వెంకటేశ్ 'ఆదర్శ కుటుంబం' ఇదే | Aadarsha Kutumbam Movie Release Date Update | Sakshi
Sakshi News home page

Aadarsha Kutumbam: రూమర్స్‌కి చెక్.. కుటుంబం రాకపై క్లారిటీ

Jun 27 2026 4:46 PM | Updated on Jun 27 2026 4:53 PM

Aadarsha Kutumbam Movie Release Date Update

వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'. చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ ఈ ఏడాది దసరాకి థియేటర్లలోకి వస్తుందని ఎప్పటినుంచో టాక్ నడుస్తోంది. కానీ గత కొన్నిరోజుల నుంచి రూమర్స్ వచ్చాయి. రీషూట్స్ వల్ల ఈ టైంకి రాకపోవచ్చని గాసిప్స్ వినిపించాయి. ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెడుతూ విడుదల తేదీని ప్రకటించారు.

(ఇదీ చదవండి: సీఎం విజయ్.. నెలకు 20 రోజులు మాత్రమే)

ఆదర్శ కుటుంబం మూవీలో వెంకటేశ్ సరసన 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. 'పెద్ది' ఫేమ్ దివ్యేందు, నివేతా పేతురాజ్ కూడా కీలక పాత్రలు చేస్తున్నారని టాక్ వచ్చింది గానీ క్లారిటీ రావాలి. తమన్ సంగీతమందిస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని దసరాకు కాకుండా గాంధీ జయంతి వీకెండ్ క్యాష్ చేసుకునేందుకు అక్టోబరు 02న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇందులో వెంకటేశ్, శ్రీనిధి.. మధ్య తరగతి భార్యభర్తల్లా కనిపించారు. జంట కూడా బాగానే ఉంది. అయితే ఈ చిత్రం.. రీసెంట్ టైంలో వచ్చిన మా ఇంటి బంగారం, బ్లాస్ట్ సినిమాల్లోని స్టోరీని కాస్త పోలి ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అంటే పైకి సౌమ్యంగా కనిపించే ఓ కుటుంబం.. ఆపద వచ్చినప్పుడు ఫైట్స్ చేయడం లాంటివి ఉండబోతున్నాయని టాక్. మరి ఇందులో నిజమేంటి అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్‌కి అసలు కారణాలు.. దిల్ రాజు మాటల్లో)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement