Movies
-
భరణం? విడాకుల్లో మూడో వ్యక్తి ప్రమేయం? నటి భర్త క్లారిటీ
బాలీవుడ్ నటి మౌనీరాయ్ కొన్నిరోజుల క్రితమే విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన భర్త సూరజ్ నంబియార్‌తో కలిసి అధికారికంగానే వెల్లడించింది. అయితే వీళ్లిద్దరూ విడిపోవడానికి బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీనే కారణమని తెగ రూమర్స్ వస్తున్నాయి. అలానే భరణం గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెట్టిన సూరజ్.. ఇన్‌స్టా స్టోరీలో మొత్తం క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)'మా విడాకుల విషయంలో వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నా. ఎలాంటి భరణం లేదు. మా మధ్య వివాదాలు ఏం లేవు. మూడ వ్యక్తి ప్రమేయం అసలు లేదు. మేం చర్చించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం. ఇది మాత్రమే నిజం. మిగతావన్నీ అవాస్తవాలు. రూమర్స్ గురించి స్పందించకపోవడం తప్పే అవుతుంది. అందుకే క్లారిటీ ఇస్తున్నా' అని సూరజ్ చెప్పుకొచ్చాడు.ప్రేమించుకుని 2022లో సూరజ్-మౌనీ రాయ్ పెళ్లి చేసుకున్నారు. సూరజ్ దుబాయికి చెందిన బిజినెస్‌మ్యాన్. మలయాళీ, బెంగాలీ సంప్రదాయల్లో వీళ్ల వివాహం జరిగింది. కానీ నాలుగేళ్లకే విడిపోయారు.(ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్) -
చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్
రామ్ చరణ్ 'పెద్ది' విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 4న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. సోమవారం మధ్యాహ్నం ముంబైలో ట్రైలర్ లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలోనే తన చేతికైనా గాయం గురించి రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)'చెయ్యి బాగానే ఉంది. బుచ్చిబాబు(దర్శకుడు) ఇచ్చిన బహుమతి ఇది. గత 25-30 రోజుల నుంచి కుస్తీ సన్నివేశాల షూటింగ్ చేశాం. ట్రైన్డ్ ఆర్టిస్టులని తీసుకురమ్మంటే నిజమైన పహిల్వాన్లని తీసుకొచ్చాడు. యాక్షన్ చెప్పగానే వాళ్లు బలంగా పట్టేసుకున్నారు. అందుకే చేతికి గాయమైంది. మణికట్టు దగ్గర ఎముక విరిగింది. 'పెద్ది'కి సంబంధించి ఇదో అందమైన జ్ఞాపకం' అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.'పెద్ది' షూటింగ్ టైంలో మూడుసార్లు చరణ్ గాయపడ్డారు. కుస్తీ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఓసారి గాయపడగా.. రీసెంట్గా చేసిన చిత్రీకరణలో కంటికి, మణికట్టుకి గాయాలయ్యాయి. రెండు మూడు రోజుల్లో వాటికి సంబంధించి సర్జరీలు జరగనున్నాయని నిర్మాత చెప్పారు. అయితే మణికట్టుకి ఎలా గాయమైందని ఇప్పుడు చరణ్ స్వయంగా చెప్పాడు.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా కనిపించబోతున్నాడు. పల్లెటూరిలో ఉండే ఇతడు ఢిల్లీకి వెళ్లి కూలీపని ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ ప్రయాణంలో పెద్ది ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్లో మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీపై పెద్దగా హింట్ ఇవ్వలేదు. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఆటకూలీ పోరాటం.. 'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!) -
'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మరికొన్నిరోజుల్లో థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రెగ్యులర్ కమర్షియల్ అంశాలతో పాటే సమ్‌థింగ్ డిఫరెంట్‌గానూ అనిపించింది. 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ దెబ్బకు డీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్.. ఇది ఎలాగైనా సరే హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. వీళ్లే కాదు టాలీవుడ్ కూడా అదే అనుకుంటోంది. మొత్తం భారమంతా ఈ మూవీపైనే ఉంది. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)ఈ ఏడాది సంక్రాంతిని టాలీవుడ్ గ్రాండ్‌గా మొదలుపెట్టింది. చిరంజీవి సినిమాకు రూ.300 కోట్లు వచ్చాయని అందరూ సంబరపడ్డారు. కానీ ఈ ఆనందం ఎన్నిరోజులు నిలబడలేదు. తర్వాత నుంచి ఇప్పటివరకు నాలుగు నెలలు గడిచాయి. ఒక్కటంటే ఒక్క మూవీ కూడా సరైన స్థాయిలో ఆడలేదు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో వచ్చిన చిత్రాలు భారీగా నిరాశపరిచాయి. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడులన్నీ నష్టపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఏడాది వేసవి సీజన్.. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత దారుణమైనదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.సరిగ్గా ఇలాంటి టైంలో అంటే జూన్ 4న 'పెద్ది' థియేటర్లలోకి వస్తోంది. దీంతో టాలీవుడ్ ఆశలన్నీ దీనిపైనే పెట్టుకుంది. ఇది హిట్ అవ్వడం చిత్రబృందానికే కాదు తెలుగు సినీ పరిశ్రమకు కూడా చాలా కీలకం. ఎందుకంటే థియేటర్లు గతకొన్నాళ్లుగా బోసిపోయాయి. ప్రేక్షకులు కూడా సరైన మూవీ ఎప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే ఈ మూవీ..బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశమైతే కనిపిస్తోంది. మరి 'పెద్ది' ఏం చేస్తాడనేది చూడాలి?ట్రైలర్ బట్టి చూస్తే బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే ఓ పల్లెటూరి కుర్రాడు.. క్రికెట్, కుస్తీ, రన్నింగ్‌లో ఆటకూలీగా ఎలాంటి ప్రతిభ చూపించాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీ గురించి మాత్రం పెద్దగా హింట్ ఇవ్వలేదు. 'పెద్ది గాడు గుడిలో దేవుడు కాదు గ్రౌండ్లో దేవుడు సారు' లాంటి డైలాగ్స్ బాగానే అనిపించాయి. స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక -
రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ రిలీజ్
మెగా హీరో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది'. లెక్క ప్రకారం మార్చిలోనే రావాలి కానీ రెండుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వచ్చే నెల 4న థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంటూ మూవీపై అంచనాలని పెంచేస్తోంది.(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక)బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే పనోడు.. క్రికెట్, కుస్తీలో ఎలాంటి ప్రతిభ చూపించాడు. జీవితంలో ఇతడికి ఎదురైన సవాళ్లు ఏంటనేది కాన్సెప్ట్. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆ జోష్ని కొనసాగించేలానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
మరోవారం వచ్చేసింది. ఈసారి సతీ లీలావతి, సిస్టమ్, మధువిధు, మేం కాప్‌లం లాంటి తెలుగు మూవీస్, సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరోవైపు థియేటర్లలో 'దృశ్యం 3' రిలీజ్ కానుంది. ఈ వీకెండ్‌కి అయితే ఇదే ఎంటర్టైన్మెంట్. అయితే సడన్ గా ఓ రెండు తెలుగు చిత్రాలు ఒకే ఓటీటీలోకి స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. రిలీజైన 12 రోజులకే)గతేడాది జనవరిలో థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'డ్రీమ్ క్యాచర్'. ప్రశాంత్ కృష్ణ, అనీషా దామా, ఐశ్వర్య హోళక్కల్ ప్రధాన పాత్రలు చేశారు. కలలో వచ్చిన సంఘటనలు నిజజీవితంలో ఒకవేళ జరిగితే హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఈ కలలు రావడం అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేది కాన్సెప్ట్. ఇప్పుడీ చిత్రం ఏడాదిన్నర తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.ఇకపోతే సుమన్, మహేశ్ పెగ్గర్ల, సిరి తదితరులు నటించిన 'భీంసేరి' అనే తెలుగు సినిమా కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఇది కూడా రెంట్ విధానంలోనే అందుబాటులోకి వచ్చింది. ఓ క్రూరమైన లేడీ పోలీసాఫీసర్.. ఓ నిరుపేద కుటుంబాన్ని అన్యాయంగా నాశనం చేస్తుంది. కానీ ఆ కుటుంబంలో ఓ మహిళ ప్రాణాలతో బయటపడుతుంది. ఈమె సదరు లేడీ పోలీసాఫీసర్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక) -
'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక
సాధారణంగా నటీనటులు ఎవరైనా సరే ఆచితూచి మాట్లాడుతుంటారు. స్టార్స్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉంటారు. కొన్నిసార్లు మాత్రం పొరపాటులో నోరు జారుతుంటారు. హీరోయిన్ రష్మిక కూడా ఇప్పుడు అలానే చేసింది. తోటి హీరోయిన్ని పొగుడుతూ టంగ్ స్లిప్ అయింది. వెంటనే నాలిక్కరుచుకుంది. ఇంతకీ ఏమైంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)స్వతహాగా కన్నడ అమ్మాయి అయినప్పటికీ రష్మిక.. తెలుగు సినిమాలతోనే బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. హీరో విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయిపోయింది. హిందీలోనూ మూవీస్ చేస్తున్న ఈమె నటించిన 'కాక్టెయిల్ 2' వచ్చే నెల 19న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది.ఈ కార్యక్రమంలోనే తోటి హీరోయిన్ కృతి సనన్ గురించి చెబుతూ '****' అనే బూతుని పొరపాటున ఉపయోగించింది. వెంటనే క్షమాపణ కూడా చెప్పేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రష్మిక, కృతిసనన్ హీరోయిన్లుగా కాగా షాహిద్ కపూర్ హీరో. అయితే ఈ మూవీలో రష్మిక-కృతి సనన్.. స్వలింగ సంపర్క పాత్రల్లో కనిపించనున్నారనే రూమర్స్ గతంలో వచ్చాయి. (ఇదీ చదవండి: తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్.. స్పందించిన హీరోయిన్ తల్లి)#RashmikaMandanna just couldn’t stop praising #KritiSanon 🤯🔥pic.twitter.com/bf76j1cVYd— Filmyscoops (@Filmyscoopss) May 18, 2026 -
రష్మికకు చేదు అనుభవం.. స్టార్ హీరో అసభ్య ప్రవర్తన..!
టాలీవుడ్ హీరోయిన్, కన్నడ బ్యూటీ రష్మికకు చేదు అనుభవం ఎదురైంది. తాను నటిస్తోన్న కాక్టెయిల్-2 మూవీ ప్రమోషన్స్‌లో చాలా ఇబ్బందికి గురైంది. రష్మిక మాట్లాడుతుండగా పక్కనే ఉన్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఆమె భుజంపై చేయి వేశాడు. దీంతో రష్మిక మందన్నా తీవ్ర అసౌకర్యానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం.. విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి చిత్రంలో నటిస్తోంది. పెళ్లి తర్వాత వీళ్లిద్దరు కలిసి నటిస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ మూవీ ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం కాక్టెయిల్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ మూవీ ‘కాక్టెయిల్-2’ ప్రమోషన్లలో షాహిద్ కపూర్ తీరుతో రష్మిక కాస్త ఇబ్బంది పడ్డారు. షాహిద్ తన భుజంపై చేయి వేయగానే అన్‌కంఫర్టబుల్‌గా ఫీలై వెంటనే పక్కకు తప్పుకున్నారు. ఆ సమయంలో ఆమె పైకి నవ్వుతూనే ఉన్నప్పటికీ ఏదో జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి… pic.twitter.com/FGza2sYnR8— ChotaNews App (@ChotaNewsApp) May 18, 2026 -
జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్.. ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్..!
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ నెల 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.తాజాగా యంగ్ టైగర్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 19న రాత్రి 11 గంటల 52 నిమిషాలకు ఫస్ట్ గ్లింప్స్ థియేటర్లతో పాటు డిజిటల్‌గా ప్రదర్శించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో జూనియర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. Before the clock strikes May 20…the celebrations begin across India ⚡#NTRNeel First Glimpse arrives at 11:52 PM IST on May 19th in selected theatres & digitally 🔥— NTR Arts (@NTRArtsOfficial) May 18, 2026 -
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం తమిళ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన భార్య ఆర్తి తనను వేధింపులకు గురి చేసిందని మీడియాలో కన్నీళ్లు పెట్టుకున్నారు. విడాకులు మంజూరు అయ్యాకే తాను సినిమాల్లో నటిస్తానని తేల్చి చెప్పారు. మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి తర్వాత నరకం చూశానన్నాడు. ఇంట్లో కనీస గౌరవం ఇచ్చేవాళ్లు కాదని, ఆఖరికి తాను సంపాదించిన డబ్బును దాచుకునేందుకు తనకంటూ ఒక అకౌంట్ కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లల్ని కూడా చూడనివ్వడం లేదని, తనపై చేతబడి చేయడంతో రక్తపు వాంతులు అవుతున్నాయన్నాడు.తాజాగా ఈ వివాదంలో అనూహ్యంగా నటి ఖుష్బు సుందర్ పేరు తెరపైకి వచ్చింది. మూడు అక్షరాల పేరుతో ఉన్న నటి వల్లే తన జీవితం నాశనమైందని జయం రవి ఆరోపించాడు. రవి ప్రస్తావించినట్లుగా తన జీవితాన్ని నాశనం చేసిన మూడక్షరాల నటి ఖుష్బూ(ఖుష్బూ పేరును తమిళంలో మూడు అక్షరాలతో రాస్తారు) యా? అని పిలుస్తారు. అందుకే ఆమె తనపై వస్తున్న విమర్శలపై రియాక్ట్ అయింది. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై నటి ఖుష్బు సుందర్ స్పందించింది. జయం రవి పేరు నేరుగా ప్రస్తావించకుండానే పోస్ట్ చేసింది. కొందరు తమ డీఎన్ఏను నిరూపించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారని విమర్శించింది. నేను చెప్పింది నిజమని నిరూపించినందుకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది ఖుష్బు సుందర్. జయం రవి విడాకుల కేసు కాస్తా ఖుష్బు వర్సెస్ జయం రవిగా మారిపోయింది. -
సూర్య కరుప్పు.. మూడు రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కరుప్పు. ఈ మూవీని తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ఆర్జే బాలాజీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. మొదటి రోజే ఆర్థిక సమస్యలు రావడంతో ఒక్క రోజు ఆలస్యంగా థియేటర్లో రిలీజైంది. గురువారమే విడుదల కావాల్సి ఉండగా.. శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది.ఈ చిత్రం రిలీజైన మూడు రోజుల్లోనే సెంచరీ మార్క్ కొట్టేసింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్లతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. భారతదేశ వ్యాప్తంగా చూస్తే రూ. 68 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా వసూళ్లు పరిశీలిస్తే దేశవ్యాప్తంగా రూ. 78.75 కోట్ల గ్రాస్ రాబట్టగా.. ఓవర్సీస్లో రూ. 42 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో మూడు రోజుల్లోనే వందకోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ ఆదివారం ఒక్కరోజే రూ. 28.35 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.కాగా.. ఈ చిత్రంలో, సూర్య.. శరవణన్ అనే లాయర్ పాత్రను పోషించారు. దోపిడీకి గురై, అవినీతిమయమైన న్యాయ వ్యవస్థలో చిక్కుకున్న తండ్రీకూతుళ్ల కథగా ఈ మూవీని తెరకెక్కించారు. -
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. సోమవారం నుంచే జనాలంతా వర్క్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఇక వారం సినిమాల విషయానికొస్తే పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ఉండడంతో పెద్ది మూవీ సైతం జూన్‌లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ వారంలో చూస్తే నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ, రమణి కళ్యాణం, ఫస్ట్ టైమ్, పురుషః లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటిపై ఆడియన్స్‌లో పెద్దగా బజ్ లేదు.ఇక ఓటీటీల విషయానికొస్తే మెగా కోడలు నటించిన సతీ లీలావతి, మేము కాపులం అనే వెబ్ సిరీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో సోనాక్షి సిన్హా, జ్యోతిక నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్, మలయాళ హిట్ మూవీ మధువిదు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అంతేకాకుండా పలు బాలీవుడ్ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలకు రానున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్..డెసిబ్లింగ్-సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- మే20కరీజ్మా సీజన్ 1(స్పానిష్ సిరీస్)- మే 20వన్ త్రీ హిల్(హాలీవుడ్ సిరీస్)- మే 21జేమ్స్ సీజన్-1(స్పానిష్ సిరీస్)- మే 21ది బోరోగ్స్(హాలీవుడ్ సిరిసీ)- మే 21లేడీస్ ఫస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 22దిస్ ఈజ్ నోటా టెస్ట్(హాలీవుడ్ మూవీ)- మే 22మేటింగ్ సీజన్.. సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- మే 22అమెజాన్ ప్రైమ్-ది క్రోనిన్స్ ది మమ్మీ(హాలీవుడ్ మూవీ)- మే 19సతన్ ది డార్క్-(తమిళ సినిమా)- మే 20జాక్ ర్యాన్..ఘోస్ట్ వార్(హాలీవుడ్ మూవీ)- మే20సిస్టమ్(బాలీవుడ్ సినిమా)- మే 22 సన్ నెక్ట్స్..సతీ లీలావతి(తెలుగు సినిమా)- మే 20బీష్మార్(మలయాళం సినిమా)- మే 22శేష 2016(కన్నడ సినిమా)- మే 22జియో హాట్‌స్టార్..స్కై ప్లస్ మెడ్ సీజన్ 4(హాలీవుడ్ సిరీస్)- మే 22జీ5వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విలంగ్(తమిళ సిరీస్)- మే 22మేము కాపులం(తెలుగు సిరీస్)- మే 22సోనీలివ్..మధువిదు(మలయాళ సినిమా)- మే 22లయన్స్ గేట్ ప్లే..పండప్లాన్ ది మ్యాజికల్ ట్రైబ్(హాలీవుడ్ మూవీ)- మే 22 -
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్.. స్పందించిన హీరోయిన్ మదర్..!
కన్నడ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ.. స్టార్ హీరోల సరసన మెప్పించింది. రవితేజ ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకుంది. బాలయ్య భగవంత్ కేసరి సినిమా హిట్ అవ్వకపోయినా.. నటనపరంగా మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం కోలీవుడ్ హీరో ధనుశ్‌తో ఓ సినిమా చేస్తోంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. శ్రీలీల వ్యక్తిగత జీవితంపై ఓ వార్త వైరల్‌గా మారింది. ఆమె తెలుగు క్రికెటర్ తిలక్ వర్మతో డేటింగ్లో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ముంబయి ఐపీఎల్ మ్యాచ్‌కు శ్రీలీల హాజరు కావడంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా మరోసారి ఈ టాపిక్ వైరల్‌గా మారింది. గతేడాదిగా వీరిపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నప్పటికీ ఎవరూ కూడా స్పందించలేదు.తాజాగా ఈ వార్తలపై హీరోయిన్ శ్రీలీల మదర్ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని శ్రీలీల తల్లి కొట్టిపారేసింది. అవన్నీ కేవలం ఊహాగానాలేనని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అసలు ఇప్పటి వరకు శ్రీలీల- తిలక్ వర్మ ఒక్క సారి కూడా కలుసుకోలేదని శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత స్పష్టం చేసింది. 2025 డిసెంబర్లో శ్రీలీల-తిలక్ ఇద్దరూ తిరుమలను సందర్శించడం.. అలాగే వాంఖడే టీ20 మ్యాచ్‌లో నటి సందడి చేయడం.. ఇవి రెండూ ఉద్దేశపూర్వకంగా జరగలేదని ఆమె అన్నారు. గతంలో కార్తీక్ ఆర్యన్‌తో వచ్చిన డేటింగ్ వార్తలను సైతం కొట్టిపారేశారు. కార్తీక్ వాళ్ల మదర్ డాక్టర్ కావడంతోనే వృత్తిపరంగా కలిశామని క్లారిటీ ఇచ్చారు. దీంతో హీరోయిన్‌పై డేటింగ్ రూమర్స్‌కు చెక్ పడినట్లైంది. -
సీఎం విజయ్, రజనీ వ్యాఖ్యలపై కమల్ స్పందన ఇదే..
సాక్షి, చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ పనితీరుపై ఇప్పుడే విమర్శలు చేయడం లేదా అంచనా వేయడం సరి కాదని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. మదురై విమానాశ్రయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని ఆయన కోరారు.రెండు రోజుల్లో చెబితే అది జోస్యం అవుతుంది..సీఎం విజయ్ పాలన ఎలా ఉందనే ప్రశ్నపై కమల్ హాసన్ తనదైన శైలిలో స్పందించారు. ‘విజయ్ ముఖ్యమంత్రి అయి రెండు రోజులే అవుతోంది. అప్పుడే ఆయన పాలన ఎలా ఉందో చెప్పమంటే అది జోస్యం చెప్పినట్లే అవుతుందని చమత్కరించారు. ఆరు రోజుల్లోనో, పదిహేను రోజుల్లోనో ప్రభుత్వ పనితీరుపై సమీక్షలు చేయడం కూడా అంతే అని వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం స్థిరపడటానికి, వారి విధానాలు అమలు కావడానికి కనీసం 6 నెలల సమయం ఇవ్వాలని కమల్ పేర్కొన్నారు.ప్రజలు నమ్మి ఓటేశారు.. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావడంపై స్పందిస్తూ... కొత్తవాళ్లు చాలా మంది అధికారంలోకి వచ్చారని, అయితే రాజకీయాలకు ఇది కొత్తేమీ కాదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు బాధ్యతలు స్వీకరించిన వారంతా కొత్తవారేనని పేర్కొన్నారు. ప్రజలు నమ్మి ఓటేశారు కాబట్టి, ఆ పాలన సజావుగా సాగుతుందా లేదా అనేది గమనించాలన్నారు. తాము కూడా దాన్నే గమనిస్తున్నాం అని చెప్పారు.తమిళనాట పుడితే అది ద్రావిడ పార్టీనే తమిళనాడు రాజకీయ సిద్ధాంతాలపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తన ఉద్దేశం ప్రకారం.. తమిళనాడులో తమిళం మాట్లాడే వ్యక్తి ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీని ప్రారంభిస్తే, అది కచ్చితంగా ద్రావిడ పార్టీనే అవుతుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ.. నూతన విద్యా విధానాన్ని తమిళనాడులో అమలు చేయాలని ఎవరూ బలవంత పెట్టలేరని స్పష్టం చేశారు.మా ఇద్దరి మధ్య కేవలం పోటీ మాత్రమే సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యల (ఒకవేళ కమల్ సీఎం అయినా తనకు అసూయ ఉండదన్న వ్యాఖ్యల) ప్రస్తావన రాగా, కమల్ హాసన్ వారి స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. తాను, రజనీకాంత్ ఎప్పుడూ ఒకరిని చూసి ఒకరం అసూయ పడలేదన్నారు. అయితే, తమ మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండేదన్నారు. తాము సినిమా రంగంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ పోటీ పడ్డాం.. ఒకవేళ మేం క్రికెట్ ఆడి ఉన్నా సరే, ఇలాగే పోటీ పడేవాళ్లం తప్ప అసూయ పడేవాళ్లం కాదన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం విజయ్ ప్రభుత్వానికి ఇప్పుడే మార్కులు వేయకుండా, కొంతకాలం వేచి చూడాలనే రజినీకాంత్ అభిప్రాయాన్ని కమల్ హాసన్ కూడా సమర్థించడం తమిళ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. -
హీరోగా పుష్ప విలన్.. డైరెక్టర్ ఎవరంటే?
మలయాళ ప్రముఖ నటుడు ఫాహద్ ఫాజిల్ తమిళం, తెలుగు భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పుష్ప సినిమాతో టాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. ఈయన హీరోగా, విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు. అలాంటి ఫాహద్ ఫాజిల్ తాజాగా తమిళంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ వరుసగా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా నిర్మిస్తున్న చిత్రానికి సి.ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయ న ఇంతకుముందు 96, మెయ్యళగన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. సరైన సమయాన్ని తీసుకుని పక్కా, స్క్రిప్ట్‌తో షూటింగ్‌కు రెడీ అవడం ఈయన విధానం. ఫాహద్ ఫాజిల్, దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ల రేర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్నిస్తుందనే అభిప్రాయాన్ని యూనిట్ సభ్యు లు పేర్కొన్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలను శనివారం చెన్నైలో నిర్వహించారు. ఇందులో నటించే హీరోయిన్, నటీనటులు ,సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. -
బాబీతో మరో మెగా ప్రాజెక్ట్.. 70 ఏళ్ల వయసులో చిరు కష్టం చూశారా?
వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత చిరంజీవి - దర్శకుడు బాబీ మరో ప్రాజెక్ట్ కోసం జతకట్టారు. వీరిద్దరి కాంబోలో ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో వచ్చే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ సోషల్‌మీడియాలో వైరలవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కాకాజీ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం పూర్తిగా భారీ యాక్షన్ సీన్స్‌తో నిండిన కథతో రానుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది.అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ అఫీషియల్‌గా లాంఛ్ కానుంది. ఈనె 21 నుంచి పూజా కార్యక్రమాలతో క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుందని మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పరిమితులను అధిగమించడానికి ప్రతి రోజూ మరో అవకాశం…నా ప్రియమైన డైరెక్టర్ బాబీ గారితో మెగా 158 కోసం మరో చిరస్మరణీయ ప్రయాణానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను.. ప్రారంభోత్సవం మే 21న అంటూ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తున్నారు. ఇది చూసిన అభిమానులు 70 ఏళ్ల వయసులో మెగాస్టార్ వర్కవుట్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
సీఎం విజయ్ నిర్ణయంపై విశాల్ తీవ్ర అభ్యంతరం..!
విజయ్ సీఎం అయ్యాక అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. సీఎంవోలో ఓ జ్యోతిష్యుడిని నియమించడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వెంటనే అతన్ని తొలగించారు. తాజాగా విజయ్ మరో నిర్ణయంపై హీరో విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్మ్ టెక్నాలజీ, సినిమాటోగ్రాఫీ శాఖను ఎగ్మోర్ ఎమ్మెల్యే రాజ్‌మోహన్‌కు అప్పగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని సీఎం విజయ్‌కు సూచించారు.సీఎం విజయ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నన్ను తీవ్రంగా నిరాశపర్చిందని విశాల్ అన్నారు. సినిమాతో విజయ్‌కు దశాబ్దాలుగా ఉన్న అనుబంధం కారణంగా.. ఈ శాఖకు న్యాయం చేయగలిగిన వ్యక్తి మీరేనని గుర్తు చేశారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని.. సినీరంగ అభివృద్ధికి తక్షణమే సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని అన్నారు.చిత్ర పరిశ్రమ, సంఘాలు, నిర్మాణ సంస్థలకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను అర్థం చేసుకోవడానికి పరిశ్రమలో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తి అవసరమని విశాల్ అన్నారు. ఈ విషయంలో తాను రాజ్‌మోహన్‌ను అవమానించే ఉద్దేశం తనకు లేదని.. సినిమా రంగంలో విజయ్‌కు ఉన్న అనుభవమే సరైన ఎంపిక అవుతుందని విశాల్ పేర్కొన్నారు. పరిశ్రమ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో, నిర్మాతలు, నిర్మాణ సంస్థలు సమస్యలు పరిష్కరించే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నామని విశాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.విజయ్ ముందు డిమాండ్లు..విశాల్ రాష్ట్ర ప్రభుత్వానికి మూడు కీలక డిమాండ్లు ప్రతిపాదించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సినిమా టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇది ప్రేక్షకులపై భారాన్ని తగ్గించి, రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తుందని అన్నారు. ఒకే దేశం-ఒకే పన్ను అనే సూత్రం ఉన్నప్పటికీ ద్వంద్వ పన్ను విధిస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు మాత్రమేనని.. స్థానిక సంస్థల పన్నును తొలగించాలని కూడా ఆయన కోరారు. దాదాపు తొమ్మిదేళ్లుగా ఈ డిమాండ్లు పరిష్కారం కాకుండానే ఉన్నాయని పేర్కొన్నారు. చిన్న బడ్జెట్ చిత్రాలకు సబ్సిడీలను పెంచాలని విశాల్ అభ్యర్థించారు. Happy to see #CMJosephVijay allocating ministries to respective elected MLAs but it's disheartening to see honorable minister #Rajmohan to be in charge as minister of Film Technology and Cinematograph Act. How would I or we as a body or as an association render our requests or…— Vishal (@VishalKOfficial) May 17, 2026 -
అదితి అదరహో...
ఫ్రాన్స్ వేదికగా 79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చలన చిత్రోత్సవాల్లో హాలీవుడ్ సినీ తారలతో పాటు భారతీయ సినీ తారల హంగామా జోరందుకుంది. హీరోయిన్స్ హ్యూమా ఖురేషీ, అదితి రావ్ హైదరీ, దిశా మదన్ రెడ్ కార్పెట్‌పై నడిచారు. గ్రీన్ కలర్లో అదిరిపోయే కాస్ట్యూమ్స్‌తో అదితీ రావ్ హైదరీ కనిపించారు. బ్లాక్ డ్రెస్‌లో మెరిశారు హ్యూమా ఖురేషి. హాలీవుడ్ స్టార్, ఈ ఏడాది జ్యూరీ సభ్యురాలు డెమి మూర్ బార్బీ లుక్‌తో సందడి చేశారు.జేమ్స్ గ్రే డైరెక్షన్‌లోని ‘పేపర్ టైగర్’ సినిమా ప్రీమియర్ సందర్భంగా డెమి మూర్ రెడ్ కార్పెట్ పై వాక్ చేశారు. స్పానిష్ దర్శకుడు రోడ్రిగ్ తెరకెక్కించిన ‘ది బిలవ్డ్’ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించగా, ఈ యూనిట్ హంగామా ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే క్రిస్టెన్ స్టీవర్ట్ ఓ లీడ్ రోల్ చేసిన ‘ఫుల్ ఫిల్’ సినిమా ప్రీమియర్ ప్రదర్శితమైంది. ఈ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 23 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. -
బ్లాక్మెయిల్ ఆరంభం
వరుణ్ సందేశ్, సురేష్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న సినిమా ‘బ్లాక్మెయిల్’. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో అవినాష్ కూనపరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్చాన్ చేయగా, రచయిత–నిర్మాత కోన వెంకట్ క్లాప్ ఇచ్చారు. సురేష్ తల్లి ఎం. వెంకట సుబ్బలక్ష్మి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు మంచి కంటెంట్‌తో సినిమా రాబోతోందని అర్థమైంది’’ అని అన్నారు.‘‘నన్ను నమ్మి ఈ సినిమాను నా చేతిలో పెట్టిన నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని చెప్పారు శ్రీనివాస్ గుండ్రెడ్డి. ‘‘నేను హీరోగా నా తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీనివాస్‌గారు ఈ చిత్రంలో నాకు మంచి పాత్ర ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది’’ అని చెప్పారు సురేష్. ‘‘200 కుటుంబాలకు పని కల్పించవచ్చనే ఉద్దేశంతోనే సినిమా రంగంలోకి వచ్చాను. నా సినిమాకు వచ్చే లాభాల్లో 10 శాతం మా సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్‌కు ఇస్తాను’’ అని తెలి΄ారు అవినాష్. ఈ చిత్రానికి సంగీతం: మల్లిక్ తేజ. -
నిజ జీవిత స్ఫూర్తితో పుట్టిన ‘పెద్ది’
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమా టైటిల్ వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పెద్దిరాజు అనే వ్యక్తి నుంచి ఈ టైటిల్ పుట్టిందని ఆయన తెలిపారు. పెద్దిరాజు తాపీ పని చేస్తూనే క్రికెట్, బాస్కెట్‌బాల్ బాగా ఆడేవారు. తనది పేద కుటుంబం కావడంతో ఎవరు డబ్బు ఇస్తే వాళ్ల తరఫున ఆడేవాడట. ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొంది కథను రాసుకున్నానని బుచ్చిబాబు చెప్పారు. అయితే ఈ సినిమా బయోపిక్ కాదు. నిజజీవితం నుంచి స్ఫూర్తిపొంది, దానికి కొంత ఫిక్షన్ కూడా జోడించి కథను రూపొందించానని ఆయన స్పష్టం చేశారు. అలా టైటిల్ కోసం పెద్దిరాజు పేరులోని ‘పెద్ది’ అనే పదాన్ని ఎంచుకున్నాను.ఇది కోడి రామ్మూర్తి బయోపిక్ అని, జూ.ఎన్టీఆర్ కోసం రాసిన కథ అని వస్తున్న పుకార్లను బుచ్చిబాబు ఖండించారు. ఉప్పెన రిలీజ్‌కు ముందే ఈ కథ రాసుకున్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. మొదట ఈ సినిమాను గోదావరి యాసలో తీద్దామనుకున్నాను. అయితే ఇప్పటికే రామ్ చరణ్ తన గురువు సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'రంగస్థలం' ఆ నేపథ్యమే కావడంతో తన సినిమా ‘పెద్ది’ కోసం విజయనగరం బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నానని దర్శకుడు వెల్లడించారు. మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్‌లో శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ‘పెద్ది’ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం సందడి చేయనుంది. -
'తిమ్మరాజుపల్లి టీవీ'లో అదో గుర్తుండిపోయే జ్ఞాపకం: ప్రదీప్ కొట్టె
న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన 'తిమ్మరాజుపల్లి టీవీ'. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ డ్రామా ఇది. రీసెంట్గా ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇందులో నటించిన ప్రదీప్ కొట్టె ఈ మూవీలో తన జర్నీ విశేషాలని పంచుకున్నాడు.'తిమ్మరాజు పల్లి టీవీ'లో నేను చేసిన రాజప్ప పాత్రకు ప్రశంసలు దక్కాయి. నాకు తొలి సినిమా, అవకాశం అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ సినిమాలు చేశాను కానీ తొలి ఫీచర్ ఫిల్మ్, మొదటిసారిగా స్క్రీన్ మీద కనిపించింది ఈ చిత్రంలోనే. ఇందులో సాయి తేజ్, లతీష్ ఇలా చాలామంది నటించిన పాత్రలు నాకు ఇష్టం. అందరూ సింగిల్ టేక్స్‌లోనే నటించారు. నేను యాక్టింగ్ సైడ్ ఉన్నానని మా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. మా అక్కకి తెలుసంతే. మా అమ్మనాన్నలకు చెప్పకుండా షూటింగ్‌కి తీసుకువచ్చింది మా అక్క. మా పేరెంట్స్‌ని అలా చూడటం, వారు నన్ను అలా చూడటం అదొక మెమరబుల్ మూమెంట్. -
సాహిత్యం ఒక థెరపీ.. తెలుగు సినిమాల్లో పాడాలనుంది
ఏది మనసును ఇబ్బంది పెడితే, దాన్ని కాగితంపై రాయండి. రాయడం అనేది ఒక ఆటోమేటిక్ రిలీజ్, అదొక థెరపీ కూడా.. అంటూ బ్రేకప్ టిప్స్ పంచుకుంది ప్రముఖ బాలివుడ్ సింగర్ కం యాక్టర్ సంజీతా భట్టాచార్య. మొదట్లో అలా రాసిన పాటను పాడేటప్పుడు గొంతు ఆగిపోతుందని, భావోద్వేగాలు అడ్డొస్తాయని.. కానీ కాలక్రమంలో ఆ వ్యక్తి కన్నా పాటే మిగిలిందని, అదే సంగీతంలోని అందమని ఆమె తెలిపారు. “మనిషి వెళ్లిపోతాడు… కానీ పాట మాత్రం ఉండిపోతుంది” అనే తన మాటలతో ఈ జనరేషన్లో బ్రేకప్‌లను బలహీనతగా కాకుండా, భావాలను అర్థం చేసుకునే ఒక దశగా చూడాలని సంజీతా సూచించారు. బాధను దాచుకోకుండా, దాన్ని ఆర్ట్‌గా, పాటగా, రాతగా మార్చితే అదే మన శక్తిగా మారుతుందన్నారు.షారుఖ్ కోసం స్పానిష్ సాంగ్..నగరంలోని ఇనార్బిట్ మాల్ లో షాపర్ష స్టాప్, హైబ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలోని ఫస్ట్ గ్లోబల్ గర్ల్ గ్రూప్ ఆడిషన్స్‌లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న సంజీతా భట్టాచార్య ‘సాక్షి’తో ముచ్చటించారు. గ్లామరస్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ప్రతిష్టాత్మక బెర్క్లీ కళాశాలలో మ్యూజిక్ డిగ్రీ పొందిన సంజీతా భట్టాచార్య.. సంగీతమే తనకు మొదటి ప్రేమ అని తెలిపింది. షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో తాను నటించడంతో పాటు స్పానిష్ సాంగ్ పాడటం తనకెంతో పేరు తెచ్చిపెట్టిందని అన్నారు. షారుక్ అంటే తనకూ ఎంతో ఇష్టమని, షూటింగ్ సమయంలో అలా చూస్తూ ఉండిపోయానని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘మా నాన్న నాకు మొదటి ప్రేరణ.. తానొక పెయింటింగ్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్‌గా సృజనాత్మకతతో జీవిస్తూ అందులోని ప్రేమను ఆస్వాదిస్తున్న వ్యక్తిగా పేర్కొన్నారు. ఫ్రాంక్లిన్, క్రిస్టినా, సెలిన్ డియాన్తో పాటు ఏ.ఆర్.రహ్మాన్ తన ఫేవరెట్స్ అని చెప్పారు. తదుపరి ప్రాజెక్ట్ కొత్త ఆల్బమ్ బీటీఎస్ అరిరంగ్ అందుబాటులో ఉందని, మరిన్ని కొత్త ప్రాజెక్టులతో రానుననాని, ఈ సంవత్సరం విడుదలకానున్న అల్బమ్ లో హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, బెంగాలీ పాటలు ఉంటాయని అన్నారు.మ్యూజిక్, కల్చర్, ఇన్స్పిరేషన్..హైదరాబాద్ ప్రజలు, ఇక్కడి సంస్కృతి ముఖ్యంగా బిర్యానీ అంటే నాకెంతో ఇష్టం. ఇక్కడికి 5 సార్లు వచ్చాను.. ప్రతి పర్ఫార్మెన్స్ తర్వాత ఇక్కడి నుంచి కొత్త ఫ్రెండ్స్‌తో వెళుతున్నాను.. అని హైదరాబాద్ ఆత్మీయ విశేషాలను పంచుకున్నారు. తెలుగు సినిమాల్లో కూడా పాడాలని ఉంది.. ఆ కోరిక త్వరలో నిజం కావాలని ఆశించారు. ఈ సందర్భంగా అభిమానుల కే-పాప్ సాంగ్ కావాలనే కోరిక మేరకు.. స్మూత్ లైక్ బెటర్ బీటీఎస్ సాంగ్ పాడి అలరించారు. ఈ తరం అమ్మాయిలు సోషల్ మీడియా వాడటంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ఈవెంట్ లైఫ్‌స్టైల్, మేకోవర్, కలర్ అనాలిసిస్, ఫోటోబూత్ ఫన్ వంటి విశేషాలతో ఒక ట్రెండీ యూత్ క్యాంపస్ వాతావరణాన్ని సృష్టించింది. ఫ్యాన్స్‌కు ఓపికగా సెల్ఫీలు ఇస్తూ సందడి చేశారు. -
85 ఏళ్ల నిర్మాత.. బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య
తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడు కె.రాజన్(85) చనిపోయారు. చెన్నైలో అడయార్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. 12 రోజులకే స్ట్రీమింగ్)తమిళ సినిమాల్లో కె.రాజన్.. నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడిగా విశేష సేవలు అందించారు. 1983లో విడుదలైన 'బ్రహ్మచారిగళ్' మూవీతో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టారు. తర్వాత డబుల్స్, అవళ్ పావమ్, నినైకథ నాళిళ్లయ్ తదితర సినిమాలు నిర్మించారు. 1991లో వచ్చిన 'నమ్మ ఊరు మరియమ్మ'తో దర్శకుడిగా మారారు. అనంతరం 'ఉనర్కిగళ్' తీశారు. దీంతో పాటు పలు చిత్రాలకు కథలు కూడా అందించారు.నటుడిగానూ తునివు, బకాసురన్ లాంటి సినిమాలతో పాటు పలు వాటిలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈయన కుమారుడు ప్రభుకాంత్ కూడా ప్రస్తుతం దర్శకుడిగా ఉన్నారు. ఇకపోతే రాజన్.. బహిరంగ వేదికలపై చేసే సంచలన వ్యాఖ్యలతోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆడియో లాంచ్‌లు, మూవీ ఈవెంట్స్‌లో నటుల భారీ పారితోషికాలు, నిర్మాతల ఆర్థిక ఇబ్బందులు, సినీ పరిశ్రమలోని అక్రమాల గురించి ఘాటుగా స్పందించేవారు. అలాంటి ఈయన ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో అంతా షాకయ్యారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా) -
అంజలి నెవ్వర్ బిఫోర్ లుక్.. డోస్ పెంచిన నేహాశెట్టి
బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న అంజలిగ్లామర్ డోస్ పెంచేసిన నేహా శెట్టిపచ్చని ఔట్ఫిట్లో అదితీ హొయలువర్కౌట్ వీడియో షేర్ చేసిన కీర్తి సురేశ్గ్లామర్తో మాయ చేస్తున్న రాశీ సింగ్రకుల్ ప్రీత్ సింగ్ రోజు గడుస్తుందిలా View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
హీరోయిన్ మీరా వాసుదేవన్ గురించి తెలుగువారికి కూడా సుపరిచితమే. గోల్ మాల్ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భామ.. 2001లో సీరియల్ ద్వారా బుల్లితెరపై నటిగా పరిచయమైంది. ఆ తర్వాత అంజలి ఐ లవ్యూ అనే చిత్రంలోనూ మెరిసింది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మీరా వాసుదేవన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ప్రస్తావించింది. తాను మూడు పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో చాలా పెద్ద తప్పులు చేశానని తెలిపింది. ఇప్పుడైతే చాలా ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నానని వెల్లడించింది. పెళ్లిళ్లు చేసుకుని దాదాపు 17 సంవత్సరాలు వృథా చేశానని పేర్కొంది. అర్థం లేని మూడు పెళ్లిళ్లకు అనవసరంగా సమయాన్ని కేటాయించానని వెల్లడించింది. పెళ్లి విషయంలో తాను మరింత తెలివిగా వ్యవహరించి ఉండాల్సిందని ఆమె అన్నారు.మూడోసారి కూడా విడాకులు తీసుకుని ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని మీరా వాసుదేవన్ తెలిపింది. నాకు నచ్చిన పనులు, సేవ చేస్తూ ఆనందంగా ఉంటున్నట్లు వాసుదేవన్ చెప్పుకొచ్చారు. తన తల్లిదండ్రులు, సోదరితో ఎక్కువ సమయం గడిపుతున్నానని తెలిపారు. తన సంబంధాలలో గౌరవం ఇవ్వని వ్యక్తులతో సమయాన్ని వృథా చేసుకున్నానని అన్నారు.పర్సనల్ లైఫ్..కాగా.. మీరా వాసుదేవన్.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కుమారుడు విశాల్ అగర్వాల్‌ను 2005లో పెళ్లి చేసుకుంది. మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. దీంతో ఐదేళ్లకే విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్‌ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా బాబు పుట్టాడు. కొన్నాళ్లకు ఈ జంట కూడా విడిపోయింది.వీరిద్దరు 2016లో విడాకులు తీసుకున్నారు. కుడుంబవిలక్కు సీరియల్ షూటింగ్లో కెమెరామెన్ విపిన్‌తో లవ్‌లో పడింది. కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డారు. ఈ క్రమంలో 2024 మేలో కోయంబత్తూరు వేదికగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కానీ, ఈ మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 2025 ఆగస్టులో విడాకుల విషయాన్ని ప్రకటించింది. దీంతో మూడు పెళ్లిళ్లు ఇలా పెటాకులయ్యాయి. -
ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా
కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సత్య.. హీరోగా గతంలో ఓ ప్రయత్నం చేశాడు గానీ వర్కౌట్ కాలేదు. మళ్లీ చాన్నాళ్లకు రీసెంట్‌గానే ఓ కామెడీ మూవీతో వచ్చాడు. తనకు మరింత క్రేజ్ వచ్చేలా చేసిన 'మత్తు వదలరా' దర్శకుడితో కలిసి తీసిన ఈ కామెడీ సినిమా.. ఇప్పుడు నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)'మత్తు వదలరా' రెండు సినిమాలతో ఆకట్టుకున్న రితేశ్ రానా దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'జెట్ లీ'. సత్య, వెన్నెల కిశోర్, రియా సింఘా ప్రధాన పాత్రలు చేశారు. వెరైటీ ప్రమోషన్లతో ఆకట్టుకోవడంతో ఓ మాదిరి బజ్ ఏర్పడింది. కానీ మే 01న థియేటర్లలోకి వచ్చిన తొలి ఆటకే పూర్తిగా తేలిపోయింది. కామెడీ పేరుతో చేసిన చిత్రవిచిత్ర విన్యాసాలు ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో డిజాస్టర్ అయింది. ఇప్పుడీ చిత్రం ఈనెల 25 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.'జెట్ లీ' విషయానికొస్తే.. ప్రజాపతి (అజయ్) అనే బిజినెస్‌మ్యాన్ రూ.15 వేల కోట్ల బ్యాంకింగ్ స్కామ్ చేసి దుబాయ్ పారిపోతాడు. దీంతో కేంద్ర హోంమంత్రి మేల్కోటి (శ్రీనివాస్ వడ్లమాని) ఇతడిని అరెస్ట్ చేసి తిరిగి దేశానికి రప్పించే బాధ్యతని భారత ఇంటెలిజెన్స్‌కి అప్పజెబుతాడు. అయితే కొందరి వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలియడంతో ప్రజాపతి స్వయంగా లొంగిపోయినట్లు నటించి, ఆ తర్వాత తప్పించుకోవాలని ప్లాన్ వేస్తాడు. దుబాయ్ నుంచి కొచ్చికి ప్రజాపతిని ప్రత్యేక విమానంలో తీసుకొస్తుండగా.. ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఇంతకీ అవేంటి? ఇదే విమానంలో గతం మర్చిపోయిన స్థితిలో ఉన్న డాక్టర్ వేదవ్యాస్ (సత్య) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. 12 రోజులకే స్ట్రీమింగ్)Get ready for first-of-its-kind inflight entertainment with bone-breaking action 💥 Fasten your seatbelts for a mad, turbulent ride ✈️ #JetLee is crash landing on 25th May on JioHotstar! 💫 #JetLeeOnJioHotstar A @RiteshRana's turbulence 🛫 Starring #Satya, #RheaSingha,… pic.twitter.com/mPAZ8dgFUq— JioHotstar Telugu (@JioHotstarTel_) May 17, 2026 -
‘త్రికాల’గా వస్తున్న శ్రద్ధాదాస్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ మే 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ శ్రద్ధదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించగా, రాధిక–శ్రీనివాస్ నిర్మించారు. చాగంటి ప్రొడక్షన్ ఎల్ఎల్బి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతుంది.ఇటీవలి కాలంలో మైథలాజికల్ టచ్‌తో వచ్చిన థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ‘త్రికాల’పై కూడా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన హైక్వాలిటీ వీఎఫ్ఎక్స్ ఈ సినిమాకు ప్రధాన బలం కానుందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలు, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అజయ్ పవర్ఫుల్ పాత్ర, శ్రద్ధాదాస్ కొత్త లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ…“ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ తిరుగుతుంది. భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి తెరకెక్కించాం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులకు ‘త్రికాల’ ఒక కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు.నిర్మాతలు మాట్లాడుతూ… సరికొత్త కాన్సెప్ట్‌తో, మైథలాజికల్ టచ్‌తో రూపొందిన ‘త్రికాల’ ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆసక్తి.. వంటి అంశాలు కలిసిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇస్తుంది’ అని పేర్కొన్నారు.ఈ సినిమాకు హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. -
ఐదుగురు పిల్లల్ని దత్తత తీసుకున్న మనోజ్
హీరో మంచు మనోజ్ "ఐక్యధైర్య సేన సమితి" పేరిట కొత్త ట్రస్ట్ ప్రారంభించాడు. ఈసారి బర్త్‌డే సెలబ్రేషన్స్ కంటే ముందు సేవకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపాడు. మార్చి 20న మనోజ్ పుట్టినరోజు.. ఈ క్రమంలోనే శనివారం (మార్చి 17) నాడు కొత్త ట్రస్ట్‌ను ప్రారంభిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 'ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఎవరు మన పక్కనున్నారు? ఎవరు మానవత్వంతో వ్యవహరించారనేది జీవితం గుర్తు చేస్తుంది.అలాంటి వారికోసం..ఈ మానవత్వం, సేవా స్ఫూర్తి ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. అది ఎల్లప్పుడూ మాలో అంతర్భాగంగా ఉంది. అవసరంలో ఉన్నవారికోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈరోజు మాలో ఉన్న స్ఫూర్తికి ఒక పేరు పెట్టి, మాతో కలిసి నడిచేందుకు మరిన్ని హృదయాలను ఆహ్వానించాలనుకుంటున్నాము.మానవత్వం కోసం..ముఖ్యంగా మౌనిక ప్రేరేపించిన ఆలోచనతో నేడు ఐక్యధైర్యసేనా సమితిని ప్రారంభిస్తున్నాం. ఐక్య అంటే ఐకమత్యం. మానవత్వం కోసం అందరూ ఏకం కావడం. దేవుడు మాకు ప్రసాదించినదాన్ని సేవ ద్వారా నలుగురికీ పంచుకోవాలనుకుంటున్నాము. రక్తదానం, అత్యవసర సహాయం వంటివి అవసరమైనచోట ఐక్య సంస్థ నిలబడుతుంది. ఇది రాజకీయం కాదు, అలాగే ఈ సంస్థ మాది మాత్రమే కాదు, మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరిదీ..కొత్త ఆశఒక గొప్ప లక్ష్యం కోసం హృదయాలు ఏకమైనప్పుడు జీవితాలు మారడమే కాదు... ఆశ మళ్లీ జీవం పోసుకుంటుంది అని ట్వీట్ చేశాడు. ఈ ట్రస్ట్ ద్వారా మొదటగా ఐదు మంది పిల్లలను దత్తత తీసుకున్నట్లు మనోజ్ ప్రకటించాడు. ఈరోజు నుంచి వారి బాధ్యతలు తనవేనని హామీ ఇచ్చాడు. Before celebrating birthdays, me and my wife @BhumaMounika wanted to begin with service.Life’s journey has taught us that beyond every high and low, what truly matters is humanity and the people who stand beside us.This spirit of service did not begin today. It has always… pic.twitter.com/p6gg3HqljP— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 17, 2026 చదవండి: పేరెంట్స్ విడాకులు.. వరలక్ష్మి అడిగిన ఒక్క ప్రశ్న వల్లే.. -
ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మెగా హీరో వరుణ్ తేజ్‌ని 2023లో పెళ్లి చేసుకున్న తర్వాత మెగా కోడలు అయిపోయింది. గతేడాది వీళ్లకు కొడుకు కూడా పుట్టాడు. పెళ్లికి ముందే ఓ సినిమాని లావణ్య పూర్తి చేయగా అది వాయిదాలు పడుతూ ఈ నెల ప్రారంభ వారంలో వచ్చింది. దీన్ని జనాలు కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం రెండు వారాలైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'సతీ లీలావతి'. తాతినేని సత్య దర్శకుడు. ప్రేమ, పెళ్లి, విడాకుల తదితర అంశాలతో తీసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఈ నెల 8వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. కంటెంట్ బాగోలేకపోవడంతో ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం(మే 20) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్కి రెడీ అయింది. అంటే రిలీజైన 12 రోజులకే తీసుకొచ్చేస్తున్నారనమాట. తెలుగు, తమిళ వెర్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.'సతీ లీలావతి' విషయానికొస్తే.. లీలావతి (లావణ్య త్రిపాఠి) స్టార్ డైరెక్టర్. తల్లిదండ్రుల గొడవల కారణంగా చిన్నప్పటి నుంచి ఈమెలో ఓ రకమైన భయం ఏర్పడిపోతుంది. దీని నుంచి బయటపడేందుకు సైకాలజిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్) ఈమెకు సాయం చేస్తాడు. అలా ప్రేమలో పడి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. కానీ వివాహమైన మూడేళ్లకు తనకు విడాకులివ్వాలని లీలావతిని సేతు అడుగుతాడు. నర్స్ నికోలా(మడోన్నా సెబాస్టియర్)తో ప్రేమలో ఉన్నానని.. విడాకులిస్తే ఆమెనే వివాహమాడతానని చెప్తాడు.భర్త ప్రేమ వ్యవహారం తెలిసిన లీలావతి.. సేతుని కొట్టి ఇంట్లో బంధిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు సేతు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఈ కథలో లాయర్ తమలపాకుల (వీటీవీ గణేశ్), నిర్మాత మెట్ట రాజన్ (మెట్ట రాజేంద్రన్), దొంగ (సప్తగిరి) పాత్రల సంగతేంటి? చివరకు లీలావతి - సేతు విడిపోయారా? ఒక్కటయ్యారా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా) -
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
కన్నడ ముద్దుగుమ్మ, హీరోయిన్ శ్రీలీల గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఈ ఏడాది పరాశక్తి చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ కన్నడభామ ప్రస్తుతం ధనుష్‌కు జంటగా కనిపించనున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. ఈ ముద్దుగుమ్మపై గతంలో రూమర్స్ వినిపించాయి. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్లో ఉందంటూ వార్తలొచ్చాయి. వినాయక చవితి వేడుకల కోసం ఆమె తన తల్లితో కలిసి ముంబయిలోని కార్తీక్ ఇంటికి వెళ్లడంతో పుకార్లు వైరలయ్యాయి. అదే సమయంలో తనకు డాక్టర్ కోడలు కావాలని కార్తీక్ ఆర్యన్ తల్లి చెప్పడంతో మరింత ఆజ్యం పోసింది. కానీ వీటిపై ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు.(చదవండి: రామ్ చరణ్ మణికట్టుకు గాయం.. ఎల్లుండి ఆపరేషన్!)తాజాగా శ్రీలీలపై మరోసారి డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ సారి ఏకంగా టీమిండియా క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్లో ఉందంటూ కథనాలొస్తున్నాయి. మన తెలుగువాడు, యంగ్ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తోందని కథనాలు మొదలయ్యాయి.ఏడాదిగా రూమర్స్.. శ్రీలీల, తిలక్ వర్మ ప్రేమలో ఉన్నారని గతేడాది నుంచి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి కనిపించారని వార్తలు రావడంతో రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. దాదాపు ఆరు నెలల క్రితమే శ్రీలీల తన తల్లితో కలిసి తిరుమలను సందర్శించింది. అదే సమయంలో తిలక్ వర్మ కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం.ఆ తర్వాత ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా శ్రీలీల, ఆమె తల్లితో పాటు ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లతో కలిసి కనిపించడంతో రూమర్స్ మరింత బలపడుతున్నాయి. అయితే తమపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించలేదు. -
రామ్ చరణ్‌కు మరో ఆపరేషన్.. ?
రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ మరికొద్ది రోజుల్లో(జూన్ 4) ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రెండేళ్లుగా ఈ చిత్రం కోసం రామ్ చరణ్ కష్టపడ్డాడు. దర్శకుడు బుచ్చిబాబు రాసుకున్న ‘పెద్ది’ పాత్ర కోసం చరణ్ పడిన కష్టం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, యాక్షన్ కొరియోగ్రాఫర్‌తో పాటు నిర్మాత కూడా చరణ్ పడిన కష్టం గురించే చెబుతున్నారు. యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించే క్రమంలో చాలా సార్లు ప్రమాదానికి గురయ్యారట. దాదాపు మూడు పెద్ద గాయాలు అయ్యాయట. కానీ బయటకు మాత్రం కంటికి గాయం అయిందన్న విషయమే తెలిసిందే. ఓ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నప్పుడు చరణ్ మణికట్టుకు కూడా తీవ్రంగా గాయం అయిందట. అయినా కూడా షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వలేదట. ఇప్పుడా నొప్పి కాస్త ఎక్కువైపోవడంతో వైద్యులను సంప్రదిస్తే.. సర్జరీ చేయాలని చెప్పారట. రెండు రోజుల్లో చరణ్ మణికట్టు దగ్గర చిన్న సర్జరీ చేయించుకోబుతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత వెంకట సతీష్ వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. చరణ్‌కు తగిలిన గాయాల గురించి వివరించాడు.‘పెద్ది’ సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. షూటింగ్ సమయంలో ఆయనకు మూడు గాయాలు అయ్యాయి. అయినా కూడా విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్లో పాల్గొన్నాడు. కంటికి మాత్రమే కాదు మణికట్టు దగ్గర కూడా గాయం అయింది. ఇప్పుడా నొప్పితో బాధపడుతున్నాడు. ఎల్లుండి(మంగళవారం) ఆపరేషన్ ఉంది. షూటింగ్ సమయంలో కండరాలు పట్టేసేవి. షూటింగ్ గ్యాప్‌లో జిమ్ చేసి వచ్చేవాడు. కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్లో ఆయన కండరాలు పట్టేశాయి. కాలు కూడా బెణికింది. ఆయన కోసం ప్రత్యేకంగా ఫిజియో థెరపిస్ట్ పెట్టాల్సివచ్చింది. ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి నటించాడు. సినిమా చూస్తే అందరికి ఆ విషయం అర్థవవుతుంది. సినిమా ప్రారంభం నుంచే పెద్ది ప్రపంచంలోకి వెళ్తారు’ అని సతీష్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇటీవల చరణ్ కంటికి చిన్న సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మణికట్టుకు కూడా మరో సర్జరీ అని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
మేం అమ్మనాన్న అయ్యాం.. కమెడియన్ పోస్ట్
జబర్దస్త్ కామెడీ షోతో చాలామంది కమెడియన్లు గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్లలో కెవ్వు కార్తిక్ ఒకడు. ప్రారంభంలో అవినాష్‌తో కలిసి స్కిట్స్ చేసిన ఇతడు తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు. ప్రస్తుతం ప్రవీణ్‌తో కలిసి షోలో కనిపిస్తున్నాడు. ఇకపోతే రెండేళ్ల క్రితం సిరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె బిడ్డకు జన్మనిచ్చినట్లు కార్తీక్ వెల్లడించాడు.(ఇదీ చదవండి: అట్లీ పాపకు అందమైన పేరు.. దాని అర్థమేంటంటే?)మేం అమ్మనాన్న అయ్యాం. చిన్ని పాదాలతో మా జీవితాల్లోకి వచ్చిన బిడ్డ మా జీవితాలని మార్చేసింది. అమ్మని కోల్పోయిన సరిగ్గా రెండేళ్లకు ఈ బిడ్డ మా జీవితాల్లోకి వచ్చింది అని కెవ్వు కార్తిక్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన మూడు ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.కార్తిక్‌తో స్కిట్స్ చేసిన అవినాష్ కూడా రెండు మూడు రోజుల క్రితమే తండ్రయిన విషయాన్ని బయటపెట్టాడు. కొడుకు పుట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా పిల్లాడి ఫొటోలని పంచుకున్నడు. మరోవైపు కార్తిక్‌తో ప్రస్తుతం స్కిట్స్ చేస్తున్న ప్రవీణ్.. రీసెంట్‌గానే నటి వంశీతని పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ తెలుగు రివ్యూ) View this post on Instagram A post shared by Kevvu Kartheek (@kevvukartheek) -
పేరెంట్స్ విడాకులు.. వరలక్ష్మి అడిగిన ఒక్క ప్రశ్న వల్లే..!
సినీ రంగంలో డేరింగ్ అండ్ డాషింగ్ నటీమణుల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఒకరు. తనకున్న గుండెధైర్యం మధ్యలో వచ్చింది కాదు, చిన్నప్పటినుంచే ఉంది. చిన్నతనంలోనే తల్లిదండ్రుల విడాకులను కళ్లారా చూసింది. తల్లి చాయా దేవి కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఎదురు తిరిగింది. ఆమె కొత్త జీవితం మొదలుపెట్టేందుకు కారణమైంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..పేరెంట్స్ విడాకులుశరత్కుమార్, చాయా దేవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వరలక్ష్మి, పూజ అని ఇద్దరు ఆడపిల్లలు సంతానం. కొంతకాలానికి మనస్పర్థల కారణంగా శరత్‌కుమార్ దంపతులు విడిపోయారు. అప్పుడు వరలక్ష్మి వయసు పదిహేనేళ్లే.. తనకేం అర్థం కాలేదు. తమవైపు నుంచి ఏదైనా తప్పుందా? ఉంటే దాన్ని సరిదిద్దుకుంటాం కదా అనుకుంది. నెమ్మదిగా పరిస్థితిని అర్థం చేసుకుంది. తల్లికి అండగా నిలబడింది. ఒక్క ప్రశ్నతో తల్లిలో మార్పుఅయితే విడాకుల బాధ నుంచి చాయాదేవి అంత సులువుగా బయటకు రాలేదు. ఒకరోజు ఏడుస్తూనే కూర్చున్న తల్లి దగ్గరకు వెళ్లింది వరలక్ష్మి. జీవితాంతం ఇలాగే ఏడుస్తూ ఉండిపోతావా? జరిగిందేదో జరిగిపోయిందని ముందుకు కదుల్తావా? అని ప్రశ్నించింది. ఆ ఒక్క ప్రశ్న తల్లిని ఆలోచనలో పడేసింది. తనెందుకు బాధపడుతూ ఉన్నచోటే ఆగిపోవాలని తలచింది. సొంతంగా బిజినెస్ ప్రారంభించింది. సంపాదించడం మొదలుపెట్టింది.మళ్లీ పెళ్లి చేయాలని..అయితే తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని మ్యాట్రిమోనీలోనూ వరుడిని వెతికారు వరలక్ష్మి, పూజ. కానీ చాయా దేవి అందుకు ఇష్టపడలేదు. కేవలం పిల్లల పెంపకం, బిజినెస్.. ఈ రెండింటిపైనే దృష్టి పెట్టింది. తల్లి మాట కాదనలేక సైలెంట్ అయిపోయారు. తల్లితో విడాకుల కారణంగా మొదట్లో తండ్రిపై కోపం, బాధ కలిగాయని, కానీ గొడవపడుతూ కలిసుండటం కన్నా విడిపోవడమే మంచిదని తర్వాత అర్థమైందని నటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఎవరినీ దగ్గరకు రానివ్వనుఇంకా మాట్లాడుతూ.. చిన్నతనంలోనే ఒంటరితనాన్ని అనుభవించడం వల్ల ఎవరినీ తన దగ్గరకు రానివ్వనంది. అనుబంధాలపై పెద్దగా అటాచ్మెంట్ లేదంది. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటే మనం జీవించలేమని, మన కోసం ఎవరో వచ్చి కంటతడి పెట్టరని పేర్కొంది. ఇతరులను గాయపరచకుండా మనం ఏం చేసినా తప్పులేదంది. శరత్‌కుమార్ రెండో పెళ్లివరలక్ష్మీ శరత్ కుమార్ మొదట్లో కథానాయికగా రంగప్రవేశం చేసినా, ఆ తర్వాత వచ్చిన, నచ్చిన పాత్రలు చేస్తూ ఆల్‌రౌండర్‌గా మారింది. ఇటీవల దర్శక, నిర్మాతగా కూడా అవతారమెత్తింది. కాగా శరత్‌కుమార్, చాయా దేవి 1984లో పెళ్లి చేసుకున్నారు. 2000వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది నటి రాధికను పెళ్లి చేసుకున్నాడు. శరత్- రాధిక దంపతులకు కుమారుడు రాహుల్ సంతానం.చదవండి: త్రిష కోసమే ఆ పని చేశా.. చెప్పడానికే ఎంతో భయంగా ఉంది: చిన్మయి -
'ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది'.. నటికి డైరెక్టర్ కౌంటర్
టాలీవుడ్ నటి సునయన షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల రిలీజ్ చేసిన హ్యాపీ జర్నీ మూవీ పోస్టర్లో తాను లేకపోవడం తీవ్రంగా బాధించిందని తెలిపింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో నేను లేకపోవడంతో నా ఫ్యామిలీ కూడా ఫుల్ డిసప్పాయింట్‌కు గురయ్యారని వెల్లడించింది. విదేశాల్లో షూట్‌కు వెళ్లినప్పుడు కాస్తా గ్యాప్ దొరికితే ఎవరైనా షాపింగ్ వెళ్తారని చెప్పింది. అంతమాత్రాన నా ఫోటోను ఫస్ట్ లుక్ పోస్టర్లో నుంచి తీసేయండి చాలా బాధగా ఉందని తన ఆవేదన వ్యక్తం చేసింది.షాపింగ్ వెళ్తే ఎలా ఉంటారు.. డైరెక్టర్ కౌంటర్సునయనకు హ్యాపీ జర్నీ డైరెక్టర్ అభిరామ్ కౌంటరిచ్చారు. పారిస్ లాంటి లోకేషన్స్‌కు వెళ్లినప్పుడు.. షూట్లో లేకుండా మీరు షాపింగ్‌కు ఎలా వెళ్తారండి అని ప్రశ్నించారు. పారిస్ వరకు వచ్చాక మీరు షూటింగ్ లోకేషన్లో అందుబాటులో ఉండాలి కదా అని నిలదీశారు. అక్కడేక్కడో మిక్చర్ బాగుంటుంది.. ఇక్కడెక్కడో బజ్జీలు బాగుంటాయంటా? అని మీరు వెళ్తే మరి ఫోటోలో ఎలా కనిపిస్తారని ఎద్దేవా చేశారు. చివరికీ మిమ్మల్ని యాడ్ చేసేందుకు వీఎఫ్ఎక్స్లో కూడా ట్రై చేశామన్నారు. కానీ నేచురల్ లుక్ రాకపోవడంతోనే నేనే వద్దని చెప్పానని డైరెక్టర్ అభిరామ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇది మీ బ్యాడ్ లక్ అండి.. ఈ విషయంలో నేను ఎలాంటి సాయం చేయలేనని కౌంటరిచ్చారు. ఇప్పుడు ఈ మ్యాటర్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. సునయన బదం పలు సూపర్ హిట్ సినిమాల్లో క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా మెప్పించింది. -
అట్లీ పాపకు అందమైన పేరు.. దాని అర్థమేంటంటే?
తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ ఏడాది ప్రారంభంలో గుడ్‌న్యూస్ చెప్పాడు. భార్య ప్రియ రెండోసారి గర్భం దాల్చిందని వెల్లడించాడు. కుమారుడు మీర్‌తో ఆడుకునేందుకు ఓ బుజ్జి బేబీ ఇంట్లోకి రాబోతుందని శుభవార్త చెప్పాడు. అంతలోనే ఏప్రిల్ 20న పాప పుట్టిందని ప్రకటించాడు. తాజాగా పాప పేరును వెల్లడించాడు.కూతురి నామకరణంమీర్, ప్రియ.. ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసి వచ్చేలా మియూ (MIYOU) అని నామకరణం చేశాడు. మియూ అంటే అందం, ప్రేమకు చిరునామా అని తెలిపాడు. అలాగే మి అంటే నేను, యు అంటే నువ్వు.. అని అర్థం వచ్చేలా మియూ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి మరోసారి అభిమానులు అట్లీ జంటకు కంగ్రాట్స్ చెప్తూ పాప పేరు భలే ఉందని కామెంట్లు చేస్తున్నారు.టాప్ డైరెక్టర్‌గా..అట్లీ విషయానికి వస్తే.. రాజా రాణి సినిమాతో దర్శకుడిగా ఫేమస్ అయ్యాడు. విజయ్‌కు తేరి, మెర్సల్, బిగిల్ చిత్రాలతో సూపర్ హిట్లు అందించాడు. షారూఖ్ ఖాన్‌కు జవాన్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో రాకా మూవీ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌తో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. Our art of love now has a name 💕🧿MIYOU — beauty, gentleness & loveWith luv , MEER , PRIYA & ATLEE 💕🧿 pic.twitter.com/hoUi9D5Fw9— atlee (@Atlee_dir) May 17, 2026చదవండి: చేయి కోసుకుని బ్లాక్మెయిల్ చేసింది నువ్వు కాదా? ఆర్తి రవి తల్లి ఫైర్ -
విడాకులపై ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్..!
ఇటీవలే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. ఈ సమయంలో మా ప్రైవసీని గౌరవించాలని అభిమానులను కోరింది. నాలుగేళ్ల పాటు బంధంలో ఉన్న ఈ జంట సంయుక్త ప్రకటన రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చారు.అయితే అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చారు. వీరిద్దరు ఇప్పటికే సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకున్నారు. కానీ తాజాగా ఈ జంట మళ్లీ ఒకరినొకరు అనుసరిస్తున్నారు. దీంతో ఈ జంట తమ విడాకుల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మళ్లీ ఫాలో కావడంతో ఈ జంట కలవబోతున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా వీరిద్దరు కలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. మౌనీరాయ్ సీరియల్స్‌తో పాటు పలు చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. -
చేయి కోసుకుని బ్లాక్మెయిల్ చేసింది నువ్వు కాదా? హీరోపై అత్త ఫైర్
కట్టుకున్న భార్య ఆర్తిని కాదనుకున్నాడు. సింగర్ కెనీషాతో ప్రేమలో పడ్డాడు. విడాకులు మంజూరవకముందే ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేసరికి జనం ఛీకొట్టారు. విపరీతమైన ఆన్లైన్ ట్రోలింగ్ తట్టుకోలేక ప్రేయసి వదిలేసింది. దీంతో ఒంటరివాడైపోయాడు తమిళ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి.పెళ్లి తర్వాత నరకంఆ బాధ తట్టుకోలేక మీడియా ముందుకు వచ్చాడు. పెళ్లి తర్వాత నరకం చూశానన్నాడు. ఇంట్లో కనీస గౌరవం ఇచ్చేవాళ్లు కాదని, ఆఖరికి తాను సంపాదించిన డబ్బును దాచుకునేందుకు తనకంటూ ఒక అకౌంట్ కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లల్ని కూడా చూడనివ్వడం లేదని, తనపై చేతబడి చేయడంతో రక్తపు వాంతులు అవుతున్నాయన్నాడు. నటి వల్ల జీవితం నాశనంశారీరకంగా, మానసికంగా హింసించి చంపేయాలని చూస్తున్నారని ఆరోపించాడు. మూడక్షరాల ఇడ్లీ నటి తన జీవితాన్ని నాశనం చేసిందన్నాడు. ఈ ఆరోపణలపై ఆర్తి తల్లి, నిర్మాత సుజాత విజయకుమార్ స్పందించింది. అతడికి పిల్లల్ని దూరం చేస్తున్నారన్నదాంట్లో ఏమాత్రం నిజం లేదంది. పైగా 2009లో రవి- ఆర్తిల పెళ్లి ఎలా జరిగిందన్న విషయాన్ని ప్రస్తావించింది. బ్లాక్మెయిల్ చేసింది అతడే..ఆమె మాట్లాడుతూ.. '2008లో వికటన్ మ్యాగజైన్లో ఓ ఇంటర్వ్యూ వచ్చింది. దానికోసం నేను వెతుకుతున్నాను. అందులో ఆర్తిని పెళ్లి చేసుకోమని బలవంతపెట్టిందెవరు? చేతి మణికట్టు కోసుకుని బ్లాక్మెయిల్ చేసిందెవరు? అన్నది స్పష్టంగా ఉంది. తన డబ్బు వాడుకోనిస్తున్నామా? లేదా? అన్నది కోర్టు ఇదివరకే క్లారిటీ ఇచ్చింది' అని తెలిపింది.ఆ నటి హస్తం లేదురవి ప్రస్తావించినట్లుగా తన జీవితాన్ని నాశనం చేసిన మూడక్షరాల నటి ఖుష్బూ(ఖుష్బూ పేరును తమిళంలో మూడు అక్షరాలతో రాస్తారు) యా? అన్న ఓ విలేకరి ప్రశ్నకు సుజాత ఇలా స్పందించింది. 'తమిళనాడులో ఏ మహిళకు అన్యాయం జరిగినా అందరూ మాట్లాడతారు. లక్షలాది మంది ఆర్తి పోస్టులకు కామెంట్లు పెట్టారు. కేవలం ఫలానా వ్యక్తులే ఆర్తి వెంట ఉండి ఇదంతా చేస్తున్నారనడం పూర్తిగా అబద్ధం. పెళ్లిప్రస్తుతం ఈ విడాకుల కేసు కోర్టులో ఉన్నందున ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను' అంది. కాగా రవి మోహన్- ఆర్తి 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరవ్, అయాన్ అని ఇద్దరు కుమారులు సంతానం. కాగా రవిమోహన్ దంపతులు 2024లో విడిపోతున్నట్లు ప్రకటించారు.చదవండి: త్రిష కోసం ఆ పని చేశా.. చెప్పాలంటే భయంగా ఉంది: చిన్మయి శ్రీపాద -
'అందుకే స్టాలిన్‌ను కలిశా.. విజయ్‌పై ద్వేషం లేదు'.. రజినీకాంత్ ఆసక్తికర కామెంట్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమిళనాడు రాజకీయాలపై ఆయన మాట్లాడారు. నేను రాజకీయాల్లోకి రానని మరోసారి స్పష్టం చేశారు. పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాడినని ధీమా వ్యక్తం చేశారు. స్టాలిన్ నాకు మంచి స్నేహితుడని.. ఎన్నికల్లో ఓటమి తర్వాత అందుకే వెళ్లి కలిశానని అన్నారు.కేవలం ఒక స్నేహితుడిగా మాత్రమే స్టాలిన్‌ను కలిశానని రజినీకాంత్ వెల్లడించారు. హీరో విజయ్ సీఎం కావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. నాకు ఎవరిపైనా ఎలాంటి ద్వేషం లేదని అన్నారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని.. అందుకే విజయ్ను గెలిపించాలని రజినీకాంత్ స్పష్టం చేశారు.ఎన్నికల ఫలితం తర్వాత స్టాలిన్‌ను కలవడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. దీంతో తాను స్టాలిన్‌ను కలవడానికి గల కారణాలను వెల్లడించారు. విజయ్ సీఎం అయినందుకు నాకేలాంటి అసూయ లేదన్నారు. కమల్‌హాసన్ సీఎం అయితే అసూయపడేవాడిని.. కానీ విజయ్ సీఎం అయ్యాడని తెలిసి మొదట షాక్‌కు గురైనట్లు తెలిపారు. తమిళనాడు ప్రజలకు విజయ్ మంచి చేస్తాడని నమ్మారని రజినీకాంత్ తెలిపారు. సింగిల్‌గా పోటీచేసి రెండు పెద్ద పార్టీలపై గెలిచాడని ప్రశంసించారు. నన్ను విజయ్‌తో పోల్చడం కరెక్ట్ కాదని.. నాకు, అతనికి 28 ఏళ్ల వ్యత్యాసముందని రజినీ స్పష్టం చేశారు. ఇక తలైవా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం జైలర్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
త్రిష కోసం ఆ పనిచేశా.. చెప్పాలంటే భయంగా ఉంది!
చిన్మయి శ్రీపాద.. పాటలు పాడటమే కాదు, ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్తూ ఉంటుంది. అలా కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సినిమాలో త్రిషకు కూడా తనే గొంతు అరువిచ్చింది. కానీ, ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి భయమేసిందంటోంది చిన్మయి. ఈమేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.నిజంగా భయపడ్డా..'మీకు ఈ విషయం ఎలా చెప్పాలా? అని నన్ను నేను సిద్ధం చేసుకోవడం కాస్త విచిత్రంగా ఉంది. కరుప్పు సినిమాలో త్రిషకు నేనే డబ్బింగ్ చెప్పాను. ఆ మాట చెప్పేందుకు నేను నిజంగా భయపడ్డాను. ఆర్జే బాలాజీ నాకు చాలాకాలంగా తెలుసు. అతడు, అతడి భార్య ఎంతో మంచివాళ్లు. బాలాజీ ఎంతో పట్టుదల, ధృడ సంకల్పంతో ముందుకు సాగే వ్యక్తి. తన కలలను సాకారం చేసుకోవడానికి ఎంతగానో శ్రమిస్తాడు. నాకు అతడి గురించి, అతడి కుటుంబం గురించి బాగా తెలుసు. అందుకే అతడి గురించి భయపడ్డాను. వెక్కివెక్కి ఏడ్చా..గతంలో లియో సినిమా(త్రిష కోసం డబ్బింగ్ చెప్పినందుకు) విషయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి అతడికి ఎలాంటి వ్యతిరేకతలు ఎదురవుతాయోనని ఆందోళన చెందాను. ఆ మూవీలో కొన్ని సీన్స్‌కు డబ్బింగ్ చెప్పేటప్పుడు వెక్కివెక్కి ఏడ్చిన విషయం నాకు బాగా గుర్తుంది. నా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. గతంలో జరిగిందంతా మళ్లీ నా కళ్లముందు కదులుతున్నట్లే అనిపించింది.థాంక్యూ బాలాజీఏదేమైనా ఈ సినిమాలో త్రిషకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్నిచ్చినందుకు థాంక్యూ బాలాజీ. నా సొంతగడ్డపై ఎటువంటి బెరుకు లేకుండా, తర్వాత ఏం జరుగుతోందనన్న భయం లేకుండా నా పని నేను ధైర్యంగా చేసుకునే శక్తిని ఆ కరుప్పు సామి ఇస్తాడని ఆశిస్తున్నాను. ఏళ్ల తరబడి పని చేసుకోకుండా నిషేధించబడ్డ నాకు, నాలాంటి బాధితులను దేవుడు అనుగ్రహించుగాక!' అంటూ #KaruppuBlockbuster అనే ట్యాగ్ జత చేసింది చిన్మయి.చిన్మయిపై బ్యాన్2018లో మీటూ ఉద్యమ సమయంలో డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న రాధా రవిపై చిన్మయి శ్రీపాద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో తమిళనాడులోని 'సౌత్ ఇండియన్ సినీ, టెలివిజన్ ఆర్టిస్ట్స్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్' (SICTADAU) చిన్మయి సభ్యత్వాన్ని రద్దు చేసి నిషేధం విధించింది. ఆమెపై బ్యాన్ ఉన్నప్పటికీ లోకేశ్ కగనరాజ్ లియో (2023) మూవీలో త్రిషకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని చిన్మయికి ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి కరుప్పులో త్రిషకు తనే డబ్బింగ్ చెప్పింది. Strange I am readying myself saying this... I was genuinely afraid this time, of sharing that I dubbed in Karuppu. I have known R J Balaji a long time - he and his wife, are such lovely people and RJB himself, is someone whose entire life is such a story of grit,…— Chinmayi Sripaada (@Chinmayi) May 16, 2026 చదవండి: విజయ్- త్రిషలపై చీప్ ప్రశ్న.. రాజాసాబ్ బ్యూటీ ఆగ్రహం -
పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ కాదు.. ఎవరంటే?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయలేదట. ఈ చిత్రంలో మొదట జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్‌ను అనుకున్నారట. ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికీ మళ్లీ జాన్వీ కపూర్ వైపే మొగ్గుచూపారు. ఒక వేళ్ల జాన్వీ కపూర్ ప్లేస్‌లో ఖుషి కపూర్ చేసి ఉంటే తనకిది బిగ్గెస్ట్ టాలీవుడ్ డెబ్యూ అయ్యి ఉండేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.కాగా.. ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
తప్పు తనదే అన్నాడు.. చరణ్‌లా ఏ హీరో ఒప్పుకోరు : ఫైట్ మాస్టర్
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్‌గా వర్క్ చేసిన నబా కాంత్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ–‘‘మాది మణిపూర్. నా చిన్నప్పుడే నాన్నగారు హైదరాబాద్ వచ్చారు. నాన్నగారి స్ఫూర్తితో ఇదే ఫీల్డ్‌లో 14 ఏళ్ల వయసు నుంచి ఉన్నాను. స్టంట్స్‌లో నాకు 18 ఏళ్ల అనుభవం ఉంది. విజయ్, రామ్–లక్ష్మణ్ మాస్టర్ల దగ్గర అసిస్టెంట్ మాస్టర్‌గా వర్క్ చేశాను. ‘పుష్ప’ చిత్రంతో యాక్షన్ కొరియోగ్రాఫర్ అయ్యాను. ఆ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ చూసి, ‘మా పేరు నిలబెట్టావ్’ అని రామ్–లక్ష్మణ్ మాస్టర్లు అన్నప్పుడు సంతోషంగా అనిపించింది. పుష్ప 2, మన శంకర వరప్రసాద్‌గారు, డెకాయిట్’ సినిమాలకు వర్క్ చేశాను. తాజాగా ‘పెద్ది’ సినిమా చేశాను. ఫస్ట్ గ్లింప్స్‌లో సరికొత్త బ్యాటింగ్ స్టైల్‌తో చరణ్‌గారు సిక్సర్ కొట్టే షాట్‌ను నేనే కంపోజ్ చేశాను. మా గురువుగారు రామ్–లక్ష్మణ్మాస్టర్లు ఈ సినిమాలోని ఓ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ చేశారు. ఈ సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు చరణ్‌కి గాయమైంది. ఓ రోల్ మూమెంట్లో తనకి పొరపాటున అలా జరిగింది. ఆ క్షణంలో నేను ఏడ్చేశాను. కానీ, చరణ్ మాత్రం పొరపాటు తనవైపే ఉందని చెప్పారు. నిజంగా ఏ హీరో అలా ఒప్పుకోరు. తనకంటే ముందు ఎదురుగా ఉన్న ఫైటర్‌కి ఏమైందో చూడమని అందరికీ చెప్పారు. ఆయన కుట్లు వేయించుకుని మరుసటి రోజే షూట్‌కి వచ్చేశారు. నేనైతే షాక్ అయిపోయా.ఇందులో కుస్తీ సీక్వెన్స్ కోసం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్గారి నాన్నగారు శ్యామ్ కౌశల్‌ను సంప్రదించాం. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ‘పెద్ది’ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’, విజయ్ దేవరకొండ ‘రౌడీ జనా ర్ధన’, చిరంజీవి–బాబీ, సల్మాన్‌ఖాన్–వంశీగార్ల సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు. -
'ఎంత పని చేశావయ్యా?'.. పెద్ది డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్..!
