Kenishaa Francis
-
నాపై చేతబడి.. రక్తం వాంతులు, నరకం చూశా : జయం రవి
గత కొంతకాలంగా జయం రవి వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. భార్య ఆర్తితో విడాకులు ఇచ్చినప్పటి నుంచి ఆయన పర్సనల్ లైఫ్‌పై పుకార్లు ఎక్కువయ్యాయి. సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో ఆయన రిలేషన్లో ఉండడం.. విడాకులకు ఆమెనే కారణం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ట్రోల్ చేశారు. అయితే తాజాగా సింగర్ కెనీషా కూడా షాకిచ్చింది. రవితో తనకున్న రిలేషన్‌కి బ్రేకప్ చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ట్రోలింగ్స్ వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే చెన్నై నగరాన్ని సైతం వదిలి వెళ్లిపోతున్నట్లు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా జయం రవి మీడియా ముందుకు వచ్చాడు. ఈ వివాదాలపై మాట్లాడుతూ ఎమోషన్ అయ్యాడు.నరకం చూశా.. ఇండస్ట్రీలోకి వచ్చి 23 ఏళ్లు అవుతుందని.. ఇన్నేళ్లు ఎలాంటి మచ్చ లేకుండా బతికిన తాను.. పెళ్లి తర్వాత నరకం చూశానని అన్నాడు. ‘పెళ్లైయిన మొదటి రోజు నుంచే బ్లాక్ మెయిల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంట్లో కనీసం గౌరవం కూడా ఇచ్చవాళ్లు కాదు. ఆఖరికి నేను సంపాదించుకున్న డబ్బుని దాచుకోవడానికి కూడా ఒక అకౌంట్ లేకుండా చేశారు. ఎంతో ఇష్టంగా కోట్లాది రూపాయలకు కట్టుకున్న ఇంటిని కూడా వాళ్లే(ఆర్తి) స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నేను అద్దె ఇంట్లోనే ఉంటున్నా. కనీసం నా పిల్లలను కూడా చూడనివ్వడం లేదు. ఫోన్లు లాక్కున్నారు. స్కూల్‌కి బాడీగార్డ్స్‌ని పెట్టి పంపిస్తున్నారు. ఒక గ్రూప్ క్రియేట్ చేసి, వాళ్లకు డబ్బులు ఇచ్చి నన్ను నాపై ట్రోలింగ్ చేస్తున్నారు. నా బిడ్డల భవిష్యత్తు కోసమే అన్నీ భరించా.(చదవండి: రవిని వదిలేస్తున్నా.. ట్రోలింగ్ తట్టుకోలేక సింగర్ బ్రేకప్!)చేతబడి చేశారు.. ఇంట్లో ఉన్నప్పుడు నేను వారి చెప్పుచేతుల్లో ఉండడానికి నాపై చేతబడి చేశారు. నన్ను పూర్తిగా అనచివేయడానికి ఇలా చేశారు. ఆ చేతబడి ప్రభావం వల్ల ఇప్పుడు నాకు రక్తంతో వాంతులు అవుతున్నాయి. శారీరకంగా, మానసికంగా హింసించి నన్ను చంపేయాలని కుట్ర చేస్తున్నారు. అయితే అందరి సంగతి తేల్చేవరకు నేను పోరాడుతూనే ఉంటా. అప్పటి వరకు నటించను45 ఏళ్ల వయసులో అమ్మాయిల వెంట పడాల్సిన అవసరం నాకు లేదు. సినిమాలలో మహిళల హక్కుల గురించి మాట్లాడే తాను, ఆడవారి గురించి ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని లక్షలు పెట్టి చదివించాను. అయినా కూడా వాళ్లపై నాకు ప్రేమ లేదని రాయించారు. అవి ఎంత భాదిస్తాయో తెలుసా? ఇన్నాళ్లు నన్ను అర్ధం చేసుకుని తోడుగా నిలిచిన కేనీషాను కూడా టార్గెట్ చేసి వేధింపులు చేసి ఆమెను పంపించేశారు. మూడక్షరాల ఇడ్లీ నటి నా జీవితాన్ని నాశనం చేసింది.. నాతో పాటు ఎన్నో కుటుంబాలను ఆమె కూల్చింది. నా వ్యక్తిగత జీవితాన్ని సరిదిద్దుకుని .. నా భార్యతో విడాకులు తీసుకున్నాకే తిరిగి సినిమాలలో నటిస్తా, అప్పటి వరకు నటించనని జయం రవి వెల్లడించారు. View this post on Instagram A post shared by Sun News Tamil (@sunnews) -
రవిని వదిలేస్తున్నా.. ట్రోలింగ్ తట్టుకోలేక సింగర్ బ్రేకప్!
