ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ అమలాపాల్ | Amala Paul Said Husband Jagat Desai Dont Know She Was Actress | Sakshi
Sakshi News home page

Amala Paul: నేను హీరోయిన్ అని మా ఆయనకు తెలీదు

May 10 2025 3:07 PM | Updated on May 10 2025 3:22 PM

Amala Paul Said Husband Jagat Desai Dont Know She Was Actress

సాధారణంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే అబ్బాయి లేదా అమ్మాయి ఎవరు? వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తదితర విషయాలు తెలుసుకుని పెళ్లి చేసుకుంటారు. కానీ హీరోయిన్ అమలాపాల్ జీవితంలో మాత్రం వీటికి రివర్స్ లో జరిగింది. ఈమె నటి ‍అనే సంగతే భర్తకు తెలీదు, అలానే ప్రెగ్నెంట్ ‍అయిన తర్వాత వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు.

అవును మీరు విన్నది కరెక్టే. తాజాగా జేఎఫ్ డబ్ల్యూ మూవీ అవార్డ్ వేడుక జరిగింది. ఇందులో ఉత్తమ నటిగా(క్రిటిక్స్) అమలాపాల్ అవార్డ్ గెలుచుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగత్ దేశాయ్ తో తన ప్రేమ, పెళ్లి ఎలా జరిగిందనే విషయాల్ని బయటపెట్టింది.

(ఇదీ చదవండి: శ్రీవిష్ణు ‘సింగిల్‌’కి రికార్డు ఓపెనింగ్స్‌... తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే?)

'జగత్-నేను గోవాలో కలిశాం. అతడు గుజరాతీ కానీ గోవాలో సెటిలయ్యాడు. నాది కేరళ అని చెప్పాను. అతడు దక్షిణాది సినిమాలు చూడడు. దీంతో నేను నటి అనే విషయాన్ని చెప్పలేదు. తర్వాత కొన్నాళ్లకు నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. గర్భంతో ఇంట్లో ఉన్నప్పుడు నా సినిమాలని ఒక్కొక్కటిగా చూస్తూ ఎంజాయ్ చేశాడు. నేను అవార్డ్స్ తీసుకున్న వీడియోలు చూసి తెగ మురిసిపోయాడు' అని అమలాపాల్ చెప్పుకొచ్చింది.

తెలుగులో ఇద్దరమ్మాయిలతో, నాయక్ తదితర సినిమాలు చేసిన అమలాపాల్.. తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. గతంలోనే ఈమె డైరక్టర్ ఏఎల్ విజయ్ ని 2014లో పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా మూడేళ్లకే అంటే 2017లో విడిపోయారు. 2023లో బిజినెస్ మ్యాన్ జగత్ దేశాయ్ ని అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు పుట్టాడు.

(ఇదీ చదవండి: ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్‌!)

Advertisement
 
Advertisement
Advertisement