హోరాహోరీగా ఒంగోలు ఎడ్ల బలప్రదర్శన పోటీలు
రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. జూనియర్ విభాగంలో నిర్వహించిన 20 నిమిషాల ప్రదర్శనలో అనంతపురం జిల్లా క్రాయపేటకు చెందిన ఎద్దుల రవీంద్రారెడ్డి ఎడ్ల జత 2,908.08 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతి కై వసం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన బుర్రముక్కు కౌసల్యారెడ్డి ఎడ్ల జత 2,573.07 అడుగుల దూరం లాగి రెండవ బహుమతి దక్కించుకున్నాయి. బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన అత్తోట శిరీషాచౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్ల జత 2,450 అడుగుల దూరంలాగి 3వ బహుమతి కై వసం చేసుకున్నాయి. పల్నాడు జిల్లా పమిడిమర్రు గ్రామానికి చెందిన యర్రసాని సుబ్బ య్య ఎడ్ల జత 2,428.11 అడుగుల దూరంలాగి 4వ బహుమతి, గుంటూరు జిల్లా కొండపాటూరుకు చెందిన పోతిన లక్షిత్‌చౌదరి ఎడ్ల జత 2,230.02 అడుగుల దూరం లాగి 5వ బహుమతి, కృష్ణా జిల్లా నాదెండ్లవారిపాలెం గ్రామానికి చెందిన కాకర్ల సురేష్‌బాబు ఎడ్ల జత 2,141.07 అడుగులు దూరంలాగి 6వ బహుమతి దక్కించుకున్నాయి. గుంటూరు జిల్లా కుంచనపల్లి గ్రామానికి చెందిన బుర్రముక్కు కౌసల్యారెడ్డి ఎడ్ల జత 1,908.5 అడుగుల దూరం లాగి 7వ బహుమతి, పల్నాడు జిల్లా మాచవరానికి చెందిన నీలం త్రివేణి నాయుడు ఎడ్ల జత 1,544.8 అడుగులు దూరంలాగి 8వ బహుమతి దక్కించుకున్నాయి. కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌కు చెందిన విప్పర్ల చిన్న వెంకటేశ్వర్లు ఎడ్ల జత 1,506 అడుగులు దూరంలాగి 9వ బహుమతి గెలుచుకున్నాయి. బలప్రదర్శనలో మొత్తం 11 జతలు పాల్గొనగా మిగిలిన 2 జతలకు కూడా ప్రోత్సహక బహుమతులు అందచేసినట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, గొంటు సుమంత్‌రెడ్డి, ఏరువ జోజిరెడ్డి, డి.రామకృష్ణ, జడ్డు రాజేష్‌రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, మూలి రాజారెడ్డి, ఎం.చిన్నశౌర్రెడ్డి, కె.జోసఫ్‌రెడ్డి, గాదె కస్పారెడ్డి, వెన్నా కోటిరెడ్డి, ఓ.ఇన్నారెడ్డి, వైఎఫ్ మర్రెడ్డి, మూలి రాయపురెడ్డి తెలిపారు.
ప్రథమ స్థానం కై వసం చేసుకున్న అనంతపురం జిల్లా ఎడ్ల జత
హోరాహోరీగా ఒంగోలు ఎడ్ల బలప్రదర్శన పోటీలు