తమిళ హీరో రవి మోహన్.. భార్య ఆర్తితో తెగదెంపులు చేసుకుని సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. విడాకులు మంజూరు కాకముందే సింగర్‌తో షికార్లు చేస్తుండటంతో వీరిపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సింగర్ కెనీషా ఫ్రాన్సిస్యే.. రవిమోహన్ దంపతుల విడాకులకు కారణమని ఆమెను నెటిజన్లు దుయ్యబట్టారు.వదిలేస్తున్నా..ఇటీవల మీన్కులతి భగవతి ఆలయ ఉత్సవాల్లో రవితో కలిసి కెనీషా స్టేజ్ షేర్ చేసుకోవడంపై తీవ్రంగా విమర్శించారు. ఈ ఆన్లైన్ ట్రోలింగ్‌తో కలత చెందిన కెనీషా సంచలన నిర్ణయం తీసుకుంది. రవిని వదిలేస్తున్నా.. అతడిని కాపాలనుకోవడం నా మూర్ఖత్వం అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. రవి- ఆర్తిల 15 ఏళ్ల వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడానికి తాను కారణం కాదని, తమది కేవలం స్నేహబంధం మాత్రమేనని వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాకు, మ్యూజిక్కు గుడ్‌బై చెబుతూ.. చెన్నై వదిలి వెళ్లిపోతున్నట్లు ప్రకటించింది.నావల్ల కావట్లేదుఈ పోస్ట్‌తో వీరి ప్రేమ ముగిసినట్లేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి దీనిపై రవి మోహన్ ఏమని స్పందిస్తాడో చూడాలి! దీనికంటే ముందు కూడా కెనీషా తన గతాన్ని గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది. నాలుగేళ్ల వయసులో ఇంట్లో వేధింపులకు గురయ్యానంది. 18 ఏళ్లకే పెళ్లి చేయగా భర్త కూడా టార్చర్ పెట్టాడంది. వివాహమైన నాలుగు నెలలకే గర్భం దాల్చినప్పటికీ అతడి చిత్రహింసల వల్ల బిడ్డను కోల్పోయానంది. తర్వాత అమ్మను కోల్పోవడం.. అనంతరం అల్జీమర్స్ (మతిమరుపు)తో బాధపడుతున్న నాన్నను కోల్పోవడం తనను కుంగతీశాయంది.స్నేహం మాత్రమే..ఆ సమయంలో బార్‌కు వెళ్లి పాటలు పాడటం మొదలుపెట్టానంది. ఒక ఆడియోలాంచ్లో రవిమోహన్ కలిశాడని, అక్కడే తమకు పరిచయం ఏర్పడగా స్నేహానికి దారి తీసిందని తెలిపింది. అయితే అతడి కుటుంబాన్ని విడగొట్టాలన్న ఉద్దేశం తనకెప్పుడూ లేదని పేర్కొంది. ఇంతలోనే ఈ ట్రోలింగ్ తన వల్ల కావడం లేదని.. తన ప్రేమను ఎవరూ నమ్మడం లేదంటూ అతడిని వదిలేస్తున్నానని కెనీషా పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Keneeshaa (@keneeshaa1) చదవండి: అర్ధరాత్రి నడిరోడ్డుపై దీనస్థితిలో పావలా శ్యామల -
తిరుమల శ్రీవారి సేవలో జయం రవి, సింగర్ కెనీషా (ఫోటోలు)
-
హవ్వ, పెళ్లి కాలేదా? ప్రియురాలి కోసం అబద్ధమాడిన హీరో!