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా వస్తోన్న చిత్రం పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఎట్టకేలకు జూన్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ కోసం చరణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. ఈ మూవీ ట్రైలర్ జూన్ 18న రిలీజ్ కానుంది.అయితే ట్రైలర్ రిలీజ్‌కు ముందే మెగాస్టార్ ట్రైలర్ వీక్షించారు. మూడు నిమిషాల పాటు ఉన్న ట్రైలర్ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఫుల్ ఫైర్‌పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అని ప్రశంసలు కురిపించారు. చరణ్… బుచ్చి… రెహమాన్… ఇలా ఒక్కొక్కరు తమ బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు. ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.. ఎమోషన్.. ఎలివేషన్.. మ్యాడ్నెస్ అన్ని నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయన్నారు. అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు చిరు లీక్స్ ఇచ్చి.."మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు... నేను పోరాడాను సారు..." అంటూ పెద్ది డైలాగ్ లీక్ చేశారు. నన్ను క్షమించు బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పాను అంటూ చిరు ట్వీట్ చేశారు. #PeddiTrailer చూసాను!! 🔥Just… WOW 🤗🤗🤗3 నిమిషాలు…PURE FIREPOWER PACKED TRAILER!! ✨చరణ్… బుచ్చి… రెహమాన్…ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.Emotion… Elevation… Madness… అన్నీ next…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 16, 2026 -
చిరంజీవి-బాబీ, రామ్ చరణ్-సుకుమార్.. హిట్ కాంబినేషన్ రిపీట్
ఓ సినిమా హిట్ అయిందంటే ఆ చిత్రకథానాయకుడు–దర్శకుడు, హీరో–హీరోయిన్... వీరిది ‘హిట్ కాంబినేషన్’ అనే ఇమేజ్ ఏర్పడుతుంది. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హిట్ కాంబినేషన్స్ రిపీట్ ట్రెండ్ బాగా కొనసాగుతోంది. ఓ హీరో–ఓ డైరెక్టర్ కాంబినేషన్లో ఒక హిట్ మూవీ వచ్చిందంటే చాలు.. వారి కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి సగటు సినీ ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇప్పటికే తమకు హిట్ ఇచ్చిన దర్శకులతో పని చేయడానికి హీరోలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. పైగా హిట్ హీరో–డైరెక్టర్ కాంబోని రిపీట్ చేసేందుకు నిర్మాతలు కూడా ఏమాత్రం ఆలోచించడం లేదు. ఎందుకంటే హిట్ కాంబినేషన్లో మరో మూవీ వస్తోందంటే బిజినెస్ పరంగానూ నిర్మాతలకు బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రస్తుతం చిరంజీవి–బాబీ, వెంకటేశ్, కల్యాణ్ రామ్–అనిల్ రావిపూడి, బాలకృష్ణ– గోపీచంద్ మలినేని, రామ్‌చరణ్–సుకుమార్, నాని–శ్రీకాంత్ ఓదెల, విజయ్ దేవరకొండ–రాహుల్ సాంకృత్యాయన్, శ్రీ విష్ణు– రామ్ అబ్బరాజు వంటి హీరోలు–డైరెక్టర్స్ కాంబినేషన్స్ రిపీట్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’కి సీక్వెల్‌గా ‘సలార్ 2’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న ‘కల్కి 2898 ఏడీ 2’, ఎన్టీఆర్–కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర 2’ వంటి సీక్వెల్ సినిమాలు కూడా రానున్నాయి. ఆ విధంగా వీరి కాంబినేషన్ రిపీట్ అవుతున్నట్లే. అయితే సీక్వెల్స్‌తో కాకుండా డైరెక్ట్ మూవీస్‌తో సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి హిట్ మ్యాజిక్‌ని రిపీట్ చేయనున్న హీరోలు–దర్శకుల సినిమాల గురించి తెలుసుకుందాం. రెండోసారి... హీరో చిరంజీవి–డైరెక్టర్ బాబీ కొల్లిలది (కేఎస్ రవీంద్ర) హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ మూవీ మంచి హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడి పాత్రలో హీరో రవితేజ నటించడం విశేషం. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ మూవీ తర్వాత చిరంజీవి– బాబీ కొల్లి కాంబినేషన్లో రెండో సినిమాకి శ్రీకారం చుట్టారు. చిరంజీవి కెరీర్లో 158వ చిత్రమిది. ‘చిరుబాబీ2’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ కె. నారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ మూవీకి సంబంధించి చిరంజీవి లుక్ టెస్ట్‌ని కూడా పూర్తి చేసినట్లు ఏప్రిల్ 28న చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘చిరుబాబీ2’ మరో ప్రతిష్టాత్మక ్ర΄ాజెక్ట్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. ఈ సినిమాలో పవర్ఫుల్, స్ట్రైకింగ్ లుక్‌లో చిరంజీవి కనిపించబోతున్నారు. మాస్ ఎంటర్టైన్మెంట్ను తనదైన స్టైల్లో అద్భుతంగా అందించే బాబీ ఈసారి చిరంజీవి కోసం మరింత ఇంటెన్స్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత ఎలివేట్ చేసేలా స్క్రిప్ట్ సిద్ధం అవుతోంది. ఈ కాంబినేషన్ నుంచి ఓ భారీ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ రాబోతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి సంబంధించిన ముహూర్తం, రెగ్యులర్ షూటింగ్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత చిరంజీవి–బాబీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇటు ట్రేడ్ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. కాగా ఈ చిత్రానికి ‘కాకాజీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ నెల చివరి వారంలో ఈ సినిమాని ప్రారంభించి జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించనున్నారని టాక్. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయాలనే లక్ష్యంతో శరవేగంగా తెరకెక్కించనున్నారట బాబీ. క్రేజీ మల్టీస్టారర్ హీరో వెంకటేశ్–డైరెక్టర్ అనిల్ రావిపూడిలది క్రేజీ కాంబినేషన్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఎఫ్ 2’. ఈ మూవీలో వరుణ్ తేజ్ మరో హీరోగా నటించారు. 2019 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ మూవీ థియేటర్లలో వినోదాల జల్లులు కురిపించింది. ‘ఎఫ్ 2’ వంటి హిట్ మూవీ తర్వాత వెంకటేశ్–వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్ 3’ 2022 మే 27న రిలీజై విజయం సాధించింది. వెంకటేశ్ సోలో హీరోగా అనిల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు... వెంకటేశ్ తొలిసారి రూ. 300 కోట్ల క్లబ్లో చేశారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు అనిల్ రావిపూడి. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో వెంకటేశ్ వెంకీ గౌడ అనే కీలకమైన పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... హీరోలు వెంకటేశ్–కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీని ప్రకటించారు అనిల్ రావిపూడి. ‘పటాస్’ (2015) సినిమాతో అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేశారు కల్యాణ్ రామ్. పదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్ రెండోసారి రిపీట్ అవుతుండటం విశేషం. ‘‘ఈ కొత్త చిత్రాన్ని క్లీన్, టిపికల్ ఎంటర్టైనర్గా అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో రూ΄÷ందించనున్నారు అనిల్ రావిపూడి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కంప్లీట్ ఎంటర్టైనర్లా ఉంటుంది. అనిల్ ట్రేడ్ మార్క్ స్టయిల్, హ్యూమర్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్తో రూపొందించనున్న మా సినిమా 2027 సంక్రాంతికి ఫెస్టివ్ ట్రీట్‌గా నిలిచేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ–్ర΄÷డక్షన్ దశలో ఉంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.పవర్ఫుల్ జడల్ హీరో నాని పూర్తి స్థాయి ఫుల్ మాస్ లుక్‌లో కనిపించిన చిత్రం ‘దసరా’. ఈ మూవీతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే నాని వంటి క్లాస్ హీరోని ఊర మాస్ లుక్‌లో చూపించి, హిట్ అందుకున్నారు దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా 2023 మార్చి 30న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ‘దసరా’ వంటి హిట్ కాంబినేషన్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్నారు. ‘దసరా’లో నానీని ఫుల్ మాస్ లుక్‌లో చూపించిన శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’లో అంతకు మించి అన్నట్లుగా రా రస్టిక్ పాత్రలో చూపించనున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే శక్తిమంతమైన ΄ాత్రలో నాని కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్‌లో కనిపించగా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఈ సినిమా తెలుగుతో ΄ాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఆగస్టు 21న విడుదల కానుంది.మరోసారి... హీరో బాలకృష్ణ– డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘వీర సింహారెడ్డి’. 2023 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ‘వీర సింహారెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరి కలయికలో రూ΄÷ందుతోన్న ద్వితీయ చిత్రం ‘ఎన్బీకే 111’ (వర్కింగ్ టైటిల్). వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముంబయ్ నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ కథ ఉంటుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో జరుగుతోంది. ఇప్పటివరకు జరిపిన షెడ్యూల్స్‌తో సుమారు 30 శాతం పూర్తయినట్లు సమాచారం. మిగిలిన భాగాన్ని కూడా వేగంగా పూర్తి చేసి, దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ΄్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఎన్బీకే 111’లో హీరోయిన్గా తొలుత నయనతార పేరు వినిపించింది. ఆ తర్వాత ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ నటించనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఆర్సీ 17 కోసం... రామ్ చరణ్ కెరీర్‌లోని హిట్ మూవీస్‌లో ‘రంగస్థలం’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ‘చిరుత’ (2007) ‘ధృవ’ (2016) వరకూ లవర్ బాయ్‌గా, స్టైలిష్ క్యారెక్టర్స్‌లో కనిపించిన ఆయన్ను ‘రంగస్థలం’ చిత్రంలో పూర్తి స్థాయి మాస్ లుక్‌లో చూపించారు సుకుమార్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ప్రత్యేకించి ఈ సినిమా కోసం ఫుల్ మాస్ లుక్‌లో రామ్‌చరణ్ మేకోవర్ అయిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్– సుకుమార్ కాంబినేషన్లో రెండో సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో నెలకొంది. ‘రంగస్థలం’ తర్వాత అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప: ది రైజ్’ (2021), ‘పుష్ప 2: ది రూల్’ (2024) వంటి సినిమాలు తెరకెక్కించి, పాన్ ఇండియా హిట్స్ అందుకున్నారు సుకుమార్. ఈ చిత్రాల తర్వాత రామ్ చరణ్ హీరోగా ‘ఆర్సీ 17’ (వర్కింగ్ టైటిల్) చేయనున్నారు సుకుమార్. ‘పుష్ప’ చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వం వహించనున్న సినిమా కావడంతో ప్రకటనతోనే ‘ఆర్సీ 17’పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ‘పెద్ది’ రిలీజ్ తర్వాత ‘ఆర్సీ 17’ షూటింగ్లో పాల్గొంటారట రామ్ చరణ్. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందని సమాచారం. జూన్ 25 నుంచి ఈ మూవీ షూటింగ్ ్ర΄ారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా సుకుమార్ ఒక వినూత్నమైన ΄ాయింట్ను ఎంచుకున్నట్లు తెలిసింది.ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉంటుందని ఇన్సైడ్ టాక్. వాస్తవ ఘటనలతో... హీరో విజయ్ దేవరకొండ–డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘టాక్సీవాలా’. 2017 నవంబరు 17న విడుదలైన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. ‘టాక్సీవాలా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ–రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూ΄÷ందుతోన్న రెండో చిత్రం ‘రణబాలి’. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న భారీ ΄ాన్ ఇండియా మూవీ ఇది. 1854–1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూ΄÷ందుతోంది. మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి మేకర్స్ స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్ చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలోని హార్స్ రైడింగ్ సన్నివేశాల కోసం స్టాలియన్ బ్రీడ్ గుర్రాలపై స్వారీ చేయడానికి విజయ్ ఎలాంటి కఠినమైన శిక్షణ తీసుకున్నారు? ఈ క్రమంలో గాయాల్ని తట్టుకుని ఎలా విజయవంతంగా స్వారీ చేశారు? అన్నది ఈ గ్లింప్స్‌లో చూపించారు. ‘‘రణబాలి’లో ఈ సన్నివేశాలు స్క్రీన్ మీద చూసేందుకు చాలా బాగుంటాయి. అందుకే ఇలాంటి కష్టతరమైన సీన్స్ చేస్తున్నాను’ అని విజయ్ దేవరకొండ చెప్పారు. ‘‘19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ ΄ాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా ‘రణబాలి’ రూపొందుతోంది. రణబాలి పాత్రలో విజయ్ హార్స్ రైడింగ్ సీన్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులు హైలైట్‌గా నిలుస్తాయి. సెప్టెంబరు 11న ఈ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
విజయ్-త్రిషలపై చీప్ ప్రశ్న.. మండిపడ్డ రాజాసాబ్ బ్యూటీ
నువ్వు తలుచుకుంటే అవుద్ది సామీ... ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు, విజయ్ జీవితంలో జరిగిన అద్భుతం. రాజకీయాల కోసం సినిమాలు వదిలేసిన ఆయన.. సీఎం అవాలన్న కసితో పని చేశాడు. మొదటి ప్రయత్నంలోనే తిరుగులేనివాడిలా గెలుపు పతాకం ఎగరవేశాడు. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆయన ప్రయాణాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అనుచిత ప్రశ్నఇదే సమయంలో సీఎం విజయ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కొందరు హీరోయిన్ త్రిష పేరును కూడా లాగుతున్నారు. తాజాగా ఓ ఈవెంట్‌కు వెళ్లిన హీరోయిన్ మాళవిక మోహనన్‌ను సైతం అటువంటి ఇబ్బందికర ప్రశ్నలడిగారు. ఈమధ్య త్రిష ఎక్కడికి వెళ్తే విజయ్ అక్కడికి వెళ్తున్నారు. ఆయనతో కలిసి ప్రయాణించడం ఎలాగో మీకేమైనా ఐడియా ఉందా? అని అడిగారు. ఈ ప్రశ్న విని చిర్రెత్తిపోయిన మాళవిక.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? అంటూ మండిపడింది. సంచలనం కోసం..ఈ విషయంలో పలువురు నెటిజన్లు మాళవికకు మద్దతుగా నిలబడ్డారు. తాజాగా ఈ వివాదంపై మాళవిక సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'నేను ఒక ఈవెంట్‌కు వెళ్లాను. నాకు తమిళనాడు మీడియా, జర్నలిస్టులపై అపారమైన గౌరవం ఉంది. కానీ, వారిలో కొందరు సంచలనం కోసం పదేపదే ఇబ్బందికర, అసహ్యమైన ప్రశ్నలడిగారు. విజయ్ నాకు ఏడేళ్లుగా పరిచయం. అద్భుతంఆయనపై నాకెంతో గౌరవం ఉంది. తనను నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నటుడి నుంచి నాయకుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఒక అద్భుతమనే చెప్పాలి. ఇక చెప్పొచ్చేదేంటంటే.. భవిష్యత్తులో జరిగే మీడియా సమావేశాల్లో అయినా అందరి గౌరవమర్యాదలు కాపాడుతూ, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేసింది.సినిమామాళవిక మోహనన్ 2013లో తన సినీకెరీర్ ప్రారంభించింది. సొంత భాష అయిన మలయాళంలో పట్టం పోలే చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. విజయ్‌తో కలిసి మాస్టర్ సినిమాలో నటించింది. ది రాజాసాబ్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో సర్దార్ 2, పాకెట్ నోవెల్ అని రెండు సినిమాలు చేస్తోంది. I went for an event yesterday, and while I have the utmost regard for all the journalists and members of the Tamil Nadu media, a couple of them persistently asked some very distasteful questions that were completely unnecessary and sensational.Thalapathy Vijay is someone I’ve…— Malavika Mohanan (@MalavikaM_) May 16, 2026 చదవండి: టాలీవుడ్లో స్పెషల్ ఎంట్రీ -
కాన్స్ లో మెరిసిన భారత సినీ తారలు
ఫ్రాన్స్‌లో జరుగుతున్న 79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినీ తారలు మెరిశారు. గత ఏడాది ‘లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్ తొలిసారిగా ఈ చిత్రోత్సవాల్లో మెరిశారు. ఈ ఫెస్టివల్ కోసమే అదితీ రావు హైదరి, డయానా పెంటీ ఫ్రాన్స్‌లో ఉన్నారు. నటి తారా సుతారియా కూడా తొలిసారిగా ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘ఉమెన్ ఇన్ సినిమా గాలా’ వేదికపై తారా సుతారియాకు ప్రత్యేక సత్కారం జరిగింది. సంగీతం, థియేటర్ ఆర్ట్స్, నటిగా బహుముఖ ప్రతిభ చూపిస్తున్నందుకు ఆమెకు ఈ గౌరవం లభించింది. ‘ఉమెన్ ఇన్ సినిమా గాలా’ కార్యక్రమంలో హ్యూమా ఖురేషి సందడి చేశారు. ఇంకా అభినవ్ గోమటం, స్వాతీ శర్మ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తెలుగు చిత్రం ‘ది గేమ్ ఆఫ్ సాంగ్’ టీజర్, పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వేణు నక్షత్రం దర్శకత్వంలో అవంతిక నక్షత్రం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే జాన్ అబ్రహాం దర్శకత్వంలోని మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా ‘అమ్మ అరియాన్’ రీస్టోర్డ్ 4కే వెర్షన్‌ను ‘కాన్స్ క్లాసిక్’ విభాగంలో ప్రదర్శించారు. ఈ ఏడాది ఈ విభాగంలో ఎంపికైన ఏకైక భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. మరోవైపు అమి విర్క్, రూపీ గిల్ లీడ్ రోల్స్‌లో నటించిన పంజాబీ సినిమా ‘చర్దోకలా’ ప్రదర్శితమైంది. ఈ సినిమా ప్రదర్శనలో భాగంగా రూపీ గిల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై మెరిశారు. ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమవుతున్న తొలి పంజాబీ సినిమా ‘చర్దోకలా’ కావడం విశేషం. గుజరాతీ నటి–నిర్మాత మానసీ పారేఖ్, సింగర్–నిర్మాత పార్దివ్ గోహిల్, చందు పటేల్ గుజరాతీ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం హాజరై, సందడి చేస్తున్నారు. ఈ నెల 23 వరకూ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. -
భక్తి పాట రాసిన హీరో శివకార్తికేయన్
తమిళ స్టార్ శివకార్తికేయన్‌కు ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అవుతోందని చెప్పవచ్చు. ఈయన కథానాయకుడిగా నటిస్తూనే నిర్మాతగా ఎస్కే ప్రొడక్షన్స్ పతాకంపై పలు వైవిధ్యమైన కథా చిత్రాలను నిర్మిస్తూ, ఇతరులు నిర్మించిన మంచి కంటెంట్‌తో కూడిన చిత్రాలను విడుదల చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. అలా ఈయన ఇటీవల నిర్మించిన తాయ్‌కిళవి చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. హీరోగా, నిర్మాతగా విజయాలను అందుకుంటున్న ఈయనలో మంచి గాయకుడు, గీత రచయిత కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడీయన ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ రంగంలోకి అడుగు పెట్టారు. వేలుమ్ మయిలుమ్ అంటూ సాగే భక్తిరస పాటకు లిరిక్స్ అందించారు. ఈ ప్రైవేట్ మ్యూజికల్‌కు నివాస్ కే. ప్రసన్న సంగీతాన్ని అందించి, పాడారు. దీన్ని తాయ్ కిళవి ఫేమ్ శివకుమార్ మురుగేశన్ డైరెక్ట్ చేశాడు. ఇలాంటి ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్‌లు ఈ సంస్థ నుంచి మరిన్ని వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇకపోతే శివకార్తికేయన్.. మురుగేశన్ దర్శకత్వంలో 'సెయోన్' చిత్రంలో నటిస్తున్నారు. -
స్పెషల్ ఎంట్రీ
టాలీవుడ్‌కి స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ. హవీష్ హీరోగా నటించిన ‘నేను రెడీ’ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్ చేశారు. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ఇదే. కావ్య థాపర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, ‘వెన్నెల’ కిశోర్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మించారు. ‘‘నేను రెడీ’ సినిమా రీ–రికార్డింగ్ పనులతో సహా ఇటీవలే షూటింగ్ పూర్తయింది. జూన్ రెండో వారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాం. హవీష్‌కు క్లీన్ కమర్షియల్ విజయాన్ని అందిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్. -
కొత్త అనుభూతినిచ్చేలా...
నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వృష కర్మ’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, బి. సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల రాజస్తాన్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను పూర్తి చేశారు.దీంతో ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు తెలిపి, రాజస్తాన్ లొకేషన్లోని కొన్ని ఫొటోలను విడుదల చేశారు. రాజభవనాలు, పురాతన శిల్ప కళతో కనిపిస్తున్న ఈ లొకేషన్స్‌లో చిత్రీకరించిన కీలక సన్నివేశాలు సినిమాకి ఓ హైలైట్ అని తెలుస్తోంది. ‘‘షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుపుతున్నాం. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి కృషి చేస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
చిరు లీక్స్.. 'పెద్ది' ట్రయిలర్‌కి ముందే పెంచేసిన హైప్
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి చేసే లీక్స్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తన సినిమాలే కాదు, ఇతర సినిమాల సంగతుల్ని కూడా అప్పుడప్పుడూ బయటపెడుతుంటారు. ఈసారి రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా ట్రయిలర్ విషయాలు ముందుగానే చెప్పేశారు. తాజాగా పెద్ది ట్రయిలర్‌ను చిరంజీవితో పాటు కొంతమంది మీడియా వ్యక్తులకు చూపించారు. ఆ విషయం అందరూ గోప్యంగానే ఉంచారు. అయితే మెగాస్టార్ మాత్రం ట్రయిలర్‌లోని ఓ కీలక డైలాగ్‌ను లీక్ చేశారు. “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్” అనే డైలాగ్ ట్రయిలర్లో ఉంటుందని వెల్లడించారు. “సారీ బుచ్చి.. ట్రయిలర్ చూశాక కంట్రోల్ తప్పింది” అంటూ హాస్యంగా కొనసాగించారు. అంతేకాదు పెద్ది సినిమా ట్రయిలర్ 3 నిమిషాల నిడివి కలిగి ఉందని కూడా చిరంజీవి బయటపెట్టారు. చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ముగ్గురూ తమ బెస్ట్ ఇచ్చారని ఆయన ప్రశంసించారు. ఆడియన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగానే ట్రయిలర్ ఉంటుంది. అంతా కలిసి రఫ్ఫాడించారని మెగాస్టార్ ట్రయిలర్‌పై ఉన్న హైప్‌ను అమాంతం పెంచేశారు. ఈ నెల 18న రిలీజ్ కానున్న పెద్ది ట్రయిలర్‌పై చిరంజీవి చేసిన ఈ లీక్స్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఆయన రివ్యూ వల్ల ట్రయిలర్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. -
సన్నగా మారేందుకు సర్జరీ? క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేశ్
బొద్దుగా కనిపించే హీరోయిన్లు, హఠాత్తుగా బక్కచిక్కిపోయి కనిపిస్తే ఎవరికైనా లేనిపోని సందేహాలు వస్తాయి. హీరోయిన్ కీర్తి సురేశ్ గురించి గతంలో ఇలానే అనుకున్నారు. 2018లో 'మహానటి'లో నిండుగా బొద్దుగా కనిపించిన ఈమె.. తర్వాత కాలంలో ముఖంలో జీవకళ కోల్పోయినట్లు సన్నగా మారిపోయి షాకిచ్చింది. దీంతో అసలు ఈమెకు ఏమైందా అనుకున్నారు. కొందరైతే సర్జరీ చేసుకుందేమోనని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ సందేహాలపై స్వయంగా కీర్తినే క్లారిటీ ఇచ్చేసింది. సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: మహేశ్ సినిమా.. ఆర్మీని కామెడీ చేశారు: మేజర్)'2013లో నటిగా కెరీర్ ప్రారంభించినప్పుడు ఫిట్‌నెస్‌పై నాకేం అవగాహన లేదు. జిమ్ నా వల్ల కాదు అనుకునేదాన్ని. 2018లో 'మహానటి' చేసిన తర్వాత కాస్త గ్యాప్ దొరకడంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలనుకున్నా. హెచ్ఐఐటీ, కార్డియో వర్కౌట్స్‌తో పాటు ఎక్కువ ప్రొటీన్, తక్కువ కార్బో డైట్ పాటించి 9 నెలల్లో 10 కిలోల బరువు తగ్గాను. కానీ నేను ఇంత కష్టపడితే కొందరు మాత్రం బలహీనంగా కనిపిస్తున్నావు, సర్జరీలు చేయించుకున్నావా అని అన్నారు. అది నాకు ఆవేదన కలిగించింది''2020లో యోగా చేయడం మొదలుపెట్టిన తర్వాత నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, శరీరంపై ప్రేమ పెరిగింది. సరైన విధంగా జిమ్ చేస్తే ఎంత ఉపయోగమో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎంత ముఖ్యమో అర్థమైంది. ప్రస్తుతం స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తోపాటు యోగా, అనిమల్ ఫ్లో, కార్డియో, కాలిస్థెనిక్స్‌ను బ్యాలెన్స్‌గా చేస్తున్నాను. ఇప్పుడే నా జీవితంలో బెస్ట్ ఫేజ్‌లో ఉన్నా''అయితే నా చిన్నప్పుడు కాస్త లావుగా ఉన్నానని సన్నబడమని చెప్పినవాళ్లే.. ఇప్పుడు సన్నబడిన తర్వాత గతంలోనే బాగున్నావని అంటున్నారు. అసలు ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. ఈ మధ్య శారీరకంగా, మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నవడం వల్లే బయట కనిపించలేదు. జీవితంలో ఎప్పుడైనా బ్రేక్ తీసుకోవాల్సి రావచ్చు. కానీ జిమ్ని మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టను' అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది.కేరళకు చెందిన కీర్తి సురేశ్.. 'నేను శైలజ'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 'మహానటి'తో అదరగొట్టి ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ కూడా దక్కించుకుంది. రీసెంట్ టైంలో టాలీవుడ్లో పెద్దగా నటించలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన'లో చేస్తోంది.(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ తెలుగు రివ్యూ) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ తెలుగు రివ్యూ
'ప్రేమలు' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగులోనూ కాస్తంత గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు నస్లేన్.. ఇదే మూవీ దర్శకుడితో కలిసి చేసిన చిత్రం 'ఐ యామ్ కాదలన్'. 2024లోనే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? చూడొచ్చా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి?విష్ణు(నస్లేన్) తన క్లాస్మేట్ శిల్ప(అనీష్మా)ని కాలేజీలో ఉన్నప్పుడే ప్రేమిస్తాడు. కానీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విష్ణుకి జాబ్ రాకపోవడంతో శిల్ప నిరుత్సాహపడుతుంది. ఈమె.. తన తండ్రి ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరిపోతుంది. ఓసారి తన ప్రేమ గురించి చెప్పేందుకు శిల్ప తండ్రి దగ్గరకెళ్లిన విష్ణుకు చేదు అనుభవం ఎదురవుతుంది. ఇంతకీ అదేంటి? దీని తర్వాత శిల్ప తండ్రి కంపెనీని విష్ణు ఎలా హ్యాక్ చేశాడు? శిల్ప తండ్రిని ముప్పతిప్పలు పెట్టిన విష్ణు చివరకు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?తెలుగులో ఎప్పుడూ దాదాపుగా ఒకే కమర్షియల్ ఫార్ములా చుట్టూ స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు తిరుగుతుంటారు. మలయాళంలో మాత్రం తక్కువ బడ్జెట్లోనే కాస్త భిన్నంగా మంచి సినిమాలు వస్తుంటాయి. అలా వచ్చిన మూవీనే ఇది. ప్రేమించిన అమ్మాయిపై ప్రతీకారం తీర్చుకోవడం పాత కాన్సెప్టే. కానీ దానికి హ్యాకింగ్ అనే అంశం జోడించడం కాస్త చిత్రంగా అనిపించింది. ఒక్క ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే సూపర్ కాకపోయినా పర్లేదు బాగానే ఉంది.అసలు పాయింట్ చెప్పడానికి కాస్త టైమ్ తీసుకున్న దర్శకుడు.. విషయం తెలిసిన తర్వాత ఎంటర్టైనింగ్గానే సినిమాని నడిపాడు. పెద్దగా టెక్నికల్ సెటప్ లేకపోయినప్పటికీ హీరో తన దగ్గరున్న డబ్బా కంప్యూటర్‌తోనే హ్యాకింగ్ చేయడం సహజంగానే ఉంది. హ్యాకింగ్ అనగానే ఏదేదో అనుకుంటాం కానీ సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా సింపుల్‌గానే చూపించారు. ఆ సీన్లు బాగానే కుదిరాయి. కాకపోతే కామెడీ లాంటి పెద్దగా ఉండవు.క్లైమాక్స్‌లో హీరో దొరికిపోతాడు అనుకున్న దగ్గర ఇచ్చిన ట్విస్ట్ అయితే నవ్వులు పూయిస్తుంది. ఇక హ్యాకర్ అయిన హీరోని పట్టుకునేందుకు హీరోయిన్ తండ్రి నియమించుకున్న లేడీ హ్యాకర్ చాలా ట్రై చేస్తుంది. మరి హీరో దొరికాడా లేదా? హ్యాకర్లు ఇద్దరూ ఏ సందర్భంలో ఎక్కడ కలుసుకున్నారనేది కూడా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. మలయాళంలో చాలా చిత్రాల్లో ఉన్నట్లే కాస్తంత సాగదీత కూడా ఉంటుంది. దాన్ని తట్టుకుని చూస్తే ఇదో టైమ్ పాస్ సినిమా.హీరోహీరోయిన్లు నస్లేన్, అనీష్మా బాగా చేశారు. మిగతా పాత్రధారులు కూడా సహజంగా నటించారు. టెక్నికల్ విభాగాలు కూడా తమ పని తాము చేశారు. ఓటీటీలో ఏదైనా కొత్త మూవీ.. అలా అలా సాగిపోయేలా ఉండేది చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. మలయాళ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. అభ్యంతరకర సీన్స్ ఏం లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.-చందు డొంకాన(ఇదీ చదవండి: మహేశ్ సినిమా.. ఆర్మీని కామెడీ చేశారు: మేజర్) -
మహేశ్ సినిమా.. నేను అది తీసుకోలేకపోయాను
భారత ఆర్మీకి చెందిన గూఢచారులు అనగానే స్టైల్‌గా సూటు బూటు వేసుకుని ప్రైవేట్ జెట్స్‌లో తిరుగుతూ విలన్లని చితగ్గొట్టేస్తుంటారు లాంటి వాటినే ఇన్నాళ్లుగా సినిమాల్లో చూపిస్తూ వచ్చారు. అయితే ఓ గూఢచారి.. ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటాడనేది 'ధురంధర్'లో కొంతమేర రియాలిటీకి దగ్గరగా చూపించారు. అయితే మన మూవీస్‌లో ఆర్మీని చూపించే తీరుపై మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. తెలుగులోనూ)'ఆర్మీ సినిమాలు నాకు పెద్దగా నచ్చవు. 'ధురంధర్' పక్కనబెట్టేస్తే నిజానికి దూరంగా ఉంటాయి. అందుకే నేను వాటిని చూసేందుకు వెళ్లను కూడా. మహేశ్ బాబు మూవీ(సరిలేరు నీకెవ్వరు) ఏదో ఉంది. బాంబు ఉంటే పక్కనే కూర్చుని కాఫీ తాగుతుంటాడు. అదంతా చూసి నాకు కామెడీగా అనిపిస్తుంది. ఇదే సినిమాకు నా ఫ్రెండ్‌తో కలిసి వెళ్లాను. నేను నవ్వుతుంటే.. అరేయ్ నవ్వకురా జనాలు కొడతార్రా అని అన్నాడు. మరి ఆ సీన్ అలా ఉంది ఏం చేయమంటావ్ అని అడిగా. నువ్వు ఆర్మీ వాడివి అని తర్వాత అడుగుతార్రా, ఫస్ట్ కొడతారు అని ఫ్రెండ్ నాతో అన్నాడు. దీంతో నేను థియేటర్ నుంచి బయటకొచ్చేశా. ఆర్మీని వాళ్లు అపహస్యం చేసినట్లు అనిపించింది. నేను అది తీసుకోలేకపోయాను' అని మేజర్ ఒబెరాయ్ చెప్పుకొచ్చారు.సినిమాలంటేనే రియాలిటీకి ఆమడ దూరంలో ఉంటాయి. వాటిలో లాజిక్స్ వెతకలేం. 'సరిలేరు నీకెవ్వరు'లోనూ అదే తరహాలో ఉంటాయి. విలన్ ప్రకాశ్ రాజ్‌ని చివరలో ఆర్మీ చేర్పించే సీన్స్‌పై రిలీజ్ టైంలోనే విమర్శలు వినిపించాయి. మళ్లీ ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఆర్మీ మేజర్.. ఈ ప్రస్తావన తీసుకురావడంతో మహేశ్ మూవీ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే) -
దీనస్థితిలో పావలా శ్యామల.. అండగా నిలిచిన దిల్ రాజు!
అనారోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ నటి పావలా శ్యామలకు నిర్మాత దిల్ రాజు అండగా నిలిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూసేందుకు దిల్ రాజు తన ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించాడు. తన మేనేజర్ల ద్వారా అక్కడి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.కాగా, గుండె సంబంధిత వ్యాధితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్యామల, నిన్న రాత్రి చికిత్స నిమిత్తం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, డబ్బులు లేవని ఆమెను బయటకు పంపించేశారు. క్యాబ్ డ్రైవర్ ఆమెను అర్థరాత్రి నడిరోడ్డుపై వదిలేసి వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆమెను పట్టించుకునేవారే లేరని, తీవ్ర గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తక్షణమే స్పందించాడు.తన మేనేజర్ల ద్వారా శ్యామల ప్రస్తుతం కూకట్‌పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారని ట్రేస్ చేయించి తెలుసుకున్నారు. అనంతరం దిల్ రాజు స్వయంగా ఆసుపత్రి వైద్యులను ఫోన్లో సంప్రదించి శ్యామల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. డాక్టర్లతో మాట్లాడిన దిల్ రాజు, ‘శ్యామల గారికి పూర్తిస్థాయి చికిత్స అందించండి. అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి. మా మేనేజర్లు మీతో టచ్‌లో ఉంటారు. నేను కూడా ఎప్పుడైనా ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటాను’ అని భరోసా ఇచ్చారు.కన్నీళ్లు పెట్టుకున్న శ్యామలదిల్ రాజు టీమ్ పావలా శ్యామలను కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ దిల్ రాజుకు ధన్యవాదాలు తెలిపింది. గతంలో కూడా చాలా సార్లు దిల్ రాజు సహాయం చేశాడని..మరోసారి తనకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు అని శ్యామల పేర్కొంది. పావలా శ్యామలకు అండగా దిల్ రాజుProducer #DilRaju stepped in to ensure she received proper care. He immediately sent his team to the hospital to assess her condition and coordinate with doctors.#PavalaShyamala pic.twitter.com/lOJOcejaWL— Milagro Movies (@MilagroMovies) May 16, 2026 -
సమంతని ఇలా చూసుండరేమో.. హన్సిక జీరో సైజ్!
షాకింగ్ లుక్‌లో కనిపించిన సమంతనడుము అందాలతో హన్సిక పోజులుబీచ్లో నోరా ఫతేహి గ్లామరస్ డ్యాన్స్పూల పక్కన మెరిసిపోతున్న నయనతారకళ్లద్దాలతో రెచ్చగొట్టేస్తున్న కేతిక శర్మకొత్త హెయిర్ స్టైల్‌తో ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Savleen kaur manchanda (@savleenmanchanda) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) -
అది నా అదృష్టం.. గర్వంగా ఉంది : రాగ్ మయూర్
‘నటుడిగా నేను కెరీర్ ప్రారంభించిన తొలి సినిమాకే మరిడేశ్ బాబు లాంటి అద్భుతమైన పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకంటే మంచి డెబ్యూని నేను కోరుకోలేను. సినిమా బండి సినిమా నటుడిగా నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది’ అని రాగ్ మయూర్ అన్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాగ్ మయూర్.. ఇండస్ట్రీకి వచ్చి ఈ శుక్రవారం(మే 15)తో ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు, నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. 👉 సినిమా బండి రిలీజ్ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. వీరాంజనేయులు విహారయాత్ర, కీడా కోలా, గాంధీతాతా చెట్టు వంటి చిత్రాలు యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గర చేశాయి. ప్రముఖ హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’కు రీమేక్‌గా వచ్చిన ‘సివరాపల్లి’ నటుడిగా మరింత గుర్తింపు తెచ్చింది.👉 ‘సివరాపల్లి’ సూపర్‌హిట్ తర్వాత నాకు మరింత ఆత్మ విశ్వాసం వచ్చింది. చాలా మంది దర్శకులు నన్ను దృష్టిలో పెట్టుకుని పాత్రలను రాశామని చెప్పారు. దర్శకులు నాకోసం ప్రత్యేకంగా పాత్రలు రాయటం అనేది నటుడిగా నాకు గొప్ప గుర్తింపు. నేను థియేటర్ ఆర్టిస్ట్ కావటంతో నటనలో విభిన్న కోణాలను అన్వేషించే అవకాశం దక్కింది. అది నా నటనను మరింత మెరుగు పరిచింది.👉 ‘శుభం’లో క్యామియో రోల్ చేశా. అది చిన్న క్యామియో పాత్రే అయినా, ఓ బ్లాక్‌బస్టర్ సినిమాలో భాగమవడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఆ అవకాశం ఇచ్చిన సమంత గారికి కృతజ్ఞతలు. 👉 ప్రస్తుతం డైరెక్టర్ గౌరి నాయుడు జమ్ము తెరకెక్కిస్తోన్న ‘గరివిడి లక్ష్మి’లో బుర్రకథ కళాకారుడి పాత్ర చేశా. ఇది చాలా ఎక్సైటింగ్‌తో పాటు ఛాలెంజింగ్ పాత్ర కూడా. ఈ పాత్ర కోసం ఎంతో ప్రిపేర్ అయ్యి నటించాను.👉 నా ఫిల్మోగ్రఫీపై గర్వంగా ఉంది. కెరీర్ ప్రారంభ దశలోనే అగ్రశ్రేణి దర్శకులు, టెక్నీషియన్స్‌తో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఎమోషన్స్, రియలిస్టిక్ కథనాలకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించాలని ఎప్పటినుంచో కోరుకున్నాను’ అని అన్నారు. -
త్రిషకు నేనంటే ప్రాణం.. నా వల్ల కాదు అని ఏడ్చేసింది
అప్పడెప్పుడో 1999లో సినిమాల్లోకి వచ్చిన త్రిష.. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్గా తెలుగు, తమిళ భాషల్ని కవర్ చేస్తోంది. అయితే తమిళనాడు సీఎంగా విజయ్ గెలవడం మాటేమో గానీ సోషల్ మీడియాలో ఈమెనే ట్రెండ్ అయిపోతుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకనిర్మాత ఎమ్మెస్ రాజు.. త్రిషతో తన బాండింగ్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)'మహేశ్ బాబు 'అర్జున్' కోసం త్రిషని ఆడిషన్ చేశారు కానీ ఎందుకో ఈ అమ్మాయి సెట్ అవ్వదని దర్శకుడికి అనిపించింది. మహేశ్ దగ్గర ఆ ఫొటోలని చూసి ఆమెని కలవాలనుకున్నాను. ఆ టైంకి ఛాన్సులు రాకపోవడంతో కొంచెం నిరాశలో ఉంది. నా నుంచి ఫోన్ రాగానే తెగ ఆనందపడింది. తర్వాత నేను ఆమె ఇంటికి వెళ్లి చూసి ఓకే అనుకున్నాక 'వర్షం'లో హీరోయిన్గా సెలెక్ట్ చేశా. షూటింగ్లో 75 రోజుల పాటు వర్షంలో తడుస్తూనే షూటింగ్ చేసింది. ట్రైన్ నుంచి దూకే సీన్స్ చేయలేక నా వల్ల కాదు అని ఏడ్చేసింది. నేను ధైర్యం చెప్పి ప్రోత్సాహించడంతో నేను కచ్చితంగా చేస్తానని అంది. ఈ మూవీ రిలీజైన తర్వాత త్రిష మా ఇంటిలో మనిషి అయిపోయింది. అందుకే ఆమెని చిన్నపిల్లలా ట్రీట్ చేసేవాడిని''త్రిషకు నేనంటే ప్రాణం. ఎంతలా అంటే ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ వాళ్లు..'రాత్రి 3 గంటలకు మీకు ఏదైనా సమస్య వస్తే మీరు ఎవరికి కాల్ చేస్తారు' అని ఆమెని అడిగితే మరో ఆలోచన లేకుండా నా పేరు చెప్పింది. నాపై ఆమెకు అంత నమ్మకం ఉండేది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాకు హీరోయిన్ని ఇంకా ఎవరిని అనుకోలేదు. కానీ ఫోన్ చేసి మా ఇంటికి వచ్చేసింది. భోజనం చేసి తన డేట్స్ బుక్ ఇచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తానని చెప్పింది. ఇక 'ఆట'లో ఇలియానాని హీరోయిన్గా పెట్టినందుకు నాపై అలిగింది. నేను షూటింగ్‌కి వచ్చేస్తానని వరసపెట్టి ఫోన్లు చేస్తూనే ఉంది. షూటింగ్ మొదలైపోయింది. ఆపడం కుదరదు అనే చెప్పడంతో శాంతించింది' అని ఎమ్మెస్ రాజు.. త్రిషతో తన బాండింగ్ గురించి చెప్పుకొచ్చారు.వీళ్లిద్దరి కాంబినేషన్లో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి సినిమాలు వచ్చాయి. వీటిలో తొలి రెండు సూపర్ హిట్ కాగా మూడోది మాత్రం బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడలేదు. అప్పట్లో స్టోరీ అందించి నిర్మాతగా వ్యవహరించిన ఎమ్మెస్ రాజు.. ఇప్పుడు దర్శకుడిగా మూవీస్ చేస్తున్నారు. ఈయన తీసిన 'అగధ' విడుదలకు సిద్ధమైంది. దీని ప్రమోషన్లలోనే త్రిషతో తన బంధం గురించి చెప్పారు.(ఇదీ చదవండి: శత్రుదేశంలో ఓటీటీ నం.1 ట్రెండింగ్‌లో 'ధురంధర్ 2') -
శత్రుదేశంలో ఓటీటీ నం.1 ట్రెండింగ్‌లో 'ధురంధర్ 2'
విదేశాల్లో 'ధురంధర్ 2' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మన దేశంలో మాత్రం జూన్ 4వ తేదీ సాయంత్రం నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుందని అధికారికంగానే ప్రకటించారు. అయితే ఈ మూవీ అంతా పాక్‌లోని లయరీ ప్రాంతంలో జరిగే గ్యాంగ్ వార్స్, రాజకీయాలు, ఉగ్రవాద చర్యలు తదితర అంశాల ఆధారంగా తీశారు. దీంతో పాక్‌తో పాటు అరబ్ దేశాల్లో దీనిపై నిషేధం విధించారు. దీంతో అక్కడి ప్రేక్షకులు ఎవరూ ఈ చిత్రాన్ని చూడలేకపోయారు.(ఇదీ చదవండి: నాపై చేతబడి.. రక్తం వాంతులు, నరకం చూశా : జయం రవి)అయితే 'ధురంధర్ 2' థియేటర్లలో రిలీజైన తర్వాత పైరసీని పాక్‌లో విపరీతంగా చూశారు. అక్కడి కరెన్సీలో రూ.50కే ప్రింట్ అమ్మారు. ఇప్పుడు అధికారికంగా దాయాది దేశంలో ఓటీటీలోకి వచ్చేసింది. వచ్చిన మరుక్షణం నుంచే ఓటీటీ సర్వర్ క్రాష్ అయిందని, అలానే గడిచిన 24 గంటల నుంచి తమ దేశంలో నం.1 ట్రెండింగ్‌లో ఉందని పాక్ ఇన్ఫ్లూయెన్సర్ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.'ధురంధర్ 2 పాకిస్తాన్లో ఇప్పుడే రిలీజైంది. సర్వర్స్ క్రాష్ అయ్యాయి. పాకిస్థానీలు అర్థరాత్రి ఎప్పుడవుతుందా? నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడొస్తుందా అని చూశారు. రాగానే క్లిక్ చేశారు. అందుకే మూవీ ప్లే కావడానికి టైమ్ పడుతోంది. అంతలా క్రేజ్ సంపాదించుకుంది. అయితే సినిమాలో చూపించింది నిజమా అబద్దమా అనేది వేరే విషయం. కానీ పాకిస్థానీలు మాత్రం మూవీ ఎలా తీసుంటారా అని చూసేందుకు ఎగబడుతున్నారు. రణ్వీర్ సింగ్ పాత్ర ఏంటనేది అందరికీ తెలుసు. లయరీలో అలా జరిగింది లేదా అనేది తర్వాత మాట్లాడుదాం' అని సదరు ఇన్ఫ్లూయెన్సర్ చెప్పుకొచ్చాడు.'ధురంధర్' రెండు భాగాలుగా రిలీజైంది. తొలి పార్ట్ గతేడాది డిసెంబరులో, సీక్వెల్ ఈ ఏడాది మార్చిలో థియేటర్లలోక వచ్చింది. మొత్తంగా రూ.3000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. జస్కీరాత్ సింగ్ అనే వ్యక్తి.. హంజా అలీ మజారీ అనే మారుపేరుతో పాకిస్తాన్లోకి గూఢచారిగా వెళ్లి.. అక్కడ మాఫియాని, భారత్‌కి చేటు చేసిన పలువురు ఉగ్రవాదుల్ని ఎలా అంతం చేశాడనే స్టోరీతో ఈ సినిమా తీశారు. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్, సారా అర్జున్ కీలక పాత్రలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకుడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా) View this post on Instagram A post shared by maviya umer farooqui (@kaam_wali_baat) View this post on Instagram A post shared by maviya umer farooqui (@kaam_wali_baat) -
తండ్రయిన అవినాష్.. అప్పుడు రోడ్డుపై పిచ్చోడిలా.. ఇప్పుడేమో!
కమెడియన్ ముక్కు అవినాష్ తండ్రయ్యాడు. ఏడాది కిందటే తండ్రయినప్పటికీ చాలా ఆలస్యంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తనకు బాబు పుట్టిన సంగతిని పన్నెండు నెలలుగా దాచి ఇప్పుడు బయటకు ప్రకటించి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. గతేడాది మే 14న తనకు కొడుకు పుట్టాడని, అతడికి అద్వైత్ అని నామకరణం చేసినట్లు తెలిపాడు. కొడుకు మొదటి పుట్టినరోజును ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయగా.. ఈ వేడుకకు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.2021లో పెళ్లిఅయితే అవినాష్ తన కొడుకును వెంటనే పరిచయం చేయకపోవడానికి ఒక పెద్ద కారణమే ఉంది. ఇతడు 2021 నవంబర్‌లో అనూజను పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామంటూ 2023లో గుడ్‌న్యూస్ చెప్పారు. బేబీ బంప్ ఫోటోలు, మెటర్నటీ షూట్, సీమంతం వీడియోలతో తెగ సందడి చేశారు. కానీ, ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. 2024 ప్రారంభంలో అబార్షన్ అయిందని చేదువార్త చెప్పాడు. విషాదంతెల్లవారితే డెలివరీ అనగా అనూజ కడుపులో బిడ్డ కదలికలు ఆగిపోయాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందన్నారు. ఏదో ఒకటి చేసి బిడ్డను బతికించమని డాక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్నాడు అవినాష్. ఒక్కసారి గుండె కొట్టుకోవడం ఆగిపోయాక తిరిగి బతికించడం ఆ దేవుడి వల్ల కూడా కాదని వైద్యులు చేతులెత్తేశారు. ఊహించని ఈ విషాదానికి పిచ్చోడైపోయాడు. అర్ధరాత్రి ఒంటిగంటకు రోడ్డుపై ఏడ్చుకుంటూ ఉండిపోయాడు. అందుకే ఇంత సీక్రెట్2.75 కిలోల బరువుతో పుట్టిన బిడ్డలో ప్రాణం లేకపోవడం మా ఇద్దర్నీ ఎంతో కుంగదీసిందంటూ ఓ ఇంటర్వ్యూలో అవినాష్ తన బాధను పంచుకున్నాడు. అందుకే అనూజ ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఎవరితోనూ ఆ వార్తను పంచుకోలేదు. కనీసం కొడుకు పుట్టాక కూడా ఎవరికీ చెప్పదల్చుకోలేదు. ఇప్పుడు ఏడాది తర్వాత ఈ శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నాడు. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) చదవండి: చిన్న వయసులోనే పెళ్లి.. గర్భస్రావం.. హీరోను వదిలేస్తున్నా: సింగర్ -
నాపై చేతబడి.. రక్తం వాంతులు, నరకం చూశా : జయం రవి
గత కొంతకాలంగా హీరో జయం రవి వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. భార్య ఆర్తితో విడాకులు ఇచ్చినప్పటి నుంచి ఆయన పర్సనల్ లైఫ్‌పై పుకార్లు ఎక్కువయ్యాయి. సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో ఆయన రిలేషన్లో ఉండడం.. విడాకులకు ఆమెనే కారణం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ట్రోల్ చేశారు. అయితే తాజాగా సింగర్ కెనీషా కూడా షాకిచ్చింది. రవితో తనకున్న రిలేషన్‌కి బ్రేకప్ చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ట్రోలింగ్స్ వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే చెన్నై నగరాన్ని సైతం వదిలి వెళ్లిపోతున్నట్లు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా జయం రవి మీడియా ముందుకు వచ్చాడు. ఈ వివాదాలపై మాట్లాడుతూ ఎమోషన్ అయ్యాడు.నరకం చూశా.. ఇండస్ట్రీలోకి వచ్చి 23 ఏళ్లు అవుతుందని.. ఇన్నేళ్లు ఎలాంటి మచ్చ లేకుండా బతికిన తాను.. పెళ్లి తర్వాత నరకం చూశానని అన్నాడు. ‘పెళ్లైయిన మొదటి రోజు నుంచే బ్లాక్ మెయిల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంట్లో కనీసం గౌరవం కూడా ఇచ్చవాళ్లు కాదు. ఆఖరికి నేను సంపాదించుకున్న డబ్బుని దాచుకోవడానికి కూడా ఒక అకౌంట్ లేకుండా చేశారు. ఎంతో ఇష్టంగా కోట్లాది రూపాయలకు కట్టుకున్న ఇంటిని కూడా వాళ్లే(ఆర్తి) స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నేను అద్దె ఇంట్లోనే ఉంటున్నా. కనీసం నా పిల్లలను కూడా చూడనివ్వడం లేదు. ఫోన్లు లాక్కున్నారు. స్కూల్‌కి బాడీగార్డ్స్‌ని పెట్టి పంపిస్తున్నారు. ఒక గ్రూప్ క్రియేట్ చేసి, వాళ్లకు డబ్బులు ఇచ్చి నన్ను నాపై ట్రోలింగ్ చేస్తున్నారు. నా బిడ్డల భవిష్యత్తు కోసమే అన్నీ భరించా.(చదవండి: రవిని వదిలేస్తున్నా.. ట్రోలింగ్ తట్టుకోలేక సింగర్ బ్రేకప్!)చేతబడి చేశారు.. ఇంట్లో ఉన్నప్పుడు నేను వారి చెప్పుచేతుల్లో ఉండడానికి నాపై చేతబడి చేశారు. నన్ను పూర్తిగా అనచివేయడానికి ఇలా చేశారు. ఆ చేతబడి ప్రభావం వల్ల ఇప్పుడు నాకు రక్తంతో వాంతులు అవుతున్నాయి. శారీరకంగా, మానసికంగా హింసించి నన్ను చంపేయాలని కుట్ర చేస్తున్నారు. అయితే అందరి సంగతి తేల్చేవరకు నేను పోరాడుతూనే ఉంటా. అప్పటి వరకు నటించను45 ఏళ్ల వయసులో అమ్మాయిల వెంట పడాల్సిన అవసరం నాకు లేదు. సినిమాలలో మహిళల హక్కుల గురించి మాట్లాడే తాను, ఆడవారి గురించి ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని లక్షలు పెట్టి చదివించాను. అయినా కూడా వాళ్లపై నాకు ప్రేమ లేదని రాయించారు. అవి ఎంత భాదిస్తాయో తెలుసా? ఇన్నాళ్లు నన్ను అర్ధం చేసుకుని తోడుగా నిలిచిన కేనీషాను కూడా టార్గెట్ చేసి వేధింపులు చేసి ఆమెను పంపించేశారు. మూడక్షరాల ఇడ్లీ నటి నా జీవితాన్ని నాశనం చేసింది.. నాతో పాటు ఎన్నో కుటుంబాలను ఆమె కూల్చింది. నా వ్యక్తిగత జీవితాన్ని సరిదిద్దుకుని .. నా భార్యతో విడాకులు తీసుకున్నాకే తిరిగి సినిమాలలో నటిస్తా, అప్పటి వరకు నటించనని జయం రవి వెల్లడించారు. View this post on Instagram A post shared by Sun News Tamil (@sunnews) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా తిమ్మరాజుపల్లి టీవీ, తెరచాప, బ్యాడ్ బాయ్ కార్తీక్, మిస్టర్ ఎక్స్, కాళిదాస్ 2, కర్తవ్య లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్‌తో పాటు ఎగ్జామ్ లాంటి డబ్బింగ్ సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చింది. 'ధురంధర్ 2' అయితే విదేశాల్లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇప్పుడు వీటికి తోడుగా మరో తెలుగు చిత్రం కూడా వచ్చేసింది.(ఇదీ చదవండి: అర్ధరాత్రి నడిరోడ్డుపై దీన స్థితిలో పావలా శ్యామల)వజ్రయోగి, శ్రేయ భర్తీ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'Cమంతం'. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. సుధాకర్ పాణి దర్శకత్వం వహించాడు. గతేడాది నవంబరు 14న థియేటర్లలోకి వచ్చింది. కానీ స్టార్స్ లేకపోవడం స్టోరీ అంతంత మాత్రంగా ఉండేసరికి ఆడియెన్స్ దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం తాజాగా రెంట్ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'Cమంతం' విషయానికొస్తే.. నగరంలో గర్భిణులని వరుసగా హత్య చేస్తుంటారు. ఈ దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? అనే విషయాలు పోలీసులకు కూడా అంతుచిక్కవు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ డిటెక్టివ్‌గా ఉన్న హీరో (వజ్రయోగి) ఈ కేసును ఎలా టేకప్ చేశాడు? అసలు హంతకుడు ఎవరు? వారి వెనుక ఉన్న ఫ్లాష్‌బ్యాక్ ఏమిటనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రవిని వదిలేస్తున్నా.. ట్రోలింగ్ తట్టుకోలేక హీరోతో సింగర్ బ్రేకప్!) -
నువ్వు హీరోయిన్‌వా లేదా.. : నటికి అసభ్యకర మెసేజ్, ట్విస్ట్ ఏంటంటే?
