రీసెంట్ టైంలో వేర్వేరు సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు, నటుడు కలిసి పని చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. విష్ణు విశాల్ హీరోగా 'గట్ట కుస్తీ' రెండు మూవీస్ తీసి హిట్స్ అందుకున్న దర్శకుడు చెల్లా అయ్యావు. తొలిసారి హీరో కమ్ దర్శకుడిగా చేసి ఘనవిజయాన్ని అందుకున్న కెన్ కరుణాస్. ఇప్పుడు వీళ్లిద్దరే కలిసి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది.
గట్ట కుస్తీ 2 చిత్రంలో కీలకపాత్ర చేసిన నటుడు కరుణాస్‌కు దర్శకుడు సెల్లా అయ్యావు తో మంచి స్నేహం ఏర్పడిందని, దీంతో ఆయన దర్శకత్వంలో తన కొడుకు కెన్ కరుణాస్ హీరోగా మూవీని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం.