తమిళ హీరో రవి మోహన్ ఓపక్క విడాకుల వ్యవహారం, మరోపక్క సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లో ఉంటున్నాడు. విడాకులు మంజూరవకముందే సింగర్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చాలాసార్లు విమర్శలపాలయ్యాడు. అయితే ఏకంగా అతడికి అసలు పెళ్లే కాలేదని చెప్తూ ప్రియురాలి కోసం ల్యాండ్ కొన్నట్లు ఓ వార్త కోలీవుడ్ టౌన్లో వైరల్‌గా మారింది.ఇంకా పెళ్లవలేదు!రవి మోహన్, కెనీషా ప్రాన్సిస్ గోవాలో భూమి కొనుగోలు చేశారట. ఈ ప్రాపర్టీ ఖరీదు రూ.40-42 లక్షలని తెలుస్తోంది. అయితే రిజిస్ట్రేషన్ సంబంధిత పత్రాల్లో రవి మోహన్.. అన్ మ్యారీడ్ అంటూ తనకింకా పెళ్లవలేదని పేర్కొన్నాడట! విడాకులు మంజూరు కాకముందే సింగిల్ అని ఎలా పేర్కొంటారని పలువురు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరేమో.. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సిబ్బంది పొరపాటున అన్‌మ్యారీడ్ సెలక్ట్ చేసి ఉంటారని భావిస్తున్నారు.పేరు మార్పుకాగా రవి మోహన్.. ప్రముఖ నిర్మాత సుజాత విజయ్‌కుమార్ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ సంతానం. 2024లో రవి మోహన్, ఆర్తి విడిపోయారు. అయితే చట్టపరంగా ఇంకా విడాకులు మంజూరు కాలేదు. ఇకపోతే జయం మూవీతో బ్రేక్ అందుకుని జయం రవిగా కొనసాగుతున్న ఆయన.. గతేడాది జనవరిలో తన పేరు మార్చుకున్నాడు. ఇకపై జయం రవి కాకుండా రవి మోహన్ అనే పిలవాలని కోరాడు. చివరగా పరాశక్తి సినిమాలో విలన్‌గా నటించాడు.చదవండి: నిన్ను నా అంతగా ఇంకెవరూ ప్రేమించలేరు: విజయ్ ఆంటోని -
చిన్నతనం నుంచే నాకు గుర్తింపు లేదు: సింగర్
గాయని కెనిషా పేరు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఈమె మల్టీ టాలెంటెడ్ బ్యూటీ. గాయని, గీత రచయిత, డాన్సర్, నటి ఇలా పలు టాలెంట్స్ కలిగిన బెంగళూరు భామ కెనిషా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల నటుడు రవిమోహన్ స్నేహితురాలిగా వార్తల్లో నానుతున్న గాయని ఈమె. అంతే కాదు నటుడు రవిమోహన్‌కు ఆయన భార్యకు మధ్య మనస్పర్థలకు, వారు విడిపోవడానికి కారణం ఈమె అనే ప్రచారం జరుగుతోంది. వీటన్నింటికి బలం చేకూర్చే విధంగా రవిమోహన్, కెనిషా జంటగా తిరున్నారు.రవి మోహన్‌పై పొగడ్తలుఇలాంటి పరిస్థితుల్లో నటి కెనిషా సందర్భం వచ్చినప్పుడల్లా రవిమోహన్పై పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇటీవల శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన పరాశక్తి చిత్రంలో రవిమోహన్ ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో రవిమోహన్ హీరో అయినా విలన్ అయినా ఆయన వల్లే ఈ చిత్రం ఆడుతోంది. ఎవర్ గ్రీన్ రవిమోహన్ ముందు తన కళ్లకు ఎవరు కనిపించలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. రవితో బర్త్‌డే సెలబ్రేషన్స్రవిమోహన్కు నీడలా ఉంటున్న కెనిషా గత 7వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోగా రవిమోహన్ హాజరై పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇటీవల ఈ గాయని తన ఎక్స్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో తనకు చిన్న వయసులోనుంచే గుర్తింపు లేదంది. ప్రపంచమే మారిపోయిందితాను ఇతరుల నుంచి చిన్న గుర్తింపు, ప్రేమనే ఆశించానని తెలిపింది. అలాంటిది రవిమోహన్ వచ్చిన తర్వాత తన ప్రపంచమే మారిపోయిందని, తన ఆలోచనలు, భావాలు, ప్రేమ తదితర విషయాలు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయంది. ఎవరేమనుకున్నా తాను బాధ పడనని, తాము నిజంగా చాలా ప్రశాంతంగా ఉన్నామంది. ఈ విషయం తమను అర్థం చేసుకున్న వారికి తెలుసని, కష్టాల్లో అండగా నిలబడినవారికి, రవిమోహన్‌కు ధన్యవాదాలని కెనిషా పేర్కొంది. -
ఆమె నాకు దేవుడిచ్చిన వరం.. భార్యను వదిలేసి ప్రియురాలిపై ప్రశంసలు!
ఓపక్క భార్యకు విడాకులు.. మరోపక్క సింగర్‌తో రిలేషన్ రూమర్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు తమిళ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి (Ravi Mohan). ఇతడు ఆర్తి రవిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. 15 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత దంపతులిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ విడాకులకు మూడో వ్యక్తికే కారణమని సంచలన ఆరోపణలు చేసింది ఆర్తి. ఆ మూడో వ్యక్తి మరెవరో కాదు, సింగర్ కెనీషా అంటూ ప్రచారం జరిగింది.పార్ట్నర్షిప్గుడికి వెళ్లినా, బయట పార్టీకి వెళ్లినా రవి, కెనీషా (Kenishaa Francis) జంటగా కనిపిస్తూ ఉండటంతో వీరిమధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని బలంగా నమ్ముతున్నారు. తాజాగా ఆమెపై తనకున్న ప్రేమను పరోక్షంగా చెప్పకనే చెప్పాడు రవి. తన సొంత బ్యానర్ రవి మోహన్ స్టూడియోస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కెనీషాతో కలిసి వచ్చాడు. అంతే కాదు, తన బ్యానర్లో ఆమెను పార్ట్నర్గా ప్రకటించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ఏకైక కారకురాలు కెనీషా! నా జీవితంలో తనలా ఇంతవరకు ఎవరూ సాయం చేయలేదు. కెనీషా ఎమోషనల్జీవితంలో ఏమీ తోచని స్థితిలో చిక్కుకున్నప్పుడు భగవంతుడు మనకు ఏదో రకంగా సాయం చేస్తాడు. అలా నాకు ఆ దేవుడు పంపిన బహుమతి కెనీషా. నేనెవరు?అనేది నాకు తెలిసేలా చేసింది. రవి మోహన్ స్టూడియోలో కెనీషాకి కూడా భాగముంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి వ్యక్తి ఒకరుండాలని మనసారా కోరుకుంటున్నాను అన్నాడు. అతడి స్పీచ్ వింటున్నప్పుడు కెనీషా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది చూసిన జనాలు.. మీరు ప్రేమలో ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ravi Mohan (@iam_ravimohan) చదవండి: టాప్ 15లో తనే చెత్త కంటెస్టెంట్.. దమ్మున్న శ్రీజకు సూపర్ పవర్ -
సింగర్‌తో జయం రవి రిలేషన్.. ఏకంగా ఇద్దరు కలిసి!
