breaking news
Kenishaa Francis
-
సింగర్‌తో జయం రవి రిలేషన్.. ఏకంగా ఇద్దరు కలిసి!
కోలీవుడ్ స్టార్ జయం రవి విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. గతేడాది తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన స్టార్ హీరో.. ఆ తర్వాత తన భార్య ఆర్తి ఆరోపణలు చేయడంతో వివాదానికి దారితీసింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. అంతేకాకుండా వీరి మధ్యలో సింగర్ కెన్నీషా పేరు తెరపైకి రావడంతో జయం రవితో రిలేషన్లో ఉందంటూ వార్తలొచ్చాయి. ఆర్తి రవి సైతం మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసింది. అంతకుముందే జయం రవి, సింగర్ కెన్నీషా ఓ పెళ్లి వేడుకలో జంటగా కనిపించడంతో వీరి రిలేషన్‌పై మరింత టాక్ వినిపించింది. తాజాగా మరోసారి వీరిద్దరి రిలేషన్‌పై చర్చ మొదలైంది. ఇంతకీ ఆ సంగతి ఏంటో తెలుసుకుందాం.సాంగ్‌లో జయం రవి ప్రత్యక్షం..తాజాగా సింగర్ కెన్నీషా ఓ మ్యూజిక్ ఆల్బమ్ వీడియోను రిలీజ్ చేసింది. 'ఆండ్రమ్ ఇంద్రమ్'అనే పేరుతో మ్యూజిక్ వీడియో జూన్ 15న విడుదలైంది. ఈ పాటలో జయం రవి అతిథి పాత్రలో కనిపించాడు. అంతేకాకుండా రవి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కెనీషాకు అభినందనలు తెలిపారు. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై మరోసారి కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో ఉన్నందున వీరిద్దరి తమ రిలేషన్‌పై మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
జయం రవితో రిలేషన్ రూమర్స్.. ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్!
గత కొద్ది నెలలుగా కోలీవుడ్ హీరో విడాకుల జయం రవి విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు జయం రవి అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆయన భార్య అతనిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. దీంతో ఒకరిపై ఒకరు వరుస లేఖలతో విమర్శలు చేసుకున్నారు. వీరి విడాకుల వ్యవహారంలో ప్రముఖ సింగర్ కెన్నీషా పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత కూడా జయం రవి, కెన్నీషా ఓ వివాహా వేడుకలో కనిపించడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారంటూ కోలీవుడ్‌లో వార్తలొచ్చాయి.జయం రవి భార్య ఆర్తి సైతం తాము విడిపోవడానికి ముడో వ్యక్తి ప్రమేయం ఉందని ఆరోపించింది. ఈ మేరకు ఆమె లేఖ విడుదల చేసింది. పరోక్షంగా విడాకులకు కారణం సింగర్ కెన్నీషా అంటూ ఆరోపించింది. అయితే ఇటీవల జయం రవి, కెన్నీషా దండలు వేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఏకంగా పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు రాసుకొచ్చారు. కానీ వీరిద్దరు తమిళనాడులోని కుంద్రకుడి మురుగన్ ఆలయాన్ని సందర్శించినప్పుడు పూజారులతో కలిసి తీసుకున్న ఫోటో అని తెలిసింది.అయితే కొద్దికాలంగా సింగర్ కెన్నీషాపై సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది. ప్రస్తుత కెన్నీషా గర్భంతో ఉన్నారంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కొన్ని రోజుల తర్వాత కెన్నీషా తన గర్భధారణపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రెగ్నెన్సీ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చింది. నాకు అందమైన సిక్స్ ప్యాక్ ఉంది.. నేను గర్భవతిని కాదు.. ఎవరు ఏమి చెప్పినా వారి కర్మ వాళ్లే అనుభవిస్తారంటూ మాట్లాడింది. నిజం, అబద్ధాలు ఏంటనేది అతి త్వరలోనే తెలుస్తాయి.. అప్పటి వరకు అందరూ ఇంట్లో బిర్యానీ తయారు చేసుకుని ప్రశాంతంగా తినండి.. నన్ను కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ కెన్నీషా చెప్పుకొచ్చింది. తాజాగా సింగర్ మాటలతో తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలకు చెక్ పెట్టేసింది. -
జయం రవి విడాకుల వివాదం.. సింగర్‌కు హత్య బెదిరింపులు!
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి(Ravi Mohan), సింగర్ కెనీషా(kenishaa) డేటింగ్లో ఉన్నారనే వార్తలు గతకొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అధికారికంగా వీరిద్దరు ప్రకటించనప్పటికీ.. జయం రవి తన భార్య ఆర్తికి దూరంగా ఉండడం.. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో ఇది నిజమనే అంతా అనుకుంటున్నారు. ఇటీవల ఓ ఈవెంట్‌కి కెనీషాతో కలిసి వెళ్లడంతో మరోసారి వీరిద్దరి ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో జయం రవి సతీమణి ఆర్తి సోషల్ మీడియా వేదికగా విడాకులపై స్పందించడం, మూడో వ్యక్తికారణంగానే విడిపోవాల్సి వస్తుందని చెప్పడంతో.. కెనీషానే వీరిద్దరి కాపురంలో చిచ్చు పెట్టిందని కొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు కెనీషాను చంపేస్తామంటూ సందేశాలు కూడా పంపుతున్నారట. ఈ విషయాన్ని కెనీషానే సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. తనను బెదిరిస్తూ పంపిన సందేశాలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేయలేదు. ఏ విషయాన్ని దాచడం లేదు. ఎటూ పారిపోవడం లేదు. నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఉంది. ఏ విషయాన్ని అయినా నా ముఖంపైనే అడగండి. మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నిజానిజాలు చెప్పడం నాకు కూడా సంతోషమే. ఇప్పుడు నా చుట్ట జరుగుతున్న కొన్ని విషయాలకు నేనే బాధ్యురాలు అని మీకు అనిపిస్తే.. కోర్టుకు అప్పగించండి. అంతేకానీ ఇలా శాపాలు పెడుతూ కామెంట్ చేయడం వల్ల నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలుసా? కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. మీరంతా నన్ను నిందిస్తున్నారు. కానీ నిజానిజాలు ఏంటనేది బయటకు వచ్చాక మీరు కూడా ఇలాంటి బాధను అనుభవించాలని నేను కోరుకోవడం లేదు. మీలో చాలామందికి నిజం తెలియకపోవడం వల్ల ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను నిందిస్తున్నారు. మీ అందరి భావాలను నేను అర్థం చేసుకోగలను. కానీ, త్వరలోనే నిజం బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను తప్పు చేస్తే.. చట్టం వేసే శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పటివరకూ నన్ను ద్వేషించకండి. ప్రశాంతంగా బతకనివ్వండి’ అని కెనీషా రాసుకొచ్చింది. -
డబ్బు, పవర్ కాదు మూడో వ్యక్తి వల్లే విడిపోయాం: ఆర్తి రవి
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్)(Ravi Mohan), ఆయన సతీమణి ఆర్తి రవి(Aarti Ravi) మధ్య విడాకుల వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. 2009లో వివాహం చేసుకున్న ఈ జంట, 18 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య జీవితం తర్వాత విడిపోతున్నట్లు గత ఏడాది జయం రవి ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై ఆర్తి తీవ్ర ఆరోపణలు చేస్తూ, తనకు తెలియకుండానే, సంప్రదింపులు లేకుండా రవి ఏకపక్షంగా విడాకులు ప్రకటించారని సోషల్ మీడియాలో వెల్లడించారు.ఈ వివాదం రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. ఆర్తి, జయం రవి తనను ఇంటి నుంచి తరిమేశారని, తమ ఇద్దరు కుమారుల బాధ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. దీనికి కౌంటర్‌గా, ఆర్తి తనపై సానుభూతి కోసం పిల్లలను ఉపయోగించుకుంటోందని జయం రవి విమర్శించారు. తాజాగా, ఆర్తి సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము విడిపోవడానికి డబ్బు లేదా పవర్ కారణం కాదని, మూడో వ్యక్తి (సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో రవి సంబంధం) కారణమని ఆరోపించారు. ఈ విషయంపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఊహాగానం కాదని ఆర్తి స్పష్టం చేశారు.కాగా ఇటీవల జయం రవి, కెనీషాతో కలిసి ఓ వివాహ వేడుకలో కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, దీనిపై ఆర్తి భావోద్వేగంతో స్పందించారు. "18 ఏళ్లు నాతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈజీగా దూరమయ్యారు. పిల్లల బాధ్యత నా భుజాలపై ఉంది. నేను మాట్లాడకపోవడం నా నిజాయితీ కోసమే" అని ఆర్తి పేర్కొన్నారు. మరోవైపు, ఆర్తి తన సోషల్ మీడియా ఖాతాలను తన ఆధీనంలో ఉంచి ఇబ్బంది పెట్టిందని, ఆర్థికంగా, మానసికంగా వేధించిందని రవి ఆరోపించారు.ఆర్తి తల్లి, నిర్మాత సుజాత విజయ్‌కుమార్ కూడా ఈ వివాదంలోకి దిగి, జయం రవిని కొడుకులా చూసుకున్నామని, అతని కోసం రూ.100 కోట్ల అప్పులు చేశామని, అయినా రవి అబద్ధాలు చెబుతున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం ఈ విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణలో ఉంది, కానీ ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
నటుడు రవి మోహన్‌తో జంటగా మళ్లీ కనిపించిన సింగర్
ప్రముఖ నటుడు రవి మోహన్ (జయం రవి) తన భార్యతో విడిపోయిన తర్వాత ప్రముఖ సింగర్‌తో డేటింగ్లో ఉన్నాడంటూ కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే, అందులో ఎలాంటి నిజం లేదని తాము స్నేహితులం మాత్రమే అంటూ ఇద్దరూ చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా వారిద్దరూ ఒక పెళ్లి వేడుకలో జంటగా కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. గతంలో వచ్చిన వదంతులు అన్నీ నిజమే కావచ్చని నెటిజన్లు ఇప్పుడు చెప్పుకొస్తున్నారు.వేల్స్ విశ్వవిద్యాలయం ఛైర్మన్ ఇషారి కె. గణేష్ కుమార్తె పెళ్లి చెన్నైలో జరిగింది. ఈ వేడుకలలో రవి మోహన్‌తో పాటుగా సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ కూడా జంటగా హాజరైంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో తమ మధ్య ఎలాంటి లవ్ లేదు.. కేవలం స్నేహం మాత్రమే అని చెప్పిన ఈ జంట ఇప్పుడు జంటగా కనిపించడంతో మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి. సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ వల్లనే రవి మోహన్ తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అవన్నీ పుకార్లు మాత్రమేనని, తాము స్నేహితులమని వారు చెప్పారు. తాము వృత్తిపరంగానే కలిశామని వారిద్దరూ ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. అనవసరంగా తన విడాకుల మధ్య మూడో వ్యక్తిని లాగుతున్నారంటూ జయం రవి అసహనం వ్యక్తం చేశాడు. తన విడాకుల వ్యవహారానికి సింగర్ కెనిషాతో ఎలాంటి సంబంధం లేదని గతంలోనే ఆయన చెప్పాడు.రవి మోహన్ విడాకులపై గతంలో సింగర్ ఏం చెప్పిందంటే..రవి మోహన్ విడాకుల విషయంలో అనవసరంగా తనను లాగుతున్నారని, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదని సింగర్, థెరపిస్ట్ కెనిషా ఫ్రాన్సిస్ గత ఇంటర్వ్యూలో చెప్పింది. జయం రవి మానసిక అనారోగ్యంతో బాధపడతున్నాడని, చికిత్స కోసమే తన వద్దకు వచ్చాడని అప్పట్లో ఆమె క్లారిటీ ఇచ్చింది. ఒక థెరపిస్ట్‌గా అతనికి చికిత్స అందించానని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని వెల్లడించింది. ‘ఆర్తి, ఆమె పెరెంట్స్ పెట్టిన టార్చర్ కారణంగా రవి చాలా మానసికంగా క్రుంగిపోయాడని చెప్పుకొచ్చింది. ఆయన తనకు స్నేహితుడు, క్లయింట్ కూడా.. అంతకు మించి ఏమి లేదని చెప్పింది. గతంలో ఏమీ లేదని చెప్పిన వారిద్దరూ ఇప్పుడు జంటగా పెళ్లిలో కనిపించడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.కాగా, జయం రవి, ఆర్తిగా వివాహం 2009 జూన్‌లో జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు ఇల్లలు. 15 ఏళ్లపాటు కలిసి కాపురం చేసిన ఈ జంట.. గత ఏడాదిలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు. Yes, It's Keneesha who is sitting behind #RaviMohan !!It's their life, let them live...pic.twitter.com/OeaDDBfZRP— AmuthaBharathi (@CinemaWithAB) May 9, 2025 -
సాక్ష్యాలన్నీ బయటపెడతా.. హీరో భార్యకు సింగర్ వార్నింగ్!
ప్రముఖ నటుడు జయం రవి, ఆర్తి విడాకుల వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కానీ భార్త ఆర్తి మాత్రం తన అనుమతి లేకుండానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడని ఆరోపిస్తుంది. అంతేకాదు జయం రవి సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో సన్నిహితంగా ఉంటున్నట్లు రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఇవి పుకార్లు మాత్రమేనని జయం రవి కొట్టేశాడు. తాజాగా సింగర్ కెనిషా కూడా జయం రవి విడాకుల ఇష్యూపై స్పందిస్తూ అతని భార్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.సింగర్‌తో సహజీవనంజయం రవి గత కొన్నాళ్లుగా భార్య ఆర్తితో కలిసి ఉండడం లేదు. అతను ఒక్కడే వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో సింగర్ కెనిషాతో ప్రేమలో పడ్డాడని..ఆమె కారణంగానే ఆర్తికి దూరంగా ఉంటున్నాడని కోలీవుడ్‌లో రూమర్స్ వచ్చాయి. ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే అటు జయం రవి కానీ, ఇటు కెనిషా కానీ తమ మధ్య ఉన్న బంధాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. తాము వృత్తిపరంగానే కలిశామని చెబుతున్నారు. అనవసరంగా మా విడాకుల మధ్య మూడో వ్యక్తిని లాగుతున్నారంటూ జయం రవి అసహనం వ్యక్తం చేశాడు. నా విడాకుల వ్యవహారానికి సింగర్ కెనిషాతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.సాక్ష్యాలన్నీ బయటపెడతా: సింగర్జయం రవి విడాకుల విషయంలో అనవసరంగా తనను లాగుతున్నారని, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదని అంటోంది సింగర్, థెరపిస్ట్ కెనిషా ఫ్రాన్సిస్. జయం రవి మానసిక అనారోగ్యంతో బాధపడతున్నాడని, చికిత్స కోసమే తన వద్దకు వచ్చాడని చెబుతోంది. ఒక థెరపిస్ట్‌గా అతనికి చికిత్స అందించానని, అంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని వెల్లడించింది. ‘ఆర్తి, ఆమె పెరెంట్స్ పెట్టిన టార్చర్ కారణంగా రవి చాలా మానసికంగా క్రుంగిపోయాడు. ట్రీట్మెంట్ కోసం జూన్‌లో నా దగ్గరకు వచ్చాడు. ఆయనతో నాకు వృత్తిపరమైన స్నేహం మాత్రమే ఉంది. ఆయన స్నేహితుడు, క్లయింట్ కూడా. అంతకు మించి ఏమి లేదు. నా కారణంగానే విడాకులు తీసుకుంటున్నరనేది పచ్చి అబద్దం. రవి తన భార్యకు విడాకులు నోటీసులు పంపిన విషయం కూడా నాకు తెలియదు. నేను ఇచ్చిన ట్రిట్మెంట్, థెరపీకి సంబంధించిన నోట్స్‌తో పాటు అన్ని సాక్ష్యాలు కోర్టుకు ఇవ్వగలను. దీనికి ఎవరి అనుమతి అవసరం లేదంటూ పరోక్షంగా ఆర్తికి వార్నింగ్ ఇచ్చింది. కాగా, జయం రవి, ఆర్తిగా వివాహం 2009 జూన్‌లో జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు ఇల్లలు. 15 ఏళ్లపాటు కలిసి కాపురం చేసిన ఈ జంట.. ఈ నెల 9న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు.