ఈషా ఫేం త్రిగుణ్, పాపం ప్రతాప్ ఫేం పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. మే 15న సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. మొన్ననే ప్రధాని మోదీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని మళ్లీ ట్రెండ్ మొదలుపెట్టారు. ఆ రకంగా ఈ సినిమా మంచి ట్రెండ్‌లో వస్తోంది. ఐటీ జాబ్ వదిలేసిన ఓ కుర్రాడు వ్యవసాయం చేయాలనుకుంటే తన ఇంటి నుంచి, ఫ్యామిలీ నుంచి, అలాగే తన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ సినిమాలో చాలా వినోదాత్మకంగా చెప్పాం. తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.
డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ. ఈ సినిమా ఓపెన్ మైండ్‌తో చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. అందరూ ఎంజాయ్ చేసే చిత్రమిది. ఈ సినిమాను ఆదరిస్తే ఒక మంచి సినిమాను సమాజానికి అందించిన వాళ్లం అవుతాం’ అన్నారు.
నిర్మాత అరవింద్ మాట్లాడుతూ.. మన ప్రధాని మోదీ కూడా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని ప్రోత్సహిస్తున్నారు. మేము చాలా అడ్వాన్స్‌గా ఈ సినిమా తీశాం. ఈ సినిమాను ఆయన కూడా ప్రశంసిస్తారని నమ్మకం ఉంది. అందరికీ ఉపయోగపడే ఒక కాన్సెప్ట్ చెప్పాం. తప్పకుండా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
‘నేను సైన్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. ఈ సినిమాను చాలా ప్యాషన్‌తో చేశాను. తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అన్నారు.