కోలీవుడ్ స్టార్ జయం రవి విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. గతేడాది తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన స్టార్ హీరో.. ఆ తర్వాత తన భార్య ఆర్తి ఆరోపణలు చేయడంతో వివాదానికి దారితీసింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. అంతేకాకుండా వీరి మధ్యలో సింగర్ కెన్నీషా పేరు తెరపైకి రావడంతో జయం రవితో రిలేషన్లో ఉందంటూ వార్తలొచ్చాయి. ఆర్తి రవి సైతం మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసింది. అంతకుముందే జయం రవి, సింగర్ కెన్నీషా ఓ పెళ్లి వేడుకలో జంటగా కనిపించడంతో వీరి రిలేషన్‌పై మరింత టాక్ వినిపించింది. తాజాగా మరోసారి వీరిద్దరి రిలేషన్‌పై చర్చ మొదలైంది. ఇంతకీ ఆ సంగతి ఏంటో తెలుసుకుందాం.సాంగ్‌లో జయం రవి ప్రత్యక్షం..తాజాగా సింగర్ కెన్నీషా ఓ మ్యూజిక్ ఆల్బమ్ వీడియోను రిలీజ్ చేసింది. 'ఆండ్రమ్ ఇంద్రమ్'అనే పేరుతో మ్యూజిక్ వీడియో జూన్ 15న విడుదలైంది. ఈ పాటలో జయం రవి అతిథి పాత్రలో కనిపించాడు. అంతేకాకుండా రవి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కెనీషాకు అభినందనలు తెలిపారు. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై మరోసారి కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో ఉన్నందున వీరిద్దరి తమ రిలేషన్‌పై మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
జయం రవితో రిలేషన్ రూమర్స్.. ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్!
గత కొద్ది నెలలుగా కోలీవుడ్ హీరో విడాకుల జయం రవి విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు జయం రవి అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆయన భార్య అతనిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. దీంతో ఒకరిపై ఒకరు వరుస లేఖలతో విమర్శలు చేసుకున్నారు. వీరి విడాకుల వ్యవహారంలో ప్రముఖ సింగర్ కెన్నీషా పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత కూడా జయం రవి, కెన్నీషా ఓ వివాహా వేడుకలో కనిపించడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారంటూ కోలీవుడ్‌లో వార్తలొచ్చాయి.జయం రవి భార్య ఆర్తి సైతం తాము విడిపోవడానికి ముడో వ్యక్తి ప్రమేయం ఉందని ఆరోపించింది. ఈ మేరకు ఆమె లేఖ విడుదల చేసింది. పరోక్షంగా విడాకులకు కారణం సింగర్ కెన్నీషా అంటూ ఆరోపించింది. అయితే ఇటీవల జయం రవి, కెన్నీషా దండలు వేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఏకంగా పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు రాసుకొచ్చారు. కానీ వీరిద్దరు తమిళనాడులోని కుంద్రకుడి మురుగన్ ఆలయాన్ని సందర్శించినప్పుడు పూజారులతో కలిసి తీసుకున్న ఫోటో అని తెలిసింది.అయితే కొద్దికాలంగా సింగర్ కెన్నీషాపై సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది. ప్రస్తుత కెన్నీషా గర్భంతో ఉన్నారంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కొన్ని రోజుల తర్వాత కెన్నీషా తన గర్భధారణపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రెగ్నెన్సీ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చింది. నాకు అందమైన సిక్స్ ప్యాక్ ఉంది.. నేను గర్భవతిని కాదు.. ఎవరు ఏమి చెప్పినా వారి కర్మ వాళ్లే అనుభవిస్తారంటూ మాట్లాడింది. నిజం, అబద్ధాలు ఏంటనేది అతి త్వరలోనే తెలుస్తాయి.. అప్పటి వరకు అందరూ ఇంట్లో బిర్యానీ తయారు చేసుకుని ప్రశాంతంగా తినండి.. నన్ను కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ కెన్నీషా చెప్పుకొచ్చింది. తాజాగా సింగర్ మాటలతో తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలకు చెక్ పెట్టేసింది. -
జయం రవి విడాకుల వివాదం.. సింగర్‌కు హత్య బెదిరింపులు!
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి(Ravi Mohan), సింగర్ కెనీషా(kenishaa) డేటింగ్లో ఉన్నారనే వార్తలు గతకొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అధికారికంగా వీరిద్దరు ప్రకటించనప్పటికీ.. జయం రవి తన భార్య ఆర్తికి దూరంగా ఉండడం.. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో ఇది నిజమనే అంతా అనుకుంటున్నారు. ఇటీవల ఓ ఈవెంట్‌కి కెనీషాతో కలిసి వెళ్లడంతో మరోసారి వీరిద్దరి ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో జయం రవి సతీమణి ఆర్తి సోషల్ మీడియా వేదికగా విడాకులపై స్పందించడం, మూడో వ్యక్తికారణంగానే విడిపోవాల్సి వస్తుందని చెప్పడంతో.. కెనీషానే వీరిద్దరి కాపురంలో చిచ్చు పెట్టిందని కొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు కెనీషాను చంపేస్తామంటూ సందేశాలు కూడా పంపుతున్నారట. ఈ విషయాన్ని కెనీషానే సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. తనను బెదిరిస్తూ పంపిన సందేశాలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేయలేదు. ఏ విషయాన్ని దాచడం లేదు. ఎటూ పారిపోవడం లేదు. నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఉంది. ఏ విషయాన్ని అయినా నా ముఖంపైనే అడగండి. మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నిజానిజాలు చెప్పడం నాకు కూడా సంతోషమే. ఇప్పుడు నా చుట్ట జరుగుతున్న కొన్ని విషయాలకు నేనే బాధ్యురాలు అని మీకు అనిపిస్తే.. కోర్టుకు అప్పగించండి. అంతేకానీ ఇలా శాపాలు పెడుతూ కామెంట్ చేయడం వల్ల నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలుసా? కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. మీరంతా నన్ను నిందిస్తున్నారు. కానీ నిజానిజాలు ఏంటనేది బయటకు వచ్చాక మీరు కూడా ఇలాంటి బాధను అనుభవించాలని నేను కోరుకోవడం లేదు. మీలో చాలామందికి నిజం తెలియకపోవడం వల్ల ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను నిందిస్తున్నారు. మీ అందరి భావాలను నేను అర్థం చేసుకోగలను. కానీ, త్వరలోనే నిజం బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను తప్పు చేస్తే.. చట్టం వేసే శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పటివరకూ నన్ను ద్వేషించకండి. ప్రశాంతంగా బతకనివ్వండి’ అని కెనీషా రాసుకొచ్చింది. -
డబ్బు, పవర్ కాదు మూడో వ్యక్తి వల్లే విడిపోయాం: ఆర్తి రవి
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్)(Ravi Mohan), ఆయన సతీమణి ఆర్తి రవి(Aarti Ravi) మధ్య విడాకుల వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. 2009లో వివాహం చేసుకున్న ఈ జంట, 18 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య జీవితం తర్వాత విడిపోతున్నట్లు గత ఏడాది జయం రవి ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై ఆర్తి తీవ్ర ఆరోపణలు చేస్తూ, తనకు తెలియకుండానే, సంప్రదింపులు లేకుండా రవి ఏకపక్షంగా విడాకులు ప్రకటించారని సోషల్ మీడియాలో వెల్లడించారు.ఈ వివాదం రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. ఆర్తి, జయం రవి తనను ఇంటి నుంచి తరిమేశారని, తమ ఇద్దరు కుమారుల బాధ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. దీనికి కౌంటర్‌గా, ఆర్తి తనపై సానుభూతి కోసం పిల్లలను ఉపయోగించుకుంటోందని జయం రవి విమర్శించారు. తాజాగా, ఆర్తి సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము విడిపోవడానికి డబ్బు లేదా పవర్ కారణం కాదని, మూడో వ్యక్తి (సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో రవి సంబంధం) కారణమని ఆరోపించారు. ఈ విషయంపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఊహాగానం కాదని ఆర్తి స్పష్టం చేశారు.కాగా ఇటీవల జయం రవి, కెనీషాతో కలిసి ఓ వివాహ వేడుకలో కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, దీనిపై ఆర్తి భావోద్వేగంతో స్పందించారు. "18 ఏళ్లు నాతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈజీగా దూరమయ్యారు. పిల్లల బాధ్యత నా భుజాలపై ఉంది. నేను మాట్లాడకపోవడం నా నిజాయితీ కోసమే" అని ఆర్తి పేర్కొన్నారు. మరోవైపు, ఆర్తి తన సోషల్ మీడియా ఖాతాలను తన ఆధీనంలో ఉంచి ఇబ్బంది పెట్టిందని, ఆర్థికంగా, మానసికంగా వేధించిందని రవి ఆరోపించారు.ఆర్తి తల్లి, నిర్మాత సుజాత విజయ్‌కుమార్ కూడా ఈ వివాదంలోకి దిగి, జయం రవిని కొడుకులా చూసుకున్నామని, అతని కోసం రూ.100 కోట్ల అప్పులు చేశామని, అయినా రవి అబద్ధాలు చెబుతున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం ఈ విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణలో ఉంది, కానీ ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
నటుడు రవి మోహన్‌తో జంటగా మళ్లీ కనిపించిన సింగర్
ప్రముఖ నటుడు రవి మోహన్ (జయం రవి) తన భార్యతో విడిపోయిన తర్వాత ప్రముఖ సింగర్‌తో డేటింగ్లో ఉన్నాడంటూ కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే, అందులో ఎలాంటి నిజం లేదని తాము స్నేహితులం మాత్రమే అంటూ ఇద్దరూ చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా వారిద్దరూ ఒక పెళ్లి వేడుకలో జంటగా కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. గతంలో వచ్చిన వదంతులు అన్నీ నిజమే కావచ్చని నెటిజన్లు ఇప్పుడు చెప్పుకొస్తున్నారు.వేల్స్ విశ్వవిద్యాలయం ఛైర్మన్ ఇషారి కె. గణేష్ కుమార్తె పెళ్లి చెన్నైలో జరిగింది. ఈ వేడుకలలో రవి మోహన్‌తో పాటుగా సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ కూడా జంటగా హాజరైంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో తమ మధ్య ఎలాంటి లవ్ లేదు.. కేవలం స్నేహం మాత్రమే అని చెప్పిన ఈ జంట ఇప్పుడు జంటగా కనిపించడంతో మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి. సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ వల్లనే రవి మోహన్ తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అవన్నీ పుకార్లు మాత్రమేనని, తాము స్నేహితులమని వారు చెప్పారు. తాము వృత్తిపరంగానే కలిశామని వారిద్దరూ ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. అనవసరంగా తన విడాకుల మధ్య మూడో వ్యక్తిని లాగుతున్నారంటూ జయం రవి అసహనం వ్యక్తం చేశాడు. తన విడాకుల వ్యవహారానికి సింగర్ కెనిషాతో ఎలాంటి సంబంధం లేదని గతంలోనే ఆయన చెప్పాడు.రవి మోహన్ విడాకులపై గతంలో సింగర్ ఏం చెప్పిందంటే..రవి మోహన్ విడాకుల విషయంలో అనవసరంగా తనను లాగుతున్నారని, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదని సింగర్, థెరపిస్ట్ కెనిషా ఫ్రాన్సిస్ గత ఇంటర్వ్యూలో చెప్పింది. జయం రవి మానసిక అనారోగ్యంతో బాధపడతున్నాడని, చికిత్స కోసమే తన వద్దకు వచ్చాడని అప్పట్లో ఆమె క్లారిటీ ఇచ్చింది. ఒక థెరపిస్ట్‌గా అతనికి చికిత్స అందించానని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని వెల్లడించింది. ‘ఆర్తి, ఆమె పెరెంట్స్ పెట్టిన టార్చర్ కారణంగా రవి చాలా మానసికంగా క్రుంగిపోయాడని చెప్పుకొచ్చింది. ఆయన తనకు స్నేహితుడు, క్లయింట్ కూడా.. అంతకు మించి ఏమి లేదని చెప్పింది. గతంలో ఏమీ లేదని చెప్పిన వారిద్దరూ ఇప్పుడు జంటగా పెళ్లిలో కనిపించడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.కాగా, జయం రవి, ఆర్తిగా వివాహం 2009 జూన్‌లో జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు ఇల్లలు. 15 ఏళ్లపాటు కలిసి కాపురం చేసిన ఈ జంట.. గత ఏడాదిలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు. Yes, It's Keneesha who is sitting behind #RaviMohan !!It's their life, let them live...pic.twitter.com/OeaDDBfZRP— AmuthaBharathi (@CinemaWithAB) May 9, 2025 -
సాక్ష్యాలన్నీ బయటపెడతా.. హీరో భార్యకు సింగర్ వార్నింగ్!
ప్రముఖ నటుడు జయం రవి, ఆర్తి విడాకుల వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కానీ భార్త ఆర్తి మాత్రం తన అనుమతి లేకుండానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడని ఆరోపిస్తుంది. అంతేకాదు జయం రవి సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో సన్నిహితంగా ఉంటున్నట్లు రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఇవి పుకార్లు మాత్రమేనని జయం రవి కొట్టేశాడు. తాజాగా సింగర్ కెనిషా కూడా జయం రవి విడాకుల ఇష్యూపై స్పందిస్తూ అతని భార్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.సింగర్‌తో సహజీవనంజయం రవి గత కొన్నాళ్లుగా భార్య ఆర్తితో కలిసి ఉండడం లేదు. అతను ఒక్కడే వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో సింగర్ కెనిషాతో ప్రేమలో పడ్డాడని..ఆమె కారణంగానే ఆర్తికి దూరంగా ఉంటున్నాడని కోలీవుడ్‌లో రూమర్స్ వచ్చాయి. ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే అటు జయం రవి కానీ, ఇటు కెనిషా కానీ తమ మధ్య ఉన్న బంధాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. తాము వృత్తిపరంగానే కలిశామని చెబుతున్నారు. అనవసరంగా మా విడాకుల మధ్య మూడో వ్యక్తిని లాగుతున్నారంటూ జయం రవి అసహనం వ్యక్తం చేశాడు. నా విడాకుల వ్యవహారానికి సింగర్ కెనిషాతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.సాక్ష్యాలన్నీ బయటపెడతా: సింగర్జయం రవి విడాకుల విషయంలో అనవసరంగా తనను లాగుతున్నారని, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదని అంటోంది సింగర్, థెరపిస్ట్ కెనిషా ఫ్రాన్సిస్. జయం రవి మానసిక అనారోగ్యంతో బాధపడతున్నాడని, చికిత్స కోసమే తన వద్దకు వచ్చాడని చెబుతోంది. ఒక థెరపిస్ట్‌గా అతనికి చికిత్స అందించానని, అంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని వెల్లడించింది. ‘ఆర్తి, ఆమె పెరెంట్స్ పెట్టిన టార్చర్ కారణంగా రవి చాలా మానసికంగా క్రుంగిపోయాడు. ట్రీట్మెంట్ కోసం జూన్‌లో నా దగ్గరకు వచ్చాడు. ఆయనతో నాకు వృత్తిపరమైన స్నేహం మాత్రమే ఉంది. ఆయన స్నేహితుడు, క్లయింట్ కూడా. అంతకు మించి ఏమి లేదు. నా కారణంగానే విడాకులు తీసుకుంటున్నరనేది పచ్చి అబద్దం. రవి తన భార్యకు విడాకులు నోటీసులు పంపిన విషయం కూడా నాకు తెలియదు. నేను ఇచ్చిన ట్రిట్మెంట్, థెరపీకి సంబంధించిన నోట్స్‌తో పాటు అన్ని సాక్ష్యాలు కోర్టుకు ఇవ్వగలను. దీనికి ఎవరి అనుమతి అవసరం లేదంటూ పరోక్షంగా ఆర్తికి వార్నింగ్ ఇచ్చింది. కాగా, జయం రవి, ఆర్తిగా వివాహం 2009 జూన్‌లో జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు ఇల్లలు. 15 ఏళ్లపాటు కలిసి కాపురం చేసిన ఈ జంట.. ఈ నెల 9న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు.


