సక్సెస్‌కి చిరునామా అతడు..! | Meet the NeoKred Co-founder, Rohith Reji | Sakshi
Sakshi News home page

సక్సెస్‌కి చిరునామా అతడు..! సమస్యల పరిష్కార వేదికగా..

Apr 3 2026 12:53 PM | Updated on Apr 3 2026 1:11 PM

Meet the NeoKred Co-founder, Rohith Reji

‘హాయిగా గడిచిపోతుంది కదా...రిస్క్‌ ఎందుకు!’ అనుకునే వాళ్లకు రిస్క్‌తోపాటు సక్సెస్‌ కూడా దూరంగానే ఉంటుంది! ‘సక్సెస్‌ దక్కాలంటే రిస్క్‌ చేయాల్సిందే’ అనుకునేవాళ్లే విజేతలవుతారు. రోహిత్‌ రేజి కొన్ని స్టార్టప్‌లలో ఉద్యోగాలు చేశాడు. ‘నేనే ఒక స్టార్టప్‌ ఎందుకు మొదలు పెట్టకూడదు’ అనే ఆలోచనతో నియోక్రెడ్‌ టెక్నాలజీస్‌ మొదలు పెట్టి అద్భుత విజయం సాధించాడు... 

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేలా చూసే సాంకేతికతను, సమస్యల పరిష్కారాలను ‘నియోక్రెడ్‌ టెక్నాలజీస్‌’ రూపొందించింది. ఇది బి2బి2సి స్టార్టప్‌. నియోక్రెడ్‌ అనేది డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగంలో పనిచేసే సంస్థ. మన దేశంలోని అగ్రశేణి బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు, రేజర్‌పే, పేటీఎం వంటి ఫిన్‌టెక్‌లు ‘నియోక్రెడ్‌’ కస్టమర్‌లు.

అసలైన సామర్థ్యం అదే!
‘ఏఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌  సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ నుండి బీకామ్‌ పూర్తి చేసిన తరువాత ‘ఎక్స్‌పెడైట్‌’ అనే స్టార్టప్‌లో నాలుగు సంవత్సరాలు పనిచేశాడు రోహిత్‌. ‘లార్సెన్‌ అండ్‌ టర్బో (ఎల్‌ అండ్‌ టి)’లో కొంతకాలం పనిచేసిన తరువాత టెడ్‌ఎక్స్‌ టాక్‌ షోలను నిర్వహించడానికి ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఆ తరువాత బెంగళూరులో ‘ఎంఎస్‌ఎస్‌’ పేమెంట్స్‌ అనే స్టార్టప్‌లో చేరాడు.  అక్కడ పనిచేస్తున్న సమయంలోనే సొంత స్టార్టప్‌ గురించి ఆలోచించాడు.

‘ఓపెన్‌ బ్యాంకింగ్‌ రంగంలో పరిష్కారాలను రూపొందించడంలోనే అసలైన సామర్థ్యం ఉందని గ్రహించాను’ అంటున్న రోహిత్‌ ఆ సమస్యల పరిష్కార వేదికగా ‘నియోక్రెడ్‌ టెక్నాలజీస్‌’కు శ్రీకారం చుట్టాడు. ఓపెన్‌ బ్యాంకింగ్‌ అనేది సురక్షితమైన ఏపీఐలను ఉపయోగించే ఒక వ్యవస్థ. దీనిద్వారా అధీకృత థర్డ్‌–పార్టీ ప్రొవైడర్‌లు(ఫిన్‌టెక్‌ల వంటివి) కస్టమర్‌ల బ్యాంక్‌ డేటాను వారి అంగీకారంతో యాక్సెస్‌ చేస్తాయి.

నమ్మకం ప్లస్‌ గుర్తింపు
యెస్‌ బ్యాంక్‌తో కలిసి 2018–19లలో ప్రీపెయిడ్‌ కార్డులను ప్రారంభించింది నియోక్రెడ్‌. కోవిడ్‌ కల్లోల కాలం తరువాత ‘రూపే ఆన్‌ ది గో’ అనే పైలట్‌ భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ఎన్‌పీసీఐ(నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్స్‌ ఆఫ్‌ ఇండియా)తో కలిసి సహ–భాగస్వామ్యం కుదుర్చుకుంది. 

‘ఇది మాకు నమ్మకాన్ని, గుర్తింపు రెండిటినీ ఇచ్చింది’ అంటాడు రోహిత్‌. కొన్ని సంవత్సరాల క్రితం రోహిత్‌ స్టార్టప్‌కు విరెంక్సియా, ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ రాజేష్‌ జైన్‌ నుంచి ఎనిమిది కోట్ల సీడ్‌ ఫండింగ్‌ వచ్చింది. ప్రొడక్ట్స్‌లైన్స్‌ నియోక్రెడ్‌కు మూడు ఉత్పత్తి శ్రేణులు(ప్రొడక్ట్‌ లైన్స్‌) ఉన్నాయి. ఐడెంటీ మెనేజ్‌మెంట్‌ (ప్రొఫైల్‌ ఎక్స్‌), ప్రైవసీ(బ్లూటిక్‌), పేమెంట్స్‌ (కలెక్ట్‌ బాట్‌)

‘నియోక్రెడ్‌’ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నంలో ఉన్నాడు రోహిత్‌ రెజి,‘ఇతర దేశాలలో ఐడెంటిటీ ప్రొఫైలింగ్, ప్రైవసీ, పేమెంట్స్‌ ఫ్లాట్‌ఫామ్‌లను నిర్మించాలనుకుంటున్నాం. మౌలిక సదుపాయాలకు సంబంధించి స్థానిక అవసరాలు తీర్చాలనుకుంటున్నాం’ అంటున్నాడు రోహిత్‌. దీనికి సంబంధించి సింగపూర్, దుబాయ్‌లోని పార్టీలతో ప్రాథమిక చర్చలు జరుపుతున్నాడు. 

‘నియోక్రెడ్‌’లో ప్రస్తుతం 140 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సగం మంది టెక్‌ నిపుణులు. ‘తమ లక్ష్యం గురించి నిరంతరాయంగా కష్టపడడం, నిబద్ధత నియోక్రెడ్‌ విజయానికి కారణం’ అంటున్నారు 

‘అల్వారెజ్‌ అండ్‌ మార్సల్‌’ గ్లోబల్‌ ట్రాన్సాక్షన్‌ అడ్వైజరీ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ భావిక్‌ హతి. సక్సెస్‌ అనేది కంఫర్ట్‌ జోన్‌ నుంచి రాదు. సవాళ్లను అధిగమించే శక్తి నుంచి వస్తుంది.'
– రోహిత్‌ రెజి

(చదవండి: 14 ఏళ్లకే స్కూల్‌ డ్రాపౌట్‌..కానీ ఆ ఆవిష్కరణ..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement