యంగ్‌ హీరోతో కలిసి గుడిలో నాగదుర్గ పూజలు.. ప్రేమలో ఉన్నారా? | Folk Dancer Naga Durga and Akhil Raj Visit Komuravelli Temple: Dating Rumors Surface | Sakshi
Sakshi News home page

యంగ్‌ హీరోతో కలిసి కొమురవెల్లిలో నాగదుర్గ పూజలు.. ప్రేమలో ఉన్నారా?

Aug 12 2026 1:13 PM | Updated on Aug 12 2026 1:22 PM

Folk Dancer Naga Durga, Raju Weds Rambai Fame Akhil Raju Visites Komuravelli Temple

సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్‌ కామన్‌. హీరోహీరోయిన్ల సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలపై కూడా పుకార్లు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి, ప్రేమకు సంబంధించిన విషయాలపై రకరకాలు గాసిప్స్‌ నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఫోక్‌ డ్యాన్సర్‌, హీరోయిన్‌ నాగదుర్గపై కూడా ఓ క్రేజీ రూమర్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె యంగ్‌ హీరో అఖిల్‌ రాజ్‌తో ప్రేమలో ఉన్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికి గల కారణం.. వీరిద్దరు కలిసి ఇటీవల గుడికి వెళ్లి పూజలు చేయడమే.

‘రాజు వెడ్స్‌ రాంబాయి’మూవీతో హీరోగా సక్సెస్‌ అందుకున్నాడు అఖిల్‌ రాజ్‌. మరోవైపు ఫోక్‌ డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగదుర్గ..ఇటీవల సినిమాల్లోకి అడుగుపెట్టింది. తమిళంలో లవ్‌ ఓ లవ్‌ సినిమాతో హీరోయిన్‌గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో ప్రియదర్శితో కలిసి ‘ఇడుపు కాయితం’ అనే మూవీ చేస్తోంది. 

ఇలా కెరీర్‌ పరంగా ఇప్పుడిప్పుడే సెటిల్‌ అవుతున్న వీరిద్దరు కలిసి సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ కావడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. లవ్‌లో ఉన్నారు కాబట్టే కలిసి గుడికి వెళ్లారని కొంతమంది నెటిజన్స్‌ కామెంట్స్‌ పెడతున్నారు. మరికొంతమంది మాత్రం వీరిద్దరి కాంబినేషన్‌లో కొత్త సినిమా రాబోతుందని..అందుకే గుడికి వెళ్లారని కామెంట్‌ చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే.. అఖిల్‌ రాజు లేదా నాగదుర్గ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement