పెదాలపై అభిమాని ముద్దు.. స్పందించిన నటి | Nikita Rawal Responds After Female Fan Kisses Her on Red Carpet: "I Have Nothing to Hide" | Sakshi
Sakshi News home page

ఫోటో కోసం వచ్చి పెదాలపై ముద్దు.. స్పందించిన నటి

Aug 12 2026 3:42 PM | Updated on Aug 12 2026 3:57 PM

Nikita Rawal Breaks Silence After Female Fan Kisses Her On Red Carpet

అవార్డు షోలో జరిగిన అనుకోని సంఘటనపై బాలీవుడ్‌ నటి నిఖితా రావల్ స్పందించింది. ఇటీవల జరిగిన రెడ్ కార్పెట్ కార్యక్రమంలో నిఖితా రావల్‌ను ఒక మహిళా అభిమాని ఆకస్మికంగా పెదవులపై ముద్దు పెట్టిన సంగతి తెలిసిందే. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనతో నిఖిత కొంతమేర అసౌకర్యానికి గురైంది. ఈ ముద్దు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేశారు.

తాజాగా నిఖిత ఈ సంఘటనపై స్పందించారు.సోషల్‌ మీడియాలో తనకు మద్దతుగా పంపిన అభిమానుల సందేశాలకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ని ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ.. మీ అందరి ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాకు దాచుకోవాల్సినదేమీ లేదు. నేను ఎల్లప్పుడూ సత్యం పక్షాన ఉంటాను’ అని రాసుకొచ్చింది.

నిఖితా రావల్ బాలీవుడ్‌తో పాటు దక్షిణ భారతీయ చిత్రాల్లోనూ నటించారు. ఆమె నటించిన 'బ్లాక్ అండ్ వైట్', 'మిస్టర్ హాట్ మిస్టర్ కూల్', 'ది హీరో – అభిమన్యు', 'అమ్మా కి బోలి', 'గరం మసాలా', 'క్యూట్ కమీనా'  చిత్రాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం అర్షద్ వార్సీ, చంకీ పాండేలతో కలిసి 'రోటి కప్డా అండ్ రొమాన్స్' అనే చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement