పిన్నెల్లిలో హింసను రూపుమాపేందుకు చర్యలు
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ జవహర్
నరసరావుపేట: పిన్నెల్లి ఘటనపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ బుధవారం మున్సిపల్ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ గ్రామ ప్రజలు శాంతిని బలంగా కోరుకుంటున్నారని, పోలీసులు, ప్రజ లు, అధికారుల సహకారంతో హింసను రూపు మాపేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు. ఎస్పీ బి.కష్ణారావు, డీఆర్వో నారదముని, ఆర్డీవో మురళీకృష్ణ, కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.
సాల్మన్ హత్య బాధాకరం
గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో జరిగిన మందా సాల్మన్ హత్య చాలా దురదృష్టకరం, బాధాకరమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కేఎస్.జవహర్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంఘటనలో దాడిచేసిన వారు, దాడికి గురైన వారు ఇరువురూ దళితులే అన్నారు. ప్రాణం పోయింది దళితుడిది కాబట్టి తమ కమిషన్‌కు బాధ్యత ఉందన్నారు. చాలా పారదర్శకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో నిజనిర్ధారణకు ఒక కమిటీని వేశామని, వీరు బాధితులతోపాటు మిగిలిన వారి నుంచి సమాచారం సేకరించి ఒక నివేదికను తయారుచేశారని చెప్పారు. ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగతమైన వివాదాల వలనే సంఘటన జరిగినట్లుగా నిజనిర్ధారణ కమిటీ నిర్ధారించిందన్నారు. ఇది ప్రేరేపితమైన సంఘటన కాదని, కేవలం యాధృచ్ఛికమైందన్నారు.
తాడికొండ: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పనున్న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపనకు జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రద్యుమ్న, సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాలు బుధవారం పరిశీలించారు. ఉద్దండరాయునిపాలెం వద్ద స్థల పరిశీలన చేసి పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఆర్‌టిజీఎస్ అధికారులు ప్రకార్ జైన్, గీతాంజలి శర్మ, రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి కోమలి పద్మ పాల్గొన్నారు.
గుంటూరు లీగల్: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై గురువారం స్పెషల్ మొబైల్ కోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఈనేపథ్యంలో పోలీసులు తీసుకున్న చర్యలపై న్యాయవాదులు, లీగల్ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది.
కొరిటెపాడు(గుంటూరు): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులోని శ్యామలానగర్‌లో గల రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరసన, వంట– వార్పు కార్యక్రమం ఏడవ రోజుకు చేరుకుంది. బుధవారం ఉమ్మడి శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పీఏసీఎస్‌ల ఉద్యోగులు పాల్గన్నారు. ప్లకార్డులు చేతబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించి, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు నిరసన, వంట వార్పు కార్యక్రమం, 13వ తేదీన కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయాల ముట్టడి, కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. అప్పటికీ ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకపోతే, 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల రాష్ట్ర నాయకులు తోట వెంకట రామయ్య, మువ్వా వెంకటేశ్వరరావు, బి.రఘురామ్, ఎస్.ఖాజామొహిద్దీన్, జీబీ రంగనాథ్, యెర్నేని పాపినాయుడు, ఎం.సత్యనారాయణ, పి.విజయభాస్కర్, పి.కృష్ణశాస్త్రి, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.
బాపట్లటౌన్: భూసార పరీక్షలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.విజయనిర్మల తెలిపారు. మండలంలోని ఈస్ట్ బాపట్లలో బుధవారం భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పించారు. జేడీఏ ఎం.విజయనిర్మల మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని దానికి తగినట్లుగా ఎరువులను వినియోగించుకోవాలన్నారు. విచక్షణా రహితంగా ఎరువులు వాడటం వలన పొలంలో శత్రు పురుగులతోపాటు మిత్రపురుగులు చనిపోయి పైరుకు నష్టాన్ని కలిగిస్తాయన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. అనంతరం వ్యవసాయ, రైతు సాధికార సంస్థ సిబ్బందికి మట్టినమూనాల సేకరణపై శిక్షణ, అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సయ్యద్ అత్తర్ హుస్సేన్, ఏడీపీఎం జక్కుల మోహన్, ఏఓ కె.శారద, వీఏఏ టి.గోపికృష్ణ, రైతు సాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.


