Trigun
-
త్రిగుణ్ ‘జిగేల్’ మూవీ రివ్యూ
త్రిగుణ్(Trigun) హీరోగా మల్లి ఏలూరి రూపొందించిన చిత్రం ‘జిగేల్’(Jigel). వై.జగన్ మోహన్, నాగార్జున అల్లం నిర్మించారు. మేఘా చౌదరి హీరోయిన్. రఘుబాబు, మధునందన్, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు(మార్చి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..నందు(త్రిగుణ్) ఓ లాకర్ల దొంగ. బాగా డబ్బు దోచుకొని జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటాడు. అతనికి కలలో మీనా(మేఘా చౌదరి) అనే అమ్మాయి వస్తుంది. ఆమెతో సహజీవనం కలిసి కాపురం చేస్తున్నట్లు కలలు కంటాడు. ఓ సారి నిజంగానే మీనా తారాసపడుతుంది. ఆమె కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నట్లు నందుకు తెలుస్తుంది. దీంతో ఇద్దరు కలిసి దొంగతనాలు చేయడం ప్రారంభిస్తారు. ఓసారా రాజా చంద్ర వర్మ ప్యాలెస్‌లో ఉండే ఓ పురాతన లాకర్ తెరచుకోవడం లేదని..అందులో పెద్ద మొత్తంలో నగలు ఉన్నట్లు మీనాకి తెలుస్తుంది. దీంతో ఆమె జేపీ(సాయాజీ షిండే)దగ్గర పీఏగా చేరి..నందుతో ఆ లాకర్ని ఓపెన్ చేయించాలని ప్లాన్ వస్తుంది. మరి ఆమె ప్లాన్ వర్కౌట్ అయిందా? అలసు ఆ లాకర్ ఎవరిది? అందులో ఏం ఉంది? రాజా చంద్ర వర్మ ప్యాలెస్ ప్లాష్‌బ్యాక్ ఏంటి? మీనాకి ఆ ప్యాలెస్‌తో ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఇదొక కామెడీ సస్పెన్స్ రొమాంటిక్ థ్రిల్లర్.గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేసేందుకు దర్శకుడు మల్లి యేలూరి ప్రయత్నించాడు. యూత్ ను ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు... కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కామెడీ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా చేశారు. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే పోసాని వేసిన ఆండ్రాయిడ్ బాబా వేషం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటాయి. పోసానికి రాసిన సంభాషణలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే లాయర్ మన్మథరావు పాత్రలో పృథ్వీ రాజ్ చేత చేయించిన కామెడీ కొంతవరకు వర్కౌట్ అయింది. అయితే హీరోహీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు యూత్‌ని ఆకట్టుకున్నా.. ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాత్రం ఇబ్బందికరంగా అనిపిస్తాయి. సెకెండాఫ్ లో అసలు కథ మొదలై... చివరి వరకూ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో లాకర్ చుట్టూ రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే ఆద్యంతం ఆకట్టుకుంటుంది.ఎవరెలా చేశారంటే..త్రిగుణ్ ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. లాకర్ టెక్నీషియన్ గా బాగా సూట్ అయ్యాడు. అందులో లాకర్ ను ఓపెన్ చేసే టెక్నిక్స్ ను కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశారు. ఆ పాత్రలో త్రిగుణ్ బాగా ఒదిగిపోయి నటించారు. అతనికి జంటగా నటించిన మేఘా చౌదరి కూడా రొమాంటిక్, యాక్షన్ సన్నివేశాల్లో బాగా నటించింది. కథ మొత్తం సెకెండాఫ్ లో ఆమె చుట్టూనే తిరుగుతుంది కాబట్టి... ఆమె పాత్ర ఇంపార్టెన్స్ బాగా ఆకట్టుకుంటుంది. పోసాని పాత్ర బాగా నవ్విస్తుంది. ఫస్ట్ హాఫ్ లోనూ, సెకెండాఫ్ లోనూ అతని పాత్ర ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. సాయాజీ షిండే పాత్ర నెగిటివ్ రోల్ లో పర్వాలేదు అనిపిస్తుంది. మన్మథరావు పాత్రలో పృథ్వీ రాజ్ ఎప్పటిలాగే బాగా నటించారు. అతనితో పాటు నటించిన జయవాణి పాత్ర కూడా బాగుంది. హీరోయిన్ తల్లి పాత్రలో నళిని నటించి ఆకట్టుకుంది. రఘుబాబు ముక్కు అవినాష్, మధునందన్ పాత్రలు పర్వాలేదు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సాకేంతికంగా సినిమా పర్వాలేదు. సంగీత దర్శకుడు ఆనంద్ మంత్ర అందించిన బాణీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టకుంటాయి.వాసు అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. విజువల్స్ అన్నీ బాగున్నాయి. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. -
కామెడీ థ్రిల్లర్ జిగేల్.. రిలీజ్ ఎప్పుడంటే?
త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా నటిస్తున్న కామెడీ థ్రిల్లర్ 'జిగేల్'. మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ వై.జగన్ మోహన్, నాగార్జున అల్లం నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే సాంగ్స్ హిట్టయ్యాయి.తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. మార్చి 7న సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రముఖ హాస్యనటులంతా ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న 'జిగేల్' మాస్, క్లాస్ ఆడియన్స్ అంతా రెండున్నర గంటల పాటు ఎంజాయ్ చేస్తారని నిర్మాతలు తెలిపారు. ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమాకు పని చేశారు. ఆనంద్ మంత్ర మ్యూజిక్ అందిస్తున్నారు. వాసు డీవోపీగా పని చేస్తున్నారు. చదవండి: రష్మికపైనే విమర్శలా? ఆమె ట్రాక్ రికార్డ్ చూశారా?: ఛావా నటి -
‘ఉద్వేగం’ మూవీ రివ్యూ
టైటిల్: ఉద్వేగంనటీనటులు: త్రిగుణ్, దీప్సిక, శ్రీకాంత్ అయ్యంగార్, సురేష్, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, అంజలి తదితరులు నిర్మాతలు: జి శంకర్, ఎల్ మధుదర్శకుడు: మహిపాల్ రెడ్డిసంగీతం: కార్తిక్ కొడగండ్లసినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్ఎడిటర్: జశ్వీన్ ప్రభువిడుదల తేది: నవంబర్ 29, 2024కథేంటంటే..మహీంద్రా (త్రిగుణ్) ఓ లాయర్. క్రిమినల్ కేసులు వాధించడంలో దిట్ట. కేసులుంటే కోర్టుకు వెళ్లడం లేదంటే ప్రియురాలు అమ్ములు(దీప్సిక)తో గడపడం..ఇదే మహీంద్ర దినచర్య. ఇలా జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో , ఓ గ్యాంగ్ రేప్ కేసు మహీంద్రా దగ్గరకు వస్తుంది. మొదట ఈ కేసు వాదించేందుకు మహీంద్రా నిరాకరిస్తాడు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్లీ ఈ కేసును టేకాప్ చేస్తాడు. ఆ కేసులో ఏ2 అయిన సంపత్ తరపున వాదించేందుకు మహీంద్రా రంగంలోకి దిగుతాడు. ప్రత్యర్థుల తరపున వాదించేందుకు సీనియర్ లాయర్ ప్రసాద్(శ్రీకాంత్ అయ్యంగార్) రంగంలోకి దిగుతాడు.ఈ గ్యాంగ్ రేప్ మహీంద్రా జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పింది? ఈ కేసులో ఎవరు గెలిచారు? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.ఎలా ఉందంటే.. కోర్డు డ్రామా సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అన్నింటిలోనూ హీరో అమ్మాయిల తరపున వాదిస్తుంటాడు. కానీ హీరో బాధిత అమ్మాయిల తరపున కాకుండా నిదింతుడి తరపున వాదించడం అనేది ఈ సినిమాలో కొత్త పాయింట్. దర్శకుడు ఇలాంటి పాయింట్ ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అయితే కథను ప్రారంభించిన విధానం కాస్త నెమ్మదిగా ఉంటుంది. అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. హీరో చేతికి గ్యాంగ్ రేప్ కేసు వచ్చిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. కోర్టు రూమ్ సన్నివేశాలు, ట్విస్ట్ లు ఆకట్టుకున్నాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా, వాస్తవికానికి చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తాయి. శ్రీకాంత్ అయ్యంగార్, త్రిగుణ్ మధ్య వచ్చే సన్నివేశాలను మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. నిడివి తక్కువగా ఉండడం సినిమాకు కలిసొచ్చిందనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే..లాయర్ మహీంద్రగా త్రిగుణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దీప్సిక తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. త్రిగుణ్ గురువు పాత్రలో పరుచూరి గోపాలకృష్ణ ఎప్పటిలాగే తన మార్క్ చూపించారు. జడ్జిగా సీనియర్ నటుడు సురేష్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇక లాయర్ ప్రసాద్‌గా శ్రీకాంత్ అయ్యంగార్ ఎప్పటిమాదిరి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సీనియర్ నటుడు శివకృష్ణ కూడా తాను పోషించిన పోలీస్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కార్తిక్ కొడగండ్ల సంగీతం బాగుంది. జి.వి. అజయ్ కుమార్ కెమెరా పనితనం పర్వాలేదు. ఎడిటర్ జశ్వీన్ ప్రభు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రేటింగ్: 2.25/5