
తమిళ హీరో జయం రవి విడాకుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతేడాది భార్య ఆర్తికి విడాకులు ఇచ్చేసినట్లు ప్రకటించిన ఇతడు.. ప్రసుత్తం సింగిల్ గానే ఉంటున్నాడు. కానీ శుక్రవారం ఉదయం చెన్నైలో నిర్మాత ఇషారీ గణేశ్ కూతురు పెళ్లికి మాత్రం సింగర్ కెనీషాతో కలిసి హాజరయ్యాడు. దీంతో భార్య ఆర్తి తట్టుకోలేకపోయింది.
నిన్న సాయంత్రం జయం రవి పేరు నేరుగా ప్రస్తావించనప్పటికీ.. చాలా ఆరోపణలు చేసింది. తనని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని, పిల్లల్ని పట్టించుకోనివాడు అసలు తండ్రేనా అంటూ చాలా పెద్ద నోట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు దీని ప్రతిగా జయం రవితో కలిసి కనిపించిన కెనీషా కౌంటర్ ఇచ్చింది.
(ఇదీ చదవండి: భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన డాక్టర్ బాబు)

తన ఇన్ స్టా స్టోరీలో ఆర్తి పేరు ప్రస్తావించకుండా.. 'మగాడు ఎప్పుడూ ఎమోషన్స్ కి లొంగడు. ఏ మహిళ దగ్గర అయితే ప్రశాంతత ఉంటుందో వాళ్లకే తన హృదయాన్ని ఇస్తాడు. మంచిగా ఉన్నాను కదా అని లైట్ తీసుకోకు. అదే నిజమైన బలం' అనే కొటేషన్ ని కెనీషా షేర్ చేసింది.
ప్రస్తుతానికి హీరో జయం రవి భార్య ఆర్తి వర్సెస్ రూమర్ ప్రియురాలు కెనీషా మధ్య పరోక్షంగా మాటల యుద్ధం నడుస్తోంది. మరి ఈ విషయంలో ఎవర ఒప్పు? ఎవరిది తప్పు అనేది తెలియాలంటే సదరు హీరో నోరు విప్పాల్సిందే. కోలీవుడ్ మీడియా ప్రకారం.. జయం రవి అత్త ఇతడి డేట్స్, మూవీస్ విషయంలో చాలా జోక్యం చేసుకుందని, అందుకే భార్యకు విడాకులు ఇచ్చేశాడనే టాక్ నడుస్తోంది.
(ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ అమలాపాల్)