ఏరువ వెంకటేశ్వరరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నరసరావుపేటనియోజకవర్గానికి చెందిన కొత్తూరి కిషోర్‌బాబును రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అచ్చంపేట: స్థానిక పీహెచ్సీలో పనిచేసే సిబ్బందికి అధికారులకు మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా గత మూడు నెలల జీత భత్యాలు రాని వైనంపై పీహెచ్‌సీకి ‘విభేదాల రోగం’ శీర్షికన ఈనెల 7న సాక్షి పల్నాడు జిల్లా పేజీలో ప్రచురితమైన వార్తకు ఉన్నతాధికారులు స్పందించారు. రెగ్యులర్ ఉద్యోగులకు రావలసిన రెండు నెలలకు, కాంట్రాక్టు ఉద్యోగులకు రావలసిన మూడు నెలల బకాయిలను చెల్లించారు. సిబ్బందికి వెంటనే జీతాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా అచ్చంపేట వైద్యాధికారి డాక్టర్ సీహెచ్ స్రవంతి తెలిపారు. ఇదిలా ఉండగా, బకాయిలో చెల్లింపులో జాప్యంపై ఆరాతీస్తే నిజాలు బయటకు వస్తున్నాయి. గత ఏడాదిన్నరగా పీహెచ్సీలో పనిచేసే యూడీసీ తరచూ విధులకు గైర్హాజరవుతూ గోరంట్ల నుంచి బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు వేసుకుంటున్న నిజం బయటపడింది. ప్రస్తుతం పీహెచ్సీలో పనిచేసే యూడీసీ గతంలో పనిచేసిన యూడీసీ రషీద్ చేత బిల్లులు వేయిస్తారని, ఆ యూడీసీ గుంటూరు జిల్లా మేడికొండూరుకు బదిలీ అయి అక్కడ నుంచే గత ఏడాదిన్నరగా అచ్చంపేట పీహెచ్‌సీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు మొత్తం నడుపుతున్నారన్న అంశం బయటకు వచ్చింది. ఇప్పుడు గత యూడీసీ ఇకపై తాను బిల్లులు వేయడం కుదరదని చెప్పడంతో ఈ యూడీసీ నిర్వహించాల్సిన విధులు కొన్ని నిలిచిపోగా మరికొన్ని అందుకు సంబంధించిన ఉద్యోగులే చేసుకుంటున్నారు. జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశంలో డీఆర్ఓ నరసరావుపేట: జిల్లాలో సున్నా నుంచి ఐదేళ్ల వయస్సు పిల్లలు అందరికీ తప్పనిసరిగా పోలియా చుక్కలు అందజేయాలని, ఒక్క చిన్నారిని కూడా వదలకుండా ఇంటింటి పర్యటనలు, హైరిస్క్ ప్లాన్లు అమలు చేయాలని డీఆర్ఓ ఏకా మురళీ ఆదేశించారు. ఈ నెల 21న నిర్వహించే నేషనల్ ఇమ్యునైజేషన్ డై సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. హాజరైన డీఎంహెచ్ఓ డాక్టర్బి.రవి. డీఐఓ డాక్టర్ వై.రాంబాబు, ఇతర అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలియో బూత్‌ల ఏర్పాటు వంటి అంశాలు పరిశీలించారు. వలస కుటుంబాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రదేశాలు, బస్స్టాండ్లు రైల్వేస్టేషన్లు ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని కోరారు. మాచర్ల: ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీఎంఈఎఫ్) పల్నాడు జిల్లా ప్రథమ మహాసభ పట్టణంలోని మానుకొండ కల్యాణ మండపంలో శనివారం నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేపల్లి అబ్రహం లింకన్, మాచర్ల ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు చెరుకూరి గోపాల్, కొమ్ము నాగరాజు, మక్కెన సీతయ్యలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా అబ్కాస్ ఉద్యోగులుగా పనిచేస్తూ రెగ్యులర్ కాకపోగా ప్రభుత్వ విధానాలు మారినప్పుడల్లా అన్నీ విభాగాలు తొలగిస్తూ రోడ్డున పడవేయటం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఏ, పీఆర్సీ, ఎన్‌క్యాష్‌మెంట్ లీవ్‌లతోపాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న తాము నాన్ పిహెచ్సి ఉద్యోగులుగా తాగునీరు, రోడ్లు, కాల్వల నిర్మాణం, అనేక గంటలు పనిచేస్తూ, పండుగ సెలవులు లేకుండా ఇబ్బందులు పడుతున్నామన్నారు. వీటన్నింటిని పరిష్కరించేందుకు మున్సిపల్ ఉద్యోగులు అన్నీ విభాగాలను సంఘటితం చేసి మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభలో రాష్ట్ర కార్యదర్శి బందెల రవికుమార్, ఈదులమూడి రవిబాబు, సోమిశంకరరావు, కునపాముల విఘ్నేష్, రేలంగి నాగరాజుతోపాటు పలువురు పాల్గొంటారన్నారు. -
సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోండి
నరసరావుపేట రూరల్: విద్యార్థులు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని పోలీసు సిబ్బందికి, విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు శుక్రవారం బహుమతులు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కృష్ణారావు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. లైంగిక వేధింపుల నుంచి మహిళలను, చిన్నారులను రక్షించడంలో విద్యార్థుల పాత్ర, నేటి పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థుల విభాగంలో సీహెచ్ నవ్యశ్రీ (సత్తెనపల్లి), ఏ.ప్రవల్లిక (నరసరావుపేట), జే.వైష్ణవి (సత్తెనపల్లి)లు, పోలీసు సిబ్బంది విభాగంలో బి.ఆనంద్, బి.సరోజ్‌కుమార్, ఎం.అనిల్‌లు విజేతలుగా నిలిచారు. వీరికి జిల్లా ఎస్పీ కృష్ణారావు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(ఏఆర్) సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ, వెల్ఫేర్ ఆర్ఐ ఎల్.గోపినాథ్ పాల్గొన్నారు. విద్యార్థులకు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు సూచన -
విద్యార్థుల మృతికి కారణమైన ఐదుగురు నిందితుల అరెస్టు
చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతికి కారణమైన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల నాలుగవ తేదీన చిలకలూరిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మేడగం రామిరెడ్డి, మెరుగు వెంకట నాగ శ్రీకాంత్‌రెడ్డి, గొడవర్తి యశ్వంత్‌సాయి, శివరాత్రి మహేష్‌బాబు, వంగవల్లు వాసు మృతి చెందారు. దీనికి కారణం నరసరావుపేటలో ఏఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాసరావు కుమారుడు మదమంచి వెంకట అనుజ్ఞనాయుడు తన అనుచరులైన పుల్లంశెట్టి మహేష్, బెల్లంకొండ గోపీ, షేక్ నబీబాష, నాలి వెంకటరావులతో కలసి టీఎస్ 08హెచ్‌వై 3158 అనే నంబరుగల కారుతో వాహనాలు ఆపి వాహనదారులను బెదిరించి, కొట్టి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేపట్టాడు. ఇందులో భాగంగా చిలకలూరిపేట బైపాస్ రోడ్డులో మహేంద్ర ట్రాక్టర్ల లోడ్‌తో వెళుతున్న ఎంహెచ్40 డీసీ 0889 నంబర్ గల ట్రాలీ లారీని క్రాస్ చేసి ఆపారు. ఎటువంటి ముందు జాగ్రత్తలు పాటించకుండా హైవే రోడ్డుపై ఒక్కసారిగా భారీ వాహనాన్ని అడ్డుకొని ప్రమాదానికి కారణమయ్యారు. ఒక్కసారిగా భారీ ట్రాలీ లారీ ఆగడంతో వెనుక ఏపీ 40 ఏబీ 0685 కారులో ప్రయాణిస్తున్న విద్యార్థుల కారు లారీ వెనుక భాగంలోకి చొచ్చుకుపోయి ఇరుక్కుపోయారు. ఇందులో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా ఇంకొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఇంకా చికిత్స పొందుతున్నాడు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు... ప్రధాన నిందితుడు మదమంచి వెంకట అనుజ్ఞ నాయుడుతో పాటు అతని అనుచరులపైన పలు పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయి. కోటప్పకొండ వద్ద పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ. 10 లక్షలకు రూ.50 లక్షలు ఇప్పిస్తామని మోసానికి పాల్పడిన కేసులోనూ ఇతను నిందితుడు. వీరు పలు కార్ల దొంగతనాలకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి కారణమైన సమయంలో ఉపయోగించిన కారుకూడా దొంగిలించిన కారుగానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితులు చేసిన ఇతర నేరాలకు సంబంధించి విచారణ నిమిత్తం న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టి పోలీసుల కస్టడీకి తీసుకొని మరింత లోతుగా విచారిస్తామని తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు, నాదెండ్ల ఎస్ఐ జి. పుల్లారావు, రూరల్ ఎస్ఐ జి. అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
ప్రభుత్వం కూలిపోవడం ఖాయం
నరసరావుపేట: మహిళలే కదా ఏం చేస్తారులే అని అంగన్వాడీలను ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూ నిర్లక్ష్యం చేస్తున్నాయని, అంగన్వాడీలు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయమని సీఐటీయూ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ హెచ్చరించారు. గత సమ్మె కాలపు ఒప్పందాలకు ఇచ్చిన హామీలు, కనీస వేతనాలు, గ్రాట్యుటీ తదితర సమస్యలు పరిష్కారం కోసం ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం కలెక్టరేట్ వద్ద యూనియన్ పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గాంధీ పార్కు వద్ద గల ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్లో డీఆర్ఓకు మురళికి వినతిపత్రం అందజేశారు. జిల్లా కార్యదర్శి శాంతమణి అధ్యక్షత వహించిన సభలో ఆంజనేయులు నాయక్, జిల్లా గౌరవాధ్యక్షురాలు జి.మల్లీశ్వరి, డి.శివకుమారి, టి.శ్రీనివాసరావు, రైతు, కౌలు రైతు సంఘాల జిల్లా కార్యదర్శిలు ఏపూరి గోపాలరావు, వై.రాధాకృష్ణ, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు ఏ.ఎల్.ప్రసన్న మాట్లాడారు. అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, 42 రోజుల చారిత్రాత్మక సమ్మెకు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు నాడు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ అధికారులు తనిఖీలకు వెళ్లిన సమయంలో సంబంధం లేని కారణాలతో షోకాజు నోటీసులు ఇస్తున్నారన్నారు. ప్రాజెక్టు లీడర్లు బి.నిర్మల, సాయికుమారి, మాధవి, శివపార్వతి, విజయలక్ష్మి, అహల్య, సుజాత, తులసి, పద్మ, రమణ, సావిత్రి, ఉషా 500 మందికి పైగా అంగన్వాడీలు పాల్గొన్నారు. -
చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షిస్తాం
