టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ పూర్తి చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినట్లు సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. డా. ఆర్‌ఎ పూర్ణచంద్ర తేజస్వి, డా. నితిన్ బెజ్జంకి, డా. మధుసూదన్‌రావు, డా. శ్రీనివాస్‌రావు సూరపనేని నేతృత్వంలో ఆర్థోపెడిక్ సర్జన్స్ బృందంతో సర్జరీ నిర్వహించారు. వైద్యుల పర్యవేక్షణలో ఎన్టీఆర్‌కు త్వరలోనే ప్రత్యేక రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చేపట్టనున్నారు. దాదాపు 2 నుంచి 3 నెలల్లోపే సంపూర్ణంగా కోలుకుని, సాధారణ స్థితికి వస్తారని డాక్టర్లు తెలిపారు.
కాగా.. జూలై 27న సాయంత్రం ఎన్టీఆర్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అప్పట్లో ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు వైద్యులు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపింది.


