ఓటీటీల్లోకి వచ్చే సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో కొన్ని కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా అలానే రెస్పాన్స్ అందుకుంటాయి. అలా నాలుగేళ్ల క్రితం వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కి సంబంధించి కొత్త సీజన్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుంది?
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి లవ్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
2022లో ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో 'వదంది' అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయిన దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్ మర్డర్ నేపథ్యంగా దాన్ని తెరకెక్కించారు. ఆ సీజన్ అక్కడితో ముగిసిపోయింది. అయితే ఈ సిరీస్‌లో రెండో సీజన్‌ని కొత్త స్టోరీ, కొత్త పాత్రలతో తెరకెక్కించారు. ఆగస్టు 07 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
'వదంది : ది మిస్టరీ ఆఫ్ మణి' పేరిట తీసిన ఈ సిరీస్‌లో శశి కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఆండ్రూ లూయిస్ ఈ సీజన్‌కు దర్శకుడు కాగా స్టార్ డైరెక్టర్స్ పుష్కర్-గాయత్రి క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో ప్రధాన పాత్రధారి అయిన ఎస్సై చేసిన తప్పు వల్ల ఓ అమాయకుడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. తన తప్పు తెలుసుకున్న ఎస్సై.. సదరు వ్యక్తిని జైలు నుంచి ఎలా విడిపించాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)