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా దాచేపల్లి: చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. మండలంలోని గామాలపాడు గ్రామంలో పల్నాటి తొలి మహిళ మంత్రి నాయకురాలు నాగమ్మ నిర్మించిన దేవాలయాన్ని శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. దేవాలయంలో వద్ద గ్రామస్తులు, కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంత రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయానికి సంబంధించిన భూ సమస్యలపై ఆరా తీశారు. పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న భూములను తిరిగి దేవాలయానికి చెందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎంతో ప్రాచీన దేవాలయంగా ప్రసిద్ధి గాంచిన ఈ దేవాలయం అభివృద్ధికి తమ వంతు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. కలెక్టర్ వెంట గురజాల ఆర్టీవో మురళీకృష్ణ, సర్పంచి జంగా సురేష్, తహసీల్దార్ జీ.శ్రీనివాస్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి తదితరులు ఉన్నారు. ఏపీఐఐసీ భూములను పరిశీలన మాచర్ల రూరల్: వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని రాయవరం గ్రామంలో ఏపీఐఐసీ భూములను పరిశీలించి మాట్లాడారు. 200 ఎకరాల ఏపీఐఐసీ భూములకు అప్రోచ్ రోడ్డు, విద్యుత్ సరఫరా తదితర విషయాల పై అధికారులతో మాట్లాడారు. సర్వే రికార్డులను ఆమె పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేశారు. గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, తహసీల్దార్ బి. కిరణ్‌కుమార్ ఉన్నారు. -
రైతు నెత్తిన ఎరువు దరువు
● ఎమ్మార్పీ కంటే అధికంగా వ్యాపారుల విక్రయం ● వ్యవసాయానికి భారీగా పెరిగిన పెట్టుబడులు ● చంద్రబాబు ప్రభుత్వంలో పెట్టుబడి సాయం అంతంత మాత్రమే ● ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించక తీవ్ర నష్టాలు ● జిల్లాలో 2,76,947 హెక్టార్లలో వివిధ పంటల సాగు సత్తెనపల్లి: చంద్రబాబు పాలనలో ఎరువుల, ధరలు భగ్గుమంటున్నాయి. ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచుకుంటూ పోతుండడంతో రైతుల పై మోయలేని భారం పడుతోంది. పెట్టుబడి సాయం అంతంతమాత్రంగానే ఉండటం, గిట్టుబాటు ధరలు లేక నష్టాలు పాలవుతున్నారు. గత ఏడాది సాగు చేసిన వరి, మిర్చి, పత్తి రైతులు భారీగా నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది ఽపంట ఉత్పత్తులు ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ఇప్పుడు ఎరువుల ధరలు పెరగడంతోపాటు బస్తాకు అదనంగా వ్యాపారులు దోచుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ తీరుపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర రాక నష్టాల బాట.. జిల్లా వ్యాప్తంగా 2,76,947 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతు న్నాయి. అందులో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, తదితర పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది వరికి మద్దతు ధర రాకపోవడంతో రైతులు నష్టాలు బాట పట్టారు. తీరా పంట చేతికి వచ్చేసరికి ధాన్యానికి ధరలు లేక దళారులకు తక్కువ ధరకే విక్రయించుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎకరా పంట సాగు చేయడానికి పంటను బట్టి రూ.35 వేల నుంచి రూ.80 వేల పైనే ఖర్చవుతోంది. ఈ ఏడాది ఎరువులు, కూలీల ధరలు పెరగడంతో సాగు ఖర్చులు మరో రూ.15 వేలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పంట ఉత్పత్తుల ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ప్రధానంగా ఇటీవల కురిసిన మోంథా తుఫాన్‌తో పత్తి పంట తడిచి నల్లగా మారింది. దీంతో తేమశాతం పేరుతో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. -
కాల భైరవస్వామికి పూజలు
పెదపులివర్రు (భట్టిప్రోలు): వ్యాఘ్రపుర క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన భట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామ దేవత శ్రీ గోగులమ్మ వారి దేవాలయంలో కొలువైన శ్రీ కాల భైరవస్వామి వారికి మార్గశిర బహుళాష్టమి శుక్రవారం ప్రాతఃకాలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ దేవత అమ్మవారి దేవాలయంలో నిత్యపూజ కై ంకర్యాలు విరజిల్లుతూ భక్తుల కోర్కెలు తీర్చే బంగారు కల్పవల్లి అమ్మవారిని భక్తులు సందర్శించారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు సంపత్‌నగర్ శ్రీరామనామ క్షేత్రంలో నిర్వహిస్తున్న 99వ శ్రీరామకోటి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి మూలవిరాట్లకు పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలు, అలంకరణ జరిగాయి. ప్రత్యేకంగా అలంకరించిన స్వామి ఉత్సవ మూర్తులను తెప్ప తిరునాళ్లతో మహోత్సవం నిర్వహించారు. అనంతరం హోమం, పూర్ణాహుతి చేయగా, వసంత సేవ, అవబదోత్సవం, చక్రతీర్థం కార్యక్రమాలు నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరు కాగా, కార్యక్రమాలను ఆలయ ట్రస్ట్ రాగం వెంకట లీలా సుందరి బెల్లంకొండ మస్తానరావు పర్యవేక్షించారు. నరసరావుపేట రూరల్: మిరప పంటలో తెగుళ్లు, చీడపీడలను అరికట్టేందుకు సస్యరక్షణ చేపట్టాలని పల్నాడు జిల్లా ఉద్యాన అధికారి ఐ.వెంకట్రావు తెలిపారు. జిల్లా ఏరువాక కేంద్రం కో–ఆర్టినేటర్ డాక్టర్ ఎం.నగేష్, నరసరావుపేట ఉద్యాన అధికారి షేక్ నబీ రసూల్‌లతో కలిసి ఆయన శుక్రవారం మిరప తోటలను పరిశీలించారు. పోషక లోప నివారణకు పైపాటుగా 19–19–19, ఫార్ములా–6, మెగ్నీషియం సల్ఫేట్‌ను పిచికారి చేయాలని తెలిపారు. తెల్లనల్లి నివారణకు డైఫెన్డుయురాన్ 1.25 గ్రాములు లేదా స్పెరోమైసిఫెన్ ఒక మి.లీ.ను లీటరు నీటితో కలిపి పిచికారి చేయాలని సూచించారు. తెల్లదోమ నివారణకు ఎకరాకు 20 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలను పొలంలో ఏర్పాటుచేసి, ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా థాయోమిథాగ్సం 0.4 గ్రాములు లేదా స్పెరోమైసిఫెన్ ఒక మీ.లీను లీటరు నీటితో కలిపి పిచికారి చేయాలని సూచించారు. నల్లతామర నివారణకు సైయాన్ట్రనిలిప్రోల్ 240 మి.లీ ఎకరానికి లేదా ఇమిడా క్లోప్రిడ్, ఫెఫ్రోనిల్ 50 గ్రాములు రెండు కలిపి ఎకరాకు పిచికారి చేయాలని తెలిపారు. నగరంపాలెం (గుంటూరు వెస్ట్): మహా కాల భైరవాష్టమిని పురస్కరించుకుని శుక్రవారం గుంటూరు నల్ల చెరువు ఒకటో వీధిలో శ్రీభవానీ శంకర శివసేన పూజ్య గురువులు శ్రీ సూర్యచంద్రేశ్వరానంద స్వామీజీ ఆధ్వర్యంలో కాల భైరవ జయంతి ఆరాధన శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహాకాల భైరవాష్టమి విశిష్టతను భక్తులకు స్వామీజీ వివరించారు. అనంతరం భక్తులకు భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. -
పల్నాడులో పోలీసుల ప్రత్యేక రాజ్యాంగం
నరసరావుపేట రూరల్: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. తమ పార్టీ నేత, వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలు సుప్రీం కోర్టు ఆదేశాలతో కోర్టులో లొంగిపోతుండటంతో ఆయనను పరామర్శించేందుకు వెళుతున్న నాయకులను హోస్ అరెస్ట్‌లు చేయడం దారుణమని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పల్నాడు జిల్లాలో పోలీసులు ప్రత్యేక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరులు సమావేశంలో వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, వైఎస్సార్పీపీ అధికారప్రతినిధి యాదవ్ మాట్లాడారు. పిన్నెల్లి సోదరులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గం చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చేలా పల్నాడు పోలీసు చర్యలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో వైఎస్సార్సీపీపై ఆంక్షలు ఓవరాక్షన్ చేసే పోలీసులపై చర్యలు ఉంటాయి అక్రమ కేసులు నమోదు చేసే పోలీసులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తాం వెఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే కాసు, పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి నాగార్జున యాదవ్ -
యొనుమలను అడ్డుకున్న పోలీసులు
మాచర్ల రూరల్: జంట హత్యల కేసులో అక్రమంగా ఇరికించిన పిన్నెల్లి సోదరులను పరామర్శించేందుకు వస్తున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు, వినుకొండ నియోజక వర్గాల పరిశీలకుడు యెనుముల మురళీధర్‌రెడ్డిని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. గురువారం బస్టాండ్‌లో మురళీధర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలు నేడు కోర్టులో లొంగిపోతున్న వారిని కలిసి మాట్లాడదామని వస్తుంటే పోలీసులు అడ్డుకోవటం పై ఆయన తీవ్రంగా ఆగ్రహించారు. ప్రజాస్వామ్యంలో అందరినీ సమానంగా చూడాలని, అధికార పార్టీకి సలాం కొడుతూ వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటూ పోలీసులను హెచ్చరించారు. సంఘీభావం తెలిపే హక్కు కూడా లేదా గురజాల : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో లోంగిపోతున్నారనే సమాచారం రావడంతో సంఘీభావం తెలిపేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి,యెనుముల మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన తన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘీభావం తెలిపే హక్కు కూడా మాకు లేదా అని ప్రశ్నించారు. కోర్టు కేవలం వారిని సరండర్ కావాలని అర్డర్ ఇచ్చిందే కానీ సంఘీభావం తెలపకూడదని అని ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఒక నిర్భందమైన పరిస్థితి కొనసాగుతుంది. ఎమర్జెన్సీ పాలన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. పోలీసులు ఒక పద్ధతి లేకుండా ప్రవర్తిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం జరుగుతుందన్నారు. జె.పంగులూరు: స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టు ఎంపిక శనివారం జరగనున్నట్లు కేకేఎఫ్ఐ ప్రెసిడెంట్ ఎం. సీరామిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచి సీనియర్ (మెన్), జూనియర్(బాయ్స్) క్రీడాకారుల ఎంపిక జరగనున్నట్లు తెలిపారు. ఈ ఎంపికలో పొల్గొనే క్రీడాకారుల్లో జూనియర్ బాలుర విభాగంలో 31 డిసెంబర్ 2025 నాటికి 18 సంవత్సరాలు లోపు ఉండాలని, 1జనవరి 2008 తరువాత పుట్టిన వారు అయి ఉండాలని తెలిపారు. సెలక్షన్లకు వచ్చే క్రీడాకారులు తప్పనిసరిగా అధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని తెలిపారు. సీనియర్ (పురుషుల) విభాగంలో ఆధార్ కార్డు, టెన్త్ మార్కులిస్టు మెమో తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 9848156652 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. -
‘రొంపిచర్ల’ టీడీపీలో ముసలం
రొంపిచర్ల: మంత్రి లోకేశ్ పీఏ పేరుతో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు చేస్తున్న అరాచకాల నుంచి తమను కాపాడాలంటూ పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం వీరవట్నంలో గ్రామ టీడీపీ నాయకులు గురువారం నిరాహారదీక్షకు దిగారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నాయకులు జాష్ఠి శ్రీనివాసరావు, జాష్ఠి ప్రసాదు, వెలగటూరి వెంకటనారాయణ నిరాహారదీక్ష చేపట్టారు. చల్లా సుబ్బారావు గత 18 నెలల కాలంలో చేసిన దందాలు, అక్రమవసూళ్లు, రౌడీలతో ఊళ్లో చేస్తున్న అల్లర్లు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగాలిప్పిస్తానని దళితవాడలో కొందరి నుంచి డబ్బు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అన్నవరపు పంతులు నుంచి రూ.1.50 లక్షలు తీసుకుని, అడిగితే బెదిరిస్తున్నారని తెలిపారు. పదవి ఇప్పిస్తానని జాష్ఠి ప్రసాద్‌తో రూ.10 లక్షల వరకు ఖర్చుచేయించినట్లు పేర్కొన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇళ్లపై రౌడీలతో దౌర్జన్యం చేయిస్తున్నారని ఆరోపించారు. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.30 లక్షల బిల్లులను సైతం అడ్డుకుంటున్నాడన్నారు. కోడెల శివప్రసాద్ హయాంలో నిర్మించిన నీటిసంఘం భవనానికి రంగులు వేసి ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల బిల్లు చేసుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ఆ భవనం పక్కనున్న స్థలాన్ని సుబ్బారావు ఆధ్వర్యంలోనే ఆక్రమించారన్నారు. కోడెల ఆవిష్కరించిన మూడు శిలాఫలకాలను సుబ్బారావు ధ్వంసం చేశారన్నారు. ఈ విషయమై రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తిరిగి తమపైనే కేసులు పెట్టారని, దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని చెప్పారు. సుబ్బారావు అరాచకాల గురించి ఎమ్మెల్యే అరవిందబాబుకు, ఎంపీకి, ఇన్చార్జి మంత్రికి కూడా ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. వీరవట్నంలో తెలుగుదేశం నాయకులు నిరాహారదీక్ష చేస్తున్నారని తెలిసిన వెంటనే పోలీసులు వెళ్లి మాట్లాడి విరమింపజేశారు. గ్రామంలో పార్టీ నాయకులు కూడా ఆందోళనకు దిగినవారికి సర్దిచెప్పారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సుబ్బారావు నుంచి తమను కాపాడాలంటూ వీరవట్నంలో పార్టీ నేతల నిరాహారదీక్ష లోకేశ్ పీఏ పేరుతో సుబ్బారావు చేసిన అరాచకాలంటూ ఫ్లెక్సీ ఏర్పాటు -
టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణతకు ప్రథమ ప్రాధాన్యం
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారిగా పి.వి.జే.రామారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. కృష్ణాజిల్లా డీఈఓగా పనిచేస్తున్న రామారావు పల్నాడు జిల్లాకు బదిలీపై వచ్చారు. కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన రామారావును పలువురు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు సంఘం, ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించటమే ప్రథమ ప్రాధాన్యతగా గుర్తిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక మేరకు ఉత్తమ ఫలితాలు సాధిస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని తెలిపారు. మెగా డిఎస్సీ– 2025 ఉపాధ్యాయ నియామకాలతో పాటు విద్యా వాలంటీర్లను ప్రభుత్వం నియమించిందని వివరించారు. అలాగే ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక గెజిటెడ్ అధికారిని పరిశీలకునిగా నియమిస్తున్నదని తెలిపారు. ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన 100 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థులను షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్‌గా విభజించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు ఒక్కో సబ్జెక్ట్‌లో స్లిప్ టెస్ట్‌లు నిర్వహిస్తూ విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా బోధన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పది విద్యార్థుల నూరు శాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులు, సిబ్బంది సహకరించాలని కోరారు. జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సహకారంతో పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. జిల్లా డీఈఓగా పి.వి.జే.రామారావు బాధ్యతలు స్వీకరణ -
ప్రజల మద్దతున్న పీఆర్కేపై కేసులా?
గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం ఇన్చార్జి అన్నా వెంకట రాంబాబు మాచర్ల రూరల్: పల్నాడు చరిత్రలో వరుసగా నాలుగుసార్లు గెలిచి ప్రజల మద్దతు ఉన్న పీఆర్కేను రాజకీయంగా అణచివేసే ధోరణిలోనే అక్రమ కేసు నమోదు చేశారని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం ఇన్చార్జి అన్నా వెంకట రాంబాబు అన్నారు. అక్రమ కేసులకు, వేధింపులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు భయపడబోరన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై వేధింపులకు దిగుతూ, అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగనన్న నాయకత్వంలో ఇలాంటి అక్రమ కేసులను ఎదుర్కొని మరింత ఉత్సాహంగా ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. -
మాతృ మరణాలను నిరోధించాలి
నరసరావుపేట రూరల్: మాతృ మరణాలను నిరోధించే విధంగా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా స్థాయి మాతృ మరణాల పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ హై రిస్క్ ప్రెగ్నెన్సీలపై క్షేత్ర స్థాయి సిబ్బంది ముందుగానే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. రక్తంలో హీమో గ్లోబిన్ స్థాయి, గర్భిణులు, ఆరోగ్య, ఆదాయ స్థితిగతులను బట్టి హైరిస్క్ ప్రెగ్నెన్సీలను గుర్తించాలని తెలిపారు. జిల్లాలో చోటుచేసుకున్న ఐదు మాతృ మరణాలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరారు. బాధితుల కుటుంబీకుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రవి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి గౌతమి, డీసీహెచ్‌ఎన్ ప్రసూన, డీఐవో రాంబాబు, డీఎల్వో మాధవీలత పాల్గొన్నారు. సత్తెనపల్లి: పెను ప్రమాదం త్రుటిలో తప్పిన సంఘటన సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం వద్ద గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపాలెం మండలం ఉప్పలపాడు నుంచి పత్తి లోడుతో ట్రాక్టర్ గుంటూరు వెళుతుంది. అదే సమయంలో సత్తెనపల్లి వైపు నుంచి సిమెంటు లోడుతో లారీ గుంటూరు వెళుతుంది. ట్రాక్టర్‌ను ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పిన లారీ తగిలి పత్తి లోడు ట్రా క్టర్ ముందు చక్రం ఊడి పోవడంతో ట్రాక్టర్‌కు ఉన్న పత్తి లోడు ట్రక్కు బోల్తా కొట్టింది. కాగా ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారిగా డాక్టర్ షేక్ సలీమ్ బాషా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియాను కలెక్టరేట్లోని ఆమె ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం డీఈవో సలీమ్ బాషాను పలువురు ఎంఈవోలతో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన డీఈవో సలీమ్ బాషా మాట్లాడుతూ తాను రెగ్యులర్‌గా పాఠశాలలను సందర్శిస్తానని, పాఠశాలల్లో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని చెప్పారు. విద్యాబోధన తీరుతెన్నులపై విద్యార్థులతో నేరుగా మాట్లాడతానని పేర్కొన్నారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. వేటపాలెం: పందిళ్లపల్లి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థి రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించినట్లు హెచ్ఎం తలమల దీప్తి గురువారం తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీలో ఈనెల 9, 10 తేదీల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14 విభాగంలో రాష్ట్రస్థాయి బాల, బాలికల ఫెన్సింగ్ పోటీలు జరిగాయని తెలిపారు. పోటీల్లో ఆరో తరగతి విద్యార్థి ఎం.దీపక్ రామ్ హర్షిత్ ప్రతిభ కనపర్చి గోల్డ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. విద్యార్థిని క్రీడల్లో ప్రోత్సహించడానికి స్టాఫ్ సెక్రటరీ బుద్ది మోహనరావు రూ.1000 బహూకరించి అభినందించారు. పీఈటీ కర్ణ నాగేశ్వరరావు, తోట వెంకటేశ్వర్లు అభినందించారు. -
ముక్కోటి మహోత్సవాలను విజయవంతం చేయాలి
మంగళగిరి టౌన్ : అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను ప్రశాంతంగా సజావుగా విజయవంతం అయ్యేలా కృషి చేయాలని మంగళగిరి తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర సూచించారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో గురువారం వివిధ శాఖలకు చెందిన అధికారులతో ముక్కోటి ఏకాదశి పర్వదిన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ మంగళగిరిలో వేంచేసి యున్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్, ఎంటీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, పట్టణ ఎస్ఐ రవీంద్రనాయక్, యూపీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ అనూషలతో పాటు విద్యుత్‌శాఖ, ఎస్సైజ్శాఖ, ఆర్టిసి, అగ్నిమాపక శాఖల అధికారులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. బీ.ఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల ఏఎన్‌యూ(పెదకాకాని): ఈ ఏడాది సెప్టెంబరు నెలలో జరిగిన బీ.ఫార్మసీ ఐదో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఏఎన్‌యూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ఆలపాటి శివప్రసాద్ తెలిపారు. మొత్తం పరీక్షకు 370 మంది హాజరు కాగా 211 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈనెల 23వ తేదీలోగా పీజీ కో–ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కు రూ.2070 ఫీజు చెల్లించాలన్నారు. ఈ ఏడాది అక్టోబరులో జరిగిన ఫార్మా.డి మొదటి సెమిస్టర్‌కు 285 మంది హాజరు కాగా వారిలో 194 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. రీవాల్యుయేషన్‌కు 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 23వ తేదీలోగా పీజీ కో–ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కు రూ.2070 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు. గుంటూరు రైల్వే స్టేషన్లో సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : గుంటూరు రైల్వే స్టేషన్లో 500 కేవీపీ, గ్రిడ్ సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించడం సంతోషకరమని గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ సుధేష్ణసేన్ తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్లో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్‌ను డీఆర్ఎం ప్రారంభించారు. ముందుగా సౌర విద్యుత్ ప్లాంట్ వివరాలు సంబంధిత అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన రూఫ్ టాప్ సౌర ప్లాంట్ సుమారు 8.10 లక్షల యూనిట్లు శుద్ధ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రూపొందించడం జరిగిందన్నారు. నేటి నుంచి గుంటూరులో క్రెడాయ్ ఎక్స్పో నగరంపాలెం(గుంటూరు వెస్ట్): క్రెడాయ్ 8వ ప్రాపర్టీ ఎక్స్పోను ఈనెల 12, 13, 14 తేదీల్లో సిద్ధార్థ కన్వెన్షన్ హాల్ (గుంటూరు రింగు రోడ్లో) నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ ఏపీ మాజీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి గురువారం తెలిపారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రాపర్టీ షో కొనసాగుతుందని అన్నారు. బ్యాంక్‌లు, బిల్డర్స్, మెటీరియల్ దుకాణాలు, కన్‌స్ట్రషన్స్ దుకాణాల నిర్వాహ కులు పాల్గొంటారని పేర్కొన్నారు. క్రెడాయ్ ప్రెసిడెంట్ మామిడి రాము, షో కన్వీనర్ తియ్యగూర వినోద్‌రెడ్డి, క్రెడాయ్ కార్యదర్శి మెట్టు సాంబశివారెడ్డి మాట్లాడుతూ ఈ షోకు వచ్చేందుకు ప్రవేశం ఉచితమని అన్నారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా మొక్కలను పంపిణీ చేస్తామని తెలిపారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు శివనాగేశ్వరరావు, కోశాధికారి ఆళ్ళ నాగార్జునరెడ్డి, ఈసీ కళ్యాణ్‌చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
దేశంలోనే ఏపీ టూరిజాన్ని నెం.1 గా చేసేందుకు కృషి
విజయపురిసౌత్: సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ పర్యాటక శాఖ ను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. గురువారం టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు యం.దారు నాయక్ తో కలిసి పర్యాటక కేంద్రాలైన నాగార్జునసాగర్ లాంచీ స్టేషన్, ఎత్తిపోతలను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. నూతన టూరిజం పాలసీతో భారీగా పెట్టుబడులు వస్తాయన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ టూరిజం 19 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒప్పందాలు కుదర్చుకున్నట్లు తెలిపారు. సాగర్ లాంచీ స్టేషన్లో రెండు చిన్న బోట్లను త్వరలోనే నూతనంగా ప్రవేశ పెడతామన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ ఎస్ఈ ఈశ్వరయ్య, జీఎం నాంచారయ్య, డీవీఎం కృష్ణ చైతన్య, జిల్లా టూరిజం ఆఫీసర్ నాయుడమ్మ, మేనేజర్లు మస్తాన్ బాబు, యల్లాల బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
తప్పిపోయిన బాలిక పోలీసు రక్షణలో
●36 గంటల్లో కేసు ఛేదన ● పెంపుడు తల్లిదండ్రుల నుంచి పారిపోయానన్న ఏడేళ్ల పాప కారంచేడు: తప్పిపోయిన ఏడు సంవత్సరాల బాలిక చెవుటూరి నాగేంద్రాన్ని పోలీసులు గురువారం కనుగొన్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా ఏర్పడి వెతకడం ప్రారంభించారు. కేసు నమోదు అయిన 36 గంటల్లో పాపను పట్టుకున్నారు. కారంచేడు ఎస్ఐ షేక్ ఖాదర్‌బాషా అందించిన సమాచారం మేరకు.. మండల కేంద్రమైన కారంచేడు గ్రామానికి చెందిన చెవుటూరి వెంకటేశ్వర్లు, లక్ష్మి దంపతుల పెంపుడు కుమార్తె నాగేంద్రం ఈనెల 9వ తేదీన ఇంటి నుంచి బైటకు వెళ్లి అదృశ్యమైంది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎస్ఐ ఖాదర్‌బాషా బాపట్ల ఎస్పీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ సూచనలతో ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య సారథ్యంలో కారంచేడు, ఇంకొల్లు ఎస్ఐ సురేష్, చినగంజాం ఎస్ఐ రమేష్‌లు తమ సిబ్బందితో ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం తమ సిబ్బంది చిలకలూరిపేట ప్రాంతంలో వెతుకుతుండగా పాప ఆ ప్రాంతంలో సంచరించిన విషయం గమనించిన పోలీసులు పాపను జాగ్రత్తగా విచారించారు. తన పెంపుడు తల్లిదండ్రులు కొడుతుండటంతోనే తాను ఇంటి నుంచి పారిపోయానని తెలపడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. ఎస్ఐ ఖాదర్‌బాషా విషయాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగానికి తెలపడంతో వారి సూచనలతో పాపను బాపట్ల వన్‌స్టాప్ సఖి సెంటర్‌కు తరలించామన్నారు. పాప ఇష్ట్రపకారమే ఆమె పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించలేదని తెలిపారు. -
దొడ్లేరు రైతుల పోరాటం స్ఫూర్తిదాయకం
క్రోసూరు: దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం వస్తువుల కోసం బాధితులందరూ సమష్టిగా పోరాటం చేసిన ఫలితంగానే పరిహారం లభించిందని కౌలు రైతు, రైతు, వ్యసాయ కార్మిక సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు కరపత్రాలు పంపిణీ చేశారు. కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా కమిటీ సభ్యుడు తిమ్మిశెట్టి హనుమంతరావు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల కిందట దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో బంగారం కోల్పోయి, సరైన రసీదులు లేక అయోమయ పరిస్థితిలో ఆందోళన చేస్తూ రోడ్డెక్కిన రైతన్నలకు కౌలురైతు, రైతు – వ్యవసాయ కార్మిక సంఘాలు అండగా నిలిచాయని తెలిపారు. 2500 ఖాతాలు పరిశీలించి 500 మంది ఖాతాదారులు బంగారం కోల్పోయినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. మొదటి దశలో 370 మందికి వడ్డీతో సహా రూ.2 కోట్ల 50 లక్షలు నష్టపరిహారం చెల్లించారని తెలిపారు. మిగిలిన 120 మందికి సరైన ఆధారాలు లేకపోవడం వలన నష్టపరిహారం ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంకు అధికారులు చెప్పిన నేపథ్యంలో మరింత పట్టుదలతో ప్రజా సంఘాల సహకారంతో 2 సంవత్సరాల 4 నెలలపాటు పోరాటం చేసి చివరగా 474 మంది రైతులకు రూ.3.50 కోట్ల నష్టపరిహారాన్ని సాధించుకున్నట్లు తెలిపారు. దొడ్లేరు రైతాంగం చేసిన ఈ పోరాటం ఎలాంటి సమస్యనైనా సమష్టిగా పోరాటం చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని రుజువు చేసిందని, నేటి ప్రజానీకానికి ఎంతో స్ఫూర్తిదాయకం అని అన్నారు. కార్యక్రమంలో శిలర్షా, ఈశ్వర్‌రెడ్డి, దగ్గు నటరాజు, తదితరులు పాల్గొన్నారు.కౌలు రైతు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు -
మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కిల్కారి సేవలు
నరసరావుపేట రూరల్: మాతా శిశు మరణాలు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కిల్కారి సేవలు ప్రవేశపెట్టినట్టు జిల్లా ఆశ అధికారి సురేష్ తెలిపారు. నరసరావుపేటలోని బాబాపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కిల్కారి సేవలపై ఆశ, ఏఎన్ఎమ్లకు గురువారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ గర్భిణీ నుంచి పుట్టిన బిడ్డ సంవత్సరం వరకు నెలకు ఒక సారి వాయిస్ కాల్స్ ద్వారా సమాచారం ఇస్తుందని తెలిపారు. కిల్కారి కాల్ వచ్చే నెంబరును 911600403660 గర్భిణులు, బాలింతలు సేవ్ చేసుకోవాలని సూచించారు. అప్పుడే కాల్ వినగల్గుతారని, మళ్లీ వినాలంటే 14423, 18005321255 టోల్‌ఫ్రీ నెంబర్‌కి చేసి వినవచ్చని సూచించారు. ఈ కిల్కారి కాల్లో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హైరిస్క్, టీకాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులు, తల్లి బిడ్డలకు సలహాలు అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ రాజు పాల్గొన్నారు. -
బెదిరించినా ఎదిరించారు!
