నటుడు రవి మోహన్‌తో జంటగా మళ్లీ కనిపించిన సింగర్‌ | Actor Ravi Mohan Attend Wedding With Kenishaa Francis | Sakshi
Sakshi News home page

నటుడు రవి మోహన్‌తో జంటగా మళ్లీ కనిపించిన సింగర్‌

May 9 2025 10:51 AM | Updated on May 9 2025 11:10 AM

Actor Ravi Mohan Attend Wedding With Kenishaa Francis

ప్రముఖ నటుడు రవి మోహన్‌ (జయం రవి) తన భార్యతో విడిపోయిన తర్వాత ప్రముఖ సింగర్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే, అందులో ఎలాంటి నిజం లేదని తాము స్నేహితులం మాత్రమే అంటూ ఇద్దరూ చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా వారిద్దరూ ఒక పెళ్లి వేడుకలో జంటగా కనిపించి అందరికీ షాక్‌ ఇచ్చారు. గతంలో వచ్చిన వదంతులు అన్నీ నిజమే కావచ్చని నెటిజన్లు ఇప్పుడు చెప్పుకొస్తున్నారు.

వేల్స్ విశ్వవిద్యాలయం  ఛైర్మన్ ఇషారి కె. గణేష్ కుమార్తె పెళ్లి చెన్నైలో జరిగింది. ఈ వేడుకలలో రవి మోహన్‌తో పాటుగా సింగర్‌  కెనిషా ఫ్రాన్సిస్‌ కూడా జంటగా హాజరైంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. గతంలో తమ మధ్య ఎలాంటి లవ్‌ లేదు.. కేవలం స్నేహం మాత్రమే అని చెప్పిన ఈ జంట ఇప్పుడు జంటగా కనిపించడంతో మళ్లీ రూమర్స్‌ మొదలయ్యాయి.  

సింగర్‌  కెనిషా ఫ్రాన్సిస్‌ వల్లనే రవి మోహన్‌ తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అవన్నీ పుకార్లు మాత్రమేనని, తాము స్నేహితులమని వారు చెప్పారు. తాము వృత్తిపరంగానే కలిశామని  వారిద్దరూ ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. అనవసరంగా తన విడాకుల మధ్య మూడో వ్యక్తిని లాగుతున్నారంటూ జయం రవి అసహనం వ్యక్తం చేశాడు. తన విడాకుల వ్యవహారానికి సింగర్‌ కెనిషాతో ఎలాంటి సంబంధం లేదని గతంలోనే ఆయన చెప్పాడు.‌

రవి మోహన్‌ విడాకులపై గతంలో సింగర్‌ ఏం చెప్పిందంటే..
రవి మోహన్‌ విడాకుల విషయంలో అనవసరంగా తనను లాగుతున్నారని, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదని  సింగర్‌, థెరపిస్ట్‌ కెనిషా ఫ్రాన్సిస్‌ గత ఇంటర్వ్యూలో చెప్పింది. జయం రవి మానసిక అనారోగ్యంతో బాధపడతున్నాడని, చికిత్స కోసమే తన వద్దకు వచ్చాడని అప్పట్లో ఆమె క్లారిటీ ఇచ్చింది. ఒక థెరపిస్ట్‌గా అతనికి చికిత్స అందించానని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్‌ లేదని వెల్లడించింది. ‘ఆర్తి, ఆమె పెరెంట్స్‌ పెట్టిన టార్చర్‌ కారణంగా రవి చాలా మానసికంగా క్రుంగిపోయాడని చెప్పుకొచ్చింది.  ఆయన తనకు స్నేహితుడు, క్లయింట్‌ కూడా.. అంతకు మించి ఏమి లేదని చెప్పింది. గతంలో ఏమీ లేదని చెప్పిన వారిద్దరూ ఇప్పుడు జంటగా పెళ్లిలో కనిపించడంతో అభిమానులు కూడా షాక్‌ అవుతున్నారు.

కాగా, జయం రవి, ఆర్తిగా వివాహం 2009 జూన్‌లో జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు ఇల్లలు. 15 ఏళ్లపాటు కలిసి కాపురం చేసిన ఈ జంట.. గత ఏడాదిలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement