Mr Work From Home Movie
-
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ రివ్యూ
టైటిల్ : మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్నటీనటులు: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ & అనీష్ కురువిల్లా, శివాజీరాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, సివిఎల్ నర్సింహారావు, గుండు సుదర్శన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండుదర్శకత్వం: మధుదీప్ చెలికానినిర్మాత: అరవింద్ మండెంఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావుసంగీతం: ప్రకాష్ చెరుకూరి, అరుణ్ చిలువేరు విడుదల తేది: మే 15, 2026కథేంటంటే.. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అరవింద్ (త్రిగుణ్).. తన జాబ్‌కి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగివస్తాడు. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత.. ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఫిక్స్ అవుతాడు. వ్యవసాయంలో కొత్త తరహా పద్దతులను ప్రవేశపెట్టడమే కాకుండా రైతులు ఆదాయం పెంచేడానకి ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే యాప్ తీసుకొస్తాడు. ఆ యాప్‌తో రైతుల జీవితం ఎలా మార్చాడు? మహి(పాయల్ రాధాకృష్ణ)తో ప్రేమాయాణం ఎలా సాగింది? చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని అరవింద్ ఎలా నెరవేర్చుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే టైటిల్ చూడగానే ఇదేదో సాఫ్ట్వేర్ ఉద్యోగి కథ అనుకుంటారు. కానీ ఇందులో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి..వ్యవసాయం చేసుకునే యువకుడి కథను చెప్పాడు దర్శకుడు మధుదీప్ చెలికాని. అప్పట్లో ఎలాంటి ఎరువులు లేకుండా సాంప్రదాయ వ్యవసాయ పద్దతుల్లో పండించిన పంటలను తిన్న మన పెద్ద వాళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ నేటి తరం అలా ఉండటం లేదు. రసాయన ఎరువులు వాడిన కూరగాయలు, రైస్ తీసుకొని అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆర్గానిక్ వ్యవసాయం వల్ల కలిగే లాభాల గురించి పెద్దగా తెలియదు. ఈ చిత్రంలో ఒకవైపు రైతుల కష్టాలను చూపిస్తూనే మరోవైపు ఆర్గానిక్ వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు.దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా..దాన్ని తెరపై అనుకున్నట్లుగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. దర్శకుడు పనితనం కొన్నిసన్నివేశాల్లో మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంది. ఉన్నంతలో ఫస్టాఫ్ బాగానే ఉంటుంది. కొన్ని కామెడీ సీన్లు, లవ్ ఎపిసోడ్ పర్వాలేదు. కానీ సెండాఫ్లో కథనం స్లోగా సాగడంతో సాగదీశారనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది.ఎవరెలా చేశారంటే..అరవింద్ పాత్రకి త్రిగుణ్ న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అందంగా కనిపించింది. హీరో తండ్రి పాత్రలో నటించిన అవినాష్ కురువిల్లా, ఆర్గానిక్ వ్యవసాయం వైపు హీరోను టర్న్ చేసే పాత్రలో శివాజీ రాజా తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిది మేర నటించి ఆకట్టుకున్నారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. -
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ చూస్తే మోదీ కూడా ప్రశంసిస్తారు
ఈషా ఫేం త్రిగుణ్, పాపం ప్రతాప్ ఫేం పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. మే 15న సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. మొన్ననే ప్రధాని మోదీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని మళ్లీ ట్రెండ్ మొదలుపెట్టారు. ఆ రకంగా ఈ సినిమా మంచి ట్రెండ్‌లో వస్తోంది. ఐటీ జాబ్ వదిలేసిన ఓ కుర్రాడు వ్యవసాయం చేయాలనుకుంటే తన ఇంటి నుంచి, ఫ్యామిలీ నుంచి, అలాగే తన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ సినిమాలో చాలా వినోదాత్మకంగా చెప్పాం. తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ. ఈ సినిమా ఓపెన్ మైండ్‌తో చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. అందరూ ఎంజాయ్ చేసే చిత్రమిది. ఈ సినిమాను ఆదరిస్తే ఒక మంచి సినిమాను సమాజానికి అందించిన వాళ్లం అవుతాం’ అన్నారు.నిర్మాత అరవింద్ మాట్లాడుతూ.. మన ప్రధాని మోదీ కూడా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని ప్రోత్సహిస్తున్నారు. మేము చాలా అడ్వాన్స్‌గా ఈ సినిమా తీశాం. ఈ సినిమాను ఆయన కూడా ప్రశంసిస్తారని నమ్మకం ఉంది. అందరికీ ఉపయోగపడే ఒక కాన్సెప్ట్ చెప్పాం. తప్పకుండా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘నేను సైన్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. ఈ సినిమాను చాలా ప్యాషన్‌తో చేశాను. తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అన్నారు. -
'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వెరైటీగా 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' సినిమా ప్రమోషన్స్
ఈ రోజుల్లో సినిమా తీయడం ఒక ఎత్తయితే, దాన్ని ప్రమోట్ చేయడం మరో ఎత్తు! ఇటీవల ఒక సినిమా వినూత్నమైన ప్రమోషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్”. సినిమా కాన్సెప్ట్ మాత్రమే కాకుండా, ఈ చిత్రబృందం చేస్తున్న ప్రచార కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.వినూత్న ప్రమోషన్స్రైతులకు ఉపయోగపడే అంశాన్ని ఈ సినిమాలో చూపించడంతోపాటు సినిమా ప్రమోషన్స్ కూడా రైతుల మధ్య నుంచే ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రాజేందర్ రెడ్డి రైతుబడి అగ్రి షోలో చిత్రబృందం ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చిన రైతులకు సినిమా కాన్సెప్ట్‌ను వివరించారు. సాధారణంగా అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లలో వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు, విత్తనాలు, కంపెనీల స్టాళ్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఒక సినిమాకు ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేయడం అరుదైన విషయమే అని చెప్పాలి.ఆరోజు కూడా..అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)లో జరిగిన మెగా రైతు మేళాలో కూడా “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” సినిమా టీమ్ స్టాల్ ఏర్పాటు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రులు, అధికారులు, స్కాలర్లు, యాక్టివిస్టులు, మహిళా యాక్టివిస్టులు, రైతులు మూవీ స్టాల్‌ను సందర్శించి చిత్రబృందాన్ని అభినందించారు. రైతుల కోసం వారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించారు.ప్రధాన ఉద్దేశంవ్యవసాయం, సాంకేతికత మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమని చిత్రబృందం చెబుతోంది. “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” వ్యవసాయంతో పాటు ఆధునిక సమాజంలో పెరుగుతున్న విడాకుల సమస్యను కూడా ప్రస్తావిస్తుంది. మునుపటి తరాలు జంటలకు మార్గనిర్దేశం చేయడంలో, కుటుంబ విభేదాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాయని ఈ సినిమా గుర్తుచేస్తుంది. అలాగే దాదాపు 10 మంది ప్రముఖ కమెడియన్స్‌తో నవ్వులు పంచేలా రూపొందించారు. ఈ మూవీని వేసవిలో విడుదల చేయనున్నారు. -
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ పాటకు మిలియన్ వ్యూస్
త్రిగున్-పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. లోటస్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై మధుదీప్ సీహెచ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సాఫ్ట్వేర్ టర్నెడ్ ఇంజినీర్ అరవింద్.ఎమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ‘వెన్నెలే వెన్నెలే నాలో వెల్లువై పొంగెలే’పాటకు అనూహ్య స్పందన లభిస్తోంది.ఒకే ఒక లోకం నువ్వే..." పాటతో సంచలనం సృష్టించిన అరుణ్ చిలువేరు సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాటకు ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ సాహిత్యం సమకూర్చగా ఎన్.సి.కారుణ్య ఆలపించారు. ఇప్పటికే ఈ పాట మిలియన్ వ్యూస్‌ని సాధించింది. హీరో త్రిగున్ పుట్టిన రోజు(జూన్ 8) సందర్భంగా ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ మోషన్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.అనీష్ కురువిల్లా, సత్యకృష్ణన్, సి.వి.ఎల్.నరసింహారావు, జయశ్రీ రాచకొండ, వివా హర్ష, గుండు సుదర్శన్, నెల్లూరు సుదర్శన్, గిరిధర్, జబర్దస్త్ వేణు తదితరులు కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అరుణ్ చిలువేరు సంగీతం అందించారు.