మాచవరం: మాచవరం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతలు, పోలీసుల బెదిరింపులకు లొంగకుండా ఎదిరించి నిలబడ్డారు. ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా మండల సర్వసభ్య ప్రత్యేక సమావేశానికి మొత్తం 14 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాల్సి ఉండగా, 11 మంది వచ్చారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి గైర్హాజరు అయ్యారు. టీడీపీకి ఆరుగురు సభ్యులు మద్దతు ఇచ్చారు. టీడీపీ తరఫున పిల్లుట్ల–1 ఎంపీటీసీ సభ్యురాలు కొక్కెర అంజమ్మ ఎంపీపీగా నామినేషన్ వేశారు. ఆకు రాజు పల్లి, కొత్త గణేశునిపాడు, వేమవరం, పిల్లుట్ల–2 ఎంపీటీసీలు మద్దతు ఇచ్చారు. వైఎస్సార్సీపీ తరఫున మొర్జంపాడు ఎంపీటీసీ సభ్యురాలు ముంగి మంగమ్మ నామినేషన్ వేయగా, గంగిరెడ్డిపాలెం ఎంపీటీసీ ముండ్లపాటి సత్యనారాయణ, మల్లవోలు ఎంపీటీసీ చుక్క సువార్తమ్మ, మాచవరం ఎంపీటీసీ మద్దు అనూరాధ మద్దతు ఇచ్చారు. మాచవరం –2 ఎంపీటీసీ చిట్టిప్రోలు గురవయ్య ఓటింగ్‌లో పాల్గొనకుండా తటస్థంగా ఉన్నారు. మెజార్టీ సభ్యులు టీడీపీ మద్దతు ఇవ్వడంతో అంజమ్మను ఎంపీపీగా ప్రకటించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. టీడీపీ నేతలు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు పార్టీకి అండగా నిలిచారు. మల్లవోలు సభ్యురాలు చుక్కా సువార్త, మాచవరం సభ్యురాలు మధు అనూరాధ, మొర్జంపాడు సభ్యురాలు ముంగి మంగమ్మ, గంగిరెడ్డిపాలెం ఎంపీటీసీ సభ్యుడు ముండ్లపాటి సత్యనారాయణలు పార్టీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వారిని, వారి కుటుంబసభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులకు పాల్పడినా, ప్రలోభాలు చూపినా లొంగకుండా గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి ఇచ్చిన ధైర్యంతో పార్టీకి మద్దతుగా నిలిచారు. ఎంపీటీసీ గురవయ్యకు సీఐ బెదిరింపు సమావేశానికి హాజరయ్యే ఎంపీటీసీ సభ్యులకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసుల తీరు మారలేదు. మాచవరం ఎంపీటీసీ సభ్యుడు చిట్టిపోలు గురవయ్యను దాచేపల్లి సీఐ భాస్కరరావు సమావేశంలో బెదిరించడంతో ఓటింగ్‌లో తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఎంపీటీసీని బెదిరించడాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు తప్పు పట్టాయి. సీఐ తీరుపై ఆక్షేపణ తెలిపాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, బెదిరింపులు వచ్చినా, ప్రలోభాలకు గురిచేసినా పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బలం లేకున్నా బరితెగింపు వాస్తవానికి టీడీపీకి తగిన బలం లేకున్నా వైఎస్సార్సీసీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను బెదిరించి, తమకు మద్దతు ఇవ్వకుంటే అక్రమ కేసులకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. అనేక ప్రలోభాలకు గురి చేశారు. బంధువులను పోలీసులు స్టేషన్లకు పిలిపించి బెదిరించారు.మండలంలో మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. ఎంపీపీ దారం అమ్ములమ్మ ఇటీవల మృతి చెందారు. గత స్థానిక సంస్థ ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాలకే పరిమితమైంది. వేమవరం ఎంపీటీసీ శానంపూడి లక్ష్మి, కొత్త గణేశుని పాడు ఎంపీటీసీ చల్లగుండ్ల లక్ష్మయ్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ ఫిరాయించారు. దీంతో టీడీపీ బలం నాలుగుకు చేరింది. వైఎస్సార్సీపీకి 10 సభ్యులు ఉన్నారు. వీరిలో ప్రలోభాలకు గురి చేయడంతో టీడీపీకి ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు మద్దతు ఇచ్చారు. గంగిరెడ్డిపాలెం సభ్యుడు ముండ్లపాటి సత్యనారాయణ, మాచవరం ఎంపీటీసీ–2 మధు అనూరాధ, ఎంపీటీసీ– 1 చిట్టిప్రోలు గురవయ్య, మొర్జంపాడు ఎంపీటీసీ ముంగి మంగమ్మ, మల్లవోలు ఎంపీటీసీ చుక్కా సువార్తలు వైఎస్సార్సీపీలో కొనసాగారు. టీడీపీ తరఫున పిల్లుట్ల–1 ఎంపీటీసీ కొక్కెర అంజమ్మ ఎంపీపీగా నామినేషన్ దాఖలు చేయడంతో ఐదుగురు సభ్యులు ఆమెకు మద్దతు ప్రకటించారు. వైఎస్సార్సీపీ తరఫున మొర్జంపాడు–1 ఎంపీటీసీ ముంగి మంగమ్మ నామినేషన్ వేయగా ముగ్గురు సభ్యులు మద్దతు ప్రకటించారు. కొక్కెర అంజమ్మను ఎంపీపీగా అధికారులు ప్రకటించారు. -
ప్రకృతి వ్యవసాయం ద్వారా వరిలో అధిక దిగుబడులు
●స్టేట్ రిసోర్స్ పర్సన్ రామచంద్రన్ ●నర్సింగపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలిస్తున్న రైతు సాధికార సంస్థ ప్రతినిధులు, రైతులు నకరికల్లు: ప్రకృతి వ్యవసాయ విధానంలో తక్కువ ఖర్చులో అధిక దిగుబడులు సాధించవచ్చని స్టేట రిసోర్స్‌పర్సన్ రామచంద్రన్ అన్నారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఐసీఆర్పీలకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని నర్సింగపాడు గ్రామంలో రైతు గ్రామ సుబ్బారెడ్డికి చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని గురువారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ అన్ నేచురల్ ఫార్మింగ్ పథకంలో భాగంగా ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్పర్సన్కు, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్స్‌కు డిస్టిక్ మోడల్ మేకింగ్ ట్రైనర్ బృందాలకు ఐదు రోజులు శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రకృతి వ్యవవసాయ కార్యాలయం ద్వారా క్షేత్ర సందర్శన నిర్వహించామన్నారు. పిడుగురాళ్ల, క్రోసూరు, సత్తెనపల్లి డివిజన్ల నుంచి సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ పొందనున్నారు. రసాయనాలు లేకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి పంట సాగు చేస్తే దిగుబడి అధికంగా ఉంటుందని, పంట పొలంలో గట్లపై పలు మొక్కలను వేయడం వలన అధిక ఆదాయం వస్తుందన్నారు, పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రకృతి వ్యవసాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా సిబ్బంది కృషి చేయాలన్నారు. పల్నాడు జిల్లాలో వరి, ప్రత్తి, మిరప పంట పొలాలను సాగు చేస్తున్న రైతులందరు భూమి ఆరోగ్యాన్ని కాపాడేందుకు రసాయనిక ఎరువులను వాడకుండా సేంద్రియ పద్ధతిలో పంటలను సాగుచేస్తే భూమి ఆరోగ్యం కాపాడుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ప్రాజెక్టు మేనేజర్ ప్రేమ్‌రాజు, ఎన్ఎఫ్ఏలు అప్పలరాజు, సైదయ్య, మాస్టర్స్, ట్రైనర్స్, ప్రకృతి వ్యవసాయ రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
అడ్డంకులు దాటుతూ ముందుకు సాగిన మురళీకృష్ణ
మాచర్ల రూరల్: పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వస్తున్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. పల్నాడు పార్టీ జిల్లా అధ్యక్షుడు పీఆర్కేతోపాటు పీవీఆర్‌ను అక్రమంగా కేసులో ఇరికించడంతో కోర్టులో లొంగిపోతున్న వారిని కలిసి మద్దతు తెలిపేందుకు గుంటూరు నుంచి వస్తున్న ఆయన వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. వాహనాన్ని, తన అనుచరులను విడిచి ఆయన ఒక్కరే ఆర్టీసీ బస్సులో ఎక్కి మాచర్లకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఆ బస్సును నిలిపారు. తనిఖీ చేస్తున్న సమయంలో ఆయన బస్సులోని చివరి సీటులోకి వెళ్లి పడుకొని వారికి కనిపించకుండా మాచర్ల పట్టణ శివారుకు చేరుకున్నారు. ఆ సమయంలో కొందరు పోలీసులు ఆయనను గుర్తుపట్టి అక్కడ నుంచి దించివేశారు. మురళీకృష్ణ పట్టణ శివారులో ఉన్న పొలాల్లో పయనించి ఆ ప్రాంతంలో వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడి సాయం తీసుకొని, అడ్డదారుల్లో ఇబ్బంది పడుతూనే కోర్టు వద్దకు చేరుకొని పిన్నెల్లి సోదరులను కలిసి పార్టీ తరఫున మద్దతు తెలిపారు. మురళీకృష్ణ పట్టుదలతో గమ్యానికి చేరుకున్న తీరును పార్టీ నాయకులు అభినందించారు. -
టీడీపీ కుట్రలకు తగిన రీతిలో సమాధానం చెబుదాం
మాచర్ల రూరల్: చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ నాయకులు కుట్రపూరితంగా, అన్యాయంగా, అక్రమంగా హత్య కేసులో ఇరికించి పిన్నెల్లి సోదరులను వేధిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల అన్నారు. దీనికి కారణమైన నాయకులకు, కొందరు పోలీసులకు తగిన సమయంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గురువారం మాచర్లలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పిన్నెల్లి సోదరులను నిందితులుగా చేర్చటంలో టీడీపీ నేతల కుటిల బుద్ధి బయటపడిందన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని, ఆ బెయిల్ రద్దు చేసేందుకు అధికార పార్టీ నాయకులు కుట్ర చేసినట్లు తమకు అర్థం అవుతోందని చెప్పారు. ప్రజల్లోకి పిన్నెల్లి సోదరులు మళ్లీ వచ్చి జగనన్న పాలనను తీసుకు వస్తారని ఆమె స్పష్టం చేశారు. మాజీ కౌన్సిలర్ అన్నెం అనంతరావమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, అరుణ్‌రెడ్డి, పిన్నెల్లి శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శివలింగరాజు, మద్దికర శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల -
కన్నీరు పెట్టించిన కుటుంబసభ్యుల ఆవేదన
విలపించిన పీఆర్కే తల్లి, సోదరి మాచర్ల: ‘ఇంట్లో ఉన్నా.. నీకు ఏమీ తెలియకున్నా... హత్య కేసు పెట్టి నిన్ను నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంటి వద్ద లేకుండా చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఎంత అన్యాయంగా వ్యవహరిస్తోందయ్యా...’ అంటూ వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పీవీఆర్‌లను పట్టుకొని ఏడుస్తూ వారి తల్లి రమణమ్మ, సోదరి నాగలక్ష్మిలు విలపించారు. గురువారం వారు కోర్టుకు హాజరయ్యేందుకు బయలుదేరిన సమయంలో వారిని పట్టుకుని బాధపడుతూ ’మనకిదేందయ్యా.. మంచి చెయ్యటమే మనం చేసిన పాపమా’ అంటూ వారు ఆవేదన చెందారు. ఆ సమయంలో విషాద వదనంతోనే పీఆర్కే, పీవీఆర్‌లు వారిని ఓదార్చారు. ‘ఏం కాదులే’ అంటూ ధైర్యం చెప్పారు. పక్కనే ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, న్యాయవాది రామలక్ష్మీరెడ్డిలు ఓదార్చారు. వారిద్దరూ తల్లికి, చెల్లికి కరచాలనం చేసి కోర్టుకు బయలుదేరి వెళ్లారు. ఆ దృశ్యాలు అందరిని కలచివేశాయి. వెల్లువెత్తిన సానుభూతి.. పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు పెట్టడంపై తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం నాయకులు కుట్ర పూరితంగా జంట హత్య కేసులో వీరిని ఇరికించి ఇబ్బందులు పెట్టడంపై వారి పట్ల సానుభూతి నెలకొంది. ఎక్కడ చూసినా ఇదేం రాజకీయం అనుకుంటున్నారు. పిన్నెల్లి సోదరులను జైలు పాలు చేసేలా టీడీపీ చేస్తున్న కుట్రను ప్రతి ఒక్కరూ అసహ్యించుకున్నారు. -
చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై గ్రామాల్లోనూ నిరసన వెల్లువ
మాచర్ల: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యంత దారుణంగా వ్యవహరిస్తూ పేదలకు, పేద విద్యార్థులకు అన్యాయం చేసేలా మెడికల్ కళాశాలలను ప్రయివేటీకరించడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోందని, వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ జిల్లాలో విజయవంతమైందని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ జరిపిన అనంతరం ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంతకాల పత్రాల వాహనాన్ని జెండా ఊపి పంపారు. మాచర్ల నియోజక వర్గంలో మొత్తం 72,452 మంది సంతకాలు చేశారని పేర్కొన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాలకు విశేష స్పందన లభించిందని, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పేపర్ బాక్స్‌లను బుధవారం లింగంగుంట్లలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి తరలించారు. గుంటూరు రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు గుత్తికొండ అంజిరెడ్డిలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. నియోజకవర్గంలో 62,500 సంతకాలు సేకరించారు.. చిలకలూరిపేట నియోజకవర్గంలో... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సమర శంఖారావాన్ని వైఎస్సార్ సీపీ పూరించిందని మాజీ మంత్రి విడదల రజిని చెప్పారు. పట్టణంలోని ఎన్ఆర్టీ రోడ్డులో ఉన్న మాజీమంత్రి నివాసం నుంచి నియోజకవర్గ పరిధిలో సేకరించిన సంతకాలను జిల్లా కేంద్రానికి పంపే కార్యక్రమం బుధవారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకుడు చిట్టా విజయభాస్కరరెడ్డితో కలసి సంతకాల ప్రతులు ఉన్న వాహనాన్ని పచ్చజెండా ఊపి ప్రారంభించించారు. వినుకొండ నియోజకవర్గంలో... కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో పూర్తి చేసిన 63వేల సంతకాల ప్రతులను బుధవారం భారీ ర్యాలీగా నరసరావుపేట జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ఐదు మండలాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో... కోటి సంతకాల సేకరణ ప్రజాఉద్యమం చంద్రబాబు ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడుతుందని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజాఉద్యమంలోని 66,507 ప్రతులను బుధవారం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు తరలించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో... పెదకూరపాడు నియోజకవర్గం నుంచి 55వేల మంది ప్రజలు పీపీపీని వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారని పెదకూరపాడు మాజీ శాసన సభ్యుడు నంబూరు శంకరరావు అన్నారు. క్రోసూరు వైఎస్సార్సీపీ కార్యాయలంలో కోటి సంతకాల ఉద్యమ ప్రతులను పార్టీ జిల్లా కార్యాలయానికి తరలిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురజాల నియోజకవర్గంలో... కోటి సంతకాల కార్యక్రమం ప్రజా ఉద్యమంలా జరిగిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సంతకాల కాపీల బాక్సులను పల్నాడు జిల్లా కేంద్రానికి పంపించే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాసు మహేష్‌రెడ్డి ముందుగా సంతకాల సేకరణ బాక్సులను పరిశీలించి, అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జెండాను ఊపి వాహనాన్ని ప్రారంభించారు.క్రోసూరులో సంతకాల పత్రాలు ఉన్న వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు -
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
●అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు ●సూపర్వైజర్, అంగన్వాడీ కార్యకర్త, ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు నకరికల్లు: విధి నిర్వహణలో అలసత్వం వ్యవహరించినా, పౌష్టికాహారం పంపిణీలో అవకతవకలకు పాల్పడినా కఠినచర్యలు తప్పవని ఫుడ్ కమిషన్ మెంబర్ ఈ.లక్ష్మీరెడ్డి హెచ్చరించారు. ఆహార భధ్రత చట్టం అమలులో భాగంగా ఫుడ్‌కమిషన్, ఐసీడీఎస్, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు మండలంలోని నర్శింగపాడు, నకరికల్లు, దేచవరం గ్రామాల్లోని అంగన్వాడీకేంద్రాలు, ప్రభుత్వపాఠశాలల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బియ్యం, కోడిగుడ్లు, సరుకుల నిల్వలు, వంటగదులు, పరిశుభ్రత, రిజిస్టర్ల నిర్వహణ తదితర అంశాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్టర్ నిర్వహణలో తప్పులు, గర్భిణులకు కోడిగుడ్లు పంపిణీలో నిబంధనలు పాటించకపోవడంతో అంగన్వాడీ సూపర్వైజర్ షేక్.రమీజున్, నర్శింగపాడు–2 అంగన్వాడీ కార్యకర్త కృష్ణవేణికు షోకాజ్ నోటీస్ జారీచేయాలంటూ ఐసీడీఎస్ పీడికి సిఫారసు చేశామన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలలో వండించకుండా బయట వండించి తీసుకువస్తున్న కారణంగా ప్రాథమికపాఠశాల ఉపాధ్యాయురాలు బి.శివకుమారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఎంఈఓకు ఆదేశాలు జారీచేశారు. ఐసీడీఎస్ సిబ్బంది పనితీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అనంతరం నకరికల్లులోని ఉన్నతపాఠశాలలో మధ్యాహ్నభోజనం చేసి అభినందించారు. కార్యక్రమంలో ఐసీడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమారాణి, డిఎస్ఓ ఎం.వి.ప్రసాద్, జీసీడీఎస్ఓ శ్రీలత, జీసీడీఓ దొండేటి రేవతి, డిప్యూటి డీఈఓ ఏసుబాబు, తహసీల్దార్ కె.పుల్లారావు, డిప్యూటి తహసీల్దార్ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అనైతిక బంధం..అంతం !
నరసరావుపేట టౌన్: నరసరావుపేట పట్టణం పెద్ద చెరువు రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివసిస్తున్న త్రోవగుంట బాల సుబ్రమణ్యాచారికి శ్రీలక్ష్మి (35)తో పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. సంతానం లేరు. సుబ్రహ్మణ్యాచారి హార్డ్‌వేర్ షాపు నిర్వహిస్తుంటాడు. భార్య శ్రీలక్ష్మికి పట్టణానికి చెందిన షేక్ బాజీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కొద్ది రోజులకు భర్తకు తెలియడంతో భార్యను మందలించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. తన భార్య జోలికి రావద్దని బాజీని హెచ్చరించాడు. అయినా లెక్క చేయకుండా శ్రీలక్ష్మితో ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో బాజీని హతమార్చాలని నిర్ణయించుకుని అత్త రాంబాయమ్మతో కలిపి పథకం పన్నాడు. ఈ క్రమంలో గత నెల 24వ తేదీన బాజీ ఎస్ఆర్కేటీ కాలనీ వద్ద హోటల్లో ఒంటరిగా ఉన్నాడని తెలుసుకొని సుబ్రహ్మణ్యాచారి, రాంబాయమ్మ కలిసి హతమార్చారు. వీరిద్దరినీ గత శనివారం నరసరావుపేట రూరల్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. బాజీ మృతి చెందడం, తల్లి, భర్త కటకటాల పాలవడంతో శ్రీలక్ష్మి మానసికంగా కుంగిపోయింది. ములాఖత్‌లో చివరి పలకరింపు.. రాత్రికి బలవన్మరణం.. సబ్జైల్లో ఉన్న భర్త, తల్లిని ములాఖత్ ద్వారా శ్రీలక్ష్మి మంగళవారం కలిసింది. అక్కడ ఏం జరిగిందో ఏమో ... అర్ధరాత్రి సమయంలో శ్రీలక్ష్మి ఉరేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఆమె సోదరుడు మల్లిఖార్జునరావు పిలిచినా పలకపోవడంతో అనుమానంతో గది తలుపులు పగలగొట్టి చూశాడు. ఉరేసుకుని కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ ప్రభాకర్, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వివాహేతర బంధం నేపథ్యంలో వ్యక్తి హత్య కటకటాల పాలైన వివాహిత భర్త, తల్లి చివరకు ఉరేసుకున్న వివాహిత నరసరావుపేటలో కలకలం రేపిన ఘటన ఆకర్షణ పునాదులపై కట్టుకున్న తాత్కాలిక ప్రేమ సౌధం అర్ధంతరంగా కూలిపోయింది. కనిపెంచిన తల్లి, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్త కటకటాల పాలవగా పశ్చాత్తాపంతో నిలువునా కుంగిపోయింది. కట్టుకున్నోడు దూరం కాగా.. కలుపుకొన్న బంధం మట్టిలో కలిసిపోగా.. ఒంటరి జీవితాన్ని భరించలేక, జీవచ్ఛవంలా బతకలేక తానూ ఉరికొయ్యకు వేలాడింది. అనైతిక బంధాల ఉచ్చులో పడి నరసరావుపేటలో ఓ మహిళ నిండు ప్రాణాలు బలి తీసుకుంది. -
22న వినుకొండలో జాబ్‌మేళా
నరసరావుపేట ఈస్ట్: జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన వినుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈమేరకు బుధవారం కలెక్టరేట్లో జాబ్‌మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని నిరుద్యోగ యువత జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్‌మేళాకు దాదాపు 35 కంపెనీలు హాజరై అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారని తెలిపారు. పదవ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, డిప్లోమో, ఇంజినీరింగ్, ఫార్మసీ, పీజీ చదివిన నిరుద్యోగ యువత జాబ్‌మేళాకు హాజరు కావాలని సూచించారు. విద్యార్హత, ఎంపిక చేసుకున్న కంపెనీల పరంగా రూ.13వేలు నుంచి రూ.35వేలు వరకు వేతనం లభిస్తుందని తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ.తమ్మాజీరావు మాట్లాడుతూ, అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో నేరుగా హాజరు కావచ్చని తెలిపారు. వివరాలకు డి.జానీబాషా (99512 14919), సురేష్ (91005 66581), ఎం.వీరాంజనేయులు (91602 00652), ఏ.రమ్య (77029 21219) నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
రండి .. ప్రధానితో మాట్లాడండి
సత్తెనపల్లి: ప్రధాన మంత్రితో నేరుగా మాట్లాడాలనుకుంటున్నారా, ఇప్పుడు ఆ అవకాశం మీ చేతుల్లోనే ఉంది. మీరు చేయాల్సిందల్లా ప్రధానమంత్రి ‘పరీక్షా పే చర్చ’ యాప్‌లో ఆన్లైన్లో నమోదు కావాలి. ఏటా పరీక్షలకు ముందు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా సంభాషించనున్నారు. పరీక్షలను సమర్థంగా, ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడం, చిరునవ్వుతో పరీక్షలకు సమాధానాలు రాయడం ద్వారా విద్యార్థులకు పరీక్షలు అంటే భయాన్ని తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు 6 నుంచి 12 తరగతుల విద్యార్థులు అర్హులు. విద్యార్థులు తమ ప్రశ్నను ప్రధానమంత్రిని నేరుగా అడగవచ్చు. ప్రశ్న గరిష్టంగా 500 అక్షరాలలోపు ఉండాలి. ఇందులో తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు. వారి ఎంట్రీలను కూడా ఆన్లైన్లో పంపే అవకాశం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కల్పించింది. వీటిలో మంచి ప్రశ్నలను ఎంపిక చేసి అర్హులను నిర్ణయిస్తారు. విజేతలుగా నిలిస్తే... ‘పరీక్షా పే చర్చ’లో విజేతలు నేరుగా ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశాన్ని పొందుతారు. ప్రతి విజేతకు ప్రత్యేక కిట్ అందజేస్తారు. విజేతలకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. విజేతలు ప్రతి ఒక్కరూ ప్రధాన మంత్రి ఆటోగ్రాఫ్, ఫొటోతో కూడిన డిజిటల్ సావనీర్ పొందే అవకాశం ఉంది. లాగిన్ ఇలా... విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హెచ్‌టీటీపీఎస్://ఇన్నోవేటివ్ఇండియా.మైజీవోవీ.ఇన్ అని క్లిక్ చేయాలి. ఎంటర్ కాగానే క్లిక్ ఏజ్ స్టూడెంట్, టీచర్, పేరెంట్స్ అనే లాగిన్స్ కనిపిస్తాయి. వాటిలోకి ఎంటర్ కాగానే మీ మొబైల్ నెంబర్ లేదా జీమెయిల్ ఖాతాను పూర్తి చేయాలి. ఓటీపీతో లాగిన్ అయి క్లిక్ చేయాలి. ఓటీపీ రాగానే మళ్లీ లాగిన్ చేయాలి. స్టూడెంట్స్ నేరుగా ఫోన్ నెంబర్, జీమెయిల్ లేని సందర్భంలో టీచర్స్ లాగిన్ ద్వారా ప్రవేశ అవకాశం కల్పించారు. ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు 2026 జనవరి 11 వరకు గడువు ఇచ్చారు. విద్యార్థులు/ ఉపాధ్యాయులు/తల్లిదండ్రులు ప్రాథమిక సమాచారం వివరాలను పూర్తి చేయాలి. కార్యాచరణ వివరాలను పూర్తి చేసిన తర్వాత థీమ్‌ను ఎంచుకొని 500 అక్షరాల లోపు వివరించాలి. -
ప్రజారోగ్యాన్ని అంగట్లో పెడితే సహించేది లేదు
నాడు జగనన్న ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల రావాలని కలగంటే ....నేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాటిని కార్పొరేట్ గద్దలకు దోచిపెట్టేందుకు పీపీపీ విధానంతో స్కెచ్ వేసింది. మా ప్రభుత్వంలో పేదవాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందాలన్న ఉద్దేశంతో నిర్మించిన భవనాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అంటే ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడమే. ఇది ముమ్మాటికి నిరుపేదలపై జరుగుతున్న దాడిగా పరిగణిస్తాం. ఈ పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకునేంత వరకు మా పోరాటం ఆగదు. కూటమి ప్రభుత్వం మెడలు వంచే ఆయుధాలు ఈ నెల 16న గవర్నర్‌కు సమర్పిస్తాం. చంద్రబాబునాయుడు కుట్రలను బట్టబయలు చేస్తాం. – కాసు మహేష్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే, గురజాల. -
బలం లేకున్నా బరిలో టీడీపీ
మాచవరం: అధికారం కోసం టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. తమకు మెజార్టీ లేకున్నా మాచవరం ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు కుయుక్తులు పన్నుతోంది. టీడీపీ నాయకుల అరాచకాలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుల బంధువులను దాచేపల్లి సీఐ స్టేషన్‌కు పిలిపించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. మాచవరం మండల పరిషత్ అధ్యక్షురాలు దారం అమ్ములమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 11న ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ క్రమంలో మెజారిటీ లేకున్నా టీడీపీ నేతలు ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు స్థానాలు ఉన్నాయి. వాటిలో 13 స్థానాలు వైఎస్సార్ సీపీ దక్కించుకోగా, టీడీపీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇటీవల జరిగిన పరిణామాలలో వేమవరం ఎంపీటీసీ శానంపూడి లక్ష్మి, కొత్త గణేశునిపాడు ఎంపీటీసీ చల్లగుండ్ల లక్ష్మయ్య పార్టీ ఫిరాయించారు. దీంతో ఫిరాయింపుదారులతో కలిపి టీడీపీ బలం నాలుగుకు చేరింది. ప్రస్తుతం వైఎస్సార్ సీపీకి 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. దీంతో గెలుపు అసాధ్యమని గుర్తించిన టీడీపీ నాయకులు వక్ర మార్గాలను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నికపై మండల ప్రజానీకంలో ఉత్కంఠ నెలకొంది. న్యాయమే గెలుస్తుందని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొంటున్నారు. పోలీసుల అండదండలు మండలంలోని చెన్నాయపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు సపోర్ట్ లక్ష్మీబాయికి బావ వరుసైన బాలు నాయక్, మల్లవోలు ఎంపీటీసీ సభ్యురాలు చుక్క సువార్త కుమారుడు పెదరాజారావులను దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ మంగళవారం ఉదయం అక్రమంగా పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లారంటూ బంధువులు ఆరోపించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన వైఎస్సార్ సీపీ శ్రేణులు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని ఆశ్రయించారు. పోలీసుల తీరును మండల ప్రజలు తప్పుబడుతున్నారు. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ శ్రేణులు మాచవరం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక గురువారం జరగనున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ హైకోర్టును ఆశ్రయించింది. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులకు రక్షణ కల్పించాలంటూ గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు న్యాయం చేస్తుందని కాసు పేర్కొన్నారు. -
మక్కీకి..మక్కీ..!
