'ఆదర్శ కుటుంబం' చిట్టిబాబు.. భలే ఫన్నీగా ఉన్నాడు | Aadarsha Kutumbam Movie Venkatesh Glimpse | Sakshi
Sakshi News home page

Adarsha Kutumbam Movie: త్రివిక్రమ్ పాత స్టైల్ కామెడీ.. గ్లింప్స్ రిలీజ్

Jul 27 2026 1:18 PM | Updated on Jul 27 2026 1:30 PM

Aadarsha Kutumbam Movie Venkatesh Glimpse

ఒకప్పటితో పోలిస్తే ఫ్యామిలీ కాన్సెప్ట్‌తో తీస్తున్న సినిమాలు చాలా తగ్గిపోయాయి. అనిల్ రావిపూడి లాంటి ఒకరిద్దరు దర్శకులు తప్పితే వేరే ఎవరూ ఈ టైపు మూవీస్ చేయట్లేదు. ఇకపోతే త్రివిక్రమ్-వెంకటేశ్ చాన్నాళ్ల తర్వాత కలిసి చేస్తున్న మూవీ 'ఆదర్శ కుటుంబం'. అక్టోబరు 02న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా వెంకటేశ్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)

ఈ మూవీలో చిట్టిబాబు అనే భార్య చాటు భర్తగా వెంకటేశ్ కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన క్యారెక్టర్ వీడియోలో కామెడీ, మ్యూజిక్ బాగున్నాయి. గతంలో త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ కామెడీ ఉండబోతుందని అనిపిస్తుంది. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్ కాగా నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పుడు వెంకీ వీడియో వదిలారు. త్వరలో ఒక్కో పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement