దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా కథ త్రేతాయుగం నేపథ్యంలో జరిగే సన్నివేశాల కోసం మహేశ్ బాబును శ్రీరాముడిగా చూపించనున్నట్లు ఇప్పటికే రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘట్టానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఇందులో హనుమంతుడి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
మొదట్లో ఈ పాత్ర కోసం ప్రముఖ నటుడు మాధవన్ పేరు వినిపించింది. అయితే ఆ పాత్రకు అవసరమైన ఇంటెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ దృష్ట్యా రామ్ చరణ్ అయితే హనుమాన్ పాత్ర తెరపై మరింత ప్రభావవంతంగా ఉంటుందని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జక్కన్న 'మగధీర' ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలను చరణ్‌తో చేశాడు. ఆ చిత్రాల అనుభవం కూడా ఈ కాంబినేషన్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది. అయితే రామ్ చరణ్ ‘వారణాసి’లో హనుమంతుడిగా నటిస్తున్నారనే వార్తపై 'వారణాసి' చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ నిజంగా ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరడం ఖాయం.


