జయం రవి విడాకుల వివాదం.‍. సింగర్‌కు హత్య బెదిరింపులు! | Ravi Mohan And Aarti Ravi Divorce Issue: Singer Kenisha Receives Death Threats | Sakshi
Sakshi News home page

జయం రవి విడాకుల వివాదం.‍. సింగర్‌కు హత్య బెదిరింపులు!

May 23 2025 1:53 PM | Updated on May 23 2025 2:50 PM

Ravi Mohan And Aarti Ravi Divorce Issue: Singer Kenisha Receives Death Threats

కోలీవుడ్‌ స్టార్‌ హీరో జయం రవి(Ravi Mohan), సింగర్‌ కెనీషా(kenishaa) డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు గతకొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అధికారికంగా వీరిద్దరు ప్రకటించనప్పటికీ.. జయం రవి తన భార్య ఆర్తికి దూరంగా ఉండడం.. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో ఇది నిజమనే అంతా అనుకుంటున్నారు. ఇటీవల ఓ ఈవెంట్‌కి కెనీషాతో కలిసి వెళ్లడంతో మరోసారి వీరిద్దరి ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చింది.

 ఇదే సమయంలో జయం రవి సతీమణి ఆర్తి సోషల్‌ మీడియా వేదికగా విడాకులపై స్పందించడం, మూడో వ్యక్తికారణంగానే విడిపోవాల్సి వస్తుందని చెప్పడంతో.. కెనీషానే వీరిద్దరి కాపురంలో చిచ్చు పెట్టిందని కొంతమంది నెటిజన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు. అంతేకాదు కెనీషాను చంపేస్తామంటూ సందేశాలు కూడా పంపుతున్నారట. ఈ విషయాన్ని కెనీషానే సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. తనను బెదిరిస్తూ పంపిన సందేశాలకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌లను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేసింది.

నేను కామెంట్‌ బాక్స్‌ ఆఫ్‌ చేయలేదు. ఏ విషయాన్ని దాచడం లేదు. ఎటూ పారిపోవడం లేదు. నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఉంది. ఏ విషయాన్ని అయినా నా ముఖంపైనే అడగండి. మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నిజానిజాలు చెప్పడం నాకు కూడా సంతోషమే. ఇప్పుడు నా చుట్ట జరుగుతున్న కొన్ని విషయాలకు నేనే బాధ్యురాలు అని మీకు అనిపిస్తే.. కోర్టుకు అప్పగించండి. అంతేకానీ ఇలా శాపాలు పెడుతూ కామెంట్‌ చేయడం వల్ల నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలుసా? కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. మీరంతా నన్ను నిందిస్తున్నారు. 

కానీ నిజానిజాలు ఏంటనేది బయటకు వచ్చాక మీరు కూడా ఇలాంటి బాధను అనుభవించాలని నేను కోరుకోవడం లేదు.  మీలో చాలామందికి నిజం తెలియకపోవడం వల్ల ఇలాంటి కామెంట్స్‌ పెట్టి నన్ను నిందిస్తున్నారు. మీ అందరి భావాలను నేను అర్థం చేసుకోగలను. కానీ, త్వరలోనే నిజం బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను తప్పు చేస్తే.. చట్టం వేసే శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పటివరకూ నన్ను ద్వేషించకండి. ప్రశాంతంగా బతకనివ్వండి’ అని కెనీషా రాసుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement