తమిళ హీరో రవి మోహన్.. భార్య ఆర్తితో తెగదెంపులు చేసుకుని సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. విడాకులు మంజూరు కాకముందే సింగర్‌తో షికార్లు చేస్తుండటంతో వీరిపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌యే.. రవిమోహన్ దంపతుల విడాకులకు కారణమని ఆమెను నెటిజన్లు దుయ్యబట్టారు.
వదిలేస్తున్నా..
ఇటీవల మీన్‌కులతి భగవతి ఆలయ ఉత్సవాల్లో రవితో కలిసి కెనీషా స్టేజ్ షేర్ చేసుకోవడంపై తీవ్రంగా విమర్శించారు. ఈ ఆన్‌లైన్ ట్రోలింగ్‌తో కలత చెందిన కెనీషా సంచలన నిర్ణయం తీసుకుంది. రవిని వదిలేస్తున్నా.. అతడిని కాపాలనుకోవడం నా మూర్ఖత్వం అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. రవి- ఆర్తిల 15 ఏళ్ల వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడానికి తాను కారణం కాదని, తమది కేవలం స్నేహబంధం మాత్రమేనని వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాకు, మ్యూజిక్‌కు గుడ్‌బై చెబుతూ.. చెన్నై వదిలి వెళ్లిపోతున్నట్లు ప్రకటించింది.
నావల్ల కావట్లేదు
ఈ పోస్ట్‌తో వీరి ప్రేమ ముగిసినట్లేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి దీనిపై రవి మోహన్ ఏమని స్పందిస్తాడో చూడాలి! దీనికంటే ముందు కూడా కెనీషా తన గతాన్ని గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది. నాలుగేళ్ల వయసులో ఇంట్లో వేధింపులకు గురయ్యానంది. 18 ఏళ్లకే పెళ్లి చేయగా భర్త కూడా టార్చర్ పెట్టాడంది. వివాహమైన నాలుగు నెలలకే గర్భం దాల్చినప్పటికీ అతడి చిత్రహింసల వల్ల బిడ్డను కోల్పోయానంది. తర్వాత అమ్మను కోల్పోవడం.. అనంతరం అల్జీమర్స్ (మతిమరుపు)తో బాధపడుతున్న నాన్నను కోల్పోవడం తనను కుంగతీశాయంది.
స్నేహం మాత్రమే..
ఆ సమయంలో బార్‌కు వెళ్లి పాటలు పాడటం మొదలుపెట్టానంది. ఒక ఆడియోలాంచ్‌లో రవిమోహన్ కలిశాడని, అక్కడే తమకు పరిచయం ఏర్పడగా స్నేహానికి దారి తీసిందని తెలిపింది. అయితే అతడి కుటుంబాన్ని విడగొట్టాలన్న ఉద్దేశం తనకెప్పుడూ లేదని పేర్కొంది. ఇంతలోనే ఈ ట్రోలింగ్ తన వల్ల కావడం లేదని.. తన ప్రేమను ఎవరూ నమ్మడం లేదంటూ అతడిని వదిలేస్తున్నానని కెనీషా పోస్ట్ పెట్టింది.