సేమ్ టు సేమ్.. నకిలీ స్కామ్ క్లీనింగ్‌కు ఉపయోగించేటప్పుడు ముక్కు పుటాలు బద్ధలవుతున్నా అనుమానానికి ఆస్కారం లేదు.. ఆ వాసన శ్వాసకోశ వ్యాధులకు గురి చేస్తున్నా ఆరా తీసే అవకాశం లేదు.. లేబుళ్లు, బాటిల్ ఆకృతిలో మార్పు లేదు.. రంగులో తేడా లేదు.. కానీ కల్తీ మాత్రం నట్టింట చేరి ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తోంది. కల్తీకి కాదేదీ అనర్హం అన్న చందంగా బాత్ రూములు క్లీన్ చేసే హార్పిక్, ఫ్లోరింగ్ తుడిచే లైజాల్ కు నకిలీ మకిలీ అంటించేశారు. నరసరావుపేట కేంద్రంగా కల్తీ హార్పిక్, లైజాల్‌ను మార్కెట్లోకి పంపించేశారు. అధికారుల నిర్లక్ష్యానికి సవాల్ విసురుతూ యథేచ్ఛగా వ్యాపారం సాగించేస్తున్నారు. నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నకిలీ హార్పిక్, లైజాల్లు పట్టుబడటం కలకలం రేపుతుంది. ఇటీవల నకిలీ బాస్మతి బియ్యం పట్టుబడిన విషయం మరువక ముందే హార్పిక్, లైజాల్ నకిలీవి వెలుగు చూడటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. వంట నూనె, దీపారాధన నూనెలతో మొదలైన కల్తీ వ్యాపారం ఇంటి పరిశుభ్రత ఉత్పత్తుల వరకు విస్తరించింది. అసలుకు ఏ మాత్రం తీసిపోకుండా నకిలీలను అక్రమార్కులు మార్కెట్లో ప్రవేశపెట్టారు. వీటిని వినియోగదారులు గుర్తు పట్టడం ఆసాధ్యంగా మారింది. దీంతో అక్రమార్కులు కల్తీకి కాదేది అన్న చందంగా ప్రతి వస్తువునూ డూప్లికేట్ తయారు చేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అధికారుల నిఘా కూడా అంతంతమాత్రంగా ఉండటంతో అక్రమ వ్యాపారులు యథేచ్ఛగా తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బాత్రూంలు శుభ్రపరిచే హార్పిక్, ఫ్లోరింగ్ శుభ్రం చేసే లైజాల్ డూప్లికేట్ బాటిళ్లను దిగుమతి చేసి ఇక్కడ గత కొన్ని నెలలుగా విక్రయిస్తున్నారు. ఇందులో నరసరావుపేటకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యాపారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. విషయం తెలుసుకున్న హార్పిక్, లైజాల్ కంపెనీల ప్రతినిధులు గత గురువారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దాడితో ఈ నకిలీ వ్యవహారం వెలుగు చూసింది. ఆందోళనలో వినియోగదారులు.. కల్తీల కారణంగా మార్కెట్లో దొరికే వస్తువుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. అక్రమార్కులు ప్రతి వస్తువును మక్కీకి మక్కీ తయారు చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజారోగ్యంపై ఈ ప్రభావం తీవ్రంగా చూపుతన్నప్పటికీ అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో దొరికే వస్తువుల సైతం అనుమానించాల్సి వస్తుంది. పోలీసుల అదుపులో నిందితులు.. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో సత్తెనపల్లి రోడ్డులోని కామాక్షి జనరల్ స్టోర్‌పై దాడులు నిర్వహించారు. అక్కడ హార్పిక్, లైజాల్ డూప్లికేట్ బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పాతూరులోని మరో దుకాణంపై దాడులు నిర్వహించి నకిలీ హార్పిక్, లైజాల్ బాటిళ్లను స్వాధీనం చేసుకొని దుకాణ నిర్వాహకుడిని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు.. హార్పిక్, లైజాల్ సంస్థ ప్రతినిధి గరికముక్కు వినోద్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు. డూప్లికేట్ బాటిళ్లు విక్రయిస్తున్న దుకాణ నిర్వాహకులు మధుసూదనరావు, మణికంఠ లపై కేసు నమోదు చేశామన్నారు. మొత్తం 15 కల్తీ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన దుకాణాల్లో తనిఖీలు చేయాల్సి ఉందన్నారు. విచారణలో కల్తీ తయారీలో కీలక నిందితుల పాత్ర తేలనుందన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డూప్లికేట్ హార్పిక్, లైజాల్ బాటిళ్లు -
జిల్లా విద్యాశాఖాధికారిగా రామారావు
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారిగా పి.వి.జె.రామారావు నియమితులయ్యారు. ప్రభుత్వం మంగళవా రం విద్యాశాఖలో చేపట్టిన డీఈఓల బదిలీలలో భాగంగా కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారిగా విధులు నిర్వర్తిస్తు న్న రామారావు బోయపాలెం డైట్ కళాశాల ప్రిన్సిపల్ బాధ్యతలతోపాటు పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి(డీఎస్ఈఓ)గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రామారావు ఉమ్మడి గుంటూరు జిల్లాలో నరసరావుపేట డిప్యూటీ డీఈఓగా, అడిషనల్ డైరెక్టర్–1 బాధ్యతలు నిర్వర్తించారు. బాపట్ల జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న ఎల్.చంద్రకళ కృష్ణాజిల్లా అంగలూరు డైట్ కళాశాల ప్రిన్సిపల్‌గా, ఎన్టిఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి (డీఎస్ఈఓ)గా బదిలీపై వెళ్లనున్నారు. శిలాఫలకాలు, ఆర్చీలపై వైఎస్సార్ సీపీ నాయకుల పేర్లు ధ్వంసం నాదెండ్ల: మండలంలోని చిరుమామిళ్ల గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన అభివృద్ధి పథకాల శిలాఫలకాలను టీడీపీ వర్గీయులు ధ్వంసం చేసిన ఉదంతం మంగళవారం చోటుచేసుకుంది. మోడల్ స్కూలు–బీసీ కాలనీ రహదారికి అప్పటి మంత్రి విడదల రజిని పేరిట ఆర్చి నిర్మించారు. తాజాగా ఆర్చిలోని ఆమె పేరును తొలగించారు. శ్మశానవాటికలో నిర్మించిన ఆర్చిని, కమ్యూనిటీ హాలుకు గల వైఎస్సార్ సీపీ నాయకుడు సింగారెడ్డి కోటిరెడ్డి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి పేరును ధ్వంసం చేశారు. అమూల్ డెయిరీ, రైతు భరోసా కేంద్రం, సచివాలయం, హెల్త్ సెంటర్లో శిలాఫలకాలపై సర్పంచ్ సింగారెడ్డి లక్ష్మి, సొసైటీ అధ్యక్షుడు సింగారెడ్డి కోటిరెడ్డి పేర్లను తొలగించారు. టీడీపీ వర్గీయుల దుశ్చర్యపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు కోరుతున్నారు. -
● సిబ్బంది, పోలీసులకు గాయాలు ● ఆక్టోపస్ సిబ్బంది చేతికి చిక్కిన ఐదుగురు మావోయిస్టులు ● ఆక్టోపస్ అధికారులు నిర్వహించిన మాక్‌డ్రిల్
నరసరావుపేట రూరల్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షను జిల్లాలో సమర్థంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. బుధవారం నుంచి ఈనెల 21వ తేదీ వరకు జరగనున్న టెట్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. డీఆర్వో అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిఈవో చంద్రకళ, ఇతర అధికారులు పాల్గొన్నారు. డీఆర్వో మాట్లాడుతూ పట్టణంలోని ఐదు కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల వరకు పరీక్షలు ఉంటాయని వివరించారు. పరీక్షలకు నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉండేలా ఆదేశాలు జారీచేయాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్థులు సకాలంలో కేంద్రాల వద్దకు చేరుకునేలా రవాణా సౌకర్యం కల్పించాలని తెలిపారు. స్క్వాడ్స్ నియమించి శాఖాపరమైన అధికారులు పరీక్ష కేంద్రాలను తరచూ తనిఖీ చేసేలా చర్యలు తీసుకుని పర్యవేక్షించాలని సూచించారు. పరీక్ష సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద మావోయిస్టుల కాల్పులు అచ్చంపేట: అచ్చంపేట మండల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టు, ప్రాజెక్టుకు సమీపంలోని చెక్పోస్టులపై మావోయిస్టులు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో దాడి చేశారు. అక్కడ డ్యూటీలో ఉన్న ప్రాజెక్టు సిబ్బంది, సమీపంలో ఉన్న చెక్‌పోస్టు వద్ద కాపలాగా ఉన్న పోలీసులపై కాల్పులు జరిపారు. డ్యామ్ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న మావోయిస్టులు డ్యూటీలో ఉన్న ఏఈ రాజుతోపాటు ప్రాజెక్టు సిబ్బందిని నిర్బంధించారు. ప్రాజెక్టు ఏఈ రాజు సమయస్ఫూర్తితో అచ్చంపేట సీఐ శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. మావోయిస్టులు తమను నిర్బంధించారని త్వరగా రావాలంటూ సమాచారం అందించారు. అచ్చంపేట సీఐ హుటాహుటిన ప్రాజెక్టు వద్దకు చేరుకుని మావోయిస్టులపై కాల్పులు జరిపారు. సుమారు గంటపాటు పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. సీఐ శ్రీనివాసరావు ఆక్టోపస్ అధికారులకు తెలియజేయడంతో ప్రత్యేక వాహనంలో బెటాలియన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆక్టోపస్ బెటాలియన్ యూనిట్ మావోయిస్టులపై కాల్పులు జరిపారు. ఐదుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను అచ్చంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాయపడిన డ్యామ్ సిబ్బందిని, పోలీసులను మెరుగైన చికిత్స నిమిత్తం అచ్చంపేటలోని ప్రభుత్వ వైద్యశాలకు పంపారు. ఇదంతా ప్రాజెక్టుకు మావోయిస్టుల వల్ల ప్రమాదం వాటిల్లితే పోలీసులు, ప్రాజెక్టు సిబ్బంది ఏవిధంగా వ్యవహరించాలి, ఎవరెవరికి సమాచారం అందించాలి, ఆపరేషన్ చేసి మావోయిస్టులను ఎలా లొంగతీసుకోవాలో ప్రయోగాత్మకంగా ఆక్టోపస్ అధికారులు నిర్వహించిన మాక్ డ్రిల్. కార్యక్రమంలో ఆక్టోపస్ డీఎస్పీలు జి.విశ్వనాథం, బి.మధు, పల్నాడు డీఎస్పీ ఏఆర్ జీయం గాంధీరెడ్డి, ఇన్స్పెక్టర్స్ ఆర్ రాంబాబు, డి.మధుబాబు, పోలీస్, అగ్నిమాపక, వైద్య, రెవెన్యూ, పల్నాడు బీడీ టీమ్, ఆక్టోపస్ మాక్స్ డ్రిల్ స్బింది పాల్గొన్నారు. -
ప్రాధాన్యాన్ని వివరిస్తున్నాం
వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో వైద్య సదుపాయాలు లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జగన్మోహన్రెడ్డి హయాంలో గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద మెడికల్ కళాశాలను నిర్మాణం చేసి పేదలకు మెరుగైన వైద్యంతోపాటు నిరుపేద విద్యార్థులకు మెడికల్ చదివే అవకాశం కల్పించేందుకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పీపీపీ విధానంతో కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పగించే పనిలో ఉన్నారు. నిరసనగా మేము చేపట్టే సంతకాల సేకరణలో మెడికల్ కళాశాల ఉంటే ప్రజలకు అందించే వైద్య సేవలు, వాటి ప్రాముఖ్యతను తెలుపుతున్నాం. – డేగల సునీల్ కుమార్, గురజాల


