మూడు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా | Mr Work From Home Movie OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

OTT: రైతుల నేపథ్య కథతో మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే?

Aug 9 2026 8:02 PM | Updated on Aug 10 2026 9:27 AM

Mr Work From Home Movie OTT Streaming Details

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగువి ఎప్పుడొస్తుంటాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. అలా మూడు నెలల క్రితం థియేటర్లలో రిలీజైన ఓ తెలుగు మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: ఇప్పుడు రోడ్డుపై నడవలేకపోతున్నా: అల్లు అర్జున్)

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన మూవీ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. రైతుల నేపథ్య కథతో దీన్ని తీశారు. ఈ ఏడాది మే 15న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడం, కంటెంట్ కూడా ఓ మాదిరిగా ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు దీనిని ఈ శుక్రవారం(ఆగస్టు 14) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' విషయానికొస్తే.. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే అరవింద్ (త్రిగుణ్).. తన జాబ్‌కి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగొస్తాడు. ఆ తర్వాత ఆర్గానిక్‌ వ్యవసాయం చేయాలని ఫిక్స్‌ అవుతాడు. ఇందులో కొత్త పద్దతులు ప్రవేశపెట్టడమే కాకుండా రైతులు ఆదాయం పెంచడానికి 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' యాప్ తీసుకొస్తాడు. దీనితో రైతుల జీవితం ఎలా మారింది? మహి(పాయల్‌ రాధాకృష్ణ)తో ‍అరవింద్ ప్రేమ సంగతేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: కంటతడి పెట్టించే ప్రేమకథా సినిమా.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement