విమర్శలను కూల్‌గా ఎదుర్కోవడం ఒక కళ. అందుకు తాజా ఉదాహరణ కీర్తి సురేష్. నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో కీర్తి ఒక స్పెషల్ సాంగ్‌కి డ్యాన్స్ చేశారు. కీర్తి ఈ పాట చేయడాన్ని విమర్శిస్తూ, ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసింది. అవకాశాలు లేక ఇలా ఐటమ్ సాంగ్ చేసిందని ఆ యువతి విమర్శించింది. పైగా కన్నడ సినిమా ‘ది ప్యారడైజ్’లో కీర్తి నటించినట్లుగా పేర్కొంది.
ఈ విమ ర్శకు కీర్తి సురేష్ కూల్‌గా సమాధానం ఇచ్చారు. ‘వేరే లెవెల్ (కన్నడ సినిమా అని చెప్పడాన్ని ఉద్దేశించి అయ్యుండొచ్చు)... చిన్న కరెక్షన్... నాని నటిస్తున్నది తెలుగు సినిమా... కన్నడ సినిమా కాదు’ అంటూ సోషల్ మీడియా వేదికగా కీర్తి స్పందించారు. అంతే... ‘భలే చురక వేశావ్... సరైన రీతిలో చె ప్పావ్’ అన్నట్లుగా పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. ఇక నాని–కీర్తి సురేష్ ‘దసరా’ వంటి సూపర్ హిట్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాని ‘ది ప్యారడైజ్’లో కీర్తి స్పెషల్ సాంగ్ చేశారు. ఈ చిత్రం సెప్టెంబరు 24న విడుదల కానుంది.


