కన్నడ స్టార్ యశ్ ప్రస్తుతం టాక్సిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. మోస్ట్ బోల్డ్ అండ్ వయొలెంట్‌గా కనిపించింది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఇక ఈ మూవీ సంగతి పక్కనపెడితే తాజాగా యశ్..సతీమణి ఆసక్తికర పోస్ట్ చేసింది. యశ్‌తో ఎంగేజ్‌మెంట్ అయిన రోజును గుర్తు చేసుకుంది. ఇప్పటికీ పదేళ్లు పూర్తయింది.. జీవితకాలపు ప్రేమ.. మనకిష్టమైన కథ, ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఎప్పటికీ నువ్వే నా ఫేవరేట్ అంటూ ఆయన రాధికా పండిట్ ఇన్‌స్టాలో వీడియోను పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటను చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.