ఈ మధ్య సోషల్ మీడియాలో సీటీ నటులపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు షేర్ చేసే ఫోటోలపై బూతు కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాలా మంది తారలు వీటిని పట్టించుకోవడం లేదు. వారి కామెంట్స్‌పై స్పందిస్తే..మరింత ట్రోల్ చేస్తారని.. లైట్ తీసుకుంటున్నారు. అదే ఇప్పుడు కొంతమంది ఆకతాయిలకు బలంగా మారింది. ఎలాంటి కామెంట్స్ పెట్టినా.. పట్టించుకోరని ఇష్టం వచ్చినట్లుగా, పచ్చి బూతులతో కామెంట్స్ పెట్టి శునకానందం పొందుతున్నారు. అయితే అలాంటి వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది కన్నడ నటి చైత్ర. తనపై వల్గర్ కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు గట్టి బుద్ది చెప్పింది.పోలీసు డ్రెస్ డీపీతో..సప్తసాగరాలు దాటి, 3బీహెచ్‌కే లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైత్ర జే ఆచార్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోపై పోలీస్ డ్రెస్‌లో ఉన్న ఫోటోని ప్రొఫైల్ పిక్చర్, ‘@hosamani53’ అనే హ్యాండిల్‌తో ఉన్న ఆ అకౌంట్ నుంచి ‘అసలు నువ్వు హీరోయిన్‌వా లేక సె** వర్కర్‌వా? పద్ధతిగా ప్రవర్తించడం నేర్చుకో’ అంటూ కన్నడ భాషలో అసభ్య పదజాలంతో కామెంట్ చేశారు. ఈ కామెంట్‌ని చైత్ర స్క్రీన్‌షాట్ తీసి.. సోషల్ మీడియా వేదికగా బెంగళూరు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘గౌరవనీయులైన బెంగళూరు సిటీ పోలీసులు.. ఈ అకౌంట్ మీ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తిదే అనుకుంటా. దయచేసి ఇతనికి మీరే సమాధానం చెప్పగలరా?’ అని సింగర్ చైత్ర ప్రశ్నించారు.భయపడి క్షమాపణలుచైత్ర చేసిన పోస్ట్‌తో బెంగళూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. సదరు ప్రొఫైల్ పిక్చర్లో ఉన్న వ్యక్తి నిజంగానే పోలీస్ శాఖలో పనిచేస్తున్నాడా? లేక ఖాకీ యూనిఫామ్ ఫోటో పెట్టుకుని తప్పుదోవ పట్టిస్తున్నాడా? అనే కోణంలో అంతర్గతంగా విచారణ ప్రారంభించారు. ఈ విషయం తెలిసి సదరు నెటిజన్ వెంటనే తాను పెట్టిన కామెంట్‌ని డిలీట్ చేశాడు. అంతేకాదు కామెంట్ సెక్షన్లోనే నటి చైత్రకు క్షమాపణలు చెబుతూ మెసేజ్ పెట్టాడు. ఈ విషయమై ఒక సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఇలాంటి అసభ్య కామెంట్లు పెట్టడం నేరమే. అయితే సదరు వ్యక్తి మా డిపార్ట్మెంట్కు చెందినవాడు కాదు. ప్రస్తుతం ఈ ఘటనపై ఎలాంటి అధికారిక కేసు నమోదు కాలేదు, కానీ సదరు వ్యక్తి తన తప్పు తెలుసుకుని నటికి క్షమాపణలు చెప్పాడు’అని స్పష్టం చేశారు. -
రవిని వదిలేస్తున్నా.. ట్రోలింగ్ తట్టుకోలేక సింగర్ బ్రేకప్!
తమిళ హీరో రవి మోహన్.. భార్య ఆర్తితో తెగదెంపులు చేసుకుని సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. విడాకులు మంజూరు కాకముందే సింగర్‌తో షికార్లు చేస్తుండటంతో వీరిపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సింగర్ కెనీషా ఫ్రాన్సిస్యే.. రవిమోహన్ దంపతుల విడాకులకు కారణమని ఆమెను నెటిజన్లు దుయ్యబట్టారు.వదిలేస్తున్నా..ఇటీవల మీన్కులతి భగవతి ఆలయ ఉత్సవాల్లో రవితో కలిసి కెనీషా స్టేజ్ షేర్ చేసుకోవడంపై తీవ్రంగా విమర్శించారు. ఈ ఆన్లైన్ ట్రోలింగ్‌తో కలత చెందిన కెనీషా సంచలన నిర్ణయం తీసుకుంది. రవిని వదిలేస్తున్నా.. అతడిని కాపాలనుకోవడం నా మూర్ఖత్వం అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. రవి- ఆర్తిల 15 ఏళ్ల వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడానికి తాను కారణం కాదని, తమది కేవలం స్నేహబంధం మాత్రమేనని వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాకు, మ్యూజిక్కు గుడ్‌బై చెబుతూ.. చెన్నై వదిలి వెళ్లిపోతున్నట్లు ప్రకటించింది.నావల్ల కావట్లేదుఈ పోస్ట్‌తో వీరి ప్రేమ ముగిసినట్లేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి దీనిపై రవి మోహన్ ఏమని స్పందిస్తాడో చూడాలి! దీనికంటే ముందు కూడా కెనీషా తన గతాన్ని గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది. నాలుగేళ్ల వయసులో ఇంట్లో వేధింపులకు గురయ్యానంది. 18 ఏళ్లకే పెళ్లి చేయగా భర్త కూడా టార్చర్ పెట్టాడంది. వివాహమైన నాలుగు నెలలకే గర్భం దాల్చినప్పటికీ అతడి చిత్రహింసల వల్ల బిడ్డను కోల్పోయానంది. తర్వాత అమ్మను కోల్పోవడం.. అనంతరం అల్జీమర్స్ (మతిమరుపు)తో బాధపడుతున్న నాన్నను కోల్పోవడం తనను కుంగతీశాయంది.స్నేహం మాత్రమే..ఆ సమయంలో బార్‌కు వెళ్లి పాటలు పాడటం మొదలుపెట్టానంది. ఒక ఆడియోలాంచ్లో రవిమోహన్ కలిశాడని, అక్కడే తమకు పరిచయం ఏర్పడగా స్నేహానికి దారి తీసిందని తెలిపింది. అయితే అతడి కుటుంబాన్ని విడగొట్టాలన్న ఉద్దేశం తనకెప్పుడూ లేదని పేర్కొంది. ఇంతలోనే ఈ ట్రోలింగ్ తన వల్ల కావడం లేదని.. తన ప్రేమను ఎవరూ నమ్మడం లేదంటూ అతడిని వదిలేస్తున్నానని కెనీషా పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Keneeshaa (@keneeshaa1) చదవండి: అర్ధరాత్రి నడిరోడ్డుపై దీనస్థితిలో పావలా శ్యామల -
కేన్స్ వేదికపై మన సినీ ప్రమోషన్!
ఫ్రాన్స్‌లో ఏటా జరిగే ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కేన్స్ చలనచిత్రోత్సవం ఈసారి కూడా సందడిగా సాగుతోంది. మే నెల 12న మొదలైన ఈ ఏటి 79వ కాన్ చలనచిత్రోత్సవంలో పలువురు అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొంటున్నారు. ఫ్రెంచ్ పీరియడ్ – కామెడీ చిత్రం ‘ది ఎలక్ట్రిక్ కిస్’తో ఆరంభమైన ఈ వేడుకలో భారత ప్రభుత్వం సైతం మన దేశీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయంగా మరింత మందికి చేరువ చేసేందుకు ‘భారత్ పెవిలియన్’ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సారథ్యంలోని ‘నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్’, అలాగే వందేళ్ళ సుదీర్ఘ చరిత్ర గల ప్రతిష్ఠాత్మక భారతీయ వ్యాపార సంఘం ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఫిక్కీ) సమష్టిగా వివిధ భారతీయ సినిమాల ప్రమోషన్‌కు ఈ ‘భారతీయ పెవిలియన్’ ద్వారా వేదికను కల్పిస్తున్నాయి.తెలుగు నుంచి సోషియో - ఫ్యాంటసీగా...వివిధ దేశాల సినీ రంగాలకు ఏర్పాటు చేసిన పెవిలియన్ల లానే భారతీయ సినీ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా పెట్టిన ‘భారత్ పెవిలియన్’లో మే 15, శుక్రవారం ఓ తెలుగు సినిమా ప్రమోషన్ కూడా జరగడం విశేషం. ‘ది గేమ్ ఆఫ్ సాంగ్’ (ఆటాడిన పాట) అనే తెలుగు చిత్రం టీజర్, పోస్టర్ విడుదల అక్కడ జరిపారు. నక్షత్రం ప్రొడక్షన్స్ పతాకంపై అవంతిక నక్షత్రం ఈ చిత్రాన్ని నిర్మించగా, ప్రముఖ కథా, నవలా రచయిత వేణు నక్షత్రం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. కాన్ ఫిలిం ఫెస్టివల్లో ‘లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్’ (ఎల్ఐఎఫ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ అయిన క్యారీ సాహ్ని చేతుల మీదుగా ఈ సినిమా టీజర్, పోస్టర్‌ను ఆవిష్కరించి, సభికులకు ప్రదర్శించారు. సోషియో- ఫ్యాంటసీ జానర్లో రూపొందిన ఈ ‘ఆటాడిన పాట’లో అభినవ్ గోమఠం, స్వాతీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.“ఇదో వినూత్న ప్రయోగం. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి అయింది. తెలుగులో రూపొందించిన ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లోకి కూడా అనువాదం చేస్తున్నాం” అని రచయిత, దర్శకుడు వేణు నక్షత్రం తెలిపారు. ఈ చిత్రానికి రాహుల్ మాచినేని ఛాయాగ్రహణం, టి.ఆర్. సెల్వకుమార్ కూర్పు, కార్తీక్ కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. ‘భారత్ పెవిలియన్’లో జరిగిన ఈ చిత్ర కార్యక్రమానికి హాజరైన పలువురు సినీ ప్రముఖులు ప్రయోగాత్మకంగా నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను ఆసక్తిగా గమనించారు. టీజర్‌ను ఆవిష్కరించిన క్యారీ సాహ్ని సహా పలువురు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహణకు సహకరించిన డైరెక్టర్ శర్వి, తదితర మిత్రులు, ఆహూతులకు వేణు నక్షత్రం ధన్యవాదాలు తెలిపారు.గుజరాతీ చిత్ర పరిశ్రమ సైతం...వివిధ భారతీయ భాషా చిత్రాలు అంతర్జాతీయంగా తమను తాము మార్కెట్ చేసుకొనేందుకు కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారత్ పెవిలియన్ వేదికను కల్పిస్తోంది. ఇప్పటికే పలు భారతీయ భాషా చిత్ర పరిశ్రమలు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. హిందీ టీవీ నుంచి గుజరాతీ చిత్రసీమలో ప్రముఖ నటిగా ఎదిగి, గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్ ప్రెస్’ (2023) ద్వారా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న మానసీ పారేఖ్ ఈసారి కాన్‌లో గుజరాతీ సినిమా పక్షాన జోరుగా ప్రచారం చేస్తూ, రకరకాల ఫ్యాషన్ దుస్తులతో ఫోటోలు దిగుతూ, అందరినీ ఆకర్షిస్తున్నారు. నిరుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ముఖ్య పాత్రగా చేసుకొని, అతి తక్కువ బడ్జెట్లో నిర్మాణమై, కనివిని ఎరుగని వసూళ్ళతో గుజరాతీ సినీ పరిశ్రమ వైపు దేశమంతా తిరిగి చూసేలా చేసిన సోషియో-ఫ్యాంటసీ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ చిత్ర దర్శకుడు సహా పలువురు ఆ పరిశ్రమ నుంచి అక్కడ సందడి చేస్తున్నారు. ఈ మే 23 వరకు మరో వారం రోజుల పాటు ఈ కాన్ చలనచిత్రోత్సవం సాగనున్నందున తెలుగు చిత్రసీమతో పాటు ఇతర భారతీయ భాషల నుంచి మరెన్ని విశేషాలు చోటుచేసుకుంటాయో చూడాలి. -
అర్ధరాత్రి నడిరోడ్డుపై దీన స్థితిలో పావలా శ్యామల
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి పావలా శ్యామల పరిస్థితి రోజురోజుకూ మరింత దయనీయంగా మారుతోంది. అటు వృద్ధాప్య సమస్యలు, ఇటు అనారోగ్యం ఆమెను మరింత కుంగదీస్తున్నాయి. ప్రస్తుతం ఆర్కే ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమె శుక్రవారం రాత్రి అస్వస్థతకు లోనవగా చికిత్స కోసం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. దీన స్థితిలో నటికానీ చికిత్సకు సరిపడా డబ్బు తన దగ్గర లేకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యం ఆమెకు ట్రీట్మెంట్ చేసేందుకు నిరాకరించింది. అంతేకాకుండా ఓ క్యాబ్ ఎక్కించి ఆమెను బలవంతంగా పంపించేసింది. అయితే క్యాబ్ డ్రైవర్ సైతం ఆమెను మధ్యలోనే దింపేశాడు. కూకట్‌పల్లిలోని ఓ జంక్షన్ వద్ద రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై దించేసి నిర్దాక్షిణ్యంగా వెళ్లిపోయాడు. దీంతో అర్ధరాత్రి కటిక చీకటిలో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ కూర్చుండిపోయింది. ఆస్పత్రిలో చికిత్సకాసేపటికి ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు.. ఆమె ఆశ్రయం పొందుతున్న ఆర్కే ఫౌండేషన్‌కు సమాచారమివ్వడంతో వారు తనను సనత్‌నగర్‌లోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఒకప్పుడు తన నటనతో ఎంతోమందిని నవ్వించిన నటి ఇప్పుడిలా రోడ్డుపై దయనీయ స్థితిలో కనిపించడం చూసి సినీప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పావలా శ్యామల పరిస్థితి తెలుసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. సాయం చేయడం కోసం తన టీంను ఆసుపత్రికి పంపినట్లు సమాచారం.చదవండి: సూర్యకు భారీ పారితోషికం.. మరి త్రిషకెంతో? -
రామ్‌చరణ్ చేతికి గాయం? హీరోకు ఏమైంది?
గేమ్ ఛేంజర్‌తో భారీ డిజాస్టర్‌ను మూటగట్టుకున్న రామ్‌చరణ్ ఈసారి పెద్దితో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాయి. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 4న విడుదల కానుంది. అయితే అప్పటివరకు గ్యాప్ లేకుండా భారీ ఈవెంట్లు ప్లాన్ చేసింది చిత్రయూనిట్. బ్యాండేజ్‌తో చరణ్?మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్‌తో ఈ ప్రమోషన్స్ జర్నీ మొదలు కానుంది. పలు నగరాల్లో అనేక ఈవెంట్లను ఏర్పాటు చేశారు. చివరగా జూన్ 2న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే ముంబై వెళ్లిన రామ్‌చరణ్ చేతికి బ్యాండేజ్‌తో కనిపించాడు. శుక్రవారం నాడు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ హకీం ఆలిం సెలూన్‌కు వెళ్లాడు చరణ్. చరణ్‌కు ఏమైంది?అనంతరం బయటకు వస్తుండగా అతడి కుడి చేతికి సపోర్ట్ బ్రేస్ (రిస్ట్ బ్యాండేజ్) ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో చరణ్‌కు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే షూటింగ్లో చరణ్ చేతికి చిన్న గాయమైందని, దాన్నుంచి త్వరగా కోలుకోవడానికే ఈ బ్యాండేజ్ ధరించాడని తెలుస్తోంది. #RamCharan - MAINTAINING HOLLYWOOD STAR LEVEL OF LOOKS - and Ram Charan is absolutely owning that long hair look🔥#ramcharan 💥 pic.twitter.com/SJ5IW73K9j— ROYAL BHARAT (INDIAN)🇮🇳 (@royal_mogile) May 16, 2026 చదవండి: స్క్రిప్ట్ చదివే అలవాటే లేదు: సల్మాన్ ఖాన్ -
సూర్యకు భారీ పారితోషికం.. త్రిషకు మాత్రం ఇదే చివరిసారి!
కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "కరుప్పు". తెలుగులో ఈ మూవీ 'వీరభద్రుడు' పేరిట విడుదలైంది. మే 14న విడుదల కావాల్సిన ఈ సినిమా ఒకరోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. దీన్ని ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మించారు. సినిమా పాజిటివ్ టాక్ అందుకుంటున్న నేపథ్యంలో ఎవరెవరు ఎంత పారితోషికం తీసుకున్నారో చూసేద్దాం...పారితోషికంకోలీవుడ్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం హీరో సూర్య రూ.45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట! త్రిష రూ.5 కోట్లు, ఆర్జే బాలాజీ రూ.4 కోట్లు పుచ్చుకోగా కమెడియన్ యోగిబాబు రూ.2 కోట్లు వెనకేసినట్లు తెలుస్తోంది. నటుడు ఇంద్రన్స్ రూ.80 లక్షలు అందుకున్నాడని సమాచారం. స్వసికకు రూ.40 లక్షలు, జార్జ్ మరియన్‌కు రూ.30 లక్షలు ముట్టజెప్పారని భోగట్టా!తర్వాతి నుంచి..ప్రస్తుతం రూ.5 కోట్లతో సరిపెట్టుకున్న త్రిష తన తర్వాతి సినిమాకు మాత్రం పారితోషికం రెట్టింపు చేసిందని ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్- రజనీకాంత్ మూవీలో యాక్ట్ చేసేందుకుగానూ ఏకంగా రూ.12 కోట్లు డిమాండ్ చేసినట్లు వినికిడి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ బ్యూటీని సినిమాలో పెట్టుకునేందుకు అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సైతం రెడీ అంటున్నారట! ఈ లెక్కన త్రిష తక్కువ పారితోషికం తీసుకున్న చివరి తమిళ సినిమాగా 'వీరభద్రుడు' మిగిలిపోనుందన్నమాట!చదవండి: వీరభద్రుడు మూవీ రివ్యూ -
అబ్బే.. స్క్రిప్ట్ చదివే అలవాటు నాకెక్కడిది?: సల్మాన్ ఖాన్
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ చిత్రపరిశ్రమకు ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్బస్టర్లు అందించాడు. తన కెరీర్లో ఎన్నో విజయాలు చూసిన ఈ స్టార్ హీరోకు అసలు స్క్రిప్ట్ చదివే అలవాటే లేదట! ఈ విషయాన్ని తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ.. నా జీవితం మొత్తంలో ఒక్కసారి కూడా స్క్రిప్ట్ చదివిందే లేదు. కొన్నిసార్లు నేనే స్క్రిప్ట్ రాశాను కానీ ఎన్నడూ చదివిన పాపాన పోలేదు అని నవ్వుతూ చెప్పాడు. అదన్నమాట సంగతి!గతంలోనూ సల్మాన్ ఈ విషయాన్ని చూచాయగా చెప్పాడు. తనకు కథ కన్నా దాని స్వభావం, అందులోని కమర్షియల్ అంశాలే ముఖ్యమన్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొందరు అతడి నిజాయితీని మెచ్చుకుంటున్నారు. మరికొందరేమో అందుకే సల్మాన్ వరుస వైఫల్యాలు అందుకుంటున్నారని, ఇకనైనా ఈ ధోరణి మార్చుకుని మంచి కథలు ఎంచుకుంటే తిరిగి ట్రాక్ ఎక్కుతాడని హితవు పలుకుతున్నారు.సినిమాప్రస్తుతం సల్మాన్ ఖాన్ మాతృభూమి సినిమా చేస్తున్నాడు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ మూవీలో సైనికాధికారిగా నటిస్తున్నాడు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నాడు. దీనికి మొదట బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పలు కారణాల వల్ల దాన్ని మాతృభూమిగా మార్చారు. అలాగే సల్మాన్.. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో ఓ మూవీ చేస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఈద్‌కు విడుదల కానుంది. -
పవర్ఫుల్ లీలావతి
విరాట్ కర్ణ హీరోగా నటించిన సినిమా ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. నభా నటేష్, ఐశ్వర్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ నామా దర్శకత్వంలో ఎన్ ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా జూలై 3న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలో లీలావతి పాత్రలో అనసూయ నటించినట్లు వెల్లడించి, ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమాలో అనసూయ పాత్ర పవర్‌ఫుల్‌గా, కీలకంగా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. రిషబ్ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాశ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. -
కొత్త ప్రయాణం
బర్త్ డే రోజున ఫ్యాన్స్ కు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు హీరో రామ్ పోతినేని. దర్శకుడిగా కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారాయన. శుక్రవారం (మే 15) ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా రామ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించనున్న కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఆయన దర్శకత్వం వహించనున్న తొలి సినిమా ఇదే. రామ్ కెరీర్‌లోని ఈ 23వ సినిమాను రాపో సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో వీర అనే పాత్రలో నటించనున్నారు రామ్. ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్’ అనేది ఈ సినిమా క్యాప్షన్ . ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను జూన్ లో ప్రారంభించి, డిసెంబరులో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘‘ఈ సినిమాలో వీర పాత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని లుక్‌లో రామ్ కనిపిస్తారు. ఒంటరితనం, మానసిక సంఘర్షణలతో నిండిన కొత్త పాత్ర ఆయనది’’ అని యూనిట్ పేర్కొంది. కాగా తన గత చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోసం రామ్ రచయితగా మారి తొలి పాట రాయడంతో పాటు పాటలు పాడారు. -
ఇదే సరైన సమయం.. కమల్‌హాసన్ బహిరంగ లేఖ
చెన్నై: భారతీయ సినీ పరిశ్రమను ఉద్దేశించి ప్రముఖ నటుడు కమల్ హాసన్ బహిరంగ లేఖ రాశారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం మరింత తీవ్రమవుతోందన్న కమల్.. ఇంధనం, వాణిజ్యం, రవాణా, ఆర్థిక స్థిరత్వంపై ప్రపంచం ఒత్తిడిని ఎదుర్కొంటోందన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ కూడా ప్రభావితమవుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.‘‘పెరుగుతున్న ఖర్చులు కేవలం సినిమా నిర్మాణాన్ని మాత్రమే ప్రభావితం చేయవు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా రాబోయే నెలల్లో వినోదం కోసం వినియోగదారుల ఖర్చు చేసే విధానాలు కూడా మారవచ్చు. ఆ భారం అనివార్యంగా నిర్మాతలు, కార్మికులు, థియేటర్లు, పంపిణీదారులు, ఫైనాన్షియర్లు, మొత్తం వ్యవస్థపై పడుతుంది. సినిమా రంగం అభివృద్ధి చెందాలంటే, ఖర్చు చేసే ప్రతి రూపాయి కేవలం భారీ స్థాయి ప్రదర్శనకే కాకుండా, సినిమాకే ఉపయోగపడేలా మనం నిర్ధారించుకోవాలి.’’ అని కమల్‌హాసన్ లేఖలో సూచించారు.‘‘ప్రతి ప్రేమకథ పారిస్‌లోనే ఎందుకు వికసించాలి. ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి?. అదృష్టవశాత్తూ ప్రేమకు విదేశీ మారకద్రవ్యం అవసరం లేదు. భారతీయ సినిమా పరిశ్రమలోని వ్యక్తులు ఒకే అభిప్రాయానికి రావడానికి ఇదే సరైన సమయం. ఆర్థిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై పరిశ్రమ వ్యాప్తంగా చర్చ జరగాలి. నిర్మాతలు, నటీనటులు, దర్శకులు, యూనియన్లు, స్టూడియోలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, గిల్డ్ల మధ్య సంప్రదింపులు జరగాలి.సమర్థవంతమైన సినిమా నిర్మాణం కోసం, మనమందరం కలిసి ఆచరణాత్మకమైన, సుస్థిరమైన నిర్వహణ పద్ధతులను అభివృద్ధి చేసుకోవాలి. అనవసరమైన విదేశీ ప్రయాణాలను పరిమితం చేయడం, సెట్లు, స్టూడియోల అంతటా విద్యుత్ ఆదా చేయడం, సుస్థిరమైన సెట్ నిర్మాణం, వస్తువుల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం చేయాలి. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం.మన పరిశ్రమ సంస్కృతిని తీర్చిదిద్దుతుంది, ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. సినిమా కేవలం వినోదానికి మించిన బాధ్యతలను కలిగి ఉంటుంది. ఈ పరిశ్రమ నుండి అత్యధికంగా లబ్ధి పొందిన మనము ముందుగా ఆదర్శంగా నిలవాలి. ఈ రోజు సినిమా ఆర్థిక వ్యవస్థను కాపాడగలిగితే, రేపటి సినిమా భవిష్యత్తును కాపాడగలిగినట్లే’’ అంటూ కమల్‌హాసన్ లేఖలో పేర్కొన్నారు. -
రెడ్ డ్రెస్‌లో మంచు లక్ష్మీ.. కేన్స్‌లో కొత్త లోకా బ్యూటీ..!
ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా..మ్యాగజైన్ లుక్‌లో అనన్య పాండే..జిమ్‌లో బిగ్‌బాస్ ఇనయా సుల్తానా కసరత్తులు..రెడ్ డ్రెస్‌లో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ లుక్స్..కేన్స్‌లో కల్యాణి ప్రియదర్శన్ సందడి.. View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
హీరోగా స్టార్ డైరెక్టర్.. ట్రైలర్ రిలీజ్
ఖైదీ, విక్రమ్ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ దక్కించుకున్న డైరెక్టర్ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ప్రస్తుతం దర్శకుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ డీసీ. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బీ హీరోయిన్గా కనిపించనుంది.ఈ సినిమాకు అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో చంద్ర (వామికా గబ్బీ) అనే యువతికి సపోర్ట్‌గా నిలిచే దేవదాస్‌గా లోకేశ్ కనగరాజ్ కనిపించనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. -
లగ్జరీ స్పోర్ట్స్ కారు కొన్న వీకే నరేశ్.. ఎన్ని కోట్లో తెలుసా?
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారు విలువ దాదాపు రూ.2.5 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ ఖరీదైన స్పోర్ట్స్ కారుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు నరేశ్‌కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. వీకే నరేశ్ టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటన, కామెడీతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ఏడాది బ్యూటీ, హే బల్వంత్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం మరిన్ని చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. Live life King Size like Naresh pic.twitter.com/PaChEpGm9A— Journalist Nishant (@NishantOpinions) May 15, 2026 -
కొత్త సీఎంకు ఫోన్ చేసిన మెగాస్టార్.. ఏ సలహా ఇచ్చారంటే?
తమిళనాడు సీఎం విజయ్‌కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ను అభినందించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ప్రజాకేంద్రీకృత పాలనతో తమిళనాడు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని మెగాస్టార్ సూచించారు. దివంగత మహానేత ఎంజీఆర్‌లా ప్రజల ప్రేమాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు.చిరంజీవి మాటలకు సీఎం విజయ్ కూడా స్పందించారు. ఇటీవలే మన శంకర వర ప్రసాద్ గారు చిత్రాన్ని వీక్షించినట్లు తెలిపారు. మిమ్మల్ని తెరపై చూడటం ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు. జననాయగన్ పైరసీ విషయంలో సపోర్ట్ చేసినందుకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న చిరంజీవి రాబోయే చిత్రానికి విజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ రివ్యూ
టైటిల్ : మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్నటీనటులు: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ & అనీష్ కురువిల్లా, శివాజీరాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, సివిఎల్ నర్సింహారావు, గుండు సుదర్శన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండుదర్శకత్వం: మధుదీప్ చెలికానినిర్మాత: అరవింద్ మండెంఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావుసంగీతం: ప్రకాష్ చెరుకూరి, అరుణ్ చిలువేరు విడుదల తేది: మే 15, 2026కథేంటంటే.. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అరవింద్ (త్రిగుణ్).. తన జాబ్‌కి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగివస్తాడు. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత.. ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఫిక్స్ అవుతాడు. వ్యవసాయంలో కొత్త తరహా పద్దతులను ప్రవేశపెట్టడమే కాకుండా రైతులు ఆదాయం పెంచేడానకి ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే యాప్ తీసుకొస్తాడు. ఆ యాప్‌తో రైతుల జీవితం ఎలా మార్చాడు? మహి(పాయల్ రాధాకృష్ణ)తో ప్రేమాయాణం ఎలా సాగింది? చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని అరవింద్ ఎలా నెరవేర్చుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే టైటిల్ చూడగానే ఇదేదో సాఫ్ట్వేర్ ఉద్యోగి కథ అనుకుంటారు. కానీ ఇందులో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి..వ్యవసాయం చేసుకునే యువకుడి కథను చెప్పాడు దర్శకుడు మధుదీప్ చెలికాని. అప్పట్లో ఎలాంటి ఎరువులు లేకుండా సాంప్రదాయ వ్యవసాయ పద్దతుల్లో పండించిన పంటలను తిన్న మన పెద్ద వాళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ నేటి తరం అలా ఉండటం లేదు. రసాయన ఎరువులు వాడిన కూరగాయలు, రైస్ తీసుకొని అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆర్గానిక్ వ్యవసాయం వల్ల కలిగే లాభాల గురించి పెద్దగా తెలియదు. ఈ చిత్రంలో ఒకవైపు రైతుల కష్టాలను చూపిస్తూనే మరోవైపు ఆర్గానిక్ వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు.దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా..దాన్ని తెరపై అనుకున్నట్లుగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. దర్శకుడు పనితనం కొన్నిసన్నివేశాల్లో మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంది. ఉన్నంతలో ఫస్టాఫ్ బాగానే ఉంటుంది. కొన్ని కామెడీ సీన్లు, లవ్ ఎపిసోడ్ పర్వాలేదు. కానీ సెండాఫ్లో కథనం స్లోగా సాగడంతో సాగదీశారనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది.ఎవరెలా చేశారంటే..అరవింద్ పాత్రకి త్రిగుణ్ న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అందంగా కనిపించింది. హీరో తండ్రి పాత్రలో నటించిన అవినాష్ కురువిల్లా, ఆర్గానిక్ వ్యవసాయం వైపు హీరోను టర్న్ చేసే పాత్రలో శివాజీ రాజా తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిది మేర నటించి ఆకట్టుకున్నారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. -
టాలీవుడ్లో పర్సంటేజీ వివాదం.. సబ్ కమిటీ ఏర్పాటు
టాలీవుడ్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల అంశంపై ముందడుగు పడింది. ఇవాళ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పర్సంటేజీ వివాదంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో జాయింట్ మీటింగ్ నిర్వహించారు. ఈ పర్సంటేజీ సమస్యను వేగంగా, సామరస్యంగా పరిష్కరించేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా సబ్ కమిటీ ఏర్పాటు చేశారు.ముఖ్యంగా ఎగ్జిబిటర్ల సెక్టార్‌కు సంబంధించిన పర్సంటేజీ విధానంపై చర్చ జరిగింది. సబ్ కమిటీ ఛైర్మన్‌గా డి. సురేష్ బాబు, కన్వీనర్లుగా అల్లు అరవింద్, దిల్ రాజు, కె.ఎల్. నారాయణ, కె. అశోక్ కుమార్ ఉన్నారు. ఈ సబ్-కమిటీలో మూడు రంగాలకు (నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు) సమాన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిర్మాతల రంగం నుంచి వై. సురేందర్ రెడ్డి, వై. సుప్రియ, వై. రవి శంకర్, బి. బాపినీడు, చెరుకూరి సుధాకర్, జి. శ్రీనివాస్ కుమార్(ఎస్కేఎన్), టి. ప్రసన్న కుమార్ సభ్యులుగా ఉన్నారు.ఎగ్జిబిటర్స్ రంగం నుంచి వి. ప్రతాప్ రెడ్డి, టి. బాల్గోవింద్ రాజ్, కె. అనుపమ్ రెడ్డి, పి. శ్రీనివాస రావు, జి. వీరనారాయణ బాబు, కె. వంశీ కిషోర్ (చిన్ని), ఎం. విజేందర్ రెడ్డి సభ్యులుగా ఎంపికయ్యారు. డిస్ట్రిబ్యూటర్స్ రంగం నుంచి డి. విష్ణు మూర్తి, వి. వీరనాయుడు, ఎన్. సుధాకర్ రెడ్డి, ముత్యాల రామదాసు, ఎన్. నాగార్జున, బి. మధుసూదన్ రెడ్డి (ఠాగూర్ మధు), ధీరజ్ మొగిలేని కూడా ఉన్నారు. -
'విజయ్‌ని అడిగామని చెప్పండి..' త్రిష రియాక్షన్ చూశారా?
కోలీవుడ్ హీరోయిన్ త్రిష తాజాగా కరుప్పు మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా ఇవాళే థియేటర్లలో రిలీజైంది. ఒక రోజు ఆలస్యంగా ఈ మూవీ విడుదలైంది. తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా త్రిష చెన్నైలోని ఓ థియేటర్ వద్ద సందడి చేశారు. మూవీ వీక్షించిన అనంతరం కారులో ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో అక్కడే ఫ్యాన్స్.. ఆమె కారును చుట్టుముట్టారు. దీంతో ఒకరు విజయ్‌ని అడిగామని చెప్పండని త్రిషను అడిగారు. ఇది విన్న త్రిష చిరు నవ్వులు చిందించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. "Thalapathy ah kettenu sollunga"Trisha replies, "Kandipa" 😅❤️ pic.twitter.com/CLZUTP3QIn— Deepu (@deepu_drops) May 15, 2026 -
ది రాజాసాబ్‌పై కామెంట్స్.. సప్తగిరి క్షమాపణలు!
టాలీవుడ్లో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నవారిలో సప్తగిరి ఒకరు. ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతం పురుషః అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా మే 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీటీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈవెంట్‌కు హాజరైన సప్తగిరి తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను చేసిన చిన్న సినిమాల గురించి చెప్పే క్రమంలో అనుకోకుండా ది రాజాసాబ్ పేరును కూడా కలిపేశారు. ఈ మధ్యే సరస్వతి, ది రాజాసాబ్, కొక్కరొక్కో లాంటి సినిమాలు చేశాను. కాకపోతే అవి చిన్నస్థాయి సినిమాలు కావడంతో సరిగ్గా ప్రజలకు రీచ్ అవ్వడం లేదు. పెద్ద సినిమాలు అయితే రీచ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ బాగా ఫీలయ్యారు. సప్తగిరిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.తాజాగా తాను చేసిన కామెంట్స్‌పై సప్తగిరి స్పందించారు. అలా మాట్లాడినందుకు నన్ను క్షమించాలని కోరారు. మినిమం బడ్జెట్ మూవీస్ చేస్తున్నాను.. ఆ సినిమాల లిస్ట్ చెబుతూనే ది రాజాసాబ్ పేరు చెప్పానని తెలిపారు. మారుతి కూడా నాకు ఫోన్ చేశారని.. సారీ చెప్పమని అడిగారని వెల్లడించారు. ఆయనకు కూడా సారీ చెప్పా.. ఇప్పుడు ఫ్యాన్స్ అందరికీ కూడా క్షమాపణలు చెప్పారు సప్తగిరి. -
‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: వీరభద్రుడునటీనటులు: సూర్య, త్రిష, ఇంద్రన్స్, నట్టి, ఆర్.జే బాలాజీ తదితరులునిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్నిర్మాతలు: ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభురచన & దర్శకత్వం: ఆర్.జే బాలాజీసినిమాటోగ్రఫీ : జికె విష్ణుసంగీతం : సాయి అభ్యంకర్ఎడిటర్ : ఆర్.కళైవానన్విడుదల తేది: మే 15, 2026సూర్య ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇప్పుడు ఆయన ఆశలన్నీ కరుప్పు పైనే పెట్టుకున్నాడు. తెలుగులో ‘వీరభద్రుడు’పేరుతో నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. మీను అనే అమ్మాయి ప్రాణాంతక వ్యాధి బారిన పడుతుంది. చికిత్స కోసం లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. దీంతో తమ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను అమ్మాలని చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తారు. నాంపల్లిలో రైలు దిగి..సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కుతుండగా..దొంగలు వచ్చి ఆ నగలను ఎత్తుకెళ్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మరుసటి రోజు దొంగలను పట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారు. వాటిని తీసుకోవాలంటే కోర్టు అనుమతి అవసరం అని చెప్పడంతో మీను, ఆమె తండ్రి కోర్టుకు వెళ్తారు. ఈ కేసునే టేకాప్ చేసిన లాయర్ బేబీ కృష్ణ(ఆర్.జే బాలాజీ)..వాళ్లకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ.. దోచుకోవడం మొదలుపెడతాడు. కావాలనే కేసును నెలల తరబడి సాగదీస్తాడు. మీను తండ్రికి ఓపిక నశించి.. చేసేదేం లేక కోర్టు ఎదుటే ఉన్న వీరభద్రుడు స్వామిని (సూర్య)ను వేడుకుంటాడు. న్యాయం కోసం ఆ దేవుడే కిందకి దిగొస్తాడు. మనిషిగా భూమికి మీదకు వచ్చిన వీరభద్రుడు స్వామి.. మీనుకి న్యాయం చేశాడా? అవినీతి కంపులో మునిగిపోయి బేబీ కృష్ణకు, ఇతర లాయర్లకు ఆయన ఎలాంటి బుద్ది చెప్పాడు? అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే..ప్రస్తుతం న్యాయ వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అందరికి తెలిసిందే. ఒక కేసుని పరిష్కరించడానికి నెలల సమయం పడుతుంది. డబ్బులు ఉన్నవాడికే ‘న్యాయం’ జరుగుతున్న రోజులివి. సామాన్యుడు న్యాయం కోసం కోర్టుని ఆశ్రయిస్తే.. ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పదు. అప్పటికీ సరైన న్యాయం జరుగుతుందా అంటే అనుమానమే. అవినీతి కంపులో న్యాయ వ్యవస్థ మునిగిపోయిందనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. చివరకు ఆ దేవుడే దిగివచ్చినా.. ప్రస్తుత న్యాయవ్యవస్థను బాగు చేయలేడు అనేది వినోదాత్మకంగా ‘వీరభద్రుడు’ సినిమాలో చెప్పాడు దర్శకుడు ఆర్.జే బాలాజీ. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. కోర్టులో జరుగుతున్న అవినీతిని, సామాన్యులకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. కానీ సూర్య స్థాయి లాంటి హీరోని పక్కన పెట్టి.. ఆర్.జే బాలాజీ పోషించిన బేబీ కృష్ణ పాత్రను హైలెట్ చేయడమే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సినిమా మొదలైన అరగంట వరకు సూర్య తెరపై కనిపించడు. సూర్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆర్జే బాలజీ పాత్రకే మంచి సన్నివేశాలు ఉంటాయి. అయితే క్లైమాక్స్‌లో మాత్రం వీరభద్రుడు(సూర్య) తాండవం అదిరిపోతుంది. మీను పాత్రతో పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. నగలు అమ్మి చికిత్స చేసుకోవాలని నగరానికి వచ్చిన తండ్రి కూతుళ్లపై దొంగలు దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లడం.. కేసు పెట్టి, కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. అయినప్పటికీ సూర్య ఎంట్రీ లేకపోవడంతో కథనం నెమ్మదిగా సాగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక వీరభద్రుడు ఆగమనం తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. కోర్టు డ్రామా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండాఫ్‌లో ఫాంటసీ ఎలిమెంట్స్ ఆకట్టుకోకపోగా..చిరాకుగా అనిపిస్తుంది. న్యాయం కోసం దేవుడు చేసే పనులు సిల్లీగా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ఎమోషన్ మీద దృష్టిపెట్టిన దర్శకుడు..ద్వితియార్థంలో మాత్రం మాస్ ఎలిమెంట్స్‌పైనే ఫోకస్ పెట్టాడు. సూర్యతో వచ్చే యాక్షన్ సన్నివేశాలు.. పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కథనం కూడా అక్కడక్కకే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో వీరభద్రుడు తాండవం ఆకట్టుకుంటుంది. తమిళ వాసనలు ఎక్కువగా ఉండడం.. సూర్య పాత్ర నిడివి తక్కువగా ఉండడం ఈ సినిమాకు మైనస్. ఎవరెలా చేశారంటే.. వీరభద్రుడు పాత్రలో సూర్య ఒదిగిపోయాడు. సామాన్య మనిషిగా, దేవుడిగా రెండు విభిన్నమైన పాత్రలను పోషించి..తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్‌లో వీరభద్రుడు తాండవం అదిరిపోతుంది. లాయర్ ప్రీతిగా త్రిష చక్కగా నటించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా.. సెకండాఫ్‌లో మాత్రం ఒకటి రెండు మంచి సీన్లు పడ్డాయి. ఇక దర్శకుడు ఆర్.జే బాలాజీ పోషించిన బేబీ కృష్ణ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రలో బాలాజీ ఒదిగిపోయాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర బాగానే నటించారు. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. సాయి అభ్యంకర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు అంతగా ఆకట్టుకోవు. సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ వీఎఫ్ఎక్స్ పనితీరు తేలిపోయింది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
షూటింగ్ సెట్లో విషాదం.. జైలర్-2 సిబ్బంది మృతి
రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న జైలర్-2 సెట్లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో సిబ్బంది మృతి చెందారు. చెన్నైలోని పనైయూర్లో ఉన్న ఒక ప్రైవేట్ ఫిల్మ్ స్టూడియోలో ఈ ఘటన జరిగింది. మృతున్ని చిత్రబృందంలో పనిచేస్తోన్న కార్తికేయన్‌గా గుర్తించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం కార్తికేయన్ ఆర్ట్ డైరెక్షన్ యూనిట్లో పనిచేస్తున్నారు. తన పనిలో భాగంగా షూటింగ్ కోసం ఇంటి సెట్‌ను నిర్మించడంలో సహాయం చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో యువకుడు అక్కడిక్కడే మరణించాడు. పనైయూర్‌లోని స్టూడియోలో ఈ సంఘటన జరిగిందని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. విద్యుత్ లీక్‌కు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.కాగా.. ఇటీవలే 'జైలర్ 2' షూటింగ్ పూర్తయిందని సన్ పిక్చర్స్ ప్రకటించిన కొన్ని వారాల తర్వాతే ఈ సంఘటన జరిగింది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023లో వచ్చిన జైలర్‌కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని జూన్ 12న విడుదల అవుతుందని మొదట ప్రకటించినప్పటికీ... సన్ పిక్చర్స్ ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కొంచెం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని కృష్ణాష్టమి కానుకగా సెప్టెంబర్ 4న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో రమ్యకృష్ణన్, యోగి బాబు, మీర్నా కీలక పాత్రల్లో నటించారు. -
కరుప్పు మూవీ.. పూనకంతో ఊగిపోయిన డైరెక్టర్..!
సూర్య హీరోగా వచ్చిన కరుప్పు ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గురువారం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఆర్థికపరమైన సమస్యలతో ఓ రోజు ఆలస్యంగా తెరపైకొచ్చింది. ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూర్య సరసన హీరోయిన్గా త్రిష కనిపించింది.ఇవాళ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆర్జే బాలాజీ సైతం థియేటర్లో వీక్షించారు. దీంతో సినిమాను చూసి పూనకంతో ఊగిపోయారు. టాలీవుడ్ హీరో నాని నటించిన జెర్సీ మూవీ సీన్ రీ క్రియేట్ చేశారు. ట్రైన్ సీన్లో నానిలానే బిగ్గరగా అరుస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #RJBalaji - HUGGED TRISHA AFTER A BLOCKBUSTER RESPONSE - Of #Karuppu Film 🔥🔥🔥🔥This Man Deserves this SUCCESS.pic.twitter.com/LmeMv8q3Fv— GetsCinema (@GetsCinema) May 15, 2026 -
పెద్ది మూవీ హీరోయిన్.. అందుకే దూరంగా ఉందా?
ప్రస్తుతం టాలీవుడ్లో అందరి చూపులు పెద్ది సినిమా వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ నెల 18న పెద్ది ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. డైరెక్టర్ బుచ్చిబాబు సనా సైతం పెద్ది ప్రమోషన్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే పెద్ది మూవీ గురించి మరో చర్చ మొదలైంది. ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మూవీ ప్రమోషన్స్ వీడియోల్లోనూ జాన్వీ పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జాన్వీ పెద్ది ప్రమోషన్స్‌కు దూరంగా ఉండడంపై టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.కారణం అదేనా??అయితే జాన్వీ కపూర్ కేవలం భారీ రెమ్యూనరేషన్ కోసమే ఈ ప్రాజెక్టుకు సంతకం చేసిందని ఓ టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్లే ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ఓ కథనంలో వెల్లడైంది.ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ట్రైలర్ రిలీజ్‌కు వేడుకలోనైనా జాన్వీ కపూర్ కనిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ముంబయిలో ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రమోషన్ల విషయంలో జాన్వీ వెనక్కి తగ్గితే అది ఆమె కెరీర్‌పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ‘పెద్ది’ లాంటి పాన్ ఇండియా చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే అవకాశాన్ని బాలీవుడ్ బ్యూటీ మిస్ చేసుకున్నట్లే. -
ఎంతమందితోనైనా డేటింగ్.. నాకు అలానే జరిగింది
భరత్ అనే నేను, గేమ్ ఛేంజర్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న హీరోయిన్ కియారా అడ్వాణీ.. త్వరలోనే 'టాక్సిక్'తో రాబోతుంది. ప్రస్తుతం గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ దర్శకనిర్మాతలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. ఇప్పుడు ఏడాది కూడా నిండని తన కూతురి భవిష్యత్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. వాటిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే)తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అడ్వాణీ.. కూతురు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 'ఆమె (సరయూ) పూర్తి జీవితం చూడాలని అనుకుంటున్నాను. ఒక్కరితో డేటింగ్ చేయాలని రూలేం లేదు. ఈ విషయంలో ఆమెకు ఎలాంటి ఆంక్షలు విధించను. పెళ్లి చేసుకోవాలనుకుంటే ఓకే లేదంటే లేదు. డేట్ చేసిన ప్రతి ఒక్కరినీ పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు అలానే జరిగింది. చివరకు సరైన వ్యక్తి దొరికాడు. ఎదిగే క్రమంలో ఈ బంధాలు.. అన్ని పాఠాలు నేర్పిస్తాయి. మనల్ని మనిషిగా మారుస్తాయి. జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి. పొరపాట్లు అందరూ చేస్తారు. కానీ వాటి నుంచే నేర్చుకుంటారు' అని కియారా స్టేట్మెంట్ ఇచ్చింది.కియారా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కనీసం ఏడాది పూర్తి కాని కూతురి గురించి మాట్లాల్సిన మాటలేనా ఇవి అని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం ఫెమినిజం అని ప్రశ్నిస్తున్నారు. ఇదే సంస్కృతి అని ఫైర్ అవుతున్నారు. కియారా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని కియారా ప్రేమించి 2023లో పెళ్లి చేసుకుంది. గతేడాది జూలైలో వీళ్లకు కూతురు పుట్టింది.(ఇదీ చదవండి: ఎట్టకేలకు మన దేశంలో ఓటీటీకి 'ధురంధర్ 2'.. అధికారిక ప్రకటన)#KiaraAdvani Bold STATEMENT about her Daughter left Everyone SHOCKED 😳 She Said , - I will let My Daughter to DATE as many MAN she Wants . No Need to Marry a Guy You Date . EXPLORE Yourself with them . Earlier #RamKapoor Wife Giving SE*X and VIB*R*A*T*OR to her Daughter as… pic.twitter.com/uMqeOgxFOm— Manoz Kumar (@ManozTalks) May 15, 2026 -
సీఎం విజయ్ నా కాళ్లపై పడ్డారు: కరూర్ బాధితురాలు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు ఏకంగా సీఎం పీఠం ఎక్కారు. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఏకంగా ముఖ్యమంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఫుల్ మెజారిటీ రాకపోయినా.. ఇతర పార్టీల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తమిళనాడు సీఎంగా విజయ్ ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారంలో తీవ్ర విషాదం జరిగిన సంగతి తెలిసిందే.విజయ్ సభకు వచ్చిన తొక్కిసలాటలో దాదాపు 41 మంది మరణించారు. ఈ తీవ్ర విషాదం తమిళనాడును ఒక్కసారిగా కుదిపేసింది. ఆ సమయంలో విజయ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. కరూర్ సభలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తాజాగా విజయ్ సీఎం కావడంతో కరూర్ తొక్కిసలాట బాధితులతో ప్రముఖ మీడియా మాట్లాడింది.ఈ ఘటనలో బిడ్డను కోల్పోయిన తమను విజయ్ పరామర్శించారని తల్లిదండ్రులు తెలిపారు. ఆ సమయంలో విజయ్ మా ఇంటికి వచ్చి నా కాళ్లపై పడ్డారని బాలిక తల్లి చెప్పారు. ఈ ఘటన తర్వాత మాకు అండగా నిలిచారని వెల్లడించారు. మార్పు కోసమే ఆయనకు ఓటేశామని అన్నారు. గత సెప్టెంబరులో విజయ్ కరూర్ సభలో తొక్కిసలాట జరిగింది. మరి ప్రస్తుతం విజయ్ సీఎం కావడంతో కరూర్ ఘటన బాధితులను ఆదుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. -
ఎట్టకేలకు ఓటీటీలోకి 'ధురంధర్ 2'.. అధికారిక ప్రకటన
'ధురంధర్ 2' సినిమా మన దేశంలో ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందనే విషయంపై సస్పెన్స్ వీడింది. ఎందుకంటే నేటి(మే 15) నుంచి విదేశాల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. దీంతో పాటే మన దగ్గర కూడా అందుబాటులోకి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని హాట్‌స్టార్ తేల్చి చెప్పింది. అధికారిక స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా)గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైన తొలి పార్ట్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఈ ఏడాది మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన సీక్వెల్‌ని తాజాగా విదేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. మన దేశంలో మాత్రం వచ్చే నెల 4వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న దృష్ట్యా ఓటీటీ రిలీజ్ చేస్తే రెండింటి వ్యూస్‌పై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. అందుకే ఈ లీగ్ పూర్తయిన తర్వాత స్ట్రీమింగ్ చేయాలని ఫిక్సయ్యారు. అలా జూన్ 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారు. 5వ తేదీ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.'ధురంధర్ 2' విషయానికొస్తే.. ఆపరేషన్ 'ధురంధర్'లో భాగంగా జస్కిరాత్ సింగ్(రణ్వీర్ సింగ్) తన పేరుని హమ్జా అలీ మజారీగా మార్చుకుని పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడి లయరీ నగరంలో బలోచ్ నాయకుడు రెహమాన్ డెకాయిట్(అక్షయ్ ఖన్నా)ని చంపేస్తాడు. ఇదే టైంలో మరో గ్యాంగ్ నాయకుడు అర్షద్ పప్పు (అశ్విన్ ధర్) తనని తాను లయరీకి కింగ్‌గా ప్రకటించుకుంటాడు. అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలిసిన ఉజెయిర్ బలోచ్ (డానిష్) అతడిపై ఎలా పగతీర్చుకున్నాడు? ఈ క్రమంలో హమ్జా ఎలాంటి ప్లాన్స్ వేశాడు? ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్) నుంచి హమ్జాకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? హమ్జా భారత గూఢచారి అని మిగతా వాళ్లకు తెలిసిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే)Aandhi banke jo aa raha hai usse DHURANDHAR kehte hain.🔥Watch Dhurandhar The Revenge, Raw & Undekha. Grand Digital Premiere on June 4th at 7 PM, starts streaming from June 5th only on JioHotstar.#Dhurandhar2OnJioHotstar #DhurandharTheRevenge #RawAndUndekha@RanveerOfficial… pic.twitter.com/w73rLgM06F— JioHotstar (@JioHotstar) May 15, 2026 -
వివాదంలో రాజీవ్ కనకాల.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల ఊహించని విధంగా వివాదంలో చిక్కుకున్నారు. ఓ స్కూల్ ఫంక్షన్‌కు హాజరైన ఆయన పదిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెమొంటోలు, షీల్డ్స్ అందజేశారు. అయితే ఈ ఈవెంట్‌కు నవ తెలంగాణ విద్యార్థి విభాగం సభ్యులు వచ్చిన ఒక్కసారిగా నిరసనకు దిగారు. అసలు ఈ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా అని నిలదీశారు. అక్కడ స్కూల్ మేనేజ్మెంట్, విద్యార్థి సంఘం మధ్య గట్టిగానే వాగ్వాదం జరిగింది.అదే సమయంలో పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చిన రాజీవ్ కనకాలను సైతం ప్రశ్నించారు. నుమతులు లేని అలాంటి స్కూల్ ఫంక్షన్‌కి ఎలా అటెండ్ అవుతారని అడిగారు. అయితే ఈ విషయాల గురించి తనకు ఏమీ తెలియదని రాజీవ్ కనకాల అన్నారు. మంచి కార్యక్రమం అని పిలిస్తే వచ్చానని తెలిపారు. దయచేసి ఈ ఈవెంట్‌కు సంబంధించిన నా ఫోటోలు, వీడియోలు ఎవరూ కూడా పబ్లిసిటీ వినియోగించవద్దని రాజీవ్ కనకాల విజ్ఞప్తి చేశారు. నన్ను అలర్ట్ చేసినందుకు నవ తెలంగాణ విద్యార్థి విభాగానికిని నా ధన్యవాదాలు అంటూ వీడియో రిలీజ్ చేశారు. రాజీవ్ కనకాల ఓ స్కూల్ వివాదంలో ఇరుక్కున్నారు10th lo highest marks vachina students ki Rajeev Kanakala garu shields andincharu. Sanmana karyakramam jarugutunna samayam lo Nav Telangana Vidyarthi Shakti (NTVS) organization members okkasariga protest chesaru. Aa school ki… pic.twitter.com/45jhHyXQZK— Milagro Movies (@MilagroMovies) May 15, 2026 -
పర్సంటేజీ సమస్య.. ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం
టాలీవుడ్లో ప్రస్తుతం నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు అన్నట్లు వివాదం నడుస్తోంది. మల్టీప్లెక్స్‌ల్లో ఇస్తున్నట్లే సింగిల్ స్కీన్లలోనూ పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. నిర్మాతలు మాత్రం దీనికి పూర్తిగా అంగీకరించట్లేదు. వ్యవహారం శ్రుతి మించుతుండటంతో ఇందులో ఫిలిం ఛాంబర్ కల్పించుకుంది. హైదరాబాద్‌లో శుక్రవారం ఇరువర్గాలతో కలిసి మీటింగ్ పెట్టింది. ఇందులోనే కీలక నిర్ణయం తీసుకుంది.(ఇదీ చదవండి: నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్.. హీరోలు, ప్రేక్షకులు ఎవరివైపు?)పర్సంటేజ్ సమస్య పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. కమిటీలో 18 మంది సభ్యులు. 1-2 నెలల్లో సమస్య పరిష్కారమవుతుంది. ఈ టైంలో సినిమా రిలీజులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తలో ఆరుగురు కమిటీలో ఉంటారని నిర్మాత సి.కళ్యాణ్ చెప్పుకొచ్చారు.ఫిలిం ఛాంబర్లో ఎగ్జిబిటర్స్ యాక్టీవ్ గిల్డ్ నిర్మాతలు సమావేశం వాడివేడిగా సాగుతోంది. చర్చలు జరుగుతున్నప్పుడే ఏషియన్ సునీల్ నారంగ్ అరుస్తూ బయటికి వచ్చేశారు. దీంతో ఈయనని బతిమాలిన చదలవాడ శ్రీనివాస్, దిల్ రాజు, నాగవంశీ, అనుపమ్ రెడ్డి తిరిగి మీటింగ్‌కు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఇరు వర్గాలు వేర్వేరుగా మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే: టాలీవుడ్ విలన్) -
మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే
మహేశ్ బాబు ఇప్పటివరకు తెలుగులో మాత్రమే సినిమాలు చేశాడు. హిందీలో ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆసక్తి చూపించలేదు. ఈ విషయం గురించి గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇప్పుడా టాపిక్ మరోసారి హాట్ టాపిక్ అయింది. దానికి కారణం ఒకప్పుడు టాలీవుడ్ విలన్ రోల్స్ చేసిన రాహుల్ దేవ్. లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో మహేశ్ గురించి ఇతడు చేసిన కామెంట్స్ షాకింగ్‌గా అనిపించాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. తెలుగులోనూ)మహేశ్ బాబు గతంలో ఓసారి మాట్లాడుతూ.. 'బాలీవుడ్ వాళ్లు నన్ను భరించలేరు' అన్నారు కదా దానిపై మీ స్పందన ఏంటి? అని యాంకర్ అడగ్గా.. రాహుల్ దేవ్ నవ్వుతూనే ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. తెలుగులో దర్శకుడు త్రివిక్రమ్ చాలా సెన్సిబుల్ డైరెక్టర్. ఆయన సినిమాల్లో కమర్షియల్ హంగులతో పాటు ఓ అర్థం ఉంటుంది. త్రివిక్రమ్‌తో మహేశ్ చేశారు. ఇలాంటి మూవీస్ హిందీలో ఉండవు. అక్కడంతా రామ్ గోపాల్ వర్మ, అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్లు తీసే టైపు సినిమాలు లేదంటే హాలీవుడ్ రీమేక్సే ఉంటున్నాయి. నిజం చెప్పాలంటే ఆయనకు(మహేశ్) భాష రాదు అదే అసలు కారణం' అని రాహుల్ దేవ్ చెప్పుకొచ్చాడు. మరి ఈ నటుడు ఏ ఉద్దేశంతో మహేశ్ గురించి ఇలాంటి కామెంట్స్ చేశాడనేది అర్థం కావట్లేదు.మహేశ్ గతంలో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా రిపోర్టర్ ప్రశ్నకు బదులిస్తూ.. 'నాకు హిందీలో చాలా ఆఫర్లు వచ్చాయి. గర్వంగా అనిపించొచ్చు కానీ వాళ్లు నన్ను భరించలేరు. నా టైమ్ వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. తెలుగు సినిమాల్లో నాకు దొరుకుతున్న స్టార్డమ్, అభిమానం చూసిన తర్వాత మరో పరిశ్రమకు ఎప్పుడూ వెళ్లాలనుకోలేదు. ఇక్కడే మూవీస్ చేస్తానని, అది పెద్ద హిట్ అవుతాయని నమ్మాను. ఇప్పుడు నా నమ్మకం నిజమవుతోంది' అని అన్నారు. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న 'వారణాసి' మూవీ.. హిందీలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.(ఇదీ చదవండి: హీరో రామ్.. ఈ సాహసం ఎందుకు చేస్తున్నట్లు?) -
హీరో రామ్.. ఈ సాహసం ఎందుకు చేస్తున్నట్లు?
తెలుగులో ప్రస్తుతమున్న స్టార్ హీరోలు నటించడం తప్పితే మిగతా విషయాలపై పెద్దగా ఆసక్తి చూపించిన దాఖలాలు లేవు. కానీ నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ లాంటి వాళ్లు మాత్రం నటిస్తూనే రైటింగ్‌లో ప్రతిభ చూపించారు. విశ్వక్ సేన్ లాంటి ఒకరిద్దరు డైరెక్షన్ కూడా చేశారు. ఇప్పుడీ లిస్టులోకి మరో హీరో చేరాడు. అతడే రామ్ పోతినేని. ఇప్పటివరకు హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. తన 23వ మూవీ కోసం దర్శకుడిగా మారిపోయాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. తెలుగులోనూ)పుట్టినరోజు సందర్భంగా రామ్.. డైరెక్టర్‌గా మారిన విషయాన్ని బయటపెట్టాడు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో వీర పాత్రకు సంబంధించిన బ్యాక్ సైడ్ లుక్‌ని పంచుకున్నాడు. ఈ సినిమాలో హీరో కమ్ దర్శకుడిగా రామ్ వ్యవహరిస్తుండగా.. నిర్మాతగా రామ్ సోదరుడు కృష్ణ ఉన్నారు. అంటే నిర్మాణంలోనూ రామ్ హ్యాండ్ కచ్చితంగా ఉంటుంది.రీసెంట్ టైంలో 'ఇస్మార్ట్ శంకర్' తప్పితే రామ్‌కి మరో హిట్ అనేది లేదు. ఇది సక్సెస్ అయిందని వరసగా మాస్ మూవీస్ చేసుకుంటూ వెళ్లాడు. వీటిలో ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. దీంతో రూటు మార్చేసి 'ఆంధ్రా కింగ్ తాలుకా' అని క్లాస్ టచ్ మూవీ చేశాడు. టాక్ బాగానే వచ్చింది గానీ కలెక్షన్స్ రాక ఇది కూడా ఫ్లాప్ అయింది. ఈ మూవీలో ఓ పాట రాసిన రామ్.. ఇప్పుడు ఏకంగా దర్శకుడిగా మారడం ఆశ్చర్యం కలిగించింది.హీరో-దర్శకుడిగా ఈ బరువు బాధ్యతల్ని ఎలా హ్యాండిల్ చేస్తాడనేది చూడాలి. దానికి తోడు ఈ ఏడాది డిసెంబరులోనే థియేటర్లలో రిలీజ్ అవుతుందని కూడా ప్రకటించాడు. అంటే ఆరు నెలల్లోనే మూవీ పూర్తి చేసి రిలీజ్ చేస్తాడనమాట. ప్రయత్నం మంచిదే అయినా ఎందుకీ సాహసం చేస్తున్నాడనేది ఇక్కడ ప్రశ్న.(ఇదీ చదవండి: నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్.. హీరోలు, ప్రేక్షకులు ఎవరివైపు?)An exciting journey begins with all your love & blessings. 🖤Introducing "𝙑𝙀𝙀𝙍𝘼" in #RAPO23 🔥-the story of a Lone Wolf. 🐺Genre: Psychological Action Thriller.Written & Directed by #𝙍𝘼𝙋𝙊Produced by Krishna PothineniA @RAPO_Cinematics Production.December 2026… pic.twitter.com/m9dkC0XMb7— RAm POthineni (@ramsayz) May 15, 2026 -
‘దూరదర్శని’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఈ వారం కూడా టాలీవుడ్లో చిన్న సినిమాల సందడే ఉంది. ఈ రోజు మూడు, నాలుగు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి ‘దూరదర్శని’. . కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. సువిక్షిత్, గీతికా రతన్ హీరోహీరోయిన్లుగా నటించారు. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. హరి(సువిక్షిత్ బొజ్జ) వెనుకబడిన కులానికి చెందిన యువకుడు. అదే గ్రామానికి చెందిన గొప్పింటి అమ్మాయి వాణి(గీతికా రతన్) అంటే అతని చాలా ఇష్టం. వాణి కూడా హరిని ప్రేమిస్తుంది. వీరిద్దరి ప్రేమకి పేకబాబు(భాస్కర్) ఇల్లు అడ్డా అవుతుంది. ప్రతి రోజ రాత్రి టీవీ చూసేందుకు పేకబాబు ఇంటికి వెళ్లేవారు. హరి,వాణిల మధ్య ప్రేమాయణం కొనసాగుతుందనే విషయం పేకబాబుకి తెలుస్తుంది. వాణిపై మనసుపడ్డ పేకబాబు..ఎలాగైన ఆమె నుంచి హరిని దూరం చేయాలనుకుంటాడు. అందుకోసం వాణి అన్నయ్య పరశురామ్(విజయ్ కృష్ణారెడ్డి)ని పావుగా వాడుతాడు. అతనికి లేనిపోనివి చెప్పి.. ఊర్లో కులాల చిచ్చు పెడతాడు. కొన్నాళ్ల తర్వాత వాణి, హరి ప్రేమించుకుంటున్నారనే విషయం పరశురామ్‌కి తెలుస్తుంది. తన చెల్లి తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిదనే విషయం తెలిసిన తర్వాత పరశురామ్ ఏం చేశాడు? పేక రాజు చేసిన కుట్రకి ఊర్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రేమను దక్కించుకునేందుకు హరి, వాణిలు తీసుకున్న నిర్ణయం ఏంటి? చివరకు వీరి ప్రేమ కథ విషాదంగా ముగిసిందా లేదా సుఖాంతం అయిందా ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ప్రస్తుతం టాలీవుడ్లో వింటేజ్ లవ్‌స్టోరీ ట్రెండ్ నడుస్తోంది. 80-90ల నాటి ప్రేమ కథలను తెరపై చూపిస్తూ.. ప్రేక్షకులకు అప్పటి రోజులను, తీపి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేస్తున్నారు. దూరదర్శని చిత్రం కూడా ఆ కోవకు చెందిన కథే. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తదేమి కాదు. తక్కువ కులానికి చెందిన హీరో, పెద్ద కులానికి చెందిన హీరోయిన్ని ప్రేమించడం.. హీరోయిన్ ఫ్యామిలీ వీరి ప్రేమకు అడ్డుపడడం.. ఇద్దరి మధ్య సంఘర్షణ..చివరకు హీరోహీరోయిన్లు ఒక్కటవ్వడం..ఇలాంటి నేపథ్యంతో నైంటీస్ నుంచి ఇప్పటి వరకు సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ కథను ఎంత సహజంగా చూపిస్తే.. అంత గొప్పగా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రేక్షకుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అయితేనే కథతో ప్రయాణం చేస్తాడు. ఈ విషయంలో దర్శకుడు కొంతవరకు సఫలం అయ్యాడు. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయకుండా..చాలా నిజాయితీగా ఓ మంచి ప్రేమ కథను చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే కథ రొటీన్‌గా ఉండడం.. కథనం నెమ్మదిగా సాగడం మైనస్. ఇటీవల వచ్చిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి. హీరో హీరోయిన్లు టీవీ చూసేందుకు ఒకరి ఇంటికి వెళ్లడం.. ప్రేమకి కులం అడ్డురావడం..ఇవన్నీ ఆ చిత్రాన్ని గుర్తు చేస్తాయి.ఫస్టాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల ప్రేమ కథ చుట్టే సాగుతుంది. ఇద్దరు కలిసేందుకు చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో హీరో ఫ్రెండ్స్ చేసే అల్లరి నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ వరకు కథనం ఎంటర్టైనింగానే సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త సీరియస్‌గా సాగుతుంది. వీరిద్దరి ప్రేమ విషయం పరశురాంకి తెలియడం.. హీరోపై దాడి చేయడం.. ఇవన్నీ ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఇక చివరిలో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకోవడమే కాదు ఎమోషనల్‌కి గురి చేస్తుంది. కథ, కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే.. ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. సినిమాలో నటించిన వారంతా పెద్ద అనుభవం లేనివాళ్లే. అయినా కూడా బాగానే నటించారు. హరి పాత్రకి సువిక్షిత్ న్యాయం చేశాడు. ఆయన హవభావాలు అచ్చం అప్పటి పల్లెటూరి యువకుడిలాగానే ఉన్నాయి. పల్లెటూరి అమ్మాయి వాణిగా గీతికా రతన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పేకబాబు పాత్రలో భాస్కర్ ఒదిగిపోయాడు. ఇక హీరోయిన్ అన్నయ్యగా విజయ్ కృష్ణారెడ్డి చాలా బాగా నటించాడు. హీరో ఫ్రెండ్స్ గా తేజ విహాన్, బాలరాజు పులుసు, పాండు నవ్వించారు. బాలరాజు పాత్ర నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. -
నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్.. హీరోలు, ప్రేక్షకులు ఎవరివైపు?
ప్రస్తుతం టాలీవుడ్లో ఏం జరుగుతుందో అంతా చూస్తూనే ఉన్నారు. థియేటర్లు రన్ చేస్తున్న ఎగ్జిబిటర్లు.. సింగిల్ స్క్రీన్లలో రెంట్ పద్ధతికి బదులు పర్సంటేజీ ఇవ్వాలని పట్టుబడుతుండగా.. నిర్మాతలేమో ఇప్పటికిప్పుడు అంటే కష్టం, తర్వాత చూసుకుందాం అనే రీతిలో మాట్లాడుతున్నారు. అయితే సమస్య పరిష్కరించుకోవడం సంగతి పక్కనబెట్టి ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునేంత వరకు వచ్చారు. అసలు ఈ వ్యవహారంలో ప్రేక్షకులు ఎవరివైపు ఉన్నారు?(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా)నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మధ్య జరుగుతున్న వివాదం గురించి చాలామంది ప్రేక్షకులు సరిగా తెలియదు. సింపుల్‌గా దాని గురించి చెప్పుకోవాలంటే ఓ మూవీని తీసిన నిర్మాత.. దాన్ని ఓ థియేటర్లో ప్రదర్శించుకునేందుకు ఎగ్జిబిటర్ అనే వాడికి కొంత మొత్తం చెల్లిస్తాడు. అయితే సింగిల్ స్క్రీన్స్‌లో మూవీ వేసినందుకు అద్దె చెల్లిస్తుండగా.. మల్టీప్లెక్స్‌లో మాత్రం వచ్చిన డబ్బుల్లో పర్సంటేజీ చెల్లిస్తున్నాడు. అయితే ఇలా వేర్వేరుగా కాకుండా అందరికీ ఒకేలా పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు ఇప్పుడు అంటున్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం తొలుత ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టి తమ బాధలు చెప్పుకోగా తర్వాతి రోజు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున కొందరు నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి తమ వాదన వినిపించారు.ఇన్నాళ్లు వాళ్లవరకే పరిమితమైన సమస్యని ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కలిసి అందరి ముందు పెట్టారు. ఇక్కడివరకు బాగానే ఉంది గానీ నిర్మాత నాగవంశీ.. ఆసియన్ సునీల్‌ని ఉద్దేశిస్తూ మల్టీప్లెక్స్‌లు ఎక్కువగా ఉన్న ఈయనకు సింగిల్ స్క్రీన్ బాధలేం తెలుస్తాయని అన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చిన సునీల్.. నాగవంశీని ఉద్దేశిస్తూ విగ్ పెట్టుకుంటాడు అంటూ బాడీ షేమింగ్ చేసేలా మాట్లాడారు. అలా సమస్య కాస్త పక్కదారి పట్టి వేరే వైపు వెళ్లిపోయింది. మరోవైపు 'పెద్ది' రిలీజ్ టైంలో కావాలనే ఎగ్జిబిటర్ శిరీష్ ఇలా చేస్తున్నారని నిర్మాతలు ఆరోపణలు చేశారు. స్పందించిన శిరీష్.. తాము ఎప్పటినుంచో పర్సంటేజీ గురించి అడుగుతున్నామని 'పెద్ది'ని టార్గెట్ చేయట్లేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం.. తెలుగు ఫిలిం ఛాంబర్లో సురేశ్ బాబు ఆధ్వర్వంలో ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య చర్చలు జరగనున్నాయి. సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని నిర్మాత సి.కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో 'గొడవ'.. చేయిదాటిపోయిన పరిస్థితి)ఈ మొత్తం వ్యవహారంలో ప్రేక్షకులు ఎవరివైపు ఉన్నారా? అంటే ఎవరివైపు లేరు. ఎందుకంటే ప్రేక్షకులకు ఈ పర్సంటేజీ, రెంట్ లాంటి వాటి గురించి పెద్దగా ఆసక్తి లేదు. ఉండదు కూడా! ఓ మంచి సినిమా తీస్తే దాన్ని థియేటర్‌కి వెళ్లి చూడటం మాత్రమే ఆడియెన్స్‌కి తెలుసు. కానీ సరైన మూవీస్ తీయడం, టైంకి రిలీజ్ చేయడం మానేసి వాళ్లలో వాళ్లే గొడవపడి టాలీవుడ్ అంటేనే విరక్తి వచ్చేలా చేస్తున్నారు.అసలు థియేటర్లు నడిచేవే హీరోలు, ప్రేక్షకుల వల్ల. ఆ విషయాన్ని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మర్చిపోతున్నారేమో అని సందేహం కలుగుతోంది. ప్రస్తుతమున్న గొడవ పూర్తిగా సద్దుమణగాలంటే తెలుగు రాష్ట్రాల్లో కచ్చితమైన టికెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ లాంటి రిలీజ్ చేసి మభ్య పెట్టకుండా గ్రాస్, నెట్, షేర్ కలెక్షన్స్‌లో పారదర్శకత పాటించాలి. ఒకరిని ఒకరు నిందించుకోకుండా హీరోల రెమ్యునరేషన్, ఓటీటీ బిజినెస్ లాంటి వాటిపై నిర్మాతలు దృష్టి పెట్టాలి. పెద్ద మూవీ అని టికెట్ రేట్లు ఎడాపెడా పెంచేయకుండా థియేటర్లు శుభ్రంగా ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేయాలి. ఏళ్లకు ఏళ్లు సాగదీయకుండా స్టార్ హీరోలు ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేసేలా ఒప్పించాలి. నటీనటులు, మూవీ బడ్జెట్ నియంత్రణలో ఉంచాలి. బడ్జెట్ అనవసరంగా పెంచేసి ఓటీటీల్లో త్వరగా రిలీజ్ చేయడం లాంటివి ఆపాలి. మరీ ముఖ్యంగా డబ్బు పెట్టే ప్రేక్షకుడిపై భారం పడకుండా చూసుకోవాలి. అప్పుడే థియేటర్లు బతుకుతాయి. తద్వారా ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కూడా బతుకుతారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. అది మాత్రం సస్పెన్స్) -
ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. అది మాత్రం సస్పెన్స్
పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమా 'ధురంధర్ 2' ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది కానీ ఇక్కడే ఓ ట్విస్ట్. ఇంకా ఓ విషయంలో సస్పెన్స్ మాత్రం పోవట్లేదు. ఆడియెన్స్ ఏమో ఎదురుచూస్తున్నారు. కానీ ఓటీటీ సంస్థ మాత్రం షాక్ ఇచ్చింది. ఇంతకీ 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ సంగతేంటి? తెలుగు వెర్షన్ ఎందులోకి వచ్చింది?గతేడాది డిసెంబరులో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించిన మూవీ 'ధురంధర్'. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.1300 కోట్ల మేర వసూళ్లు సాధించింది. మూడు నెలలు తిరిగేసరికల్లా అంటే ఈ ఏడాది మార్చి 19న రెండో భాగాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఈసారి తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. సీక్వెల్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.(ఇదీ చదవండి: టాలీవుడ్లో 'గొడవ'.. చేయిదాటిపోయిన పరిస్థితి)అయితే తొలి భాగాన్ని థియేటర్లలోకి వచ్చిన రెండు నెలల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. సీక్వెల్ కూడా ఇదే ఓటీటీలో వస్తుందని అంతా అనుకున్నారు కానీ డిజిటల్ హక్కుల్ని మన దేశం వరకు హాట్‌స్టార్ దక్కించుకుంది. విదేశాల వరకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజాగా గురువారం సాయంత్రం నుంచి అమెరికా, న్యూజిలాండ్, మలేసియాతో పాటు ఇతర దేశాల్లో 'ధురంధర్ 2' స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. కానీ మన దగ్గర మాత్రం ఎప్పుడొస్తుందనే సస్పెన్స్ ఇంకా తీరలేదు. మరి ఇప్పుడు రిలీజ్ చేస్తారా? వచ్చే వారం స్ట్రీమింగ్ చేస్తారా అనేది చూడాలి?'ధురంధర్ 2' విషయానికొస్తే.. ఆపరేషన్ 'ధురంధర్'లో భాగంగా జస్కిరాత్ సింగ్(రణ్వీర్ సింగ్) తన పేరుని హమ్జా అలీ మజారీగా మార్చుకుని పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడి లయరీ నగరంలో బలోచ్ నాయకుడు రెహమాన్ డెకాయిట్(అక్షయ్ ఖన్నా)ని చంపేస్తాడు. ఇదే టైంలో మరో గ్యాంగ్ నాయకుడు అర్షద్ పప్పు (అశ్విన్ ధర్) తనని తాను లయరీకి కింగ్‌గా ప్రకటించుకుంటాడు. అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలిసిన ఉజెయిర్ బలోచ్ (డానిష్) అతడిపై ఎలా పగతీర్చుకున్నాడు? ఈ క్రమంలో హమ్జా ఎలాంటి ప్లాన్స్ వేశాడు? ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్) నుంచి హమ్జాకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? హమ్జా భారత గూఢచారి అని మిగతా వాళ్లకు తెలిసిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా) -
టాలీవుడ్లో 'గొడవ'.. చేయిదాటిపోయిన పరిస్థితి
థియేటర్లలో సినిమాలు ప్రదర్శించాలంటే పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు, దానికి టైమ్ పడుతుందని నిర్మాతలు.. అలా టాలీవుడ్లో మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ఫిలిం ఛాంబర్లో నేడు.. ఎగ్జిబిటర్స్, నిర్మాతలతో చర్చలు జరగనున్నాయి. ఛాంబర్ అధ్యకుడు, నిర్మాత సురేశ్ బాబు ఆధ్వర్యంలో ఇరుపక్షాల సమస్యలని చర్చించబోతున్నారు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో పర్సంటేజీ వివాదం.. పెద్ది మూవీకే ప్లస్ కానుందా?)ఈ భేటీలో ప్రధానంగా పర్సంటేజీ, రెంటల్, ఓటీటీ విండో గురించి చర్చలు జరగనున్నాయి. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి, ఏపీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి, గిల్డ్ నిర్మాతల నుంచి ముగ్గురు సభ్యులు హాజరు కానున్నారు. మొత్తంగా 10 మంది సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈరో జు జరిగే చర్చలలో ఎగ్జిబిటర్స్, నిర్మాతల మధ్య వివాదానికి పరిష్కారం దొరుకుతుంది నిర్మాత సీ కళ్యాణ్ చెబుతున్నారు. ఇరువర్గాలు వ్యక్తిగత విమర్శలు దాకా వెళ్లడంతో పరిస్థితి చేయి దాటకుండా ఫిలిం ఛాంబర్ చర్చలకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా) -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
తెలుగులో చాలామంది హీరోలున్నారు. అందులో నాగశౌర్య. సహాయ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి హీరోగా పలు సినిమాలు చేసిన ఇతడు.. 'ఛలో' లాంటి మూవీస్ చేశాడు. అయితే గత కొన్నేళ్లుగా ఇతడికి సరైన హిట్ అనేది లేకుండా పోయింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఓ సినిమా చేశారు. అదిప్పుడు ఎలాంటి చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా)ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, జో అచ్యుతానంద, ఛలో, ఓ బేబీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న నాగశౌర్య.. 2023లో 'రంగబలి' చేశాడు. దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు గానీ ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో అప్పటి నుంచి మరో ప్రాజెక్ట్ చేయలేదు. ఈ మూడేళ్లలో 'బ్యాడ్ బాయ్ కార్తీక్' చిత్రం చేయగా గత నెల 17న థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆటకే తేలిపోయింది. అసలు ఇదొచ్చిన సంగతి కూడా ఎవరికీ తెలియనంతగా మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది.'బ్యాడ్ బాయ్ కార్తీక్' విషయానికొస్తే.. కార్తీక్(నాగశౌర్య) వైజాగ్‌లో ఉంటాడు. అక్క కస్తూరి(శ్రీదేవి విజయ్ కుమార్) అంటే ప్రాణం. ఆమె ఓ లాయర్. రాయలసీమలోని కదిరిలో భూకబ్జాలు చేసే గోవిందప్పు(మైమ్ గోపీ), వరదారెడ్డి (సముద్రఖని)లపై న్యాయపోరాటం చేస్తుంటుంది. దీంతో ఈమెపై దాడి జరుగుతుంది. ఆ విషయం తెలిసి వైజాగ్ నుంచి రాయలసీమకు కార్తీక్ వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది? తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకునే అక్క.. అతడిపైనే ఎందుకు కోప్పడింది? ఒకప్పుడు సఖ్యతగా ఉన్న గోవిందప్ప, వరదారెడ్డి మధ్య ఎందుకు వైరం ఏర్పడింది? గోవిందప్పను చంపింది ఎవరు? వరదారెడ్డిని చంపింది ఎవరు? మధ్యలో హీరో ప్రేమకథ ఏంటనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
తిమ్మరాజుపల్లి టీవీ సంతృప్తినిచ్చింది: కిరణ్ అబ్బవరం
‘‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఒక మంచి సినిమా అనే ముద్ర కుటుంబ ప్రేక్షకుల్లో ఉంది. నిర్మాతగా మంచి చిత్రం తీశాననే సంతృప్తిని నాకు మిగిల్చింది. నేటి నుంచి మా సినిమాని ‘ఆహా’లో చూస్తారని ఆశిస్తున్నాను’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. సాయి తేజ్ హీరోగా, వేద జలంధర్ హీరోయిన్గా వి. మునిరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సుమైర స్టూడియోస్‌తో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మించారు.తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదలైంది. ఈ మూవీ నేటి నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. గురువారం నిర్వహించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ సంబరాలు’ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ–‘‘నేను హీరోగా చేస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ షూటింగ్ పూర్తయింది. ‘గువ్వల చెరువు ఘాట్’ షూటింగ్ చివరి దశలో ఉంది’’ అన్నారు. ‘‘థియేటర్స్‌లో మా సినిమాను ఆదరించారు. ఓటీటీలో కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని వి. మునిరాజు పేర్కొన్నారు. -
నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి: ప్రియదర్శి
‘‘దూరదర్శని’ సినిమా ట్రైలర్ చూడగానే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఆ రోజుల్లో అందరికీ ప్రపంచాన్ని పరిచయం చేసింది దూరదర్శని. నేను కూడా చిన్నప్ప్పుడు దూరదర్శని చానల్లో సినిమాలు చూసి, స్ఫూర్తి పొంది నటుడిగా మారాను. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల హృదయాలను హత్తుకోవడంతో పాటు మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో ప్రియదర్శి చెప్పారు. సువీక్షిత్, గీతిక జంటగా కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహించిన చిత్రం ‘దూరదర్శిని’. వారాహ మూవీ మేకర్స్‌పై జయశంకర్ రెడ్డి .ఎం, పాటిమీది సంతోష్ నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ప్రియదర్శి, ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రదర్శకుడు సాయి కంపాటి అతిథులుగా హాజరయ్యారు. -
దేశవ్యాప్తంగా రయ్ రయ్‌మంటూ ‘పెద్ది’ ప్రచారం!
రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ ‘పెద్ది’. ఈ సినిమాకు సంబంధించిన ప్రచారం రయ్ రయ్ మంటూ మొదలుకానుంది. ఇప్పటివరకు నిశ్శబ్దంగా సాగిన ప్రమోషన్లు మే 18 నుంచి వేగం అందుకోనున్నాయి. జూన్ 2 వరకు దశలవారీగా భారీ ఈవెంట్లు ప్లాన్ చేసినట్లు యూనిట్ ప్రకటించింది. ముందుగా మే 18న ముంబయిలో ట్రైలర్ లాంచ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి చరణ్ హాజరవుతాడు. ఆ తర్వాత మే 22న హైదరాబాద్ ఉప్పల్‌లో మరో భారీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ చేశారు. దీనికి కూడా చరణ్ హాజరవుతాడు. ఆ మరుసటి రోజు, అంటే మే 23న భోపాల్‌లో స్పెషల్ సాంగ్ రిలీజ్ జరగనుంది. మొదట భోపాల్‌లోనే ట్రైలర్ లాంచ్ చేయాలని అనుకున్నారు కానీ ప్లాన్ మార్చి అక్కడ పాట విడుదలకు నిర్ణయించారు. శృతిహాసన్, చరణ్‌పై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్‌ను భోపాల్‌లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ ఈవెంట్‌కు చరణ్ హాజరవ్వడం లేదట. శృతిహాసన్ మాత్రమే పాల్గొననుందని సమాచారం. ఇక తదుపరి ప్రచార కార్యక్రమాల విషయానికి వస్తే.. మే 24న బెంగళూరులో, మే 28న ఢిల్లీలో, మే 30న చెన్నైలో ఈవెంట్లు జరుగుతాయని సమాచారం. జూన్ 1న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఓ ప్రత్యేక కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారట. అలాగే జూన్ 2న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. జూన్ 3న ప్రీమియర్స్‌తో ‘పెద్ది’ సందడి థియేటర్లలో మొదలవనుంది. ప్రస్తుతానికి యూనిట్ అనుకుంటున్న ప్రమోషనల్ ప్లాన్ ఇదే. అయితే రాబోయే రోజుల్లో ఈ షెడ్యూల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇందులో చరణ్ ఎన్ని ఈవెంట్లకు హాజరవుతాడనే అంశంపై కూడా త్వరలోనే స్పష్టత రానుంది. మొత్తంగా, మే 18 నుంచి జూన్ 2 వరకు దేశవ్యాప్తంగా ‘పెద్ది’ ప్రచారం రయ్ రయ్‌మంటూ సాగనుంది. అభిమానుల్లో ఆసక్తి పెంచేలా యూనిట్ వ్యూహాత్మకంగా కార్యక్రమాలను అమలు చేస్తోంది. చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
స్మిత సరికొత్త సంగీత ప్రయాణం!
నిత్యం ఏదో ఒక కొత్త ప్రయోగంతో జనంలోకి వచ్చి... సరికొత్తగా వార్తల్లో నిలిచే ప్రముఖ గాయని స్మిత. తాజాగా ఆమె మళ్ళీ అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. కాకపోతే, ఇప్పటి వరకు ర్యాప్, పాప్ లాంటి పాటలతో అలరించిన ఆమె ఈసారి అందుకు పూర్తి భిన్నమైన దోవ తొక్కుతున్నారు. మానవ జీవిత పరమార్థాన్ని వివరిస్తూ, మనసును మేలుకొలిపి, చిత్తాన్ని చైతన్యం చేసే తత్వాలను ఆలపిస్తూ, జనం ముందుకు రానున్నారు. తరతరాలుగా మనకు సంస్కృతీ వారసత్వంగా వస్తున్న తెలుగు, సంస్కృత సాహిత్యాల్లోని సుప్రసిద్ధమైన తాత్త్విక కృతులను ఎంచుకొని, వాటిని తనవైన కొత్త బాణీలలో, క్రొంగొత్త ఆర్కెస్ట్రయిజేషన్తో ‘తత్త్వమసి... (ఉపశీర్షిక - నాద టు నిర్వాణ)’ పేరిట నవ తరానికి అందించనున్నారు.మన చిన్నప్పుడు ఒక దశలో పెద్దవాళ్ళు పిల్లలందరికీ సుమతీ శతకం, వేమన శతకం చెప్పేవారు. మన సినిమాల్లో, రేడియోలో రకరకాల తత్త్వాలు వినిపించేవి. సినీ దర్శకుడు దేవా కట్టా అన్నట్టు, “దురదృష్టవశాత్తూ, మనం, మన సినిమాలు ఆ ఘన సంస్కృతీ వారసత్వాన్ని వదిలేసుకున్నాం. కనీసం బయటైనా అలాంటివి వినడానికీ, స్మిత చేస్తున్న ఓ మంచి ప్రయత్నమే ఇది”. మన భాష, సాహిత్యం, సంస్కృతుల ఖజానా నుంచి ఓ వంద ఆణిముత్యాలను ఏర్చికూర్చి, ఒక్కొక్కటిగా ‘తత్త్వమసి’లో స్మిత అందించనున్నారు. అలా “తరువాతి తరాలకు మన తాత్త్విక చింతనా వారసత్వాన్ని అందించనున్నారు”.శివరాత్రితో స్మిత అనుబంధం... ప్రకృతి ఆదేశం...‘ఓజీ... క్వీన్ ఆఫ్ పాప్’ అంటూ పాప్ పాటలతో గాయని స్మిత వివిధ ప్రాంతాలకు పర్యటించాలని ప్రయత్నాలు సాగుతున్న సమయంలో ఉన్నట్టుండి ఎదురైన ఈ ట్విస్టు ఏమిటని ఎవరికైనా అనిపిస్తుంది. అదే అడిగితే, స్మిత సైతం ఇదంతా చిత్రంగా జరిగిందని ఒప్పుకుంటున్నారు. “మ్యూజిక్ వీడియోలు చాలా ఏళ్ళ క్రితమే చేసేశాను. పేరు తెచ్చిన ఆ పాప్ పాటలను జనం ఎదుట వేదిక మీద పాడుతూ, ప్రదర్శన ఇవ్వాలంటే చాలా సన్నద్ధత కావాలి. అందుకే, ‘ఓజీ... క్వీన్ ఆఫ్ పాప్’ టూర్‌కి డేట్లు అడిగినప్పుడు... ‘దాన్ని పక్కాగా డిజైన్ చేసి, శారీరకంగా, మానసికంగా సన్నద్ధమయ్యేందుకు కొద్దిగా సమయం కావాల’ని అడిగాను. ఇంతలో ఈ తత్త్వాలను పాడాలనే ఆలోచన వచ్చింది” అని ఆమె వివరించారు.రెండు, మూడు నెలల క్రితం శివరాత్రి సందర్భంగా స్మిత వల్లూరుపల్లి, మరో సినీ నేపథ్య గాయని తిరుమల శ్రీనిధి కలసి ‘ఏమి సేతురా లింగా...’ అనే ప్రసిద్ధమైన శివతత్త్వాన్ని కొత్త రీతిలో ఆలపించారు. ఆ గీత రూపకల్పన ఒక రకంగా ఈ భారీ తత్త్వాల ప్రాజెక్ట్‌కు అనుకోని రీతిలో నాంది అయింది. “నిజం చెప్పాలంటే, మహాశివరాత్రికీ, నా జీవితానికీ ఏదో తెలియని బంధం ఉంది. కీలకమైనవెన్నో జరుగుతుంటాయి. ప్రతి ఏటా శివరాత్రి వచ్చిందంటే, ఏదో అతీత శక్తి అంతకు ముందు వరకు అసలు ప్లాన్ చేయనిది ఏదో నేను చేసేలా ముందుకు నెడుతుంది. అలా చేసిన ప్రతిదీ ఓ అద్భుతంగా ఆవిష్కృతమవుతూ ఉంటుంది. ఆత్మ చైతన్యం వైపు నడిపిస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా అలాంటిదే జరిగింది. ‘ఏమి సేతురా లింగా...’ తత్త్వం పాడగానే, మరిన్ని పాడాలంటూ ప్రకృతి రకరకాల మనుషులు, మార్గాల ద్వారా చెప్పినట్టయింది. అంతే... అలా ఈ 2026లో ఈ ఆధ్యాత్మిక గాన ప్రయాణంలో అడుగులు వేస్తున్నాను” అని స్మిత వివరించారు.ఇంతకీ, ప్రకృతి ఆదేశం ఎవరెవరి నుంచి, ఎలా వచ్చిందంటారా? “శివరాత్రికి చేసిన ‘ఏమి సేతురా లింగా...’ తత్త్వం ఫైనల్ అవుట్ పుట్ మా అమ్మ (జోగులాంబ), మిత్రుడు దేవా కట్టా వింటున్నారు. ఆ సమయంలో... ‘నువ్వు ఒకటి కాదు... ఇలాంటి తత్త్వాలు 100 రికార్డు చేయాలి’ అని దేవా కట్టా అన్నారు. అలాగే, ఆ తర్వాత... సిద్ధవైద్యం ‘చక్రసిద్ధ’తో అనారోగ్యాలను దూరం చేసే సింధుజ అమ్మ సైతం ‘ఈ తత్త్వాలు నువ్వు పాడాలి’ అని నాతో అన్నారు. అలా ఆ మాటలన్నీ నాకు ప్రకృతి ఆదేశంగా అనిపించాయి. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. నా దృష్టిలో ఇది చేస్తున్నది నేను కాదు. ఈ పని చేయడానికి ప్రకృతి నన్ను ఓ సాధనంగా ఎంచుకుంది. అంతే!” అని స్మిత జరిగిన కథ చెప్పుకొచ్చారు. అలా పాప్ పాటల ‘ఓజీ... క్వీన్ ఆఫ్ పాప్’ పర్యటన కాస్తా అనూహ్యంగా ఇప్పుడు ‘తత్త్వమసి’ అయింది.అటు ఆధునిక పాప్... ఇటు ఆధ్యాత్మిక చింతన...ఆధునిక పాప్ గీతాలు, ఆధ్యాత్మిక తాత్త్విక చింతన... ఈ రెండు భిన్న ధ్రువాలను స్మిత ఎలా సంబాళించుకుంటారు? “నిజమే. ‘ఓజీ... క్వీన్ ఆఫ్ పాప్’కీ, ‘తత్త్వమసి’కీ సంబంధమే లేదు. అది ఆలోచన నుంచి వస్త్రధారణ దాకా అంతా మెరుపులు, తళుకులతో సాగితే, ఇందులో ప్రశాంతత, ఆధ్యాత్మికత, చేనేత వస్త్రాలు చోటుచేసుకుంటాయి. తత్త్వాలు పాడినంత మాత్రాన నాలోని ఆ పాప్ పార్శ్వం చచ్చిపోలేదు, చచ్చిపోదు. గాయనిగా ఈ రెండు భిన్న కోణాలనూ చూపడం నాకిష్టం. ఈ రెండు విభిన్న ప్రపంచాల మధ్య నా సింగింగ్ జర్నీ సాగుతూనే ఉంటుంది” అని స్థిరచిత్తంతో చెప్పారు స్మిత.బలమైన సంకల్పం... భగవదేచ్ఛ...‘తత్త్వమసి’ లాంటి ప్రాజెక్టులు చేయడం అంత సులభమేమీ కాదు. కచ్చితంగా “ఉద్వేగం నిండిన ఓ పిచ్చి ప్రేమ లాంటిది ఏదో ఉండాలి. నాలో అది ఉంది. నన్ను ఎవరన్నా సవాలు చేశారంటే చాలు... దాన్ని నేను ఆషామాషీగా తీసుకోను. బలంగా బదులిస్తా. చిన్నప్పటి నుంచి నన్ను చూసినవారికి నాలోని ఆ లక్షణం, ఆ వ్యక్తిత్వం బాగా తెలుసు. అలాంటి ఛాలెంజ్ ఎదురైనప్పుడల్లా నాలోని ఏదో శక్తి బయటకు వచ్చి, ఆ సవాలును స్వీకరించి, దృఢంగా జవాబిస్తుంది. ప్రతిసారీ అదే జరుగుతుంటుంది. ఈసారీ అదే జరిగింది. అందుకే, ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడినా, ఏ ప్రస్తావన తెచ్చినా ఆవు కథలాగా నా మాట, పాట, ప్రస్తావన తత్త్వంలోకే వెళుతోంది. దీన్నిబట్టి ఇది ఎంతటి బలమైన సంకల్పమో, ఎంతగా భగవదేచ్ఛో అర్థం చేసుకోవచ్చు” అని స్మిత చెప్పుకొచ్చారు.స్మిత తల్లి జోగులాంబ సైతం, “మా అమ్మాయి ఎప్పుడూ ఏదో ఒక క్లిష్టమైన ప్రాజెక్ట్ చేపడుతుంది. ఎందుకింత కష్టం అనుకొనే లోగా, దానిలో పూర్తిగా లీనమై పని చేసేస్తుంది. నిజం చెప్పాలంటే, ఇది ఆమె చేస్తున్నది కాదు... ఏదో ఒక దైవిక శక్తి జోక్యంతో సాగుతున్న ప్రయాణం” అని అభిప్రాయపడ్డారు. “దేవుడు ఏదో ఒక నిర్ణీతమైన ప్రణాళికతోనే ప్రతి జీవినీ పంపిస్తాడు. బహుశా స్మితను ఈ వైవిధ్యభరిత ప్రయాణం కోసమే పంపి ఉంటాడు” అని దర్శకుడు నాగ్ అశ్విన్ వ్యాఖ్యానించారు.ప్రతి శనివారం ఓ తత్త్వం! వంద వారాల బృహత్ ప్రయత్నం!ఇప్పటికే 8 తత్త్వాల గానం, చిత్రీకరణ చేసిన స్మిత మే 16వ తేదీ శనివారం నుంచి వారానికో గీతంతో 100 వారాల పాటు ప్రజల్ని పలకరించనున్నారు. ఆదిశంకరుల ‘భజగోవిందం’ నుంచి అన్నమయ్య సంకీర్తన ‘బ్రహ్మమొక్కటే...’ దాకా అనేకం ఆ వరుసలో రానున్నాయి. ‘తెలిసితే మోక్షము తెలియకున్న బంధము...’, ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు...’ (అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తనలు), ‘ఎక్కడ మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది…’ (తాళ్ళపాక పెద తిరుమలాచార్య రచన), ‘మానస సంచరరే...’ (సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తన)... ఇలా అనేకం ఆ వరుసలో రానున్నాయి.అలాగే, అనుభూతి ప్రధానమైన ఈ తత్త్వాలను ప్రేక్షకుల ముందు స్మిత బృందం గానం చేస్తూ, దేశదేశాల్లో అనుభూతి ప్రధానమైన ప్రదర్శనలు ఇవ్వాలని ప్రణాళికా రచన చేస్తున్నారు. ‘ఇండియన్ రాగాస్’ సంస్థ, అలాగే గతంలో ఇళయరాజా – ఏ.ఆర్. రెహమాన్ – కీరవాణి లాంటి పలువురు సుప్రసిద్ధ సంగీత దర్శకుల లైవ్ షోలను నిర్వహించిన ‘దక్షిణ్ స్టోరీస్’ సంస్థ ఈ బృహత్తర ప్రయత్నంలో స్మితకు తోడుగా నిలిచి, ముందడుగు వేస్తున్నాయి. కొన్ని తరాలుగా సంప్రదాయ వస్త్రశ్రేణితో ముడిపడిన కంకటాల సంస్థ ఈ తత్త్వమసిలో తొలి సీజన్ అయిన ప్రథమ పాదాన్ని సమర్పిస్తోంది.“ఆదిశంకరుల ‘నిర్వాణ షట్కం’, అన్నమాచార్యుల కీర్తనలు, వేమన సాహిత్యం లాంటివన్నీ భవబంధనాలను తెంచుకొని విముక్తమై, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను చేరిన మహోన్నతుల అద్భుత రచనలు. శతాబ్దాలుగా తెలుగు వారి జీవితంలో భాగమైపోయిన కాలాతీతమైన రచనలు. వాటి లోతైన అర్థం అవగాహన చేసుకొని, అందరికీ తెలిసేలా పాడడం నాకు ఆత్మతృప్తినిస్తోంది” అని స్మిత చెప్పారు. ఈ ప్రాచీన తత్త్వాలకు వాద్యగోష్ఠి, బాణీలలో వాయులీన విద్వాంసులు సాయి, అలాగే సుజన్, సహా ప్రతిభావంతులైన సంగీత కళాకారులు పలువురు పాలుపంచుకుంటూ ఉండడం విశేషం. అలాగే, స్మిత తదితర సినీ, కళా ప్రముఖులెందరో ఉంటున్న భారీ కమ్యూనిటీ గృహ సముదాయంలోనే నివసిస్తున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి ఈ తత్త్వాలకు వీడియో చిత్రీకరణలో కీలక భూమిక వహించడం మరో విశేషం.అమ్మ, అమ్మమ్మల ప్రభావంతో...“మనం బయట వెతుకుతున్న సత్యం... ఇప్పటికే మనలోనే ఉందని గుర్తుచేసే శాశ్వత సందేశం ఈ తత్త్వమసి” అంటూ ఈ ప్రాజెక్టు విశేషాలను గాయని స్మిత ఇటీవల వెల్లడించారు. అత్యంత సన్నిహితులైన కొందరు సినీ ప్రముఖులతో పాటు ఆప్తులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యుల మధ్య ఆ ప్రారంభ పరిచయోత్సవం ఆత్మీయంగా జరిగింది. గాయకుడు హేమచంద్ర సంధానకర్తగా వ్యవహరించిన ఆ ఉత్సవంలో ప్రాజెక్ట్ పరిచయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్, స్మిత బృందం రూపొందించిన తత్త్వాల ఆడియో గ్లింప్స్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సత్యవాణి ఆవిష్కరించి, అభినందించారు. కొన్ని తత్త్వాల దృశ్యఖండికలను వెండితెరపై ప్రత్యేకంగా ప్రదర్శించారు.తత్త్వాలను పాడుతున్నప్పుడు వాటి వీడియో చిత్రీకరణతో పాటు ఆ పాటల భావార్థాలను పక్కనే ఇంగ్లీషు లిపిలో వేయడం విశేషం. తెలుగు తెలియనివారికి కూడా ఆ తత్త్వాల అంతరార్థం తెలిసేందుకు ఈ ఆలోచన ఉపకరిస్తుంది. “స్మిత ఆలోచన, ఆచరణ ఏదైనా మితంగా ఉండదు. అపరిమితంగా ఉంటుంది. బహుముఖ ప్రజ్ఞ గల అమ్మమ్మ తేళ్ళ లక్ష్మీకాంతమ్మ, అమ్మ జోగులాంబల ప్రభావం స్మితపై ఎంతో ఉంది. ‘నాదాధీనం జగత్సర్వం’ అన్నారు పెద్దలు. ఆ నాదాన్ని పట్టుకొని, ఈ తరానికి ఆమె అందిస్తున్న అద్భుతమైన ఆధ్యాతిక ఔషధ గుళిక ఈ ‘తత్త్వమసి’ ” అని సత్యవాణి అనర్గళంగా ఉపన్యసిస్తూ, గాయనిని ఆశీర్వదించారు. “స్మిత ఓ లేడీ అపరిచితుడు!”: హీరో నానిప్రముఖ హీరో నాని ఈ తత్త్వాల ఆలోచనను అమితంగా మెచ్చుకున్నారు. “నాకు రక్తసంబంధీకులైన అక్కాబావ ఒకరైతే, దేవుడిచ్చిన అక్కాబావలు స్మిత దంపతులు. నా దృష్టిలో చాలామంది కన్నా భిన్నమైన, అరుదైన వ్యక్తి స్మిత. ఏ మాత్రం అలసిపోకుండా, ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. బాస్కో సీజర్ కొరియోగ్రఫీలో పాప్ గీతాలు పాడుతూ, డ్యాన్సులు చేసే అదే వ్యక్తి... ఎంతో భక్తి, వేదాంతాలతో అంతే అద్భుతంగా ఇలా తత్త్వాలూ పాడుతుంది. (చమత్కార ధోరణిలో...) నిజం చెప్పాలంటే, శంకర్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన ‘అపరిచితుడు’ చిత్రంలో లాగా ఆమె ఓ లేడీ అపరిచితుడు. మా కమ్యూనిటీలోని స్మిత వాళ్ళ ‘బి-10’ ఫ్లాట్ తలుపు తడితే... (నవ్వుతూ...) ఆమె ఎప్పుడు శుద్ధ సంప్రదాయ రామాచారి ఫక్కీలో తలుపు తీస్తుందో, ఎప్పుడు ఆధునిక కాలపు రెమో ధోరణిలో వ్యవహరిస్తుందో తెలియదు. అందుకే, ఆమె ఓ సెపరేట్ పీస్” అని నాని తన మనోభిప్రాయాలు పంచుకున్నారు.నిజానికి, పాటలు, ఇలాంటి తత్త్వాలంటే చెవి కోసుకునే హీరో నానితో కూడా ఈ తత్త్వాలలో గొంతు కలిపేలా చేయాలని స్మిత భావించారట. కానీ, హీరో నాని మాత్రం “నాకు పాటలు వినడం చాలా ఇష్టం. అలాగని నన్ను పాడమంటే ఎలా” అంటూ సున్నితంగానే ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు. లేదంటే, హీరో నాని గొంతు కూడా ఈ వినూత్న ప్రాజెక్ట్‌లో వినిపించేంది. వైజాగ్ సహా వివిధ ప్రాంతాల్లో త్వరలో లైవ్ షోస్! “విజయవాడ రోజుల నుంచి గత 40 ఏళ్ళుగా స్మిత నాకు బాగా తెలుసు. అయిదేళ్ళ వయసుకే తాను ఏమవుతానో చెప్పేది. నటి, ప్లేబ్యాక్ సింగర్, పాప్ సింగర్... ఇలా ఏ వయసుకు ఆ వయసులో ఎప్పటికప్పుడు తాను అవదలుచుకున్నదల్లా చెప్పేది. చెప్పిందల్లా చేసి, చూపించింది. దటీజ్ స్మిత” అని నిర్మాత స్వప్నాదత్ తన చిరకాల అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. స్వప్నాదత్ సహా సినీ ప్రముఖులు నాని, ఐశ్వర్యా రాజేశ్, అల్లరి నరేశ్, సుబ్బరాజు, దర్శకులు నాగ్ అశ్విన్, దేవా కట్టా, స్మిత భర్త శశాంక్ కంచర్ల, తల్లి జోగులాంబ, తదితరులు కలసి ‘తత్త్వమసి’ ప్రాజెక్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. “ఎవరి మాటా వినని సీతయ్య లాగా... ఎవరి మాటా వినదు స్మితక్క. నచ్చినది చేసుకుంటూ ముందు వెళుతుంది” అంటూ ‘అల్లరి’ నరేశ్ చమత్కరించారు. “ఈ తత్త్వాల ప్రయోగం తర్వాత యోగి వేమన లాగా యోగిని స్మిత అంటారేమో” అని సుబ్బరాజు ఛలోక్తి విసిరారు. “ఈ తత్త్వాల వీడియో నాకు కళ్ళు తెరిపించే అనుభవం. పాటల గానంతో పాటు ఆ పాటల చిత్రీకరణ వేళ ఆధ్యాత్మికతను ప్రతిఫలిస్తూ స్మిత చేసుకున్న వస్త్రధారణ, అలంకరణ కూడా కళ్ళకు ఇంపుగా ఉన్నాయి” అని హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ జనం నవ్వుల మధ్య, స్మితకు ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. స్మితతో పుష్కరకాలం క్రితం పరిచయమై, ఇప్పుడు ఆ పరిచయమే ఓ ప్రపంచంగా మారిపోయిందంటున్న దర్శకుడు దేవా కట్టా మాటల్లో చెప్పాలంటే, “స్మిత ఓ ర్యాడికల్. ఎప్పుడూ ఒకే పని చేస్తూ కూర్చుండిపోకుండా, నూతనత్వం వైపు ప్రయాణించే వ్యక్తి. స్థిరపడిపోయిన భావాలపై తిరుగుబాటు చేసే రెబెలియన్. ఒకసారి నిర్ణయం తీసుకుంటే, ఎంత కష్టమైనా సరే అనుకున్నది చేసే తీరే రకం”. వరుసగా వంద వారాల్లో 100 తత్త్వాల ఆడియో, వీడియో విడుదల, వివిధ ప్రాంతాల్లో షోల నిర్వహణ లాంటి సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రయత్నానికి బహుశా అలాంటి వ్యక్తిత్వం, కృత నిశ్చయమే కావాలి. ఈ విషయంలో ‘తత్త్వమసి’ (అది నువ్వే) అంటున్న శ్రేయోభిలాషులతో పాటు తానూ అదే బలంగా నమ్ముతున్న స్మితకు ఆల్ ది బెస్ట్!పాతికేళ్ళ పైచిలుకు క్రితమే తెలుగు పాప్ పాటల రంగంలో ‘హాయ్ రబ్బా’ అంటూ తొలి ఆల్బమ్‌తోనే సంచలనం రేపిన చరిత ఆమెది. ఇప్పుడీ ‘తత్త్వమసి’ పేరిట హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాలతో పాటు, విదేశాల్లోనూ స్మిత చేయదలుచుకున్న ఈ అనుభూతి ప్రధాన తత్త్వాల ప్రత్యక్ష కచ్చేరీలు సైతం మరో ట్రెండ్ సృష్టిస్తాయేమో చూడాలి. “ఇది కేవలం ఆడియో ఆల్బమ్ కాదు... అలాగని వీడియోనే కాదు... సంప్రదాయ సంగీత కచ్చేరీ కాదు... ప్రవచనాల బోధ కాదు... ప్రజల మనసుకు దగ్గరై, వారిని అనుభూతికి లోను చేసే ప్రత్యక్ష ప్రదర్శన” అంటున్నారు స్మిత. ఆమెకు అన్ని విషయాల్లో అండగా నిలిచే ఆమె భర్త ఓ సామాన్య శ్రోతగా అన్నట్టు, “పరుగులు తీస్తున్న ఈ ఆధునిక, రణగొణధ్వనుల ప్రపంచంలో జీవితం లోతుల్ని మనకు తెలియజెప్పడం ఓ గొప్ప ప్రయత్నం. కచ్చితంగా అత్యుత్తమమైన మంచి ప్రయత్నం.” జీవిత పరమార్థం ఏమిటో, ఆ పరమ లక్ష్యాన్ని ఎలా చేరాలో గుర్తుచేసే గీతాలుగా ‘తత్త్వమసి’ ఆధునికులకు అవసరమైన ప్రయోగమే!- రెంటాల జయదేవ -
బిగ్‌బాస్ దివి అందాలు.. చిన్నపిల్లలా మెరిసిపోతున్న యషిక..!
టాలీవుడ్ బిగ్‌బాస్ దివి అందాలు..ఫారిన్ వెకేషన్లో నమ్రతా శిరోద్కర్.. కేన్స్ వీధుల్లో నిహారిక కొణిదెల సందడి..మంచుకొండల్లో హీరోయిన్ సాయిపల్లవి చిల్..చిన్నపిల్లలా మెరిసిపోతున్న యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
అయోధ్యలో భూమి కొన్న రణబీర్ కపూర్: ధర ఎంతంటే?
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అయోధ్యలోని హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL) వారి ప్రీమియం ప్లాటెడ్ డెవలప్మెంట్లో ఒక భూమిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆ రియల్ ఎస్టేట్ సంస్థ వెల్లడించింది.సుమారు 75 ఎకరాల విస్తీర్ణంలో.. కంపెనీ అభివృద్ధి చేస్తున్న ''ది సరయూ'' అనే ప్రీమియం ప్రాజెక్ట్‌లో రణబీర్ కపూర్ భూమిని కొనుగోలు చేశారు. సుమారు 2,134 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ స్థలం విలువ దాదాపు రూ.3.31 కోట్లు. ఇందులో క్లబ్ హౌస్, విలాసవంతమైన సౌకర్యాలతో పాటు.. ది లీల నిర్వహించే లగ్జరీ హోటల్ కూడా ఉంది.భూమిని కొనుగోలు చేసిన సందర్భంగా.. ''అయోధ్య నన్ను పిలిచినట్టుగా అనిపించింది, నేను ఆ పిలుపుకు స్పందించాను'' అని రణబీర్ కపూర్ పేర్కొన్నారు. కాగా.. ఈయన త్వరలో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ చిత్రం రామాయణంలో శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. అందువల్లనే అయోధ్యతో తనకు ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడిందని పేర్కొన్నారు.భారతదేశ చరిత్రలో.. సంస్కృతిలో అయోధ్యకు ఉన్న ప్రత్యేక స్థానం కారణంగా, ఈ భూమిని తన కుటుంబ వారసత్వంలో భాగంగా ఉంచాలని భావించినట్లు రణబీర్ కపూర్ చెప్పారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా -
ఎట్టకేలకు మౌనం వీడిన మౌనీ రాయ్.. నాలుగేళ్లకే గుడ్ బై
అనుకున్నదే జరిగింది. గత రెండు రోజులుగా వస్తోన్న రూమర్సే నిజమయ్యాయి. బాలీవుడ్ హీరోయిన్, నాగిని ఫేమ్ మౌనీ రాయ్ తన వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సమయంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని అభిమానులను కోరింది. విడాకుల విషయాన్ని మౌనీరాయ్‌తో పాటు ఆమె భర్త సూరజ్ నంబియార్ సంయుక్తంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పెళ్లైనా నాలుగేళ్లకే తమ బంధానికి ముగింపు పలికారు.తమ వ్యక్తిగత ప్రాధాన్యతలు మారిన నేపథ్యంలో, పరస్పర గౌరవంతో విడిపోయి వేర్వేరు మార్గాల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని.. స్నేహపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే విడిపోయినప్పటికీ భవిష్యత్తులో స్నేహితులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు.తమ వ్యక్తగత జీవితాలపై మీడియా అత్యుత్సాహంపై మౌనీ రాయ్ దంపతులు మండిపడ్డారు. తమ ప్రైవేట్ లైఫ్‌కు సంబంధించి వస్తున్న తప్పుడు వార్తలను, కల్పిత కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రిలేషన్ గురించి బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. ప్రస్తుతానికి ఈ కష్ట కాలంలో తమ నిర్ణయాన్ని అర్థం చేసుకుని తమ గోప్యతను గౌరవించాలని అభిమానులను విజ్ఞప్తి చేశారు.కాగా.. మౌని రాయ్, సూరజ్ నంబియార్ జనవరి 2022లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. గోవాలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇటీవలే ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో డివోర్స్ రూమర్స్ మొదలయ్యాయి. మౌని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో సూరజ్‌తో ఉన్న ఫోటోలు, పెళ్లి ఫోటోలు కనిపించడం లేదని అభిమానులు విడాకుల చర్చకు దారితీసింది.ఇక మౌనీ రాయ్ సినీ కెరీర్ విషయానికొస్తే 'కస్తూరి', 'దేవోం కే దేవ్...మహాదేవ్', 'నాగిన్' వంటి సీరియల్స్‌తో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా 'నాచ్ బలియే 6', 'ఝలక్ దిఖ్లా జా 7', 'జరా నాచ్కే దిఖా' వంటి రియాలిటీ షోలలో కూడా కనిపించింది. ఇటీవలే 'టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా'కు హోస్ట్‌గా వ్యవహరించింది. 'బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ – శివ', గోల్డ్, మేడ్ ఇన్ చైనా లాంటి చిత్రాల్లో కూడా నటించింది. View this post on Instagram A post shared by mon (@imouniroy) -
ఓటీటీకి దురంధర్-2.. ఫ్రైడే ఒక్క రోజే 16 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి షరామామూలే. ఈ వారంలో కోలీవుడ్ హీరో కరుప్పు ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు అరేయ్ ఆపండ్రా, హరుడు, శివం శైవం అనే తెలుగు మూవీస్ విడుదలవుతున్నాయి. కానీ వీటిపై పెద్దగా బజ్ లేదు. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.ఇక ఈ ఫ్రైడే ఓటీటీల విషయానికొస్తే దురంధర్-2పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ సినిమా మే 15 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్(ఓవర్సీస్ ఆడియన్స్‌కు మాత్రమే) కానుంది. దీంతో పాటు తిమ్మరాజుపల్లి టీవీ, తెరచార లాంటి టాలీవుడ్ సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా కర్తవ్య లాంటి డబ్బింగ్ సినిమా, పలు డబ్బింగ్ సిరీస్‌లు రెడీ అయిపోయాయి. ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ధురంధర్ 2 (హిందీ సినిమా) - మే 15 (ఓవర్సీస్ రిలీజ్)కర్తవ్య (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15బెర్లిన్ అండ్ ద లేడీ విత్ ఎర్మిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15ఇట్స్ నాట్ లైక్ దట్(హాలీవుడ్ సిరీస్)- మే 15ది వండర్ ఫూల్స్(కొరియన్ సిరీస్)- మే 15ది క్రాష్(డాక్యుమెంటరీ చిత్రం)- మే 15అమెజాన్ ప్రైమ్ఎగ్జామ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 15డ్రైవర్స్ ఈద్(హాలీవుడ్ సినిమా)- మే 15జియో హాట్‌స్టార్ ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 15ఆహా తిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు సినిమా) - మే 15సన్ నెక్ట్స్..తెరచాప(తెలుగు సినిమా)- మే 15జీ5..టిఘీ (మరాఠీ మూవీ) - మే 15మనోరమ మ్యాక్స్..కప్(మలయాళ సినిమా)- మే15లయన్స్ గేట్ ప్లే..కౌచర్(హాలీవుడ్ మూవీ)- మే 15హులు..రివల్స్(హాలీవుడ్ సినిమా)- మే 15ముబీ..ది మిస్టిరీయస్ గేజ్ ఆఫ్ ది ఫ్లైమింగో(హాలీవుడ్ సినిమా)- మే 15 -
కరుప్పు మూవీ వాయిదా.. ఆందోళనకు దిగిన ఫ్యాన్స్
తమ అభిమాన హీరో సినిమా కోసం ఫ్యాన్స్ అంతా సిద్ధమయ్యారు. ఈ రిలీజ్ అనగానే ఉదయం 9 గంటలకే థియేటర్లకు చేరుకున్నారు. తీరా అక్కడికెళ్లాక అభిమానులు షాక్ తిన్నారు. ఈ రోజు సినిమా విడుదల లేదని థియేటర్ యాజమాన్యాల చెతులేత్తేశాయి. దీంతో తమ హీరో మూవీని చూడాలని వచ్చిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇదంతా సూర్య హీరోగా వచ్చిన కరుప్పు మూవీ గురించే. ఇవాళ రిలీజ్ కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా వేయాల్సి వచ్చింది.దీంతో ఒక్కసారిగా సూర్య అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. మొదటి షోలు రద్దు కావడంతో పుదుచ్చేరిలోని సూర్య అభిమానులు థియేటర్ల బయట నిరసనలు చేపట్టారు. తమ అభిమాన నటుడి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన టీ-షర్టులు,, టపాసులు, డోలు వాయిద్యాలు, పూల దండలు, పాలతో సిద్ధమైన ఫ్యాన్స్ సినిమా హాళ్ల బయట వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన చేపట్టారు. నిర్మాత ఎస్.ఆర్. ప్రభు, నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటించారు. ఫైనాన్స్ సమస్యలతో ఈ సినిమాను అనూహ్యంగా వాయిదా వేయాల్సి వచ్చింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌కు చెల్లించాల్సిన రూ. 50 కోట్లకు పైగా బకాయిలు సమస్యల కారణంగా విడుదల కాలేదు. దీంతో ఈ చిత్రం మే 15న థియేటర్లలో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. కరుప్పు చిత్రంలో యోగి బాబు, జాఫర్ సాదిక్, మన్సూర్ అలీ ఖాన్, ఇంద్రన్స్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సాయి అభ్యంక్కర్ సంగీతం అందించారు. View this post on Instagram A post shared by MUBARAK🇮🇳 (@mubaraksvlog) -
టాలీవుడ్లో పర్సంటేజీ వివాదం.. పెద్ది మూవీకే ప్లస్ కానుందా?
ప్రస్తుతం టాలీవుడ్లో బిగ్ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. సరిగ్గా ఈ సమయంలోనే టాలీవుడ్లో సమస్య మొదలైంది. సింగిల్ స్క్రీన్స్ ఎగ్జిబిటర్స్ తమకు పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పెద్ది రిలీజ్‌కు ముందే టాలీవుడ్లో వివాదం ముదురుతోంది. అది కాస్తా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్‌కు మధ్య వార్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఇది టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారంది. పెద్ది సమయంలో ఇలాంటి వివాదం తలెత్తడంతో నిర్మాతలు రవిశంకర్, నాగవంశీ ఫైరయ్యారు.ఇక వివాదం పక్కనపెడితే.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పెద్ది కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ మూవీ రిలీజ్‌పై ప్రభావం పడనుందా? అనే చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితిలో ‘పెద్ది’ సినిమాకు స్క్రీన్ సమస్యలు రావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు రెంటల్ సిస్టమ్‌కు వ్యతిరేకంగా పెద్దికి థియేటర్లు ఇవ్వొద్దనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరోవైపు ఈ వివాదం కూడా టాలీవుడ్‌కు ప్లస్ అవుతుందా? అని కొందరు భావిస్తున్నారు. టాలీవుడ్ ఫ్యూచర్‌కే టర్నింగ్ పాయింట్ అవుతుందా? అన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మేకర్స్ అదే ఛాలెంజ్‌ను అవకాశంగా మార్చుకుంటే? పీవీఆర్ ఐనాక్స్, ప్రసాద్స్, అల్లు సినిమాస్ వంటి ఇండిపెండెంట్ థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేసి.. పరిమిత స్క్రీన్లతోనే భారీ కలెక్షన్లు కొడితే మాత్రం ఇండస్ట్రీ డైనమిక్స్ పూర్తిగా మారిపోవచ్చని అంచనా వేస్తున్నారు.ఎందుకంటే.. స్టార్ హీరోల సినిమాలు తక్కువ స్క్రీన్లతో సక్సెస్ అయితే.. భవిష్యత్తులో పెద్ద నిర్మాతలు సింగిల్ స్క్రీన్ నెట్‌వర్క్‌పై ఆధారపడే అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ లాంటి నిర్మాణ సంస్థ వద్ద ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ లాంటి భారీ ప్రాజెక్టులు కూడా లైనప్‌లో ఉన్నాయి. ఈ వివాదం ఇలాగే కొనసాగితే.. చివరికి ఎక్కువ నష్టం ఎవరికి? నిర్మాతలకా? ఎగ్జిబిటర్లకా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందో మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ చూస్తే మోదీ కూడా ప్రశంసిస్తారు
ఈషా ఫేం త్రిగుణ్, పాపం ప్రతాప్ ఫేం పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. మే 15న సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. మొన్ననే ప్రధాని మోదీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని మళ్లీ ట్రెండ్ మొదలుపెట్టారు. ఆ రకంగా ఈ సినిమా మంచి ట్రెండ్‌లో వస్తోంది. ఐటీ జాబ్ వదిలేసిన ఓ కుర్రాడు వ్యవసాయం చేయాలనుకుంటే తన ఇంటి నుంచి, ఫ్యామిలీ నుంచి, అలాగే తన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ సినిమాలో చాలా వినోదాత్మకంగా చెప్పాం. తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ. ఈ సినిమా ఓపెన్ మైండ్‌తో చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. అందరూ ఎంజాయ్ చేసే చిత్రమిది. ఈ సినిమాను ఆదరిస్తే ఒక మంచి సినిమాను సమాజానికి అందించిన వాళ్లం అవుతాం’ అన్నారు.నిర్మాత అరవింద్ మాట్లాడుతూ.. మన ప్రధాని మోదీ కూడా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని ప్రోత్సహిస్తున్నారు. మేము చాలా అడ్వాన్స్‌గా ఈ సినిమా తీశాం. ఈ సినిమాను ఆయన కూడా ప్రశంసిస్తారని నమ్మకం ఉంది. అందరికీ ఉపయోగపడే ఒక కాన్సెప్ట్ చెప్పాం. తప్పకుండా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘నేను సైన్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. ఈ సినిమాను చాలా ప్యాషన్‌తో చేశాను. తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అన్నారు. -
విజయ్- రష్మిక జంట.. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్
ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన జంట విజయ్- రష్మిక. కొన్నేళ్లుగా డేటింగ్ ఉన్న వీరిద్దరు ఉదయ్‌పూర్ వేదికగా ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఈవెంట్ నిర్వహించారు.అయితే విరోష్ జంటగా క్రేజ్ తెచ్చుకున్న వీరిద్దరు ఓ యాడ్ ప్రమోట్ చేశారు. ప్రముఖ ఎయిర్ బీఎన్ బీ కపుల్ యాడ్‌లో పాల్గొన్నారు. దీనికి ఏకంగా 9.1 మిలియన్ లైక్స్ వచ్చాయి. దీంతో ఇన్‌స్టాలో మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ జంటగా విరోష్ జోడీ నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యాడ్‌కు వరల్డ్ వైడ్‌గా వచ్చిన రెండో అత్యధిక లైక్స్ ఇవే కావడం విశేషం. దీంతో విజయ్- రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వీరిద్దరు జంటగా రణబాలిలో కనిపించనున్నారు. మొదటి ప్లేస్ కూడా వీరిదే..ఈ జాబితాలో మొదటి స్థానం రికార్డ్ సైతం వీరిదే కావడం గమనార్హం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన మాన్యవార్ అనే వెడ్డింగ్ యాడ్ 11.5 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దీనికి తోడు 104 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ప్రముఖ దిగ్గజాలు మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వంటి గ్లోబల్ ఐకాన్స్ కలిసి చేసిన ఇంటర్నేషనల్ బ్రాండ్ యాడ్స్‌కు మించిన ఆదరణ విరోష్ జంటకు అందరినీ షాకింగ్‌కు గురి చేస్తోంది. -
'ఇది అంతం కాదు.. ఆరంభం'.. ఫుల్ వయొలెంట్‌గా కేడీ ట్రైలర్
కన్నడ స్టార్ ధ్రువ్ సర్జా హీరోగా నటిస్తోన్న చిత్రం కేడీ ది డెవిల్. ఈ మూవీకి ప్రేమ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేడీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ఫుల్ వయోలెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. పగ, ప్రతీకారాల నేపథ్యంలోనే ఈ కథ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో శిల్పా శెట్టి, సంజయ్ దత్ పాత్రలు హైలెట్‌గా ఉండనున్నట్లు కనిపిస్తోంది. ట్రైలర్లో ఇది అంతం కాదు.. ఆరంభం అనే డైలాగ్ ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకుంటోంది.ఇటీవల ఈ మూవీలో ఓ సాంగ్ హిందీ వర్షన్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. లిరిక్స్ విషయంలో బూతుపదాలు ఎక్కువగా ఉన్నాయని విమర్శలొచ్చాయి. దీంతో ఈ సినిమాలోని ఆ పాటను అన్ని సోషల్ మీడియా వేదికల్లోనూ తొలగించారు. మరి ఈ సాంగ్ తెలుగు వర్షన్ ఉంటుందో.. లేదో సినిమా రిలీజ్ అయితే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. కాగా.. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు. -
చిక్కుల్లో సూర్య సినిమా.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు బిగ్ షాక్ తగిలింది. ఆయన నటించిన తాజా చిత్రం కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) నేడు(మే 14) ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా... అనూహ్యంగా మార్నింగ్ షోలు రద్దయ్యాయి. అంతేకాదు ఆమెరికా షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. మార్నింగ్ షోలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి అనుమతి వచ్చినా కూడా ఎందుకు రిలీజ్ కాలేదు? అసలు సమస్య ఏంటి? వివరాల్లోకి వెళితే..సూర్య,త్రిష జంటగా నటించిన కరుప్పు చిత్రానికి ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మాతలు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ప్రకటించారు. మార్నింగ్ షోల కోసం సీఎం విజయ్ నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. విజయ్ సీఎం అయ్యే ముందు వరకు తమిళనాడులో మార్నింగ్ షోస్ లేవు. పదకొండున్నర గంటలు దాటిన తర్వాత థియేటర్లలో బొమ్మ పడేది. విజయ్ వచ్చాక ఉదయం తొమ్మిది గంటలకు షోలు వేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు జీవో కూడా జారీ చేశారు. అయినా కూడా మార్నింగ్ షోలు పడలేదు. కారణం ఫైనాన్షియల్ ఇష్యూస్. రూ. 10 కోట్ల బకాయిలు.. ఏ సినిమా అయినా సరే.. విడుదలకు ముందే ఫైనాన్స్ క్లియర్ చేయాలి. లేదంటే షోలను నిలిపివేస్తారు.లీగల్ సమస్యలు కూడా వస్తాయి. కరుప్పు విషయంలో ఇప్పుడిదే జరిగింది. సినిమాకు సంబంధించిన ఫైనాన్స్‌ని పూర్తిగా క్లియర్ చేయకుండానే రిలీజ్‌కి వచ్చారట. రూ. 10 కోట్లకు పైగా బకాయిలు చెల్లించలేదట. దీనిపై బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు జరిపిన చర్చలన్నీ విఫలం అవ్వడంతోనే మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బకాయిల చెల్లింపులకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇవి పరిష్కారమైతేనే తదుపరి షోలు ప్రదర్శించే అవకాశం ఉంది.నా దగ్గర సమాధానం లేదు : ఆర్జే బాలాజీమార్నింగ్ షో రద్దుపై దర్శకుడు ఆర్జే బాలాజీ ఎక్స్‌వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ‘సూర్య అభిమానులకు నేను క్షమాపణలు కోరుతున్నా. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. సినిమా విడుదలకు ముందు ఎదురైన కొన్ని ఇబ్బందుల వల్ల షోలు రద్దయ్యాయి. ప్రస్తుతం ఉన్న సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశిస్తున్నాను. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సినిమా కచ్చితంగా విడుదలవుతుంది. మీరందరూ పడుతున్న ఇబ్బందికి నేను క్షమాపణలు చెబుతున్నాను’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి సాయంత్రం షో అయినా పడుతుందా లేదా రిలీజ్ వాయిదా పడుతుందో చూడాలి. #RjBalaji's Very Emotional video..🥲"I'm really sorry.. It shouldn't have happened.. I didn't expect this too.. I hope all the issues will get resolved and the film will be released this evening at 6PM..❣️ Sorry for making you all go through this..🫂"pic.twitter.com/cCkOyFXfE0— Laxmi Kanth (@iammoviebuff007) May 14, 2026 -
కొత్త శక్తి వచ్చింది.. ఆ భయాన్ని పూర్తిగా జయించా : రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ‘మైసా’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవల కొచ్చిలోని దట్టమైన అడవుల్లో జరిగింది. సాధారణంగా రష్మికకు 'అక్రోఫోబియా' (ఎత్తులంటే భయం) ఉంది. అయితే, ఈ సినిమా కారణంగా ఆ భయాన్ని అధిగమించానని చెబుతోంది రష్మిక. ఈ మేరకు ఇన్‌స్టాతో ఓ సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది. ‘కొచ్చిలో ఉన్న రోజులు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చాయి. అడవులు, కీటకాలు, జలపాతాలు, ట్రెక్కింగ్‌లు, వర్కౌట్లు, వర్షాలు.. ఇలా ప్రతిదీ ఒక అనుభవం. నాకు ఎత్తులంటే చాలా భయం. ఇక్కడ ఆ భయాన్ని పూర్తిగా జయించాను. మోకాళ్లకు గాయాలైనా పట్టువదలకుండా పోరాడటం నాకు కొత్త శక్తిని ఇచ్చింది. ఉదయాన్నే అలారం మోగగానే నిద్ర లేవడం నుంచి, ఎంతో ఇష్టమైన పళం పూరీలు కడుపునిండా తినడం వరకు ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను’ అంటూ కొచ్చిలో దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాగా, ఈ సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం రష్మిక ఎలాంటి డూప్ లేకుండా ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకి అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ సాహసోపేతమైన ఫీట్ చేస్తున్న సమయంలో రష్మిక కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. అయినప్పటికీ, ఆమె ఏమాత్రం విరామం తీసుకోకుండా పట్టుదలతో షూటింగ్లో పాల్గొన్నారని దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
రోజూ గోటీల ఫ్యాక్టరీకి వెళ్తా.. రూ.3 కోట్ల ఆదాయం : రాజశేఖర్ కామెడీ
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్‌కి గోటీల ఫ్యాక్టరీ ఉందనే గాసిప్ గతకొంతకాలంగా నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్, పాక్, ఇండియాల్లో గోటీలను అమ్ముతూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నాడంటూ యూట్యూబ్‌లో వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై రాజశేఖర్ స్పందించే వరకు అంతా నిజమనే నమ్మారు. బైకర్ సినిమా ప్రమోషన్స్‌లో తనకు ఎలాంటి ఫ్యాక్టరీ లేదని ఆయన క్లారిటీ ఇవ్వడంతో గోటీల ఫ్యాక్టరీ పుకార్లు ఆగిపోయాయి. అయితే రాజశేఖర్ మాత్రం తనపై వచ్చిన పుకార్లను ఎంజాయ్ చేస్తున్నాడు. వాటిపై పంచులు వేస్తూ.. అందర్నీ నవ్విస్తున్నాడు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఆయన.. గోటీల ఫ్యాక్టరీ పుకార్లపై తనదైన శైలీలో స్పందించాడు.జీ తెలుగు చానల్లో ప్రసారం అవుతున్న ఆట డ్యాన్స్ షోకి జీవిత-రాజశేఖర్ జంట గెస్ట్‌గా వెళ్లింది. ఈ సందర్భంగా హోస్ట్ సుధీర్ వారిని సాదరంగా స్టేజ్‌పైకి ఆహ్వానించి.. రాజశేఖర్‌ని డ్యాన్స్ చేయమని కోరాడు. అయితే జడ్జిగా ఉన్న నటి రాధిక వెంటనే ‘డ్యాన్స్ అంటే రాజశేఖర్‌కి జ్వరం వచ్చేస్తుంది’ అంటూ నవ్వేసింది.దానికి బదులుగా రాజశేఖర్.. అవును నిజమే. రాధిక చెప్పినట్లు అప్పట్లో డ్యాన్స్ అంటే జ్వరం వచ్చేది. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను చాలా బిజీ అయిపోయా(నవ్వుతూ..). రోజు ఫ్యాక్టరీకి వెళ్లి వస్తా. నాకు గోటీల ఫ్యాక్టరీ ఉంది. అది కూడా యూట్యూబ్‌లోనే ఉంది. నెలకు రూ.3 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ ఆ ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలియడం లేదు. వెతుకుతున్నాను’ అని చెప్పడంతో సుధీర్‌తో పాటు జడ్జిగా ఉన్న రాధిక కూడా ఘొల్లున నవ్వేశారు. రాజశేఖర్ కొత్త సినిమాల విషయానికొస్తే.. బైకర్ మూవీతో ఆయన సెకండ్ ఇన్సింగ్స్ మొదలెట్టాడు. ఇందులో ఆయన హీరో శర్వానంద్‌కి తండ్రిగా నటించి, మెప్పించాడు. ప్రస్తుతం సోలో హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. -
దేవ కన్యలా ఊర్వశి.. డ్రెస్ ధర రూ. 1500 కోట్లా?
ఫ్రాన్స్‌లో జరుగుతోన్న కాన్స్ చిత్రోత్సవంలో భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన సీనీ తారలు పాల్గొని, తమ అందచందాలతో అదరగొడుతున్నారు. మంగళవారం ఆరంభమైన ఈ ఫెస్టివల్ ఈ నెల 23తో ముగుస్తుంది. ఇప్పటికే భారత్ నుంచి బాలీవుడ్ నటి అలియా భట్ రెడ్ కార్పెట్‌పై మెరిసింది. మరో నటి ఊర్వశీ రౌతేలా కూడా క్రిస్టల్ గౌను ధరించి ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం ఊర్వశీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వియత్నాంకు చెందిన ఫ్యాషల్ లేబుల్ జోలీ పొలీ కోచర్ ఈ గౌనుని డిజైన్ చేసినట్లు ఊర్వశీ రౌతేలా వెల్లడించింది. గౌనుతో పాటు ఆమె ధరించిన వెండి ఎంబ్రాయిడరీతో, క్రిస్టల్స్, పూసల వర్క్‌తో డిజైన్ చేసిన సిల్వర్ కలర్ ఫ్రాక్ అందర్నీ ఆకట్టుకుంది. అలాగే చోకర్ నెక్లెస్, భారీ ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్, కేశాలంకరణలో పక్షి ఆకారంలో ఉన్న ఆభరణం, చేత్తో పట్టుకున్న అద్దాలు, రంగుల రాళ్లు పొదిగిన క్లచ్... వంటివన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయనే అభినందనలు దక్కించుకున్నాయి. ఊర్వశి దేవ కన్యలా ఉందని పలువురు అభినందించారు. ఊర్వశి గౌను, ఆభరణాలు, బ్యాగు విలువ ఫ్యాషన్ నిపుణుల అంచనా ప్రకారం దాదాపు 155.87 మిలియన్ డాలర్లు అట. భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1500 కోట్లు. వీటిని తయారు చేయడానికి 8 నెలలు పట్టిందట. ఇప్పటివరకూ ఊర్వశి పాల్గొన్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనే అత్యంత ఖరీదైనది ఇదే అని ఫ్యాషన్ నిపుణులు అంటున్నారు. -
సినిమాల్లో అలా మేనేజ్ చేయొచ్చు కానీ ..: రుక్మిణీ వసంత్
అతి తక్కువ కాలంలో శాండిల్‌వుడ్ నుంచి బాలీవుడ్ స్థాయికి ఎదిగిన కథానాయకి రుక్మిణీ వసంత్. ప్రస్తుతం కన్నడం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారీ భామ. నిజం చెప్పాలంటే తమిళంలో రుక్మిణీవసంత్కు ఇంకా సరైన హిట్టు పడలేదు. విజయ్‌సేతుపతికి జంటగా ఏస్ అనే చిత్రం ద్వారా ఈ అమ్మడు కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత శివకార్తికేయన్ సరసన మదరాసి చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. అయినప్పటికీ రుక్మిణీ వసంత్‌కు పలు భాషల్లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇంతకుముందు కన్నడంలో రిషబ్‌శెట్టితో కలిసి నటించిన కాంతార చాప్టర్–1 చిత్రం బాలీవుడ్ వరకు తీసుకెళ్లింది. దీంతో అభిమానులు ఆమెను నేషనల్ క్రష్ గా పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం యష్‌తో కలిసి నటించిన కన్నడ చిత్రం టాక్సిక్ త్వరలో ఆల్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.అదేవిధంగా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. వీటితోపాటు తమిళంలో మరో రెండు కొత్త చిత్రాలు వరించినట్లు తాజా సమాచారం. రుక్మిణీవసంత్ మోడలింగ్ రంగం నుంచి వచ్చారన్నది చాలా మందికి తెలిసుండదు. కాగా మోడలింగ్, సినిమా రంగం గురించి ఇటీవల ఈమె పేర్కొన్న విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో సినిమాల్లో నటీనటులు పంచ్ డైలాగులు చెప్పి, యాక్షన్ సన్నివేశాల్లో నటించి మేనేజ్ చేయవచ్చు, అయితే మోడలింగ్ రంగంలో అలాంటి అవకాశం ఉండదు. ఒక మాట కూడా మాట్లాడకుండా భావాలను, అభినయాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇదే మోడలింగ్ సుందరీమణులకు పెద్ద సవాల్. ఇప్పటి వరకు నేను సినిమా రంగంలో నేర్చుకుంటున్న విషయం ఇదే అని రుక్మిణీ వసంత్ పేర్కొన్నారు. -
‘కాంచనా -4’: ఈసారి పూజా హెగ్డే, నోరా ఫతేహిలతో రచ్చ!
ప్రముఖ కొరియోగ్రాఫర్, కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత ఇలా పలు శాఖల్లో విజయవంతంగా రాణిస్తున్న నటుడు రాఘవ లారెన్స్. ఈయన పలు చిత్రాలు రూపొందించినా కాంచన చిత్రం మైలు రాయిగా నిలిచిపోతుంది. హర్రర్, కామెడీ, థ్రిల్లర్ నేపథ్యంలో ఈయన రూపొందించిన కాంచన, కాంచన స్వీకెల్స్ అనూహ్య విజయాన్ని సాధించాయి. సాధారణంగా ఒక చిత్రానికి సీక్వెల్ రూపొందితే అది సక్సెస్ కావడమే అరుదుగా మారింది. అలాంటిది రాఘవ అదే జానర్లో వరుసగా మూడు సీక్వెల్స్ రూపొందించి విజయం సాధించారు. తాజాగా నాలుగో సీక్వెల్‌తో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారు. కాంచన–4గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తన రాఘవేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తూ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో క్రేజీ నటీమణులు పూజాహెగ్డే, బాలీవుడ్ బ్యూటీ నోరాఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని తమిళనాడులో సన్ పిక్చర్స్ సంస్థ విడుదల చేయనుండడం విశేషం. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. అందులో కండలు తిరిగిన సిక్స్‌ప్యాక్ బాడీతో రాఘవ లారెన్‌న్స్ నిలబడి ఉండగా వెనుక ఆయన మరో రూపం, చుట్టూ భూతాల ముఖాలు ఉన్నాయి. అలా బీభత్సంగా ఉన్న ఆ పోస్టర్ చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది. -
‘కాన్స్’ లో ఆలియా ఆసక్తికర వ్యాఖ్యలు.. నెటిజన్స్ ఫైర్!
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ దేశ, విదేశీ తారల తళుకులతో కనువిందుగా సాగుతోంది. మంగళవారం ఆరంభమైన ఈ ఫెస్టివల్ ఈ నెల 23తో ముగుస్తుంది. తొలి రోజు రెడ్ కార్పెట్‌పై పీచ్ కలర్ ఫ్రాక్‌లో తళుకులీనారు ఆలియా భట్. అయితే ఆలియా చేసిన కొన్ని వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ‘‘సినిమాల్లో లీడ్ రోల్స్‌లో ఎవరు నటిస్తారు? అనేది ప్రేక్షకులు చూడరు. వాళ్లకి కథ ముఖ్యం’’ అని పేర్కొనడంతో పాటు ఆలియా ఈ ఫెస్టివల్లో ఇంకా మాట్లాడుతూ – ‘‘బార్బీ’లాంటి మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. అయితే భారత్‌లో మాత్రం 75 శాతం సినిమాలు మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే రూపొందిస్తారు. అవన్నీ హీరో ప్రాధాన్యంగా సాగే సినిమాలే. అలాంటి సినిమాలు తీయొద్దని అనడంలేదు. కానీ మహిళల కోసమూ సినిమాలు తీయాలి కదా. మహిళా ప్రేక్షకులకు కావాల్సిన సినిమాలు ఎవరు తీస్తారు? ఎందుకంటే సినిమాలు ఒక వర్గానికి మాత్రమే కాదు. అందరి కోసం తీయాలి’’ అన్నారు. సినిమా పరిశ్రమలో పురుషాధిక్యతను ఉద్దేశించి ఆలియా ఈ వ్యాఖ్యలు చేశారని ఊహించవచ్చు. అయితే రెడ్ కార్పెట్‌పై ఆలియా అందానికి ప్రశంసలు కురిపించిన పలువురు నెటిజన్లు ఈ వ్యాఖ్యలను మాత్రం విమర్శిస్తున్నారు. ‘‘ఒకవైపు భర్త (రణ్‌బీర్ కపూర్) ‘యానిమల్’ లాంటి వయొలెంట్ సినిమాలో నటించాడు. ఆ సినిమాలో హింస ఎక్కువగా ఉందని విమర్శలు వచ్చినా ‘యానిమల్’ని సమర్థించింది. అలాగే ‘ధురంధర్’ సినిమా గురించి కూడా పెదవి విప్పలేదు. అలాంటి ఆలియా కాన్స్‌లో మహిళల కోసం సినిమాలు రావాలని మాట్లాడటం ఎందుకు?’’ అంటూ విమర్శించారు. నేను ఊర్వశిని కాదు... భారతదేశాన్ని! ‘‘నా దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన ప్రతిసారీ ‘నేను ఊర్వశిని కాదు... భారతదేశాన్ని! కాన్స్ ఫెస్టివల్ ప్రారంభ వేడుకలో నా భారతదేశం తరఫున నేను ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది. వియత్నాంకు చెందిన ఫ్యాషల్ లేబుల్ జోలీపొలీ కోచర్ డిజైన్ చేసిన ఈ బ్యూటిఫుల్ గౌనుని ధరించాను’’ అని ఊర్వశీ రౌతేలా పేర్కొన్నారు. -
శర్వానంద్–శ్రీను వైట్ల క్రేజీ కాంబో.. హీరోయిన్గా మానస!
శర్వానంద్ వరుస విజయాలతో దూసుకుపోతూ ఇప్పుడు కామెడీ కింగ్ శ్రీను వైట్లతో కొత్త ప్రాజెక్ట్‌ను ఖరారు చేశారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో కూడిన ఈ సినిమా వినోదానికి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ జోడించబోతున్నట్లు సమాచారం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర నిర్మాణంలో జులై 2026 నుంచి షూటింగ్ ప్రారంభమై వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రంలో శర్వానంద్ సరసన నటించబోయే హీరోయిన్గా మొదట పూజా హెగ్డే, మమితా బైజు వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చినా తాజా సమాచారం ప్రకారం ‘మిస్ ఇండియా’ రన్నరప్ మానస వారణాసి ఎంపికైనట్లు టాలీవుడ్ టాక్. ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాలో తన నటనతో మానస మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో మానస, శర్వాతో జోడీ కట్టడం ఫ్రెష్ ఫీల్‌ను తెస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉంది. త్వరలోనే హీరోయిన్‌తో పాటు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 1960ల నాటి పీరియడ్ డ్రామా ‘భోగి’ షూటింగ్లో శర్వానంద్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ - మహారాష్ట్ర ప్రాంతాలతో ముడిపడిన ఈ పీరియాడిక్ స్టోరీని పాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్నారు. ఇందులో రోహిత్ పాఠక్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 'భోగి' చిత్రం ఆగష్టు 28, 2026న థియేటర్లలో విడుదల కానుంది. -
అంజలి కీలక పాత్రలో 'ముసలోడికి దసరా పండుగ'.. రిలీజ్‌కు రెడీ
నాజర్, అంజలి ప్రధాన పాత్రల్లో వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ముసలోడికి దసరా పండుగ. ఈ సినిమాకు మనోహర్ దర్శకత్వం వహించారు. రమణా ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాత రమణ వాళ్లె నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ సందర్భంగా నిర్మాత రమణ మాట్లాడుతూ.. "ప్రేక్షకులు థియేటర్‌కు వస్తే రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. సినిమా అవుట్‌పుట్ పట్ల మేము చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నమ్మకముంది. ఈ సినిమాను మా పితృ సమానులు దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు అంకితమిస్తున్నాం" అని తెలిపారు. ఈ సినిమాలో అనిత (నువ్వు నేను ఫేం), కోవై సరళ, శరణ్య, సత్య కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి డి. ఇమాన్ సంగీతమందించారు. -
బ్లాక్ డ్రెస్‌లో యాంకర్ శ్రీముఖి.. వెస్టర్న్ స్టైల్లో మంచు లక్ష్మీ..!
బీచ్‌లో ఆర్జే మహ్వశ్ చిల్..బ్లాక్ డ్రెస్‌లో యాంకర్ శ్రీముఖి హోయలు..వెస్టర్న్ లుక్‌లో నటి మంచు లక్ష్మీ పోజులు..జిమ్‌లో బాలీవుడ్ భామ దిశా పటానీ కసరత్తులు..యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్..అక్కినేని కోడలు శోభిత లేటేస్ట్ లుక్స్.. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్.. ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 20న యంగ్ టైగర్ బర్త్ డేకు ఏదైనా సర్ప్రైజ్ ఇస్తారా? అని వెయిటింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.ఈ నెల 20న జూనియర్ బర్త్ డే సందర్భంగా డ్రాగన్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇంకా కేవలం 7 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని చిత్ర బృందం ట్వీట్ చేసింది. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. 7 రోజులు మాత్రమే.बस 7 दिन बाकी हैं.இன்னும் 7 நாட்கள் மட்டுமே.ಇನ್ನೂ 7 ದಿನಗಳು ಮಾತ್ರ.ഇനി 7 ദിവസം മാത്രം.#NTRNeel First Glimpse on May 20th.— #NTRNeel (@NTRNeelFilm) May 13, 2026 -
'మీ చేతిలో సినిమాలు లేనప్పుడే గుర్తుకొచ్చిందా..? మైత్రి నిర్మాత కౌంటర్
టాలీవుడ్లో పర్సంటేజీ విధానంపై వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో టికెట్ రేట్లు పెంచే ప్రసక్తే లేదని నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి స్పష్టం చేశారు. పర్సంటేజీ విధానంపై ఎగ్జిబిటర్ల బతుకులు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. నిర్మాతలంతా మా బాధలను అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం జీవోలు ఇచ్చినా సరే టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదని అన్నారు.తాజాగా శిరీష్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ స్పందించారు. మీ చేతిలో పెద్ద సినిమా లేకపోవడంతో ఇప్పుడు పర్సెంటేజ్ విధానం అమలు చేయాలని అనడం కరెక్ట్ కాదని అన్నారు. హరిహర వీరమల్లు నుంచి ఈ సమస్య మొదలైందని తెలిపారు. ఆ తర్వాత వార్ 2, కూలీ, ఓజీ, అఖండ, నారీ నారీ నడుమ మురారి, చిరంజీవి మూవీ కూడా రిలీజ్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు మీకు ఎగ్జిబిటర్ల కష్టాలు కనపడలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మీ చేతిలో సినిమా లేకపోతే పర్సంటేజీ అని డిమాండ్ చేయడం మంచిది కాదన్నారు. ఏదైనా ఉంటే కూర్చోని మాట్లాడుకుందామని రవిశంకర్ అన్నారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్వహించిన ప్రెస్మీట్లో రవిశంకర్ మాట్లాడారు. పెద్ది సినిమా నుంచే పర్సంటేజ్ కావాలని పట్టు పడుతున్నారు.. కానీ నిర్మాతలకు సమస్యలు ఉన్నాయని తెలిపారు. వీటిపై కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుందన్నారు. ఈ ప్రెస్‌మీట్‌కు నాగవంశీ, సాహు గారపాటి, సతీశ్ కిలారు కూడా హాజరయ్యారు. కామెడీ కోసం ప్రెస్మీట్లు పెట్టకండి..నాగవంశీఎగ్జిబిటర్ల పర్సంటేజీ విధానంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. 300 మల్టిప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఓ ఎగ్జిబిటర్, సింగిల్ స్క్రీన్స్ బాధలు చెబుతుంటే వినడానికి నవ్వొచ్చినా ఏమీ చేయలేకపోతున్నామని కౌంటరిచ్చారు. సీ సెంటర్ నుంచి బీ, ఏ సెంటర్ వరకు ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ మల్టిప్లెక్స్‌లు కట్టేశారని విమర్శించారు. సింగిల్ స్క్రీన్స్‌కు రావాల్సిన రెవెన్యూ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఎగ్జిబిటర్ సింగిల్ స్క్రీన్స్ కష్టాలు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉందని నిర్మాత నాగ వంశీ ఎద్దేవా చేశారు. పెద్ది సినిమా వస్తుంటే పూజలు చెయ్యాల్సింది పోయి ఇలా బెదిరించడం సరికాదన్నారు. -
'హైదరాబాద్ ఈవెంట్లో కామెంట్స్.. తప్పుగా అర్థం చేసుకున్నారు'
కోలీవుడ్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ కరుప్పు. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. తెలుగులో వీరభద్రుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ బాలాజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా థియేటర్లకు వచ్చే వారికోసమే తీశామని అన్నారు. అంతేకానీ సోషల్ మీడియాలో సమీక్షించే వారి కోసం కాదన్నారు. దీంతో దర్శకుడు బాలాజీ కామెంట్స్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఆన్లైన్ సినిమాలను విశ్లేషించే వారిని కించపరిచేలా మాట్లాడారంటూ ట్రోల్స్ చేశారు. దీంతో తన వ్యాఖ్యలపై స్పందించారు. కేరళలో నిర్వహించిన మూవీ ఈవెంట్లో తన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు.తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆర్జే బాలాజీ అన్నారు. ఎలాంటి ముందస్తు అభిప్రాయం లేకుండా సినిమా చూడమని మాత్రమే తాను ప్రేక్షకులను కోరానని స్పష్టం చేశారు. సినిమాలపై చేసే సమీక్షలను, చర్చలను కొట్టిపారేయడం తన ఉద్దేశం కాదని తెలిపారు. ముందుగానే ఓ అభిప్రాయంతో థియేటర్లకు రావద్దని ప్రేక్షకులను కోరడమే నా ఉద్దేశమని వెల్లడించారు. మీరు విశాల దృక్పథంతో థియేటర్లకు వచ్చి.. సినిమా చూసిన తర్వాతే.. నచ్చిందో లేదో చెప్పాలని కోరుకుంటున్నానని అన్నారు. నా అభిప్రాయం ప్రకారం ఏదైనా ఒక ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చాక.. ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడాలి.. సమీక్షించాలి. నేను కూడా ఒకప్పుడు సమీక్షకుడినే.. ఇప్పుడే డైరెక్టర్‌గా మారానని తెలిపారు.సూర్య హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి సుబ్రమణ్యం, స్వాసిక, శ్శివద, అనఘ మాయ రవి, సుప్రీత్ రెడ్డి, యోగి బాబు, మన్సూర్ అలీ ఖాన్, జార్జ్ మరియన్, ఆడుకలం నరేన్, నమో నారాయణ, దీపా శంకర్, సభ మారన్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. ఈ చిత్రం మే 14న థియేటర్లలో విడుదల కానుంది. -
ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో ధురంధర్ 2, మిస్టర్ ఎక్స్, తిమ్మరాజుపల్లి టీవీ, కాళిదాస్ 2, కర్తవ్య తదితర చిత్రాలతో పాటు ఎగ్జామ్ అనే డబ్బింగ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడీ ఈ లిస్టులోకి ఓ తెలుగు సినిమా కూడా చేరింది. ఇంతకీ అదేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్)నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'తెరచాప'. గత నెల 17న థియేటర్లలోకి వచ్చింది. కానీ స్టార్స్ ఎవరూ లేకపోవడంతో జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ మూవీ శుక్రవారం (మే 15) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.'తెరచాప' విషయానికొస్తే.. ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న కాశీబాబు (నాగ మహేష్) ఓ ప్రమాదంలో చనిపోతాడు. ఇతడి మరణానికి ఆయన కొడుకు ఈశ్వర్ (నవీన్ రాజ్ శంకరపు) నిర్లక్ష్యమే కారణమని ఊరు మొత్తం వేలెత్తి చూపుతుంది. తన తండ్రిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే ఈశ్వర్, ఆ నింద భరించలేకపోతాడు. తన తండ్రి మరణం వెనుక ఏదో పెద్ద వ్యవహారమే ఉందని అనుమానించి అసలు నిజం తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతనికి సీత (శ్రీలు), గాయత్రి (పూజా సుహాసిని) ఎలా సహాయపడ్డారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ) -
భారీ యాక్షన్ సీక్వెన్స్.. రాజమౌళి ప్లాన్ ఛేంజ్..!
మహేశ్ బాబు- వారణాసి కాంబోలో వస్తోన్న అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీని వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు.అయితే భారీ యాక్షన్ సీన్స్‌ను కోసం హైదరాబాద్‌లోనే తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం గగన్‌పహాడ్ పరిసరాల్లో భారీ కొలను నిర్మించారు. అందుకోసం ఏకంగా 150 ట్యాంకర్ల అవసరం కావడంతో జలమండలికి లేఖ రాశారు. వేసవికాలం కావడంతో అంత నీరు ఇవ్వలేమని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి వారణాసి టీమ్‌కు షాకిచ్చారు. దీంతో మేకర్స్ పునరాలోచనలో పడ్డారు. ఈ సీన్స్ కోసం ప్రత్యామ్నాయం కోసం వేట ప్రారంభించారు.ఈ నేపథ్యంలోనే మేకర్స్ వారణాసికి ప్లాన్ మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. అండర్ వాటర్ యాక్షన్స్ సీక్వెన్స్ వారణాసిలోనే చిత్రీకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో వాటర్ సమస్య రావడంతో మేకర్స్ ఈ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే మరింత క్లారిటీ రానుంది. -
నిర్మాత జోకర్ అయిపోయాడు.. సెట్లో నా మీదే జోకులు
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. వేళ్లపై లెక్కపెట్టగలిగే నిర్మాతలు తప్పితే కొత్తగా ఎవరొచ్చినా ఇక్కడ నిలబడటం కష్టం. హీరోల ఆధిపత్యం చాలా పెరిగిపోయింది. దీంతో నిర్మాత అనేవాడు డబ్బులు ఖర్చుపెట్టే మెషీన్లా మారిపోయాడు. ఇలాంటి కారణాలతోనే చాలామంది ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయారు. అలాంటి వాళ్లలో ప్రసాద్ వి పొట్లూరి అలియాస్ పీవీపీ ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈయన.. టాలీవుడ్‌ని వదిలేయడానికి గల కారణాన్ని బయటపెట్టారు.(ఇదీ చదవండి: పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి)'సినిమాలు నిర్మించడం కంటే దారుణమైన బిజినెస్ ప్రపంచంలో మరొకటి లేదు. మనం డబ్బులు పెట్టి అవమానాలు పడటం కంటే దారుణమైన విషయం లేదు. ఇండస్ట్రీలో ఉంటే మన మీద మనమే పెంట వేసుకున్నట్లు ఉంటుంది. ఇక్కడ నిర్మాత ఓ జోకర్లా అయిపోయాడు. డబ్బులు పెట్టి సినిమా తీసే నిర్మాత మీదే సెట్లో అందరూ జోకులు వేస్తుంటారు. సినిమా పోతే రోడ్డున పడేది నిర్మాతే అని నా మీద ఎవరికీ ఏ ఆందోళన ఉండదు. నన్నో బఫూన్లా చూస్తారు. హాలీవుడ్లో ఉన్నట్లు ఇక్కడ స్టూడియో విధానం లేదు. హీరోలే ఇండస్ట్రీని నడిపిస్తున్నారు. నిర్మాతలకు విలువ లేదు. ఇలాంటి చోట ఉండటం ఎందుకని నేనే వచ్చేశాను' అని పీవీపీ ఆవేదన వ్యక్తం చేశారు.'టెంపర్' సినిమాకు సంబంధించి నిర్మాత బండ్ల గణేశ్‌తో వివాదం గురించి స్పందించిన పీవీపీ.. ఆ చిత్రానికి నేను సోలో ఫైనాన్సియర్. బ్యాంక్ తరహాలో వడ్డీకి అప్పు ఇచ్చి దాన్ని వసూలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇబ్బందులు తలెత్తాయి. మన డబ్బులు మనం తీసుకోవడానికి అవమానాలు పడాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు.రవితేజ 'బలుపు' మూవీతో నిర్మాతగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. క్షణం, ఊపిరి, బ్రహ్మోత్సవం, మహర్షి లాంటి భారీ సినిమాలు చేశారు. కానీ ఉన్నట్లుండి సడన్‌గా నిర్మించడం మానేశారు. ఇన్నాళ్లకు అందుకు గల కారణాన్ని బయటపెట్టారు.(ఇదీ చదవండి: విడాకుల వార్తలు.. స్పందించిన హీరోయిన్) -
హీరోయిన్ లయ చెస్ ఛాంపియనా?.. పోస్ట్ వైరల్
అప్పట్లో హీరోయిన్గా మెప్పించిన లయ.. మళ్లీ సినిమాల వైపే వచ్చేసింది. అమెరికాలో కొన్నేళ్లు ఉద్యోగం చేసిన లయ.. గతేడాది నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు మూవీతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శివాజీ సరసన సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం టాలీవుడ్లో తగిన క్యారెక్టర్స్ వస్తే చేయడానికి రెడీ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. తాజాగా హీరోయిన్ లయ తన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంది. 12 ఏళ్ల వయసులో తాను చెస్ ఛాంపియన్‌గా నిలిచిన విషయాన్ని పంచుకుంది. దీనికి సంబంధించి ప్రముఖ పత్రికల్లో వచ్చిన న్యూస్ క్లిప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. విజయవాడలో జరిగిన ఆంధ్రా సబ్ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో లయ విజేతగా అవతరించింది. ఇలాంటి మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయని ఇన్‌స్టాలో షేర్ చేసింది లయ. చిన్నప్పటి విజయాలు ఎప్పటికీ సంతోషంగానే అనిపిస్తాయని రాసుకొచ్చింది. ఈ ఘనత అందించిన అమ్మ, నాన్నకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) -
విడాకుల వార్తలు.. స్పందించిన హీరోయిన్
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మౌనీరాయ్ విడాకులు తీసుకోందని వార్తలు వినిపిస్తున్నాయి. భర్త సూరజ్ నంబియార్ని ఇన్ స్టాలో అన్ ఫాలో చేయడమే దీనికి కారణం. ఇప్పటికీ వీళ్లిద్దరూ విడివిడిగా ఉంటున్నారని, విడాకుల తతంగం కూడా పూర్తయిందని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే తనపై వస్తున్న పుకార్లపై మౌనీ స్పందించింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి)'మీడియా వాళ్లకు విజ్ఞప్తి. అవాస్తవాలని ప్రచారం చేయొద్దు. మాకు కాస్త ప్రైవసీ ఇవ్వండి ప్లీజ్' అని మౌనీరాయ్.. తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. మరి విడాకుల వార్తల్లో నిజానిజాలేంటి అనేది త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.2018లో దుబాయిలో కలుసుకున్న సూరజ్-మౌనీరాయ్ నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించి 2022లో గోవా వేదికగా పెళ్లి చేసుకున్నారు. మలయాళీ-బెంగాలీ సంప్రదాయ పద్ధతుల్లో ఈ వేడుక జరిగింది. సూరజ్, దుబాయికి చెందిన బిజినెస్‌మ్యాన్ కాగా మౌనీ, హిందీ-దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్, నటిగా కనిపిస్తూనే స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. లేటెస్ట్గా అయితే చిరు 'విశ్వంభర'లోనూ ఐటమ్ సాంగ్ చేసింది.(ఇదీ చదవండి: తమిళనాడు అసెంబ్లీలో 'పుష్ప' గురించి చర్చ) -
‘పెద్ది’లో ఆటే కాదు.. అసలు కథే వేరే!
టాలీవుడ్ బాక్సాఫీస్ గత కొంతకాలంగా డల్ అయిపోయింది. చాలా వారాలుగా పెద్ద సినిమాలేవి విడుదల కావడం లేదు. చిన్న చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో థియేటర్స్ దగ్గర సందడే కనిపించడం లేదు. మళ్లీ ఆ సందడి రావాలంటే ఓ భారీ చిత్రం రావాలి.. సూపర్ హిట్ కొట్టాలి. అందుకే ఇప్పుడు అందరి చూపులు ‘పెద్ది’వైపు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత తెలుగు నుంచి విడుదల అవుతున్న పాన్ ఇండియా చిత్రం ఇది. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఒక్క రోజు ముందే అంటే జూన్ 3నే ప్రీమియర్లతో పెద్ది సందడి మొదలవుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలయ్యాయి. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మే 18న ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా ప్రమోషన్లలో పాల్గొంటాడు. ఇలా నెల మొత్తం ఇండస్ట్రీలో పెద్ది టాపిక్కే నడుతుంది.ఇదిలా ఉండగా.. పెద్దికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇది కేవలం గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదట. అంతకు మించిన స్టోరీ సినిమాలో ఉందట. ఆటతో పాటు ఊరికి సంబంధించిన ఎమోషన్ని ఈ కథలో బలంగా చూపించబోతున్నాడట దర్శకుడు బుచ్చిబాబు. ఊరి బాగుకోసం హీరో ఏం చేశాడనేది ఈ సినిమా కథ. దానికి స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌ని ఎంచుకొని.. అద్భుతమైన సన్నివేశాలను అల్లాడట బుచ్చిబాబు.కోచ్‌గా శివరాజ్ కుమార్, హీరో తండ్రిగా జగపతిబాబు పాత్రలను కూడా బలంగా తీర్చిదిద్దాడట. హీరోతో పాటు ఈ రెండు పాత్రల నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. సినిమాలలో కీలక పాత్రల తీరు ఎలా ఉంటుందో ట్రైలర్లో చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పెద్ది కథ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఎక్కడ లీక్ కూడా కాలేదు. ట్రైలర్ వస్తే కానీ అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది తెలియదు. కుస్తీ, క్రికెట్ ఆటలకు ఈ కథతో ఉన్న సంబంధం ఏంటనేది కూడా ట్రైలర్లో చూపించే అవకాశం ఉంది. -
నెల రోజుల్లోపే ఓటీటీకి పాన్ ఇండియా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ హీరో ఆర్య నటించిన లేటేస్ట్ పాన్ ఇండియా మూవీ మిస్టర్ ఎక్స్. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 17న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 1965లో భారత్ - చైనా బోర్డర్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే బుల్లితెరపై సందడి చేయనుంది. జియో హాట్‌స్టార్ వేదికగా ఈనెల 14 నుంచే మిస్టర్ ఎక్స్ స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఓవర్సీస్ అభిమానులకు సింప్లీ సౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ మూవీలో గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్ ,నటి మంజు వారియర్, అనకా, అతుల్య రవి, రైసా విల్సన్, ఖాళీ వెంకట్ ముఖ్యపాత్రల్లో నటించారు.మిస్టర్ ఎక్స్ కథేంటంటే..1965లో భారత సైనికులు చైనాను ఎదుర్కొనడానికి హిమాలయాల్లో ఉన్న నందాదేవి అనే కొండపైకి ఏడు బ్లుటోనియం క్యాప్షల్స్‌ను తీసుకెళ్తారని అయితే అవి అనుహ్యంగా కనిపించకుండా పోవడంతో ఎదురైన సమస్యలు ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించారు. దాదాపు 60 ఏళ్లకు పైగా వాటి గురించి పరిశోధనలు జరిపినప్పటికీ ఎలాంటి ఆచూకీ కనిపించలేదు. అలాంటి న్యూక్లియర్ క్యాప్సిల్స్ నేపథ్యంలో సాగే కథే మిస్టర్ ఎక్స్. ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
సూపర్ స్టార్ మనవడి శ్రీనివాస మంగాపురం.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
ఘట్టమనేని రమేశ్ బాబు తనయుడు నటిస్తోన్న లేటేస్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ రషా తడాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్, టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్‌ను విడుదల చేశారు. యే మంగా.. హే మంగా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా లాంఛ్ చేశారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. ఎల్వీ రేవంత్ ఆలపించారు. ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. ఈ మూవీని తిరుపతి పట్టణంలో సాగే ఈ కథ వాసు బాబు, మంగ అనే ఇద్దరు స్నేహితులు... ప్రేమికులుగా మారి ఆనందంగా జీవించే ప్రయాణం నేపథ్యంగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. -
తమిళనాడు అసెంబ్లీలో 'పుష్ప' గురించి చర్చ
తమిళ రాజకీయాల గురించి తెలుగు రాష్ట్రాల్లోనూ ఎప్పుడూ లేనంతగా గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతోంది. అందుకు కారణం స్టార్ హీరో విజయ్ ముఖ్యమంత్రి కావడం. టీవీకే పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అధికారం దక్కించుకున్నారు. రీసెంట్‌గానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి బుధవారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల బలపరీక్షలోనూ నెగ్గారు. 144 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్‌కి దక్కింది. అయితే అధికారం దక్కించుకునే సీఎం విజయ్ సోఫా రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్ష నేత ఉదయనిధి విమర్శలు చేశారు.(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు)ఉదయనిధి.. విజయ్‌పై విమర్శలు చేసిన సందర్భంలోనే తెలుగు బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా 'పుష్ప' గురించి ప్రస్తావన వచ్చింది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యమంత్రి విజయ్‌పై ఘాటు విమర్శలు చేసిన ఉదయనిధి స్టాలిన్.. సోఫా సెట్ రాజకీయం చేశారంటూ సీఎంపై కౌంటర్లు వేశారు. ఆయన పుష్ప తరహా సోఫా రాజకీయం చేశారని విమర్శించారు. ముందు సోఫాని ఎమ్మెల్యేకి పంపిన తర్వాతే సీఎం.. పూల బొకేలతో అక్కడికి వెళ్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలని అప్పుగా తీసుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చురకలు వేశారు. టీవీకే హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడిందని ఉదయనిధి ఆరోపించారు. ఉదయనిధి ఆరోపణలపై స్పందించిన ముఖ్యమంత్రి విజయ్.. ప్రభుత్వాన్ని నడపడానికి రేసు గుర్రాలని కొనే అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.'పుష్ప 2' సినిమాలో హీరో, కేంద్రమంత్రి పాత్రధారిని కలవడానికి ముందే డబ్బుల కట్టలతో నిండిన సోఫాని ఆయనకు పంపిస్తాడు. అలానే రావు రమేశ్ పాత్రని ముఖ్యమంత్రి చేసేందుకుగానూ ఎమ్మెల్యేలకు డబ్బులతో నిండిన సోఫా సెట్లని పంపిస్తాడు. అలా ఈ చిత్రంలోని సన్నివేశాల్ని రిఫరెన్స్‌గా తీసుకుని తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి) View this post on Instagram A post shared by ETamil News (@etamilnewsig) -
పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి
'ధురంధర్' సినిమాలు ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది డిసెంబరులో తొలి పార్ట్ రూ.1300 కోట్లు వసూలు చేయగా.. ఈ మార్చిలో రిలీజైన సీక్వెల్ అంతకు మించిన బీభత్సం చేసింది. ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గరున్న అన్ని రికార్డులు కొల్లగొట్టింది. పుష్ప, బాహుబలి.. దేన్ని వదల్లేదు. చాలామంది ఈ మూవీస్ నచ్చాయి గానీ కొందరు మాత్రం ప్రొపగాండా అని విమర్శించారు. ఇందులో పాకిస్థాన్ కూడా ఉంది.(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు)గతేడాది డిసెంబరులో 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడే పాక్ నాయకుల్లో అలజడి రేగింది. తన దేశంలోని లయరీ ప్రాంతం గురించి తప్పుతప్పుగా చూపించారని మండిపడ్డారు. అసలు లయరీ ఎలా ఉంటుందో చూపిస్తామని చెబుతూ 'మేరీ లయరీ' అనే సినిమాని కూడా ప్రకటించారు. గత వీకెండ్ అంటే మే 08న థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందు కాస్తోకూస్తో బజ్ ఉన్నప్పటికీ థియేటర్లలోకి వచ్చిన ఘోరాతీ ఘోరంగా పరిస్థితి తయారైంది.ఆజ్ తక్ కథనం ప్రకారం.. 'మేరీ లయరీ' సినిమాకు పాక్‌లోని కొన్ని థియేటర్లలో మరీ 22 టికెట్లే అమ్ముడుపోయాయట. ప్రేక్షకులు కూడా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో తొలిరోజే చాలా థియేటర్లలో నుంచి సినిమాని తీసేశారట. అబూ అలీహా దర్శకత్వం వహించిన 'మేరీ లయరీ' మూవీలో ఆయేషా ఒమర్, దననీర్ మొబీన్, సామియా ముంతాజ్ ప్రధాన పాత్రలు చేశారు.'ధురంధర్' రెండు భాగాలు కూడా గూఢచర్యం, పాక్ ఉగ్రవాదం నేపథ్యంగా తీశారు. 'మేరీ లయరీ' మాత్రం లయరీ ప్రాంతంలో ఫుట్‌బాల్, సమాజ జీవనం, మహిళల ఆత్మవిశ్వాసం బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. గతంలోనే ఓ సందర్భంలో మాట్లాడిన సింధ్ సమాచార శాఖ మంత్రి షర్జీల్ ఇనామ్.. భారతీయ సినిమాల్లో లయరీ ప్రాంతాన్ని తప్పుగా చూపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు వాళ్లే మూవీ తీస్తే సొంత ప్రేక్షకుల నుంచే తిరస్కరణ ఎదురైంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ) -
సబ్బు యాడ్ వివాదం.. క్షమాపణలు చెప్పిన అలీ
టాలీవుడ్ నటుడు, కమెడియన్ అలీ వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన నటించిన ఓ యాడ్‌పై ఓ వర్గం ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన విమర్శిస్తూ పోస్టులు పెట్టడంతో చివరకు అలీ క్షమాపణలు చెబుతూ ఆ వీడియోని తొలగించేశాడు. అసలేం ఏం జరిగిందంటే..అలీ ఇటీవల ఓ సబ్బుకి సంబంధించిన ప్రకటనలో నటించాడు. అందులో సబ్బుకి లక్ష్మీ పూజ చేస్తూ కనిపించాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని మంత్రాలు కూడా వినిపించాయి. ఇదే ఇప్పడు వివాదానికి దారి తీసింది. ఈ ప్రకటనపై ఓ వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ వాణిజ్య ప్రకటన కోసం మత విశ్వాసాల్ని అపహాస్యం చేస్తారా అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలీ సినిమాలను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ వివాదం ముదరడంతో అలీ వెంటనే స్పందిస్తూ ఓ వీడియోని విడుదల చేశాడు. ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని కోరాడు. అంతేకాదు ఆ యాడ్ కూడా డిలీట్ చేశానని చెప్పారు. ముంబై కంపెనీ వాళ్లు యాడ్ చేయమన్నారని, దేవుడు చేసిన మనుషులు సినిమాలో తనపై కంపోజ్ చేసిన ఓ బిట్ ని ఈ యాడ్ కోసం వాడామని, అయితే తన సన్నిహితులంతా యాడ్ ఇబ్బందిగా ఉందని చెప్పడంతో డిలీట్ చేశానని అలీ చెప్పుకొచ్చారు.Soap Ad Lands Ali in Controversy Hindu organizations have raised objections to a soap advertisement featuring Ali. As the controversy intensified, Ali issued an apology.#Ali #SoapAd #Controversy #Tollywood #Trending pic.twitter.com/ikLM1BjsM8— Telangana Ahead (@telanganaahead) May 13, 2026 -
ఓటీటీలోకి వచ్చిన తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మిగతా భాషల్లోనూ మూవీస్ కూడా తెలుగు డబ్బింగ్ రూపంలో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఒకటి సైలెంట్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ దాని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'ప్రేమిస్తే' సినిమాతో గతంలో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న భరత్.. తర్వాత కాలంలో ఎక్కువగా తమిళంలోనే మూవీస్ చేస్తున్నాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కాళిదాస్ 2'. గత నెల 3వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడుది అమెజాన్ ప్రైమ్, లయగ్స్ గేట్ ప్లే, టెంట్ కొట్ట, ఆహ తమిళ, సన్ నెక్స్ట్, షార్ట్ ఫ్లిక్స్ ఇండియా ఓటీటీల్లో ఒకేసారి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.లయన్స్ గేట్ ప్లేలో తెలుగు వెర్షన్స్ ఉచితంగా స్ట్రీమింగ్ అవుతుండగా.. అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం అద్దె విధానంలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇకపోతే 2019లో వచ్చిన 'కాళిదాస్' చిత్రానికి ఇది సీక్వెల్. తొలి భాగం చూడకపోయినా సరే దీన్ని చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే చేశారు.'కాళిదాస్ 2' విషయానికొస్తే.. ఓ గేటెడ్ కమ్యూనిటీలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. అదే రోజు రాత్రి అక్కడే ఉన్న మిత్ర అనే నాలుగేళ్ల అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఈ కేసుని కాళిదాసు దర్యాప్తు చేస్తుంటాడు. ఓసారి గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వాళ్ల గురించి ఓ డార్క్ సీక్రెట్ కాళిదాస్‌కి తెలుస్తుంది. ఇంతకీ అదేంటి? తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు) -
విషాదం.. గుండెపోటుతో 47 ఏళ్ల నటుడు మృతి!
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్(47) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం ఉదయం తన ఇంట్లో దిలీప్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మరణించారని ధ్రువీకరించారు. దిలీప్ మరణవార్త కన్నడ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.2007లో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన మిలానా చిత్రంలో దిలీప్‌కి మంచి గుర్తింపు లభించింది. తర్వాత ‘యు-టర్న్’ సినిమాలో కీలక పాత్ర పోషించి అందరినీ మెప్పించాడు. వెండితెరపైనే కాదు.. హిట్లర్ కళ్యాణ వంటి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించాడు.నటుడిగా కాకుండా నిర్మాతగా రాణించారు. డీఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై టీవీ సీరియళ్లను నిర్మించారు. ఆయన అకాల మృతితో కన్నడ సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. -
సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు
సినిమాలకు సంబంధించిన వ్యక్తి.. ప్రభుత్వంలో ఉంటే పలు నిర్ణయాలు ఇండస్ట్రీకి కలిసొచ్చేలా ఉంటాయి. విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కోలీవుడ్‌కి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు తమిళనాడులో ఆ ట్రెండ్ మొదలైంది. ఎన్నాళ్లుగానో లేని స్పెషల్ షోలకు అనుమతి లభించింది. త్రిష హీరోయిన్గా నటించిన మూవీతోనే దీనికి శ్రీకారం చుట్టడం విశేషం.(ఇదీ చదవండి: టాలీవుడ్‌కి బిగ్‌షాక్.. ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది)తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమకు తొలిసారి ఊరట లభించింది. సూర్య, త్రిష జంటగా నటించిన 'కరుప్పు' మూవీకి మే 14,15 తేదీల్లో ఉదయం 9 గంటల స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు విజయ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తమిళనాడులో చాన్నాళ్ల నుంచి స్పెషల్ షోలు లేవు. దీంతో ఈ నిర్ణయంపై నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్టర్స్.. సీఎం విజయ్‌కి థ్యాంక్స్ చెప్పింది. తెలుగులో ఈ చిత్రం 'వీరభద్రుడు' పేరిట రిలీజ్ కానుంది. విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమిళనాడులో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 2 వరకు రెండు రోజుల పాటు మొత్తం 5 షోలు వేయనున్నారు.సూర్య,త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన 'కరుప్పు' సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించాడు. ట్రైలర్ అయితే పర్లేదనిపించేలా ఉంది. కోర్టులో సామాన్యులకు న్యాయం అందకుండా చేసే ఓ అవినీతి లాయర్ భరతం పట్టేందుకు దేవుడే దిగివస్తే ఏం జరిగింది అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత రెండు మూడు సినిమాలతో బాగా డీలాపడిపోయిన సూర్య.. ఇది హిట్ అవ్వడం చాలా కీలకం. మరి ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
టాలీవుడ్‌కి బిగ్‌షాక్.. ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది
తెలుగు సినీ పరిశ్రమకు బిగ్ షాక్ తగిలింది. ఒకప్పుడు తీవ్రంగా ఇబ్బంది పెట్టి, వదిలి వెళ్లిపోయిన పైరసీ బూతం ‘ఐబొమ్మ ’మళ్లీ వచ్చేసింది. తాజాగా రిలీజ్ అయిన కొత్త సినిమాలన్నీ ఈ వెబ్సైట్లో కనినిపిస్తున్నాయి. ఈ సైట్ నిర్వాహకుడు రవి అరెస్ట్ కావడంతో ఇక ఈ సమస్య తీరిపోయిందని భావించిన సినీ పెద్దలకు తాజా పరిణామాలు షాక్ ఇస్తున్నాయి.కొన్ని నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు ఈ నెట్‌వర్క్‌ను ఛేదించి, కీలక సూత్రధారిగా భావిస్తున్న రవిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఆయన బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే సైట్ మళ్లీ ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఐబొమ్మ తన డొమైన్లను మార్చుకుంటూ మళ్లీ రంగ ప్రవేశం చేసింది. థియేటర్లలో ఉన్న తాజా చిత్రాలు, ఓటీటీలో విడుదలైన కొత్త కంటెంట్ ఈ సైట్లో ప్రత్యక్షమవుతుండటంతో సినీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నిర్వాహకుడు బెయిల్‌పై ఉన్న సమయంలోనే సైట్ మళ్లీ యాక్టివ్ అవ్వడం వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. -
ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. అంటే థియేటర్లలో రిలీజైన సినిమాలు ఒకటి రెండు నెలల్లోనే స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తున్నాయి. అలాంటి జేమ్స్ కామెరూన్ తీసిన 'అవతార్' మూడో భాగం మాత్రం ఆరు నెలల తర్వాత అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'టైటానిక్' లాంటి మూవీ తీసిన జేమ్స్ కామెరూన్.. లాంగ్ గ్యాప్ తీసుకుని 2009లో 'అవతార్' అనే సినిమా తీశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. రూ.14-15 వేల కోట్ల వసూళ్లు రాగా.. 2022లో రిలీజైన పార్ట్ 2 కూడా రూ.18 వేల పైచిలుకు కలెక్షన్స్ సాధించింది. గతేడాది డిసెంబరులో మూడో పార్ట్ (అవతార్: ఫైర్ అండ్ యష్) రిలీజ్ కాగా దీనికి ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే వచ్చింది.మూడో పార్ట్ కూడా వేలకోట్లు కలెక్షన్స్ సాధించినప్పటికీ ఓటీటీలోకి మాత్రం త్వరగా తీసుకురాలేదు. మార్చి 31న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇంగ్లీష్ వెర్షన్ వచ్చినప్పటికీ అద్దె విధానంలోనే స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు జూన్ 24 నుంచి హాట్స్టార్లోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.'అవతార్: ఫైర్ అండ్ యాష్' విషయానికొస్తే.. రెండో పార్ట్ 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' సంఘటనల తర్వాత జేక్ సల్లీ (శ్యామ్ వర్తింగ్టన్), నేతిరి (జో సల్దానా) జంట తమ పెద్ద కొడుకు కోల్పోయిన బాధలో ఉంటారు. పిల్లలతో కలిసి జీవిస్తుంటారు. తన వల్లే సోదరుడు చనిపోయాడనే అపరాధ భావంతో జేక్ కొడుకు లోక్ ఉంటాడు. రెండో భాగంలో చనిపోయిన కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్).. నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ వచ్చి జేక్‌పై ప్రతీకారానికి సిద్ధమవుతాడు. ఈసారి కల్నల్‌కి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఊనా చాప్లిన్) తోడవుతుంది. వీళ్లకు ఆర్డీఏ బృందం కూడా తోడవుతుంది. మరి ఇంతమంది శత్రువుల్ని జేక్ కుటుంబం ఎలా ఎదుర్కొంది? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్) -
పావలా కోసం కొట్టుకుంటున్నాం.. బన్నీవాసు సంచలన ట్వీట్
టాలీవుడ్లో ‘పర్సెంటేజీ’ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబీటర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ పెద్దలు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి, పర్సెంటేజీ విధానం అమలు చేయకపోతే సినిమాలను ప్రదర్శించబోమని హెచ్చరించారు. దీనిపై నిర్మాత బన్నీవాసు స్పందించాడు. ఇప్పటికే ప్రేక్షకులు థియేటర్స్ రాకపోవడంతో ఆదాయం తగ్గిందని..దానికి గల కారణాలను తెలుసుకొని సరి చేయకుండా.. తగ్గిపోయిన ఆదాయం మీద పోరాటం చేస్తే ఏం లాభం అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు.అంతకంటే తెలివితక్కువతనం ఇంకొకటి లేదురూపాయి ఆదాయం అందరికీ పోయింది, పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయింది. ఈరోజు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని మనం చూస్తున్నాం. కానీ ఆ కలెక్షన్లు నిజంగా ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కాదు; టికెట్ రేట్లు, ఇతర ధరలు పెరగడం వల్ల వచ్చినవని మనందరం అర్థం చేసుకోవాలి. అంటే, సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం తగ్గిపోయింది. వచ్చే కొద్దిమంది ప్రేక్షకుల మీదే అధిక భారం వేసి వసూళ్లు పెంచుకుని, దాన్నే భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం కన్నా పెద్ద తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు.పావలా కోసం కొట్టుకుంటున్నాంచిన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది; వారి ఆదాయం పావలా స్థాయికి పడిపోయింది. ఇప్పుడు ఆ పావలాలో ఎవరు ఎంత తీసుకోవాలి అని మనం కొట్టుకుంటున్నాం కానీ, అసలు మన రూపాయి ఆదాయం ఎందుకు పోయిందో మాత్రం మర్చిపోతున్నాం.ఇక్కడ నిర్మాతలు నష్టపోతున్నారు. అదే విధంగా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతున్నారు, ఇది వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ పరిస్థితికి అసలు మూలకారణం ఏమిటి? ఉన్న ఆదాయంలో ఎవరు ఎంత పంచుకోవాలి అని వాదించుకోవడం కంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గుర్తించి దాన్ని సరిచేసుకోవడం ముఖ్యమా కాదా?నా అభిప్రాయం ప్రకారం ప్రధాన కారణాలు ఇవి1. హీరోలు సినిమాలు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకోవడం. సగటు ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావడంలో హీరోల పాత్ర చాలా ముఖ్యమని ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజం. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడంలో హీరోల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీలో హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేస్తే, ప్రేక్షకుడికి సినిమాలపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది. దాని ప్రభావం కేవలం పెద్ద సినిమాలపైనే కాదు, చిన్న సినిమాల మీద కూడా పడుతుంది.2. సినిమాలను కేవలం 27 రోజుల్లోనే OTTలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోవడం.3. ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడం. “ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరమా?” అనే భావన ప్రేక్షకుల్లో రావడం.4. మల్టీప్లెక్సుల్లో అధిక క్యాంటీన్ ధరలు.ఈ నాలుగు కారణాల్లో మూడు కారణాలు మన చేతిలోనే ఉన్నాయి. కంటెంట్ విషయం మాత్రమే పూర్తిగా మన నియంత్రణలో ఉండదు.ఈ మూడు అంశాలను సరిచేయకుండా, ఎంత శాతం పంచుకోవాలి అని వాదించుకున్నా ఉపయోగం లేదు. రేపు వచ్చే ఆ పావలా ఆదాయంలో ఎవరు ఎంత తీసుకోవాలి అని కొట్టుకోవడం తప్ప, దాంతో ఎవరికీ నిజమైన లాభం ఉండదు.మూల సమస్యను సరిచేయకుండా, ఇప్పటికే తగ్గిపోయిన ఆదాయం మీదే పోరాడటం వల్ల ఏం లాభం చేకూరుతుంది? అని బన్నీవాసు ప్రశ్నించాడు. -
పూజా హెగ్డే ‘అందాల’ అస్త్రం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
ఎవరేమనుకున్నా కథానాయికల్లో 99 శాతం మంది గ్లామర్ తోనే గుర్తింపు పొందాలని భావిస్తారు. అవకాశాల వేటకు గ్లామరస్ ఫొటోలనే వాడుతుంటారు. ఇందుకు నటి పూజా హెగ్డే అతీతం కాదనే సాహసం ఎవరు చేయలేరు. అందాల పోటీల్లో పాల్గొని ఆ తరువాత సినీ రంగ ప్రవేశం చేసిన బ్యూటీ ఈమె. 2012 లో ముఖముడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లో హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఆ చిత్రం విజయం సాధించకపోయినా, ఈ అమ్మడి పేరు వెలుగులోకి వచ్చింది. అలా టాలీవుడ్ లో అవకాశాలు అందుకున్నారు. అక్కడ మొదట్లో యువ హీరోలతో జత కట్టి, ఆ తరువాత మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి ప్రముఖ హీరోలతో నటించి స్టార్ డమ్‌ను పొందారు.అయితే ఆ మధ్య పూజా హెగ్డే నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో అక్కడ డిమాండ్ తగ్గింది. అదే విధంగా హిందీలో నటించిన చిత్రాలేవీ సక్సెస్ కాలేదు. కోలీవుడ్‌లోనూ ఈ భామకు అదే పరిస్థితి. ప్రస్తుతం చేతిలో ఒకటి రెండు చిత్రాలే ఉన్నాయి. దీంతో అవకాశాల వేటలో పడ్డారు. అందులో భాగంగా తన ఆదిలో తీసుకున్న గ్లామరస్ ఫొటోలను తన ఇన్ స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు నెటిజన్ల విమర్శలను గట్టిగానే ఎదుర్కొంటున్నాయి. ఇంతకు రెట్రో వంటి చిత్రాల్లో నటించిన పూజాహెగ్డే నేనా ఈమె అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ‘పూజాహెగ్డే కాస్తయినా సంసార పక్షంగా కనిపించేది ఇక్కడేననీ(సౌత్ సినిమాల్లో), బాలీవుడ్లో అయితే వేరే లెవెల్ అంటూ తన ఎక్స్‌ఫోజింగ్ ఫొటోల గురించి చాలా బోల్డ్‌గా పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
గ్యాంగస్టర్స్గా మారిన స్టార్ హీరోలు
థియేటర్స్‌లో మాస్ ఆడియన్స్ సినిమాను మెచ్చుకుంటే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. ‘పుష్ప, కేజీఎఫ్’, ఇటీవల ‘ధురంధర్’... ఇలా ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆడియన్స్‌కు థియేటర్స్‌లో మాస్ మూమెంట్స్‌ను అందించేందుకు కొందరు స్టార్ హీరోలు సిల్వర్ స్క్రీన్‌పై గ్యాంగస్టర్స్గా మారారు. మరి... ఈ గ్యాంగ్స్టార్స్పై ఓ లుక్ వేయండి.ఒక్కరు కాదు... ఇద్దరు!‘అపూర్వ రాగంగళ్’, ‘అంతులేని కథ’, ‘గిరఫ్తార్’... ఇలా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 20 సినిమాల్లో రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి నటించారు. కానీ 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ (తెలుగులో ’అల్లావుద్దీన్ అద్భుత దీపం’) సినిమా తర్వాత రజనీకాంత్–కమల్హాసన్ల కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. తాజాగా తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ఇద్దరు సూపర్ స్టార్స్‌ను ఒకే ఫ్రేమ్‌లోకి తెస్తున్నారు. రజనీకాంత్, కమల్‌హాసన్ హీరోలుగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుంది.రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇదొక పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అని, ఇందులో రజనీకాంత్, కమల్‌హాసన్... ఇద్దరూ గ్యాంగ్‌స్టర్స్‌గా నటిస్తారని కోలీవుడ్ టాక్. ఈ సినిమా జానర్ గ్యాంగ్‌స్టర్ డ్రామాయే అయినప్పటికీ కథలో మంచి సెంటిమెంట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయట. ఇక ఈ సినిమాలోని ఓ ప్రధాన పాత్రధారిగా త్రిష నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.2027 దసరా లేదా దీపావళి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు రజనీకాంత్ హీరోగా కమల్‌హాసన్ ఓ సినిమాను నిర్మించనున్నారు. సిబీ చక్రవర్తి ఈ సినిమాకు దర్శకుడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. సో... రజనీకాంత్ – సీబీ చక్రవర్తిల కాంబినేషన్లోని సినిమా చిత్రీకరణ తర్వాత, కమల్‌హాసన్–రజనీకాంత్‌ల మల్టీస్టారర్ మూవీ సెట్స్‌కు వెళ్తుందని ఊహించవచ్చు.కాకాజీ?హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. తాజాగా వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. అయితే ఈ సినిమా ప్రధాన కథాంశం కోల్కత్తా నేపథ్యంతో సాగుతుందని, ఇదొక గ్యాంగ్‌స్టర్ మూవీ అనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.అంతేకాదు... ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ల ఎమోషన్ కూడా బలంగా ఉంటుందని, ఈ చిత్రానికి ‘కాకా’, ‘కాకాజీ’ అనే టైటిల్స్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగు తోంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి, ఆయన కుమార్తె పాత్రలో అనస్వరా రాజన్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారని, ఆ దిశగా షూటింగ్ షెడ్యూల్స్‌ను జరిపేందుకు బాబీ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. మరో గ్యాంగ్‌స్టర్ సినిమా? హీరో నానితో ‘దసరా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానీతోనే ‘ది ΄్యారడైజ్’ అనే సినిమా తీస్తున్నారు. ‘ది ΄్యారడైజ్’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 21న రిలీజ్ కానుంది. అయితే హీరో చిరంజీవి– దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. నాని ఈ సినిమాకు నిర్మాత. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామా అని ఫిల్మ్‌నగర్ సమాచారం. కానీ ఈ సినిమా ప్రారంభం కావడానికి మరికొంత సమయం ఉంది. ఈ సినిమా 2027లో సెట్స్‌కు వెళ్లొచ్చు.ముంబై మాఫియాబాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన తొలి సినిమా ‘వీరసింహారెడ్డి’. 2023లో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ను అలరించి, హిట్‌గా నిలిచింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోంది. వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముందు ఈ సినిమా కోసం ఓ చారిత్రాత్మక కథను అనుకున్నారు. కానీ బడ్జెట్ కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌కు వెళ్లలేదు. దీంతో ఓ స్టైలిష్ యాక్షన్ డ్రామా కథను రెడీ చేశారు గోపీచంద్ మలినేని. ఈ సినిమా ముంబై నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ముంబై మాఫియా, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో తొలుత నయనతారను హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఈ ప్లేస్‌లో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారని టాక్. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.పోలీస్ ఆఫీసర్ పోరాటంప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న తొలి సినిమా ‘స్పిరిట్’. ‘అర్జున్‌రెడ్డి, యానిమల్’ సినిమాల ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా, ప్రోఫెసర్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా, ఖైదీగా కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. గ్యాంగ్‌స్టర్ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు ఓ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్‌స్టర్‌గా మారితే ఏం జరుగుతుంది? అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ‘స్పిరిట్’ సినిమాలోని కొంత కథనం సాగుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తున్నారు.ఇందులో త్రిప్తి డాక్టర్ రోల్ చేస్తున్నారని తెలిసింది. ప్రభాస్, త్రిప్తి భార్యాభర్తలుగా కనిపిస్తారని సమాచారం. ప్రభాస్ తండ్రి, జైలర్ పాత్రలో ప్రకాశ్‌రాజ్ కనిపిస్తారట. మరో కీలక పాత్రలో సీనియర్ నటి కాంచన, విలన్స్‌గా వివేక్ ఓబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ నటిస్తున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌తోనే ప్రభాస్ బిజీగా ఉన్నారు. ప్రభాస్–వివేక్ ఒబెరాయ్‌ల మధ్య కీలమైన యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారట సందీప్‌రెడ్డి వంగా. టీ సిరీస్ ఫిల్మస్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది. కోల్‌కతాలో డ్రాగన్కోల్కతాలో ‘డ్రాగన్’ చెప్పిందే జరగాలి. వెండితెరపై ఆ డ్రాగన్ ఎవరంటే ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు మేకర్స్. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘డ్రాగన్’ టైటిల్‌ను ఓ గ్లింప్స్ వీడియోతో మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ఆలియా భట్ లేదా రష్మికా మందన్నా నటించే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. నందమూరి కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘డ్రాగన్’ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది.ఫుడ్ మాఫియా..!డ్రగ్స్ మాఫియా, ఆయుధాల అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్... ఇలా డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్స్‌లో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమాలను ఆడియన్స్ ఎక్కువగా చూసి ఉంటారు. కానీ కాస్త డిఫరెంట్‌గా ఫుడ్ మాఫియా నేపథ్యంలో సాగే కథాంశంతో వస్తున్నారు హీరో నాని. ‘సాహో, ఓజీ’ వంటి గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సుజిత్ తీస్తున్న తాజా సినిమా ‘బ్లడీ రొమియో’. ఈ చిత్రంలో నాని హీరోగా నటిస్తున్నారు.ఈ మూవీ ప్రధానంగా ఫుడ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని తెలిసింది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ప్రస్తుతం నాని ‘ది ΄్యారడైజ్’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత, ‘బ్లడీ రొమియో’ సినిమా సెట్స్‌కు వెళ్తుందని ఊహించవచ్చు.గోవాలో డ్రగ్ మాఫియా‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ :చాఫ్టర్ 2’ వంటి చిత్రాల తర్వాత కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం (ఇంగ్లిష్, కన్నడ) ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్–అప్స్’. 1940–1970 మధ్య కాలంలో, గోవా నేపథ్యంలో సాగే పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ సినిమా ఇది. ఈ మూవీలో తండ్రీకొడుకులుగా యశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలిసింది. ఇందుకు తగ్గట్లుగానే... రాయ, టికెట్..అంటూ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో ఉన్న యశ్ లుక్స్ బయటకు వచ్చాయి. గోవా తీర ప్రాంతంలో జరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామా ఈ సినిమా. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది.ఈ సినిమాలో నాడియాగా కియారా అద్వానీ, గంగ పాత్రలో నయనతార, ఎలిజబెత్ పాత్రలో హ్యూమా ఖురేషీ, రెబెకా పాత్రలో తారా సుతారియా, మెల్లిస్సాగా కియారా అద్వానీ నటిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ ఈ ‘టాక్సిక్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ జూన్ 4న విడుదల కావాల్సింది. కానీ, రిలీజ్‌ను వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ‘టాక్సిక్’ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. సామ్రాజ్యంనార్త్ చెన్నైలో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు హీరో శింబు. వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు హీరోగా షూటింగ్ జరుపుకుంటున్న తమిళ సినిమా ‘అరసన్’. కలైపులి యస్.థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఆండ్రియా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నార్త్ చెన్నై నేపథ్యంలో సాగే పక్కా గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. అయితే నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో ఆల్రెడీ వెట్రిమారన్ డైరెక్షన్లో ధనుష్ హీరోగా ‘వడ చెన్నై’ సినిమా వచ్చింది. కానీ ‘వడ చెన్నై’ సినిమాకు, ‘సామ్రాజ్యం’ చిత్రానికి సంబంధం లేదని దర్శకుడు వెట్రిమారన్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. అలాగే ధనుష్‌తోనే ‘వడ చెన్నై 2’ సినిమా తీయను న్నట్లుగా వెట్రిమారన్ తెలిపారు.డీసీ‘మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో’ వంటి సూపర్‌హిట్ సినిమాలను తీసిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హీరోగా ‘డీసీ’ అనే సినిమా చేశారు. ఈ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. లోకేశ్ కనగరాజ్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ నటి వామికా గబ్బి నటించగా, ఓ కీలక పాత్రలో సంజనా కృష్ణమూర్తి నటించారు. ఈ సినిమాలో దేవదాస్ పాత్రలో లోకేశ్, చంద్రగా వామికా గబ్బి నటించారని తెలిసింది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ ‘డీసీ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందని తెలిసింది.ఇలా గ్యాంగ్‌స్టర్స్‌గా వెండితెరపై నటిస్తున్న మరికొంతమంది హీరోలు ఉన్నారు. ఇంకొంతమంది హీరోలు ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా జానర్లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.– ముసిమి శివాంజనేయులు -
కాన్స్‌లో సందడి
‘ఎంట్రీ సూపర్... ప్రిన్సెస్‌లా ఉంది’ అంటూ ప్రస్తుతం కాన్స్ చిత్రోత్సవాల్లో సందడి చేస్తున్న ఆలియా భట్ని ఉద్దేశించి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఫ్రాన్స్‌లోని కాన్స్ నగరంలో 79వ కాన్స్ చలన చిత్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఆరంభమైన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ 23 వరకూ జరుగుతుంది. ఈ చిత్రోత్సవాల్లో భారతీయ తారలు ఐశ్వర్యా రాయ్, ఆలియా భట్, తారా సుతారియా తదితరులు పాల్గొననున్నారు.ఇప్పటికే ఆలియా ఫ్రాన్స్ చేరుకున్నారు. ఓ బ్యూటీ ప్రాడెక్ట్కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆమె ఇందులో భాగంగానే అక్కడికి వెళ్లారు. తొలి రోజు రెడ్ కార్పెట్‌పై నడిచే ముందు ఆలియా ఫ్రెంచ్ రివెరా దగ్గర దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఫ్లోరల్ ప్రింట్ ఫ్రాక్‌లో ఆమె మెరిసిపోయారు. ఇలా తొలి రోజే ఫొటోషూట్‌తో ఆకట్టుకున్న ఆలియా... మరి రెడ్ కార్పెట్‌పై ఏ స్థాయిలో సందడి చేస్తారో చూడాలి. -
జాతరలో డిష్యుం... డిష్యుం
జాతరలో రెచ్చిపోయి ఫైట్ చేస్తున్నారట రవితేజ. ఎందుకంటే ‘ఇరుముడి’ సినిమా కోసం అన్నమాట. ఆయన హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇరుముడి’. ఈ చిత్రంలో రవితేజ కుమార్తెగా బేబీ నక్షత్ర, భార్య పాత్రలో ప్రియా భవానీశంకర్ నటిస్తున్నారు.నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రవితేజ పాల్గొనగా ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారట. ఈ ఫైట్ జాతర బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. తండ్రీకూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. -
కొత్త ప్రపంచంలోకి...
‘శంబాల’ వంటి హిట్ మూవీ తర్వాత ఆది సాయికుమార్, యుగంధర్ ముని, షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు కాంబినేషన్లో మరో సినిమా ఖరారైంది. ఆది సాయికుమార్ హీరోగా యుగంధర్ ముని సమర్పణలో మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మించనున్న ఈ చిత్రానికి బృందా రవీందర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ని రిలీజ్ చేశారు.ఆది మంచి మాస్ రోల్ చేయనున్నట్లు ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ‘‘ఎమోషన్స్‌తో పాటు హారర్ ఎలిమెంట్స్‌ను సరికొత్తగా చూపించనున్న చిత్రం ఇది. భయం, ఉత్కంఠ, అపరిమితమైన వినోదంతో ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా మా సినిమా ఉంటుంది. సంగీతానికి ప్రాధాన్యం ఉన్న కథ ఇది ’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
యషిక ఆనంద్ హాట్ పోజులు.. యువరాణిలా ఐటమ్ బ్యూటీ నోరా..!
హీరోయన్ యషిక ఆనంద్ హాట్ పోజులు..సమ్మర్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్..యోగా చేయాలంటోన్న హీరోయిన్ అనన్య నాగళ్ల..యువరాణిలా మెరిసిపోతున్న ఐటమ్ బ్యూటీ నోరా ఫతేహీ..కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్.. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Khushi Kapoor (@khushikapoor) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
'నలుగురు పిల్లల అమ్మాయితో పెళ్లి'.. ఆసక్తిగా టీజర్
సూర్య వశిష్ట, దీప్షిక హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ రమణి కల్యాణం. ఈ ఎమోషనల్ డ్రామాకు విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు. కోర్ట్ మూవీ ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సీనియర్ నటి జయసుధ చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. ఈ సినిమా నిర్మించిన నిర్మాతలకు అభినందనలు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు అద్భుతంగా నటించారు. విజయ్ చాలా ప్యాషన్‌తో ఈ సినిమా తీశాడు. ఇది ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో కూడా చాలా మంచి చిత్రాలు వస్తున్నాయి. ‘రమణి కళ్యాణం’ కూడా అలాంటి సినిమానే. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇది ఒక మంచి ఫీల్‌గుడ్ మూవీ. మే 22న ఈ సినిమా విడుదల అవుతోంది. అందరూ థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు.డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. ఇది మంచి టీమ్ సపోర్ట్‌తో చేసిన సినిమా. ఈ కథను నమ్మి పనిచేసిన అందరికీ థ్యాంక్స్. హీరో, హీరోయిన్లు చాలా ప్యాషన్‌తో సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రామ్ జగదీశ్ నా ఫ్రెండ్. ఈ సినిమాలో ఆయన చాలా చక్కని మాటలు రాశారు. నా రైటింగ్ టీమ్ అందరికీ థ్యాంక్యూ. సినిమాలు థియేటర్స్‌లోనే చూడాలి. ఆ అనుభూతి వేరు. అందరూ సినిమాలను థియేటర్స్‌లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. మాకు ఎంతో సపోర్ట్ చేసిన జయసుధ గారికి ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, శ్యామల, చైతు జొన్నల గడ్డ కీలక పాత్రల్లో నటించారు. -
నాని ది ప్యారడైజ్‌పై రూమర్స్.. మేకర్స్ రియాక్షన్..!
దసరా బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌తో తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాని లుక్, ఆయా షేర్ పాట ఫ్యాన్స్‌ను అలరించాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. సుబ్బలక్ష్మి పాత్రలో అభిమానులను మెప్పించనుంది. ఈ మూవీలో జడల్ పాత్రలో హీరో నాని అలరించనున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ చిత్రంపై ఇటీవల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌కు హీరో నాని రీ షూట్ కోరాడని సోషల్ మీడియాలో వైరలైంది. కొన్ని సన్నివేశాలతో నాని పూర్తిగా సంతృప్తి చెందలేదని.. అందుకే దర్శకుడు ఓదెలను రీ షూట్ చేయాలని కోరినట్లు పెద్దఎత్తున టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ది ప్యారడైజ్ మేకర్స్ స్పందించారు.రీ షూట్ వార్తలపై టీమ్ క్లారిటీ..ది ప్యారడైజ్ మూవీని ఎలాంటి రీ షూట్ చేయడం లేదని స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా మా సినిమాకు సంబంధించి నిరాధారమైన, బాధ్యతారహితమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయని అన్నారు. అంతా మేము అనుకున్న విధంగానే ముందుకు సాగుతోందని తెలిపారు. ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన షెడ్యూల్ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రణాళిక ప్రకారం జరుగుతోందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.దయచేసి సోషల్ మీడియాలో వచ్చే రీ షూట్ లాంటి వార్తలు ఎవరు నమ్మవద్దని మూవీ టీమ్ కోరింది. మా అధికారిక మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని.. ఏదైనా ఉంటే మేమే నేరుగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. అవాస్తవ కథనాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. ఈ చిత్రంలో విలన్ శికంజ మాలిక్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్ట్ 21న థియేటర్లలో సందడి చేయనుంది.Over the past few days, we’ve noticed several baseless rumors and irresponsible speculations being circulated about #TheParadise.For clarity:• #TheParadise was planned with absolute clarity from day one, and the film is progressing exactly as intended. Over 100 shooting days… https://t.co/kjP8VpgV9x— THE PARADISE (@TheParadiseOffl) May 12, 2026 -
'జీవో ఇచ్చినా రేట్లు పెంచే ప్రసక్తే లేదు' తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం
తెలంగాణ ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ బాగుండాలంటే పర్సంటేజీ విధానంలో సింగిల్ స్క్రీన్లు రన్ చేయడం తప్పనిసరి అని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సింగిల్ స్క్రీన్ల మనుగడకు టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతల మద్దతు కావాలని కోరింది. ఈ విషయంలో ఎగ్జిబిటర్స్ అంతా ఓ నిర్ణయానికి వచ్చామని తెలిపింది. నిర్మాతలందరు అర్థం చేసుకుని మాకు సపోర్ట్ చేయాలని కోరారు. సింగిల్ స్క్రీన్స్‌పై సవతి ప్రేమ వద్దని అన్నారు.దిల్ రాజు సోదరుడు శిరీష్ మాట్లాడుతూ..'ఎగ్జిబిటర్స్ బ్రతుకు పోరాటం ఈ పర్సంటేజ్ విధానం. నిర్మాతలందరు అర్థం చేసుకొండి. మాకు సపోర్ట్ చేయండి. తెలుగులో సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోతున్నాయి. ఇప్పుడంతా ఓటీటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. థియేటర్‌ను పక్కన పెట్టేస్తున్నారు. సింగిల్ స్క్రీన్‌ను కాపాడుకోవాల్సిన అవసరముంది. గవర్నమెంటు జీవో ఇచ్చినా సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో టికెట్ రేట్లు పెంచం' అని అన్నారు.ఎగ్జిబిటర్ శ్రీధర్ మాట్లాడుతూ..'2008 నుంచి పర్సంటేజ్ కోసం కొట్లాడుతున్నాం. హరిహర వీరమల్లు టైంలో మాట్లాడితే థియేటర్స్ మూసేస్తున్నామని నెగిటివ్ ప్రచారం చేశారు. నిదానంగా అన్నీ ప్రొడక్షన్స్ హౌస్‌లు పర్సంటేజ్ పద్ధతి వైపే వస్తున్నాయి. అందరూ ఈ విధానానికి వస్తే మేము ధియేటర్స్ నడుపుతాం'అని అన్నారు.చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..'నిర్మాతకు ఎగ్జిబిటర్ బిడ్డతో సమానం. చాలా కాలం నుంచి సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి దారుణంగా ఉంది. సింగిల్ స్క్రీన్స్ బిర్యానీ అయితే మల్టీప్లెక్స్ ఆవకాయ లాంటిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ముగ్గురు కలవాల్సిన అవసరం ఉంది' అని అన్నారు. -
'అందుకే జనాలు థియేటర్లకు రావడం లేదు'.. రాహుల్ రామకృష్ణ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ నటుడు రామకృష్ణ మనందరికీ సుపరిచితమైన పేరు. జాతిరత్నాలు మూవీలో తన నటన, డైలాగ్స్‌తో అందరినీ నవ్వించేశాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో కమెడియన్‌గా మెప్పించారు. అయితే తాజాగా రాహుల్ రామకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కంటెంట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. జనాలు థియేటర్లకు రావాలంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయానని తెలిపారు. సినిమా టికెట్ కంటే ఎక్కువగా పార్కింగ్, పాప్‌కార్న్, పెట్రోల్ ఖర్చుల వల్ల ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఇవన్నీ దాటుకుని ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే సినిమాలు గొప్పగా ఉండాలని అన్నారు. బలహీనమైన కంటెంట్ కారణంగానే థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా రాహుల్ రామకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. 'థియేటర్లు ఖాళీగా ఉండటం చాలా బాధాకరరం. ఇది మన సినిమాలకు ప్రేక్షకులు ఇస్తున్న నిజమైన తీర్పు. మనం తీస్తున్న సినిమాల స్థాయి ఎలా ఉందో పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ రోజుల్లో ప్రేక్షకుడు థియేటర్‌కి రావడం అంత ఈజీ కాదు. బయటకు రావాలంటే ముందుగా ట్రాఫిక్ ఇబ్బందులు, పెరుగుతున్న పెట్రోల్ ఖర్చులు, పార్కింగ్ ఛార్జీలు, థియేటర్లలో స్నాక్స్ రేట్లు వంటి చాలా విషయాలు ప్రేక్షకుడిని ప్రభావితం చేస్తున్నాయని' అన్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్‌కి రావాలంటే కథలో కొత్తదనం ఉండాలని రాహుల్ అన్నారు. కథలో ఏదైనా ప్రత్యేకత ఉంటే తప్ప జనాలు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ప్రస్తుతం ఓటీటీల్లోనే చూసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. రోటీన్ కథలకు కాలం చెల్లిందని.. కథలో కొత్తదనం, ఎమోషన్స్ ఉంటేనే ఆడియన్స్ ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. ఈ కామెంట్స్ టాలీవుడ్ సినిమా పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇకనైనా టాలీవుడ్ కంటెంట్‌పై దృష్టి పెడితే బాగుంటుందని సగటు అభిమాని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
సీఎంగా విజయ్.. మరి కోలీవుడ్ దళపతి ఎవరు?
ఇన్నాళ్లు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దళపతిగా ఉన్న విజయ్.. ఇప్పుడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కేశారు. సినిమాల్లో తన మార్క్ క్రియేట్ చేసిన విజయ్.. రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. పోటీ చేసిన తొలిసారే సీఎంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందే జన నాయగన్ తన చివరి చిత్రమని స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.దీంతో కోలీవుడ్‌లో ఇకపై దళపతి అన్న పేరు వినిపించదు. మరి విజయ్ ప్లేస్‌ను ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై చర్చ మొదలైంది. విజయ్ సీఎం కావడంతో కోలీవుడ్‌లో తదుపరి దళపతి ఎవరన్న విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుత తమిళ హీరోల్లో ఎవరికీ అంతటి స్టార్డమ్ ఉందో మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.తదుపరి దళపతి ఎవరు?విజయ్ తర్వాత కోలీవుడ్‌లో అంతే రేంజ్లో క్రేజ్ ఉన్న హీరో అజిత్ కుమార్. గతేడాది రెండు సినిమాలతో అలరించిన అజిత్.. ప్రస్తుతం రేసింగ్‌లో బిజీగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కోలీవుడ్ దళపతిగా నిలుస్తారేమో వేచి చూడాల్సిందే. ఇక అజిత్ తర్వాత వరుసలో ధనుశ్, సూర్య, విక్రమ్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. వీరికి విజయ్ రేంజ్లో మాస్ ఇమేజ్ దక్కడం కష్టంగానే అనిపిస్తోంది. శివ కార్తికేయన్ వరుస సినిమాలతో అలరిస్తున్నా.. ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోగా ముద్ర వేసుకున్నారు. దీంతో విజయ్‌లా మాస్ ఇమేజ్ దక్కడం అసాధ్యమేనని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కోలీవుడ్ దళపతి ఎవరు అవుతారో వేచి చూడాల్సిందే. -
రామ్ చరణ్ పెద్ది.. నార్త్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ పెద్ది. ఈ మూవీలోని రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. పెద్ది ట్రైలర్‌ను మే 18న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.తాజాగా ఈ మూవీ నార్త్ ఇండియా రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ దక్కించుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. హీందీతో పాటు తెలుగు హక్కులను కూడా జియో స్టూడియోస్ సొంతం చేసుకుంది. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. పెద్ది మూవీ స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ స్టెప్పులు వేయనుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. Excited to bring Peddi to theatres across North India in Hindi & Telugu.Peddi in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani… pic.twitter.com/TvSYP8hRzt— Jio Studios (@jiostudios) May 12, 2026 -
ఎక్కువ సినిమాలు చేసింది ఎవరు? బ్రహ్మీ స్థానమెంత?
ఒకప్పటితో పోలిస్తే మన దేశానికి సంబంధించిన వివిధ భాషల సినిమాలు, నటీనటులు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అదే టైంలో యాక్టర్స్ ఎక్కువైపోవడం వల్ల కెరీర్ మొత్తంలో మహా అయితే పదుల సంఖ్యలో లేదంటే వందల్లో మాత్రమే మూవీస్ చేస్తున్నారు. కానీ కొందరు నటీనటులు మాత్రం వేల చిత్రాల్లో నటించి ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ సృష్టించారు. ఇంతకీ ఎక్కువ చిత్రాల్లో కనిపించిన నటి/నటుడు ఎవరంటే?(ఇదీ చదవండి: ఓటీటీలో కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్)సుకుమారిమలయాళ చిత్రసీమకు చెందిన ఈమె.. 1940లో పుట్టి 2013లో చనిపోయారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ, సింహళ, ఫ్రెంచ్, ఇటాలియన్, బెంగాలీ, తుళు, ఇంగ్లీష్ భాషల్లో కలిపి మొత్తంగా 2500కి పైగా సినిమాల్లో కనిపించారు. ఈమెనే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.మనోరమగోపిశాంత అలియాస్ మనోరమ స్వతహాగా తమిళ నటి. 1500కి పైగా సినిమాల్లో కనిపించిన ఈమె 5000కి పైగా నాటకాల్లోనూ వివిధ పాత్రలు పోషించారు. అలానే అన్నాదురై, కరుణానిధి, జయలలిత, ఎమ్జీఆర్, స్టాలిన్, ఎన్టీఆర్, విజయ్ లాంటి ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత ఈమె సొంతం.జగతి శ్రీకుమార్మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు, దర్శకుడు, సింగర్ అయిన శ్రీకుమార్ ఆచారి అలియాస్ జగతి శ్రీకుమార్ నాలుగు దశాబ్దాల కెరీర్లో 1500కి పైగా మూవీస్‌లో కనిపించారు.బ్రహ్మానందంతెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం తన కెరీర్ మొత్తంలో 1100కి పైగా మూవీస్ చేశారు. 1000కి చిత్రాల్లో కమెడియన్ గా చేసిన గిన్నిస్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు. కమెడియన్లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న రికార్డ్ కూడా ఈయన పేరిట ఉంది.శక్తి కపూర్బాలీవుడ్కి చెందిన శక్తి కపూర్.. 1975 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో యానిమల్, ఎల్ 2 ఎంపురాన్ లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో కనిపించారు. 1980-90 మధ్య కాలంలో 100కి పైగా సినిమాలు చేసిన ఈయన.. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు 700కిపైగా మూవీస్‌లో కనిపించారు. ఈయన కూతురు శ్రద్ధా కపూర్ ప్రస్తుతం హీరోయిన్గా చేస్తోంది.అనుపమ్ ఖేర్హిందీ నటుడు అనుపమ్ ఖేర్. 1982 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో పలు పాన్ ఇండియా చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో 540కి పైగా సినిమాల్లో కనిపించారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగానూ పలు చిత్రాల్ని తెరకెక్కించడం విశేషం.మమ్ముట్టిమహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్ అలియాస్ మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 74 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ హీరోగా మూవీస్ చేస్తున్న ఈయన కెరీర్ మొత్తంలో 450కి పైగా చిత్రాల్లో కనిపించారు. ఇందులో 400కి పైగా సినిమాల్లో హీరోగా నటించడం విశేషం. ఈయన కొడుకు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియాలోని ప్రధాన భాషల్లో హీరోగా సినిమాలు చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్) -
'తప్పు నాదే.. ఇప్పటికీ ఆ సినిమా చూడలేదు'.. లయ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ లయ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది నితిన్ తమ్ముడు మూవీతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. హిట్ పెయిర్ అయిన శివాజీ సరసన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం టాలీవుడ్లో మంచి పాత్రలు వస్తే చేయడానికి రెడీ అంటోంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అప్పట్లో తాను ఓ సినిమా చేసినందుకు చాలా బాధపడ్డానని తెలిపింది. స్వయంవరం తర్వాత వడ్డే నవీన్ సరసన మా బాలాజీ అనే మూవీలో విడో పాత్రలో కనిపించానని వివరించింది. అయితే ఆ సినిమా కథ రెమ్యునరేషన్ గురించి తాను అడగలేదని తెలిపింది. అయితే ఇలాంటి తప్పులు చేయకూడదని తర్వాత అనిపించిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కేవలం కోడి రామకృష్ణ గారిపై ఉన్న గౌరవంతో కథ వినకుండానే చేశానని తెలిపింది. ఆ సినిమాను ఇప్పటి వరకు తాను చూడలేదని లయ షాకింగ్ కామెంట్స్ చేశారు. విడో పాత్రలో నన్ను నేను చూసుకోలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.


