సడన్‌గా ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ | Jigel Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

OTT Movie: మూడు నెలల తర్వాత ఓటీటీలో తెలుగు సినిమా

Jun 4 2025 3:28 PM | Updated on Jun 4 2025 4:51 PM

Jigel Movie OTT Telugu Streaming Details

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలా 20కి పైగా మూవీస్-సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో రజనీకాంత్ 'లాల్ సలామ్', సన్నీ డియోల్ 'జాట్' చిత్రాలు కాస్త చెప్పుకోదగ్గవిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటితో పాటు కొన్ని సడన్ సర్‌ప్రైజ్ అన్నట్లు డేట్ లాక్ చేసుకుంటున్నాయి. అలాంటి ఓ తెలుగు సినిమా దాదాపు మూడు నెలల తర్వాత ఓటీటీ రిలీజ్‪‌కి సిద్ధమైంది. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' తెలుగు రివ్యూ)

తెలుగు, తమిళంలో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న త్రిగుణ్.. అప్పుడప్పుడు హీరోగానూ పలు చిత్రాల్లో నటించారు. అలానే 'జిగేల్' అనే మూవీ.. ఈ మార్చి తొలివారంలో థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ఎలా వచ్చిందో అలా కనుమరుగైపోయింది. ఇప్పుడు మూడు నెలల తర్వాత సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రాబోతుందని ప్రకటించారు.

జూన్ 5నుంచి అంటే రేపటి(గురువారం) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో 'జిగేల్' మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ చిత్రం విషయానికొస్తే.. చిన్న చిన్న దొంగతనాలు చేసే ఓ ప్రేమ జంట కథతో ఈ మూవీ తెరకెక్కించారు. లాకర్లని చాకచక్యంగా తెరిచే టాలెంట్ ఉన్న నందు(త్రిగుణ్).. మీనా(మేఘా చౌదరి)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటుంది. ఈ ఇద్దరూ కలిసి రాజాచంద్ర వర్మ ప్యాలెస్‌లో పాతకాలం నాటి లాకర్‌పై కన్నేస్తారు. ఈ క్రమంలో మీనా.. జేపీ(షాయాజీ షిండే) దగ్గర పీఏగా చేరుతుంది. మరి నందు-మీనా.. ఆ లాకర్ కొట్టేశారా? చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి కొత్త సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement